
లారీని ఢీకొట్టిన కారు: నలుగురికి తీవ్రగాయాలు
తిప్పర్తి(నల్లగొండ): టోల్‌ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టిన సంఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
నల్లగొండ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న కారు మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే అక్కడే ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. గాయాలపాలైన చిన్నారి పరస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.