ఒంగోలు : ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు వద్ద జాతీయ రహదారిపై గురువారం ఆగి ఉన్న లారీని జీపు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
పెళ్లి చూపుల కోసం కడప నుంచి కాకినాడ వెళ్లి... తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.