degree certificate
-
కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: ప్రధాని డిగ్రీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు షాకిచ్చింది సుప్రీంకోర్టు. ప్రధాని డిగ్రీకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ హైకోర్టు పరువు నష్టం చర్యలు తీసుకోకుండా స్టే విధించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ప్రధాని డిగ్రీకి సంబంధించి తమ యూనివర్సిటీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు మరో ఆప్ నేత సంజయ్ సింగ్‌లపై గుజరాత్ యూనివర్సిటీ రిజిష్ట్రార్ పీయూష్ పటేల్ పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మధ్యంతర స్టే విధించాల్సిందిగా మొదట గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించగా ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు గుజరాత్ హైకోర్టులో విచారణ దశలో ఉన్నందున దీనిపై తాము ఎటువంటి నోటీసులు ఇవ్వలేమని చెబుతూ సంజీవ్ ఖన్నా, ఎస్విఎన్ భట్టిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అరవింద్ కేజ్రీవాల్, గుజరాత్ యూనివర్సిటీ హైకోర్టుకు వివరణ ఇవ్వాలని తెలిపింది. అంతకు ముందు ప్రధాని డిగ్రీపై వ్యంగ్యంగానూ అవమానకరంగానూ వ్యాఖానించినందుకు వీరిరువురికీ గుజరాత్ మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టును ఆశ్రయించగా కేజ్రీవాల్‌కు అక్కడ కూడా చుక్కెదురైంది. పరువు నష్టం కేసు ట్రయల్‌పై మధ్యంతర స్టే విధించాలన్న వారి రివిజన్ అప్లికేషన్‌ను సెషన్స్ కోర్టు కూడా తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టులో ఆగస్టు 29న ఈ కేసు విచారణకు రానుంది. Supreme Court refuses to grant relief to Delhi’s Chief Minister Arvind Kejriwal in the criminal defamation case filed by the Gujarat University over his comments in connection with the Prime Minister’s degree. Supreme Court notes that Kejriwal’s plea to stay the trial is pending… pic.twitter.com/oPUFC3pR2J — ANI (@ANI) August 25, 2023 ఇది కూడా చదవండి: G20 Summit: ఢిల్లీలో మూడ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు -
ఛీ!..గ్రాడ్యుయేషన్ డిగ్రీ అందుకుంటూ..మరీ ఇంత చీప్‌గా..!వీడియో వైరల్
చదువుకి తగ్గ సంస్కారం ఉంటే అది హుందాగా, గౌరవప్రదంగా ఉంటుంది. ఓ రేంజ్లో చదవుకుని చదువుకోని వాడి కంటే దారుణంగా దిగజారి ప్రవర్తిస్తే.. చూసే వాళ్లకే ఛీ అనిపించేంత అసహ్యంగా ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే సరిచేసి చెప్పే స్థాయిలో ఉండి వీధి పోకిరిలా ప్రవర్తిస్తే.. అందురు చులకనగా చూడటమే గాదు ఆ వ్యక్తికి విలువుండదు. ఆ విద్యార్థికి చదువు చెప్పిన గురువులు సైతం తలదించుకోవడమే గాదు, వారిని కూడా తిట్టుకుంటారు కూడా. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. This is so embarrassing. pic.twitter.com/PsE0hLOUTT — Ian Miles Cheong (@stillgray) June 22, 2023 వీడియోలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ అందుకోవడానికి వరుసగా విద్యార్థినులు వెళ్తున్నారు. అక్కడ ప్రోఫెసర్లు, మీడియా అంతా ఉన్నారు. అందరి ముందు ఓ అమ్మాయి ఇబ్బందికరమైన రీతిలో ప్రవర్తించింది. అక్కడున్న ప్రోఫెసర్లు సైతం ఆమె తీరుని చూసి కంగుతిన్నారు. ఆ అమ్మాయి తన ముందున్న గ్రాడ్యుయేషన్ ప్రజంటేషన్ ను దౌర్జన్యంగా లాక్కుని అక్కడున్న వారిని ఖతారు చేయకుండా మైక్ తీసుకుని తన ధోరణిలో తాను మాట్లాడేసి అక్కడ నుంచి వెళ్లిపోయింది. అయితే దాని వెనక ఉన్న కథ ఇది అంటూ మరో వీడియో విడుదల చేసింది. వర్ణ వివక్ష చూపించినందుకే తాను అలా ప్రవర్తించానంటూ చెప్పుకొచ్చింది. Backstory: This admin was cutting off Black students from saying their name & major. She snatched the mic from this young lady before she finished her name, and she took her moment back 🤷🏽♀️ pic.twitter.com/jY6DauZaZI — ✯ (@featurespice) June 22, 2023 అక్కడున్న వారంతా ఆ ఘటన నుంచి తేరుకోవడానికే చాలా సమయం పట్టింది. అక్కడున్నవారంతా ఏం జరుగుతుందో అర్థం గాక కాస్త గందరగోళానికి గురయ్యారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ప్రోఫెసర్లు ఆమెకు చదువు సరిగా చెప్పమా? లేదా అన్నట్లు ప్రోఫెసర్లు షాక్‌లో ఉన్నారని ఒకరు, ఆమె గ్రాడ్యేయేట్ పూర్తి చేయలేకపోయిందేమో కాబోలు అని మరోకరు సెటైర్లు వేస్తూ ట్వీట్లు చేశారు. (చదవండి: ఆడపిల్ల ఉన్న తండ్రి అంటే ఏమిటో? దశరథుని మాటల్లో..) -
కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌కు అహ్మదాబాద్ కోర్టు నోటీసులు.. కారణం ఇదే..
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివాదంపై కేజ్రీవాల్‌కు మరోసారి షాక్ తగిలింది. ఈ వివాదంపై తాజాగా కేజ్రీవాల్ సహా ఆప్ ఎంపీ సంజయ్‌కు అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీటిపై మే 23వ తేదీలోపు సమాధాని ఇవ్వాలన్ని నోటీసుల్లో పేర్కొంది. వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ డిగ్రీ అర్హతను ప్రశ్నిస్తూ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ గుజరాత్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అయితే, వారు ఉద్దేశపూర్వకంగా గుజరాత్ యూనివర్సిటీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారని వర్సిటీ రిజిస్ట్రార్ పీయూష్ పటేల్ క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీటిపై మే 23లోగా స్పందించాలని ఆదేశిస్తూ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జయేశ్‌భాయ్ చోవాటియా ఆదేశించారు. ఇక, అంతకుముందు.. ప్రధాని మోదీ డిగ్రీపై కేజ్రీవాల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్స్ ఉంటే.. వర్సిటీ ఎందుకు బయటపెట్టడం లేదు. ఫేక్ సర్టిఫికెట్ కాబట్టే వర్సిటీ బయటపెట్టడం లేదేమో అని అన్నారు. ప్రధాని తమ విద్యార్థి అని ఢిల్లీ, గుజరాత్ వర్సిటీలు చెప్పుకునేవి కదా! అంటూ కామెంట్స్ చేశారు. ఇక, ఆప్ ఎంపీ సంజయ్.. ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదని వర్సిటీ నిరూపించిందన్నారు. -
నకిలీ సర్టిఫికెట్ ముఠా గుట్టురట్టు
సాక్షి, ముంబై: భారత ఆర్థిక రాజధాని ముంబైలో నకిలీ సర్టిఫికేట్లు, డిగ్రీ పట్టాలను తయారు చేస్తున్న రాకెట్ బయటపడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బోరివలి ప్రాంతంలోని ఒక భవనంపై ఆకస్మికంగా దాడిచేశారు. దాడిచేసిన ప్రదేశంలో అనేక యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికేట్లు, డిగ్రీపట్టాలు కుప్పలుగా ఉండటాన్ని కనుగొన్నారు. ఈ క్రమంలో.. అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ స్థానిక న్యాయస్థానం ఎదుట హజరుపర్చారు. వీరిని విచారించిన న్యాయస్థానం నిందితులకు ఈనెల 27 వరకు పోలీసు కస్టడికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ముంబై డీసీపీ సంగ్రామ్ నిషాందర్ ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: ప్రేయసి కళ్లలో ఆనందం కోసం ప్రియుడి కిడ్నీ దానం.. ట్విస్ట్ ఏంటంటే -
బతికుండగానే చంపేశారు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ‘అర్జున్ సురవరం’ సినిమా వచ్చింది. నిరుద్యోగుల డిగ్రీ సర్టిఫికెట్లను వారికి తెలియకుండా సేకరించి, బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకుంటారు. ఈలోగా లోన్ కట్టలేదంటూ బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులొచ్చి అరెస్టు చేస్తారు. బాధితుడైన హీరో.. ఆ స్కాంను బయటపెట్టడంతో కథ సుఖాంతమవుతుంది. సరిగ్గా హైదరాబాద్‌లో ఇదే తరహాలో ఓ ఘటన జరిగింది. తమ తోటి వ్యాపార భాగస్వామి తండ్రిని బతికుండగానే చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, వారి ఆస్తినే తాకట్టు పెట్టి రూ.16 కోట్లు రుణం తీసుకున్నారు. వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, ఆస్తులకు సంబంధిం చిన డాక్యుమెంట్లు నేర స్వభావం ఉన్నవారి చేతిలో పడితే చిక్కులు ఎదురవుతాయనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. సీన్ కట్ చేస్తే..: బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 5లో రెన్‌లైఫ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఉంది. ఇది రక్తం నుంచి తీసిన సీరమ్, అల్బుమిన్ తదితరాలను సేకరించి విక్రయిస్తుంది. 2017లో ఈ కంపెనీని ఆరుల్ ప్రకాశ్, మహమ్మద్ అబ్దుల్ అజీజ్‌లు స్థాపించారు. వీరిద్దరూ కూడా కంపెనీ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. తర్వాత కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన విజయ్.. మైసూర్ రాఘవేంద్ర మూడో డైరెక్టర్‌గా చేరాడు. రాఘవేంద్ర కుటుంబం పేరు మీద దక్షిణ బెంగళూరులోని కెంగెరి గ్రామంలో 3.3 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై ఆరుల్, అజీజ్‌లు కన్నేశారు. రాఘవేంద్రకు తెలియకుండా ఈ భూమి నకిలీ సేల్ డీడ్ సంపాదించారు. జానకీ రమాశర్మ అనే ఫైనాన్సియల్ కన్సల్టెంట్ సాయంతో సదరు భూమిని తనఖాగా ఉంచి రుణం కోసం తొలుత ఎస్బీఐ సైఫాబాద్ శాఖలో రుణం కోసం యత్నించారు. అక్కడ యత్నం బెడిసికొట్టింది. ఈసారి మరింత పకడ్బందీగా మహబూబ్‌గంజ్ ఎస్బీఐ బ్రాంచ్‌లో రాఘవేంద్ర పేరిట రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. నకిలీ డెత్ సర్టిఫికెట్.. డైరెక్టర్ రాఘవేంద్ర తండ్రి బతికుండగానే చనిపోయినట్లు, నకిలీ డెత్ సర్టిఫికెట్, నకిలీ ఫొటోలు, పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలు సంపాదించారు. రుణం కోసం దరఖాస్తు పత్రాలకు జతచేసిన వివరాలు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లోని వివరాలతో పొంతనలేదు. అయినా వాటిని అలాగే సమర్పించారు. ఈ పత్రాలను సరిగ్గా పరిశీలించకుండానే.. మహబూబ్‌గంజ్ బ్రాంచ్ ఆర్ఎంఎంఈ పవన్‌కుమార్, చీఫ్ మేనేజర్ జే.నాగేశ్వరశర్మ, బ్యాంకు మేనేజర్ శశిశంకర్లు రూ.16 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాఘవేంద్ర అవాక్కయ్యాడు. తన తండ్రి చనిపోయాడంటూ పత్రాలు సృష్టించారని తెలుసుకుని కంగుతిన్నాడు. ఈ విషయంపైతానే స్వయంగా దర్యాప్తు చేశాడు. బ్యాంకుకు వచ్చి లోను మంజూరు చేసినఫైళ్లలో ఫొటో, సంతకం తనవి కావని నిరూపించాడు. దీంతో నాలుక్కరుచుకున్న ఎస్బీఐ ఉన్నతాధికారులు లోను ఖాతాను నిరర్ధక ఆస్తి (నాన్‌పెర్ఫామింగ్ అసెట్)గా గతేడాది మార్చి 8న ప్రకటించారు. బ్యాంకు అంతర్గత విచారణలో విభాగాధిపతి ధనార్జనరావు సహా పలువురు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని గుర్తించారు. అనంతరం సీబీఐకి ఫిర్యాదు చేశారు. తమ అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని కోరారు. దీంతో ఐపీసీలోని పలు సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గురువారం రాత్రి నిందితులుగా ఉన్న ఎస్బీఐ అధికారులు, రెన్‌లైఫ్ నిందితుల ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించి పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకుంది. -
ఇంజనీరింగ్ 75,000, లా పట్టా 2,00,000
ముంబై: కాలేజీకి వెళ్లే అవసరం లేదు..పరీక్షలు రాయాల్సిన పని అంతకన్నా లేదు.. రూ.75వేలు పెడితే ఇంజినీరింగ్ డిగ్రీ, రూ.2 లక్షలు మనవి కావనుకుంటే లా డిగ్రీ చేతికి అందుతుంది. ఒక్క 45 రోజులు ఓపిక పడితే ఏకంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు చేతికి వచ్చేస్తాయి. న్యూస్18 రహస్య ఆపరేషన్‌లో ఈ చీకటి దందా వెలుగు చూసింది. 2016లో పూర్తి చేసినట్లుగా బీఏ డిగ్రీ పట్టా ఇచ్చేందుకు న్యూస్18 మీడియా వ్యక్తులతో నవీ ముంబైలోని కోపర్ఖైరానీ ప్రాంతానికి చెందిన కీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి చెందిన ఏజెంట్ స్వప్నిల్ గైక్వాడ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ డిగ్రీని యూజీసీ, ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ప్రముఖ వర్సిటీలు యశ్వంత్రావ్ చవాన్ యూనివర్సిటీ నుంచి గానీ సోలాపూర్ యూనివర్సిటీ నుంచి గానీ ఇస్తానన్నాడు. ఇందుకు 45 రోజుల సమయం పడుతుందని, 30 రోజుల తర్వాత డిగ్రీపట్టా జిరాక్స్ ప్రతులు, మరో 15 రోజుల తర్వాత ఒరిజినల్ పత్రాలను అందజేసేందుకు అంగీకరించాడు. ‘వర్సిటీకి గానీ, క్లాసులకు గానీ వెళ్లాల్సిన అవసరం లేదు. 2016లో డిగ్రీ పూర్తి చేసినట్లుగానే సంబంధిత పత్రాల్లో ఉంటుంది. వర్సిటీ రికార్డుల్లో కూడా ఇవి జత పరిచి ఉంటా యి. ఇవి ఎక్కడా తనిఖీల్లో పట్టుబడేం దుకు అవకాశం లేదు’ అని అతడు భరోసా ఇచ్చాడు. ఇంజినీరింగ్, ఎల్ఎల్బీతోపాటు వివిధ వర్సిటీల్లో పీహెచ్డీ చేసినట్లుగా కూడా సర్టిఫికెట్లు ఇస్తాం కానీ, ఫీజులు వేర్వేరుగా ఉంటాయన్నాడు. మూడేళ్ల ఇంజినీరింగ్ పట్టాకైతే రూ.75 వేలు, ఇందులో సగం ముందుగా, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చాక మిగతా సొమ్ము ఇవ్వాల్సి ఉంటుంది. పీహెచ్డీ డిగ్రీలైతే ఆంధ్రా వర్సిటీ నుంచి ఇస్తామని చెప్పాడు. థీసిస్, సినాప్సిస్ కూడా అందజేస్తానన్నాడు. యూపీలోని ఓ వర్సిటీ నుంచి పొందినట్లుగా ఉండే లా డిగ్రీకి రూ.2 లక్షలు ఖర్చవుతుందని గైక్వాడ్ చెప్పాడు. వర్సిటీల సంఖ్య పెరగడంతో తమ మార్కెట్ కూడా పెరిగిందని గైక్వాడ్ అన్నాడు. ప్రతి వర్సిటీకి టార్గెట్లున్నాయి. వాటి లక్ష్యం నెరవేరేందుకు మాలాంటి వారిని అవి ఆశ్రయిస్తున్నాయి. వర్సిటీలకు అడ్మిషన్లు కావాలి, మాకేమో డబ్బులు కావాలి’ అని తెలిపాడు. ఈ అంశంపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి పోఖ్రియాల్ ప్రకటించారు. -
పట్టా సర్టిఫికెట్ల స్వీకరణ
మెదక్ రూరల్: తిమ్మాయిపల్లి దళిత, గిరిజనుల నుంచి పట్టా సర్టిఫికెట్లను అధికారులు స్వీకరిస్తున్నారు. ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలకు అధికారులు స్పందించారు. అనంతసాగర్ భూముల్లో సీలింగ్‌యాక్టులో భాగంగా పట్టాలు పొందిన హక్కుదారులకు జరిగిన అన్యాయాన్ని ‘సాక్షి’ ఎత్తిచూపిన విషయం విదితమే. కాగా సోమవారం వీఆర్‌ఓతో పాటు పలువురు రెవెన్యూ సిబ్బంది గ్రామానికి చేరుకుని సుమారు 30 మంది లబ్ధిదారుల నుంచి పట్టాసర్టిఫికెట్లతో పాటు పాస్‌బుక్కులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ నగేష్ మాట్లాడుతూ అర్హులందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. -
'నా ఇంజనీరింగ్ పట్టా బోగస్ కాదు'
ముంబై: నకిలీ డిగ్రీ పట్టాను ఆధారంగా చూపి మంత్రి పదవి పొందారన్న ఆరోపణలపై మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే వివరణ ఇచ్చారు. సోమవారం ముంబైలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 'పలు వార్తా ఛానెళ్లు ప్రసారం చేసినట్లు నా గ్రాడ్యుయేషన్ పట్టా నకిలీది కాదు. సత్యప్రమాణకంగా నిజమైందే. పుణేలోని ధ్యానేశ్వరీ విద్యాపీఠంలోనే నేను బీఈ ఎలక్ట్రానిక్స్ చదివాను. 1980 నుంచి 1984 వరకు నేనక్కడ చదువుకున్నా. అయితే అప్పట్లో మా కోర్సుకు ప్రభుత్వ గుర్తింపు ఉండేదికాదు. దూర విద్యావిధానం కిందికి వచ్చే కోర్సులో చేరేముందు ఈ విషయాన్ని టీచర్లు కూడా మరోసారి గుర్తుచేశారు. గుర్తింపులేని డిగ్రీ చదవాలో లేదో మమ్మల్నే నిర్ణయించుకోమని చెప్పారు కూడా. అప్పట్లో ధ్యానేశ్వరీ విద్యామందిర్ ప్రవేశపెట్టిన ఈ కోర్సుపై కొందరు కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పు కూడా వారికే అనుకూలంగా వచ్చింది. అందుకే మా డిగ్రీ సర్టిఫికేట్లు చెల్లకుండా పోయాయి. కానీ నేను కోర్సు చదివింది మాత్రం నిజం' అంటూ తన విద్యార్హతపై వివరణ ఇచ్చారు వినోద్ తావ్డే. కాగా, తావ్ డే తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని మహారాష్ట్ర ప్రతిపక్షనేత రాధాకృష్ణ పాటిల్ డిమాండ్ చేశారు. నకిలీ డిగ్రీ పట్టా కేసులో ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ జైలు పాలైన నేపథ్యంలో అన్నిరాష్ట్రాల్లో మంత్రుల విద్యార్హతలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.