బరంపురం: నవ వధువు తపస్విని దాస్ న్యాయ పోరాటం ఫలించింది. తనను ప్రేమించి, పెళ్లాడిన వైద్యుడు సమిత్ సాహు కొన్నిరోజుల కాపురం తర్వాత తనను ఒంటరిగా వదిలేసి, ముఖం చాటేశాడు. దీంతో ఆమె తన భర్త కోసం అత్తవారింటి ఎదుట ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో ఈమెకి స్థానిక ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల నుంచి పెద్దఎత్తున మద్దతు తెలిపి, కోర్టులో కేసు వేశారు. కోర్టు తీర్పు వచ్చేంత వరకు దాదాపు 44 రోజుల పాటు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆమె ఆందోళన చేసింది.
ఈ క్రమంలో మంగళవారం విచారణ చేపట్టిన బరంపురంలోని జిల్లా కోర్టు తపస్విని దాస్‌కు అత్తవారింట్లోనే అత్తమామలతో కలిసి ఉండేందుకు అవకాశం కల్పించాలని, ప్రతి నెలా ఆమె ఖర్చుల కోసం రూ.17 వేలు ఇవ్వాలని కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో బాధితురాలు, ఆమెకు మద్దతుగా నిలిచిన ప్రజలు న్యాయం గెలిచిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: ఓ వైపు భర్త స్నేహితుడు.. మరో ఇద్దరితో మహిళ వివాహేతర సంబంధం
Comments
Please login to add a commentAdd a comment