
చెట్టుకు ఢీకొన్న కారు
రాయగడ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాయగడ జిల్లాకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సివిల్ సప్లయిస్, సహకార విభాగా మంత్రి సూర్యనారాయణ పాత్రో సెక్యూరిటీ వాహనం ప్రమాదానికి గురైంది. కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా పార్వతీపు రం మీదుగా బరంపురం వెళ్లే సమయంలో మం త్రి సెక్యూరిటీ వాహనం శేశికళ పోలీస్‌స్టేషన్ పరి ధి జీమిడిపేట ప్రాంతంలో అదుపు తప్పి ఒక చెట్టును ఢీకొని ప్రమాదానికి గురైంది.
ప్రమాదంలో సెక్యూరిటీ సిబ్బంది ఏఎస్‌ఐ మోతీలాల్, కె.పొరిడా, బిశొయిరామకృష్ణ, ఆదిత్యచౌదరి, కేకే నాయక్‌కు గాయాలు కాగా వారికి తక్షణం జీమి డిపేట పీహెచ్‌సీలో వైద్యం అందించిన పిదప రాయగడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమించడంతో విశాఖపట్టణం తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment