బెర్హంపూర్: దేశాభివృద్ధిలో మహిళల శకం మొదలైందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. జాతి నిర్మాణంలో నేడు బాలికలు అన్ని రంగాల్లో కీలకంగా మారారని, ఈ పరిణామం ఎంతో ప్రోత్సాహకరమైందని పేర్కొన్నారు. గంజాం జిల్లాలోని బెర్హంపూర్ యూనివర్సిటీ 25వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు.
సాహిత్యం, సంస్కృతి, సంగీతం వంటి రంగాల్లో మహిళ భాగస్వామ్యం ప్రశంసనీయమని తెలిపారు. ‘సైన్స్, టెక్నాలజీ మొదలుకొని పోలీసు, ఆర్మీ వరకు ప్రతి రంగంలోనూ మన కుమార్తెల సామర్థ్యం కనిపిస్తోంది. ఇప్పుడు మనం మహిళాభివృద్ధి దశ నుంచి మహిళల సారథ్యంలో అభివృద్ధి వైపు పయనిస్తున్నాం’అని రాష్ట్రపతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment