Graduation Ceremony
-
సంప్రదాయానికే జై.. టోపీ, గౌన్లకు బై బై
భారతీయ విద్యాసంస్థల స్నాతకోత్సవ సంప్రదాయాల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. బ్రిటిష్ కాలం నాటి నల్లటోపీ, గౌన్ల స్థానాన్ని సంప్రదాయ చేనేత వస్త్రాలు భర్తీ చేస్తున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) 2015లో మేకిన్ ఇండియాలో భాగంగా ప్రధాని పిలుపు మేరకు విశ్వవిద్యాలయాల్లో సంప్రదాయ వస్త్రధారణకు మారాలని పిలుపునిచ్చింది. తద్వారా చేనేత పరిశ్రమ పునరుద్ధరణతో పాటు నేత కార్మికుల ఆదాయాన్ని పెంచేందుకు తోడ్పాటునివ్వాలని కోరింది. కేవలం భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించడమే కాకుండా వేడి, తేమతో కూడిన వాతావరణంలో చేనేత వస్త్రధారణ సౌకర్యవంతంగా ఉంటుందని భావించింది. ఈ క్రమంలోనే ఐఐటీలు, ఐఐఎంలు సహా దాదాపు 70 కేంద్ర విద్యాసంస్థలు యూజీసీ డ్రెస్ ఇండియన్ అడ్వైజరీ సిఫారసులను అమలు చేస్తామని ప్రకటించాయి. వీటిలో 62 విద్యాసంస్థలు ఇప్పటికే సంప్రదాయ దుస్తుల్లో స్నాతకోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ ఉద్యమం వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటివరకు కొనసాగిన శాటిన్ దుస్తులు, గౌన్లు, హుడ్స్, మోర్టార్బోర్డ్లు (టోపీలు) త్వరలో కనమరుగు కానున్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల వైద్య సంస్థలను కూడా వారి స్నాతకోత్సవ వేడుకలకు భారతీయ దుస్తుల కోడ్‌ను అనుసరించాలని కోరడం విశేషం. – సాక్షి, అమరావతికొన్ని వర్సిటీల్లో హైబ్రిడ్ డ్రెస్ కోడ్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 48 సెంట్రల్ వర్సిటీలలో 34 సంస్థలు స్నాతకోత్సవాల్లో గౌన్లు, టోపీలను దశలవారీగా రద్దు చేశాయి. వీటిలో మహారాష్ట్రలోని వార్ధాలోని మహాత్మా గాంధీ అంతర్రాష్ట్ర హిందీ విశ్వవిద్యాలయ, పశ్చిమ బెంగాల్ శాంతినికేతన్‌లోని విశ్వభారతి, అస్సాంలోని తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం యూజీసీ సిఫారసులకు ముందునుంచే సంప్రదాయ దుస్తులను అనుసరిస్తున్నాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ జార్ఖండ్, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ కేరళ, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ తమిళనాడు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ లేకుండా భారతీయ, పాశ్చాత్య దుస్తులను మిళితం చేస్తూ హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తుండటం గమనార్హం. బెనారస్ వర్సిటీ నుంచి మొదలై.. సెంట్రల్ వర్సిటీల్లో వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ డ్రెస్ కోడ్ మార్పునకు మొదటగా స్పందించింది. ఇక్కడ స్నాతకోత్సవానికి విద్యార్థులు పసుపు రంగు ఉత్తరీయం, సఫాల(టోపీ)తో పాటు పురుషులైతే తెల్లటి కుర్తా–పైజామా, మహిళలు చీరలు ధరిస్తూ భారతీయ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా 11 కేంద్ర విశ్వవిద్యాలయాల్లో డ్రెస్ కోడ్ మారలేదు. వీటిల్లో అరుణాచల్ ప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ విశ్వవిద్యాలయం, మేఘాలయలోని నార్త్ ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయం, నాగాలాండ్ విశ్వవిద్యాలయం, మణిపూర్ విశ్వవిద్యాలయంలో త్వరలో మార్పుల కోసం ఆలోచిస్తున్నట్టు ధ్రువీకరించాయి. ఇప్పటికే నాగాలాండ్ విశ్వవిద్యాలయం తమ స్నాతకోత్సవ వేడుకలకు సంప్రదాయ నాగా దుస్తులను ప్రవేశపెట్టడంపై చర్చలు జరుపుతోంది. లద్ధాఖ్లోని సింధు సెంట్రల్ వర్సిటీ, సెంట్రల్ వర్సిటీ ఆఫ్ ఒడిశా, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినవి కావడంతో ఇంకా స్నాతకోత్సవ వేడుకను నిర్వహించలేదు. వివాదాలూ ఉన్నాయ్! స్నాతకోత్సవాల్లో భారతీయ సంప్రదాయ దుస్తుల ధారణపై విమర్శలు లేకపోలేదు. విద్యావేత్తలు స్నాతకోత్సవం భావన పాశ్చాత్యమైనదని.. ఇందులో భారతీయ దుస్తుల కోడ్ ఎందుకని ప్రశి్నస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఐఐటీ–ఖరగ్‌పూర్ స్నాతకోత్సవంలో డ్రెస్ కోడ్ వివాదాన్ని రేకెత్తించింది. ఆ సంస్థ వస్త్రధారణ శైలిపై పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. పొడవాటి దుస్తులు, పాదరక్షలు, ఆభరణాలను కూడా ధరించాలని సూచించడంతో విద్యార్థులు మండిపడ్డారు. ఇప్పటికే భారతీయ తరహా దుస్తులు ధరిస్తున్నందున కొత్త మార్గదర్శకాలు ఏమిటని ప్రశి్నంచడంతో ఐఐటీ ఖరగ్‌పూర్ అధికారులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 2021లో ఐఐటీ– జమ్మూ కాశీ్మరీలో ఫెరాన్లు (మోకాళ్ల వరకు ఉండే వస్త్రం), పకోల్స్ (పురుషుల టోపీ) స్ఫూర్తితో స్నాతకోత్సవ వేషధారణ కోసం ప్రణాళికలను ప్రకటించిన తర్వాత విమర్శలను ఎదుర్కొంది. ఆ తర్వాత తెల్ల కుర్తాలు–పైజామాలకు మారింది. యూజీసీ సిఫారసు చేసిన డ్రెస్ కోడ్‌ను వ్యతిరేకిస్తూ లక్నోకు చెందిన బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని దళిత్ స్టూడెంట్స్ యూనియన్ 2019లో అంబేడ్కర్‌కు నివాళిగా పాశ్చాత్య దుస్తులు(సూట్) ధరించడానికి అనుమతి కోరింది. ఐఐటీ ఢిల్లీ మినహా.. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్ వర్సిటీలు కలిపి 92 ఉన్నాయి. యూజీసీ సిఫారసులతో 76 శాతం కంటే ఎక్కువ వర్సిటీలు పాత డ్రెస్ కోడ్‌ను తొలగించాయి. మొత్తం 23 ఐఐటీల్లో ఒక్క ఐఐటీ–ఢిల్లీ తప్ప మిగతావన్నీ భారతీయ దుస్తులను స్వీకరించాయి. వీటిలో 18 ఐఐటీలు 2015 తర్వాత మార్పు చేశాయి. యూజీసీ సలహా కంటే ముందే భువనేశ్వర్, జోధ్‌పూర్, బాంబే, గాంధీనగర్, గౌహతి ఐఐటీలు భారతీయ దుస్తులను అనుసరిస్తుండటం విశేషం. ఐఐటీ భువనేశ్వర్‌లో మహిళలకు కుర్తా డ్రెస్ కోడ్‌కు బదులుగా చీరల ఎంపికను తీసుకొచి్చంది. ఐఐటీ బాంబేలో ఖాదీ ఉత్తరీయాన్ని ప్రవేశపెట్టారు. స్థానికతకు అద్దం పట్టేలా ఐఐటీ–మండిలో సంప్రదాయ నీలిరంగు శాటిన్ వస్త్రానికి బదులుగా ఇప్పుడు ఆఫ్–వైట్ కుర్తా–పైజామా, సల్వార్–కుర్తాలు (హిమాచలీ శాలువా, టోపీ)లతో జత చేసిన చీరలను ధరిస్తున్నారు. ఇక 21 ఐఐఎంలలో 14 సంస్థలు పాత డ్రెస్ కోడ్‌ను రద్దు చేశాయి. కానీ, వీటిల్లో అన్నీ స్నాతకోత్సవ సంప్రదాయ వేషధారణను భారతీయ దుస్తులతో భర్తీ చేయలేదు. ఏడు ఐఐఎంలు స్టోల్‌తో కూడిన పాశ్చాత్య శైలి ఫార్మల్ దుస్తులను ఎంచుకున్నారు. అయితే బెంగళూరు, కలకత్తా, లక్నో, ఇండోర్, రోహ్తక్, ఉదయ్‌పూర్, అమృత్సర్ ఐఐఎంలు ఇంకా పాత డ్రెస్ కోడ్‌నే కొనసాగిస్తున్నాయి. ఐఐఎం షిల్లాంగ్‌లో స్థానిక ఖాసీ ర్యాప్ దుస్తులను ఎంచుకున్నారు. -
గడ్డకట్టే చలిలోనూ... లెహంగాలో స్నాతకోత్సవానికి!
ఎలాంటి పరిస్థితుల్లోనైనా తగ్గేదేలే అంటారు కొందరు. ఆ విద్యార్థిని సరిగ్గా అలాంటి వారిలో కోవలోకే వస్తుంది. గడ్డ కట్టించే చలిలోనూ వస్త్రధారణలో రాజీ పడలేదు. స్నాతకోత్సవంలో సంప్రదాయ దుస్తులే ధరించింది! స్విట్జర్లాండ్‌లో ప్రస్తుతం చలి వణికిస్తోంది. మైనస్ డిగ్రీలతో సర్వం గడ్డ కట్టుకుపోతోంది. అయినా సరే, లక్ష్మీకుమారి అనే భారతీయ విద్యార్థిని అస్సలు రాజీ పడలేదు. స్నాతకోత్సవానికి లెహెంగా ధరించి ప్రశంసలు అందుకుంది. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘‘మైనస్ డిగ్రీల వాతావరణం. బయట ఎటు చూసినా మంచు. ఊహించలేనంతటి చలి! అయినా సరే, లెహంగా ధరించడంలో రాజీపడలేదు’’అని రాసుకొచ్చింది. ఆ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. జీవితంలో ప్రత్యేకమైన మైలురాయిని సంప్రదాయంతో మేళవించిందంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. అంతటిప్రతికూల వాతావరణంలోనూ గ్రాడ్యుయేషన్ కోసం సంప్రదాయ దుస్తులు ధరించడం బాగుంది. ఆమె నిజమైన భారతీయురాలు. అంతర్జాతీయ వేదికపై తన మూలాలను ఇంతందంగా చూపించింది’’అంటూ పొగుడుతున్నారు. View this post on Instagram A post shared by Lakshmi Kumari (@lakshmi.ch) -
సింగపూర్‌లో వైభవంగా మనబడి స్నాతకోత్సవం
ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలతో నిరంతరం సింగపూర్ లోని తెలుగు వారి కోసం సేవ చేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం వారి ఆద్వర్యంలో మనబడి తెలుగు విద్యార్థుల స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంబమైన కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది.మెరీనా బే సాండ్స్ ఎగ్జిబిషన్ హాల్లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. 2022-23, 2023-24 విద్యా సంవత్సరములలో ప్రవేశం, ప్రస్తుత తరగతుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా తెల్లటి పైకండువా కప్పి, మెడల్ తోపాటు సిలికానాంధ్ర, సింగపూర్ తెలుగు సమాజం స్నాతకోత్సవ ధృవపత్రాలను బహుకరించినట్లు కార్యక్రమ నిర్వాహకులు స్వామి గోపి కిషోర్ తెలిపారు. మంచి అభిరుచితో తెలుగు నేర్చుకుంటున్న విద్యార్థులను అభినందిస్తూ, మనబడి కార్యక్రమానికి సహకారం అందిస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాస రెడ్డి ప్రారంభోన్యాసంలో ఈ తరం వారికి తెలుగు భాష అవసరాన్ని తెలుపుతూ అందరూ సమాజం సభ్యులుగా చేరి ఆ రకంగా తెలుగు సమాజం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.NRI ONE స్థిరాస్తి విక్రేతలు అందించిన సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి, స్థానిక GIG అంతర్జాతీయ పాఠశాల ఎక్జిక్యూటివ్ డైరక్టర్ సాంబశివ రావు ముఖ్య అతిథి గా విచ్చేసి ఉపాధ్యాయులకు జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాతృభాష ఉన్నతి కోసం కృషి చేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గాన్ని, నిస్వార్ధంతో సేవ చేస్తున్న ఉపాధ్యాయులను అభినందిస్తూ భవిష్యత్తులో మనబడి కార్యక్రమానికి అవసరమైన సహాయ సహకారం అందిస్తామని పేర్కొన్నారు.తెలుగు బడి విద్యార్థులు ప్రదర్శించిన పద్య పఠనం, తెలుగు పాటలు, శాస్త్రీయ సంగీతం, నాట్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన చాణక్య సభికులను ఆకట్టుకుంటూ కార్యక్రమం ఆద్యంతం క్రమపద్ధతిలో జరిగేలా సహకరించారు. ఈ సందర్భంగా జీఐజీ రావు గారికి, NRI ONE శేఖర్‌కి జ్ఞాపికను బహుకరించారు.అనంతరం సింగపూర్ తెలుగు సమాజం గౌరవ కార్యదర్శి అనిల్ కుమార్ పోలిశెట్టి వందన సమర్పణ చేస్తూ కార్యక్రమం విజయవంతం చేయటానికి సహకరించిన, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, NRI ONE వారికి, GIG రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మనబడి కార్యక్రమాలను మరింత మంది ఉపయోగించుకుని తద్వారా మాతృభాష అభివృద్ధికి దోహదం చేయాలని కోరారు.ఉపాధ్యక్షులు పాలెపు మల్లికార్జున్, కురిచేటి జ్యోతీశ్వర్ కార్యక్రమానికి మొదటి నుండి సహకారం అందిస్తూ వెన్నంటి నిలిచారు. కార్యక్రంలో సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గం శ్రీనివాసరెడ్డి పుల్లన్నగారి, టేకూరి నాగేష్, కురిచేటి స్వాతి, వైదా మహేష్, కొత్త సుప్రియ పాల్గొని సహకారం అందించారు. ఉపాధ్యాయులు ప్రతిమ, దేదీప్య, శ్రీలక్ష్మి, కిరణ్ కుమార్, గోపి క్రిష్ణ, రంగనాధ్, గీత, శ్రీలత, విజయ వాణి విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందచేసారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా 200 మంది, పరోక్షంగా 4000 మంది వీక్షించినట్లు నిర్వహకులు తెలిపారు.(చదవండి: అయోవాలో ప్రారంభమైన నాట్స్ ప్రస్థానం) -
దయాగుణం కలిగి ఉండండి
బెంగళూరు: గొప్ప తెలివితేటలే కాదు, తోటివారి పట్ల దయాగుణం కలిగి ఉండటం ఎంతో అవసరమని యువ పట్టభద్రులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉద్బోధించారు. ఆదివారం ఆయన బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ(ఎన్ఎల్ఎస్ఐయూ)లో జరిగిన 32వ స్నాతకోత్సవంలో ప్రసంగించారు. అకడెమిక్ బ్లాక్ విస్తరణ పనులకు అనంతరం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రసంగించారు. ‘నిజమైన నాయకత్వ ప్రతిభ గలవారు తమ బలాలతోపాటు బలహీనతలను కూడా గుర్తించగలరు. తమకున్న బలంతో ఇతరులకు తోడ్పాటునిస్తూ, తమ బలహీనతలను అధిగమించేందుకు ఇతరుల సాయం తీసుకుంటారు’అని సీజేఐ వివరించారు. అడ్డంకులను అధిగమించే క్రమంలో కుటుంబంతోపాటు స్నేహితుల మద్దతు ఎంతో అవసరమని చెప్పారు. తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతో సహనంతో మెలగాలన్నారు. ‘నిర్ణయం తీసుకునే ప్రక్రియ అనిశి్చతితో కూడి ఉంటుంది, అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అనిశ్చితి కొనసాగేది కొంతకాలమే. మీరు ఎంచుకునే మార్గం ఏదైనప్పటికీ, భవిష్యత్తులో మీ సొంత నిర్ణయాలు సానుకూల పరిణామాలను కలిగిస్తాయి. ఈ క్రమంలో సహనం, వినయం అనే సద్గుణాలను ఎన్నడూ వీడరాదని కోరుతున్నాను’అని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. ‘వేగంగా మారుతున్న ప్రపంచం, అవసరాలు, వాతావరణ మార్పులు, సోషల్ మీడియా వంటి కొత్త వినోద సాధనాలు, సామాజిక దురాచారాలను మార్చాలనే ఆత్రుత సంక్లిష్ట సమస్యలకు స్వల్పకాలిక ఫలితాలను కోరేలా చేస్తున్నాయి’అంటూ ఆయన ఇలాంటి సమయంలో సహనంతో మెలగాల్సిన అవసరం ఎంతో ఉందని నొక్కిచెప్పారు. ‘హడావుడిగా తీసుకునే నిర్ణయాలకు ఎక్కువ శక్తిని వెచి్చంచాల్సి ఉంటుంది. ఇలాంటివి దీర్ఘకాలంలో మీ మానసిక ఆరోగ్యానికి చేటు కల్గిస్తాయి. దీర్ఘకాలంలో సానుకూల లక్ష్యాలను సాధించడం కూడా కష్టమవుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది’అని ఆయన యువ న్యాయవాదులను హెచ్చరించారు. న్యాయమూర్తిగా 24 ఏళ్లపాటు పనిచేశాక నాకో విషయం అర్థమయింది. మనదేశంలోని కోర్టుల్లో మనం మూడో వ్యక్తిగా కాకుండా మొదటి వ్యక్తిగా వాదిస్తాం ఎందుకంటే.. కోర్టుల్లో మనం క్లయింట్ల కోసం వాదించం. మనమే క్లయింట్లుగా వాదనలు సాగిస్తాం. వారికి ప్రతినిధులుగా మాత్రమే కాదు, వారి గొంతుక, వారి లాయర్‌గా, విజేతలుగా ఉంటాం’అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
CJI DY Chandrachud: న్యాయం, వైద్యం... అత్యంత ఖరీదు!
చండీగఢ్: ‘‘వైద్య, న్యాయ వృత్తుల రెండింటి లక్ష్యమూ ఒక్కటే. అంకితభావంతో కూడిన సేవ ద్వారా వ్యక్తులకు, సమాజానికి హితం చేకూర్చడం. సంక్షేమమే వాటి మూలసూత్రం. కానీ, సమాజ హితానికి పాటుపడేందుకే పుట్టుకొచి్చన అతి కీలకమైన ఆ రెండు రంగాలూ నేడు అదే సమాజానికి అందుబాటులో లేకుండా పోవడం ఆశ్చర్యకరం’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగం రాకతో 1980ల నుంచి భారత్‌లో వైద్యం బాగా వ్యాపారమయంగా మారిపోయిందన్నారు. ‘‘పలు ఔషధాల ఖరీదు భరించలేనంతగా పెరిగిపోయింది. గ్రామీణుల ఆదాయంలో ఏకంగా 77 శాతం, పట్టణ ప్రాంతాల్లో 70 శాతం వైద్య ఖర్చులకే పోతోంది’’ అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వైద్య కళాశాలు చూడాల్సిన అవసరముంది. ఇది వాటి సామాజిక బాధ్యత కూడా’’ అని హితవు పలికారు. శనివారం చండీగఢ్‌లో పీజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 37వ స్నాతకోత్సవంలో సీజేఐ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువ వైద్యులను ఉద్దేశించి ప్రసంగించారు. రోగుల పట్ల దయ, సహానుభూతి ఉండాలని వారికి ఉద్బోధించారు. ‘‘భారత్ ఇన్నొవేషన్ల కేంద్రంగా మారడం అభినందనీయం. కానీ వాటి ఫలాలు అతి కొద్దిమందికే పరిమితం అవుతుండటం బాధాకరం. కనుక వైద్య రంగంలో కీలక పరిశోధనలకు యువ డాక్టర్లు శ్రీకారం చుట్టాలి’’ అని ఆకాంక్షించారు. టెక్నాలజీ వాడకం పెరగాలి టెక్నాలజీ ద్వారా కోర్టుల పనితీరులో జవాబుదారీతనం పెరగడమే గాక న్యాయప్రక్రియ ప్రజలకు మరింత చేరువవుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘పారదర్శకత, ప్రజాస్వామ్యం, అందరికీ సమన్యాయం వంటి విలువల పరిరక్షణకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. కక్షిదారులు కూడా ఉన్నచోటి నుంచే వారి కేసుల విచారణను ప్రత్యక్షంగా వీక్షించే వీలు కలి్పస్తోంది’’ అని చెప్పారు. గత నాలుగేళ్లలో సుప్రీంకోర్టు ఏకంగా 8 లక్షలకు పైగా కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిందని గుర్తు చేశారు. పెండింగ్ భారాన్ని తగ్గించేందుకు కోర్టుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. -
ఘనంగా తమన్నా మేకప్ స్టూడియో స్నాతకోత్సవం (ఫొటోలు)
-
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్ (ఫొటోలు)
-
11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్ కపుల్.. కుమారుడి కోసం (ఫొటోలు)
-
గౌతమ్ గ్రాడ్యుయేషన్ డేలో మహేశ్ ఫ్యామిలీ ఫోటోలు
-
యుద్ధం నీడలో ‘వైద్యం’ పూర్తి!
దేశంకాని దేశంలో ఎంబీబీఎస్ కోర్సు చదివేందుకు రెక్కలు కట్టుకొని వెళ్లారు.. ఓ కాలేజీలో తొలి సెమిస్టర్ పూర్తి చేసి రెండో సెమిస్టర్‌లోకి అడుగుపెట్టారు. అంతలోనే ఒక్కసారిగా దేశమంతా బాంబుల మోత, కాల్పుల శబ్దాలతో విలవిల్లాడారు.. కేంద్రం చొరవతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వదేశం చేరుకున్నా ఆగిన చదువును కొనసాగించాలన్న పట్టుదలతో తొలుత 2–3 నెలలు ఆన్లైన్ చదువులు చదివి.. ఆ తర్వాత కన్నవారిని, కేంద్రాన్ని ఒప్పించి మరో దేశంలోని కాలేజీలో కోర్సును పూర్తిచేసి స్వదేశానికి తిరిగొచ్చారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం తాలూకు మనోవేదనను అధిగమించి.. అన్ని పరీక్షల్లోనూ విజయం సాధించిన 210 మంది వైద్య విద్యార్థుల విజయగాథ ఇది. లక్డీకాపూల్: ఉక్రెయిన్‌లోని జపోరిఝియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చేపట్టిన ఎంబీబీఎస్ కోర్సును.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉజ్బెకిస్తాన్‌లోని బుఖారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో పూర్తిచేసిన 10 రాష్ట్రాలకు చెందిన 210 మంది విద్యార్థులకు మంగళవారం హైదరాబాద్ గచ్చి»ౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కన్నులపండువగా పట్టాల పంపిణీ జరిగింది. 86 మంది విద్యార్థినులు సహా మొత్తం 210 మంది ఉజ్బెకిస్తాన్ వెళ్లి కోర్సు పూర్తిచేశారు. అయితే జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) సూచనల మేరకు మొత్తం 210 మంది విద్యార్థులకు.. వారు ఎంబీబీఎస్ కోర్సు మొదలుపెట్టిన ఉక్రెయిన్‌లోని జపోరిఝియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచే పట్టాలు రావడం గమనార్హం. కాగా, ఎంబీబీఎస్ పాసైన విద్యార్థుల్లో 110 మంది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ) రాయగా 81 మంది తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులయ్యారు. వారిలోనూ 34 మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ విద్యార్థులది అపార కృషి: ఉజ్బెకిస్తాన్ రాయబారి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారత్‌లో ఉజ్బెకిస్తాన్ రాయబారి సర్దోర్ రుస్తంబేవ్ మాట్లాడుతూ విద్యార్థులంతా అపార కృషితోపాటు అడ్డంకులన్నింటినీ ఎదుర్కొని మరీ విజయం సాధించారన్నారు. వాళ్ల విజయంలో తమ దేశం పాత్ర ఉన్నందుకు గర్వపడుతున్నామని చెప్పారు. యుద్ధ కాలంలో విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చేలా చొరవ చూపడంతోపాటు తిరిగి వారిని ఉబ్జెకిస్తాన్ పంపడంలో కీలకపాత్ర పోషించిన నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండీ, ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖలో భారతీయ ప్రతినిధి డాక్టర్ దివ్యా రాజ్రెడ్డిని అభినందించారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తగిన అనుమతులు ఇచ్చిన కేంద్రానికి, జాతీయ మెడికల్ కౌన్సిల్‌కు కూడా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా సంఘం చైర్మన్ పి. విజయబాబు, డాక్టర్ దివ్యారాజ్‌రెడ్డి, ఉజ్బెకిస్తాన్ ఎంబసీ ఫస్ట్ సెక్రటరీ ఎస్. సుయరొవ్, ఉజ్బెకిస్తాన్ ఎంబసీ కౌన్సిలర్ ఐ. సొలియెవ్, నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీఈఓ డాక్టర్ బీవీకే రాజ్, ఏఐజీ ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ సందీప్ సాహూ తదితరులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో మహిళల శకం: ముర్ము
బెర్హంపూర్: దేశాభివృద్ధిలో మహిళల శకం మొదలైందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. జాతి నిర్మాణంలో నేడు బాలికలు అన్ని రంగాల్లో కీలకంగా మారారని, ఈ పరిణామం ఎంతో ప్రోత్సాహకరమైందని పేర్కొన్నారు. గంజాం జిల్లాలోని బెర్హంపూర్ యూనివర్సిటీ 25వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. సాహిత్యం, సంస్కృతి, సంగీతం వంటి రంగాల్లో మహిళ భాగస్వామ్యం ప్రశంసనీయమని తెలిపారు. ‘సైన్స్, టెక్నాలజీ మొదలుకొని పోలీసు, ఆర్మీ వరకు ప్రతి రంగంలోనూ మన కుమార్తెల సామర్థ్యం కనిపిస్తోంది. ఇప్పుడు మనం మహిళాభివృద్ధి దశ నుంచి మహిళల సారథ్యంలో అభివృద్ధి వైపు పయనిస్తున్నాం’అని రాష్ట్రపతి తెలిపారు. -
రక్షణ రంగ స్వావలంబనే ఏకైక లక్ష్యం: రాజ్‌నాథ్
తేజ్‌పూర్(అస్సాం): రక్షణలో స్వావలంబన సాధన కోసమే స్వదేశీ రక్షణరంగాన్ని బలోపేతం చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. అస్సాంలో తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా రాజ్‌నాథ్ ప్రసంగించారు. ‘‘ భారత్‌ను వ్యూహాత్మక ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే రక్షణరంగంలో స్వావలంబన అవసరం. అందుకే దేశీయ రక్షణరంగాన్ని బలోపేతం చేస్తున్నాం. ఇందులోభాగంగా రక్షణ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించుకుంటున్నాం. ఎగుమతులను నెమ్మదిగా పెంచుతున్నాం. దశాబ్దాలుగా దిగుమతి చేసుకుంటున్న 509 రకాల రక్షణ రంగ ఉత్పత్తులను ఇకపై దేశీయంగానే తయారుచేయాలని నిర్ణయించి వాటి దిగుమతులను నిషేధించాం. త్వరలో మరో 4,666 రకాల రక్షణ విడిభాగాలనూ దేశీయంగానే తయారుచేయాలని ప్రతిపాదించాం. ఇది కూడా త్వరలోనే ఆచరణలోకి తెస్తాం. తొలిసారిగా స్వదేశీ రక్షణ తయారీ రంగ పరిశ్రమ రూ.1లక్ష కోట్ల మార్క్‌ను దాటింది. 2016–17 కాలంలో రూ.1,521 కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఇప్పుడు 10 రెట్లు పెరిగి రూ.15,920 కోట్లు దాటాయి’’ అని రాజ్‌నాథ్ చెప్పారు. దేశీయ రక్షణ రంగంలో ప్రధాని మోదీ కొత్త ఒరవడి తెచ్చారు’’ అన్నారు. -
సిరియాలో భీకర డ్రోన్ దాడి
బీరుట్: పదమూడేళ్లుగా అంతర్యుద్దంతో సతమతమవుతోన్న సిరియాలో భీకర డ్రోన్ దాడి సంభవించింది. హొమ్స్ నగరంలో గురువారం మిలటరీ జవాన్ల స్నాతకోత్సవ కార్యక్రమం లక్ష్యంగా జరిగిన దాడిలో పౌరులు, సైనికులు కలిపి 100 మందికి పైగా చనిపోగా మరో 125 మంది గాయపడ్డారు. సిరియాలో ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన దాడుల్లో ఇదే తీవ్రమైందని చెబుతున్నారు. ఘటన నేపథ్యంలో ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ‘మాకు తెలిసిన అంతర్జాతీయ బలగాల మద్దతు ఉన్న తిరుగుబాటుదారులే పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్లతో దాడికి పాల్పడ్డారు’అని సిరియా సైన్యం ఆరోపించింది. ఘటనకు తామే కారణమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. Drone attack killed over 100 in a graduation ceremony at Syrian Military Academy, Syria. Several Syrian regime generals and officers who attended the ceremony are killed or injured. Middle East is heating up. https://t.co/p099AtAdu1 pic.twitter.com/NK2xAWCaqo — Shadow of Ezra (@ShadowofEzra) October 5, 2023 -
నవ ప్రపంచాన్ని నిర్మించే శక్తి యువత సొంతం
ఏఎన్‌యూ: సాంకేతికతను సద్వినియోగం చేసుకుని నవ ప్రపంచాన్ని నిర్మించే శక్తి యువతకు ఉందని గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 39, 40వ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ చాన్సలర్ హోదాలో పాల్గొన్న గవర్నర్ సందేశం ఇస్తూ మానవాళి ప్రయోజనాలు పరిరక్షించే నూతన ఆవిష్కరణలకు యువత కృషిచేయాలని సూచించారు. చదువు, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు నైతికత, సామాజిక బాధ్యత కూడా ముఖ్యమని చెప్పారు. యువత నేర్చుకునే సాంకేతిక, నైపుణ్యం కేవలం తమ సొంతానికి మాత్రమే కాకుండా సమాజ హితం కోసం వాడాలని సూచించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, సంక్షోభాలకు పరిష్కారం చూపే వైవిధ్యభరితమైన ఆవిష్కరణలు చేయడంతోపాటు వాటి ద్వారా అపారమైన అవకాశాలు సృష్టించాలని సూచించారు. ప్రపంచానికి స్టార్టప్ హబ్‌గా భారత్ నిలిచిందని, ఇది మంచి పరిణామమన్నారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే నిరుద్యోగంతోపాటు అనేక సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. కృత్రిమ మేధస్సు వినియోగం నుంచి బయోటెక్నాలజీ వరకు ప్రతి అంశం మానవాళికి ప్రయోజనం కలిగించేదిగా ఉండాలన్నారు. యూనివర్సిటీ వీసీ ఆచార్య పి.రాజశేఖర్ ఏఎన్‌యూ అభివృద్ధి నివేదికను సమర్పించారు. అనంతరం ప్రముఖ సంపాదకుడు పాలగుమ్మి సాయినాథ్కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. పలువురు విద్యార్థులకు పీహెచ్‌డీలు, బంగారు పతకాలు, డిగ్రీ పట్టాలు అందించారు. అడిషనల్ డీజీ రవిశంకర్‌కు డాక్టరేట్ ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌కు డాక్టరేట్ పట్టాను గవర్నర్, వీసీ అందించారు. ఏఎన్‌యూ కామర్స్ విభాగంలో ఆచార్య జీఎన్ బ్రహా్మనందం పర్యవేక్షణలో రవిశంకర్ అయ్యన్నార్ పీహెచ్డీ పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, ఏఎన్‌యూ రెక్టార్ ఆచార్య రాజశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ, పలువురు డీన్లు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగ సమస్యలపై అధ్యయనం చేసిన తొలి రాష్ట్రం ఏపీ : సాయినాథ్ వ్యవసాయ రంగంలో సంక్షోభం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ప్రముఖ సంపాదకుడు పాలగుమ్మి సాయినాథ్ చెప్పారు. ఏఎన్‌యూ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతుల సమస్యలపై తాను 2001–2002 కాలంలో అధ్యయనం చేశానని చెప్పారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో వ్యవసాయ రంగ సంక్షోభంపై అధ్యయనానికి ప్రత్యేకంగా కమిటీని నియమించారని తెలిపారు. ఈ కమిటీ సుదీర్ఘకాలంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి నిశితంగా అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు ప్రాంతాల్లో వ్యవసాయ రంగ సమస్యలు, వాస్తవ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేశానని తెలిపారు. ఆ సేవలకు దక్కిన గౌరవంగా ఈ డాక్టరేట్‌ను భావిస్తానని సాయినాథ్ తెలిపారు. -
ఛీ!..గ్రాడ్యుయేషన్ డిగ్రీ అందుకుంటూ..మరీ ఇంత చీప్‌గా..!వీడియో వైరల్
చదువుకి తగ్గ సంస్కారం ఉంటే అది హుందాగా, గౌరవప్రదంగా ఉంటుంది. ఓ రేంజ్లో చదవుకుని చదువుకోని వాడి కంటే దారుణంగా దిగజారి ప్రవర్తిస్తే.. చూసే వాళ్లకే ఛీ అనిపించేంత అసహ్యంగా ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే సరిచేసి చెప్పే స్థాయిలో ఉండి వీధి పోకిరిలా ప్రవర్తిస్తే.. అందురు చులకనగా చూడటమే గాదు ఆ వ్యక్తికి విలువుండదు. ఆ విద్యార్థికి చదువు చెప్పిన గురువులు సైతం తలదించుకోవడమే గాదు, వారిని కూడా తిట్టుకుంటారు కూడా. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. This is so embarrassing. pic.twitter.com/PsE0hLOUTT — Ian Miles Cheong (@stillgray) June 22, 2023 వీడియోలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ అందుకోవడానికి వరుసగా విద్యార్థినులు వెళ్తున్నారు. అక్కడ ప్రోఫెసర్లు, మీడియా అంతా ఉన్నారు. అందరి ముందు ఓ అమ్మాయి ఇబ్బందికరమైన రీతిలో ప్రవర్తించింది. అక్కడున్న ప్రోఫెసర్లు సైతం ఆమె తీరుని చూసి కంగుతిన్నారు. ఆ అమ్మాయి తన ముందున్న గ్రాడ్యుయేషన్ ప్రజంటేషన్ ను దౌర్జన్యంగా లాక్కుని అక్కడున్న వారిని ఖతారు చేయకుండా మైక్ తీసుకుని తన ధోరణిలో తాను మాట్లాడేసి అక్కడ నుంచి వెళ్లిపోయింది. అయితే దాని వెనక ఉన్న కథ ఇది అంటూ మరో వీడియో విడుదల చేసింది. వర్ణ వివక్ష చూపించినందుకే తాను అలా ప్రవర్తించానంటూ చెప్పుకొచ్చింది. Backstory: This admin was cutting off Black students from saying their name & major. She snatched the mic from this young lady before she finished her name, and she took her moment back 🤷🏽♀️ pic.twitter.com/jY6DauZaZI — ✯ (@featurespice) June 22, 2023 అక్కడున్న వారంతా ఆ ఘటన నుంచి తేరుకోవడానికే చాలా సమయం పట్టింది. అక్కడున్నవారంతా ఏం జరుగుతుందో అర్థం గాక కాస్త గందరగోళానికి గురయ్యారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ప్రోఫెసర్లు ఆమెకు చదువు సరిగా చెప్పమా? లేదా అన్నట్లు ప్రోఫెసర్లు షాక్‌లో ఉన్నారని ఒకరు, ఆమె గ్రాడ్యేయేట్ పూర్తి చేయలేకపోయిందేమో కాబోలు అని మరోకరు సెటైర్లు వేస్తూ ట్వీట్లు చేశారు. (చదవండి: ఆడపిల్ల ఉన్న తండ్రి అంటే ఏమిటో? దశరథుని మాటల్లో..) -
ప్రిన్సిపాల్ ఎదుట డాన్స్.. ఊహించని షాక్.. డిగ్రీ గోవిందా!
అమెరికా: అమెరికాలో ఒక హై స్కూల్లో స్టేజి మీద డాన్స్ చేసినందుకు ఓ విద్యార్థినికి డిప్లొమా పట్టా ఇవ్వడానికి నిరాకరించారు ఆ స్కూలు ప్రిన్సిపాల్. దీంతో ఇన్నేళ్ల శ్రమ మొత్తం బూడిదలో పోసినట్టయ్యిందని ఆ విద్యార్థిని తోపాటు ఆమె తల్లిదండ్రులు వాపోతున్నారు. జూన్ 9న ఫిలడెల్ఫియా బాలికల హై స్కూల్ స్నాతకోత్సవంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తమ పిల్లలు డిగ్రీలు స్వీకరిస్తున్న సమయంలో ఎలాంటి గోల, అరుపులు చేయవద్దని.. కనీసం చప్పట్లు కూడా కొట్టవద్దని స్ట్రిక్ట్ గా చెప్పింది స్కూల్ యాజమాన్యం. దీంతో నిశ్శబ్ద వాతావరణంలో పట్టా ప్రదానోత్సవం జరుగుతుండగా హఫ్సా అబ్దుల్ రహ్మాన్ అనే అమ్మాయి తన పేరు పిలవగానే స్టేజి మీదకు వచ్చింది. కానీ డిగ్రీ పట్టా సాధిస్తున్నానన్న సంతోషంలో ఉండబట్టలేక చిన్నగా చిందేసింది. అదికాస్తా ప్రిన్సిపాల్ దృష్టిలో పడేసరికి ఆమెకు పట్టా అందివ్వలేదు సరికదా మర్యాదగా స్టేజి విడిచి వెళ్ళమని ఆదేశించారు. దీంతో స్టేజి విడిచి వెళ్లిన హఫ్సా అబ్దుల్ రహ్మాన్ ప్రిన్సిపాల్ పట్టా అందివ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది. నేనే తప్పూ చేయలేదు, ఏ నిబంధనను అతిక్రమించలేదని తెలిపింది. ఇదే స్నాతకోత్సవంలో హఫ్సా తనతో పాటు 2014లో కాల్పుల్లో చనిపోయిన తన సోదరి ఐషా తరపున కూడా డిగ్రీ పట్టా స్వీకరించాల్సి ఉంది. కానీ అంతలోనే ఆమెను స్టేజి విడిచి వెళ్ళమనడంతో బోరున ఏడ్చేసింది. హఫ్సా తల్లి మాట్లాడుతూ.. నాలుగేళ్లపాటు కోవిడ్ సమయంలో మానసికంగానూ, శారీరకంగానూ చాలా ఇబ్బందులు ఎదుర్కొని చదువుకున్నారని. ప్రిన్సిపాల్ ఇలా చేయడం అమానుషమని అన్నారు. Controversy at Philadelphia Girls' High School as Muslim graduate Hafsah Abdur-Rahman's diploma denied on stage for a celebratory dance. Despite the district's apology, her family calls for rule changes. pic.twitter.com/qbiIG0Rlr7 — Middle East Eye (@MiddleEastEye) June 18, 2023 ఇది కూడా చదవండి: మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ ఉగ్రవాది హతం.. -
సందడిగా జరిగిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవం
ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఆదివారం మధ్యాహ్నం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవ సభ విజయవంతంగా జరిగింది. టెక్ మహీంద్రా కంపెనీ గ్లోబల్ టెక్నాలజీ హెడ్ హర్షుల్ అస్నానీ ముఖ్య అతిథిగా హాజరై స్నాతకోపన్యాసం చేయగా, విశ్వవిద్యాలయ బోర్డు ట్రస్టీలు, వివిధ శాఖల అధిపతులు వేదికనలంకరించగా, విద్యార్థులు, వారి బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ ఉత్సవం ఒక పండుగ లాగా జరిగింది. గత ఏడు సంవత్సరాలుగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం భరతనాట్యం, కూచిపూడి, కర్ణాటిక సంగీతం, హిందుస్తానీ, తెలుగు, సంస్కృత విభాగాల్లో సర్టిఫికెట్, డిప్లొమా, మాస్టర్స్ కోర్సులను అందజేస్తోంది. అందులో భాగంగా 2022-23 విద్యాసంవత్సరానికి 65 మంది విద్యార్థులు తమ కోర్సులలో ఉత్తీర్ణులై ఈ ఉత్సవంలో విశ్వవిద్యాలయ అధినేత డా. ఆనంద్ కూచిభొట్ల చేతుల మీదుగా పట్టాలు పుచ్చుకున్నారు. తొలుత శ్రీ మారేపల్లి నాగవేంకటశాస్త్రి గారి వేద పఠనంతో సభ మొదలయింది. కుమారి ఈషా తనుగుల అమెరికా జాతీయ గీతాలాపన అనంతరం విశ్వవిద్యాలయ అధినేత డా. ఆనంద్ కూచిభొట్ల అధ్యక్షోపన్యాసం చేస్తూ అమెరికాలోని విశ్వవిద్యాలయాల చరిత్రల్లో అతి తక్కువ కాలంలోనే WASC గుర్తింపు పొందిన ఏకైక విశ్వవిద్యాలయం తమదేనని ఆహూతులకు గుర్తుచేశారు. ఈ విద్యా సంవత్సరం నించి MS కంప్యూటర్ సైన్స్ కోర్సు ప్రారంభిస్తున్నామని, ప్రపంచంలోని వివిధ దేశాల విద్యార్థులకు అమెరికాకు వచ్చి చదువుకోవడానికి వీలుగా I -20 లు మంజూరు చేయడానికి తమ సంస్థకు అమెరికా నించి అనుమతి లభించిందని ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య తెలియజేసారు. పురాతన భారతీయ శాస్త్ర విజ్ఞానాన్ని, అత్యాధునిక సాంకేతిక పరికరాలతో మేళవించి రూపొందించే కోర్సులతో, వైద్య, ఆయుర్వేద, యోగ, నర్సింగ్ వంటి శాఖలు యూనివర్సిటీలో అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయని, ఎప్పటిలాగే వాటికీ అందరి సహాయ సహకారాలు లభిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. అనంతరం విశ్వవిద్యాలయ బోర్డు ఛైర్మన్ డా. పప్పు వేణుగోపాలరావు గారు మాట్లాడుతూ ఏడేళ్ళ క్రితం ఒక గోప్ప ఆశయం, లక్ష్యంతో మొదలైన ఈ కల, భారతీయ భాషలు, కళలకే పరిమితం కాకుండా అమెరికన్ విశ్వవిద్యాలయాలకు దీటుగా సమీప భవిష్యత్తులో ట్రేసీ నగరంలో 67 ఎకరాల్లో నిర్మింపబోయే సొంత ప్రాంగణంతో అన్ని రంగాల్లో విద్యాబోధన చేస్తుందని ప్రకటించారు. ముఖ్య అతిథి హర్షుల్ అస్నానీ స్నాతకోపన్యాసం చేస్తూ విద్యార్థులను ఉద్దేశించి మిమ్మల్ని పట్టభద్రులనాలా లేక కళాకారులనాలా అని తేల్చుకోలేక పోతున్నాను అని చమత్కరించారు. తాను సాంకేతిక రంగం నుంచి వచ్చినందున భాషా, కళా రంగాల్లో పట్టభద్రులైన వారికి ఆ రంగానికి సంబంధించిన సలహాలు ఇవ్వలేకపోయినా ఏ రంగంలోనైనా రాణించడానికి, తను అవలంబించే ఐదు సూత్రాల ప్రణాళికను విద్యార్థులతో పంచుకున్నారు. జీవితంలో ఎప్పటికీ నిత్య విద్యార్థిగా ఉండమని, ఎవ్వరు ఏమి చెప్పినా ఎప్పుడూ స్వశక్తి మీద నమ్మకం కోల్పోవద్దని, ఉద్యోగంతో పాటూ మరేదైనా వ్యాసంగం చేపట్టమని, కృతజ్ఞతా భావంతో జీవితం గడపమని, అందరిపట్ల దయతో ఉండమని ఉద్బోధించారు. విశ్వవిద్యాలయ ప్రోవోస్ట్ చమర్తి రాజు ముఖ్య సంపాదకులు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో బోర్డు మెంబర్ డాక్టర్ జ్ఞానదేవ్ చేతుల మీదుగా విశ్వవిద్యాలయ జర్నల్ శాస్త్రను విడుదల చేశారు. విద్యార్థులంతా లేచి నిలబడగా యూనివర్సిటీ అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్ కూచిభొట్ల అధికారికంగా విద్యార్థులకు డిగ్రీలను ప్రకటించారు. విశ్వవిద్యాలయ ప్రధాన విద్యాధికారి రాజు చమర్తి మాట్లాడుతూ, ఈ సంవత్సరం పట్టాలు పొందిన వారిలో హైస్కూల్ స్థాయి విద్యార్థులనించి విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న వారి వరకు ఉండడం విశేషమని, అంతేకాక విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ఒక్క అమెరికా నుంచే కాక భారతదేశం సింగపూర్ మలేషియా వంటి దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదవడం ప్రత్యేకమని పేర్కొన్నారు. తదనంతరం విద్యార్థులు ఒక్కొక్కరుగా వేదిక మీదకు వచ్చి స్నేహితుల బంధువుల హర్షద్వానాల మధ్య తమ పట్టాలు పుచ్చుకున్నారు. విశ్వవిద్యాలయ బోర్డు కీలక సభ్యులు రిచర్డ్ ఆస్బోర్న్ ముగింపు ఉపన్యాసం చేస్తూ భారతీయ కళలు ఒక ఆదర్శ జీవిత విధానాన్ని ఎలా అవలంబించాలో అన్యాపదేశంగా నేర్పిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. తన ప్రసంగం చాట్ జిపిటి తయారు చేసిందని, తన సొంతది కాదని చమత్కరిస్తూ సాంకేతిక రంగంలో వచ్చే మార్పులను స్వీకరిస్తూ పురాతన శాస్త్రీయ వైభవాన్ని నిలుపుకుంటూ భవిష్యత్తు వైపు అడుగులు వేయాలంటూ పిలుపునిచ్చారు. వేదిక అలంకరించిన ఇతర ప్రముఖులు బోర్డు సభ్యులు, కల్వచెర్ల ప్రభాకర్, డాక్టర్ బారీ రాయన్, ఏమీ కాట్లిన్, ఎలిజబెత్ షూమేకర్, మరియు తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ మృణాళిని చుండూరి, సంస్కృత విభాగ అధ్యక్షులు డాక్టర్ వసంతలక్ష్మి, కూచిపూడి భరతనాట్య విభాగాల నుంచి డాక్టర్ యశోద ఠాకూర్, డాక్టర్ కరుణ విజయేంద్రన్, డాక్టర్ అనుపమ కౌశిక్ లు ఉన్నారు. కార్యక్రమం సజావుగా జరగడానికి విశేషంగా కృషి చేసిన విశ్వవిద్యాలయ సిబ్బంది డాక్టర్ కార్తీక్ పటేల్, మమతా కూచిభొట్ల, సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు కందుల సాయి, సంగరాజు దిలీప్, పరిమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర, కార్యకర్తలు అనిరుధ్ తనుగుల, ప్రియ తనుగుల, కోట్ని శ్రీరాం లకు ఆనంద్ కూచిభొట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులందరూ తమ కుటుంబాలతో, స్నేహితులతో ఫోటోలు తీసుకుంటూ యాజమాన్యం ఏర్పాటు చేసిన విందు ఆరగిస్తూ సందడిగా ఆ సాయంత్రం కార్యక్రమం ముగిసింది. -
శునకానికి డిప్లొమా డిగ్రీ: వీడియో వైరల్
గ్రాడ్యుయేషన్ వేడుకలో యజమాని తోపాటు డిగ్రీ అందుకుని విస్మయపరిచింది ఓ శునకం. ఆ కుక్క తన యజమాని తోపాటు ప్రతి తరగతికి క్రమంత తప్పకుండా అటెండెంట్ అయ్యింది. దీంతో ఆ వేడుకలో స్టేజ్‌పై ఆ కుక్కకి డిప్లొమా డిగ్రీ అందజేసింది సదరు యూనివర్సిటీ. వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని న్యూజెర్సీలోని సెటన్ హాల్ యూనివర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో జస్టిన్ అనే సర్వీస్ డాగ్ డిప్లోమా డిగ్రీని అందుకుని అందర్నీ ఆకర్షించింది. సెటన్ హాల్‌కి చెందని జోసెఫ్ నైర్ గ్రేస్ మరియాని, తన కుక్క జస్టిన్లు ఈ వేడుకలో డిగ్రీలను అందుకున్నారు. మరియాని బ్యాచిలర్ ఆప్ సైన్స్ ఇన్ ఎడ్యుకేషన్ డిగ్రీతో పట్టుభద్రురాలైంది. ఆమె కుక్క యూనివర్సిటీలో ఉన్న అన్ని సమయాల్లో ఆమె పక్కనే ఉండి అన్ని తరగతులకు హజరయ్యి.. యజమాని పట్ల అచంచలమైన అంకితభావంతో పనిచేసింది. అందుకు గాను గ్రాడ్యుయేషన్ వేడుకలో ఆమెకు డిప్లొమా డిగ్రీని ప్రధానం చేశారు. తన యజమాని మరియాని తోపాటు ఆ కుక్క అన్ని శిక్షణా తరుగుతుల్లో ఉండటం అనేది చాలా అరుదైన విషయం అని ప్రశంసిస్తూ యూనివర్సిటీ ఈ డిగ్రీని సదరు కుక్కకి బహుకరించింది. ఇక మరియాని తన కుక్క సహచర్యంతోనే ప్రాథమిక పాఠశాలలో భోదించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Seton Hall President Joseph E. Nyre, Ph.D. presents Justin, the service dog for Grace Mariani, of Mahwah, NJ, with a diploma for attending all of Grace’s classes at Seton Hall. pic.twitter.com/sZgHD5Fs3X — Seton Hall (@SetonHall) May 23, 2023 (చదవండి: శునకాన్ని చిన్నపాటి కొమ్మతో అదిలించాడు..అంతే అది రెచ్చిపోయి...) -
విద్యుత్ సంస్కరణలకు నేనే మార్గదర్శిని
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అప్పట్లో తాను విజన్ 2020 రూపకల్పన చేస్తే తనను అందరూ 420 అంటూ ఎద్దేవా చేశారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తన విజన్ 2020 వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ తొలి గ్రాడ్యుయేషన్ వేడుకకి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. దేశంలో వచ్చిన పలు ఆర్థిక సంస్కరణలకు తానే కారణమని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విద్యుత్ సంస్కరణకు తానే మార్గదర్శినన్నారు. తాను తెచ్చిన సంస్కరణల వల్ల ఇప్పుడు దేశంలో విద్యుత్ రంగం అభివృద్ధి చెందిందన్నారు. అదేవిధంగా టెలికాంలోనూ సంస్కరణలు తేవాలని నాటి ప్రధాని వాజ్‌పేయ్‌కు చెప్పానని చెప్పుకున్నారు. ఇక తాను రూపకల్పన చేసిన పాలసీల కారణంగానే హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, జినోమ్ వ్యాలీ, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు వచ్చాయని చెప్పారు. జినోమ్ వ్యాలీలోనే ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. డిజిటల్ కరెన్సీతో ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి చెక్ రూ.500, రూ.2 వేల పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా దేశంలో నల్లదనం ప్రవాహం, అవినీతిని రూపుమాపవచ్చని చంద్రబాబు అన్నారు. డిజిటల్ కరెన్సీతో ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ వంటి అవినీతికి అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. పబ్లిక్, ప్రభుత్వం, ప్రైవేట్, పార్టనర్ షిప్ (పీ–4)తో వేగంగా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తాను అప్పట్లో ప్రైవేట్, పబ్లిక్, పార్ట్నర్షిప్ (పీ–3) పాలసీతోనే తాను హైటెక్ సిటీని నిర్మించానన్నారు. బయోటెక్నాలజీకి సంబంధించి అప్పట్లో బిల్‌గేట్స్ తనకు చెప్పారని గుర్తు చేశారు. కార్యక్రమంలో గీతం యూనివర్సిటీ చాన్స్‌లర్ వీరేందర్‌సింగ్ చౌహాన్, ప్రెసిడెంట్ ఎం.శ్రీభరత్, వీసీ ప్రొఫెసర్ దయానంద సిద్దవటం, ప్రొఫెసర్ జయశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు శ్రీవెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 7వ స్నాతకోత్సవం
-
2030 నాటికి మూడో ఆర్థిక శక్తిగా భారత్
మాదాపూర్: ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 2030 నాటికి మూడో ఆర్థిక శక్తిగా ఎదగనుందని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయమంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ అన్నారు. మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో మంగళవారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) 2023 స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ 2047 నాటికి మనదేశం నెంబర్‌వన్‌గా నిలుస్తుందన్నారు. సీఏ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఆయన పట్టాలను అందజేశారు. ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై చర్చలు నిర్వహించే జీ–20 దేశ సమావేశాల్లో ఐసీఏఐ కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. ఐసీఏఐ అధ్యక్షుడు దేబాషిన్ మిత్రా మాట్లాడుతూ ఎంతో క్లిష్టమైన సీఏ ఉత్తీర్ణులైన విద్యా ర్థుల్లో 42% మహిళలే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఐ ఉపాధ్యక్షుడు అనికేత్ సునీల్ తలాటి, ఐసీఏఐ కౌన్సిల్ సభ్యులు శ్రీధర్ ముప్పాల, ప్రతినిధులు సుశీల్‌కుమార్ గోయల్, ప్రసన్నకు మార్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యార్థులు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి
బాసర(ముధోల్): ప్రతిభ ఎవరి సొత్తూ కాదని, ఐడియాలో దమ్ముంటే ఎవరూ ఆపలేరని, గ్లోబల్ లీడర్‌గా ఎదగాలంటే మంచి ఆలోచనలతో నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో శనివారం నిర్వహించిన 5వ స్నాతకోత్సవ కార్య క్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వచ్చే 20 ఏళ్లలో ప్రపంచం పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నడుస్తుందని, దానికి తగ్గట్టు మనం కూడా రూపాంతరం చెందాలన్నారు. బాసర ట్రిపుల్ ఐటీపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, సమస్యల పరిష్కారానికి దాదాపు రూ.25 కోట్లు అవసరమని కళాశాల అధికారులు కోరగా.. అవి సరిపోవంటూ రూ.27 కోట్లు సీఎం మంజూరు చేశారని వివరించారు. స్టేట్ యూనివర్సిటీగా ఉన్న ట్రిపుల్ ఐటీని నేషనల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దే బాధ్యత విద్యార్థులదేనన్నారు. ట్రిపుల్ ఐటీకి వరాలు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. ఇకపై విద్యార్థులకు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి విన్నపం మేరకు నాలుగు వేల మంది విద్యార్థినులు చదువుతున్న ట్రిపుల్ ఐటీలో గైనకాలజీ డాక్టర్లు అందుబాటులో ఉండేలా పది పడకల ఆస్పత్రి నిర్మించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు సోలార్ ఎనర్జీ అందించి, క్యాంపస్ లోని చెరువును సుందరీకరణ చేస్తామని, విద్యా ర్థుల అవసరాల మేరకు సైన్స్‌ల్యాబ్ ఏర్పాటు చేస్తా మని తెలిపారు. వీటికి అవసరమయ్యే దాదాపు రూ.5కోట్లు త్వరలో మంజూరు చేస్తామన్నారు. ల్యాప్‌టాప్‌లు ప్రదానం గత సెప్టెంబర్‌లో ట్రిపుల్ ఐటీని సందర్శించిన కేటీఆర్ విద్యార్థులకు అవసరమైన ల్యాప్‌టాప్‌లు అందిస్తామని హామీనిచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ శనివారం స్థానిక కాన్ఫరెన్స్ భవనంలో పలువురు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ప్రదానం చేశారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో 38మంది విద్యార్థులకు మంత్రి కేటీఆర్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వీసీ వెంకటరమణ, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ నూతన విద్యావిధానంతో మేలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రపంచంతో విద్యార్థి పోటీపడేలా జాతీయ నూతన విద్యావిధానం దేశంలో అమల్లోకి రానున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యార్థులకు పౌష్టికాహారంతోపాటు మాతృభాషలో విద్యనందిస్తారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బండమీదిపల్లిలో గురువారం పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ) మూడో స్నాతకోత్సవానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ బీజే రావుతో కలిసి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రస్తుత విద్యావిధానాల వల్ల విద్యార్థుల్లో సామర్థ్యాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని అమల్లోకి తేనుందని.. దీని ద్వారా మాతృభాషకు ప్రాధాన్యం పెరిగి విద్యార్థుల్లో సామర్థ్యం పెరుగుతుందన్నారు. దేశంలో ఇంకా పేదరికం, అవినీతి, అనారోగ్య సమస్యలున్నాయని.. వీటిని రూపుమాపే పరిశోధనలకు నూతన విద్యావిధానం పునాది వేస్తుందని ఆకాంక్షించారు. క్లిష్టమైన సమయంలో కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొని భారత్ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలదని నిరూపించిందన్నారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. స్నాతకోత్సవానికి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ హాజరుకాలేదు. అదనపు కలెక్టర్ సీతారామారావు గవర్నర్‌కు స్వాగతం పలికారు. గొప్ప వ్యక్తులు కలిస్తే అద్భుతాలు గొప్ప వ్యక్తులు కలిస్తే అద్భుతాలు జరుగుతాయని గవర్నర్ తమిళిసై చెప్పారు. 1893లో స్వామి వివేకానంద, జంషెడ్ టాటా ఒకే ఓడలో కెనడాలోని వాంకోవర్‌కు బయల్దేరారని గుర్తుచేశారు. ఆ సమయంలో టాటా.. బ్రిటీష్ ఇండియాకు స్టీల్ ఉత్పత్తులు తెచ్చి విక్రయిస్తున్న విషయం వారి మధ్య చర్చకు వచ్చిందని చెప్పారు. భారత్‌లోనే సైన్స్ ఆఫ్ స్టీల్‌కు సంబంధించిన పరిశోధనాలయాన్ని ఏర్పాటు చేయాలని, ఇక్కడే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా కృషి చేయాలని టాటాకు వివేకానంద సూచించారన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న టాటా 1898లో బెంగళూరులో టాటా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను స్థాపించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరుగురికి పీహెచ్డీ, 72 మంది పీజీ, డిగ్రీ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. -
ఆధునిక కోర్సుల్లో చేరాలి
నర్సాపూర్ : ఇంజనీరింగ్ విద్యార్థులు సాంప్రదాయ కోర్సులతోపాటు ఆధునిక కోర్సులను చదవాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.లింబాద్రి అన్నారు. ఆదివారం నర్సాపూర్‌లోని బీవీ రాజు ఇంజినీరింగ్ కాలేజీలో 8వ స్నాతకోత్సవం ఏర్పాటు చేయగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సాంప్రదాయ కోర్సులైన మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌లతో పాటు పాటు ఫార్మా రంగాలకు మంచి భవిష్యత్ ఉందని, నూతన కంప్యూటర్ కోర్సులను చదవాలన్నారు. విద్యార్థులకు మంచి విద్యతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థల్లో బీవీఆర్ఐటీ ఒకటని ఆయన కాలేజీ యాజమాన్యాన్ని అభినందించారు. స్నాతకోత్సవంలో పాల్గొన్నందుకు తనకు సంతోషంగా ఉందని వివరిస్తూ విద్యార్థులు మంచి నడవడికతో దేశానికి, సమాజానికి సేవా భావం కల్గి ఉండాలని, నిజాయితీగా ఉండాలని హితవు పలికారు. ఆయా కోర్సుల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆయన మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మిప్రసాద్, కాలేజీలోని పలు బ్రాంచ్‌ల హెచ్ఓడీలు, కాలేజీ డీజీఎం కాంతారావు, ఏఓలు బాపిరాజు, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు. సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బందితో కలిసి ఆనందం వ్యక్తం చేశారు. -
ఆర్థిక వ్యవస్థ పరిరక్షణలో సీఏల పాత్ర కీలకం
మాదాపూర్ (హైదరాబాద్): దేశ ఆర్థిక వ్యవస్థ పరిరక్షణలో సీఏల పాత్ర కీలకమైందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో గురువారం జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఖాతాదారులను సరైన మార్గంలో నడిపించే బాధ్యత చార్టెడ్ అకౌంటెంట్లపై ఉంటుందన్నారు. పన్నులు కట్టడాన్ని తగ్గించే ప్రయత్నం చేయకూడదని సూచించారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం సజావుగా అమలు అయ్యేలా చూడటంలో సీఏలది ముఖ్య భూమిక అని, ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలుగల దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉందని అన్నారు. భారత్ అప్పు తీసుకునే దశ నుంచి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతోందన్నారు. జీ–20 దేశాల సదస్సు ఈ ఏడాది భారత్‌లోనే జరుగుతుందని, ఆర్థిక రంగానికి సంబంధించిన పలు సమా వేశాలను హైదరాబాద్‌లో కూడా నిర్వహించనున్నారని తెలిపారు. ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు ముప్పల శ్రీధర్ మాట్లాడుతూ.. సీఏ కోర్సు పూర్తి చేసిన వారికి అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వృత్తిలో నైతిక విలువలను పాటిస్తూ, అంకిత భావంతో పనిచేయాలని కోరారు. అనంతరం సీఏ కోర్సులను పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు దయానివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం అవసరం
సాక్షి, హైదరాబాద్/సుభాష్‌నగర్: దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన మహీంద్రా విశ్వవిద్యాలయం ప్రథమ వార్షిక స్నాతకోత్సవంలో మంత్రి ప్రసంగించారు. ఆవిష్కరణల్లో యువత చాలా చురుకుగా ఉందనికొనియాడారు. ప్రపంచమంతా వయోభారంతో కుంగుతుంటే, భారత్ మాత్రం నవయవ్వన దేశంగా మారుతోందన్నారు. వినూత్నమైన ఆలోచనలు, శక్తిని చాటడానికి యువతరం ఉవ్విళ్లూరుతోందని పేర్కొన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్న వేళ దేశ భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన అవసరమూ ఉందని కేటీఆర్ అన్నారు. కాలేజీ నుంచి అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యువత బయటకు వచ్చి సమాజ శ్రేయస్సుకు తమవంతు తోడ్పాటునందించి మరోమారు చేంజ్ మేకర్స్‌గా నిలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో దేశానికే తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. వర్సిటీ చాన్సలర్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ ‘‘ఇంటర్ డిసిప్లి్లనరీ విద్య అనేది సైన్స్, హ్యుమానిటీస్‌ను మిళితం చేసి హోల్ బ్రెయిన్ థింకింగ్‌ను వేగవంతం చేస్తుంది. ఈ తరహా భావి విద్యకు అంతర్జాతీయ కేంద్రంగా ఇండియా నిలిచే సామర్థ్యం ఉంది’’అని అన్నారు. కార్పొరేట్ సెక్టార్‌తోపాటు దేశానికి స్కిల్ డెవలప్మెంట్, టాలెంట్ మేనేజ్మెంట్ చాలా కీలకమని మహీంద్రా విద్యాసంస్థల చైర్మన్ వినీత్ నయ్యర్ అభిప్రాయపడ్డారు. టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో గుర్నానీ మాట్లాడుతూ డిజిటలైజేషన్‌తో రూపురేఖలు మారుతున్నాయని, డిజిటల్ టెక్నాలజీలలో నైపుణ్యం పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగాలన్నారు. యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ యాజులు మెడూరి మాట్లాడుతూ అంతర్జాతీయ పాఠ్యాంశాలు, పరిశోధన–ఆధారిత అభ్యాసం ద్వారా గ్లోబల్ థింకర్స్, ఎంగేజ్డ్ లీడర్లను రూపొందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులంటే ఇంకా భయమే
గాంధీనగర్: అంతర్గత భద్రతా వ్యవస్థను ఆధునీకరించేందుకు స్వాతంత్య్రానంతరం పెద్దగా ప్రయత్నాలే జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘బ్రిటిష్ హయాంలో జనాలను భయభ్రాంతులను చేయడమే అంతర్గత భద్రతా వ్యవస్థ లక్ష్యంగా ఉండేది. ఇప్పటికీ ఈ విషయంలో పెద్దగా మార్పు రాలేదు. పోలీసులంటే ప్రజల్లో భయం, వారికి దూరంగా ఉండాలన్న భావనే కన్పిస్తున్నాయి’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరిస్థితిని మార్చేందుకు తక్షణం సంస్కరణలు రావాల్సిన అవసరముందన్నారు. ఆయన శనివారం గాంధీనగర్‌లోని రాష్ట్రీ య రక్షా యూనివర్సిటీ (ఆర్ఆర్యూ) తొలి స్నాతకోత్సవంలో ప్రసంగించారు. పోలీసు సిబ్బంది సంఖ్యను పెంచితే చాలదని, టెక్నాలజీ, జనం సైకాలజీ, యువతరం భావోద్వేగాలను అర్థం చేసుకునే నైపుణ్యమున్న శిక్షితులైన అధికారులు తక్షణావసరమని అన్నారు. ‘‘పోలీసులు సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించగలగాలి. ప్రజలతో సున్నితంగా వ్యవహరించి వారిలో స్నేహభావన, నమ్మకం పెంపొందించాలి. అంటే శిక్షణ పద్ధతుల్లోనే మార్పు రావాలి’’ అని అన్నారు. విపరీతమైన పనిభారం పోలీసు సిబ్బంది విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, పని భారంతో సతమతం అవుతున్నారని ప్రధాని అన్నారు. ‘‘వారికి ఆసరాగా నిలిచే ఉమ్మడి కుటుంబాల వంటి సంప్రదాయ వ్యవస్థలు క్షీణించడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. పైగా నేటి పరిస్థితుల్లో భద్రతా సిబ్బంది కేవలం శారీరకంగా ఫిట్‌గా ఉంటే చాలదు. మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. ఎందుకంటే శారీరక వైకల్యమున్నా మానసికంగా దృఢంగా సిబ్బంది భద్రతా వ్యవస్థలకు ఎంతగానో ఉపయోగపడగలరు. అందుకే ఒత్తిడిని దూరం చేసుకునేందుకు వారికి యోగ శిక్షణ, నిపుణుల మద్దతు వంటివి తప్పనిసరి’’ అని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థ, సంబంధిత స్టార్టప్‌ల విస్తరణను కూడా ప్రస్తావించారు. ఆర్ఆర్యూ విద్యార్థులు వాటిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. భద్రత, రక్షణ తదితర రంగాల్లో మహిళల రాక పెరుగుతుండటం శుభ పరిణామమన్నారు. 1,090 మంది ఆర్ఆర్యూ విద్యార్థులు ఈ సందర్భంగా పట్టాలు అందుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు, నేర న్యాయ వ్యవస్థల్లో సుశిక్షిత సిబ్బందిని అందించేందుకు 2020లో ఆర్ఆర్యూ స్థాపన జరిగింది. రెండు రోడ్ షోలు వచ్చే డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ప్రధాని మోదీ శనివారం మరో రెండు రోడ్ షోలు చేశారు. ఉదయం గాంధీనగర్ జిల్లాలో దేగం నుంచి లవద్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ దాకా 12 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు. ఓపెన్ టాప్ జీప్‌లో ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు. సాయంత్రం అహ్మదాబాద్‌లో ఇందిరా బ్రిడ్జి నుంచి సర్దార్ పటేల్ స్టేడియం దాకా 3.5 కిలోమీటర్ల మేర మామూలు జీప్‌లో రోడ్ షో చేశారు. అయితే పలుచోట్ల వాహనం దిగి, ‘మోదీ, మోదీ’ అని నినదిస్తున్న జనాన్ని పలకరిస్తూ సాగారు. గుజరాత్లో 1988 నుంచీ బీజేపీయే అధికారంలో ఉంది. -
నవ భారత నిర్మాణానికి నడుం బిగించండి
కాన్పూర్: యువత తాము కలలుకనే భారతం కోసం ఇప్పటినుంచి కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఐఐటీ కాన్పూర్ 54వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. యువత సుఖాల కన్నా సవాళ్లను ఎంచుకోవాలని సూచించారు. ఇప్పటికే ఎంతో సమయం వృధా అయిందని, విద్యార్థిలోకం తక్షణం నడుం బిగించి పనిచేస్తే వచ్చే 25ఏళ్లలో వాళ్లు కలలు గనే భారత్‌ను చూడవచ్చని ఉద్భోదించారు. భారత స్వావలంబనకు తోడ్పడాలని నూతన గ్రాడ్యుయేట్లను ఆయన కోరారు. స్వాతంత్య్రానంతరం భారత్ నూతన పయనం ఆరంభమైందని, నిజానికి 25ఏళ్లు పూర్తయ్యేసరికి ఎంతో అభివృద్ధి జరిగి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ సమయం వృథా చేయడం వల్ల దాదాపు రెండు తరాలు గడిచిపోయాయన్నారు. అందుకే ఇకపై ఎంతమాత్రం జాప్యం కూడదని హెచ్చరించారు. అనంతరం కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్టులో పూర్తయిన భాగాన్ని ప్రధాని ప్రారంభించారు. ఐఐటీ కాన్పూర్ నుంచి మోదీ ఝీల్ వరకు 9 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం పూర్తయింది. దీంతోపాటు 356 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్ ప్రాజెక్టును ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రధాని మోదీ కాన్పూర్ నుంచి లక్నోకు 80 కిలోమీటర్లు రోడ్డుమార్గం ద్వారా వెళ్లాల్సి వచ్చింది. దారిపొడవునా తనిఖీలు చేసి, తగిన బందోబస్తును ఏర్పాటు చేశాక మోదీ రోడ్డు మార్గంలో ప్రయాణించారు. ఐదేళ్లు దోచుకోవచ్చనుకున్నారు సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని మోదీ తన కాన్పూర్ పర్యటనలో నిప్పులు చెరిగారు. గతంలో యూపీలో అధికారంలోకి వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ, ఎదురులేకుండా ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకునే లాటరీ దొరికినట్లు భావించిందని దుయ్యబట్టారు. అనంతరం ఏర్పడిన తమ ప్రభుత్వం నిజాయితీ, పారదర్శకతతో పనిచేస్తోందన్నారు. ఇటీవల కాన్పూర్‌కు చెందిన సుగంధద్రవ్యాల వ్యాపారి వద్ద కోట్ల రూపాయల నగదు దొరకడాన్ని ఆయన ప్రస్తావించారు. ఇది ప్రతిపక్షం సాధించిన విజయమని ఎద్దేవా చేశారు. 2017కు పూర్వం అవినీతి దుర్గంధం రాష్ట్రమంతా వ్యాపించిందని, కట్టలు బయటపడగానే ఎస్పీ నేతల నోళ్లు మూతపడ్డాయని విమర్శించారు. కాన్పూర్, యూపీ ప్రజలకు మొత్తం అర్థమవుతోందన్నారు. యూపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతోందన్నారు. -
16వ స్నాతకోత్సవం: కళకళలాడిన కోఠి ఉమెన్స్ కాలేజీ
-
గుంటూరు వైద్య కళాశాల స్నాతకోత్సవం
-
ఆనందమానందమాయే!
-
అవకాశాలు అందిపుచ్చుకోవాలి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశ జనాభాలో 50 శాతం మంది యువత 27 ఏళ్లలోపు వారే ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. వివిధ రంగాల్లో మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న స్టార్టప్ ఇంక్యుబేటర్ ‘వి హబ్’గ్రాడ్యుయేషన్ వేడుకలో మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘వి హబ్’ స్టార్టప్‌లు సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలకు కృషి చేస్తున్నాయని చెప్పారు. స్టార్టప్‌ల ఉత్పత్తులు ఉపయోగకరమని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వమే తొలి వినియోగదారుగా మారి కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఉత్పత్తులు అవసరమైన వారితో ‘వి హబ్’స్టార్టప్‌లను అనుసంధానం చేసేందుకు అవసరమైతే ప్రభుత్వమే చొరవ తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వి హబ్ సీఈఓ దీప్తి రావుల పాల్గొన్నారు. ‘వి హబ్’లో మూడు కొత్త కార్యక్రమాలు ‘వి హబ్’ప్రారంభిస్తున్న మూడు కొత్త కార్యక్రమాలను కేటీఆర్ ప్రారంభించారు. వంద మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ‘ఫిక్కి ఫ్లో’సాయంతో అవసరమైన మద్దతు, దేశవ్యాప్తంగా 20 స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తుం ది. డేటా సైన్స్, కృత్రిమ మేథస్సు సంబంధిత రంగాల్లో ఆసక్తి ఉన్న మహిళలను తయారు చేసేందుకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోని వుమెన్ ఇన్ డేటా సైన్స్ (విడ్స్) భాగస్వామ్యంతో దేశంలోని ఐదు నగరాల్లో వంద మంది పాఠశాల విద్యార్థుల కోసం ‘గరల్స్ ఇన్ స్టెమ్’కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను చేపట్టేలా 50 మంది విద్యార్థినులకు రాçష్ట్రంలోని 5 సాంకేతిక విద్యాసంస్థల ద్వారా సాయమందించేందుకు ‘వి ఆల్ఫా’అనే మరో కార్యక్రమానికి వి హబ్ శ్రీకారం చుట్టింది. సర్టిఫికెట్ల అందజేత వివిధ గ్రాడ్యుయేట్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నవారిని కేటీఆర్ అభినందించారు. స్టార్టప్‌లకు మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేటివ్, న్యాయ, మార్కెటింగ్ మద్దతుతోపాటు సాంకేతిక సాయం అందించేలా తమ ఉత్పత్తులను రూపొందించిన 25 స్టార్టప్‌లు ‘ఇంక్యుబేషన్ సెకండ్ కోహర్ట్ గ్రాడ్యుయేషన్’పూర్తి చేసుకున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతో గ్రామీణ ప్రాంతాల్లో ఎంట్రప్రెన్యూర్షిప్పై ఆసక్తి కలిగిన ఆరు ఔత్సాహిక స్టార్టప్‌లకు సర్టిఫికెట్లు అందజేశారు. సైబర్ క్రైమ్, ట్రాఫిక్, రోడ్డు భద్రత, మహిళలు, పిల్లల భద్రత తదితరాలకు సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీసు సహకారంతో చేపట్టిన ఎర్లీప్రెన్యూర్ కార్యక్రమం కింద పరిష్కారాలు చూపిన 12 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ప్రత్యేక పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సిద్ధం సాక్షి, హైదరాబాద్: తైవాన్ భాగస్వామ్యంతో ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న తైవాన్ ఆర్థిక, సాంస్కృతిక కమిటీ (టెక్క్), తైవాన్ విదేశీ వాణిజ్యాభివృద్ధి మండలి (తైత్ర), ఇన్వెస్ట్ ఇండియా సంయుక్త ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్‌తో బుధవారం భేటీ అయింది. రాష్ట్రంలోని వ్యాపార అనుకూలతలు, మౌలిక వసతుల నేపథ్యంలో అనేక దేశాలు భారీ పెట్టుబడులతో వస్తున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తైవాన్ పారిశ్రామిక పెట్టుబడులకూ తెలంగాణ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తైవాన్ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు గతంలో తాను తైవాన్‌లో పర్యటించిన విషయాన్ని టెక్క్ డైరెక్టర్ జనరల్ బెన్‌వాంగ్‌కు కేటీఆర్ వివరించారు. -
ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలి
సాక్షి, బెంగళూరు: దేశంలో కరోనా మహమ్మారిని చూసిన తర్వాత గుణపాఠాలు నేర్చుకుని ప్రజా ఆరోగ్యానికి అన్ని ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. ఆదివారం బెంగళూరులోని నిమ్హాన్స్లో జరిగిన రాజీవ్‌గాంధీ ఆరోగ్య యూనివర్సిటీ 23వ వార్షిక స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎంబీబీఎస్, పీజీ పట్టభద్రులకు పట్టాలను, బంగారు పతకాలను అందజేసి ప్రసంగించారు. ఆరోగ్యం, విద్యా రంగాలు అత్యంత ప్రధాన రంగాలని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల విజయం .. భవిష్యత్తులో కరోనా వంటి అంటురోగాలు విస్తరించకుండా అడ్డుకట్ట వేయాలంటే ఆరోగ్య రంగం మరింత బలోపతం కావాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ యోజన ద్వారా మన శాస్త్రవేత్తలు కరోనాకు టీకాను కనిపెట్టారని, దీనివల్ల మనదేశంలో లక్షలాది మందికి వ్యాక్సిన్ అందించడం సాధ్యమైందని చెప్పారు. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలకు సైతం కోవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసిన ఘనత మనదేశానికి దక్కుతుందని చెప్పారు. ఇది మన శాస్త్రవేత్తల విజయమని కొనియాడారు. కోవిడ్ సమయంలో వైద్యులు, వైద్య విద్యార్థులు తమ జీవితాలను పణంగా పెట్టి పని చేశారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు సులభ జీవనం అందించండి
న్యూఢిల్లీ: భారతదేశం తన యువతకు కావాల్సిన సదుపాయాలను (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అందిస్తుందని, అనుభవం, నైపుణ్యం, నవీన ఆవిష్కరణల ద్వారా వారు దేశంలోని పేదలకు సులభతర జీవనాన్ని(ఈజ్ ఆఫ్ లివింగ్) అందించాలని ప్రధాని మోదీ కోరారు. ఆయన శనివారం ఢిల్లీ ఐఐటీ 51వ వార్షిక స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధానంగా నిరుపేదల కోసం కొత్త ఆవిష్కరణలు చేయాలని యువతకు సూచించారు. కోవిడ్ అనంతరం భిన్నమైన ప్రపంచాన్ని మనం చూడబోతున్నామని, ఇందులో సాంకేతిక పరిజ్ఞానం అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని తెలిపారు. నాణ్యతపై కచ్చితంగా దృష్టి పెట్టాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని ఐఐటీ విద్యార్థులకు ఉద్బోధించారు. మీ శ్రమ ద్వారా భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని అన్నారు.బ్రాండ్ ఇండియాకు విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. టెక్నాలజీ ద్వారా మంచి పాలన అందించవచ్చనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఈ టెక్నాలజీ పేదల వరకూ చేరుతోందన్నారు. సాంకేతికత ద్వారా సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తూ అవినీతికి అడ్డుకట్ట వేశామని మోదీ పేర్కొన్నారు. ఎన్ఈపీ అతిపెద్ద సంస్కరణ: రమేశ్ ఐఐటీకి చెందిన 2,019 మంది గ్రాడ్యుయేట్లకు శనివారం డిగ్రీలు అందజేశారు. విద్యార్థులను ఉద్దేశించి విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రసంగించారు. స్నాతకోత్సవం అంటే విద్యాభ్యాసం పూర్తయినట్లు కాదని, ఉద్యోగ రంగంలోకి అడుగపెట్టేందుకు ఇదొక గట్టి పునాది లాంటిదన్నారు. నూతన జాతీయ విద్యా విధానం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద సంస్కరణ అని అభివర్ణించారు. -
అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో సంస్కరణలు
మైసూర్: ఈ దశాబ్దాన్ని భారతదేశ దశాబ్దంగా మార్చడం, దేశ పురోభివృద్ధే లక్ష్యంగా అన్ని రంగాల్లో అవసరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉన్నత విద్యకు భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడానికి, మన యువతలో పోటీతత్వాన్ని పెంచడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. సోమవారం మైసూర్ విశ్వవిద్యాలయం శతాబ్ది స్నాతకోత్సవంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. గత 7 నెలలుగా సంస్కరణల్లో వేగం పెరగడాన్ని మీరు గమనించే ఉంటారని అన్నారు. వ్యవసాయం, అంతరిక్షం, రక్షణ, విమానయానం, కార్మిక.. ఇలా అన్ని రంగాల్లో సంస్కరణలు ఊపందుకున్నాయని, ఈ ప్రయత్నమంతా దేశ ప్రగతి కోసమేనని ఉద్ఘాటించారు. కోట్లాది మంది యువత ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యమని అన్నారు. మన పునాదులను పటిష్టంగా మార్చుకుంటేనే ఈ దశాబ్దం భారతదేశ దశాబ్దంగా మారుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుత దశాబ్దం దేశంలోని యువతకు అపారమైన అవకాశాలు కల్పించిందని గుర్తుచేశారు. ఇప్పుడు అన్ని రంగాల్లో అమలవుతున్న సంస్కరణలు గతంలో ఎప్పుడూ అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఏదో ఒక రంగానికే పరిమితం అయ్యేవని, ఇతర రంగాలను పక్కన పెట్టేవారని చెప్పారు. ఇండియాలో గత ఆరేళ్లుగా బహుళ రంగాల్లో బహుళ సంస్కరణలు అమలయ్యాయని వివరించారు. ఆరోగ్య రక్షణలో కేంద్ర స్థానంలో భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అధికంగా పెట్టుబడులు పెడుతూ నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించే దేశాలే భవిష్యత్తును నిర్దేశిస్తాయని మోదీ వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం గ్రాండ్ చాలెంజెస్ వార్షిక సమావేశంలో ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. శాస్త్రీయ పరిశోధనా సంస్థలే భారత్‌కు అతిపెద్ద ఆస్తి అని చెప్పారు. ఆరోగ్య రక్షణ విషయంలో ఇండియా ప్రపంచంలోనే కేంద్ర స్థానంలో నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు. వైద్య రంగంలో భారత్ అనుభవం, పరిశోధనల్లో నైపుణ్యాలే ఇందుకు కారణమని వివరించారు. వైద్య రంగంలో ఇతర దేశాలకు సహకారం అందిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న మొత్తం టీకాల్లో 60 శాతానికిపైగా టీకాలు భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ విధాన నిర్ణేతలు, పరిశోధకులను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చి పరిష్కార మార్గాలు కనిపెట్టడమే చాలెంజెస్ లక్ష్యం. -
ఆశావహంగా ఉండండి..
న్యూఢిల్లీ: విద్యాభ్యాసం పూర్తి చేసుకుని బైటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్న గ్రాడ్యుయేట్లు ఆశావహంగాను, కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆసక్తిగాను ఉండాలని టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సూచించారు. అంతే కాకుండా కొంత అసహనంగా కూడా ఉండాలని, దాన్నుంచే కొత్త సాంకేతిక విప్లవం రాగలదని ఆయన పేర్కొన్నారు. 2020 గ్రాడ్యుయేట్ల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పిచాయ్ ఈ విషయాలు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులతో పాటు పలువురు ప్రముఖులు ఈ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఈ స్నాతకోత్సవం ఇలా జరుగుతుందని మీరెవరూ ఊహించి ఉండరు. మీరు వేడుకగా జరుపుకోవడానికి బదులు కోల్పోయిన అవకాశాలు, తల్లకిందులైన ప్రణాళికల గురించిన ఆందోళనతో జరుపుకోవాల్సి వస్తోందని మీరు బాధపడుతూ ఉండొచ్చు. ఇలాంటి కష్టకాలంలో ఆశావహంగా ఉండటం కష్టమే. కానీ ఆశావహంగా ఉండగలిగితే, ఈ ఏడాది గ్రాడ్యుయేట్లయిన మీరు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టగలరు. చరిత్రలో నిల్చిపోగలరు‘ అని సుందర్ చెప్పారు. మెరుగైన ప్రపంచం.. ఒక తరం సాధించిన పురోగతి మరో తరానికి పునాదిరాయి కాగలదని సుందర్ తెలిపారు. నేటి యువత ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పురోగతి సాధించాలంటే కాస్త అసహనం కూడా ఉండాలన్నారు. ‘కొన్ని టెక్నాలజీ సంబంధిత విషయాలు మీకు విసుగు తెప్పించవచ్చు. అసహనానికి గురిచేయొచ్చు. ఆ అసహనాన్ని కోల్పోవద్దు. దాన్నుంచే కొత్త సాంకేతిక విప్లవం సృష్టి జరగొచ్చు, మా తరం కనీసం కలలో కూడా ఉహించని కొత్తవన్నీ మీరు నిర్మించవచ్చేమో. కాబట్టి అసహనంగా ఉండండి. ప్రపంచానికి అవసరమైన పురోగతి దాన్నుంచే వస్తుంది‘ అని సుందర్ పేర్కొన్నారు. నేనూ సవాళ్లు ఎదుర్కొన్నా.. గూగుల్ సీఈవో స్థాయికి ఎదిగే క్రమంలో తానూ పలు సవాళ్లు ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా సుందర్ చెప్పారు. తన చిన్నతనంలో టెక్నాలజీ పెద్దగా అందుబాటులో ఉండేది కాదని, కానీ ప్రస్తుత తరం పిల్లలు కంప్యూటర్లతోనే పెరుగుతున్నారన్నారు. ‘నేను స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి అమెరికా రావడం కోసం మా నాన్న దాదాపు ఏడాది జీతం వెచ్చించి విమానం టికెట్ కొనిచ్చారు. నేను విమానం ఎక్కడం అదే మొదటిసారి. నన్ను అక్కడ (భారతదేశం) నుంచి ఇక్కడి దాకా (అమెరికా) తీసుకొచ్చినది కేవలం అదృష్టం ఒక్కటే కాదు. టెక్నాలజీ అంటే నాకున్న అమితాసక్తి, కొత్తవి నేర్చుకోవాలనే అభిలాష కూడా ఇందుకు కారణం‘ అని సుందర్ తెలిపారు. -
ఏబీకే ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ విశిష్ట కార్యక్రమానికి గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ చాన్స్‌లర్ హోదాలో హాజరయ్యారు.యూనివర్శిటీ డైక్మెన్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వీసీ రాజశేఖర్, రిజిస్ట్రార్ రోశయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.180 మంది స్కాలర్స్‌కు వివిధ విభాగాల్లో డాక్టరేట్ డిగ్రీలు ప్రదానం చేశారు. పరిశోధన, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో అద్భుత ప్రతిభ చూపిన 249 విద్యార్థులకు గవర్నర్ హరిచందన్ గోల్డ్ మెడల్స్ అందజేశారు. -
బ్యూటీ ‘మేకప్’
-
జేఎన్‌యూలో ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ఫీజుల పెంపును నిరసిస్తూ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఢిల్లీలోని వసంత్‌కుంజ్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్ గది అద్దె, మెస్ ఛార్జీల పెంపు, డ్రెస్‌కోడ్‌లను విధించేందుకు వీలుగా హాస్టల్ మాన్యువల్‌లో ప్రతిపాదించిన మార్పులను ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థులు నిరసనబాట పట్టారు. జేఎన్‌యూ నుంచి విద్యార్థుల నిరసనర్యాలీ మొదలైంది. దగ్గర్లోని ఏఐసీటీఈ ఆడిటోరియంకు సమీపానికి రాగానే పోలీసులు వారిని నిలువరించారు. ఆడిటోరియంలో స్నాతకోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య మాట్లాడుతున్నపుడు బయట విద్యార్థుల ఆందోళన కొనసాగింది. పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్నాతకోత్సవం తర్వాత వెంకయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆడిటోరియం ప్రాంతాన్ని విద్యార్థులు చుట్టుముట్టడంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోఖ్రియాల్ దాదాపు ఆరు గంటలపాటు ఆడిటోరియంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల అభ్యంతరాలు, డిమాండ్లన్నింటినీ పరిశీలిస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
అందమైన భామలు
-
డిజిటల్లో అగ్రగామిగా భారత్
గాంధీనగర్: డిజిటల్ రంగంలో భారత్ త్వరలోనే అగ్రగామిగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. ‘డిజిటల్ రంగం ప్రతీ రోజు, ప్రతీ క్షణం కొత్త పుంతలు తొక్కుతున్న దేశం ఏదైనా ఉందంటే.. అది భారత్ మాత్రమేనని ఘంటాపథంగా చెప్పగలను. మొబైల్ డేటా విభాగంలో ప్రపంచ దేశాల జాబితాలో 155వ స్థానంలో ఉండే భారత్ కేవలం 24 నెలల్లోనే నంబర్ వన్ స్థాయికి చేరింది. అలాగే నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విభాగాల్లో కూడా వచ్చే 24 నెలల్లో అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముకేశ్ ఈ విషయాలు చెప్పారు. మరోవైపు, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. భారతదేశం.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీ అని ఆయన పేర్కొన్నారు. -
అమెరికాలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం
కాలిఫోర్నియా: ఆమెరికాలోని కాలిఫొర్నియాలో భారతీయ కళలు, భాషలలో మాస్టర్స్, డిప్లొమ మరియు సర్టిఫికెట్ స్థాయి కోర్సులను అందిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం కాంప్ బెల్ హెరిటేజ్ థియేటర్లో ఘనంగా జరిగింది. తొలి బ్యాచ్ లో చేరి కోర్సు పూర్తి చేసిన ౩1 మంది విద్యార్ధులకు సిలికానాంధ్ర విశ్వ విద్యాలయ అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, విశ్వ విద్యాలయ పాలకవర్గ చైర్మన్ లకిరెడ్డి హనిమిరెడ్డి చేతుల మీదుగా పట్టాలు అందించారు. విశ్వవిద్యాలయం ప్రొవొస్ట్ రాజు చమర్తి ముందు నడవగా ఆనంద్ కూచిభొట్ల, డా. హనిమిరెడ్డి లక్కిరెడ్డి, డా. పప్పు వేణుగోపాల రావు, నీరజ్ భాటియా, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ దీనబాబు కొండుభట్ల, చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్ దిలీప్ కొండిపర్తి, ప్రముఖ వ్యక్తిత్వవికాస నిపుణులు ప్రసాద్ కైపా మరియు పట్టభద్రులు కాబోతున్న విద్యార్ధులు స్నాతకోత్సవ దుస్తులతో కవాతుగా వేదిక వద్దకు వచ్చారు. ఈ స్నాతకోత్సవ సంబరాల్లో విశ్వవిద్యాలయ విద్యార్ధులు అబ్బురపరిచే ప్రదర్శనలిచ్చారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కర్ణాటక సంగీత ఆచార్యులు డా. శ్రీరాం పరశురాం నిర్వహించిన హిందుస్తాని-కర్ణాటక సంగీత జుగల్బంది కచేరీకి ప్రేక్షకులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి భారతదేశం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన అధ్యాపక బృందం డా. శ్రీరాం పరశురాం, డా.మాలా స్వామి, డా.రమాదేవి, డా. సుమిత్ర వేలూరి, డా.యశోద ఠాకూర్, డా.అనుపమ కైలాష్ తదితరులను విశ్వవిద్యాలయ పాలకవర్గం ప్రత్యేకంగా సన్మానించింది. -
ఎల్పీయూ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి
జలంధర్: పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ) 9వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆ తర్వాత స్నాతకోత్సవంలో భాగంగా గోల్డ్ మెడల్ సాధించిన 98 మంది టాపర్లకు, పీహెచ్డీ డిగ్రీలు పూర్తి చేసిన 54 మంది విద్యార్థులకు డిగ్రీలు, మెడల్స్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రదానం చేశారు. స్నాతకోత్సవంలో యూనివర్సిటీ 2017, 2018 బ్యాచ్‌లకు చెందిన 38,000 మంది విద్యార్థులకు డిగ్రీలు/డిప్లమోలను ప్రదానంచేసింది. వీరితోపాటు 13,018 మంది రెగ్యులర్ విద్యార్థులు, 223 మంది పార్ట్‌టైమ్, 24,685 మంది డిస్టెన్స్ విద్యార్థులు డిగ్రీ/డిప్లమోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థులతోపాటు 70కిపైగా దేశాల నుంచి వచ్చి ఎల్పీయూలో విద్యనభ్యసించిన విదేశీ విద్యార్థులూ డిగ్రీ/డిప్లమోలు సాధించారు. ఈ కార్యక్రమంలో ఎల్పీయూ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్, వైస్ చాన్స్‌లర్ నరేశ్ మిట్టల్, ఉన్నతాధికారులు, వేలాది మంది విద్యార్థులు, తల్లిదండులు పాల్గొన్నారు. -
మాతృభాషను మరవొద్దు
సాక్షి, హైదరాబాద్: మాతృభాషలోనే భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. మాతృభాషలో ఉన్న మాధుర్యం ఇతర భాషల్లో ఉండదని, వీలైనంత వరకు తల్లిభాషలోనే మాట్లాడాలని పిలుపునిచ్చారు. గురువారం కోఠిలో జరిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాల 14వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. వివిధ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ‘తల్లి భాష కంటి చూపులాంటిది. చూపు ఉన్నప్పుడే ఎంతటి ఖరీదైన అద్దాలనైనా పెట్టుకోగలం. కానీ, చూపే లేనప్పుడు కళ్లద్దాలను వినియోగించే పరిస్థితి ఉండదు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషకున్న ప్రాధాన్యత తగ్గదు. కేవలం మాట్లాడుకోవడమే కాదు, ప్రభుత్వ పాలన మొదలు అన్ని విభాగాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలి. అందుకు పాలకులు ప్రత్యేక చొరవ చూపాలి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో స్థానికభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు పరిస్థితులన్నీ సామాన్యులకు అర్థమవుతాయి’అని వివరించారు. దేశంలో మహిళా అక్షరాస్యత పెరుగుతోందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లిష్ తప్పనిసరైందని, కాని స్థానిక మాధ్యమంలో చదువుకున్నవారే గొప్ప వ్యక్తులయ్యారని పేర్కొన్నారు. మహిళలదే రాజ్యం: ప్రాధాన్యతారంగాల్లో మహిళల పాత్ర కీలకమవుతోందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇటీవల ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పతకాలు సాధించినవారిలో మహిళలే అత్యధికులని, ఫార్చ్యూన్ 500 కంపె నీల్లో మహిళలే సీఈవోలుగా ఉన్నారని, వారి సారథ్యంలోని కంపెనీలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. మహి ళ అక్షరాస్యురాలైతే సమాజమే మారిపోతుందని, అందులో భాగంగా నరేంద్రమోదీ ప్రభుత్వం మహిళాభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సూచన మేరకు 1924 సంవత్సరంలో కోఠిలో మహిళా కళాశాల ఏర్పాటైందని, ఇది త్వరలో శత వసంతాలు పూర్తి చేసుకోబోతోందన్నారు. ఈ కళాశాల విశ్వవిద్యాలయంగా మారే అవకాశం కూడా ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. కోఠి మహిళా కాలేజీలో చదివిన వారంతా ఉన్నత శిఖరాలు అధిరోహించారని, స్నాతకోత్సవానికి హాజరు కావడానికి కారణాన్ని పేర్కొంటూ తన కూతురు కూడా ఇదే కాలేజీలో పట్టా అందుకుందన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రోజారాణి తదితరులు పాల్గొన్నారు. -
స్నాతకోత్సాహం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఐఐటీ హైదరాబాద్ ఏడో స్నాతకోత్సవం ఆదివారం కందిలోని ఐఐటీహెచ్ ప్రాంగణంలో సందడిగా సాగింది. ఐఐటీహెచ్ పదో వసంతంలోకి అడుగు పెట్టడంతో విద్యార్థులు, సిబ్బంది ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పట్టా సర్టిఫికెట్లు అందుకునేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పండుగ వాతావరణం కనిపించింది. స్నాతకోత్సవానికి హాజరైన విద్యార్థులు, బోధన సిబ్బంది, అతిథులు భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులు ఇక్కత్ డిజైన్‌లో రూపొందించిన జకార్డ్ వస్త్రాలు ధరించారు. బీటెక్, ఎమ్మెస్సీ, ఎంటెక్, ఈఎండీఎస్, ఎండీఈఎస్, ఎంఫిల్, ఎంఎస్, పీహెచ్డీ తదితర కోర్సులకు సంబంధించి మొత్తం 566 మంది విద్యార్థులు స్నాతకోత్సవంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ యూబీ దేశాయ్ చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు. పట్టాలను అందుకునేందుకు విద్యార్థులు క్రమశిక్షణతో బారులు తీరడం ఆకట్టుకుంది. పట్టాలు అందుకున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులు, స్నేహితులు అభినందనల్లో ముంచెత్తారు. క్యాంపస్‌ను వీడుతున్న విద్యార్థులు తమ స్నేహితులతో జ్ఞాపకాలను పదిలపరుచుకునేందుకు సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ కేరింతలు కొట్టారు. బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనిబరిచిన నలుగురు విద్యార్థులకు రాష్ట్రపతి కోవింద్ బంగారు పతకాలు ప్రదానం చేశారు. బంగారు పతకం అందుకున్న వారిలో వికారాబాద్‌కు చెందిన కొడుగుంట స్నేహారెడ్డి అనే విద్యార్థినికి ఓ ఐటీ కంపెనీలో కోటి రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగం వచ్చినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ప్రముఖుల రాకతో సందడి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరవుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గవర్నర్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తదితరులు రాష్ట్రపతికి హెలిప్యాడ్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ యూబీ దేశాయ్ నేతృత్వంలోని అధ్యాపక బృందం.. రాష్ట్రపతి దంపతులో పాటు అతిథులను వేదిక వరకు ఊరేగింపుగా తోడ్కొని వచ్చాయి. ఐఐటీహెచ్ పాలక మండలి చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేయగా, ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దేశాయ్ ప్రగతి నివేదిక చదివారు. అతిథులకు ప్రొఫెసర్ దేశాయ్ జ్ఞాపికను అందజేయగా, రాష్ట్రపతికి ఐఐటీ అసిస్టెంట్ చంద్రశేఖర్ రూపొందించిన ప్రత్యేక మెమెంటోను అందజేశారు. ఇందులో సిలికాన్‌తో తయారు చేసిన ప్రత్యేక చిప్‌ను అమర్చి, ఐఐటీ ఫొటోలు, వివరాలను నమోదు చేశామని ప్రొఫెసర్ దేశాయ్ రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. లోనికి వచ్చే వారిని విస్తృతంగా తనిఖీల అనంతరం అనుమతించారు. స్నాతకోత్సవానికి జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీ యాదవ్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జేసీ నిఖిల, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు మనోహర్‌గౌడ్ తదితరులు హాజరయ్యారు. -
ఆరుగురు రాష్ట్రపతులు ఇక్కడి విద్యార్థులే
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆరుగురు రాష్ట్రపతులను అందించిన ఘనత మద్రాసు యూనివర్సిటీకే సొంతమని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. మద్రాసు వర్సిటీ 160వ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించగా రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థుల్లో మూడింట ఒకవంతు అమ్మాయిలుండటంపై కోవింద్ మాట్లాడుతూ ఒక అమ్మాయిని చదివిస్తే రెండు కుటుంబాలను చదివించినట్లేనన్నారు. ‘ మాజీ రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి, ఆర్ వెంకట్రామన్, కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాం.. వీరంతా ఇక్కడ చదువుకున్న వారే. తొలి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి ఈ వర్సిటీ విద్యార్థే. నోబెల్ బహుమతులు అందుకున్న సీవీ రామన్, సుబ్రమణియన్ చంద్రశేఖర్‌లు సైతం ఇక్కడే చదువుకున్నారు. ఈ వర్సిటీలో విద్యనభ్యసించిన సుబ్బారావు, పతంజలి శాస్త్రిలు ప్రధాన న్యాయమూర్తులుగా ఎదిగారు. ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, సరోజినీనాయుడు, సీ సుబ్రమణియన్‌లు కూడా వర్సిటీకి పేరు తెచ్చినవారే. ఇంతటి పేరు ప్రఖ్యాతులు, ఘనత వహించిన విశ్వవిద్యాలయమిది’ అని కోవింద్ అన్నారు. స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్ పురోహిత్ పాల్గొన్నారు. -
సమాజ హితాన్ని కోరండి
కర్నూలు(హాస్పిటల్): ధనార్జనే ధ్యేయం కాకుండా సమాజ హితాన్ని కోరాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ సి. వెంకటేశ్వరరావు వైద్యులు, వైద్య విద్యార్థులకు పిలుపునిచ్చారు. కర్నూలు మెడికల్ కళాశాల 2012 బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవాన్ని శనివారం కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 200 మెడికల్ సీట్లున్న ఏకైక కళాశాల కేఎంసీ మాత్రమేనన్నారు. ఈ కళాశాలకు దేశంలోనే ప్రత్యేకత ఉందని, ఇందులో అభ్యసించడం అదృష్టమన్నారు. గతంతో పోల్చితే వైద్యవిద్యలో సాంకేతికంగా చాలా మార్పులు వచ్చాయన్నారు. ఒక విధంగా ఇది విద్యార్థులు, అధ్యాపకుల మధ్య కాస్త దూరం పెంచిందన్నారు. ఇప్పటి విద్యార్థులు ఎక్కువ శాతం సాంకేతికతపై ఆధారపడుతున్నారన్నారు. ఈ కారణంగా చాలా మందిలో నైతికత లోపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజీ జీవితంలో రోగులు వేగవంతమైన చికిత్స కోరుకుంటున్నారని, ఇందుకు తగ్గట్టు వైద్యులు విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. రోగుల ఇబ్బందులు పూర్తిగా తెలుసుకుని వైద్యం చేయాలని సూచించారు. అనంతరం రిటైర్డ్ డీఎంఈఎస్ఏ సత్తార్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. భాస్కర్ మాట్లాడారు. చివరగా వివిధ సబ్జెక్టుల్లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు పతకాలు, సర్టిఫికెట్లు, స్నాతకోత్సవ పట్టాలను అతిథులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ జీఎస్ రాంప్రసాద్, పెద్దాసుపత్రి, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్లు పి. చంద్రశేఖర్, నరేంద్రనాథ్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీహరి అందజేశారు. గోల్డ్‌మెడల్ సాధించిన వారు బి. మేఘనారెడ్డి, 2. సి. ప్రవల్లిక, 3. కె. జయసత్య(పీడియాట్రిక్స్), ఎ. కావ్యలహరి(గైనిక్, ఫార్మకాలజి, అనాటమి, ఫార్మకాలజి), జి. వైష్ణవి(జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరి, అన్నపూర్ణమ్మ మెమోరియల్ మెడల్), యు. శివ(ఈఎన్టీ, కమ్యూనిటీ మెడిసిన్, ఈ. శ్రీనివాసులు రెడ్డి మెమోరియల్ మెడల్ ), ఎన్. సాయిచరిత(ఆఫ్తమాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, పాలుట్ల మహాలక్ష్మమ్మ మెమోరియల్ మెడల్), యాస్మిన్ షేక్(ఫార్మకాలజీ, ఫిజియాలజీ), ఎ. సాహితి, జి.సుమాంజలి(మైక్రోబయాలజి), కోనేటి శ్రీదేవి(బయోకెమిస్ట్రీ, సుబ్బారెడ్డి మెమోరియల్ మెడల్), కేబీ. నవనీత్యాదవ్(బయోకెమిస్ట్రీ, ముక్కామల ఈశ్వరరెడ్డి మెమోరియల్ మెడల్). -
ఉగ్రవాదులను ఎదిరించి స్నాతకోత్సవం
ఇస్తాంబుల్: సిరియాలో ఉగ్రవాదులు సాగిస్తున్న ఆగడాలకు ఆ దేశానికి చెందిన వేలాదిమంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోతున్నారన్న విషయం తెలిసిందే. అయితే అదే సిరియాలో ఓ మహిళ ఉగ్రవాదులను ఎదిరించి ఓ మోడల్ స్కూల్ నడపడమే కాదు.. వారి హెచ్చరికలను బేఖాతరు చేస్తూ స్నాతకోత్సవాన్ని కూడా నిర్వహించి, వార్తల్లో నిలిచింది. రానియా కిసార్... సిరియన్–అమెరికన్ మహిళ. అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ పెత్తనమున్న ఆ ప్రాంతంలో ఏ పనిచేయాలన్నా వారి అనుమతితోనే చేయాల్సి ఉంటుంది. అయితే వారిని ఎదిరించి, పాఠశాలను ప్రారంభించిన కిసార్‌కు.. ఎన్నోసార్లు ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు ఎదురయ్యాయి. అయితే ఆమె ఏమాత్రం బెదరకుండా తనపని తాను చేసుకుపోయింది. తాజాగా.. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థులతో స్నాతకోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుసుకున్న మిలిటెంట్లు మరోసారి కిసార్‌ను బెదిరించారు. స్నాతకోత్సవం జరుపుకొంటే తమకేమీ అభ్యంతరం లేదుకానీ.. వేడుకలో ఎటువంటి ఆటపాటల వంటివి ఉండకూడదని హెచ్చరించారు. అయినా అవేవీ లెక్కచేయని కిసార్.. స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. విద్యార్థులు ఒక్కొక్కరుగా వేదికపైకి వచ్చి.. పట్టాను, ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్న సమయంలో స్వయంగా తానే గొంతువిప్పింది. స్నాతకోత్సవం సమయంలో అమెరికా వర్సిటీల్లో పాడే గీతాన్ని ఆలపించింది. ఈ కార్యక్రమానికి ఉగ్రవాదుల కూడా హాజరైనా ఏమీ చేయలేకపోయారు. కార్యక్రమం అనంతరం కిసార్ మాట్లాడుతూ... ‘వాళ్లు వారి పెత్తనాన్ని చాటుకోవాలని ప్రయత్నించారు. కానీ ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే నేను చేస్తున్నది తప్పు కాదు. అటువంటప్పుడు నేనెవరికీ భయపడాల్సిన అవసరం కూడా లేద’ని పేర్కొంది. -
ఘనంగా గీతం వర్శిటీ స్నాతకోత్సవం