berhampur
-
తొలి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించిన టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యాడు. పశ్చిమ బెంగాల్‌లోని బరంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన యూసఫ్.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌధురిపై 73 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందాడు. తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగిన యూసఫ్.. రాజకీయ దురంధరుడు, బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు, మూడు ఎంపీ అయిన అధిర్ రంజన్‌పై సంచలన విజయం సాధించడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధిర్ రంజన్ ప్రస్తుతం తాను ఓటమి చవిచూసిన బరంపూర్ నుంచే 1999 నుంచి వరుసగా మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. అధిర్ రంజన్ గత లోక్‌సభ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా కూడా పని చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తొలి క్రికెటర్‌గా యూసఫ్ అరుదైన ఘనత సాధించాడు. గత లోక్‌సభలో ఢిల్లీ నుంచి మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఎంపీగా ఎన్నికయ్యాడు. అయితే అతను ఈసారి ఎన్నికల్లో పాల్గొనలేదు.కాగా, ఇవాళ (జూన్ 4) వెలువడుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఊహించని విజయాలు సాధిస్తూ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుంది. బెంగాల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉండగా.. టీఎంసీ 29 స్థానాల్లో జయకేతనం ఎగరేసే దిశగా దూసుకుపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు చేస్తూ ఈ ఎన్నికల్లో బెంగాల్ నుంచి టీఎంసీ విజయదుందుభి మోగించనుంది. ఎగ్జిట్ పోల్స్‌లో ఇక్కడ బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని వచ్చింది. అయితే బీజేపీ మాత్రం కేవలం 12 సీట్లకే పరితమితమయ్యేలా కనిపిస్తుంది.దేశవ్యాప్తంగా వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే.. గతంలో కంటే ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గణనీయంగా సీట్లు తగ్గేలా ఉన్నాయి. ప్రస్తుతమున్న సమాచారం మేరకు 543 లోక్‌సభ స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 292 సీట్లకు పరిమితమయ్యేలా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఈ కూటమి 300కు పైగా సీట్లు సాధించింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండీ కూటమి అనూహ్య విజయాలు సాధించే దిశగా దూసుకుపోతుంది. ఈ కూటమి ప్రస్తుతమున్న సమాచారం మేరకు 236 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. -
దేశాభివృద్ధిలో మహిళల శకం: ముర్ము
బెర్హంపూర్: దేశాభివృద్ధిలో మహిళల శకం మొదలైందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. జాతి నిర్మాణంలో నేడు బాలికలు అన్ని రంగాల్లో కీలకంగా మారారని, ఈ పరిణామం ఎంతో ప్రోత్సాహకరమైందని పేర్కొన్నారు. గంజాం జిల్లాలోని బెర్హంపూర్ యూనివర్సిటీ 25వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. సాహిత్యం, సంస్కృతి, సంగీతం వంటి రంగాల్లో మహిళ భాగస్వామ్యం ప్రశంసనీయమని తెలిపారు. ‘సైన్స్, టెక్నాలజీ మొదలుకొని పోలీసు, ఆర్మీ వరకు ప్రతి రంగంలోనూ మన కుమార్తెల సామర్థ్యం కనిపిస్తోంది. ఇప్పుడు మనం మహిళాభివృద్ధి దశ నుంచి మహిళల సారథ్యంలో అభివృద్ధి వైపు పయనిస్తున్నాం’అని రాష్ట్రపతి తెలిపారు. -
కొన్ని రోజులు కాపురం చేసి ముఖం చాటేశాడు.. 44 రోజుల పాటు పగలు, రాత్రి.. చివరికి
బరంపురం: నవ వధువు తపస్విని దాస్ న్యాయ పోరాటం ఫలించింది. తనను ప్రేమించి, పెళ్లాడిన వైద్యుడు సమిత్ సాహు కొన్నిరోజుల కాపురం తర్వాత తనను ఒంటరిగా వదిలేసి, ముఖం చాటేశాడు. దీంతో ఆమె తన భర్త కోసం అత్తవారింటి ఎదుట ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో ఈమెకి స్థానిక ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల నుంచి పెద్దఎత్తున మద్దతు తెలిపి, కోర్టులో కేసు వేశారు. కోర్టు తీర్పు వచ్చేంత వరకు దాదాపు 44 రోజుల పాటు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆమె ఆందోళన చేసింది. ఈ క్రమంలో మంగళవారం విచారణ చేపట్టిన బరంపురంలోని జిల్లా కోర్టు తపస్విని దాస్‌కు అత్తవారింట్లోనే అత్తమామలతో కలిసి ఉండేందుకు అవకాశం కల్పించాలని, ప్రతి నెలా ఆమె ఖర్చుల కోసం రూ.17 వేలు ఇవ్వాలని కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో బాధితురాలు, ఆమెకు మద్దతుగా నిలిచిన ప్రజలు న్యాయం గెలిచిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఓ వైపు భర్త స్నేహితుడు.. మరో ఇద్దరితో మహిళ వివాహేతర సంబంధం -
ఒడిశా కశ్మీర్ చూసి వస్తుండగా.. రోడ్డంతా మంచుతో కప్పేసరికి..
సాక్షి,బరంపురం(భువనేశ్వర్): కొందమాల్ జిల్లాలోని కళింగా ఘాటీలో బస్సు బోల్తాపడిన దుర్ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జి.ఉదయగిరి పోలీసులు వైద్యసేవల నిమిత్తం పుల్బణి ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. ఒడిశా కశ్మీర్‌గా పేరొందిన దరింగబడి అందాలను తిలకించి, వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. సరిగ్గా రెండు రోజుల క్రితం దేశంలోని పలు పర్యాటక ప్రాంతాల సందర్శనకు పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాకి చెందిన 40 మంది పర్యాటకులు ఓ బస్సులో తమ ప్రయాణం ఆరంభించారు. శుక్రవారం సాయంత్రం దరింగబడి పర్యాటక స్థలానికి వెళ్లి రాత్రి తిరిగి వస్తుండగా, బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో గాయపడిన వారిని తొలుత దగ్గరలోని ఆస్పత్రికి తరలించి, వైద్యం అందజేశారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్న క్షతగాత్రులను బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. అయితే మంచు కారణంగా దారి కనిపించకపోవడంతోనే దుర్ఘటన జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. చదవండి: పబ్‌కు మాజీ ప్రియురాలిని పిలిచి.. -
‘ము పట్టొ పొడిబి’.. దీనికి అర్థం ఏంటో తెలుసా?
బరంపురం(భువనేశ్వర్): నగరంలోని హిల్‌పట్నా మెయిన్‌రోడ్డులో ఉన్న బిజూ పట్నాయక్ సాంస్కృతిక భవనంలో ఒడిశా నాటక సమారోహ సమితి ఆధ్వర్యంలో 3 రోజుల నుంచి జరుగుతున్న రాష్ట్ర స్థాయి శిశు నాటక మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా గంజాం జిల్లా బంజనగర్ గురుకుల పాఠశాల విద్యార్థులు చేపట్టిన ‘ము పట్టొ పొడిబి’(నేను చదువుకుంటాను) అనే నాటిక ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో బరంపురం ఎంపీ చంద్రశేఖర్ సాహు, ఎమ్మెల్యే విక్రమ్ పండా తదితరులు పాల్గొన్నారు. మరో ఘటనలో.. రాఖీ ఘెష్‌కు ప్రెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా పురస్కారం భువనేశ్వర్: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ప్రెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా పురస్కారం–2021..ది పయనీర్ ఇంగ్లిష్ జర్నలిస్ట్ రాఖీ ఘోష్‌ని వరించింది. వర్చువల్ మాధ్యమంలో ఈ పురస్కార ప్రదానోత్సవం శుక్రవారం జరిగింది. సుందరగఢ్ ప్రాంతంలో కోవిడ్ మృతుల దహన సంస్కారాలను స్వచ్చంధంగా నిర్వహిస్తున్న యుజవన సాంఘిక సేవా సంస్థలపై పత్రికలో రాసిన కథనానికి గాను ఆమెకి ఈ అవార్డుల లభించినట్లు తెలుస్తోంది. చదవండి: భర్త, కూతురు మృతి.. తోడు నిలిచిన ‘రిక్షా’ కుటుంబం.. బహుమతిగా రూ.కోటి ఆస్తి -
ఆపదలో ఆలివ్.. తీర ప్రాంతాల్లో ఆలివ్‌రిడ్లేల కళేబరాలు!
ప్రపంచలోనే అత్యంత అరుదైన సముద్రపు తాబేళ్లుగా పిలవబడే ఆలివ్‌రిడ్లేల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సముద్ర జలాలను శుద్ధిచేసి, పర్యావరణాన్ని కాపాడడంలో తోడ్పడుతున్న వీటి సంరక్షణ కరువైంది. ఏటా గంజాం జిల్లా సాగర తీరంలో మైటింగ్(సంగమం)కి వచ్చే వీటిని కాపాడేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నా ఇవి ఈసారి ఆశించినంత స్థాయిలో లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి జిల్లాలోని పలు తీర ప్రాంతాల్లో కనిపిస్తున్న ఆలివ్‌రిడ్లేల కళేబరాలే నిదర్శనం. బరంపురం (ఒడిశా): గంజాం జిల్లాలోని రుసికుల్యా నది–బంగాళాఖాతం ముఖద్వారం ఆలివ్‌రిడ్లేల సంతానాభివృద్ధికి మంచి ఆవాసం. దేశ వ్యాప్తంగా ఉన్న 3 అనువైన ప్రదేశాలకు మాత్రమే ఇవి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మరీ సంగమిస్తుండడం విశేషం. ఏటా నవంబరులో వీటి మైటింగ్(సంగమం)తో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ గుడ్లు పెట్టడం, ఆ తర్వాత వాటిని పొదగడం వంటి ప్రక్రియలు జనవరి, ఫిబ్రవరి నెలల వరకు నిరవధికంగా సాగుతుంది. అయితే ఈ తాబేళ్ల పిల్లలు సముద్రంలోకి ఏ మార్గాన వెళ్తాయో అవి పెద్దవైన తర్వాత గుడ్లు పెట్టేందుకు కూడా అదే స్థావరానికి రావడం వీటి ప్రత్యేకత. ఇప్పుడు గంజాం జిల్లాలోని గోపాలపూర్, పూర్ణబొందా సాగర తీరాల్లో ఎక్కడికక్కడ ఒడ్డుకు చేరుకున్న ఆలివ్ రిడ్లే తాబేళ్ల కళేబరాలు కనిపిస్తున్నాయి. ఇక్కడికి ఏటా చేరుకుంటున్న వీటికి రక్షణ కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నా ఇటువంటి దృశ్యాలు తారసపడడం పర్యావరణ హితులను కలవరపరుస్తోంది. ఇటీవల ఆలివ్‌రిడ్లేల రాక నేపథ్యంలో తీరం నుంచి లోపలికి 10 కిలోమీటర్ల మేర చేపల వేట నిషేధిస్తూ జిల్లా అధికార యంత్రాంగం ఉత్వర్వులు జారీ చేసింది. ఫిషింగ్ బోట్లతో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది. చదవండి: (AP PGCET: ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల) తీరంలోని కళేబరాలను పీక్కుతింటున్న శునకాలు సంప్రదాయ వలలతో వేటకు ఓకే.. మత్స్యకారులు జీవనోపాధి కోల్పోకుండా సంప్రదాయ వలలతో వేట కొనసాగించుకోవచ్చని అవకాశం కల్పించింది. తీరంలో నిబంధనలను ఎవ్వరూ అతిక్రమించకుండా అధికారులను సైతం అధికార యంత్రాంగం నియమించింది. అయితే రెండు రోజులుగా అధికారుల జాడ కొరవడడంతో కొంతమంది సముద్రంలో అక్రమంగా చేపల వేట కొనసాగించే సాహసం చేస్తున్నారు. ఈక్రమంలో ట్రాలీల వినియోగంతో మైటింగ్లో ఉన్న తాబేళ్లు చనిపోతున్నాయి. ముఖ్యంగా ఫిషింగ్ బోట్ల చక్రాలు తాబేళ్లను ఢీకొనడం, సముద్రంలోకి చేరే ఆక్వా రసాయనాలతో ఇవి చనిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రుసికుల్యా నది–బంగాళాఖాతం ముఖ ద్వారంలోని నిషేధిత ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విశాఖపట్నం, కాకినాడ ఓడరేవుల నుంచి కొంతమంది వేట జరపడంతో ఇక్కడి మైటింగ్లోని ఆలివ్‌రిడ్లేలు చనిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి, ఆపదలో ఉన్న తాబేళ్ల పరిరక్షణకు చర్యలను కట్టుదిట్టం చేయాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. పొదిగే సమయం 45 రోజులు.. సంతానాభివృద్ధికి ఏటా నవంబరులో తీరానికి చేరే తాబేళ్లు మైటింగ్ అనంతరం గుడ్లు పెడతాయి. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలల్లో తీరంలోని ప్రత్యేక గుంతల్లో భద్రపరిచిన గుడ్లును పొదుగుతాయి. దీనికి 45 నుంచి 60 రోజుల సమయం పడుతుంది. వీటి సంరక్షణకు ట్రీ ఫౌండేషన్, బయోవర్సిటీ కన్జర్వేషన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తుండగా, ఆలివ్‌రిడ్లే ఒక్కొక్కటి 3 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, దాదాపు 45 కిలోల బరువు ఉంటుంది. చదవండి: (KTR: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు) ఆక్సిజన్ పెంచడంలో కీలకం.. ఆలివ్‌రిడ్లే తాబేళ్లు సముద్ర జలాల్లోని వివిధ వ్యర్థాలను తిని, సముద్రం కలుషితం కాకుండా కాపాడుతాయి. అంతేకాకుండా సముద్ర జీవరాశులను అంతరించిపోకుండా ఇవి పరిరక్షిస్తున్నాయి. సముద్రంలో ఆక్సిజన్ పెంచడంలో తాబేళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి గుడ్లు పెట్టే సమయంలో తీరంలో ఓ రకమైన జెల్‌ని విడుదల చేస్తాయి. అది భూమిలో బంకలా అతుక్కుపోయి విపత్తుల సమయంలో తీరం కోతకు గురికాకుండా నివారిస్తుంది. ఇలా అనేక ఉపయోగాలున్న వీటి సంరక్షణ నేడు గాల్లో దీపంగా మారింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏం చెబుతోంది.. వణ్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం తాబేళ్లను షెడ్యూల్–1లో పొందుపరిచి, ప్రత్యేక రక్షణ కల్పించారు. పర్యావరణాన్ని కాపాడే సముద్రపు తాబేళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కొందరు సముద్రంలోకి వ్యర్థాలను వదిలిపెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా మరబోట్లు నడపడం వల్ల తాబేళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి. అలాగే తాబేళ్లను ఎవరైనా తిన్నా, చంపినా, వాటి ఆవాసాలను నాశనం చేసినా శిక్షార్హులు. నేరం రుజువైతే 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. -
భారీ దోపిడికి పక్కా ప్లాన్.. ట్విస్ట్ మూములుగా లేదుగా
సాక్షి, బరంపురం( భువనేశ్వర్): జాతీయ రహదారిలో భారీ దోపిడీకి వ్యూహ రచన చేసిన దుండగుల ముఠాను పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. వీరంతా ఇప్పటికే పదుల సంఖ్యలో వివిధ నేరాల్లో శిక్ష అనుభవించి, విడుదలైన వారని తెలియడంతో స్థానికంగా సంచలనం రేపింది. ఐఐసీ అధికారి సుమిత్‌సరన్ అందించిన సమాచారం ప్రకారం... గంజాం జిల్లా గుసానినువాగం పోలీస్ స్టేషన్ పరిధి కొజిరిపడా సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న వంతెన వద్ద మంగళవారం అర్ధరాత్రి భారీ దోపిడీకి దుండగులు పథకం పన్నారు. ఇదే సమయంలో గుసానినువాగం పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా.. అనుమానాస్పదంగా కొందరు తిరుగాడటంతో వెంబడించారు. దుండగులు తప్పించుకొనే ప్రయత్నంగా చేయగా.. వారందరినీ చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 32 సెల్ఫోన్లు, 3 నాటుబాంబులు, నాటు తుపాకి, 3 తూటాలు, ఇనుపరాడ్లు, మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో టైగర్ నొనియా, చోటుకుమార్ నొనియా, రాహుల్‌కుమార్, చందన్ నొనియా, రాజ్‌కుమార్ నొనియా, రొహన్‌కుమార్ నొనియా, బిజయ్‌దాస్, అనుక్‌కుమార్, సహిర్‌ఖాన్‌గా గుర్తించారు. పట్టుబడిన వారంతా ఝార్కండ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా.. మరో దుండగుడు భువనేశ్వర్ బాలకొటి చెందిన నేరస్థుడుగా వెల్లడించారు. అరెస్టయిన వారిపై గతంలో బరంపురం జిల్లా పరిధిలోని పెద్ద బజార్, బీఎన్‌పూర్ పోలీస్ స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయన్నారు. వాటికి సంబంధించి శిక్ష అనుభవించి, జైలు నుంచి బయటకు వచ్చిన వారేనని వివరించారు. ఈ నేపథ్యంలో నిందుతులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఐఐసీ అధికారి తెలిపారు. -
వింత శిశువు: పంది తల ఆకారం, పొలుసుల శరీరం!
సాక్షి, బరంపురం (ఒడిశా): నగరంలోని ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో ఓ మహిళ వింత శిశువుకి గురువారం జన్మనిచ్చింది. బట్టకుమరా గ్రామానికి గర్భిణికి ఉదయం పురిటినొప్పులు రావడంతో ఆమెని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో 2.40 కిలోల బరువున్న శిశువుకి ఆమె జన్మనివ్వగా, శిశువు తల పంది తల ఆకారంలోనూ, చర్మంపై పొలుసులు ఉండి అవి ఊడిపోతున్నట్లుగానూ కనిపిస్తోంది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగానే ఉండగా, ఇటువంటి శిశువు ఇంతవరకు బతికి ఉండడం చాలా అరుదు అని వైద్యులు అంటున్నారు. చదవండి: నీ ఒంట్లో ఏమైనా స్ప్రింగ్ ఉందా ఏంటి! -
హెచ్ఐవీ బాధితులకు పెళ్లి చేసిన కలెక్టర్
సాక్షి, బరంపురం(ఒడిశా): ఇద్దరూ భయంకరమైన రోగంతో పీడించబడుతున్నారు. ఏ క్షణాన మృత్యువు కబలిస్తుందో తెలియని విషమ పరిస్థితి. చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు చేసేంతలా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎదిగినా.. సాటి మనుషులుగా వారిని ఆమోదించని సమాజం. వీటన్నిటినీ ఎదుర్కొని ఒక్కటయ్యింది ఓ కొత్త జంట. భయంకరమైన ఎయిడ్స్ వ్యాధికి గురైన ఇద్దరు యువతీ, యువకులు వివాహ బంధంతో తమ పవిత్ర బంధానికి శ్రీకారం చుట్టారు. గోపాల్‌పూర్‌లోని శ్రాద్ధ సంజీవని హెచ్ఐవీ సేవాశ్రమం దీనికి వేదికైంది. స్వయంగా బరంపురం కలెక్టర్ విజయ్ అమృత కులంగా పెళ్లి పెద్దగా వ్యవహరించి, వివాహ తంతు నిర్వహించడం విశేషం. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ఆశీర్వదించారు. ఇలాగే 5–టీ కార్యదర్శి కార్తికేయ పాండ్యాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి విభాగం ప్రాజెక్ట్ చైర్మన్ సింధ్ దత్తాత్రేయ బహుసాహిబ్, బరంపురం మున్సిపాల్ కమిషనర్ శిద్ధేశ్వర్ బలిరామ్ బందరా, సబ్ కలెక్టర్ కీర్తి హాసన్ పాల్గొన్నారు. చదవండి: మొతేరాకు మోదీ పేరు, పప్పులో కాలేసిన భారత నెటిజన్లు పీఎం,సీఎం సార్లు.. నెట్వర్క్ సదుపాయం కల్పించండి! -
లాక్డౌన్: మహిళపై అఘాయిత్యం
బెర్హంపూర్: దేశమంతా నిర్బంధంలో ఉన్నా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఒడిశాలో కామాంధుల బారిన పడి ఓ గిరిజన మహిళ ప్రాణాలు కోల్పోయింది. మల్కాన్‌గిరి పోలీస్ క్యాంటీన్లో సామూహిక లైంగిక దాడికి గురైన బాధితురాలు మంగళవారం బెర్హంపూర్ ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో కన్నుమూసిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో గుర్తుతెలియని దోషులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్టు వెల్లడించారు. అసలేం జరిగింది? పోలీసుల నివేదిక ప్రకారం... బాధితురాలు అనారోగ్యం పాలైందని మే 7న బాధితురాలి భర్తకు పోలీస్ క్యాంటీన్ ఇన్చార్జి సమాచారం ఇచ్చారు. విషమ పరిస్థితుల్లో ఉన్న ఆమెను మల్కాన్‌గిరి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చేర్చారు. తన భార్య శరీరంపై గాయాలను గుర్తించిన బాధితురాలి భర్త మే 9న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యపై లైంగిక దాడి జరిగిందని అతడు ఆరోపించాడు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆమెను బెర్హంపూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఆమె చనిపోయింది. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు మల్కాన్‌గిరి మోడల్ పోలీస్‌స్టేషన్ సీఐ రాంప్రసాద్ నాగ్ తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆమె మరణానికి గల కారణాలు తెలుస్తాయన్నారు. ప్రత్యేక బృందం కేసు దర్యాప్తు చేస్తుందని, నేరానికి పాల్పడిన వారిపై చర్యలు తప్పవని మల్కాన్‌గిరి ఏఎస్పీ అన్నారు. జూన్ 9లోగా నివేదిక ఇవ్వండి: ఓహెచ్‌ఆర్‌సీ ఈ ఘటనపై దర్యాప్తు జరిపి జూన్ 9లోగా నివేదిక సమర్పించాలని మల్కాన్‌గిరి ఎస్పీని ఒడిశా మానవ హక్కుల సంఘం(ఓహెచ్‌ఆర్‌సీ) ఆదేశించింది. సామాజిక కార్యకర్త నమ్రతా చాద్దా ఫిర్యాదుతో ఓహెచ్‌ఆర్‌సీ స్పందించింది. ఈ నేరంతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలని మల్కాన్‌గిరి ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలికి అన్ని రకాల చికిత్సలు అందేలా చూడాలని, వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఇంతకుముందు ఓహెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. రోజు కూలీ అయిన బాధితురాలి భర్తకు ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని నమ్రత తన పిటిషన్లో కోరారు. పోలీసులపైనే అనుమానం సాక్షాత్తు పోలీస్ క్యాంటీన్లోనే మహిళపై అఘాయిత్యం జరగడం పట్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నిందితులను ఎందుకు గుర్తించలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణం వెనుక పోలీసుల హస్తం ఉండొచ్చన్న అనుమానాలను వ్యక్తం చేశారు. పోలీస్ క్యాంటీన్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ఎలా వస్తారు? అక్కడ సీసీ కెమెరాలు ఎందుకు లేవని అడుగుతున్నారు. ఇంత ఘోరం జరుగుతుంటే పోలీస్ క్యాంటీన్ సంరక్షకులు ఏమి చేస్తున్నారు? పోలీసులు ఎక్కడ ఉన్నారని నిలదీస్తున్నారు. దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. (రైలు దిగగానే.. ‘ముద్ర’ పడింది!) -
ఏకంగా 34సార్లు ఓడిపోయాడు.. ఐనా!
భువనేశ్వర్: లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ.. ఎన్నికలు ఏదైనా ఆయన పోటీ చేయాల్సిందే. 1962 నుంచి ఒడిశా బెర్హంపూర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తూనే ఉన్నారు. ఓటమి ఆయనను ఏనాడూ ఆపలేదు. నిరుత్సాహ పరచలేదు. నిజానికి ఎన్నికల్లో ఇప్పటికీ 32సార్లు ఆయన ఓడిపోయాడు. అయినా, ఈసారి ఒకటి కాదు రెండు నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయనే ఒడిశా ఎన్నికలకు బాగా సుపరిచితుడైన శ్యాంబాబు సుబుద్ధి. 84 ఏళ్ల వయస్సులో తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సుబుద్ధి.. ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీతో ముచ్చటించారు. ‘నేను మొదటిసారి 1962లో ఎన్నికల్లో పోటీ చేశాను. అప్పటినుంచి లోక్‌సభ, అసెంబ్లీ ఇలా భిన్నమైన ఎన్నికలన్నింటిలోనూ పోటీ చేస్తూ వస్తున్నాను. తమ పార్టీలో చేర్సాలిందిగా పలు రాజకీయ పార్టీల నుంచి నాకు ఆహ్వానాలు అందాయి. కానీ, నేను ఎప్పుడూ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తూ వచ్చాను’ అని తెలిపారు. సర్టిఫైడ్ హోమియోపతి డాక్టర్ అయిన సుబుద్ధి ఈసారి ఆస్కా, బెర్హంపూర్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అంతేకాదు, జూన్ 11న ఒడిశాలో జరగనున్న మూడు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. గతంలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, మాజీ సీఎం బీజు పట్నాయక్‌లపై కూడా ఆయన పోటీ చేశారు. ‘రైళ్లలో, బస్సుల్లో ప్రయాణించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటాను. మార్కెట్లు, కూడళ్లలోనూ ప్రచారం చేస్తాను. గెలుపోటములు నాకు ముఖ్యం కాదు. నా పోరాటాన్ని నేను కొనసాగిస్తాను. ఈసారి ఎన్నికల గుర్తుగా నాకు క్రికెట్ బ్యాటును కేటాయించారు. అందుకే పీఎం అభ్యర్థి అని రాసి ఉన్న బ్యాటును ప్రచారంలో ఉపయోగిస్తున్నాను’ అని సుబుద్ధి వివరించారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న పరిస్థితులు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నగదు, మద్యం పంపిణీ వంటి చర్యలు తనను తీవ్ర అసంతృప్తి గురి చేస్తున్నాయని, అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటానని సుబుద్ధి చెప్పారు. చదవండి: ఎన్నికల్లో పోటీ.... ఆయన హాబీ! -
హోలీ వేడుకల్లో అపశ్రుతి.. ముగ్గురు గల్లంతు
సాక్షి, బరంపురం: హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. గోపాల్పూర్ సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం ఒడ్డుకు చేరుకోగా మిగిలిన ఇద్దరి కోసం గాలింపు ముమ్మరం చేశారు. పోలీసులు, బాధిత కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. బినాయక్ ఆచార్య కళాశాల విద్యార్థి సంఘం కార్యదర్శి డి.హితీష్, ప్రెసిడెన్షియల్ కాలేజీకి చెందిన సిద్ధాంత్ పాత్రో, ఎ.లోకేష్‌లతో సహా వివిధ కళాశాలలకు చెందిన 19 మంది విద్యార్థులు శుక్రవారం హోలీ పండగ చేసుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం గోపాల్పూర్ సముద్ర తీరానికి స్నానానికి వెళ్లారు. ఆ సమయంలో అలల ఉద్ధృతికి నలుగురు విద్యార్థులు కొట్టుకుపోగా ఒకరిని స్థానికులు రక్షించారు. మిగిలిన ముగ్గురు గల్లంతయ్యారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో సిద్ధంత్ పాత్రో మృతదేహం హరిపురం తీరంలో ఒడ్డుకు చేరింది. హితీష్, ఎ.లోకేష్‌ల జాడ దొరకలేదు. వీరిద్దరి కోసం మెరైన్, గోపాల్పూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. -
నీరుగారిన నిషేధం
బరంపురం: ప్రస్తుతం మానవ జీవితంలో ప్లాస్టి క్స్ విడదీయరాని భాగమైపోయాయి. ఉదయం బ్రష్ చేసుకోవడం నుంచే ప్లాస్టిక్స్ వాడకం మొదలవుతోంది. ఇక పాల ప్యాకెట్లు, కూరలు తెచ్చుకునే బ్యాగులు, చిన్నారులు స్కూలు కెవెళ్లేటపు డు లంచ్ బాక్స్‌లు, వాటర్ బాటిళ్లు, ఇంటి బయట అడుగు పెడితే అల్పాహారం, బోజనం, నీళ్లు, కాయగూరలు ఏది కొన్నా ప్లాస్టిక్ బ్యాగులతోనే మన చేతికందుతాయి. ఇటీవల కాలం లో ప్రచారం ఊపందుకోవడంతో ఫ్లెక్సీ బ్యాన ర్లు, బోర్డులు వెల్లువెత్తుతున్నాయి. ఇవి కూడా ప్లాస్టిక్స్ వినియోగించి రూపొందిస్తున్నవే. ఇంకా ప్రమాదకరమైన రసాయనాలు రంగులను వీటిపై పూస్తున్నారు. ఇవన్నీ పర్యావరణానికి పెను ప్రమాదాన్ని తెచ్చి పెడుతున్నాయని వివిధ సంస్థల వాదన. జిల్లాలో ప్లాస్టిక్ కారణంగా రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు వేల సంఖ్యలో ఉండడం గమనార్హం. పదేళ్ల క్రితం వరకూ సరుకులు తెచ్చుకోవాలంటే కాగితం సంచులు, జనప నార సంచులు ఎక్కువగా వాడేవారు. వీటికన్నా తక్కువ ధరకే ప్లాస్టిక్ సంచులు అందుబాటులోకి రావడంతో అందరూ వీటిని ఉపయోగిస్తున్నారు. 20 మైక్రానుల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వాడకం సమస్త జీవజాలం ఉనికికి ముప్పుతెస్తుందని అంతర్జాతీయంగా పర్యావరణవేత్తలు రుజువుచేశారు. దీంతో కొన్ని దేశాలు ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించాయి. అయినప్పటికీ నిషేధం అమలు కావడం లేదు. మన దేశంలో ప్రజాసంక్షేమమే తమ పరమావధి అంటూ భారీగా ఉపన్యాసాలు ఇచ్చే నేతలందరూ పర్యావరణానికి తూట్లు పొడితే ఈ ఫెక్సీ బ్యానర్లకు భారీగానే ప్రోత్సాహం ఇస్తుండడం విశేషం. ప్రస్తుతం జిల్లాలో పట్టణ, నగర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకూ లక్షల సంఖ్యలో ఇలాంటి ఫ్లెక్సీ బ్యానర్లు ఉన్నప్పటికీ ఏ అధికారి కూడా వీటిని పట్టించుకోవడం లేదు. ప్రమాదమని తెలిసినా.. పలువురు పరిశోధకులు అందించిన సమాచారం ప్రకారం ప్లాస్టిక్ సంచులు, ఇతర ప్లాస్టిక్ ఉత్పాదకాలు మట్టిలో కలవాలంటే అక్షరాలా లక్ష సంవత్సరాలు పడుతుంది. మనం తిని పారేసే అరటితొక్క 24 రోజుల్లో, కాగితంతో తయారుచేసిన వస్తువులు నెల రోజుల్లో, వస్త్రాలు రెండేళ్లలో, చర్మపు ఉత్పత్తులు 200 ఏళ్లలోగా భూమిలో కలిసిపోయే పరిస్థితిలేదని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్స్ వల్ల కాలుష్య విషవలయంలో జన జీవితాలు విలవిలలాడుతున్నాయి. గంజాం జిల్లాలో ప్లాస్టిక్స్ వినియోగం ఏటా నలభై శాతం పెరుగుతోంది. అందులోని హెవీమెటల్స్ ఆహా రం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఫలితంగా నరాల బలహీనత ఏర్పడుతోంది. బ్యాగ్‌ల కోసం, ఫ్లెక్సీ బ్యానర్ల కోసం వినియోగించే రంగుల వలన సీసం, కాడ్మియంలు పిల్లల్లో ఎదుగుదలను, జ్ఞాపకశక్తిని హరించి వేస్తున్నాయి. నామమాత్రంగా తనిఖీలు ప్లాస్టిక్స్ వినియోగంపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం ఉన్నప్పటికీ ఈ జిల్లాలో మాత్రం ఒక్క శాతం కూడా అమలు కావడం లేదు. 20 మైక్రానుల కంటే తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగ్‌లు ఉపయోగించరాదని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలుచేసే స్థితిలో అధికారులు లేరు. తక్కువ మందం ఉండే క్యారీ బ్యాగ్‌ల తయారీ లాభసాటి కావడంతో ఉత్పత్తిదారులు వాటిని తయారుచేస్తూ ప్రజల ప్రాణా లతో చెలగాటమాడుతున్నారు. ఏదో నామమాత్రంగా బీఎంసీ ఆధ్వర్యంలో నగరంలో తూతూమంత్రంగా సోదాలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటిౖMðనా అధికార యంత్రాంగం ప్లాస్టిక్స్ వినియోగం వల్ల కలుగుతున్న పర్యావరణ విషాదాన్ని గుర్తించి నిషేధంపై దృష్టి సారించా లని పలు స్వచ్ఛం, ప్రజా సంఘాలు కోరుతున్నారు. -
యువతి ఆత్మహత్యపై అనుమానాలు
బరంపురం: యువతి మమ్మిని బెహరా(20) మరణంపై పోలీసు అధికారుల్లో హత్య, ఆత్మహత్య అనే సందేహాలు ఏర్పడ్డాయి. రెండు రోజుల క్రితం బెహరా మృతి చెందగా, దీనిపై అనుమానాలు వీడడం లేదు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం... బరంపురం పెద్ద బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో కుమ్మరి వీధిలో బాస్కర్ బెహరా నివాసం ఉంటున్నాడు. తమ్ముడు కుమార్తె మమ్మిని బెహరా(20) తన ఇంట్లో ఉంటూ మహమాయి మహిళా కళాశాలలో +3 డిగ్రీ చదువుతుంది. ఈ నెల 12వ తేదీ ఉదయం 5 గంటల సమయంలో మమ్మిని బెహరా నిద్రలేచి పెరటిలోకి వెళ్లి తన చున్నీతో ఉరి వేసుకుంది. మమ్మిని బెహరా ఎంతకీ రాకపోయే సరికి పెద్దమ్మ రంజని బెహరా పెరటికి వెళ్లి చూసే సరికి కొన ఊపిరితో మమ్మిని ఉంది. వెంటనే ఆటోలో సోదరుడు సునిల్ బెహరా, పెద్దనాన్న భాస్కర్ బెహరా సొంత గ్రామం కుల్లడా తీసుకువెళుతుండగా మార్గం మధ్యలోనే మృతి చెందినట్టు సోదరుడు సునిల్ బెహరా తెలియజేశారు. మృతురాలు తండ్రి సంతోష్ బెహరా, పెద్దనాన్న భాస్కర్ బెహరా కలిసి శ్రీరామ్‌నగర్ చివరన ఉన్న శ్మశానంలో మమ్మిని బెహరాకు దహన సంస్కారాలు చేశారు. మమ్మిని బెహరా ఆత్మహత్యపై అనుమానాలు రావడంతో ఆమె సొంత సోదరులు దీరు బెహరా, గురు బెహరా ఆదివారం సాయంత్రం పెద్ద బజార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేవారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టి కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. దర్యాప్తు కొనసాగుతుందని పూర్తయిన వెంటనే నిజాలు వెలుగులోకి వస్తాయని ఎస్డీపీవో తెలియజేశారు. -
దివ్యాంగురాలిపై ఇద్దరి పిల్లల తండ్రి అత్యాచారం
బెర్హంపూర్: ఒడిషాలో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగ్గాలేని ఓ దివ్యాంగురాలిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన గంజమ్ జిల్లా హింజిలీలో చోటు చేసుకుంది. బాధితురాలి ఇంటి పక్కన ఉండే వ్యక్తే ఈ దారుణానికి వడిగట్టాడు. ఎవరు లేని సమయంలో ఆమెపై పలుమార్లు అత్యాచారం జరిపాడని, ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం తెలిసిందని బాధితురాలి తల్లి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు ఇద్దరి పిల్లల తండ్రి అని, 41 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. బాధితురాలు, నిందితుడిని వైద్య పరీక్షలకు పంపించామని, కేసు దర్యాప్తు జరుగుతుందని పోలీసులు చెప్పారు. -
తీరానికి చేరిన అరుదైన భారీ తిమింగలం
భువనేశ్వర్: తమిళనాడులోని ట్యూటికోరిన్ సముద్ర తీరానికి వందల కొద్ది తిమింగలాలు చనిపోయి తీరానికి కొట్టుకువచ్చిన ఘటన మరువకముందే అదే రీతిలో ఓ భారీ తిమింగలం ఒడిషాలోని గంజం తీరానికి వచ్చింది. ఈ తీరం రాజధాని భువనేశ్వర్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారు 33 అడుగులు ఉన్న ఈ భారీ తిమింగలం రక్తపుమడుగులో పడి ఉండటాన్ని తీరానికి వెళ్లిన స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. ఈ భారీ తిమింగలం రెండు, మూడు రోజుల కిందటే చనిపోయి ఉండొచ్చునని బెర్హంపూర్ డివిజన్ అటవీ అధికారి ఏకే బేహెరా అభిప్రాయపడ్డారు. ఆ ప్రాంతంలో తిరిగే కొన్ని ప్రత్యేక నౌకలు, ఓడలకు కింది ఉండే పదునైన భాగం తిమింగలాన్ని చీల్చకుంటూ పోవడం వల్ల ఈ భారీ ప్రాణి మరణించి ఉంటుందని గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని బెర్హంపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేసీ సాహు తెలిపారు. స్పెర్మ్ తిమింగలం దంతాలు ప్రపంచలోనే అతిపెద్దవన్న విషయం అందరికీ తెలిసిందే. 2,250 మీటర్ల లోతుకు కూడా వెళ్లగలగడం వీటి ప్రత్యేకత. సాధారణంగా సముద్ర తాబేళ్లు ఎక్కుగా ఈ తీరానికి వస్తుంటాయని ప్రొఫెసర్ వివరించారు. తిమింగలం చినిపోవడానికి అసలు కారణాలేంటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
పాతకక్షలతో పాత్రికేయుడి హత్య
ఒడిషాలోని ఓ ప్రైవేటు టీవీ ఛానల్లో పనిచేస్తున్న పాత్రికేయుడు దారుణ హత్యకు గురయ్యాడు. బెరహంపూర్కు చెందిన తపస్ ఆచార్య (34) మృతదేహం ఖల్లికోటె పోలీసు స్టేషన్‌కు సమీపంలో రోడ్డుపక్కన పడి ఉండగా గుర్తించారు. తపస్ మెడ మీద గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తన డ్యూటీ ముగించుకుని ఖల్లికోటేకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామానికి వస్తుండగా అతడు హత్యకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితులు పదునైన ఆయుధం లేదా కత్తిని ఉపయోగించి ఉంటారని ఛత్రపూర్ డీఎస్పీ ఏసీహెచ్ పాహి తెలిపారు. పాత కక్షల వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు తెలిపారు. గంజాం జిల్లాలోని పాత్రికేయ సంఘాలు ఈ హత్యను తీవ్రంగా ఖండించాయి. -
హెల్మెట్ల వాడకం ఇక తప్పనిసరి!!
ద్విచక్ర వాహనదారులంతా ఇక తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాల్సిందే. లేకపోతే భారీ జరిమానాలు తప్పవు. ఈ నిబంధన దక్షిణ ఒడిషాలోని బెర్హంపూర్‌లో తాజాగా అమలులోకి వచ్చింది. కేవలం వాహనం నడిపేవాళ్లు మాత్రమే కాదు, వెనకాల కూర్చున్నవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని బెర్హంపూర్ ఎస్పీ ఏకే సింగ్ తెలిపారు. కొన్ని నెలల క్రితమే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినా, ఇప్పటివరకు దాని అమలు విషయాన్ని అంత గట్టిగా పట్టించుకోలేదు. కానీ, సురక్షిత డ్రైవింగ్‌లో భాగంగా ఎస్పీ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. దీంతోపాటు డ్రంకెన్ డ్రైవింగ్ చేసేవారిని కూడా పట్టుకోవడం ద్వారా ప్రమాదాలను అరికట్టాలని భావిస్తున్నారు. గత సంవత్సరం జరిగిన ప్రమాదాల్లో 93 మంది మరణించగా 265 మంది గాయపడ్డారు. అదే 2012లో అయితే 117 మంది మరణించగా 106 మంది గాయపడ్డారు. అందుకే ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. -
మరుభూమిగా మారిన బరంపురం