చదువుకి తగ్గ సంస్కారం ఉంటే అది హుందాగా, గౌరవప్రదంగా ఉంటుంది. ఓ రేంజ్‌లో చదవుకుని చదువుకోని వాడి కంటే దారుణంగా దిగజారి ప్రవర్తిస్తే.. చూసే వాళ్లకే ఛీ అనిపించేంత అసహ్యంగా ఉంటుంది.
ఎవరైనా తప్పు చేస్తే సరిచేసి చెప్పే స్థాయిలో ఉండి వీధి పోకిరిలా ప్రవర్తిస్తే.. అందురు చులకనగా చూడటమే గాదు ఆ వ్యక్తికి విలువుండదు. ఆ విద్యార్థికి చదువు చెప్పిన గురువులు సైతం తలదించుకోవడమే గాదు, వారిని కూడా తిట్టుకుంటారు కూడా. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
This is so embarrassing. pic.twitter.com/PsE0hLOUTT
— Ian Miles Cheong (@stillgray) June 22, 2023
వీడియోలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ అందుకోవడానికి వరుసగా విద్యార్థినులు వెళ్తున్నారు. అక్కడ ప్రోఫెసర్‌లు, మీడియా అంతా ఉన్నారు. అందరి ముందు ఓ అమ్మాయి ఇబ్బందికరమైన రీతిలో ప్రవర్తించింది. అక్కడున్న ప్రోఫెసర్‌లు సైతం ఆమె తీరుని చూసి కంగుతిన్నారు. ఆ అమ్మాయి తన ముందున్న గ్రాడ్యుయేషన్ ప్రజంటేషన్ ను దౌర్జన్యంగా లాక్కుని అక్కడున్న వారిని ఖతారు చేయకుండా మైక్ తీసుకుని తన ధోరణిలో తాను మాట్లాడేసి అక్కడ నుంచి వెళ్లిపోయింది. అయితే దాని వెనక ఉన్న కథ ఇది అంటూ మరో వీడియో విడుదల చేసింది. వర్ణ వివక్ష చూపించినందుకే తాను అలా ప్రవర్తించానంటూ చెప్పుకొచ్చింది.
Backstory: This admin was cutting off Black students from saying their name & major. She snatched the mic from this young lady before she finished her name, and she took her moment back 🤷🏽♀️
— ✯ (@featurespice) June 22, 2023
pic.twitter.com/jY6DauZaZI
అక్కడున్న వారంతా ఆ ఘటన నుంచి తేరుకోవడానికే చాలా సమయం పట్టింది. అక్కడున్నవారంతా ఏం జరుగుతుందో అర్థం గాక కాస్త గందరగోళానికి గురయ్యారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ప్రోఫెసర్లు ఆమెకు చదువు సరిగా చెప్పమా? లేదా అన్నట్లు ప్రోఫెసర్లు షాక్‌లో ఉన్నారని ఒకరు, ఆమె గ్రాడ్యేయేట్ పూర్తి చేయలేకపోయిందేమో కాబోలు అని మరోకరు సెటైర్లు వేస్తూ ట్వీట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment