- పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా సంఘటన
- విద్యార్థులంతా సురక్షితం
స్కూల్ ఆటో బోల్తా పడి తృటిలో పెను ప్రమాదం తప్పిన సంఘటన బుధవారం మండలంలోని కత్తిమానుపల్లె గ్రామ సమీపాన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన 15 మంది విద్యార్థులు మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు ఆటోలో వచ్చేవారు. ఈ క్రమంలో బుధవారం పాఠశాల వదిలిన తర్వాత ఆటోలో ఉప్పలపాడుకు వెళుతుండగా కత్తిమానుపల్లె గ్రామ సమీపాన ఎదురుగా వచ్చిన ఒక ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.