one killed
-
మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు
ఇంఫాల్: మణిపూర్ వ్యాప్తంగా శనివారం నుంచి అన్ని రకాల వాహనాలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన ఆదేశాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. భద్రతా సిబ్బంది, కుకీ వర్గం ప్రజల మధ్య జరిగిన ఘర్షణల్లో నిరసనకారుడొకరు చనిపోగా 40 మంది గాయపడ్డారు. వీరిలో 16 మంది స్థానికులు కాగా, 27 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. హోం మంత్రి అమిత్ షా ఆదేశాలను నిరసిస్తూ కంగ్పోక్పి వద్ద రెండో నంబర్ ఇంఫాల్–దిమాపూర్ జాతీయ రహదారిపై కుకీలు నిరసన చేపట్టారు. అడ్డుకునేందుకు యతి్నంచిన భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. అదే సమయంలో ప్రైవేట్ వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. మండుతున్న టైర్లను రోడ్డుపై పడేశారు. ఇంఫాల్ నుంచి సేనాపతి జిల్లా వైపు వెళ్తున్న రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సుకు నిప్పు పెట్టేందుకు ప్రయతి్నంచడంతో పరిస్థితి చేయి దాటింది. దీంతో, భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఘర్షణల్లో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే, మైతేయి వర్గం చేపట్టిన శాంతి ర్యాలీని పోలీసులు కాంగ్పోక్పికి రాకమునుపే అడ్డుకున్నారు. ర్యాలీ ముందుకు సాగాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వెళ్లాలని వారికి షరతు విధించారు. చివరికి వారందరినీ 10 ప్రభుత్వ బస్సుల్లో తరలిస్తుండగా కుకీల మెజారిటీ ప్రాంతమైన కాంగ్పోక్పి వద్ద అడ్డుకుని, ఒక బస్సుకు నిప్పంటించేందుకు ప్రయతి్నంచారని పోలీసులు తెలిపారు. టియర్ గ్యాస్ ప్రయోగించి, నిరసన కారులను చెదరగొట్టాక మైతేయి శాంతి ర్యాలీ నిర్వాహకులున్న బస్సులు ముందుకు సాగాయని చెప్పారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ అమల్లోకి వచి్చందని చెప్పారు. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. 13 ఏళ్ల బాలుడి దుర్మరణం
న్యూయార్క్: అమెరికాలో 13 ఏళ్ల పిల్లాడు పోలీసు తూటాకు బలయ్యాడు. తుపాకీ చూపించి డబ్బులు దోచుకుంటున్న ఒక ముఠా గురించి గాలిస్తున్న పోలీసు బృందం అనూహ్యంగా పిల్లాడిని పొట్టనబెట్టుకుంది. స్థానిక మీడియా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యుటికాలో శుక్రవారం రాత్రి సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు టీనేజర్లను పోలీసులు ఆపి ‘మీ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు కదా?’ అని అడిగారు. వారిలో 13 ఏళ్ల న్యాహ్ ఎంవా ఒక్కసారిగా పరుగెత్తడంతో పోలీసులు వెంటపడ్డారు. దాంతో పిల్లాడు తన దగ్గరున్న బొమ్మ పెల్లెట్ గన్‌తో బెదిరించాడు. దాన్ని నిజమైన గన్‌గా భావించి ప్యాట్రిక్ హష్నే అనే పోలీసు పిల్లాడిని కిందపడేసి పట్టుకోబోయాడు. మరో ఇద్దరు పోలీసులు పిడిగుద్దులు కురిపించారు. పెనుగులాటలో పిల్లాడిని ప్యాట్రిక్ షూట్ చేశాడు. ఛాతిలో తూటా దిగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పిల్లాడు చనిపోయాడు. మొత్తం ఉదంతం పోలీసు అధికారి బాడీ కెమెరాలో రికార్డయింది. వారి అతి జాగ్రత్తలు అమాయక పౌరులను బలితీసుకుంటున్నాయని పిల్లాడి సంతాప సభలో స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు జరుపుతామని సిటీ మేయర్ హామీ ఇచ్చారు. అంతర్గత కలహాలతో రగిలిపోతున్న మయన్మార్ నుంచి పిల్లాడి కుటుంబం ఎనిమిదేళ్ల క్రితం అమెరికాకు వలసవచ్చింది. -
విషాదం: బాణసంచా కాల్చడంపై ఘర్షణ.. ఒకరు మృతి
లక్నో: దీపావళి రోజు విషాదం చోటుచేసుకుంది. రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. షామ్లీ జిల్లాలో గురువారం దీపావళి రోజు టపాసులు కాల్చడంపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ ఏర్పడింది. గొడవ మరింత ముదిరి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. చదవండి: దీపావళి ఎఫెక్ట్.. బాణాసంచా పేలుస్తూ 31 మందికి గాయాలు ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని రాహుల్, సంజీవ్ సైనీగా పోలీసులు గుర్తించారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొదుతూ సంజీవ్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు తెలిపారు. -
కేరళలో నిఫా కలకలం
కోజికోడ్: కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేరళలో మరో వైరస్ బయటపడింది. నిఫా వైరస్ సోకి 12 ఏళ్ల బాలుడు చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జి ఆదివారం వెల్లడించారు. అతడి నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కి పంపగా, నిఫా వైరస్‌గా నిపుణులు ధ్రువీకరించారని తెలిపారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ డిజీస్ కంట్రోల్‌కు చెందిన నిపుణులను కేరళకు పంపించింది. ఈ బృందం వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో రాష్ట్ర యంత్రాంగానికి సాయపడనుంది. బాలుడి మృతిపై ఆరోగ్య మంత్రి వీణా జార్జి మీడియాతో మాట్లాడారు. ‘12 ఏళ్ల బాలుడు నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. శుక్రవారం అతడి లాలాజలం తదితర నమూనాలను పుణెకు పంపించాం. శనివారం రాత్రి అతడి పరిస్థితి విషమంగా మారింది. ఆదివారం ఉదయం 5 గంటలకు అతడి మృతి చెందాడు. ఆగస్టు 27వ తేదీ నుంచి బాలుడితో సన్నిహితంగా ఉన్న కుటుంబసభ్యులు, స్నేహితులు, చికిత్స జరిగిన ఆస్పత్రులకు చెందిన మొత్తం 188 మందిని గుర్తించాం. వీరందరినీ ఐసోలేషన్‌లో ఉండాలని కోరాం. వీరిలో హైరిస్క్ ఉన్న 20 మందిని కోజికోడ్ మెడికల్ కళాశాలలో ఐసోలేషన్‌లో ఉంచాం. వీరిలో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల నమూనాల్లో నిఫా వైరస్ జాడలు బయటపడ్డాయి’అని ఆమె వివరించారు. ‘కోజికోడ్ మెడికల్ కాలేజీలో నిఫా బాధితుల కోసం ప్రత్యేకంగా వార్డు ఏర్పాటుచేశాం. ముందు జాగ్రత్తగా, బాలుడి నివాసం చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్‌గా ప్రకటించాం’అని మంత్రి తెలిపారు. ‘ఇక్కడే నిఫా వైరస్ నిర్థారణ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని పుణె ఎన్ఐవీ అధికారులను కోరాం’ అని ఆమె వివరించారు. కాగా, దక్షిణ భారతంలోనే మొట్టమొదటి సారిగా 2018లో కేరళలోని కోజికోడ్‌లో నిఫా వైరస్ బారినపడిన 17 మంది చనిపోయారు. ఏమిటీ నిఫా..! ఇది›జూనోటిక్ వైరస్. అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. దీనికి ప్రధాన ఆవాసం గబ్బిలాలే. వాటి నుంచి ఇతర జంతువులు, మనుషులకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా పందులు, శునకాలు, గుర్రాలు ఈ వైరస్ బారినపడే ప్రమాదం ఉంది. మనుషులకు సోకితే ఆరోగ్య పరిస్థితి విషమించి మరణం సంభవించే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. లక్షణాలేమిటి? ► బ్రెయిన్ ఫీవర్ ► తీవ్రమైన దగ్గుతో కూడిన జ్వరం. ► ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు ► ఇన్‌ఫ్లూయెంజా తరహా లక్షణాలు.. అంటే జ్వ రం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి, మగతగా ఉండడం. ► కొన్ని సందర్భాల్లో న్యుమోనియా తలెత్తడం ► 24 నుంచి 48 గంటలపాటు కోమాలోకి వెళ్లిపోయే అవకాశం సైతం ఉంది. ► మనిషి శరీరంలో ఈ వైరస్ 5 నుంచి 14 రోజులపాటు ఉంటుంది. కొన్ని కేసుల్లో 45 రోజులదాకా ఉండొచ్చు. గుర్తించడం ఎలా?: అనుమానిత లక్షణాలున్న వ్యక్తి శరీరంలోని స్రావాలతో గుర్తించవచ్చు. ఇందుకోసం రియల్–టైమ్ పాలీమెరేజ్ చైన్ రియాక్షన్(ఆర్టీ–పీసీఆర్) పరీక్ష చేస్తారు. ఎలిసా, పీసీఆర్, వైరస్ ఐసోలేషన్ టెస్టుల ద్వారా కూడా గుర్తించవచ్చు. మనుషుల్లో ఎలా వ్యాప్తి చెందుతుంది? నిఫా వైరస్ సోకిన జంతువులు లేదా మనుషులకు దగ్గరగా మసలితే వ్యాప్తి చెందే అవకాశం ఉంది. నిఫా సోకిన గబ్బిలాల విసర్జితాల్లో ఈ వైరస్ ఆనవాళ్లు ఉంటాయి. ఈ గబ్బిలాలు ఉండే ప్రాంతాల్లో పండ్ల కోసం చెట్లు ఎక్కడం లేదా చెట్టు నుంచి రాలిన పండ్లు తినడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉంది. నిఫా వల్ల మరణించివారి మృతదేహాల్లోనూ వైరస్ ఉంటుంది. అలాంటి మృతదేహాలకు దూరంగా ఉండడం ఉత్తమం. నివారణ ఎలా?: చేతులు తరచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పండ్లను బాగా కడిగిన తర్వాతే తినాలి. వైరస్ బారినపడిన వారికి దూరంగా ఉండాలి. చికిత్స ఉందా?: నిఫా వైరస్ బాధితులకు ప్రస్తుతానికి నిరి్ధష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు. అనుమతి పొందిన వ్యాక్సిన్, ఔషధాలూ లేవు. ల్యాబ్‌లో నిఫా వైరస్‌పై రిబావిరిన్ డ్రగ్ కొంత మేర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే, మనుషులపై ఈ డ్రగ్ ఉపయోగించవచ్చా? లేదా? అనేది నిర్ధారణ కాలేదు. -
ఉప్పల్‌లో ఇసుక లారీ బీభత్సం
-
కూలీల బతుకులు ఛిద్రం
బొబ్బిలి రూరల్/దత్తిరాజేరు: రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు వారు... ప్రతి రోజూ ఒకే ఊరి నుంచి 3, 4 ఆటోలలో 45 మంది వరకు కలిసి వేకువజామునే క్యారేజీలు కట్టుకుని వచ్చి రైల్వే పనులు చేస్తుంటారు. మరో 15 రోజులలో పండగ వస్తోందని ఆశతో అందరూ పనిచేసుకుపోతున్నారు. పనిచేసే ప్రదేశం వద్ద రైలు లేదా గూడ్స్ వచ్చే సమయంలో హెచ్చరికగా జెండాలు ఊపుతూ అంతా అప్రమత్తంగా ఉంటారు. రైలుబళ్లు కూడా వేగం తగ్గించి పని ప్రదేశంలో వెళ్తాయి. కాని గురువారం వారి ఆశలు ఆవిరయ్యాయి. రైలు బండి రూపంలో వారి బతుకులు ఛిద్రం అయ్యాయి...మండలంలోని పెంట రైల్వే బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాదంలో దత్తిరాజేరు మండలం కోరపు కృష్ణాపురం గ్రామానికి చెందిన దన్నాన సన్యాసిరావు(44) మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన మృతుడికి వరుసకు సోదరుడయ్యే పతివాడ రాము కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే దన్నాన అన్నపూర్ణమ్మ భయంతో బ్రిడ్జిపై నుంచి దూకేయడంతో తీవ్రంగా గాయపడింది. అసలేం జరిగింది.....? స్థానికులు, బాధిత కుటుంబాల సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కోరపు కృష్ణాపురం గ్రామానికి చెందిన 45 మంది సుమారు 30 సంవత్సరాలుగా రైల్వే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా గురువారం ఉదయం పెంట బ్రిడ్జిపై పనులు చేపట్టారు. ట్రాక్ పనులు చేస్తుండగా ఉదయం 9.30 గంటల సమయంలో విశాఖ నుంచి రావాల్సిన విశాఖ–రాయఘడ డీఎంయూ గంట ఆలస్యంగా 10.30గంటలకు వచ్చింది. వేగంగా రైలు వస్తుండడంతో çపనులు జరుగుతున్నట్లు కార్మికులు హెచ్చరిక జెండా ఊపారు. అయినా రైలు వేగంగా వచ్చి దన్నాన సన్యాసిరావును ఢీ కొట్టింది. దీంతో అతని శరీరం ఛిద్రమై బ్రిడ్జి పిల్లర్ల మీద పడిపోయింది. ఈ సమయంలో అక్కడేపనిచేస్తూ పరుగుతీçస్తున్న పతివాడ రామును కూడా రైలు ఢీకొనడంతో తలకు తీవ్రగాయమైంది. ఈ ఘటనలో భయబ్రాంతులకు గురైన దన్నాన అన్నపూర్ణమ్మ బ్రిడ్జిపై నుంచి దూకేయడంతో సుమారు 25 నుంచి 30 అడుగుల ఎత్తునుంచి కిందపడడంతో ఆమె కాలుకు తీవ్రగాయమైంది. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను 108 వాహనంలో బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. భార్య కళ్లెదుటే... మృతుడు సన్యాసిరావుకు భార్య రమణమ్మ, కుమార్తెలు దివ్య, ఉష ఉన్నారు. రమణమ్మ కూడా గురువారం భర్తతో పాటే పనిచేస్తోంది. తన కళ్లెదుటే భర్త చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇద్దరు కుమార్తెల్లో ఒకరు టెన్త్, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. తీవ్రంగా గాయపడిన పతివాడ రాముకు భార్య చిన్నమ్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తీవ్రంగా గాయపడిన అన్నపూర్ణమ్మ భర్త గతంలో మృతి చెందగా ఆమెకు పార్వతి అనే ఒక కుమార్తె ఉంది. వీరంతా గ్రామానికి చెందిన ఎస్.బంగారునాయుడు ఆధ్వర్యంలో రైల్వే పనులు చేస్తున్నారు. సన్యాసిరావు మృతదేహాన్ని అతికష్టం మీద బ్రిడ్జి పిల్లర్ల మీద నుంచి తీసి రైల్వే ఇన్స్పెక్టర్ ఎంకే మీనా, ఎస్సై జీపీ రాజు, ఏఎస్సై వీఆర్ రెడ్డి, ఎస్హెచ్ఓ ఈ.కేశవరావు, వీఆర్ఓ రవి, అప్పారావుల సమక్షంలో శవపంచనామా చేసి బొబ్బిలి సీహెచ్‌సీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మిన్నంటిన ఆర్తనాదాలు... ప్రమాదం జరిగిన ప్రదేశంలో కోరపు కృష్ణాపురం గ్రామస్తులతో పాటు మృతుడు సన్యాసిరావు కుటుంబ సభ్యులు హృదయ విదారకంగా రోదించడంతో ఆర్తనాదాలు మిన్నంటాయి. ఎప్పుడూ ట్రాక్‌లపై పనిచేసే తాము ప్రమాదాలను పసిగడతామని... 30 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లాల్సిన ట్రైన్ 120 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారు. మృతుని కుటుంబ సభ్యులకు, క్షతగాత్రులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని వైఎస్సార్సీపీ నాయకుడు సుమన శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దిగ్భ్రాంతి.... సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన దురదృష్టకరమని, బాధితులను ఆదుకోవాలని ఆయన కోరారు. -
జార్ఖండ్‌లో 63.36% పోలింగ్
రాంచీ: ఉద్రిక్తత నడుమ జార్ఖండ్‌లో రెండో దశ పోలింగ్ ముగిసింది. 63.36 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. సిసాయ్ నియోజకవర్గంలోని 36వ పోలింగ్ బూత్ వద్ద పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించిన వ్యక్తుల మీద భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మరణించగా, మరి కొందరు గాయపడ్డారని ఏడీజీపీ మురారి లాల్ మీనా చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరపుతున్నామని జార్ఖండ్ ఎన్నికల అధికారి వినయ్ కుమార్ చౌబే తెలిపారు. పోలీసుల కాల్పుల అనంతరం కోపోద్రిక్తులైన ప్రజలు రాళ్లు విసరడంతో ఓ పోలీసుకు గాయాలయ్యాయి. రెండో దశలో మొత్తం 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనుండగా, అందులో 18 స్థానాల్లో మధ్యాహ్నం 3 వరకూ మరో రెండు స్థానాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరిగింది. దాదాపు ఏడు జిల్లాల వ్యాప్తంగా 42 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. -
టీడీపీ అభ్యర్థి కారు ఢీకొని యువకుడి మృతి
-
టీడీపీ అభ్యర్థి కారు ఢీకొని యువకుడి మృతి
తెనాలి: తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సతీమణి మాధవి ప్రయాణిస్తున్న కారు, బైకును ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వేరొక వాహనంలో మాధవి వెళ్లిపోగా, క్షతగాత్రులను తెనాలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వీరిలో ఒక యువకుడు మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆలపాటి మాధవి, హనుమాన్‌పాలెం–గుంటూరు రహదారిలో తిరిగి వెళుతుండగా, రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. తెనాలి రూరల్ మండలం ఖాజీపేట సెంటరులో ఎదురుగా వస్తున్న బైకును కారు ఢీకొంది. ఈ దుర్ఘటనలో బైకుపై వస్తున్న సమీప కొలకలూరు గ్రామ యువకులు సుద్దపల్లి రవీంద్ర (30), పొన్నెకంటి పవన్‌కుమార్ (25)కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని తెనాలిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో పవన్‌కుమార్ మృతి చెందగా, రవీంద్ర పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. విషయం తెలిసిన కొలకలూరు దళితవాడ ప్రజలు ప్రమాద స్థలానికి చేరుకుని, ఆందోళన చేపట్టారు. తెనాలి రూరల్ ఎస్ఐ రాంబాబు అక్కడకు చేరుకుని న్యాయం చేస్తామని పరిస్థితిని సర్దుబాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. -
జమ్మూలో గ్రెనేడ్ దాడి
జమ్మూ: జమ్మూలో ఉగ్రవాదులు గురువారం జరిపిన గ్రెనేడ్ దాడిలో మహ్మద్ షరీక్ (17) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 32 మంది గాయపడ్డారు. జమ్మూ ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ దాడి జరిగింది. సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు యాసిన్ జావీద్ భట్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. అతనికి హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఆ సంస్థే జమ్మూలో మతసామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడిందన్నారు. ఘటనపై జమ్మూ ఐజీ ఎంకే సిన్హా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడిని నగ్రోటా టోల్‌ప్లాజా దగ్గర పట్టుకున్నామనీ, హిజ్బుల్ సంస్థ కుల్గాం జిల్లా కమాండర్ ఫరూఖ్ అహ్మద్ భట్‌తో అతను మాట్లాడినట్లు తేలిందని చెప్పారు. ఫరూఖ్ తనకు గ్రెనేడ్‌ను కుల్గాంలో అందజేశాడనీ, గురువారం ఉదయం జమ్మూ చేరుకున్నానని విచారణలో యాసిన్ చెప్పాడన్నారు. చనిపోయిన మహ్మద్ ఫరీక్ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాకు చెందిన వాడు. గతేడాది మే నుంచి చూస్తే జమ్మూ ఆర్టీసీ బస్టాండ్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడటం ఇది మూడోసారి. ఎన్కౌంటర్లో జైషే ఉగ్రవాది హతం శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్‌కు చెందిన ముష్కరుడు మరణించాడని పోలీసులు చెప్పారు. హంద్వారాలోని క్రల్గుండ్లో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా సమాచారం మేరకు పోలీసులు బుధవారం రాత్రి నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదిని పాకిస్తాన్ జాతీయుడైన అన్వర్‌గా గుర్తించామనీ, ఇతనికి జైషే మహ్మద్ సంస్థతో సంబంధాలున్నాయని పోలీసులు వెల్లడించారు. ఆయుధాలు, పేలుడు పదార్థాల వంటి నేరారోపక వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. యూపీలో కశ్మీరీలపై దాడి చితక్కొట్టిన బజరంగ్ దళ్ సభ్యులు లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రవాదులనుకుని కశ్మీర్‌కు చెందిన యువకులపై బజరంగ్ దళ్‌కు చెందిన వ్యక్తులు దాడి చేశారు. బుధవారం సాయంత్రం ఆ రాష్ట్రంలోని దాలిగంజ్ బ్రిడ్జిపై డ్రై ఫ్రూట్స్‌ను అమ్ముతున్న కొందరు కశ్మీర్ యువకులపై బజరంగ్ దళ్‌కు చెందిన కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ కశ్మీరీ యువకులపైకి రాళ్లతో దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచారు. నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. దాడిలో ప్రధాన నిందితుడు, బజరంగ్దళ్ సభ్యుడు, విశ్వ హిందూదళ్ అధ్యక్షుడు సోంకర్, హిమాన్షు గార్గ్, అనిరుధ్, అమర్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు డ్రైఫ్రూట్స్ అమ్మేందుకు కశ్మీర్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. -
కారు-లారీ ఢీ,ఇద్దరు మృతి
-
హైదరాబాద్: దోంగల బీభత్సం
-
రెప్పపాటులో ఢీకొన్న మూడు వాహనాలు ..
రామాపురం(తడ) : తమిళనాడు సరిహద్దులో రామాపురం కుప్పం వద్ద జాతీయ రహదారిపై గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెప్పపాటులో టిప్పర్, లారీ, పరిశ్రమ బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, 32 మందికి తీవ్రంగా గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు..తమిళనాడుకు చెందిన టిప్పర్ శ్రీకాళహస్తి నుంచి రాతి పొడిని(డస్ట్) తీసుకెళుతోంది. టిప్పర్ రామాపురం కుప్పం వద్దకు చేరుకునే సరికి డివైడర్‌ను దాటుతూ ద్విచక్ర వాహనదారుడు అడ్డు వచ్చాడు. దీంతో టిప్పర్ డ్రైవర్ మదన్(32) బైక్‌ను తప్పించేందుకు షడన్ బ్రేక్ వేశాడు. దీంతో టిప్పర్ డివైడర్ని ఢీకొని టైర్లు పేలిపోయాయి. దీంతో టిప్పర్ అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కి అవతలి రోడ్డులోకి దూసుకెళ్లింది. అదే సమయంలో తమిళనాడు నుంచి నెల్లూరు వైపు వెళుతున్న ఖాళీ లారీ అకస్మాత్తుగా రోడ్డుపై అడ్డు వచ్చిన టిప్పర్ని వేగంగా ఢీకొంది. ఖాళీ లారీ వెనుకగా కార్మికులతో చెన్నై నుంచి శ్రీసిటీకి వస్తున్న సెల్‌ఫోన్ తయారీ పరిశ్రమ బస్సు అదుపుతప్పి ఢీకొంది. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో పాత గుమ్మిడిపూండికి చెందిన ట్రిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఖాళీ లారీ డ్రైవర్ వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలయ్యాయి. క్లీనర్ రామకృష్ణ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బస్సు డ్రైవర్ సతీష్ కాలుతెగిపోయింది. స్థానికులు బయటకు తీసి తమిళనాడు అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం చెన్నై పంపారు. బస్సులో ముగ్గురు మహిళా ఉద్యోగులతో పాటు 29 మంది కార్మికులు ఉండగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయడిన వారిని తమిళనాడు అంబులెన్స్‌లో చెన్నై తరలించగా> పలువురిని శ్రీసిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం చెన్నై తరలించారు. ఈ ప్రమాదంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచి పోయాయి. ప్రమాద విషయం తెలుసుకున్న సూళ్లూరుపేట సీఐ ఎన్ కిషోర్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులు, పోలీసుల సహకారంతో సహాయ చర్యలు చేపట్టారు. -
కుటుంబంలో పెను విషాదం
చింతామణి: సెలవు రావడంతో ఆనందంగా సొంతూరికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం విరుచుకుపడింది. కారును సరుకు ఆటో డీ కొన్న ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించగా, ఆమె భర్తతో సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. చింతామణి తాలూకా కంచార్లపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని దండుపాళ్యం గేటు దగ్గర ఆదివారం ఈ ఘటన చోటుచేసుకొంది. మృతురాలిని లలితమ్మ (40)గా గుర్తించారు. వివరాలు... ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లి సొసైటీ కాలనీకి చెందిన రవీంద్రరెడ్డి, భార్య లలితమ్మ(40), కూతురు హారిక (18)తో కలిసి బెంగళూరు మహదేవపురలో నివాసం ఉంటున్నారు. రవీంద్రరెడ్డి సివిల్ ఇంజినీర్‌గా ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. భార్య పుట్టింటికి వెళ్తుండగా... ఆదివారం సెలవు కావడంతో భార్య లలితమ్మ పుట్టినిల్లయిన తంబళ్లపల్లి మండలం ముద్దలదొడ్డి గ్రామంలోని తల్లిదండ్రులను చూడటానికి బెంగళూరు నుంచి బయల్దేరారు. ఉదయం 10 గంటలప్పుడు చింతామణి మీదుగా వెళుతుండగా ఎదురుగా రాగుల లోడుతో వచ్చిన సరుకు ఆటో వీరి కారును వేగంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు ముందుభాగం నుజ్జునుజ్జుకాగా భార్యాభర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. లలితమ్మ కొద్దినిమిషాలకే కన్నుమూసింది. రవీంద్రరెడ్డి తలకు తీవ్రకు గాయాలయ్యాయి, కూతురు నీహారికకు కాళ్లు, చేతులు విరిగాయి. వీరిని బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.ఆటోలో వున్న వారు శ్రీనివాసపురం తాలూకా కూరకుల్లోపల్లి గ్రామానికి చెందని రైతులు నారాయణస్వామి, రామన్న, మూర్తి రాగులతో చింతామణి మార్కెట్‌కు వస్తుండగా ప్రమాదం సంభవించింది. వారికి కూడా గాయాలు తగిలాయి. ఆటోను మూర్తి నడుపుతున్నట్లు గుర్తించారు. కంచార్లపల్లి పోలీసులు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
బంజారాహిల్స్ లో రౌడీషీటర్ల వీరంగం, ఒకరి మృతి
సాక్షి,హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ పెన్షన్ ఆఫీస్ సమీపంలో బుధవారం రౌడీషీటర్లు వీరంగం సృష్టించారు. అయిదుగురి వ్యక్తులపై రౌడీ షీటర్లు కత్తులతో దాడి చేశారు. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రాణం తీసిన రూ.200
సంగారెడ్డి క్రైం: దాబాలో రూ.200 బిల్లు విషయంలో తగాదా ఏర్పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది. కొండాపూర్ మండలం తెర్పోల్కి చెందిన షాకిర్ మియా(45), చాకలి రాములు, గంగ్యా నర్సింలు పెద్దాపూర్‌లో సిమెంట్ రింగులు కొనుగోలు చేసి, వాటిని వాహనంలో గ్రామానికి తీసుకెళ్తున్నారు. మార్గమధ్యలో ఆ వాహనం పాడవడంతో షెడ్‌కు తరలించారు. అనంతరం పట్టణ శివారులోని 65వ నంబర్ జాతీయ రహదారి పక్కనున్న ఫ్రెండ్స్ ఫ్యామిలీదాబాకు వెళ్లారు. మద్యం సేవించి భోజనం చేశారు. బిల్లు రూ.1,200 కాగా, రూ.వెయ్యి చెల్లించారు. మిగతా రూ.200 వాహనంలో ఉన్నాయని, తీసుకువస్తామని చెప్పినా దాబా యజమాని అశోక్ చౌహాన్‌తోపాటు ఆయన కుమారుడు పూర్తి డబ్బులు చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. ఇది పెద్ద గొడవకు దారి తీయడంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలోనే షాకీర్ మియా మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాకీర్మియా మృతదేహాన్ని ఘటనాస్థలం నుంచి తరలించేది లేదని బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. దాబాపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. -
వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
-
తేనేటీగల దాడి: ఒకరి మృతి
సాక్షి, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అశ్వరావుపేట వద్ద పామాయిల్ తోటలో కూలీలపై తేనేటీగలు దాడి చేశాయి. తేనేటీగల దాడిలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తేనేటీగల దాడిలో కూలీ మృతిచెందడంతో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆస్తి తగాదా ఒకరు మృతి
-
కేవీబీపురంలో దారుణం
-
కేవీబీపురంలో దారుణం
కేవీబీపురం: చిత్తూరు జిల్లాలోని కేవీబీపురంలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్ష్యలతో ఇటుకల వ్యాపారి రాజశేఖర రెడ్డిని దుండగలు నరికి చంపారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. -
బెజవాడలో కల్తీ మద్యం కలకలం
విజయవాడ: విజయవాడలో మరోసారి కల్తీమద్యం కలకలం రేపుతోంది. శుక్రవారం రిక్షా కార్మికుడు అచ్చన్న శుక్రవారం మద్యం తాగిన కొద్దిసేపటికే మృతి చెందాడు. దీంతో అచ్చెన్న కుటుంబసభ్యులు కల్తీ మద్యం వల్లే మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి వద్ద ఉన్న మద్యం బాటిల్‌ను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలోనూ కల్తీ మద్యం సేవించి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. -
కూకట్‌పల్లిలో డీసీఎం బీభత్సం
-
ఇంట్లో నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన డీసీఎం
కృష్ణా: జిల్లాలోని కంచికచర్ల మండలం కీసరలో శుక్రవారం తెల్లవారుజామున డీసీఎం బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టి.. పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. డీసీఎంలో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విశాఖ జిల్లా యలమంచిలి నుంచి గన్నవరం గొర్రెల సంతకు వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. యలమంచిలికి చెందిన ఎస్కే సుభాని గన్నవరం నుంచి గొర్రెలు తీసుకెళ్లడానికి తన డీసీఎం వాహనంలో ఓ డ్రైవర్‌తో పాటు వచ్చాడు. ఈ క్రమంలో కీసర వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుభాని మృతి చెందగా.. ఇంట్లో నిద్రిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు క్షతగాత్రులను అంబులెన్స్‌ల సాయంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
రూ. 30 బాకీ కోసం ఘర్షణ
చికిత్స పొందుతూ ఒకరి మృతి చిల్పూరు (స్టేషన్ ఘన్పూర్): గుడుంబా విక్రయ కేంద్రంలో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్‌కు చెందిన అన్నెబోయిన లింగయ్య (35) ఓ గుడుంబా విక్రయ కేంద్రంలో ఖాతాదారుడు. ఈ నెల 24న పాత అప్పును చెల్లించేందుకు లింగయ్య బస్తా బియ్యం తీసుకెళ్లాడు. ముందుగా గుడుంబా తాగిన తర్వాత వాటిని విక్రయదారునికి అందజేశాడు. ఇంకా రూ. 30 బాకీ ఎవరు కడతారని గుడుంబా విక్రయదారుడు అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గుడుంబా అమ్మకందారులు ఒకటై లింగయ్యపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. లింగయ్యను ఆస్పత్రిలో చేర్పించగా, మంగళవారం మృతి చెందాడు. -
రాజమండ్రి పుష్కర ఘాట్‌లో అపశృతి
-
విషాదంగా మారిన ’రయీస్’ ప్రమోషన్
-
‘దారి’ తీసిన గొడవ
♦ రాళ్ల దాడిలో ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం ♦ వికారాబాద్ జిల్లాలో ఘటన దోమ: దారికి అడ్డంగా బైక్ పెట్టడంతో మొదలైన గొడవ చివరకు ఒకరి ప్రాణాన్ని బలి గొంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం ఐనాపూర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుడ్ల రాజు కొన్నిరోజుల క్రితం తన పొలంలో బోరుబావి తవ్వించాడు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం స్నేహితులు యాదయ్య, నరేందర్, బుగ్గయ్య, నర్సింలుతో కలసి విందు ఏర్పాటు చేశాడు. రాజు పొలానికి వెళ్లే దారిలోనే గ్రామానికి చెందిన సుజాజొద్దీన్ (50) పొలం ఉంది. గురువారం సాయంత్రం ఆయన కుమారులు సైఫొద్దీన్, అహ్మద్ తమ పొలం దగ్గర దారికి అడ్డంగా బైక్ నిలిపి ఉంచడంతో యాదయ్య వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ విషయాన్ని యాదయ్య విందులో ఉన్న తన స్నేహితులకు చెప్పడం తో వారు అక్కడికి వచ్చి ఘర్షణకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సుజాజొద్దీన్ రాత్రి మరోవర్గానికి చెందిన వారిని పిలిపించి సర్ది చెప్పాడు. అనంతరం వారిని మరోసారి తిరిగి పిలిపించడంతో గొడవ మొదలైంది. దీంతో సుజాజొద్దీన్, అహ్మద్, సైఫొద్దీన్లపై రాళ్లతో దాడి చేసి పరారయ్యారు. పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి సుజాజొద్దీన్ మృతి చెందగా.. సైఫొద్దీన్ పరిస్థితి విషమం గా ఉంది. కేసు దర్యాప్తులో ఉంది. వివరాలు సేకరించిన ఎస్పీ ఎస్పీ నవీన్‌కుమార్ శుక్రవారం ఘటన స్థలా నికి చేరుకొని గొడవకు దారి తీసిన కార ణాలను పరిగి డీఎస్పీ అశ్ఫక్, సీఐ ప్రసాద్, ఎస్ఐ ఖలీల్‌ను అడిగి తెలుసుకున్నారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
బలితీసుకున్న మంత్రి కారు
-
బలితీసుకున్న మంత్రి కారు
లక్నో: ఓ మంత్రి కారు డ్రైవర్ బాధ్యతారహితంగా ప్రవర్తించాడు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఓ నిండు ప్రాణం పోయేందుకు కారణమయ్యాడు. అతడి కారులో మద్యం సీసాలు కూడా లభించడంతో మద్యం తాగి అతడు వాహనం నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, ఉత్తప్రదేశ్‌లోని ఓం ప్రకాశ్ సింగ్ అనే ఆయన సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయనకు సంబంధించిన కారు హర్దోయి అనే ప్రాంతంలో ఓ హ్యాండ్ కార్ట్(మనిషిలాగే బండి)ను ఢీకొట్టడంతో దానిని నడిపే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఆ డ్రైవర్‌ను అరెస్టు చేసిన పోలీసులు అనంతరం కారును తనిఖీ చేయగా అందులో మద్యం బాటిళ్లు లభించాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. -
న్యూఢిల్లీలో ఫైరింగ్ ఒకరు మృతి
-
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
వరంగల్: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగులోకి ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కాల్మెట్టా అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన పోలీసులకు, మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక నక్సల్ చనిపోయాడు. మృతుడిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం కొంగల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు మృతదేహాన్ని గుర్తించి, తీసుకువచ్చేందుకు శుక్రవారం బీజాపూర్ బయలుదేరి వెళ్లారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ముగ్గురికి తీవ్రగాయాలు సురక్షితంగా బయటపడ్డ చిన్నారులు ఓడీ చెరువు: ఓడీచెరువు మండలంలోని కదిరి– హిందూపురం రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం మధుగిరికి చెందిన లక్ష్మమ్మ(70)మృతి చెందింది. నరసింగప్ప, గీత, రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయట పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మధుగిరికి చెందిన దంపతులు రమేష్, గీత తమ ఇద్దరు పిల్లలు పావని, చిన్నికి పుట్టెంట్రుకలు తీయించేందుకు రమేష్ తండ్రి నరసింగప్ప, అమ్మ లక్ష్మమ్మతో కలసి కదిరికి బయలు దేరారు. తమ ఇంటి ఇలవేల్పు దేవుడు లక్ష్మినరసింహస్వామికి తలనీలాలు అర్పించి మొక్కుబడి తీర్చుకునేందుకు రమేష్ స్వయంగా కారు డ్రైవింగ్ చేస్తూ వచ్చారు. జేసీబీని ఓవర్టేక్ చేయబోయి.. ఓడీ చెరువు మండలంలోని వేమారెడ్డిపల్లి సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న జేసీబీని ఓవర్టేక్ చేయబోయి వెనకువైపు ఢీ కొట్టాడు. దీంతో కారు కుడివైపు పొలంలోకి దూసుకెళ్లి బండరాâýæ్లను ఢీ కొట్టింది. ప్రమాదంలో లక్ష్మమ్మ, నరసింగప్ప తీవ్రంగా గాయపడ్డారు. గీత, రమేష్ స్వల్పంగా గాయపడ్డారు. పిల్లలు చిన్న గాయం కూడా లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ముందు సీట్లులో కూర్చున్న రమేష్, గీత సీట్ బెల్టు పెట్టుకోవడంతో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని 108 కు సమాచారం చేరవేశారు. క్షతగా>త్రులను 108 ద్వారా కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మమ్మ మృతి చెందినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రెండు ట్రాలీలు ఢీ- క్లీనర్ మృతి
కృష్ణపట్నంపోర్టు బైపాస్‌రోడ్డు (ముత్తుకూరు): ఆగి ఉన్న ట్రాలీని మరో ట్రాలీ ఢీకొనడంతో ఓ క్లీనర్ దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని పంటపాళెం సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్ఐ శ్రీనివాసరెడ్డి కథనం మేరకు..చీమకుర్తి నుంచి కృష్ణపట్నంపోర్టుకు గ్రానైట్ రాళ్లలో ట్రాలీ బయలుదేరింది. పోర్టు బైపాస్‌రోడ్డులోని పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద ట్రాలీని రోడ్డు వైపు నిలిపి, డీజల్ కోసం డ్రైవర్ సమీపంలోని ఫిల్లింగ్ స్టేషన్‌కు వెళ్లాడు. ఇంతలో చీమకుర్తి నుంచి వస్తున్న మరో గ్రానైట్ లోడు ట్రాలీ వేగంగా ఆగి ఉన్న ట్రాలీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాలీ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. అందులోని ప్రకాశంజిల్లా చీమకుర్తి మండలం, కోళ్లబీమునిపాడుకు చెందిన క్లీనర్ సత్తెనపల్లి పిచ్చయ్య (25) రాళ్ల కింద నలిగి, మృతి చెందాడు. డ్రైవర్ పరారయ్యాడు. వారం క్రితమే పనిలో చేరాడు మృతి చెందిన పిచ్చయ్య వారం క్రితమే ఈ ట్రాలీలో క్లీనర్‌గా చేరాడు. ఈ ప్రమాదంలో వెనుక ట్రాలీలోని గ్రానైట్ బండరాళ్లు కిందపడ్డాయి. పోర్టు సెక్యూరిటీ గార్డులు క్రేన్ ద్వారా పిచ్చయ్య మృతదేహాన్ని బయటకు తీశారు. బండరాళ్లను మరో ట్రాలీలో పోర్టుకు తరలించారు. ఈ ప్రమాదానికి భయపడి డీజల్ కోసం వెళ్లిన మరో ట్రాలీ డ్రైవర్ కూడా పరారయ్యాడు. పిచ్చయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
లారీని ఢీకొని యువకుడి దుర్మరణం
వెంకటగిరి: ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బంగారుపేట తెలుగుగంగ కాలువ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వైఎస్సార్ జిల్లా రామాపురం మండలానికి చెందిన నోముల చిన వెంకటేష్ (21) నెల్లూరులోని ఓ స్వీట్ బేకరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వెంకటగిరి సమీపంలోని ఇలగనూరులో ఉన్న తన బంధువుల ఇంటికి మంగళవారం మోటారుబైక్పై వచ్చాడు. బుధవారం తెల్లవారు.జామున నెల్లూరుకు బయలుదేరారు. బంగారుపేట సమీపంలో మరమ్మతులకు గురై రోడ్డుపై ఆగి ఉన్న లారీని అదుపు తప్పి ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన లారీ సిబ్బంది 108కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్ పరీక్షించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. మృతుడి వద్ద లభించిన బేకరీ బిల్లుపై ఉన్న ఫోన్ నంబరు ఆధారంగా వెంకటేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇసుక ట్రాక్టర్ బోల్తా
కూలీ మృతి, డ్రైవర్ పరారు ఎగువపల్లి (సోమశిల) : అధిక లోడుతో అతివేగంగా వెళ్తున్న ఓ ఇసుక ట్రాక్టర్ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడి కూలీ మృతి చెందిన సంఘటన అనంతసాగరం మండలంలోని ఎగువపల్లి సమీపంలో బుధవారం జరిగింది. సోమశిల ఎస్ఐ ఎంఎస్ రాకేష్ కథనం మేరకు.. వైఎస్సార్ జిల్లా బద్వేల్ పురపాలక పరిధిలోని మడకరవారిపల్లికి చెందిన ట్రాక్టర్ మండలంలోని పీకేపాడు ఇసుక రీచ్ నుంచి అధిక లోడుతో ఇసుకను తీసుకెళ్తుండగా ఎగువపల్లి సమీపంలోని మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కూలీ చిట్టిబోయిన సుధాకర్ (28) ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ పరారీ అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటాన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌ను ఢీకొన్న కారు
బంగారు వ్యాపారి మృతి నెల్లూరు రూరల్ : వేగంగా వస్తున్న కారు బైక్‌ను వెనుక నుంచి ఢీకొనడంతో బంగారు వ్యాపారి మృతి చెందిన సంఘటన జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ పోలీసుల కథనం మేరకు.. నగరంలోని పెద్దబజార్‌కు చెందిన బంగారు వ్యాపారి కేజర్ల బద్రీనాథ్ (61) సొంత పనుల నిమిత్తం గూడూరుకు బైక్‌పై బయలు దేరాడు. నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో విజయవాడ వైపు నుంచి గూడూరు వైపు వస్తున్న కారు వేగంగా వచ్చి బైక్‌ను వెనుక వైపు ఢీకొంది. దీంతో కింద పడిన బద్రీనాథ్ తలకు బలమైన గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ బాలకోటయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌ను ఢీకొన్న లారీ
తండ్రి దుర్మరణం కుమారుడికి తీవ్రగాయాలు క్షేమంగా భార్య, కుమార్తె చలివేంద్ర (నాయుడుపేటటౌన్) : మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీ బైక్‌ను ఢీకొనడంతో తండ్రి మృతి చెందగా, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో భార్య, కుమార్తె క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన మండలంలోని చలివేంద్రం సమీపంలో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. మండలంలోని వద్దిగుంట కండ్రిగకు చెందిన పిగిలం అశోక్ (28) అలియాస్ కిరణ్ తన భార్య ప్రభావతి, పిల్లలు హర్షవర్ధన్, రోహితిలను తీసుకుని శనివారం చిల్లకూరు మండలం తిమ్మనగారిపాళెంలో అత్తంటికి వెళ్లేందుకు మోటారు బైక్‌పై బయలుదేరాడు. మేనకూరు పంచాయతీ చలివేంద్రం వద్దకు వచ్చే సరికి రహదారిపై ఎదురుగా అతివేగంగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న అశోక్‌తో పాటు ముందు కూర్చుని ఉన్న ఎల్కేజీ చదువుతున్న కుమారుడు హర్షవర్ధన్ తీవ్రంగా గాయపడ్డారు. భార్య ప్రభావతితో పాటు చిన్నారి రోహితి స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే అశోక్ మృతి చెందినట్లు నిర్ధారించారు. హర్షవర్ధన్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ¯ðనెల్లూరుకు తరలించారు. ఎస్ఐ మారుతీకృష్ణ, ఏఎస్ఐ శంకర్రాజు లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిన్నంటిన రోదనలు కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే అశోక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పపత్రి వద్దకు చేరుకోవడంతో అక్కడ రోదనలు మిన్నంటాయి. మృతుడి భార్య ప్రభావతి గుండెలు బాదుకుంటూ రోదించడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. అశోక్ ఆమె తల్లి బుజ్జమ్మ మతిస్థిమితం తప్పినట్లుగా ఆస్పత్రి ప్రాంగణంలో అటూ ఇటూ పరుగులు పెట్టడంతో ఆమెను సముదాయించేందుకు అవస్థలు పడ్డారు. -
ప్రాణాల మీదకు తెచ్చిన మేకపాలు
నర్సంపేట: మేకపాల విషయంలో అన్నదమ్ముల మధ్య చెలరేగిన ఘర్షణ ఒకరి ప్రాణాలు తీసింది. అన్నదమ్ముల మధ్య పాల విషయంలో గొడవ జరగడంతో.. కోపోద్రిక్తుడైన అన్న తమ్ముడిని కర్రతో చితక బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన తమ్ముడిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లెలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం
అనంతసాగరం (సోమశిల) : మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ ఆటో ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన అనంతసాగరంలో బుధవారం రాత్రి జరిగింది. ఏఎస్ఐ శ్రీనివాసరావు కథనం మేరకు.. అనంతసాగరానికి చెందిన సిద్దవటం పెంచలయ్య (47) బస్టాండ్ సమీపంలోని æతన ఇంటి నుంచి రోడ్డు మీదకు వస్తుండగా మండలంలోని లింగంగుంటకు చెందిన ఆటో బస్టాండ్ వైపు వెళ్తూ ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన పెంచలయ్యను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. ఆటోడ్రైవర్ సంఘటనా స్థలం నుంచి డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవాడు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
స్తంభాన్ని ఢీకొన్న బైక్
ఒకరి దుర్మరణం సూళ్లూరుపేట : పట్టణంలోని చెంగాళమ్మ దక్షిణంవైపు ముఖద్వారంలో మధ్యలో ఉన్న స్తంభాన్ని ఢీకొని ఓ వ్యక్తి ఆదివారం అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కథనం మేరకు.. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలం కాంపాళెంకు చెందిన అక్కరపాక మునిశేఖర్ (24) తడ మండలం మాంబట్టు సెజ్‌లోని రీజెన్ పవర్‌టెక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మాంబట్టులోనే అద్దెకు గది తీసుకుని ఉంటున్నాడు. ఆదివారం మోటార్‌బైక్‌పై సూళ్లూరుపేటకు వచ్చాడు. తిరిగి వెళుతుండగా బైక్ అదుపు తప్పి చెంగాళమ్మ ఆలయం ముఖద్వారం ఆర్చి మధ్యలో ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మునిశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి మృతుని బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బంధువుల వద్ద ఫిర్యాదు తీసుకుని ఎస్ఐ జీ గంగాధర్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యక్తి మృతి
బుచ్చిరెడ్డిపాళెం : టిప్పర్ టైర్లు వ్యక్తి తలపైకి ఎక్కడంతో అతను మృతిచెందిన సంఘటన మండలంలోని రేబాల వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. రేబాల వద్ద బొల్లినేని కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ముంబయి జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం సికరా ప్రాంతానికి చెందిన గంగాప్రసాద్‌యాదవ్ ( 60) తన కుమారుడితో కలిసి కొంతకాలంగా రహదారి పనులు చేస్తున్నాడు. రేబాల వద్ద శుక్రవారం మట్టిని అన్లోడ్ చేసే క్రమంలో టిప్పర్ టైర్లు గంగా ప్రసాద్ తలపైకి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్లోంచి పడి యువకుడు మృతి
తీవ్రగాయాలతో కొద్ది దూరం కలయతిరిగిన వైనం చేనిగుంట (తడ) : రైల్లోంచి జారిపడి జార్కండ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు.ఈ సంఘటన మండలంలోని చేనిగుంట వద్ద గురువారం జరిగింది. అయితే ఆ యువకుడు రైల్లోంచి జారి తీవ్ర గాయాలతో సాయం కోసం వచ్చేందుకు అటూ ఇటూ కొద్ది దూరం కలయతిరిగినట్లు తెలుస్తోంది. రైల్వే ట్రాక్‌కు 150 మీటర్ల దూరంలో పొలం గట్టుపై మృతి చెంది ఉండగా స్థానికులు హత్యగా అనుమానించి రెవెన్యూ, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ టీ విజయకృష్ణ, తడ ఎస్ఐ ఏ సురేష్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి ఒంటిపై ఎలాంటి ఎలాంటి దుస్తులు లేవు. మృతుడికి సమీపంలో ఫ్యాంట్, టీ షర్ట్, పర్సు పడి ఉన్నాయి. చెన్నై వైపు వెళ్లే మార్గంలో 73వ కిలోమీటరు వద్ద రక్తపు మరకలు ఉన్నాయి. అక్కడ చెప్పులు పడి ఉండగా, ట్రాక్‌కు సుమారు 150 మీటర్ల దూరంలో టీ షర్ట్ పడి ఉంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మతిస్థిమితం కోల్పోయి సాయం అటూ ఇటూ కలయతిరిగినట్లు ఉంది. మృతుడికి సంబంధించి దుస్తుల వద్ద లభించిన పర్సులో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా అతన్ని వివరాలు గుర్తించారు. జార్కండ్ రాష్టం రాంచీలోని రోయిరోడ్డుకి చెందిన హనుమంత మెహతా కుమారుడు షాంబు మెహతా(25)గా నిర్ధారించారు. మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, శీతల గదిలో భద్రపరిచారు. బంధువులకు సమాచారం అందించారు.వారు వచ్చాక పోస్టుమార్టం అనంతరం అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. -
ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్ దుర్మరణం
కావలిఅర్బన్ : ట్రాక్టర్ అదుపుతప్పి పడి డ్రైవర్ దుర్మరణం పాలైయ్యాడు. ఈ సంఘటన మండలంలోని వ్యవసాయ పొలాల్లో బుధవారం జరిగింది. కావలి రూరల్ పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఆనెమడుగు పంచాయతీ ఆకుతోట గిరిజన కాలనీకి చెందిన చిట్టేటి సురేష్ (25) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రుద్రకోటకు చెందిన జగదీశ్వరరెడ్డి వద్ద ట్రాక్టర్ తీసుకుని నారుమడులు దున్నేందుకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి పొలాల్లో వేసిన రోడ్డుపై వస్తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
రావూరు (ఇందుకూరుపేట): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మాజీ సైనిక ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని రావూరులో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రావూరుకు చెందిన మహానంది సుబ్బరాయుడు (65) మాజీ సైనికోద్యోగి. ప్రతి రోజు తెల్లవారు జామున మైపాడులోని నెల్లూరు ప్రధాన రహదారిపై వాకింగ్ చేయడం అలవాటు. రోజులాగేనే ఆదివారం తెల్లవారుజామున జగదేవిపేట రోడ్డు వైపు వాకింగ్‌కు బయలు దేరాడు. పున్నూరు అంకమ్మ సత్రం వద్దకు చేరుకునే సరికి గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన సుబ్బారాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడు సుబ్బారాయుడుకు భార్య రమణమ్మ పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎస్ఐ షరీఫ్ తెలిపారు. -
బైక్‌ను ఢీకొన్న లారీ: ఒకరు మృతి
-
లారీ ఢీకొని బేల్దారి మృతి
నెల్లూరు (క్రైమ్) : సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ లారీ ఢీకొనడంతో బేల్దారి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన సుందరయ్యకాలనీ సమీప జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. పడారుపల్లి సుందరయ్య కాలనీ బీబ్లాక్‌లో నివాసం ఉంటున్న ఎస్కే గౌస్‌బాషా (40) బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం గౌస్‌బాషా సైకిల్‌పై డి బ్లాక్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో జాతీయ రహదారి దాటుతుండగా చెన్నై వైపు నుంచి వస్తున్న లారీ వేగంగా సైకిల్‌ను ఢీకొంది. గౌస్‌బాషా తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ లారీని అక్కడే వదిలి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. తమకు దిక్కెవరని భార్య ఖాదరున్నీసా గుండెలవిసేలా రోదించింది. ఆమె రోదన చూపరులను కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న సౌత్ ట్రాఫిక్ ఎస్ఐ పి.చిన్న బలరామయ్య సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రభుత్వ వైద్యులతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్ఐ చిన్న బలరామయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు -
రైల్లోంచి జారిపడి వ్యక్తి మృతి
నెల్లూరు (క్రైమ్) : ప్రమాదవశాత్తు రైల్లోంచి జారిపడి గుర్తుతెలియని (40) వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు సమీప రైలు పట్టాల వద్ద చోటు చేసుకుంది. మృతుడు లేత బ్లూ (స్కైబ్లూ)రంగు ఫుల్‌హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు కాటన్ జీన్స్ ధరించి ఉన్నాడు. మృతుడి జేబులో టెస్టర్ ఉంది. విషయం తెలుసుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ జోసఫ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ఎలక్ట్రీషియన్ అయి ఉండొచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని డీఎస్ఆర్ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
సూళ్లూరుపేట : బైక్ అదుపు తప్పి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణంలోని శేషసాయి కల్యాణ మండపం సమీపంలో చెన్నై–కోల్కత్తా ఏషియన్ హైవేపై బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నాయుడుపేట మండలం అత్తలపాళెంకు చెందిన చిన్నస్వామి (45) వరదయ్యపాళెం మండలం సాధనవారిపాళెంలోని తన అక్క ఇంటికి మోటార్‌బైక్‌పై వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగి ఇంటికెళ్తూ శేషసాయి కల్యాణ మండపం వద్ద ఆటోను క్రాస్ చేస్తూ అదుపు తప్పి రోడ్డు మీద పడిపోయాడు. తలకు బలమైన గాయంకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్ఐ జీ గంగాధర్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డివైడర్‌ను ఢీకొన్న బైక్
యువకుడి దుర్మరణం మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఉలవపాడు/ కావలి రూరల్ : వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జాతీయ రహదారిపై మండలంలోని చాగల్లు పోలేరమ్మ గుడి సమీపంలో బుధవారం జరిగింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంవ బ్రహ్మారెడ్డిపాళెంకు చెందిన గుమ్మడి కుమార్ (25) చీరాలకు చెందిన టి.రాము, మనోజ్‌కుమార్‌తో కలిసి ఒకే బైక్‌పై నెల్లూరు నుంచి చీరాలకు బయల్దేరారు. నెల్లూరు జిల్లాలోని బ్రహ్మరెడ్డిపాళెంలో దశదిన కర్మకు వచ్చిన చీరాల వాసులు తమ మిత్రుడైన కుమార్ బైక్‌పై చీరాల తీసుకెళ్తున్నాడు. కుమార్ బైక్ నడుపతున్నాడు. చాగల్లు వద్దకు వచ్చే సరికి లారీని ఓవర్టేక్ చేయబోయి కుడి వైపున డివైడర్‌ను ఢీకొట్టారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సిబ్బంది కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమార్ మృతి చెందాడు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. ఒక్కడే కుమారుడు. పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బోరు నిర్మిస్తూ యువకుడి మృతి
మరొకరికి గాయాలు కావలిరూరల్ : పొలంలో బోరువేస్తూ విద్యుత్ షాకుకు గురై యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. మండలంలోని రుద్రకోట పంచాయతీ గుమ్మడిబొందలకు చెందిన దద్దాల పిచ్చయ్య గౌడ్ మామిడితోటలో బోరు వేస్తున్నారు. బోరు నిర్మాణ పనులను ఒడిశా రాష్ట్రం నవరంగ్‌పూర్ జిల్లా రాయగఢ్‌కు చెందిన వికాస్ (29), ఒబ్బిగోండ్ అనే కూలీలు చేస్తున్నారు. ఈ క్రమంలో పైపులు పైకి లాగుతుండగా పైన ఉన్న కరెంటు తీగలు పైపునకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యారు. వీరిలో వికాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఒబ్బిగోండ్ గాయపడటంతో అతన్ని 108లో కావలికి తరలించి ఒక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. మృతుడు వికాస్ అవివాహితుడు. వికాస్ తండ్రి ఇటీవలే మరణించగా అతను ఉపాధి కోసం ఇక్కడకు వచ్చాడు. అతని తల్లిదండ్రులకు నలుగురు సంతానం కాగా వికాస్ చివరివాడు. కావలి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కలిగిరి: కలిగిరిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంగళవారం ఆర్టీసీబస్సు, బైకు ఢీ కొన్న సంఘటనలో ఎస్థానిబాషా (19) అనే యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరక.. కలిగిరికి చెందిన ఎస్థానిబాషా, వీరారెడ్డిపాలెంకు చెందిన స్నేహితుడు మనోజ్ ఇద్దరూ హసనాపురంలో ఐటీఐ కాలేజికి వెళుతున్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గేదెలను తప్పించబోయి ఉదయగిరికి వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న ఎస్తానీబాషా తీవ్రంగా గాయపడగా.. మనోజ్‌కు కూడా గాయాలయ్యాయి. బాషా పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. సాయంత్రం చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే పోలిస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. -
ఫుట్‌పాత్‌పైకి దూసుకువచ్చిన కారు
యాచకుడు దుర్మరణం.. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ పట్టివేత నాయుడుపేటటౌ¯న్: ఫుట్‌పాత్‌పైకి ఒక్కసారిగా బొలేరో కారు దూసుకు రావడంతో గుర్తుతెలియని యాచకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు వివరాల మేరకు.. స్థానిక వినాయకుడి గుడి పక్కన రోడ్డు ఫుట్‌పాత్‌పై ఓయాకుడు కూర్చుని ఉన్నాడు. నాయుడుపేట వైపు నుంచి ఓ బొలేరో కారు అతివేగంగా వస్తూ ఒక్కసారిగా గుడి పక్కనే ఉన్న ఫుట్‌పాత్ పైకి దూసుకువచ్చింది. దాంతో అక్కడ కూర్చుని ఉన్న సుమారు 50 సంవత్సరాలకు పైగా వయస్సు ఓ యాచకుడు మృత్యువాతపడ్డాడు. బొలేరో కారు సిని ఫకీలో పైకి లేపి కూర్చుని ఉన్న వ్యక్తిపైకి నడపడంతో స్థానికులు గుర్తించి సంఘటన స్థలం వద్దకు పరిగెత్తారు. అప్పటికే కారు నడుపుతున్న డ్రైవర్ అక్కడి నుంచి పరారైయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకున్నారు. అయితే ఆ వ్యక్తి మద్యం మత్తులో తూగుతుండడాన్ని గుర్తించారు. బొలేరో వాహనం ఎంపీ షుగర్ ఫ్యాక్టరీకి చెందిన వాహనంగా గుర్తించారు. డ్రైవర్ పట్టణానికి చెందిన మాబాషాగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ అదుపు తప్పిపడి రైతు మృతి
అనుమసముద్రంపేట : బైక్ అదుపు తప్పి పడి ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని సంగం–హసనాపురం ఆర్ అండ్‌బీ రోడ్డుపై సోమవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. హసనాపురానికి చెందిన అబ్బూరు ఆదినారాయణ (55) సోమవారం మధాహ్నం పొలానికి వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే సమయంలో సంగం నుంచి హసనాపురం వైపు వెళ్లే ద్విచక్ర వాహనదారులను లిఫ్ట్ అడిగాడు. కొందరు ఆపకుండా వెళ్లారు. ఏపీ 26ఏఎస్ 9184 నంబరు బైక్‌లో వెళ్తున్న వ్యక్తి ఆపి ఆదినారాయణను ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో బైక్ అదుపు పడిపోయింది. ప్రమాదంలో కింద పడిన ఆదినారాయణ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం అనంతరం బైక్ నడుపుతున్న వ్యక్తి పరారీ అయ్యాడు. ఎస్ఐ వెంకటసాయి తన సిబ్బందితో వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదినారాయణ మృతి చెందిన విషయం తెలుసుకున్న బం«ధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
కల్వర్టులో పడిపోయిన కారు,ఒకరు మృతి
-
అంబులెన్స్ - కారు ఢీ: ఒకరి మృతి
-
అంబులెన్స్ - కారు ఢీ: ఒకరి మృతి
మహబూబ్‌నగర్ : మానవపాటు వద్ద మంగళవారం తెల్లవారుజామున అంబులెన్స్ - కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లోని ఒకరి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. మహాబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి
మృతదేహంతో పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయింపు ఉద్రిక్తత పరిస్థితి ఉదయగిరి : విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని దేకూరుపల్లిలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని దేకూరుపల్లికి చెందిన గోపిదేశి వెంకటరమణయ్య (30) ఉదయం ఎద్దులను మేత కోసం తోలుకోని గ్రామ సమీపంలో ఉన్న తమ పొలం వద్దకు వెళ్లాడు. పొలంలో పనిచేసుకుంటుండగా, ఎద్దులు పక్కనే ఉన్న పైరును మేస్తుండటంతో వాటిని తోలేందుకు పరుగెత్తుతుండగా అదే పొలంలో తాత్కాలిక కర్రల మీద ఏర్పాటు చేసిన విద్యుత్‌తీగలు తగిలి షాక్‌కు గురయ్యాడు. గ్రామ ఎస్సీ కాలనీ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కిలో మీటరు దూరం వ్యవసాయ పొలాల్లో ఉండగా కర్రల ఆధారంగా సిద్దు నారాయణరెడ్డి, కారుమంచి రసూల్ తమ పొలాల వద్దకు ఏర్పాటు చేసుకున్నారు. ఈ వైర్లు మృతుడి పొలం వద్ద కర్రల మీద నుంచి కిందికి పడిపోయాయి. గమనించని వెంకట రమణయ్య షాక్ తగిలి మృతి చెందారు. నారాయణరెడ్డి, రసూల్ చర్యల వల్లే వెంకట రమణయ్య మృతి చెందాడని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు స్టేషన్ బయట బైఠాయించారు. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటల సమయంలో మృతుడి బంధువులకు, ఈ ప్రమాదానికి కారకులుగా ఆరోపిస్తున్న వ్యక్తుల బంధువుల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది. కొంతమంది పెద్దలు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వైద్యులు సంధానిబాషా పోస్టుమార్టం నిర్వహించారు. -
జేసీబీ కింద పడి యువకుడి మృతి
దుత్తలూరు : జేసీబీకి మరమ్మతులు చేస్తున్న ఓ యువకుడు అదే జేసీబీ కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం దుత్తలూరు సెంటర్ సమీపంలో జరిగింది. ఆత్మకూరు మండలం కరటంపాడుకు చెందిన హరీష్ (25) అనే యువకుడు నర్రవాడలో జేసీబీ ఆపరేటర్‌గా నాలుగు నెలల క్రితం చేరాడు. బుధవారం దుత్తలూరు–వింజమూరు మార్గంలోని మూతబడిన పెట్రోల్ బంక్ వద్ద జేసీబీని నిలిపి కిందవైపు మరమ్మతులు చేస్తున్నాడు. అయితే జేసీబీని ఆపరేట్ చేసే గేర్ లివర్లను లాక్ చేయడం మరిచాడు. మరమ్మతులు చేస్తుండగా అటుగా ఆడుకుంటున్న పిల్లలు పొరపాటున వాటిని తగలడంతో జేసీబీ ముందు భాగంలోని తొట్టెవంటి భాగంలో ఇరుక్కుపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం వింజమూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు ఆందలేదు. -
రెండు లారీలు ఢీ: ఒకరి మృతి
మెదక్ : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర వద్ద మంగళవారం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డివైడర్‌ను ఢీకొన్న బైక్
–అపాచి కార్మికుడి దుర్మరణం మరొకరికి తీవ్రగాయాలు సూళ్లూరుపేట : ప్రమాదవశాత్తు డివైడర్‌ను బైక్ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన చెన్నై–గుంటూరు ఏషియన్ హైవేపై సూళ్లూరుపేట సమీపంలోని మన్నారుపోలూరు మలుపురోడ్డు వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చిట్టమూరు మండలం జంగాలపల్లికి చెందిన పాలిచెర్ల లక్ష్మీనారాయణ (20), అతని సమీప బంధువు చిల్లకూరు మండలం నల్లయ్యగారి పాళెంకు చెందిన పీ శ్రీనివాసులు (24) ఆపాచి కంపెనీలో చేరి పట్టణంలోని కోళ్లమిట్టలో రూము తీసుకుని ఉంటున్నారు. టౌన్లో అద్దెలు ఎక్కువగా ఉన్నాయని, ఎక్కడైనా పల్లెటూరులో రూము తీసుకుంటే అద్దెలు తగ్గుతాయనే భావనతో ఇద్దరు కలిసి మోటార్‌బైక్‌పై చిత్తూరుజిల్లా వరదయ్యపాళెం మండలం కారిపాకం వెళ్లి రూము చూసుకుని తిరిగి వస్తుండగా డివైడర్‌ను కొట్టుకుని పక్కనే ఇనుప రైలింగ్‌కు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీనివాసులు తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మృతుడి బంధువులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి ఎస్సై జీ గంగాధర్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
చిల్లకూరు : ‘నాకు పనుంది బైక్‌పై నెల్లూరు వెళ్తా.. మీరు ఆటోలో వచ్చేయండి’ చెప్పిన వ్యక్తి కొంతసేపటికి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. సంఘటన మండలంలోని కోట క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు నెల్లూరు శ్రామిక్‌నగర్‌కు చెందిన ఎంబేటి మురళి (30) లారీ డ్రైవర్‌గా పనిచేన్నాడు. అతని భార్య పోలమ్మ, తమ ముగ్గురు పిల్లలైన చరిత, ఏసు, శరత్‌కుమార్‌లను మోటార్‌బైక్‌పై ఎక్కించుకుని ఆదివారం గూడూరు మండలం అయ్యవారిపాళెంలోని బంధువుల ఇంటి వచ్చారు. పోలమ్మ అక్క పిల్లలు చిట్టేడు గిరిజన గురుకుల పాఠశాలలో చదవుతుండగా వారిని చూసేందుకు బంధువులతో కలిసి భార్య పిల్లలను ఆటోలో చిట్టేడుకు పంపాడు. మురళి బైక్‌పై వెళ్లినప్పటికీ అర్జెంటు పని ఉందని చిట్టేడు నుంచి ఒంటరిగానే నెల్లూరుకు బయలుదేరి ఆటోలో భార్య, పిల్లలను నెల్లూరుకు రావాలని చెప్పాడు. ఈ క్రమంలో మురళి కోట క్రాస్‌రోడ్డు వద్ద మలుపు తిరుగుతుండగా చెన్నె వైపు నుంచి వేగంగా వస్తున్న బైక్‌ను గమనించకుండా ఢీకొట్టింది. ఈ ఘటనలో మురళి అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుకనే ఆటోలో వస్తున్న భార్య, పిల్లలు అక్కడి చేరకుని మృతదేహాన్ని చూసి బోరు విలపించారు. విషయం తెలుసుకున్న ఎస్సై అంకమ్మ సంఘటనా స్థలానికి చేరకుని వివరాలను సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటోను ఢీకొన్న లారీ : ఒకరి మృతి
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు రూరల్ మండలం ఎస్ ఉప్పరపల్లి హరిజనవాడ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ... ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను 108 వాహనంలో రైల్వేకోడూరులోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మృతుడి వివరాలు మాత్రం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
- పాకల సముద్ర తీరంలో ఐదుగురు గల్లంతు - ఒకరు మృతి.. నలుగురిని రక్షించిన మెరైన్ కానిస్టేబుల్ - మృతునిది పొన్నలూరు మండల కేంద్రం పాకల (సింగరాయకొండ) : వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఐదుగురు గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృతి చెందగా నలుగురిని మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఈ సంఘటన పాకల సముద్ర తీరంలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం సింగరాయకొండ, కందుకూరు, జరుగుమల్లి, పొన్నలూరు, కొండపి మండలాల నుంచి భక్తులు పాకల సముద్ర తీరానికి బుధవారం విరివిగా వచ్చారు. అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. ప్రజలను సముద్రంలోకి వెళ్లకుండా సీఐ భీమానాయక్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో పొన్నలూరుకు చెందిన విగ్రహాన్ని ఆ గ్రామస్తులు రెండు ట్రాక్టర్లలో వచ్చి సముద్రంలో నిమజ్జనం చేశారు. విగ్రహం ఒడ్డునే ఉండటంతో సముద్రం లోపలికి నెట్టే ప్రయత్నంలో ఉండగా ఐదుగురు యువకులు అలల ధాటికి సముద్రంలో కొట్టుకుపోయారు. సీఐ భీమానాయక్ అప్రమత్తమై మెరైన్ కానిస్టేబుళ్లను అప్రమత్తం చేశారు. కానిస్టేబుల్ కె.రామకృష్ణ సముద్రంలో గల్లంతైన వారిని రక్షించేందుకు ప్రయత్నించి చివరకు ఆయన కూడా ప్రమాదంలో పడ్డారు. వెంటనే మరో మెరైన్ కానిస్టేబుల్ కె.ధనుంజయ లైఫ్ జాకెట్ల సాయంతో సముద్రంలోకి వెళ్లి రామకృష్ణతో పాటు నలుగురు యువకులను రక్షించారు. పొన్నలూరుకు చెందిన లింగంగుంట రమేష్ (42)ను ఒడ్డుకు తీసుకొచ్చినా అప్పటికే బాగా నీరు తాగి ఉండటంతో చనిపోయాడు. మరో యువకుడు కొత్తకోట మాధవ (35) అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే 108లో సింగరాయకొండ ప్రభుత్వ అస్పత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. మిగిలిన ముగ్గురు స్వయంపాకుల మణికంఠ, చెన్నయపాలెం మల్లికార్జున, ఎన్.విజయ్‌లు వెంటనే తేరుకున్నారు. ఆ తర్వాత నుంచి తీరం ఒడ్డునే నిమజ్జనాలు చేసేలా ఎస్సై వైవీ రమణయ్య చర్యలు తీసుకున్నారు. విషయం తెలిసి తహసీల్దార్ షేక్ దావూద్‌హుస్సేన్ హుటాహుటిన తన సిబ్బందితో పాకల తీరానికి వెళ్లి పోలీసు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. పొన్నలూరులో.. పొన్నలూరు : స్థానికంగా నివాసం ఉండే రజకులు వినాయక విగ్రహం నిమజ్జనం కోసం రెండు ట్రాక్టర్లలో పాకల సముద్ర తీరానికి వెళ్లారు. అలల ధాటికి రమేష్ గల్లంతై మృతి చెందడంతో భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు బేల్దారి పనుల కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. భార్య రమణమ్మ కూలి పనులు వెళ్తూ ఇద్దరు కొడుకులు వెంకటసాయి, బాలసాయిలను చదివించుకుంటూ ఇంటి వద్దే ఉంటోంది. వినాయక నిమజ్జనం కోసం రమేష్.. హైదరాబాద్ నుంచి మంగళవారం స్వగ్రామం వచ్చాడు. వినాయక లడ్డూను వేలం పాటపడి దక్కించుకున్నాడు. ఆ రాత్రి తన బంధువులకు ఇంటి వద్ద విందు ఇచ్చి వారితో సంతోషంగా గడిపాడు. రాత్రి గ్రామంలో జరిగిన వినాయక విగ్రహం ఊరేగింపులో పాల్గొన్నాడు. నిమజ్జనానికి వెళ్లొద్దని భార్య బతిమాలినా వినిపించుకోకుండా వెళ్లి రమేష్ ప్రాణాలు కోల్పోయాడు. కాలనీలో విషాద ఛాయలు రాత్రంతా తమతో పాటు వినాయక ఊరేగింపులో పాల్గొన్న రమేష్ సముద్రంలో మృతి చెందడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కళ్లముందే అలల మధ్య కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేకపోయామని కాలనీ వాసులు వాపోయారు.పోలీసులు వెంటనే స్పందించకుంటే మిగిలిన నలుగురినీ కోల్పోవాల్సి వచ్చేదని భయాందోళన వ్యక్తం చేశారు. -
ప్రాణం తీసిన సెల్‌ఫోన్..
నెల్లూరు రూరల్ : ట్రాక్టర్ ఆపి చార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్ తీసుకుని రోడ్డు పక్కన నిలబడిన వ్యక్తిని అదే ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతిచెందిన సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొన్నవాడ రోడ్డులో పొట్టేపాళెం సమీపంలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు పొదలకూరు రోడ్డు సెంటర్‌కు చెందిన జి.వెంకటరమణ్య తన ట్రాక్టర్‌తో ఇసుక తీసుకువచ్చేందుకు పొట్టేపాళెం ఇసుకరీచ్‌కు బయలుదేరాడు. తోడుగా కుమారుడిని తీసుకెళ్లాడు. సెల్‌ఫోన్ చార్జింగ్ తక్కువగా ఉండటంతో పొట్టెపాళెం పాత హరిజనవాడ సమీపంలోని మూడోమైలు (గుడితూము) వద్ద ట్రాక్టర్‌ను ఆపి, సమీపంలోని దుకాణంలో చార్జింగ్ పెట్టాడు. ఇసుక రీచ్‌కు వెళ్లి ఇసుక లోడ్ చేసుకుని తిరిగి నెల్లూరు వైపు వస్తు పొట్టెపాళెంలో దుకాణం సమీపంలో ట్రాక్టర్‌ను రోడ్డుపక్కన ఆపాడు. చార్జింగ్ పెట్టిన సెల్ తీసుకుని వెంకటరమణయ్య రోడ్డుపక్కన నిలుచుని కొడుకును ట్రాక్టర్ నడపాలని సూచించాడు. తండ్రి సూచన మేరకు కొడుకు ట్రాక్టర్‌ను ముందుకు తీశాడు. అదుపుతప్పిన ట్రాక్టర్ సెల్లో మాట్లాడుతున్న వెంకటరమణయ్యను ఢీకొట్టింది. గోడకు, ట్రాక్టర్ ట్రాలీ ట్రక్కు మధ్యన ఇరుక్కుపోయిన వెంకటరమణయ్య(48) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం అందించడంతో రూరల్ ఎస్సై సుబ్బారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించాడు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బస్సు- లారీ ఢీ: ఒకరి మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చీలపల్లె సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెంగుళూరులో కాల్పులు : ఒకరి మృతి
బెంగుళూరు : కావేరి నది జల వివాదంతో బెంగుళూరు నగరం అట్టుడుకుతోంది. నగరంలో సోమవారం రాత్రి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ ఆందోళనకారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరోకరు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నగరంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు రాజ్గోపాల్నగర్, కామాక్షిపాలై, విజయనగర్, బయంత్రాయన్పురా, కెన్రెగి, మగాది రోడ్డు, రాజాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. -
ట్రాక్టర్ కిందపడి యువకుడి దుర్మరణం
మరొకరికి తీవ్రగాయాలు గూడూరు : ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను అధిగమించే క్రమంలో దాని కింద పడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆదివారం పట్టణంలోని ముత్యాలపేట ప్రాంతంలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు రెండో పట్టణంలోని ఎస్ఆర్ఏ థియేటర్ ప్రాంతానికి చెందిన పందేటి మస్తాన్ (28), 1వ పట్టణంలోని రాణీపేట ప్రాంతానికి చెందిన ఏడుకొండలు మోటార్ బైక్‌పై టవర్‌క్లాక్ సెంటర్ నుంచి రైల్వేస్టేషన్ వైపు వెళ్తున్నాడు. ముందు వెళ్లే ట్రాక్టర్‌ను అధిగమించే క్రమంలో పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొని అదుపు తప్పి ట్రాక్టర్ చక్రాల కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న మస్తాన్ తీవ్రంగా గాయపడగా, మోటార్ బైక్ నడుపుతున్న ఏడుకొండలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మస్తాన్ మృతి చెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ మాత్రం వెళ్లిపోయింది. మస్తాన్, ఏడుకొండలు ఇద్దరూ సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 1వ పట్టణ ఎస్సై సుధాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాకుదిక్కెవరు మస్తాన్ రెక్కాడితే కానీ ఆ కుటుంబానికి పూడగడవని పరిస్థితి. రోడ్డు ప్రమాదంలో మస్తాన్ మృత్యువాత పడటంతో ఇక మాకు దిక్కెవరంటూ మృతుడి భార్య అపర్ణ తన ఇద్దరు కుమారులను పట్టుకుని బోరున విలపించింది. సెంట్రింగ్ పనులు చేస్తూ వచ్చే సంపాదనతో పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నారని, మస్తాన్ పెద్ద కుమారుడు నిఖిల్‌కుమార్ 5వ తరగతి, భానుప్రసాద్ 3వ తరగతి వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో చదువుతున్నారు. -
కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం
అక్కంపేట (తడ) : బైక్‌పై రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని అక్కంపేట వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. ఎస్ఐ సురేష్‌బాబు సమాచారం మేరకు.. మధ్యప్రదేశ్ మురానా జిల్లా గడియా గ్రామానికి చెందిన శశికాంత్ శర్మ(40) అక్కంపేట సమీపంలో అండగుండాల మార్గంలో నిర్మిస్తున్న జైన్ మందిరం వద్ద పనికి వచ్చాడు. మందిరంపై బొమ్మలు చెక్కడంలో సిద్ధహస్తుడైన శర్మ ఏడాది క్రితం ఇక్కడే ఉంటూ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తన సహచరుడితో కలిసి బైక్‌పైS కూరగాయలు, ఇతర సామగ్రి కొనుగోలు కోసం అక్కంపేటకు వచ్చాడు. అక్కంపేట మలుపు వద్ద మధ్యలో చెన్నై వైపు వెళ్తున్న వాహనాలను చూసి ఓ మారుతి కారు నిలిచి ఉంది. అవతల వచ్చే వాహనాలను గమనించని బైక్ నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై కొంత ముందుకు వెళ్లాడు. గూడూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న స్కార్పియో కారు వేగంగా రావడం చూసి వెనుక కూర్చున్న శర్మ ఆందోళనతో కిందకు దిగి ముందుకు, వెనక్కు ఒకటి రెండు అడుగు వేసే క్రమంలో శర్మను ఢీకొంది. దీంతో శర్మ కారు బానెట్‌పై పడిపోయాడు. స్కార్పియో రోడ్డు మలుపు మధ్యలో ఆగి ఉన్న మరో కారు ముందు భాగం ఢీకొని డివైడర్ ఎక్కి కొంత దూరం వెళ్లి నిలిచింది. కారు ఢీకొనడంతో శర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు తోటి సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో..
కారును ఢీకొట్టిన మరో కారు యువకుడు దుర్మరణం ఇద్దరికి స్వల్పగాయాలు కాకుటూరు(నెల్లూరు) : ముందు వెళ్తున్న కారును ఓకారు అధిగమించే ప్రయత్నంలో ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వెంకటాచలం మండలం కాకుటూరు సమీపంలో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు వివరాలు.. సైదాపురం మండలం మొలకలపూండ్ల గ్రామానికి చెందిన పాలెపు వేమయ్య కుమారుడు రాజశేఖర్(28) సోమవారం తిరుపతిలో ఉన్న తన బంధువు మందా ప్రసాద్ (పొదలకూరు మండలం పొనగలూరు గ్రామం)ను కలిసేందుకు తన కారులో వెళ్లాడు. మంగళవారం ఉదయం ఇద్దరు నెల్లూరుకు బయలుదేరాడు. ఈ క్రమంలో కాకుటూరు దాటిన తర్వాత జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కారును రాజశేఖర్ అధికమించబోయి ఢీకొట్టాడు. దీంతో కారు పల్టీలు కొడుతూ అవతలిరోడ్డుపై పడింది. కారు అద్దాలుపగలడంతో డ్రైవింగ్ చేస్తున్న రాజశేఖర్ పైకెగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. రాజశేఖర్‌తో ఉన్న ప్రసాద్‌కు స్వల్పగాయాలయ్యాయి. వీరు ఢీకొన్న కారు ముందుభాగం దెబ్బతినగా డ్రైవర్ షేక్ మీరాజాన్బాబుకు స్వల్పగాయాలయ్యాయి. ఆమార్గంలో వస్తున్న ప్రయాణికులు వెంటనే 108కు, పోలీసులకు సమాచారం అందించారు. ఈప్రమాదం కారణంగా జాతీయ రహదారికి రెండు వైపులా ట్రాఫిక్ స్తంభించింది. వెంకటాచలం ఎస్సై వెంకటేశ్వరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ సమస్య పరిష్కరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
బైక్‌ను ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
కావలిరూరల్ : బైక్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కొన్నదిన్నె క్రాస్‌రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. కావలి రూరల్ ఎస్సై పుల్లారావు సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు పెద్దపాళెంకు చెందిన చాపల శ్రీను (28) శుక్రవారం రాత్రి రామాయపట్నంలో బంధువుల వివాహానికి వెళ్లి అక్కడి నుంచి కావలి మండలం ఒట్టూరుకు చెందిన అప్పన్నగారి సోమరాజు, వెయ్యల శ్రీనుతో కలిసి ఒట్టూరుకు బయలుదేరారు. మార్గమధ్యలో రాత్రి 10.30 గంటల సమయంలో కొనదిన్నె క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా అన్నగారిపాళెం నుంచి పెళ్లి బృందంతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న చాపల శ్రీనుకు తీవ్ర గాయాలు కాగా, సోమరాజు, శ్రీను స్వల్పగాయాలయ్యాయి. వెంటనే చాపల శ్రీనును ఆటోలో కావలికి తరలించారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఆస్పత్రికి చేరుకున్న శ్రీను భార్య సృజన బోరున విలపించింది. విషయం తెలుసుకున్న బంధువులు పెద్దఎత్తున ఏరియా వైద్యశాలకు తరలివచ్చారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. ఎస్సై పుల్లారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కూలీ పనులకు వెళ్తూ..
కానరాని లోకాలకు కారు అదుపు తప్పి భర్త మృతి ప్రాణాలతో బయటపడిన భార్యా పిల్లలు కోవూరు : విధి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఎదుగుతూ పది మందికి సహాయ పడుతుండటం చూసి సహించలేకపోయింది. ఎన్నో కష్టాలు పడి కుదురుకుంటున్న కుటుంబ యజమానిని రోడ్డు ప్రమాదం పొట్టనపెట్టుకుంది. ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ దురదృష్ట సంఘటన మండలంలోని జాతీయ రహదారిపై భారత్‌బెంజ్ షోరూం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగింది. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని సూదరగుంట రామాపురానికి చెందిన ఎద్దు ఏడుకొండలు (34) బెంగళూరులో కూలీలను తీసుకుని వెళ్లి బేల్దారి పనులు చేయించేవాడు. ఇటీవల రామాపురంలో జరిగిన ఓ వివాహానికి ఏడుకొండలు తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వచ్చాడు. శనివారం రాత్రి ఏడుకొండలు భార్య అంకమ్మ, మూడేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తెతో పాటు తండ్రి చెన్నయ్య, సమీప బంధువు చలమయ్యతో కలిసి బెంగళూరుకు బయలుదేరారు. పడుగుపాడు వద్దకు వచ్చే సరికి కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుకొండలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మిగిలిన వారికి స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై అళహరి వెంకట్రావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అందరిని బతికించేందుకు.. కారు నడుపుతున్న ఏడుకొండలు ప్రమాదంలో అందరిని బతికించేందుకు తాను ప్రాణాలను పణంగా పెట్టాడు. కారు అదుపు తప్పిన సమయంలో ఏడుకొండలు బయటకు దూకేసి ఉంటే కారు పక్కనే ఉన్న పంట కాలువలోకి బోల్తాపడేది. దీంతో పెనుప్రమాదం జరిగేది. అయితే ఏడుకొండలు అప్రమత్తమై కారు కంట్రోల్ చేస్తూ సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన ఇనుపు కంచెను ఢీకొన్నాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కారు బోల్తా పడటంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు. మమ్మల్ని బతికించి నువ్వు దూరమయ్యావా... మమ్మల్ని బతికించేందుకు నీవు దూరమయ్యావా అంటూ ఏడుకొండలు భార్య అంకమ్మ రోదిస్తూ విలపిస్తుంది. ఇద్దరు బిడ్డలను ఒడిలో పెట్టుకుని రోదిస్తున్న తీరను చూసిన స్థానికులను కలిచివేసింది. ఏడుకొండలకు భార్యతో పాటు నలుగురు కుమార్తెలు, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. -
పెళ్లి ఇంట్లో చావు బాజా
పెళ్లివారి వాహనం బోల్తా ఒకరి మృతి 14 మందికి గాయాలు గోనుపల్లిలో విషాదఛాయలు రాపూరు : పెళ్లి ఇంట్లోచావు బాజా మోగింది. మండలంలోని గోనుపల్లి అరుంధతీయవాడకు చెందిన పెళ్లి బృందం జీపులో తిరుపతికి వెళ్తుండగా గుండవోలు సమీపాన ఉన్న మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా, 14 మందికి గాయాలు పడ్డారు. ఈ గురువారం రాత్రి చోటు చేసుకుంది. గోనుపల్లికి చెందిన వడ్లపల్లి జయరామయ్య, రమణమ్మ కుమార్తె చామండేశ్వరికి తిరుపతికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో గోనుపల్లిలో గురువారం రాత్రి సుమారు 7 గంటలకు జీపులో కొందరు, లారీలో మరి కొందరు బయలుదేరారు. జీపు గుండవోలు వద్ద ఉన్న మలుపు వద్ద అదుపు తప్పడంతో జీపులో ఉన్న 15 మందిలో 14 మందికి గాయాలయ్యాయి. పెళ్లికొడుకు తరపున సారె తీసుకు వచ్చిన సూరిపాక జయరామయ్య (65) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. విషయం తెలుకున్న గుండవోలు, ఆకలివలస గ్రామస్తులు 108 సిబ్బంది హుటాహుటిన సంఘనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనం, మినీ బస్సు, లారీలో రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇక్కడ ఒక్క వైద్యుడు మాత్రమే ఉండడంతో సైదాపురం, డక్కిలికి చెందిన 108 వాహనాల్లో ప్రైవేట్ కారుర్లలో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుల్లో డ్రైవర్ పశుపులేటి శీను (తిరుపతి) పాదర్తి పెంచలమ్మ,పాదర్తి మానస (పెద్దచెరుకూరు) బోపం చిట్టేమ్మ, బోపినేని వెంకటేశ్వర్లు (తిరుమల) బోపం కృష్ణయ్య, బోపినేని చిన్నయ్య (నేతివారిపల్లి, చిట్వేలి మండలం) సత్యవేలు మాతమ్మ (చీపినాపి, కలువాయి మండలం) వడ్డిపల్లి లక్ష్మీనరసమ్మ, బుజ్జమ్మ (గోనుపల్లి), మాతంగి మాతయ్య(గూడూరు), వడ్డిపల్లి మణి (తెగచర్ల) ఉన్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
దొరవారిసత్రం: మట్టి తీసుకువస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో డ్రైవర్ మావిళ్లపాటి రాజయ్య(40) మృతి చెందిన సంఘటన తిమ్మినాయుడు కండ్రిగ గ్రామ రోడ్డు వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు... తనియాలి ఎస్సీ కాలనీకి చెందిన రాజయ్య బూదూరు గ్రామ సమీపంలో తెలుగు గంగ కాలువ వద్ద ట్రాక్టర్లో మట్టి లోడు చేసుకుని తిరిగి తనియాలి గ్రామానికి వస్తున్న సమయంలో ట్రాక్టర్ తిమ్మనాయుడుకండ్రిగ గ్రామ రోడ్డు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే పొలాల్లో పడిపోవడంతో డ్రైవర్ కూడా ట్రాక్టర్ కిందనే పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం సూళ్లూరుపేటకు తరలిస్తున్న సమయంలోనే 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రాజయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. ప్రమాదంపై పోలీసులకు ఏలాంటి సమాచారం అందలేదు. -
థాయ్‌లాండ్‌లో వరుస పేలుళ్లు.. ఒకరు మృతి
థాయ్‌లాండ్‌లోని పట్టాని రాష్ట్రంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా 30 మందికి పైగా గాయపడ్డారు. రెండు వారాల క్రితమే వరుస పేలుళ్లు దేశాన్ని కుదిపేసిన తర్వాత మళ్లీ అలాంటి ఘటనే మరోసారి జరిగింది. రాత్రి 10.40 గంటల సమయంలో ఓ పబ్‌కు సమీపంలో ఉన్న పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉంచిన కారులో బాంబులు పేలాయి. రాత్రి 11 గంటల సమయంలో మరో కారు బాంబు పేలింది. దాంతో ఓ మహిళ మరణించగా, 30 మంది గాయపడ్డారు. స్థానిక మార్కెట్ సమీపంలోని చెత్తబుట్టలో దాచి ఉంచిన మూడో బాంబు రాత్రి 11.30 సమయంలో పేలింది. అయితే ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంతకుముందు ఉత్తర థాయ్‌లాండ్‌లో జరిగిన వరుస పేలుళ్లలో నలుగురు మరణించగా, 11 మంది విదేశీ పర్యాటకులు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. -
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన థాయ్‌లాండ్
బ్యాంకాక్ : థాయ్‌లాండ్‌లోని పట్టని ప్రావిన్స్‌లో మంగళవారం అర్థరాత్రి వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మంగళవారం అర్థరాత్రి పబ్‌కు అతి సమీపంలో పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడులో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో అరగంట వ్యవధిలో మరో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా....... 30 మంది గాయపడ్డారు. స్థానిక మార్కెట్ సమీపంలో మరో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. -
వ్యాన్ ఢీకొని యువకుడి దుర్మరణం
నాయుడుపేట : మితి మీరిన వేగంతో వెళ్తున్న ఓ మినీ వ్యాన్ ఎదురుగా వస్తున్న ఆటోను, ఆ తర్వాత బైక్‌ను ఢీకొనడంతో ఒకరు దుర్మరణం చెందగా, ఆటోడ్రైవర్ గాయపడ్డాడు. ఈ సంఘటన నాయుడుపేట–మల్లాం మార్గంలో మిట్టకండ్రిగ వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగింది. మల్లాం నుంచి నాయుడుపేట వైపు వస్తున్న ఆటోను, దాని వెనుకనే వస్తున్న బైక్‌ను ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్ ఢీకొంది. ఆటోబోల్తా పడగా ఆటోడైవర్ పుదూరుకు చెందిన గోనుపల్లి కుమార్ స్వల్ప గాయాలయ్యాయి. మోటార్ బైక్‌పై వస్తున్న రామారెడ్డికండ్రిగకు చెందిన మైలారి అనిల్ (29) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన కుమార్‌ను 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనిల్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణాలు తీసిన అతి వేగం
నెల్లూరురూరల్ : వాహనచోదకుల అతివేగం ఇద్దరి ప్రాణాలు బలిగొంది. బైక్‌పై అతివేంగా వెళ్తూ కారు ఢీకొని ఓ యువకుడు, ముందు వెళ్తున్న వాహనాన్ని అదిగమించబోయి బైకిస్ట్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటనలు మండలంలోని వేర్వేర్లు చోట్ల జరిగాయి. నెల్లూరురూరల్ పోలీసుల కథనం మేరకు.. రాపూరు మండలం చిట్టుపాళెంకు చెందిన పులిబోయిన శివ(23) రాపూరు నుంచి నెల్లూరువైపు బైక్‌పై బయలుదేరాడు. ఆమంచర్ల వద్దకు వచ్చే సరికి ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఢీకొన్నాడు.. దీంతో తీవ్రంగా గాయపడిన శివను 108 వాహనంలో పెద్దాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివ మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు ఢీకొని.. 4వ మైలుకు చెందిన కాటంరెడ్డి రవీంద్రరెడ్డి (40) బైక్‌పై ఆదివారం నెల్లూరు వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో నెల్లూరు నుంచి కొత్తకాలువ మీదుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రవీంద్రరెడ్డిని ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాసుపత్రికి తరలించారు. ఈ మేరకు రెండు ప్రమాదాల కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు. -
కారు బోల్తా : ఒకరి మృతి
-
కారు బోల్తా : ఒకరి మృతి
నల్లగొండ : కృష్ణా పుష్కరాలకు వెళ్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా... మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురం సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు తిరుపతమ్మ గుడి సమీపంలో అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి... అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లారీ - ఆర్టీసీ బస్సు ఢీ: ఒకరి మృతి
కర్నూలు : కర్నూలు నగరం సమీపంలోని నన్నూరు వద్ద గురువారం లారీ - ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరి అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌ను ఢీకొట్టిన పాలవ్యాన్..ఒకరు మృతి
హైదరాబాద్ : పాలవ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి.. ఒకరి మరణానికి కారణమయ్యాడు. కుషాయిగూడలో పోచమ్మ ఆలయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. అత్తాపూర్‌కు చెందిన బలరాం (21) మరో వ్యక్తితో కలసి చక్రిపురం నుంచి ఈసీఐఎల్ వైపు తన ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. పోచమ్మ ఆలయం వద్ద అతని వాహనాన్ని మదర్ డెయిరీ పాల వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బలరాం అక్కడికక్కడే చనిపోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి...క్షతగాత్రుడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు ఢీకొని పెయింటర్ మృతి
నెల్లూరు (క్రైమ్) : రైలు ఢీకొని పెయింటర్ మృతి చెందిన సంఘటన ఎస్–2 థియేటర్ సమీప రైలు పట్టాలపై శనివారం జరిగింది. చిల్డ్రన్స్‌పార్కు సమీపంలోని గుర్రాలమడుగుకు చెందిన ఎ.మురళీకృష్ణ (30) పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంత కాలంగా ఆయన వ్యసనాలకు బానిసై సంపాదన ఖర్చు చేయసాగాడు. ఈ విషయమై దంపతుల నడుమ విభేదాలు పొడచూపాయి. పలుమార్లు భార్య మమత అతన్ని పద్ధతి మార్చుకోమని సూచించింది. అయినా ప్రవర్తనలో మార్పురాకపోవడంతో ఇటీవల ఆమె తన కుమారుడితో కలిసి వడ్డిపాళెంలోని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి మురళీకృష్ణ ఫూటుగా మద్యం సేవించి పనికి వెళ్లడం మానేశాడు. భార్యను కాపురానికి రమ్మన్నాడు. ఆమె రాకపోవడంతో మరింత మనస్థాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఎస్–2 థియేటర్ సమీపంలో చెన్నై వెళ్లే రైలు పట్టాల వద్ద రైలు ఢీకొని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి జేబులో లభ్యమైన ఓటరు గుర్తింపు కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే అతను ప్రమాదవశాత్తు మృతి చెందాడా?. ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బ్రిడ్జిని ఢీకొన్న కారు
వ్యక్తి దుర్మరణం సూళ్లూరుపేట : కారు అదుపు తప్పి బ్రిడ్జిని ఢీకొన్న ప్రమాదంలో ఇస్రో విశ్రాంత ఉద్యోగి మృతి చెందాడు. ఈ సంఘటన సూళ్లూరుపేట–శ్రీహరికోట రోడ్డులో కుదిరి–అటకానితిప్ప మధ్యలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చెన్నైలోని ఇస్రో అతిథి భవనంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన శివాజీ (64), ఝాన్సీరాణి దంపతులు శ్రీహరికోటలోని కామాక్షమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసుకునేందుకు చెన్నై నుంచి ఈ నెల 1న సూళ్లూరుపేటలోని తన స్నేహితుడు వీరాస్వామి ఇంటికి వచ్చారు. రెండు రోజులు ఇక్కడే ఉన్నారు. బుధవారం శివాజీ, ఝాన్సీరాణి, వీరాస్వామి,వాణి దంపతులు శ్రీహరికోటలోని కామాక్షమ్మకు పూజలు చేసుకుని తిరిగి కారులో వస్తుండగా అదుపుతప్పి బ్రిడ్జికి ఢీకొంది. కారు డ్రైవింగ్ చేస్తున్న శివాజీ అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న ఝాన్సీరాణి, వీరాస్వామి, వాణితో పాటు మరో గుర్తు తెలియని మహిళ తీవ్రంగా గాయపడ్డారు. కారులో వస్తుండగా పేరు తెలియని ఓ మహిళ లిప్ట్ అడగడంతో ఎక్కించుకున్నారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా షార్ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన శివాజీ మృతదేహాన్ని స్థానిక గ్లోబల్ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. మృతుడి కుమారుడు, కుమార్తె ఇద్దరు అమెరికాలో ఉండడంతో వారు వచ్చేవరకు మృతదేహాన్ని ఇక్కడే ఉంచి వారు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని ఎస్సై జీ గంగాధర్‌రావు తెలిపారు. -
ట్రాక్టర్ ట్రక్కు బోల్తా : యువకుడి మృతి
మరొకరికి గాయాలు కోట : ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడారు. ఈ సంఘటన మండలంలోని చంద్రశేఖరపురం వద్ద ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. చంద్రశేఖరపురానికి చెందిన కయ్యాల వెంకటేశ్వర్లు (18), తన స్నేహితుడైన ట్రాక్టర్ డ్రైవర్ ముమ్మడి వెంకటేశ్వర్లుతో కలిసి తోడుగా ట్రాక్టర్లో వెళ్లాడు. పనులు ముగించుకుని చిట్టేడు నుంచి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి ట్రక్ బోల్తాపడటంతో అందులో కూర్చుని ఉన్న కయ్యాల వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ముమ్మడి వెంకటేశ్వర్లును 108 సిబ్బంది చికిత్స కోసం గూడూరుకు తరలించారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి తల్లిదండ్రులు రవీంద్ర, రాధమ్మలను ఓదార్చడం ఎవరితరం కాలేదు. వెంకటేశ్వర్లు విద్యానగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో స్నేహితునికి తోడుగా వెళ్లి ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్సై అజయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ - బైక్ ఢీ ఒకరు మృతి
-
కారు ఢీకొని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి మృతి
కుదిరి (సూళ్లూరుపేట) : బైక్‌ను ఎదురుగా కారు ఢీకొనడంతో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కుదిరి–అటకానితిప్ప మధ్యలో శనివారం జరిగింది. కోవూరుకు చెందిన నలగండ్ల అశోక్ (32) శ్రీహరికోటలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. శనివారం మోటార్‌బైక్‌పై సూళ్లూరుపేటకు కూరగాయలు తీసుకుని తిరిగి వెళ్తుండగా, స్పేస్ సెంట్రల్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసే గాం«ధీ తన కారులో శ్రీహరికోట నుంచి కేఆర్పీ కాలనీకి వస్తూ అతివేగంగా ఎదురెదురుగా అశోక్ బైక్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అశోక్ పులికాట్ సరస్సులోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న గాంధీకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై జీ గంగాధర్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అశోక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టును ఢీకొన్న కారు..ఒకరి మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల క్రాసింగ్ వద్ద ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిమ్మాపూర్ మండలానికి చెందిన మహ్మద్ రిజ్వాన్ (32) అక్కడికక్కడే మృతిచెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్: ఒకరు మృతి
అవనిగడ్డ : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణాజిల్లా అవనిగడ్డలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక వెంకటేశ్వర థియేటర్ సమీపంలో.. వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న నాంచారయ్య (65) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన భార్య ఈశ్వరమ్మకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతులు విద్యుత్ కార్యాలయం ఎదుట బడ్డీ కొట్టు నిర్వహించడానికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. -
లారీని ఢీకొన్న ట్రాక్టర్: ఒకరు మృతి
ముగ్గురి పరిస్థితి విషమం ఐదుగురికి తీవ్రగాయాలు చిల్లకూరు : ఉపాధి పనుల కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ లారీని ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఐదుగురు గాయపడ్డారు. పోలీసుల సమాచారం మేరకు చేడిమాల పంచాయతీ నల్లాయగారిపాళెంకు చెందిన ఉపాధి కూలీలు గ్రామంలో కొంత మందికి ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో పనులు చేస్తున్నారు. అక్కడికి వెళ్లేందుకు కూలీలు ట్రాక్టర్లో బయలు దేరారు. చేడిమాలకు సమీపంలోకి వచ్చే సరికే మలుపు వద్ద ముందు వెళుతున్న లారీ ఆకస్మికంగా ఆగింది. దీన్ని తప్పించబోయిన ట్రాక్టర్ డ్రైవర్ ముందు ఇంజను దాటుకున్నప్పటికి ట్రక్కు లారీకి తగిలి పక్కకు ఒరిగి పోయింది. దీంతో ట్రక్కులో కూర్చొన్న 30 మంది కూలీలు ఒకరిపై ఒకరు పడి పోయారు. ఎనిమిది మందికి త్రీవగాయాలు కాగా పలువురికి స్వల్పగాయాలయ్యాయి. వీరిని ఆటోల్లో స్థానికులు గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మందా ఈశ్వరమ్మ (38) మృతి చెందింది. బాణాల చెంగయ్య, తాబాక రమణమ్మ, పారిచెర్ల కృష్ణవేణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై అంకమ్మ, ఏఎస్ఐ నాగేశ్వరరావు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం
మరొకరికి గాయాలు నెల్లూరు (క్రైమ్) : బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఇద్దరు రోడ్డుపై పడ్డారు. బస్సు చక్రాలు ఓ వ్యక్తి తలపైకి ఎక్కడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శెట్టిగుంటరోడ్డు వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఉస్మాన్‌సాహెబ్‌పేట కృష్ణమందిరం ప్రాంతానికి చెందిన వై. వెంకటనరసింహం పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన కె. రామయ్య (64) అతని వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం బోడిగాడితోటలో కర్మక్రియలు చేసేందుకు వెంకటనరసింహం, రామయ్య వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని తమ యాక్టివా బైక్‌పై ఇంటికి బయలుదేరారు. శెట్టిగుంట రోడ్డు వద్దకు వచ్చేసరికి మితిమీరిన వేగంతో ప్రొద్దుటూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెల్లూరు వస్తుండగా వారి బైక్‌ను వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఇద్దరు రోడ్డుపై పడ్డారు. రామయ్య తలపైకి బస్సు చక్రాలు ఎక్కడంతో తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడని వెంకటనరసింహంను స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం డీఎస్ఆర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి. వెంకటరావు, ఎస్ఐ కొండయ్య పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న రామయ్య కుటుంబం సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమైయింది. భర్త మృతదేహాన్ని చూసి సరోజనమ్మ గుండెలవిసేలా రోదించారు. మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ట్రాఫిక్ ఎస్ఐ కొండయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎర్రగడ్డలో రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి
హైదరాబాద్ : ఎర్రగడ్డ సమీపంలోని రహదారిపై బుధవారం రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న స్కూటర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చి... లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటర్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. వెనక కూర్చున వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
భోగాపురం : మండలంలోని ఉప్పాడపేట కూడలి వద్ద జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందా డు. వివరాల్లోకి వెళితే.. హెరిటేజ్ కంపెనీకి చెందిన టాటా మ్యాజిక్ వాహనం విశాఖపట్నం నుంచి పూసపాటిరేగ వస్తుండగా బుధవారం రాత్రి 1.30 సమయంలో ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని వెనుకనుంచి బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో టాటా మ్యాజిక్‌లో ముందుభాగంలో ఎడమవైపు కూర్చున్న విశాఖపట్నం సరబన్నపాలెంనకు చెందిన దూలి శివప్రసాద్(25) అక్కడికక్కడే మరణించాడు. డ్రైవరు వేమల నాగేశ్వరరావుకి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసకున్న హెచ్‌సీ అప్పారావు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'వర్మ సినిమాలే హత్యలకు ప్రేరేపించాయి'
నెల్లూరు: సినిమాల్లో చూపించే మంచికన్నా చెడునే ఎక్కువగా ప్రభావితం చేస్తాయనేది ఇదో ఉదాహరణ. వివరాల్లోకి వెళితే... సెట్ అప్ బాక్సుల రిపేర్, ఆధార్ అనుసంధానం పేరుతో ఇళ్లలోకి వెళ్లి మహిళలను, వృద్ధులను సుత్తితో క్రూరంగా హత్యలు చేస్తూ పోలీసులకు పట్టుబడిన కరుడుగట్టిన నేరస్తుడు కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ అలియాస్ వెంకీకి దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాలే హత్యలకు ప్రేరేపించాయని విచారణలో వెల్లడించాడు. పట్టపగలు నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కు రోడ్డులో శనివారం మహిళను హత్యచేసి, మరో ఇద్దరిపై హత్యాయత్నం చేసిన వెంకటేశ్వర్లును స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. నిందితుడు నెల్లూరు జిల్లా కొండాపూరం మండలం ఎర్రబొట్లపల్లి వాసి. గతంలో నెల్లూరులో పలు దారుణాలకు పాల్పడింది అతనేనని విచారణలో తేలింది. రాంగోపాల్ వర్మ అంటే అభిమానమని, అతడు తీసిన ప్రతి సినిమా లెక్కకు మించి చూసేవాడని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అందులోని కొన్ని ఘటనలు ఊహించుకుని నెల్లూరు జిల్లాలో నలుగురి ప్రాణాలు అతి కిరాతకంగా బలి తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. -
అట్టుడుకుతోన్న కశ్మీర్ లోయ..
-
అట్టుడుకుతోన్న కశ్మీర్ లోయ..
శ్రీనగర్: ఆందోళనకారుల రాళ్ల దాడి, పోలీసుల కాల్పులతో కశ్మీర్ లోయలో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వాని ఎన్ కౌంటర్ కు నిరసనగా లోయలోని కుల్గాం, అనంత్ నాగ్, బారాముల్లా జిల్లాల్లో జరుగుతోన్న ఆందోళనలు హింసాయుతంగా మారాయి. ఆందోళనకారులు పోలీస్, ఆర్మీ చెక్ పోస్టులపై రాళ్లు రువ్వారు. కుల్గాం లోని బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. నిరసనకారుల్ని అదుపుచేసే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు మరణించారు. రాళ్ల దాడిలో ముగ్గురు పోలీసులు సహా 11 మంది గాయపడ్డారు. (చదవండి: ఈ టెర్రరిస్టు ఒక్కరిని కూడా చంపలేదు!) అనంతనాగ్ జిల్లాలోని బందిపోరా, ఖాజిగుండ్, లర్నోలో, కుల్గాం జిల్లాలోని మీర్ బజార్, దమ్హాల్ ప్రాంతాల్లో, అనంత్ నాగ్ జిల్లాలోని వార్పోరాలో ఆందోళనకారుల ఉధృతి తీవ్రంగా ఉందని, దక్షిణ కశ్మీర్ లోని ఓ మైనారిటీల నివాస సముదాయం వద్ద పహారా కాస్తున్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారని పోలీస్ అధికారులు చెప్పారు. (చదవండి: అమర్ నాథ్ యాత్ర నిలిపివేత) బుర్హాన్ ఎన్ కౌంటర్ నిరసనల వేడి శ్రీనగర్ ను కూడా రగిలిస్తుండటంతో అధికారులు అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. అమర్ నాథ్ యాత్ర ఆసాంతం కశ్మీర్ లోయ గుండా సాగాల్సిఉండగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సీఆర్ఫీఎప్ డీజీ దుర్గా ప్రసాద్ తెలిపారు. మరోవైపు అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. -
నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం
-
నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం
నెల్లూరు: నెల్లూరులో పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.. చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని ఇంట్లోకి దుండగులు ప్రవేశించి దోపిడీకి యత్నించారు. ఈ సందర్భంగా అడ్డుకున్న ముగ్గురిపై దాడి చేసి గొంతు కోశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే స్థానికంగా నివసించే ఆడిటర్ నాగేశ్వరరావు ఇంట్లోకి దోపిడీ దొంగలు చొరబడి భారీ స్థాయిలో నగలు, నగదు దోచుకోవడమేకాక కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేశారు. శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. దొంగల దాడిలో ఆడిటర్ నాగేశ్వరరావు భార్య మృతి చెందగా, కుమారుడు, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. భారీ స్థాయిలో బంగారు నగలు, నగదు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. దొంగలు అడ్డొచ్చిన ముగ్గురి గొంతు కోశారని స్థానికుల కథనం. కేకలు విన్న ఇరుగు పొరుగువారు వెంబడించి ఒకరిని పట్టుకోగా మిగిలిన ఇద్దరు దొంగలు పారిపోయారు. దొరికిన దొంగను దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. కాగా దోపిడీ దొంగలు గత నాలుగు రోజులుగా రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. దోపిడీకి పాల్పడిన దుండగులు కోవూరు ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మంత్రాల నెపంతో దారుణ హత్య
మేడిపల్లి: ఓ వైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమాజం అభివృద్ధిపథాన దూసుకెళ్తుంటే.. మరో వైపు మంత్రాలు, చేతబడులు, బాణమతులను కొందరు ఇంకా నమ్ముతున్నారు. మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన సంఘటన కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం విలాయతాబాద్‌లో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పూదరి రాజం(50) రాళ్లు కొట్టుకుం ఉంటాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో నిద్రిస్తున్న రాజంపై అదే గ్రామానికి చెందిన బత్తుల రాజు, గంగాధర్ అనే అన్నదమ్ములు గొడ్డలితో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన రాజంను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రాజు, గంగాధర్‌ల బావ అనారోగ్యంతో మృతి చెందాడు. రాజం మంత్రాలు చేయడం ద్వారానే తమ బావ మృతి చెందాడని ఆగ్రహించిన అన్నదమ్ములు అతడిపై గొడ్డలితో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
తాతమనవళ్లపైకి దూసుకెళ్లిన లారీ
ఒంగోలు : ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద శుక్రవారం లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న తాతా,మనవడి మీదుకు లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా... తాత తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేశారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు : ఒకరి మృతి
ఒంగోలు : ప్రకాశం జిల్లా పంగులూరు మండలం రేణంగివరం వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. అలాగే మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకుని... పోస్ట్ మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులంతా ఖమ్మం జిల్లా భద్రాచలంకు చెందిన వారని పోలీసులు తెలిపారు. తిరుమల నుంచి భద్రచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. -
వివాహేతర సంబంధంతో వ్యక్తి దారుణ హత్య
ఏటూరునాగారం: వివాహేతర సంబంధం ఓ యువకుడి దారుణ హత్యకు దారి తీసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఏటూరునాగారం మండలం ఆకుల వారి గణపురానికి చెందిన కేతిరి రమేశ్(23) అనే యువకుడు కొంతకాలంగా తన వదినతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో ఆమె మామ కేతిరి సమ్మయ్య(55) రమేశ్‌ను శనివారం ఉదయం గ్రామంలోని చెరువు సమీపంలో గొడ్డలితో నరికి చంపాడు. సమ్మయ్య, మృతుడికి సొంత పెదనాన్న. రమేశ్‌ను చంపిన అనంతరం సమ్మయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సమ్మయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు. -
బొలేరోను ఢీకొన్న స్కార్పియో: ఒకరు మృతి
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా కంచిలి సమీపంలో రహదారిపై ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని స్కార్పియో వాహనం ఢీకొట్టింది. అనంతరం స్కార్పియో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. రహదారిపై ఉన్న స్కార్పియో వాహనాన్ని పక్కకు తీసి... ట్రాఫిక్‌ను పునరుద్ధించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా : బాలుడు మృతి
అనంతపురం : అనంతపురం జిల్లా కూడేరు వద్ద శుక్రవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సు - ఆటో ఢీ: ఒకరి మృతి
అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం ప్రైవేట్ బస్సు - ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని... బస్సు, ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూల్ వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి
నల్లగొండ: స్కూల్‌వ్యాన్ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అర్వపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని అడివెంల గ్రామానికి చెందిన సైదులు (30) బైక్ పై పని మీద అర్వపల్లి వచ్చి...తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్కూల్ వ్యాన్‌ను సీజ్ చేసి... డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాహనం బీభత్సం: ఒకరి మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లా మదనపల్లె బైపాస్ రోడ్డులో బుధవారం వాహనం బీభత్సం సృష్టించింది. రహదారిపై వాకింగ్ చేస్తున్న వారిపైకి టాటాఏస్ వాహనం దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత టాటాఏస్ వాహనం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు ఢీకొని యువకుడు మృతి
తణుకు : పశ్చిమగోదావరి జిల్లా తణుకు శివారులోని 16వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పలుగుపట్నం గ్రామానికి చెందిన కోలా మల్లేష్(30), ముత్యాలరావు(35) ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మల్లేష్ అక్కడికక్కడే మృతిచెందగా, ముత్యాలరావు, కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టును ఢీకొన్న కారు: ఒకరి మృతి
గుంటూరు : గుంటూరు జిల్లా ఈపూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో వినుకొండకు చెందిన అపరాల వ్యాపారి దేశు నాగేశ్వరరావు (40) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాలువలో పడిన బస్సు: ఒకరు మృతి
బీజింగ్ : చైనా హుబి ప్రావిన్స్‌లో బస్సు కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.... మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని ... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వెంజూ నగరం నుంచి మెయిన్యంగ్ నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుందని స్థానిక మీడియా వెల్లడించింది. -
చెట్టును ఢీకొన్న లారీ..ఒకరి మృతి
విజయనగరం : విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద ఓ లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బిహార్‌కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి రూర్కెలాకు లారీలో అమ్మోనియం నైట్రేట్ తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు - బైక్ ఢీ: ఒకరు మృతి
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టు రహదారిలోని కిషన్‌గూడ సమీపంలో బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో ఒకరి మృతి
జియ్యమ్మవలస: మండలంలోని బిత్రపాడు పంచాయతీ సీమనాయుడువలస గ్రామానికి చెందిన బెల్లాన వెంకటనాయుడు (38) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పశువుల మేతకు గడ్డి తీసుకురావడానికి బుధవారం సాయంత్రం పొలానికి వెళ్లి, తిరిగి వస్తుండగా విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య హేమలత, పిల్లలు లోకేష్, గాయత్రి ఉన్నారు. నాయుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియూ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై పాపారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డివైడర్‌ను ఢీకొట్టిన బైక్: ఒకరు మృతి
విశాఖపట్నం : పెద్దరిషికొండ వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రుడిని విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అలాగే మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో - లారీ ఢీ: ఒకరి మృతి
గుంటూరు : గుంటూరు జిల్లా నాదెండ్ల వద్ద జాతీయరహదారిపై మంగళవారం ఆటో - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వ్యాన్ - లారీ ఢీ: ఒకరు మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లా ఐరాల మండలం పాటూరు వద్ద మంగళవారం తెల్లవారుజామున వ్యాన్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాబూల్‌లో ఆత్మాహుతి దాడి
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఎయిర్ పోర్టు గేట్ ఎదురుగా భారీ ఎత్తున పేలుడు పదార్ధాలతో కూడిన కారుతో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేశారు. ఈ సంఘటనలో ఉగ్రవాది మృతి చెందినట్లు పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు కాబూల్ విమానాశ్రయం సమీపంలో ఆత్మాహుతి దాడి జరగటం వారంలో ఇది రెండోసారి. డిసెంబర్ 28న జరిగిన ఆత్మాహుతి దాడిలో ఉగ్రవాదితో పాటు ఓ పౌరుడు మృతి చెందగా, మరో 13మంది గాయపడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పార్క్ చేసిన కారులో మంటలు, ఒకరి మృతి
-
పార్క్ చేసిన కారులో మంటలు, ఒకరి మృతి
హైదరాబాద్ : ఇంటి ముందు పార్క్ చేసిన కారులో నుంచి మంటలు చెలరేగి ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్ మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే సురేష్ రెడ్డి గత రాత్రి తన ఇంటి ముందు కారు పార్క్ చేశారు. సురేష్ రెడ్డి ఇద్దరు కుమారులు శుక్రవారం కారులో ఉన్న పెన్‌డ్రైవ్ తీసుకునేందుకు వెళ్లారు. కారు డోర్లు తెరిచి పెన్ డ్రైవ్ తీసుకుంటుండగా, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు ముందు సీటులో ఉన్న సృజన్ కొద్దిపాటి గాయాలతో వెంటనే బయటకు రాగా, వెనక సీటులో ఉన్న శ్రేయన్ మంటల్లో చిక్కుకున్నాడు. సుమారు 80 శాతం గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన అతడు మృతి చెందాడు. మరోవైపు సృజన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా రాత్రి కారు పార్క్ చేసిన సమయంలో లైట్లు ఆఫ్ చేయకపోవడంతో, ఇవాళ ఉదయం కారు ఓపెన్ చేయగానే షార్ట్ సర్క్యూట్ సంభవించినట్లు సమాచారం. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
బస్సును ఢీకొన్న కారు: ఒకరు మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం బలిజపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూల్ వద్ద హీలియం సిలిండర్ పేలుడు
థానే: మహారాష్ట్రలో ఓ స్కూల్ వద్ద హీలియం వాయువుతో నిండిన సిలిండర్ పేలి ఒక చిన్నారి ప్రాణాలుకోల్పోయింది. 13మంది గాయాలపాలయ్యారు. గాయపడినవారిలో ఎనిమిదిమంది చిన్నారులు ఉన్నారు. థానే జిల్లాలోని కల్యాణ్ ప్రాంతంలో ఓ పాఠశాల వద్ద బెలూన్లు విక్రయించే వ్యక్తి బెలూన్లలో హీలియం గ్యాస్ నింపుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
కడప : వైఎస్ఆర్ జిల్లా రామాపురం మండలం బండపల్లె సమీపంలో గురువారం బైక్ - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగ్రాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దుర్ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
జి.మాడుగుల: విశాఖజిల్లాలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ గిరిజనుడిని హతమార్చారు. జి.మాడుగుల మండలం మడతకొండ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన మావోయిస్టులు.. ఓ గిరిజనుడిని పట్టుకుని కొట్టి చంపేశారు. మృతుని వివరాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బావిలో పడ్డ కారు : ఒకరు మృతి
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా అరకులోయ మండలం పానిరంగని వద్ద ఆదివారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న బాలిలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బావిలోని బయటకు తీసి...విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్లైఓవర్‌పై నుంచి పడిన స్కార్పియో: ఒకరు మృతి
-
ఫ్లైఓవర్‌పై నుంచి పడిన స్కార్పియో: ఒకరు మృతి
శ్రీకాకుళం : శ్రీకాకుళం కొత్తరోడ్డు ఫ్లైఓవర్ పైనుంచి వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.... క్షతగాత్రులను శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. బరంపురం నుంచి జైపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎల్లారెడ్డిలో దారుణ హత్య
ఎల్లారెడ్డి: నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలంలో గురువారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాతకక్షల నేపథ్యంలో మల్లాయిపల్లిలో పోచయ్య(55) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు. పోచయ్యకు అతని తమ్ముడు బాలయ్యతో కొన్నేళ్లుగా విభేదాలున్నాయి. హత్య జరిగిన తర్వాత బాలయ్య కనిపించకపోవటంతో ఈ హత్య అతడే చేసి ఉంటాడని పోచయ్య కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ : ఒకరి మృతి
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... 12 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇసుక లారీ బోల్తా : ఒకరు మృతి
హైదరాబాద్ : శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్‌రోడ్డుపై గురువారం ఇసుక లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని హైదరాబాద్ నగరంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అతి వేగంగా కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పుణెలో పేలుళ్లు: ఒకరి మృతి
పుణె: నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రెండు స్వల్ప తీవ్రత గల పేలుళ్లలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. నారాయణ్గావ్లో ద్విచక్రవాహనం స్టార్ట్ చేస్తుండగా పేలుడు సంభవించి దేవిదాస్ కాలే అనే వ్యక్తి మరణించాడు. ద్విచక్రవాహనం ఇంజన్ లో రసాయనిక చర్యవల్లే పేలుడు సంభవించి ఉంటుదని భావిస్తున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొండ్వానాలో జరిగిన మరో ఘటనలో ఓ పాతసామాన్ల దుకాణంలో గ్యాస్ సిలండర్ పేలి ఒక వ్యక్తి గాయపడ్డాడు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. -
రెండు ఆటోలు ఢీ : యువకుడి మృతి
కడప : ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొని ఒక యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం ముత్తుకూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ముత్తుకూరు గ్రామంలో జరుగుతున్న ఓ శుభకార్యానికి వచ్చి వెళ్తున్న ఆటో అదే కార్యక్రమానికి వస్తున్న మరో ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో.. ఆటో ముందు భాగంలో డ్రైవర్ పక్కన కూర్చున్న మహబూబ్‌పాషా (21) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టును ఢీ కొన్న వ్యాన్ : ఒకరు మృతి
అనంతపురం : అనంతపురం జిల్లా హిందూపూర్ మండలం తూముకుంట వద్ద బుధవారం పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ వ్యాను చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి అక్కడికక్కడే చెందగా... మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను హిందూపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. -
ఆగి ఉన్న లారీ ఢీ కొన్న జీపు: ఒకరి మృతి
మైదుకూరు : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని జీపు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కడప, ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇరువర్గాల మధ్య ఘర్షణ: ఒకరు మృతి
కర్నూలు : భూమికి సంబంధించి ఇరువర్గాలు ఘర్షణ పడి కత్తులతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో.. ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందవరం మండలం మాచాపురం గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింహులు, సోమన్నల మధ్య గత కొన్ని ఏళ్లుగా భూతగాదాలు జరుగుతున్నాయి. దాంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఈ వాజ్యంపై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య తరచు ఘర్షణలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో సోమన్న కొడుకు వెంకటేశ్వర్లు(25) మృతి చెందగా.. నర్సింహులు కొడుకులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సుచిత్ర వద్ద ఆర్మీ వాహనం బీభత్సం
హైదరాబాద్ : వేగంగా వెళ్తున్న ఆర్మీ వ్యాను ముందు వెళ్తున్న పల్సర్ వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం రోడ్డు దాటుతున్న మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా .. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నగరంలోని బోయినపల్లి సమీపంలోని సుచిత్రా గార్డెన్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. వివరాలు... సుచిత్ర నుంచి బోయిన్పల్లి వైపు వస్తున్న ఆర్మీ వ్యాను ముందు వెళ్తున్న పల్సర్ బైకును ఢీకొట్టింది. దీంతో దానిపై ప్రయాణిస్తున్న మహిళకు తీవ్రగాయాలు కాగా.. బైకు నడుపుతున్న పురుషుని కాలు విరిగింది. అనంతరం రోడ్డు దాటుతున్న మరో వాహనాన్ని(ప్యాషన్) ఢీ కొట్టింది. దీంతో వాహనం పైన ఉన్న అంబులెన్స్ డ్రైవర్ లక్ష్మణ్ (37) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత అటువైపు నుంచి వస్తున్న స్కూటీని ఢీకొంది. దీంతో ఆ వాహనదారునికి కూడా తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన గుడాల మోహన్(35), తన స్నేహితుడి పొలంలో విద్యుత్ మోటారు వేసేందుకు వెళ్లగా షాక్ కొట్టింది. దీంతో మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ర్యాలీపై కాల్పులు, మహిళ మృతి
కొలంబో: శ్రీలంక రాజధాని నగరం కొలంబోలో ఎన్నికల ర్యాలీపై కాల్పుల ఘటన కలకలం రేపింది. యునైటెడ్ నేషనల్ పార్టీ మద్దతుదారుల ర్యాలీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆగస్టు 17న ఆ దేశంలో పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం యూఎన్‌పీ ఎంపీ, శ్రీలంక ఆర్థికమంత్రి రవి కారుణ్యాంకేకు మద్దతుగా కార్యకర్తలు ఎన్నికల ప్రచారర్యాలీ నిర్వహించారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు సాయుధులు ప్రదర్శనపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే.. మంత్రి కొద్ది సేపటి ముందే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో.. ఆయన ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు అయింది. దీంతో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కొలంబో గెజిట్ ఈ ఘటనను రిపోర్ట్ చేసింది. -
ఆటో, మోటర్ బైక్ ఢీ: ఒకరు మృతి
విజయనగరం: విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందిగాం వద్ద ఆటో, మోటారుసైకిల్ బుధవారం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడిక్కడే మృతిచెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వెంటనే స్పందించి క్షతగాత్రులను బొబ్బిలిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. బొబ్బిలి నుంచి నందిగాం వైపు ఆటో వస్తుండగా... మోటార్ సైకిల్ తెర్లాం నుంచి నందిగాం వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతిచెందిన మహిళను తెర్లాం మండలం ఆవిటి గ్రామానికి చెందిన గుడ్ల పార్వతమ్మ(50)గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌ను ఢీకొన్న లారీ : ఒకరు మృతి
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని పుష్కరఘాట్ వద్ద బుధవారం బైక్‌ను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న బొక్కా నాగమణి (35) అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త సుబ్రహ్మణ్యం స్వలంగా గాయపడ్డారు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి అతడిని ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే నాగమణి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగమణి, ఆమె భర్త సుబ్రహ్మణ్యం రావులపాలెంలో పుష్కర స్నానం ఆచరించి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. -
లారీని ఢీకొట్టిన కారు: ఒకరు మృతి
ఒంగోలు: ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక ఉంచి వచ్చి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోని ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. టోల్‌ప్లాజా సిబ్బంది వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు. నెల్లూరుకు చెందిన వారని పోలీసులు తెలిపారు. గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఐఏఎస్ అకాడమీలో కాల్పులు
ముస్సోరి: ముస్సోరిలోని ప్రముఖ ఐఏఎస్‌ల శిక్షణ కేంద్రం 'లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఐఏఎస్ ట్రైనీస్' వద్ద ఓ జవాను కాల్పులు జరపడంతో అతడి సహచరుడు చనిపోయాడు. మరో ఇద్దరు జవాన్లు గాయాలపాలయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం అతడు పారిపోయాడు. కాల్పులు జరిపిన సైనికుడు ఇండో-టిబెట్ సరిహద్దు పోలీసు విభాగానికి చెందినవాడు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పారిపోయిన జవానుకోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. -
ఆగి ఉన్న లారీని కారు ఢీ: ఒకరు మృతి
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా నందలూరు సమీపంలో ఆల్విన్ ఫ్యాక్టరీ వద్ద ఆగి ఉన్న లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కె.శ్రీనివాస్ (46) అక్కడికక్కడే మరణించారు. కారులో ప్రయాణిస్తున్న సతీష్, వెంకటేశ్, శ్రీనివాస్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కె.శ్రీనివాస్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం కడప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూలి పనికి వెళ్లి అనంత లోకాలకు..
పెదకాపవరం (ఆకివీడు) : ఐస్ లోడుతో వెళుతున్న లారీ బోల్తా కొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయూలయ్యూరుు. లారీ క్యాబిన్లో ప్రయూణిస్తున్న చేపల ప్యాకింగ్ కార్మికుడు గోడి రమణ (40) అక్కడికక్కడే మృతిచెందగా బోనుల జార్జి (50), పితాని శ్రీను (35) అనే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. లారీ తిరగబడటంతో క్యాబిన్లో చిక్కుకుపోరుున రమణ కొద్దిసేపు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచాడు. రమణ ను కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యూరుు. ఆకివీడు మండలం పెదకాపవరంలో వెంకయ్య వయ్యేరు కాలువ వంతెన వద్ద జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గణపవరం నుంచి లారీలో ప్యాకింగ్ కూలీలను ఎక్కించుకు ని ఐస్ లోడు, చేపల ట్రేలతో డ్రైవర్ పెదకాపవరంలో ఓ చెరువు వద్దకు వెళ్లాడు. కొన్ని కారణాల వల్ల చేపల పట్టుబడి నిలిచిపోవడంతో వీరంతా అదే లారీలో తిరుగు ప్రయూణమయ్యూరు. పెదకాపవరంలో వెంకయ్య వయ్యేరు వంతెనపైకి వచ్చేసరికి లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి నిలిపివేశాడు. ఐదు నిమిషాల తర్వాత వంతెనపై నుంచి లారీ పక్కకు ఒరగడం మొదలైంది. దీనిని గమనించిన లారీపై ఉన్న కూలీలు, డ్రైవర్ కిందకు దూకేశారు. కొద్ది సేపటికి వంతెన పక్కనున్న రోడ్డుపైన లారీ తిరగబడింది. దీంతో లారీ క్యాబిన్లో చిక్కుకుపోరుున కార్మికుడు రమణ శరీరం నుజ్జునుజ్జుకాగా జార్జి కుడి కాలు, శ్రీను ఎడమ కాలుకు తీవ్రగాయూలయ్యూరుు. ఆక్రందనలు చేస్తూ కన్నుమూత లారీ బోల్తా కొట్టిన వెంటనే స్థానికులు స్పందించి చేపల ట్రేలను, ఐస్‌ను కిందకు దించారు. క్యాబిన్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. తీవ్రగాయూలైన రమణ రక్షించండంటూ ఆక్రందనలు చేస్తూ కన్నుమూశాడు. జార్జి, శ్రీనును బయటకు తీసిన స్థానికులు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఉండి మండలం వెలివర్రు గ్రామానికి చెందిన రమణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తహసిల్దార్ వి.నాగార్జునరెడ్డి, ఎస్సై కె.అశోక్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, ఏ ఎంసీ చైర్మన్లు మోటుపల్లి రామవరప్రసా ద్, కొత్తపల్లి గోపాలకృష్ణంరాజు, గ్రామ పెద్ద తోట ఏడుకొండలు, సర్పంచ్ లం బాడి మురళీ వెంకటలక్ష్మి, ఎంపీటీసీ మందలంక జాన్ వెస్లీ తదితరులు పరి శీలించి బాధితులను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాకు దిక్కెవరు నాన్నా ‘నాన్నా.. వెళ్లిపోయూవా.. ఇక మాకు దిక్కెవరు’ అంటూ మృతుని కుమార్తె శాంతి, భార్య మాణిక్యం రోదనలు మి న్నంటారుు. కొద్దిసేపు కన్నీరుమున్నీరైన శాంతి స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను చికిత్స కోసం అంబులెన్సులో తరలించారు. ఘటనా స్థలం వద్ద రమణ బంధువులు, కుటుంబ సభ్యులు రోదిం చిన తీరు కన్నీళ్లు తెప్పించింది. వెలివై లో విషాదఛాయలు అలముకున్నాయి. -
బోల్తాపడిన చేపల లారీ, ఒకరి మృతి
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకువీడు మండలం పెదకాపవరం సమీపంలో గురువారం ఉదయం ఓ చేపల లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. -
బైకును ఢీకొన్న బస్సు: ఒకరి దుర్మరణం
కీసర: ఆర్టీసీ బస్సు బైకును వేగంగా ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం మండల పరిధిలోని నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సురేష్(30), శంకర్లు లారీ డ్రైవర్లు. వీరి లారీ మరమ్మతుకు గురికావడంతో బుధవారం నాగారంలోని ఓ షెడ్‌కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భోజనం చేసేందుకు బైకుపై నాగారం గ్రామంలోకి వెళ్లి తిరిగి షెడ్డుకు వస్తున్నారు. ఈక్రమంలో నాగారం శివాలయం దగ్గర వెనుక నుంచి వేగంగా వచ్చిన కుషాయిగూడకు చెందిన ఈసీఐఎల్-గోపాలపురం రూట్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సురేష్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. శంకర్‌కు తీవ్రగాయాలవడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్న లారీ
వర్గల్ : సిలిండర్ల లోడ్‌తో వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొనగా ఒకరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన మండలంలోని గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై బుధవారం తె ల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న లారీ డ్రైవర్ మొగులుగాని సత్యం (50) ఆస్పతిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, క్లీనర్ గుగులోతు వెంకన్న (40) గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సిలిండర్ లారీ డ్రైవర్ బురాన్ నగేష్ (35) కాలు పూర్తిగా తెగిపోయింది. అదృష్టవశాత్తు సిలిండర్లు పేలడం లాంటి ఘటన చోటుచేసుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద తీవ్రతకు సిలిండర్ లారీ డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోగా దాదాపు రెండు గంటల పాటు శ్రమించి వెలికి తీశారు. గౌరారం ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి కలపను తీసుకువచ్చేందుకు బుధవారం రాత్రి ఓ లారీ హైదరాబాద్ నుంచి బయలుదేరింది. అయితే లారీలో సాంకేతిక లోపం కారణంగా గౌరారం వద్ద రోడ్డు పక్కన ఆగిపోయింది. డ్రైవర్ సత్యం, క్లీనర్ గుగులోతు వెంకన్న అందులోనే కూర్చుని ఉన్నారు. తెల్లవారుజాము 3.30 గంటల ప్రాంతంలో చర్లపల్లి నుంచి హెచ్‌పీ సిలిండర్ల లోడ్‌తో సిద్దిపేట వైపు వెళుతున్న లారీ అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో రెండు లారీలు 50 గజాలు పైగా ముందుకు దూసుకెళ్లాయి. ఆగి ఉన్న లారీ రోడ్డు కిందకు గోతిలోకి జారిపడగా, కల్వర్టు గోడ అడ్డుతగిలి సిలిండర్ల లోడుతో వెళుతున్న లారీ ఆగిపోయింది. క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కావడంతో సిలిండర్ లారీ డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోయాడు. దాదాపు రెండు గంటలపాటు నరక యాతన అనుభవించాడు. గౌరారం పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని వెలికి తీసే ప్రయత్నం విఫలమైంది. జేసీబీ సాయం తీసుకుని లారీలను విడదీసి డ్రైవర్‌ను వెలికి తీసారు. నిండు సిలిండర్లు కావడంతో పేలిపోయే ప్రమాదం శంకించి గజ్వేల్ నుంచి అగ్నిమాపక వాహనాన్ని తెప్పించారు. ప్రమాదంలో అతడి కాలు కొంత మేర పూర్తిగా తెగిపోయింది. ముందులారీ డ్రైవర్ సత్యంకు, క్లీనర్ వెంకన్నకు తీవ్రగాయాలు కాగా వారందరినీ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యం మృతి చెందాడు. మృతుడి సొంత గ్రామం వరంగల్ జిల్లా నర్సింహులు పేట మండలం బీర్శెట్టి గూడెం. మృతుడికి భార్య వెంకటమ్మ, కొడుకు రాజేష్ (19) ఉండగా ఇద్దరు కూతుళ్ల వివాహం జరిగింది. డ్యూటీకి వెళ్లిన భర్త రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన విషయం తెలిసి వెంకటమ్మ కుటుంబం పెను విషాదంలో కూరుకుపోయింది. ప్రమాదానికి కారణమైన సిలిండర్లలోడుతో వెళుతున్న లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని, మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపించి కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. -
చిత్తూరు జిల్లాలో అతిసార ప్రబలి ఒకరు మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం 24 పెద్దూరు గ్రామంలో అతిసార ప్రబలి ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలోని మంచినీటి పథకం నుంచి సరఫరా అయ్యే నీరు సోమవారం కలుషితం కావడంతో స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. దాంతో గత రాత్రి దాదాపు 15 మంది ఆసుపత్రుల్లో చేరారు. మంగళవారం మధ్యాహ్నం కనకమ్మ ( 80) పరిస్థితి విషమించి చనిపోయింది. మరో వ్యక్తి మునెస్ప (55) ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
స్నేహితుల చేతిలో యువకుడి హత్య
చిరు వివాదంతో ఘటన పహాడీషరీఫ్: స్నేహితుల నడుమ తలెత్తిన చిరు వివాదం ఒకరి హత్యకు దారి తీసింది. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల ప్రకారం... ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఫరికార్ ఖాన్(30), అతని స్నేహితులు రామాన్జన్ షా, బుద్దు, కేజూ, అనిల్, సూరజ్, రాజ్‌కుమార్‌లు తుక్కుగూడలోని హెచ్‌సీఎల్ కంపెనీలో రెండు నెలలుగా పెయింటర్లుగా పని చేస్తున్నారు. వీరంతా హెచ్‌సీఎల్‌లోనే ఓ గదిలో ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఫరికార్ తన స్నేహితుడు అనిల్‌కు ఫోన్ చేసి అన్నం వండమని చెప్పాడు. ఇంటికి చేరుకున్నాక ఫరికార్ అతని స్నేహితుల మధ్య చిరు వివాదం తలెత్తింది. తీవ్ర ఆగ్రహానికి గురైన రామానుజన్ షా, బుద్దు, కేజూలు కత్తితో ఫరికార్ వీపు, ఛాతి భాగాల్లో పొడిచారు. దీంతో ఫరికార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నెల్లూరు: ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొనడంతో ఒక బాలిక మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో జరిగింది. వివరాలు.. వేగంగా వెళ్తున్న కంటెనర్ లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వైపు తిరుపతి నుంచి నెల్లూరు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనతో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో వేరే బస్సు కోసం వేచి ఉన్న ప్రమాణికులు బస్సు ముందు రోడ్డుపై కూర్చున్నారు. ఈ క్రమంలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక లారీ ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు మందు భాగంలో కూర్చోని ఉన్న హేమజ(16) అక్కడిక క్కడే మృతి చెందింది. మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం గూడూరులోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీడీఎల్ ప్రాంగణంలో పేలుడు.. ఒకరి మృతి
హైదరాబాద్: హైదరాబాద్ కంచన్‌బాగ్‌లో ఉన్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) ప్రాంగణంలో శనివారం సంభవించిన పేలుడు ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయడ్డారు. బీడీఎల్ ప్రాంగణంలో వ్యర్థాలకు ఎం.ఎ.రజాక్ (42), వాహబ్(45), నవీన్(35), గోపాల్‌రావు(42) అనే కార్మికులు నిప్పంటించారు. దీంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. మంటలు చెలరేగడంతో సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌సింగ్‌తోపాటు ఆ నలుగురు కార్మికులు గాయపడ్డారు. అధికారులు వెంటనే వారిని డీఆర్డీవో అపోలో ఆసుపత్రికి తరలించారు. వీరిలో నవీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 11.30కి మృతి చెందాడు. చెత్తలో పేలుడు స్వభావమున్నవస్తువులు ఉన్నందునే ప్రమాదం జరిగిందని, దీనికి బీడీఎల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని వర్కర్స్ యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. క్షతగాత్రులను ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పరామర్శించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.