four injured
-
సిలిండర్ పేలి నలుగురికి గాయాలు
-
ఓల్వో బస్సు బోల్తా: నలుగురికి గాయాలు
ఇటిక్యాల : ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తాపడటంతో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం మండలంలోని కొండేరు సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ జగదీశ్వర్ కథనం ప్రకారం.. ప్రైవేట్ ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు బుధవారం తెల్లవారుజామున తిరుపతి నుంచి హైదరబాద్ వెళ్తుంది. ఈ క్రమంలో మండలంలోని కోండేరు గ్రామ స్టేజీ వద్ద డ్రైవరు నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు అదుపు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన సురేష్, ఆయన భార్య పద్మ, వారి కుమార్తె సౌమ్య, తిరుపతికి చెందిన మురళీకృష్ణలకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బస్సులో మొత్తం 38 మంది ప్రయాణికులు ఉన్నారు. సంఘటన స్థలానికి ఎస్ఐ వెళ్లి ప్రయాణికులను ఇతర వాహనాల్లో హైదరాబాద్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చెట్టును ఢీకొన్న పోలీస్ వాహనం
రాయగడ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాయగడ జిల్లాకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సివిల్ సప్లయిస్, సహకార విభాగా మంత్రి సూర్యనారాయణ పాత్రో సెక్యూరిటీ వాహనం ప్రమాదానికి గురైంది. కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా పార్వతీపు రం మీదుగా బరంపురం వెళ్లే సమయంలో మం త్రి సెక్యూరిటీ వాహనం శేశికళ పోలీస్‌స్టేషన్ పరి ధి జీమిడిపేట ప్రాంతంలో అదుపు తప్పి ఒక చెట్టును ఢీకొని ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో సెక్యూరిటీ సిబ్బంది ఏఎస్ఐ మోతీలాల్, కె.పొరిడా, బిశొయిరామకృష్ణ, ఆదిత్యచౌదరి, కేకే నాయక్‌కు గాయాలు కాగా వారికి తక్షణం జీమి డిపేట పీహెచ్సీలో వైద్యం అందించిన పిదప రాయగడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమించడంతో విశాఖపట్టణం తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
హాజీపూర్(మంచిర్యాలరూరల్) : హాజీపూర్ మండలం దొనబండ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రికి చెందిన ఓ యువకుడు మృతిచెందగా మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. హాజీపూర్ ఎస్సై ముత్తన్న తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి రాజీవ్‌నగర్‌కు చెందిన శెట్పల్లి నిఖిల్‌సాయి, రాజ్‌కుమార్, సాయిపవన్, వెంకటరమణ, సిద్దులు కారులో మందమర్రి నుంచి లక్సెట్టిపేట వైపు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శెట్పల్లి నిఖిల్‌సాయి(19) తలకు తీవ్ర గాయాలయ్యాయి. రాజ్‌కుమార్, సాయిపవన్, వెంకటరమనణ, సిద్ధులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హాజీపూర్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో నిఖిల్‌సాయి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మిగతా నలుగురు యువకులు పట్టణలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతన్నారు. కాగా మృతుడు నిఖిల్‌సాయికి తండ్రి రాజేశం, తల్లి విజయ ఉన్నారు. తండ్రి క్యాబ్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నిఖిల్‌సాయి బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రెండు లారీల మధ్య నలిగిన కారు
ఇచ్ఛాపురం : పట్టణానికి సమీపంలో పురుషోత్తపురం చెక్‌పోస్టు సమీపంలో గెడ్డ వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు చెప్పిన వివరాలు ప్రకారం... ఒడిశా నుంచి ఇచ్ఛాపురం వైపు వస్తున్న కారు ఎదురుగా ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ సమయంలో వెనుక వైపుగా వస్తున్న మరో లారీ కారును ఢీకొట్టింది. దీంతో రెండు లారీల మధ్య కారు నలిగిపోయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో బరంపురం మెడికల్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పట్టణ ఎస్ఐ బి.మంగరాజు తెలిపారు. -
పెళ్లి బృందం డీసీఎం బోల్తా
మరికొన్ని గంటల్లో ‘నిఖా’ (వివాహ వేడుక).. ఎంతో సంతోషంగా బంధుమిత్రులు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరారు. ఎంతో సందడిగా వెళ్తున్న ఆ పెళ్లి బృందం క్షణాల్లోనే క్షతగాత్రులుగా మారారు. అనుకోని విధంగా జరిగిన ప్రమాదంతో అప్పటి వరకు పెళ్లి వేడుకల సంబురంలో ఉన్న వారంతా ఆహాకారాలు.. రోదనలతో మృత్యు భయంతో వణికిపోయారు. మహబూబాబాద్ రూరల్: ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి బోల్తా కొట్టిన పెళ్లిబృందం డీసీఎంను అటుగా వెళ్తున్న మరో గూడ్స్‌వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా, నలుగురికి తీవ్రంగా, మరో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భవానీనగర్ తండా సమీపంలో సోమవారం జరిగిన ఘటన వివరాలు బాధితులు, స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... మహబూబాబాద్ మండలంలోని ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఎండీ. హుస్సేన్‌షరీఫ్–నూర్జహాన్ కుమారుడు ఆరీఫ్‌షరీఫ్ వివాహం నెల్లికుదురు మండంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన అక్బర్–రజీయా కుమార్తె రిజ్వానాతో జరిపేందుకు నిశ్చయించారు. ఈ పెళ్లి బృందం మొత్తం ఒక డీసీఎం వాహనంలో జిల్లా కేంద్రంలోని భవానీనగర్ తండా మీదుగా మధ్యాహ్నం సమయంలో వెళ్తోంది. అదే సమయంలో కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామ శివారు పెద్దతండాకు చెందిన కొర్ర వీరన్న తన ద్విచక్ర వాహనంపై ఏ క్యాబిన్ రైల్వేగేట్ నుంచి ఎదురుగా వేగంగా వచ్చాడు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన బైక్‌ను డీసీఎం వాహన డ్రైవర్ తప్పించే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా అదుపుతప్పి పక్కన ఉన్న కంకర కుప్ప పైకి వెళ్లి పల్టీకొట్టింది. అదే సమయంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లికి చెందిన చాక్‌పీస్‌ల వ్యాపారి కూర పాటి బాబురావు, డ్రైవర్ గోసిక రాఘవేంద్ర గూడ్స్‌వ్యాన్‌లో అటువైపుగా వస్తున్నారు. ఒక్కసారిగా ముందు పడిన పెళ్లిబృందం డీసీఎంను వారు బలంగా ఢీకొట్టారు. క్షతగాత్రులు వీరే.. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు ఆరీఫ్ షరీఫ్ తండ్రి హుస్సేన్‌షరీఫ్ తలకు, గూడ్స్‌వ్యాన్ డ్రైవర్ గోసిక రాఘవేంద్ర తలకు తీవ్ర గాయాలయ్యాయి. డీసీఎంలో ఉన్న ఎస్కే.సమీర్, ఎండీ.అజీమ్‌కు చేతులు విరిగాయి. పసునూరి కరుణాకర్, ఉమేష్, పెండ్లి కొడుకు అన్న ఆసీఫ్, సాయి, శ్రావణ్, ఇమామ్ పాషా, యాకుబ్ పాషాకు స్వల్ప గాయలయ్యాయి. వీరిని వెంటనే చికిత్స నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక డీసీఎం డ్రైవర్ తప్పించిన ద్విచక్రవాహనదారుడు కొర్ర వీరన్న వ్యాన్ వెనుకవైపు ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి చెందాడు. హాహాకారాలు..రోదనలు... పెళ్లి బృందం డీసీఎం వ్యాన్ బోల్తా పడిన ఘటన స్థలంలో ఆహాకారాలు.. రోదనలు మిన్నంటాయి. ప్రమాదం జరుగగానే రోడ్డు అడ్డంగా వాహనం పడిపోవడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. పెళ్లి బృందం వారికి ప్రమాదం జరిగిందని వార్త తెలియగానే ఘటన స్థలానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గూడ్స్‌వ్యాన్ డ్రైవర్ రాఘవేంద్ర అందులోనే ఇరుక్కుపోగా పోలీసులు, స్థానికులు అతడిని అతి కష్టం మీద బయటకి లాగి ఆస్పత్రికి తరలించారు. డీసీఎం వ్యాన్ ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. సమయ స్ఫూర్తితో డ్రైవర్ అందులో నుంచి బయటకు వచ్చాడు. టౌన్ ఎస్సై అరుణ్‌కుమార్, ట్రాఫిక్ ఎస్సై సిరిసిల్ల అశోక్, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను తీయించి ట్రాఫిక్ క్లియర్ చేయించారు. మండల మైనార్టీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫక్రూద్దీన్, సర్పంచ్ షఫీయుద్దీన్, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని మురళీ క్షతగాత్రులను పరామర్శించారు. -
రోడ్డుప్రమాదంలో నలుగురికి గాయాలు
ఇల్లెందురూరల్: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో వాటిలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు... ఇల్లెందులోని మయూరి హోటల్ వ్యాపారి లక్ష్మి, ఆమె భర్త రవీందర్ కలిసి కారులో కొత్తగూడెం నుంచి తిరిగొస్తున్నారు. ఇల్లెందు మండలంలోని బొజ్జాయిగూడెం గ్రామంలోని సమ్మక్క–సారక్క గద్దెల వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొంది. లక్ష్మి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న కారులోని మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రం గాయపడిన లక్ష్మిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. -
ఓవర్ టేక్ చేయబోయి అదుపు తప్పిన కారు ఒకరి మృతి
సిద్దిపేటటౌన్: ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం సిద్దిపేట శివారు ఇమాంబాద్ వద్ద జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం షాద్‌నగర్‌కు చెందిన రాళ్లబండి వెంకటరామరాజు కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిఖనిలో ఉండే బంధువుల ఇంట్లో పెళ్లికి ఆదివారం వెళ్లారు. పెళ్లి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకోవడానికి వెళ్లారు. దర్శనం చేసుకున్న అనంతరం షాద్‌నగర్‌కు తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో సిద్దిపేట పట్టణ శివారు ఇమాంబాద్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయిన కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో వెంకటరామరాజు భార్య కనకదుర్గ సీట్ బెల్ట్ ధరించకపోవడంతో ప్రమాద స్థలంలోనే మృతి చెందింది. రామరాజు, అతడి కొడుకు కృష్ణమోహన్, కోడలు మధుమిత, మనమరాలు తన్విశ్రీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
బంజారాహిల్స్ లో రౌడీషీటర్ల వీరంగం, ఒకరి మృతి
సాక్షి,హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ పెన్షన్ ఆఫీస్ సమీపంలో బుధవారం రౌడీషీటర్లు వీరంగం సృష్టించారు. అయిదుగురి వ్యక్తులపై రౌడీ షీటర్లు కత్తులతో దాడి చేశారు. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లి బృందం వీరంగం
బుక్కరాయసముద్రం : మండల కేంద్రంలోని ఓ హోటల్లో పెళ్లి బృందం సభ్యులు వీరంగం సృష్టించారు. నలుగురికి తీవ్ర గాయాలనాయి. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా ముద్దనూరు మండలం పెద్ద దుద్యాల గ్రామానికి చెందిన పెళ్లి కూతురు కవితను మరుట్ల గ్రామానికి చెందిన హరీష్కిచ్చి పెన్నహోబిళంలో శనివారం వివాహం జరిపించారు. పెళ్లి ముగించుకుని పెళ్లి కుమార్తె బంధువులు తమ స్వగ్రామానికి బయలు దేరారు. బీకేఎస్ మండల కేంద్రంలోకి రాగానే మినీ ఐచర్ వాహనం ఆపి అందులో కొందరు వ్యక్తులు బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో మద్యం సేవించారు. అనంతరం బిల్లు విషయమై హోటల్ యజమాని రంగ నాయకులతో గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అంతటితో ఆగకుండా రోడ్డు పక్కనే ఉన్న రాళ్లను రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో బీకేఎస్కు చెందిన హోటల్ నిర్వాహకుడు రంగనాయకులు, అతని అక్క లక్ష్మిదేవి, కడప జిల్లా పెద్ద దుద్యాలకు చెందిన మల్లేష్ నాయుడు, వాసు గాయపడ్డారు. ఇరు వర్గాల వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అదుపు తప్పి ఆటో బోల్తా
కదిరి టౌన్ : ఓ ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం కదిరికి కిలోమీటర్ దూరంలో గురువారం జరిగింది. పోలీసులు, క్షతగాత్రుల కథనం ప్రకారం... కదిరి రూరల్ మండలం కె.బత్తలపల్లి నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ఆటో మార్గమధ్యంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో కె.బత్తలపల్లికి చెందిన వెంకటరమణప్ప, ఆదిలక్ష్మీ, పుల్లయ్య, నడింపల్లికి చెందిన పుల్లయ్య తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారందరినీ కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో వెంకటరమణప్ప పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం అతన్ని అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతోనే.. గట్ల నుంచి కదిరి వైపు పల్లం రోడ్డు కావడంతో ఆటో డ్రైవరు డీజిల్ ఆదా కోసం కక్కుర్తిపడి న్యూట్రల్ చేశాడు. కొంత దూరం రాగానే సడన్ బ్రేక్ వేయడంతో వేగాన్ని నియంత్రించలేకపోవడంతో ఆటో అదుపు తప్పి నడి రోడ్డుపై బోల్తా పడిందని బాధితులు తెలిపారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. -
ఓల్వోబస్సు -లారీ ఢీ
గుత్తి రూరల్ (గుంతకల్లు) : మండలంలోని బాచుపల్లి గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు, లారీ ఢీ కొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు హైదరాబాదు నుంచి బెంగళూరు వైపునకు వెళుతోంది. అలాగే బాచుపల్లి గ్రామ శివారులో లారీ గుత్తి క్రాస్ వద్ద తిప్పడంతో వెనుక వేగంగా వస్తున్న ఓల్వో బస్సు అదుపు తప్పి ఎదురుగా ఉన్న లారీని ఢీ కొంది. ఈ ప్రమాదంలో మెదక్‌కు చెందిన కాశీరాం, నెల్లూరుకు చెందిన శరత్ చంద్ర, హైదరాబాదు కాచిగూడకు చెందిన స్వప్న, హేమ గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్సల కోసం అనంతపురానికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఓమిని వాహనం బోల్తా.. నలుగురికి గాయాలు
మడకశిర రూరల్ : కర్ణాటకలోని పావగడ తాలుకాలోని రాజవంతి గ్రామ సమీపంలో బుధవారం ఓమిని వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మడకశిర మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసుబాబు, తల్లి రత్నమ్మ, కోడళ్లు అనితమ్మ, విద్య తీవ్రంగా గాయపడ్డారు. నాగలమడకలో జరుగుతున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను పావగడలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని కొలంబియా ఆస్పత్రికి తరలించారు. -
తిరుమలలో సుమో బోల్తా : తీవ్ర గాయాలు
-
తిరుమలలో సుమో బోల్తా : తీవ్ర గాయాలు
తిరుమల : తిరుమలలో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. పాపవినాశనం రోడ్డులో టాటా సుమో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కర్ణాటకలోని హుబ్లీ గ్రామానికి చెందిన వ్యక్తులకు తీవ్రగాయాలయ్యయి. గాయపడిన వారిని అశ్విని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాలనీలో కూలిన హెలికాప్టర్
-
కాలనీలో కూలిన హెలికాప్టర్
న్యూఢిల్లీ: ముంబయిలో హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. ఓ కాలనీపై రాబిన్ సన్ ఆర్ 44 హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయాలపాలయ్యారు. నగరంలోని గోరేగావ్ లోని ఆరే కాలనీపై చాపర్ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో పైలెట్ తోపాటు ఐదుగురు ప్రయాణీకులు ఉన్నారు. చాపర్ కూలిన వెంటనే మంటలు అంటుకున్నాయి. ఘటనా స్థలి వద్దకు రెండు అగ్ని మాపక వాహనాలు వెళ్లి మంటలు ఆర్పుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
డ్రైవర్ నిర్లక్ష్యానికి ప్రయాణికుడు బలి
ఏలూరు : డ్రైవర్ నిర్లక్షానికి ఓ ప్రయాణికుడు నిండు ప్రాణం బలైంది. సోమవారం ఉదయం ఏలూరు మండలం మల్కాపురం ఆటోనగర్ వద్ద ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీను ఆర్టీసి బస్సు ఢీ కొనడంతో ప్రమాదంలో పాలకొల్లు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన జెడ్డు రత్తయ్య(55) మృతి చెందాడు. కండక్టర్‌తో పాటు మరో నలుగురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. గన్నవరం డిపోకు చెందిన ఏపీ 16 జెడ్ 0063 నెంబర్ గల బస్సు గోపాలపురంకు చెందిన 8 మంది తీర్ధ యాత్రికులు ఉన్న ప్రయాణికులతో ద్వారకాతిరుమల వెళుతోంది. ఉదయం 10 గంటలకు ఆశ్రం ఆసుపత్రి వద్ద ఏలూరు రోడ్డుపై నిలిచి ఉన్న ఏపీ16, 6955 నెంబర్ లారీని బస్సు డ్రైవర్ డీ కొట్టాడు. దీంతో బస్సులో కండక్టర్ వైపు కూర్చున్న ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో యాత్ర బందంలోని సభ్యుడైన రత్తయ్య మతి చెందగా ఆయన తమ్ముడు ముత్తయ్య(45)కు చేయి విరిగిపోయింది. మరొక యాత్రికుడు తోట సూరిబాబుకు గాయాలయ్యాయి. మనవుడు పుట్టినరోజు వేడుక కోసం భీమడోలులో అల్లుడు ఇంటికి వెళుతున్న హనుమాన్ నగర్‌కు చెందిన టి జయలక్ష్మీ, గోపాలపురంకు చెందిన లేడీ కండక్టర్ ఎస్ నాగలక్ష్మీతో పాటు మరో ప్రయాణికుడు యాండ్రపు దుర్గారావు గాయపడ్డారు. వీరికి ఆశ్రం ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఏలూరు ఆర్టీసీ డిపో సీటీఎం ఎస్ మురళీకష్ణ సంఘటన వద్దకు చేరి పరిస్దితి సమీక్షించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పలువురు ప్రయాణికులు చెప్పారు. -
లారీని ఢీకొట్టిన కారు: నలుగురికి తీవ్రగాయాలు
తిప్పర్తి(నల్లగొండ): టోల్‌ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టిన సంఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. నల్లగొండ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న కారు మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే అక్కడే ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. గాయాలపాలైన చిన్నారి పరస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మద్యం మత్తులో క్యాబ్ డ్రైవర్ వీరంగం
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ క్యాబ్ డ్రైవర్ వీరంగం సృష్టించాడు. అర్థరాత్రి మద్యం అతిగా తాగి వేగంగా కారు నడుపుతూ రోడ్డు పక్కన వెళ్తున్న నలుగురిని ఢీకొట్టాడు. ఆగకుండా వెళ్లిపోతుండగా స్థానికులు అడ్డుకుని అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు అప్పగించారు. ఈ ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి గాయత్రీనగర్ కాలనీ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రక్తం చిందిన రాత్రి
►స్థల వివాదంలో ఘర్షణ ►ఇనుపరాడ్లు, సిమెంటు దిమ్మెలతో దాడి ►నలుగురికి తీవ్ర గాయాలు ►ఒకరి పరిస్థితి విషమం నాగోలు: హైదరాబాద్ నడి బొడ్డున స్థల సరిహద్దు విషయంలో ఏర్పడిన వివాదంలో ఓ వర్గం వారు ప్లాట్ల యజమానులపై ఒక్కసారిగా ఇనుపరాడ్లు, రాళ్ళతో దాడి చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే... ఎల్బీనగర్ సీఐ కాశిరెడ్డి, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నాగోలు స్నేహపురికాలనీకి చెందిన అనంతుల వీరారెడ్డి 1998–99లో జైపురికాలనీ, మల్లికార్జునహిల్స్లో సర్వే నెం–87/1లో వెంచర్ చేసి ప్లాట్లను విక్రయించాడు. దీని పక్కనే ఉన్న నాగోలు గ్రామానికి చెందిన ఝెగ్గే భిక్షపతి, ఝెగ్గే రాములు, దానయ్యలకు సర్వే నెం–77లో కొంత స్థలం ఉంది. వీరి మధ్య కొన్నేళ్లుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. దీంతో వీరారెడ్డి ఏడీ సర్వే రిపోర్ట్ తెప్పించుకోగా తనకు అనుకూలంగా రావడంతో వారం రోజుల నుంచి సదరు స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. కాగా ఈ స్థలాన్ని ఝెగ్గే భిక్షపతి కుటుంబ సభ్యులు కొర్రెములకు చెందిన బైర రాములుగౌడ్, లక్ష్మణ్‌గౌడ్‌కు విక్రయించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి రాములుగౌడ్, లక్ష్మణ్‌గౌడ్, ఝెగ్గే భిక్షపతి కుటుంబ సభ్యులు 20 మంది రెండు వాహనాల్లో ప్లాట్ల వద్దకు వచ్చి కాపలా ఉన్న కిరణ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, యాదయ్య, సుధాకర్, మధుగౌడ్లపై ఇనుపరాడ్లు, సిమెంటు ఇటుక పెళ్లలతో దాడి చేశారు. అనంతరం అక్కడే ఉన్న మంటల్లో రవిందర్‌రెడ్డిని వేశారు. ప్లాట్ల యజమానులకు చెందిన రెండు కార్లను ధ్వంసం చేశారు. స్థానికులు ఒక్కసారిగా బయటకు రావడంతో వారు పారిపోయారు. బాధితులను అంబులె ఆసుపత్రికి తరలించారు. రవిందర్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు రాములుగౌడ్, లక్ష్మణ్‌గౌడ్, ఝెగ్గే భిక్షపతి, దానయ్య, శివశంకర్, జంగయ్య, మహేష్, సురేష్, కొత్త నవీన్, ఝెగ్గే శంకర్లను అరెస్ట్ చేసి హత్యాయత్నం, దొమ్మి, అక్రమంగా స్థలంలోకి ప్రవేశించడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. రాములుగౌడ్పై ఘట్కేసర్, ఉప్పల్ పోలీస్స్టేషన్ల పరిధిలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. హత్య చేయడానికే కుట్ర: అనంతుల వీరారెడ్డి.... భిక్షపతికి చెందిన స్థలాన్ని అమ్ముకుని కావాలనే నా స్థలంలోకి వచ్చి దాడులు చేస్తున్నారని గతంలో కూడా నయీం అనుచరులతో బెదిరించారని లే అవుట్ యజమాని అయిన అనంతుల వీరారెడ్డి పేర్కొన్నారు. సంతోష్‌నగర్ వినయ్నగర్కాలనీలో కొల ఆనంద్‌రెడ్డి ఇంటికి తీసుకెళ్లి పిస్టల్‌తో బెదిరించారని రెండు రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన ముఠాతో తనను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చినట్లు తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని, ఎల్బీనగర్ ఎమ్మెల్యే కృష్ణయ్య అండతోనే భిక్షపతి వర్గీలు దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. -
బస్సును ఢీకొన్న లారీ: నలుగురికి గాయాలు
గుంటూరు : పిడుగురాళ్ల శివారులో ఆర్టీసీ బస్సును బుధవారం తెల్లవారుజామున లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు మీరే రాసుకోవాలంటూ బస్సు ప్రయాణికులపై హల్చల్ చేశారు. బస్సుతోపాటు ప్రయాణికులకు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దాదాపు నాలుగు గంటల పాటు ప్రయాణికులు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. పోలీసుల తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. -
అమ్మోనియం గ్యాస్ లీకై నలుగురికి అస్వస్థత
ఒంగోలు: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం మున్నంగి సీఫుడ్స్‌లో బుధవారం తెల్లవారుజామున అమ్మోనియం గ్యాస్ లీకు అయింది. ఈ నేపథ్యంలో నలుగురు సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో సహచర సిబ్బంది వెంటనే అప్రమత్తమై... వారిని ఒంగోలు నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. -
రోడ్డు ప్రమాదం: నలుగురికి గాయాలు
నల్గొండ : నల్గొండ జిల్లా కోదాడ మేళ్లచెరువు రోడ్డులో శుక్రవారం ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం... కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా : నలుగురికి తీవ్రగాయాలు
హిందూపురం అర్బన్ / గోరంట్ల : గోరంట్ల మండలం మల్లాపల్లి వద్ద మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా పడిన సంఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడి హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ఏపీ02 టీడీ 0667 నంబరు హిందూపురం డిపో ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి హిందూపురం వస్తోంది. ఈక్రమంలో మల్లాపల్లి సమీపంలో జెడ్ టర్నింగ్ రైట్ సైడ్ తిప్పుతుండగా ఎదురుగా మరో వాహనం రావడంతో డ్రైవర్ అశ్వర్థ బస్సును అదుపు చేసే లోపు బోల్తా పడింది. ప్రమాదంలో కర్ణాటక ఆదినారాయణకొండ సోమిరెడ్డిపల్లికి చెందిన లక్ష్మినారాయణ, మల్లాపల్లికి చెందిన లక్ష్మిదేవి, నరసింహులు, తిరుపతికి చెందిన రామ్మూర్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్ వారం రోజుల నుంచి 600 కి లోమీటర్లు రోజూ ఇదే రూట్లో డ్యూటీ చేశారు. వన్మన్ సర్వీస్ కావడంతో తీవ్ర ఒత్తిడికి కూడా గురైనట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున వెంటనే డిపో మేనేజర్ గోపినాథ్, యూనియన్ నాయకులు సంఘటన ప్రదేశానికి వెళ్లి పర్యవేక్షించారు. -
ఆగిన బస్సును ఢీకొన్న మినీలారీ
నలుగురికి గాయాలు చిల్లకూరు : ఆగి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న ఆర్టీసీ బస్సును ఓ మినీ లారీ వేగంగా వచ్చి వెనుక వైపు ఢీకొనడంతో లారీలోని ఓ వ్యక్తితో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. పోలీసుల సమాచారం మేరకు గూడూరు డిపోకి చెందిన బస్సు ముత్తుకూరుకు వెళ్తుంది. నాంచారమ్మపేట వద్ద బస్‌స్టాప్‌లో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు నిలవగా అదే సమయంలో బెస్తపాళెంలోని రొయ్యల గుంతల వద్దకు ఐస్ తీసుకెళ్తుతున్న మినీలారీ వేగంగా వచ్చి బస్సును వెనుక వైపు ఢీకొంది. ఈ ప్రమాదంలో కృష్ణాపురం గిరిజన కాలనీకి చెందిన విద్యార్థులు శ్రావణి, వినీత, అనూష ముందుకు పడి గాపడ్డారు. లారీలో ఉన్న పోలయ్య గాయపడ్డాడు. క్షతగాత్రులను 108 సిబ్బంది గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
కుప్పకూలిన భవనం : నలుగురికి గాయాలు
-
కుప్పకూలిన భవనం : నలుగురికి గాయాలు
హైదరాబాద్: మాదాపూర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక కాకతీయ హిల్స్‌లో నిర్మాణంలో ఉన్న నూతన భవనం పిల్లర్ ఒక్కసారిగా కుప్పకూలింది. అదే సమయంలో అక్కడ పని చేస్తున్న నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కల కారణాలతో పాటు క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. -
రెండు ఆటోలు ఢీ, ముగ్గురు దుర్మరణం
-
రెండు ఆటోలు ఢీ, ముగ్గురు దుర్మరణం
గుంటూరు : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందివెలుగులో రెండు ఆటోలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా దుర్ఘటనా స్థలం రక్తసిక్తంగా మారింది. కాగా బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. -
కారు బోల్తా : మహిళ మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి వద్ద శనివారం కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కుటుంబం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కారులో బయలుదేరింది. బేలుపల్లి క్రాస్ రోడ్డు వద్ద కారు అదుపు తప్పి.. పక్కనే ఉన్న గోతిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ప్రియ (35) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, కుమారవేలు (35), లక్ష్మీకుమారి (65), శివమణి (49), విసు (35) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ప్రియ మృతదేహాన్ని బైరెడ్డిపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సచివాలయం నిర్మాణ పనుల్లో ప్రమాదం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల్లో మరోసారి ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భవనం పిట్టగోడ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన నలుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో గాయపడిన కార్మికులు రాంగోపాల్, ధర్మేంద్ర, జయరామ్, కిషోర్ చౌదరిలను ఎన్నారై ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే సచివాలయం నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదాల్లో ఒకరు మృతిచెందారు. తాజా ప్రమాదంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సచివాలయ నిర్మాణంలో జరుగుతున్న వరుస ప్రమాదాలపై సీపీఎం నాయకుడు బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని...వారికి తక్షణమే నష్టపరిహారమివ్వాలన్నారు. కార్మికులకు రక్షణ చర్యలు తీసుకోవాలని బాబురావు ప్రభుత్వాన్ని కోరారు. -
కారును ఢీకొన్న లారీ: నలుగురికి గాయాలు
చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమూరు వద్ద కారును లారీ ఆదివారం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్నోవా కారు బోల్తా : నలుగురికి గాయాలు
హైదరాబాద్ : నగరంలోని రాజేంద్రనగర్ పరిధిలో దుర్గానగర్ చౌరస్తా వద్ద శుక్రవారం ఇన్నోవా కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ప్రమాదంపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. రహదారిపై నుంచి కారును పక్కకు తొలగించి.. ట్రాఫిక్‌ను పునరుద్దురించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు బోల్తా... నలుగురికి గాయాలు
ఆలేరు: నల్లగొండ జిల్లా ఆలేరు మండలం పెద్దవాగు వంతెనపై ఓ కారు అదుపుతప్పి కింద పడిపోయింది. సోమవారం ఉదయం ఐదుగురు వ్యక్తులు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నలుగురికి గాయాలు కాగా వారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికు తరలించి వైద్యం అందిస్తున్నారు. -
కారును ఢీకొన్న లారీ: ఇద్దరు మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునారు. మృతులు కర్ణాటకకు చెందిన కనకపుర వాసులని పోలీసులు చెప్పారు. -
మాదాపూర్‌లో కారు బీభత్సం
హైదరాబాద్ : మాదాపూర్‌లో ఆదివారం కారు బీభత్సం సృష్టించింది. రహదారి పక్కనే ఉన్న గుడిసెల్లోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... డ్రైవర్‌ను పట్టుకున్నారు. అలాగే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వీధికుక్కల దాడిలో విద్యార్థినులకు గాయాలు
హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో నలుగురు విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరినగర్కాలనీలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలనీకి చెందిన విద్యార్థినులు పాఠశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో వీధికుక్కలు దాడి చేశాయి. దీంతో వారికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు కుక్కల ను తరిమికొట్టి విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు. -
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ: ఇద్దరు మృతి
మెదక్ : మెదక్ జిల్లా చేగుంట వద్ద ఆదివారం తెల్లవారుజామున రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు ఆదిలాబాద్‌కు చెందిన పాండరి, మహారాష్ట్రకు చెందిన ఉద్ధవ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా..నలుగురికి తీవ్రగాయాలు
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో బుధవారం జరిగిన ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చోడవరం మండలం వెంకన్నపాలెం జంక్షన్ వద్ద చెరుకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులతో పాటు చిన్నారులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను చోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
బస్సు - లారీ ఢీ : నలుగురికి గాయాలు
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా నక్కపల్లి టోల్గేట్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఆ రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోడిపందాల్లో ఘర్షణ : నలుగురికి గాయాలు
-
రెండు కార్లు ఢీ : నలుగురికి గాయాలు
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ వద్ద శనివారం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోడిపందాల్లో ఘర్షణ : నలుగురికి గాయాలు
విజయవాడ : కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం కృష్ణవరంలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. కోడిపందాల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో నలుగురు యువకులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సగ్గూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే నలుగురు యువకులు తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో వారిని నూజివీడు తరలించారు. ఈ ఘర్షణపై సమాచారం అందుకున్న ఆగిరిపల్లి పోలీసులు కృష్ణవరం చేరుకున్నారు. ఘర్షణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా పోలీసులు కృష్ణవరంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
రోడ్డుప్రమాదంలో నలుగురికి గాయాలు
మంగపేట: వరంగల్ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. మంగపేట గంపోనిగూడెం సమీపంలో ఓ కారు గోతిలో పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వెంకట్‌రెడ్డి, అతని భార్య నాగేశ్వరి, కుమారులు భార్గవ్, సాయి కిరణ్‌లు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లా అశ్వాపురం వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మణుగూరు వైపు నుంచి వస్తున్న ఇసుక లారీని తప్పించే క్రమంలో కారు ముందున్న గోతిలో పడింది. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన నాగేశ్వరిని 108 వాహనంలో ఏటూరు నాగారం ఆస్పత్రికి తరలించారు. -
బావిలో పడ్డ కారు : ఒకరు మృతి
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా అరకులోయ మండలం పానిరంగని వద్ద ఆదివారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న బాలిలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బావిలోని బయటకు తీసి...విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టును ఢీకొట్టిన కారు..నలుగురికి గాయాలు
బనగానపల్లె: కర్నూలు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బనగానపల్లి మండలం గులాంనబిపేట గ్రామం వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలులో ఓ శుభకార్యానికి హాజరైందుకు కడపకు చెందిన నలుగురు స్నేహితులు కారులో బయలుదేరారు. కారు గులాంనబిపేట గ్రామ శివారుకు వచ్చేసరికి రోడ్డుపై దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉండటంతో.. అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇసాక్, విజయ్‌కుమార్, ప్రసన్నకుమార్, విక్కీలకు తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
పిచ్చి కుక్క దాడిలో నలుగురికి గాయాలు
రాజమండ్రి: గోదావరి జిల్లాల్లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం పంచాయతీ కార్యాలయం సమీపంలో శుక్రవారం ఉదయం ఓ పిచ్చికుక్క స్థానికులపై దాడికి దిగింది. దీంతో నలుగురు గాయపడ్డారు. వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కల స్వైరవిహారంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు. -
ఆటో, బైక్ ఢీ: నలుగురికి తీవ్ర గాయాలు
లేపాక్షి: అనంతపురం జిల్లా లేపాక్షి మండల కేంద్రం శివారులో బుధవారం సాయంత్రం ఆటో, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆటోలో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా వారిలో నలుగురు గాయపడ్డారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం లేపాక్షి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రెండు ఆటోలు ఢీ: నలుగురికి తీవ్రగాయాలు
అశ్వారావుపేట (ఖమ్మం): ఖమ్మం జిల్లా అశ్వారావుపేట సమీపంలో బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలోజరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోల్లో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అశ్వారావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
లారీ, టెంపో ఢీ : నలుగురికి తీవ్ర గాయాలు
చిత్తూరు : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం దండువారిపల్లె వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న టెంపో, చెన్నై నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కంటెయినర్ లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలకు చెందిన డ్రైవర్లు, క్లీనర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెన్నైలో ఘోర రోడ్డుప్రమాదం; ఏడుగురి మృతి
చెన్నై: తిరుచ్చి సమీపంలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మంత్రి కాన్వాయ్ ఢీకొని నలుగురికి తీవ్ర గాయాలు
కొవ్వూరు: మోటార్ బైక్ పై వెళుతోన్న ఓ కుటుంబానికి మంత్రి గారి వాహనం ప్రమాదం రూపంలో ఎదురై తీవ్ర గాయాలను మిగిల్చింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం అరికిరేవుల సమీపంలో బైక్ పై వెళుతోన్న ఓ కుటుంబాన్ని మంత్రి పరిటాల సునీత కాన్వాయ్ లోని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తోన్న ఎ. రాజు, అతని భార్య సంతోషి, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇద్దరి పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
టెంపో - జీపు ఢీ: నలుగురికి గాయాలు
రాజంపేట (వైఎస్సార్ జిల్లా): వేగంగా వెళ్తున్న టెంపో వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న జీపును ఢీ కొట్టింది. ఈ సంఘటన శుక్రవారం వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం జైపాస్ రోడ్డులో జరిగింది. వివరాలు.. మద్యం సేవించి డ్రైవర్ టెంపో నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్ రెండు కాళ్లు విరిగిపోయాయి. అంతేకాకుండా జీపులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరిని రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి చూపులకు వెళ్లి వస్తుండగా...
ఒంగోలు : ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు వద్ద జాతీయ రహదారిపై గురువారం ఆగి ఉన్న లారీని జీపు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పెళ్లి చూపుల కోసం కడప నుంచి కాకినాడ వెళ్లి... తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కారు బోల్తా: నలుగురికి గాయాలు
ఓర్వకల్లు (కర్నూలు జిల్లా): వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. వివరాలు.. నంద్యాల నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వైద్యం కోసం ఓర్వకల్లు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
గుడిసెల్లోకి దూసుకెళ్లిన కారు: నలుగురికి గాయాలు
విజయవాడ: విజయవాడలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. నగరంలోని బీఆర్టీఎస్ రహదారి పక్కనే ఉన్న గుడిసెల్లోకి అధిక వేగంతో వెళ్తున్న కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గుడిసెలోని నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. కారులోని వ్యక్తికి దేహశుద్ధి చేసి... పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 32వ మలుపు వద్ద అతివేగంగా వెళ్తున్న ఓ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. తిరుమలలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారంతా తమిళనాడు రాష్ట్రంలోని వేలూరుకు చెందిన వారని పోలీసులు తెలిపారు. శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలసీఉలు వెల్లడించారు. -
కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
-
కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
కృష్ణా: గేర్ రాడ్డు విరిగి పోవడంతో అదుపుతప్పిన స్కూల్ బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామం సమీపంలో జరిగింది. వివరాలు.. 'కేర్ అండ్ షేర్' స్కూల్ బస్సు విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదవశాత్తు గేర్ రాడ్డు విరిగిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. కాలువలో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలు, మరో ఆరుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (గన్నవరం) -
శివకాశిలో అగ్ని ప్రమాదం
నిత్యం అగ్ని ప్రమాదాలతో వార్తల్లో నిలిచే శివకాశిలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. తాయిల్ పట్టిలోని ఓ అగ్గిపుల్లల ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. కారణాలు మాత్రం తెలియరాలేదని పేర్కొన్నారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి ఘటనకు కారణాలను శోధిస్తున్నామని చెప్పారు. -
స్కూల్లో కాల్పులు: ఒకరు మృతి
రియోడీజనీరో: స్కూల్లో ఆగంతకుడు విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బ్రెజిల్‌లోని బెలో హరిజోటీ మెట్రోపాలిటిన్ ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది. కాల్పులు జరిగిన వెంటనే ఆగంతకుడు అక్కడి నుంచి పరారైయ్యాడు. స్థానికులు స్కూల్ సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో అసిస్టెంట్ ప్రిన్సిపల్ కూడా ఉన్నారని చెప్పారు. ఆగంతకుడు ప్రవేశ ద్వారం నుంచి స్కూల్లోకి ప్రవేశిస్తున్న వ్యక్తినే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనకు డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉండే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల ఘటనతో స్కూల్ విద్యార్థులు, సిబ్బంది కారిడార్ నుంచి తరగతి గదుల్లోకి భయంతో పరుగులు తీశారు. -
ఆటో బోల్తా..నలుగురికి గాయాలు
మహబూబ్ నగర్: అడ్డాకుల మండలం వేముల గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆటో వేముల వైపు వెళ్తుండగా మధ్యలో ఒక కాలువ రావటంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో ప్రమాదం సంభవించిందని ఆటో డ్రైవర్ తెలిపారు. -
టవేరా-ఇన్నోవా ఢీ,ఏడుగురు మృతి
-
గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి తీవ్రగాయాలు
మహబూబ్‌నగర్: గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు తీవ్రగాయాలపాలైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం కుర్వపల్లిలో చోటుచేసుకుంది. కొత్త గ్యాస్ కొన్న నాశయ్య అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ వెలిగించేందుకు యత్నించగా ఈ ఘటన చోటుచేసుకుంది. సిలిండర్‌ను సరిగ్గా పెట్టకపోవడం వల్లే గ్యాస్ లీకై ఈ ప్రమాదానికి దారి తీసినట్టు తెలుస్తోంది. గ్యాస్ వెలిగించగానే ఒక్కసారిగా మంటలు అలమకున్నాయి. ఇంట్లో రెండు క్వింటాళ్ల పత్తి ఉంది. మంటలు పత్తికి అంటుకోవడంతో త్వరగా వ్యాపించినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
గరుడ బస్సు బోల్తా,పలువురికి గాయాలు
-
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం ముంగిలిపట్టు సమీపంలోని పూతలపట్టు వద్ద ఇన్నోవో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు వెంటనే గాయపడిన వారిని దగ్గర్లోని....ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని సమాచారం. తీవ్రంగా గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
PM నవాజ్ది ఒకమాట,పాక్ ఆర్మీది మరో బాట
-
గోడ కూలి ఇద్దరు మృతి
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం గోడ కూలింది. ఆ ఘటనలో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోడ కూలిన ఘటనలో నాలుగు ద్విచక్రవాహనాలు, ఐదు ఆటోలు పూర్తిగా ధ్వంసమైనాయి. -
రెండు కార్లు ఢీ: ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద శుక్రవారం అగి ఉన్న కారును మరో కారు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హైదరాబాద్ నగరంలోని ఆసుపత్రికి తరలించారు. మరణించిన మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు రాజేంద్రనగర్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
25 లక్షలు పరిహారం చెల్లించాలి: ఎమ్మెల్యే బలాలా
హైదరాబాద్ : మెట్రో రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని మలక్‌పేట మజ్లిస్ ఎమ్మెల్యే బలాలా గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ పరిహారాన్ని ఎల్అండ్టీ కంపెనీ చెల్లించాలని, ఈ ఘటనపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా మలక్‌పేట వద్ద జరుగుతున్న మెట్రో రైలు పనుల్లో గురువారం తెల్లవారుజామున సిమెంటు లారీ బోల్తాపడి ఇద్దరు కార్మికులు మరణించిన విషయం తెలిసిందే. మరో నలుగురు కార్మికులు గాయపడ్డారు. పిల్లర్ల కోసం తీసిన గుంతల్లో ప్రమాదవశాత్తు సిమెంట్ లారీ బోల్తాపడగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
మెట్రో పనుల్లో ప్రమాదం.. ఇద్దరి మృతి
-
మెట్రో పనుల్లో ప్రమాదం.. ఇద్దరి మృతి
హైదరాబాద్ మలక్‌పేట వద్ద జరుగుతున్న మెట్రో రైలు పనుల్లో గురువారం తెల్లవారుజామున ప్రమాదం సంభవించింది. సిమెంటు లారీ బోల్తాపడి ఇద్దరు మరణించారు. అన్సారీ, బాబూలాల్ అనే ఇద్దరు కార్మికులు మరణించినట్లు గుర్తించారు. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పిల్లర్ల కోసం తీసిన గుంతల్లో ప్రమాదవశాత్తు సిమెంట్ లారీ బోల్తాపడగా, ఇద్దరు కూలీలు మృతి చెందారు. హైదరాబాద్ మలక్‌పేట్ ఫ్లై ఓవర్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కూలీలు సిమెంట్ పిల్లర్లు వేస్తుండగా, దూసుకొచ్చిన లారీ కూలీలను ఢీకొంటూ గుంతలో పడిపోయింది. దీంతో కూలీలు లారీ కింద ఇరుక్కుపోయారు. కూలీలను బయటకు తీసేందుకు ఆలస్యం కావడంతో వారిద్దరూ మృతిచెందారు. అదృష్టవశాత్తు మరో ఎనిమిదిమంది కూలీలు అదే సమయానికి మంచినీళంలె తాగేందుకు బయటకు వచ్చారు. ఈ ప్రమాదంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దిల్సుఖ్నగర్ నుంచి కోఠి వరకూ వాహనాలు ఎక్కడికక్కడే గంటలపాటు స్తంభించిపోయాయి. కాంక్రీటు మిక్సర్ పూర్తిగా తిరగబడిపోయింది. పదిమంది వరకు లోపల ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. నాలుగు గంటలుగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. అయినా కాంక్రీటు మిక్సర్‌ను తొలగించేందుకు మరికొంత సమయం పట్టేలా ఉంది. కార్మికులు కింద పనిచేస్తున్నప్పుడు వారి భద్రతకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలా చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. గతంలో కూడా మలక్‌పేట వద్ద సుమారు నెల రోజుల క్రితం ఒక వాహనం ఇలాగే గుంతలో పడింది. అయితే ఇంతవరకు మెట్రో అధికారులు ఎవరూ దీనిపై స్పందించలేదు. మరోవైపు హయత్‌నగర్ ప్రాంతంలోని పెద్ద అంబర్‌పేట వద్ద ఇదే సమయంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం లారీ బోల్తాపడి ఇద్దరు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.