రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద శుక్రవారం అగి ఉన్న కారును మరో కారు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హైదరాబాద్ నగరంలోని ఆసుపత్రికి తరలించారు. మరణించిన మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు రాజేంద్రనగర్కు చెందిన వారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.