Orissa
-
తాను కన్నుమూస్తూ... మరో ఐదుగురికి ప్రాణదానం
ఆరిలోవ (విశాఖ జిల్లా): అతను మరణిస్తున్నా.. మరో ఐదుగురికి ప్రాణదానం చేశాడు. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి జిల్లాకు చెందిన నరేష్ పట్నాయక్ (32) రెండు రోజుల క్రితం కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే బంధువులు పర్లాకిమిడిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.పరీక్షలు చేసిన వైద్యులు... నరేష్ పట్నాయక్ బ్రెయిన్లో తీవ్ర రక్తస్రావమైందని, మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తీసుకువెళ్లాలని సూచించారు. ఈ మేరకు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, ఇక్కడ వైద్యులు రెండు రోజులు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించారు.జీవన్‌దాన్ ప్రతినిధులు నరేష్ కుటుంబ సభ్యులను సంప్రదించి అవయవదానంపై అవగాహన కల్పించారు.బాధను దిగమింగుకుని నరేష్ కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. ఆస్పత్రిలో వైద్యులు శుక్రవారం నరేష్ దేహం నుంచి ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, లివర్ తొలగించారు. వాటిని జీవన్‌దాన్ ప్రొటోకాల్ ప్రకారం ఐదుగురికి కేటాయించారు. గ్రీన్ చానెల్ ద్వారా వాటిని అవసరమైనవారికి వెంటనే తరలించినట్లు జీవన్‌దాన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
Jagannath Rath Yatra 2024: పూరీలో వైభవంగా రథయాత్ర
భువనేశ్వర్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీలోని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. సాయంత్రం లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం దిశగా భారీ రథాలు ముందుకు సాగాయి. 5.20 గంటలకు రథాలు కదిలాయి. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రథాలకు పూజలు చేశారు. ఆమె, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, సీఎం మోహన్ చరణ్ మాఝి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జగన్నాథ రథం తాళ్లను లాగి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ముందున్న బలభద్రుని ప్రతిష్టించిన 45 అడుగుల ఎత్తైన రథాన్ని దేవీ సుభద్ర, జగన్నాథుని రథాలు అనుసరించాయి. రథయాత్రకు ముందు భక్తుల బృందాలు జగన్నాథుని కీర్తనలను ఆలపిస్తూ ముందుకు సాగారు. రెండు రోజులపాటు సాగే యాత్ర కోసం భారీగా బందోబస్తు చేపట్టారు.సాయంత్రం వేళ బలభద్రుని రథం లాగుతున్న చోట ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఊపిరాడక తొమ్మిది మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా ఒడిశాలోని బాలాంగిర్ జిల్లాకు చెందిన లలిత్ బాగార్తి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. భక్తుని మృతి పట్ల సీఎం చరన్ మాఝీ సంతాపం వ్యక్తంచేశారు. అయితే 300 మందిదాకా గాయపడినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. -
Lok Sabha Election 2024: బీజేడీకి సవాల్!
ఒడిశాలో ఇప్పటిదాకా 9 లోక్‌సభ సీట్లకు, వాటి పరిధిలోని 63 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఆరో విడతలో 6 లోక్‌సభ సీట్లకు శనివారం పోలింగ్ జరగనుంది. అధికార బిజూ జనతాదళ్, బీజేపీ హోరాహోరీగా తలపడుతుండగా కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో కీలక నియోజకవర్గాలపై ఫోకస్... సంభాల్పూర్... తొలిసారి కాషాయ జెండా 2019లో ఇక్కడ తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ నేత నరేశ్ గంగదేవ్ కేవలం 9,162 ఓట్ల తేడాతో బీజేడీ అభ్యర్థి నళినీకాంత ప్రధాన్‌ను ఓడించారు. ఈసారి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి నాగేంద్ర ప్రధాన్, బీజేడీ నుంచి ప్రణబ్ ప్రకాశ్ దాస్ పోటీలో ఉన్నారు. త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది.కటక్... బీజేడీ కంచుకోటస్వాతంత్య్ర యోధుడు సుభాష్ చంద్ర బోస్ జన్మస్థలమిది, హొయలొలికించే మహానదీ తీరాన 900 ఏళ్లు కళింగ రాజధానిగా వెలిగింది. బీజేడీ దిగ్గజం భర్తృహరి మహతాబ్ 1998 నుంచి వరుసగా ఆరుసార్లు గెలిచారు. ఇటీవలే బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్‌పై బరిలోకి దిగారు. బీజేడీ నుంచి సంతృప్త్ మిశ్రా, కాంగ్రెస్ నుంచి సురేశ్ మహాపాత్ర రేసులో ఉన్నారు. కంచుకోటను కాపాడుకునేందుకు సీఎం నవీన్ పట్నాయక్ గట్టిగా ప్రయతి్నస్తున్నారు. కాంగ్రెస్‌కూ మంచి ఓటు బ్యాంకు ఉండటంతో త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది.పూరి.. నువ్వా నేనా! సుందరమైన బీచ్‌లు, జగన్నాథుడి సన్నిధితో కళకళలాడే పూరిలో బీజేడీకి 2019లో బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర చుక్కలు చూపించారు. చివరిదాకా గట్టి పోటీ ఇచ్చి కేవలం 11,714 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి మళ్లీ సవాలు విసురుతున్నారు. ఇక బీజేడీ సిట్టింగ్ ఎంపీ పినాకీ మిశ్రాకు బదులు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అరూప్ పట్నాయక్‌ను బరిలోకి దించింది. కాంగ్రెస్ నుంచి జయనారాయణ్ పటా్నయక్ పోటీలో ఉన్నారు. ఆ పారీ్టకి ఇక్కడ బలమైన ఓటు బ్యాంకుంది.భువనేశ్వర్... నవీన్‌కు సవాల్ ఈ టెంపుల్ సిటీలో గత ఎన్నికల్లో తొలిసారి బీజేపీ గెలిచింది. బీజేడీ అభ్యరి్థ, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అరూప్ పటా్నయక్ను బీజేపీ తరఫున మాజీ ఐఏఎస్ అపరాజితా సారంగి ఓడించారు. ఈసారీ ఆమే బరిలో ఉన్నారు. బీజేడీ నుంచి మన్మథ రౌత్రే, కాంగ్రెస్ నుంచి యాసిర్ నవాజ్ పోటీలో ఉన్నారు. దాంతో త్రిముఖ పోటీ రసవత్తరంగా మారింది. ఇండియా కూటమి భాగస్వామి సీపీఎం కూడా పోటీలో ఉండటం కొసమెరుపు!కియోంజర్.. పోటాపోటీ ఈ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం 2009 నుంచీ బీజేడీ గుప్పెట్లోనే ఉంది. 2019లో బీజేడీ నుంచి గెలిచిన చంద్రానీ ముర్ము యంగెస్ట్ ఎంపీగా రికార్డు సృష్టించారు. ఈసారి ధనుర్జయ సిద్దుకు బీజేడీ టికెటిచ్చింది. బీజేపీ నుంచి అనంత నాయక్, కాంగ్రెస్ నుంచి బినోద్ బిహారీ నాయక్ రేసులో ఉన్నారు. కియోంజర్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 బీజేడీ చేతిలోనే ఉండటం ఆ పారీ్టకి కలిసొచ్చే అంశం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Soma Mondal: క్వీన్ ఆఫ్ స్టీల్
పెద్ద బాధ్యతను స్వీకరించినప్పుడు గర్వించదగిన క్షణాలు మాత్రమే ఉండవు. పెద్ద పెద్ద సవాళ్లు కాచుకొని కూర్చుంటాయి. భయపెడతాయి. ఆ సవాళ్లకు భయపడితే అపజయం మాత్రమే మిగులుతుంది. వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉంటే విజయం సొంతం అవుతుంది. ఇంజినీరింగ్ చదివే రోజుల నుంచి ఉక్కు పరిశ్రమలోకి అడుగు పెట్టే వరకు, ఉద్యోగ ప్రస్థానంలో రకరకాల సవాళ్లను ఎదుర్కొంది సోమా మండల్. వాటిని అధిగమించి అపురూపమైన విజయాలను సొంతం చేసుకుంది. తాజాగా... ఫోర్బ్స్ ‘వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్– 2023’ జాబితాలో చోటు సంపాదించింది. భువనేశ్వర్‌లోని ఓ బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది సోమా మండల్. తండ్రి అగ్రికల్చర్ ఎకానమిస్ట్. అప్పట్లో చాలామంది తల్లిదండ్రుల ధోరణి ‘ఆడపిల్లలను ఒక స్థాయి వరకు చదివిస్తే చాలు. పెద్ద చదువు అక్కర్లేదు’ అన్నట్లుగా ఉండేది. సోమా తండ్రిలో మాత్రం అలాంటి భావన లేదు. ‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను’ అనేవాడు. అలాంటి వ్యక్తి కాస్తా సోమా ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పుడు ‘కుదరదు’ అని గట్టిగా చెప్పాడు. ఎందుకంటే ఆరోజుల్లో అమ్మాయిలు ఇంజినీరింగ్ చదవడం అరుదు. తల్లి సహాయంతో నాన్న మనసు మారేలా చేసింది. రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసింది. ఇక కాలేజీ రోజుల విషయానికి వస్తే బ్యాచ్‌లో రెండు వందల మంది ఉంటే ఇద్దరు మాత్రమే అమ్మాయిలు. పాఠం వింటున్నప్పుడు ఏదైనా సందేహం అడగాలంటే అబ్బాయిలు నవ్వుతారేమోనని భయపడేది. అయితే ఒకానొక సమయంలో మాత్రం... ‘అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే చదువు చదువుతున్నప్పుడు భయపడటం ఎందుకు?’ అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది... ఇక అప్పటి నుంచి ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. ఆ ధైర్యమే తన భవిష్యత్ విజయాలకు పునాదిగా నిలిచింది. సోమా మెటల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు మహిళా ఉద్యోగులు ఎక్కువగా లేరు. ‘మెటల్ ఇండస్ట్రీ అంటే పురుషుల ప్రపంచం’ అన్నట్లుగా ఉండేది. ఇక మహిళలు ఉన్నత స్థానాల్లోకి రావడం అనేది ఊహకు కూడా అందని విషయం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ భవిష్యత్‌పై ఆశను కోల్పోలేదు సోమా మండల్. నాల్కో(నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్)లోకి గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ తొలి మహిళా డైరెక్టర్(కమర్షియల్) స్థాయికి చేరింది. 2017లో సెయిల్(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా)లోకి వచ్చిన తరువాత ఫస్ట్ ఉమెన్ ఫంక్షనల్ డైరెక్టర్, ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ సెయిల్‌గా ప్రత్యేక గుర్తింపు పొందింది. సెయిల్ చైర్‌పర్సన్‌గా బా«ధ్యతలు స్వీకరించిన కాలంలో ఆ సంస్థ వేల కోట్ల అప్పులతో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌లో మార్పులు తీసుకువచ్చింది. మైక్రో–మేనేజ్మెంట్పై దృష్టి సారించింది. సెయిల్ ప్రాడక్ట్స్‌ను ప్రమోట్ చేయడానికి మార్గాలు అన్వేషించింది. గ్రామీణ ప్రాంతాలలో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. కొత్త వ్యాపార వ్యూహాలను అనుసరించింది. సోమా కృషి వృథా పోలేదు. అప్పులు తగ్గించుకుంటూ ‘సెయిల్’ను లాభాల దిశగా నడిపించింది. ‘నా కెరీర్లో జెండర్ అనేది ఎప్పుడూ అవరోధం కాలేదు. మహిళ అయినందుకు గర్వపడుతున్నాను. మన దేశంలో వివిధ రంగాలలో మహిళా నాయకుల సంఖ్య పెరుగుతోంది. లీడర్‌కు అసంతృప్తి ఉండకూడదు. ఆశాభావం ఉండాలి. పరిమిత వనరులు ఉన్నా సరే మంచి ఫలితం సాధించే సామర్థ్యం ఉండాలి’ అంటుంది సోమా మండల్. టైమ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇచ్చే సోమా మండల్ అటు వృత్తి జీవితాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లింది. ‘సక్సెస్‌కు షార్ట్‌కట్ అనేది లేదు. అంకితభావం, సమర్థత మాత్రమే మనల్ని విజయానికి దగ్గర చేçస్తాయి’ అంటుంది సోమా మండల్. -
Paital Gagan: బట్టల తాత వచ్చాడోచ్
ఒరిస్సాలో ఏదో ఒక ఉదయం ఏదో ఒక మారుమూల పల్లెలో వ్యాన్ ఆగుతుంది. దానిని చూసిన వెంటనే పిల్లల కళ్లల్లో వెలుగు. కటిక దారిద్య్రం వల్ల చలికాలమైనా వానాకాలమైనా ఒంటి నిండా బట్టలు లేని వారికి గగన్ బట్టలు పంచుతాడు. రిటైర్డ్ ఉద్యోగి అయిన పెయిటల్ గగన్ తన భార్యతో కలిసి ఊరూరా తిరిగి బట్టలు సేకరించి పంచుతాడు. పిల్లల పసినవ్వును ఆశీర్వాదంగా పొందుతాడు. సంఘటనలు అందరికీ ఎదురవుతుంటాయి. కొందరు స్పందిస్తారు. కొందరు స్పందించరు. కొందరు ఆ సంఘటనలతో తమ లక్ష్యాన్ని, కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. అలాంటి వారు ఆదర్శంగా నిలుస్తారు. పదేళ్ల క్రితం– భువనేశ్వర్‌లో చిన్న పోస్టల్ ఉద్యోగైన గగన్ పెయిటల్ ఇంటికి వెళుతున్నాడు. అతనికి వాణి విహార్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక దిక్కులేని మహిళ కనిపించింది. ఆమె చిరిగిన చీర కట్టుకుని ఉంది. గగన్ ఆమెను చూసి జాలిపడి హోటల్ నుంచి ఫుడ్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు. కాని ఆమె ‘అన్నం వద్దు. ముందు ఒక చీర ఇవ్వండి’ అని ప్రాధేయపడింది. స్త్రీగా ఆమె అవస్థ గమనించిన గగన్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లి పాత చీర తెచ్చి ఇచ్చాడు. ‘దానిని అందుకుంటూ ఆమె ముఖంలో కనిపించిన సంతోషం అంతా ఇంతా కాదు. ఒంటికి తగిన బట్ట ఉంటేనే మనిషికి మర్యాద. అది లేని వారు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. వారి కోసం ఏదైనా చేయాలి అని నిశ్చయించుకున్నాను’ అంటాడు గగన్. ఉద్యోగంలో ఉండగా మొదలుపెట్టిన ఈ పనిని రిటైరయ్యాక కూడా కొనసాగిస్తున్నాడు. చిన్న ఉద్యోగి అయినా పోస్టాఫీసులో చిరుద్యోగిగా పని చేసి రిటైరైన గగన్ భువనేశ్వర్‌లో చకైసియాని ప్రాంతంలో నివసిస్తాడు. కొడుకు మృత్యుంజయ బలిగూడ అనే ఊళ్లో క్యాబ్ డ్రైవర్. కోడలు టీచర్‌గా పని చేస్తున్నది. ఇతర బాదరబందీలు లేని గగన్ తన భార్య అన్నపూర్ణకు తన ఆలోచన చెప్పాడు. ‘మనం అందరికీ కొత్త బట్టలు ఇవ్వలేం. అలాగని అన్నేసి పాత బట్టలూ ఉండవు. కాబట్టి సేకరించి పంచుదాం’ అన్నాడు. అన్నపూర్ణ అతనికి సహరించడానికి అంగీకరించింది. ఆ రోజు నుంచి గగన్ తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా భువనేశ్వర్‌లోని అపార్ట్మెంట్లకూ హౌసింగ్ కాలనీలకు తిరిగి వాడిన దుస్తులను సేకరిస్తాడు. అవసరమైతే కటక్ వంటి ఇతర పట్టణాలకు కూడా వెళతాడు. ‘పేదలకు పంచుతాం. మీరు ఉపయోగించక పడేసిన దుస్తులు ఇవ్వండి’ అంటే చాలామంది ఇస్తారు. వాటిని తీసుకొస్తాడు గగన్. సరి చేసి, ఇస్త్రీ చేసి ‘మనం బట్టలు పంచినా అవి సరిగ్గా ఉండాలి. మావారు తెచ్చిన బట్టలు ఏవైనా చిరిగి ఉంటే కుట్టి, ఇస్త్రీ చేసి, స్త్రీలవి, పురుషులవి, పిల్లలవి విడివిడిగా ప్యాక్ చేసి కొత్తవిగా కనిపించేలా చేస్తాను’ అంటుంది గగన్ భార్య అన్నపూర్ణ. వాళ్లుండేది చిన్న ఇల్లే అయినా ఒక గది ఖాళీ చేసి పూర్తిగా గోడౌన్‌గా వదిలారు. భార్యాభర్తలిద్దరూ డాబా మీదకు చేరి వాటిని విభజించి మూటలుగా కడతారు. ఆ తర్వాత గగన్ తీసుకెళ్లి పంచుతాడు. బట్టలు, బూట్లు, దోమతెరలు గగన్ ముఖ్యంగా చిన్నపిల్లల కోసం బట్టలు సేకరిస్తాడు. ఒడిసాలో గిరిజన పిల్లలకు సరైన బట్టలు ఉండవు. కొండ ప్రాంతాలకు వెళ్లి వారి బాగోగులు ఎవరూ చూడరు. గగన్ అలాంటి పిల్లల కోసం బట్టలు సేకరించి పంచుతాడు. గగన్ సేవా భావం గమనించిన దాతలు అతనికో వ్యాన్ ఏర్పాటు చేశారు. గగన్‌కు ఏనుగంత బలం వచ్చింది. తాను సేకరించిన బట్టలను వ్యాన్‌లో వేసుకుని మారుమూల పల్లెలకు వెళ్లి పిల్లలకు పంచుతాడు. దోమలు కుట్టి పసికందులు రోగాల బారిన పడకుండా దోమతెరలు పంచుతాడు. బొమ్మలు ఇస్తాడు. పిల్లలు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరిస్తారు. బట్టల తాత అని పిలుస్తారు. పండుగల ముందు ఒడిసాలో చేసుకునే పండగల ముందు చాలా శ్రమించి బట్టలు సేకరిస్తాడు గగన్. పేదలు పండగ సమయంలో వీలైనంత మంచి బట్టలు వేసుకోవాలని ఆ సమయాలలో ప్రత్యేకంగా తీసుకెళ్లి పంచుతాడు. అంతేకాదు పూరి జగన్నాథ రథ యాత్ర సమయంలోనూ, కటక్ దుర్గా పూజకూ ఎక్కడెక్కడి పేదవారో వస్తారు. అక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ పెట్టి మరీ పాత బట్టలు పంచుతాడు. ఈ దేశంలో ప్రతి పేదవాళ్లకి ఒంటినిండా బట్ట దొరికే దాకా గగన్ లాంటి వాళ్లు వందలుగా పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారుగా ఎవరైనా ఉండొచ్చు. ప్రయత్నించాలి... కొద్దిగా మనసు పెట్టాలి అంతే. -
వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
భువనేశ్వర్: రూర్కెలా–పూరి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మెరామండలి, బుద్ధపంక్ రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లోని ఒక కిటికీ రాళ్ల తాకిడికి దెబ్బతిందని తెలిపింది. -
20 తులాల బంగారం, కేజీన్నర వెండి అపహరణ
చీపురుపల్లి: చాలాకాలం తరువాత పట్టణంలో దొంగల అలజడితో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. ఒకే రాత్రి సమీప ప్రాంతాల్లోని రెండు నివాసాల్లోకి చొరబడిన దుండగులు స్థానికులను భయాందోళనకు గురిచేశారు. ఒక ఇంటిలో ఎలాంటి సొత్తు లభించకపోవడంతో వెళ్లిపోయిన దుండగులు మరో ఇంట్లో 20 తులాల బంగారం, కేజీన్నర వెండి చోరీకి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా చోరీకి పాల్పడిన దుండగులు ఒక ఇంటిలో డైనింగ్ టేబుల్‌పై ఉన్న జీడిపప్పు, మరో ఇంట్లో ఫ్రిజ్‌లో ఉన్న పాయసం తీసుకుని తిన్నారు. ఇదే తరహాలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల చోరీలు జరుగుతున్న నేపథ్యంలో తర రాష్ట్రాల నుంచి వచ్చిన ఓ ముఠా వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. చోరీలకు గురైన ఇళ్లను డీఎస్పీ ఏఎస్.చక్రవర్తి, సర్కిల్ ఇన్స్పెక్టర్ హెచ్.ఉపేంద్ర, ఎస్సై ఎ.సన్యాశినాయుడు సోమవారం పరిశీలించారు. అంతేకాకుండా క్లూస్ టీమ్‌లను రప్పించి చోరీ జరిగిన ఇళ్లలో దుండగుల వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. చోరీకి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 20 తులాల బంగారం, కేజీన్నర వెండి అపహరణ పట్టణంలోని ఆంజనేయపురంలో గల విజయకృష్ణ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఆప్టికల్స్ వ్యాపారి తమినాన గంగాధర్ కుటుంబంతో కలిసి ఆదివారం మధ్యాహ్నం శ్రీకాకుళంలోని అత్తవారి ఇంటికి వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దుండగులు ఆదివారం రాత్రి ఇంటికి వెనుక వైపు ఉన్న కిటికీ గ్రిల్ డోర్‌ను తొలగించి ఇంటిలోకి చొరబడ్డారు. మాస్టర్ బెడ్రూంలో ఉన్న బీరువా తాళాలు విరగ్గొట్టి వస్తువులన్నీ చిందరవందరగా పడేశారు. అనంతరం బీరువాలో ఉన్న 20 తులాల బంగారం, కేజీన్నర వెండి అపహరించుకుపోయారు. అంతేకాకుండా ఫ్రిజ్‌లో ఉన్న పాయసం తీసుకుని చక్కగా తిన్నారు. సోమవారం ఉదయం అపార్ట్మెంట్లో ఉన్న నివాసితులు కిటికీ తొలగించి ఉండడాన్ని గమనించి బాధితుడు గంగాధర్‌తో బాటు పోలీసులకు సమాచారం అందజేశారు. ఎంతో కాలంగా కష్టపడి సంపాదించుకున్న బంగారం ఒకేసారి చోరీకి గురవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు వెంకటేశ్వరనగర్‌లో నివాసం ఉంటున్న ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగి దేముడు నివాసం వెనుక ద్వారం తాళాలు పగలగొట్టి చొరబడిన దుండగులు చిల్డ్రన్స్ బెడ్రూంలోకి ప్రవేశించి కబ్బోర్డుల్లో ఉన్న బట్టలు, వస్తువులు చిందరవందరగా పడేశారు. దేవుడి గదిలోకి వెళ్లి వస్తువులను చెల్లాచెదురు చేశారు. తరువాత హాలులో డైనింగ్ టేబుల్‌పై ఉన్న జీడిపప్పు తిన్నారు. అంతలో మాస్టర్ బెడ్రూంలో పడుకున్న దేముడు భార్య లేచిన శబ్దం రావడంతో దొంగలు అక్కడి నుంచి జారుకున్నారు. ఈ చోరీకి సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
స్కానింగ్‌లకు వేలల్లో ఫీజులు
గంట్యాడ మండలానికి చెందిన బి.శ్రీనివాస్ తలనొప్పి అని విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లడంతో వైద్యుడు ఆయనకు ఎంఆర్ఐ స్కాన్ చేయించాలని చీటీ రాసి ఇచ్చాడు. దీంతో ఆ వ్యక్తి ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో రూ.4 చెల్లించి స్కానింగ్ తీయించుకున్నాడు. ● ఇదే మండలానికి చెందిన ఆర్. అప్పారావు కాలి బొటన వేలు ఇన్ఫెక్షన్ అవడంతో విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా బొటన వేలు తొలగించడానికి రూ.40 వేలు బిల్లు వేశారు. ● రెండు రోజుల పాటు జ్వరం రావడంతో విజయనగరానికి చెందిన మురళి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షలు రాశారు. వైద్య పరీక్షలన్నింటికీ రూ.1,000 బిల్లు అయింది. ● ఇలా ఈ ముగ్గురికే కాదు అనేక మంది రోగులకు నిత్యం ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబొరేటరీల్లో ఎదురువుతున్న పరిస్థితి ఇది. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబొరేటరీలు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా స్కానింగ్, వైద్య పరీక్షలు రాసి ప్రజల నుంచి దోపిడీకి పాల్పడుతున్నాయి. వైద్యులు రాస్తున్న పరీక్షలు, స్కానింగ్ చేయించుకోకపోతే ఏమోవుతుందోనని భయంతో వేలల్లో ఫీజులు చెల్లించి రోగులు చేయించుకుంటున్నారు. జ్వరం అని చెబితే చాలు వైద్యపరీక్ష జ్వరం అని ఎవరైనా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగానే వైద్య పరీక్షలు రాసేస్తున్నారు. సాధారణ జ్వరానికి కూడా వైరల్, డెంగీ, మలేరియా, సీబీసీ, హెచ్‌బీ ఇలా అనేక రకాల వైద్య పరీక్షలు రాసేస్తున్నారు. దీంతో రోగులకు తడిసి మోపుడువుతోంది. స్కానింగ్‌లకు వేలల్లో ఫీజులు సిటిస్కాన్, ఎంఆర్ఐ స్కాన్లకు అయితే వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అయితే రోగికి కచ్చితంగా అవసరమని వైద్యులు నిర్ధారిస్తే ఉచితంగా తీస్తారు. కానీ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో మాత్రం సిటిస్కాన్కు రూ.2500 నుంచి రూ. 3 వేలు, ఎంఆర్ఐ స్కాన్‌కు అయితే రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు అవుతుంది. చాలా మంది ప్రైవేట్ వైద్యులకు ఆయా స్కానింగ్ సెంటర్లలో షేర్ ఉంటుంది. షేర్ లేని వైద్యులకు ఆ సెంటర్లు కమీషన్ ఆఫర్ చేస్తాయి. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు స్కానింగ్‌లు రాస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్ఎంపీలే మధ్యవర్తులు ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబొరేటరీలకు ఆర్ఎంపీలే మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. కేసును బట్టి వారికి ఆయా ఆస్పత్రి, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలు కొంతమంది స్థానికంగా ఉంటున్న ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందుతున్నప్పటికీ, రోగులను వారు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలని సిఫార్సు చేస్తున్నారు. జిల్లాలో ఆస్పత్రుల వివరాలు : జిల్లాలో 79 క్లినిక్‌లు, 122 ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లు ఉన్నాయి. 58 ల్యాబొరేటరీలు, 83 ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. ఆయా ఆస్పత్రులకు రోజుకు 10 వేల నుంచి 12 వేల మంది రోగులు వెళ్తున్నారు. వారిలో ఇన్‌పేషేంట్లుగా 1000 నుంచి 2 వేల మంది వరకు చేరుతున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారిలో వేలాది మందికి వైద్య పరీక్షలు రాస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ లేకుండానే ల్యాబ్‌ల నిర్వహణ జిల్లాలో 58 ల్యాబొరేటరీలు మాత్రమే వైద్య ఆరోగ్యశాఖ వద్ద రిజిస్ట్రేషన్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ లేకుండా 100 వరకు జిల్లాలో ల్యాబొరేటరీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వైరల్ జ్వరాలు, డెంగీ జ్వరాల వ్యాప్తి అధికంగా ఉన్న తరుణంలో ల్యాబొరేటరీలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఏ ల్యాబొరేటరీలో కూడ ఏ వైద్య పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేస్తారో తెలిపే బోర్డు ఉండదు. దీంతో వారు ఎంత అడిగితే అంత ఇవ్వవలసిన పరిస్థితి. ల్యాబొరేటరీల్లో కానరాని పెథాలజిస్టులు జిల్లాలో ఉన్న ల్యాబొరేటరీల్లో పెథాలజిస్టులు కానరావడం లేదు. నిబంధన ప్రకారం యూరిన్ కల్చర్, బ్లడ్ కల్చర్ , ప్లేట్లెట్ కౌంట్ వంటి పరీక్షలు పెథాలజిస్టుల పర్యవేక్షణ జరగాలి. ఒకటి, రెండు ల్యాబొరేటరీల్లో తప్ప మిగతా చోట వారు కనిపించరు. -
ఆదివాసీల ‘జలియన్‌వాలాబాగ్’ ఘటన ఏమిటి? ఖర్సావాన్‌లో ఏం జరిగింది?
భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో దేశంలోని ప్రజలంతా ఉజ్వల భవిష్యత్తు గురించి కలలు కన్నారు. అటు జలియన్‌వాలాబాగ్ ఉదంతం, ఇటు విభజన వేదన లాంటివన్నీ మరచిపోయి ముందుకు సాగాలనే తపన నాటి ప్రజల్లో అణువణువునా ఉండేది. అయితే స్వాతంత్య్రం వచ్చిన 138 రోజులకు దేశంలోని ఆదివాసీలు ‘జలియన్‌వాలాబాగ్’ లాంటి మరో దారుణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒరిస్సా పోలీసులు నిరాయుధులైన గిరిజనులను చుట్టుముట్టి, స్టెన్ గన్లతో వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దాదాపు 2000 మంది మృతి చెందారు. ఈ దారుణం 1948, జనవరి ఒకటిన చోటుచేసుకుంది. ఖర్సావాన్ ప్రాంతం జంషెడ్పూర్(జార్ఖండ్) నుండి కేవలం 60-70 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వాతంత్ర్యం తర్వాత సెరైకెలా, ఖర్సావాన్‌లను ఒరిస్సాలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువ మంది ఒడియా మాట్లాడే వారు ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రెండు ప్రాంతాలలో ఉంటున్న గిరిజనులు తమను బీహార్లోనే ఉంచాలని కోరారు. నాటి రోజుల్లో జైపాల్ సింగ్ ముండా అనే గిరిజన నేత పిలుపు మేరకు నిరసనలు చేపట్టేందుకు దాదాపు 50 వేల మంది గిరిజనులు ఖర్సావాన్‌కు తరలివచ్చారు. ఒరిస్సా ప్రభుత్వం ఈ ఆందోళనను అణచివేయాలని భావించింది. ఒరిస్సా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖర్సావాన్‌ను కంటోన్మెంట్‌గా మార్చారు. సైనిక బలగాలను మోహరించారు. అయితే ఏవో కారణాలతో జైపాల్ సింగ్.. ఖర్సావాన్ చేరుకోలేకపోయాడు. దీంతో 50 వేల మంది గిరిజనులు ఈ విలీనానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించిన అనంతరం ఖర్సావాన్ మైదానంలో తిరిగి సమావేశమయ్యారు. కొందరు గిరిజనులు ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో ఒరిస్సా మిలటరీ సైనికులు గిరిజనులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దారుణం అనంతరం కేవలం 35 మంది గిరిజనుల మరణాన్ని ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కోల్‌కతా నుండి ప్రచురితమయ్యే స్టేట్స్‌మన్ అనే ఆంగ్ల వార్తాపత్రిక 1948 జనవరి 3న ఆందోళనల్లో 35 మంది గిరిజనులు మరణించిన వార్తను ప్రచురించింది. కాగా మాజీ ఎంపీ మహారాజా పీకే దేవ్ రాసిన ‘మెమోయిర్ ఆఫ్ ఎ బైగోన్ ఎరా’ పుస్తకంలో నాటి ఆందోళనలో రెండు వేలమంది గిరిజనులు హత్యకు గురయ్యారని రాశారు. నాటి కాల్పుల్లో వేలాది మంది ఆదివాసీలు మృతి చెందారని అప్పటి నేతలు కూడా ప్రకటించారు. ఒరిస్సా మిలటరీ సైనికులు సాగించిన ఈ దురాగతానికి సంబంధించిన చాలా పత్రాలు అందుబాటులో లేవు. అయితే ఈ ఘటనపై పలు కమిటీలు వేసినట్లు వెలుగులోకి వచ్చింది. విచారణ కూడా జరిగింది. కానీ ఈ ఫలితాలు ఏమిటో నేటికీ వెల్లడికాలేదు. ‘జలియన్ వాలాబాగ్’ దారుణం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన ఘటన. జలియన్ వాలాబాగ్ అనేది అమృత్సర్ పట్టణంలో ఒక తోట. 1919 ఏప్రిల్ 13 న పంజాబీ న్యూ ఇయర్ సందర్భంగా వేడుకలు చేసుకునేందుకు వచ్చిన వారిపై జనరల్ డయ్యర్ సారథ్యంలో బ్రిటీష్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వెయ్యి మందికి పైగా మరణించగా, రెండువేల మంది గాయపడ్డారు. ఇది కూడా చదవండి: యుద్ధ నేరం అంటే ఏమిటి? అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏం చేస్తుంది? -
స్వాతి నాయక్‌కు నార్మన్ బోర్లాగ్ అవార్డు
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్– 2023 అవార్డుకు భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (ఐఆర్ఆర్ఐ)లో పనిచేస్తున్న ఆమెను అద్భుతమైన మహిళా శాస్త్రవేత్తగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అభివర్ణించింది. చిన్న రైతులు సాగు చేసేందుకు వీలయ్యే ప్రశస్తమైన వరి వంగడాల రూపకల్పనలో విశేషమైన కృషి చేశారని కొనియాడింది. ఆహారం, పోషక భద్రత, ఆకలిని రూపుమాపేందుకు ప్రత్యేకమైన కృషి సల్పే 40 ఏళ్లలోపు శాస్త్రవేత్తలకు డాక్టర్ నార్మన్ బోర్లాగ్ పేరిట రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఈ అవార్డును అందజేస్తుంది. అక్టోబర్‌లో అమెరికాలోని అయోవాలో జరిగే కార్య క్రమంలో డాక్టర్ స్వాతి పురస్కా రాన్ని అందుకోనున్నారు. అమెరికాకు చెందిన హరిత విప్లవం రూపశిల్పి, నోబెల్ గ్రహీత నార్మన్ బోర్లాగ్. కాగా, డాక్టర్ స్వాతి నాయక్ ఒడిశాకు చెందిన వారు. ఈమె 2003– 07లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చదివారు. -
ముస్లింల అభివృద్ధికి కృషి
● ఎంపీ చంద్రశేఖర్ సాహు బరంపురం: గంజాం జిల్లాలో ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నామని బరంపురం ఎంపీ చంద్రశేఖర్ సాహు తెలియజేశారు. స్థానిక ఖాజా వీధిలో గంజాం ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ముస్లింలు ఉన్నతంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విక్రమ్ పండా, మేయర్ సంఘమిత్ర దొళాయి, ఛత్రపూర్ ఎమ్మెల్యే సుభాష్ చంద్ర బెహరా, జిల్లా ప్రణాళిక బోర్డు చైర్మన్ డా.రమేష్ చంద్ర చావ్ పట్నాయక్, ముస్లిం కమ్యూనిటీ అధ్యక్షుడు అబ్ధుల్ హాద్రిస్, ఉపాధ్యక్షుడు మహ్మద్ సలీం, కార్యదర్శి రహీం ఖాన్, యువజన అధ్యక్షుడు ఫైజర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పట్టాలు తప్పిన ఓహెచ్సీ రాయగడ: రైల్వే ట్రాక్‌లో విద్యుదీకరణ పనులకు వినియోగించే ఓహెచ్సీ (ఒవర్ హెడ్ కార్) భళ్లుమస్కా రైల్వేస్టేషన్‌కు సమీపంలో పట్టాలు తప్పింది. సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి అప్రమత్తమైన రైల్వే సంబంధిత శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులను చేపట్టారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం . పేకాటరాయుళ్లు అరెస్టు మల్కన్‌గిరి: జిల్లాలోని పోలీసులు ఆదివారం రాత్రి ఏఎస్ఐ భుజంగ కుమార్ జాన నేతృత్వంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మల్కన్‌గిరి సమితి ఎంవీ 84 మరియు 83 గ్రామాల్లో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే 84 గ్రామంలోని ఒక ఇంటిపై దాడిచేసి ఐదుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వీరిలో ఎంవీ 84 గ్రామానికి చెందిన అమాల్ దే, బాలాయి మండాల్, ఎంవీ 83 గ్రామానికి చెందిన అముల్యా సర్ద్ర్, సోమాల్ రౌయ్, పద్మాగిరికి చెందిన సోమాల్ అధికారి ఉన్నట్లు నిర్ధారించారు. వారి వద్ద నుంచి రూ.20,820 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మల్కన్‌గిరి కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. -
కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే కృష్ణ సగారియా
కొరాపుట్: మాజీ ఎమ్మెల్యే కృష్ణ సగారియా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సగారియా కొరాపుట్ రిజర్వ్డ్ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున 2009–14 మధ్య ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతర పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. 2014లో ఆ పార్టీ తరుఫున కొరాపుట్, జయపురం స్థానాల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం కొరాపుట్ పార్లమెంటరీ పరిధిలో మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో, మాజీ ఎంపీలు హేమావతి గొమాంగ్, జయరాం పంగిలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో సగారియా సైతం ఈనెల 21న చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కేవలం కొరాపుట్ పార్లమెంటరీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు పెరుగుతుండడంతో ఆసక్తికరంగా మారింది. -
కోడి పందాల రాయళ్ల అరెస్టు
గంట్యాడ: మండలంలోని కొత్త వెలగాడ గ్రామంలో కోడి పందాలు ఆడుతున్న కొంతమందిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. గ్రామంలో కోడి పందాలు ఆడుతున్నట్లు మహిళాపోలీస్ గంట్యాడ పోలీసులకు సమాచారమందించడంతో గ్రామంలో పోలీసులు మాటు వేసి కోడి పందాలు ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.12,470, మూడు కోండి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఎక్కడైనా కోడి పందాలు, పేకాట అడినట్లయితే చర్యలు తీసుకుంటామని ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎరువుల షాపు సీజ్ నెల్లిమర్ల రూరల్: మండలంలోని మొయిద నారాయణపట్నంలో గల శ్రీ మణికంఠ రైతు డిపో ఎరువుల దుకాణంలో విజిలెన్స్ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎరువులు, పురుగు మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ఈ క్రమంలో రూ.4,20, 832 విలువ చేసే ఎరువుల నిల్వల్లో వ్యత్యాసాలు కనిపించడంతో షాపును సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ బి.సింహాచలం, ఏఓ పూర్ణిమ, ఏఈఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం పార్వతీపురం: సీతానగరం మండలం జోగింపేటకు చెందిన జాగాన పోలినాయుడు గుట్కాలు తినడం కారణంగా నోట్లో పుండ్లు ఏర్పాడ్డాయి. అలాగే ముఖం అందవికారంగా ఉందని భావించి మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం భార్య ఆదిలక్ష్మి గమనించి కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి 108 వాహనం ద్వారా చికిత్సకోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. బెదిరించేందుకు మహిళ.. పార్వతీపురం: కుటుంబసభ్యులను బెదిరించేందుకు సీతానగరం మండలం గుచ్చిమి గ్రామానికి చెందిన మండల అపర్ణ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్త రామకృష్ణ, అత్తమ్మ చూస్తుండగానే వారిని భయపెట్టేందుకు ఇంట్లో ఉన్న మాత్రలు ఒక్కసారిగా మింగేసింది. దీంతో కుటుంబసభ్యులు ఆటోలో ఆమెను చికిత్సకోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
పింఛన్ ఇస్తామని తీసుకెళ్లి.. ఆపరేషన్ చేశారు
మల్కన్‌గిరి(భువనేశ్వర్): పింఛన్ ఇస్తామని ఓ యువకుడిని తీసుకెళ్లిన ఆశ వర్కర్.. కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స చేసిన వైనం మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితిలో వెలుగుచూసింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు.. మత్తిలి సమితి మొహిపోధర్ పంచాయతీ అంబగూడకు చెందిన గాంగదురువ(26) పుట్టుకతో మూగ. ఇంకా వివాహం కాలేదు. ఈ నెల 3న గ్రామానికి చెందిన ఆశా వర్కర్ గాంగదరువ ఇంటికి వచ్చింది. పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి మత్తిలి సమితి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది. ఇంటికి మందులతో తిరిగి వచ్చిన కుమారుడిని తల్లి చూసి.. ఎందుకు మందులు వేసుకుంటున్నావని ప్రశ్నించింది. జరిగిన విషయం చెప్పడంతో ఆమె గ్రామస్తులతో కలిసి ఆస్పత్రికి వెళ్లి వైద్యులను నిలదీసింది. తన బిడ్డకు పిల్లలు పుట్టకుండా చేసిన ఆశ వర్కర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విషయమై మల్కన్‌గిరి జిల్లా వైద్యాధికారి ప్రపుల్ల కుమార్ నాందో వద్ద ప్రస్తావించగా.. విచారణ నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రి నుంచి బృందాన్ని మత్తిలి పంపించామన్నారు. ఆశ వర్కర్ తప్పు చేసినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. చదవండి: హెచ్ఎం వేధింపులు.. జాబ్ కావాలంటే , నేను చెప్పినట్లు వినాల్సిందే! -
కూలిన విమానాశ్రయ ప్రహరీ
భువనేశ్వర్: కలహండి జిల్లా భవానీపట్న ఉత్కెళ ఎయిర్‌స్ట్రిప్ ప్రాంతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చెందింది. త్వరలో ఇక్కడి నుంచి భువనేశ్వర్‌కు విమానయాన సౌకర్యం అందుబాటులోకి రానుందని ఇటీవల ప్రకటించారు. ఇంతలో విమానాశ్రయం ప్రహరీ కుప్పకూలింది. ఈ నెల 15న విమానాశ్రయం ప్రారంభించేందుకు యోచిస్తున్న తరుణంలో ఇలా జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్, చీఫ్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఏఎస్‌ఓ), ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), సీఐఎస్ఎఫ్ నోడల్ అధికారుల నేతృత్వంలోని ప్రత్యేక బృందం గత నెల ఎయిర్‌స్ట్రిప్‌ను సందర్శించి సౌకర్యాలు, ఇతర భద్రతా ప్రామాణికల్ని అధికారుల సమక్షంలో సమీక్షించింది. దీని ఆధారంగా ఉత్కెళ ఎయిర్‌స్ట్రిప్‌కు 2బి లైసెన్స్ మంజూరు చేసే సౌకర్యాలపై బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. -
కాంగ్రెస్ సమితులకు అధ్యక్షుల నియామకం
రాయగడ: జిల్లాలోని ఎన్ఏసీ, మున్సిపాలిటీ, సమితుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను పార్టీ అధిష్టానం శనివారం ప్రకటించింది. రాయగడ సమితి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా గడిగ బచిలి, రాయగడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మనోజ్‌కుమార్ రొథొ, కాసీపూర్ సమితికి అంగద్ నాయక్, బిసంకటక్‌కు కృష్ణ నానక్, మునిగుడకు నీలాంబర్ భిభార్, కొలనారకు ఐ.గోవర్ధనరావు, కళ్యాణసింగుపూర్‌కు సీహెచ్ నాగేశ్వరరావు, గుణుపూర్ సమితికి లివింగ్‌స్టోన్ లిమ్మ, మున్సిపాలిటీకి ఘాసీరథం బవురి, రామనగుడ సమితికి బచానిధి బెహరా, పద్మపూర్‌కు సాహెబ్ సబర్, గుడారి సమితికి భాస్కర జగరంగ, గుడారి ఎన్ఏసీకి ప్రమోద్‌కుమార్ పతి, చంద్రపూర్‌కు జార్జ్ క్రిషకలు అధ్యక్షులుగా నియమితులైనట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయ కార్యదర్శి బైద్యనాథ స్వాయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ బలోపేతానికి కృషి బరంపురం: దక్షిణ ఒడిశాలో అన్ని రంగాల్లో కేంద్ర బిందువుగా నిలిచిన గంజాం జిల్లాలో బీజేపీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు భిబుతి భూషణ్ జెనా పిలుపునిచ్చారు. శనివారం నెహ్రూనగర్ 10వ లైన్‌లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ పవనాలు వీస్తున్నాయని, ఒడిశా ప్రజలు కూడా ఆదరిస్తారనే నమ్మకముందన్నారు. సమావేశంలో కార్యదర్శి మదన్మోహన్ పాత్రో, సునీల్ సాహు, కై లాస్ సడంగి జిల్లా బ్లాక్ అధ్యక్షుడు, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పునరావాసం కల్పించాలి కొరాపుట్: దసరా పొద రోడ్డు విస్తరణ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని నబరంగ్‌పూర్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం నబరంగ్‌పూర్ కలెక్టర్‌ను కలిసేందుకు మున్సిపల్ చైర్మన్ కును నాయక్ నేతృత్వంలో బృందం వెళ్లింది. కలెక్టర్ భువనేశ్వర్ పర్యటనలో ఉన్నారని తెలిసి ఏడీఎం మహేశ్వర్‌నాయక్‌ను కలిసి సమస్య వివరించారు. జిల్లా కేంద్రంలోని బస్తి ప్రాంతం దసరా పొద మీదుగా జిల్లా కేంద్ర ఆస్పత్రి వరకు రోడ్డు విస్తరణ చేపట్టారని, రోడ్డును ఆనుకుని ఉన్న ఒకవైపు వారికి వారం రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని, దాంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వైపులా విస్తరణ చేస్తే నష్టం తక్కువగా ఉంటుందన్నారు. అదే విధంగా, నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉషారాణి, ఏ.సతీష్, ఐ.మురళీకృష్ణ, నాగేంద్ర పట్నాయక్, షర్మీష్టా దేవ్ పాల్గొన్నారు. -
ఛీ.. ఇదేం పాడు పని..స్పెషల్ క్లాసులు అని చెప్పి బాలికలతో..
వంగర: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిని వేధిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు పాఠశాలలో పనిచేస్తున్న ఎన్ఎస్ ఉపాధ్యాయుడు బండి రాముడుపై వంగర పోలీసులు కేసు నమోదు చేశారు. తమ కుమర్తెతో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా మాట్లాడుతూ లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాలిక తల్లిదండ్రులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర ఆదేశాల మేరకు సంతకవిటి ఎస్సై బుడుమూరు లోకేశ్వరరావు వంగర చేరుకుని విచారణ చేపట్టారు. ప్రత్యేక తరగతుల పేరిట ముందస్తుగా పాఠశాలకు రావాలని చెప్పడం, అందరిలో బాలిక పట్ల వికృత చేష్టలు చేసిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్టుచేసిన ఉపాధ్యాయుడు వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసేవాడని బాధిత బాలిక తల్లిదండ్రులు విచారణలో తెలియజేశారు. ఈ మేరకు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై లోకేశ్వరరావు తెలిపారు. ఎన్.ఎస్.ఉపాధ్యాయుడు బండి రాముడుపై సస్పెన్షన్ విధిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీ చేసినట్లు పాఠశాల హెచ్ఎం ముద్దాడ రమణమ్మ తెలిపారు. అభంశుభం తెలియని బాలికపై అసభ్యకరంగా వ్యవహరించి, లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ కోరారు. పాఠశాలలో జరిగిన విషయాన్ని తెలుసుకుని హుటాహుటిన ఆయన పోలీస్‌స్టేషన్ కు వెళ్లి ఎస్సై లోకేశ్వరరావుతో మాట్లాడారు. -
విజిలెన్స్ వలలో పోలీసు అధికారి
జయపురం: స్థానిక సదర్ పోలీసుస్టేషన్ పరిధి అంబాగుడ పోలీసు పంటి సబ్ ఇన్స్పెక్టర్ రూ.5 వేల లంచం తీసుకుంటూ విజిలెన్స్ వలలో చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. సబ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత కుమార్ మహంతి జయపురం సదర్ పోలీసుస్టేషన్లో నమోదైన ఒక కేసులో ఒక వ్యక్తికి సహకరించేందుకు రూ.5 వేల లంచం డిమాండ్ చేశారు. ఈ విషయంపై బాధిత వ్యక్తి విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేయగా, ఒడిశా విజిలెన్స్ టీమ్ ఎస్ఐ లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. అలాగే అనంతరం ఎస్ఐ ప్రభుత్వ నివాసంపై, ధమంజొడిలోని అతడి అద్దె ఇంటిపై, కార్యాలయంలో దాడులు నిర్వహించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రైలు నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు పర్లాకిమిడి: విశాఖపట్నం–గుణుపురం ట్రైన్లో సోమవారం ప్రయాణిస్తున్న బర్నాల రవిబాబు(50) కాశీనగర్ స్టేషన్ వద్ద దిగుతుండగా కాలుజారి పడడంతో, దురదృష్టవశాత్తు ఆయన రెండు పాదాలు తెగిపోయాయి. వెంటనే క్షతగాత్రుడుని పర్లాకిమిడి కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి తరలించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం డాక్టర్లు పరీక్షించి గాయం తీవ్రంగా ఉండడంతో బరంపురం ఆస్పత్రికి తరలించారు. కాశీనగర్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. గంజాయి స్వాధీనం ● ముగ్గురు అరెస్టు రాయగడ: జిల్లాలోని రామనగుడ పోలీసులు ఆదివారం నిర్వహించిన దాడుల్లో 73 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అరైస్టెనవారు గజపతి జిల్లా ఒడవా ప్రాంతానికి చెందిన రమాకాంత్ నాయక్ (36), ప్రదీప్ చంద్ర నాయక్(37), మున్నా బెహర (23)లుగా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. రామనగుడ ఎస్ఐ పృధ్వీరాజ్ జంకార్ నేతృత్వంలో రామనగుడ పోలీసుస్టేషన్ పరిధిలోని చకుండా కూడలిలో ఆదివారం ఉదయం వాహన తనికీలను నిర్వహించారు. ఈ క్రమంలో గజపతి జిల్లా ఒడవా నుంచి ఒక వాహనంలో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తుండగా గంజాయి పట్టుబడింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టుకు తరలించారు. సప్లిమెంటరీలో 33 శాతం ఉత్తీర్ణత భువనేశ్వర్: రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు (బీఎస్ఈ) ఆధ్వర్యంలో జరిగిన హైస్కూల్ సర్టిఫికెట్ (హెచ్ఎస్సీ) 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను సోమవారం ప్రకటించారు. ఫలితాలు బోర్డు అధికారిక వెబ్సైట్ www. bseodisha.ac.in అందుబాటులో ఉన్నాయి. ఈ పరీక్షలకు హాజరైన 1,310 మంది విద్యార్థుల్లో 433 మంది ఉత్తీర్ణులయ్యారు. 360 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే స్టేట్ ఓపెన్ స్కూల్ పరీక్షలు రాసిన 8,920 మంది విద్యార్థుల్లో 6,778 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 525 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరు కాగా, 49 మంది మాల్ ప్రాక్టీస్ కింద బుక్ అయినట్లు బీఎస్ఈ తెలిపింది. -
విద్యుత్ మీటర్ రీడర్ హత్య
బరంపురం: గంజాం జిల్లాలోని గెలరి గ్రామంలో విద్యుత్ మీటర్ రీడర్ హత్యకు గురైన ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఎస్పీ జగ్మాహన్ మినా తెలిపిన వివరాల మేరకు.. గెలరీ పోలీసుస్టేషన్ పరిధి కుడాలి ఆదివాసీ గ్రామంలో విద్యుత్ మీటర్ రీడింగ్ కోసం వెళ్లిన సౌత్ కో ఉద్యోగి లక్ష్మీ నారాయణ త్రిపాఠి హత్యకి గురైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని బంజనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కారులో శబ్ధం.. డోర్ ఓపన్ చేయగానే గుండె ఝల్లుమంది!
జయపురం: పట్టణంలోని ఇండాల్ సర్వీసింగ్ కేంద్రానికి వచ్చిన కారులో 6 అడుగుల నాగుపాము కనిపించింది. దీంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే... నవరంగపూర్ జిల్లాలోని ఇంద్రావతిగుడకు ఆదిత్య పట్నాయక్ తన కారును సర్వీసింగ్ నిమిత్తం తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో బోనెట్ ఎత్తి పరిశీలిస్తున్న మెకానిక్కు లోపలి నుంచి శబ్ధం వినిపించింది. కారు డోర్ ఓపన్ చేసి టార్చ్‌లైట్ వేసి పరిశీలించగా, సర్పం కనిపించింది. దీంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. ఇంతలో కొందరు చాకచక్యంగా పామును బంధించి నక్కిడొంగర పర్వత ప్రాంతంలో విడిచి పెట్టారు. నవరంగపూర్ లోనే కారు ఇంజిన్‌లో పాము చేరి ఉంటుందని సర్వీసింగ్ సెంటర్ యజమాని తదితరులు అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వాళ్లందరికి రేషన్ కార్డు రద్దు! -
వర్ష బాధితులకు ఆవాస్ గృహాలు
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి సమితి కేంద్రం జొడియా వీధిలో గత కొద్ది రొజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఐదు ఇళ్లు కూలిపోయాయి. ఈ నేపథ్యంలో నిర్వాసిత బాధిత కుటుంబాలకు ఆవాస్ గృహాలను మంజూరు చేస్తున్నట్లు తహసీల్దార్ బిశ్వభూషిత్ సాహు వెల్లడించారు. తాత్కాలిక పునరావాసం కింది ఆయా కుటుంబాలకు ఇంటి పైకప్పు వేసుకునేందుకు టార్ఫాన్లను శుక్రవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్ఐ బొనొమాలి సాహు, ఏఆర్ఐ ఉమేష్ బిడిక పాల్గొన్నారు. వాల్తేర్ డీఆర్ఎంతో ఎమ్మెల్యే భేటీ పర్లాకిమిడి: తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని వాల్తేర్ డివిజనల్ మేనేజర్ సౌరభ్ ప్రసాద్‌ను పర్లాకిమిడి ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు దుశ్శాలువతో సత్కరించారు. అనంతరం పర్లాకిమిడి రైల్వే స్టేషన్లో ఫ్లాట్‌ఫాం, స్టేషన్ పునరుద్ధరణ, కార్యాలయ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన డీఆర్ఎం.. సమస్యల పరిష్కారంతో పాటు పర్లాకిమిడి, గుణుపురం స్టేషన్లను త్వరలో పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఛిత్రి సింహాద్రి, గేదెల శ్రీధరనాయుడు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు యూనిఫాం పంపిణీ రాయగడ: సదరు సమితి పరిధి పెంట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం, బూట్లు, సాక్సులను శుక్రవారం పంపిణీ చేశారు. జిల్లా బిజూ ఛత్ర జనతాదళ్ ఉపాధ్యక్షుడు ఉదయ్‌కుమార్ హిమిరిక, సర్పంచ్ ఎ.విశ్వనాథ, సమితి సభ్యులు జంబాక తదితరులు పాల్గొని, 530మంది విద్యార్థులకు వీటిని అందజేశారు. రాష్ట్రప్రభుత్వం విద్యార్థులకు ఏటా వీటిని ఉచితంగా పంపిణీ చేస్తోందని ప్రధానోపాధ్యయుడు మనోజ్‌కుమార్ గౌడొ తెలిపారు. -
పర్సు ఇంట్లో మరిచిపోయా.. కాల్ చేస్తే స్విచాఫ్.. న్యాయవాదికే మస్కా కొట్టిన కేటుగాళ్లు
జయపురం(భువనేశ్వర్): ‘సార్.. పర్స్ ఇంట్లో మరచిపోయాను. చికిత్స కోసం డబ్బు అవసరం. ఫోన్ పేలో పంపించగలరు. ఉదయం 11గంటలకు తిరిగి ఇస్తా’నని కొరాపుట్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీరేష్ పట్నాయక్‌కు ఓ సైబర్ నేరగాడి నుంచి ఫోన్ వచ్చింది. పరిచయస్తుని పేరు చెప్పడంతో అతను కూడా వివిధ దఫాలుగా రూ.30 వేలు జమ చేశారు. అయితే కొద్ది సేపటికే ఫోన్ స్విచాఫ్ రావడం, డబ్బు తిరిగి జమ కాకపోవవంతో మోసపోయానని గ్రహించిన న్యాయవాది జయపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బాధితుడి వివరణ ప్రకారం... మంగళవారం ఉదయం 7750874432 నంబర్ నుంచి ఫోను వచ్చింది. తనకు తెలిసిన వ్యక్తి దాస్ బాబుగా పేరు చెప్పి, ఆస్పత్రిలో ఉన్నానని.. చికిత్స కోసం డబ్బులు అవసరం కాగా, పర్స్ మర్చిపోయానని తెలిపాడు. రూ.10 వేలు అవసరం అయ్యాయని, ఇంటికి వచ్చి ఇస్తానని నమ్మబలికాడు. దీంతో అడిగినంత ఫోన్ పే చేశారు. కొద్ది సేపటికే మరో రూ.10 వేలు అడగ్గా, మళ్లీ బదిలీ చేశారు. అనంతరం ఫోన్ చేసి ఫోన్ పేలో రూ.30 వేలు పంపానని నకిలీ రసీదు వాట్సాప్‌కు పంపించాడు. పారపాటున రూ.10 వేలు అధికంగా జమయ్యాయని, మిగతా మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలని కోరడంతో తిరిగి జమ చేశారు. అయితే అకౌంట్లో చూడగా నగదు లేకపోవడం, సంబంధిత వ్యక్తి ఫోన్ స్విచాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన అతను.. పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి వర్షం మధ్య దాహార్తి తీర్చుకుంటున్న పులి.. అలరిస్తున్న అరుదైన వీడియో! -
ఐఐఐటీ డైరెక్టర్‌గా ఆశిష్ ఘోష్
భువనేశ్వర్: నగరంలోని ప్రఖ్యాత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ) డైరెక్టర్‌గా ప్రొఫెసర్ ఆశిష్ ఘోష్ నియమితులయ్యారు. రాష్ట్ర గవర్నర్, ఛాన్సలర్ ప్రొఫెసర్ గణేషీలాల్ నిర్ణయం మేరకు ఈ నియామకం జరిగింది. ఈ పదవిలో ఘోష్ ఐదేళ్ల పాటు నిరవధికంగా కొనసాగుతారు. బాధ్యతలు స్వీకరించిన నుంచి కాల పరిమితి పరిగణిస్తారు. ఇప్పటి వరకు ఆయన కోల్‌కతా ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ప్రొఫెసర్, ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. బోధన రంగంలో సుదీర్ఘంగా 28 ఏళ్ల అనుభవం కలిగి ఉండటంతో పాటు వివిధ అంశాలపై 10 పుస్తకాలను వెలువరించారు. 10మంది ిపీహెచ్డీ అభ్యర్థులకు విజయవంతంగా మార్గనిర్దేశం చేశారు. -
డ్యూటీలో మద్యం తాగి ఇంజినీర్లు చిందులు.. వీడియో వైరల్ కావడంతో
భువనేశ్వర్: ఉద్యోగస్తులు బయట ఎలా ఉన్న ఆఫీసులోకి వెళ్లగానే హుందాగా ప్రవర్తించడంతో పాటు వారి పనిని నిబద్దతతో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతీ సంస్థ తమ ఉద్యోగుల నుంచి ఆశిస్తుంది. అయితే కొందరు మాత్రం ఇవేవి తమకు పట్టవంటూ ఇష్టారీతిన వ్యవహరిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒరిస్సాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేంద్రాపడా జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ ఇంజినీర్లు తమ కార్యాలయంలో మద్యం సేవిస్తున్నట్లు వీడియో వైరల్ అయ్యింది. దీంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌కుమార్ జెనా జలవనరుల శాఖను సోమవారం ఆదేశించారు. ఈ ఇరువురు నిందితులు మహానది నార్త్ డివిజన్లో ఇంజినీర్లుగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం జిల్లాలోని నారాయణపూర్ సెక్షన్ కార్యాలయంలో ఇంజినీర్లు, మరికొందరు వ్యక్తులు పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో మద్యం, ఆహారం సరంజామాతో సమగ్ర వీడియో చిత్రీకరించి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఇరువురు ఇంజినీర్లపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని జల వనరుల శాఖను ఆదేశిస్తూ సీఎస్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి అన్యోన్యంగా ఉండేవాళ్లు,ఎలాంటి లోటు లేదు.. కానీ ఆ ఒక్క కారణంతో భార్యను హతమార్చాడు! -
927మందికి వైద్య పరీక్షలు
జయపురం: పట్టణంలోని జగధాత్రిపూర్ ఆస్పత్రి, జయపురం ఎల్ఆర్ ఆస్పత్రి సంయుక్తంగా నిర్వహించిన వైద్య శిబిరాల్లో 927మందికి పరీక్షలు జరిపారు. క్రిస్టియన్‌పేట క్లబ్ ప్రాంగణంలోని రెండో హటపొదర్ మిషన్శక్తి కేంద్రంలో సీజనల్‌గా వచ్చే వ్యాధులు, వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. రక్తపోటు, మధుమేహం, రక్తహీనత, ఇతర సాధారణ వ్యాధులపై వివరించారు. శిబిరాల్లో డాక్టర్ తధాగత రథ్, డాక్టర్ సురేష్ పాణిగ్రహి, పీహెచ్ఎం సంజయకుమార్ స్వొయి, లింగరాజ్ పాఢి, సూపర్వైజర్ సత్యనారాయణ పాత్రొ, ప్రణయ సాహు తదితరులు పాల్గొన్నారు. మణిపూర్‌పై ఆందోళనలో ఎంపీ ఉల్క కొరాపుట్: మణిపూర్ ఘటనపై పార్లమెంట్లో సోమవారం జరిగిన ఆందోళనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి ఉల్క పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి ఉల్క ఒక్కరే హస్తం పార్టీ తరఫున లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇండియా కూటమి ఎంపీలు చేపట్టిన ఆందోళనలో భాగంగా సహచర మిత్రుడు సమీప ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ఎంపీ దీపక్ బైజ్‌తో కలిసి పాల్గోన్నారు. దీపక్ ప్రస్తుతం ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. మాజీ స్పీకర్‌కు పరామర్శ పర్లాకిమిడి: ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్ చింతామణి జ్ఞాన్ సామంతరే సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఈ నేపథ్యంలో గంజాం జిల్లా పాత్రపురం బ్లాక్ బొమ్మిక గ్రామంలోని ఆయన నివాసానికి చేరుకున్న పర్లాకిమిడి ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు పరామర్శిచారు. పరామర్శలో బీజేపీ నాయకులు జగన్నాథ పరిడా, జి.శ్రీధరనాయుడు ఉన్నారు. -
చిమ్మచీకటి.. జోరు వర్షం.. పసికందును విసిరేసిన తల్లిదండ్రులు
భువనేశ్వర్: చిమ్మచీకటి.. జోరు వర్షంలో బస్తాలో చుట్టి, పసికందును విసిరేసిన తల్లిదండ్రుల కాఠిన్యానికి పిడుగులు కూడా మిన్నకుండిపోయాయి. జనం కంట కనిపించే వరకు మెరుపులే తోడుగా నిలిచి, ముక్కు పచ్చలారని చిన్నారిని కాపాడుకున్నాయి. మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన మానవత్వానికి మాయని మచ్చగా తారస పడింది. వివరాల్లోకి వెళ్లే శనివారం వేకువజామున మల్కన్‌గిరి తోలాసాహి(దిగువ వీధి) వైపు వెళ్తున్న స్థానికులకు ఏడుపు వినిపించడంతో వెళ్లి చూడగా, చెత్తకుప్ప వద్ద బియ్యం బస్తాలో చుట్టి ఉన్న పసికందు కనిపించింది. వెంటనే చైల్డ్‌లైన్ సిబ్బందికి సమాచారం అందించడంతో పాటు మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. బిడ్డ ఆరోగ్యంగానే ఉందని, పుట్టి ఒక రోజే కావస్తుందని తెలిపారు. ఆస్పత్రికి చేరుకున్న ఐఐసీ రీగాన్ కీండో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పసికందు తల్లిదండ్రుల వివరాలపై ఆరా తీస్తున్నారు. చదవండి విదేశీయుని వద్ద రూ.5000 చలానా వసూలు చేసిన పోలీసు.. రిసిప్ట్ ఇవ్వకుండానే.. వీడియో వైరల్.. -
సీబీఎస్ఈలో భారతీయ భాషల బోధన
● కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భువనేశ్వర్: జాతీయ నూతన విద్యా విధానం(ఎన్ఎన్ఈపీ)–2020 అమలులో భాగంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ), అనుబంధ పాఠశాలల్లో ఇంగ్లిష్, హిందీ భాషల ఎంపికలతో పాటు ఒడియాతో సహా బోధనా మాధ్యమంగా భారతీయ భాషలను ఎంపిక చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ మేరకు సీబీఎస్ఈ తన అనుబంధ పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసిందని శనివారం ప్రకటించారు. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లో పేర్కొన్న భారతీయ భాషలను ప్రీ–ప్రైమరీ తరగతుల నుంచి 12వ తరగతి వరకు ఐచ్ఛిక మాధ్యమంగా, ఇతర అందుబాటులో ఉన్న ఎంపికలతో పాటు బోధనా మాధ్యమంగా ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. 8వ షెడ్యూల్లో 22 భారతీయ భాష లు ఈ జాబితాలో చోటు చేసుకున్నట్లు గుర్తుచేశారు. భారతీయ భాషలను బోధనా మాధ్యమంగా చేర్చడం బహు భాషావాదాన్ని ప్రోత్సహించడం, భాషా వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రధాన సోపానంగా అభిప్రాయం వ్యక్తంచేశారు. వివిధ భాషల్లో విద్యను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సీబీఎస్ఈ విద్యార్థుల అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచడం తోపాటు సాంస్కృతిక, భాషా గుర్తింపులతో వారి సంబంధాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్య చేపట్టినట్లు వివరించారు. బాంబు దాడి కేసులో నిందితుల అరెస్ట్ బరంపురం: గంజాం జిల్లాలోని బుగడాలో మందుల దుకాణంపై ఈనెల 16న జరిగిన బాంబు దాడి కేసులో పరారైన నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దీనిపై ఐఐసీ అధికారి చిత్రరంజన్ బెహరా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుగడా పోలీసు స్టేషన్ పరిధిలోని మెడికల్ ప్రాంగణం వద్ద ఉన్న దుకాణంపై దుండగులు నాటు బాంబులతో దాడి చేసి, పరారయ్యారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయలు కాగా, దుకాణంలోని ఔషధాలు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయి. దీనిపై బాధిత యజమాని సంతోష్‌కుమార్ పోలీసులకు ఫర్యాదు చేశారు. కేసు నమోదు చేయగా, దర్యాప్తు చేయడంతో పాటు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 బైక్‌లు, సెల్‌ఫోన్, నాటు తుపాకీ, 2 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణాల్లో ముమ్మర తనిఖీలు పర్లాకిమిడి: పట్టణంలో లైసెన్సులు లేకుండా మాంసం విక్రయిస్తున్న దుకాణాల్లో మున్సిపల్ శాఖ, ఆహర భద్రతా విభాగం అధికారులు శనివారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. సంబంధిత వ్యాపారులపై అపరాధ రుసుం విధించారు. మున్సిపల్ కౌన్సిల్ నిబంధనలు అతిక్రమించి మాంసం విక్రయిస్తున్న దుకాణదారులు, టిఫిన్ బండి నిర్వాహకులపై రూ.30 వేల జరిమానా వసూలు చేశారు. ఫుడ్ లైసెన్సు, ట్రేడ్ లైసెన్సు లేని వారిపై చర్యలు తీసుకున్నారు. అలాగే 167 కిలోల పాలిథిన్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో పురపాలక శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి వనమాలి శత్పతి, జిల్లా ఆహార తనిఖీ అధికారి తపస్వినీ బెహారా, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది కలిసి పాల్గొన్నారు. -
సినీ ఇండస్ట్రీని కుదిపేసిన ఘటన.. హీరోయిన్‌పై అత్యాచారయత్నం!
బాలీవుడ్ నటి అర్చన జోగ్లేకర్ 1990లో పరిచయం అక్కర్లేని పేరు. అర్చన బుల్లితెరతో పాటు బాలీవుడ్‌తో పాటు మరాఠీ, ఒరియా, సినిమాల్లోనూు నటించింది. అంతే కాకుండా ఆమె గొప్ప డ్యాన్సర్ కూడా. అర్చనకు క్లాసికల్ డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. కిసీ కా శాంతి కా', 'కర్ణభూమి', 'ఫూల్వతి' వంటి సీరియల్స్‌తో బాలీవుడ్లో మంచి గుర్తింపు వచ్చింది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆ సంఘటన అప్పట్లో ఏకంగా సినిమా ఇండస్ట్రీనే కుదిపేసింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. (ఇది చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్!) సినిమా షూటింగ్ సమయంలోనే అర్చనపై అత్యాచారయత్నం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఘటన ఆమె నటించిన ఒరియా సినిమా సెట్లో చోటు చేసుకుంది. ఓ చిత్రంలో అర్చన హీరోయిన్గా నటించింది. అప్పట్లో వచ్చిన మీడియా కథనాల ప్రకారం మూవీ షూటింగ్ జరిగి సమయంలో ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నం చేసేందుకు యత్నించాడట. అదే సమయంలో అక్కడున్న వ్యక్తులు ఆమెను రక్షించినట్లు సమాచారం. అయితే అప్పట్లో ఆ సంఘటనతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా భయాందోళనకు గురైందట. కాగా.. పెళ్లి చేసుకున్న తర్వాత అర్చన అమెరికాలో న్యూజెర్సీలో స్థిరపడింది. ప్రస్తుతం తానే స్వయంగా ఓ డ్యాన్స్ స్కూల్ కూడా నిర్వహిస్తోంది. ఆమె స్కూల్ ద్వారా పిల్లలకు శాస్త్రీయ నృత్యంలో శిక్షణనిస్తోంది. కాగా.. అర్చన సునా చదేయ్, స్త్రీ లాంటి ఒరియా చిత్రాల్లో కనిపించింది. (ఇది చదవండి: ఒకటే ముక్క..పుష్ప-2 పవర్ఫుల్ డైలాగ్ లీక్..!) View this post on Instagram A post shared by Archana Arts (@archanaarts.us) -
Bahuda yatra : ఘనంగా పూరీ జగన్నాథుని బహుడా యాత్ర (ఫొటోలు)
-
తుపాన్లు తలొంచుతున్నాయ్..! వారం రోజుల ముందే హెచ్చరికలతో..
మాండాస్, సిత్రాంగ్, అసానీ, గులాబ్, బిపర్ జోయ్. పేరు ఏదైనా కానివ్వండి ఆ తుపాను ఎంత తీవ్రమైనదైనా కానివ్వండి మనం తట్టుకొని నిలబడుతున్నాం. 1990,–2000నాటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకప్పుడు తుపాన్లు, వరదలంటే భారీగా ప్రాణ నష్టాలే జరిగేవి. ఇప్పుడు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ముందస్తుగా తుపాన్లను గుర్తించి పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతో సత్ఫలితాల్ని ఇస్తోంది. గుజరాత్లో ఏకంగా లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు యుద్ధ ప్రాతిపదికన తరలించడంతో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. తుపాన్ల సన్నద్ధతలో ఒడిశా ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఆ రాష్ట్ర చర్యలకు ఐక్యరాజ్య సమితి కూడా శభాష్ అనడం విశేషం. అది 1999 సంవత్సరం అక్టోబర్ 29. ఒడిశా ప్రజలకు అదో కాళరాత్రి. పారాదీప్ సూపర్ సైక్లోన్ రాష్ట్రంపై విరుచుకుపడింది. సముద్రం అలల ధాటికి 14 జిల్లాల్లో భారీ విధ్వంసం జరిగింది. జగత్సింగ్పూర్ జిల్లాకి జిల్లాయే తుడిచిపెట్టుకుపోయింది. తుపాను దెబ్బకి 10 వేల మంది జలసమాధి అయ్యారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 30 వేల మంది వరకు ప్రాణాలు పోగొట్టుకుని ఉంటారని ఒక అంచనా. అప్పట్లో భారత వాతావరణ కేంద్రం దగ్గర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. దీంతో తుపాను ముంచుకొస్తోందని కేవలం 48 గంటల ముందు మాత్రమే తెలిసింది. వాతావరణ శాఖ అధికారులు ఒడిశా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినప్పటికీ సన్నద్ధత లేని కారణంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 10 వేలు నుంచి 30 వేల మంది మరణిస్తే, 3.5 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. గ్రామాలకు గ్రామాలే నీళ్లలో కొట్టుకుపోయాయి. 25 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రెండు లక్షల జంతువులు మరణించాయి. గంటకి 250 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీయడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ నాశనమైంది. ఒడిశాతో ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. ఈ పెను విధ్వంసంతో అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తుపాన్లు ఎదుర్కోవడంలో నవీన పంథా సూపర్ సైక్లోన్ ముంచెత్తిన తర్వాత సంవత్సరం 2000లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నవీన్ పట్నాయక్ తుపాన్లు ఎదుర్కోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. సూపర్ సైక్లోన్ తుపాను బీభత్సం నుంచి అప్పటికి ఇంకా రాష్టం కోలుకోలేదు. భౌగోళికంగా ఒడిశా తుపాన్ల తాకిడిని తప్పించుకోవడం అసాధ్యం. 1891 నుంచి 100కి పైగా తుపాన్లు ఒడిశాను వణికించాయి. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం నవీన్ పట్నాయక్ ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు ► రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేశారు. ఇలా ఒక రాష్ట్రం విపత్తు నిర్వహణ కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేయడం అదే మొదటి సారి. జిల్లాలు, బ్లాక్ స్థాయిలో కూడా విపత్తు కమిటీలు ఏర్పాటు చేశారు. 22 వేల గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక యువకుల్ని సభ్యులుగా నియమించారు. తుపాను హెచ్చరికలు అందిన వెంటనే లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే వీరు చేయాల్సిన పని ► రాష్ట్రంలోని 480 కి.మీ. పొడవైన తీర ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు, తుపాన్లపై ప్రజల్ని అప్రమత్తం చేయడానికి 2018లో ప్రభుత్వం ఎర్లీ వార్నింగ్ డిస్సెమినేషన్ సిస్టమ్ (ఈడబ్ల్యూడీఎస్) ఏర్పాటు చేసింది. తుపాన్లు ముంచుకొస్తే లోతట్టు ప్రాంత ప్రజలకి కనీసం అయిదారు రోజుల ముందే హెచ్చరికలు అందుతాయి. ► తీర ప్రాంతాల్లో నివసించే వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చింది ► ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లో బాగా విస్తరించి సుశిక్షితులైన సిబ్బందిని 20 రెట్లు పెంచింది. వారి దగ్గర 66 రకాల ఆధునిక పరికరాలు అంటే జనరేటర్లు, చెట్లను కట్ చేసే, రోడ్లను శుభ్రం చేసే యంత్రాలు, పడవలు, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ వంటివి ఎప్పుడూ ఉండేలా చర్యలు తీసుకుంది. ► 1999 సూపర్ సైక్లోన్ సమయం నాటికి ఒడిశాలో కేవలం ఆరు జిల్లాల్లో కేవలం 23 శాశ్వత తుపాను శిబిరాలు ఉండేవి. తీర ప్రాంతాల్లో అడుగడుక్కీ బహువిధాలుగా ఉపయోగపడే శిబిరాలు నిర్మించారు. ఇప్పుడు వాటి సంఖ్య 870కి చేరుకుంది. ఒక్కో శిబిరంలో వెయ్యి మంది వరకు తలదాచుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రశంసలు 2013 సంవత్సరంలో ఫాలిని అత్యంత తీవ్రమైన తుపానుగా ఒడిశాను ముంచెత్తింది. అప్పుడు భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ తుపాను సమయంలో లక్షలా ది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఒడిశా ప్రభుత్వ సహాయక చర్యలకు ఐక్యరాజ్యసమితి ఫిదా అయింది. ఒడిశా ప్రభుత్వం చారిత్రక విజయాన్ని సాధించిందని అభినందించింది. కేంద్రం మూడంచెల వ్యవస్థ బిపర్జోయ్ మహా తుపాను గుజరాత్లో విధ్వంసం సృష్టించినా ప్రాణ నష్టం జరగలేదు. దీనికి తుపాన్లపై ముందస్తు సన్నద్ధతే కారణం. తుపాను ముప్పుని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం మూడంచెల వ్యవస్థని ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ పనితీరుతో ఏకంగా లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణాలు కాపాడగలిగారు. తుపాన్లు ఎప్పుడు ఏర్పడతాయి? ఏ దిశగా ప్రయాణిస్తాయి, ఎక్కడ తీరం దాటుతాయన్న అంశాలను వారం రోజులు ముందుగానే గుర్తించే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజల్లో తుపాన్లపై అవగాహన పెరుగుతుంది. ఇక రెండో అంచెగా శిబిరాల నిర్మాణం, ప్రజల్ని తరలించడం ఒక యుద్ధంలా చేస్తారు. ఇక మూడో దశలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్లో విద్యుత్ లైన్లు, మంచినీటి పైపుల నిర్మాణం, రైల్వే, విమానాశ్రయాల్లో రాకపోకలు సాగేలా ఏర్పాట్లు వంటి వాటిపై దృష్టి పెట్టింది. ఫలితాలు ఇలా..! ప్రకృతి వైపరీత్యాలతో జరిగే ఆర్థిక నష్టాన్ని నివారించలేకపోయినా ప్రాణలైతే కాపాడగలుగుతున్నాం. గత కొద్ది ఏళ్లలో ఒడిశాను అల్లకల్లోలం చేసిన తుపాన్లలో ప్రాణనష్టం తగ్గుతూ వస్తోంది. -
చచ్చిపోతున్నాం.. బకాయిలు చెల్లించండి
జయపురం: సబ్ డివిజన్ పరిధిలోని గగనాపూర్‌లో ఉన్న సేవా పేపర్‌మిల్లు యాజమాన్యాలు మారినా.. శ్రామికుల బాధలు కన్నీటి గాథలుగానే ఉన్నాయి. బిల్డ్ కంపెనీ నుంచి మిల్లును హస్తగతం చేసుకున్న మదర్ అర్థరిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కూడా విశ్రాంత శ్రామికల కష్టాలను లెక్కచేయడం లేదు. వారికి చెల్లించాల్సిన పింఛన్, గ్రాడ్యుటీ, పీఎఫ్ బకాయిలు ఇప్పటికీ చెల్లించడం లేదు. కార్మిక సంఘం ఎన్ని వినతులు చేసినా, నెలలు తరబడి ఆందోళన చేపట్టినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో విశ్రాంత శ్రామికులు సరైన వైద్యం సైతం పొందలేక ఇప్పటికే 30మందికి పైగా మృతి చెందినట్లు కార్మిక సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే తరహాలో మరో శ్రామికుడు ధనుర్జయ భాగ్ తన భార్యతో సహా ఆదివారం ఉదయం మండుటెండలో మిల్లు ప్రధాన గేటు వద్ద ధర్నాకు దిగారు. తనకు రావాల్సిన పింఛన్, గ్రాడ్యుటీ బకాయిలను చెల్లించాలని యాజమాన్యాన్ని కోరినా మనసు కరగలేదని వాపోయారు. 2011లో ఉద్యోగ విరమణ చేశానని, అప్పటి నుంచి ఇదే పరిస్థితని వివరించారు. అప్పులు చేసి అతి కష్టంతో కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నానని, ఇక గత్యంతర లేక నిరసనకు దిగినట్లు చెప్పుకొచ్చారు. ఈనెల 21న నిరవధిక ధర్నా ఈ సందర్భంగా విశ్రాంత శ్రామిక సంఘ కన్వీనర్, ప్రముఖ కార్మికనేత ప్రమోద్‌కుమార్ మహంతి మీడియాతో మాట్లాడారు. వెంటనే మిల్లు యాజమాన్యం స్పందించకపోతే ఈనెల 21 నుంచి జయపురం లోని కార్మికశాఖ కార్యాలయం ఎదుట నిరవధిక ధర్నా చేపడతామని ప్రకటించారు. విశ్రాంత శ్రామికుల ఇబ్బందులను ఎప్పటికప్పుడు యాజమాన్యానికి, అధికారులకు చెబుతున్నా.. బకాయిలు చెల్లించడం లేదన్నారు. ఇప్పటికై నా స్పందించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. -
ఒడిశా రైలు ప్రమాదం: రాత్రింబవళ్లు అక్కడే..
కొరాపుట్: బాలేశ్వర్ రైలు దుర్ఘటన జరిగిన ప్రాంతంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి దాదాపు 70శాతం పనులు పూర్తయ్యాయి. రాష్ట్రానికి చెందిన కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ శ్రీవైష్టవ్, మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు అక్కడే మకాం వేశారు. దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్ పునరుద్ధరణలో ఉన్న అత్యంత నాణ్యమైన టెక్నాలజీ వినియోగించారు. వందల సంఖ్యలో రైల్వే కార్మికులు షిఫ్ట్‌ల వారీగా పనులు చేస్తున్నారు. మరోవైపు ఇద్దరూ మంత్రులు భద్రక్ జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. అలాగే రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రతాప్ జెన్నా మీడియా మాట్లాడుతూ మెత్తం 275మంది మృతులు తుది ప్రకటన చేశారు. ప్రతి మృతదేహాన్ని రాష్ట్ర ఖర్చులతో వారి స్వస్థలాలకు పంపిస్తున్నామన్నారు. బంధువులకు అప్పగించని మృతదేహాలను అన్ని ఆస్పత్రుల నుంచి భువనేశ్వర్‌కు రప్పిస్తున్నామన్నాని తెలిపారు. ఏ రాష్ట్రానికి చెందిన మృతులు ఉన్నా.. వారి బంధువులు వస్తే డెత్ సరి్టఫికెట్లు అందజేస్తామన్నారు. మృతదేహాలను ఫొటోలు తీసి, ప్రదర్శనగా ఉంచారు. బాధిత కుటుంబం సభ్యులు ఫొటో గుర్తించిన వెంటనే అధికారులు ఆ ఫొటో నంబర్ చూసి బాధితులను మృతదేహం ఉన్న ఆస్పత్రికి తీసుకు వెళ్తున్నారు. వెనువెంటనే తరలింపు ప్రక్రియ చేపడుతున్నారు. అందుకే.. అంత వేగంగా.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని శ్రీవైష్టవ్ పనితీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకున్న ఆయన.. అప్పటి నుంచి విశ్రాంతి లేకుండా అక్కడే మకాం వేశారు. పగలు, రాత్రీ తేడా లేకుండా పరుగులు పెడుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్వయాన రైల్వేమంత్రే ఘటన స్థలంలో తిష్ట వేయడంతో ఆ శాఖలో ఉన్నతాధికారులెవరూ అక్కడి నుంచి కదల్లేకపోయారు. ఈ నేపథ్యంలో శిథిలమైన బోగీలులను తరచూ సందర్శిస్తూ, ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయిస్తున్నారు. మరోవైపు మృతదేహాల తరలింపు పూర్తయినప్పటికీ కొన్ని బోగీల కింద ఇంకా ఎవరైనా ఉన్నారనే అనుమానంతో పూర్తిస్థాయిలో తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మరోవైపు సహాయక చర్యల్లో అందరి మన్ననలు పొందిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు చెట్ల కిందే సేద తీరుతున్నాయి. రైళ్ల రాకపోకలు నిలిచి పోవడంతో ముఖ్యమంత్రి నవీన్ పట్నయక్ ఉచిత బస్సు సర్వీసులు నడపాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సహయ నిధి నుంచి ఈ పరిహరాన్ని బస్సు యజమానులకు చెల్లిస్తామన్నారు. ఈ బస్సులు బాలేశ్వర్, పూరీ, కోల్‌కతా, భువనేశ్వర్, కటక్ మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. చదవండి: తగ్గిన జీడి.. పెరిగిన కోడి -
ఒడిశా రైలు ప్రమాదం: బాధితులకు ఏపీ ప్రభుత్వ భరోసా
సాక్షి అమరావతి/భువనేశ్వర్/మహారాణిపేట: ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో గాయపడి, బాలాసోర్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో చికిత్స పొందున్న క్షతగాత్రులను ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం పరామర్శించారు. అంతకు ముందు ఆయన బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో స్థితిగతులను సమీక్షించి, ఘటన పూర్వాపరాలపై అధికారులతో విశ్లేషించారు. లోటుపాట్లు లేకుండా సహాయ, పునరుద్ధరణ కార్యకలాపాలు కొనసాగేలా వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కూడా చర్చించారు. స్థానికుల సహాయ, సహకారాలను మంత్రి ప్రశంసించారు. బాధితులను ఆదుకునే దిశగా ఏపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని వివరించారు. అత్యవసర సేవలకు అనుకూలంగా భువనేశ్వర్‌లో 16 అంబులెన్స్‌లు, 10 మహా ప్రస్థానం వాహనాలు, బాలాసోర్‌లో 5అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచిందని చెప్పారు. భువనేశ్వర్‌లో బాధితుల సహాయ కేంద్రం ఆచూకీ తెలియని వారి కోసం భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఒడిశా అధికారులతో సంప్రదింపులు చేస్తోందన్నారు. భువనేశ్వర్‌లోని ఆస్పత్రుల్లో 120 గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నాయన్నారు. మృతులను గుర్తించడానికి కుటుంబసభ్యులను తీసుకెళ్లేందుకు వాహనాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సహాయం కోసం 1929 హెల్ప్‌లైన్‌తో పాటు ప్రత్యేక అధికారి తిరుమల నాయక్(ఐఏఎస్) 8895351188ను బాధిత కుటుంబాలు సంప్రదించాలని సూచించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల, మృతుల వివరాలను https://srcodisha.nic.in/, https://www.bmc.gov.in, https://www.osdma.org వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారన్నారు. కటక్ రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎస్సీబీ మెడికల్ కళాశాల, భువనేశ్వర్ రైల్వేస్టేషన్, బారముండా బస్టాండ్, విమానాశ్రయంలో హెల్ప్‌డెస్క్‌లు పని చేస్తున్నాయన్నారు. క్షతగాత్రులకు విశాఖలో చికిత్స రైలు ప్రమాదంలో గాయపడ్డ పలువురికి విశాఖలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. సెవెన్ హిల్స్, ఐఎన్ఎస్ కల్యాణి ఆస్పత్రుల్లో ఇద్దరి చొప్పున, కేజీహెచ్‌లో ముగ్గురికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎ.శంకరరావుకు అన్ని పరీక్షలు చేశామని, ఆరోగ్యం స్థిరంగా ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణ తెలిపారు. బాధితుల కోసం కేజీహెచ్ క్యాజువాలిటీ వద్ద 30 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. బుచ్చిరాజుపాలెం ప్రాంతానికి చెందిన భారతి, మాధవరావులకు ఇక్కడే చికిత్స అందిస్తున్నామన్నారు. కె.పూజ అనే మహిళను భువనేశ్వర్ నుంచి విశాఖకు తీసుకొస్తున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. గురుమూర్తికి అక్కడే అంత్యక్రియలు ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన సి.గురుమూర్తి ఒక్కరే మృతి చెందారు. ఆయన కుటుంబం బాలాసోర్‌లో ఉంటున్నందున మృతదేహాన్ని అక్కడికే తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా విజయవాడలో దిగాల్సిన ప్రయాణికుల్లో 11 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. బాధితుల కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచామని రైల్వే అధికారులు తెలిపారు. బాధితుల వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు 1070, 18004250101, 8333905022 (వాట్సాప్) సంప్రదించవ్చని తెలిపారు. చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’.. పట్టాలపై ప్రేమ కథ! -
ఒడిశా రైలు ప్రమాదం: శ్రీకాకుళం వాసి మృతి
శ్రీకాకుళం: ఒడిశా రైలు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన వ్యక్తి మృతిచెందారు. మండలంలోని జగన్నాధపురానికి చెందిన గురుమూర్తి(60) మృత్యువాత పడ్డారు. నిన్న(శనివారం) జరిగిన రైలు దుర్ఘటనలో గురుమూర్తి యశ్వంత్‌పూర్ రైలులో ప్రయాణిస్తూ మృత్యువాత పడ్డాడు. ప్రమాద వార్త తెలుసుకున్న గురుమూర్తి కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకోగా అక్కడే అతని మృతదేహాన్ని అప్పగించారు. అతనికి ఒడిసాలోనే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. జూట్ కార్మికుడిగా పనిచేసే గురుమూర్తి.. బాలాసోర్‌లో నివాసముంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకూ రైలు ప్రమాదంలో మృత్యువాత పడ్డ వారి సంఖ్య 288కి చేరింది. మరొకవైపు వెయ్యికి మందికి పైగా గాయపడ్డారు. -
కోరమండల్‌కు కలిసిరాని శుక్రవారం
కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం కలిసిరావడం లేదు. గత 20 ఏళ్లలో ఈ రైలు మూడుసార్లు ప్రమాదానికి గురైంది. అవన్నీ శుక్రవారమే జరిగాయి. పైగా వాటిలో రెండు ప్రమాదాలు ఒడిశాలోనే చోటుచేసుకున్నాయి. హౌరా–చెన్నై మధ్య నడిచే కోరమండల్ మూడుసార్లూ చెన్నై వెళ్తూనే ప్రమాదానికి గురైంది! 2009లో ఒడిశాలోని జైపూర్ వద్ద తొలిసారి ప్రమాదం జరిగింది. అప్పుడు 16 మంది చనిపోయారు. తర్వాత 2022 మార్చిలో నెల్లూరు వద్ద జరిగిన రెండో ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. తాజా ప్రమాదం మూడోది. -
ఒడిశా రైలు ప్రమాదం.. రక్తదానానికి యువత క్యూ
ఒడిశాలో కనీవినీ ఎరుగని రీతిలో రైలు ప్రమాదం జరిగిన సమయంలో నేటి తరం యువత తమలో మానవత్వం ఉందని నిరూపించారు. క్షతగాత్రులతో కిక్కిరిసిపోయిన బాలసోర్ ప్రభుత్వ ఆస్పత్రికి యువతీ యువకులు క్యూ కట్టారు. బాధితులకి అవసరమైన రక్తం తాము ఇస్తామంటూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఒక జిల్లా ఆస్పత్రికి ఒకేసారి 250 మందికి పైగా క్షతగాత్రులు రావడంతో వారికి చికిత్స ఎలా అందించాలో తెలీక సిబ్బంది తీవ్ర గందరగోళానికి గురయ్యారు. అప్పటికే రైలు ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానిక యువత ఆస్పత్రికి వచ్చి తమ వంతు ఏదైనా చేస్తామన్నారు. ఈ విషయాన్ని జిల్లా అదనపు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మృత్యుంజయ్ మిశ్రా చెప్పారు. ‘‘నేను గత కొన్ని దశాబ్దాలుగా ఈ వృత్తిలో ఉన్నాను. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఒకేసారి వందల మంది క్షతగాత్రులకి చికిత్స అందించడం చాలా కష్టంగా మారింది. అదే సమయంలో పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి రక్తదానం చేయడానికి రావడం సంభ్రమాశ్చర్యాల్ని కలిగించింది. రాత్రంతా 500 యూనిట్ల రక్తాన్ని సేకరించాం. రక్తం ఇచ్చిన యువతకి ధన్యవాదాలు ’’ అని డాక్టర్ వివరించారు. -
దేవుడా! ఈ మృతదేహాల్లో నా కొడుకు ఉండకూడదు.. ఓ తండ్రి ఆవేదన ఇది
భువనేశ్వర్: ఒడిశా రైలు ప్రమాదం. తల్చుకుంటేనే ఒళ్లు జలదరించే ఘటన ఇది. ఈ ప్రమాదం కారణంగా ఎన్నో మధ్య తరగతి కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనలో సుమారు 288 మంది మరణించగా, 900 మంది గాయాలపాలై ఎక్కడెక్కడో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఓ పాఠశాల ఆవరణలో కుప్పలా పోసిన మృతదేహాలు పడి ఉన్నాయి. అందులోకి వెళ్లిన ఓ తండ్రి తన కొడుకు బతికే ఉన్నాడో లేడో తెలీక ఆ మృతదేహాల్లో వెతుకుతూ.. దేవుడా ఇందులో నా కొడుకు ఉండకూడదూ అని లోపల అనుకుంటూ వెతుక్కుంటూ కనిపించాడు. కుప్పల్లా మృతదేహాలు.. ఒడిశా బాలాసోర్ సమీపంలోని బహనగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాద దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఒక్కొక్కరిని కదుపుతుంటే దయనీయ ఘటనలే వినిపిస్తున్నాయి. ఓ తండ్రి పడే బాధకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ తండ్రి తన కొడుకు అక్కడ పడిఉన్న మృతదేహాల్లో ఉన్నాడేమో అని వెతుకుతున్నాడు. తీరా ఓ వ్యక్తి అక్కడికి వచ్చి..ఎవరి కోసం వెతుకుతున్నారు అని అడగ్గా.. నా కొడుకు. ఇదే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించాడు. బతికే ఉన్నాడో లేడో తెలీదు. బతికే ఉంటే నాకు ఫోన్ చేసేవాడు. ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది, తనకు ఏమైందో తెలియడం లేదు. ఒకవేళ చనిపోయాడేమో అని ఇక్కడ వెతుక్కుంటున్నాను. కానీ దొరకడంలేదు అంటూ కన్నీరుమున్నీరయ్యారు. కాగా ..శుక్రవారం సాయంత్రం సుమారు రాత్రి 7 గంటలకు జరిగిన విధ్వంసకర సంఘటనలో, ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ వద్ద 12841 షాలిమార్-కోరోమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టింది. బాలాసోర్ రైలు ప్రమాదంపై సంయుక్త తనిఖీ నివేదిక ప్రకారం, ప్రమాదానికి ప్రాథమిక కారణం సిగ్నల్ వైఫల్యంగా అధికారులు గుర్తించారు. This is heartbreaking 💔 A father looking for his son among the dead. 😔#OdishaTrainAccident pic.twitter.com/eZZDAO94BR — Ketofol☀️ (@aka911_) June 3, 2023 -
ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. ఏపీ సర్కార్ కీలక ప్రెస్‌మీట్
సాక్షి,విశాఖ: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విశాఖలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మల్లికార్జున, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్రెడ్డి నేతృతంలో సమీక్ష సమావేశం జరిగిందని.. ట్రైన్ ప్రమాదంలో క్షతగాత్రులను మృతులను తీసుకురావాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే మంత్రి అమర్నాథ్, ముగ్గురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను ఒరిస్సా పంపించారన్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీకి చెందిన వారు ఉన్నట్టుగా గుర్తించామన్నారు.వీరిలో విశాఖపట్నంలో దిగాల్సినవారు 309 మంది, రాజమండ్రిలో దిగాల్సినవారు 31, ఏలూరులో దిగాల్సినవారు 5 గురు, విజయవాడలో దిగాల్సిన వారు 137 మంది ఉన్నట్లు తెలిపారు. వీరందరి ఫోన్ నంబర్లకు ఫోన్లుచేసి వారిని ట్రేస్ చేస్తున్నామన్నారు. ప్రయాణికుల్లో 267 మంది సురక్షితంగా ఉండగా.. 20 మందికి స్వల్పంగా గాయాలు కాగా, 82 మంది ప్రయాణాలను రద్దుచేసుకున్నట్టు వెల్లడైనట్లు తెలిపారు. 113 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్ అయినట్లు భావిస్తున్నామని.. ప్రస్తుతం ఈ 113 మంది వివరాలను సేకరించడానికి ముమ్మరంగా చర్యలుచేపడుతున్నామన్నారు. (చదవండి: 'కన్న కొడుకు మృతదేహాన్ని చేతులతో మోస్తూ..' రైలు ప్రమాదంలో చెదిరిన మధ్యతరగతి కుటుంబాలెన్నో..) ఇదిలా ఉండగా హౌరా వెళ్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో రాష్ట్రం నుంచి 89 మంది రిజర్వేషన్లు చేసుకున్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. వారిలో విశాఖపట్నంలో 33 మంది, రాజమండ్రిలో 3, ఏలూరు నుంచి ఒక్కరు, విజయవాడ నుంచి 41, బాపట్లలో 8 , నెల్లూరు నుంచి 3 ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో 49 మంది సురక్షితంగా ఉన్నారని, స్వలంగా గాయాలు అయినవారు ఇద్దరు ఉన్నారని చెప్పారు. 10 మంది ట్రైను ఎక్కలేదని, 28 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్ అయినట్లు తెలిపారు. సీఎం ఆదేశాలు మేరకు ఇచ్చాపురం నుంచి బోర్డర్లో ఉన్న అన్ని హాస్పిటల్స్ ను సిద్ధం చేశామన్నారు.అన్ని కలెక్టరేట్లోను హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రం నుంచి మెడికల్ టీమ్స్ తో పాటు మొత్తంగా 65 అంబులెన్స కు పంపించినట్లు చెప్పారు. వీటితో పాటు విమానాశ్రయంలో ఒక చాపర్‌ను కూడా సిద్ధంగా ఉంచామని, అవసరమైతే నేవి సహకారం కూడా తీసుకోనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఏపీ నుంచి ఎవరు చనిపోయినట్లు సమాచారం లేదని గాయపడినట్లు మాత్రమే మాకు సమాచారం అందిందన్నారు. ఒరిస్సాలో కూడా మన వారికి వైద్యం అందించడానికి అన్ని చర్యలు చేపట్టామన్నారు. (చదవండి: ఎంత కష్టం వచ్చింది!.. చివరి సారిగా బస్సుకు ముద్దుపెట్టి) -
మాంచెస్టర్‌లో హైస్కూల్ టీచర్.. సంబల్‌పురీ చీరకట్టి సంబురంగా పరుగెట్టీ
మొన్నటికి మొన్న గ్వాలియర్‌లో... చీరె ధరించి ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు మహిళామణులు. తాజాగా... మాంచెస్టర్ మారథాన్‌లో చీరె ధరించి పాల్గొని ‘శభాష్’ అని ప్రశంసలు అందుకుంటోంది మధుస్మిత జెన... చిన్నప్పటి నుంచి మధుస్మితకు పరుగెత్తడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చింది. మాంచెస్టర్‌లో హైస్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న మధుస్మిత జెన నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్ ఒడియా కమ్యూనిటీలో క్రియాశీల కార్యకర్త. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మారథాన్లు, ఆల్ట్రా మారథాన్లలో పాల్గొంది. తాజాగా మాంచెస్టర్‌లో 42.5 కి.మీల మారథాన్‌లో పాల్గొంది. ఈసారి మాత్రం అందరూ ఆశ్చర్యపడేలా చేసింది. అభినందనలు అందుకుంది. ఈసారి ప్రత్యేకత...సంబల్‌పురీ చీర కట్టి మారథాన్‌లో పాల్గొంది మధుస్మిత. ‘అంతదూరం చీరతో పరుగెత్తడం సులువేమీ కాదు’ అంటున్న మధుస్మిత సంతోషం ప్లస్ సంకల్పబలంతో నాలుగు గంటల యాభైనిమిషాలలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ‘చీరతో మారథాన్‌లో పాల్గొనడం అసాధ్యం అనేది చాలామంది నమ్మకం. ఇది తప్పని రుజువు చేయాలనుకున్నాను’ అంటుంది 41 సంవత్సరాల మధుస్మిత. ‘తనలోని ప్రతిభతో ఎప్పుడూ ఎంతోమందికి స్మిత స్ఫూర్తి ఇస్తుంటుంది. ఆమె విజయానికి గర్విస్తున్నాం’ అంటున్నాడు ఒడియా కమ్యూనిటీ మాజీ కార్యదర్శి సుకాంత్ కుమార్ సాహు. ఒడిశాలోని కుస్పూర్ గ్రామానికి చెందిన మధుస్మితకు తల్లి, అమ్మల ద్వారా చీరెపై ఇష్టం ఏర్పడింది. ఇంగ్లాండ్‌లో ప్రత్యేకమైన సందర్భాలు, వేసవిలో చీర ధరిస్తుంది మధుస్మిత. -
జంగిల్ రాణి..పద్మిని మాఝీ: అడవిని చేరాలంటే ఆమెను దాటాలి
చేత గొడ్డలి కళ్లల్లో తీక్షణత ‘అడవికి నేను కాపలా’ అనే ప్రకటన. 65 ఏళ్ల పద్మిని మాఝీ ఒరిస్సాలో తన పల్లె చుట్టూ ఉన్న 100 హెక్టార్ల అడవిలో పుల్ల కూడా పోకుండా ఒక్క కొమ్మా తెగి పడకుండా కాపలా కాస్తోంది. కలప మాఫియా ఆమె దెబ్బకు తోక ముడిచింది. అందుకే ఆమెను ఆ ప్రాంతంలో జంగిల్ రాణి అని పిలుస్తుంటారు. ఉదయం ఆరూ ఆరున్నరకంతా పద్మిని మాఝీ ఇంటి పనులన్నీ అయిపోతాయి. ఆ తర్వాత ఆమె తన అసలైన ఇంటికి బయలుదేరుతుంది. అంటే దాపున ఉన్న అడవికి. అదే ఆమె రోజంతా గడిపే ఇల్లు. ఒరిస్సాలోని నౌపడా జిల్లాలో బిర్సింగ్పూర్ అని చిన్న పల్లె ఆమెది. ఆ పల్లెకు ఆనుకునే చిన్న కొండ. దాని చుట్టుపక్కల విస్తారమైన అడవి. అందులో చాలా విలువైన కలప చెట్లు, మందు మొక్కలు, అడవి పళ్లు అన్నీ దొరుకుతాయి. ‘మేము అడవి మీద ఆధారపడి బతుకుతాము. అడవిని నరికి, అడవిలో ఉండే జంతువులను చంపి కాదు’.. అంటుంది పద్మిని. కిరాసాగర్ మాఝీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ముప్పై ఏళ్ల క్రితం ఆ అడవి పక్క ఊరికి కోడలిగా వచ్చింది పద్మిని. అడవికి వెళ్లి వంట చెరుకు, తేనె, దుంపలు... ఇవన్నీ తెచ్చుకుని బతకడం తొందరగా నేర్చుకుంది. ‘కాని అడవిలో ఆ రోజుల్లో కలప దొంగలు విచ్చలవిడిగా తిరిగేవారు. వేటగాళ్లు ఉండేవారు. వారి వల్ల అడవి నాశనమవుతోందని నాకు అర్థమైంది. అడవి పచ్చగా ఉంటే మేము పచ్చగా ఉంటాము. అడవి ఉంటేనే వానలు పడతాయని మా నాన్న నా చిన్నప్పుడు చెప్పేవాడు. అందుకే అడవిని కాపాడాలనుకున్నా’ అంటుందామె. తనకు తానుగా వేసుకున్న ఈ డ్యూటీని పాతికేళ్లు గడిచినా ఆమె వదల్లేదు. రోజూ ఉదయం ఆరున్నరకంతా భుజాన గొడ్డలి వేసుకొని అడవిలోకి బయలుదేరుతుందామె. పుట్టి బుద్ధెరిగాక ఆమె చెప్పులు వేసుకోలేదు. ఇన్నాళ్లుగా ఆమె అడవిలో ఉత్త పాదాలతోనే తిరుగుతుంది. అడవిలోని ప్రతి అడుగు తెలిసినవారే ఉత్త పాదాలతో తిరగ్గలరు. అడవిని ఆమె ఐదారు భాగాలుగా చేసుకుంది. ఒకోరోజు ఒకో భాగంలో తిరుగుతుంది. దారిలో తనకు కనపడిన ఎండుపుల్లల్ని ఒకచోటకు చేరుస్తుంది. అడ్డంగా ఉన్న కొమ్మలను, తీగలను కొట్టి దారి చేస్తుంది. నిన్న ఉన్న అడవే ఇవాళా ఉందా అని చెక్ చేస్తుంది. ఇక పరాయి వ్యక్తి ఎవరైనా కనిపించాడో గొడ్డలి చేతికందుకుంటుంది. ‘మొదట వాణ్ణి భయపెడతాను. నన్ను చూడగానే చాలామంది పారిపోతారు. అడ్డం తిరిగితే పెద్దగా అరిచి సాయం వచ్చేలా చేస్తాను. ఊరి వాళ్లు ఎవరో ఒకరు అడవిలో తిరుగుతూనే ఉంటారు. వారొచ్చి పట్టుకుంటారు. ఊర్లోకి తీసుకెళ్లి వాణ్ణి కట్టేస్తాం. వాడు క్షమాపణలు చెప్పి మళ్లీ అడవి ముఖం చూడను అని ప్రమాణం చేస్తే వదిలేస్తాం. అడవిలో రోజూ నేను తిరుగుతానని ఎదురు పడతానని కలప దొంగలకు, వేటగాళ్లకు తెలిసిపోయింది. అందుకే రావడం మానేశారు. మా అడవి మాకు మిగిలింది’ అంటుంది పద్మిని. ఇన్నేళ్లుగా ఆమె ఒక పైసా ఎవరి నుంచి ఆశించకుండా, ఏ జీతం తీసుకోకుండా ఈ పని చేస్తున్నందు వల్ల ఊళ్లో పద్మిని అంటే చాలా గౌరవం. ఆమెను జంగిల్ రాణి అని పిలుస్తారు. ఫారెస్ట్ రేంజర్లు, గార్డులు ఆమె కనిపిస్తే గౌరవంగా మాట్లాడతారు. ‘నాకు జీతం ఎందుకు? ఇది ప్రతి మనిషి బాధ్యత’ అంటుంది మాఝీ. ఈ అడవి పచ్చగా ఉండటం వల్ల వీకెండ్స్‌లో విహారానికి వచ్చేవారి సంఖ్య ఎక్కువ. వారి ఆనందానికి కారణం ఒక బక్కపలుచని ఆదివాసి మహిళ అని వారికి తెలియకపోవచ్చు. ఇలాంటి తెలియని మహానుభావుల వల్లే మన దేశంలో ప్రకృతి ఈ మాత్రమైనా మిగిలి ఉంది. ఇలాంటి స్పూర్తిదాయక కథలు ఎంతో మందికి ఆదర్శనీయంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. పద్మిని మాఝీతో పాటు ఆమెలాంటి మహిళా మణులందరికీ ముందుగానే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!! నన్ను చూడగానే చాలామంది పారిపోతారు. అడ్డం తిరిగితే పెద్దగా అరిచి ఊరివాళ్లు సాయం వచ్చేలా చేస్తాను. ఊర్లోకి తీసుకెళ్లి వాణ్ణి కట్టేస్తాం. వాడు క్షమాపణలు చెప్పి మళ్లీ అడవి ముఖం చూడను అని ప్రమాణం చేస్తే వదిలేస్తాం. -
20 లక్షల వాహనాలు తుక్కు లోకి!
భువనేశ్వర్: రోడ్లపై రవాణాకు పట్టు కోల్పోయి, 15 ఏళ్లు పైబడిన 20 లక్షలకు పైగా వాహనాలను రద్దు చేయనున్నారు. రాష్ట్ర వాణిజ్య, రవాణాశాఖ మంత్రి టుకుని సాహు అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ పాలసీ–2022 ప్రకారం, వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి 20 లక్షలకు పైగా వాహనాలను దశల వారీగా రోడ్ల నుంచి తొలగిస్తామన్నారు. 15 ఏళ్లకు పైగా రవాణాలో ఉపయోగిస్తూ.. పట్టు కోల్పోయిన 20,39,500 వాహనాలను గుర్తించామన్నారు. రద్దు చేయనున్న వాహనాల్లో 12,99,351 ద్విచక్ర వాహనాలు ఉన్నాయని తెలిపారు. దీనికి సంబంధించి స్క్రాపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. డొక్కు వాహనాలు రద్దు చేయడంతో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం స్క్రాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. పాలసీ మార్గదర్శకాల ప్రకారం పాత వాహనాల యజమానులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రోత్సాహకాలు కూడా పొందుతారని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. చదవండి వైద్యుల నిర్లక్ష్యం.. ఆస్పత్రి ఎదుటే ప్రసవమైన మహిళ! -
మన్యం థెరిసా
‘ఆమె చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాలి’ అని ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇటీవల ట్విటర్లో కామెంట్ చేశారు. 75 ఏళ్ల రూపాలి జకాకాను రాయగడ జిల్లాలోని మన్యంప్రాంతంలో మన్యం థెరిసాగా పిలుచుకుంటారు. దానికి కారణం గవర్నమెంట్‌తో ఏ పని జరగాలన్నా ఈమె సాయం చేయాల్సిందే. మేము అడవిలో ఉంటాము గనుక అధికారులు వచ్చేవారు కాదు. నేనే రాయగడకు తిరిగి వారిని రప్పించేలా చేశాను. – జకాకా మన్యంలోని సాహి అనే గ్రామంలో చీకటి పడి భోజనాలు అయ్యాక ఒక్కొక్కరుగా రూపా లి జకాకా ఇంటికి చేరుకుంటారు. అక్కడ సభ తీరి తమ కష్టసుఖాలు చెప్పుకుంటారు. ఆమె అన్నీ వింటుంది. ఎవరికి ఏ సాయం కావాలో, ఏ పథకం ద్వారా సాయం అందించాలో జ్ఞాపకం పెట్టుకుంటుంది. తెల్లవారి లేచి ఇంట్లో పనులు ముగించుకుని ఊర్లో ఉన్న స్కూల్ దగ్గరకు వెళుతుంది. అక్కడి హెడ్మాస్టర్కు ఆమె ఏ పని మీద వచ్చిందో తెలుసు. ఒక్కొక్కరి పేరు ఆమె చెబుతుంటే వారి పేరుతో అప్లికేషన్లు రాసి సహాయం చేస్తాడు. ఆమె వాటిని అధికారులకు చేరవేయడానికి బయలుదేరుతుంది. దాదాపుగా ఇది ఆమె దినచర్య.ఒరిస్సా రాయగడ జిల్లాలోని హలువా పంచాయతీలో సాహితో సహా 18 గ్రామాలు ఉన్నాయి. అన్నీ ఆదివాసీ గ్రామాలే. పెద్ద వాళ్లంతా దాదాపుగా నిరక్షరాస్యులే. వారందరి సమస్యలు తీర్చే స్వచ్ఛంద కార్యకర్త రూపా లి జకాకా. భర్త మరణంతో రూపా లి జకాకాకు 35 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె భర్త అంతర్ జకాకాకు జబ్బు చేసింది. హలువాలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో చేతనైన వైద్యం చేశారుగాని అది సరిపోలేదు. ఇంతకు మించి వైద్యం చేయాలంటే రాయగడ వెళ్లాలి. ఉచిత వైద్యం పొందాలి. అది ఎలాగో చెప్పమని వారినీ వీరినీ బతిమాలింది. ఎవరూ సాయం చేయలేదు. భర్త మరణించాడు. కూతురితో జకాకా మిగిలింది. ‘మన బతుకులు ఇంతేనమ్మా. దిక్కులేని బతుకులు. వీరి కోసం ఏదైనా చేయి నువ్వు’ అని ముసలి తండ్రి అన్నాడు. ఆ మాటలు జకాకా మీద పని చేశాయి. అప్పటికి ఆమె వంట చెరకు సేకరించి అమ్మి బతుకుతోంది. ఇల్లు కూడా సరిగా లేదు. అయినా సరే తన బాగు చూసుకోక అందరి కోసం పని చేయడం మొదలుపెట్టింది. గత 40 ఏళ్లుగా చేస్తూనే ఉంది. ప్రభుత్వం ప్రజల కోసం, ఆదివాసీల కోసం ఏమేం పథకాలు నిర్వహిస్తోందో కనుక్కుని అవన్నీ అందేలా సాయం చేస్తోంది జకాకా. ‘మేము అడవిలో ఉంటాము గనుక అధికారులు వచ్చేవారు కాదు. నేనే రాయగడకు తిరిగి వారిని రప్పించేలా చేశాను’ అంటుంది జకాకా. పథకాలు అందాలంటే డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ చాలా ముఖ్యమని ఆమె తెలుసుకుంది. అందుకే తన పంచాయతీలో చావు, పుట్టుక జరిగితే సర్టిఫికెట్లు తీసుకోమని వెంట పడుతుంది. అవి వచ్చేలా చూసి వారి కుటుంబ సభ్యులకు వాటిని అందిస్తుంది. 5000 మందికి సాయం ఇంత వయసు వచ్చినా జకాకాలో చరుకుదనం పోలేదు. ఎంత దూరమైనా నడుస్తుంది. కంటి చూపుకు ఢోకా లేదు. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఊళ్లోనో చుట్టుపక్కల పల్లెల్లోనో తిరుగుతూనే ఉంటుంది. ఇప్పటికి ఆమె 5000 మందికి సాయం అందించినట్టు అధికారులే లెక్క తేల్చడం కాదు... ఇటీవల రాయగడకు పిలిచి సన్మానం కూడా చేశారు. ఒరిస్సా ముఖ్యమంత్రి ఆమెను మెచ్చుకుంటూ ట్వీట్ చేసి ‘ప్రజల కోసం ఉద్దేశించిన పథకాలు అట్టడుగు స్థాయికి చేరాలంటే ఇటువంటి వారు చేసే కృషి స్ఫూర్తి కావాలి’ అన్నారు. జకాకా ఇప్పుడు తన కూతురు, మనవరాలు, మనవడితో కలిసి జీవిస్తోంది. పంట పొలాల్లో పని ఉంటే చేస్తోంది. అధికారులు ఆమెకు 20 కేజీల బియ్యం, 500 రూపా యల నగదు ప్రతి నెలా అందేలా శాంక్షన్ చేశారు. ఇప్పటికీ ఆమె ఇల్లు అంతంత మాత్రంగానే ఉంది. అయినా సరే తన కోసం కాకుండా ఊరి జనాల కోసం ఆమె తిరుగుతూనే ఉంటుంది. సాటి వారికి సాయం చేయడంలో సంతృప్తే ఆమెకు సంజీవనిలా పని చేస్తున్నట్టుంది. -
వేలెడంత సైజు.. వండుకుని తింటే.. ఆ టెస్టే వేరు!
సహజ నీటి వనరుల్లో పెరిగే 2 అంగుళాల మెత్తళ్లు (ఆంగ్లంలో ‘మోల’ (Amblypharyngodon mola) వంటి చిరు చేపలను తినే అలవాటు ఆసియా దేశాల్లో చిరకాలంగా ఉంది. ఎండబెట్టిన మెత్తళ్లను నిల్వ చేసుకొని ఏడాదంతా తింటూ ఉంటారు. ఈ చిరు చేపల్లో అద్భుతమైన సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉండటంతో పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో వీటి పాత్ర విశిష్టమైనది. అయితే, వీటి సైజు వేలెడంతే ఉండటం వల్ల కృత్రిమ విత్తనోత్పత్తి ఇన్నాళ్లూ అసాధ్యంగా మిగిలిపోయింది. అయితే, ఈ పెనుసవాలును శాస్త్రవేత్తలు ఇటీవలే ఛేదించారు. చేపల విత్తనోత్పత్తి రంగంలో ఇది పెద్ద ముందడుగని చెప్పచ్చు. జర్మనీకి చెందిన స్వచ్ఛంద సంస్థ జి.ఐ.జడ్. ఆర్థిక తోడ్పాటుతో ‘వరల్డ్‌ఫిష్’ సంస్థ శాస్త్రవేత్తలు మన దేశంలో మెత్తళ్ల విత్తనోత్పత్తికి సులభమైన సాంకేతిక పద్ధతులను రూపొందించడంలో కొద్ది నెలల క్రితం ఘనవిజయం సాధించారు. దీంతో మెత్తళ్లు, తదితర చిరు చేపలను మంచినీటి చెరువుల్లో సాగు చేసుకునే అవకాశం విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. నేచురల్ సూపర్ ఫుడ్స్ భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో ప్రజల్లో సూక్ష్మపోషకాల లోపాన్ని ఆహారం ద్వారా సహజమైన రీతిలో అధిగమించేందుకు ఇదొక సువర్ణ అవకాశంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు, ఎషెన్షియల్ ఫాటీ ఆసిడ్స్ కలిగి ఉండే మెత్తళ్లు నేచురల్ సూపర్ ఫుడ్స్ అని వరల్డ్‌ఫిష్ అభివర్ణించింది. పౌష్టికాహార లోపంతో మన దేశంలో 36% మంది పిల్లలు వయసుకు తగినంతగా ఎదగటం లేదు. 32% మంది తక్కువ బరువు ఉన్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెబుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి మెత్తళ్లు భేషుగ్గా ఉపయోగపడుతాయని ‘వరల్డ్‌ఫిష్’ చెబుతోంది. విటమిన్ ఎ లోపం వల్ల వచ్చే కంటి జబ్బులు, చర్మ వ్యాధులు మెత్తళ్లు తింటే తగ్గిపోతాయి. ఈ చిరు చేపల్లో ఐరన్, జింక్, కాల్షియం, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, అమినో యాసిడ్స్ ఉన్నాయి. పిల్లలు, గర్భిణీ స్త్రీలను పీడించే సూక్ష్మపోషక లోపాలు మెత్తళ్లను తింటే తగ్గిపోతాయి. 70 లక్షల సీడ్ ఉత్పత్తి అధిక పోషకాలున్న మెత్తళ్లు వంటి చిరు చేపల సాగు ప్రోత్సాహానికి ఒడిషా, అస్సాం రాష్ట్రాల్లో, బంగ్లాదేశ్‌లో వరల్డ్‌ఫిష్ సంస్థ గత దశాబ్దకాలంగా కృషి చేస్తోంది. ఒడిషాలోని జగత్సింగ్పూర్ జిల్లాలో గల బిశ్వాల్ ఆక్వాటెక్ హేచరీతో కలిసి వరల్డ్‌ఫిష్ చేసిన పరిశోధనలు ఫలించాయి. ఇండ్యూస్డ్ బ్రీడింగ్ టెక్నిక్ ద్వారా మెత్తళ్ల సీడ్ ఉత్పత్తిలో అవరోధాలను 2022 జూన్‌లో అధిగమించటం విశేషం. 70 లక్షల మెత్తళ్లు సీడ్‌ను ఉత్పత్తి చేయగలిగారు. ప్రత్యేకంగా నిర్మించిన చిన్న చెరువుల్లో ఆక్సిజన్‌తో కూడిన నీటిని ఎయిరేషన్ టవర్ ద్వారా అందిస్తూ ప్రయోగాలు చేశారు. ఆ నీటిలో గుడ్ల నుంచి వెలువడిన చిరుపిల్లలు చక్కగా బతికాయి. గుడ్డు నుంచి బయటికి వచ్చిన 3–4 రోజుల్లోనే అతిచిన్న పిల్లలు అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. వీటిని కొద్ది రోజులు నర్సరీ చెరువుల్లో పెంచి తర్వాత సాధారణ చేపల చెరువుల్లోకి మార్చాల్సి ఉంటుంది. తొలి విడత మెత్తళ్లు పిల్లలను ఒడిషా రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలకు అందించారు. మెత్తళ్ల చేప పిల్లలను తెలుగు రాష్ట్రాల్లోనూ చేపల రైతులకు, మహిళా బృందాలకు అందుబాటులోకి తేవాలి. నగరాల్లో/గ్రామాల్లో ఇంటిపంటలు /మిద్దె తోటల సాగుదారులకు కూడా మెత్తళ్లు చేప పిల్లలను అందించాలి. ప్రజలకు పౌష్టికాహార భద్రతను చేకూర్చడంలో చిరు చేపలు ఎంతగానో దోహదపడతాయి. మెత్తళ్ల చేప పిల్లలను ఒక్కసారి వేస్తే చాలు! ‘మోల’ చేపలు చూపుడు వేలంత పొడవుండే అద్భుత పోషకాల గనులు.. వీటిని మనం మెత్తళ్లు /పిత్త పరిగెలు /కొడిపెలు /ఈర్నాలు అని పిలుచుకుంటున్నాం . ► గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని, రక్తహీనతను, రేచీకటిని పారదోలే వజ్రాయుధాలు అ చిరుచేపలు. ► మంచినీటి ఆక్వా చెరువుల్లో బొచ్చె, రాగండి, మోసు, శీలావతి వంటి పెద్ద చేపలతో కలిపి లేదా విడిగానూ ఈ చిరుచేపలను సునాయాసంగా సాగు చేయొచ్చు. ► గ్రామ చెరువులు, కుంటల్లో, పెరటి తోటల్లోని తొట్లలో, మిద్దెల పైన ఫైబర్ టబ్లలోనూ ఎంచక్కా చిరు చేపలను పెంచుకోవచ్చు. ► వానాకాలంలో వాగులు, వంకల్లో కనిపించే సహజ దేశవాళీ చేపలివి. ► మెత్తళ్లు చేప తన సంతతిని తనంతట తానే(సెల్ఫ్ బ్రీడర్) వృద్ధి చేసుకుంటుంది.. ఈ చేప పిల్లలను ఒక్కసారి చెరువులో/తొట్లలో వేసుకుంటే చాలు.. నిరంతరం సంతతి పెరుగుతూనే ఉంటుంది. ► ప్రతి 10–15 రోజులకోసారి వేలెడంత సైజుకు పెరిగిన చేపలను పెరిగినట్లు పట్టుబడి చేసి వండుకు తినొచ్చు. ► వాణిజ్య స్థాయిలో పెంపకం చేపట్టి స్థానిక మార్కెట్లలో అమ్ముకొని ఆదాయం కూడా పొందవచ్చు. ► మగ చేపలు 5.0–5.5 సెం.మీ. (2 అంగుళాలు) పొడవు, ఆడ చేపలు 6.0–6.5 సెం.మీ. పొడవు పెరిగేటప్పటికి పరిపక్వత చెందుతాయి. ఆ దశలో పట్టుబడి చేసి వండుకొని తినొచ్చు. ఎండబెట్టుకొని దాచుకోవచ్చు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యలో ఈ చేపల్లో సంతానోత్పత్తి జరుగుతుందని కేంద్రీయ మత్స్య విద్యా సంస్థ (సి.ఐ.ఎఫ్.ఇ.) ఎమిరిటస్ సైంటిస్ట్ డాక్టర్ అప్పిడి కృష్ణారెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. నిజానికి, మెత్తళ్ల విత్తనోత్పత్తి ఆవశ్యకత గురించి ఆయన రాసిన వ్యాసాన్ని ‘సాక్షి సాగుబడి’ ఐదేళ్ల క్రితమే ప్రచురించింది. (క్లిక్ చేయండి: నల్ల తామరను జయించిన దుర్గాడ) -
తెలుగు–ఒడియా అనువాద వారధి
ఫకీర్ మోహన్ సేనాపతితో మొదలైన ఆధునిక ఒడియా సాహిత్యం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త ధోరణులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటోంది. సమాజంలోని విభిన్న వర్గాల గొంతులను ప్రతిధ్వనిస్తోంది. ఇదివర కటితో పోల్చుకుంటే, ఒడియా రచయితలు అనువాదాలపై మరింతగా దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు భాషల్లో వెలువడిన సాహిత్యాన్ని ఒడియాలోకి అనువదించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆధునిక ఒడియా సాహిత్య రంగంలో ఇదొక మేలి మలుపు. బరంపురంలో డిసెంబర్ 24, 25 తేదీలలో కేంద్ర సాహిత్య అకాడమీ సౌజన్యంతో జరిగిన ‘వికాసం’ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు ఒడియా రచయితలు అనువాదాలు మరింత విస్తృతంగా జరగాల్సి ఉందని అన్నారు. ‘రాజకీయాలు మనుషులను విడగొడితే, సాహిత్యం మనుషులను చేరువ చేస్తుంది. పరస్పర అనువాదాల వల్ల భాషా సంస్కృ తుల మధ్య, మనుషుల మధ్య మరింతగా సఖ్యత ఏర్పడుతుంది’ అని ప్రముఖ ఒడియా పాత్రికేయుడు, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడు గౌరహరి దాస్ అభిప్రాయపడటం విశేషం. ఆయన కథలను ‘గౌరహరి దాస్ కథలు’ పేరిట కెవీవీఎస్ మూర్తి తెలుగులోకి అనువదించారు. ‘వికాసం’ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లోనే ఈ అనువాద సంపుటి ఆవిష్కరణ కూడా జరిగింది. డిజిటల్ మీడియా వ్యాప్తి ఎంతగా పెరిగినా, ఒడియాలో ముద్రిత పత్రికలకూ ఆదరణ తగ్గకపోవడం మరో విశేషం. గౌరహరి దాస్ సంపాదకత్వంలోని ‘కథ’ మాసపత్రిక ఒడిశాలోనూ, ఒడిశా వెలుపల కూడా మంచి పాఠకాదరణ పొందుతోంది. కేవలం కథానికలను ప్రచురించే ఇలాంటి సాహితీ పత్రికేదీ మన తెలుగులో లేకపోవడం విచారకరం. ‘కథ’ మాసపత్రికను అత్యధిక జనాదరణ గల దినపత్రిక ఒడియా ‘సంబాద్’ ప్రచురిస్తోంది. ఇదే కాకుండా, ఒడిశాలో ‘కాదంబిని’, ‘ఆహ్వాన్’, ‘ఒడియా సాహిత్య’, ‘ప్రేరణ’ వంటి పత్రికలు సాహిత్యానికి పెద్దపీట వేస్తున్నాయి. ఇవి అనువాద సాహిత్యానికి కూడా పెద్దపీట వేస్తున్నాయి. ఇక ‘కరోనా’ కాలంలో తెలుగులో మనకు ఉన్న వారపత్రికలు కూడా మూతబడ్డాయి. ఒడియాలో అనువాద సాహిత్యానికి అక్కడి పత్రికలు బాసటగా నిలుస్తుంటే, మనకు అలాంటి పత్రికలే ఇక్కడ కరవయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే, ఒడిశా వెనుకబడిన రాష్ట్రమే అయినా, సాహితీరంగంలో మాత్రం ముందంజలో ఉందనే చెప్పుకోవాలి. ఇతర భాషల సంగతి పక్కనపెడితే, తెలుగు నుంచి ఒడియాలోకి అనువాదాలు ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే వస్తున్నాయి. బరంపురానికి చెందిన కడి రామయ్య వేమన పద్యాలను దాదాపు మూడు దశాబ్దాల కిందటే ఒడియాలోకి అనువదించారు. ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ నవల ‘హృదయ నేత్రి’ని రఘునాథ్ పాఢి శర్మ ఒడియాలోకి అదే పేరుతో అనువదించారు. ఇది ఒడియాలోనూ మంచి పాఠకాదరణ పొందింది. వేంపల్లి గంగాధర్ రాసిన ‘ఆగ్రా టాంగా’ను ‘ఆగ్రారొ టాంగావాలా’ పేరిట అంజలీ దాస్ అనువదించారు. తెలుగు నుంచి ఒడియాలోకి విరివిగా అనువాదాలు సాగిస్తున్న వారిలో బంగాళీ నంద ప్రముఖుడు. ఉభయ భాషలూ ఎరిగిన ఒడియా రచయిత బంగాళీ నంద నేరుగా తెలుగు నుంచి ఒడియాలోకి అనువాదాలు సాగిస్తుండటం విశేషం. శివారెడ్డి, ఎన్.గోపి, ఓల్గా తదితరుల రచనలను ఆయన అనువదించారు. వీటిలో పలు పుస్తకాలను సాహిత్య అకాడమీ ప్రచురించింది. బరంపురానికి చెందిన ఉపద్రష్ట అనూరాధ పలు తెలుగు రచనలను ఒడియాలోకి అనువదించడమే కాకుండా, సుప్రసిద్ధ ఒడియా రచయిత మనోజ్ దాస్ కథలను, పలు ఇతర ఒడియా రచనలను తెలుగులోకి తీసుకొచ్చారు. ఉభయ భాషల్లోనూ ఆమె అనువాదాలు పాఠకాదరణ పొందాయి. కళింగ సీమలో చాగంటి తులసి కూడా విరివిగా అనువాదాలు చేశారు. ‘వికాసం’ కార్యదర్శి రవిశర్మ ఇటీవల అరణ్యకృష్ణ కవితలను తెలుగు నుంచి ఒడియాలోకి అనువదించారు. ఉభయ భాషల్లోని కొత్తతరం రచయితలు, కవులు విరివిగా అనువాదాలు చేస్తున్నట్లయితే, ఒకరి సాహిత్యం మరొకరికి చేరువ కావడమే కాకుండా, ఉభయ భాషల ప్రజల మధ్య సాన్నిహిత్యం కూడా మరింత పెరుగుతుందని ఆశించవచ్చు. (క్లిక్ చేయండి: ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..) – పన్యాల జగన్నాథదాసు, కవి, సీనియర్ జర్నలిస్టు -
కళింగసీమలో స్వర్ణోత్సవ ‘వికాసం’
తెలుగునేలకు వెలుపల ఒడిశా రాష్ట్రంలోని బరంపురంలో ఆవిర్భవించిన తెలుగు సాహితీ సంస్థ ‘వికాసం’ స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. ఈ సంస్థ పూర్తిపేరు ‘వికాసాంధ్ర సాహితీ సాంస్కృ తిక సంవేదిక’. ప్రముఖ రచయిత అవసరాల రామకృష్ణారావు అధ్యక్షతన 1970 నవంబర్ 14న ‘వికాసం’ ఆవిర్భవించింది. అవసరాల అధ్యక్షునిగా ఉన్నకాలంలోనే ‘మనం మనం బరంపురం’ కథా సంకలనాన్ని ‘వికాసం’ వెలువరించింది. అవసరాల విశాఖకు తరలిపోయాక, రష్యా నుంచి స్వస్థలమైన బరంపురం తిరిగి వచ్చేసిన డాక్టర్ ఉప్పల లక్ష్మణరావు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ‘వికాసం’లో ఉన్నకాలంలోనే ఆయన ‘అతడు–ఆమె’ నవలను పూర్తిచేశారు. ఉప్పల లక్ష్మణరావు సారథ్యంలో ‘వికాసం’ ఆదర్శప్రాయమైన సాహితీ సంస్థగా రూపుదిద్దుకుంది. ‘వికాసం’ మలిప్రచురణ ‘ఉండండుండండి’ కవితా సంపుటి పురిపండా అప్పలస్వామి సంపాద కత్వంలో వెలువడింది. బి.ఎల్.ఎన్.స్వామి, తాతిరాజు వెంకటేశ్వర్లు, సేతుపతి ఆదినారాయణ, మండపాక కామేశ్వరరావు, గరికిపాటి దేవదాసు, మురళీమోహన్, దేవరాజు రవి, వై.ఎన్.జగదీశ్, బచ్చు దేవి సుభ్రదామణి, పోతాప్రగడ ఉమాదేవి, సుశీల తదిత రులు తొలితరం సభ్యులు. ‘వికాసం’ సభ్యులు విజయచంద్ర, దేవరకొండ సహదేవ రావు, రమేష్‌రాజు తదితరులు కొంతకాలం ‘స్పృహ’ సాహితీ పత్రికను నడిపారు. శ్రీశ్రీ ఆవిష్కరించిన ఈ పత్రిక రెండున్నరేళ్ల పాటు కళింగాంధ్ర రచయితలకు వేదికగా నిలిచింది. కాళోజీ, శివారెడ్డి, నందిని సిధారెడ్డి, వంగపండు ప్రసాద్ తదితర కవి ప్రముఖులు ‘స్పృహ’ కార్యాలయాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ‘వికాసం’ అనేక సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. ఎందరో సాహితీ ప్రముఖులను బరంపురానికి ఆహ్వానించింది. ‘వికాసం’ వారం వారం సాహితీ సమావేశాలతో పాటు ‘నెలనెలా వెన్నెల’ క్రమం తప్పకుండా నిర్వహించేది. ఇందులో ఎందరో స్థానిక ఔత్సాహిక కవులు, రచయితలు పాల్గొని స్వీయరచనలను వినిపించేవారు. ప్రస్తుతం ప్రతినెలా కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితులు లేకున్నా, సాధ్యమైనంత విరివిగానే తన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బరంపురంలోని ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజం, ఆంధ్ర సంస్కృతీ సమితి తదితర సంస్థలతో కలసి మెలసి పనిచేస్తోంది. ఒడిశాలో తెలుగు చదువులు పూర్తిగా కనుమరుగవుతున్న పరిస్థితుల్లోనూ ‘వికాసం’ యాభయ్యేళ్లుగా తన ఉనికిని నిలుపుకొంటూ రావడం విశేషం. ‘వికాసం’ స్వర్ణోత్సవాలు డాక్టర్ దేవరకొండ సహదేవరావు అధ్యక్షతన డిసెంబర్ 24, 25 తేదీల్లో బరంపురం ఆంధ్రభాషాభివర్ధనీ సమాజం ప్రకాశం హాలులో జరగనున్నాయి. శివారెడ్డి, వాసిరెడ్డి నవీన్, భూసురపల్లి వెంకటేశ్వర్లు, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అట్టాడ అప్పల నాయుడు, ఒడియా సాహితీవేత్తలు బంగాళి నందా, గౌరహరి దాస్ పాల్గొననున్నారు. ఇందులో కెవీవీఎస్ మూర్తి అనువదించిన ‘గౌరహరిదాస్ కథలు’, రొక్కం కామేశ్వరరావు ‘ముఖారి’ కవితా సంపు టితో పాటు, అంతర్ముగం (తమిళ అనువాదం), అంతర్ముఖ్ (హిందీ అనువాదం), ‘జ్ఞానా మృత్’ (హిందీ అనువాదం), ఇన్నర్ విజన్ (ఇంగ్లిష్ అనువాదం), పి. ఉమాదేవి ‘ఉమాదేవి సాహితీ సుమాలు’, విజయచంద్ర కవితల ఇంగ్లిష్ అనువాదం ‘విండ్స్ ఆర్ అలైవ్’, వరదా నర సింహారావు ‘కన్యాశుల్కం నాటకం: స్త్రీల స్థితిగతులు’, ‘మనం మనం బరంపురం’ రెండో ప్రచురణ, పన్యాల జగన్నాథ దాసు తొలి కవితా సంపుటి ‘ఏడో రుతువు కోసం’ విడుదల కానున్నాయి. – పన్యాల జగన్నాథ దాసు, సీనియర్ జర్నలిస్ట్ -
రష్యా పౌరుడి అనుమానాస్పద మృతి.. వాళ్లిదరూ ఒకే గదిలో..
రాయగడ(భువనేశ్వర్): పట్టణంలోని సాయి ఇంటర్నేషనల్ హోటల్లో ఓ విదేశీయుడి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మృతుడు రష్యాకు చెందిన వ్లాదిమర్ బిదానోబ్(61)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్డీపీఓ దేవజ్యోతి దాస్ ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే... ఈనెల 21న రష్యాకు చెందిన నలుగురు పర్యాటకులు ఒడిశాలోని దారింగిబడి నుంచి రాయగడలో పర్యటించేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారి వెంట వచ్చిన గైడ్ స్థానిక సాయి ఇంటర్నేషనల్ హోటల్లో వసతి సౌకర్యం కల్పించారు. గురువారం రాత్రి వ్లాదిమర్‌తో పాటు అతనితో వచ్చిన మరో విదేశీయుడు కలిసి ఒకే గదిలో మద్యం సేవించారు. అయితే తెల్లవారు లేచి చూసేసరికి వ్లాదిమర్ మృతి చెందడంతో హోటల్ మేనేజర్‌కు విషయాన్ని తెలియజేశారు. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అతిగా మద్యం సేవించడమే మృతికి కారణమా? లేదా ఇంకేమైనా జరిగి ఉంటుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఎస్డీపీఓ దాస్ మీడియాతో మాట్లాడుతూ విదేశీయుడి మృతికి సంబంధించి నియమాల ప్రకారం సమాచారాన్ని రష్యా రాయబార కార్యాలయానికి విషయం చేరవేశామని తెలిపారు. మృతునికి ఒక కుమారుడు ఉన్నట్ల తెలిసిందని, మిగతా సమాచారం అందాల్సి ఉందని వివరించారు. చదవండి: షాకింగ్ ఘటన.. పారిపోయిన అల్లుడు.. అసలేం జరిగింది? -
అంతవరకు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు.. సడన్‌గా వారి మధ్య..
రాయగడ: అంతవరకు సరదాగా కబుర్లు చెప్పుకున్న స్నేహితులు మధ్య మాటామాటా పెరిగింది. మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ప్రాణాలు తీసేవరకు వెళ్లింది. జిల్లాలోని అంబోదల పోలీస్ స్టేషన్ పరిధి గడియాఖాల్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గడియాఖాల్ గ్రామానికి చెందిన లుసిలి మాఝి(25), కిర్జో మాఝి(26) స్నేహితులు. శనివారం ఉదయం కూలి పనులకు వెళ్లి, తిరిగి వస్తూ అలవాడు ప్రకారం ఈత కళ్లు తెచ్చుకొని పొలం సమీపంలో తాగుతున్నారు. ఇంతలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన లుసిలి.. ఒక కర్ర సాయంతో కిర్జోపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన కిర్జో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని, నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. చదవండి: మాయలేడి: సోషల్ మీడియాలో యువకులకు వల.. నమ్మించి జేబు ఖాళీ -
అంతర్జాతీయ సైకత శిల్పకళోత్సవం; ఏపీకి ఫస్ట్ ప్రైజ్
సాక్షి, కోణార్క్: అంతర్జాతీయ సైకత శిల్పకళోత్సవం –2022లో ఆంధ్రప్రదేశ్ విజేతగా నిలిచింది. ఒడిశాలోని కోణార్క్ చంద్రభాగా బీచ్‌లో ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు జరిగిన పోటీల్లో ఏపీ తరపున ప్రాతినిథ్యం వహించిన ఆకునూరు బాలాజీ వరప్రసాద్ ప్రథమ స్థానం దక్కించుకున్నారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ చేతుల మీదుగా ఆయన.. పతకం, ప్రశంసాపత్రం అందుకున్నారు. ఐదు రోజుల పాటు జరిగిన పోటీల్లో వైవిధ్యమైన ఇసుక శిల్పాలతో బాలాజీ వరప్రసాద్ అందరినీ ఆకట్టుకున్నారు. ఒడిశా టూరిజం- కల్చర్, హాకీ వరల్డ్‌కప్ - 2023, భారతీయ సంస్కృతి- పండుగలు, ప్రపంచ శాంతి ఇతివృత్తాలతో సైకత శిల్పాలను తయారు చేశారు. పోటీదారులందరి కంటే మిన్నగా అద్భుత శిల్పాలను తయారు చేసి మొదటి బహుమతి సాధించారు. కాగా, 2018లో జరిగిన అంతర్జాతీయ సైకత కళా పోటీల్లోనూ ప్రథమ బహుమతి సాధించడం విశేషం. సంతోషంగా ఉంది: బాలాజీ వరప్రసాద్ అంతర్జాతీయ సైకత శిల్పకళోత్సవంలో విజేతగా నిలవడం పట్ల బాలాజీ వరప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రం తరపున భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తానన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. ప్రభుత్వం తోడ్పాటు అందించాలని ఆయన కోరుకుంటున్నారు. (క్లిక్ చేయండి: ఆరు గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు..) -
Akunuru Balaji Varaprasad: శాండ్ ఆర్టిస్ట్‌గా అంతర్జాతీయ ఖ్యాతి
సాక్షి, అమరావతి: ఇసుక రేణువులను మునివేళ్లతో తాకుతూ.. అద్భుత శిల్పాలు చెక్కుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు ఏలూరు జిల్లా కైకలూరు మండలం పల్లెవాడకు చెందిన ఆకునూరు బాలాజీ వరప్రసాద్. ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు ఒడిశాలోని కోణార్క్ చంద్రభాగా బీచ్‌లో జరుగుతున్న ‘అంతర్జాతీయ సైకత శిల్పకళోత్సవం –2022’ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొంటున్నాడు. చిత్రకళా పోటీల్లో చిన్ననాటి నుంచే అనేక బహుమతులు అందుకున్న బాలాజీ ఆ కళపై ఆసక్తి పెంచుకున్నాడు. డిగ్రీ చదివే రోజుల్లో సముద్ర తీరంలో స్నేహితులతో కలిసి ఇసుకతో ‘మత్స్య సుందరి’ పేరిట సైకత శిల్పాన్ని రూపొందించడం, అది పత్రికల్లో ప్రచురణ కావడంతో శాండ్ ఆర్ట్‌పైకి దృష్టి మరల్చాడు. ఎంతో సాధన చేసి సైకత శిల్పిగా, పోర్ర్‌టైట్ ఆర్టిస్ట్‌గా, స్పీడ్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు. సైకత కథలకు విశేష స్పందన భారతీయ ఇసుక శిల్పిగా, యానిమేషన్, కథకుడిగా బాలాజీ రూపొందించిన అనేక సైకత శిల్పాలు, సైకతరూపక కథలకు విశేష స్పందన లభిస్తోంది. వాటిని వీడియోలుగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ప్రజలు వీక్షిస్తున్నారు. ఇప్పటివరకు రెండు అంతర్జాతీయ అవార్డులు, 8 జాతీయ అవార్డులు, రెండు పురస్కారాలు (ఉగాది, విశిష్ట వ్యక్తి పురస్కారం), రెండు ప్రపంచ రికార్డులు (అద్భుత ప్రపంచం, మేధావి ప్రపంచ రికార్డులు) సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా అనేక అంశాలపై 250కి పైగా ఇసుక శిల్పాలను చెక్కి ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. (క్లిక్: పిల్లలను లాలిస్తూ పాడిన పాటే.. బాధను మరిపిస్తోంది!) ఇసుక రేణువులతో చైతన్యం చిన్నప్పటి నుంచి డ్రాయింగ్, పెయింటింగ్, కాన్వాసింగ్‌పై మక్కువతో అనేక ప్రయోగాలు చేశాను. సైకత శిల్పాల సృష్టిలోనూ పట్టు సాధించాను. ఎటువంటి సంగీతం, ఇతర పరికరాలు అవసరం లేకుండానే ఇసుక శిల్పాలతో ప్రజలకు అతి తేలిగ్గా అర్థమయ్యే రీతిలో అంశాలను ప్రదర్శిస్తున్నాను. 2018లో జరిగిన అంతర్జాతీయ సైకత కళా పోటీల్లో 28 దేశాల నుంచి 104 మంది సైకత శిల్పులు పాల్గొనగా.. అంతర్జాతీయ ప్రథమ బహుమతి సాధించడం నా జీవితంలో మరిచిపోలేను. ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో జరుగుతున్న అంతర్జాతీయ పోటీల్లో కచ్చితంగా బహుమతి సాధించాలనే పట్టుదలతో సైకత శిల్పాన్ని రూపొందిస్తున్నాను. – ఆకునూరి బాలాజీ వరప్రసాద్, సైకత శిల్పి -
లోయలు.. సొరంగాల్లోంచి ప్రయాణం.. సూపర్ లొకేషన్స్.. ఎక్కడంటే!
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అద్భుతమైన ప్రకృతి అందాలు, ఎత్తయిన, పచ్చని కొండలు, వీటిని మించి మరపురాని సొరంగ మార్గాల ద్వారా ప్రయాణాన్ని ఆస్వాదించాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం.. మన పక్కనే ఉన్న ఒడిశాలోని కోరాపుట్‌కు వెళ్తే చాలు.. ఈ అనుభూతులన్నీ మీ సొంతమతాయి. అవేమిటో.. ఈ రూట్ విశేషాలను పర్యాటక ప్రేమికుల కోసం ప్రత్యేకం.. కే–ఆర్ (కోరాపుట్–రాయగడ) రైల్వే లైన్ వాల్తేర్ డివిజన్‌కు ప్రధానంగా ఆదాయాన్నిచ్చే కిరండూల్, బచేలిలో ఉన్న ఐరన్ ఓర్ రవాణా మార్గానికి ప్రత్యామ్నాయంగా వేరే లైన్‌ను ఏర్పాటుచేసి ఈ సరకు రవాణాను మరింతగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశ్యంతో 1980లలో కోరాపుట్ – రాయగడ (కే–ఆర్) లైన్‌ను ప్రారంభించగా.. 1993–92మధ్య ఈ లైన్ పూర్తయింది. నాటి ప్రధాని పీవీ నరసింహారావు 1995 అక్టోబర్ 31న ప్రారంభించారు. కోరాపుట్ నుంచి రాయగడకు మొత్తం 167 కిలోమిటర్ల మేర ఈ లైన్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో మొత్తం 36 సొరంగాలు, 76 ప్రధాన వంతెనలు, 180 అందమైన మలుపులు ఉన్నాయి. అప్పట్లో ప్రధానంగా ఈ మార్గం వైజాగ్ స్టీల్‌ప్లాంట్, వైజాగ్ పోర్ట్ ట్రస్ట్‌లకు అసవరమైన ఐరన్‌ఓర్‌ను రవాణాను పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా వినియోగించేవారు. పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి ఈ మార్గంలో అల్యూమినా పౌడర్ సరఫరా చేసే నాల్కో, ఉత్కళ్ అల్యూమినా, వేదాంత, జేకే పేపర్, ఇంఫా (ఇండియా మెటల్ అండ్ ఫెర్రో అల్లాయ్), హెచ్‌పీసీఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ వంటి పరిశ్రమలకు ఎంతో అనుకూలంగా ఈ మార్గం ఉండేది. ప్రస్తుతం ఈ మార్గంలో రెండో లైన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 2015–16లో రూ.2500 కోట్లు బడ్జెట్ మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 2026నాటికి రెండోలైన్ పూర్తి చేయనున్నారు. పర్యాటక, పుణ్యక్షేత్రాల సమాహారం... ఆంధ్రా, ఒడిశా సదరన్ డివిజన్లో ప్రసిద్ధిచెందిన మజ్జిగైరమ్మ ఆలయం రాయగడ ప్రాంతంలోనే ఉంది రాయగడకు కేవలం 50కి.మీల దూరంలో చిత్రకోన వాటర్ ఫాల్స్ తెరుబలిలో గల ఇంఫా ప్యాక్టరీ వద్ద ప్రసిద్ధి చెందిన లక్ష్మీనారాయణ ఆలయం కోరాపుట్‌లో రాణి డుడుమ వాటర్‌ఫాల్స్, జగన్నాథస్వామి ఆలయం గుప్తేశ్వర గుహలు డియోమలి హిల్స్ కూడా కోరాపుట్ ప్రాంతంలోనే ఉన్నాయి. కోరాపుట్లోనే కోలాబ్ రిజర్వాయర్ కూడా ఉంది. గుహల్లో, వంతెనలపై మరపురాని ప్రయాణం ఈ మార్గంలో సొరంగాలలో నుండి రైలు దూసుకుపోతుంటే ఆ అనుభూతులే వేరు. సుమారు 36 చిన్న, పెద్ద సొరంగాలు. ఈ మార్గంలోనే రౌలీ స్టేషన్‌కు సమీపంలో తూర్పుప్రాంతంలోనే అత్యంత పొడవైన సొరంగమార్గం ఉంది. దీని పొడవు 1,599 మీటర్లు (1.59 కిలోమిటర్లు). ప్రకృతి సోయగాలు, లోతైన, ఎత్తైన కొండలపై ప్రయాణం. సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తులో కోరాపుట్ రైల్వే స్టేషన్. అందమైన వంతెనలు ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ మార్గంలో ఉన్నాయి. సాధారణంగా అరకు, బొర్రాగుహలుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు, కానీ ఒకసారి ఈ ప్రాంతాలను సందర్శిస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. వెలుగులోకి తీసుకువచ్చిన వాల్తేర్ డివిజన్ కోరాపుట్–రాయగడ రైల్వే మార్గం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. వాల్తేర్ డివిజన్‌కు డివిజనల్ రైల్వే మేనేజర్ గా వచ్చిన అనూప్‌కుమార్ సత్పతి అతి తక్కువ సమయంలో ఈ మార్గంలో పర్యటించి, తనిఖీలు చేసి దీనిని పర్యాటకులకు పరిచయం చేశారు. ఈ మార్గంలో పర్యాటకుల కోసం తొలిసారిగా విస్టాడోమ్ కోచ్‌ను జతచేశారు. వారానికి మూడుసార్లు నడిచే విశాఖపట్నం–కోరాపుట్ స్పెషల్ ప్యాసింజర్ రైలుకు ఈ విస్టాడోమ్ కోచ్ జతచేస్తున్నారు. (క్లిక్ చేయండి: అడవుల్లోనూ ఆహార పంటలు) 20 ఏళ్ల తరువాత ప్రెస్‌టూర్... దాదాపు 20 ఏళ్ల తరువాత వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ మార్గంలో శనివారం ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో గల ప్రముఖ పాత్రికేయులకు ప్రెస్టూర్ను ఏర్పాటుచేశాం. బహుశా కొద్ది డివిజన్లు మాత్రమే ఇటువంటివి ఏర్పాటు చేస్తాయి. ఈ టూర్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెందిన పర్యాటకరంగ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు పరిచయం చేస్తే బాగుంటుంది. – అనూప్ కుమార్ సత్పతి, డీఆర్ఎం అద్భుతంగా ఉంది మొదటిసారిగా ఈ ప్రాంతాలను సందర్శించా. విస్టాడోమ్కోచ్లో ప్రయాణించడం కూడా మరచిపోలేని అను భూతి. ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు తనతో పాటు మార్కెటింగ్ డివిజన్ నుంచి కృష్ణమోహన్, రాజేంద్రరావు, లోకనాథరావు కూడా ఈ టూర్లో పాల్గొన్నారు. – కె హరిత, డివిజనల్ మేనేజర్, ఏపీ టూరిజం -
గుర్తుపెట్టుకోండి.. నో మ్యాగీ.. ఓన్లీ రాగి!
రాయగడ(భువనేశ్వర్): అధిక పౌష్టిక విలువలు ఉన్న రాగులు ప్రతిఒక్కరూ తమ నిత్య జీవన ఆహారంలో భాగంగా తీసుకోవాలని, ఇతర చిల్లర తిండికి స్వస్తి పలకాలని కలెక్టర్ స్వాధాదేవ్ సింగ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో చిరు ధాన్యాల దినోత్సవాన్ని జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. రాగులతో తయారు చేసే వివిధ మిఠాయి పదార్థాలు, పిండివంటల స్టాల్స్‌ను ప్రారంభించారు. జిల్లాలోని వివిధ స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు స్టాల్స్‌లో రాగులతో తయారు చేసిన వంటకాలను ప్రదర్శనలో పెట్టారు. వీటిలో కొన్ని వంటకాలను రుచిచూసిన కలెక్టర్.. అబ్బురపడ్డారు. రాగులతో ఇన్ని రకాల వంటకాలు తయారు చేసుకొవచ్చా! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఆదివాసీల ముఖ్య ఆహారం రాగులని, వాటిలో పౌష్టిక విలువలు చాలా ఎక్కువగా ఉండటంతో నిత్య జీవనంలో భాగంగా చేర్చుకునే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామచంద్ర దాస్, సిబ్బంది పాల్గొన్నారు. చిరు ధాన్యాలకు ప్రభుత్వం ప్రోత్సాహం పర్లాకిమిడి: జిల్లా కేంద్రంలోని బిజూ పట్నాయక్ కల్యాణ మండపంలో జరిగని కార్యక్రమాన్ని కలెక్టర్ లింగరాజ్ పండా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. రాగిపిండితో తయారుచేసిన పదార్థాల స్టాల్స్‌ను పరిశీలించి, గిరిజన రైతులతో మాట్లాడారు. రాగులు, జొన్నలతో చేసిన జావ, మిక్చర్, బిస్కెట్లు డయాబెటిస్ రోగులకు దివ్య ఔషధమని తెలిపారు. జిల్లాలోని కాశీనగర్, నువాగడ బ్లాక్‌లలో రైతులు ఎక్కువుగా చోడి పండిస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా చిరుధాన్యాల ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సత్కరించారు. కార్యక్రమంలో రాగిపంట స్కీం అధికారి సంఘమిత్ర ప్రధాన్, జిల్లా వాటర్‌షెడ్ పథకాల అధికారి సంతోష్‌కుమార్ పట్నాయక్, జిల్లా ప్రాణిచికిత్స ముఖ్య అధికారి గిరీష్ మహంతి, వ్యవసాయ అధికారి కైలాస్చంద్ర బెహరా తదిరులు పాల్గొన్నారు. చోడి ఉత్పత్తిలో ప్రథమం.. జయపురం: నో మ్యాగీ ఓన్లీ రాగి అనే నినాదం ప్రజల చెంతకు చేరాలని, అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తంచేశారు. జయపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండియ దినోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సింహాచల మిశ్రా అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జూనియర్ రెడ్‌క్రాస్ కార్యదర్శి యజ్ఞేశ్వర పండా మాట్లాడారు. చోడి ఉత్పత్తిలో కొరాపుట్ జిల్లా రాష్ట్రంలో మొదఠి స్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విశ్వరంజన్ గౌఢ, ప్రకాశచంద్ర పట్నాయక్, ప్రభాత్‌కుమార్ రథ్, సాగరిక పాత్రొ, సువర్ణకుమారి ఖిళో తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు బిర్యానీ.. ఏంటిది? మీరు చెప్పేదేంటి? కొట్టుకునేవరకు వెళ్లిన పంచాయితీ -
హమ్మయా!.. తిరిగొచ్చిన సెల్ఫోన్లు
కొరాపుట్(భువనేశ్వర్): జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన సెల్ఫోన్లు.. తిరిగి యజమానుల చేతికందాయి. వీటిని నవరంగపూర్ ఎస్పీ కార్యాలయంలో బాధితులకు అందించారు. నవరంగ్‌పూర్ జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎస్.సుశ్రీ సమక్షంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న, అపహరణకు గురైన సెల్ఫోన్లపై నిఘా పెట్టిన పోలీసులు..రూ.5 లక్షల విలువైన 49 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి బాధితులకు సమాచారం అందించి, ఎస్పీ స్వయంగా సెల్ఫోన్లు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎస్ఎం ప్రధాన్, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: వామ్మో ఈ ఫైటింగ్ ఏంది..? కోర్టులోనే రెచ్చిపోయిన మహిళా లాయర్లు.. జుట్లు పట్టుకొని.. -
అయ్యో.. అవ్వా, అన్నేళ్ల కష్టమంతా పోయిందే!
రాయగడ(భువనేశ్వర్): ఆరుగాలం కష్టపడి పైసా పైసా కూడబెట్టింది ఆ వృద్ధురాలు. నా అన్నవారు ఎవరూ లేకపోయినా దాచుకున్న సొమ్ముతో కులాసాగా బతకాలని అనుకుంది. తీరా అవసరం కోసం దాచుకున్న డబ్బును బయటకు తీయగా చెదలు పట్టడంతో దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరు అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కెరడ పంచాయతీ ఖిలిమిసి గుడ గ్రామానికి చెందిన సామంత సదే అనే వృద్ధురాలికి ఎవరూ లేరు. కూలి పనులు చేసుకుంటూ బతుకుతోంది. వచ్చే కూలి డబ్బులను కొంతమేర అవసరాలకు ఖర్చు పెట్టి, మిగతా డబ్బును ఒక ట్రంకు పెట్టెలో దాచి ఉంచింది. ఇలా సుమారు రూ.40 వేలకు పైగా దాచుకున్న డబ్బు అవసరం కోసం తెరవగా, డబ్బుకు చెదలు పట్టి పనికిరాకుండా పోయినట్లు గుర్తించింది. కొన్ని నోట్లు తడిచిపోవడంతో పాటు మరికొన్ని పూర్తిగా చిరిగిపోయి ఉన్నాయి. దీంతో కష్టమంతా వృథా అయ్యిందని కన్నీటిపర్యంతమైంది. కొన్ని నోట్లు తడిచి ఉండడంతో ఎండలో ఆరబెట్టింది. చదవండి: డాక్టర్ సతీమణి అత్యుత్సాహం.. భర్త లేకపోవడంతో తానే వైద్యం, రోగి మృతి.. ఇద్దరూ పరార్! -
అతిథులుగా ఆహ్వానించి, అంతరంగిక లీలలతో ముంచెత్తుతుంది.. తర్వాతే..
భువనేశ్వర్: రాజకీయ నాయకులు, సినిమా నిర్మాతలను ముగ్గులోకి దింపి, మోసం చేసిన మాయలాడిని ఖండగిరి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందిత మహిళ న్యాయశాస్త్రంలో పట్టా పొందింది. అయితే పోలీసులు ఈ విషయమై అధికారికంగా సమాచారం జారీ చేయలేదు. ఆమె వద్ద 2 పెన్‌డ్రైవ్‌లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు ఇది వరకే వివాహమైంది. భర్త సహాయ సహకారాలతో ప్రముఖులను ముగ్గులోకి దింపి.. నిలువునా దోచుకుంటున్నట్లు ఆరోపణ. ఫేసుబుక్ పరిచయ వేదికగా ప్రముఖుల వివరాలను సేకరించి, సన్నిహిత పరిచయాలు పెంచుకుంటుంది. వారిని అతిథులుగా ఆహ్వానించి, అంతరంగిక లీలలతో ముంచెత్తుతుంది. ఈ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను భద్రపరిచి, భారీ మొత్తం కోసం బెదిరించడంలో ఆరితేరినట్లు బాధితులు లబోదిబోమంటున్నారు. మాజీ మంత్రులు, నాయకులు, ప్రముఖ వ్యాపారులు, సినీ నిర్మాతలు ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఖండగిరి పోలీస్ ఠాణాలో ఫిర్యాదు నమోదు కావడంతో డొంక కదిలింది. దీర్ఘకాలంగా విచారణకు సహకరించనందున పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. 2021 నుంచి ఈ వ్యవహారంలో తలమునకలై ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. చదవండి: (Nayanathara: నయన్ అంత పెద్ద షాక్ ఇస్తుందా!) -
రెడీగా ఉండండి.. ‘త్వరలో హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ సేవలు’
భువనేశ్వర్: రాష్ట్రానికి హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర సాంకేతిక, సమాచార శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూరీ పర్యటన పురస్కరించుకుని ఆయన ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ శిక్షణా శిబిరం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి విచ్చేశారు. కేంద్రప్రభుత్వం సంకల్పించిన 5జీ సేవలు తొలి దశలోనే రాష్ట్రానికి కల్పిస్తున్నట్లు ప్రకటించడం విశేషం. దేశంలో పలు ప్రాంతాలకు ఈ సేవలు లభిస్తాయని, ఈ వ్యవస్థలో మానవాళికి ఎటువంటి ముప్పు ఉండబోదని హామీ ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) జారీ చేసిన రేడియేషన్ పరిమితి కంటే సుమారు 10 రెట్లు తక్కువగా దేశంలో ప్రవేశ పెట్టనున్న హైస్పీడ్ ఇంటర్నెట్ వ్యవస్థ ఉంటుందని స్పష్టంచేశారు. వినియోగదారులకు విస్తృత 5జీ సేవలు కల్పించేందుకు అనుబంధ టెలికాం సంస్థలు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లతో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అతి త్వరలో హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి తొలి దశలో అవకాశం కల్పించే యోచన కనబరచడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. చదవండి: పవర్ ఆఫ్ సారీ:రూ.6 లక్షలతో.. 50కోట్లు వచ్చాయ్! -
కోళ్లు ఇస్తే.. కరెంట్ ఇస్తా.. విద్యుత్ సిబ్బంది నిర్వాకం
మల్కన్‌గిరి(భువనేశ్వర్): జిల్లాలోని కలిమెల సమితి చిత్రంగ్‌పల్లి పంచాయతీ పరిధి 6 గ్రామాలకు గత రెండు నెలలుగా విద్యుత్ సరఫరా లేదు. తుఫాను గాలుల ధాటికి కెసల్‌గూఢ, గుముకగూఢ, ఏంతాగూఢ, పూజారిగూఢ, తంగగూఢ, ఒరెల్‌గూఢ గ్రామాల్లోని విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీనిపై పలుమార్లు కలిమెల విద్యుత్‌శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎట్టకేలకు అంగీకరించిన కొందరు సిబ్బంది.. లంచంగా కోళ్లు, వాహనం పెట్రోల్ ఖర్చులు ఇస్తేనే బాగు చేస్తామని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై గ్రామాస్తులంతా కలిసి కలిమెల విద్యుత్‌శాఖ అధికారి పీకే నాయక్‌ను శుక్రవారం కలిసి, ఫిర్యాదు చేశారు. గత 2 నెలలుగా నానా ఇబ్బందులు పడుతున్నామని, కరెంట్ లేకపోయినా రసీదు ఇచ్చి బిల్లు చెల్లించమంటున్నారని వాపోయారు. దీనిపై స్పందించిన అధికారి.. ఘటనపై విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
80 ఏళ్లు పూర్తి.. అయినా గుండెలపై మానని గాయం
కొరాపుట్(భువనేశ్వర్): అది 1942 ఆగస్టు 24వ తేదీ. భారతదేశ చరిత్రలో అత్యంత అమానవీయ ఘటన జలియన్ వాలా బాగ్ దురంతం వంటి ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. బ్రిటీష్ సైనికుల కాల్పులకు 19 మంది స్వాతంత్య్ర సమరయోధులు అశువులు బాశారు. నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి టురి నది ఒడ్డున అమరులయ్యారు. నాటి రోజుల్లోకి వెళ్తే.. దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజులవి. జాతిపిత మహాత్మా గాంధీ పిలుపు దక్షిణ ఒడిశాకు చేరడంతో అవిభక్త కొరాపుట్ జిల్లాలోని దండకారణ్యంలో మన్యంవీరుల్లో కదలిక వచ్చింది. నందాహండి, తెంతులకుంటి, జొరిగాం, డాబుగాం, పపడాహండి సమితుల్లో క్విట్ ఇండియా ఉద్యమం ర్యాలీల నిర్వహణకు సన్నాహాలు జరిగాయి. 1942 ఆగస్టు 14న స్థానిక సమరయెధుడు మాధవ ప్రధాని భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చాడు. ఈ సభ నబరంగ్‌పూర్ సమీపంలోని చికిలి వద్ద జరగాల్సి ఉంది. సుమారు 200 మంది ప్రజలు గూమిగూడారు అని తెలిసి పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే చికిలి నది ఒడ్డుకు ఎవరూ చేరకుండా వంతెన కూల్చివేశారు. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం ఈ సంఘటనతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. స్వాతంత్య్ర సమరయెధుడు సోను మజ్జి నేతృత్వంలో ఉద్యమకారులు జఠాబల్ వంతెన కూల్చివేశారు. ఆగస్టు 24వ తేదీన సుమారు 500 మంది ఉద్యమకారులు పపడాహండి వద్ద టురి నదిపై ఉన్న వంతెన కూల్చి వేయడానికి బయల్దేరారు. వీరికి మాధవ ప్రధానితో ఉన్న 200 మంది ఉద్యమకారులు జత కలిశారు. దీంతో వీరిని నిలువరించేందుకు జయపురం, నబరంగ్పూర్ల నుంచి రిజర్వ్ పోలీసు బలగాలు టురి నది ఒడ్డుకు చేరుకున్నాయి. వంతెనకు ఒకవైపు పోలీసులు మరోవైపు ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమకారులు వంతెనపైకి రావడంతో పోలీసులు కాల్పులు జరిపారు. నదిలో రక్తం ప్రవహించిన వేళ పోలీసుల కాల్పులకు అక్కడికక్కడే 11 మంది స్వాతంత్య్ర సమరయోధులు కనుమూశారు. మరో 7గురు నబరంగ్‌పూర్ ఆస్పత్రిలో చనిపోయారు. పదుల సంఖ్యలో నదిలో పడి గల్లంతయ్యారు. అనేక మంది శాశ్వత దివ్యాంగులుగా మారారు. 140 మంది అరెస్టై జైలు పాలయ్యారు. ఫలితంగా టురి నది రక్తంతో పారినట్లు నాటి ప్రత్యక్ష సాకు‡్ష్యలు పేర్కొన్నారు. స్వాతంత్య్ర అనంతరం గల్లంతైన వారి కోసం గాలించినా లాభం లేకపోయింది. 1980 ఆగస్టు 24న అదే చోట అప్పటి రాష్ట్ర మంత్రి, స్వాతంత్య్ర సమరయెధుడు రాధాకృష్ట విశ్వాస్ రాయ్, స్థానిక ఎమ్మెల్యే హబిబుల్లాఖాన్లు సాయుధ స్థూపం కోసం శంకుస్థాపన చేశారు. 1984 మే 23న అప్పటి రాష్ట్ర గవర్నర్ విశ్వనాథ్ పాండే ఈ స్థూపాన్ని ప్రారంభించారు. స్థూపం మీద చనిపోయిన 19 మంది ఉద్యమకారుల పేర్లు లిఖించారు. నాటి నుండి నేటి వరకు అగస్టు 24న ఉద్యమకారుల కుటుంబాలను అక్కడ సత్కరిస్తున్నారు. వారి ఆచారాలకు అనుగుణంగా టురి నదిలో పిండ ప్రధానం చేస్తున్నారు. అనంతరం 2011లో డాబుగాం ఎమ్మెల్యే భుజబల్ మజ్జి తన కోటా నిధులతో అక్కడ స్మారక మందిరం నిర్మించారు. ప్రభుత్వం 24 మంది స్వాతంత్య్ర సమరయెధుల విగ్రహాలు, 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది బుధవారం జరగనున్న కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ కమలోచన్ మిశ్రా మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. -
హాకీ ప్రపంచకప్‌కు సన్నాహాలు
భువనేశ్వర్: హాకీ ప్రపంచకప్–2023 టోర్నమెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్‌చంద్ర మహాపాత్రొ అధ్యక్షతన అనుబంధ విభాగాల ఉన్నత అధికారులతో సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. స్థానిక లోక్‌సేవా భవన్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి వీకే పాండ్యన్, క్రీడా విభాగం కార్యదర్శి ఆర్.వినీల్‌కృష్ణ, వివిధ విభాగాల ప్రముఖులు, ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. కటక్, రౌర్కెలా ప్రాంతాల నుంచి అనుబంధ వర్గాలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వరుసగా రెండోసారి హాకీ పురుషుల ప్రపంచకప్ టోర్నమెంట్ నిర్వహిస్తుండడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో 2018లో తొలిసారి ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడంపై ఆనందం వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా హాకీ క్రీడాకారులు, క్రీడాభిమానులు, నిర్వాహక వర్గాలు టోర్నమెంట్ నిర్వహణకు ప్రసంశలు కురిపించారని గుర్తుచేశారు. ఈసారి గతంకంటే ఘనంగా ఆద్యంతం విజయవంతం చేయాలని చీఫ్ సెక్రటరీ అధికారులకు పిలుపునిచ్చారు. ఈ దఫా ఒకేసారి రెండు వేర్వేరు చోట్ల నిర్వహించడం ప్రత్యేకతగా పేర్కొన్నారు. భువనేశ్వర్ లోని కలింగ స్టేడియం, రౌర్కెలా ప్రాంతంలో హాకీ పురుష ప్రపంచకప్–2023 టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 2017లో ప్రభుత్వం నిర్వహించిన ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ కావడం క్రీడాలోకంలో జయజయ ధ్వానాలు నేటికి మార్మోగడం అద్భుత విజయంగా వివరించారు. హాకీ ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం రౌర్కెలా స్టేడియం శరవేగంగా సిద్ధమవుతోందని క్రీడా విభాగం కార్యదర్శి వినీల్‌కృష్ణ తెలిపారు. -
సీతమ్మ ఆగ్రహం.. దుస్తులు లేకుండా ఉంటారని శాపం.. అప్పటినుంచి..
మల్కన్‌గిరి(భువనేశ్వర్): జిల్లాలోని ఖోయిర్‌పూట్ సమితి ముదిలిపొడ, ఓండ్రహల్ పంచాయతీల్లో సుమారు 10వేల మంది బొండా గిరిజన తెగలవారు జీవిస్తున్నారు. వీరి నివాసాలన్నీ సముద్ర మట్టానికి 4వేల అడుగులు ఎత్తులో, జన జీవనానికి దూరంగా, వన్య ప్రాణులు, జల పాతాలకు దగ్గరగా ఉంటాయి. వీరి వస్త్రధారణకు సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడుతో కలిసి వనవాసం చేస్తున్న సమయంలో బొండా ఘాట్ సమీపంలోని జలాపాతం వద్ద సీతాదేవి స్నానం చేస్తుండగా చూసిన ఓ బొండా మాహిళ నవ్వింది. ఆగ్రహానికి గురైన సీతమ్మ వారు.. ఇకపై మీరు కూడా దేహంపై దుస్తులు లేకుండా ఉంటారని శపించారు. దీంతో మహిళలంతా కలిసి, క్షమాపణ కోరగా.. తాను కట్టుకున్న చీరలో చిన్న ముక్కను వారికిచ్చింది. అప్పటి నుంచి బొండా మహిళలంతా సీతాదేవి మాటకు కట్టుబడి నడుము కింది భాగంలో వస్త్రం మినహా, శరీరమంతా పూసలు, వెండి కడియాలు చుట్టుకుంటారు. తాము ఫొటో దిగితే తమ ఆత్మలో సగం ఎవరో తీసుకుపోతారనే మూఢ నమ్మకంతో ఇప్పటికీ ఆయుధం తోనే బయటకు వస్తుంటారు. ప్రతి గురువారం ఒనకఢిల్లీ, ఆదివారం జరిగే ముదిలిపొడ సంతలకు అటవీ ఉత్పత్తులతో గుంపులుగా వెళ్తారు. అక్కడ తమకిష్టమైన జీలుగు కల్లు, అలంకరణ సామగ్రి, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తాంటారు. చదవండి: లవ్ వైరస్: హెచ్ఐవీ పేషెంట్‌తో ప్రేమ.. ప్రాణం మీదకు తెచ్చుకుంది! -
అమానుషం.. వైద్యం పేరుతో 9 నెలల చిన్నారికి వాతలు.. అల్లాడిన పసి ప్రాణం
కొరాపుట్: మూఢ నమ్మకం ముక్కు పచ్చలారని పసికందు ప్రాణం తీసింది. నవరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి జోడాబర–2 గ్రామంలో ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుఖదేవ్ గొండో కుమారుడు రూపేష్ గొండో(9 నెలలు) తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతున్నాడు. దీంతో కుటుంబీకులు మంత్రగాడుని సంప్రదించగా, శిశువు పొట్ట, గుండెపై కొడవలితో వాతలు పెట్టించారు. నొప్పి తట్టుకోలేక ఆ పసి ప్రాణం అల్లాడిపోయింది. విషయం తెలుసుకున్న ఆశా కార్యకర్త సుభావతి గొండో అంబులైన్స్‌కు సమాచారం అందిదంచి, రూపేష్‌ను బొడబరండి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చికిత్స అందించగా, ఆస్పత్రిలో ఎవరికీ తెలియకుండా కుటుంబీకులు శిశువుని తిరిగి ఇంటికి తెచ్చారు. మరోసారి మంత్రగాడితో పూజలు చేయించగా, రూపేస్ మృతిచెందాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. చదవండి: సీఎం పదవి ఖాళీగా లేదు! ఒకరిద్దరూ గొంతు చించుకుంటే సీఎం కాలేరు! -
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం: భార్య తలను నరికి చేతిలో పట్టుకుని 12 కి.మి..
భువనేశ్వర్: భార్య తలను నరికి చేతిలో పట్టుకొని 12 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు ఒక పైశాచిక భర్త. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన ఢెంకనాల్ జిల్లాలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రశేఖరపూర్ గ్రామానికి చెందిన నక్కొఫొడి మాఝి అక్రమ సంబంధం అనుమానంతో తన భార్య సుచల మాఝిని పైశాచికంగా హత్య చేశాడు. అనంతరం ఆమె తలను చేతిలో పట్టుకొని పోలీసులకు లొంగిపోవడానికి కాలి నడకన బయల్దేరాడు. జొంఖిరా గ్రామం ప్రధాన రహదారిపై నిందితుడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతడిని విచారించగా తన భార్యకు అక్రమ సంబంధం ఉండడంతో పలుమార్లు హెచ్చరించినట్లు తెలియజేశాడు. కానీ ఆమె పట్టించుకోకపోవడంతో శుక్రవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో కత్తితో పీకకోసి చంపేసినట్లు చెప్పాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ.. నా భర్తపై చర్యలు తీసుకోండి -
అటవీ అధికారుల కంటపడ్డ వింతజీవి.. కాటేస్తే డౌటే!
రాయగడ(భువనేశ్వర్): జిల్లాలోని మునిగుడ సమితి లోదిపొంగ అడవుల్లో అటవీశాఖ అధికారులకు ఓ వింతజీవి తారసపడింది. దీనిని చాకచక్యంలో పట్టుకుని అటవీశాఖ కేంద్రానికి తరలించారు. శనివారం రాత్రి కొంతమంది అటవీశాఖ సిబ్బంది అడవిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ జీవి కనిపించిందని అటవీశాఖ అధికారి ప్రసన్నకుమార్ మిశ్రొ తెలిపారు. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పేరుతో పిలుస్తారనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. అయితే ఇది విషపూరితమైన జీవమని, మనుషులపై దాడి చేసి, కాటు వేస్తుందని వన్యప్రాణుల సంరక్షణ విభాగానికి చెందిన తెలిపారు. దాడి చేసే స మయంలో శరీరంలోకి విషం ఎక్కి, ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందని సమాచారం. దీనిపై వివరాలు సేకరిస్తున్నారు. చదవండి: సామూహిక లైంగిక దాడి చేసి.. ఆమెకు ఇలా వెల కట్టారు -
‘ధూం సినిమా చూడండి.. దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి’ .. చివరికి..
కొరాపుట్: ‘ధూం సినిమా చూడండి.. దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి’ అంటూ పోలీసులకు సవాల్ విసిరిన దొంగలు దొరికిపోయారు. నవరంగ్‌పూర్ జిల్లా ఎస్పీ ఎస్.సుశ్రీ ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. జిల్లాలోని ఖాతీగుడ సమితి ఇంద్రావతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 3న చోరీ జరిగింది. పాఠశాలలోని కంప్యూటర్లు, ఇతర సమాగ్రి ఎత్తుకుపోయిన దుండగులు.. అక్కడితో ఆగకుండా మితిమీరిన ఆగడాలకు పాల్పడ్డారు. ఇదే వారిని పట్టించేలా చేసింది. తమది ధూం 4 స్టైల్ అని, ఇదే తరహాలో మరో దొంగతనం కూడా చేస్తామని వీలైతే అడ్డుకోవాలని సూచించారు. పాఠశాల బోర్డుపై ఫోన్‌నంబర్లు రాసి, దమ్ముంటే తమను పట్టుకోవాలని పోలీసులకు సవా ల్ విసిరారు. తమను సంప్రదించి, డబ్బులు పట్ట కొని వస్తే దొంగిలించిన వస్తువులు తిరిగి ఇస్తామని ప్రకటించారు. దీంతో పోలీసులు ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు చేశారు. దొంగలు రాసిన నాలుగు ఫోన్ నంబర్లపై నిఘా పెట్టారు. అయితే అత్యుత్సాహంతో 2 రోజుల క్రితం ఇందులోని ఒక నంబర్‌కి ఫోన్ చేసి, ఎవరైనా ఈ కేసుపై ఫోన్ చేశారా అని ఆరా తీశారు. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఆ నంబర్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వీరు ఇంద్రావతికి చెందిన ఆదిత్యకుమార్ దాస్, ఆనందకుమార్ దాస్‌గా గుర్తించారు. వారి ఇళ్లల్లో సోదాలు చేయగా దొంగిలించబడిన వస్తువులు పట్టుబడ్డాయి. వారి రాతలను పరిశీలించగా, పాఠశాల బోర్డులపై రాసిన రాతలు నిందితులవిగానే తేటతెల్లమైంది. నిందితులు ఇద్దరూ అన్నదమ్ములని, వారు ఇదే బడిలో పూర్వ విద్యార్థులని ఎస్పీ ప్రకటించారు. చదవండి : హైటెక్ దొంగతనం.. తెలివి మామూలుగా లేదుగా! -
పడగవిప్పిన ర్యాగింగ్ భూతం.. ఎన్నో ఆశలతో కాలేజ్‌కి వచ్చి..
వికృత ఆనందం మరోసారి పడగ విప్పింది. ర్యాగింగ్ భూతం పేరిట విద్యార్థి ప్రాణాలను బలి తీసుకుంది. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యాలయమే వారిపాలిట మృత్యు పాశంగా మారింది. దీంతో మరో కుటుంబానికి గర్భశోకం మిగిలింది. ఈ సెగలు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు అసెంబ్లీని సైతం కుదిపేశాయి. దీనిపై విచారణకు నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేక కమిటీని నియమించారు. భువనేశ్వర్: రాష్ట్ర రాజధాని నగరంలోని బక్షి జగబంధు(బీజేబీ) కళాశాల క్యాంపస్‌లో విద్యార్థి రుచికా మహంతి(19) ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. కళాశాల ఆవరణ నుంచి శాసనసభ వరకు ఆందోళన సెగలు విస్తరించాయి. రుచికా కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా రోదించారు. ఈ అమానుష చర్య విద్యార్థి సంఘాలు నిరసనకు దిగేలా చేశాయి. ఈ విచారకర పరిస్థితులను తొలగించేందుకు ప్రభుత్వం ఇంకెంత కాలం నిరీక్షిస్తుందని నిలదీస్తున్నాయి. రుచికా మహంతి ఆత్మహత్యకు ప్రేరేపించిన ర్యాగింగ్ వేధింపులకు పాల్పడిన వారిపట్ల కఠిన చర్యలు చేపడతామని కళాశాల యాజమాన్యం, పోలీస్ కమిషనరేట్ వర్గాలు యథాతధంగా భరోసా ఇస్తున్నాయి. ఈ రెండు వర్గాలు ఎవరి తరహాలో వారు ప్రత్యేక కమిఈలు ఏర్పాటు చేసి, విచారణ చేపట్టినట్లు సోమవారం ప్రకటించాయి. తల్లిదండ్రుల నిరసన.. విద్యార్థి రుచికా మహంతి శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ చర్యలకు నిరసనగా ఆమె తల్లిదండ్రులు, కటుంబీకులు కళాశాల ఆవరణలో నిరసనకు దిగారు. వీరికి పలు విద్యార్థి సంఘాలు సంఘీభావం ప్రకటించి, ధర్నాలో పాల్గొన్నారు. కటక్ జిల్లా అఠొగొడొ ప్రాంతం నుంచి బీజేబీ కళాశాల ఆర్ట్స్ విభాగం ప్లస్3 డిగ్రీ తొలి సంవత్సరం తరగతిలో రుచికా మహంతి ఇటీవల చేరింది. కళాశాల కరుబాకి హాస్టల్ 201వ నంబర్ గదిలో శనివారం రాత్రి ఉరి పోసుకుని మరణించినట్లు గుర్తించారు. ఆమె మరణ వాంగ్మూలం పోలీసులు గుర్తించినట్లు 4వ నంబర్ జోన్ ఏసీపీ పరేష్రౌత్ తెలిపారు. ముగ్గురు సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ తాళలేక రుచికా మహంతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఈ వాంగ్మూలంలో వివరించింది. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల పేర్లు ఇతర వివరాలను పేర్కొనలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. కళాశాల విచారణ కమిటీ.. రుచికా మహంతి ఆత్మహత్య ఘటనపై విచారణ పురస్కరించుకుని ఏడుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటైంది. కళాశాల యాజమాన్యం దీనిని నియమించింది. ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ, క్రమశిక్షణ కమిటీ, అన్ని విభాగాల అధ్యాపకులతో ఏర్పాటు చేశారు. ర్యాగింగ్‌కు సంబంధించి రుచికా మహంతి గతంలో ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. త్వరలో ఈ విచారకర ఘటన పూర్వాపరాలు వెలుగు చూస్తాయని బీజేబీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిరంజన మిశ్రా తెలిపారు. మరోవైపు ప్లస్3 డిగ్రీ చివరి సంవత్సరపు పరీక్షలను నిలిపి వేశారు. సోమవారం నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కళాశాలలో నెలకొన్న ఉధ్రిక్తతతో సోమవారం, మంగళవారాల్లో జరగాల్సిన పరీక్షలను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు ప్రకటించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన ముగ్గురు సీనియర్ విద్యార్థులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టాలని వివిధ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘం, విద్యార్థిని కుటుంబీకులు నిరసన వ్యక్తం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలో.. రుచికా మహంతి ఆత్మహత్య ఘటన పురస్కరించుకుని విద్యార్థి కాంగ్రెస్ సోమవారం ఆందోళనకు దిగింది. ర్యాగింగ్ నివారణలో ప్రభుత్వ వైఫల్యమైందని నినాదాలతో శాసనసభలోకి చొరబడేందుకు ఆందోళనకారులు ప్రయత్నించి, విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు, విద్యార్థి కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుని ఉధ్రిక్తత నెలకొంది. కమిషనర్ ఆధ్వర్యంలో.. బీజేబీ కళాశాల క్యాంపస్ కరిబాకి హాస్టల్ గదిలో విద్యార్థి రుచికా మహంతి ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. డీïసీపీ హోదా అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో దీనిపై విచారణ చేపడుతుందని జంట నగరాల పోలీసు కమిషనర్ సౌమేంద్రకుమార్ ప్రియదర్శి వెల్లడించారు. మరోవైపు స్థానిక బర్గడ్ ఠాణా పోలీసులు ఈ సంఘటన పురస్కరించుకుని ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. స్పందించిన హక్కుల కమిషన్ భువనేశ్వర్: స్థానిక బక్షి జగబంధు(బీజేజీ) కళాశాల క్యాంపస్ హాస్టల్ గదిలో ప్లస్3 డిగ్రీ ఆర్ట్స్ విభాగం విద్యార్థిని రుచికా మహంతి ఆత్మహత్య సంఘటన పురస్కరించుకుని సమగ్ర నివేదిక దాఖలు చేయాలని ఒడిశా మానవ హక్కుల కమిషనప్ సోమవారం ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి సీల్డ్ కవర్లో నివేదిక దాఖలు చేయాలని కటక్–భువనేశ్వర్ జంట నగరాల కమిషరేటు పోలీస్ వర్గాలకు కమిషన్ ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేసినట్లు తెలిపింది. మీడియా ప్రసారం ఆధారంగా ఒడిశా మానవ హక్కుల కమిషన్ స్వయంగా చొరవ కల్పించుకుని, ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది. నిందితుల్ని క్షమించేది లేదు: హోంశాఖ భువనేశ్వర్: బీజేబీ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య ఘటన పట్ల రాష్ట్ర హోంశాఖ సహాయమంత్రి తుషార్‌కాంతి బెహరా సోమవారం స్పందించారు. నిందితుల్ని క్షమించేది లేదని ఆయన శాసనసభలో ప్రవేశ పెట్టిన వివరణలో పేర్కొన్నారు. విపక్షాల దాడితో ఈ ఘటనపై వివరణ సభలో ప్రవేశ పెట్టాలని స్పీకర్ విక్రమకేశరి అరూఖ్ ఆదేశించారు. సభా కార్యక్రమాలు ముగిసే సమయానికి వివరణ దాఖలు చేయాలని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా తుషార్‌కాంతి బెహరా మాట్లాడుతూ... ‘విద్యార్థిని రుచికా మహంతి ఆత్మహత్య అత్యంత విచారకరం. పోలీసులు ఈ ఘటన పట్ల అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. తక్షణమే దర్యాప్తు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది’ అని ప్రకటించారు. దీనిపై బర్గడ్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డీసీపీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు కోసం కమిషనరేట్ పోలీసు 3 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. అదనపు డీసీపీ హోదా అధికారి ఈ బృందాలను పర్యవేక్షిస్తున్నారు. కుటుంబీకులు, మృతురాలి బంధువర్గం జారీ చేసిన సమాచారం, ఘటనా స్థలంలో లభ్యమైన మరణ వాంగ్మూలం వివరాలను దర్యాప్తు పరిధిలో ప్రధాన అంశాలుగా పరిగణించినట్లు మంత్రి తెలిపారు. సభలో సమరమే..! ర్యాగింగ్ తీవ్రతతో బీజేబీ కళాశాలలో విద్యార్థిని రుచికా మహంతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర సంచలనాత్మకంగా మారింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయి. ఈ విచారకర పరిస్థితుల పట్ల పూర్తి వివరణ సభలో ప్రవేశ పెట్టాలని సోమవారం జరిగిన వర్షాకాల సమావేశాల్లో సభ్యులు విరచుకు పడ్డారు. స్పీకర్ పోడియం వైపు దూసుకుపోయారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన కాసేపటికే ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. విపక్షాల తీరుపట్ల అసహనం ప్రదర్శించిన స్పీకర్.. సభా కార్యక్రమాలను ఉదయం 11.30 గంటల వరకు తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో సభలో ప్రశ్నోత్తరాల ఘట్టానికి గండి పడింది. జీరో అవర్‌లో దీనిపై చర్చిద్దామని సభాపతి విక్రమకేశరి అరూఖ్ సభ్యుల్ని అభ్యర్థించారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగనీయాలన్న స్పీకర్ పిలుపుని నిరాకరించడంతో పరిస్థితి అదుపు తప్పినట్లు గుర్తించి, సభా కార్యక్రమాలను వాయిదా వేశారు. -
ఆ ప్రాంతంలో అమ్మకు కష్టం.. తీరేదెన్నడో!
కొరాపుట్: శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నాం. ఆధునిక యుగంలో అన్ని వసతులు సమకూర్చుకుంటున్నాం అని సంబర పడుతున్నాం. కానీ ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ ప్రజలు కనీస వసతులకు నోచుకోవడం లేదు. పురిటి నొప్పులు వస్తే పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. వసతులు లేకపోవడంతో ఆస్పత్రికి రాకుండానే ప్రసవిస్తున్న ప్రాణాలెన్నో. నబరంగ్‌పూర్ జిల్లాలోని జొరిగాం సమితి చక్ల పొదర్ గ్రామ పంచాయతీ పరిధి దహిమార గ్రామానికి చెందిన ఉషావతి బోత్ర అనే గర్భిణికి బుధవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గ్రామస్తులు ఆశ కార్యకర్త నళినిని సంప్రదించారు. ఆమె వెంటనే జొరిగాం ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కానీ వెంటనే అంబులెన్స్ వచ్చినప్పటికీ గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న నది అడ్డంగా మారింది. వెంటనే గ్రామస్తులు ఉషావతిని ఒక మంచంపై మోసుకొని నది ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇదే సమయంలో వారికి అంబులెన్స్ సిబ్బంది సైతం సాయం చేశారు. అనంతరం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఉషావతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. చదవండి: థాక్రే అంటే ఇప్పటికీ గౌరవమే.. శివసేనకు వెన్నుపోటు పొడిచి మొత్తం ఆయనే చేశారు!: రెబల్స్ -
భూ తగాదా.. న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు.. చివరికి
రాయగడ(భువనేశ్వర్): పోలీసులు తనకు న్యాయం చేయడం లేదనే మనస్థాపంతో ఒక యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చందిలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒంటామడ గ్రామానికి చెందిన తిరుపతి జరువా గ్రామంలోని శివ మందిరం దగ్గరలో ఉండే హోమశాల పైకప్పుకు తాడుతో ఉరి వేసుకొని బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన తన భర్త సాయంత్రానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన భార్య చుట్టుపక్కల వెతికింది. ఈ సమయంలో తన భర్త ఉరికి వేలాడుతూ కనిపించడంతో బోరుమని విలపించింది. చుట్టుపక్కల వారు అక్కడికు వచ్చి పొలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో ఒక భూ తగాదాకు సంబంధించి కొంతమంది వ్యక్తులతో తిరుపతికి వైరం కొనసాగుతోంది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ చందిలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు న్యాయ చేయడం లేదని, ప్రత్యర్థులు తనను నిత్యం వేధిస్తుండడంతో గత్యంతరం లేక చనిపోతున్నట్లు సూసైడ్ నోట్లో రాశాడు. విషయం తెలుసుకున్న పొలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి అనుమానుతులుగా భావిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్డీపీవో దేవజఓతి దాస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చదవండి: Road Accident Today: సత్యసాయి జిల్లా: ఘోర ప్రమాదం.. 5 మంది సజీవ దహనం -
ట్వీట్ రచ్చ.. రామ్‌గోపాల్ వర్మపై ఫిర్యాదు
కొరాపుట్(భువనేశ్వర్): వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై నబరంగ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో జిల్లా బీజేపీ మహిళా విభాగం సభ్యులు సోమవారం ఫిర్యాదు చేశారు. భారత రాష్ట్రపతి పదవికి ఎన్డీయే కూటిమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముపై రామ్‌గోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తక్షణమే వర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దేశ అత్యున్నత పదవికి పోటీ చేస్తున్న ఒడియా గిరిజన మహిళపై ఇటువంటి వ్యాఖ్యలు అత్యంత నేర పూరితమైనవిగా అభివర్ణించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఎదురుగా వర్మకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం నాయకురాలు, కౌన్సిలర్ షర్మిష్టా దేవ్, సునీతా పాఢీ, మినతి పట్నాయక్, గౌరీ శంకర్ మజ్జి, దేవదాస్ మహంకుడో, నిల్లు మిశ్ర, మానస్ త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు. చదవండి: Pooja Hegde: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఎలాంటి ఆఫర్స్ రాలేదు -
ద్రౌపది ముర్ముపై కూతురు ఇతిశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు
Presidential Candidate Draupadi Murmu: ‘మా అమ్మ అత్యంత సహనశీలి. కష్టం, విషాదంతో అన్ని తలుపులు మూతబడిన విపత్కర పరిస్థితుల్లో సడలని మానసిక స్థైర్యం కలిగిన సాహసి అమ్మ ద్రౌపది ముర్ము. ఒడిదుడుకులను సహనంతో ఎదురీది దేశంలో అత్యున్నత స్థానానికి ఎదిగిన ఆమె నాకు సదా మార్గదర్శకం’. ఇదీ... ఎన్డీయే కూటమి తరఫున భారత రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉన్న ద్రౌపది ముర్ము కుమార్తె ఇతిశ్రీ ముర్ము(35) తన తల్లిని ఉద్దేశించి, వెల్లడించిన అభిప్రాయం. ద్రౌపది ముర్ముకు 3 నెలల మనవరాలు ఉంది. శుక్రవారం నామినేషన్ దాఖలు చేసేందుకు ముందు ఆమె కుమార్తె, మనవరాలితో కలిసి, కొద్దిసేపు ముచ్చటించారు. తొలుత ఫోన్ ద్వారా.. భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరఫున ద్రౌపది ముర్ము పేరు ఖరారైన విషయం తొలుత ఫోన్ ద్వారా తెలిసింది. ఆ సమయానికి గ్రామంలో కరెంట్ కోత ఉండడంతో టీవీ ప్రసారాన్ని చూడలేక పోయారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఈ శుభవార్తను తొలుత తెలియజేయడంతో ఆమె అవాక్కయ్యారు. 2017లో కూడా రాష్ట్రపతి అభ్యర్థిత్వం చివరి క్షణంలో చేజారిపోయింది. ఈసారి కలిసి వస్తుందని ఊహించలేక పోయారు. బరిలో నిలవడం నిజం కావడం ఆనందదాయకంగా పేర్కొన్నారు. ఉపాధ్యాయినిగా సాధికారతకు శ్రీకారం చుట్టి, తరచూ ప్రజాహిత, సామాజిక కార్యకలాపాల్లో పాలుపంచుకొని.. క్రమంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగిడారు. చదవండి: చైల్డ్ ఆర్టిస్టులను ఇక అలా చూపించడానికి వీల్లేదు: కొత్త మార్గదర్శకాలు రెడీ! కౌన్సిలర్ స్థాయి నుంచి అత్యున్నత రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో నిలిచే వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. బీజేపీ ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టారు. బీజేపీ అభ్యర్థిగా వరుసగా 2సార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 2000లో బీజేపీ–బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో వాణిజ్య రవాణా, మత్స్య, పశు సంవర్థక శాఖల మంత్రిగా బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. 2015లో ఝార్కండ్ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆమె పనితీరుపై కేంద్రం సంతృప్తికరంగా ఉండటంతో ఆరేళ్లకు పైగా 2021 వరకు అదే బాధ్యత్లో కొనసాగారు. ప్రధాని తొలి సంతకం.. భువనేశ్వర్: భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, జాతీయ గణతంత్ర కూటమి(ఎన్డీయే) ప్రముఖులు హాజరయ్యారు. తొలి ప్రతిపాదకులుగా ప్రధాని తొలి సంతకం చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ద్రౌపది ముర్ముకు మద్దతుగా ఎన్డీయే ప్రముఖులతో ఎన్డీయేతర బీజేడీ, వైఎస్సార్ సీపీ ప్రముఖులు నామినేషన్ పత్రాల్లో సంతకాలు చేయడం విశేషం. ఒడిశాకు చెందిన బీజేపీ ఎమ్మల్యేలు ముర్ము నామినేషన్లపై సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. సైకత శుభాకాంక్షలు భారత రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ద్రౌపది ముర్ముకు అంతర్జాతీయ సైకతశిల్పి, పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పూరీ సాగర తీరంలో తీర్చిదిద్దిన శైకత శిల్పం.. పలువురిని ఆకట్టుకుంది. చదవండి: షాకింగ్ ఘటన... డబ్బాలో ఏడు పిండాలు! -
ప్రేమికులను కత్తితో బెదిరించి.. కొండపైకి తీసుకెళ్లి వివస్త్రలను చేసి..
జయపురం(భువనేశ్వర్): ప్రేమికులను భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్ డివిజనల్ పోలీసు అధికారి అరూప్ అభిషేక్ బెహర శనివారం తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. జయపురం పారాబెడకు కొంతదూరంలో ఇద్దరు ప్రేమికులు శుక్రవారం మాట్లాడుతూ ఉండగా వారి వద్దకు ఇద్దరు యువకులు వెళ్లి భయపెట్టారు. తమ వద్దనున్న కత్తిని చూపించి ప్రేమికులను సమీప కొండపైకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న మరో ముగ్గురు దుండగులతో కలిసి ప్రేమికులను నగ్నంగా చేసి ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని హెచ్చరించి, రూ.50 వేలు డిమాండ్ చేశారు. అయితే తమ వద్ద డబ్బులు లేకపోవడంతో రూ.7 వేల నగదును ప్రేమికులు దుండగులకు ఇచ్చారని వెల్లడించారు. శనివారం మరో రూ.13 వేలు ఇచ్చేందుకు అంగీకరించి, మిగతా రూ.30 వేలు నెల రోజుల్లో ఇస్తామని ప్రేమికులు దుండగులకు చెప్పినట్లు తెలిపారు. అనంతరం బందువుల సాయంతో వీరు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేసి 5 దుండగులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అరెస్టైనవారిలో జయపురం కౌదంబ వీధి టుకున జాని, రోహిత్ గరడ, దీపక్ సావుడ్, కపిల పొరిచ, ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, రూ.7 వేల నగదు, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. -
లక్కీ బాయ్.. మృత్యువు అంచు వరకు వెళ్లి వచ్చాడు!
కొరాపుట్(భువనేశ్వర్): ప్రమాదావశాత్తు లోయలోకి జారిపడిన బాలుడిని గ్రామస్తులు సురక్షితంగా బయటకు చేర్చారు. నవరంగ్‌పూర్ జిల్లా తెంతులుకుంటి సమితి కొంటా పంచాయతీ బరిపొదర్ గ్రామానికి చెందిన డొమ్ము జానీ సమీపంలోని కొండ మీదకు శుక్రవారం ఉదయం పశువులను తీసుకు వెళ్లాడు. అక్కడి నుంచి ప్రమాదావశాత్తు కాలుజారడంతో రెండు బండ రాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. తల భాగం కిందికి ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోయాడు. గమనించిన మిగతా కాపర్లు బాలుడు జారిపోకుండా కాలికి తాడు కట్టి, నిలువరించారు. విషయాన్ని తెంతులకుంటి బీడీఓ దుర్జన బొయికి తెలియజేశారు. ఆయన హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు సకాలంలో అక్కడికి చేరుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల సహకారంతో 8 గంటలు కష్టపడి శుక్రవారం రాత్రికి జానీని వెలుపలికి తీశారు. చిన్నపాటి గాయాలవడంతో తెంతుల కుంటి ఆస్పత్రికి తరలించారు. చదవండి: కింజరాపు వారి మైనింగ్ మాయ.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్ బాగోతం -
‘ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 50 లక్షలు ఇచ్చారు.. అందుకే వాళ్లకి ఓటు వేశా’
కోలారు(బెంగళూరు): రాజ్యసభ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ సొంత ఎమ్మెల్యేలకే ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు చొప్పున ఇచ్చి కొనుగోలు చేసిందని కోలారు ఎమ్మెల్యే కె శ్రీనివాసగౌడ ఆరోపించారు. శనివారం నగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు కూడా రూ. 50 లక్షలు ఇవ్వజూపారని, అయితే తాను తీసుకోలేదని అన్నారు. ఎమ్మెల్యేలను లంచం ఇచ్చి కొనుగోలు చేసిన పార్టీ నాయకులు తన గురించి ఆరోపణలు చేయడంలో అర్థం లేదని అన్నారు. జేడీఎస్‌కి ఎప్పటి నుంచో దూరంగా ఉన్నానని, అందుకే రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఓటేశానని బహిరంగంగానే చెప్పానని అన్నారు. స్థానిక జేడీఎస్ నాయకులు తన ఇంటి ముందు ఆందోళన చేస్తే తాను భయపడేది లేదని అన్నారు. విలేకరుల సమావేశంలో డీసీసీ బ్యాంకు డైరెక్టర్ బ్యాలహళ్లి గోవిందగౌడ పాల్గొన్నారు. చదవండి: బాబు, పవన్‌కు రాజకీయ హాలిడే -
అడిగినంత లంచం ఇవ్వాలి.. లేదంటే నీ సంగతి చెప్తా
భువనేశ్వర్: రాష్ట్ర విజిలెన్స్ ఇనస్పెక్టర్ మానసి జెనాను విధుల నుంచి బర్తరఫ్ చేసినట్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) సునీల్‌కుమార్ బన్సాల్ శుక్రవారం ప్రకటించారు. తోటి ఉద్యోగి ఆధ్వర్యంలో రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా ఆమె ప్రత్యక్షంగా పట్టుబడ్డారు. విజిలెన్స్ వలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగిపై నమోదైన కేసును కొట్టి వేసేందుకు ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు ఆరోపణ. అడిగినంత లంచం ఇవ్వకుంటే కఠిన క్రిమినల్ చర్యలు చేపడతామని నిందితుడిని బెదిరించారు. ఈ వ్యవహారంలో విజిలెన్స్ అంతర్గత వర్గం అధికారులు మానసి జెనాను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మే 14న ఆమెను అరెస్ట్ చేసి, జుడీషియల్ కస్టడీకి తరలించారు. చదవండి: స్నేహితుని పెళ్లి.. మత్తు ఎక్కువై రైలుపట్టాలపై పడుకుని.. -
అడవుల్లో ఉండిపోయింది
‘ఒక సమయం వస్తుంది. ఈ నగరాలకు దూరం వెళ్లిపోవాలనిపిస్తుంది. కాకుంటే నేను ఆ పిలుపు ముందు విన్నాను’ అంటుంది 35 కావ్య. నోయిడాలో ఫ్యాషన్ ఉత్పత్తుల రంగంలో పని చేసిన కావ్య గత పదేళ్లుగా సెలవుల్లో భారతీయ పల్లెలను తిరిగి చూస్తూ తన భవిష్యత్తు పల్లెల్లోనే అని గ్రహించింది. ‘ఒరిస్సా అడవులకు మారిపోయాను. ఈ ఆదివాసీల కోసం పని చేస్తాను’ అంటోంది కావ్య. ఆమెలా బతకడం ఎందరికి సాధ్యం. చుట్టూ దట్టమైన అడవులు. అమాయకంగా నవ్వే ఆదివాసీలు. స్విగ్గి, జొమాటో, అమెజాన్‌ల గోల లేకుండా దొరికేది తిని సింపుల్‌గా జీవించే జీవనం, స్వచ్ఛమైన గాలి, స్పర్శకు అందే రుతువులు... ఇంతకు మించి ఏం కావాలి. నగరం మనిషి సమయాన్ని గాయబ్ చేస్తోంది. మరో మనిషిని కలిసే సమయం లేకుండా చేస్తుంది. కాని పల్లెల్లో? సమయమే సమయం. మనుషుల సాంగత్యమే సాంగత్యం. ‘ఆ సాంగత్యం అలవాటైన వారు అడవిని వదల్లేరు’ అంటుంది కావ్య సక్సెనా. 35 ఏళ్ల కావ్య ఇప్పుడు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ల సరిహద్దులో ఉండే కోరాపుట్ ప్రాంతంలో సెటిల్ అయ్యింది. ఒక్కత్తే. అక్కడి పల్లెల్లో ఆమె నివాసం. ఆ ఊరివాళ్లే ఆమె మనుషులు. అక్కడి ఆహారమే ఆమె ఆహారం. కాని ఆ జీవితం ఎంతో బాగుంటుంది అంటోంది కావ్య. నోయిడా నుంచి జైపూర్‌లో జన్మించిన కావ్య చదువు కోసం అనేక ప్రాంతాలు తిరిగింది. కొన్నాళ్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పని చేసింది. ఆ తర్వాత నోయిడాలో ఫ్యాషన్ ఉత్పత్తుల కార్పొరెట్ సంస్థకు మారింది. అయితే ఎక్కడ పని చేస్తున్నా పల్లెలను తిరిగి చూడటం ఆమెకు అలవాటు. ‘అందరూ అందమైన బీచ్‌లను, టూరిస్ట్ ప్లేస్‌లను చూడటానికి వెళతారు. నేను కేవలం పల్లెటూళ్లు చూడటానికి వెళ్లేదాన్ని. పల్లెల్లో భిన్నమైన జీవితం ఉంటుంది. అది నాకు ఇష్టం’ అంటుంది కావ్య. అయితే 2020లో వచ్చిన లాక్డౌన్ ఆమె కాళ్లకు బేడీలు వేసింది. అక్టోబర్‌లో ఆంక్షలు సడలింపు మొదలయ్యాక ‘మహీంద్రా’ వారితో కలిసి ‘కావ్యాఆన్క్వెస్ట్’ అనే సోలో ట్రిప్‌కు బయలుదేరింది. దీని ఉద్దేశ్యం పల్లెల్లో ఉండే హస్తకళలను డాక్యుమెంట్ చేయడమే. ఆ దారిలో ఆమె అనేక పల్లెల్లో గ్రామీణులు, ఆదివాసీలు చేసే హస్తకళలను గమనించింది. ‘కాని వాటిని మార్కెట్ చేసే ఒక విధానం మన దగ్గర లేదు. పల్లెల్లోని ఉత్పత్తులకు పట్నాల్లోని మార్కెట్‌కు చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ను పూడ్చాలి అనిపించింది’ అంది కావ్యా. ఇక ఆమెకు జీవిత గమ్యం అర్థమైంది. ‘నగరానికి తిరిగి వచ్చాక నాకు ఊపిరి ఆడలేదు. జూలై 2021లో ఇక నేను శాశ్వతంగా నగరానికి వీడ్కోలు చెప్పేశాను. ఒరిస్సాల్లోని ఈ అడవులకు వచ్చి ఉండిపోయాను’ అంటుంది కావ్య. క్రాఫ్ట్ టూరిజం ఇది కొత్తమాటగా అనిపించవచ్చు. కాని హస్తకళలు ఉన్న గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా ప్రోత్సహించడమే క్రాఫ్ట్ టూరిజం. కావ్య ఇప్పుడు కోరాపుట్ ప్రాంతంలోని నియమగిరి కొండల దగ్గర నివశిస్తోంది. ఆ ప్రాంతంలో డోంగ్రియా తెగ ఆదివాసీలు ఎక్కువ. ‘వారు గడ్డితో చాలా అందమైన వస్తువులు చేస్తారు. అవి బాగుంటాయి. అంతేకాదు వారు 47 రకాల బియ్యాన్ని పండిస్తారు. వారి వంటలు మధురం. అవన్నీ నగరాల్లో ఎక్కడ తెలుస్తాయి. ఈ తెగవారు ‘కపడగంధ’ అనే శాలువాను అల్లుతారు. అది చాలా బాగుంటుంది. చెల్లెలు శాలువా అల్లి అన్నకు ఇస్తే అన్న తాను వివాహం చేసుకోదలిచిన అమ్మాయికి దానిని బహుమతిగా ఇస్తాడు. ఆ శాలువాలకు మంచి గిరాకీ ఉంది’ అంటుంది కావ్య. అయితే గ్రామీణ హస్తకళల ఉత్పత్తుల పేరుతో మార్కెట్లో డూప్లికేట్లు ఉండటం గురించి ఆమెకు బెంగ ఉంది. ‘ఒరిజినల్ ఉత్పత్తులను కస్టమర్లకు అందించడానికి ‘క్రాఫ్ట్ పోట్లీ’ అనే సంస్థ స్థాపించి పని చేస్తున్నాను. ఒక గ్రామాన్ని నా వంతుగా దత్తత చేసుకున్నాను. ఆ గ్రామంలో ఉండే 50 మంది మహిళలకు హస్తకళల ద్వారా ఉపాధి కల్పిస్తున్నాను’ అంది కావ్య. ఈమె చేస్తున్న పని చూసి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ హస్తకళల ప్రమోషన్‌కు ఆహ్వానించింది. అక్కడి ఆదివాసీలను తరచూ కలిసి వస్తోంది కావ్య. త్వరలో ఆమె దేశంలోని అందరు ఆదివాసీలను ఒక ప్లాట్‌ఫామ్ మీదకు తెచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందరో మహానుభావులు అని మగవాళ్లను అంటారు. కాని ఎందరో మహా మహిళలు. కావ్య కూడా ఒక మహా మహిళ. -
ఒరిస్సా కొత్త క్యాబినెట్.. ఎన్నాళ్లో వేచిన ఉదయం..
రాష్ట్ర నూతన మంత్రివర్గం కొలువుదీరింది. ఆదివారం ఉదయం 11.45 గంటలకు మంత్రిమండలి సభ్యులతో గవర్నర్ ప్రొఫెసర్ గణేషీలాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక లోక్‌సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. నవీన్ కొలువులో 13మంది కేబినెట్ మంత్రులుగా 8మంది సహాయ మంత్రులుగా(ఇండిపెండెంట్) స్థానం దక్కించుకోగా.. వీరిలో ఐదుగురు మహిళలు ఉండటం విశేషం. ఎప్పటి నుంచో వేచి చూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. 2019లో ఐదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నవీన్ పట్నాయక్.. తాజాగా నూతన మంత్రిమండలిని ఏర్పాటు చేశారు. ఇందులో పలువురు మాజీలకు మరోదఫా అవకాశం ఇచ్చారు. అలాగే ఐదుగురు మహిళలకు మంత్రి పదవులు కేటాయించారు. వీరిలో ముగ్గురికి క్యాబినేట్, ఇద్దరు సహాయ మంత్రి పదవులు లభించాయి. ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన ప్రమీల మల్లిక్‌కు క్యాబినేట్ ర్యాంకు కల్పించారు. కొత్త కొలువులో పాత ప్రముఖులకు పట్టం గట్టారు. వీరిలో నిరంజన పూజారి, రణేంద్రప్రతాప్ స్వొయి, ఉషాదేవి, ప్రఫుల్లకుమార్ మల్లిక్, ప్రతాప్కేశరి దేవ్, అతున్ సవ్యసాచి నాయక్, ప్రదీప్‌కుమార్ ఆమత్, నవకిషోర్ దాస్, అశోక్‌చంద్ర పండా, టుకుని సాహు, సమీర్రంజన దాస్, ప్రీతిరంజన్ ఘొడై, తుషార్‌కాంతి బెహరా, రోహిత్ పూజారి ఉన్నారు. వీరిలో 10 మందికి క్యాబినేట్, 4 మందికి సహాయ మంత్రి పదవులు లభించాయి. అతివలకు వందనం.. నూతన మంత్రిమండలిలో నవీన్ పట్నాయక్ మహిళలకు పెద్దపీట వేశారు. శాసనసభలో 15 మంది మహిళా సభ్యులు ఉండగా.. వీరిలో ఐదుగురికి మంత్రి పదవులు కేటాయించారు. వీరిలో ముగ్గురు క్యాబినేట్, ఇద్దరికి సహాయ మంత్రి పదవులు వరించాచాయి. ఈ లెక్కన మూడో వంతు పదవులు అతివలకు పదవులు కట్టబెట్టారు. ఎస్పీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో ఇందులో ఉండటం గమనార్హం. బర్గడ్ జిల్లా బిజేపూర్ నియోజకవర్గం నుంచి రీతా సాహు, మయూర్భంజ్ జిల్లా కరంజియా నియోజకవర్గం బాసంతి హేంబ్రమ్కు తొలిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టడం విశేషం. ఉషాదేవి, ప్రమీల మల్లిక్(ఎస్సీ), టుకుని సాహుకు క్యాబినేట్ పదవులు దక్కించుకున్నారు. మంత్రివర్గంలో విద్యాధికులు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రిమండలి విద్యాధికులతో రూపుదిద్దుకుంది. కొలువుదీరిన మంత్రుల సగటు వయసు 58 ఏళ్లు కాగా.. 9మంది మంత్రుల వయసు 50 ఏళ్లు లేదా అంత కంటే తక్కువ కావడం విశేషం. 19మంది డిగ్రీ, ఆపై విద్యార్హతలు కలిగి ఉన్నారు. ఆరుగు పోస్ట్రుగాడ్యుయేట్లు, ముగ్గురు ఇంజినీర్లు ఉన్నారు. పదవులు కోల్పోయిన మాజీలు నవీన్ పట్నాయక్ మంత్రిమండలిలో ముగ్గురు అగ్ర నాయకులకు స్థానం లేకుండా పోయింది. వీరిలో ప్రతాప్జెనా, కెప్టెన్ దివ్యశంకర మిశ్రా, డాక్టర్ అరుణ్‌కుమార్ సాహు ఉన్నారు. ముగ్గురు మంత్రులు ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో ప్రభుత్వం తల దించుకోవాల్సిన దయనీయ పరిస్థితులు తాండవించాయి. మహంగ జంటహత్యల కేసులో ప్రతాప్ జెనా, పూరీ హత్యాకాండలో డాక్టర్ అరుణ్‌కుమార్ సాహు, కలహండి జిల్లా ఉపధ్యా యిని మమిత మెహర్ హత్యాకాండలో కెప్టెన్ దివ్యశంకర మిశ్రా వివాదాలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో విపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేప ట్టి, వీరిని మంత్రిమండలి నుంచి బహిష్కరించాలని భారీ ఆందోళనలు చేపట్టారు. ఈ ప్రభావం వారి స్థానాలపై పడిందని సమాచారం. దక్షత లోపం వంటి కారణాలతో మంత్రులు సుశాంతసింఘ్, ప్రేమానంద నాయక్, జ్యోతిప్రకాష్ పాణిగ్రాహి, పద్మినీదియాన్, ప్రతాప్ జెనా, ప ద్మనాభ బెహరా, సుదాం మరాండి, రఘునందన దాస్ కొత్త కొలువులో స్థానం కోల్పోయారు. గంజాం జిల్లాలో ఇద్దరికి.. బరంపురం: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లా నుంచి ఇద్దరికి మంత్రిమండలిలో స్థానం దక్కింది. అలాగే అసెంబ్లీ స్పీకర్‌గా బంజనగర్ ఎమ్మెల్యే విక్రమ్‌కేశరి ఆరక్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే చికిటి ఎమ్మెల్యే ఉషాదేవి, పులసరా ఎమ్మెల్యే శ్రీకాంత్ సాహు మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఇదలి ఉండగా గంజాం జిల్లా దిగపండి ఎమ్మెల్యే స్పీకర్‌గా విధులు నిర్వహించిన సూర్జొపాత్రొ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జిల్లా మంత్రులకు బరంపురం నగర మేయర్ సంఘమిత్ర దొళాయి అభినందనలు తెలియజేశారు. సరక స్థానం.. పదిలం రాయగడ: రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమశాఖ మంత్రిగా జగన్నాథ సరకకు రెండోసారి మంత్రిమండలిలో స్థానం దక్కింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రెండురోజుల క్రితం మంత్రి మండలిని రద్దు చేసి, కొత్త క్యాబినేట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో సరక రెండోసారి మంత్రి మండలిలో స్థానం దక్కించుకోవడంతో జిల్లావాసుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1973 జూన్ 10న బిసంకటక్ సమితి జగిడిలో జన్మించిన ఆయన.. 1997లో జిగిడి సమితి సభ్యుడిగా గెలుపొందారు. అనంతరం అదే పంచాయతీకి సర్పంచ్‌గా పనిచేశారు. 2012లో జరిగిన జిల్లా పరిషత్ చైర్మన్‌గా అవకాశం దక్కించుకున్నారు. అనంతరం 2014లో సార్వత్రిక ఎన్నికలోల బిసంకటక్ నియోజకవర్గం నుంచి పోటీచేసి, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో మరోసారి విజయం సాధించి, సీఎం ఆశీర్వాదంతో రెండోసారి కూడా క్యాబినేట్లో స్థానం దక్కించుకున్నారు. రణేంద్రప్రతాప్ స్వొయి జననం: 1953 జూలై 1 స్వస్థలం: రాధా గోవిందపూర్, కటక్ జిల్లా నియోజకవర్గం: అఠొగొడొ భార్య: మంజుల దాస్ విద్యార్హతలు: ఎం.ఎ, ఎల్ఎల్బీ అభిరుచులు: పర్యటన, పఠనం, క్రీడలు, ఆటలు నవీన్ పట్నాయక్ మంత్రిమండలిలో రణేంద్రప్రతాప్ స్వొయి హ్యాట్రిక్ మంత్రిగా రికార్డు నెలకొలిపారు. రాజా స్వొయిగా సుపరిచితులైన ఆయన.. నవీన్ నేతృత్వంలో ఏర్పాటైన తొలి మంత్రి మండలిలో స్థానం పొందారు. 2019లో ఏర్పాటైన మంత్రివర్గంలో బెర్తు దక్కించుకున్న రణేంద్రప్రతాప్, మంత్రిమండలి మార్పుచేర్పుల ప్రభావం నుంచి విజయవంతంగా బటయట పడగలిగారు. వ్యవసాయం, రైతు సాధికారిత, మత్స్య, పశు వనరుల అభివృద్ధి క్యాబినేట్ మంత్రిగా నియమితులయ్యారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో విశేష అనుభవం కలిగిన వ్యక్తిగా, సౌమ్యశీలిగా పేరొందారు. 1990 నుంచి వరుసగా 7 పర్యాయాలు రాష్ట్ర శాసనసభకు ఎన్నిక కావడం విశేషం. మూడు జిల్లాలకు మెండి చెయ్యి! కొరాపుట్: రాష్ట్ర మంతివర్గ విస్తరణలో మూడు జిల్లాలకు మెండి చెయ్యి మిగిలింది. నవీన్ కొలువులో కొరాపుట్, మల్కన్‌గిరి, నవరంగ్‌పూర్ జిల్లాకు అవకాశం లభించలేదు. ఈ 3 జిల్లాలో బీజేడీ తరఫున 9మంది ఎమ్మెల్యేలుగా గొలుపొందారు. ఇప్పటి వరకు ఈ జిల్లాల నుంచి ఏకైక మంత్రిగా ఉన్న పద్మినీదియాన్ తన పదవిని కోల్పోయారు. ఆమె స్థానంలో సోదరుడు మనోహర్ రంధారికి లభిస్తుందని ఊహాగానాలు వ్యాపించినా.. నిరాసే మిగిలింది. పార్టీ అధిష్టానం సమాచారంతో ఆయన కూడా భువనేశ్వర్ చేరుకొని, క్యాబినేట్ అవకాశం కోసం ఎదురు చూసినా, పిలుపు రాలేదు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జికి అవకాశం వస్తుందని ప్రచారం జరిగి ఫలితం లేకపోయింది. దీంతో అధికార పార్టీ శ్రేణులు డీలా పడిపోయారు. -
వైరల్.. అమ్మ నీకు దండమే...
కొండలు పగిలేంత ఎండ కోరలు చాచి భయపెడుతుంది. రాక్షస దుమ్ము మేఘం ఒకటి ఊపిరిలోకి రావడానికి దూసుకొస్తుంది. అయినా తప్పదు...పని చేయాల్సిందే. ఈ ఎండలో బిడ్డను బయటికి తీసుకురావడం ఏమంత మంచిది కాదు. ఎండమ్మా కాస్త కరుణ చూపు... నా బిడ్డ ముఖం చూసైనా! కానీ ఎండ తగ్గేలా లేదు. అయినా తప్పదు... పని చేయాల్పిందే. పచ్చని చెట్టుకు కట్టిన ఉయ్యాలలో బిడ్డను పడుకోబెట్టి ఊపుతుంటే, ఆ కేరింతలను చూసి ఎన్ని సంవత్సరాలైనా సంతోషంగా బతకవచ్చు. కానీ బతుకుపోరు తనను బజార్‌కు తీసుకువచ్చింది. ఎండైనా, వానైనా పని తప్పదు. పనికి వెళుతున్నప్పుడు బిడ్డను ఇంట్లో వదిలి వెళ్లాలి కదా. ఇంట్లో ఎవరు ఉన్నారని! పెనిమిటి తనలాగే పనికి పోయాడు. పక్కింటివాళ్లకు అప్పగించాలనుకుంటే వారు ఇంట్లో ఉండరు. తనలాగే పనికోసం వెళ్తారు. అందుకే... పనికి వెళ్లక తప్పదు. వెళుతూ వెళుతూ బిడ్డను తీసుకువెళ్లక తప్పదు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో మున్సిపాలిటీ ఉద్యోగి ఒకరు బిడ్డను కొంగుకు కట్టుకొని రోడ్లు ఊడుస్తున్న వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఒక చిత్రం వంద పదాల పెట్టు అంటారు. ఇప్పుడు ఆ వరుసలో లఘుచిత్రాన్ని కూడా చేర్చవచ్చు. శ్రమైకజీవన సౌందర్యం నుంచి వర్కింగ్ వుమెన్ పర్సనల్ చాయిస్ వరకు నెటిజనులు ఈ వీడియో చిత్రం నేపథ్యంగా తమ మనసులోని భావాలను ప్రకటించుకున్నారు. ‘ఇదేనా మహిళా సంక్షేమం అంటే!’ అని ఒకరు వ్యంగ్యబాణం విసిరితే, ‘ఇలాంటి వృత్తి నిబద్ధత ఉన్న మహిళలు ఎంతో మందికి స్ఫూర్తి ఇస్తారు. దేశం ముందడుగు వేయడానికి ఇలాంటి ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉంది’ అంటూ స్పందిస్తారు మరొకరు. ‘ఈ అమ్మలో మా అమ్మను చూసుకున్నాను’ అని ఒకరు కన్నీరు కార్చితే, మరొకరు ‘ఇది పట్టణ దృశ్యం. ఇక మాలాంటి పల్లెల్లో పొలం పనులకు బిడ్డతో వచ్చే తల్లులు ఉన్నారు. చెట్టుకు జోలె కట్టి బిడ్డను అందులో పడుకోబెట్టి పొలం పనులు చేస్తుంటారు. ఆ తల్లి మనసంతా బిడ్డ మీదే ఉంటుంది!’ అని జ్ఞాపకాల్లోకి వెళతారు ఒకరు. ‘మా ఊళ్లో ఒక అమ్మ తన బిడ్డను చెట్టు కింద కూర్చోబెట్టి కూలీపనులు చేసుకుంటుంది. నీళ్లు తాగడం కోసం పొలం దాటి బయటికి వచ్చిన ఆమె బిడ్డను చూసిపోదామని వచ్చేసరికి కాస్త దూరంలో పాము కనిపించి పెద్దగా అరిచి బిడ్డను అక్కడి నుంచి తీసుకొని పరుగెత్తింది. ఈ సంఘటన గురించి ఇప్పటికీ మా ఊళ్లో చెప్పుకుంటారు’ భావోద్వేగాల సంగతి సరే, మంచి సూచనలు ఇచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాటిలో ఒకటి... ‘పేదవాళ్లకు కేర్టేకర్లను ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్థోమత ఉండదు. దేశంలో రకరకాల స్వచ్ఛందసంస్థల గురించి విని ఉన్నాం. పేద ఉద్యోగులు ఉద్యోగానికి లేదా పనికి వెళితే వారి పిల్లలను చూసుకునే స్వచ్ఛందసంస్థలు కూడా వస్తే మంచిది. ఈ దిశగా ఎవరైనా ఆలోచించాలి’. సామాజిక మాధ్యమాల్లో ‘వైరల్’ అనేది కొత్త కాదు. అయితే ఒక మంచి కారణంతో చర్చల్లో ఉండే వీడియోలు అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిలో ఇది ఒకటి. -
ఒకే చోట వరుస ప్రమాదాలు.. ప్రాణాలు తీస్తున్న బ్లాక్‌స్పాట్
ఒకేచోట 20 మీటర్ల దూరంలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లు అంటారు. బరంపురం నగరం నుంచి దిగపండి మీదుగా కొందమాల్, రాయగడ వెళ్లే 326 నంబర్ జాతీయ రహదారిలో తప్తపాణి–కళింగా మధ్య ఘాట్ రోడ్ బ్లాక్ స్పాట్‌గా మారింది. గత కొద్ది రోజులుగా ఇక్కడ వరుసగా ప్రమాదాలు జరుగుతుండడం దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. ఏడాదిలో కాలంలో ఇక్కడ జరిగిన దుర్ఘటనల్లో సుమారు 20 మందికి పైగా మరణించారు. మరో 100 మందికి పైగా తీవ్ర గాయాలు పాలై అస్పత్రిలో చికిత్స పొందగా, వారిలో పదుల సంఖ్యలో వికలాంగులుగా మారారు. అందువలన ఇక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. ఏ పిక్నిక్కు వెళ్లి వస్తుండగా... జనవరి 15వ తేదీన రాయగడా జిల్లా చంద్రగిరికి పిక్నిక్కు వెళ్లి రాత్రి 10 గంటల సమయంలో తిరిగి వస్తున్న బస్సు తప్పపాణి ఘాటి దగ్గర ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాద సమయంలో డ్రైవర్ కంగారు పడడంతో అదుపు తప్పిన పిక్నిక్ బస్సు లోయలోకి పల్టీ కొట్టింది. ప్రమాదంలో పిక్నిక్ వెళ్లిన వారిలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే అంబగడా గ్రామానికి చెందిన బైక్ నడిపిన వ్యక్తి, వెనుక కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. 8 మంది దుర్మరణం ఏప్రిల్ 29వ తేదీన రాయగడా నుంచి బరంపురంనకు 60 మందితో వస్తున్న బస్సు ఉదయం 3 గంటల సమయంలో అదుపు తప్పడంతో 8 మంది దుర్మరణం చెందారు. అలాగే 40 మంది ప్రయాణికులు తీవ్రగాయాల పాలయ్యారు. స్వయంగా గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ అమృత కులంగా, ఎస్పీ బ్రాజేష్ కుమార్‌రాయ్ సంఘటనా స్థలానికి చేరుకొని ఓడ్రాప్ బృందం సాయంతో క్షతగాత్రులను ఎంకేసీజీ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. 60 మంది విద్యార్థులకు ప్రమాదం ఇదే రోడ్డులో జనవరి చివరి వారంలో రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని రవిన్స్శా విశ్వ విద్యాలయానికి చెందిన విద్యార్థులు సుమారు 60 మంది బస్సులో గజపతి జిల్లా గండాహతి వాటర్ ఫాల్స్ వద్దకు పిక్నిక్కు వెళ్లారు. వీరు ఆనందంగా గడిపి తిరిగి రాత్రి 10 గంటల సమయంలో వస్తుండగా బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. దీంతో 30 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర విషాదం ఇటీవల కొందమాల్ జిల్లా దరింగబడి నుంచి బరంపురం మీదుగా పశ్చిమబంగా వెళ్తున్న పర్యాటకుల ఏసీ బస్సు వేకువజామున 3 గంటల సమయంలో గంజాం జిల్లా జగన్నాథ్ ప్రసాద్ బ్లాక్ కళింగా ఘాట్ రోడ్డులో అదుపు తప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టి బోల్తా పడింది. దుర్ఘటనలో 6గురు పర్యాటకులే మృతి చెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. లోయలో పడిన ట్రక్కు అలాగే అక్కడికి కొద్ది రోజుల తర్వాత రాయగడ నుంచి బరంపురం లోడుతో వస్తున్న ట్రాక్‌కు లోయలోకి పడిపోవడంతో డ్రైవర్ మృతి చెందగా, క్లీనర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఇదేవిధంగా పత్తపాణి ఘాటి లోయలో పడిన టాటా సఫారి దుర్ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చెట్టుని ఢీకొని... ఇటీవల గంజాం జిల్లా సురడా బ్లాక్ పరిధి తప్తపాణీ–గజలబడి దగ్గర కళింగా ఘాట్ రోడ్డులో పెళ్లి బృందం వ్యాన్ చెట్టుని ఢీకొనడంతో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కలెక్టర్ ఆదేశాలతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బంజనగర్ ఆస్పత్రికి తరలించారు. చదవండి: Orissa Crime News: నా భార్యను చంపేశాను.. డయల్ 100కు ఫోన్ చేసి.. -
ధైర్యం చెప్పి.. థింసా స్టెప్పులేసి.. పిల్లలతో సరదాగా గడిపిన ఎస్పీ
భువనేశ్వర్: ఆమె ఓ జిల్లాకు పోలీస్ బాస్. నిత్యం నేర సమీక్షలు, శాంతి, భద్రతల పరిరక్షణ, సిబ్బంది విధులపై పర్యవేక్షణ, ఫిర్యాదుదారులతో నిత్యం క్షణం తీరికలేకుండా ఉంటారు. ఐపీఎస్‌గా ఉన్నా.. ఆశ్రమ చిన్నారులతో కలిసి ఆడిపాడారు. నేనున్నానంటూ వారిలో మానసిక ధైర్యం నింపారు. ఆమె.. నవరంగ్‌పూర్ జిల్లా ఎస్పీ ఎస్.సుశ్రీ. నవరంగ్‌పూర్ జిల్లా కేంద్రం సమీపం లోని ప్రభుత్వ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న దీనదయాల్ ఆశ్రమాన్ని ఎస్పీ గురువారం సందర్శించారు. ఆమెతో పాటు కలెక్టర్ కమలోచన్ మిశ్రా ఉన్నారు. వీరిద్దరూ బాలికలకు మిఠాయిలు, మామిడి పళ్లు పంచిపెట్టారు. ఎస్పీ చొరవ కల్పించుకొని బాలికలలో ఒకరిగా కలసిపోయి కులాశాగా కబుర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్నారులంతా కొరాపుటియా థింసా నృత్యం చేయగా.. సుశ్రీ కూడా వారితో జత కలిసి, స్టెప్పులేశారు. స్వయానా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తమతో డ్యాన్స్ చేస్తుండటంతో బాలికలు మరింత ఉత్సాహంగా ఆమెకు సూచనలు చేస్తూ ముందుకు సాగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చూసిన వారంతా ఎస్పీ చొరవను అభినందిస్తున్నారు. చదవండి: వింత ఆచారం: కొరడాతో మహిళలను కొట్టి, ఈలలు వేస్తూ.. -
భళిభళిరా.. బలి
జయపురం(భువనేశ్వర్): సబ్ డివిజన్ పరిధిలోని కుంద్రా గ్రామంలో ఇసుక పండగ(బలి జాతర)ను సోమవారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో పరిసర గ్రామాలకు చెందిన గ్రామ దేవతల లాఠీలు పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మార్కెట్ వద్ద వివిధ రకాల వస్తువులు, ఆహార పదార్థాల కొనుగోలుకు జనం ఆసక్తి చూపారు. గ్రామీణ వ్యవసాయ రంగంలో బలి జాతరకు అధిక ప్రాధాన్యమిస్తారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఆదివాసీలు జరుపుకొనే ప్రధాన పండుగల్లో ఇది కూడా ఒకటి. వర్షాకాలం ప్రారంభానికి సూచికగా బలి జాతర చేపట్టడం విశేషం. ఖరీఫ్ కాలంలో ఏ పంటలు వేస్తే ఉత్తమ దిగుబడులు సాధించవచ్చో తెలుసుకొకనే సూచికగా బలిజాతర జరపడం ఆనవాయితీ. పండగ కోసం ఆదివాసీ దిసారి(పూజారులు) మంచి రోజు నిర్ణయిస్తారు. ఆ రోజు మిగతా గ్రామాల దేవతలకు పూజలు చేసి, ఆమె ప్రతినిధిగా లాఠీ(జెండా)లతో వెదురుబుట్ట పట్టుకుని సమీపంలోని నదికి వెళ్తారు. నదిలో ఇసుకను గ్రామానికి తీసుకు వచ్చి, గ్రామదేవత గుడి ప్రాంగణంలో ప్రతిష్టించి, ఇళ్ల నుంచి సేకరించిన వివిధ రకాల విత్తనాలను ఇసుక బుట్టలో వేస్తారు. మొలకెత్తిన విత్తనాలు పరిశీలించి, బాగా మొలకెత్తిన పంట విత్తనాలు ఖరీఫ్ కాలంలో వేస్తే అధిక దిగుబడి సాధించవచ్చని అభిప్రాయానికి వచ్చారు. ఈ ఇసుక పండగకు వివిధ గ్రామాల ప్రజలను ఆహ్వానించారు. చదవండి: భారత్‌కు మంకీపాక్స్ ముప్పు.. ఇలా అనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే! -
‘పెళ్లి కార్డులు ఇవ్వాలి.. తలుపు తీయండి’... అలా తెరిచారో లేదో.. !
రాయగడ(భువనేశ్వర్): ‘పెళ్లి కార్డులు ఇవ్వడానికి వచ్చాం.. తలుపు తీయండి’ అని పిలవడంతో బయటకు వచ్చిన వారిని దుండగులు బంధించి, దోపిడీకి ప్రయత్నించిన ఘటన స్థానిక బుదరావలసలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే. బుదరావలసలో నివాసముంటున్న జగన్నాథ మహంతి అనే వ్యక్తి ఇంటికి ఐదుగురు వెళ్లి తలుపులు తట్టారు. మీ దుకాణానికి వెళ్తే.. మూసివేసి ఉందని, పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చామని పిలవడంతో జగన్నాథ భార్య జ్యోతి తలుపులు తెరిచారు. అంతా లోపలికి వచ్చి, ఎండతో వచ్చాం.. తాగేందుకు నీళ్లు ఇవ్వండని అనడంతో ఆమె వంటగది వైపు వెళ్లగా ఆమె వెనకాల వెళ్లిన దుండగులు.. కత్తితో బెదిరించారు. అదే సమయంలో ఆమె కొడుకు ప్రీతమ్(15) తన తల్లిపై దాడి చేయండం గమనించి అవరడంతో అతడిని కొటి,్ట బాత్రూంలో బంధించారు. దీంతో వేరే గదిలో ఉన్న ఆమె కూతురు చాందిని(17) కేకలు వేయగా ఇరుగు–పొరుగు వారు రావడంతో దుండగులు బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న 15 వవార్డు కౌన్సిలర్ సంతోష్ కుమార్ దొళాయి పోలీసులకు సమాచారం అందించారు. సైంటిఫిక్ బృందం ఆధారాలు సేకరించిందని ఐఐసీ రస్మీరంజన్ ప్రదాన్ తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: రాత్రికి ఇంటికి వెళ్లాడు.. ఉదయం లేచి చూస్తే.. -
ఈ బంధమేనాటిదో!
మల్కన్‌గిరి(భువనేశ్వర్): తన ఆనందం, అవసరాల కోసం సాధు జంతువులను మచ్చిక చేసుకోవడం వేల సంవత్సరాల క్రితమే మనిషి ప్రారంభించాడు. కొందరైతే అడవుల్లో ఉన్న వన్య ప్రాణులకు సైతం ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చి, యజమానిలా వాటితో ఆదాయం పొందుతుంటారు. మరికొందరు రాక్షసానందం కోసం జీవాల ప్రాణాలు హరిస్తుంటారు. మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి చెందని మహేంద్ర మాత్రం పైవాటికి భిన్నం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వన్యప్రాణికి ఆశ్రయం కల్పించడంతో పాటు ఆలనాపాలన చూస్తున్నారు. జీవం కూడా నిన్ను వదలి పోలేనంటూ గత 20 ఏళ్లుగా ఆయనను విడిచి పెట్టడం లేదు. వివరాల్లోకి వెళ్తే... 20 ఏళ్ల క్రితం వచ్చిన వరదలో మల్కన్‌గిరిలోని జగన్నాథ్ మందిరం సమీపంలో నివాసం ఉంటున్న మహేంద్ర ఇంటికి సమీప కాలువలో అడవిపంది పిల్ల కొట్టుకు వచ్చింది. చలికి గజగజా వణుకుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వరాహాన్ని గమనించిన ఆయన.. ఇంటికి తీసుకు వచ్చి, ఆహారం అందించాడు. రక్షణ కల్పించి, అక్కడే ఆశ్రయం కల్పించాడు. అడవిలో వదిలి పెట్టినా.. వరాహం కొద్దిగా కోలుకున్న అనంతరం మహేంద్ర అటవీశాఖ అధికారులకు అప్పగించేందుకు ప్రయత్నించాడు. అయితే చిన్న పిల్ల కావడంతో అతనే వద్దే క్షేమంగా ఉంటుందని భావించిన సిబ్బంది.. తిరిగి అడవిలోకి పంపించేందుకు నిరాకరించారు. దీంతో అప్పటి నుంచి తన ఇంట్లో మనిషిలాగే వన్యప్రాణిని పెంచి, పెద్ద చేశాడు. దానికి రాజు అని పేరు కూడా పెట్టాడు. ఈ ఇద్దరి బంధం ఏనాటిదో గానీ మహేంద్ర ఎంత చెబితే అంతే అన్నట్లుగా వరాహం తయారైంది. రెండు దఫాలు అడవిలో వదిలినా, తిరిగి మహేంద్ర ఇంటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో జీవిపై మరింత ప్రేమ పెంచుకొని, తనకు ఉన్న దాంట్లోనే రాజుని కూడా పోషిస్తున్నాడు. మనుషుల్లాగే అన్నం, బిస్కెట్లు, రొట్టె, చపాతీ తదితర పదార్థాలను ఆహారంగా అందిస్తున్నాడు. ఈ 20 ఏళ్లలో ఎవరికీ ఎలాంటి హానీ చెయ్యలేదని, వీధిలో పిల్లలు కూడా రాజుతో కాసేప గడిపేందుకు ఆసక్తి చూపుతారని మహేంద్ర చొప్పుకొచ్చారు. ఆహారం కోసం అడవికి వెళ్లినా.. సాయంత్రం తిరిగి వస్తుందని, రాత్రి సమయంలోనూ తనను విడిచి ఉండదని వన్యప్రాణి ప్రేమను ఆయన వివరించాడు. చదవండి: ప్రేమ పెళ్లి.. నా భర్త దగ్గరికి వెళ్లిపోతా.. ఇంతలోనే ఘోరం.. -
ఈ ప్రజలకు ఏమైంది.. వాళ్లనే ఎన్నుకుంటారు!
రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్ ప్రతినిధుల ఎన్నిక ఇటీవల ముగిసింది. ఇందులో సింహభాగం అధికార పక్షం బిజూ జనతాదళ్ అభ్యర్థులే విజేతలుగా నిలిచారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో 90శాతం మంది ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అయితే అరకొర విద్యార్హతతో పాటు నేర చరితులు, కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. ఒడిశా ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సంస్థలు వెల్లడించిన విశ్లేషణాత్మక వివరాల నివేదికలో ఈ వివరాలు బయటపడ్డాయి. భువనేశ్వర్: రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 851మంది జిల్లా పరిషత్ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో 125 మంది విజేతలు అఫిడవిట్ వివరాలు ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ కాలేదు. ఈ నేపథ్యంలో 726 మంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన వివరాలను ఒడిశా ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ ఏడీఆర్ సంస్థలు విశ్లేషణాత్మకంగా వివరించాయి. దాఖలైన పూర్తి వివరాలు ప్రకారం 726 మంది జిల్లా పరిషత్ విజేత అభ్యర్థుల్లో 385 మంది మహిళలు ఉన్నారు. అలాగే నేర చరితుల వర్గంలో అగ్రస్థానంలో నిలిచిన బీజేడీ.. కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానం చేజిక్కించుకోవడం ప్రత్యేకం. 726మంది జిల్లా పరిషత్ సభ్యుల్లో 113మంది నేర చరితులు. 15 మందిపై హత్యాయత్నం ఆరోపణలతో ఐపీసీ 307 సెక్షన్ కింద కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 12మంది విజేత అభ్యర్థులు మహిళల పట్ల అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కలంకితులు.. పంచాయతీ ఎన్నికల్లో విజయ శంఖారావం చేసిన బీజేడీ అభ్యర్థుల్లో అత్యధికంగా 66 మందిపై నేరారోపణలు ఉన్నాయి. 53మంది తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 37మంది బీజేపీ జెడ్పీటీసీలు, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఏడుగురు, ఝార్కండ్ ముక్తి మోర్చా(జేఏఎంఎం), భారతీయ కమ్యునిస్ట్ పార్టీ(సీపీఐ), స్వతంత్ర అభ్యర్థుల వర్గంలో ఒక్కొక్కరి చొప్పున నేరచరితులు ఉన్నారు. బీజేపీకి చెందిన జెడ్పీ సభ్యుల్లో నలుగురిపై తీవ్ర నేరారోపణలు, కాంగ్రెస్ నుంచి ఆరుగురిలో, జేఏఎంఎం, స్వతంత్ర అభ్యర్థుల వర్గంలో ఒక్కొక్క అభ్యర్థికి వ్యతిరేకంగా నమోదైన కేసులు వివిధ కోర్టుల్లో కొనసాగుతున్నాయి. సగటు ఆస్తుల విలువ.. కొత్తగా ఏర్పాటైన మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో సమగ్రంగా 95 మంది(13 శాతం) కోటీశ్వరులు ఉన్నారు. వీరి సగటు ఆస్తుల విలువ రూ.56 లక్షల 60 వేలు. వీరిలో బీజేడీకి చెందిన జిల్లా పరిషత్ అభ్యర్థుల్లో అత్యధికంగా 90 మంది(14 శాతం) కోటీశ్వరులు కాగా.. బీజేపీ నుంచి ముగ్గురు(8శాతం), కాంగ్రెస్‌లో ఇద్దురు(9శాతం) కోటీశ్వరులు ఎన్నికయ్యారు. విద్యాధికులు అంతంతమాత్రమే.. తాజా ఎన్నికల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులుగా ఎన్నికైన వారిలో విద్యాధికులు అంతంత మాత్రమే. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సంస్థ విశ్లేషణాత్మక వివరాలను బహిరంగం చేసింది. కొత్తగా ఎన్నికైన వారిలో 451 మంది(62శాతం) 5వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య విద్యార్హతలు కలిగి ఉన్నారు. 256 మంది(35 శాతం) పట్టభద్రులు, ఆరుగురు డిప్లొమా విద్యార్హత కలిగి ఉన్నారు. ఏడుగురు అభ్యర్థులు నామమాత్రపు అక్షరాశ్యులు. 50 ఏళ్లు పైబడిన అభ్యర్థులు అత్యధికంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. 51 ఏళ్ల నుంచి 70 ఏళ్లు పైబడిన వారు 88 మంది ఉన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన 373మంది అభ్యర్థులు వయస్సు సంబంధిత వివరాలు దాఖలు చేయలేదని నివేదికలే తేలింది. చదవండి: క్షణంలో పెళ్లి.. సొమ్మసిల్లి పడిపోయిన వరుడు.. షాకిచ్చిన వధువు.. ఏం చేసిందంటే! -
క్షణంలో పెళ్లి.. సొమ్మసిల్లి పడిపోయిన వరుడు.. షాకిచ్చిన వధువు.. ఏం చేసిందంటే!
భువనేశ్వర్: ఇటీవల కొన్ని వివాహాలు పీటలు వరకు వచ్చి ఆగిపోతున్నాయి. అయితే అందులో కొన్నింటికి వరుడు కారణమైతే, మరికొన్నింటికి వధువు కారణంగా నిలుస్తున్నారు. గతంలో పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెప్తుంటారు. మరి ఇప్పుడు అదే పెద్దలు చూడట్లేదేమో, మండపం వరకు వచ్చిన వివాహాలు చివరి నిమిషంలో పుల్‌స్టాప్ పడుతున్నాయి. తాజాగా ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లాలోనూ ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. కల్యాణ ఘడియల శుభవేళలో మంగళ వాద్యాలు మారుమోగుతున్న పెళ్లి పందిరిలో అకస్మాతుగా నిశ్శబ్దం ఆవరించింది. వరుడు సొమ్మసిల్లి పోయాడు. దీంతో అక్కడి వారంతా అవాక్కయ్యారు. కాసేపటి తర్వాత తేరుకన్న వరుడు వధువు పాపిట కుంకుమ పెట్టే క్షణంలో ఆమె అందరికీ షాకిస్తూ పెళ్లికి నిరాకరించింది. ఇంతకు ముందే తనకు వేరే వ్యక్తితో వివాహం జరిగినట్లు ప్రకటించి వేదిక నుంచి వైదొలగింది. బాలాసోర్ జిల్లా బలియాపాల్ ఠాణా రెమూ గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఊహాతీత ఘటన చోటు చేసుకుంది. చదవండి: భార్యను కాటు వేసిన కొండచిలువ.. భర్త ఏం చేసాడంటే? -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో కొత్తగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి ఆహ్వనించారు. మే 21 నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 26న విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఉంటాయని సీఎం జగన్‌కు వైవీ సుబ్బారెడ్డి వివరించారు. సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ ఈవో గుణభూషణ రెడ్డి, ఏఈవో దొరస్వామి ఉన్నారు. చదవండి: (ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ) -
విశాఖపట్నం నుంచి తొలిసారిగా కొరాపుట్‌కు రైలు.. షాకిచ్చిన ప్రయాణికులు
కొరాపుట్(భువనేశ్వర్): ఎద్దు ఈనిందంటే.. తీసుకొచ్చి వాకిట్లో కట్టేయమన్న చందంగా ఉంది ఈస్టుకోస్టు రైల్వే అధికారుల తీరు. ప్రజలు డిమాండ్ చేశారు. అధికారులు మంజూరు చేశారు. కానీ రైలు ఏ మార్గంలో నడపాలో పట్టించుకోక పోవడంతో డొల్లతనం బయటపడింది. విశాఖపట్నంలో ఉదయం 6.35 గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరి, రాయగడ మీదుగా తొలిసారిగా కొరాపుట్ చేరుకున్న విస్టాడోం కోచ్‌లో ఒక్కరు కూడా ప్రయాణించ లేదు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో రైల్వేశాఖ సిబ్బందే సమాధానం చెప్పాల్సి ఉంది. వాస్తవానికి విశాఖపట్నం నుంచి అరకు ప్రయాణించే కిరండూల్ రైలు(18551) కొరాపుట్ మీదుగా జగదల్పూర్ వెళ్తుంది. తూర్పు కనుమల్లో ఉన్న ఈ మార్గమంతా ప్రకృతి అందాలతో ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు రైల్వేశాఖ కిరండూల్ రైలుకు విస్టాడోం కోచ్‌ను గతంలోనే అనుసంధానించారు. దీనిని కొరాపుట్ వరకు నడపాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. అయితే ప్రతిపాదనకు ఆమోదించిన ఈస్టుకోస్టు రైల్వే అధికారులు.. కోచ్‌ను మాత్రం రాయగడ మీదుగా కొరాపుట్ వెళ్లే రైలుకు అనుసంధానించి, చేతులు దులుపుకొన్నారు. మరోవైపు విశాఖపట్నం నుంచి కొరాపుట్‌కు నిడిపే ప్రత్యేక రైలు(08545)లో సాధారణ టిక్కెట్ ధర కేవలం రూ.140లు ఉండగా.. విస్టాడోం కోచ్‌లో రూ.1,300లుగా ఉంది. అరుకు మీదుగా కొరాపుట్ చేరు కిరండూల్ రైలులో సాధారణ టిక్కెట్ రూ.85 మాత్రమే. ఈ లెక్కను అరకు అందాలు చూడకుండా రాయగడ మీదుగా విస్టాడోంలో ప్రయాణించేందుకు అదనంగా రూ.1,160లు చెల్లించేందుకు ప్రయాణికులు ఆసక్తిగా ఉండరని రైల్వేశాఖ గమనించలేదు. అలాగే తిరుగు ప్రయాణంలో రైలు అరకు వెళ్లదని తెలిసి, పర్యాటకుల్లో అసంతృప్తి నెలకొంది. చదవండి: పెళ్లిలో ‘షేర్వాణీ’ రగడ -
అనగనగా ఓ రైల్వేస్టేషన్.. అక్కడ ఏ సౌకర్యాలు ఉండవ్
పర్లాకిమిడి(భువనేశ్వర్): ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు ఏళ్లుగా సేవలందిస్తున్న పర్లాకిమిడి, గుణుపురం రైల్వేస్టేషన్లలో కనీస సదుపాయాలు కరువయ్యాయి. ఈ స్టేషన్ల నుంచి రైల్వేకు అధికంగా ఆదాయం వస్తున్నా అభి వృద్ధి చేయడంలో మాత్రం శీతకన్ను వహిస్తున్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాష్ట్రానికి చెందినవారు అయినా ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ. 10 కోట్లు తప్ప, ఇతర మౌలిక సౌకర్యాలకు నిధుల కేటాయించలేదని పలువురు విమర్శిస్తున్నారు. ప్లాట్ఫారం ఎత్తు పెంచేదెన్నడో..? పర్లాకిమిడి రైల్వేస్టేషన్లో ప్లాట్ఫారం ఎత్తు తక్కువగా ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎత్తు తక్కువగా ఉండడంతో వయోవృద్ధులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. కొందరైతే ట్రైన్ ఎక్కేందుకు ప్లాస్టిక్ కుర్చీలు తెచ్చుకుంటున్నారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు కనీసం షెల్టర్ కూడా నిర్మించలేదు. ఇదివరకు సుమారు రూ.3,050 కోట్లతో పర్లాకిమిడి–గుణుపురం–తెరువల్లి–రాయగడ రైల్వేలైన్ అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రులు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా రైల్వేశాఖ అధికారులు, స్థానిక నాయకులు స్పందించి రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. చదవండి: అమ్మానాన్న ప్లీజ్ నన్ను క్షమించండి.. కరిష్మా సూసైడ్ లేఖ -
తగ్గేదేలే.. 58 ఏళ్ల వయసులో పదో తరగతి పరీక్ష రాసిన ఎమ్మెల్యే
భువనేశ్వర్: ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూ పొలం పనుల్లో చురుగ్గా పాల్గొంటున్న ఫుల్బణి ఎమ్మెల్యే అంగద కన్హర్(58) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. విద్యార్థులతో కలిసి మెట్రిక్యులేషన్ పరీక్షలు రాయడం రాష్ట్రవ్యాప్తంగా ట్రెండింగ్ మారింది. కందమాల్ జిల్లా ఫుల్బాణి మండలం పితాబరి గ్రామంలోని రుజంగి ఉన్నత పాఠశాల కేంద్రంలో ఆయన పరీక్షకు హాజరయ్యారు. 1978లో అర్ధాంతరంగా విద్యాభ్యాసం ముగించిన ఆయన.. ఇన్నాళ్లకు పునఃప్రారంభించడం విశేషం. కుటుంబ పరిస్థితులతో అప్పట్లో చదువు కొనసాగించలేక పోయానని, 50 ఏళ్లు పైబడిన వారు కూడా మెట్రిక్యులేషన్ పరీక్షలు రాసి, ఉత్తీర్ణులైనట్లు ఇటీవల వార్తల్లో విన్నానని తెలిపారు. ఉన్నత అభ్యాసానాకి వయస్సు అడ్డు కాదన్నారు. ఇదే ఉత్సాహంతో పరీక్షలకు హాజరైనట్లు ఎమ్మెల్యే వివరించారు. స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎస్‌ఐఓఎస్) వర్గం కింద ఈ ఏడాది 63మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్లు కేంద్రం పరిశీలకురాలు, హెచ్ఎం అర్చనా బాస్ వెల్లడించారు. ఇందులో ఎమ్మల్యే అంగద తోపాటు లుయిసింగి పంచాయతీ సర్పంచ్ సుదర్శన్ కంహర్ కూడా ఉన్నారని ప్రకటించారు. 1985లో క్రీయాశీల రాజకీయాల్లో ప్రవేశించిన అంగద కన్హర్.. వరుసగా 3సార్లు కెరండిబాలి పంచాయతీ సర్పంచ్‌గా గెలుపొందారు. మరో సారి పొకారి పంచాయతీ నుంచి ఎన్నికయ్యా రు. పంచాయతీరాజ్ వ్యవస్థలో అంచెలంచెలుగా ఎదిగారు. ఫిరింగియా మండల అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ సభ్యుడిగా ప్రజాభిమానాన్ని సంపాదించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం ఫుల్బాణి నుంచి బీజేడీ అభ్యర్థిగా పోటీ చేసి, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా కారణంగా పరీక్షలు జరగక పోవడంతో రాయలేక పోయానని చెప్పిన ఎమ్మెల్యే.. శుక్రవారం సాధారణ విద్యార్థిగా ప్రవేశ ద్వారం వద్ద హాల్ టికెట్ చూపించి, కేంద్రంలోకి ప్రవేశించారు. మరో ఇద్దరు మిత్రులతో కలిసి పరీక్షకు రాగా.. వీరిలో ఒకరు స్థానిక సర్పంచ్ కావడం గమనార్హం. చదవండి: King Cobra: కిచెన్‌లోకి వెళ్లిన భార్య ఒక్కసారిగా భయంతో.. -
పట్టు వదలక.. కొడుకుతో కలిసి పరీక్ష రాసిన తల్లి
భువనేశ్వర్: తల్లీ, కొడుకులు తోటి విద్యార్థులుగా మెట్రిక్ పరీక్షలకు హాజరయ్యారు. జయపురం మండలం పూజారిపుట్ గ్రామంలో జ్యోత్స్న పాఢి(తల్లి), అలోక్‌నాథ్ పాత్రొ(కొడుకు) శుక్రవారం మెట్రిక్యులేషన్ పరీక్షలు రాశారు. తల్లి జయపురం ప్రభుత్వ పాఠశాల కేంద్రంలో ఓపెన్ స్కూల్ అభ్యర్థిగా, కొడుకు పూజారిపుట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షలకు హాజరయ్యారు. భర్త త్రినాథ్‌ప్రసాద్ పాత్రొ ప్రోత్సాహంతో అర్ధాంతరంగా ముగించిన చదువును తిరిగి ప్రారంభించినట్లు జ్యోత్స్న తెలిపారు. అసౌకర్యాల వెక్కిరంత! ఉత్తర ఒడిశాలో పలు కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు లేనట్లు ఆరోపణలు వినిపించారు. ఈ కేంద్రాల్లో విద్యార్థులు ఇబ్బందికరంగా పరీక్షలు రాయాల్సి వచ్చిందని నిరుత్సాహం వ్యక్తం చేశారు. వేసవి తాపంతో తల్లడిల్లుతున్న పరిస్థితుల్లో పలు కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు ఏర్పాటు చేయలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: Fake Baba At Uttarakhand: భూత వైద్యం పేరుతో మహిళను లొంగదీసుకొని.. ఆ తర్వాత.. -
మాట నిలుపుకున్న కేంద్రమంత్రి.. చెప్పినట్లే ఢిల్లీ వెళ్లగానే..
కొరాపుట్(భువనేశ్వర్): తాను కొరాపుట్ నుంచి ఢిల్లీ వెళ్లిన వెంటనే ప్రతిపాదిత స్టేషన్లలో రైళ్లు ఆగుతాయన్న కేంద్ర రైల్వే, టెలికాం మంత్రి అశ్వినీ శ్రీవైష్టవ్ ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ అయ్యాయి. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్, బస్తర్ జిల్లా బచేలిలో రైళ్లు ఆగాయి. ఉదయం ఆదేశాలు రావడంతో సాయంత్రం నుంచి ఆయా స్టేషన్లకు హాల్టులు కల్పించారు. మెదటి విడత కోవిడ్ సమయం నుంచి ఈ స్టేషన్లలో రైళ్లు ఆపడం నిలిపివేశారు. అనంతరం కోవిడ్ తగ్గుముఖం పట్టినా రైళ్లను పునరుద్ధరించలేదు. దీంతో ఇటీవల రైల్వే మంత్రి కొరాపుట్ వచ్చినప్పుడు ఈ సమస్యను నాయకులు ప్రస్తావించారు. దీంతో ఆయా స్టేషన్లలో హాల్టులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు నెరవేర్చారు. దీంతో లక్ష్మీపూర్‌లో జగధల్‌పూర్–భువనేశ్వర్, జగధల్‌పూర్–హౌరా, జగధల్‌పూర్–రౌర్కెలా రైళ్లు ఆగనున్నాయి. అలాగే బచేలిలో విశాఖపట్నం–కిరండోల్ ఎక్స్‌ప్రెస్ రైలు (రాత్రిపూట రైలు) ఆగనుంది. ఈ ప్రకటనతో లక్ష్మీపూర్, నారాయణ పట్న, బందుగాం సమితులలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు వాల్తేర్ డీఆర్ఎం అనుఫ్ కమార్ సత్పతి లక్ష్మీపూర్ రైల్వేస్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. చదవండి: ఎస్ఐ స్కాంలో అభ్యర్థి అరెస్టు... బ్లూటూత్ ద్వారా పరీక్ష రాసిన వైనం -
మహమ్మారి.. పొంచే ఉంది!
భువనేశ్వర్: రాష్ట్రంలో కోవిడ్ కేసుల నమోదు అదుపులో కొనసాగుతోంది. అయితే రోజూ 10 నుంచి 20 వరకు మాత్రమే కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి రోజురోజుకీ పెరుగడంతో కోవిడ్ మహమ్మారి పొంచి ఉందనే సంకేతాలు స్పష్టం అవుతున్నాయి. మరోసారి పూర్వ పరిస్థితులు విజృంభించకుండా జాగ్రత్తలు పాటించడం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోవిడ్–19 ఆంక్షలు తొలగించినా.. మాస్కు ధరించడం, ఇతర నివారణ చర్యలను యథాతధంగా కొనసాగిస్తుందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ నిరంజన్ మిశ్రా బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాలుగైదు రాష్ట్రాల్లో కరోనా కేసుల నమోదు తరచూ పెరుగుతోందని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రతిపాదించామన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ప్రధాన వైద్యాధికారులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. కరోనా విజృంభణ పునరావృతం కాకుండా పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని, కోవిడ్–19 నిర్ధారణ పరీక్షల పరిమితి విస్తరించాలని సూచించారు. పాజిటివ్ కేసుల నమోదు పెరిగిన సందర్భాల్లో చేపట్టాల్సిన సత్వర కార్యాచరణకు మార్గదర్శకాలను అనుబంధ యంత్రాంగాలకు జారీ చేశారు. విశ్వసనీయ సమీక్ష.. కోవిడ్ కేసుల నమోదు ఆధారంగా రాష్ట్రంలో నివారణ, నియంత్రణ కార్యాచరణ చేపట్టనున్నారు. నిబంధనల అమలు, సడలింపు, తొలగింపు వ్యవహారాలకు విశ్వసనీయ నివేదిక కీలకంగా ప్రజారోగ్య శాఖ పేర్కొంది. జిల్లాస్థాయిలో నిత్యం నమోదవుతున్న కేసులు, విశ్వసనీయ నివేదికతో మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. పాజిటివ్ కేసుల నిర్ధారణతో సంక్రమణ తీవ్రత, పరిధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఆస్పత్రి వ్యవస్థ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించారు. నిర్ధారిత విధానాల్లో కోవిడ్ పరీక్షలు చేపడుతూ పెరుగుదల, తీవ్రత వంటి విపత్కర సంకేతాలపై నిపుణులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. కరోనా తీవ్రత ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల ఆరోగ్య స్థితిగతుల పట్ల నిఘా పటిష్ట పరచాలని తెలిపారు. విస్తృతంగా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్న జనసమూహ బహుళ అంతస్తు భనవ సముదాయాలు, హాస్టళ్లు, విద్యాసంస్థలు వంటి ప్రాంతాల్లో తరచూ పరీక్షల నిర్వహణ చేపట్టాలని పేర్కొన్నారు. కోవిడ్ సంక్రమణ నియంత్రణ, నివారణ కోసం స్థానికంగా అనుబంధ వ్యవస్థ, వైద్య పరీక్షల పరికరాలతో యంత్రాంగం అనుక్షణం సిద్ధం కావాలని వివరించారు. వైద్యారోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు.. ► భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్ఏ) తరచూ జారీ చేస్తున్న తాజా మార్గదర్శకాల మేరకు కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు చేపట్టడం అనివార్యం. ► కరోనా రోగుల చికిత్స కోసం గృహ నిర్బంధం, ఆస్పత్రి సదుపాయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ► కోవిడ్ ఆరోగ్య సంరక్షణ కార్యాచరణ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలి. ► నిబంధనల మేరకు కోవిడ్ టీకాల ప్రదాన ప్రక్రియ పూర్తి చేయడం పట్ల శ్రద్ధ వహించాలి. ► సామాజిక భాగస్వామ్యంతో వ్యాప్తి నివారణ, ప్రయాణ సమయం, జన సందోహిత ప్రాంతాల సందర్శన, కార్యాలయాల సముదాయాల్లో తిరుగాడే వారంతా మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. ► సామాజిక దూరం, రద్దీతో పరిసరాలు గుమిగూడకుండా ప్రజలు తిరుగాడుతూ కరోనా నివారణ పట్ల చైతన్యవంతం కావాలి. ►జన సందోహిత ప్రాంతాల్లో ఉమ్మడం నిషేధించారు. ► పనులు జరిగే చోట్ల చేతులు శుభ్రం చేసుకునేందుకు సదుపాయాలతో శానిటైజర్ వ్యవస్థ తప్పనిసరి. ► గాలి వీచేలా సదుపాయాలతో పనులు జరిగే ప్రాంతాల్లో పర్యావరణ అనుకూలత కల్పించాలని ఆదేశించారు. -
బీచ్‌లో స్నానం.. అంతలోనే తండ్రిని మింగేసిన అల..
భువనేశ్వర్: పూరీ బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సముద్రపు స్నానం ఓ బాలుడికి తండ్రిని దూరం చేసింది. ఈ ఘటన ఒడిశాలోని పూరీలో చోటు చేసుకుంది. బాలాసోర్‌కు చెందిన బన్సిధర్ బెహెరా(35) కుటుంబసభ్యులతో కలసి వేసవి టూర్ కోసం పూరీ సముద్ర తీరానికి వెళ్లారు. శనివారం తండ్రీకొడుకులు సరదాగా బీచ్‌లోకి దిగి.. ఆడుతుపాడుతూ స్నానం చేశారు. అలా వారు స్నానం చెస్తూ.. సముద్రపు ఓ పెద్ద అల వైపు బన్సిధర్ బెహెరా దూకాడు. దీంతో ఆ పెద్ద అల వారిని అతలాకుతలం చేసింది. అల నుంచి బన్సిధర్ బెహెరా తిరిగి రాలేదు. 12 ఏళ్ల అతని కొడుకు మాత్రం సురక్షితంగా ఉన్నారు. అతని కుటుంబసభ్యులు అప్రమత్తమైనప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతని మృతదేహం కోసం డైవర్లు, ఫైర్ సిబ్బంది సముద్రంలో వెతుకుతున్నారు. సముద్రంలోకి దిగి స్నానం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఇక్కడకు వచ్చే పర్యటకులకు చెబుతామని పూరీ బీచ్ పోలీసులు తెలిపారు. అయితే కొంతమంది తాము చెప్పే సూచనలు నిర్లక్ష్యం చేస్తుంటారని అన్నారు. దాని వల్లే ఇలాంటి ప్రమాదలు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. ఈ ఘటనను కుటుంబసభ్యుల్లో ఒకరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. బన్సిధర్ బెహెరా బాలాసోర్‌లో చిరు వ్యాపారిగా పనిచేస్తున్నారు. -
ఒడిశా యువతిపై లైంగిక దాడి.. అపస్మారకస్థితిలో
సాక్షి, గురజాల: ఒడిశాకు చెందిన మహిళపై లైంగిక దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దుర్ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. సేకరించిన సమాచారం మేరకు ఒడిశాకు చెందిన మహిళ తన మూడేళ్ల కుమారుడితో కలిసి శుక్రవారం రాత్రి మాచర్ల ప్యాసింజర్ రైలు నుంచి గురజాల రైల్వే గేట్ హాల్ట్ వద్ద దిగింది. పొట్టకూటి కోసం వచ్చిన ఆమె టికెట్ కౌంటర్ వద్దే రాత్రి నిద్రించింది. ఆ సమయంలో ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు తెలిసింది. తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితిలో ఆమె పడి ఉంది. శనివారం ఉదయం ఆమె పక్కనే మూడేళ్ల బాలుడు బిక్కచూపులు చూస్తూ కూర్చుండడాన్ని గమనించిన స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది వచ్చి బాధితురాలిని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించారు. వైద్యురాలు లక్ష్మి యువతికి ప్రాథమిక చికిత్స చేశారు. పోలీసులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. బాధితురాలు మాట్లాడే భాష అర్థం కాకపోవడంతో కొందరు స్థానికులను పిలిపించి విచారణ సాగిస్తున్నారు. మహిళ ఇంకా దిగ్భ్రాంతిలో ఉండడంతో సరైన వివరాలు చెప్పలేకపోతున్నట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు. గురజాల డీఎస్పీ బెజవాడ మోహర జయరాం ప్రసాద్, సీఐ రాయన ధర్మేంద్రబాబు, జీఆర్పీ సీఐ టి శ్రీనివాసరావు, ఆర్పీఫ్ సీఐ నాగార్జునరావు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరిసరాల్లో ఆరా తీస్తున్నారు. చదవండి: (సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం) -
అడుగంటినది
పర్లాకిమిడి(భువనేశ్వర్): గజపతి జిల్లాలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు వర్షాభావ పరిస్థితులతో మహేంద్రతనయ, వంశధార నదీజలాలు అడుగంటాయి. రాష్ట్ర సరిహద్దులో మహేంద్రతనయ నది చిన్నపాయలా ప్రవహిస్తోంది. పాతపట్నం మండలం–పర్లాకిమిడి సరిహద్దుల్లో ప్రజారోగ్యశాఖ ఇంజినీర్లు మహేంద్రతనయ వంతెన కింద ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసి, పంపుల సాయంతో నీటిని పర్లాకిమిడి లోని పీహెచ్ఈడీ పంప్‌హౌస్‌కి పంపిస్తున్నారు. పర్లాకిమిడిలో రోజుకు 12మిలియన్ గ్యాలన్ల తాగునీరు అవసరం కాగా.. 8 మిలియన్ల గ్యాలన్ల తాగునీటిని మాత్రమే సరఫరా అవుతోందని అధికారులు తెలిపారు. పట్టణంలో రోజూ ఉదయం గంట సేపు మాత్రమే తాగునీటిని అధికారులు అందిస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో వర్షాలు పడకపోతే పట్టణ ప్రజలకు మరిన్ని ఇబ్బందుతు తప్పవని అభిప్రాయ పడుతున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తలతో పర్లాకిమిడి డీఎన్ ప్యాలెస్ వద్ద నీటిని రిజర్వ్ చేశారు. మూడు గోట్టపు బావులు తవ్వకాలు చేపట్టారు. దీంతో కొంతవరకు నీటి ఎద్దడికి అడ్డకట్ట వేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పగటిపూట 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
అన్వి... అన్నీ విశేషాలే!
ఏడాదిలోపు పిల్లలు పాకుతూ, పడుతూ లేస్తూ నడవడానికి ప్రయత్నిస్తూ పసి నవ్వులు నవ్వుతారు. వచ్చీరాని మాటలను పలుకుతూ ముద్దు లొలికిస్తుంటారు. ‘‘దాదాపు ఈ వయసువారంతా ఇలానే ఉంటారనుకుంటే మీరు పొరపడినట్లే. ప్రతిభకు వయసుతో సంబంధంలేదు. మాలాంటి చిచ్చర పిడుగులు బరిలో దిగితే అచ్చెరువు చెందాల్సిందే’’ అంటోంది అన్వి విశేష్ అగర్వాల్. రెండున్నరేళ్ల వయసున్న అన్వి తన పెయింటింగ్స్‌తో ఏకంగా గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. రెండేళ్లకే ఈ రికార్డు సాధిస్తే ఇక పెద్దయ్యాక ఇంకెన్ని అద్భుతాలు చేస్తోందో అని అవాక్కయ్యేలా చేస్తోంది చిన్నారి అన్వి. భువనేశ్వర్‌కు చెందిన అన్వి విశేష్ అగర్వాల్ 72 చిత్రాలను గీసి అతి చిన్నవయసులో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఎక్కువ సంఖ్యలో పెయింటింగ్స్ వేసిన అతిపిన్న వయస్కురాలుగా నిలిచి లండన్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. రెండున్నరేళ్ల పాప ఇన్ని రికార్డులు సాధించిందంటే చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది అక్షరాలా నిజం. అన్వి పెయింటింగ్ జర్నీ కేవలం తొమ్మిది నెలల వయసులోనే జరగడం విశేషం. అప్పటినుంచి పెయింటింగ్స్ వేస్తూనే ఉంది. ‘‘మ్యాగ్నెంట్, పెండులమ్, కలర్స్ ఆన్ వీల్స్, రిఫ్లెక్షన్ ఆర్ట్, హెయిర్ కాంబ్ టెక్చర్, రీ సైక్లింగ్ ఓల్డ్ టాయిస్, హ్యూమన్ స్పైరోగ్రఫీ, దియా స్ప్రే పెయింటింగ్, బబుల్ పెయింటింగ్’’ వంటి 37 రకాల పెయింటింగ్ టెక్నిక్స్‌ను ఆపోశన పట్టింది. పెయింటింగేగాక పంతొమ్మిది నెలల వయసు నుంచే స్పానిష్ భాషలో మాట్లాడడం ప్రారంభించింది. 42 అక్షర మాల శబ్దాలను స్పష్టంగా పలుకుతూ ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. అత్యంత అరుదైన చిన్నారులు మాత్రమే ఇవన్నీ చేయగలుగుతారు.అన్నట్లు అన్వి అందర్నీ అబ్బురపరుస్తోంది. ‘‘కోవిడ్ సమయంలో కుటుంబం మొత్తం ఇంటికే పరిమితమయ్యాం. ఈ సమయంలో పిల్లల్ని బిజీగా ఉంచడం చాలా పెద్ద టాస్క్. ఎప్పుడూ వారికి ఏదోఒకటి నేర్పించాలనుకున్నా ఆ సమయంలో అన్నీ లభ్యమయ్యేవి కావు. ఈ క్రమంలో అన్వికి పెయింటింగ్స్ వేయడం నేర్పించాం. మేము చేప్పే ప్రతి విషయాన్నీ లటుక్కున పట్టేసుకునేది. దీంతో ఆమెకు ఆసక్తి ఉందని గ్రహించి పెయింటింగ్స్ మెలుకువలను నేర్పించగా కొద్ది నెలల్లోనే నేర్చేసుకుంది. ఆ స్పీడు చూసి ప్రోత్సహించడంతో ఈ రోజు మా పాప ఈ రికార్డుల్లో తన పేరును చేర్చింది. రెండున్నరేళ్ల అన్వి ఈ రికార్డులు సాధించి మరెంతోమంది చిన్నారులకు ఆదర్శంగా నిలవడం మాకెంతో గర్వంగా ఉంది’’ అని అన్వి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
పైన చూస్తే చింతపండు.. లోపలే ఉంది అసలు మ్యాటర్!
మల్కన్‌గిరి(భువనేశ్వర్): జిల్లాలోని కలిమెల సమితి ఎంపీవీ–31 గ్రామం వద్ద మల్కన్‌గిరి ఎస్డీపీఓ సువేందుకుమార్ పాత్రొ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు భారీగా గంజాయిని గుర్తించారు. చింతపండు లోడ్‌తో ట్రక్‌ను తనిఖీ చేయగా, 15 క్వింటాళ్ల గంజాయి బయట పడింది. డ్రైవర్ కన్నరామ్ చౌదరి, వ్యాపారి ప్రతామ్ పాత్రొను అరెస్ట్ చేశారు. అతివేగంగా వెళ్తున్న ట్రక్‌పై అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేయగా.. 63 బస్తాల్లో నింపి, చింతపండు లోడ్ మధ్య తరలిస్తున్న గంజాయిని గుర్తించారు. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.కోటికి పైగా ఉంటుందని ఎస్డీపీఓ గురువారం ప్రకటించారు. నిందితులపై కేసు నమోదు చేసి, మల్కన్‌గిరి కోర్టులో హాజర్ పరిచారు. గంజాయిని మోటు మీదుగా తెలంగాణకు తరలిస్తున్నట్లు తేలిందన్నారు. చదవండి: చేతబడి: నిద్ర లేచి తలుపు తెరచి చూస్తే.. -
తల్లీ,బిడ్డల హత్య కేసు.. మాజీ ఎమ్మెల్యేకి యావజ్జీవ కారాగార శిక్ష
భువనేశ్వర్: బ్రజ్‌రాజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే అనుప్ సాయెకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ సెషన్స్ కోర్టు శనివారం తీర్పు వెల్లడించింది. రెండేళ్ల క్రితం తల్లీ, బిడ్డలపై ఓ మోటార్ వాహనం ఎక్కించి, వారిని అత్యంత అమానుషంగా హతమార్చిన ఘటనలో ఆయనకు వ్యతిరేకంగా కేసు నమోదు కాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మాజీ ఎమ్మెల్యేని దోషిగా పరిగణిస్తూ చర్యలు చేపట్టడం గమనార్హం. ఇదే కేసులో డ్రైవర్ వర్ధన్ టోప్నోని నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించి, విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. వివరాలిలా ఉన్నాయి.. 2000లో యువతి కల్పన దాస్‌కి బీహార్‌కి చెందిన సునీల్ శ్రీవాస్తవ్‌తోతో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల పాప ఉండగా, అనివార్య కారణాల రీత్యా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కల్పన దాస్‌తో మాజీ ఎమ్మెల్యే అనుప్ సాయెతో అక్రమ సంబంధం ఏర్పడి, అది బలపడింది. కొన్నాళ్లకు ఆమె తనని పెళ్లి చేసుకుని, ఆస్తిలో వాటా ఇవ్వాలని కోరడంతో తల్లీపిల్లలను చంపాలని అనుప్ సాయె భావించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకుంటానని, ఆమెని నమ్మించాడు. తల్లీబిడ్డలను తీసుకుని, హమిర్పూర్ అడవులకు వెళ్లాడు. అక్కడ వారిపై నుంచి ఓ వాహనం ఎక్కించి, దారుణంగా చంపేశారు. 2016 మే 7వ తేదీన ఈ ఘటనపై చక్రధర నగర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం 2020 ఫిబ్రవరి 12వ తేదీన మాజీ ఎమ్మెల్యేని పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులోని నిందితుడికి హార్ట్ఎటాక్ -
అమ్మాయిల కళ్లముందే యువతిపై అఘాయిత్యం! వీడియో, ఫొటోలతో ఎంజాయ్ చేస్తూ..
ఒడిశా (మల్కన్‌గిరి) : అశ్లీల వీడియో పోస్ట్(విడుదల) చేసిన యువకుడు నిరంజన్ మఝితో పాటు అతడికి సహకరించిన నలుగురు యువతులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని కలిమెల సమితి, ఎంవీ–79 గ్రామంలో ఓ 17 ఏళ్ల యువతిని సదరు నిందితుడు శనివారం కిడ్నాప్ చేసి, ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనంతటినీ వీడియో తీసి, విడుదల చేశాడు. ఈ ఘటనకు మరో నలుగురు యువతుల సాయం చేయగా, దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులందరినీ అరెస్ట్ చేయడం గమనార్హం. అరెస్టయిన వారిలో నిరంజన్ మఝితో పాటు అతడికి సహకరించిన మమత మండాల్, అనోమా బిశ్వాస్, నలిని హల్ధర్, మధుమ హల్ధర్ ఉన్నారు. -
ముఖ్యమంత్రి సింప్లిసిటీ.. కాలి నడకన పోలింగ్ బూత్‌కు..
భువనేశ్వర్: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆడంబరాలకు దూరంగా ఉంటారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆయన సింప్లిసిటీ వార్తల్లో నిలిచింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీఎం నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 9.10 గంటలకు ఓ సాదాసీదా ఓటరుగా కాలినడకన 53వ నంబర్ వార్డులోని ఏరోడ్రామ్ ఉన్నత పాఠశాలకు చేరుకున్న ఆయన 544వ నంబర్ పోలింగ్ బూత్‌లో బీఎంసీ మేయర్, కార్పొరేటర్లకు ఓటు వేశారు. నవీన్ నివాస్ నుంచి కేవలం 300 మీటర్ల దూరంలోనే ఈ పోలింగ్ కేంద్రం ఉండడంతో సీఎం సాధారణ రక్షణ దళం సహాయంతో కాలినడకన ఓటు వేసేందుకు వెళ్లడం విశేషం. (చదవండి: 10 నిమిషాల్లో డెలివరీ ఎలా సాధ్యం?: ‘జొమోటో’కు పోలీసుశాఖ నోటీసులు) -
ఏం జరిగింది..రాత్రి అదృశ్యం.. ఉదయం రైలు పట్టాలపై శవంగా మారింది
కొరాపుట్: అనుమానాస్పదంగా అంజితా కింబుడి(12) అనే బాలిక మృతి చెందిన సంఘటన జిల్లాలోని దమంజొడి రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం వెలుగుచూసింది. ఖోరాగుడకి చెందిన ఈ బాలిక బుధవారం రాత్రి అదృశ్యం కాగా, ఆ మరుసటి రోజు ఉదయం రైలు పట్టాలపై బాలిక మృతదేహం కనిపించడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు ముందు అటువైపుగా వెళ్లిన హిరాఖండ్ రైలు ఢీకొనడంతోనే సదరు బాలిక మృతి చెంది ఉంటుందని ఓ వర్గం అభిప్రాయపడుతుండగా, ఎవరో కిడ్నాప్ చేసి, హత్య చేసి మృతదేహం రైలు పట్టాలపై పడేసి ఉంటారని మరో వర్గం సందేహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు రైలురోకోకి దిగారు. దీంతో అటువైపుగా వచ్చే జగదల్పూర్–హౌరా వెళ్తున్న సమలేశ్వరీ రైలుని ఆపి, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి మృతదేహం తరలించారు. అనంతరం నిరసనకారులకు నచ్చజెప్పి, ఆందోళన విరమింపజేశారు. -
పాఠశాలలో పిస్తోల్ కలకలం.. తరగతి గదులను మాస్టారు ఆధీనంలోనే ఉంచుకుని..
భువనేశ్వర్: సంబల్పూర్ జిల్లా, జొమొనొకిరా సమితి, రెంగుముండా ప్రాథమికోన్నత పాఠశాలలోని ఓ తరగతి గదిలో నాటు పిస్తోలు లభించడం చర్చనీయాంశమైంది. సోమవారం ఉదయం తరగతి గది శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్యకర్తలకు అక్కడి పిస్తోలు కనిపించింది. వీరు ఈ విషయం ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీకాంత్ బాగ్ దృష్టికి తీసుకువెళ్లారు. నిన్నమొన్నటి వరకు ఈ పిస్తోలు లభించిన తరగతి గది సహాయ ఉపాధ్యాయుడు గోవిందు భొయి ఆధీనంలో ఉండేది. ఇక్కడి నుంచి బదిలీ అయ్యేంత వరకు పాఠశాలలో రెండు తరగతి గదులను ఆయన తన ఆధీనంలోనే ఉంచుకుని, వినియోగించారు. తనకు వేరే చోటుకు బదిలీ అయిన తర్వాత ఆ గది తాళాలు అప్పగించకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాళాలు తెరిచి, గది శుభ్రం చేస్తుండగా ఈ పిస్తోలు తారసపడినట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. (చదవండి: పెద్దాయన పబ్లిసిటి పిచ్చి.. తిక్క కుదిర్చిన కన్సుమర్ కోర్టు ) -
జనంపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు.. చితకబాదిన స్థానికులు
భువనేశ్వర్: ఒడిశాలో లఖింపుర్ ఖేరి తరహా ఘటన చోటు చేసుకుంది. శనివారం బీజూ జనతాదళ్ పార్టీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ కారు ప్రజలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ఘటన పలువురు గాయపడగా, ఏడుగురు పోలీసులు ఉన్నారు. వివరాల ప్రకారం.. బ్లాక్ చైర్పర్సన్ ఎన్నిక జరుగుతుండగా బీడీఓ బాణాపూర్ కార్యాలయం వెలుపల ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కారు అక్కడ గుంపుగా ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 22 మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరు మృతి చెందారు.దీంతో ఆగ్రహించిన ప్రజలు ఎమ్మెల్యేపై తిరగబడి చితకబాదడంతో పాటు ఆయన కారు కూడా ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు జగదేవ్‌ను గతేడాది బీజేడీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. .@bjd_odisha Chilika MLA Prasant Jagdev brutally mows down public in Banpur. Women & Lady police officers injured. The arrogance of power of @Naveen_Odisha and his MLA's is clearly visible. #Odisha pic.twitter.com/OxSdP7Tr3v — Sumit Kumar Behera (@SumitOdisha) March 12, 2022 -
యువతిపై ప్రియుడి అఘాయిత్యం.. నమ్మి వస్తే స్నేహితులతో కలిసి..
మల్కన్‌గిరి(భువనేశ్వర్): విషం తాగి బబిత హంతాల్(17) అనే యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి సమితి, పెద్దవాడ పంచాయతీ, బప్పన్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈ యువతి, మత్తిలి సమితి, పూరణగుడకు చెందిన గుప్త బారల్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం ఉదయం ఇంట్లో వాళ్లకు చెప్పి, ప్రియుడి ఇంటికి బబిత వెళ్లింది. అయితే అక్కడ ప్రియుడు తన స్నేహితులతో కలిసి, బబితపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ప్రియుడి ఇంట్లోనే విషం తాగి, ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన యువతిని చికిత్స నిమిత్తం మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు. అయినా పరిస్థితి విషమించడంతో ఉన్నత వైద్యసేవల కోసం మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి యువతిని తరలించారు. అయితే అక్కడే చికిత్స పొందుతుండగా యువతి మృతి చెందడం విచారకరం. ఈ ఘటనపై కన్నీరుమున్నీరు అయిన యువతి తల్లిదండ్రులు మల్కన్‌గిరి పోలీసులను ఆశ్రయించి, న్యాయం చేయాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. -
గేమ్ ఆడుతూ ప్రేమ.. ఎవరికి తెలియకుండా పెళ్లి.. ట్విస్ట్ ఇచ్చిన పేరెంట్స్
మైసూరు: ఆన్లైన్లో పరిచయమైన ఒడిశా యువతిని ప్రియుడు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. యథా ప్రకారం అమ్మాయి తల్లిదండ్రులు ప్రేమ లేదు, పెళ్లీ లేదు అని యువతిని తమతో తీసుకెళ్లారు. దీంతో ప్రియుడు కమ్ భర్త.. తన భార్య కావాలని పోలీసులను ఆశ్రయిచాడు. వివరాలు.. మైసూరు సిటీకి చెందిన మహ్మద్ అఖిబ్ అనే యువకుడు ఆన్లైన్లో గేమ్ ఆడుతున్న సమయంలో ఒడిశాకు చెందిన ప్రియాత్ రావత్ అనే యువతి పరిచయమైంది. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుతూ ప్రేమించుకున్నారు. తరువాత అఖిబ్ ఒడిశాకు వెళ్ళి యువతిని మైసూరుకు తీసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నాడు. తమ కుమార్తె కనిపించక పోవడంతో యువతి తల్లిదండ్రులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను మైసూరులో ఉన్నానని, పెళ్లి చేసుకున్నానని ప్రియాత్ తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పోలీసులతో వచ్చి మాట్లాడాలని చెప్పి కూతురిని పిలిపించుకుని ఒడిశాకు తీసుకెళ్లారు. అఖిబ్ భార్య కావాల్సిందేనని మైసూరు నగరంలోని ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఫార్మాసిస్ట్ వచ్చీరాని వైద్యం.. బాలిక మృతి
మల్కన్‌గిరి (ఒడిశా): ఓ ఫార్మాసిస్ట్ వచ్చీరాని వైద్యం.. ఓ బాలిక మృతికి దారితీసింది. బాధిత కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి.. జిల్లా కేంద్రంలోని జగన్నాథ్ మందిరం సమీపంలో నివాసముంటున్న సందీప్ బెహరా అనే ఫార్మాసిస్ట్ తన ఇంటి వద్దనే క్లినిక్ నిర్వహిస్తూ తన వద్దకు వచ్చిన రోగులకు వైద్యం చేస్తుంటాడు. బుధవారం ఉదయం 4 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఎంవీ–44 గ్రామానికి చెందిన వాసుదేవ్ బాలా కూతురు వందన బాలా(14)ని చికిత్స కోసం ఇతడి వద్దకు తీసుకువచ్చారు. చదవండి: (తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు రోజులుగా భర్త మృతదేహంతోనే..) పరీక్షించిన సందీప్ బాలికకు బ్లడ్ టెస్ట్(రక్త పరీక్ష) చేయించాలని సూచించారు. ఈ పరీక్ష అనంతరం వచ్చిన రిపోర్టులో సదరు బాలికకు ప్లేట్లెట్స్ తగ్గినట్లు తేలింది. దీంతో మెరుగైన వైద్యం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి బాలికను తరలించేందుకు బాధిత కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఆస్పత్రిలో అయితే సకాలంలో వైద్యం అందించరని, ఇక్కడ తానే వైద్యం చేసి, బాగు చేస్తానని సందీప్ వారికి నచ్చజెప్పాడు. ఆయన మాటలు నమ్మి, బాలికను అక్కడే ఉంచారు. ఈ క్రమంలో సందీప్ వైద్యం అందించినప్పటికీ తీవ్ర అస్వస్థతతో గురువారం ఉదయం బాలిక కన్నుమూసింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు సదురు ఫార్మాసిస్ట్ నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. అనంతరం సందీప్‌పై ఈడ్చుకుని వెళ్లిమరీ పోలీసులకు అప్పగించి, అతడిపై కేసు నమోదు చేయించారు. -
తనకు ఓటు వేయలేదని గ్రామస్తులపై కక్ష.. ఏం చేశాడంటే?
పర్లాకిమిడి(భువనేశ్వర్): పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ సర్పంచ్ అభ్యర్థి తనకు ఓటు వేయని గ్రామస్తులపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వారిని ఇబ్బంది పెట్టాలని గ్రామ రహదారిని దిగ్బంధం చేశాడు. రోడ్డుకు ఓ వైపు పెద్ద గొయ్యి తవ్వి.. మరోవైపు దారికి అడ్డంగా భారీ బండరాళ్లను ఉంచాడు. దీంతో కూలి పనులు, ఇతర అవసరాల నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన గజపతి జిల్లాలోని రాయఘడ సమితిలో ఉన్న ఏఓబీ(ఆంధ్రా–ఒడిశా బోర్డరు)లోని గంగాబడో పంచాయతీలో బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. ఇదంతా ఇక్కడి పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేసి, ఓటమి పాలైన బరిక శోబోరో అనే వ్యక్తి చేసిన నిర్వాకంగా తేలింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేడీ మద్దతు అభ్యర్థిగా ఇతడు పోటీ చేశాడు. అయితే ఇక్కడి ప్రజలు ఇతడిని కాదని ఇండిపెండెంట్ అభ్యర్థి హారిబందు కార్జికి అండగా నిలిచి, అతడిని గెలిపించారు. దీంతో కోపంతో రగిలిపోయిన బరిక శోబోరో తనకు అధికార పార్టీ బీజేడీ అండ ఉందన్న అహంకారంతో గ్రామస్తులపై ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కొత్త సర్పంచ్ హారిబందు కార్జి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గారబంద పోలీసులు, గారబంద ఐఐసీ అధికారి సర్వేశ్వర సామంత్రాయ్, తహసీల్దారు లీలావతి ఆచార్య హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం రహదారి పునరుద్ధరణ పనులకు చర్యలు ముమ్మరం చేశారు. -
ఏమైందో ఏమో తెలియదు కానీ ఉదయం తలుపు తెరచి చూస్తే..
మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలోని దుర్గగుడి వీధిలో మధుస్మిత మహాపాత్రో(45) అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగుచూసింది. రెండు నెలల క్రితమే భర్త చనిపోవడంతో మనోవేదనకు గురైన ఈమెని బంధువులు ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో ఈమె ఓ అద్దె ఇంట్లో ఒంటరిగానే ఉంటోంది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఉదయం ఆమె ఇంటి తలుపులు తెరిచి ఉండకపోవడంపై సందేహం వ్యక్తం చేసిన ఇరుగుపొరుగు వారు ఆమెని పలిచారు. అయినా ఆమె ఇంటి లోపలి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు విరగ్గొట్టి, చూడగా ఉరికి వేలాడుతున్న మధుస్మిత మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి మృతదేహం తరలించారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మతనమంటే ఇదే.. మేక పిల్లలకు పాలిస్తున్న కుక్క !
భువనేశ్వర్: సృష్టిలో తీయనిది తల్లి ప్రేమ. పేగు తెంచుకుని కన్న బిడ్డలకు ఆదరించి లాలించడం పరిపాటే. తల్లి లేని లోటు ఏ జీవికైన భర్తీ చేయలేనిది. కూనలు కన్ను తెరిచేలోగా ప్రసవించిన తల్లి మేక కన్ను మూసింది. పోషణకు ఆధారమైన తల్లి పాలు లేక అల్లాడుతున్న మేక పిల్లల్ని వీధి కుక్క అక్కున చేర్చుకుంది. నిత్యం క్రమం తప్పకుండా తన పాలుని పంచిపెడుతోంది. మయూర్భంజ్ జిల్లా జమదా మండలం మధుపూర్ గ్రామంలో ఈ విభిన్న మాతృత్వం శుక్రవారం తారసపడింది. రాగా అంకుర్ బాగే పోషించిన మేక 2 పిల్లల్ని ఈనింది. మరుక్షణమే తల్లి మేక కన్ను మూసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో గంజితో జీవుల ఆకలి తీర్చేందుకు యజమాని చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. వీధుల్లో తిరుగాడుతున్న కుక్కకి తల్లిని కోల్పోయిన మేక పిల్లలు చేరువయ్యాయి. కడుపునిండా పాలు పంచి మేక పిల్లల్ని కుక్క అక్కున తీసుకుని ఆదరించడం స్థానికులను ఆలోచింపజేసింది. -
హద్దుల్లేకుండా.. హల్లో!
భువనేశ్వర్: రాష్ట్రంలో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు మొబైల్ ఫోన్ నెట్వర్కు అందుబాటులోకి రానున్నదని కేంద్ర సమాచార, ఎలక్ట్రానిక్స్ సాంకేతిక సమాచారం, రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్ట్ర పర్యటన పురస్కరించుకుని సోమవారం మీడియాతో సమావేశమయ్యారు. త్వరలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో 4వేల మొబైల్ టవర్ల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో సమగ్రంగా 6వేల గ్రామాలకు మొబైల్ నెట్వర్క్ లేదన్నారు. ఈ నేపథ్యంలో మారుమూల గ్రామాలకు నెట్వర్క్ సదుపాయం కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్లో 3,933 గ్రామీణ ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు ఆదేశించారన్నారు. ఏ ఒక్క గ్రామం మొబైల్ నెట్వర్క్ లేకుండా ఇబ్బందులు పడకూడదని సూచించారన్నారు. ఈ నేపథ్యంలో సర్వే నిర్వహించి, కేబినెట్ నోట్ ప్రవేశ పెట్టామన్నారు. పూర్వోదయ మిషన్‌లో భాగంగా ఈ చర్య చేపడుతున్నట్లు వివరించారు. బీఎస్ఎన్ఎల్కు పునరుజ్జీవం దివాలా తీసిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ల్)కు నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు పునరుజ్జీవం కల్పించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ చర్యతో ఈ సంస్థ గతేడాది నిర్వహణ లాభాల (ఆపరేటింగ్ ప్రాఫిట్) స్థాయికి పునరుద్ధరణ సాధించిందన్నారు. బీఎస్ఎన్ల్కు రెండు విడతల్లో ఆర్థిక వనరులు కల్పించిందని తెలిపారు. తొలివిడత కింద 2019లో రూ.90వేల కోట్లు, మలివిడతగా రూ.45వేల కోట్లు ఈ ఏడాది మంజూరు చేశారని ప్రకటించారు. దీంతో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలు పునరుజ్జీవం పొందాయన్నారు. దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని, 4జీ టెక్నాలజీ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. 5జీ వ్యవస్థ ప్రయోగాత్మక దశలో తుది మెరుగులు దిద్దుకుంటోందని, ఫోన్, రేడియోకు 5జీ టెక్నాలజీ అనుసంధానంతో త్వరలో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. కనీవినీ ఎరుగని నిధులు.. రాష్ట్రంలో రైల్వేరంగం సమగ్ర అభివృద్ధికి బడ్జెట్లో కనీవినీ ఎరుగని స్థాయిలో నిధులు కేటాయించారు. యూపీఏ హయాం కంటే 2022–23 బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామన్నారు. 2009 నుంచి 2014 వరకు కొనసాగిన కాంగ్రెస్ హయాంలో రాష్ట్రానికి ఏటా సగటున సుమారు రూ.800 కోట్ల నిధులు కేటాయించారని గుర్తుచేశారు. 2014–2019 మధ్య బీజేపీ ప్రభుత్వం ఏటా సగటున రూ.4,126 కోట్లు రాష్ట్ర రైల్వే రంగానికి కేటాయిస్తోందన్నారు. ఈ ఏడాది రాష్ట్ర రైల్వే రంగానికి రూ.9,734 కోట్లు కేటాయించడం చారిత్రాత్మకంగా వివరించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 12 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. -
ఇలాంటి ఆధార్ కార్డును ఎప్పుడైనా చూశారా? సోషల్ మీడియా ఫిదా
భువనేశ్వర్: కోవిడ్ నియంత్రణలో భాగంగా పండగలు, ఉత్సవాలు, వివాహాది శుభకార్యాల నిర్వహణపై ప్రభుత్వ ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఏ కార్యక్రమం అయినా జనసమూహానికి తావులేకుండా పరిమిత వ్యక్తులతో కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా జరుపుకోవాలనేది ప్రధానమైన నిబంధన. ఈ నేపథ్యంలో త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఛత్తీస్‌గఢ్‌లోని యశ్‌పూర్ జిల్లా, ఫర్సభ సమితి, అంకిరా గ్రామానికి చెందిన లోహిత్ సింఘ్ కాస్త వినూత్నంగా ఆలోచించాడు. ఆధార్ తరహాలో తన పెళ్లి కార్డ్‌ను ప్రింట్ చేయించి, బంధుమిత్రులకు పంచిపెట్టాడు. పెళ్లికి విచ్చేసే వారంతా ముఖానికి మాస్క్ ధరించడమే కాకుండా భౌతికదూరం పాటించాలని పిలుపునిస్తూ శుభలేఖలో పేర్కొనడం విశేషం. బార్ కోడ్ సైతం కలిగి ఉన్న ఈ కార్డ్‌లో ఆధార్ నంబరు స్థానంలో పెళ్లి తేది, అడ్రస్ స్థానంలో ఆచరించాల్సిన కోవిడ్ నియమాలు ఉండడం ప్రత్యేక ఆకర్షణ. ప్రస్తుతం ఈ పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో సైతం ఈ తరహా వెడ్డింగ్ కార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. -
దామోదర్ హోతా కన్నుమూత
భువనేశ్వర్: ప్రముఖ ఒడిస్సీ శాస్త్రీయ సంగీతకారుడు దామోదర్హోతా తన 87వ ఏట ఆదివారం కన్నుమూశారు. వయసు మీదపడడంతో పలు అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. హోతా మృతికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఆదివారం దేశం ఇద్దరు సంగీత దిగ్గజాలను కోల్పోయిందన్నారు. చదవండి: వాళ్లు అలా అనేసరికి లతా మంగేష్కర్ ఒక్కరోజే బడికెళ్లింది -
ఆ రాష్ట్రంలో భారీగా ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీలు..!
Electric Vehicle Subsidy In Odisha:ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీలు) కొనుగోళ్లపై 15% డిస్కౌంట్ అందించనున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ఒడిశా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2021 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ద్విచక్ర వాహనాలకు వాహనం ఎక్స్ షో రూమ్ ధర మీద 15% లేదా రూ.5,000 వరకు, త్రిచక్ర వాహనాలకు రూ.10,000, నాలుగు చక్రాల వాహనాలకు రూ.50,000 వరకు సబ్సిడీలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆర్డీవో కార్యాలయాల ద్వారా వాహనాలు రిజిస్టర్ చేసుకున్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో సబ్సిడీ మొత్తం క్రెడిట్ చేయనున్నట్లు తెలిపింది. ఈ పథకం డిసెంబర్ 31, 2025 వరకు అమలులో ఉండనున్నట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు, కొనుగోలు ప్రోత్సాహకాల క్రెడిట్, ఈవీ కొనుగోళ్ల రుణ సబ్సిడీలకు సంబంధించిన సమాచారాన్ని ట్రాక్ చేయడానికి ఎన్ఐసి లేదా ఒసీఏసీ సహాయంతో రవాణా కమిషనర్ ఒక ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇంతకు ముందు, వాణిజ్య & రవాణా శాఖ అన్ని కేటగిరీల ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజులు, మోటారు వాహన పన్నులపై అక్టోబర్ 29, 2021 నుంచి మినహాయింపు ఇచ్చింది. (చదవండి: ఫేస్‌బుక్‌పై విజిల్ బ్లోయర్ ఫ్రాన్సెస్ హౌగెన్ సంచలన ఆరోపణలు..!) -
పసికందు అమ్మకం: తండ్రి అరెస్టు
భువనేశ్వర్: పసికందు అమ్మకం ఘటనలో తండ్రి అరెస్టయిన ఘటన జాజ్‌పూర్ జిల్లాలో సంచలనం రేకిత్తించింది. ఇదే వ్యవహారంలో ఇద్దరు మధ్యవర్తులు, మరో ఇద్దరు కొనుగోలుదారులు అరెస్టయ్యారు. అరెస్టయిన వారిలో శిశువుని కొనుగోలు చేసిన దంపతులు(కైలాస్ బారిక్, సస్మిత బారిక్), శిశువు అమ్మకానికి బేరం కుదిర్చిన అంగన్వాడీ కార్యకర్త ప్రభాషినీ దాస్, ఆమె సోదరుడు దీపక్ దాస్, శిశువును అమ్మకానికి పెట్టిన తండ్రి నటవర బెహరా ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి.. జాజ్‌పూర్ జిల్లాలోని ధర్మశాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సనొరాయిపొడా గ్రామానికి చెందిన నటవర బెహరా భార్య కాంచన్ బెహరా ధర్మశాలఆరోగ్య కేంద్రంలో ఈ నెల 27వ తేదీన ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 28వ తేదీన డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లింది. అదే రోజు శిశువు తండ్రి నటవర బెహరా కేంద్రాపడా జిల్లాలోని మహాకలపడా ప్రాంతానికి చెందిన దంపతులకు రూ.12 వేలకు తన బిడ్డను అమ్మేశాడు. శనివారం సాయంత్రం ఈ సంఘటన వెలుగుచూడడంతో జిల్లా శిశు సంరక్షణ అధికారులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. దీనిపై కొత్తొపూర్ ఔట్‌పోస్ట్‌లో ఫిర్యాదు దాఖలైంది. దీని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు శనివారం రాత్రి శిశువుని కొనుగోలు చేసిన వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం ఆదివారం ఉదయం సదరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నటవర్, కాంచన్ దంపతులకు ఈ బిడ్డ నాలుగో సంతానం కాగా రోజువారీ కూలి పనులతో బతుకు భారమవుతుండడంతోనే శిశువును అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. తమ అభ్యర్థన మేరకే అంగన్వాడీ కార్యకర్త బిడ్డను దత్తత తీసుకునే వారిని సంప్రదించిందని దంపతులు తెలిపారు. -
బాలుడి కిడ్నాప్.. సోషల్‌మీడియా సాయంతో కథ సుఖాంతమైంది!
కొరాపుట్(భువనేశ్వర్): ట్రక్ డైవర్ కిడ్నాప్ చేసిన బాలుడు సోషల్ మీడియా సాయంతో ఇంటికి చేరిన ఘటన అందరినీ ఆనందంలో ముంచెత్తింది. నవరంగపూర్ జిల్లా ఎస్పీ పురుషోత్తం దాస్ దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం ప్రకటించారు. 2021 అక్టోబర్ 22న నవంరంగ్‌పూర్ జిల్లా చందాహండి పోలీస్ స్టేషన్ పరిధి ఖపరాది గ్రామంలో ఓ ట్రక్ డ్రైవర్ ప్రదీప్ అనే బాలుడిని అపహరించి, ఎత్తకుపోయాడు. (చదవండి: గతేడాది వివాహం.. అత్తవారింటికి వెళ్లి ఎవరూ లేని సమయం చూసి.. ) దీనిపై అదేరోజు చందాహండి పోలీస్ స్టేషన్లోకేసు నమెదయ్యింది. బాలుడిని ట్రక్ డ్రైవర్ హర్యనాలోని రేవాడి జిల్లా గొడిబాల్ని జంక్షన్ వద్ద జాతీయ రహదారి–6పై డిసెంబర్ 21న రాత్రి వదలి వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న హరున్ధావన్ దాబాకు చేరిన ప్రదీప్ ఉదంతాన్ని దాబా యజమాని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారి, నవంరంగ్‌పూర్ జిల్లాకు చేరింది. దీనిపై ఎస్పీ జోక్యం చేసుకొని, హర్యానాలోని బాలసదన్‌కు సమాచారం అందించి, సంరక్షించారు. అనంతరం ప్రదీప్ సోదరుడు భుజభల్ని జిల్లా పోలీసుల బృందంతో అక్కడకు పంపించి, నవరంగపూర్ లోని కుంటుంబ సభ్యులకు అప్పగించారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా, పోలీసులు చేసిన సాయాన్ని మరువలేమని కన్నీటి పర్యంతమవుతున్నారు. -
గతేడాది వివాహం.. అత్తవారింటికి వెళ్లి ఎవరూ లేని సమయం చూసి..
రాయగడ(భువనేశ్వర్): జిల్లాలోని కాసీపూర్ సమితి ఒండ్రాకంచ్ పోలీస్ స్టేషన్ పరిధి కంటాలి గ్రామంలో యువకుడు గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు తొలొజొరి గ్రామానికి చెందిన నందొ మజ్జి(18)గా పోలీసులు గుర్తించారు. ఒండ్రాకంచ్ ఐఐసీ తపన్‌కుమార్ మహాలి తెలిపిన వివరాల ప్రకారం.. కటాలి గ్రామానికి చెందిన శివమజ్జి పెద్ద కుమార్తెతో నందొ మజ్జికి గతేడాది వివాహం నిశ్చయమయ్యింది. (చదవండి: సీఎం దృష్టికి వెళ్లకుండా చూస్తాం.. రూ.25లక్షలు ఇవ్వు.. డీఎంకే ఎమ్మెల్యేలకు బెదిరింపులు ) ఈ క్రమంలో నందొ అప్పుడప్పుడు అత్తవారింటికి వెళ్లి, వస్తుండేవాడు. బుధవారం కూడా అదే విధంగా వెళ్లిన యువకుడు.. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడు సాయంతో ఉరి వేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఘటన హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్నికల చిత్రాలు.. ఓటు కోసం పడరాని పాట్లు.. మహిళ కాళ్లుకు..
భువనేశ్వర్/జాజ్‌పూర్: పంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్రమైన సంఘటనలు తారసపడుతుంటాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన మహిళా అభ్యర్థులు వినయ విధేయతలు మరింత ఎక్కువగా ప్రదర్శిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. జాజ్‌పూర్ జిల్లా, జాజ్‌పూర్ సమితి, ఎరబంగా పంచాయతీలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో సమితి సర్పంచ్ అభ్యర్థి రేఖా మల్లిక్, సమితి సభ్యురాలిగా పోటీ చేస్తున్న సస్మతి శెట్టి పంచాయతీ బహుముఖాభివృద్ధికి హామీ ఇస్తూ తమకు ఓటు వేసి, గెలిపించాలని ఇలా పెద్దలకు వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఓటుకో పాదాభివందనం లెక్కన పంచాయతీ వ్యాప్తంగా ప్రచారం చేయడంలో ఇలా తలమునకలయ్యారు. -
కలిసి బతకలేమని అర్థమైంది.. అందుకే ఇద్దరు కలిసి..
కొరాపుట్/నవరంగపూర్: ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నవరంగపూర్ జిల్లాలోని రాయిఘర్ సమితి, తురు(యువీ) గ్రామంలో శనివారం కలకలం రేపింది. తురు గ్రామానికి చెందిన దర్బార్ గోండో(20), కంగ గ్రామానికి చెందిన సునీత గోండో(18) గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు వారి ప్రేమను నిరాకరించారు. దీంతో తాము జీవితంలో కలిసి ఉండలేమని భావించిన వారు చనిపోయేందుకు నిర్ణయించుకున్నారు. తురు గ్రామంలోని దర్బారు నివాసానికి 200 మీటర్ల దూరంలో ఓ చెట్టుకు ఇద్దరూ ఉరేసుకుని చనిపోయారు. దీనిపై రాయిఘర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారులపై కేంద్రమంత్రి దాడి.. తలుపులు మూసి కుర్చీ తీసుకొని..
భువనేశ్వర్: కేంద్రమంత్రి విశ్వేశ్వర టుడు ప్రభుత్వ అధికారులపై దాడి చేసి, వారిని గాయపరిచారు. మయూర్భంజ్ జిల్లాలో ఈ సంచలనాత్మక సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గాయపడిన వారిలో మయూర్భంజ్ జిల్లా ప్రణాళిక, పర్యవేక్షణ కేంద్రం డిప్యూటీ డైరెక్టరు అశ్వినికుమార్ మల్లిక్, సహాయ డైరెక్టరు దేవాశిష్ మహాపాత్రో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. లక్ష్మీపోషీ దగ్గరున్న పార్టీ కార్యాలయానికి సదరు అధికారులను రప్పించుకుని, మంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి, అధికారుల మధ్య జరిగిన చర్చ వేడెక్కడంతో మంత్రి తన అనుచరులతో కార్యాలయం తలుపులు మూయించి, అధికారులను దుర్భాషలాడి అక్కడి కుర్చీతో వారిపై దాడికి పాల్పడినట్లు ప్రధాన ఆరోపణ. ఈ దాడిలో అశ్వినికుమార్ మల్లిక్ ఎడమ చేయి విరిగింది. ఈ విషయం జిల్లా కలెక్టరు దృష్టికి వెళ్లగా లిఖితపూర్వకమైన ఫిర్యాదు దాఖలు చేస్తే తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అయితే తనపై వచ్చిన ఈ ఆరోపణ అవాస్తవమని మంత్రి విశ్వేశ్వర టుడు ఖండించారు. -
స్టార్ హీరో మిహిర్ దాస్ ఇకలేరు.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
భువనేశ్వర్: ఓలీవుడ్ స్టార్ హీరో, యాక్టర్ మిహిర్ దాస్(63) మంగళవారం కన్నుమూశారు. కటక్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో ఓలీవుడ్ సినీ కళాకారులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవల గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం కొన్నిరోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో చేరారు. బహుళ అవయవాల వైఫల్యంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. మయూర్భంజ్ జిల్లాలోని బరిపదలో 1959 ఫిబ్రవరి 11వ తేదీన మిహిర్ దాస్ జన్మించారు. 1979లో విడుదలైన తొలి కమర్షియల్ చిత్రం మధుర విజయ్ సూపర్ హిట్ కావడంతో ఆయన దశ తిరిగింది. లక్ష్మీ ప్రతిమ, ఫెరి ఆ మో సున్నా భొవుణి చలన చిత్రాలు ఆయనకు రాష్ట్ర ఫిల్మ్ అవార్డు, ఉత్తమ నటుడు అవార్డు సాధించిపెట్టాయి. రాఖీ బంధిలి మో రొఖిబొ మొనొ, ప్రేమొ ఒఢెయి ఒక్షొరొ చలన చిత్రాల్లో ఉత్తమ సహాయ నటుడి అవార్డును ఆయన అందుకున్నారు. ప్రేక్షక హృదయాల్లో స్థానం సుస్థిరం.. అత్యుత్తమ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో మిహిర్ దాస్ స్థానం సుస్థిరం సంతాపం ప్రకటించారు. ఒడియా చలన చిత్ర రంగం ప్రముఖ నటుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. –ప్రొఫెసరు గణేషీ లాల్, రాష్ట్ర గవర్నరు ఉన్నత శ్రేణి నటుడిని కోల్పోయింది.. రాష్ట్ర చలన చిత్ర రంగం ఉన్నత శ్రేణి నటుడిని కోల్పోయింది. బహుముఖ నటుడిగా మిహిర్ దాస్ పేరొందారు. 3 దశాబ్దాలుగా తిరుగులేని నటుడిగా హవా కొనసాగించి, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన లేరన్న వార్త మనసుని కలచివేసింది. – బిశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రప్రదేశ్ గవర్నరు ఒడియా చిత్ర రంగానికి తీరని లోటు.. మిహిర్ దాస్ మరణం ఒడియా చలన చిత్ర రంగానికి తీరని లోటు. తనదైన నటన, ప్రతిభాపాటవాలతో భావితరాలకు ప్రేరణగా నిలిచారు. ఓలీవుడ్ ఓ మంచి నడుడిని కోల్పోయింది. – నవీన్ పట్నాయక్, ముఖ్యమంత్రి అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన నటుడు.. ఓలీవుడ్లో అత్యంత ప్రేక్షాకాదరణ ఉన్న నటుడిగా మిహిర్ గుర్తింపు సాధించారు. ఆయన నటనతో ఒడియా సినిమాలకు మంచి గుర్తింపు తీసుకువచ్చారు. ఆయన మరణం తీరని లోటు – సూర్యనారాయణ పాత్రో, రాష్ట్ర శాసనసభ స్పీకరు -
దుప్పట్లు అమ్ముతూనే.. మరోవైపు ఎవరికి తెలియకుండా..
కొరాపుట్(భువనేశ్వర్): జిల్లాలోని నందపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దుప్పట్ల విక్రయం మాటున జరుగుతున్న గంజాయి కొనుగోళ్ల గుట్టురట్టయింది. కొమరగుడా జంక్షన్ వద్ద హర్యానా నుంచి వచ్చిన సుల్తాన్ సింగ్ ఓ గుడారం ఏర్పాటు చేసుకుని, సమీప గ్రామాల్లో దుప్పట్ల అమ్మకం ప్రారంభించాడు. అయితే అతడు దుప్పట్లు అమ్ముతూనే మరోవైపు ఎవరికి తెలియకుండా గంజాయి కొనుగోలు చేస్తుండేవాడు. శుక్రవారం ఉదయం అతడు సేకరించిన గంజాయిని తరలించేందుకు సిద్ధం చేస్తుండగా, సమాచారం అందుకున్న పోలీసులు అత డి నివాసానికి చేరుకుని, రూ.660 కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ప్రమోద్‌కుమార్ బనువా తెలిపారు. -
వృద్ధుడి సైకిల్ సందేశం.. మూడు నెలల్లో 7వేల కిలోమీటర్ల ప్రయాణం!
బరంపురం/ఒడిశా: ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ నగరానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు సాహసయాత్రకు సిద్ధమయ్యాడు. స్థానిక కాపువీధికి చెందిన ఎ.కృష్ట్రారావు బరంపురం నుంచి రామేశ్వరం–అయోధ్య మీదు గా దేశంలోని ప్రఖ్యాత ప్రదేశాల్లో సైకిల్‌యాత్ర చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో స్థానిక ఫ్రెండ్స్ వెల్ఫేర్ క్లబ్ ఆధ్వర్యంలో బరంపురం గ్రామదేవత మాబుడి శాంతమ్మ ఆలయాన్ని బుధవారం దర్శించుకున్న ఆయన.. స్థానిక పాతబస్టాండ్ ప్రాంగణంలో సైకిల్‌యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో ఆశాంతి, అహింస రోజురోజుకీ పెరిగిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. మనుషుల మధ్య అంతరాలు ఏర్పడి, దేశాలు, ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందన్నారు. వైషమ్యాలు తొలగిపోయి, అంతా ప్రశాంతంగా మెలగాలని ఆకాంక్షిస్తూ సైకిల్‌యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. బరంపురం, రామేశ్వరం, అయోధ్య ప్రాంతాలను చుట్టి వస్తూ చివరగా పూరీ జగన్నాథుని దర్శించుకోనున్నట్లు ప్రకటించారు. సగటున రోజూ 100 కిలోమీటర్లు చొప్పున మూడు నెలల్లో 7వేల కిలోమీటర్లు సైకిల్‌పై చుట్టి వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో కృష్ణారావు ఆకాంక్ష నెరవేరాలంటూ స్థానికులు ఆయనను ఉత్సాహ పరిచి, సాగనంపారు. చదవండి: భర్త, కుమారుడి ఎదుటే మహిళపై అత్యాచారం.. -
భర్త, కుమారుడి ఎదుటే మహిళపై అత్యాచారం..
జయపురం (ఒరిస్సా): స్థానిక సమితిలో భర్త, కుమారుడి ఎదుటే మహిళపై అత్యాచారం జరిపిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు ఫరారీలో ఉన్నాడు. పట్టుబడిన వ్యక్తి జయపురం సమితి కుములిపుట్ పంచాయతీ కుములిపుట్ ప్రాంతానికి చెందిన మీణా హరిజన్‌గా గుర్తించారు. దీనికి సంబంధించి ఎస్డీపీఓ అరూప్‌అభిషేక్ బెహరా వివరాలను బుధవారం వెల్లడించారు. ఘటనపై కాంగ్రెస్, బీజేపీ సహా ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేయడంతో దోషులను పట్టుకొనేందుకు ఎస్డీపీఓ నేతృత్వంలో పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. పాడువ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవిలో ఒక నిందితుడు ఉన్నట్లు సమాచారం అందింది. హుటాహుటిని అక్కడికి చేరుకున్న పోలీసులు.. చాకచక్యంగా హరిజన్‌ను అరెస్టు చేశారు. అతడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 10 కేసులు ఉన్నాయని తెలిపారు. జయపురం సదర్ పోలీసు స్టేషన్లో 4 కేసులు, పట్టణ పోలీసు స్టేషన్లో 5 కేసులు, కొరాపుట్ సదర్ పరిధిలో ఒక కేసు ఉన్నట్లు వివరించారు. పట్టుబడిన వ్యక్తిని కోర్టుకు తరలించారు. రెండో నిందితుడి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: (కన్నపేగు కారాగారంలో.. పిల్లలు పాట్నాకు) -
కన్నపేగు కారాగారంలో.. పిల్లలు పాట్నాకు
పర్లాకిమిడి (ఒడిశా): పర్లాకిమిడి ఉప కారాగారంలో రిమాండ్‌లో ఉన్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఖైదీ పిల్లలను గజపతి జిల్లా అధికారులు వారి స్వగ్రామం పాట్నాకు బుధవారం తరలించారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న పాట్నాకు చెందిన వివాహిత ఇటీవల మోహానా వద్ద పోలీసులకు పట్టుబడింది. ఆమెను అరెస్టు చేసి, పర్లాకిమిడి ఉప కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఆమెతో పాటే 5, 7 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు అమ్మాయిలను కూడా కారాగారానికే తరలించడంపై జిల్లా శిశు సంరక్షణ సమితి, జిల్లా లీగల్ సర్వీసెస్ అధ్యక్షులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనర్ బాలికలను జైలులో ఉంచకుండా వారి స్వగ్రామానికి తరలించాల్సిందిగా ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్ లింగరాజ్ పండా, ఎస్పీ జయరాం శత్పథి సూచనల మేరకు పిల్లలిద్దరినీ పాట్నా తీసుకొని వెళ్తేందుకు డీసీపీయూ కార్యాలయానికి చెందిన నరేష్కుమార్ నాయక్, మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను వెంట పంపించారు. వారంతా పర్లాకిమిడి నుంచి పయనమై వెళ్లారు. చదవండి: (మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పండి!) -
ఇప్పటివరకు 25 వేల పక్షులు.. వావ్ వాట్ ఏ సీన్!
బరంపురం: నగర శివారులోని బహుదా నదీ తీరాన విదేశీ అతిథి పక్షులు సందడి చేస్తున్నాయి. తొలిసారిగా ఇక్కడికి విచ్చేస్తున్న విహంగాలను చూసి నగరవాసులు ఆనందం వ్యక్త చేస్తున్నారు. ఏటా శీతాకాలంలో గంజాం జిల్లా, బరంపురం దగ్గరలోని చిలికా సరస్సులో ఉన్న 24 దీవులకు విదేశాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో వలస పక్షులు వచ్చి, విడిది చేస్తుంటాయి. ఎప్పటిలాగే కాకుండా ఈ ఏడాది రికార్డు స్థాయిలో 185 జాతులకు చెందిన దాదాపు 10 లక్షల పక్షులు చిలికాకు చేరుకోవడంతో, వాటిలో కొన్నింటి నివాసం ఏర్పాటుకు కాస్త అడ్డంకి ఏర్పడింది. దీంతో విడిది కోసం సరస్సుకు సమీపంలోని బహుదా నదికి కొన్ని పక్షులు చేరుకుంటున్నట్లు సమాచారం. ఇదంతా చూస్తున్న అక్కడి వారు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే మరింత బాగుంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు 25 వేల పక్షులు నదీ తీరానికి చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల నదీ తీరంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును అక్కడి అడవిలోకి తరలించేందుకు వెళ్లిన బరంపురం అటవీ శాఖ అధికారుల ద్వారా అతిథి పక్షుల ఆచూకీ వెలుగులోకి రావడం విశేషం. ప్రస్తుతం నది పరిసర ప్రాంతాల్లో నివాసం ఏర్పరుచుకుని 25 వేల వరకు పక్షులు ఉన్నట్లు గుర్తించినట్లు డీఎఫ్ఓ అముల్యకుమార్ ప్రధాన్ తెలిపారు. చదవండి: కొన్ని రోజులు కాపురం చేసి ముఖం చాటేశాడు.. 44 రోజుల పాటు పగలు, రాత్రి.. చివరికి -
కొన్ని రోజులు కాపురం చేసి ముఖం చాటేశాడు.. 44 రోజుల పాటు పగలు, రాత్రి.. చివరికి
బరంపురం: నవ వధువు తపస్విని దాస్ న్యాయ పోరాటం ఫలించింది. తనను ప్రేమించి, పెళ్లాడిన వైద్యుడు సమిత్ సాహు కొన్నిరోజుల కాపురం తర్వాత తనను ఒంటరిగా వదిలేసి, ముఖం చాటేశాడు. దీంతో ఆమె తన భర్త కోసం అత్తవారింటి ఎదుట ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో ఈమెకి స్థానిక ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల నుంచి పెద్దఎత్తున మద్దతు తెలిపి, కోర్టులో కేసు వేశారు. కోర్టు తీర్పు వచ్చేంత వరకు దాదాపు 44 రోజుల పాటు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆమె ఆందోళన చేసింది. ఈ క్రమంలో మంగళవారం విచారణ చేపట్టిన బరంపురంలోని జిల్లా కోర్టు తపస్విని దాస్‌కు అత్తవారింట్లోనే అత్తమామలతో కలిసి ఉండేందుకు అవకాశం కల్పించాలని, ప్రతి నెలా ఆమె ఖర్చుల కోసం రూ.17 వేలు ఇవ్వాలని కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో బాధితురాలు, ఆమెకు మద్దతుగా నిలిచిన ప్రజలు న్యాయం గెలిచిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఓ వైపు భర్త స్నేహితుడు.. మరో ఇద్దరితో మహిళ వివాహేతర సంబంధం -
యువతిపై అత్యాచారం, హత్య.. కట్టెల కోసమని అడవిలోకి వెళ్లగా..
ఒరిస్సా(జయపురం): బొరిగుమ్మ సమితి చలానగుడ గ్రామ సమీపంలోని నీలగిరి అడవిలో 19 ఏళ్ల యువతి మృతదేహాన్ని పోలీసులు సోమవారం కనుగొన్నారు. ఆమెపై అత్యాచారం జరిపి, ఆపై హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలు చిలిగుడ గ్రామానికి చెందిన సుభద్ర అమనాత్య(19)గా గుర్తించినట్లు బొరిగుమ్మ సబ్‌డివిజనల్ పోలీసు అధికారి హరికృష్ణ మఝి తెలిపారు. సుభద్ర అమనాత్య డిసెంబరు 30న ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఆమె తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు గాలించారు. జాడ తెలియరాలేదు. చదవండి: (బెదిరించి లొంగదీసుకుని.. గిరిజన బాలికలపై లైంగిక దాడి..) సోమవారం ఉదయం చిలిగుడ గ్రామ మహిళలు కట్టెల కోసమని నీలగిరి అడవిలోకి వెళ్లగా, సగం కాలిన సుభద్ర అమనాత్య మృతదేహం కనిపించింది. బొరిగుమ్మ పోలీసు అధికారి ఖురేశ్వర సాహుకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసు డాగ్, సైంటిఫిక్ టీమ్‌లు చేరుకొని దర్యాప్తు ప్రారంభించాయి. సుభద్రను దుండగులు హత్యచేసి నీలగిరి తోటలో పడేసినట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని హరికృష్ణ మఝి వెల్లడించారు. దుండగులను పట్టుకున్నాకనే ఆమెపై అత్యాచారం జరిగిందా, ఎందుకు హత్య చేశారనే విషయాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. మృతురాలి సోదరుడు బలరాం అమనాత్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
భార్యతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. గాలిపటం గొంతుకు చుట్టుకుని ప్రాణం తీసింది..
భువనేశ్వర్/కటక్: గాలిపటాలు ఎగరేస్తుంటే వచ్చే ఆనందమే వేరు. కానీ ఆ పతంగి పైపైకి పోవాలనే భావనతో కొంతమంది దారానికి మాంజా(గాజు పెంకుల పొడి) పూయడం అనేక సమస్యలకు కారణమవుతోంది. ఇప్పటివరకు మాంజా కాళ్లకు చుట్టుకుని పక్షులు మరణించిన ఉదంతాలు మాత్రమే చూశాం. ప్రస్తుతం మాంజా పూసిన దారం మెడకు చుట్టుకోవడంతో ఓ వ్యక్తి మరణించిన దుర్ఘటన సంచలనం రేకిత్తిస్తోంది. కటక్–చాంద్‌బాలి జాతీయ రహదారిలోని పీర్ బజారు ప్రాంతంలో సోమవారం ఉదయం కటక్‌లోని తమ బంధువుల ఇంటికి భార్యతో కలిసి బైక్‌పై వెళ్తున్న జయంత్ సామల్(31)పీకకు ఓ తెగిన గాలిపటం దారం ఒకటి చుట్టుకుంది. ఒక చేత్తో దాన్ని పక్కకు లాగుతూనే కొంతదూరం వెళ్లారు. ఈ ప్రయత్నంలో పతంగికి ఉన్న దారం అతని గొంతును కోసేసింది. దీంతో అక్కడికక్కడే అతడు కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. అదృష్టవశాత్తు అతడితో పాటు బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. స్వల్పంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదం జరిగిన మరుక్షణమే స్థానికులు చొరవ కల్పించుకుని చేరువలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో భార్యాభర్తలిద్దరినీ చేర్చారు. ఈ క్రమంలో చికిత్స ప్రారంభించిన వైద్యులు జయంత్ అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జగత్పూర్ ఠాణా పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి మృతదేహం తరలించారు. అనంతరం దుర్ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..) గాలిపటం దారానికి గాజు పెంకుల పొడి పూస్తున్న దృశ్యం దుకాణానికి వెళ్తుండగా.. పూరీ పట్టణంలో వెలుగుచూసిన మరో గాలిపటం దుర్ఘటనలో ఓ వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. స్థానిక బొడొదండొలో మందుల దుకాణానికి వెళ్తుండగా, తెగిన గాలిపటం అతడి మెడ భాగం కోసుకుపోయింది. ఈ ప్రమాదంలో భంజబిహారి పాత్రో తీవ్రంగా గాయపడి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఏడేళ్లలో ముగ్గురు మృతి.. గడిచిన ఏడేళ్లలో ఒక్క కటక్ నగరంలోనే గాలిపటంతో పీక తెగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందడం, 10 మందికి పైగా గాయాలపాలవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే సంక్రాంతి పురస్కరించుకుని, జరుపుకునే గాలిపటాల పండుగ మరెంతమందిని విషాదంలోకి నెడుతుందోనని సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. అధికార యంత్రాంగం మాంజా అమ్మకాలపై నిషేధం విధించినా పలుచోట్ల వాటి అమ్మకాలు జోరుగా సాగుతుండడం గమనార్హం. చదవండి: (Hubli: కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం) మాంజా తయారీ.. సాధారణంగా సంక్రాంతి పండగ దగ్గర పడుతున్న తరుణంలో గాలి పటాల సందడి ప్రారంభమవుతుంది. నింగికెగసి రెపరెపలాడుతూ ఎగిరే గాలి పటాల మధ్య పోటీ కోసం దారం పదును పెడతారు. ఫుడ్ కలర్ కలిపిన బంకలో గాజు పెంకుల పొడిని జోడించిన మిశ్రమం దారపు పోగును బలంగా చేసేందుకు పూస్తారు. ఎండలో ఇది ఆరిన తర్వాత గాలి పటానికి కట్టి ఎగురవేస్తారు. ఈ ప్రక్రియని మాంజాగా పేర్కొంటారు. గాలిలో జరిగే ఈ పోటీలో ఎవరి గాలి పటం తెగితే ఆ అభ్యర్థి ఓడినట్లే. ఇలా తెగిన గాలి పటం గాలిలో తేలియాడుతూ నేలను చేరుకునే క్రమంలో ఆ ప్రాంతంలోని ఎవరికో ఒకరికి తగిలి, ప్రమాదం తెచ్చిపెడుతోంది. సాధారణంగా మెడ ప్రాంతంలో గాలిపటం దారం కోసుకుపోతుండడంతో ప్రాణాలు పోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దుకాణాలపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు.. గాలి పటం తెగడంతో కటక్ ప్రాంతంలో యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఐపీసీ 304–ఎ సెక్షన్ కింద జగత్పూర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నయా సడక్, నంది సాహి ప్రాంతాల్లో పూరీ ఘాట్ ఠాణా పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విచారకర సంఘటనతో నగర వ్యాప్తంగా ప్రత్యేక దాడులు చేపట్టినట్లు కటక్ నగర డీసీపీ ప్రతీక్ సింఘ్ తెలిపారు. గాలి పటాలు, మాంజా దారం విక్రేతలను పలుచోట్ల అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నగర వ్యాప్తంగా అన్ని ఠాణాల అధికారులు ఈ దాడుల్లో పాల్గొంటుండడం విశేషం. ముఖ్యంగా మాంజా తయారీదారులను గుర్తించి వారిని కఠినంగా శిక్షిస్తారు. గాలి పటాల దుకాణాలపై ముమ్మరంగా దాడులు చేస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు చేపడతున్నట్లు డీసీపీ తెలిపారు. మాంజా దారాల విక్రయం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. పూరీ సంఘటనపై కేసు నమోదు భువనేశ్వర్/పూరీ: పూరీ బొడొదండొ ప్రాంతంలో జరిగిన గాలిపటం దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ–337, ఐపీసీ–338 సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పూరీ కుంభార్‌పడా ఠాణా పోలీసులు తెలిపారు. -
ఒడిశా కశ్మీర్ చూసి వస్తుండగా.. రోడ్డంతా మంచుతో కప్పేసరికి..
సాక్షి,బరంపురం(భువనేశ్వర్): కొందమాల్ జిల్లాలోని కళింగా ఘాటీలో బస్సు బోల్తాపడిన దుర్ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జి.ఉదయగిరి పోలీసులు వైద్యసేవల నిమిత్తం పుల్బణి ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. ఒడిశా కశ్మీర్‌గా పేరొందిన దరింగబడి అందాలను తిలకించి, వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. సరిగ్గా రెండు రోజుల క్రితం దేశంలోని పలు పర్యాటక ప్రాంతాల సందర్శనకు పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాకి చెందిన 40 మంది పర్యాటకులు ఓ బస్సులో తమ ప్రయాణం ఆరంభించారు. శుక్రవారం సాయంత్రం దరింగబడి పర్యాటక స్థలానికి వెళ్లి రాత్రి తిరిగి వస్తుండగా, బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో గాయపడిన వారిని తొలుత దగ్గరలోని ఆస్పత్రికి తరలించి, వైద్యం అందజేశారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్న క్షతగాత్రులను బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. అయితే మంచు కారణంగా దారి కనిపించకపోవడంతోనే దుర్ఘటన జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. చదవండి: పబ్‌కు మాజీ ప్రియురాలిని పిలిచి.. -
విరిగిన లాఠీ.. అసెంబ్లీ ముట్టడి భగ్నం
భువనేశ్వర్: పోలీసుల తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. శుక్రవారం ఉదయం రాష్ట్రంలోని పలు సమస్యలపై శాసనసభ ముట్టడికి ప్రయత్నించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేకిత్తించిన ప్రిన్సిపాల్ మమిత మెహర్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు, అసలైన నిందితుల గుర్తింపు, ఇదే ఘటనలోని ప్రధాన సూత్రధారి మంత్రి దివ్యశంకర మిశ్రా మంత్రి మండలి బహిష్కరణ వంటి డిమాండ్లతో అసెంబ్లీ వైపు దూసుకుపోతున్న నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. ఈ క్రమంలో మాస్టర్ క్యాంటీన్ ఛక్ ప్రాంతంలో ఆందోళనలో పాల్గొన్న కార్యకర్తలపై ఖాకీలు విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. దీంతో పలువురికి తీవ్రగాయాలు కాగా, మరికొంతమంది తలలు పగిలాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ప్రభుత్వం, పోలీసుల తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా సర్కారు చర్యలు ఉన్నాయని విమర్శించాయి. నగరంలోని కాంగ్రెస్ భవన్ నుంచి మాస్టర్ క్యాంటీన్ ఛక్, లోయర్ పీఎమ్‌జీ మీదుగా శాసనసభ ముట్టడించేందుకు వెళ్తుండగా, ఈ దాడి చోటుచేసుకుంది. ఇదే తరహాలో గురువారం బీజేపీ యువ మోర్చా చేపట్టిన ఆందోళనను సైతం పోలీసులు లాఠీచార్జ్‌తో అడ్డుకోవడం గమనార్హం. సమావేశాల నుంచి కాంగ్రెస్ వాకౌట్.. యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా శుక్రవారం జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాలను బహిష్కరించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టి, పోలీసుల జులం నశించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పోలీస్ యంత్రాంగాన్ని చట్టాలకు విరుద్ధంగా వినియోగించుకుంటోందని ఎమ్మెల్యేలు ఆరోపించారు. కాంగ్రెస్ భవన్‌లోకి చొరబడి మరీ పోలీసులు తమ కార్యకర్తలపై దాడి చేయడం అమానుషంగా కాంగ్రెస్ చీఫ్ విప్ తారాప్రసాద్ బాహిణీపతి పేర్కొన్నారు. దీనిని తామంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇకనైనా నవీన్ సర్కారు ఈ చర్యలు మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
నన్ను బతికుండగానే చంపేశారు కదయ్యా..
రాయగడ(భువనేశ్వర్): రాజు తలచుకుంటే.. కొరడా దెబ్బలకు కొదువా? అన్నట్లు బతికున్న వారిని సైతం మృతుల జాబితాలో చేర్చడం అంత కష్టమేమీ కాదని నిరూపించారు జిల్లా అధికారులు. ప్రాణాలతో ఉన్న ఓ వృద్ధురాలి పేరును ఏకంగా మృతి చెందినట్లు రికార్డుల్లోకి ఎక్కించి, ఆమెకు రావాల్సిన నెలవారీ రేషన్ రాకుండా చేశారు. దీంతో ఏకంగా 6 నెలల రేషన్ సరుకులను ఆమె అందుకోలేకపోయింది. ప్రతినెలా రేషన్ షాపు దగ్గరకు వెళ్లి అడిగిన ఆమెకి నువ్వు మృతి చెందినట్లు ఉందని, రేషన్ ఇవ్వలేమని చెప్పడంతో బాధితురాలు లబోదిబోమంటోంది. తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడుతోంది. వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని కొలనార సమితి, మేదర వీధికి చెందిన ఎమ్.నారాయణమ్మ(60)కు భర్త మృతి చెందిన తొలి రోజుల్లో వృద్ధాప్య పెన్షన్‌తో పాటు 35 కిలోల రేషన్ బియ్యం అందించేవారు. అయితే ఆరు నెలలుగా ఆయా పథకాల లబ్ధి ఆమెకి అందడం లేదు. ఎందుకని ఆరా తీసిన ఆమెకు విస్తుపోయే నిజం తెలిసింది. జిల్లా మృతుల జాబితాలో తన పేరున్నందున రావడం లేదని తెలుసుకుంది. ప్రస్తుతం జిల్లా ఉన్నతాధికారులను కలిసిన ఆమె నేను బతికే ఉన్నానయ్యా..నాకు ప్రభుత్వ పథకాలు అందించాలని అభ్యర్థిస్తోంది. స్పందించిన పౌర సరఫరాల శాఖ ఇన్స్‌స్పెక్టర్ అనిల్‌కుమార్ గొమాంగొ జరిగిన నిర్వాకంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చదవండి: ఆలీబాబా అరడజను దొంగలు.. ప్లాన్ ఒకరు అమలు చేసేది మరొకరు -
కానిస్టేబుల్ ఇంట్లో విజిలెన్స్ దాడి.. ఆస్తులు చూసి నోరెళ్లబెట్టిన అధికారులు
బరంపురం(భువనేశ్వర్): అక్రమంగా ఆస్తులు సంపాదించారన్న ఆరోపణల నేపథ్యంలో కానిస్టేబుల్ సురేంద్ర ప్రధాన్ ఇళ్లల్లో విజిలెన్స్ అధికారులు సోమవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. 3 వేర్వేరు ప్రాంతాల్లోని కానిస్టేబుల్ ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేపట్టిన అధికారులు దాదాపు రూ.2.30 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. పలు విలువైన దస్త్రాలు, బ్యాంక్ పాస్‌పుస్తకాలు, చెక్‌బుక్‌లు, బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాం జిల్లా, బంజనగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సురేంద్ర ప్రధాన్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, అవన్నీ అక్రమంగా సంపాదించినవేనన్న సమాచారం మేరకు కటక్ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమై, దాడులు చేపట్టినట్లు సమాచారం. సోమవారం ఉదయం జరిగిన అధికారుల దాడుల్లో కానిస్టేబుల్‌కి బరంపురంలోని లుచ్చాపడలో 3 అంతస్తుల భవనం, నిమ్మఖండి గ్రామంలో మరో 3 అంతస్తుల భవనం, గురింటి గ్రామంలో రెండంతస్తుల భవనం ఉన్నట్లు నిర్ధారించారు. కానిస్టేబుల్ బంధువుల ఇళ్లల్లో సైతం అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం కానిస్టేబుల్ని అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తున్నట్లు విజిలెన్స్ ఎస్పీ త్రిలోచన్ స్వంయి తెలిపారు. చదవండి: Parag Agrawal : అడిషనల్ పేపర్ కోసం గొడవ.. శ్రేయా ఘోషల్ క్లోజ్ ఫ్రెండ్ కూడా! -
ముఖ్యమంత్రి దాతృత్వం.. అతని కలను సాకారం చేశారు
భువనేశ్వర్: ఇంజినీరింగ్ చదువుకోవాలన్న ఓ పేద విద్యార్థి కలను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సాకారం చేశారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో 99.35 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, ఆర్థిక ఇబ్బందులతో కోర్సులో చేరేందుకు సతమతమవుతున్న బొలంగీరు జిల్లా, సింధెకెలా సమితి, బొడొపొడా గ్రామానికి చెందిన తారాచాన్ రాణాకి ముఖ్యమంత్రి ఆర్థికసాయం చేసి, దాతృత్వం ప్రదర్శించారు. వరంగల్ ఎన్ఐటీలో చేరి, ఇంజినీరింగ్ పూర్తి చేయాలన్నది ఆ విద్యార్థి లక్ష్యం. అయితే తన కుటుంబానికి తనని చదివించే స్తోమత లేదు. ఈ నేపథ్యంలో సీఎం సాయం కోసం సదరు విద్యార్థి అభ్యర్థించాడు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సదరు విద్యార్థి అడ్మిషన్ ఫీజు కింద అయ్యే ఖర్చుని తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. తక్షణమే రూ.96,500 నగదుని విద్యార్థికి సీఎం అందజేసి, బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. చదవండి: 7 నెలలకే భర్త పరార్.. అత్తవారింటి మెట్లపైన కోడలి పూజలు -
ఇంటికి వచ్చి.. స్నానం కోసం వెళ్లి ఎంతసేపయినా రాలేదు..
భువనేశ్వర్/కటక్: మహానదిలో మునిగి, నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ విషాద సంఘటన కటక్ నగరంలోని మహానది భడిములో తీరంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతులంతా కటక్ నయాబజార్ ప్రాంతంలోని పొటొపొఖొరి 8వ తరగతి విద్యార్థులు జొగ్గా బెహరా, ఆకాష్ బహాలియా, చందన్ బెహరా, శుభం శెట్టిగా తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వీరు..స్నానం చేసేందుకు మహానదికి వెళ్లారు. ఎంతసేపు అయినా వీరు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన బాధిత కుటుంబాలు వారి ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఈ క్రమంలో నదీ తీరాన విద్యార్థుల సైకిళ్లు, బట్టలు ఉండడం చూసి, నదిలో స్నానం చేస్తూ గల్లంతైనట్లు భావించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో విద్యార్థుల ఆచూకీ కోసం నదిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. గురువారం రాత్రి నాటికి విద్యార్థుల్లో జొగ్గా బెహరా మృతదేహం లభించింది. ఆ తర్వాత శుక్రవారం ఉదయం జరిగిన గాలింపు చర్యల్లో మిగతా విద్యార్థులు కాష్ బహాలియా, చందన్ బెహరా, శుభం శెట్టి మృతదేహాలు లభించాయి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చదవండి: దారుణం: భర్త రాక్షసత్వానికి ఇటీవల అబార్షన్.. ఇప్పుడు చీర కొనుక్కుందని ఏకంగా.. -
7 నెలలకే భర్త పరార్.. అత్తవారింటి మెట్లపైన కోడలి పూజలు
బరంపురం(భువనేశ్వర్): ప్రేమ పేరుతో వంచించి, కోర్టు సమక్షంలో పెళ్లి చేసుకొన్న తన భర్త డాక్టర్ సునీత్ సాహు మోసం చేశాడని ఆరోపిస్తూ బాధితులు తపస్విని దాస్ న్యాయం పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. స్థానిక బ్రహ్మనగర్ 2వ లైన్‌లోని అత్తవారింటి ముందు చేస్తున్న నిరసన దీక్ష గురువారం నాలుగో రోజు కొనసాగింది. మార్గశిర గురువారం సందర్భంగా బాధితురాలు సంప్రదాయ వస్త్రాలు ధరించి, అత్తవారింటి మెట్లపైనే పండ్లు, పలహారాలు, పిండి వంటలతో లక్ష్మీదేవికి పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ తనకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తానని స్పష్టంచేశారు. ఆమె పోరాటానికి ప్రజాసంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. కొన్నాళ్ల పాటు స్నేహితులుగా మెలిగిన యువతి తపస్విని దాస్, వైద్యుడు సునీత్ సాహు కోర్టు సమక్షంలో రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఒకే ఇంట్లో కలిసి ఉండి, శారీరకంగా ఒక్కటయ్యారు. ఇలా దాదాపు 7 నెలలు గడిచిన తర్వాత తపస్విని వదిలి, సునీత్ సాహు అక్కడి నుంచి పరారయ్యాడు. చదవండి: స్నేహితురాలితో పెళ్లి.. 7 నెలలు గడిచిన తర్వాత.. -
ఒకరి కారు డ్రైవింగ్ సరదా.. మరొకరి ప్రాణం తీసింది
రాయగడ( భువనేశ్వర్): కారు డ్రైవింగ్ నేర్చుకునే సరదా నిండు ప్రాణాన్ని బలికొన్న ఘటన స్థానిక రాణిగుడ ఫారం గ్యాస్గొడౌన్ సమీపంలోని మైదానంలో చోటుచేసుకుంది. ఐఐసీ రస్మీరంజన్ ప్రధాన్ తెలిపిన వివరాల ప్రకారం.. కరుణాకర్ బెహరా అనే యువకుడు స్థానిక మైదానంలో కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. అదే సమయంలో రాణిగుడ ఫారం నకు చెందిన మంగ సొపొరి(32) కూలి పనులను చేసుకునేందుకు ఆ మార్గంలో వెళ్తోంది. కారు అదుపుతప్పి, ఆమెను ఢీకొనడంతో తీవ్రగాయాల పాలైంది. స్థానికులు ఆమెను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు కరుణాకర్ బెహరా, కారును అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన లారీ.. ఒక్కసారిగా ఆనందం ఆవిరైంది
మల్కన్‌గిరి( భువనేశ్వర్): జిల్లా కేంద్రానికి సమీపంలోని పండ్రీపణి గ్రామం బుధవారం రాత్రి ఓ మృత్యువాహనం దూసుకెళ్లింది. బియ్యం బస్తాలతో వస్తున్న లారీ గ్రామ సర్పంచ్ శివఖేముండు కుమారుడి వివాహ ఊరేగింపు పైకి దూసుకు వచ్చింది. ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శివఖేముండు తన కుమరుడి వివాహం భయపరగూడలో జరిపించి, స్వగ్రామనికి ఊరేగింపుగా తీసుకు వస్తున్నారు. అదే సమయంలో మల్కన్‌గిరి వైపు వస్తున్న ప్రభుత్వ బియ్యం సరఫరా చేసే లారీకి బ్రేకులు విఫలమయ్యాయి. దీంతో ముందుగా ఓ బైక్‌ను ఢీకొట్టింది. అనంతరం పెళ్లి ఉరేగింపు బృందంపైకి దూసుకు వచ్చింది. ప్రమాదంలో శివఖేముండు, పెళ్లి కుమారుడి మేనమామ సంతోష్‌కుమార్ సాహు, సునబేడకు చెందిన డప్పు వాయిధ్యకారులు రాజకుమార్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో ఐదుగురు గాయాలపాలు కాగా మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మల్కన్‌గిరి ఐఐసీ రామప్రసాద్ నాగ్ అక్కడికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే పండ్రీపణి గ్రామస్తులు లారీను అడ్డుకొన్నారు. మల్కన్‌గిరి–జయపురం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసి, టైర్లు కాలుస్తూ నిరసన వ్యక్తం చేశారు. చదవండి: గిటారులో డ్రగ్స్.. అంతా బాగానే కవర్ చేశాడు.. కానీ.. -
స్నేహితురాలితో పెళ్లి.. 7 నెలలు గడిచిన తర్వాత..
బరంపురం(భువనేశ్వర్): భర్త ఇంటి ఎదుట భార్య మౌన దీక్షకు దిగిన సంఘటన నగరంలో మంగళవారం సంచలనం రేకిత్తించింది. కొన్నాళ్ల పాటు స్నేహితులుగా మెలిగిన యువతి తపస్విని దాస్, వైద్యుడు సునీత్ సాహు కోర్టు సమక్షంలో రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఒకే ఇంట్లో కలిసి ఉండి, శారీరకంగా ఒక్కటయ్యారు. ఇలా దాదాపు 7 నెలలు గడిచిన తర్వాత తపస్విని వదిలి, సునీత్ సాహు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఆవేదన వ్యక్తం చేస్తూ తపస్విని నగరంలోని బ్రహ్మనగర్‌లో తన అత్తవారింటి ఎదుట మౌన పోరాటానికి దిగింది. ఆమెకి స్థానిక సంఘ సేవకురాలు ప్రమీల మద్దతు పలికారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులకు బాధితురాలు తన గోడుని వివరించింది. తన భర్త తనకు కావాలని, తీసుకురావాలని పోలీసులను ఆమె కోరింది. చదవండి: ‘మా పొట్ట కొట్టకండి సారూ.. గంజాయి పండించుకుంటాం’ -
గ్రామంలో నాగుపాము కలకలం
బరంపురం: నగర వర లుచ్చాపడా గ్రామంలో 8 అడుగుల నాగుపాము గ్రామస్తులకు కనబడి కలకలం సృష్టింంది. స్థానికుల సమాచారం అందకుని ఒడియా సంపాదకులు, స్నేక్ క్యాచ్ సంస్ధ కున్నల్ సాహు లుచ్చాపడా గ్రామనికి చేరుకొని గ్రామస్తులను కలకలం సృష్టింన 8 అడుగుల నాగుపాముని తన చాకచఖ్యంతో పట్టుకున్నారు. అనంతరం నగరానికి దగ్గర టమ్మన ఆటవి ప్రాంతంలో విడి పేట్టారు. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీర్చుకున్నారు. ఇటీవల పాములు బెడద ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. -
‘మా పొట్ట కొట్టకండి సారూ.. గంజాయి పండించుకుంటాం’
మల్కన్‌గిరి(భువనేశ్వర్): జిల్లాలోని చిత్రకొండ సమితి, ధూళిపూట్ పంచాయతీలో గిరిజనుల ప్రజా మేళా సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గత కొద్దిరోజులుగా పోలీసులు ధ్వంసం చేస్తున్న గంజాయి సాగుపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి సాగుతో తమకు ఎంతో కొంత ఉపాధి కలుగుతోందన్నారు. ఇప్పుడు వాటిని అధికారులు నాశనం చేసి, తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వేరే పంటలు పండించేందుకు చాలా పెట్టుబడి అవుతుందని, అంత స్తోమత తమకు లేదన్నారు. దీంతో పెట్టుబడి అవసరం లేని గంజాయి సాగుపై ఆధారపడి బతుకుతున్నామన్నారు. ఉపాధి అవకాశాలైనా కల్పించాలని, లేకపోతే గంజాయి సాగుకి అనుమతి అయినా ఇవ్వాలని వారు కోరారు. అనంతరం చిత్రకొండ తహసీల్దారు టి.పద్మనాబ్ బెహరాకి వారు వినతిపత్రం అందజేశారు. 85 ఎకరాల గంజాయి సాగు ధ్వంసం మల్కన్‌గిరి జిల్లాలోని చిత్రకొండ సమితి, బోడపోదర్ పంచాయతీలో ఉన్న రేఖపల్లి, పల్సన్‌పోదర్, కుమార్‌గూడ ప్రాంతాల్లో అక్రమంగా 85 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయిని చిత్రకొండ పోలీసులు సోమవారం ధ్వంసం చేశారు. నాశనం చేసిన గంజాయి సాగు విలువ దాదాపు రూ.12 కోట్లు చేస్తుందని పోలీసులు తెలిపారు చదవండి: Karnataka: ఆ ప్రాంతం మరో గోవా కానుంది.. -
పాము విషం విక్రయం గుట్టురట్టు.. ఒక కిలో పాము విషం కోటిన్నర..?!
భువనేశ్వర్: పామువిషం విక్రయం గుట్టురట్టయింది. ఈ మేరకు ముందస్తు సమాచారం పోలీసులకు అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, స్టేషన్‌కి తరలించారు. అనంతరం వారి నుంచి 1 కిలోగ్రాము పాము విషం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.1.50 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం జప్తు చేసిన పాము విషం పరీక్షల కోసం ప్రయోగశాలకు తరలించారు. పట్టుబడిన నిందితుల్లో సంబల్పూర్ జిల్లా, సిందూర్‌పంక్ గ్రామస్తుడు కైలాస్ సాహు, సఖిపొడా గ్రామస్తుడు రంజన్‌కుమార్ పాఢి ఉన్నారు. రాష్ట్రేతర ప్రాంతాల నంచి సేకరించిన పాము విషాన్ని దేవ్‌గఢ్ ప్రాంతంలో విక్రయించేందుకు మంతనాలు జరుగుతుండగా, పోలీసులు దాడి చేసినట్లు సమాచారం. చదవండి: (24న కేంద్ర మంత్రివర్గ సమావేశం.. ఆ బిల్లుల ఉపసంహరణ..) -
దేశంలోనే అత్యంత ధనిక ఆలయం.. కానీ సరిగ్గా మూడేళ్ల క్రితం..
భువనేశ్వర్: దేశంలోనే అత్యంత ధనిక ఆలయంగా పేరొందిన పూరీ జగన్నాథుని మందిరం సొత్తు భద్రతపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్నాథునికి ఉన్న వజ్ర, వైఢూర్య, బంగారు, వెండి, నవరత్నాల ఆభరణాలు, నగల సొత్తు అపారమైనది. ఈ సంపదని శ్రీమందిరం అంతరాలయంలోని ప్రత్యేక భాండాగారంలో భద్రపరిచారు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఈ భాండాగారం తాళం చెవి గల్లంతైనట్లు వార్త బయటకు పొక్కింది. దీంతో స్వామి నిధి భద్రతపై భక్తుల్లో అభద్రతాభావం బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలో ఉలికిపాటుకు గురైన దేవస్థానం, రాష్ట్ర ప్రభుత్వం, పూరీ జిల్లా అధికార యంత్రాంగం స్వామి సంపద భద్రతపై భక్తుల్లో విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాయి. రత్నభాండాగారం సంపద సందర్శన నిమిత్తం 17 మంది ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. అప్పట్లో అట్టహాసంగా ఈ కమిటీ రత్నభాండాగారం తెరిచి, పరిశీలించినట్లు.. సొత్తు అంతా భద్రమేనని ఓ ప్రకటన వెలువరించింది. రెండంతస్తుల రత్నభాండాగారంలో బాహ్య అంతస్తు నుంచి లోపలి అంతస్తుని స్పష్టంగా చూసినట్లు కమిటీ స్పష్టం చేసింది. ఈ సమాచారం స్వామి భక్తులకు కాస్త ఊరటని కలిగించింది. ఈ నెల 18న అసలు విషయం.. అయితే తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా లభ్యమైన కొత్త సమాచారంతో మళ్లీ స్వామి సొత్తుపై భక్తుల్లో విశ్వాసం నీరుగారింది. 1970 నుంచే జగన్నాథుని రత్నభాండాగారం తాళం చెవి కనబడడం లేదని సమాచార హక్కు చట్టం కింద లభించిన సమాచారం బహిర్గతం చేసింది. కొమాకొంతియా గ్రామానికి చెందిన దిలీప్‌కుమార్ బొరాల్ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ సమాచారం సేకరించారు. రత్నభాండాగారం అసలు తాళం చెవి, నకిలీ తాళం చెవి వాస్తవ సమాచారం తెలియజేయాలని ఆయన జిల్లా ట్రెజరీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవడంతో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ నెల 18వ తేదీన పూరీ కలెక్టరేట్ ద్వారా ఆయనకు అందినట్లు సమాచారం. ఇదే విషయాన్ని జగన్నాథ ఆలయం ప్రధాన పాలన అధికారికి 2018 ఏప్రిల్ 4వ తేదీన లేఖ ద్వారా తెలియజేసినట్లు సమాచారం ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో అప్పట్లో తాళం చెవి గల్లంతు ఘటనపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన సమాచారం పట్ల సర్వత్రా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు స్వామి నిధిపై రహస్యం పాటించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఏర్పాటు చేసిన కమిటీలో శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి(సీఏఓ), జిల్లా కలెక్టరు, పోలీస్ సూపరింటెండెంట్, భారతీయ పురావస్తు శాఖ కోర్ కమిటీ సభ్యులు, శ్రీమందిరం పాలక మండలి సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం సమాచార హక్కు చట్టం ద్వారా లభించిన సమాచారం.. అప్పుడు కమిటీ సభ్యుల ప్రకటనకు పొంతన లేకుండా పోవడం పలు అనుమానాలకు తావునిస్తోంది. తాళం మాయంపై కలెక్టర్‌కు లేఖ.. సమాచారం చట్టం ప్రకారం రత్నభాండాగారం తాళం చెవి వివరాలపై 2018 ఏప్రిల్ 3వ తేదీన పూరీ జిల్లా అప్పటి కలెక్టరు(అరవింద అగర్వాల్) జిల్లా కోశాధికారికి లేఖ రాశారు. రత్నభాండాగారం తాళం చెవి కనబడడం లేదని శ్రీమందిరం అప్పటి ప్రధాన పాలన అధికారి(సీఏఓ) (ప్రదీప్ కుమార్ జెనా)కు 2018 ఏప్రిల్ 4న జిల్లా కలెక్టరు లేఖ ద్వారా తెలియజేశారు. 1970 నుంచి రత్నభాండాగారం తాళం చెవి వివరాలు కానరానట్లు ఆ లేఖలో వివరించారు. ఇప్పుడు భాండాగారం తాళం చెవి వివరాల కోసం అర్జీ పెట్టుకున్న దిలీప్‌కుమార్ బొరాల్కు ఇదే సమాచారం జారీ చేశారు. ఈ క్రమంలో అప్పట్లో హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు నిర్వహించిన ఉన్నత స్థాయి కమిటీ సమాచారంపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా జగన్నాథుని రత్నభాండాగారం తాళం చెవి కానరాకుంటే ప్రముఖుల కమిటీ పరిశీలన ఎలా సాధ్యమైందనే దిశగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి ఈ తాళం చెవి గల్లంతు విషయం ఎటువైపు ఎలా మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. చదవండి: సోషల్ మీడియాలో మాజీ సీఎం భార్య రచ్చ.. ‘ఆ డ్రెస్ ఏంటి’ -
టిఫిన్ బాక్స్ బాంబు కలకలం
జయపురం: స్థానిక సబ్‌డివిజన్ పరిధిలోని బొయిపరిగుడ సమితి, గుప్తేశ్వర్–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన టిఫిన్ బాక్స్ బాంబుని బీఎస్ఎఫ్ జవానులు శనివారం గుర్తించి, నిర్వీర్యం చేశారు. ఒడిశా–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని మావోయిస్టు అడ్డాగా పేరొందిన రామగిరి ప్రాంతం అడవుల్లో జవానులను లక్ష్యంగా చేసుకుని, మావోయిస్టులు బాంబులు అమర్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం తెల్లవారుజామున బొయిపరిగుడ బీఎస్ఎఫ్ 151వ బెటాలియన్ జవానులు పోలీస్ డాగ్ సహాయంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రామగిరి ప్రాంతంలోని పూజారిగుడ కూడలి దగ్గరున్న ప్రయాణికుల విశ్రాంతి భవనానికి కొంత దూరంలో బాంబుని గుర్తించి, డెఫ్యూజ్(నిర్వీర్యం) చేసినట్లు బీఎస్ఎఫ్ 151వ బెటాలియన్ క్యాంపు కమాండెంట్ అజయ్‌కుమార్ తెలిపారు. బీఎస్ఎఫ్ జవానులను టార్గెట్‌గా చేసుకుని, మావోయిస్టులు అమర్చిన ఈ బాంబు సమాచారంతో ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డాగా ఉండడంతో మళ్లీ మావోయిస్టులు ఇక్కడ తిష్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారా అనే కోణంలో స్థానికంగా చర్చ నడుస్తుండడం విశేషం. మల్కన్‌గిరిలో మరో బాంబు నిర్వీర్యం.. మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి, నక్కమమ్ముడి పంచాయతీ, బలిమెల కూడలిలో డైక్–3 గ్రామ రహదారిలోని ఓ చెట్టుకి మావోయిస్టులు ఏర్పాటు చేసిన బాంబుని బీఎస్ఎఫ్ జవానులు నిర్వీర్యం చేశారు. అదే ప్రాంతంలో మావోయిస్టుల ఆచూకీ కోసం కూంబింగ్‌కి వెళ్లిన బీఎస్ఎఫ్ జవానులు కూంబింగ్ అనంతరం క్యాంప్‌కి తిరిగివస్తుండగా బాంబుని గుర్తించి, నిర్వీర్యం చేశారు. జవానులను హతమార్చడమే లక్ష్యంగా మావోయిస్టులు ఈ బాంబుని ఏర్పాటు చేసినట్లు సమాచారం. చదవండి: విషాదం: దైవదర్శనం కోసం వెళ్లి.. భర్త, పిల్లల చూస్తుండగానే.. -
‘ము పట్టొ పొడిబి’.. దీనికి అర్థం ఏంటో తెలుసా?
బరంపురం(భువనేశ్వర్): నగరంలోని హిల్‌పట్నా మెయిన్‌రోడ్డులో ఉన్న బిజూ పట్నాయక్ సాంస్కృతిక భవనంలో ఒడిశా నాటక సమారోహ సమితి ఆధ్వర్యంలో 3 రోజుల నుంచి జరుగుతున్న రాష్ట్ర స్థాయి శిశు నాటక మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా గంజాం జిల్లా బంజనగర్ గురుకుల పాఠశాల విద్యార్థులు చేపట్టిన ‘ము పట్టొ పొడిబి’(నేను చదువుకుంటాను) అనే నాటిక ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో బరంపురం ఎంపీ చంద్రశేఖర్ సాహు, ఎమ్మెల్యే విక్రమ్ పండా తదితరులు పాల్గొన్నారు. మరో ఘటనలో.. రాఖీ ఘెష్‌కు ప్రెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా పురస్కారం భువనేశ్వర్: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ప్రెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా పురస్కారం–2021..ది పయనీర్ ఇంగ్లిష్ జర్నలిస్ట్ రాఖీ ఘోష్‌ని వరించింది. వర్చువల్ మాధ్యమంలో ఈ పురస్కార ప్రదానోత్సవం శుక్రవారం జరిగింది. సుందరగఢ్ ప్రాంతంలో కోవిడ్ మృతుల దహన సంస్కారాలను స్వచ్చంధంగా నిర్వహిస్తున్న యుజవన సాంఘిక సేవా సంస్థలపై పత్రికలో రాసిన కథనానికి గాను ఆమెకి ఈ అవార్డుల లభించినట్లు తెలుస్తోంది. చదవండి: భర్త, కూతురు మృతి.. తోడు నిలిచిన ‘రిక్షా’ కుటుంబం.. బహుమతిగా రూ.కోటి ఆస్తి -
విజిలెన్స్ వలలో రెవెన్యూ అధికారి
కొరాపుట్( భువనేశ్వర్): విజిలెన్స్ వలలో కొరాపుట్ జిల్లా, సిమిలిగుడ ప్రాంత దుదారి రెవెన్యూ అధికారి ఖిరాది తన్నయ్య చిక్కుకున్నారు. ఓ సర్టిఫికెట్ మంజూరు చేసేందుకు జయరాం పంగి అనే వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా జయపురం విజిలెన్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. అనంతరం సదరు అధికారి ఆస్తులపై ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టి, ఆమెని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం జయపురం విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. మరో ఘటనలో.. పాముకాటుతో వ్యక్తి మృతి జయపురం( భువనేశ్వర్): పాముకాటుకు గురైన జగన్నాథ్ గదబ అనే వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానిక జయపురం సమితి, కొంగ గ్రామపంచాయతీలో ఉన్న కొదమగుడ గ్రామంలో బుధవారం రాత్రి తన ఇంటి ముందు నిల్చొని ఉన్న జగన్నాథ్‌ను పాము కాటేసింది.ఈ క్రమంలో వైద్యసేవల నిమిత్తం అతడిని జయపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అయితే రాత్రి అక్కడే చికిత్స పొందుతుండగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బాధిత కుటుంబ సభ్యులకు గురువారం అప్పగించారు. చదవండి: Chain Snatching: పల్లీపట్టీలు కావాలని వచ్చి... పుస్తెలు అపహరణ! -
స్థలాన్ని ఫ్రీగా ఇచ్చాడు.. కానీ 7నెలలుగా అక్కడే..
సాక్షి,రాయగడ(భువనేశ్వర్): జిల్లాలోని కాశీపూర్ సమితి కుచేయిపొదొరొ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)కి తాళం పడింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందాలని తలచి, పెద్ద మనసుతో స్థలాన్ని దానంగా ఇచ్చిన దాతే ప్రస్తుతం బాధితుడిగా మారాడు. ఇక్కడే గుమస్తాగా పనిచేస్తున్న ఆయనకు గత 7నెలలుగా వేతనం అందకపోవడంతో విసుగెత్తి, పీహెచ్‌సీకి తాళం వేయడంతో పాటు అక్కడే వంటా–వార్పు చేస్తూ ఆందోళనకు దిగాడు. ఇప్పటికే అంతంత మాత్రంగా వైద్య సౌకర్యాలు ఉన్న ఈ సమితిలో ఈ తరహా సమస్యలు తలెత్తడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొరాగుడ పోలీస్ స్టేషన్ ఐఐసీ అజిత్ స్వొయి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుచేయిపొదొరొలో పీహెచ్సీ నిర్మించాలని స్థానికులు ఎప్పటి నుంచే డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. 2002లో ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేసింది. అయితే అనువైన ప్రభుత్వ స్థలం అభించకపోవడంతో అదే గ్రామానికి చెందిన విభీషన్ నాయక్ తన స్థలాన్ని విరాళంగా ఇచ్చాడు. ఆ స్థలంలో 2003లో పీహెచ్‌సీని ఏర్పాటు చేసి, వైద్య సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన స్థలాన్ని ప్రభుత్వానికి దానంగా ఇచ్చిన నాయక్‌ను అదే ఆరోగ్య కేంద్రంలో గుమస్తాగా ప్రభుత్వం నియమించింది. అయితే గత కొన్నేళ్లుగా తన ఉద్యోగాన్ని రెగ్యులర్ చేయాలని విభీషన్ నాయక్ ప్రభుత్వానికి నివేదించాడు. సంబంధిత శాఖ అధికారులను కలసి వినతిపత్రాలు కూడా సమర్పించాడు. మరోవైపు గత 7నెలలుగా వేతనం కూడా చెల్లించక పోవడంతో స్థల దాతే బాధితుడిగా మారాడు. ఈ క్రమంలో అధికారుల తీరుపై విసుగెత్తిన ఆయన.. బుధవారం నాడు తన బంధువులతో కలిసి పీహెచ్‌పీ మెయిన్ గేటుకు తాళం వేశాడు. అక్కడే వంట చేస్తూ తన నిరసన తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, అతనిని బుజ్జగించారు. తాళాలు తెరిచి, సేవలందించేలా చర్యలు చేపట్టారు. చదవండి: Vijay Shekhar Sharma Emotional: జాతీయ గీతం వింటూ కన్నీరు పెట్టుకున్న విజయ్ శేఖర్ శర్మ! -
భర్త, కూతురు మృతి.. తోడు నిలిచిన ‘రిక్షా’ కుటుంబం.. బహుమతిగా రూ.కోటి ఆస్తి
భువనేశ్వర్: ఏ ప్రతిఫలం ఆశించకుండా రిక్షా కార్మికుడు చేసిన సేవకు ఓ వృద్ద మహిళ కోటి రుపాయలకుపైగా ఆస్తిని దానం చేసింది. ఈ మేరకు ఆస్తిని అతని పేరు మీద రాసిన పత్రాలను రిక్షా కార్మికుడికి అందించింది. ఈ ఘటన ఒరిస్సాలోని సంబల్పూర్లో చోటు చేసుకుంది. అయితే అంత ఆస్తిని కుటుంబ సభ్యులకో, లేక బంధువులకో కాకుండా రిక్షా కార్మికుడికి దానం చేయడానికి పెద్ద కారణమే ఉందండోయ్! వివరాల్లోకి వెళితే.. సబల్పూర్కు చెందిన మినాతి పట్నాయక్(63) భర్త 2020లో మరణించగా, తన కుమార్తె 2021లో మరణించింది. అప్పటి నుంచి తనని ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఆమె బంధువులు ఇటీవల తన ఆస్తి కోసం ఒక్కసారిగా ఆమెతో దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గత 25 ఏళ్లుగా ఆమె కుటుంబానికి నమ్మకంగా పని చేస్తున్న వచ్చిన రిక్షా కార్మికుడికి తన ఆస్తి మొత్తాన్ని దానం చేసింది. అందులో రూ.కోటి విలువైన భవనం, ఇతర సామగ్రిని అతని పేరుపై రిజిస్ట్రేషన్ చేయించింది. దీనిపై వృద్దురాలు మాట్లాడుతూ.. తన భర్త, కూతురు చనిపోయి కృంగిపోయి, దుఃఖంలో బతుకుతున్నప్పుడు, తన బంధువులెవరూ కూడా అండగా నిలబడలేదని ఆ సమయంలో తాను ఒంటరిగా కాలాన్ని గడిపినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఆ రిక్షా కార్మికుడు, అతని కుటుంబం మాత్రం ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు పేర్కొంది. అందుకే ఆస్తి కోసం ఎదురుచూసే వారికంటే ఏ లాభం ఆశించకుండా తన కుటుంబం కోసం నిశ్వార్ధంగా పని చేసిన బుధాకు( రిక్షా కార్మికుడు) తన ఆస్తిని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. చదవండి: రాంగ్ కాల్.. ఆ దివ్యాంగురాలి జీవితాన్నే మార్చేసింది.. -
వైద్యుల నిర్లక్ష్యం.. మహిళకు వేరే బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించారు.. కాసేపటికే
భువనేశ్వర్: రక్త హీనతతో బాధపడుతున్న ఓ మహిళకు వేరే బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఒడిశాలోని రూర్కీలా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కుట్ర బ్లాక్‌లోని బుడకట గ్రామానికి చెందిన సరోజిని కాకు గురువారం మధ్యాహ్నం రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రి (ఆర్‌జిహెచ్)లో చేరింది. రోగి సికిల్ సెల్ అనీమియా అనే వ్యాధితో బాధపడుతోంది. దీంతో ఆమెకు రక్తం ఎక్కించాలని వైద్యులు తెలిపారు. అయితే ఆమె బ్లడ్ గ్రూప్ O పాజిటివ్ కాగా, B పాజిటివ్ రక్తం ఎక్కించారు. దీంతో ఆ మహిళ ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. మహిళకు వేరే గ్రూప్ రక్తం ఎక్కించారనీ, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కోసం మృతదేహాన్ని భద్రపరిచినట్లు తెలిపారు. విచారణకు కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (చదవండి: ఎద్దు వయసు మూడున్నరేళ్లు.. విలువ రూ. కోటి!) -
ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్ సమీక్ష
అమరావతి: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో మంగళవారం చర్చల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాగా రేపు (09-11-2021) సీఎం జగన్ భువనేశ్వర్ వెళ్లనున్నారు. ఉభయరాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై మంగళవారం సాయంత్రం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా మూడు అంశాలపై ఒడిశా సీఎంతో సీఎం జగన్ చర్చించనున్నారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశాలపై చర్చించనున్నారు. చదవండి: AP: విద్యార్థులకు ‘పద సంపద’ వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం ► నేరడి బ్యారేజీ కారణంగా ఉభయ రాష్ట్రాలకూ కలగనున్న ప్రయోజనాలను సీఎం జగన్ వివరించనున్నారు. ► బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా వైపునుంచి 103 ఎకరాలు అవసరమని ఇందులో 67 ఎకరాలు రివర్బెడ్ ప్రాంతమేనని అధికారులు తెలిపారు. ► బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశావైపు కూడా సుమారు 5–6 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు. చదవండి: బీజేపీ నేతలు నీతులు చెప్పడం విడ్డూరం: పేర్ని నాని జంఝావతి ప్రాజెక్టు అంశం ► ప్రస్తుతం రబ్బర్ డ్యాం ఆధారంగా సాగునీరు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ► 24,640 ఎకరాల్లో కేవలం 5 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నామని, ప్రాజెక్టు పూర్తిచేస్తే రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని పేర్కొన్నారు ► ప్రాజెక్టును పూర్తిచేస్తే ఒడిశాలో 4 గ్రామాలు పూర్తిగా, పాక్షికంగా 6 గ్రామాలు ముంపునకు గురవుతాయని అధికారులు పేర్కొన్నారు. ► ఒడిశాలో దాదాపు 1174 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని తెలిపిన అధికారులు.ఇందులో 875 ఎకరాలు ప్రభుత్వ భూమేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్‌అండ్‌ఆర్‌కు సహకరించాలని ఏపీ ఒడిశాను కోరనుంది. ► కొఠియా గ్రామాల వివాదానికి సంబంధించిన మొత్తం వివరాలను అధికారులు సీఎం ముందు ఉంచారు. ► కొఠియా గ్రామాల్లో ఇటీవల పరిణామాలను వివరించారు. ► 21 గ్రామాల్లో 16 గ్రామాలు ఏపీతోనే ఉంటామంటూ తీర్మానాలు చేసి ఇచ్చారని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి సీఎంకు వివరించారు. ► ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించామని సమావేశంలో అధికారులు పేర్కొన్నారు. ►కొఠియా గ్రామాల్లో దాదాపు 87శాతానికి పైగా గిరిజనులు ఉన్నారని, వారికి సేవలు అందించే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని సమావేశంలో అధికారులు ప్రస్తావించారు. ఈ సమావేశంలో సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, జలవనరులశాఖ ఈఎన్సి సి నారాయణరెడ్డి, విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ సూర్య కుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సిక్కోలు చిరకాల కల.. ఈ నెల 9న ఒడిశా ముఖ్యమంత్రితో సీఎం జగన్ భేటీ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నేరడి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడీ అంటున్నారు. ఒక్కో అడ్డంకినీ అధిగమిస్తూ సిక్కోలు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు ముందడుగు వేస్తున్నారు. అందులో భాగంగా జల వివాదాలు పరిష్కరించుకునేందుకు 9వ తేదీన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ కానున్నారు. ఈ చర్చలు ఫలవంతమై నేరడి నిర్మితమైతే అక్షరాలా రెండున్నర లక్షల ఎకరాల్లో బంగారం పండుతుంది. వంశధార స్టేజ్–2, ఫేజ్–2 పనుల్లో భాగంగా ప్యాకేజీ–87,88, హిరమండలం రిజర్వాయర్ పనుల కో సం ఇప్పటికే రూ. 1600 కోట్లు ఖర్చు చేయగా, ప నులు పూర్తి చేసేందుకు మరో రూ.600 కోట్లు అవసరం ఉంది. ఈ పనులు చేస్తూనే మరోవైపు నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టిపెట్టనున్నారు. రూ. 585 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే ప్రాజెక్ట్ రూపకల్పన చేయగా, తాజా ధరల మేరకు రివైజ్డ్ అంచనా వేసి ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ చొరవతోనే.. నేరడికి ఎప్పుడో శంకుస్థాపన పడినా పనుల్లో వేగం చూసింది మాత్రం వైఎస్సార్ హయాంలోనే. 1962 సెప్టెంబర్ 30న ఒడిశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మద్య 50ః50 ప్రాతిపదికన వంశధార బేసిన్లో 115 టీఎంసీల నీటిని పంచుకునేందుకు ఒప్పందం జరిగింది. 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి రూ. 944.90 కోట్లతో వంశధార ప్రాజెక్ట్ రెండో దశ నిర్మా ణానికి శ్రీకారం చుట్టారు. వంశధారపై నేరడి బ్యారే జీ నిర్మించి, అక్కడి నుంచి హై లెవెల్ కెనాల్ ద్వారా సింగిడి, పారాపురం, హిరమండలం రిజర్వాయర్లకు వరద జలాలను తరలించి, గొట్టా బ్యారేజీ కింద 2.10 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతో పాటు కొత్త గా 45 వేల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించా రు. ఒడిశా ప్రభుత్వం నేరడికి అభ్యంతరం చెప్పడంతో భామిని మండలం కాట్రగడ్డ వద్ద వంశధారపై సైడ్‌వ్యూయర్ నిర్మించి అక్కడి నుంచి వరద జలాల ను సింగిడి, పారాపురం, హిరమండలం రిజర్వాయర్లకు తరలించేలా అలైన్మెంట్ మార్చి పనులు చేపట్టారు. వివాదం తేలిన తర్వాత నేరడి బ్యారేజీ నిర్మా ణం చేపట్టాలని నిర్ణయించారు. కన్నెత్తి చూడని బాబు.. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు వంశధార నదీ జలాలను సమానంగా పంచుతూ 2017 సెప్టెంబర్–13న ట్రి బ్యునల్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అమలయ్యేలా చూడడంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు నిర్లక్ష్యం వహించారు. అప్పట్లోనే ఒడిశాతో చర్చలు జరిపి ఉంటే ఈ పాటికే ప్రాజెక్ట్ నిర్మాణం ఓ కొలిక్కి వచ్చి ఉండేది. కానీ వైఎస్సార్‌కు పేరు వస్తుందని బాబు ఈ ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో జిల్లా రైతులకు నిరీక్షణ తప్పలేదు. వైఎస్సార్ తర్వా త మళ్లీ వైఎస్ జగన్ హయాంలోనే ఈ పనులకు కదలిక వచ్చింది. చదవండి: (Andhra Pradesh: ఆస్పత్రులకు ఆహ్వానం) ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే..? ►వంశధార జల వివాదంపై ట్రిబ్యునల్ ఆంధ్రాకు అనుకూలమైన తీర్పునిచ్చింది. ►నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 108 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని, ఇందుకు ఏపీ ప్ర భుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ►115 టీఎంసీల నీరు వంశధారలో లభ్యత కాగా, రెండు రాష్ట్రాలు చెరి సగం పంచుకోవాలని సూ చించింది. ►బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ప్రాతిపదికన దామాషా పద్ధతిలో ఇరు రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేసింది. ►కాట్రగడ్డ సైడ్ వ్యూయర్ వద్ద ఏర్పాటు చేసే హెడ్ రెగ్యులేటర్‌ను ఏటా జూన్ 1 నుంచి ఎనిమిది టీ ఎంసీలు మళ్లించే వరకూ లేదా నవంబర్ 30 వర కూ తెరిచి ఉంచాలని, డిసెంబర్ –1న మూసి వేయాలని షరతు పెట్టింది. ►నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత కాట్ర గడ్డ సైడ్ వ్యూయర్‌ను పూర్తిస్థాయిలో తొలగించాలని, వంశధార నదీ యాజమాన్యం బోర్డు ఏర్పా టు ఉండాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం చొరవ.. ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలు వినిపించగలిగింది. దీంతో నేరడి బ్యారేజీ నిర్మాణానికి ట్రిబ్యునల్ అనుమతి లభించింది. ఏపీ అవసరాల కోసం బ్యారేజీకి కుడివైపున హెడ్ స్లూయిస్ నిర్మాణానికి అంగీకారం తెలిపింది. రూ. 8 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి స్లూయిస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒడిశా కోసం ఎడమవైపున కూడా స్లూయిస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ట్రిబ్యునల్ ఎంత మేర నీటి అవసరమో అన్న విషయాన్ని గెజిట్ విడుదల చేసిన ఆరు నెలలు లోగా ఏపీకి తెలియజేయాలని సూచించింది. ప్రయోజనాలెన్నో.. ►నేరడి బ్యారేజీ నిర్మాణంతో ఖరీఫ్‌లో 2.50 లక్షల ఎకరాలకు, రబీలో 2 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చు. ►ఉద్దానం ప్రాంతానికి తాగునీటి సమస్య తీరుతుంది. ►ఇప్పటికే రూ. 700 కోట్లతో ఉద్దానంలో మంచినీటి పథకం పనులు జరుగుతున్నాయి. ►వంశధార–నాగావళి నదుల అనుసంధానానికి అనుగుణంగా పూర్తిస్థాయిలో నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. ►ఒడిశాలో 30 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చు. ►హిరమండలం రిజర్వాయర్‌లోకి 19 టీఎంసీల నీరు చేరాలంటే 10 వేల క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం 40 రోజుల పాటు రెగ్యులర్‌గా ఉండాలి. అదే నేరడి బ్యారేజీ నిర్మాణం జరిగితే ఈ సమస్య తప్పుతుంది. -
‘మా పిల్లలను ఆంధ్రాలో చదివించుకుంటాం’
సాక్షి,పర్లాకిమిడి(భువనేశ్వర్): ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో తమ పిల్లలను చదివించుకుంటామని రాయఘడ సమితి, గంగాబడ పంచాయతీలోని మాణిక్యపట్నం గ్రామస్తులు తెలిపారు. ఇదే విషయమై మంగళవారం కలెక్టరేట్‌ని చేరుకుని, ఏడీఎం సంగ్రాం శేఖర పండాకి వినతిపత్రం అందజేశారు. అనంతరం పంచాయతీలో పాఠశాలలు సరిగా తెరవడం లేదని, ఒకవేళ తెరిచినా ఉపాధ్యాయులు తరగతులకు హాజరుకావడం లేదన్నారు. దీంతో ఏఓబీలోని శ్రీకాకుళం జిల్లా(ఏపీ), మందస మండలంలోని పాఠశాలలో పిల్లలను చేరి్పంచాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికైనా పాఠశాలలు తెరిపించి, సరిపడ ఉపాధ్యాయులు లేనిచోట ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. లేకపోతే తమకు దగ్గరలోని ఆంధ్రా పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తామని స్పష్టం చేశారు. చదవండి: Crime News: గట్టుపై బిడ్డను కూర్చోమని చెప్పి.. కుమార్తె కళ్లెదుటే.. -
డీఆర్డీవో, ఐటీఆర్ చాందీపూర్‌లో అప్రెంటిస్ ఖాళీలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న డీఆర్డీవో–ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరాఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 116 ► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–50, డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్‌లు–40, ట్రేడ్ అప్రెంటిస్‌లు–26. ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు: విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీబీఏ, బీకాం, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. ► డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్‌లు: విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్,సివిల్,సినిమాటోగ్రఫీ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ► ట్రేడ్ అప్రెంటిస్‌లు: ట్రేడులు: కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ తదితరాలు.అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ► 2019, 2020, 2021లో అర్హత కోర్సు ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ► ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మార్కులు/ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 01.11.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.11.2021 ► వెబ్సైట్: www.drdo.gov.in -
గన్ను కాదు.. పెన్ను పట్టండి
మల్కన్‌గిరి: కుటుంబ సభ్యులకు శాంతియుత జీవనాన్ని అందించేందుకు మావోయిస్టులు జనజీవన శ్రవంతిలోకి రావాలని రాష్ట్ర డీజీపీ అభయ్ కోరారు. చిన్నారులకు బంగారు భవిష్యత్ కోసం గన్ను పట్టిన చేతులతో పెన్ను అందించాలని పిలుపునిచ్చారు. కొరాపుట్ జిల్లాలోని మత్తిలి సమితి తులసిపహడ్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఎన్కౌంటార్లో భాగస్వామ్యమైన ఆంధ్రప్రదేశ్, ఛత్తిస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు పోలీసు అధికారులతో రహస్య సమావేశం నిర్వహించారు. మావోయిస్టులను ఎలా అణచి వేయాలనే కార్యచరణపై చర్చించారు. మల్కన్‌గిరి జిల్లా సరిహద్దులో ముడు రాష్ట్రాల పోలీసు బృందాలతో సంయుక్తంగా కూంబింగ్ జరపాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావు లేదని స్పష్టంచేశారు. మల్కన్‌గిరి జిల్లా ప్రస్తుతం అధివృద్ధి పథంలో నడుస్తోందని, స్థానిక కటాఫ్ ఏరియాలో అమాయక గిరిజనులను తప్పదోవ పట్టించవద్దని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని, కుటుంబాలకు ప్రశాంతమైన జీవనాన్ని అందించేందుకు జనంలోకి రావాలని సూచించారు. అలాగే ఎన్కౌంటర్లో పాలుపంచుకున్న పోలీసు దళాలను డీజీపీ అభినందించారు. అనంతరం ఎన్కౌంటర్లో స్వా«దీనం చేసుకొన్న మృతదేహలు, ఇతర సామగ్రీని విలేకర్ల ముందు ప్రదర్శించారు. ముగ్గురివీ.. మూడు రాష్ట్రాలు ఎన్కౌంటర్లో పోలీసులు స్వా«దీనం చేసుకున్న ఆయుధాల్లో ఎస్ఎల్ఆర్ రైఫిల్(1), ఏకే–47(1), ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్లు(3), కిట్ బ్యాగ్‌లు, బుల్లెట్లు, వాకీటాకీలు, మావోయిస్టు సాహిత్యం, విద్యుత్ వైర్లు, రేడియో, కత్తులు, జిలిటెన్ స్టిక్‌లు, ఇతర సామగ్రీ ఉన్నాయి. మృతిచెందిన మావోయిస్టులలో... మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి సుదకొండ గ్రామానికి చెందిన అనీల్ అలియాస్ కిషోర్ అలియాస్ దాసరి అలియాస్ ముకసోడి. ఆంధ్ర–ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీలో ఏసీఎంగా ఉన్నాడు. ఆయనపై రూ.5 లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన సోనీపై రూ.4 లక్షలు రివార్డు ఉంది. ఆమె మావోయిస్టు అగ్రనేత అరుణక్క రక్షణ బృందంలో ఏసీఎంగా పని చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా పెదబాయిల్ గ్రామానికి చెందిన చిన్నారావు పార్టీ సభ్యుడు ఉన్నారు. అరుణక్క రక్షణ బృందంలోనే పని చేస్తున్నాడు. ఇతనిపై రూ.లక్ష రివార్డు ఉంది. పర్యటనలో ఐజీ ఆపరేషన్స్ అమితాబ్ ఠాకూర్, ఇంటిలిజెన్స్ డీఐజీ అనువృద్ధసింగ్, దక్షణాంచల్ డీఐజీ రాకేష్ పండిట్, మల్కన్‌గిరి ఎస్పీ ప్రహ్లాద్స్వొయి మిన్నా, ఇతర పోలీసుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.