అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరిలో ఆదివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. చలితీవ్రతను తట్టుకులేక గ్రామస్తులు చలిమంట వేసుకున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది.
గ్రామస్తులు చలిమంట కోసం నిరుపయోగమైన వస్తువులను మంటల్లో వేశారు. గుర్తుతెలియని బ్యాగ్ను కూడా మంటల్లో వేశారు. దాంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 12మందికి తీవ్రగాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.