గ్యాస్ ట్యాంకర్, ఆటో ఢీ: ముగ్గురు మృతి | three-killed-in-road-accident-at-east-godavari-district | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 9 2014 9:20 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని పండూరు చెరువు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ లోడ్తో వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కాకినాడ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతి చెందిన ఇద్దరు మృతదేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement