
కళింగా ఘాటీలో బోల్తాపడిని బస్సు
సాక్షి,బరంపురం(భువనేశ్వర్): కొందమాల్ జిల్లాలోని కళింగా ఘాటీలో బస్సు బోల్తాపడిన దుర్ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జి.ఉదయగిరి పోలీసులు వైద్యసేవల నిమిత్తం పుల్బణి ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. ఒడిశా కశ్మీర్‌గా పేరొందిన దరింగబడి అందాలను తిలకించి, వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాలిలా ఉన్నాయి.. సరిగ్గా రెండు రోజుల క్రితం దేశంలోని పలు పర్యాటక ప్రాంతాల సందర్శనకు పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాకి చెందిన 40 మంది పర్యాటకులు ఓ బస్సులో తమ ప్రయాణం ఆరంభించారు. శుక్రవారం సాయంత్రం దరింగబడి పర్యాటక స్థలానికి వెళ్లి రాత్రి తిరిగి వస్తుండగా, బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో గాయపడిన వారిని తొలుత దగ్గరలోని ఆస్పత్రికి తరలించి, వైద్యం అందజేశారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్న క్షతగాత్రులను బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. అయితే మంచు కారణంగా దారి కనిపించకపోవడంతోనే దుర్ఘటన జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment