విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా అరకులోయ మండలం పానిరంగని వద్ద ఆదివారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న బాలిలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బావిలోని బయటకు తీసి...విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.