అనంతపురం : అనంతపురం జిల్లా హిందూపూర్ మండలం తూముకుంట వద్ద బుధవారం పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ వ్యాను చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి అక్కడికక్కడే చెందగా... మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను హిందూపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.