దివ్యాంగురాలిపై ఇద్దరి పిల్లల తండ్రి అత్యాచారం
Published Mon, Mar 6 2017 7:19 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
బెర్హంపూర్: ఒడిషాలో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగ్గాలేని ఓ దివ్యాంగురాలిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన గంజమ్ జిల్లా హింజిలీలో చోటు చేసుకుంది. బాధితురాలి ఇంటి పక్కన ఉండే వ్యక్తే ఈ దారుణానికి వడిగట్టాడు. ఎవరు లేని సమయంలో ఆమెపై పలుమార్లు అత్యాచారం జరిపాడని, ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం తెలిసిందని బాధితురాలి తల్లి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు ఇద్దరి పిల్లల తండ్రి అని, 41 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. బాధితురాలు, నిందితుడిని వైద్య పరీక్షలకు పంపించామని, కేసు దర్యాప్తు జరుగుతుందని పోలీసులు చెప్పారు.
Advertisement
Advertisement