దైవదర్శనానికి వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురవ్వడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు.
విశాఖపట్నం : దైవదర్శనానికి వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురవ్వడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన విశాఖ జిల్లాలోని నక్కపల్లి మండలం ఒడ్డిమిట్ట పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. తునికి చెందిన బంగారు వ్యాపారి పోతుల వెంకటరమణ(60) కుటుంబ సభ్యులతో కలిసి ఒడిశాలోని మజ్జిగైరమ్మ దర్శనానికి కారులో బయలుదేరారు.
అయితే మార్గమధ్యంలో ఒడ్డిమిట్ట పెట్రోల్‌బంక్‌లో ఆయిల్ కొట్టించుకొని బయటకు వస్తున్న సమయంలో బైపాస్ మీదుగా వెళ్తున్న లారీ ముందు టైరు బరెస్ట్ కావడంతో లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగంలో నిల్చుని ఉన్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుటుంబ పెద్ద వెంకటరమణ మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.