
పట్టా సర్టిఫికెట్ల స్వీకరణ
మెదక్ రూరల్: తిమ్మాయిపల్లి దళిత, గిరిజనుల నుంచి పట్టా సర్టిఫికెట్లను అధికారులు స్వీకరిస్తున్నారు. ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలకు అధికారులు స్పందించారు. అనంతసాగర్ భూముల్లో సీలింగ్‌యాక్టులో భాగంగా పట్టాలు పొందిన హక్కుదారులకు జరిగిన అన్యాయాన్ని ‘సాక్షి’ ఎత్తిచూపిన విషయం విదితమే. కాగా సోమవారం వీఆర్‌ఓతో పాటు పలువురు రెవెన్యూ సిబ్బంది గ్రామానికి చేరుకుని సుమారు 30 మంది లబ్ధిదారుల నుంచి పట్టాసర్టిఫికెట్లతో పాటు పాస్‌బుక్కులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ నగేష్ మాట్లాడుతూ అర్హులందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.