five injured
-
అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు
ముథోల్ : భార్యను కాపురానికి పంపడం లేదంటూ ఓ ప్రబుద్ధుడు అత్తింటికి నిప్పు పెట్టాడు. ఈ ప్రమాదంలో అత్తామామలతోపాటు భార్య, అతని ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. స్తానికులు సమయానికి కాపాడడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. ముథోల్ మండల కేంద్రంలోని ముక్తాదేవిగల్లీకి చెందిన రోళ్ల మారుతి అదే గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మిని పన్నెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఈశ్వర్, మల్లేశ్ ఇద్దరు కుమారులు. కొద్ధి రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో భార్య పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. దీంతో తాగుడికి బానిసైన మారుతి బుధవారం రాత్రి అత్తారింటికి వచ్చి మరోసారి భార్యతో గొడవ పడి వెళ్లాడు. మళ్లీ వేకువజామున వచ్చి ఇంటి రేకులు తొలగించి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. భార్య భాగ్యలక్ష్మి, పిల్లలు ఈశ్వర్, మల్లేశ్, అత్త కళ, మామ చిన్నలింగన్న మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి బయటకు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ శ్రీనివాస్, ఎస్సై భరత్ సుమన్ సంఘటన స్థలానికి చేరుకొని గాయాలపాలైన వారిని భైంసా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడ్డ మారుతి ముథోల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య, అత్తమామల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పెళ్లి బారాత్‌లో అపశ్రుతి
నిజామాబాద్ లింగంపేట(ఎల్లారెడ్డి) : పెళ్లి వేడుకల్లో అపశ్రుతి జరగడంతో ఒక వృద్ధురాలు మృతి చెందగా, పెళ్లికొడుకు, మరో మహిళలకు తీవ్రగాయాలైన సంఘటన లింగంపేట మండలం లింగంపల్లి పంచాయతీ పరిధిలోని కొయ్యగుండు తండాల్లో చోటు చేసుకుంది. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన అమ్రియానాయక్ కుమారుడు దేవిసింగ్ వివా హం బుధవారం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండ లం బైరాపూర్ తండాలో జరిగింది. వివాహానంతరం పెళ్లికొడుకు, పెళ్లికూతురు, బంధువులు రాత్రి బైరాపూర్ తండా నుంచి కొయ్యగుండు తండాకు చేరుకున్నారు. తండా సమీపంలోని గిరిజనుల ఆలయం వద్ద పూజలు చేసి ఇంటికి డీజే సౌండ్ సిస్టమ్‌తో నృత్యాలు చేసుకుంటూ వెళ్తున్నా రు. ఇంటి సమీపంలో నిలిపిఉన్న ట్రాక్టర్‌ను బంధువుల యువకుడు స్టార్ట్ చేయడంతో గేర్‌లో ఉన్న ట్రాక్టర్ బారాత్ తీస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కామారెడ్డిలోని రుద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పెళ్లి కూతురు బంధువు మాలీబాయి(68) మృతిచెందింది. ట్రాక్టర్ ముందు నడుస్తున్న పెళ్లి కొడుకు, పెళ్లికూతురితో పాటు పలువురిపై ట్రాక్టర్ దూసుకెళ్లడంతో పెళ్లి కొడుకు కేతావత్ దేవిసింగ్ చాతిపైకి ట్రాక్టర్ చక్రం ఎక్కగా తండావాసులు వెంటనే టైర్‌ను పైకి లేపి బయటకు తీశారు. ఈ ఘటనలో తండాకు చెందిన కేతావత్ బగ్లీ, శాంత, సునీత, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లి ముగించుకుని ఇంటికి చేరుకున్న బంధువులు ఇంట్లోకి వెళ్లే సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో తండాలో విషాదచాయలు అలుముకున్నాయి. -
ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
పెనుకొండ రూరల్ : మండలంలోని వెంటకరెడ్డిపల్లి రహదారిలో గురువారం ఆటో బోల్తా పడి ఐదుగురు గాయపడ్డారని ఎస్ఐ జనార్దన్ తెలిపారు. పెనుకొండ నుంచి శెట్టిపల్లికి ప్రయాణికులతో బయలుదేరిన ఆటో మార్గమధ్యంలోని వెంకటరెడ్డిపల్లికి చేరుకోగానే అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో శెట్టిపల్లికి చెందిన జమిలీబాయి, పార్వతమ్మ, శివమ్మ, గాయత్రిబాయి, ఇస్లాపురానికి చెందిన రామన్న గాయపడ్డారు. వారిని 108లో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ జనార్దన్ ఆస్పత్రికి చేరుకుని ప్రమాదంపై బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ రఘునాథ్‌పై కేసు నమోదు చేశారు. సర్పంచ్ చలపతి కూడా ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. -
ఆటో బోల్తా : ఐదుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె క్రైం : మదనపల్లె మండలంలో శనివారం రాత్రి ఆటో బోల్తా పడడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. తంబళ్లపల్లె మండలం ఏటిగడ్డపల్లెకు చెందిన ఇడగొట్టి నాగరాజ (39) భార్యాపిల్లలు, తల్లితండ్రులతో కలిసి అనంతపురంలో డిగ్రీ చదువుకుంటున్న తన కొడుకు వెంకటేష్‌ను చూసేందుకు శుక్రవారం వెళ్లారు. శనివారం రాత్రి తిరిగి గుంతకల్ - తిరుపతికి రైలు ఎక్కి మదనపల్లె సమీపంలోని సీటీఎం రైల్వే స్టేషన్లో దిగారు. అక్కడి నుంచి మదనపల్లెకు వచ్చేందుకు అర్ధరాత్రి సమయంలో ప్యాసింజర్ ఆటో ఎక్కారు. ఆటో ఐదో మైలురాయి వద్ద రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నాగరాజ (39), అతని తండ్రి వెంకటరమణ (68), భార్య ఉమాదేవి(32), కుమార్తె భువనేశ్వరి(16)తో పాటు పట్టణంలోని చీకిలగుట్టకు చెందిన ఆదెమ్మ (60) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో క్షతగాత్రులను 108లో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంకటరమణ, నాగరాజు, ఉమాదేవిని తిరుపతికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. -
గుంటూరు టీడీపీలో ఘర్షణ.. ఐదుగురికి గాయాలు
పిడుగురాళ్ల : గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు భగ్గుమన్నాయి. పిడుగురాళ్లలో రెండు వర్గాలకు చెందిన టీడీపీ నాయకులు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్న సంఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పిడుగురాళ్ల మండలం అగ్రహారంలో శనివారం చోటుచేసుకుంది. స్థానిక ఎంపీటీసీ రాంరెడ్డి సైదమ్మ(టీడీపీ) వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే నెపంతో కొందరు టీడీపీ కార్యకర్తలు ఆమె పై రాళ్లతో దాడి చేశారు. దీంతో ఎంపీటీసీ వర్గీయులు కూడా రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదం- ఐదుగురికి గాయాలు
బైకును.. కంటెయినర్‌ను ఢీకొన్న లారీ రాజీవ్ రహదారిపై ఘటన శామీర్‌పేట్: ఓ లారీ బైకును మరో లారీని ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగల మైసమ్మ చౌరాస్తా వద్ద రాజీవ్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ఓ లారీ నగరంలోని ఈసీఐఎల్ నుంచి కరీంనగర్‌కు రాజీవ్ రహదారి మీదుగా వెళ్తోంది. శామీర్‌పేట్ మండలం తూంకుంట నుంచి ఓ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు బిట్స్ పిలానీ వైపు దొంగలమైసమ్మ చౌరాస్తా నుంచి వెళ్తున్నారు. మేడ్చల్ నుంచి కీసర వైపు ఓ కంటెనర్ లారీ వస్తుంది. ఈక్రమంలో శామీర్‌పేట్ మండలం దొంగలమైసమ్మ వద్దకు రాగానే గ్యాస్ సిలిండర్ల లారీ ప్రమాదవశాత్తు తూంకుంట నుంచి బిట్స్ వైపు వెళ్తున్న బైక్ ఢీకొంది. ప్రమాదాన్ని గుర్తించిన లారీ డ్రైవర్ భయాందోళనకు గురై లారీని తిప్పే క్రమంలో మేడ్చల్ నుంచి కీసర వైపు వెళ్తున్న కంటెయినర్ లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌తో పాటు కంటెయినర్ లారీ బోల్తా పడ్డాయి. బైక్‌పై వెళ్తున్న తూంకుంటకు చెందిన విజయ్, పవన్‌తో పాటు కంటెయినర్ డ్రైవర్ బ్రిజేష్, లారీ గైడ్ ప్రదీప్‌కుమార్, కృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్షతగాత్రులను 108 వాహనంలో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. -
పేలిన గ్యాస్ సిలిండర్: ఐదుగురికి గాయాలు
-
పేలిన గ్యాస్ సిలిండర్: ఐదుగురికి గాయాలు
హైదరాబాద్ : ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని నేరేడ్మెట్ కృప కాంప్లెక్స్ సమీపంలో గురువారం ఉదయం ఈ పేలుడు సంభవించింది. కృష్ణాపైప్ లైన్ లీకేజి మరమ్మత్తుల్లో భాగంగా గ్యాస్ సిలిండర్‌తో కార్మికులు పని చేస్తున్నారు. ఈ సమయంలో సిలిండర్ ప్రమాదవశాత్తు పేలింది. దీంతో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. -
ఆటోను ఢీకొట్టిన ప్రైవేట్ టూరిస్టు బస్సు
జోగిపేట: అందోలు గురుకుల పాఠశాల వద్ద రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఆటోను కర్ణాటక రాష్ట్రానికి చెందిన కేఏ 25డీ 3930 నంబరు గల టూరిస్టు బస్సు ఢీకొనడంతో అందులో కూర్చున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జోగిపేట వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న టూరిస్టు సుల్తా¯ŒSపూర్‌కు వెళుతున్న ఆటోను వెనకవైపు నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోను ఢీకొనగా ఆటో బోల్తాపడింది. బస్సు అదుపుతప్పి రోడ్డు కిందకు వెళ్లిపోయింది. ఆటోలో ఉన్న ఉప్పరిగూడెంకు చెందిన యాదమ్మ అనే వృద్ధురాలి తలకు గాయం కాగా యాదగిరి అనే వ్యక్తి నడుముకు గాయమైంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారికి చికిత్సలు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
కారును ఢీకొట్టిన ఆటో: ఐదుగురికి తీవ్ర గాయాలు
వరంగల్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి సమీపంలో మంగళవారం కారు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదురుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
కారు - లారీ ఢీ: ఐదుగురికి గాయాలు
కడప : వైఎస్ఆర్ జిల్లా రామాపురం మండలం పాలన్నగారిపల్లి వద్ద బుధవారం కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇంజమూరుకు చెందిన ఐదుగురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... వారిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటోను ఢీకొన్న కారు.. ఐదుగురికి గాయాలు
విశాఖపట్నం : విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం లైను కొత్తూరు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురికి తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని....క్షతగాత్రులను విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కారులోని వారు ఎలమంచిలి నుంచి ఏటికొప్పాకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా: ఐదుగురికి గాయాలు
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని హైవే జంక్షన్ వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల్లో ఐదుగురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... రహదారిపై నుంచి బస్సును పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు బైక్‌లు ఢీ.. ఐదుగురికి గాయాలు
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఖానాపూర్ మండలం మందపల్లి, నాగాపూర్ గ్రామాల మధ్య రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో పోశన్న, లక్ష్మి దంపతులు, వారి కుమారుడు రవితేజతోపాటు వేరొక బైక్‌పై ప్రయాణిస్తున్న అరికెల లక్ష్మణ్, చెప్పాల భూమేశ్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
వరంగల్ : వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలోని ఐదుగరు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు బోల్తా : ఇద్దరు మృతి
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా దండేపల్లి మండలం తాళ్లురు వద్ద శుక్రవారం ఉదయం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
ఆటో - లారీ ఢీ : ఐదుగురికి గాయాలు
ఒంగోలు : ప్రకాశం జిల్లా దేశవారిపేట మండలం ఓంకారపురం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో - లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
షార్ కేంద్రంలో యాసిడ్ లీక్
-
చెట్టును ఢీ కొన్న వ్యాన్ : ఒకరు మృతి
అనంతపురం : అనంతపురం జిల్లా హిందూపూర్ మండలం తూముకుంట వద్ద బుధవారం పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ వ్యాను చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి అక్కడికక్కడే చెందగా... మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను హిందూపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. -
కారు బోల్తా: ఐదుగురికి గాయాలు
కంకిపాడు: కారు బోల్తా కొట్టిన ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. విజయవాడ నుంచి కొలవెన్నికి ఐదుగురు వ్యక్తులు కారులో వెళుతుండగా మండలంలోని పునాదిపాడు వద్ద కారు బోల్తా కొట్టింది. బాధితులను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లారీని ఢీకొట్టిన కారు: ఒకరు మృతి
ఒంగోలు: ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక ఉంచి వచ్చి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోని ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. టోల్‌ప్లాజా సిబ్బంది వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు. నెల్లూరుకు చెందిన వారని పోలీసులు తెలిపారు. గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
చెట్టును ఢీకొన్న కారు : ఇద్దరు మృతి
కాటారం : కరీంనగర్ జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరంతా కర్నూలు జిల్లాకు చెందిన వారు. గోదావరి పుష్కరాల కోసం కాళేశ్వరం వెళుతుండగా ప్రమాదం బారినపడ్డారు. క్షతగాత్రులను మహదేవ్పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
రామాయంపేట (మెదక్): ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొని ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. మెదక్ నుంచి అదే డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు రామాయంపేట మీదుగా సిద్ధిపేట వెళ్తోంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కొమిగండ్ల గ్రామ శివారులోని మలుపు వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బస్సులోని ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికత్స కోసం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం బస్సులోని ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. -
ఆటో బోల్తా: ఇద్దరి మృతి
అనంతపురం : అతి వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు మరో మహిళ మృతిచెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం రజాపురం వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గుంతకల్ నుంచి గుత్తి వెళ్తున్న ప్రయాణికుల ఆటో రజాపురం వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో అనంతపురానికి చెందిన ఆటో డ్రైవర్ ఆంజనేయులు (20) తో పాటు మరో మహిళ (56) అక్కడికక్కడే మృతిచెందగా, ఆటోలో ఉన్న మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కారు, లారీ ఢీ : ఒకరు మృతి
విశాఖపట్నం : దైవదర్శనానికి వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురవ్వడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన విశాఖ జిల్లాలోని నక్కపల్లి మండలం ఒడ్డిమిట్ట పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. తునికి చెందిన బంగారు వ్యాపారి పోతుల వెంకటరమణ(60) కుటుంబ సభ్యులతో కలిసి ఒడిశాలోని మజ్జిగైరమ్మ దర్శనానికి కారులో బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఒడ్డిమిట్ట పెట్రోల్‌బంక్‌లో ఆయిల్ కొట్టించుకొని బయటకు వస్తున్న సమయంలో బైపాస్ మీదుగా వెళ్తున్న లారీ ముందు టైరు బరెస్ట్ కావడంతో లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగంలో నిల్చుని ఉన్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుటుంబ పెద్ద వెంకటరమణ మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు - లారీ ఢీ : ఐదుగురికి గాయాలు
ఖమ్మం: ఖమ్మం జిల్లా జూలూరుపాడు వద్ద బుధవారం ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు కుంట నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. -
గోడ కూలి ఐదేళ్ల చిన్నారి మృతి
ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లోని తుండ్లా ప్రాంతంలో మంగళవారం గోడ కూలింది. ఈ ఘటనలో 5 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మరణించింది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున చోటు చేసుకుందని... గోడ కూలిన సమయంలో కుటుంబంలోని వారంతా నిద్రిస్తున్నారని చెప్పారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. -
బస్‌స్టాప్‌లోకి దూసుకెళ్లిన కారు: ఇద్దరు మృతి
బెంగళూరు: బెంగళూరు నగరంలోని హోసూర్ రోడ్డులో శనివారం కారు బీభత్సం సృష్టించింది. బస్ స్టాప్‌లో బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారులోని వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అలాగే మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు - బస్సు ఢీ: ఐదుగురికి గాయాలు
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్ వద్ద బుధవారం కారు - కర్ణాటక చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు విజయవాడకు చెందిన వాసులని పోలీసులు తెలిపారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
కారు బోల్తా.. పది పల్టీలు
మెదక్: మెదక్ జిల్లా ములుగు సమీపంలో ఆదివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఆ తర్వాత పది పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు గాయపడ్డారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారులో కల్లు సీసాలు బయటపడ్డాయి. దీన్ని బట్టి కారులోని యువకులు మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. -
ఆర్టీసీ బస్సు, కారు డీ: ఐదుగురికి తీవ్రగాయాలు
వంగూరు:మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కమాల్‌పూర్ స్టేజీ సమీపంలో దేవరకొండ - కల్వకుర్తి ప్రధాన రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని కొత్తూరు మండలం హెచ్ఏఎల్ కంపెనీ ఉద్యోగులు కారులో దేవరకొండవైపు వెళుతుండగా కమలాపూర్ స్టేజీ సమీపంలో ఎదురుగా వచ్చిన కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న విరీష్, విద్యాసాగర్, సూడామన్, మనోజ్, నరేష్‌లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మనోజ్, విద్యాసాగర్, సూడామన్ల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. కాగా, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. -
కారును ఢీకొన్న బస్,ముగ్గురు మృతి
-
పిచ్చికుక్క దాడి..ఐదుగురికి గాయాలు
నల్గొండ: ఆత్మకూరు మండలంలోని వేపూరు గ్రామంలో పిచ్చి కుక్క ఒకటి స్క్వైరవిహారం చేసింది. పిచ్చి కుక్క దాడి చేసి ఎరుకల స్వప్న, మొదిళ్ల విశాల్, వర్ధ మేఘన, టి. లక్ష్మమ్మ, బిక్షం అనే వ్యక్తులను గాయపరిచింది. మొదిళ్ల విశాల్, వర్ధ మేఘనల పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పిచ్చి కుక్క కోసం గ్రామస్తులు వేట ప్రారంభించారు. చిన్న పిల్లలను ఏమైనా కరుస్తుందేమోనని గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. (ఆత్మకూరు) -
అనంతపురంలో భారీ పేలుడు, 12మందికి గాయాలు
అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరిలో ఆదివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. చలితీవ్రతను తట్టుకులేక గ్రామస్తులు చలిమంట వేసుకున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. గ్రామస్తులు చలిమంట కోసం నిరుపయోగమైన వస్తువులను మంటల్లో వేశారు. గుర్తుతెలియని బ్యాగ్‌ను కూడా మంటల్లో వేశారు. దాంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 12మందికి తీవ్రగాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
గ్యాస్ ట్యాంకర్, ఆటో ఢీ: ముగ్గురు మృతి
-
లారీ, ఆటో ఢీ: ముగ్గురు మృతి
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని పండూరు చెరువు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ లోడ్‌తో వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కాకినాడ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతి చెందిన ఇద్దరు మృతదేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జీపు బోల్తా: కానిస్టేబుల్ మృతి
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం దుప్పిలిపాలెం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీఎస్పీ బెటాలియన్ జీపు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం అక్బర్‌నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న వాహానాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. ఆ వాహనంలో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
బస్సు - లారీ ఢీ : ఇద్దరు డ్రైవర్లు మృతి
నల్గొండ: నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాములలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు - లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో బాంబు పేలుడు
-
చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో బాంబు పేలుడు
చెన్నై : చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, పదిమంది గాయపడినట్లు సమాచారం. రైల్వే స్టేషన్‌లోని 9వ నెంబర్ ఫ్లాట్‌ఫామ్ పై నిలిచి ఉన్న (త్రివేండ్రం నుంచి గౌహతి వెళుతున్న) గౌహతి ఎక్స్‌ప్రెస్ ఎస్-5 బోగీలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. ఈ పేలుడు ఉదయం 7.20 నిమిషాలకు జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రైల్వే పోలీసులు అంబులెన్స్ లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు పేలుడు నేపథ్యంలో తాత్కాలికంగా రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. కాగా పేలుడు గల కారణాలు తెలియరాలేదు. -
లారీని ఢీ కొన్న సుమో: ఇద్దరు మృతి
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి వస్తున్న టాటా సుమో కారు టైర్ పంక్చర్ కావడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో సుమోలోని ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా చిత్తూరు జిల్లా వాసులని... విజయవాడలోని కనకదుర్గను దర్శించుకుని స్వస్థలానికి వస్తున్న క్రమంలో ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఇద్దరి మృతదేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం నెల్లూరు ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పాక్‌లో బాంబు పేలుడు: ఐదుగురికి తీవ్ర గాయాలు
పాకిస్థాన్ గిరిజన ప్రాంతంలో పళ్ల మార్కెట్ సమీపంలో ఈ రోజు ఉదయం బాంబు పేలుళ్లు సంభవించింది. ఆ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన సద్దాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. పళ్ల మార్కెట్లోని ఓ పళ్ల దుకాణం పక్కన పేలుడు పదార్థాలతో ఉంచిన బ్యాగ్ పేలుడంతో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. అయితే ఆ పేలుడు ఘటనకు తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని పోలీసులు తెలిపారు.