రాయగడ: జిల్లాలోని ఎన్‌ఏసీ, మున్సిపాలిటీ, సమితుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను పార్టీ అధిష్టానం శనివారం ప్రకటించింది. రాయగడ సమితి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా గడిగ బచిలి, రాయగడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మనోజ్‌కుమార్ రొథొ, కాసీపూర్ సమితికి అంగద్ నాయక్, బిసంకటక్‌కు కృష్ణ నానక్, మునిగుడకు నీలాంబర్ భిభార్, కొలనారకు ఐ.గోవర్ధనరావు, కళ్యాణసింగుపూర్‌కు సీహెచ్ నాగేశ్వరరావు, గుణుపూర్ సమితికి లివింగ్‌స్టోన్ లిమ్మ, మున్సిపాలిటీకి ఘాసీరథం బవురి, రామనగుడ సమితికి బచానిధి బెహరా, పద్మపూర్‌కు సాహెబ్ సబర్, గుడారి సమితికి భాస్కర జగరంగ, గుడారి ఎన్‌ఏసీకి ప్రమోద్‌కుమార్ పతి, చంద్రపూర్‌కు జార్జ్ క్రిషకలు అధ్యక్షులుగా నియమితులైనట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయ కార్యదర్శి బైద్యనాథ స్వాయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బీజేపీ బలోపేతానికి కృషి
బరంపురం: దక్షిణ ఒడిశాలో అన్ని రంగాల్లో కేంద్ర బిందువుగా నిలిచిన గంజాం జిల్లాలో బీజేపీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు భిబుతి భూషణ్ జెనా పిలుపునిచ్చారు. శనివారం నెహ్రూనగర్ 10వ లైన్‌లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ పవనాలు వీస్తున్నాయని, ఒడిశా ప్రజలు కూడా ఆదరిస్తారనే నమ్మకముందన్నారు. సమావేశంలో కార్యదర్శి మదన్‌మోహన్ పాత్రో, సునీల్ సాహు, కై లాస్ సడంగి జిల్లా బ్లాక్ అధ్యక్షుడు, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పునరావాసం కల్పించాలి
కొరాపుట్: దసరా పొద రోడ్డు విస్తరణ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని నబరంగ్‌పూర్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం నబరంగ్‌పూర్ కలెక్టర్‌ను కలిసేందుకు మున్సిపల్ చైర్మన్ కును నాయక్ నేతృత్వంలో బృందం వెళ్లింది. కలెక్టర్ భువనేశ్వర్ పర్యటనలో ఉన్నారని తెలిసి ఏడీఎం మహేశ్వర్‌నాయక్‌ను కలిసి సమస్య వివరించారు. జిల్లా కేంద్రంలోని బస్తి ప్రాంతం దసరా పొద మీదుగా జిల్లా కేంద్ర ఆస్పత్రి వరకు రోడ్డు విస్తరణ చేపట్టారని, రోడ్డును ఆనుకుని ఉన్న ఒకవైపు వారికి వారం రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని, దాంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వైపులా విస్తరణ చేస్తే నష్టం తక్కువగా ఉంటుందన్నారు. అదే విధంగా, నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉషారాణి, ఏ.సతీష్, ఐ.మురళీకృష్ణ, నాగేంద్ర పట్నాయక్, షర్మీష్టా దేవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment