Lands
-
తీరంలో ‘భూ’ అలజడి!
ఉలవపాడు: ‘మా ఊరు దగ్గరలో పరిశ్రమ వస్తే సొంత ఇంట్లో ఉంటూ పని చేసుకోవచ్చు. పరిశ్రమ కోసం మా ఊరే లేకుండా చేస్తే ఎలా..? మా ఊరే లేకుండాపోయిన తర్వాత ఆ పరిశ్రమ వస్తే ఎంత..? రాకపోతే ఎంత...? ఉన్న భూమిని సాగు చేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఆ పరిశ్రమ మాకు వద్దు బాబోయ్...’ అంటున్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండల తీరప్రాంత ప్రజలు. ఉలవపాడు మండలంలో ఇటీవల కలెక్టర్ ఆనంద్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయదేవ్ పర్యటించి పరిశ్రమల ఏర్పాటుకు భూములను పరిశీలించారు. కరేడు నుంచి రామాయపట్నం వరకు తీరప్రాంత భూములు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని ప్రకటించారు. దీంతో తీర ప్రాంత గ్రామాల్లో గుబులు మొదలైంది. శుక్రవారం తీరప్రాంత మత్స్యకారులందరూ అలగాయపాలెంలో సమావేశమై పరిశ్రమలకు తమ భూములు ఇవ్వకూడదని తీర్మానించారు. పోలీసులు వచ్చి సమావేశాన్ని అడ్డుకున్నా కూడా మత్స్యకారులు ఐక్యంగా ఉంటూ తీర్మానం చేయడం గమనార్హం. అయితే, శనివారం కందుకూరుకు వచ్చిన సీఎం చంద్రబాబు ఈ నియోజకవర్గంలోనే బీపీసీఎల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, భూములు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో తీరప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుందని..బీపీసీఎల్ రిఫైనరీ కోసం ప్రధానంగా కరేడు చెరువు అనుకుని ఉన్న ఆయకట్టును తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ సమీపంలోని సపోటా, మామిడి తోటలు కూడా సేకరించే భూముల జాబితాలో ఉన్నట్లు సమాచారం. ప్రాథమికంగా కరేడు గ్రామ చెరువు నీటిని ఉపయోగించుకుని కంపెనీ నిర్మాణాలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. తమ చెరువు ఆయకట్టు కింద వరి, వేరుశనగ పండించుకుని సంతోషంగా ఉన్నామని, తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని రైతులు తెగేసి చెబుతున్నారు.కరేడుతోపాటు తీరప్రాంత గ్రామాలైన అలగాయపాలెం, టెంకాయచెట్లపాలెం, చిన్నపట్టపుపాలెం, చాకిచర్ల, పెదపట్టపుపాలెం, రామాయపట్నం, పల్లెపాలెం గ్రామాల్లో అధిక శాతం ప్రజలు సముద్ర వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆయా గ్రామాల పరిధిలోని భూములు బీపీసీఎల్ కోసం తీసుకునే జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 6వేల ఎకరాలను సేకరించనున్నట్లు తెలిసింది. భూములను తీసుకోవడంతోపాటు ఆయా గ్రామాలను ఖాళీ చేయిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కన్నతల్లి లాంటి సొంత ఊరు.. జీవనాధారమైన భూములు... తీరం వదిలి తాము ఎక్కడికి వెళ్లాలని మత్స్యకారులు భగ్గుమంటున్నారు. ఉలవపాడు మండలంలోని కొన్ని ప్రధాన గ్రామాలను లేకుండా చేసేందుకు బడాబాబులు కుట్ర పన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పరిశ్రమకు వెయ్యి ఎకరాలు సరిపోతుందని, అటవీ భూములను తీసుకుని పరిశ్రమ పెడితే తమకు ఉపాధి లభిస్తుందని, తమను తరిమేసి పరిశ్రమ పెడితే ఎలా..అని ప్రశ్నిస్తున్నారు.ఇవేమీ పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ భూములను పరిశీలిస్తున్నారు. సర్వేలు చేస్తున్నారు.భూములు లాక్కోవడానికి కుట్ర పరిశ్రమ పెట్టడానికి ఆరు వేల ఎకరాలు అవసరమా? అటవీ భూమి వెయ్యి ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది. కేవలం పేదల భూములు లాక్కోవడానికే పరిశ్రమ పేరుతో కుట్ర పన్నారు. – మిరియం శ్రీనివాసులు, 139 కులాల జేఏసీ చైర్మన్, కరేడు భూములు ఇచ్చేది లేదు బీపీసీఎల్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చేది లేదు. మండలంలో చాలా అటవీ భూములు ఉన్నాయి. పరిశ్రమల కోసం వాటిని తీసుకోవచ్చు. – వాయల అంజయ్య, అలగాయపాలెం -
కూటమి మాయ.. 460 కోట్ల భూమి 31 లక్షలకే!
సాక్షి, అమరావతి: తిరుపతిలోని శ్రీ గాలి గోపురం మఠానికి చెందిన అత్యంత విలువైన భూములను కారుచౌకగా ఆక్రమణదారులకే కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని రామానుజ సంక్షేమ సమితి చైర్మన్ డీఎస్ఎన్వీ ప్రసాదబాబు, స్వధర్మ విజ్ఞాన వేదిక కన్వీనర్ వీవీఆర్ కృష్ణంరాజు ఆరోపించారు. ఇదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం దేవదాయ భూములను కాపాడడంలో విఫలమైందన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. 1413వ సంవత్సరంలో తిరుపతిలో ఏర్పాటైన గాలి గోపురం మఠానికి ఉన్న విలువైన భూముల్లో 23 ఎకరాలు అనేక సంవత్సరాల క్రితం ఆక్రమణలకు గురయ్యాయని.. ప్రస్తుతం వాటి విలువ ఎకరం రూ.20 కోట్లు ఉంటుందన్నారు. ఈ భూముల మొత్తం విలువ సుమారు రూ.460 కోట్లు కాగా.. దానిని కేవలం రూ.31 లక్షలకే ఆక్రమణదారులకు కట్టబెట్టడానికి దేవదాయ శాఖ ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. నిజానికి.. ఈ భూముల వివాద పరిష్కారానికి 2019లో చంద్రబాబు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేయగా అది 2022 ఆక్టోబరు 10న ఇచ్చిన నివేదికలో ఎకరాకు రూ.1.35 లక్షల చొప్పున ఆక్రమణలు క్రమబద్ధీకరించాలని సూచించిందని కృష్ణంరాజు వివరించారు.అయితే, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ నివేదికను బుట్టదాఖలు చేయగా ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఇదే నివేదిక సిఫార్సులను అమలుచేయాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఈఓ కార్యాలయం ఎదురుగా సింగాలకుంట నుంచి ఇస్కాన్ రోడ్డు వరకూ విస్తరించిన ఈ ఖరీదైన భూముల రిజిస్ట్రేషన్ విలువ గజం రూ.40 వేలు ఉందని, ఇంత విలువైన భూమిని ఎకరాకు రూ.1.35 లక్షల చొప్పున ఎలా క్రమబద్ధీకరిస్తారని వారు ప్రశ్నించారు. ఆక్రమణల చెరలో 87 వేల ఎకరాలు.. ఇక చంద్రబాబు ప్రభుత్వం దేవదాయ భూములను కాపాడడంలో విఫలమైందని, ఆక్రమణలకు గురైన భూములను కారుచౌకగా క్రమబద్ధీకరించడానికి నాంది పలికిందని ప్రసాదబాబు ఆరోపించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం సర్వే నెంబర్ 233లోని ఎకరా 72 సెంట్ల భూమిని గజం కేవలం రూ.500లకే విక్రయించిందని గుర్తుచేశారు. అయితే, 2019 సెప్టెంబరులో అప్పటి సీఎం జగన్ హయాంలో టీటీడీ సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన 188 ఎకరాల భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుందన్నారు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం దేవదాయ శాఖకు ఉన్న మొత్తం నాలుగున్నర లక్షల ఎకరాల భూముల్లో 87వేల ఎకరాలు ఆక్రమణదారుల చెరలో ఉన్నాయని.. వాటిని కూడా అతితక్కువ రేట్లకే క్రమబద్ధీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రసాదబాబు ఆరోపించారు. -
పుష్పగా మారిన టీడీపీ ఎమ్మెల్యే
ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు పుష్పాను మించిపోయారు. అగ్రిగోల్డ్ ఆస్తులు తమ్ముళ్లకు అక్షయపాత్రగా మారాయి. అనాదీనంగా పడి ఉన్న ఆ సంస్థ భూముల్లోని రూ.కోట్ల విలువైన జామాయిల్ కర్రను కొల్లగొట్టేస్తున్నారు. సీఐడీ పర్యవేక్షణలో ఉన్న ఈ భూముల్లోని సంపదను స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారు. మంత్రి లోకేశ్ అనుచరుడు అక్రమ సంపాదనలో వాటా ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఈ వ్యవహారంలో తగ్గేదే లేదంటూ.. ప్రజాప్రతినిధి వర్గం తెగేసి చెప్పడంతో తమ్ముళ్ల మధ్య చిచ్చు రేగింది.సాక్షి నెల్లూరు: ప్రభుత్వ అదీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో సంపద దోచుకునేందుకు తమ్ముళ్లు పుష్పా సినిమా తరహాలో వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలు పచ్చనేతల మధ్య చిచ్చు రేపాయి. వరికుంటపాడు మండలం భాస్కరపురం రెవెన్యూ పరిధిలో అగ్రిగోల్డ్ సంస్థ భూములు ఉన్నాయి. ఆ భూముల్లోని విలువైన జామాయిల్ కర్రను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తన అనుచరులను పెట్టి అక్రమంగా నరికి స్వాహా చేస్తున్నారు. పది రోజులుగా జరుగుతున్న ఈ దందాపై ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియాల్లో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. పుష్పా తరహాలో రాత్రి పగలు తేడా లేకుండా జామాయిల్ కర్ర అక్రమ రవాణా జరుగుతున్నా.. రెవెన్యూ, పోలీ స్, సీఐడీ అధికార యంత్రాంగం కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తోంది. టీడీపీ అధినాయకత్వం కూడా పట్టీపట్టనట్లు ఉండిపోయింది. వాటా కోసం లోకేశ్ అనుచరుడు రచ్చ అగ్రిగోల్డ్ సంపదను కాపాడి బాధితులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం, అధికార యంత్రాంగం నోరు మెదపడం లేదు. దీన్ని అవకాశంగా తీసుకుని కంచే చేను మేసిన చందంగా ప్రజాప్రతినిధి తమ అనుచరుల ద్వారా ‘కర్ర’ స్కామ్‌కు పాల్పడుతున్నారు. రూ.కోట్లు విలువ చేసే కలప సంపదలో తన వాటా సంగతి ఏమిటంటూ మంత్రి లోకేశ్ అనుచురుడు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బి.వెంగళరావు (ఇతని సొంతూరు దుత్తలూరు మండలం ఏరుకొల్లు) పేచీ పెట్టి.. రచ్చ చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం కర్ర నరికే ప్రాంతం కనియంపాడు వెళ్లి మకాం పెట్టారు. ఈ విషయం తెలుసున్న ఎమ్మెల్యే అనుచరుడు మండలానికి చెందిన ఓ టీడీపీ నేతను రంగంలోకి దింపి, సమస్య లేకుండా రాజీ ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లోకేశ్ అనుచరుడు సోమవారం నేరుగా అక్రమంగా జామాయిల్ కర్ర నరికే కనియంపాడు భూముల్లోకి మరో వ్యక్తితో కలిసి కారులో వెళ్లారు. అక్కడ లోడ్ చేసి బయలు దేరేందుకు సిద్ధంగా ఉన్న లారీ ముందు దారికి అడ్డంగా కారు పెట్టాడు. తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసేందుకు కార్యాలయానికి వెళ్లి తిరిగి వచ్చే లోపు ఎమ్మెల్యే అనుచరులు కారు అద్దాలు «ధ్వంసం చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దోపిడీని ప్రశ్నించేదెవరు? ప్రజల సొత్తును అక్రమార్కులు దోచేస్తుంటే వారి ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం, పోలీసులు, సీఐడీ, రెవెన్యూ యంత్రాంగం నోరు మెదపడం లేదు. బాధితుల తరఫున ఉద్యమాలు చేసిన ప్రతిపక్ష పారీ్టలు, ప్రజా సంఘాలు మౌనవ్రతం పాటిస్తున్నాయి. చిన్న తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పే పోలీసు యంత్రాంగం కళ్లేదుటే దోపిడీ జరుగుతున్నా పట్టించుకోకపోవడం చూసి ప్రజలు మండిపడుతున్నారు.భూముల్లో రూ.50 కోట్ల సంపద అగ్రిగోల్డ్ సంస్థ డిపాజట్దార్లు నుంచి సేకరించిన నగదుతో ఉదయగిరి నియోజకవర్గంలో వరికుంటపాడు మండలం భాస్కరపురం, కనియంపాడు, తూర్పుపాళెంతో పాటు దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, సీతారామపురం, కలిగిరి మండలాల్లో 17 వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారు. అందులో దాదాపు 15 వందల ఎకరాల్లో జామాయిల్ సాగు చేశారు. ఈ భూముల్లో సాగులో ఉన్న కర్ర సంపద సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. వీటిలో ప్రస్తుతం వరికుంటపాడు మండలంలో రూ.10 కోట్లు విలువ చేసే జామాయిల్ కర్రను నరికి స్వాహా చేస్తున్నారు. -
ఉదయగిరి ఎమ్మెల్యే కర్ర సా(స్కా)ము
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం ఎమ్మెల్యేలు సహజ వనరులను దోపిడీ ఘరూ చేశారు. ఇసుక, గ్రావెల్, క్వార్ట్జ్ మెటల్‌ను దోచేస్తున్న నేతలు తాజాగా అగ్రిగోల్డ్ భూములపై కన్నేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో వందలాది ఎకరాల్లోని జామాయిల్ కర్రను అక్రమంగా నరికించి సొమ్ము చేసుకుంటున్నారు. సాక్షాత్తు ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ కార్యాలయం నుంచే అక్రమ దందా పర్యవేక్షణ జరుగుతుండడంతో పోలీస్, రెవెన్యూ యంత్రాంగం కూడా వారికి సహకరిస్తోంది. 450 ఎకరాల్లో అగ్రిగోల్డ్ జామాయిల్ తోటలుఉదయగిరి నియోజవర్గంలోని వరికుంటపాడు, కలిగిరి, దుత్తలూరు, వింజమూరు మండలాల్లో సుమారు 450 ఎకరాలు అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి. ఈ భూములను ఆ సంస్ధ బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకుంది. సంస్థ దివాలా తీయడంతో ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ భూముల్లో జామాయిల్, మామిడి, ఎర్ర చందనం, శ్రీగంధం తదితర మొక్కలు ఉన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఈ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా, అందులో ఉన్న విలువైన సంపద చోరీ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో తెలుగుదేశం నాయకులు వరికంటపాడు పంచాయతీ పరిధిలో ఉన్న భాస్కరపురం, జంగం రెడ్డిపల్లి, కనియంపాడు గ్రామాల్లో అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న దాదాపు రూ.10 కోట్లు విలువ చేసే జామాయిల్ కర్రను నరికించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పక్కా ప్రణాళికభాస్కరపురం రెవెన్యూలో 69 నుంచి 112 వరకు పలు సర్వే నెంబర్లలో సుమారు 140 ఎకరాల అగ్రిగోల్డ్ భూములు బినామీ పేర్లపై ఉన్నట్లు సమాచారం. రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా అగ్రిగోల్డ్ ఆస్తులుగా నమోదు కాలేదు. పైగా ఈ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా అవి అగ్రిగోల్డ్ సంస్థకు చెందినట్లుగా తెలిపే సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో స్థానికులకు, రెవెన్యూ అధికారులకు తప్ప మిగితా వారు ఆ భూములు గుర్తించలేరు. దీనిని ఆసరా చేసుకున్న ఒక అధికార ప్రజాప్రతినిధి రెవెన్యూ, పోలీసు అధికారులను మ్యానేజ్ చేశారు. ఎవరైనా ఈ విషయం గురించి రెవెన్యూ అధికారులను అడిగితే అవి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూములు అని చెప్పి తప్పించుకుంటున్నారు. విషయం తెలిసిన స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసుల పేరుతో భయపెడుతున్నారు.తరలుతున్న సంపదవరికుంటపాడు పంచాయతీ పరిధిలో ఉన్న అగ్రిగోల్ట్ భూముల్లో సుమారు 12,500 టన్నుల వరకు జామాయిల్ కర్ర ఉందని అంచనా. ప్రస్తుతం టన్ను జామాయిల్ రూ.8 వేలు వరకు విక్రయిస్తున్నారు. దీంతో సుమారు రూ.10 కోట్లు విలువ చేసే కర్రను గత వారం రోజుల నుంచి నరికి అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి నాలుగు ముఠాలను రప్పించి రోజువారీగా నరికిస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతలకు బెదిరింపులుఅగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ కలప నరికివేత విషయం తెలిసి వైఎస్సార్సీపీ నేత ఒకరు ప్రశ్నించగా పోలీస్ తరహాలో బెదిరింపులు వెళ్లాయి. ఈ విషయం వెలుగులోకి తెచ్చినా, అడ్డుకున్నా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయించి జైలుకు పంపిస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. తాజాగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయం నుంచే పర్యవేక్షణ జరుగుతుండడంతో పాటు పది రోజులుగా ఒక ప్రణాళిక ప్రకారం అధికారులను, నాయకులను మ్యానేజ్ చేసుకుని పక్కాగా జామాయిల్ కర్రను నరికించేసి విలువైన సంపదను దోచుకుంటున్నారు. -
కడపలో భూచోళ్లు!
కడప నగరంలో భూచోళ్లు పడ్డారు. భూ దాహంతో ‘సైకిల్ చక్రాలు’ కట్టుకుని మరీ ఊరంతా తిరుగుతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు నోరు తెరుస్తున్నారు. పట్టపగలే ప్రభుత్వ స్థలాలను చదును చేస్తూ కబ్జా చర్యలకు పదును పెడుతున్నారు. అధికారులకు మామూళ్ల మకిలీ అంటగట్టి.. ఆపై ఏంచక్కా నకిలీ డాక్యుమెంట్లతో స్థలాలను హాంఫట్ చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి కడప: కూటమి ప్రభుత్వంలోని టీడీపీ నేతలు భూ ఆక్రమణలతో చెలరేగిపోతున్నారు. ఖాళీ స్థలాలు కన్పిస్తే కబ్జాకు యత్నిస్తున్నారు. ముఖ్యంగా కడప నగరంలో ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, ఆపై రెవెన్యూ డిపార్టుమెంటును మేనేజ్ చేయడంలో తల మునకలయ్యారు. ఇలా పక్కా స్కెచ్ తో కోట్లాది రూపాయల విలువజేసే స్థలాలను కొట్టేస్తున్నారు. తాజాగా కడప నగరంలోని ద్వారకానగర్‌లో రూ.12 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమిని చదును చేశారు. ఈ ప్రాంతంలో ఇది ప్రభుత్వ భూమి అని హె చ్చరిక బోర్డును సైతం కబ్జాదారులు లెక్కచేయకుండా చదును చేసి ఆక్రమించే ప్రయత్నాలు సాగిస్తున్నారు.కడప నగరం ద్వారకానగర్‌లో రైతు బజార్ సమీపంలో నాగరాజుపల్లె పొలం సర్వే నెంబరు 71/1లో 2.52 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో రైతు బజార్ ఏర్పాటు చేయగా మరో 40 సెంట్లు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉండిపోయింది. ఈ స్థలం బుగ్గవంక ప్రొటెక్షన్ వాల్‌కు ఆనుకునే ఉంది. ఆన్లైన్లో రికార్డులల్లో అనుభవదారు పేరు ‘వాగు’అని ఇప్పటికీ వస్తోంది. కాగా ఆ స్థలంపై టీడీపీ నేతల కన్ను పడింది. జిల్లా టీడీపీ ముఖ్యనేత సన్నిహితులు స్వాహాకు ప్రణాళిక రచించారు. ప్రతిరోజు ముఖ్యనేత చుట్టు ఉండే తెలుగుతమ్ముళ్లు ఈకబ్జా వ్యవహారంలో క్రియాశీలక ప్రాత పోషించినట్లు ఆరోపణలున్నాయి.హెచ్చరిక బోర్డును లెక్కచేయని అక్రమార్కులురెవెన్యూ అధికారులు ఈ స్థలం ప్రభుత్వ భూమి...దీనిని ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడును అని హెచ్చరిక బోర్డు సైతం ఏర్పాటు చేశారు. ఇవేవి తెలుగుతమ్ముళ్లు లెక్కచేయలేదు. కాగా ఈ స్థలం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఉంది. ఈవ్యవహారం వెలుగులోకి రావడంతో సదరు నేతలు తేలుకుట్టిన దొంగలా ఉండిపోయారు. రూ.12కోట్ల విలువజేసే స్థలాన్ని కొట్టేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించి ఇది తమదేనని చదును చేసేశారు. విషయం తెలుసుకున్న ద్వారకానగర్æకాలనీ డెవెలప్మెంట్ కమిటీ వారు రెవిన్యూ, కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు. దాంతో వ్యవహారం బహిర్గతం కావడంతో అధికారులు సైతం కాస్తా అప్రమత్తమయ్యారు. కోట్లు విలువైన భూమి కాజేసేందుకు ఇప్పటికే టీడీపీ నేతలు నకిలీ డాక్యుమెంట్లు సైతం సృష్టించినట్లు సమాచారం. ఆమేరకు ఓ రెవెన్యూ అధికారితో సైతం సంప్రదించి సహాకారం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా ఓ నేతకు పీఏగా ఉన్న వ్యక్తి తలదూర్చడంతోనే సాధ్యమైందనే ఆరోపణలు లేకపోలేదు.ఇలాంటి చర్యలను ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం భూ కబ్జాలను అరికట్టేడంలో చేతులెత్తేస్తోందనే విమర్శలు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన కడప నగరంలో వార్డు సెక్రటరీ నుంచి కలెక్టర్ వరకు నిత్యం ఇక్కడే ఉంటారు. అలాంటి నగరంలోనే ప్రభుత్వ భూమిని పక్కాగా స్వాహా చేసేందుకు స్కెచ్ వేయడం గమనార్హం. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం మామూళ్ల మత్తు వీడి ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని నగర ప్రజలు కోరుతున్నారు. -
వైఎస్ జగన్ ప్రభుత్వం కేటాయించిన స్థలాలపై కూటమి సర్కారు కన్ను
-
భూభారతిలో నమోదైన భూములకే భరోసా
సాక్షి, హైదరాబాద్: భూభారతి (ధరణి) పోర్ట ల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగానే పట్టా భూమి గల రైతులకు ‘రైతు భరోసా’ కింద పెట్టుబడి సాయం అందనుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగి స్తారు. అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేసే ‘ఆర్ఓఎఫ్ఆర్’ పట్టాదారులకు సైతం రైతు భరోసా సాయాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.రాష్ట్రంలో ఈనెల 26 నుంచి అమల్లోకి రానున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం స్పష్ట త ఇచ్చింది. రైతులకు ఏటా ఎకరాకు రూ.12 వేల చొప్పున సాయం అందించే రైతు భరోసా పథకం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలు కానుండగా, వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏటా రూ.12 వేలు సాయంగా అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు కానుంది. ఈ మేరకు రెండు వేర్వేరు జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. డీబీటీ విధానంలో జమఈ నెల 26వ తేదీ నుంచి మొదలుపెట్టి వ్యవ సాయ యోగ్యమైన భూమికి ఎకరాకు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున జమ చేయ నున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర వ్యవసాయ సంచాలకుల నేతృత్వంలో అమలయ్యే ఈ పథకానికి సాయాన్ని ఆర్బీఐ నిర్వహించే ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీ టీ)’ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వహించనుంది. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాకు సంబంధించిన పథకం అమలు, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి బాధ్యత తీసుకొంటారు. పథ కానికి సంబంధించిన లోటుపాట్లపై వ్యవసాయ సంచాలకులు ఎప్పటికప్పు డు తగిన చర్యలు తీసుకుంటారు. వ్య వసాయ ఉత్పాదకతను పెంచడం, రైతులకు ఆర్థిక స్థిర త్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఆచరించేలా చూడటమే రైతుభరోసా ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది.10 లక్షల కుటుంబాలకు ఆత్మియ భరోసా! ‘ఇందిరమ్మ ఆత్మియ భరోసా’ పథకం కింద 10 లక్షల వ్యవసాయ కూలీ కుటుంబాలు లబ్ధి పొందే అవకాశం ఉంది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 55 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 29 లక్షల కుటుంబాలకు ఎలాంటి భూమి లేదు. ఇందులో కనీసం 10 రోజులు పనిచేసిన కుటుంబాలు 11 లక్షలు ఉండగా, కనీసం ఒకరోజు పని చేసిన కుటుంబాలు 15 లక్షలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 20 రోజుల పనిని ప్రామాణికంగా తీసుకుంటే 10 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మియ భరోసా కింద లబ్ధి చేకూరే చాన్స్ ఉంది. ఈ లెక్కన ప్రభుత్వం సంవత్సరానికి రూ.1,200 కోట్లు వెచ్చించనుంది. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ భరోసాగ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న భూ మిలేని వ్యవసాయ కూలీలకు భరోసా కల్పించేందుకే ‘ఇందిరమ్మ ఆత్మీయ భరో సా’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభు త్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’లో నమోదు చేయబడి, 2023–24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. ఒక్కో కుటుంబానికి ప్రతి విడతకు రూ.6 వేల చొప్పున సంవత్సరానికి రూ.12 వేల ఆర్ధిక సహాయాన్ని డీబీటీ పద్ధతిలో కూలీ కుటుంబ యజమాని ఖాతాకు జమ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ (కమిషనర్) నోడల్ విభాగంగా, జిల్లాల్లో కలెక్టర్ పర్యవేక్షణలో, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. -
చిన్న బాస్ క్లాస్మేట్.. విశాఖ భూములపై ‘కిలాడీ’ కన్ను
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కోట్ల విలువైన విశాఖ భూములపై ‘కిలాడీ’ కన్ను పడింది. ఫ్రీ–హోల్డ్ భూములను చేజిక్కించుకునేందుకు చిన్న బాస్ క్లాస్మేట్ కిలాడీ విశాఖలో మకాం వేసినట్టు తెలుస్తోంది. ప్రధాని పర్యటన సమయంలో ఇక్కడకు వచ్చిన సదరు కిలాడీ భీమిలి, ఆనందపురంతో పాటు సబ్బవరం తదితర ప్రాంతాల్లోని విలువైన భూముల వివరాలను సేకరించినట్టు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వ వ్యవహారాల్లో చిన్న బాస్ మిత్రుడిగా ‘శానా’ అతిచేస్తున్న మరో నేత కూడా కలిసి ఈ వ్యవహారాలు చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది. 20 ఏళ్ల క్రితం రైతులకు కేటాయించిన డీ–పట్టా భూములను ఫ్రీ–హోల్డ్ చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా వాటిని తమ అవసరాలకు వినియోగించుకునేందుకు రైతులకు అవకాశం కల్పించింది. అయితే, కొత్త ప్రభుత్వం వీటిపై గత కొద్ది నెలలుగా నిషేధం విధించింది. రానున్న మూడేళ్ల కాలంలో ఫ్రీ–హోల్డ్ కానున్న (20 ఏళ్లు పూర్తయిన) భూముల వివరాలనే సదరు కిలాడీ టీమ్ సేకరిస్తోంది. కొంతమంది రెవెన్యూ అధికారుల ద్వారా వివరాలను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వివాదాస్పద భూములపై కూడా వీరి కన్ను పడింది. స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల మాటకు విలువ లేకుండా ఇప్పటికే చక్రం తిప్పుతున్న సదరు కిలాడీ టీమ్.. మొత్తం భూ దందాను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్టు రెవెన్యూ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. ఫ్రీ–హోల్డ్ భూములపై కన్ను! వాస్తవానికి రైతుల వద్ద 20 ఏళ్ల నుంచి ఉన్న డీ–పట్టా భూములను తమ అవసరాల కోసం వినియోగించుకునేందుకు వీలుగా ఫ్రీ–హోల్డ్ చేసేందుకు గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. విశాఖ జిల్లాలో సుమారు 100 ఎకరాల భూములు మాత్రమే ఫ్రీ–హోల్డ్ జరిగింది. దీనిపై ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ నేతలు అనేక ఆరోపణలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ జరిపించారు. ఎటువంటి అవకతవకలు జరగలేదని ఈ ప్రభుత్వం నియమించుకున్న అధికారులే తేలి్చచెప్పారు. మరోవైపు ఫ్రీ–హోల్డ్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. 20 ఏళ్లు పూర్తయిన డీ–పట్టా భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా ఆదేశాలు జారీ చేసింది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈలోగా ఈ భూములను కొట్టేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సదరు కిలాడీ కాస్తా విశాఖపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 20 ఏళ్లు పూర్తయిన వాటితో పాటు రానున్న 3 ఏళ్లల్లో ఏయే భూములు ఫ్రీ–హోల్డ్ అయ్యే అవకాశం ఉందో... ఆ వివరాలను సేకరిస్తున్నారు. తద్వారా ఆయా రైతుల నుంచి వీటిని కారుచౌకగా కొట్టేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సదరు కిలాడీ ఇక్కడే మకాం వేసినట్టు సమాచారంప్రధాని పర్యటన ఏర్పాట్లలోనూ..! వాస్తవానికి ఆయనకు ప్రభుత్వంలో ఎటువంటి అధికారిక పదవి లేదు. కేవలం చిన్న బాస్ మిత్రుడని మాత్రమే అందరికీ తెలుసు. ఇప్పటికే అమరావతిలో చిన్న బాస్ ఆదేశాలతో పూర్తిస్థాయిలో అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతున్న సదరు కిలాడీ.. ఇప్పుడు విశాఖలోనూ చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారికంగా ఎటువంటి హోదా లేకపోయినప్పటికీ... ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులతో కలిసి ఏయూ గ్రౌండ్స్‌లో హల్చల్ చేశారు. అధికారులకు ఆదే శాలు ఇస్తూ ఏర్పాట్లపై సమీక్షించారు. ఎటువంటి హోదా లేకపోయినప్పటికీ చిన్న బాస్ క్లాస్ మేట్ హోదాలో సకల వ్యవహారాలు సదరు కిలాడీనే చూసుకుంటున్నారన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. సాక్షాత్తూ ప్రధాని పర్యటన ఏర్పాట్ల వ్యవహారంలోనూ జిల్లా లోని అధికారులకు కూడా ఈ విషయం అర్థమైనట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో సదరు కిలాడీ భీమి లి, ఆనందపురం, సబ్బవరం తదితర ప్రాంతాల్లోని ఫ్రీ–హోల్డ్ భూములపై వివరాలు సేకరించారు. ఆయా రెవెన్యూ అధికారుల ద్వారా వివరాలు తీసుకొని.. రైతుల నుంచి చౌకగా కొట్టేసి... ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత తమకు చెందేలా వ్యవహారాలు సర్దుబాటు చేసుకుంటున్నారని తెలుస్తోంది. -
అన్నం పెట్టే రైతులతో జైల్లో బాత్రూమ్లు కడిగించారు
-
వైఎస్సార్సీపీలో ఉంటే ఆస్తులు కొనుక్కోకూడదా?: దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, బీసీ, కాపులను అణివేసే ధోరణీ జరుగుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. రైతులను చంద్రబాబు ప్రభుత్వం దోచుకుంటోందని విమర్శించారు. గత వైఎస్ జగన్ హయంలో ధాన్యం ధర రూ.2వేలు ఉంటే.. చంద్రబాబు పాలనలో రూ.1400 లకే రైతులు అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులకు ఫీజు రింబయిర్స్మెంట్ చెల్లించాలని, లేదంటే వైఎస్సార్సీపీ తీవ్రమైన ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు.ఈ మేరకు శుక్రవారం దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. కాకినాడ సెజ్‌లో తాను ఆరు ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు తెలిపారు. మార్కెట్ మీద హెచ్చు రేటు పెట్టి భూములను రైతుల నుంచి కొనుక్కున్నానని చెప్పారు. 1940 నుంచి తమ కుటుంబం బంగారం వ్యాపారంలో ఉందన్నారు. తన దగ్గర డబ్బులు ఉండటం వల్లే రైతులు అమ్మిన భూములు కొన్నుకున్నట్లు పేర్కొన్నారు.‘చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా అదేదో తప్పులా అసత్య ప్రచారాలు చేశాయి. ఆ మధ్య చంద్రబాబు భూములు కొనుక్కున్నారు. ఇటీవల పిఠాపురంలో 15 ఎకరాల భూములు కొనుక్కున్నారు. ఈ పది రోజుల కాలంలో రెండు ఆస్ధులను యనమల రామకృష్ణుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, యనమల కొన్న ఆస్ధులు ప్రజల దగ్గర దోచుకున్నవే అని నేను ఆరోపించగలను.ఒక్క బకెట్ బురద చల్లేస్తే సరిపోతుందా?. వైఎస్సార్సీపీలో ఉన్నాం కాబట్టి మేము ఆస్ధులు కొనుక్కోకూడదా?. యనమల మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో రూ. రెండు లక్షలు లేకపోతే రైతు సంఘాలు ఖర్చులు బరించి గెలిపించాయి. ఇవాళ యనమల దగ్గర వేలాది కోట్ల ఆస్ధులు ఉన్నాయి. ఆ ఆస్ధులన్ని పేదలకు పంచిపెట్టాలి’ అని తెలిపారు -
ప్రాణం తీసినా భూములివ్వం!
దుద్యాల్: తమ ప్రాణాలు తీసినా సరే భూములు మాత్రం కంపెనీల కోసం ఇచ్చేది లేదని వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలంలోని లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంటతండా ప్రజలు తేల్చి చెప్పారు. శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) అధికారులు ఈ మూడు గ్రామాల్లో పర్యటించారు.ఢిల్లీ నుంచి వచ్చిన కమిషన్ డిప్యూటీ రిజిస్ట్రార్ లా ముఖేశ్, ఇన్స్పెక్టర్లు రోహిత్‌సింగ్, యతి ప్రకాశ్‌శర్మ బాధిత కుటుంబాలను కలిసి అభిప్రాయాలు సేకరించారు. ఘటన జరిగిన రోజు పోలీసులు తమపట్ల అమానుషంగా వ్యవహరించారని గిరిజన మహిళలు గోడు వెళ్లబోసుకొన్నారు. రోటిబండతండాకు చెందిన సోనీబాయి, కిష్టబాయి, జ్యోతి, ప్రమీల, వాల్మీబాయి, జార్పుల రూప్సింగ్ నాయక్, సీత తదితరులను అధికారులు ప్రశ్నించారు. తమను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, చివరికి ప్రాణాలు తీసినా భూములు మాత్రం ఇవ్వబోమని ఈ సందర్భంగా బాధితులు తేల్చి చెప్పారు. కోర్టుల చుట్టూ తిరిగేందుకు తమ వద్ద డబ్బు లేదని చెప్పగా.. ప్రభుత్వ లీగల్ ఎయిడ్ ద్వారా ఉచితంగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ పర్యటనపై అధికారులు నివేదిక సిద్ధంచేసి కమిషన్‌కు అందజేయనున్నారు. ఈ నెల 11న లగచర్ల ఘటన జరగగా.. బాధిత గిరిజనులు 18న ఢిల్లీకి వెళ్లి జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎన్హెచ్ఆర్సీ అడిగిన ప్రశ్నలివే.. ప్రశ్న: దాడి జరిగిన రాత్రి మీ మీ ఇళ్లలో ఎం జరిగింది? జవాబు: కరెంట్ తీసి పోలీసులు ఇళ్లలోకి దూరి మగవారిని తీసుకెళ్లారు, ఆడవారిని బెదిరించారు. అడ్డుపడితే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేశారు. ప్రశ్న: పోలీసులు మిమ్మల్ని కొట్టారా? జవాబు: కొట్టారు, అసభ్యకరంగా తిట్టారు సార్. ప్రశ్న: మీ డిమాండ్స్ ఏమిటి? జవాబు: మా ప్రాంతంలో కంపెనీలు వద్దు. మేము భూములు ఇవ్వం. మా జోలికి రావొద్దు. అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తేసి మా కుటుంబ సభ్యులను విడిచిపెట్టాలి. కమిషన్ చేసిన సూచనలు.. ఎఫ్ఐఆర్లో పేరున్నవారు లొంగిపోతే 14 రోజులు రిమాండ్‌కు పంపి, బెయిల్ ఇస్తారు. ఎఫ్ఐఆర్లో పేరు లేనివారు ముందస్తు బెయి ల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్ వేసుకోవాలి. లేదంటే ప్రస్తుతం జైలులో ఉన్నవారికి కూడా బెయిల్ రాదు. భూములు, కేసుల వ్యవహారాన్ని న్యాయస్థానాలు చూసుకుంటా యి. గ్రామాల్లోని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులు మీ జోలికి రారు. నా కొడుకుకు సంబంధం లేదునా కొడుకు బాష్యానాయక్కు దాడితో ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజంతా మేకలు కాసేందుకు వెళ్లాడని ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. అర్ధరాత్రి వచ్చి ఇంటి నుంచి తీసుకెళ్లడంతో పాటు అక్రమంగా కేసులు పెట్టారు. – సోనీబాయి, బాధితురాలుబతిమాలినా వదిలిపెట్టలేదు నా భర్త ప్రవీణ్ పాల ఆటో నడుపుతాడు. ఆ రోజు అర్ధరాత్రి పోలీసులు వచ్చి తలుపు తట్టారు. మేము భయపడి తీయకపోవడంతో కాళ్లతో బలంగా తలుపులు తన్నేసి లోపలికి వచ్చారు. ఇంట్లోని బీరువాను పగలగొట్టి చూశారు. నాకు డెలివరీ సమయం ఉందని బతిమాలినా వినకుండా నా భర్తను లాక్కెళ్లారు. పోలీసులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. – జ్యోతి, బాధితురాలు -
ఊరులేని ఊరు: భూముల ధరలు మాత్రం ఆకాశానికి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆ ఊరికో పేరుంది. ఊరి పేరున వందల ఎకరాల భూములు రికార్డుల్లో నమోదయ్యాయి. కానీ ఆ ఊళ్లలో ఇళ్లు ఉండవు. మనుషులూ నివసించరు. జనావాసాలు లేకున్నా అవి ఊళ్లే అంటే నమ్మాలి మరి. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ అవి గ్రామాలుగానే కొనసాగుతున్నాయి. మరికొన్ని ఊళ్లకు పేర్లున్నా.. రికార్డుల్లో మాత్రం లేవు. తాతల కాలం కిందట అక్కడ ఊళ్లు ఉండేవని చెబుతుంటారు. కొన్ని ఊళ్లల్లో ఇళ్లు, కోటలున్న ఆనవాళ్లు ఉండగా, మరికొన్ని చోట్ల ఆలయాలున్నాయి. కామారెడ్డి జిల్లాలోని ఇలాంటి ఊళ్లపై ‘సాక్షి’కథనమిది.⇒ మాచారెడ్డి మండల కేంద్రం పరిధిలో పోలోనిపల్లి అనే పేరుతో ఓ ఊరుంది. అక్కడ అప్పట్లో కొన్ని కుటుంబాలు నివసించేవి. కాలక్రమేణ వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వ్యవసాయ భూ ములున్నాయి. అక్కడి పురాతన రామాలయం వద్ద తపోవనాశ్రమానికి భక్తులు వచ్చిపోతుంటారు. ⇒ బిచ్కుంద మండలంలో 200 ఏళ్ల కిందట మల్కాపూర్ గ్రామం ఉంండేది. ఇప్పుడు అక్కడ గ్రామం లేదు. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం నమోదైంది. బిచ్కుంద మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఆ ఊరిలో హనుమాన్ ఆలయం ఉంది. ఏటా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ⇒ గాంధారి మండలంలో బంగారువాడి, కోనాయిపల్లి గ్రామాలుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. కానీ అక్కడ జనాలెవరూ నివసించరు. వ్యవసాయ భూముల్లో పంటలు మాత్రం సాగవుతున్నాయి. వందల ఏళ్ల కిందట అక్కడ ఊళ్లు ఉండేవని చెబుతారు. ⇒కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని తాడ్వాయి మండలంలో అబ్దుల్లానగర్ పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఊరుంది. వందల ఎకరాల భూములున్నాయి. అక్కడ అన్ని పంట చేలు, గుట్టలు, చెట్లు ఉన్నాయి. ఈమధ్య ఆ ప్రాంతంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొనుగోలు చేసి వెంచర్లు మొదలుపెట్టారు.⇒ కామారెడ్డి పట్టణ శివార్లలో సరంపల్లి గ్రామ పరిధిలో భూకన్పల్లి అనే ఊరుంది. అక్కడ ప్రఖ్యాత హనుమాన్ ఆలయం ఉంది. సరంపల్లి గ్రామ పరిధిలోకి వచ్చే భూకన్పల్లి హనుమాన్ ఆలయం వద్దకు భక్తులు వస్తుంటారు. సరంపల్లి గ్రామస్తులకు ఇంటి దైవం కూడా. చాలామంది ఆ ఊరి జనం తమ పిల్లలకు అంజయ్య, ఆంజనేయులు, అంజవ్వ, అంజమ్మ అనే పేర్లు పెట్టుకున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే పెద్ద అంజయ్య, చిన్న అంజయ్య అన్న పేర్లు కూడా ఉండడం విశేషం. ⇒ బాన్సువాడలో వాసుదేవునిపల్లి ఉంది. చింతల నాగారం పేర్లతో ఊళ్లున్నాయి. కానీ అక్కడ ఇళ్లు లేవు. మనుషులు ఉండరు. పొలాలు మాత్రమే ఉన్నాయి.⇒ దోమకొండ మండలం లింగుపల్లి సమీపంలో కుందారం అనే గ్రామం రికార్డుల్లో ఉంది. ఇక్కడ ఎలాంటి ఇళ్లు లేవు. ⇒ నస్రుల్లాబాద్ మండలం తిమ్మానగర్ పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఊరుంది. అక్కడ ఎలాంటి నివాసాలు లేవు. పూర్వ కాలంలో కోట ఉన్న ఆనవాళ్లున్నాయి. పాత గుడి ఉండగా, కొత్తగా నిర్మాణం మొదలుపెట్టారు. ⇒ ఇదే మండలంలోని పోశెట్టిపల్లి అనే పేరుతో రికార్డుల్లో ఊరుంది. అక్కడ ఇళ్లు లేవు. వ్యవసాయ భూములున్నాయి. ఈ రెండు ఊళ్ల పరిధిలోని భూములు బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామానికి చెందిన వారికే ఉన్నాయి. కాగా ఆయా గ్రామాలు ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. ఆ గ్రామాల పేరుతోనే పట్టా పాస్ పుస్తకాలు జారీ అవుతాయి.యాభైకి పైగా ఉనికిలో లేని గ్రామాలు కామారెడ్డి జిల్లాలో ఉనికిలో లేని రెవెన్యూ గ్రామాలు యాభైకి పైగా ఉంటాయని అంచనా. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉనికి కోల్పోయిన ఆ ఊళ్లలో వ్యవసాయం మాత్రం కొనసాగుతోంది. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని గ్రామాల్లో అయితే భూముల విలువ విపరీతంగా ఉంది. ఊరులేని ఊరిలో భూముల ధరలు మాత్రం ఆకాశాన్నంటడం విశేషం. -
బందోబస్తు మధ్య ‘ఫ్యూచర్’ రోడ్డుకు సర్వే
కందుకూరు/ఇబ్రహీంపట్నం రూరల్: ఫ్యూచర్ సిటీ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వే పనులను మంగళవారం పోలీసు బందోబస్తు మధ్య చేపట్టారు. ఈ సందర్భంగా భూములు ఇచ్చి తామెక్కడికి వెళ్లాలంటూ రైతులు ఆవేదన వెలిబుచ్చారు. భూములు కోల్పోతున్న వారికి ఎంత పరిహారం ఇస్తారు? ఎలా న్యాయం చేస్తారో చెప్పకుండా పోలీసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు సర్వే చేస్తుండగా.. కొంగరకలాన్‌లో కలెక్టరేట్ వెనక వైపు చేపట్టిన సర్వే పనులను అడ్డుకుని మహిళలు నిరసన తెలిపారు. రాజు అనే యువ రైతు తమ భూమి తీసుకుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో పోలీసులు అతన్ని సముదాయించి అక్కడి నుంచి పంపించారు. 330 అడుగుల రహదారి రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాల్లో గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అక్కడికి చేరుకునేలా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట వరకు 330 అడుగుల రహదారి నిర్మాణానికి ప్రతిపాదించింది. ఇందుకోసం ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్, మహేశ్వరం మండలం కొంగరకుర్దు, కందుకూరు మండలం లేమూరు, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లిలో రిజర్వు ఫారెస్ట్, పంజగూడ, మీర్ఖాన్పేటలో కలిపి మొత్తం 449.27 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది.ఫ్యూచర్‌సిటీ రోడ్డు కోసం ఇటువైపు కందుకూరు మండలం రాచులూరుతోపాటు అటువైపు ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో అధికారులు ఏకకాలంలో సర్వే పనులు ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, కందుకూరు తహసీల్దార్ గోపాల్, మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐలు సీతారామ్, వెంకట్‌తోపాటు పోలీసుల బందోబస్తు నడుమ సర్వే నిర్వహించారు. అక్కడి రైతులు అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంత పెద్ద రోడ్డు నిర్మిస్తే పొలాలు మొత్తం పోయి, రోడ్డున పడాల్సి వస్తుందని వాపోయారు. సమావేశం ఏర్పాటు చేసి తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పి అధికారులు సర్వేను కొనసాగించారు. -
దక్షిణ రింగు భూనిర్వాసితులకు అధిక పరిహారం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డులోని దక్షిణ భాగం పరిధిలో సేకరించే భూములకు పరిహారం భారీగా పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రింగురోడ్డు ఉత్తర భాగాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతుండగా, దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. భూసేకరణ ప్రక్రియలో భాగంగా అవార్డులు పాస్ చేసి పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ భాగంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రింగురోడ్డు అలైన్‌మెంటును ఖరారు చేసే కసరత్తు మొదలుపెట్టింది. ఆమేరకు భూసేకరణ జరగాల్సి ఉంది. పరిహారం మొత్తం పెంచి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా భూముల మార్కెట్ విలువను పెంచాలని నిర్ణయించింది. మార్కెట్ విలువ పెంచి పరిహారాన్ని భూసేకరణ, పునరావాస చట్టం–2013 ప్రకారం చెల్లించనుంది. మార్కెట్ విలువలు పెంచేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలంటూ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. భూ యజమానులకు చట్టబద్ధంగా పరిహారం అందాలని, నష్టపోయామనే భావన వారిలో ఎక్కువగా కనిపించొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ప్రాజెక్టు నిర్వహణ విభాగం ఏర్పాటుభారీ రోడ్డు ప్రాజెక్టులు నిర్వహించే ఎన్హెచ్ఏఐలో మాదిరి దక్షిణ రింగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఆర్ఆర్తో రేడియల్ రోడ్ల ద్వారా అనుసంధానాన్ని ఈ విభాగం ఖరారు చేస్తుంది. ఇందులో పర్యావరణ విభాగానికి సంబంధించి జిల్లా అటవీ అధికారి, సాంకేతిక విభాగంలో ఒక చీఫ్ ఇంజనీర్, ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, పరిపాలన విభాగానికి సంబంధించి అకౌంటెంట్ ఉండనున్నారు. అటవీ, రోడ్లు, భవనాలు, ఆర్థిక శాఖల నుంచి ఈ అధికారులు డిప్యుటేషన్‌పై పనిచేయనున్నారు. అలాగే, రీజినల్ రింగురోడ్డు పురోగతి పరిశీలనకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారి దాసరి హరిచందనను నియమించారు. ఇక దక్షిణ రింగుకు సంబంధించి డీపీఆర్ తయారీ, టెండర్ల వ్యవహారం పర్యవేక్షించేందుకు కన్సల్టెన్సీ సేవలు తీసుకోనుంది. కన్సల్టెన్సీ సంస్థ ఖరారుకు వీలుగా ఆర్ఎఫ్పీ బిడ్లు ఆహ్వానించాలంటూ రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీని ఆదేశించింది. -
ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం సాధ్యం కాదు
సాక్షి, అమరావతి/గుంటూరు (ఎడ్యుకేషన్): ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం పోలీసులకు సాధ్యం కాదని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ అన్నారు. ఆడపిల్లలు, మహిళలపై దాడులు, అఘాయిత్యాలను సమాజమే దీటుగా ఎదుర్కోవాలన్నారు. గుంటూరు అరణ్య భవన్లో ఆదివారం అటవీ అమర వీరుల సంస్మరణ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. మహిళలపై నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పైవిధంగా స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినా, వాటి అమలులో చిత్తశుద్ధి కావాలన్నారు. నిర్భయ వంటి చట్టాలు తెచి్చనా.. కోల్‌కతాలో వైద్యురాలిపై పాశవిక దాడి జరిగిందన్నారు. తమ కళ్లెదుట జరుగుతున్న నేరాలు, ఘోరాలను ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థినులు ఆత్మరక్షణ విద్య నేర్చుకుని, తమపై దాడులకు తెగబడే ఉన్మాదులపై తిరగబడాలని పిలుపునిచ్చారు. గంజాయి. మత్తు పదార్థాలను అరికట్టేందుకు శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. అధికారుల్ని బెదిరిస్తే సుమోటో కేసులు రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసు అధికారులను బెదిరిస్తున్నారని, తమ ప్రభుత్వం వస్తే ఎక్కడ ఉన్నా పిలిపిస్తామని ఐపీఎస్ అధికారులపై చేస్తున్న బెదిరింపులపై సుమోటో కేసులు వేస్తామని పవన్‌కళ్యాణ్ హెచ్చరించారు. ఒక మాజీ సీఎం స్థాయిలో పోలీసు అధికారులను బెదిరించడం సరైంది కాదని వైఎస్ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సప్త సముద్రాల ఆవల ఉన్నా వదలం అని మాజీ సీఎం అంటున్నారని, విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదన్నారు. 20 ఏళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఉంటుందని గతంలో పోలీసు అధికారులతో ఘోర తప్పిదాలు చేయించారన్నారు.గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటనల పేరిట రోడ్ల పక్కన చెట్లు నరికేశారని, ఈ వ్యవహారంలో బాధ్యులపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. షర్మిల కోరితే ప్రభుత్వ పరంగా భద్రత కల్పిస్తామని చెప్పారు. సరస్వతి భూములపై చర్యలు సరస్వతి పవర్ ప్లాంట్ భూముల వ్యవహారంపై చర్యలు చేపడతామని పవన్‌కళ్యాణ్ చెప్పారు. 76 ఎకరాల అసైన్డ్ భూములు, చుక్కల భూములు ఆక్రమించారని పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులతో ఈ అంశంపై చర్చిస్తున్నామన్నారు. పవర్ ప్లాంట్ పరిధిలో గ్రీన్‌జోన్ ఏర్పాటు చేయలేదని, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు సైతం లేవని అన్నారు. విశాఖ నడి»ొడ్డున గంజాయి పెంచుతున్నారని, గంజాయి సాగు, డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అటవీ దళాల అధిపతి చిరంజీవి చౌదరి, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అవన్నీ పట్టా భూములే
సాక్షి, అమరావతి: సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరుతో సిమెంటు పరిశ్రమ ఏర్పాటు కోసం రైతులు గ్రామ సభలో అడిగిన దాని కంటే ఎక్కువ పరిహారం ఇచ్చి భూములు సేకరించామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గ్రామ సభలో ఎకరానికి రూ.2.70 లక్షలు ఇస్తే చాలని రైతులు అడిగారని మావాళ్లు చెబితే.. రైతులను సంతోషపెట్టేలా దానికి అదనంగా రూ.30 వేలు కలిపి ఎకరాకు రూ.3 లక్షలు తగ్గకుండా చెల్లించి ఆ భూములు కొనుగోలు చేశామని.. అదీ జగన్ అంటే అని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించిన మాచవరం తహసిల్దార్.. ఆ భూముల వద్దకు వెళ్లి సర్వే చేసి, అందులో ఒక్క సెంటు కూడా ప్రభుత్వ, అటవీ, జల వనరుల భూములు లేవని స్పష్టం చేశారని(తహíసీల్దార్ మీడియాతో మాట్లాడిన వీడియోను ప్రదర్శించి చూపుతూ) గుర్తు చేశారు. అయినా పవన్ కళ్యాణ్ ఆ భూముల వద్దకు వెళ్లి ఏదో జరిగిపోతున్నట్లు ఊగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. పరిశ్రమలు రాకూడదనే రీతిలో..⇒ సరస్వతి సిమెంట్స్ పక్కనే భవ్య సిమెంట్స్ ఎకరా రూ.50 వేలు–రూ90 వేల లోపునే భూములు కొనింది. భవ్య సిమెంట్స్ తర్వాతే మా ప్రాజెక్టు వచి్చంది. వాళ్లు భూమి కొన్న ఏడాది తర్వాత మేము రూ.3 లక్షలకు తక్కువ కాకుండా భూములు సేకరించాం. ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నప్పుడు నేను నిజంగానే చెడ్డోడిని అయితే చాలా చోట్ల ప్రభుత్వ భూములు ఉన్నాయి. నేను రూపాయి పెట్టాల్సిన పని లేకుండా తీసుకోవచ్చు. గతంలో తాడిపత్రిలో దివాకర్‌రెడ్డి ప్రభుత్వ భూములను వాళ్ల పీఏ పేరుతో రాయించుకున్నారని విమర్శలొచ్చాయి. సరస్వతి సిమెంట్స్‌లో ఒక ఎకరా ప్రభుత్వ భూమి లేదు. అంతా ప్రైవేటు భూమే. ⇒ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవంబర్ 5న సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రాంతంలో పర్యటించారు. అంతకు ముందే డెప్యూటీ సీఎంగా ఆయన ఆదేశాలతోనే అక్టోబర్ 26న మాచవరం మండల తహసీల్దార్ సరస్వతి పవర్‌కు చెందిన భూములన్నీ పరిశీలించి నివేదిక ఇచ్చారు. సరస్వతి సిమెంట్స్ కొనుగోలు చేసిన భూములన్నీ పట్టా భూములేనని ఆమె ప్రకటించారు. ఆ ఫ్యాక్టరీ కోసం సేకరించిన వెయ్యికిపైగా ఎకరాలు మొత్తం పట్టా భూమేనంటూ ధ్రువీకరించారు. నాలుగు ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉన్నా, దాన్ని పరిశ్రమకు తీసుకోలేదని తహసీల్దార్ చెప్పారు. ⇒ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరుతో పల్నాడులో సిమెంట్ ఫ్యాక్టరీని అడ్డుకోవాలని చంద్రబాబు కుట్ర పూరితంగా వ్యవహరించారు. కాంగ్రెస్ నేతలతో కలిసి కేసులు వేశారు. దాని వల్లే ఈడీ అటాచ్మెంట్లోకి వెళ్లింది. 2014లో మైనింగ్ లీజులు రద్దు చేశారు. దీనిపై మేము కోర్టును ఆశ్రయిస్తే 2015లో మాకు అనుకూలంగా స్టే ఇచి్చంది. ⇒ 2019లో చంద్రబాబు చేసింది తప్పని, లీజులన్నీ రీస్టోర్ చేయాలని ఆదేశిస్తూ కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచి్చంది. చంద్రబాబు పరిశ్రమలు రాకూడదనే రీతిలో అడుగులు వేస్తున్నారు. ఫ్యాక్టరీకి నీళ్లు కూడా ఇవ్వరా? ⇒ పవన్ కళ్యాణ్ సిమెంటు పరిశ్రమకు ఇచ్చే నీళ్లపైనా రాద్ధాంతం మొదలెట్టారు. వాస్తవంగా స్టీల్ ఫ్యాక్టరీలకు ఎక్కువగా నీళ్లు కావాలి. సిమెంట్ ఫ్యాక్టరీకి పెద్దగా అవసరం ఉండదు. కానీ, అందులో పని చేసేవాళ్ల కోసం కనీసం నీళ్లు ఇవ్వాలి. ఆ మేరకు బాధ్యత ప్రభుత్వానిదే.⇒ కడపలో జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి జిందాల్ ముందుకొచ్చి పునాది రాయి వేశారు. ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఆయన్ని ప్రోత్సహించాల్సింది పోయి జత్వానిని తీసుకొచ్చి ఆమెతో దొంగ కేసులు పెట్టించి, బెదిరించి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరస్వతి సిమెంట్స్‌ను ఇదే రీతిలో అడ్డుకునే కుట్రలు చేశారు. రాని పరిశ్రమ వచ్చినట్టుగా గొప్పలు ⇒ మరోవైపున ఆర్సిలర్ మిట్టల్–నిపాన్ పరిశ్రమ అనకాపల్లికి వస్తోందంటూ తప్పుడు వార్తను ప్రచారం చేస్తున్నారు. ఆర్సిలర్ మిట్టల్–నిపాన్ పరిశ్రమ మా దగ్గరే ఉందని, పనులు ప్రారంభించింది అని ఒడిశా మంత్రి చెబుతున్నాడు. అక్కడ రూ.1.04 లక్షల కోట్లతో 24 మిలియన్ టన్నుల గ్రీన్ పీల్డ్ ప్లాంట్ కడుతున్నారు. మొదలైన ప్లాంట్ అపేసి ఇక్కడి వస్తారా?‘అవి పట్టా భూములే’‘పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సరస్వతి ప్రాజెక్టు భూములను పరిశీలించాం. మాచవరం మండలం చెన్నాయ్ పాలెంలో 272.96 ఎకరాలు, పిన్నెల్లిలో 793.79, వేమవరంలో 710.63 ఎకరాలు.. మొత్తంగా 1073.38 ఎకరాలు పట్టా భూములే. చెరువులు, వాగులు, కుంటలు, వాడీ బాడీస్ లేవు. తర్వాత ప్రభుత్వ ల్యాండ్స్ పిన్నెల్లిలో 2.87 (కొండ ప్రాంతం), వేమవరంలో 1.44 (చుక్క భూములు) కలిపి మొత్తం 4.31 ఎకరాలుసరస్వతి సిమెంట్స్ ఇంకా తీసుకోలేదు. మొత్తం 1077 ఎకరాల భూమికి సంబంధించి గతంలో ఆన్లైన్ పోరి్టంగ్కు పంపించాం. ఇందులో 821.44 ఎకరాలకు పోరి్టంగ్ చేశాం. ఇంకా 255.94 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నివేదికను పై అధికారులకు పంపిస్తున్నాం’. – మాచవరం తహసీల్దార్ మాట్లాడిన వీడియోలోని మాటలు -
‘సరస్వతి’ భూముల్లో ప్రతి సెంటూ కొన్నదే
సాక్షి, అమరావతి: ‘సరస్వతి పవర్’ భూముల్లో ప్రతి సెంటూ కొనుగోలు చేసిందేనని, ఒక్క ఎకరం కూడా ప్రభుత్వ భూమి లేదని గురజాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కాసు మహేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను రంగంలోకి దించిన విధంగానే.. ఇప్పుడు సరస్వతి భూముల వ్యవహారంలోనూ అదే పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై పెచ్చుమీరుతున్న లైంగిక దాడులు, పేట్రేగుతున్న టీడీపీ మూకల అరాచకాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సరస్వతి భూములపై రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు అడిగిన దానికంటే ఎక్కువ చెల్లించి కొన్నారు సరస్వతి కంపెనీ భూసేకరణ ఇప్పుడు జరిగింది కాదని.. పదిహేనేళ్ల క్రితం భూముల సమీకరణ జరిగిందని కాసు మహేశ్‌రెడ్డి చెప్పారు. 2009లో సరస్వతి కంపెనీ భూములు కొనుగోలు చేసేందుకు సిద్ధపడగా.. అప్పట్లో రైతులంతా సమావేశమై ఎకరం మెట్ట భూమికి రూ.1.50 లక్షలు, పల్లపు భూమికి రూ.2.75 లక్షలు చెల్లించాలని కోరుతూ తీర్మానించారని గుర్తు చేశారు. అయితే, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులంతా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో వారు కోరిన దానికంటే మిన్నగా.. అధిక ధర చెల్లించారని గుర్తు చేశారు. కొన్ని భూములకు ఆ రోజుల్లోనే ఎకరానికి రూ. 8.50 లక్షలు చెల్లించారన్నారు. ఆ సమయంలోనే ఇదే ప్రాంతంలో భవ్య సిమెంట్ కంపెనీ ఎకరం రూ.50 వేల చొప్పున కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. రైతులకు ఎక్కువ మేలు చేసింది ఎవరని, ఈ విషయాలను పవన్‌కళ్యాణ్ ఎందుకు దాచిపెడుతున్నారని, సరస్వతి భూముల విషయంలో ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ భూముల సంగతి పట్టదా పవన్! గురజాల మండలంలో ప్రభుత్వం నుంచి 40 ఏళ్ల క్రితం సంఘీ సిమెంట్స్ భూములు తీసుకుని ఇప్పటికీ పరిశ్రమ ప్రారంభించలేదని మహేశ్‌రెడ్డి గుర్తు చేశారు. ఇదే ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం ప్రభుత్వ భూములు తీసుకుని ఒక్క బస్తా సిమెంట్ కూడా తయారు చేయకుండానే అంబుజా సిమెంట్ ఆ భూములను అదానీకి అమ్మేసిందన్నారు. మై హోమ్, ఇమామి వంటి కంపెనీలు దశాబ్దాల క్రితం ప్రభుత్వ భూములు తీసుకుని పరిశ్రమలు ప్రారంభించకపోయినా పవన్‌కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఆ సంస్థలకు ఇచ్చిన భూములను రద్దు చేస్తామని పవన్ ప్రకటించగలరా అని ప్రశ్నించారు. సరస్వతి భూములపైకి వెళ్లిన పవన్‌కళ్యాణ్‌కు.. హైదరాబాద్‌లో ఖరీదైన ప్రాంతంలో వేలాది ఎకరాలను అక్రమంగా పొంది రామోజీరావు నిర్మించిన ఫిల్మ్ సిటీ భూముల్లోకి వెళ్లే ధైర్యం పవన్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఎక్కడికక్కడ హెరిటేజ్ కంపెనీ అనేక మార్గాల్లో సేకరించిన భూముల్లో పవన్ పర్యటించగలరా అని సవాల్ చేశారు. ఇవేమీ పట్టించుకోని పవన్‌కళ్యాణ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనుగోలు చేసిన ప్రైవేటు భూములను రద్దు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా!డిప్యూటీ సీఎం హోదాలో పర్యటించిన పవన్ అన్నీ పచ్చి అబద్ధాలే చెప్పారని మహేశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు మాయం అయిపోయారని గతంలో పవన్‌కళ్యాణ్ ఎలా తప్పుడు ప్రచారం చేశారో.. సరస్వతి భూముల విషయంలోనూ అలాంటి తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారన్నారు. అటవీ భూములను కన్వర్షన్ చేశారన్నది పూర్తి అబద్ధమని స్పష్టం చేశారు. అటవీ శాఖకు పవన్‌కళ్యాణ్ మంత్రిగా ఉన్నారని, సరస్వతి భూముల విషయంలో కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు మేలు కోసం దాదాపు మూడు రెట్లు ఎక్కువ ధరతో జగన్ భూములు కొనుగోలు చేసి, సరస్వతి సిమెంట్ కంపెనీ నెలకొల్పితే.. చంద్రబాబు అధికారంలోకి రాగానే 2014లో ఆ కంపెనీ మైనింగ్ లీజును రద్దు చేశారన్నారు. నిర్దేశించుకున్న సమయానికి ఆ పరిశ్రమ ప్రారంభమై ఉంటే స్థానికంగా వేలాది మందికి ఉపాధి లభించేదన్నారు. కడప జిల్లాలో మొదలైన భారతి సిమెంట్స్ ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకవైపు రాష్ట్రంలోకి పరిశ్రమలు రావాలంటూ.. దేశాలు తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం మరోవైపు ఇలా ఫ్యాక్టరీలు పెట్టాల నుకున్న కంపెనీలపై కక్ష సాధిస్తుండటం దుర్మార్గమన్నారు. -
సరస్వతి భూములపై ఆగని విషప్రచారం
సాక్షి, నరసరావుపేట: సరస్వతి పవర్ భూముల సేకరణలో ఎటువంటి ఆక్రమణలు, అటవీ భూములు లేవని రెవెన్యూ, అటవీశాఖ అధికారులు చెబుతున్నా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మాత్రం ఏదో జరిగిపోయినట్లు ఊగిపోతున్నారు. దీనిపై విచారణ చేసి నిగ్గు తేల్చాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసి తన అక్కసును మరోమారు బైటపెట్టుకున్నారు. ఎలాంటి అక్రమాలూ జరగలేదని రెవెన్యూ, అటవీశాఖ అధికారులు చెప్పినా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ అసత్య ప్రచారానికి దిగడంపై ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. పవన్ ఆకస్మిక పర్యటన.. అసంబద్ధ ఆరోపణలు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరి«ధిలోని సరస్వతి పవర్స్ భూముల పరిశీలన కోసమని మంగళవారం ఆకస్మిక పర్యటన చేసిన పవన్‌కళ్యాణ్ ప్రసంగం ఆద్యంతం తనకు అలవాటైన అసంబద్ధ, పొంతనలేని మాటలతో సాగింది. ఏకంగా 400 ఎకరాల అటవీ భూమిని రెవెన్యూ భూమిగా మార్చేశారన్నారని ఆరోపించారు. కానీ.. అందుకు ఎలాంటి ఆధారాలు చూపలేదు. స్థానిక రైతులంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఇలా బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సరస్వతి పవర్స్ కంపెనీ తీసుకున్న భూముల్లో 24 ఎకరాలు ఎస్సీ కుటుంబాలకు చెందిన అసై¯న్డ్ భూములు ఉన్నట్లు తేలిందని మరో వాదన వినిపించారు. దీనిపై మరోసారి సమగ్ర విచారణ చేసి నిగ్గు తేల్చాలని పల్నాడు కలెక్టర్‌కు ఆదేశాలిచ్చానని పవన్ తెలిపారు. సరస్వతి పవర్స్ కంపెనీ కోసం భూములు తీసుకోవడం దగ్గర నుంచి నీటి కేటాయింపులు, లీజుల పునరుద్ధరణ వరకు ప్రతి అంశంపై సమగ్ర విచారణ జరిపించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామన్నారు. పోలీసులు ఎందుకో మెత్తబడిపోయారు, భయపడుతున్నారని పవన్‌కళ్యాణ్ అన్నారు. 2014–19 మధ్య ఏం తేల్చారు? సరస్వతి భూముల సేకరణలో అక్రమాలు ఉన్నాయంటూ 2014–19 మధ్య టీడీపీ మంత్రులు, నేతలు తీవ్రస్థాయిలో విషప్రచారం చేశారు. అప్పటి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ భూములపై పదేపదే ఆరోపణలు చేస్తూ అక్రమాల నిగ్గు తేలుస్తామని ప్రగల్బాలు పలికారు. ఐదేళ్ల కాలం ముగిసినా ఒక చిన్న తప్పును సైతం గుర్తించలేకపోయారు. ఈసారి కూటమి అధికారంలోకి రావడంతో మరోసారి పవన్ కళ్యాణ్‌ను ముందుపెట్టి అసత్య ప్రచారాలకు తెరలేపారు. కూటమి నేతల కుట్రల వల్ల పల్నాడు అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన ప్రాంతమైన పల్నాడులో ఫ్యాక్టరీలు ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు అగిపోయి ఇక్కడి ప్రజలు ఆర్థి కంగా బలపడతారు. కానీ.. కూటమి నేతల విషప్రచారాలు, కుట్రలతో పారిశ్రామిక వేత్తలు భయపడి వెనుకడుగు వేస్తారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో వచ్చిన పవన్ ఈప్రాంత అభివృద్ధి గురించి ఒక్క ముక్క మాట్లాడకుండా కేవలం విద్వేష ప్రసంగాలు చేయడాన్ని ప్రజలు ఛీదరించుకుంటున్నారు. పల్నాడు జిల్లాకు కీలకమైన వరికపూడిసెల, పిడుగురాళ్ల మెడికల్ కళాశాల పనులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదలుపెట్టింది, వాటిని పూర్తి చేస్తామని ఒక్క మాట కూడా అనకపోవడం ఏమిటని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అవన్నీ పట్టా భూములే: తహశీల్దార్ సరస్వతి పవర్స్ సంస్థ భూములన్నీ పట్టా భూములేనని మాచవరం తహశీల్దార్ క్షమారాణి గతనెల 26న మీడియాకు వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో సరస్వతి భూముల్లో తనిఖీ చేస్తున్నామని ఆమె వివరించారు. ఈ భూముల్లో చెరువులు, కుంటలు, వాగులు, నీటి వసతులేవీ లేవని చెప్పారు. అటవీ భూములేవీ ఆక్రమణకు గురికాలేదు : ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డిప్యూటీ సీఎం ఆదేశాలతో అక్టోబర్ 26న మాచవరం మండలంలోని చెన్నాయపాలెం, దాచేపల్లి మండలంలోని తంగెడ అటవీ భూములను సిబ్బందితో కలిసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. అటవీ భూములేవి అక్రమణకు గురి కాలేదన్నారు. అటవీ భూములకు సుమారు 8 మీటర్ల దూరంలో సరస్వతి భూములున్నట్టు గుర్తించామన్నారు. -
స్వర్ణవారిగూడెంలో భూ‘మాయ’
వేలేరుపాడు: ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంలో ఓ రాజకీయ పార్టీ నేతతో కుమ్మక్కైన కొందరు రెవెన్యూ అధికారులు పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన భూముల్లో మిగులు భూములను పంచేసుకుంటున్నారు. నిజమైన నిర్వాసితులకు భూములివ్వడానికి విపరీతమైన జాప్యం చేస్తున్న అధికారులు.. మిగులు భూములకు బినామీ పేర్లతో నకిలీ హక్కు పత్రాలు సృష్టించి చిటికెలో మాయం చేసేస్తున్నారు. పోలవరం ముంపు మండలమైన వేలేరుపాడు మండలంలోని తాట్కూరుగొమ్ము, తిర్లాపురం, నార్లవరం, రుద్రమకోట గ్రామాలకు చెందిన కొందరు నిర్వాసితులకు జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంలో 596.73 ఎకరాల భూమికి పీఎన్ (ప్లిమినరీ నోటిఫికేషన్), తర్వాత డీడీ (డ్రాఫ్ట్ డిక్లరేషన్) ఇచ్చారు. నిర్వాసితుల కోసం భూములు కొన్నారు. ప్రస్తుత అవార్డులో మాత్రం 525 ఎకరాల 12 సెంట్లు మాత్రమే అధికారులు చూపిస్తున్నారు. అవార్డుకు, డీడీకు మధ్య 71 ఎకరాల 61 సెంట్ల తేడా ఉంది. ఇంత తేడా ఎలా వచ్చి oదో ఇంతవరకు తేలలేదు. మరోపక్క స్వర్ణవారిగూడెం గ్రామంలోని మిగులు భూములు క్రమంగా తరిగిపోతున్నాయి. అప్పట్లో ఇక్కడ 43 ఎకరాల 33 సెంట్లు మిగులు భూమిగా చూపించారు. 2023 నవంబర్ 20న అప్పటి జీలుగుమిల్లి తహసీల్దార్ 18.52 ఎకరాల మిగులు భూమి ఉన్నట్టు సర్వే నంబర్లతో సహా చూపారు. ప్రస్తుతం ఇక్కడ 8 ఎకరాలు మాత్రమే మిగులు భూమి ఉన్నట్టు చూపిస్తున్నారు. అంటే సుమారు 35 ఎకరాలు అన్యాక్రాంతమైపోయింది. ఈ భూముల్లో నిర్వాసితులు కాని పలువురు సాగు చేసుకుంటుండటం గమనార్హం. 2023 నవంబర్ నుంచి ఇప్పటివరకూ ఆర్ అండ్ ఆర్ అధికారి అయిన కేఆర్‌పురం ఐటీడీఏ పీవో ఎవరికీ మిగులు భూమి ఉన్న సర్వే నంబర్లపై ప్రొసీడింగ్స్ జారీ చేయలేదు. అలాట్మెంట్ కూడా ఇవ్వలేదు. అయినా కొందరు అధికారులు ఫోర్జరీ సంతకాలతో నకిలీ హక్కు పత్రాలు తయారుచేసి ఆయిల్‌పామ్ తోటలున్న ఈ భూములను విక్రయిస్తున్నారు. వీరిలో స్వర్ణవారిగూడెం వీఆర్ఏ, వీఆర్వో, స్థానిక రెవెన్యూ అధికారులు కొందరు కుమ్మక్కై ఈ భూములు కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాత అవార్డులో పేరు లేకుండానే, పోలవరం ముంపు ప్రాంతంలో సెంటు భూమి లేని వారికి కూడా భూములు కట్టబెడుతున్నారు. నిజమైన నిర్వాసితులకు తీరని అన్యాయంమిగులు భూములుగా ఉన్న ఆయిల్‌పామ్ తోటలను రెవెన్యూ అధికారులు నకిలీ హక్కు పత్రాలతో కాజేస్తున్నారు. నిజమైన గిరిజన నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారు. అసలు అవార్డులో పేరు, ఆర్ అండ్ ఆర్ అధికారి ప్రొసీడింగ్స్ లేకుండా సెంటు భూమి లేని వారికి ఎలా భూములు ఇస్తున్నారు? – గుజ్జా రామలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు, వేలేరుపాడు ఆయిల్‌పామ్ తోటలను ఆక్రమించుకుంటున్నారు నిజమైన నిర్వాసితుల కోసం కేటాయించిన భూములు ఈ రోజు చూస్తే, రేపటికి అధికారులు మాయం చేస్తున్నారు. విలువైన ఆయిల్‌పామ్ తోటలను దొంగ సరి్టఫికెట్లతో ఆక్రమించుకుంటున్నారు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినా మిన్నకుంటున్నారు. నిజమైన నిర్వాసితులు భూముల కోసం కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు మాత్రం చకచకా భూములు అప్పగిస్తున్నారు. –కారం దారయ్య, రాష్ట్ర గిరిజన సమాఖ్య అధ్యక్షుడు కాజేస్తున్నారిలా..స్వర్ణవారిగూడెంలో 33/1 సర్వే నంబర్లో 4 ఎకరాలు, 33/2 సర్వే నంబర్లో 0.62 ఎకరాల మిగులు భూమిని గత ఏడాది వేలేరుపాడు మండలం కన్నాయిగుట్టకు చెందిన కారం లక్ష్మయ్యకు మండల సర్వేయర్, వీఆర్వో, వీఆర్ఏ చూపించారు. అయితే ఆ తర్వాత వీఆర్వో, వీఆర్ఏ, స్థానిక ఓ గిరిజనేతరుడు కుమ్మక్కై ఆ భూమికి ఫోర్జరీ సంతకాలతో నకిలీ హక్కు పత్రం సృష్టించారు. ఎలాంటి అలాట్మెంట్, ప్రొసీడింగ్ లేకుండానే ఓ గిరిజనేతరుడు రెవెన్యూ అధికారుల అండదండలతో ఆయిల్‌పామ్ తోటను ఇటీవల ధ్వంసం చేశాడు. ఈ పొలాన్ని దున్నించి బహిరంగంగానే సాగు చేస్తున్నాడు. కారం లక్ష్మయ్యకు మాత్రం భూమి ఇవ్వలేదు. వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము రెవెన్యూలో మెట్టం వెంకయ్య పేరున ఎక్కడా సెంటు భూమి లేదు. అవార్డులో కూడా పేరు లేదు. అయినా స్వర్ణవారిగూడెంలో నకిలీ హక్కు పత్రంతో 166–4ఎ సర్వే నంబర్లో 0.73 సెంట్లు, 200–3ఎ సర్వే నంబర్లో 3.35 ఎకరాలు అప్పగించారు. ఇలాంటి నకిలీల పేర్లు ఇక్కడ చాలానే కనిపిస్తున్నాయి. తాట్కూరుగొమ్ము రెవెన్యూలో నాగులగూడేనికి చెందిన ఓ గిరిజనుడికి సెంటు భూమి లేదు. వాస్తవంగా అతనికి చిగురుమామిడి రెవెన్యూలో ఎకరా భూమి ఉండగా లాండ్ టు లాండ్ కింద బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెంలో భూమి అప్పగించారు. ఇటీవల అతనికి స్వర్ణవారిగూడెంలో 6.25 ఎకరాలు, అతని మనుమడికి మరో 6.25 ఎకరాలు.. మొత్తం 12.50 ఎకరాలు కట్టబెట్టేశారు. ఈ భూమిలో సగం వాటా రెవెన్యూ అధికారులదని చెబుతున్నారు. -
దొరా.. మా భూములు లాక్కోవద్దు
కొడంగల్, దుద్యాల్: ‘దొరా.. మీ కాళ్లు మొక్కుతాం. మమ్మల్ని బతకనీయండి. ప్రాణాలైనా ఇస్తాం కానీ ఫార్మా కంపెనీల కోసం భూములు మాత్రం ఇవ్వం’అంటూ వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం లగచర్ల, రోటిబండతండా గిరిజన రైతులు అధికారులను వేడుకున్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం దుద్యాల్ మండలంలో 1,358 ఎకరాల భూసేకరణలో భాగంగా శుక్రవారం ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారని... సంబంధిత రైతులు, స్థానికులకు ముందుగానే సమాచారం అందించారు. కానీ సమావేశం మొదలవకముందే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ప్రజాభియాప్రాయ సేకరణ భేటీ రద్దయింది. ఏం జరిగిందంటే.. కాంగ్రెస్ పార్టీ దుద్యాల్ మండల కమిటీ అధ్యక్షుడు ఆవుటి శేఖర్ హైదరాబాద్ నుంచి లగచర్లకు బయలుదేరగ రోటిబండ తండా వద్ద ప్రతిపాదిత ఫార్మా కంపెనీల వల్ల భూములు కోల్పోనున్న గిరిజన రైతులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గిరిజనులు, శేఖర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శేఖర్ తమను కులం పేరుతో దూషించారంటూ తండావాసులు ఆయనపై దాడికి యతి్నంచారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు అప్రమత్తమై ఆయన్ను పక్కనే ఉన్న పంచాయతీ భవనంలోకి తీసుకెళ్లారు. తమకు భూములు కోల్పోయే పరిస్థితి తలెత్తడానికి కూడా ఆయనే కారణమని ఆరోపిస్తూ తండావాసులు పంచాయతీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.కొందరు పంచాయతీ భవనంపైకి ఎక్కి బండరాళ్లతో రేకులను పగలగొట్టే ప్రయత్నం చేయగా మరికొందరు అక్కడే ఉన్న హైమాస్ట్ లైట్ స్తంభాన్ని పెకిలించి దానితో తలుపులు బద్దలు కొట్టేందుకు విఫలయత్నం చేశారు. ఇంకొందరు శేఖర్ కారుపై రాళ్లతో దాడిచేశారు. ఈ క్రమంలో పోలీసులు, గిరిజనులకు మధ్య తోపులాట చోటుచేసుకొని పలువురు మహిళలు కిందపడి గాయపడ్డారు. పరిస్థితి చేజారుతోందని గమనించిన పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో కొంత వెనక్కి తగ్గిన ఆందోళనకారులు శేఖర్‌తో తమకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఎస్పీ నారాయణరెడ్డి అక్కడకు చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం శేఖర్‌ను అక్కడి నుంచి తరలించారు.ఫార్మా వద్దు.. పరిహారం వద్దుఎకరా, రెండెకరాల భూములను ఇచ్చేస్తే మేమెలా బతకాలని గిరిజనులు అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఎస్పీ నారాయణ ఎదుట విలపించారు. ప్రభుత్వం అందించే పరిహారం వద్దని.. తమ జోలికి రావొద్దని వేడుకున్నారు. దీనిపై లింగ్యానాయక్, ఎస్పీ నారాయణ స్పందిస్తూ ప్రభుత్వం దౌర్జన్యంగా ఎవరి భూములను లాక్కోదని స్పష్టం చేశారు. -
‘ఫ్రీ హోల్డ్’ అన్నీ సక్రమమే!
మహారాణిపేట (విశాఖ): పేదల భూములు కాజేశారంటూ ఎన్నికలకు ముందు కూటమి నాయకులు చేసిన ప్రకటనలు అవాస్తవాలు అని తేలిపోయింది. ఆసైన్డ్ భూములు, డీ పట్టా భూములకు హక్కులు కల్పించేందుకు చేపట్టిన ఫ్రీ హోల్డ్ వ్యవహారంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని డిప్యూటీ కలెక్టర్ల కమిటీ నిగ్గు తేల్చింది. ఇదే నివేదికను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపించింది. భూములపై విచారణకు వెళ్లిన డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు అక్కడ పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. ముందుగా వీరికి చెప్పి పంపిన పద్ధతి వేరు, గ్రామంలోకి వెళ్లిన తర్వాత పరిస్థితి వేరుగా కనిపించింది. గ్రామంలో అడుగడుగునా విచారణ చేసిన డిప్యూటీ కలెక్టర్ల బృందానికి అక్రమాలు జరిగినట్టు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదు. దీంతో డిప్యూటీ కలెక్టర్లు అయోమయంలో పడ్డారు. బెడిసికొట్టిన గోబెల్స్ ప్రచారం ఫ్రీ హోల్డ్ పేరిట పేదల భూములను బలవంతంగా లాక్కున్నారని చేసిన గోబెల్స్ ప్రచారం కమిటీ విచారణతో బెడిసికొట్టినట్టు అయ్యింది. అధికారం చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎంతో హడావుడిగా ఫ్రీ హోల్డ్ భూములకు సర్టిఫికెట్ల జారీకి బ్రేకులు వేసి, రిజి్రస్టేషన్ల ప్రక్రియ నిలుపుదల చేశారు. అంతేకాకుండా ఈ భూముల కొనుగోలు, ఇతర లావాదేవీలపై విచారణ చేయాలని నిర్ణయించి విచారణ కమిటీలను నియమించారు. మొత్తం నాలుగు మండలాల్లో జరిగిన ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ల జారీపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విచారణ ముమ్మరంగా కొనసాగింది. ఒక్కో మండలానికి ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి చేత విచారణ చేపట్టారు. వీరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, అవకతవకలపై ప్రశ్నించారు. భూముల కోసం ఎవరైనా ఇబ్బందులు పెట్టారా? అని అడిగారు. ఎక్కడా ఫిర్యాదులు రాలేదు. గ్రామ సభలో చెప్పలేకపోతే తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి చెప్పవచ్చని డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు చెప్పడం విశేషం. అయినా ఎవరూ ముందుకు రాలేదు. వచ్చిన ఫిర్యాదుల్లో లీగల్ హెయిర్ (కుటుంబ సభ్యులు) అయిన తమకు డబ్బులు ఇవ్వకుండా తీసుకున్నారని, ఈ భూముల్లో తమకూ వాటా ఉందని, న్యాయం చేయాలనే ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్లు తలలు పట్టుకున్నారు. పేదల భూములకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం హక్కులు పేదల భూములకు హక్కులు కల్పించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. డీ పట్టా భూములకు హక్కులు కల్పిస్తూ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు జీవో 596 జారీ చేసింది. 2002 సంవత్సరానికి ముందు మంజూరు చేసిన డీ పట్టా భూములకు హక్కులు కల్పించడమే జీవో ముఖ్య ఉద్దేశం. హక్కులతో పాటు రిజిస్ట్రేషన్లు చేసి పేదలకు అందించేందుకు అప్పట్లో శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత జీవనాధారం కోసం భూమి క్రయ, విక్రయాలకు అవకాశం కల్పించారు. 609 ఎకరాలు ఫ్రీ హోల్డ్ ఈ జీవో ప్రకారం జిల్లాలో 609 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు. వీటిలో 190 ఎకరాలకు రిజి్రస్టేషన్లు పూర్తి చేశారు. అయితే ఈ ప్రక్రియపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎన్నికలకు ముందు తీవ్ర ఆరోపణలు చేశారు. పేదల భూముల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హడావుడిగా ఫ్రీ హోల్డ్ ప్రక్రియను నిలిపివేసింది. స్వయంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఈ భూములను పరిశీలించి వెళ్లారు. తాజాగా డిప్యూటీ కలెక్టర్ల కమిటీ కూడా ఫ్రీ హోల్డ్, రిజి్రస్టేషన్ చేసిన భూముల రికార్డులతో పాటు యజమానులను కలిసి విచారించారు. ఇందులో ఆనందపురం మండలంలో 407.77 ఎకరాలు, పద్మనాభంలో 129.60 ఎకరాలు, పెందుర్తిలో 20.04 ఎకరాలు, భీమిలిలో 52.51 ఎకరాలు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో ఎటువంటి అవకతవకలు, అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ కాలేదు. దీంతో కమిటీ ఇదే విషయాన్ని జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది. -
అమరావతి రైతులకు ప్లాట్లు ఎలా?
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం కోసం అమరావతి రైతుల నుంచి తీసుకున్న భూములకు తిరిగి వారికి ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్లాట్ల అభివృద్ధికి రూ. వేల కోట్ల నిధులు అవసరం కావడం, ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తం ఖర్చు చేసే పరిస్థితి లేకపోవడంతో హామీ అమలుపై కూటమి ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. రాజధాని నిర్మాణం కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 29 వేల మంది రైతుల నుంచి 34 వేల ఎకరాలకు పైగా భూములు సేకరించారు. తీసుకున్న ఎకరాకు 1,450 గజాల చొప్పున ప్లాట్లను అన్ని వసతులతో అభివృద్ధి చేసి ఇస్తామని గత టీడీపీ ప్రభుత్వం రైతులకు ఒప్పంద పత్రాలు ఇచ్చి0ది. ప్రస్తుతం మరో 4 వేల ఎకరాలు సేకరించాలన్న ఆలోచనతో రైతుల నుంచి సీఆర్డీఏ భూములు తీసుకుంటోంది. ఇటీవల అమరావతి పరిధిలోని 29 వేల ఎకరాల్లో రూ. 34 కోట్లతో సీఆర్డీఏ కంప చెట్ల తొలగింపు పనులు చేపట్టింది. అయితే, ఈ పనులు పూర్తయ్యాక ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాల్సి ఉంది. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధికి దాదాపు రూ. 12 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని గతంలోనే అధికారులు అంచనా వేశారు. ఇప్పుడు ఇంత మొత్తం నిధులు ఎలా సేకరించాలో.. పనులు ఎలా చేపట్టాలోనని సీఆర్డీఏ ఆందోళన చెందుతోంది. సీఆర్డీఏ అభివృద్ధి చేసే ప్లాట్లలో నివాస, కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి. మాస్టర్‌ప్లాన్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లు అభివృద్ధి చేయాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, ఎస్టీపీలు, తాగునీరు సదుపాయాలు వంటివి కల్పించాలి. ప్లాట్లు పొందే రైతులకు ఇచ్చిన హామీ మేరకు వీటిని కల్పించాకే రైతులకు అప్పగించాలి. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక అవసరం.మునిగే ప్లాట్లు రైతులు తీసుకుంటారా? ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ వర్షం, వరద నీరు ఈప్రాంతంలో నిలిచిపోయింది. ఇప్పుడున్నట్టుగా ప్లాట్లు వేస్తే భవిష్యత్‌లో ఇలాంటి వర్షం వచ్చినప్పుడు ప్లాట్లన్నీ నీట మునగడం ఖాయం. ఇలా చేసినట్టయితే వాటిని రైతులు తీసుకునే పరిస్థితి లేదు. ఆయా ప్లాట్ల ప్రాంతాలను పూర్తిగా మట్టితో ఎత్తు చేయాల్సి ఉంది. కానీ ఈ పనులన్నీ చేయడం ఇప్పుట్లో సాధ్యమయ్యే పని కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గతంలో సీఆర్డీఏ వేసిన అంచనా వ్యయమే రూ. 12 వేల కోట్లు దాటుతుండగా, ప్లాట్లు నీట మునగకుండా ఎత్తు చేయాలంటే రెట్టింపు నిధులు ఖర్చు చేయాల్సిందే. కానీ ప్రభుత్వం అంత మొత్తం ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. -
నీటిపైనే ల్యాండ్ అవుతుంది.. బోట్ కాదు - ఇదొక ఫ్లైట్ (ఫోటోలు)
-
ప్రాపర్టీ కొనుగోలుకు ఏ డాక్యుమెంట్లు అవసరం..?
-
ఇలాంటి ల్యాండ్స్ కొంటే మీరు సమస్యలు కొని తెచ్చుకున్నట్టే..
-
రూ.10 వేల కోట్ల రుణంపై తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల భూములను తాకట్టు పెట్టడం ద్వారా మూలధనం, ఇతర అవసరాల కోసం రుణ సేకరణ చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. రుణ మార్కెట్ నుంచి రూ.10 వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు, ఎఫ్ఆర్బీఎం పరిమితులు అడ్డుపడుతుండటంతో, అవాంతరాలను అధిగమించడంపై సర్కారు తర్జనభర్జన పడుతోంది. రుణ సేకరణ కోసం హైదరాబాద్‌లోని అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలని గతంలో నిర్ణయించారు. కోకాపేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.20 వేల కోట్లుగా అంచనా వేశారు. అయితే గతంలో ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణం తీసుకున్న అనుభవం లేకపోవడంతో ‘మర్చంట్ బ్యాంకర్ల’కు రుణ సేకరణ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. మర్చంట్ బ్యాంకర్ల వివరాలపై మౌనం మర్చంట్ బ్యాంకర్ల ఎంపికకు ఈ ఏడాది జూలైలో శ్రీకారం చుట్టారు. రుణమార్కెట్ నుంచి అప్పులు తేవడంలో అనుభవం కలిగిన బ్యాంకర్ల నుంచి జూలై 5 నుంచి 12వ తేదీ వరకు బిడ్లను స్వీకరించారు. అదే నెల 15న సాంకేతిక బిడ్లను తెరిచి అర్హత కలిగిన మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేశారు. అయితే ఎంపికైన బిడ్డర్ల వివరాలను వెల్లడించేందుకు ఆర్థిక, పరిశ్రమల శాఖ అధికారులు సుముఖత చూపడం లేదు. 2019 నుంచి 2023 మధ్యకాలంలో కనీసం రూ.1,500 కోట్ల నుంచి రూ.20 వేల కోట్లకు పైగా రుణాలు సేకరించిన అనుభవం కలిగిన సంస్థలను మర్చంట్ బ్యాంకర్లుగా ఎంపిక చేసినట్లు తెలిసింది.వీరు ఈఎండీ రూపంలో రూ.కోటి, పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ కింద మరో రూ.4 కోట్లు కూడా ప్రభుత్వానికి చెల్లించినట్లు సమాచారం. కాగా మర్చంట్ బ్యాంకర్లు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా రుణ సేకరణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. రుణం ఇప్పించే మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం ఒక శాతం చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీషన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఫైనాన్స్ సంస్థల షరతులు అప్పుల కోసం ప్రభుత్వం తరపున ఫైనాన్స్ సంస్థల వద్దకు వెళ్లిన మర్చంట్ బ్యాంకర్లకు సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్నట్లు తెలిసింది. రూ.10 వేల కోట్ల రుణం కోసం రూ.20 వేల కోట్లు విలువ చేసే విలువైన భూములను తాకట్టు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనా, భూముల తాకట్టుతో పాటు రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే మంజూరు చేస్తామని మెలిక పెడుతున్నాయి. ఇక్కడే ప్రభుత్వానికి చిక్కొచ్చి పడింది. రుణ మొత్తానికి గ్యారంటీ ఇస్తే ‘ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలను కేంద్రం వర్తింపజేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ తరహా రుణాలైనా ఎఫ్ఆర్బీఎం గరిష్ట రుణ పరిమితికి లోబడే ఉండాలని రిజర్వు బ్యాంకు ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. రుణమార్కెట్ నుంచి తెచ్చే అప్పులకు సంబంధించిన సమాచారం ఆర్బీఐకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అభ్యంతరాలను అధిగమించి, ఎఫ్ఆర్బీఎం నిబంధనలు వర్తించకుండా రుణ సమీకరణ విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే అప్పులు తేవడం సాధ్యమవుతుందని మర్చంట్ బ్యాంకర్లు సైతం తేల్చి చెబుతున్న నేపథ్యంలో దీని సాధ్యాసాధ్యాల పరిశీలనలో అధికారులు నిమగ్నమయ్యారు. -
నక్కపల్లిలో ఉద్రిక్తత
నక్కపల్లి: నిర్వాసితుల డిమాండ్లు నెరవేర్చకుండా విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో చంద్రబాబు సర్కారు చేపట్టిన షెడ్లు, తాత్కాలిక వసతి సదుపాయాలు, రోడ్లు, సబ్‌స్టేషన్ వంటి నిర్మాణపు పనులను వైఎస్సార్సీపీ, సీపీఎం నేతల మద్దతుతో రైతులు, నిర్వాసితులు అడ్డుకున్నారు. బుధవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడలో ఏపీఐఐసీవారి ఆధ్వర్యంలో రెండో రోజు పనులను ప్రారంభించారు. నక్కపల్లి, పాయకరావుపేట సీఐల ఆధ్వర్యంలో 70 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ అంబేద్కర్ పర్యవేక్షణలో ప్రారంభించిన ఈ పనులను కొనసాగకుండా రైతులు అడ్డుకోవడంతో 3 గంటలపాటు రైతులకు ఏపీఐఐసీ, రెవెన్యూ, పోలీసు అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. బాధిత రైతులకు వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, సర్పంచ్ తళ్ల భార్గవ్, ఎంపీటీసీ సభ్యుడు గంటా తిరుపతిరావు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు తదితరులు అండగా నిలిచారు. రైతుల డిమాండ్లు ఎప్పటిలోగా నెరవేరుస్తారో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పనులు జరగనివ్వబోమంటూ యంత్రాల ముందు బైఠాయించారు. ఇదే రైతులను గతంలో టీడీపీ నేతలు రెచ్చగొట్టి ఆందోళన చేయించారని, ఏ హామీల కోసం అయితే గతంలో ఆందోళన చేశారో అదే సమస్య పరిష్కరించకుండా పనులు ప్రారంభించేలా తెరవెనుక పావులు కదుపుతున్నారంటూ వైఎస్సార్సీపీ నేత వీసం రామకృష్ణ మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన విధంగా నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు రైతులను రెచ్చగొట్టి ఎందుకు ఆందోళనలు చేశారని, పనులు ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. పరిహారం చెల్లించినప్పుడు ఇంతకాలం భూములు ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీశారు. రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తే పోలీసు బందోబస్తుతో పనులు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రైతుల డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని, అప్పటి వరకు పనులు జరగనివ్వబోమని అన్నారు. ప్రస్తుతం పనులు ప్రారంభించిన సర్వే నంబర్ 65లో ఉన్న ప్రభుత్వ భూముల్లో చాలామంది రైతులు ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నారని, వీరిలో కొంతమందికి పరిహారం ఇచ్చి మరికొందరికి నష్టపరిహారం చెల్లించలేదన్నారు. చివరకు అధికారులు తాత్కాలికంగా పనులను నిలిపివేస్తున్నామని ప్రకటించారు. వచ్చే మంగళవారం హోం మంత్రి, కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేస్తామని, చర్చలు కొలిక్కి వచ్చిన తర్వాతే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. -
అన్నదాతలకు వాయు‘గండం’..
సాక్షి, అమరావతి: భారీ వర్షాలకు పెద్దఎత్తున వ్యవసాయ, ఉద్యాన పంటలు ముంపునకు గురవుతున్నాయి. బుడమేరు, ఎర్రకాలువలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. ఇక ఉద్యాన పంటల విషయానికొస్తే అత్యధికంగా కూరగాయలు, అరటి, పసుపు, మిరప, తమలపాకు పంటలకు అపార నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. కూరగాయల పంటలే ఎక్కువగా దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు.ఈ వర్షాలవల్ల 30వేల మందికి పైగా రైతులు ప్రభావితమైనట్లు సమాచారం. ప్రస్తుతం వరి పంట దుబ్బులు కట్టే దశలో ఉండడంతో ఈ వర్షాలు మేలుచేస్తాయని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. అయితే, ముంపునీరు 5–6 రోజులకు మించి చేలల్లో ఉంటే మాత్రం పంటలకు నష్టం వాటిల్లే అవకాశముందని చెబుతున్నారు. నిజానికి.. సీజన్ ఆరంభం నుంచి రైతులు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఖరీఫ్ సాగుచేస్తున్నారు. ఇప్పటికే జులైలో కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతినడంతో నష్టపోయిన రైతులు రెండోసారి విత్తుకున్నారు. తాజాగా.. కురుస్తున్న వర్షాలు వారిని మరింత కలవరపెడుతున్నాయి.13 జిల్లాల్లో పంటలపై తీవ్ర ప్రభావం..రాష్ట్రంలోని 13 జిల్లాల్లో.. 135 మండలాల పరిధిలోని 581 గ్రామాల్లో భారీ వర్షాలవల్ల పంటలు ముంపునకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం శనివారం రాత్రికి 1.60 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 10 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్లు గుర్తించారు. ఇది ఇంకా ఎక్కువే ఉంటుందని క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం. ఈ వర్షాలు ఉభయ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, నంద్యాల, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. -
ఫార్మాసిటీ భూములు వెనక్కివ్వండి: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఫార్మా సిటీ రద్దు చేసింనందున దాని కోసం సేకరించిన భూములు తిరిగి రైతులకు ఇచ్చేస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బడ్జెట్లో మంగళవారం(జులై 30) చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘రూ. 16 వేల కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ కు అంతా సిద్ధం చేశాం. లక్షా 50 వేల కోట్లు మీ ప్రభుత్వానికి ఎందుకు అవసమరమవుతున్నాయి. హైదరాబాద్‌లో ఎస్ఆర్డీపీ రోడ్ల నిర్మాణ పనులను కొనసాగించాలి’అని కేటీఆర్ కోరారు. -
తిమింగలానికి కోపమొస్తే.. చుక్కలే! ఈ వైరల్ వీడియో చూడండి!
అమెరికాలోని న్యూహాంప్‌షైర్ హార్బర్ సమీపంలో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక భారీ తిమింగలం చిన్న బోటు మీదికి ఉన్నట్టుండి లంఘించింది. దీంతో నడి సముద్రంలో బోటు దాదాపు బోల్తా కొట్టడంతో అందులో ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. చివరికి ఏమైంది? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.కోలిన్, వ్యాట్ యాగర్ అనే ఇద్దరు సోదరులకు తమ తొలి ఫిషింగ్ ట్రిప్‌లోనే భయకరమైన అనుభవం ఎదురైంది. వీరు మంగళవారం ఉదయం న్యూ హాంప్‌షైర్ తీరంలో 23 అడుగు పొడవున్న ఓ బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. తీరా బోటు సముద్రంలోకి వెళ్లాక వారికి సమీపంలో ఒక భారీ తిమింగలం దర్శనమిచ్చింది. అది బోటు దగ్గరకు వచ్చీ రావడంతోనే బోట్‌పై ఎటాక్ చేసింది. ఒక్కసారిగా గాల్లోకి లేచి బోటుపై ల్యాండ్ అవ్వాలని ప్రయత్నించింది. దీంతో నడి సంద్రంలో బోటు అతలాకుతలమై పోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఇద్దరూ సముద్రంలోకి దూకేశారు. సముద్రంలో చుట్టు పక్కల బోట్లలో ఉన్నవారు వారిని కాపాడారు.Whale lands on boat 😮😱 pic.twitter.com/eIJPIsB8YO— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 24, 2024 ఉత్తర న్యూ ఇంగ్లండ్ కమాండ్ సెంటర్‌కు రెండుసార్లు మేడే సిగ్నల్ అందిందని యుఎస్ కోస్ట్ గార్డ్‌లోని ఒక అధికారి చెప్పారు. న్యూహంప్షైర్ కోస్ట్లోభారీ తిమింగలాలు కనిపిస్తూ ఉంటాయనీ, కానీ ఇలా ఎపుడూ దాడికి దిగలేదని అన్నారు. తిమింగలానికి సైతం ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. అయితే ఆ బోటుకు సమీపంలో ఉన్న మరో బోటు నుంచి ఎలియట్, మైనే సోదరులు దీనికి సంబంధించిన వీడియో తీశారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
సమగ్ర భూ సర్వే రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన హయాంలో ఒకసారి రీ సర్వే చేయాలని భావించామని, కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి సర్వే చేస్తే హద్దులు మారిపోతుండటంతో ముందుకు వెళ్లలేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు కూడా రీసర్వే తలపెట్టి విఫలమైందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం పేరుతో అనాలోచితంగా రీ సర్వేను చేపట్టిందని విమర్శించారు. ఇకపై భూ యజమానులు వచ్చి తమ హద్దులు నిర్ణయించాలని కోరితే మినహా ఎవరికీ సర్వే చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.భూములు, సహజ వనరులకు సంబంధించి సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఎం శ్వేతపత్రం విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రంలో భూ యజమానులకు రక్షణ కలి్పంచేందుకు గుజరాత్ తరహాలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తెస్తామని చెప్పారు. ఈ చట్టం ప్రకారం కబ్జాదారులే భూమి తమదని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. తమ భూములు కబ్జాకు గురైనట్లు బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే వెంటనే వారి భూములను వెనక్కి ఇప్పిస్తామన్నారు.ల్యాండ్ టైట్లింగ్ చట్టం పేరుతో గత సర్కారు భూ దోపిడీకి కుట్రలు పన్నితే తాము రద్దుకు క్యాబినెట్లో తీర్మానం చేశామన్నారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం దేశంలో ఎక్కడా అమలులో లేదన్నారు. ప్రజల భూములు లాక్కునేందుకే ఏపీలో అమలు చేశారన్నారు. అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంతో పేదలకు హక్కులు కలి్పంచినట్టే చేసి వైఎస్సార్ సీపీ నాయకులు దోచేశారన్నారు. భూ దందాలపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తామన్నారు. రూ.35 వేల కోట్ల భూ దోపిడీ వైఎస్సార్ సీపీ హయాంలో భూములతో పాటు ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూములు కబ్జాలకు గురయ్యాయన్నారు. రీ సర్వేతో భూ హద్దులు మార్చేశారన్నారు. అసైన్మెంట్, అసైన్డ్, చుక్కల, నిషేధిత భూముల విషయంలో కొత్త రకం దోపిడీకి పాల్పడ్డారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో మార్కెట్ కంటే ఐదు రెట్లు అధిక ధర చెల్లించి భూములు కొన్నారని ఆరోపణలు చేశారు. వైఎస్సార్ సీపీ కార్యాలయాలకు రూ.300 కోట్ల విలువైన 40.78 ఎకరాలను కేటాయించుకున్నారని చెప్పారు.తమకున్న సమాచారం మేరకు రూ.35 వేల కోట్ల భూ దోపిడీ జరిగినట్లు అంచనా వేస్తున్నామన్నారు. ఒంగోలు భూ కబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. 22–ఏలో భూములను చేర్చి అక్రమాలు చేశారని, అసైన్డ్ భూములను వైఎస్సార్సీపీ నాయకులు దోచేసి పట్టాలు పొందారని ఆరోపించారు. పుంగనూరులో భూ వ్యవహారాలను పునఃపరిశీలన చేస్తున్నామన్నారు. మైనింగ్, క్వారీ లీజుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు.బెదిరింపులు, భారీ జరిమానాలతో లీజులను లాక్కుని గనులు కొల్లగొట్టారన్నారు. అధికారులను డిప్యూటేషన్లపై తెచ్చి పథకం ప్రకారం దోపిడీ చేశారన్నారు. ఇసుక, లేటరైట్, ఇతర ఖనిజ నిక్షేపాలతో రూ.19 వేల కోట్లు దారి మళ్లించారన్నారు. తమ హయాంతో పోలిస్తే ఎర్ర చందనం విక్రయాల ద్వారా గత ఐదేళ్లలో 27 శాతం మాత్రమే ఆదాయం వచి్చందన్నారు. వీటన్నింటిపై ప్రజల్లో, అసెంబ్లీలో విస్తృతంగా చర్చించిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.. రూ.500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రుషికొండపై భవంతులు కట్టారని సీఎం చంద్రబాబు విమర్శించారు. వాటిని ఇప్పుడు ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదన్నారు. మద్యం, గంజాయికి బానిసలై సంఘ విద్రోహ శక్తులుగా మారిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాజకీయ వివక్షకు తావులేకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. ఒక్క కిలో కూడా ఖనిజం దోపిడీకి గురికాకుండా అడ్డుకుంటామన్నారు. గతంలో దోపిడీని ప్రశి్నస్తే దాడులు చేశారని, మడ అడవులను కబ్జా చేసి ఇళ్ల స్థలాలిచ్చారని చెప్పారు.తప్పులు చేసిన అధికారులను తొలగిస్తే దోమల మందు కొట్టించేందుకు కూడా ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. విశాఖలో రామానాయుడు స్టూడియో భూమిలో వాటా కొట్టేయాలని చూశారన్నారు. దసపల్లా భూముల్లో అక్రమంగా అపార్ట్మెంట్లు నిరి్మంచారని చెప్పారు. హయగ్రీవ భూముల్ని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కొట్టేయాలని చూశారని చెప్పారు. టీడీఆర్ బాండ్లలోనూ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. శారదా పీఠానికి ఎకరా రూ.లక్షకే 15 ఎకరాలు ఇచ్చారని చెప్పారు. ఒంగోలులో రూ.101 కోట్ల ఆస్తులు, తిరుపతిలో మఠం భూములనూ కొట్టేశారన్నారు.చిత్తూరు జిల్లాలో 982 ఎకరాలు 22ఏ జాబితా నుంచి తొలగించి రిజి్రస్టేషన్ చేసుకున్నారని చెప్పారు. భూ కబ్జాలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 10 వేల ఎకరాలు లాక్కున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్ లీజ్ ఓనర్లను బెదిరించి వైఎస్సార్సీపీ నాయకులకే అమ్మేలా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. క్వార్జ్, లేటరైట్‌ను దోచేసి సొంత సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేసుకున్నారన్నారు. పెద్దిరెడ్డి మనుషులకు ఇష్టానుసారం లీజులిచ్చారన్నారు. పోలవరం కుడి కాల్వ పనుల్లో రూ.800 కోట్ల మట్టిని తరలించారని ఆరోపించారు. -
వహ్.. జగన్ స్కీమ్‌లు కాస్త స్కామ్‌లుగా!
అమరావతి, సాక్షి: అబద్దాలు, ఆరోపణలతో ఏపీలో మరో శ్వేతపత్రం విడుదలయ్యింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సచివాలయంలో భూములు, గనులు, అటవీ సంపద దోపిడీ జరిగిందంటూ ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఒకపక్క.. వాస్తవాలు అన్నీ ఎస్టాబ్లిష్ చేయలేమంటూ, మరోపక్క.. గత పాలనపై బురద చల్లారు. ఇంతకాలం ఎల్లో పేపర్లో వచ్చిన వార్తలనే వైట్పేపర్గా ప్రొజెక్ట్ చేసి చూపించారాయన. కోర్టుకు వెళ్లి మరీ పేదల ఇళ్ల స్థలాలు, పట్టాల పంపిణీ అడ్డుకోవాలని చూసిన టీడీపీ.. ఏ కోర్టులోను అవినీతి అని నిరూపించలేకపోయింది. ఇప్పుడేమో అధికారం ఉందని పేదల ఇళ్ల పట్టాల భూములపై అవినీతి ముద్ర వేస్తూ శ్వేతపత్రం విడుదల చేసింది. జగన్ హయాంలో పేదలకు భూములను పంచడం.. 14 ఏళ్లు సీఎంగా ఉండి పేదలకు సెంట్ భూమి కూడా పంచని చంద్రబాబు దృష్టిలో ఇప్పుడు పెద్ద స్కామ్ అయ్యింది. పేదల ఇళ్ల పట్టాలకు భూములను సేకరించడం, రైతులకు పరిహారం చెల్లించడం, దళితులకు అసైన్డ్ భూములపై హక్కులు కల్పించడం గత ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసింది. దళితులకు భూములపై హక్కులు కల్పించడం, వాళ్లను యజమానులుగా చేయడం అది చంద్రబాబుకి స్వతహాగానే నచ్చనట్లుంది. అందుకే ఇందులోనూ స్కామ్ అంటూ అడ్డగోలుగా ఆరోపణలు చేశారు ఇవాళ. ఇక.. గతంలో చంద్రబాబు ఇచ్చిన జీవో 340 ఆధారంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు స్థలం కేటాయింపు జరిగింది. అయితే.. టీడీపీ ఆఫీస్ లకు స్థలాలు కేటాయిస్తే ఒప్పు అయ్యిందేమో. అదే వైఎస్సార్ సీపీ ఆఫీస్ లకు స్థలాలు ఇస్తే అవినీతంటూ సీఎం చంద్రబాబు బురద జల్లారు. దీనికి తోడు లోకేష్ తోడల్లుడు భరత్‌కి చెందిన గీతం ఆక్రమణల్ని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగా స్వాధీనం చేసుకుంది. అది మాత్రం ఇవాళ్టి శ్వేతపత్రంలోకి మాత్రం ఎక్కలేదు.పైగా 10 వేల ఎకరాల అసైన్డ్ భూములు లాగేసుకున్నారంటూ ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఎక్కడి అసైన్డ్ భూములో మాత్రం శ్వేతపత్రంలో చెప్పలేదు. కొసమెరుపు: గతంలో చంద్రబాబు పాలనలో రైతుల భూములను చుక్కల భూముల జాబితాలో చేర్చేసింది. అయితే జగన్ పాలనలో నిజమైన యాజమానులకు వాటిని తిరిగి అప్పగించారు. అయితే ఆ చుక్కల భూములను నిజమైన యజమానులకు ఇవ్వడం పెద్ద స్కామ్ అంటూ సీఎం చంద్రబాబు ఇవాళ శ్వేతప్రతం విడుదల సందర్భంగా గగ్గోలు పెట్టారు. -
కబ్జా చేసి.. పట్టా భూమిలో కలిపేసి..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో విలువైన భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మహేశ్వరం మండలంలోని రూ.180 కోట్ల విలువ చేసే భూదాన్ భూమి మాయమైంది. బోర్డు పేరున భూమి ఉన్నట్టు ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో భూమి కనిపించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిలో బోర్డులు నాటి, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఏళ్ల తరబడి అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో విలువైన ఈ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. భూదాన్ భూమి...మంఖాల్ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 435లో 12.17 ఎకరాల భూమి ఉంది. 1955–58 పహాణీ ప్రకారం ఈ భూమి ఫకీర్ మహ్మద్ పేరున ఉంది. ఆయన దీనిని 3/1/1979న (ప్రొసీడింగ్ నంబరు: 1585/79 ) భూదాన్ బోర్డుకు దానం చేశారు. 1979–80 నుంచి 1985–86 వరకు భూదాన్ సమితి పేరున ఈ భూమి రికార్డుల్లో ఉంది.ఆ తర్వాత ఈ భూమిని ప్రభుత్వం స్థానికంగా ఉన్న ఐదుగురు పేదలకు దానం చేసింది. ఆ తర్వాత ఈ భూమి పక్కనే ఉన్న ఓ పట్టాదారు ఆధీనంలోకి వెళ్లింది. సదరు రైతు ఈ భూదాన్ భూమిని తన పట్టా భూమిలో కలిపేసుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పంట సాగు చేస్తున్నాడు. నివేదికతో సరి...అసైన్‌దారుల ప్రమేయం లేకుండా రికార్డుల్లో పేర్లు మారడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిని అప్పట్లో ఏపీ లోకాయుక్త సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశాన్ని సుమోటో (కేసు నంబరు: 2585/2011)గా స్వీకరించింది. రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేసింది. దీంతో మహేశ్వరం తహసీల్దార్ సదరు కబ్జాదారుకు రికార్డులు చూపించాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఇందుకు ఆయన నిరాకరించడంతో 14/2/2012లో ఈ భూమిని తమ ఆ«దీనంలోకి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అంశాన్ని లోకాయుక్తకు కూడా నివేదించింది. ఈ భూమిలో హెచ్చరికల బోర్డు కూడా ఏర్పాటు చేసింది. అయితే కబ్జాదారు దీనిని కూలి్చవేయగా, తహసీల్దార్ ఫిర్యాదుతో మహేశ్వరం పీఎస్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. కానీ ఇప్పటివరకు ఆ భూమిని స్వా«దీనం చేసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోరంబోకు..పట్టాగా మంఖాల్ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 608, 609, 610లలో 33.8 ఎకరాల పోరంబోకు భూమి ఉంది. నిన్నమొన్నటి వరకు పేదల చేతుల్లో ఉన్న ఈ భూములు ఇటీవల పెద్దల చేతుల్లోకి వెళ్లాయి. బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువ రూ.300 కోట్ల వరకు ఉన్నట్టు అంచనా. 1996 నుంచి ప్రభుత్వ రికార్డుల్లో ఈ భూములు పోరంబోకు/గైర్హాన్ సర్కారివిగా నమోదై ఉన్నాయి. 2012లో ప్రభుత్వం వీటిని నిషేధిత జాబితా (22ఎ)లో చేర్చింది. ఆ మేరకు ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. విలువైన ఈ భూములపై కన్నేసిన కొంతమంది బడానేతలు రికార్డులు మాయం చేసి గుట్టుగా వీటిని కాజేశారు. అసలు సర్వే నంబర్లకు అనేక బై నంబర్లు సృష్టించగా, పట్టాదార్ పాస్ పుస్తకాలు కూడా జారీ అయ్యాయి. ఏడాదిక్రితం వరకు నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములు ఇటీవల పట్టా భూములుగా మారడంపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అందగా, ఆయన విచారణకు ఆదేశించడం కొసమెరుపు. -
'మాన్సాస్' కౌలు కిరికిరి
తగరపువలస (విశాఖ): అవి ఏడెనిమిది తరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములు.. వాటికి పద్దెనిమిది సంవత్సరాలకు పైగా ఏనాడూ కౌలు వసూలు చేయలేదు.. ఇప్పుడు ఉన్న పళంగా ఎవరికీ చెప్పాపెట్టకుండా గ్రామసభ పెట్టి కౌలు వేలం నిర్వహిస్తామని ఏకపక్షంగా ప్రకటించేశారు. పైగా గతంలో వన్‌టైమ్ సెటిల్మెంట్కు వచ్చి ఇప్పుడు ఆ మాట మార్చేశారు. దీంతో ఆ భూములు సాగుచేసుకుంటున్న రైతులు మండిపడుతున్నారు. ఈ కలవరపాటుకు కారణం విశాఖ జిల్లాలో ‘మాన్సాస్’ ట్రస్ట్ తాజా వ్యవహారం. విషయం ఏమిటంటే.. ఆనందపురం మండలం బోని పంచాయతీలో మాన్సాస్ ట్రస్ట్‌కు 614.97 ఎకరాల భూములున్నాయి. వీటికి సంబంధించి మూడేళ్ల కాలపరిమితితో జూలై ఒకటి నుంచి మూడో తేదీ వరకు లైసెన్సు హక్కులు నిర్ణయించనున్నారు. బహిరంగ వేలం ద్వారా నిర్ణయించనున్న ఈ ట్రస్ట్ భూములకు సంబంధించి మాన్సాస్ ప్రతినిధులు, ఆనందపురం రెవెన్యూ అధికారులు బోని పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం గ్రామసభ నిర్వహించారు. మాన్సాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల అభివృద్ధికి గాను ఈ కౌలు ద్వారా వచ్చే ఆదాయాన్ని కేటాయిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు రైతులకు తెలిపారు. కొన్నాళ్లుగా రైతులెవరూ కౌలు చెల్లించకపోవడంతో మాన్సాస్ లక్ష్యం దెబ్బతింటోందని దీనికి కౌలు రైతులంతా సహకరించకపోతే తాము మరోదారిలో వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.మాన్సాస్ భూములు కేవలం కౌలుకు మాత్రమేనని విక్రయానికి సాధ్యపడదని రైతులకు తెలిపారు. ఎవరైనా వన్‌టైమ్ సెటిల్మెంట్ పేరుతో వచ్చినా నమ్మవద్దని తెలిపారు. వ్యవసాయానికి అయితే ఏడాదికి ఎకరాకు రూ.5వేలు.. ఇటుక బట్టీలకైతే ఇంకా ఎక్కువ ధర నిర్ణయించనున్నట్లు మాన్సాస్ ప్రతినిధులు తెలిపారు. సాగు హక్కులు కావాలంటూ రైతుల పట్టు.. పద్మనాభం మండలం కృష్ణాపురంలో ఇనాం రైతులకు ఇచ్చినట్లే తమకు కూడా మాన్సాస్ సాగు హక్కులు ఇవ్వాలంటూ కౌలు రైతులు పట్టుబట్టారు. గతంలో మాన్సాస్ ప్రతినిధులు రైతులతో వన్‌టైమ్ సెటిల్మెంట్కు వచ్చినట్లు గుర్తుచేశారు. అసలు ఇక్కడి భూముల్లో బంజరు, ఇనాం, మాన్సాస్‌లకు చెందినవి విడివిడిగా చూపించాలన్నారు. స్వాతంత్రానికి పూర్వం నుంచి తమ ఏడెనిమిది తరాల వారు ఈ భూములను సాగు చేసుకుంటున్నట్లు వారంతా గుర్తుచేశారు. నిజానికి.. 18 ఏళ్లకు పైగా మాన్సాస్ ట్రస్ట్ తమ నుంచి కౌలు వసూలు చేయడంలేదని.. అంతకుముందు ఏడాదిలో ఎకరాకు రూ.20 నుంచి రూ.50 కౌలు మించేది కాదన్నారు. ఆరి్థకంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన తమపై కౌలు పేరుతో చెల్లించలేనంత భారాన్ని మోపితే సహించబోమన్నారు. దీంతో గ్రామసభ మరోమారు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పుడు కౌలు అడగడం సరికాదు.. ముగ్గురు ఆడపిల్లలు, భార్య, నేను కలిసి ఎకరా భూమి సాగుచేసుకుంటున్నాం. మాకు తాతముత్తాతల నుంచి ఈ భూమే ఆధారం. ఇప్పుడొచ్చి ఏడాదికి రూ.5 వేలు కౌలు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం సరిగాలేదు. – కాళ్ల నారాయణ, కౌలు రైతు, బోని గ్రామం ముందస్తు సమాచారమే లేదు.. ముందుగా సర్పంచ్, ఎంపీటీసీలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కనీసం పత్రికల్లో ప్రకటన కూడా ఇవ్వలేదు. వాళ్లంతట వాళ్లే కరపత్రాలు ఈరోజు పట్టుకొచ్చి గ్రామసభలో పంచిపెట్టారు. కౌలు రైతులు ఎవరూ ఇందుకు సిద్ధంగా లేరు. – బోని ముకుంద, కౌలు రైతు, బోని గ్రామం కౌలు భూములకు కమర్షియల్ ధరలా? మేం సాగు చేసుకుంటున్న భూములపై సాగు హక్కులు కల్పించాలి. అప్పుడే మా కుటుంబాలకు భద్రత. కౌలు భూములకు కమర్షియల్ ధరలంటూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు. – సూరకత్తుల వెంకట్రావు, కౌలు రైతు, బోని గ్రామం రైతులను వేధిస్తే ఊరుకోం.. 1971లో గరీబ్ హఠవో ద్వారా ఇందిరాగాంధీ.. 1986లో దున్నేవాడిదే భూమిపై హక్కులు అంటూ ఎన్టీఆర్.. 30 ఏళ్లు సాగులో ఉండేవారికి భూమిపై అన్ని హక్కులు సంక్రమిస్తాయని చెప్పారు. 1956లో ట్రస్ట్లన్నింటినీ ప్రభుత్వం రద్దుచేసింది. 1958లో పుట్టుకొచ్చిన మాన్సాస్‌పై చాలా కేసులున్నాయి. చాలా ఏళ్ల తరువాత వచ్చి ఇప్పుడు కౌలు కట్టాలని రైతులను వేధిస్తే ఊరుకోం. – బోని సోంబాబు, కౌలు రైతు, బోని గ్రామం వన్‌టైం సెటిల్మెంట్పై మాటమార్చారు.. మా బోని గ్రామ పంచాయతీ ప్రజలంతా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాం. ప్రభుత్వాలు కల్పిస్తున్న వసతులతో కౌలు భూములు సాగుచేసుకుంటున్నాం. గతంలో మాన్సాస్ ప్రతినిధులు వన్ టైమ్ సెటిల్మెంట్కు వచ్చారు. ఇప్పుడు కాదంటున్నారు. – మద్దిల తాతినాయుడు, కౌలు రైతు, బోని గ్రామం -
అధికారం వచ్చింది... ఆక్రమించేద్దాం..!
అధికార బలంతో ముందుగా అధికారులపై జులుం ప్రదర్శించడం.. భయకంపితులను చేయడం.. అనంతరం ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించడం.. అక్రమాలకు పాల్పడడం.. ఇదీ టీడీపీ నేతల దురాక్రమణ సిద్ధాంతం. ప్రజలు ఇచ్చిన అధికార బలంతో చెలరేగిపోతున్నారు. రైతులు, పశువులు, గ్రామ అవసరాలకు ఉపయోగపడే చెరువులను కబ్జా చేస్తున్నారు. రాత్రికి రాత్రే పొలాలుగా మార్చేస్తున్నారు. దీనికి విజయనగరం మండలం గాజుల రేగవద్ద ఆక్రమణకు గురైన ఊరబంద నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. విజయనగరం రూరల్: అధికారం వచ్చి నిండా నెల పూర్తికాలేదు.. అప్పుడే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారు లు, జనంపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నామన్న కసితో ఒక పక్క అధికారులను బెదిరిస్తూనే చెరువులు, ప్రభు త్వ భూముల ఆక్రమణకు తెరతీశారు. నీతి, నిజా యితీలకు మారుపేరని చెప్పుకునే టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు, తాజా ఎమ్మెల్యే, అశోక్ కుమార్తె అదితిగజపతిరాజు కనుసన్నల్లోనే తెలుగు తమ్ముళ్లు విజయనగరం మండల పరిధిలోని పలు గ్రామాల చెరువుల్లో అక్రమమట్టి తవ్వకాలకు పాల్పడుతుండగా, జమ్ము గ్రామంలో ప్రభుత్వ భూములను చదును చేసేస్తుండడం ప్రజలను కలవరపెడుతోంది. గాజుల రేగవద్ద ఉన్న రూ.4 కోట్ల విలువైన ఊరబందను ఆక్రమించేయడం సొంత పార్టీవర్గాలనే విస్మయానికి గురిచేస్తోంది.కబ్జా పర్వం ఇలా...విజయనగరం నియోజకవర్గం పరిధిలోని గాజులరేగ గ్రామ సర్వే నంబర్ 30/3లో 1.22 ఎకరాల ప్రభుత్వ చెరువు ఉంది. దీని విలువ రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం రూ.4 కోట్లు ఉంటుంది. దీనిపై అధికార పార్టీ నేత కన్నుపడింది. అంతే.. కబ్జాకు ఉపక్రమించాడు. రైతులు, పశువులు, జీవాల దాహార్తిని తీర్చే చెరువును మట్టితో పూర్తిగా కప్పేసి పొలంలా చదును చేసేశాడు. అంతటితో ఆగకుండా ఎవరికీ అనుమానం రాకుండా సాగు భూమిగా మలచి చెరువులో నీలగిరి మొక్కలను సైతం నాటేశాడు. రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా చర్యలకు ఉపక్రమించకుండా ఎమ్మెల్యేకూ వాటా ఉందని చెబుతూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం చెరువు ఆక్రమణ అటు రెవెన్యూ, ఇటు గ్రామ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.చెరువు కబ్జా ఎమ్మెల్యే దృష్టికి వెళ్లినా...సర్వే నంబర్ 30/3లో 1.22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ చెరువును తమ పార్టీకి చెందిన బడా నేతే ఆక్రమించినట్టు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు దృష్టిలో ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రభుత్వ చెరువు కబ్జాకు పాల్పడిన పార్టీ నాయకుడిపై ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వ భూముల కబ్జాలు, అక్రమ మట్టి తవ్వకాలను ఆదిలోనే అడ్డుకుని అశోక్ పేరు నిలబెట్టాలని, లేదంటే ప్రజల్లో చులకన అయిపోతామని చెబుతున్నారు. ఆక్రమణల్లో రాజు పాత్ర ఉందా..? లేదంటే స్థానిక నాయకుడే ఆక్రమించి రాజుల పేరు చెబుతున్నాడా అన్న అనుమానాలను కొందరు వ్యక్తంచేస్తున్నారు.చెరువు ఆక్రమణను అడ్డుకుంటాంగాజులరేగ రెవెన్యూ పరిధి లోని సర్వే నంబర్ 30/3 లో ఉన్న 1.22 ఎకరాల చెరువు ఆక్రమణ తమ దృష్టికి వచ్చింది. ఆక్రమణకు గురైన ఊరబంద స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశాం. గ్రామ రెవెన్యూ అధికారి నివేదిక అందిన వెంటనే తగు చర్యలు తీసుకుంటాం. చదును చేసిన స్థలంలో నాటిన నీలగిరి మొక్కలు తీసి వేయడానికి చర్యలు తీసుకుంటాం.– పి.వి.రత్నం, తహసీల్దార్, విజయనగరం -
భూములమ్మి రాజధాని నిర్మిస్తాం: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: అమరావతిలో రైతులిచ్చిన భూములతో పాటు ప్రభుత్వ భూముల్లో రోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు చేపట్టగా మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుందన్నారు. రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను కూడా రాజధాని నుంచి వచ్చే సంపదతోనే అమలు చేస్తామన్నారు. గురువారం రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక శిథిలాల నుంచి ప్రారంభించి ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి భూమి పూజ చేసిన ప్రాంతం, ప్రజా ప్రతినిధులు, అధికారుల కోసం నిర్మించ తలపెట్టిన భవనాల సముదాయాలను పరిశీలించారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డులోని సీఆర్డీఏ భవనం వద్ద సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అమరావతి, పోలవరాన్ని సంపద సృష్టించే కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. దక్షిణాదిలో గోదావరి భారీ జల నిధి లాంటిదన్నారు. పోలవరం పూర్తయితే నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకూ నీళ్లివ్వచ్చన్నారు. విభజన అనంతరం రాజధాని నిర్మాణం కోసం ఆర్థిక తోడ్పాటు, పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించిందన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించగా అమరావతికి ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. ప్రజారాజధానిగా అమరావతి ఐదు కోట్ల మందికి దశ, దిశను నిర్దేశిస్తుందన్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే గర్వంగా పనులు చేసుకోవచ్చన్నారు. రాజధానిని వైఎస్ జగన్ అతలాకుతలం చేశారని విమర్శించారు. సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. రాజధానిపై శ్వేతపత్రం.. రాజధానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 16 వేల గ్రామాలు, దేశవ్యాప్తంగా పవిత్రమైన ప్రాంతాల నుంచి మట్టి, నీళ్లు తెచ్చి అందరు దేవుళ్ల ఆశీర్వాదాలతో శంకుస్థాపన చేశాం. ఆ మహిమే నేడు రాజధానిని కాపాడింది. ఎవరైనా సీఎం అయితే మంచి కార్యక్రమంతో ప్రజలను మెప్పిస్తారు. కానీ జగన్ ప్రజావేదిక కూల్చి పాలన ప్రారంభించారు. రాజధానిలో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇష్టానుసారంగా విధ్వంసం చేశారు. పైపులు, ఇసుక దొంగతనం చేయడంతో పాటు రోడ్లను కూడా తవ్వుకుపోయారు. ఒక్క బిల్డింగ్‌ను కూడా పూర్తి చేయలేదు. రోడ్ల నిర్మాణాలన్నీ సగంలో ఆగిపోయాయి. ఐఏఎస్, ఐపీఎస్, జడ్జీలు, మంత్రులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల భవన నిర్మాణాలను అర్థాంతరంగా నిలిపేశారు. రాజధాని ప్రస్తుత పరిస్థితపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఏం చేయాలనే దానిపై అధ్యయనం చేయాల్సి ఉంది. కన్సార్టియంపైనా విషం చిమ్మారు.. తెలుగుజాతి గర్వంగా తలెత్తుకు తిరిగే రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం. విశాఖను ఆర్థిక రాజధానిగా, కర్నూలును ఆధునిక నగరంగా తయారు చేయాలనుకున్నాం. రాజధానిపై బురద జల్లి బ్రాండ్ దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ఇన్సైడర్ ట్రేడింగ్, స్విస్ ఛాలెంజ్‌లో మోసం అన్నారు. సింగపూర్ కన్సార్టియంపైనా విషం చిమ్మి తరిమేశారు. రాష్ట్రానికి మధ్యలో ఉండేలా ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో చెప్పింది. దానికి అనుగుణంగానే గుంటూరు కేంద్రంగా అమరావతిని రాజధానిగా గుర్తించాం. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారు. పదేళ్ల తర్వాత రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితికి తీసుకొచ్చారు. రైతులు ఇచ్చిన భూములే కాకుండా ప్రభుత్వ భూములు కలిపి 55 వేల ఎకరాలను సేకరించాం. 29 వేల మంది రైతుల్లో ఒక్కరు కూడా కోర్టుకు వెళ్లకుండా ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూములిచ్చారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ‘ఏ’ అంటే అమరావతి.. ‘పీ’ అంటే పోలవరంగా గుర్తుంటుంది. నదులు అనుసంధానిస్తాం.. ప్రజలు కూటమికి ఏకపక్షంగా ఓట్లు వేయడంతో రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద విజయం లభించింది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి పనికిరాడని తీర్పు ఇచ్చి 11 సీట్లకు పరిమితం చేశారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, అర్హతలేని వ్యక్తి సీఎం అయితే రాష్ట్రం ఎంత నష్టపోతుందో గత ఐదేళ్లలో చూశాం. పోలవరం, అమరావతి వ్యక్తిగత అంశానికి సంబంధించినవి కాదు. వ్యక్తికి, వర్గానికి, ప్రాంతానికి పరిమితమైనవి కావు. వాటి ద్వారా సంపద సృష్టి జరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం పూర్తయితే రాయలసీమ రతనాల సీమ అవుతుంది. గత ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపింది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఖర్చు కూడా రెట్టింపు అయ్యింది.అప్పులెంతో తెలియదు..ప్రభుత్వ విధానాలతోనే ప్రజల జీవితాలు మారుతాయి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి చేస్తాం. దీర్ఘకాలంలో ప్రజల జీవితాలకు వెలుగునిచ్చే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఐదేళ్ల విధ్వంసాన్ని భరించలేకే ప్రజలు ముందుకు వచ్చి ఓట్లు వేశారు. ఎటువంటి అరమరికలు లేకుండా ప్రతి పనిని ప్రజల ముందు ఉంచుతాం. తప్పుడు పనులు చేసిన వారిని క్షమించం. రౌడీయిజాన్నిఅణచివేస్తాం. రాజధానిలో నిర్మాణాలను ఉన్మాది బారి నుంచి దేవుడే కాపాడాడు. రుషికొండను చదును చేసి రూ.500 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు. పర్యావరణానికి విరుద్ధంగా ప్రవర్తించారు. జగన్ లాంటి వ్యకు్తలకు రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉందా? అనేది ప్రజల్లో చర్చ జరగాలి. అప్పులు ఎంత చేశారో తెలియదు. అడ్డదిడ్డంగా సంతకాలు పెట్టిన అధికారులు ఎక్కడున్నారో తెలియదు. ఇవన్నీ సరిదిద్దాలి. రాజధాని భూములను కూడా తాకట్టు పెట్టారేమో చూడాలి. లాలూచీ పడే అధికారుల ప్రవర్తన మార్చుకోవాలి. -
మీ దస్తావేజులు మీకే ఇస్తారు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో మాట్లాడేందుకు ‘పచ్చ’ముఠాకు ఏమీలేక భూముల పేరు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ చంద్రబాబు తనకు ఉచ్ఛనీచాలు లేవని చాటుకుంటున్నాడు. ప్రజలు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, తాను మాత్రం ఎన్నికల్లో లబ్దిపొందాలనే ఏకైక లక్ష్యంతో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి భయంకరమైన కుట్రకు తెరలేపాడు. మీ భూములు పోతాయని, దస్తావేజులు ఇవ్వరని, భూ యజమానులను జైల్లో పెడతారంటూ దారుణమైన అపోహల్ని సృష్టించాడు. వాటిని తాను స్వయంగా చెప్పడంతోపాటు ఏకంగా పత్రికల్లో ఫుల్‌పేజీ ప్రకటనలు జారీచేశాడు. ప్రజలను భయపెట్టేందుకు ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చిన మొట్టమొదటి నేతగా చంద్రబాబు చరిత్ర సృష్టించాడు. భూములపై దు్రష్పచారాలను తొలుత ఎల్లో మీడియాతో చేయించి ఆ తర్వాత తానే ఆ విషయాలను చెబుతూ వికృత తాండవం చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆ దుష్ప్రచారాన్ని పత్రికల్లో భారీ ప్రకటనల ద్వారా మరీ చేస్తుండడం చంద్రబాబు బరితెగింపునకు పరాకాష్ట. ఈ దు్రష్పచారాలపై వాస్తవాలివే.. పచ్చి అబద్ధం.. స్థిరాస్తుల రిజి్రస్టేషన్లు జరిగాక యజమానులకు దస్తావేజులు ఇవ్వరనేది టీడీపీ సృష్టించిన భయంకరమైన అపోహ. ఏడాదిగా 9,58,296 స్థిరాస్తుల రిజి్రస్టేషన్లుగా జరగ్గా సంబంధిత రైతులకు ఒరిజినల్ దస్తావేజులే ఇచ్చారు.15,91,814 ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్లను ఇళ్ల యజమానులకు ఎప్పటిలాగే ఇచ్చారు. 1.75 లక్షల మందికి టిడ్కో ఇళ్లను రిజి్రస్టేషన్ చేసి ఒరిజినల్ పత్రాలు ఇచ్చారు. ఈ–స్టాంపింగ్ పైనా ఎడతెగని దు్రష్పచారం చేస్తున్నారు. నిజానికి ఈ ప్రక్రియ 2016లోనే మొదలైంది. 2016 నుంచి 2019 వరకు 2,27,492 డాక్యుమెంట్లను ఈ–స్టాంపింగ్ ద్వారా జారీచేశారు. 2019 నుంచి ఇప్పటివరకు 60,66,490 డాక్యుమెంట్స్ జారీచేశారు. ఇవన్నీ ఒరిజినల్సే. ఏవి జిరాక్స్ కాపీలు కాదు. మీ వారసులను నిర్ణయించేది మీరే.. సమస్య వస్తే కోర్టులకూ వెళ్లొచ్చు.. మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారనేది మరో దారుణమైన వక్రీకరణ. భూ యజమానులు తమ వారసులను తామే నిర్ణయించుకోవచ్చు. ఇంకా అమల్లోకి రాని ల్యాండ్ టైటిలింగ్ చట్టం సెక్షన్ 25 (3) ప్రకారమైనా.. టైటిల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్ వారసత్వాన్ని నిర్థారణలో ఏదైనా వివాదం ఉందని భావిస్తే సంబంధిత సివిల్ కోర్టుకు రిఫర్ చేస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్) చట్ట ప్రకారం వారసత్వ నిర్ధారణలో వివాదం ఉంటే భూ యజమానులే కోర్టుకు వెళ్లాల్సి వుంటుంది. మీ ఆస్తి మీది కాదని టైట్లింగ్ ఆఫీసర్ చెప్పలేరు.. రీ సర్వే ప్రకారం రికార్డుల్లో ఒకసారి రైతు పేరు చేరితే ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం వారు ఎటువంటి రికార్డు సమర్పించాల్సిన అవసరంలేదు. ఆ డేటాపై ఆ గ్రామంలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 90 రోజుల వరకు అభ్యంతరాలు సమర్పించవచ్చు. ఆ తర్వాత వారి పేర్లు టైటిల్ రిజిస్టర్లో నమోదవుతాయి. ఈ రిజిస్టర్‌లోని పేర్లపై రెండేళ్లలోగా ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే అప్పుడు కన్‌క్లూజివ్ టైటిల్ నిర్ధారణ అవుతుంది. టైటిల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్ (టీఆర్ఓ) ఇచి్చన ఈ నిర్ధారణ ఆర్డర్‌పై అభ్యంతరం ఉంటే ల్యాండ్ టైట్లింగ్ అప్పిలేట్ ఆఫీసర్‌కి (ఎల్‌టీఏఓ)కి అప్పీలు చేసుకోవచ్చు. దానిపైనా సంతృప్తి చెందకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. భూ యజమానులను జైల్లో ఎందుకు పెడతారు? సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెడతారని, తాతల నాటి భూములైనా నేతల దయ ఉండాల్సిందేనని, జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చంటూ చంద్రబాబుకు మతి చెడిపోయి పత్రికల్లో పిచ్చి ప్రకటన ఇచ్చాడు. ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఇవన్నీ వక్రభాష్యాలే. సరైన పత్రాల్లేవని యజమానులను జైల్లో పెట్టే స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ప్రజల్లో భయానక స్థితిని కల్పించేందుకు ఈ ప్రచారాలు చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్, వాయిస్ రికార్డింగ్స్ ద్వారా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుండడంతో ఎలక్షన్ కమిషన్ చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరుగుతోంది. అయినా, రాజకీయ లబ్దికోసం చంద్రబాబు బట్టలు విప్పేసుకుని మరీ దుష్ప్రచారానికి తెగబడుతూనే ఉన్నాడు. ఈ ప్రచారాన్ని ప్రింట్ మీడియాలో చేస్తే ఈసీ అనుమతి అవసరంలేదనే లొసుగును అడ్డంపెట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లుతున్నాడు. మూడుసార్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న వృద్ధ నేత చేసే పనేనా ఇది? సిగ్గు విడిచి, ప్రజల ప్రయోజనాలు గాలికొదిలేసి తన కోసం చేస్తున్న కుతంత్రం ఇది. చట్టం ఇంకా అమల్లోకి రాలేదు.. ఈ చట్టానికి సంబంధించి ఇంకా నిబంధనలు రూపుదిద్దుకోలేదు. దీని పరిధినీ నిర్ధారించలేదు. ఈ చట్టంలో డిజిగ్నేట్ చేయబడిన అధికారులనూ నియమించనేలేదు. ప్రజల నుంచి సలహాలు, సూచనలను తీసుకున్నాక మార్పులు, చేర్పులకు ప్రభుత్వం సిద్ధమంది. నిబంధనలు తయారుచేసి, కాంపిటెంట్ అథారిటీ అనుమతి వచ్చాకే చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ చట్టానికి టీడీపీ మద్దతిచ్చింది.. నిజానికి.. ల్యాండ్ టైట్లింగ్ బిల్లును అసెంబ్లీలో పెట్టినప్పుడు టీడీపీ దానికి పూర్తి మద్దతిచ్చింది. అంతేకాదు.. సుదీర్ఘ అధ్యయనం, ఎంతో కసరత్తు తర్వాత ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. లీగల్ అడ్వైజర్‌గా నల్సార్ యూనివర్సిటీని నియమించుకుని ముసాయిదా బిల్లును రూపొందించింది. 2011 నుండి 2019 వరకు తయారుచేసిన వివిధ మోడల్ చట్టాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ చట్టాన్ని రూపొందించారు. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన బిల్లును 2019లో అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చ జరిగింది. దీనికి అప్పుడు టీడీపీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, లా డిపార్ట్మెంట్ , ఐటీ, హోమ్, సోషల్ వెల్ఫేర్ వంటి డిపార్ట్మెంట్లన్నీ మూడేళ్లపాటు జాగ్రత్తగా పరీక్షించి పలు సూచనలు చేశారు. ఆ మేరకు మార్పులు చేర్పులు చేసి తిరిగి మళ్లీ అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఏ కేంద్ర చట్టాలకీ వ్యతిరేకంగా ఈ చట్టంలేదని నిర్ధారించిన తర్వాతే రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. బాబు బినామీ ఆస్తులు బయటకు వస్తాయనే దుష్ప్రచారం.. వాస్తవానికి.. రీ సర్వే పూర్తయ్యాకే ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వస్తుంది. అది జరిగితే అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలో చంద్రబాబు ఆయన ముఠా బలవంతంగా లాక్కుని బినామీ పేర్లపై పెట్టిన ఆస్తులు ఎక్కడ బయటికి వస్తాయోననే భయంతో సాధారణ జనంతో దీనికి ముడిపెట్టి అడ్డంకులు సృష్టిస్తున్నారు. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేకరకాల చట్టాలు చేస్తుంటాయి. వాటివల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటుందని భావిస్తే సవరణలు తెస్తారు. కానీ, ఒక చట్టాన్ని రద్దుచేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు ఇప్పుడు ఆ పని కూడా చేసి తన విలువల స్థాయి ఏంటో ప్రదర్శించుకున్నారు. మేనిఫెస్టోలో అమలుచేయలేని అనేక హామీలిచ్చి నా ఈ ఒక్క దానిపైనే ఇంత దృష్టిపెట్టి గందరగోళం సృష్టించడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి? వారు దోచుకున్న, ఆక్రమించిన బినామీ భూములు, ఆస్తులు ఎక్కడ బయట పడతాయోననే భయంతోనే ఇదంతా చేస్తున్నారు. ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకుల్లో ఎవరైనా ఇది మంచిది కాదని ఒక్క మాటైనా చెప్పారా? రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సభల్లో ప్రధాని, కేంద్ర హోంమంత్రి అనేకమంది బీజేపీ ముఖ్యనేతలు తమ ప్రసంగాల్లో ఈ చట్టం గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? ఈ చట్టం మంచిది కాదని బీజేపీ నాయకులతో చంద్రబాబు చెప్పించగలరా? కేవలం తమ బినామీ ఆస్తులను రక్షించుకునేందుకే ఎల్లోగ్యాంగ్ చేస్తున్న గందరగోళమే ఇదంతా? -
ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా కూటమి ప్రచారం
సాక్షి, విశాఖపట్నం: ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. వివాదాలకు తావులేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందన్నారు.కాగా, మంత్రి బొత్స గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బ తీసేలా కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారు. ఈసైన్ ద్వారా, ఆధార్ అతంటికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. మెమోలో ఉన్నది ఒక్కటైతే.. విపక్షాలు మరొకటి ప్రచారం చేస్తున్నారు.దేశమంతా ఈ చట్టం అమలు చేయాలని కేంద్రప్రభుత్వమే సూచించింది. వివాదాలకు తావులేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగింది. దళారి వ్యవస్థ ఉండకూడదని యాక్ట్ తెస్తున్నాము. భూమి పేపర్లకు జిరాక్స్ పేపర్లు ఇస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జిరాక్స్ పేపర్లు ఇస్తారు అనేది అబద్ధం. ఎన్నికల కోడ్ లేకపోతే తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోనే వాళ్లం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రలకు సలహాలు సూచనలు ఇచ్చింది. ఇంకా యాక్ట్ రాలేదు, రాని యాక్ట్‌ను తొలగిస్తామని చంద్రబాబు చెబుతున్నాడు.యాక్ట్‌పై అమలు చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తాము. చంద్రబాబు, పవన్, రామోజీరావు, రాధాకృష్ణ క్రిమినల్స్‌లాగా మాట్లాడుతున్నారు. ప్రజల ఆస్తులకు మరింత రక్షణ కల్పించాలనేది సీఎం జగన్ ఆలోచన. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై మూడు సార్లు అసెంబ్లీలో చర్చ జరిగింది.2014లో చంద్రబాబు 50 పేజీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. సీఎం జగన్ నాలుగు పేజీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. వైఎస్సార్సీపీ పథకాలను, మేనిఫెస్టో పేజీలను చంద్రబాబు కాఫీ కొట్టారు. టీడీపీ మేనిఫెస్టో చెత్త బుట్టలో వేయడానికి తప్ప దేనికి పనికి రాదు. టీడీపీ మేనిఫెస్టోపై మోదీ, పురంధేశ్వరి బొమ్మలు ఎక్కడ ఉన్నాయి. మంచి పని చేస్తున్న సీఎం జగన్ ఫోటో సర్వే రాళ్ళు మీద వేస్తే తప్పేంటి’ అని కామెంట్స్ చేశారు. -
భూదందాలకు ఇవిగో ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల జాబితాను అడ్డుపెట్టుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు అనేక భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఏఐసీసీ కిసాన్‌సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డి ఆరోపించారు. షామీర్పేట మండలం తూంకుంట, బొంరాస్‌పేట, చేవెళ్ల మండలం చందవెల్లి, మాజిల్‌పూర్ గ్రామాల్లో జరిగిన భూకుంభకోణాలకు సంబంధించిన సమగ్ర ఆధారాలను సమర్పించానని, వీటిపై విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం గాందీభవన్‌లో కోదండరెడ్డి మీడియాతో మాట్లాడారు. షామీర్పేట మండలం తూంకుంట గ్రామంలోని 164/1 సర్వే నెంబర్లోని 26 ఎకరాల అటవీ భూమిని జూన్, 2022లో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని ఆరోపించారు. బొంరాస్‌పేట గ్రామంలోని 260/2, 261, 265/8, 361/7, 361/9 సర్వే నెంబర్లలో రక్షణ శాఖకు చెందిన భూమిని బాలాజీ అసోసియేట్ అనే సంస్థకు ఇచ్చారని, అదే గ్రామంలోని 65 ఎకరాల ప్రైవేటు భూమిని రైతులకు కాకుండా అప్పట్లో రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుటుంబానికి చెందిన ఎఫ్ఫర్ఎల్ ఫార్మ్ అనే సంస్థకు దారాధత్తం చేశారని నిందించారు. నిషేధిత జాబితాలో పెట్టిన భూములను 2018లో ఎన్నికలు కాగానే అంబుజ్ అగర్వాల్ పేరిట రిజి్రస్టేషన్ చేశారని ఆరోపించారు. 24లక్షల ఎకరాల అసైన్డ్ భూమిని నిషేధిత జాబితాలో పెట్టి వారికి అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టారని కోదండరెడ్డి విమర్శించారు. దళితుల భూములను కేటీఆర్ అమ్ముకున్నారు చేవెళ్ల మండలం చందవెల్లి అనే గ్రామంలో దళితుల నుంచి ఎకరం రూ.9 లక్షల చొప్పున 1,500 ఎకరాలు తీసుకుని తనకు అనుకూలంగా ఉన్న మల్టినేషనల్ కంపెనీకి ఎకరానికి రూ.1.30 కోట్లకు కేటీఆర్ అమ్ముకున్నారని కోదండరెడ్డి ఆరోపించారు. మాజిల్‌పూర్ అనే గ్రామంలో ల్యాండ్‌సీలింగ్‌లో ఉన్న 25 ఎకరాల భూమిని పట్టా చేసుకున్నారని చెప్పారు. వీటన్నింటికీ సంబంధించి సమగ్ర ఆధారాలను ప్రభుత్వానికి ఇచ్చానని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. భూములను కాజేయాలనే కుట్రపూరిత ఆలోచనలతోనే కేసీఆర్ ధరణికి రూపకల్పన చేశారని, రాష్ట్రంలో జరిగిన భూకుంభకోణాలు, అక్రమాలకు కేసీఆర్, కేటీఆర్‌లే బాధ్యులని ఆరోపించారు. అప్పటి సీఎస్ సోమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. పార్లమెంటు ఎన్నికలు పూర్తికాగానే చర్యలకు ఉపక్రమించి కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు ఇందుకు బాధ్యులైన ఎంతటి వారిపైన అయినా కఠినచర్యలు తీసుకోవాలని కోదండరెడ్డి డిమాండ్ చేశారు. -
కాలం చెల్లిన బాబు నమూనా
ఫ్రెంచ్ వనిత డా‘‘ డెలాల్ బెన్బాబాలి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో సోషల్ జాగ్రఫీ – ఆంత్రో పాలజీ స్కాలర్. ఆమె – ‘క్యాస్ట్ డామినెన్స్ అండ్ టెరిటరీ ఇన్ సౌత్ ఇండియా: అండర్స్టాండింగ్ కమ్మాస్ సోషియో –స్పేషియల్ మొబిలిటీ’ అంశంపై పరిశోధన చేశారు. ఆమె తన పరిశోధనలో ప్రధానంగా దృష్టి పెట్టిన అంశం ఆసక్తికరమైనది. ఒక భూభాగంపై ఆధిపత్యం చలాయించే విషయంలో జనాధిక్యత ఉండే కులాలకూ, ఆధిపత్య కులాలకూ మధ్యఉండే వ్యత్యాసాన్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేశారామె. ‘హైదరాబాద్ నగరంలో ఆంధ్ర కల్చర్ విస్తరించడంలో కొత్తగా వలస వచ్చినవారి పాత్ర,’ ‘సామాజిక ఊర్ధ్వ చలనానికి దోహదం చేస్తున్న వలసలు’ వంటి మరో రెండు పరిశోధనా పత్రా లను కూడా గమనిస్తే వాటిల్లో ‘కామన్’గా కనిపి స్తున్న అంశాలు మూడు ఉన్నాయి. అవి – భూమి, వలసలు, ఆధిపత్యం. ఈ అంశాలను, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అన్వయించడం జరిగింది. ఆమె విదేశీ స్కాలర్ కనుక ఆమెకు ఇక్కడి రాజకీయాలు, కులాల విషయంలో ఇష్టాయిష్టాలకు ఆస్కారం లేదు. పైగా ఆమె పరిశోధనా వ్యాసాలు 2010కి ముందు కాలం నాటివి. కనుక ఆమె సూత్రీక రణలలోని నిజాయతీని అనుమానించడానికి ఆస్కారం కనిపించదు. అయితే, ఆమె తన మొత్తం పరిశోధనను – ‘ఆధిపత్యం’ వద్దకు తెచ్చి ఒక ముగింపు ఇవ్వడం, అందుకు ఆమె తీసుకున్న ఉదాహరణను ముందుగా మనం గుర్తించాలి. ఆంధ్ర ప్రాంతం నుంచి వలసవచ్చిన చంద్రబాబు కులస్థులు హైదరాబాద్ నగరానికి పశ్చిమాన జూబ్లీ హిల్స్–కూకట్ పల్లికి మధ్య ఉన్న భూములను ఆవాసాలుగా చేసుకుని స్థిరపడ్డారు. దాంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆప్రాంతంలో ‘రియల్ ఎస్టేట్’ వ్యాపారాన్ని ప్రోత్స హించి, దాన్ని ‘సైబరాబాద్’ అంటూ వారు ప్రయోజనం పొందే వ్యూహాన్ని అమలు చేశారు. అతని వ్యూహం మేరకు అది విజయవంతం అయినప్పటికీ, హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణ జిల్లాల్లో కూడా స్థానికులు వీరి ‘ఆధిప త్యాన్ని’ ప్రశ్నించడంతో రాష్ట్ర విభజన జరిగింది. దాంతో ఏపీ సీఎంగా చంద్రబాబు మళ్ళీ అదే పాత ‘సైబరాబాద్’ వ్యూహాన్ని ఈసారి – ‘రాజధాని అమరావతి’ పేరుతో ఇక్కడ అమలుకు తెర తీశారు. బాబు దాని కోసం, భారత ప్రభుత్వం నియమించిన ‘శివరామ కృష్ణన్ కమిటీ’ నివేదికను సైతం పక్కనపెట్టి, అందుకు ‘ఎన్డీయే’లో టీడీపీ భాగస్వామ్యాన్ని అడ్డంగా వాడుకున్నారు. అమరావతి భూమి పూజకు 2016లో వచ్చిననరేంద్రమోదీ ఆ తర్వాత, బాబు ఏపీ తన సొంత జాగీరు అన్నట్టుగా, విదేశీ కంపెనీలతో నిర్మాణ ఒప్పందాలు, ‘అమరావతి’ భూముల్లో వాటాలు ఇచ్చినా, ఏనాడూ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? అని అడిగింది లేదు. బాబు నిజంగా ‘విజనరీ’ అయితే, కొత్త రాష్ట్రం అభివృద్ధి కోసం మొదటి ఐదేళ్లలో పూర్తి చేయగలిగిన ‘ప్లాన్’ మాత్రమే అమలు చేయాలి. అదే జగన్ మోహన్ రెడ్డి విషయంలో చూడండి. అన్ని ఆర్థిక స్థాయుల్లోని వర్గాలకు ‘సంక్షేమం’అందిస్తూనే, రెండున్నర ఏళ్ళ ‘కరోనా’ కాలాన్ని దాటి, తీరాంధ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టి 16 వేల కోట్ల రూపాయలతో 4 పోర్టులు, రూ. 3,793 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ లేండ్సెంటర్లు నిర్మిస్తున్నారు. అలా శ్రీకాకుళం నుంచి చిత్తూరు సరిహద్దు వరకు సముద్ర తీరం వెంట సహజ ప్రకృతి వనరుల అభివృద్ధికి పెట్టుబడుల్ని వికేంద్రీకరించడం వల్ల; భవిష్యత్తులో ‘భూమి’ దాని సొంతదారు ‘ఆధిపత్యం’ వంటివి ఇకముందు లేకపోగా, ‘వలసలు’ కూడా ఇకముందు తగ్గుతాయి. డా‘‘ డెలాల్ బెన్బాబాలి తన పరిశోధనా వ్యాసాల్లో ప్రస్తావించిన – భూమి, వలసలు, ఆధిపత్యం అంశాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ తన తొలి టర్మ్‌లోనే ‘అడ్రెస్’ చేయడం ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఆమె పరిశోధనా వ్యాసాలు– కమ్మ కులం కేంద్రంగా ఉన్నప్పటికీ, రెడ్ల ప్రస్తావనను ఆమె వదిలి పెట్టలేదు. అయినా ఇక్కడ కులాలు ఏవి అనే ఆరా కంటే, ‘ఎప్పుడు’, ‘ఎవరు’ అనే దృష్టి మనకు ముఖ్యం. దేశం స్వతంత్రమై వందేళ్లకు చేరువ అవుతున్నప్పుడు, వనరుల పంపిణీ అన్ని ప్రాంతాలకూ, అన్ని సామాజిక వర్గాలకూ వారి వారి దామాషా మేరకు చేరే ప్రయత్నం మొద లయిందా లేదా అనేది ఇక్కడ కీలకం. తన మొదటి ఐదేళ్ల టర్మ్ లోనే 13 జిల్లాలను 26గా చేసి ప్రభుత్వాన్ని సూక్ష్మ స్థాయికి తీసుకువెళ్లడంలో జగన్ ప్రభుత్వం విజయవంతం అయింది. రాబోయే ఐదేళ్ల కాలంలో ఇప్పుడు జరుగుతున్న వనరుల పంపిణీ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. అనుమానం లేదు, అందువల్ల పేద వర్గాల జీవన ప్రమాణాలు మునుపటి కంటే చాలా బాగా మెరుగవుతాయి. - వ్యాసకర్త మాజీ శాసన సభ్యులుమొబైల్: 98481 28844 - అడుసుమిల్లి జయప్రకాష్ -
వార్షిక కౌలు జీవో అమలును నిలిపేయండి
సాక్షి, అమరావతి : రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు వార్షిక కౌలును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలన్న సీఆర్డీఏ చట్ట నిబంధనను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లింపు నిమిత్తం రూ.240 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం గతేడాది మే 5న జారీ చేసిన జీవో 286 అమలును నిలిపేయాలని కోరుతూ విశాఖపటా్ననికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ యునైటెడ్ ఫ్రంట్ నార్త్ ఆంధ్రా జిల్లాల అధ్యక్షుడు పాక సత్యనారాయణ ఈ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ.. ఏపీ క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీం (ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్) రూల్స్ 2015, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017ను శాసనసభ ఆమోదం లేకుండానే అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఈ నిబంధనలను రాజధాని కోసం భూములిచ్చిన రైతులను ఆదుకునేందుకు తెచ్చారని తెలిపారు. అయితే వీటిని శాసనసభ ముందు ప్రవేశపెట్టనందున ఇవి చట్ట విరుద్ధమవుతాయన్నారు. వాస్తవానికి సీఆర్డీఏ 2014 చట్టంలో ఎక్కడా రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని లేదని, అందువల్ల రాష్ట్ర ఖజానా నుంచి వార్షిక కౌలు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదని వివరించారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 53(1)(డీ) ప్రకారం మొత్తం భూమిలో 5 శాతం భూమిని పేదల నివాసం కోసం గత ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా కేటాయించలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ చట్టం తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అందులో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రక్షణ కల్పించిందని గుర్తు చేసింది. అయితే ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఉపసంహరించుకుందని వీఆర్ రెడ్డి తెలిపారు. అలా అయితే ఉపసంహరణ వల్ల చట్ట నిబంధనలు ఏ విధంగా ప్రభావితం అవుతాయో తెలియజేయాలని వీఆర్ రెడ్డికి ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. రైతుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసేందుకు ధర్మాసనం అంగీకరించింది. -
‘ధరణి’ పరిష్కారం 'పేపర్‌పైనే'!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ భూముల సమస్యలకు పరిష్కారం కాగితాలకే పరిమితం అవుతోంది. ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్‌లో 76 వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించినట్టు ప్రభుత్వం చెప్తున్నా.. ఆ వివరాలేవీ పోర్టల్‌లో అప్డేట్ కాలేదు. అంతేకాదు పోర్టల్‌లోని సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ పెట్టుకున్న గడువు కూడా ముగిసింది. అయినా ఇంకా పెద్ద సంఖ్యలో పెండింగ్ దరఖాస్తులు మిగిలిపోయాయి. దీనితో డ్రైవ్‌ను పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నా క్షేత్రస్థాయి అధికారుల్లో మాత్రం గందరగోళం కనిపిస్తోంది. ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న ప్రైవేట్ కంపెనీ అవసరమైన లాగిన్లు ఇవ్వకపోవడంతోనే దరఖాస్తుల పరిష్కార వివరాలను ఆన్లైన్లో నమోదు చేయలేకపోతున్నట్టు రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం నెరవేరలేదన్న భావనలో రెవెన్యూ వర్గాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో గందరగోళం రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో పరిష్కారం కోసం వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా 76,382 దరఖాస్తులను రెవెన్యూ యంత్రాంగం వివిధ స్థాయిల్లో పరిష్కరించింది. తహసీల్దార్, ఆర్డీవో, జేసీ, కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిల్లో ఆయా దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. కానీ ఆన్లైన్లో అప్డేట్ కాలేదు. ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో సమస్యల పరిష్కారానికి కేవలం కలెక్టర్లు, సీసీఎల్ఏ వద్ద మాత్రమే డిజిటల్‌తోపాటు అధీకృత లాగిన్లు ఉన్నాయి. తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు లాగిన్లు లేవు. గతంలో తహసీల్దార్లకు డిజిటల్ లాగిన్లు ఇచ్చినా.. దరఖాస్తులను పరిష్కరించినట్టుగా పేర్కొని అప్డేట్ చేసే అదీకృత లాగిన్లు లేవు. అ«దీకృత లాగిన్లు ఇచ్చేందుకు మరో 10–20 రోజుల సమయం పడుతుందని ‘ధరణి’ నిర్వహణ కంపెనీ చెప్తున్నట్టు తెలిసింది. గడువు ముగిసిపోయినా.. స్పెషల్ డ్రైవ్ ప్రారంభానికి ముందే.. అన్నిస్థాయిల్లో అదీకృత లాగిన్లు ఇవ్వాలని పోర్టల్ నిర్వహణ కంపెనీని కోరినట్టు రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. కానీ కంపెనీ ఇప్పటివరకు ఆ లాగిన్లు ఇవ్వలేదని.. పరిష్కారమైన దరఖాస్తుల్లోని భూముల వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసే వీలు లేకుండా పోయిందని అంటున్నాయి. స్పెషల్ డ్రైవ్ కోసం ప్రభుత్వం పెట్టిన గడువు కూడా ముగిసింది. దరఖాస్తులు ఇంకా భారీగా పెండింగ్‌లో ఉండటంతో డ్రైవ్‌ను పొడగించాలని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో అన్నిస్థాయిల్లో లాగిన్లు వచ్చేదాకా పరిష్కారమైన దరఖాస్తుల వివరాలన్నీ కలెక్టర్ల లాగిన్లకు పంపి అక్కడి నుంచి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడి మధ్య ఉన్న కలెక్టర్ల పరిధిలో ఈ ప్రక్రియ కష్టమని స్పష్టం చేస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్‌కు అభ్యంతరం చెప్పినా..? వాస్తవానికి ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టవద్దనే చర్చ ఉన్నతస్థాయిలో జరిగినట్టు తెలిసింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వద్ద జరిగిన చర్చల సందర్భంగా.. రెవెన్యూ శాఖలోని ముఖ్య అధికారి ఒకరు స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు అభ్యంతరం చెప్పారని, ఎన్నికల కోడ్ వస్తే ఆపేయాల్సి వస్తుందని సూచించారని సమాచారం. ఎన్నికల కోడ్‌కు, ధరణి సమస్యల పరిష్కారానికి ఎలాంటి సంబంధం ఉండదని.. 2017లో ప్రారంభమైన ఈ ప్రక్రియకు ఎన్నికల కోడ్‌తో ముడిపెట్టాల్సిన అవసరం లేదని ధరణి కమిటీలోని ఓ సభ్యుడు చెప్పడంతో స్పెషల్‌డ్రైవ్ ప్రకటన జరిగిందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం విధివిధానాలు రూపొందించే సమయంలోనూ ఇలాంటి సమస్య వచ్చిందని తెలిసింది. రాష్ట్రంలో రెగ్యులర్ సీసీఎల్ఏను నియమిస్తేనే ధరణి సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం సాధ్యమవుతుందని సీఎంతో జరిగిన చర్చల సందర్భంగా ధరణి కమిటీలోని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నట్టు రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ‘ధరణి’పై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అన్నిస్థాయిల్లో లాగిన్లను ధరణి పోర్టల్ నిర్వహణ కంపెనీ ఎప్పటికి సమకూరుస్తుంది? స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం ఏ మేరకు నెరవేరుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
టీడీపీ నేత బరితెగింపు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్ మండలం కోడూరుపాడులో టీడీపీ నేత కబ్జాచేసిన పెన్నా పొరంబోకు భూములను బుధవారం అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. 30 ఎకరాలు ఆక్రమించి దాదాపు 1,400 ప్లాట్లు వేసిన ఆ నేత ఇప్పటికే కొన్ని అమ్మి రూ.15 కోట్లు సొమ్ముచేసుకున్నారు. మిగిలిన ప్లాట్లను పేదలకు పంచుతున్నానంటూ చీటీలు పంపిణీ చేశారు. స్థానికుల ఫిర్యాదుతో వచ్చిన రెవెన్యూ, జలవనరులశాఖల అధికారులు.. పోలీసుల సహకారంతో ఆ భూమిని స్వా«దీనం చేసుకుని జేసీబీతో హద్దురాళ్లను తొలగించారు. కోడూరుపాడుకు చెందిన టీడీపీ నేత కోడూరు కమలాకర్‌రెడ్డి గుడిపల్లిపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 550, 411, 435, 538, 39, 40లోని 30 ఎకరాల పెన్నా పొరంబోకు స్థలంపై కన్నేశారు. దీన్లో కొంత భూమిని గతంలో దళితులకు డి–ఫారం పట్టాగా పంపిణీ చేశారు. వారు ఆ భూముల్ని సాగుచేసుకుంటున్నారు. ఇక్కడ ఎకరా ధర రూ.రెండుకోట్ల వరకు ఉంది. ఈ మొత్తం భూమిని ఆక్రమించిన కమలాకర్‌రెడ్డి పేదలకు పట్టాలు పంపిణీ చేస్తానని గత ఏడాది అందరినీ నమ్మించారు. రోడ్లు ఏర్పాటుచేసి దాదాపు 1,400 ప్లాట్లతో లే అవుట్ వేశారు. కొన్ని ప్లాట్లను రూ.రెండులక్షల నుంచి రూ.నాలుగు లక్షలకు విక్రయించి దాదాపు రూ.15 కోట్లు సొమ్ము చేసుకున్నారు. తాజాగా మిగిలిన ప్లాట్లను పేదలకు పంపిణీ చేస్తానంటూ చీటీలు అందజేశారు. చీటీలు అందుకున్నవారిలో ఆయన అనుచరులు, వారి సంబందీకులే 300 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. కొనుగోలుదారుల ఆందోళన పెన్నా పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి లేఅవుట్ వేశారన్న సమాచారం అందుకున్న రెవెన్యూ, జలవనరులశాఖల అధికారులు బుధవారం అక్కడికి చేరుకున్నారు. పోలీసుల సహకారంతో ప్రభుత్వస్థలాన్ని స్వా«దీనం చేసుకున్నారు. ఆక్రమణదారులపై చర్యలకు ఉపక్రమించారు. టీడీపీ నేత వద్ద రూ.నాలుగు లక్షలకు ప్లాట్లను కొనుగోలు చేశామని, తమ పరిస్థితి ఏమిటంటూ అక్కడ పదిమంది ఆందోళన చేశారు. ఏదైనా ఉంటే ఫిర్యాదు చేయాలని, ప్రభుత్వ స్థలాలను కొనుగోలు చేసే హక్కు ఎవరికీలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో వారు వెనుదిరిగారు. -
గ‘లీజు’ గురివింద!
సాక్షి, విశాఖపట్నం : పచ్చకామెర్ల బాధితులకు లోకమంతా పచ్చగా కనిపిస్తుంది! అద్దె స్థలానికి ఎసరు పెట్టిన గురివిందకు.. అనుమతులున్న స్థలాలు అక్రమమే అనిపిస్తాయి! బంధువుల భూమినే కాజేసిన భూ రాబందుకు..సొంత భూమిలో ఎవరు నిర్మాణాలు చేపడుతున్నా గిట్టదు! అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసినట్లుగా.. తనను అక్కున చేర్చుకొని ఆదరించిన విశాఖపై బురద చల్లుతున్న ఈనాడు రామోజీ నగరానికి ముఖ్యమంత్రి వస్తున్నారంటే చాలు ఉలిక్కిపడి విషం చిమ్ముతున్నారు. ఇన్నాళ్లూ రుషికొండపై నానా యాగీ చేసిన ఈనాడు ఇప్పుడు అక్కడ భవనాలు ప్రారంభం కావడంతో మరో బురద జల్లుడు కార్యక్రమానికి తెగబడింది. అన్ని అనుమతులూ తీసుకుని ఓ దిగ్గజ సంస్థ సొంత భూమిలో నిర్మాణాలు చేపడుతుంటే అదేదో నేరమన్నట్లుగా దిగజారుడు కథనాలను ప్రచురించింది. విశాఖ తీరానికి తూట్లు పొడుస్తున్నారంటూ రామోజీ శోకాలు పెట్టారు. విశాఖలో లక్షల ఎకరాల భూ రికార్డులను మాయం చేసిన చరిత్ర టీడీపీదే. కోర్టు పరిధిలో ఉన్న వివాదాస్పద భూముల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్న ఘనత చంద్రబాబుదే. వాస్తవానికి భీమిలిలో కొంత భూమిని కొనుగోలు చేసిన దిగ్గజ సంస్థ అరబిందో సీఆర్‌జెడ్ నిబంధనలకు లోబడి అన్ని అనుమతులూ తీసుకొని నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈనాడుకు మాత్రం అది దేశద్రోహంలా కనిపిస్తోంది. సంతకాలు ఫోర్జరీ.. పచ్చళ్లు అమ్ముకుంటూ వచ్చిన రామోజీని విశాఖ నగరం అక్కున చేర్చుకుంది. అయితే ఆయన తన వ్యాపార విస్తరణకు సహకరించిన నగరాన్నే మింగేసే వైట్ కాలర్ క్రిమినల్‌గా మారిపోయారు! కుటుంబ సభ్యుల్ని మోసగించిన వ్యక్తిగా... బంధువుల్ని కోర్టుల చుట్టూ తిప్పి వారి భూముల్ని కొల్లగొట్టిన వ్యాపారిగా.. పత్రికను అడ్డం పెట్టుకొని కుళ్లు రాజకీయాలకు మూలపురుషుడుగా రామోజీ మిగిలిపోయారు. విశాఖలో కబ్జాలకు, గలీజు దందాలకు ఆద్యుడిగా నిలిచారు. 1974లో విశాఖలోని సీతమ్మధారలో 2.78 ఎకరాల భూమిని, 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 10 భవనాలను నెలకు రూ.3 వేలు అద్దె చొప్పున 33 ఏళ్ల లీజుకు మంతెన ఆదిత్యవర్మ నుంచి లీజుకు తీసుకున్న రామోజీ గడువు ముగిసినా ఖాళీ చేయకుండా తిరిగి కోర్టులో కేసు వేశారు. స్థలం యజమానికి తెలియకుండా కొంత భూమిని రోడ్డు విస్తరణకు అప్పగించి ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి కొంత స్థలాన్ని పొందారు. రామోజీ దాన్ని తన కుమారుడి పేరిట రిజిస్టర్ చేయించుకున్నారు. లీజు స్థలాన్ని తన సొంతమని పేర్కొంటూ ప్రభుత్వానికి అప్పగించటం.. ప్రతిఫలంగా పొందిన స్థలాన్ని రామోజీ రిజిస్టర్ చేసుకుని మోసపూరితంగా వ్యవహరించడంతో యజమాని మంతెన ఆదిత్యవర్మ క్రిమినల్ కేసు దాఖలు చేశారు. దీన్నుంచి తప్పించుకునేందుకు రామోజీ ఏకంగా విశాఖ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్‌ను ఫోర్జరీ చేయడం గమనార్హం. ఫోర్జరీకి సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నట్లు తేలడంతో న్యాయస్థానం రామోజీపై కేసు నమోదుకు ఆదేశించగా స్టే తెచ్చుకున్నారు. దిగువ కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకూ ఫోర్జరీకి సంబంధించి రామోజీకి చీవాట్లు పెట్టడంతో బిల్డింగ్ కొట్టేద్దామన్న ప్రయత్నాలు విఫలమై గత్యంతరం లేక ఆ స్థలాన్ని యజమానికి అప్పగించారు. కబ్జా ‘కార్యాలయం’ కనిపించలేదా? దసపల్లా భూముల వ్యవహారం కోర్టులో ఉండగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అందులో కొంత భాగాన్ని టీడీపీ కార్యాలయం నిర్మించేందుకు కేటాయించుకున్నారు. నగరం నడిబొడ్డున సర్వే నం 1196లో 2 వేల గజాల్ని కారుచౌకగా అప్పగించేశారు. ఇది చాలదన్నట్లుగా పక్కన ఉన్న కొండని సైతం తొలిచేసి 100 నుంచి 300 గజాల్ని ఆక్రమించేసి భవనాన్ని నిర్మించుకుంటే రామోజీ కళ్లు మూసుకున్నారు. మరోవైపు ఇల్లు నిర్మించుకునేందుకు ఓ వ్యక్తి కొనుగోలు చేసిన భూమిని ఆక్రమించిన నాటి మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడ తన కలల సౌధాన్ని కట్టుకున్నారు. ఆ కబ్జా కాండ బయటకు రాకుండా రామోజీ అడ్డుపడ్డారు. దీన్ని సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో టీడీపీ నేతలు ఉలిక్కిపడి భూ యజమానితో బేరసారాలకు దిగారు. విద్యాలయం పేరుతో విధ్వంసం.. టీడీపీ నేత, మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తి రుషికొండ ప్రాంతంలో 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గీతం యూనివర్సిటీకి సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని ఆక్రమించుకొని రెండు ఎకరాల్లో భవన నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించారు. సుమారు రూ.500 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసినా టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గీతం యూనివర్శిటీ కాంపౌండ్ వాల్‌ను తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. విలువైన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తుంటే విశ్వవిద్యాలయాన్ని నాశనం చేస్తున్నారంటూ నాడు రామోజీ బురద చల్లేందుకు ప్రయత్నించారు. -
కాపాడలేం.. అమ్మేద్దాం!
సాక్షి, హైదరాబాద్: హౌసింగ్ బోర్డు, దానికి అనుబంధంగా ఉన్న ‘డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్)’ఆధీనంలోని భూములను అమ్మేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇందిరమ్మ ఇళ్లతోపాటు ఇతర సంక్షేమ పథకాల నిర్వహణ కోసం భారీగా నిధుల సమీకరణ చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో.. ఈ భూముల విక్రయంపై దృష్టిసారించినట్టు సమాచారం. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గృహనిర్మాణ శాఖ సమావేశంలో దీనిపై తీవ్ర చర్చ జరిగినట్టు తెలిసింది. సదరు భూములపై ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. తొమ్మిదో షెడ్యూల్లో ఉండటంతో.. ఉమ్మడి రాష్ట్ర సమయంలో.. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే అనువైన ఇళ్లను సమకూర్చేలా హౌసింగ్‌బోర్డు ఆధ్వర్యంలో కాలనీలు రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. బోర్డు ఏర్పడే నాటికే తెలంగాణ ప్రాంతంలో దాని ఆ«దీనంలో భారీగా భూములు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిధిలో కూడా బోర్డు భూములను సమకూర్చుకుంది. ఇందులో భారీ వెంచర్ల కోసం ప్రత్యేకంగా ‘డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాండ్ హోల్డింగ్స్ లిమిడెడ్ (దిల్)’పేరిట అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో దిల్ పరిధిలో 1,800 ఎకరాల భూములు, హౌసింగ్ బోర్డు ఆ«దీనంలో మరో 820 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే ఈ భూముల అంశం రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టం పరిధిలో ఉంది. హౌజింగ్‌బోర్డు, దిల్లకు సంబంధించి ఏ ప్రాంతంలోని భూములు ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ పట్టుబట్టినా.. షీలా భిడే కమిటీ భిన్న నిర్ణయాన్ని వెల్లడించింది. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఈ అంశం అలాగే తొమ్మిదో షెడ్యూల్లో తెగని పంచాయితీగా ఉండిపోయింది. హైకోర్టులో కేసు కూడా కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో సదరు భూములను అమ్మేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించడం చర్చనీయాంశంగా మారుతోంది. కాపాడలేమంటూ కేంద్రం దృష్టికి.. హౌసింగ్‌బోర్డు, దిల్ భూములు కీలక ప్రాంతాల్లో ఉండటంతో వాటిపై కబ్జారాయుళ్ల దృష్టి పడింది. ఇప్పటికే చాలా భూములపై వివాదాలు మొదలయ్యాయి. ఈ భూముల విక్రయానికి ప్రక్రియ మొదలుపెట్టగానే.. అభ్యంతరాలు వస్తాయని, కోర్టులో కేసు ఉండగా ఎలా అమ్ముతారన్న ప్రశ్న వస్తుందని సర్కారు ముందుగానే అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఇటు కోర్టుకు, అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ భూముల పరిరక్షణ సవాల్‌గా మారిందన్న విషయాన్ని తెలియపర్చాలని భావిస్తోంది. ‘‘ఇప్పటికే చాలా భూములు వివాదంలో ఉన్నాయి. వాటితోపాటు క్లియర్‌గా ఉన్న మిగతా భూములను పరిరక్షించటం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. కబ్జాలు ఇంకా పెరిగి వివాదాలు కోర్టుల్లో పెరిగేంత వరకు ఉపేక్షించటం సరికాదు. ఈ భూములకు సంబంధించి కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా అనుసరిస్తాం. ముందు వాటిని వేలం ద్వారా విక్రయించి, వచి్చన డబ్బును తదనుగుణంగా వినియోగించుకోవచ్చు. అందుకు వీలు కల్పించాలి’’అని కోర్టును కోరాలని యోచిస్తోంది. కేంద్రానికి కూడా ఇదే వివరించాలని.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఢిల్లీ స్థాయిలో పర్యవేక్షించేందుకు ఓ ప్రతినిధిని కూడా నియమించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. -
ఓఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ మధ్యలో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల కోసం ఇప్పటి వరకు కేటాయించిన భూములకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కేటాయించిన భూముల్లో వినియోగంలో లేని వాటి వివరాలతోపాటు ఏర్పాటైన పరిశ్రమల స్థితిగతులపైనా నివేదిక సమర్పించాలన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలసి సోమవారం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసేందుకు వీలుగా హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)కు వెలుపల.. కొత్తగా నిర్మితమయ్యే రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు లోపల ఉండేలా భూములు గుర్తించాలన్నారు. విమానాశ్రయాలు, జాతీయ, రాష్ట్ర రహదారులకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపు 500 నుంచి 1,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ భూములు ఉండాలని రేవంత్ సూచించారు. సాగుకు యోగ్యం కాని భూముల్లో... సాగుకు యోగ్యం కాని భూములనే పరిశ్రమల ఏర్పాటుకు సేకరించడం ద్వారా రైతులకు నష్టం జరగదని రేవంత్ పేర్కొన్నారు. తద్వారా కాలుష్య సమస్య తగ్గడంతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే ప్రభుత్వ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తద్వారా తక్కువ ధరలో భూములుఅందుబాటులోకి రావడంతోపాటు భూసేకరణకు రైతులు కూడా సహకరిస్తారన్నారు. కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని, హైదరాబాద్‌లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడల తరలింపునకు ప్రత్యామ్నాయం సూచించాలని చెప్పారు. బల్క్‌డ్రగ్ ఉత్పత్తుల కంపెనీల ఏర్పాటుకు సంబంధించి మధ్యప్రాచ్య, యూరోపియన్ దేశాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. థర్మల్ విద్యుత్ బదులు సోలార్ పవర్ పారిశ్రామిక అవసరాల కోసం థర్మల్ విద్యుత్‌కు బదులుగా సౌర విద్యుత్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని, బాలానగర్ ఐడీపీఎల్ భూముల పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
పోలిపల్లిలో కబ్జా గళం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న రూ.వందల కోట్ల విలువైన భూములు అవి. టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఉన్న ఈ ఖరీదైన భూములను ఆ పార్టీ నేతలు నకిలీ పత్రాలతో కొట్టేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలిపల్లి కేంద్రంగా సాగించిన భూ దందాలు ఇప్పుడు టీడీపీ నేత నారా లోకేశ్ సభతో మరోసారి వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ పత్రాలతో విక్రయించి.. పరిహారం కాజేసి విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి రెవెన్యూ గ్రామం, సర్వే నంబరు 27లో 45 ఎకరాలున్న ఆసామి తిరుమారెడ్డి ఆదినారాయణ 1973లోనే మృతి చెందారు. భీమునిపట్నం మండలం అమనాం ఆయన స్వగ్రామం. ఆ భూములను కాజేసేందుకు తిరుమలరెడ్డి ఆదినారాయణ, అతడి కుమారుడు రమేష్ అనే వ్యక్తులను టీడీపీ నేతలకు బినామీగా వ్యవహరించే పులవర్తి సుబ్రహ్మణ్యం నకిలీ ధ్రువపత్రాలతో రంగంలోకి దించాడు. నకిలీ పత్రాలతో 5.01 ఎకరాలను శ్రీరామినేని శ్రీధర్‌కు, మిగతా ఐదు ఎకరాలను కోనేరు కరుణాకరరావుకు 2000లో విక్రయించారు. అనంతరం దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన ఆర్డీవో నాగేశ్వరరావు ఆ పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్స్ బోగస్ అని తేల్చారు. తహసీల్దారు, ఆర్డీవో సంతకాలను ఫోర్జరీ చేశారని నిర్ధారిస్తూ, దీనిపై చర్యలు తీసుకోవాలని 2005లోనే ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేసినా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. మరోవైపు జాతీయ రహదారి విస్తరణ సమయంలో తిరుమారెడ్డి ఆదినారాయణకు చెందిన సుమారు 1.74 ఎకరాల భూమి పోయింది. దీనికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) చెల్లించిన పరిహారాన్ని ఆయన వారసులకు తెలియకుండా టీడీపీ భోగాపురం మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ కాజేసిన వైనాన్ని ‘సాక్షి’ జిల్లా ప్రతినిధి ఇప్పటికే బట్టబయలు చేశారు. బినామీ బాగోతం ఇలా... విలువైన భూములను కాజేసేందుకు పులవర్తి సుబ్రహ్మణ్యం అనే బినామీని తెరపైకి తెచ్చిన టీడీపీ నాయకులు తిరుమలరెడ్డి ఆదినారాయణ అనే పేరుతో బోగస్ గుర్తింపు కార్డులను సృష్టించారు. అయితే ఇంటి పేరు తిరుమారెడ్డి బదులు తిరుమలరెడ్డి అని రాయడంతో పప్పులో కాలేశారు! పులవర్తి సుబ్రహ్మణ్యం సాక్షి సంతకంతో భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 1.2.2000వ తేదీన రిజిస్ట్రేషన్ చేశారు. పట్టాదారు పాసు పుస్తకం లేకపోవడంతో సబ్‌రిజిస్ట్రార్ దస్తావేజులను పెండింగ్‌లో పెట్టారు. దీంతో నకిలీ పాసుపుస్తకం, టైటిల్ డీడ్లను టీడీపీ నాయకులు సృష్టించారు. వాటిని సమర్పించడంతో 31.3.2000న సబ్‌రిజిస్ట్రార్ డాక్యుమెంట్లను రిలీజ్ చేశారు. చుట్టూ తిరిగి పులవర్తికే.. పట్టాదారు పుస్తకం, టైటిల్ డీడ్స్‌పై అనుమానం కలగడంతో కొనుగోలుదారులైన శ్రీరామినేని శ్రీధర్, కోనేరు కరుణాకరరావు ఆర్డీవోను ఆశ్రయించారు. దీన్ని పసిగట్టిన టీడీపీ నేతలు నాడు అధికారం అండతో విచారణను అడ్డుకుని కొనుగోలుదారులతో బేరసారాలకు దిగారు. శ్రీరామినేని శ్రీధర్ అప్పటి ఆనందపురం ఎంపీపీగా ఉన్న టీడీపీ నాయకుడు కోరాడ రాజబాబుకు విక్రయించినట్లుగా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తరువాత పులవర్తి సుబ్రహ్మణ్యం బావ లక్ష్మణరావు పేరుతో బదలాయించారు. కోనేరు కరుణాకరరావు నుంచి నాలుగు ఎకరాలను సుబ్రహ్మణ్యమే స్వయంగా తన పేరున, మరో ఎకరం తన స్నేహితుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అలా చుట్టూ తిరిగి మొత్తం పది ఎకరాల భూమి పులవర్తి సుబ్రహ్మణ్యం చేతిలో పడింది! మారణాయుధాలతో దాడులు.. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమి అనంతరం పోలిపల్లి పరిధిలో సర్వే నంబర్ 27లోని భూములకు సంబంధించి తిరుమలరెడ్డి ఆదినారాయణ పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్స్‌పై విచారణ మొదలైంది. అవేవీ భోగాపురం తహసీల్దారు కార్యాలయం నుంచి జారీ కాలేదని గుర్తించారు. ఆర్డీవో, తహసీల్దారు సంతకాలను ఫోర్జరీ చేయడంపై చర్యలకు ఆదేశించినా టీడీపీ నాయకులు అడ్డుపడ్డారు. కబ్జాపై ప్రశ్నించిన తిరుమారెడ్డి ఆదినారాయణ బంధువులు, అమనాం, రావాడ గ్రామస్తులపై 2004 జనవరి 1న రౌడీమూకలు మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డాయి. ఆ భూమి వద్దకు వచ్చిన వారిని దారుణమైన చిత్ర హింసలకు గురి చేసిన వైనాన్ని స్థానికులు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. బాధితులు భోగాపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. నెలల పాటు కిరాయి మూకలు మారణాయుధాలతో ఆ భూమిలోనే తిష్ట వేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పట్లో ఉత్తరాంధ్రలోని ఓ జిల్లాకు ఎస్పీగా పని చేసిన ఓ పోలీసు అధికారి భార్య పేరిట 2.43 ఎకరాలు, ఆయన బావమరిది పేరుతో 49 సెంట్ల భూమి 2017లో బదిలీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. సదరు అధికారి ఉద్యోగ విరమణ అనంతరం టీడీపీకి చెందిన ఓ ముఖ్య నాయకుడికి సలహాదారుడిగా వ్యవహరించడం భూముల కబ్జాలో ఆ పార్టీ నేతల ప్రమేయానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆక్రమణదారుల కోసమేనా యువగళం టీడీపీకి చెందిన భూ ఆక్రమణదారులు, అక్రమార్కులకు కొమ్ము కాయటానికే లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టినట్లుగా ఉంది. టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు భోగాపురం మండలంలో పలు భూ అక్రమాలకు పాల్పడ్డారు. ఒక్క పోలిపల్లి గ్రామ పరిధిలోనే రూ.వందల కోట్ల విలువైన భూములను రెవెన్యూ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి కాజేసినట్లు బాధితులు ఆక్రోశిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పినా లోకేష్ నిస్సిగ్గుగా అదే చోట యువగళం ముగింపు సభ నిర్వహిస్తున్నారు. అక్రమార్కులు, పెత్తందారులకు టీడీపీ కొమ్ము కాస్తున్నట్లు దీన్నిబట్టి రుజువవుతోంది. తీరు మారని టీడీపీకి ప్రజలు మరోసారి బుద్ధి చెప్పడం ఖాయం. – మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు -
ఆ 181 ఎకరాలు హెచ్ఎండీఏవే..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని 181 ఎకరాల వివాదాస్పద భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కే చెందుతాయని హైకోర్టు ద్వి సభ్య ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. అందులోని 50 ఎకరాలపై తమకు హక్కులు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. 2007 నుంచి శంషాబాద్ గ్రామ పంచాయతీ జారీ చేసిన ఆస్తి పన్ను నోటీసులు, మున్సిపల్ అనుమతి, రెవెన్యూ రికార్డులు, విద్యుత్ బిల్లులు, ఫొటోలు, 2023 ఏప్రిల్ 20 నాటి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, ఇంటి పన్ను రశీదులు, ఇంటి నిర్మాణ అనుమతి.. ఇలా అన్నీ నకిలీవేనని జ్యుడీషియల్ రిజిస్ట్రార్నివేదిక బయటపెట్టిందని స్పష్టం చేసింది. 2007లోనే తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టు కల్పి త రసీదులు సృష్టించారని పేర్కొంది. 1990 సెపె్టంబర్ 4 నాటి ఉత్తర్వుగా పేర్కొంటూ.. 1992లో టైప్ చేసిన కాపీని పిటిషనర్ ఇచ్చారని, అది కూడా నకిలీదేనని తేలిందని వెల్లడించింది. అన్ని అంశాలను పరిశీలించాక పిటిషనర్‌కు ఉపశమనం పొందడానికి ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది. ‘పైగా’భూములని పేర్కొంటూ.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సర్వే నంబర్ 725/21లోని 7.31 ఎకరాలు, సర్వే నంబర్ 725/23లోని 10.07 ఎకరాలు, సర్వే నంబర్ 725/25లోని 12.34 ఎకరాలు సహా దాదాపు 50 ఎకరాల భూమిని తన పూర్వికులు పైగా (సైన్యం నిర్వహణకు పరిహారంగా నిజాం నవాబ్ మంజూరు చేసిన భూమి) యజమానుల నుంచి కొనుగోలు చేశారని హైదరాబాద్ వట్టేపల్లికి చెందిన యహియా ఖురేషి హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కూడా హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇబ్బందులు క ల్పిస్తున్నారని కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. రసీదులన్నీ నకిలీవే.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ రాఘవన్, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. తప్పుడు పత్రాలు, రసీదులు సృష్టించి కోర్టును తప్పదారి పట్టిస్తున్నారని.. అత్యంత విలువైన ప్రాంతంలో దాదాపు 50 ఎకరాలకు పైగా భూమిని స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారని ఏజీ కోర్టుకు వివరించారు. 2007, 2012లో జారీ చేసిన రసీదులు పూర్తిగా నకిలీవని స్పష్టం చేశారు. తప్పుడు రసీదులను, కోర్టు తీర్పు ఉత్తర్వుల పత్రాలను ఆయన ఈ సందర్భంగా ధర్మాసనానికి అందించారు. 2007 నాటికి తెలంగాణ రాష్ట్రమే లేదని, రసీదుల్లో మాత్రం తెలంగాణ అని పేర్కొన్నారని.. అలాగే శంషాబాద్ గ్రామం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండగా, హైదరాబాద్ అని మరో రసీదులో ఉందని వివరించారు. దాంతో ఈ అంశంపై పూర్తి విచారణ జరిపి సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని ధర్మాసనం గతంలోనే జ్యుడీïÙయల్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. రిజిస్ట్రార్విచారణ జరిపి కోర్టుకు నివేదిక ఇచ్చారు. పిటిషనర్ పేర్కొన్నట్టుగా 1997లో అసలు పిటిషన్లే నమోదు కాలేదని వివరించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు ఇచి్చంది. -
పట్టాలిచ్చిన వారికే ‘సరిహద్దు’ ఓటు
కెరమెరి(ఆసిఫాబాద్): రెండు రాష్ట్రాల గొడవలో 15 సరిహద్దు గ్రామాలు నలిగిపోతున్నాయి. సాగు భూములకు ఇప్పటికీ పట్టాలు అందకపోవడంతో అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న జనాభాలో 20 శాతం ఉన్న గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం పోడు పట్టాలిచ్చి ‘రైతుబంధు’ అమలు చేస్తోంది. అయితే 70 శాతం ఉన్న ఎస్సీలు, 10 శాతం ఉన్న బీసీలను రెండు ప్రభుత్వాలూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజనేతరులకు పట్టాలందించి, గ్రామాల్లో సమస్యలు పరిష్కరించిన వారికే ఓటు వేస్తామని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని వివాదాస్పద గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. రెండు రాష్ట్రాల్లో ఓటుహక్కు కలిగి ఉన్న వీరు ఈ నెల 30న తెలంగాణలో నిర్వహించే ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఓటు వేయనున్నారు. మొత్తంగా వీరి ఓట్ల సంఖ్య 3,566. సరిహద్దుల గుర్తింపు ఇలా.. 1955– 56లో ఫజల్అలీ కమిషన్ సరిహద్దులను గుర్తించింది. ఈ క్రమంలో పరందోళి, కోటా, పరందోళి తండా, శంకర్‌లొద్ది, లేండిజాల, మహరాజ్‌గూడ, ముకదంగూడ, అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, ఏసాపూర్, నారాయణగూడ, భోలాపటార్, లేండిగూడ, గౌరీ గ్రామాలు మహారాష్ట్రలోకి వెళ్లాయి. 1965 నుంచి ఇవి మహారాష్ట్రలోని నోకేవాడ, పుడ్యాన్‌మోదా జీపీల్లో ఉన్నాయి. అయితే 1990లో అక్కడి ప్రభుత్వం పరందోళి, అంతాపూర్ జీపీలను ఏర్పాటు చేసి 15 గ్రామాలను విడదీసింది. 1995లో ఇక్కడ నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతం ఓటింగ్ నమోదైంది. 1978లో మరోసారి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఉమ్మడిగా సరిహద్దులు గుర్తించాయి. ఆర్టికల్ 3 ద్వారా 15 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆ«దీనంలో ఉంటాయని ఇరురాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 1980 నుంచి ఏపీ గవర్నమెంట్ అక్కడ ఎన్నికలు నిర్వహిస్తుండగా ప్రజలు ఓటుహక్కు వినియోగించుకోలేదు. అనంతరం ఏపీ ప్రభుత్వం కూడా పరందోళి, అంతాపూర్ జీపీలను గుర్తించి 1994లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. అప్పటి నుంచి ఇరు రాష్ట్రాల్లో స్థానికులు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. 1980 నుంచి ఉద్యమం... వివాదాస్పద గ్రామాలను ఏపీలో కలపొద్దని 1980 నుంచే ఉద్యమం చేస్తున్నట్టు ముకదంగూడ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త రాందాస్ నర్వడే తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో 1983లో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. అయితే 1978లో చేసిన హద్దుల ప్రకారం గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందుతాయని ఆ కమిటీ నివేదించింది. 1990 జూలై 7న గ్రామాలు ఏపీకి చెందుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ మరోసారి ఉద్యమం మొదలైంది. 15 గ్రామాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్నారని, భాషా ప్రతిపాదికన నిర్ణయం తీసుకోవాలని అడ్వొకేట్, రాజూరా ఎమ్మెల్యే వాన్‌రావు చటప్‌తో కలిసి ఆందోళనలు చేపట్టారు. ఈ విషయం అక్కడి అసెంబ్లీలో చర్చకు రావడంతో మహారాష్ట్ర సర్కార్ 1993 ఆగస్టు 5న 1990లో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఆ గ్రామాలు మహారాష్ట్రలోనే కొనసాగుతాయని తేల్చిచెప్పింది. ఆ తర్వాత 1996 ఏప్రిల్ 3న ఏపీ ప్రభుత్వం దీనిపై హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రతిగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 1996 ఏప్రిల్ 30న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏపీ గవర్నమెంట్ 1997 ఆగస్టు 21న పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటివరకు 15 గ్రామాల కోసం ఎలాంటి కేసులు దాఖలు చేయలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అక్కడ సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. రెండు ఓట్లు.. రెండు రేషన్‌కార్డులు ఇక్కడి ప్రజలకు ఇరు రాష్ట్రాలకు చెందిన రెండు రేషన్‌కార్డులు, రెండు ఓట్లు ఉన్నాయి. వీరు ఇద్దరేసి సర్పంచ్‌లతోపాటు ఇతర ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. రెండు ప్రభుత్వాలు పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. పరందోళి గ్రామంలో కొందరికి ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరయ్యాయి. అయితే లబ్దిదారులకు తెలియకుండా కొంతమంది బిల్లులు కాజేశారు. అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్నా లబ్దిదారులకు న్యాయం జరగలేదు. ప్రస్తుతం మిషన్ భగీరథ నీరు కూడా సరఫరా చేస్తున్నారు. 2014 నుంచి ఇక్కడి రైతులకు పట్టాలు లేక రుణాలు అందటం లేదు. మరో వైపు రెవెన్యూ, అటవీశాఖ మధ్య భూవివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం గిరిజనులకు పోడు పట్టాలు అందినా గిరిజనేతరులకు ఎలాంటి భరోసా లేకుండా పోయింది. 80 శాతం ఉన్న గిరిజనేతరులకు పట్టాలిచ్చిన వారికే ఓటు వేస్తామని అక్కడి ప్రజలు తేల్చిచెబుతున్నారు. పట్టాలివ్వాలి.. 50 ఏళ్లుగా భూములు సాగుచేసుకుంటున్నా పట్టాల్లేవు. రెండు ప్రభుత్వాలు కూడా పట్టాలు అందించకపోవడంతో సంక్షేమ పథకాలు అందడంలేదు. ఇప్పటికైనా రైతులకు పట్టాలు అందించాలి. – కాంబ్డే లక్ష్మణ్, మాజీ సర్పంచ్, పరందోళి కోర్టు ధిక్కరణే.. 15 గ్రామాలు మహారాష్ట్రకు చెందినవిగా 1997లోనే సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అయినా తెలంగాణ సర్కారు ఇంకా కొనసాగిస్తోంది. ఇది కోర్టు ధిక్కరణవుతుంది. ఓట్ల కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. మేం మహారాష్ట్రలోనే కొనసాగుతాం. – రాందాస్ రన్వీర్, సామాజిక కార్యకర్త, ముకదంగూడ -
భూ చరిత్రలో కొత్త శకం
ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, ఆ భూమి ఏ శాఖదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్లో ఉంటుంది. వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో పలు వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం వస్తే పరిష్కారమవుతాయి. ఈ టైటిల్ రిజిస్టర్నే చట్ట పరంగా కన్‌క్లూజివ్ రికార్డు అని పిలుస్తారు. అదే తుది రికార్డు కింద లెక్క. ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రిజెంటివ్ రికార్డులు మాత్రమే. వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకసారి కన్‌క్లూజివ్ రికార్డు తయారైతే దానిపై ఎవరూ అభ్యంతరం చెప్పడానికి ఆస్కారం ఉండదు. సాక్షి, అమరావతి: దేశంలోనే మొట్ట మొదటిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో రాష్ట్రంలో భూముల చరిత్రలో కొత్త శకం నమోదు కానుంది. భూ యజమానులకు భరోసా ఇచ్చే ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని పలు రాష్ట్రాలు చాలా ఏళ్లుగా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో దీన్ని సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2019 జూలైలో ల్యాండ్ టైట్లింగ్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. పలు మార్పుల తర్వాత ఇటీవలే దానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ టైట్లింగ్ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా చెబుతోంది. ఈ ఆలోచనలను అందిపుచ్చుకుని దాన్ని ఆచరణలోకి తీసుకు రావడంలో ఆంధ్రప్రదేశ్ సఫలీకృతమైంది. గత నెల అక్టోబర్ 31వ తేదీ నుంచి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్–2023 అమల్లోకి వచ్చింది. ప్రస్తుత వ్యవస్థలో భూమి హక్కులకు సంబంధించి రాష్ట్రంలో 30కిపైగా రికార్డులున్నాయి. గ్రామ స్థాయిలో 1బీ, అసైన్మెంట్, ఈనాం వంటి 11 రిజిష్టర్లు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొన్ని, సర్వే కార్యాలయంలో మరికొన్ని, సబ్ రిజిస్ట్రార్, పంచాయతీ, మున్సిపాల్టీ కార్యాలయాల్లో భూములకు సంబంధించి వివిధ రికార్డులను నిర్వహిస్తున్నారు. అటవీ, దేవాదాయ, వక్ఫ్ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులు ఉన్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా, చట్టపరంగా ఏదీ కూడా తుది రికార్డు కాదు. ఈ రికార్డుల్లో పేరున్నా వేరే వాళ్లు అది తనదని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. భూ యజమానికి తన భూమి తనదనే పూర్తి భరోసా లేదు. టైట్లింగ్ చట్టంలో భూ యజమానులకు తమ భూములపై భరోసా వస్తుంది. వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్ల వ్యవస్థ ► భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఎటువంటి అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్ రిజిస్టర్లో ఉంటాయి. వివాదం ఉన్న భూముల వివరాలను వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఈ చట్టం ప్రకారం టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునళ్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది. ► ప్రస్తుత వ్యవస్థ మాదిరిగా రెవెన్యూ, సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు. జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతేతప్ప కింది స్థాయిలో ఏ రెవెన్యూ అధికారికి, ఏ సివిల్ కోర్టుకీ వివాదాన్ని పరిష్కరించే అధికారాలు ఉండవు. ► ఈ చట్టం ప్రకారం భూమి యజమానిగా ఒకసారి నిర్ధారణ అయితే అదే ఫైనల్. ఆ భూమి వివాదంలో పడి భూములు కోల్పోయే పరిస్థితులు ఉండవు. టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదయ్యాక ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెండు సంవత్సరాల లోపే చెప్పాలి. రెండేళ్ల లోపు ఎటువంటి అభ్యంతరం రాకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. టైటిల్ నిర్థారణ అయిన రెండేళ్లలోపే దాన్ని ఛాలెంజ్ చేయాలి. అలా చేయని పక్షంలో టైటిల్ రిజిస్టర్లో ఉన్న పేరే ఖరారవుతుంది. భూ యజమాని హక్కులకు పూచీ ప్రభుత్వానిదే ► టైటిల్ రిజిష్టర్‌లో నమోదైన వివరాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వ గ్యారంటీ లేదు. 1బిలో ఉన్నా, అడంగల్‌లో ఉన్నా, ఆర్‌ఎస్‌ఆర్‌లో ఉన్నా ప్రభుత్వ గ్యారంటీ ఉండదు. ఈ గ్యారంటీ లేకపోవడాన్నే ప్రిజెంటివ్ రైట్స్ అనేవారు. 1బిలో ఉన్న పేరుపైన ఎవరైనా కోర్టుకు వెళ్లి అది తప్పని నిరూపించే వరకు అది కరెక్ట్ అని భావించేవారు. ► ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో రెవెన్యూ రికార్డుల్లో పేరున్నంత మాత్రాన అతను భూ యజమాని కాదని, రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కులకు సాక్ష్యంగా పనికి రావని స్పష్టం చేసింది. ఎందుకంటే అవన్నీ శిస్తు వసూలు చేయడానికి బ్రిటీష్ హయాం నుంచి రాసిన లెక్కల పుస్తకాలు. అందులో పన్ను ఎంత కట్టాలో ఉంటుంది తప్ప ఆ భూమి ఎవరిదో ఉండదు. ► టైటిలింగ్ చట్టం కింద రూపొందిన రిజిస్టర్ ప్రకారం ప్రిజెంటివ్ రికార్డు వ్యవస్థ స్థానంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తుంది. పాత రికార్డులేవీ చెల్లవు. భూమి హక్కుల చరిత్ర కొత్తగా మొదలవుతుంది. ఒకసారి టైటిల్ రిజిస్టర్లో పేరు వచ్చిన తర్వాత ఏదైనా నష్టం జరిగిందని భూ యజమాని నిరూపించుకోగలిగితే బీమా సైతం ఇస్తారు. భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారు. టైటిల్ రిజిస్టర్‌గా మారనున్న ఆర్ఓఆర్ రికార్డు ► ఈ చట్టం అమలు కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆ శాఖలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టైటిల్ గ్యారంటీ అథారిటీలు ఏర్పాటవుతాయి. టైటిల్ రిజిస్టర్లను నిర్ధిష్ట విధానంలో ఈ అథారిటీలే ఖరారు చేస్తాయి. వారి ఆధ్వర్యంలోనే రిజిస్టర్లు నిర్వహిస్తారు. భూముల రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటి వరకు సబ్ రిజి్రస్టార్ కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతోంది. హక్కుల రిజిస్ట్రేషన్ జరగడం లేదు. ► పాత వ్యవస్థ స్థానంలో టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ వస్తుంది. భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే టైటిల్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అమ్మేవాడికి టైటిల్ ఉంటేనే కొనేవాడికి వస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో టైట్లింగ్ అథారిటీలు, గ్రామ స్థాయి నుంచి పై వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ వ్యవస్థలు ఏర్పాటవుతాయి. ► రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భూముల రీ సర్వేలో తయారవుతున్న కొత్త రికార్డులను ల్యాండ్ టైట్లింగ్ చట్టం కింద నోటిఫై చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రీ సర్వేలో రూపొందించిన డిజిటల్ రికార్డులను ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం కింద నోటిఫై చేస్తున్నారు. టైటిల్ గ్యారంటీ చట్టం ప్రకారం ఆర్ఓఆర్ రికార్డు టైటిల్ రిజిస్టర్‌గా మారుతుందని చెబుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో విధివిధానాలు రూపొందించనుంది. గొప్ప ముందడుగు ల్యాండ్ టైట్లింగ్ చట్టం తేవడం చాలా గొప్ప ముందడుగు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. టైటిల్‌కు భద్రత ఉంది కాబట్టి వేరే ప్రాంతంలో ఉన్న వాళ్లు కూడా ఆంధ్రాలో భూమి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. వివాదాలు తగ్గిపోయి ఆర్థిక ప్రగతి బాగా పుంజుకుంటుంది. భూ యజమానికి భరోసా ఉంటుంది. ఈ ఫలితాలు అందరికీ దక్కాలంటే ప్రభుత్వం పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దీనిపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలి. ఇది ఒక ల్యాండ్ మార్క్ చట్టం కాబట్టి ఇందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. చట్టం అమలులో పేదల కోసం పారా లీగల్ వ్యవస్థ వంటిది ఏర్పాటు చేసుకోవాలి. ఈ చట్టాన్ని అమలు చేసే యంత్రాంగానికి పూర్తి స్థాయిలో రీఓరియెంటేషన్ అవసరం. ఇది ఆర్ఓఆర్ చట్టం లాంటిది కాదు. దీనిపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించాలి. ఇవన్నీ చేస్తే ఐదేళ్లలో ఆర్థిక ప్రగతిలో ఏపీ అద్భుతంగా దూసుకుపోయే అవకాశం ఉంటుంది. – ఎం సునీల్‌కుమార్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్ లా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ -
Andhra Pradesh: లంక భూములు గట్టెక్కాయి
మా తాత నుంచి నాకు అర ఎకరం పొలం వచ్చింది. కాగితాలు లేకపోవడంతో ఆ భూమిపై మాకు ఎలాంటి హక్కు లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇందుకోసం చాలా డబ్బు ఖర్చు చేశాం. జగన్ ప్రభుత్వం వచ్చాక పైసా ఖర్చు లేకుండా మా భూమికి పట్టా ఇస్తున్నారు. ఆయనకు రుణపడి ఉంటాం. – తోడేటి నాంచారయ్య, చింతల్లంక, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా ((బాపట్ల జిల్లా కొల్లూరు, భట్టిప్రోలు నుంచి సాక్షి ప్రతినిధి బి.ఫణికుమార్)): ఇది నిన్న, మొన్నటిది కాదు.. కొన్ని దశాబ్దాలు, తరాల సమస్య. గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల్లో లంక భూములను సాగు చేసుకుంటున్న రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏడాదికి మూడు పంటలు పండే ఈ భూములు ఎంతో విలువైనవి. అయితే వాటికి కాగితాలు, పాస్ బుక్‌లు లేకపోవడంతో రైతులు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. వ్యవసాయ రుణాలు, రైతులకు అందే ఇతర ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు లభించేవి కావు. తమ సమస్యను పరిష్కరించాలని రైతులు దశాబ్దాల నుంచి ప్రజాప్రతినిధులను, అధికారులను కలుస్తూనే ఉన్నారు. అయితే ప్రయోజనం శూన్యం. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక లంక రైతుల సమస్యపై దృష్టి సారించింది. మొత్తం 8 జిల్లాల్లో ఏకంగా 9,062 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయంతో 17,768 మంది లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగులు ప్రసరించనున్నాయి. వీరు సాగుచేసుకుంటున్న భూములకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 17న పట్టాలివ్వనున్నారు. సాక్షి బృందం బాపట్ల జిల్లా కొల్లూరు, భట్టిప్రోలు మండల్లాలోని దోనేపూడి, జువ్వలపాలెం, సుగ్గునలంక, చింతల్లంక, చిలుమూరు లంక, వెల్లటూరు, పెదపులివర్రు, పెదలంక, ఓలేరు తదితర లంక గ్రామాల్లో పర్యటించినప్పుడు అక్కడి రైతులు ఇన్నేళ్లుగా తాము పడిన బాధలను పంచుకున్నారు. తమ జీవితకాలంలో ఈ సమస్య పరిష్కారమవుతుందని అనుకోలేదని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీన్ని సులువుగా పరిష్కరించారని కొనియాడారు. ఆయన మేలును మరిచిపోలేమని భావోద్వేగానికి గురయ్యారు. దళితులంటే ఆయనకు ఎంత అభిమానమో లంక భూముల సమస్య పరిష్కారంలోనే అర్థమవుతోందని కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఒక్క కొల్లూరు మండలంలోనే 710 మంది రైతులకు 295 ఎకరాలకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ పట్టాలు అందించనున్నారు. లంక భూముల కథ ఇది.. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో ఒండ్రు మట్టి ఒక చోటకు చేరడంతో ఏర్పడ్డ సారవంతమైన భూములే.. లంక భూములు. కృష్ణా, ఎనీ్టఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో తరతరాలుగా రైతులు వాటిని సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ భూములకు సంబంధించి వేలాది మంది రైతులకు పట్టాలు లేవు. తమకు పట్టాలు ఇవ్వాలని కొన్ని దశాబ్దాలుగా అక్కడి రైతులు ప్రభుత్వాలను కోరుతూ వచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షణలు చేసినా ఫలితం శూన్యం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు సిద్ధమైంది. వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇచ్చేందుకు వీలుగా లంక భూముల అసైన్డ్ నిబంధనలు సవరించింది. ఈ భూములను మూడు కేటగిరీలుగా గతంలోనే విభజించింది. గట్టుకు దగ్గరగా ఉండి వరద వచ్చినా కొట్టుకుపోని భూమిని ఏ కేటగిరీగా, ఏ కేటగిరీకి ఆనుకుని కొంత నదిలోకి ఉన్న భూమిని బి కేటగిరీగా, ఏ, బీ కేటగిరీకి ఆనుకుని వరదలు వస్తే పూర్తిగా మునిగిపోయే భూమిని సీ కేటగిరీగా వర్గీకరించింది. ఏ, బీ కేటగిరీ భూములకు పట్టాలు, సీ కేటగిరీ భూములకు లీజు పట్టాలు ఇవ్వనుంది. మా ఇంటికి వెలుగు తెచ్చారు.. 50 ఏళ్లకు ముందు నుంచి ఎకరం భూమిని లంకలో సాగు చేసుకుంటున్నాం. కానీ కాగితాల్లో మాత్రం అది మా భూమి కాదని ఉంది. దానిపై కనీసం బ్యాంకు రుణం ఇమ్మన్నా ఇచ్చేవారు కాదు. ప్రజాప్రతినిధులను, అధికారులను ఎన్నోసార్లు కలిసి న్యాయం చేయాలని అడిగినా పట్టించుకోలేదు. ఇప్పుడు జగనన్న వచ్చాక మా ఇంటికి వెలుగు తెచ్చారు. మా భూమికి పట్టా ఇస్తున్నారు. – తోడేటి రత్నాకరరావు, చింతల్లంక, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా నాలాంటి ఎంతోమంది కష్టాలను తీర్చారు.. నాకున్న ఎకరం భూమికి కాగితాలు, పాస్‌బుక్‌లు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు జగనన్న నా భూమికి పట్టా ఇస్తున్నారు.. ఎంతో ఆనందంగా ఉంది. లంకల్లో నాలాంటి ఎంతో మంది కష్టాలను తీరుస్తున్నారు. ఆయన మేలు మర్చిపోలేం – ఈపూరి ఏబేలు, చింతల్లంక, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా ఎప్పటికీ మా బాధ తీరదనుకున్నాం.. మేం సాగు చేసుకుంటున్న లంక భూములంటే అందరూ చిన్నచూపు చూసేవారు. ఎంతో విలువైన భూమి ఉన్నా దానికి కాగితాలు లేవు. ఎప్పటికీ మా బాధ తీరదనుకున్నాం. జగన్ సీఎం అయ్యాకే లంక భూముల సమస్యపై దృష్టి పెట్టారు. ఆయన వచ్చినప్పటి నుంచి మా సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకం ఉండేది. మేం ఆశించినట్లుగానే ఎవరూ చేయని పనిని ఆయన చేసి మాకు న్యాయం చేశారు. – బొజ్జా రమేశ్, వెల్లటూరు, భట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా పేదల దేవుడినని నిరూపించారు.. మేం జీవించి ఉండగా ఈ సమస్య పరిష్కారమవుతుందని అనుకోలేదు. ఇంత క్లిష్టమైన సమస్యను సీఎం జగన్ చాలా తేలిగ్గా పరిష్కరించారు. లంక భూములకు దారి చూపించి తాను పేదల దేవుడినని నిరూపించారు. – ఏలూరి శేషగిరిరావు, వెల్లటూరు, భట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా -
అప్పు చేసి.. ఆస్తి అమ్మి..
ఎన్నికల బరిలో నిలిచి గెలిచేందుకు అభ్యర్థుల తంటాలు ఎన్నికల ఖర్చు కోసం దొరికిన చోటల్లా అప్పు చేసేవారు కొందరైతే... భూములు, ఆస్తులు అమ్ముతున్నవారు మరికొందరు ఉన్నారు. ఎలాగైనా గెలవాలనే భావనతో ఖర్చు ఎంత అయినా సరే అంటూ బరిలో ఉంటున్నారు. ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ప్రధాన పార్టీ అభ్యర్థి.. చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఏం వెనకేసుకున్నాడో ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి తెలిసినవారిని, పరిచయం ఉన్నవారిని కలుస్తూ.. కాస్త డబ్బులు సర్దాలంటూ కోరుతున్నారు. చేబదులుగానే కాదు భూమిని తాకట్టు పెట్టి, అప్పులు చేసి మరీ ఎన్నికల ఖర్చు కోసం వీలైనంత సొమ్మును రెడీ చేసుకుంటున్నారు. ‘‘నా దగ్గర ఉన్న డబ్బుకు తోడు అక్కడా ఇక్కడా మరింత సర్దుబాటు చేసుకుంటున్నాను. అవసరం మనది. నానా రకాల పత్రాల మీద సంతకాలు చేయించుకోనిదే ఎవరూ డబ్బులు ఇవ్వట్లేదు..’’ అని సదరు అభ్యర్థి పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యే ఆయన.. ఎన్నికల ఖర్చు కోసం ఇటీవలే తన భూమిని అమ్మేశారు. గతంలో ఇతరులకు అప్పుగా, చేబదులుగా ఇచ్చి న సొమ్మును తిరిగి వసూలు చేసుకునే పనిలో ఉన్నారు. ‘‘ఎన్నికల్లో పోటీ ఎక్కువై, ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. భూమిపోతే మళ్లీ కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవకపోతే.. ఐదేళ్లదాకా ఆగాల్సిందే. అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు.. దొరికిన చోటల్లా డబ్బు సిద్ధం చేసుకుని అయినా ఈసారి గట్టెక్కాల్సిందే..’’ అని సదరు ఎమ్మెల్యే అంటున్నారు. ... ఇలా ఈ ఇద్దరే కాదు, ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థులందరిదీ ఇదే మాట. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్నవారి నుంచి కొత్తగా బరిలోకి దిగుతున్న వారి వరకు ఇదే వరుస. ముందు జాగ్రత్తగా ఇప్పటికే సొమ్ము రెడీ చేసుకుంటున్నవారు కొందరు.. పార్టీల నుంచి టికెట్ ఖరారుకాగానే బరిలోకి దూకేందుకు ప్రయత్నిస్తున్నవారు మరికొందరు. స్వతంత్రులుగానో, ఏదైనా చిన్న పార్టీ నుంచో పోటీ చేయడానికి సిద్ధమైనవారు ఇంకొందరు.. ఎవరిని కదిలించినా ఆఫ్ ది రికార్డుగా ‘ఖర్చు’ కష్టాలను ఏకరవు పెడుతున్నారు. సమయం దగ్గరపడుతుండటంతో..: బీఆర్ఎస్ తరఫున మెజారిటీ ఎమ్మెల్యేలే మళ్లీ బరిలోకి దిగుతున్నారు. బీ–ఫారాలు కూడా అందుకుని ప్రచారమూ ముమ్మరం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రెండు జాబితాలు విడుదల చేసింది. బీజేపీ కూడా 53 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగతా సీట్లపై కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. ఇప్పటికే టికెట్లు ఖరారైనవారు దూకుడుగా ముందుకు వెళ్తుండగా.. టికెట్ కచ్చి తంగా దక్కుతుందన్న భరోసా ఉన్నవారూ ‘ఖర్చు’ మొదలుపెట్టేశారు. ఇక టికెట్ ఆశిస్తున్నవారూ అస్త్రశ్రస్తాలను సిద్ధంగా పెట్టుకుంటున్నారు. అంతా డబ్బు సమీకరణ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఎంత ఖర్చవుతుంది, ఎంత సమకూరింది, ఇంకా ఎంత అవసరమనే లెక్కలు వేస్తున్నారు. ఎన్నికల కోడ్, తనిఖీల నేపథ్యంలో ఎక్కడికక్కడే నమ్మకస్తులు, అనుచరుల వద్ద డబ్బును సిద్ధంగా పెట్టి.. ఏయే సమయంలో, ఏ ఖర్చులకు వాడాలో సూచిస్తున్నారు. - గౌటే దేవేందర్ -
భూముల రీ సర్వేకు జాతీయస్థాయి ప్రశంస
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న భూ సమ స్యలన్నింటినీ పరిష్కరించే లక్ష్యంతో చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియకు జాతీయస్థాయిలో ప్ర శంసలు లభిస్తున్నాయని మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో వందేళ్ల తర్వాత జరుగుతున్న భూముల రీ సర్వేను అత్యంత శాస్త్రీయంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం జగనన్న భూహక్కు–భూరక్ష పథకంపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు మాట్లాడుతూ ఇటీవలే కేంద్ర కార్యదర్శి, అడిషనల్, జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులతోపాటు 5 రాష్ట్రాల నుంచి సర్వే విభాగానికి సంబంధించిన కమిషనర్లు రాష్ట్రంలో పర్యటించి, భూముల రీ సర్వే విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. మొదటి, రెండు దశల్లో మొత్తం 4 వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి, భూ హక్కు పత్రాలను పంపిణీ చేసినట్లు అధికారులు మంత్రుల కమిటీకి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,072 గ్రామాల్లో డ్రోన్ ఫ్లైయింగ్ ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. 9 వేల గ్రామాలకు డ్రోన్ ఇమేజ్‌లను పంపించినట్లు చెప్పారు. మూడో దశకు సంబంధించి ఇప్పటికే 360 గ్రామాల్లో సర్వే పూర్తయ్యిందన్నారు. అర్బన్ ప్రాంతాల్లోనూ సర్వే ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. నాలుగు మున్సిపల్ ఏరియాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి, హక్కు పత్రాలను అందించాలనే లక్ష్యం మేరకు పనిచేయాలని మంత్రులు ఆదేశించారు. మూడో దశ సర్వేను వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా అన్ని విభాగాల అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం, భూపరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, మైనింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ కమిషనర్ సిద్దార్థ్ జైన్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సూర్యకుమారి పాల్గొన్నారు. -
‘పైగా’ భూములపై.. అవి తప్పుడు తీర్పు నివేదికలే..
సాక్షి, హైదరాబాద్: ‘పైగా’భూములకు సంబంధించి 1998లో ఇచ్చిన తీర్పు కాపీని సీల్డ్ కవర్లో హైకోర్టుకు రిజిస్ట్రార్ సమర్పించారు. సెపె్టంబర్ 15న విచారణ సందర్భంగా ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు నివేదిక అందజేశారు. పిటిషనర్ పేర్కొన్నట్లు ‘పైగా’భూములపై 1998లో హైకోర్టు ఏ తీర్పునూ ఇవ్వలేదని, అసలు పిటిషనర్ పేర్కొన్న పిటిషన్లే నమోదు కాలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీంతో తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పిటిషనర్‌ను ఆదేశిస్తూ, స్టేటస్ కో ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. అక్టోబర్ 13కు విచారణను వాయిదా వేసింది. 50ఎకరాల భూములపై వివాదం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామంలోని దాదాపు 50 ఎకరాల భూమిని తన పూర్వికులు పైగా(సైన్యం నిర్వహణకు పరిహారంగా నిజాం నవాబ్ మంజూరు చేసిన భూమి) యజమానుల నుంచి కొనుగోలు చేశారని, అన్ని డాక్యుమెంట్లు ఉన్నా హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇబ్బందులు కల్పిస్తున్నారని పేర్కొంటూ హైదరాబాద్ వట్టేపల్లికి చెందిన యహియా ఖురేషి హైకోర్టులో రెండు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ రాఘువన్, ప్రభుత్వం తరఫున బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. బోగస్ డాక్యుమెంట్లు, రశీదులు సృష్టించి కోర్టును తప్పదారి పట్టించి అత్యంత విలువైన ప్రాంతంలో దాదాపు 50 ఎకరాలకుపైగా భూమిని స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారని ఏజీ గతంలో వాదనలు వినిపించారు. 2007, 2012లో జారీ చేసి న రసీదులు పూర్తిగా నకిలీవని.. తప్పుడు రసీదులను, కోర్టు తీర్పు ఉత్తర్వుల డాక్యుమెంట్లను ఆయ న ఈ సందర్భంగా ధర్మాసనం ముందు ఉంచారు. 2007నాటికి తెలంగాణ రాష్ట్రం ఎక్కడుంది? 2007 నాటికి తెలంగాణ రాష్ట్రమే లేదని, రసీదుల్లో మాత్రం అలా పేర్కొన్నారని, అలాగే శంషాబాద్ గ్రామం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండగా, హైదరాబాద్ అని మరో రసీదులో ఉందన్నారు. దీనిపై పూర్తిగా విచారణ జరిపి సీల్డ్ కవర్లో నివేదిక అందజేయాలని జుడీషియల్ రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం ఈ మేరకు నివేదిక అందజేసింది. అనంతరం ధర్మాసనం.. ఈ నివేదిక కాపీలను అక్టోబర్ 3లోగా పిటిషనర్‌కు, ప్రభుత్వానికి కూడా అందజేయాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది. -
రింగ్ రోడ్ మార్గంలో లింగమనేనికి భారీగా భూములు: ఏజీ
-
రాష్ట్రంలో భూ సంస్కరణలు ఓ విప్లవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన భూసంస్కరణలు ఓ విప్లవమని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అన్నింటినీ ఎదుర్కొని కేవలం నాలుగేళ్లలోనే ఈ సంస్కరణలు తెచ్చారని తెలిపారు. ఈ సంస్కరణలు రాష్ట్రంలోని లక్షలాది పేద కుటుంబాల జీవన స్థితిగతులను మారుస్తాయని, వారి గౌరవాన్ని పెంచుతాయని వివరించారు. సీఎం జగన్ చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ సంస్కరణలు తెచ్చారని తెలిపారు. భూమి యాజమాన్యం, వినియోగదారులకు సంబంధించి ఈ నాలుగేళ్లు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. ‘అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ – రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే – పేదల కోసం చుక్కల భూముల సంస్కరణలు’ అనే అంశంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా 15 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పారు. 28 లక్షల ఎకరాల భూమిపై ఒకేసారి యాజమాన్య హక్కులు రాబోతున్నాయని తెలిపారు. భూమి టైటిల్ ఫ్రీగా ఉంటే పెట్టుబడులు తెస్తుందని, దానివల్ల ఉద్యోగాలు వస్తాయని, తద్వారా జీడీపీ పెరిగి రాష్ట్రం వృద్ధిలోకి వస్తుందని తెలిపారు. భూమిని సరిగా వినియోగంలో తీసుకురాలేకపోతే అది సరైన పాలన కాదని అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలూ భూమిని లిటిగేషన్ ఫ్రీ చేస్తున్నాయని చెప్పారు. భూమి వినియోగంలో లేకుండా చేస్తే చెడు ప్రభావాలు పెరుగుతాయన్నారు. అసైన్డ్ భూముల చట్ట సవరణ భూమిని అమ్మడానికి చేసినది కాదని, వాటిపై సర్వ హక్కులు కల్పించడం కోసమని చెప్పారు. ఎప్పుడైనా దాన్ని ఉపయోగించుకునేలా ప్రైవేటు భూమితో సరిసమానమైన హక్కులు కల్పించామన్నారు. సీఎం వైఎస్ జగన్ తెచ్చిన ఈ సంస్కరణలను ప్రజలు బాగా స్వీకరించారని, ఇంత పెద్ద సమస్యకు ఆర్డినెన్స్ ఇస్తే ఒక్క విమర్శ కూడా రాలేదన్నారు. అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు దాటితే యాజమాన్య హక్కులు లభిస్తాయన్నారు. ఈ భూముల యజమానులు ఎన్ఓసీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదని, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదని చెప్పారు. అధికారులు వీటి జాబితాను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపుతారని, ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్కడ ప్రక్రియ అంతా జరుగుతుందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచిన వాడే నాయకుడు ప్రజల కష్టాలను తగ్గించి, జీవన ప్రమాణాలు పెంచి, వారి గుండుల్లో చిరకాలం ఉండే వాడు, పెద్ద ఎత్తున జరిగే దాడిని తట్టుకుని సంస్కరణలు చేయగలిగిన వాడే నాయకుడని అన్నారు. అలాంటి నాయకుడే వైఎస్ జగన్ అని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చే సమయానికి పేదలకు భూమి ఇస్తే, అది మళ్లీ ధనవంతుల దగ్గరకు చేరిపోయే పరిస్థితి ఉందని, అందుకే పేదలకిచ్చిన భూముల్ని అమ్మకూడదని, వ్యవసాయం మాత్రమే చేయాలని నిబంధన పెట్టారని తెలిపారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేనందున, ఇంకా భూమిని ప్రభుత్వం చేతుల్లోనే పెట్టుకోవడం సరికాదని, ఆ భూములపై వారికి సర్వ హక్కులు ఇవ్వాల్సిందేనని సీఎం జగన్ భావించారని తెలిపారు. పేద రైతుల గౌరవాన్ని పెంచడానికి అసైన్డ్ భూముల చట్టానికి సీఎం సవరణ సవరణ చేశారని తెలిపారు. దీనివల్ల 15 లక్షల కుటుంబాల సామాజిక స్థితి మారి, వారికి గౌరవం ఏర్పడుతుందన్నారు. 28 లక్షల ఎకరాల భూమిపై ఒకేసారి యాజమాన్య హక్కులు రాబోతున్నాయని తెలిపారు. ఎవరూ కోరకుండానే సీఎం జగన్ ఈ సంస్కరణలు తెచ్చారని తెలిపారు. దీనిపై బాగా అధ్యయనం చేశామని, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు వెళ్లి చూశామని, అన్నింటిపైనా చర్చింన తర్వాత అక్కడికంటే సరళంగా సీఎం చట్టాన్ని మార్చారని చెప్పారు. వైఎస్సార్ తర్వాత మళ్లీ ఇప్పుడే భూ పంపిణీ అనాధీన భూములను క్రమబద్దీకరించి, వందేళ్లుగా ఉన్న చుక్కల భూముల సమస్యనూ సీఎం జగన్ పరిష్కరించారని చెప్పారు. దీనిద్వారా 2.50 లక్షల ఎకరాలు విముక్తి పొందాయని, ఆ రైతులకు హక్కులు వచ్చాయని తెలిపారు. దళితవాడల్లో భూమి కొని అయినా శ్వశానవాటికలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించినట్లు తెలిపారు. భూ పంపిణీ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో జరిగిందని, అప్పట్లో 7 లక్షల ఎకరాలు ఇచ్చామని తెలిపారు. మళ్లీ ఇప్పుడు భూ పంపిణీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలిపారు. సాగుకు యోగ్యమైన భూమిని గుర్తించారని, త్వరలో సభ పెట్టి పంపిణీ ప్రారంభిస్తారని చెప్పారు. అసైన్డ్ భూముల చట్టంలో ఇళ్ల స్థలాలపై ఉన్న ఆటంకాన్ని కూడా ముఖ్యమంత్రి ఎత్తివేశారని, 10 సంవత్సరాల తర్వాత ఆ స్థలాలను అమ్ముకోవచ్చని తెలిపారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వడం గొప్ప విషయం 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం గొప్ప విషయమని మంత్రి చెప్పారు. ఇందుకోసం భూమని కొనడానికి రూ. 12 వేల కోట్లు ఖర్చయినా సీఎం జగన్ వెనకడుగు వేయలేదని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల్లో పేదల కోసం భూమి కొనడానికి రూ.12 వేల కోట్లు బడ్జెట్లో పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ జగన్ ప్రభుత్వమేనని చెప్పారు. ఆ కాలనీల్లో సౌకర్యాలు కల్పించడానికి ఇంకా చాలా ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఈ స్థలాల లేఅవుట్లు, అక్కడ కల్పిస్తున్న వసతులు చూసి అక్కడికి వెళ్లాలని చాలామంది అనుకుంటున్నారని తెలిపారు. ఇదంతా కేవలం రెండేళ్లలోనే వచ్చిందన్నారు. ఈర‡్ష్యతో ఉన్న వాళ్లు తప్ప ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రశంసించకుండా ఎవరుంటారని ప్రశ్నించారు. సర్వే జరక్కపోవడం వల్లే గ్రామాల్లో వివాదాలు బ్రిటిషర్ల కాలంలో భూముల సర్వే జరిగిందని, అప్పటి నుంచి మళ్లీ సర్వే జరక్కపోవడం వల్ల గ్రామాల్లో ఎన్నో వివాదాలు నెలకొన్నాయని చెప్పారు. వీటన్నింటినీ పరిష్కరించడానికి సీఎం వైఎస్ జగన్ రీ సర్వే ప్రారంభించారని తెలిపారు. 17 వేల గ్రామాలకుగానూ 4 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయిందని, రెండు నెలలకు 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని తెలిపారు. 15 శాతం మందికి ఖాతా నంబర్లు కూడా లేవని, 1.20 లక్షల మందికి ఎఫ్‌ఎంబీలు కూడా కనిపించడంలేదన్నారు. ఒక్క సర్వే జరిగితే ఇలాంటివన్నీ పరిష్కారమవుతాయన్నారు. 5 సెంటీమీటర్ల కచ్చితత్వంతో సర్వే చేస్తున్నామన్నారు. ఇందుకోసం 10 వేల మంది సర్వేయర్లను నియమించామని, పరికరాల కోసం ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. దేశంలో సమగ్రమైన సర్వే చేసిన రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలవబోతోందన్నారు. దీనివల్ల ప్రయోజనం పొందుతున్న ఏ ఒక్క రైతు పైసా పెట్టక్కర్లేదన్నారు. ఇవన్నీ భవిష్యత్ తరాల కోసం చేసే పనులని, రాజనీతిజు్ఞలే ఈ పనులు చేస్తారని చెప్పారు. ఇవన్నీ ఓట్ల కోసం చేసేది కాదు ఒక స్కూల్ పిల్లాడికి అవసరమైన అన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్నారని మంత్రి చెప్పారు. పుస్తకాలు, బ్యాగ్, యూనిఫాం, బూట్లు, సాక్సులు ఇవ్వడం.. మంచి టీచర్‌ను పెట్టడం, వారికి భోజనం పెట్టడం.. ఒకవేళ వాళ్లమ్మ పనికి పంపేస్తుందనే భయంతో ఆమెకు డబ్బులివ్వడం.. ఇవన్నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం సీఎం జగన్ చేస్తున్న కార్యక్రమాలని తెలిపారు. ఓట్ల కోసం కాదని చెప్పారు. తల్లితండ్రులు, పిల్లల కోసం దేశంలో ఎక్కడా లేని మంచి విద్యా వ్యవస్థను సీఎం జగన్ ఇక్కడ తెచ్చారన్నారు. టీచర్లంటే తనకు చాలా అభిమానం ఉందని, వారిపై వ్యతిరేకత లేదని చెప్పారు. వారు కోరకుండానే విద్యా వ్యవస్థలో మార్పు వచ్చిందని, దీన్ని అభినందిస్తూ ఒక తీర్మానం చేయాలని అన్నానని, దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. అవసరమైతే తన మాటలను ఉపసంహరించుకుంటానని చెప్పారు. ప్రతి సెక్రటేరియట్ ఓ రిజిస్ట్రేషన్ కార్యాలయం సామాన్యలు మరింత త్వరతగతిన రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి సీఎం జగన్ కొత్తగా టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారని చెప్పారు. దీని ద్వారా రిజిస్ట్రేషన్‌తోపాటే మ్యుటేషన్ కూడా జరిగిపోతుందన్నారు. ప్రతి గ్రామ సెక్రటేరియేట్ ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయం కాబోతోందన్నారు. కొత్త చట్టం వచ్చాక ఆర్ఓఆర్ చట్టం ఉండదన్నారు. ఒకే ఆస్తిని రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేయడం వంటివి ఉండవన్నారు. క్లియర్ టైటిల్‌తో ఉండే రాష్ట్రంగా ఏపీ నిలవబోతోందన్నారు. వంద సంవత్సరాలుగా కృశించినపోయిన రెవెన్యూ శాఖను సీఎం జగన్ కోట్లాది మంది ఆకాంక్షలకు అనుగుణంగా మార్చారని తెలిపారు. వెబ్‌ల్యాండ్‌లో తప్పులు సరి చేయడానికి తహశీల్దార్‌కి అధికారాలు ఇచ్చారన్నారు. ఎస్సీ కోఆపరేటివ్ భూములకు పట్టాలివ్వడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దేవాలయాల సర్వీస్ ఈనాం భూములపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రెవెన్యూలో విప్లవాత్మక మార్పులు: శాసన వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి రెవెన్యూ వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. అసైన్డ్, చుక్కల భూముల సమస్యలు పరిష్కరించడం వల్ల కొన్ని లక్షల మంది దళితులు, బీసీలు, పేదలకు లబ్ధి కలిగింది. అసైన్డ్ భూములపై హక్కులు నిరుపేదలకు వరం. గత ప్రభుత్వంలో రెవెన్యూ విషయంలో చాలా తప్పలు జరిగాయి. ఒకరి భూములను మరొకరు ఆన్లైన్ చేయించుకున్న దాఖలాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని కోరుతున్నా. వైఎస్ జగన్ ప్రభుత్వం రెవెన్యూ లోపాలపై గట్టిగా దృష్టి సారించి, వాటిని సవరిస్తోంది. హక్కుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తోంది. ఇది పేదల ప్రభుత్వమని మరోసారి నిరూపించింది. అసైన్డ్ హక్కులు చారిత్రాత్మకం : సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసైన్డ్ భూములపై హక్కులు కల్పించడం చరిత్రాత్మకం. అనేక జటిలమైన సమస్యలకు సీఎం జగన్ ఈరోజు పరిష్కారాలు చూపిస్తున్నారు. చంద్రబాబు ఫిలాసఫీ హైటెక్. సీఎం జగన్ ఫిలాసఫీ లోకల్టెక్. చంద్రబాబు కార్పొరేట్ శక్తుల్ని ప్రేమిస్తే.. జగన్ కార్మికుల్ని ప్రేమిస్తారు. భూమాతను కొందరికే సొంతం చేసిన చరిత్ర బాబుది. అదే భూమిని పేదలకు ఇచ్చి వారికి హక్కులు కల్పించిన సీఎం జగన్. చంద్రబాబు రాజమండ్రిలో ప్రజలను చంపిన చోటే దేవుడు ఆయన్ని జైల్లో పెట్టాడు. 31 లక్షల మందికి ఇళ్ల పట్లాలు లేవనే విషయం చద్రబాబుకు తెలుసా? ఒక సినిమా హీరో విలన్‌కి సపోర్ట్ చేస్తున్నాడు. నైపుణ్యమైన దొంగను కాపాడ్డానికి హీరో వెళ్లాడు. ఆయన హీరో కాదు విలన్. అణగారిన వర్గాలకు, బలిసిన వాళ్లకి మధ్య యుద్ధం జరుగుతోంది. బాబు అసైన్డ్ భూముల్ని దోచుకున్నారు.. జగన్ వాటిపై హక్కులిచ్చారు: నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ ఎం జగన్మోహనరావు చంద్రబాబు అసైన్డ్ భూములను దోచుకుంటే, సీఎం వైఎస్ జగన్ వాటిపై పేదలకు హక్కులు కల్పించారు. బాబు హయాంలో క్యాపిటల్ రీజియన్‌లో 1,400 ఎకరాల అసైన్డ్ భూములను దోచుకున్నారు. సీఆర్డీఏ పరిధిలో అసైన్డ్ రైతులను భయపెట్టి వారి భూముల్ని లాక్కున్నారు. చుక్కల భూములు, షరతుల గల భూములు వంటి లక్షల ఎకరాలపై హక్కులివ్వడం ఎప్పుడూ జరగలేదు. సమగ్ర భూ సర్వేను స్వాతంత్య్రం వచ్చాక ఏ ప్రభుత్వం చేపట్టలేదు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ఈ సర్వే జరుగుతోంది. అభినవ కొమరం భీం జగన్ : పాడేరు ఎమ్మెల్యే కె. భాగ్యలక్ష్మి అసైన్డ్ భూములకు సీఎం వైఎస్ జగన్ సంపూర్ణమైన యాజమాన్య హక్కులు కల్పించడం చరిత్రాత్మకం. ఈ నిర్ణయం లక్షలాది రైతుల జీవితాల్లో గొప్ప మార్పు తెస్తుంది. గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ భూములకు ఇప్పుడు రుణాలు ఇస్తున్నారు. గిరిజనులకు భూములపై సర్వ హక్కులు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినవ అంబేద్కర్.. అభినవ కొమరం భీం. -
‘పట్టా’భిషేకం
ఆస్తులున్నా అనుభవించలేని దుస్థితి.. అమ్ముకోలేని పరిస్థితి.. వెరసి జీవితం దుర్భరం.. దశాబ్దాలుగా నరకం అనుభవిస్తున్న నిషేధిత భూముల యజమానులు.. ఈ దైనందిన స్థితి నుంచి ఎమ్మెల్యే భూమన విశేష కృషితో ఆ భూ యజమానులకు విముక్తి లభించింది. వారికి నేడు ఆ ఆర్డర్ కాపీలను అందజేయనున్నారు. దీనిపై ప్రత్యేక కథనం. తిరుపతి తుడా: నగరంలోని పలు ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్లపై 22ఏ నిషేధిత నిబంధన శాపంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించే నాథుడే లేకపోగా 2018లో నాటి ప్రభుత్వం మరికొన్ని ప్రాంతాలను నివేధిత జాబితాలో చేర్చింది. దీంతో ఆస్తులున్నా అనుభవించలేని దయనీయ స్థితిలో నగర ప్రజలు దశాబ్దాలుగా జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితిలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి చొరవతో నిషేధిత జాబితాలోని 5,341 కుటుంబాలకు చెందిన భూములకు విముక్తి కల్పించారు. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రమబద్ధీకరణ ఆర్డర్ కాపీలను శివజ్యోతి నగర్ వాసులకు పంపిణీ చేశారు. దీంతో శివజ్యోతి నగర్, అయ్యప్పకాలనీ, ఎర్రకమిట్ట ప్రాంతాల్లోని 750 మందికి ఉపశమనం కలిగింది. ప్రస్తుతం మరోసారి 22ఏలోని నిషేధిత భూములకు మోక్షం లభించింది. తద్వారా సుమారు 10 వేల మందికి పైగా లబ్ధి పొందనున్నారు. ఈ జాబితా నుంచి విముక్తి పొందిన నగర ప్రజలకు బుధవారం పట్టాభిషేకం చేయనున్నారు. 50 ఏళ్లుగా నరకం తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో భూములను 50 ఏళ్ల కిత్రమే 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చారు. దీంతో ఆ భూములు క్రయవిక్రయాలకు నోచుకోలేదు. ఈ సమస్యను స్థానికులు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వారు 22ఏ నిబంధన విషయాన్ని పలుసార్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించి నిషేధిత జాబితా నుంచి ఆ భూములకు విముక్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో నగరవాసుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆ పాపంలో బాబూ భాగస్వామే తిరుపతిలోని 2,300 ఎకరాలకు సంబంధించిన భూములపై నాటి చంద్రబాబు ప్రభుత్వం 2018లో 22ఏ నిబంధన అస్త్రాన్ని ప్రయోగించింది. తప్పుల తడక కారణంగా ప్రభుత్వ, చుక్కల, దేవదాయ, మఠం భూములతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లోని భూములను ఆ జాబితాలో చేర్చింది. దీంతో గందరగోళం నెలకొనింది. ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఎవరు ఎప్పుడు ఇచ్చిన జీఓ కారణంగా ఈ పరిస్థితులు నెలకొన్నాయో ఆధారాలసహా వివరించడంతో ప్రతిపక్ష పార్టీలు చేసేదిలేక ఆ పాపం తమ నాయకుడిదేనని తలవంచక తప్పలేదు. 104 ఎకరాలకు విముక్తి 104 ఎకరాలకు సంబంధించిన భూములు 22ఏ నిషేదిత జాబితా నుంచి విముక్తి పొందాయి. విముక్తి పొందిన ప్రాంతాల్లో తంబవాణిగుంట, కొర్లగుంట, చంద్రశేఖర్‌రెడ్డి కాలనీ, నవోదయకాలనీ, ఎరుకుల కాలనీ, మారుతీనగర్, పూలవానిగుంట, ఆటోనగర్, అంబేడ్కర్‌కాలనీ, గొల్లవానిగుంట, బొమ్మగుంట, సూరయ్యకట్ట, ఎల్బీనగర్, సత్యనారాయణపురం, శ్రీకృష్ణనగర్, గాయత్రీనగర్, సుందరయ్యనగర్, సింగాలగుంట, రెడ్డిగుంట, తాతయ్యగుంట తదితర ప్రాంతాలు ఉన్నాయి. ప్రజలకు ఎంత చేయాలో అంతాచేస్తాం ప్రజా సమస్యలు, వినతులు, ఇబ్బందులు ఏవైనా నా వద్దకు వస్తే వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ముందుంటాను. 22ఏ గుదిబండపై వచ్చిన అన్ని వినతులను పరిశీలిస్తున్నాం. ఇప్పటికే అనేక ప్రాంతాల్లోని భూములకు నిషేధం నుంచి విముక్తి కల్పించాం. రాబోవు రోజుల్లో మరిన్ని భూములకు ఆ నిబంధన నుంచి ఉపశమనం కల్పిస్తాం. ప్రజలకు ఎంత చేయాలో అంతా చేస్తాం. 10 వేల మందికి లబ్ధి చేకూర్చే ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తోంది. – భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ప్రజలకు మేలు చేయడమే లక్ష్యం నగరంలో ఎన్నో ఏళ్లుగా భూసమస్యకు ఏ ఒక్కరూ పరిష్కారం చూపకపోగా 2018లో దాదాపు 2,300 ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజల పాపం మూటకట్టుకున్నారు. ఆస్తులున్నా వాటిని అనుభవించలేని దుస్థితికి కారకులయ్యారు. ఈ సమస్యను ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీఎంతో చర్చించి పరిష్కార మార్గాన్ని సాధించారు. వేలాది కుటుంబాలలో వెలుగులు నింపారు. రాబోవు రోజుల్లో తిరుపతి నగరం మరింత మంచిని చూడబోతోంది. –భూమన అభినయ్‌రెడ్డి, డిప్యూటీ మేయర్, తిరుపతి నేడు ఆర్డర్ కాపీల పంపిణీ 22ఏ జాబితాలోని 104 ఎకరాల భూములపై నిషేధం తొలగింపునకు సంబంధించిన ఆర్డర్ కాపీలను బుధవారం సాయంత్రం 4 గంటలకు నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో జరిగే కార్యక్రమంలో పంపిణీ చేయనున్నారు. భూమన కృషి అమోఘం నగరంలోని 22ఏ నిషేధిత భూములకు విముక్తి కల్పించేందుకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన తనయుడు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి విశేషంగా కృషి చేశారు. వీరి కృషిని నగరవాసులు కొనియాడుతున్నారు. -
ఆ భూములకు మార్కెట్ ధర నిర్ణయించండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో కమ్మ, వెలమ కుల సంఘాలకు కేటాయించిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయించాలని సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. జీవో 571 ప్రకారం మార్కెట్ ధరను అంచనా వేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న గత ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నిర్మాణాలు చేసి ఉంటే అవి తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఖానామెట్‌లో కమ్మ, వెలమ కుల సంఘాల కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదెకరాల చొప్పున కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డు ప్రొఫెసర్ ఎ.వినాయక్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం మరోసారి సోమవారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కుల సంఘాలకు భూకేటాయింపు అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. 2012, సెప్టెంబర్ 14 నాటి జీవో 571 మేరకు ప్రభుత్వం ఈ సంఘాలకు ఇచ్చిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయిస్తామని, ఇందుకు అనుమతించాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని ఆమోదించవద్దని కోరారు. అనంతరం ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
చంద్రుడి స్థలాలపై హక్కు ఎవరిది?
1967లో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం.. చందమామ సహా అంతరిక్షంలోని సహజ ఉపగ్రహాలు, గ్రహాలు, నక్షత్రాలపై ఏ వ్యక్తికీ, దేశానికీ హక్కులు ఉండవు. కానీ ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ (ఐఎల్ఎల్ఆర్), లూనా సొసైటీ ఇంటర్నేషనల్‌తోపాటు పలు ఇతర సంస్థలు వెబ్సైట్లు పెట్టి చందమామపై స్థలాలను అమ్ముతున్నాయి. చంద్రుడిపై మానవులు ఆవాసాలు ఏర్పర్చుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో కూడా తెలియదు. అయినా చాలా మంది వినూత్నంగా ఉంటుందనో, భిన్నమైన బహుమతి ఇవ్వాలనో, సరదాకో చంద్రుడిపై భూములను కొనుగోలు చేస్తున్నారు. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ గతంలో చంద్రుడిపై స్థలాన్ని కొన్నట్టు చెప్పారు. 2009లో షారుక్‌ఖాన్ మహిళా వీరాభిమాని ఒకరు ఆయనకు చంద్రుడిపై స్థలాన్ని కొని బహుమతిగా ఇవ్వడం గమనార్హం. అయితే చంద్రుడిపపై సుమారుగా 43,560 చదరపు అడుగులు లేదా 4,047 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక ఎకరం ధర సుమారు 37.50 (భారత కరెన్సీ ప్రకారం 3,054) మరియు సూపర్‌స్టార్‌కు అక్కడ అనేక ఎకరాలు బహుమతిగా ఇచ్చారు. చదవండి: ప్రధాని బెంగుళూరు పర్యటన.. సీఎంని రావొద్దని నేనే చెప్పా: మోదీ కాగా ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై పాదం మోపిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్ పూర్తయ్యాక 4 గంటలకు.. అంటే ఈ నెల 23న రాత్రి 10.04 గంటలకు ల్యాండర్ తలుపులు తెరుచుకున్నాయి. రోవర్ నెమ్మదిగా బయటకు వచి్చంది. ప్రజ్ఞాన్ ప్రస్తుతం చందమామ ఉపరితలంపై తన ప్రయాణం నిరాటంకంగా సాగిస్తోంది. అందులోని పేలోడ్స్ సైతం పని చేయడం మొదలైందని ఇస్రో వెల్లడించింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌లోని అన్ని పేలోడ్స్ చక్కగా పని చేస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. -
సరికొత్త చరిత్రను లిఖించాం.: పీఎం మోదీ..
జోహెన్నస్‌బర్గ్: చంద్రుని దక్షిణ ధృవంపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా భారత్ సమిష్టిగా చరిత్ర సృష్టించిందని ప్రధాని మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ.. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై కాలుమోపిన క్షణాన్ని వీక్షించారు. భారత్ గౌరవించదగిన విషయమని ప్రధాని మోదీ అన్నారు. "ఈ విజయంపై ఇస్రోను, శాస్త్రవేత్తలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను దక్షిణాఫ్రికాలో ఉండవచ్చు కానీ నా హృదయం ఎల్లప్పుడూ చంద్రయాన్ మిషన్‌తో ఉంటుంది. చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపాం. ఇప్పటివరకు ఏ దేశం కూడా ఈ ఘనత సాధించలేదు. సరికొత్త చరిత్రకు అధ్యాయం ప్రారంభమైంది." అని దక్షిణాఫ్రికా నుంచి వర్చువల్ ప్రసంగంలో ప్రధాని మోదీ అన్నారు. ఈ విజయంతో భారత్.. అంతరిక్ష రంగంలో చైనా, రష్యా, అమెరికా సరసన చేరింది. చంద్రునిపై ల్యాండింగ్ చేసిన ఘటన ఇప్పటివరకు ఈ మూడు దేశాలకే ఉండేది. తాజాగా చంద్రయాన్ 3తో భారత్ కూడా చేరింది. Congratulations @isro #Chandrayaan3 #IndiaOnTheMoon #PMModi #NarendraModi #PMOIndia #Congratulations #isrochandrayaan3mission @narendramodi pic.twitter.com/mVfQZAIF1V — Aryan S Prince (@aryansprince49) August 23, 2023 చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసిన అద్భుత ఘట్టం ఆవిషృతమైంది. 2019లో చంద్రయాన్ 2 విఫలమైన తర్వాత ఈ మిషన్‌ను ఛాలెంజ్‌గా తీసుకోవడం, అటు.. రష్యా లూనా 25 ఇటీవల ఫెయిలవడంతో యావత్ ప్రపంచం చంద్రయాన్ 3వైపు ఆసక్తిగా చూసింది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 ఆ విజయం వెనక మేధస్సు వీరిదే -
కోకాపేట భూముల్ని కారుచవకగా కొల్లగొట్టిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ రాయించుకున్న కోకాపేట భూములను వెంటనే ప్రభుత్వపరం చేయాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎకరం రూ.100 కోట్ల లెక్కన రూ.1100 కోట్లను చెల్లించాలని గురువారం ట్విట్టర్ వేదికగా కోరారు. జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాల యాల పేరిట రూ.వెయ్యి కోట్ల విలువైన 33.72 ఎక రాల భూములను రూ.3 కోట్లకే అప్పనంగా కొట్టేశా రని ఆరోపించారు. ఎకరం రూ.100 కోట్లు పలికే కోకాపేటలో బీఆర్ఎస్ భవనం కోసంరూ.3.41 కోట్లకే 11 ఎకరాలు దోచేశారని పేర్కొన్నారు. -
పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం భూమి ఎస్సీలకు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేసే పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం భూమి తప్పనిసరిగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. నూతన పారిశ్రామిక పాలసీ 2023 –27 కింద వివిధ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులకు ఏపీఐఐసీ భూ కేటాయింపులకు ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీఐఐసీ ఇండ్రస్టియల్ పార్క్స్ అలాట్మెంట్ రెగ్యులేషన్ 2020 కింద కేటాయించిన భూములకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని, తాజాగా చేసిన కేటాయింపులకు మాత్రమే వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.తాజా మార్గదర్శకాల ప్రకారం.. పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం భూమిని కామన్ ఫెసిలిటీ సెంటర్, 5 శాతం వాణిజ్య ప్లాట్స్‌కు కేటాయించాలి. ఎంఎస్ఎంఈలకు 15 శాతం కేటాయించాలి. రూ.500 కోట్ల పైబడి పెట్టుబడితో కనీసం 1,000 మందికి ఉపాధి కల్పిస్తూ కనీసం మరో ఐదు అనుబంధ యూనిట్లు వచ్చే యాంకర్ యూనిట్లకు 25 శాతం తక్కువ ధరకు భూమి కేటాయిస్తారు. మండలస్థాయిలో ఏర్పాటు చేసే యాంకర్ యూనిట్లకు 20 నుంచి 33 శాతం వరకు తగ్గింపు ఇస్తారు. 33 ఏళ్లపాటు లీజుకు భూమిని ఇస్తారు. ఆ తర్వాత లీజును 66, 99 సంవత్సరాలకు పెంచుకోవచ్చు. ఉత్పత్తి ప్రారంభించి 10 ఏళ్లు దాటి నిబంధనలను పూర్తి చేసిన యూనిట్లకు ఆ భూమిని కొనుక్కొనే హక్కు కల్పిస్తారు. వివిధ కంపెనీలకు భూకేటాయింపులు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహక విధానంలో భాగంగా వివిధ పరిశ్రమలకు భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వట్ల గ్రామం వద్ద ఉన్న రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని సంజమల రైల్వే స్టేషన్‌కు అనుసంధానిస్తూ రైల్వే లైన్ నిర్మాణం కోసం 211.49 ఎకరాలు కేటాయించింది. ఎన్టీఆర్ జిల్లా మల్లవల్లి వద్ద బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు అవిశా ఫుడ్స్‌కు 101.81 ఎకరాలు, విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద సత్య బయోఫ్యూయల్‌కు 30 ఎకరాలు కేటాయించింది. తిరపతిలో హిందుస్థాన్ స్టీల్ వర్క్స్‌కు కేటాయించిన 50.71 ఎకరాల యూనిట్ పూర్తి కావడానికి గడువును పెంచింది. కియా వెండర్స్‌కు రాయితీలకు సంబంధించిన విధివిధానాలు, శ్రీకాళహస్తి వద్ద ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ (గతంలో శ్రీకాళహస్తి పైప్స్) కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫెర్రో అల్లాయిస్ యూనిట్‌కు, గుంటూరు టెక్స్టైల్ పార్క్, తారకేశ్వర టెక్స్టైల్ పార్కులకు వాటి పెట్టుబడి, ఉద్యోగ కల్పన ఆధారంగా టైలర్‌మేడ్ రాయితీలను ప్రకటించింది. -
ఎర్రమట్టికి, ఎర్రమట్టి దిబ్బలకు తేడా తెలుసుకో పవన్
కొమ్మాది (భీమిలి): ఎర్రమట్టికి, ఎర్రమట్టి దిబ్బలకు తేడా తెలుసుకోవాలని ఇక్కడి జేవీ అగ్రహారం, నిడిగట్టు, కొత్తవలస రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సూచించారు. పర్యాటక ప్రాంతం ఎర్రమట్టి దిబ్బలను ధ్వంసం చేస్తున్నారంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలను వారు ఖండించారు. గురువారం ఎర్రమట్టి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు మాట్లాడారు. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్న సమయంలో ఈ ప్రాంతాల్లో ఒక్కో రైతుకు 5 ఎకరాలు ఇచ్చారని తెలిపారు. కాలక్రమేణా పంటలు పండకపోవడంతో ప్రభుత్వం ఈ భూములను అభివృద్ధి చేస్తామనడంతో లాండ్ పూలింగ్‌కు ఇచ్చామని, తమపై ఎటువంటి ఒత్తిడీ లేదని చెప్పారు. బుధవారం పవన్ పర్యటించిన ప్రాంతం నుంచి కనుచూపు మేరలో కూడా ఎర్రమట్టి దిబ్బలు లేవన్నారు. అసలు ఎర్రమట్టి కనిపించే ప్రాంతమంతా ఎర్రమట్టి దిబ్బలు కావని పవన్ తెలుసుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా మట్టి ఎర్రగా ఉంటుందని, అలా అని ఊరంతా ఎర్రమట్టి దిబ్బలంటే ఎలా అని ప్రశ్నించారు. పవన్ పర్యటించిన ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం నాయకులు రైతుల వద్ద తక్కువ ధరకు డీఫారం భూములు కొన్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక లాండ్ పూలింగ్ ద్వారా రైతులకు మేలు జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూములు చవగ్గా లాగేసుకున్నా మాట్లాడని పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పవన్ వాస్తవాలు తెలుసుకుని ప్రజల్లోకి వెళ్లాలే తప్ప ఇతర పార్టీల లబ్ధికోసం పేదల పొట్టకొట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో రైతులతోపాటు వైఎస్సార్సీపీ వార్డు అధ్యక్షుడు రమణారెడ్డి, నాయకులు రామకృష్ణ, నల్లబాబు, చంటి తదితరులు పాల్గొన్నారు. -
అమ్మకానికి ఎల్&టి మెట్రోరైల్ భూములు?
-
గిరిజనాభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సాక్షి, హైదరాబాద్: గిరిజనాభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోడు భూముల పట్టాల పంపిణీలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. గిరిజనులను రైతులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగమన్నారు. గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచడంతో గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆమె ఒక ప్రకటనలో గిరిపుత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గిరిజనుల వెనుకబాటును తొలగించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఆదివాసులకు అన్ని మౌలిక వసతులు కల్పించడానికి రూ. కోట్లలో నిధులు మంజూరు చేస్తోందని వెల్లడించారు. ప్రతి తండానూ గ్రామ పంచాయతీగా గుర్తించి.. ‘మా తండాలో మా రాజ్యం’అనే గిరిజన ప్రజల కలను సాకారం చేసిందన్నారు. గిరిజనులకు పాలనాధికారం కల్పించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరిపుత్రులను కేసీఆర్ ఆ భూములకు యజమానులని చేశారని, 4.06 లక్షల ఎకరాలకుగాను 1.51 లక్షల పోడు రైతులకు పట్టాలను అందజేశామన్నారు. గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. మేడారం జాతరకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నదని మంత్రి వివరించారు. -
దశాబ్దాల భూ సమస్యలు కొలిక్కి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న భూముల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోంది. సీఎం వైఎస్ జగన్ చొరవతో ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వేలాది ఎకరాలకు నిషేధిత భూముల నుంచి జాబితా విముక్తి లభించింది. తాజాగా కృష్ణాజిల్లాలో దశాబ్దాల క్రితం ప్రభుత్వానికి నామమాత్రంగా ధర చెల్లించి, కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలకు నిషేధిత భూముల జాబితా నుంచి విముక్తి లభిస్తోంది. పూర్తి వివరాలు ఇవి.. మచిలీపట్నం, గుడివాడ ప్రాంతంలో కొన్ని లే అవుట్లలో 1970–80 ప్రాంతంలో రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు, ఉద్యోగులు ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ చెల్లించి స్థలాలు కొనుగోలు చేసి, ఇంటి పట్టాలు పొందారు. అయితే ఈ స్థలాలు నిషేధిత భూముల జాబితాలో ఉండటం వల్ల రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బంది పడుతున్నారు. ఇంటి స్థలాలు పొంది లే అవుట్లలో ఉన్న వారు తమ సమస్యను కలెక్టర్ రాజబాబు దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన స్పందించి, విషయాన్ని సీసీఎల్ఏ దృష్టికి తీసుకెళ్లారు. అసైన్డ్ భూములనే రెగ్యులరైజ్ చేస్తున్నామని, కానీ ఇక్కక దశాబ్దాల కిందట మార్కెట్ విలువ చెల్లించి స్థలాలు కొన్నారని, వీటిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సీసీఎల్ఏ మచిలీపట్నంలోని ఆరు లేఅవుట్లో, గుడివాడలోని ఇంటి స్థలాలను సైతం నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని గత నెల 31వ తేదీ 368 జీవో జారీ చేశారు. సర్వే ప్రారంభించిన అధికారులు.. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజితాసింగ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, ఇంటి స్థలాలు ఎన్ని ఉన్నాయో సర్వే చేయాలని ఆదేశించారు. ఈ మేరకు సర్వే బృందాలు ఇంటి స్థలాలను గుర్తిస్తున్నారు. ఈ జీవో ప్రకారం 2వేల కుటుంబాలకు పైగా లబ్ధి కలుగుతుందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసి, నిషేధిత భూముల జాబితా నుంచి విముక్తి చేసే దిశగా రెవెన్యూ శాఖ అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ప్రధానంగా ఈ జీవో ప్రకారం మచిలీపట్నం, గుడివాడలో అప్పట్లో ఇంటి స్థలాలు పొందిన రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు లబ్ధి కలుగనుంది. వేగంగా భూములకు పరిష్కారం.. ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. అందులో భాగంగా ఇటీవలే 60 ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్నా గన్నవరం నియోజకవర్గంలోని వెంకటాపురం ఇనాం భూములకు సైతం జిల్లా కలెక్టర్ నిషేధిత భూముల జాబితా నుంచి విముక్తి కల్పించారు. దీని ద్వారా వేలాది మంది పేద రైతులకు లబ్ధి కలిగింది. అలాగే గత ఏడాది అక్టోబర్‌లో అవనిగడ్డలో షరతుగల పట్టా భూములను నిషేధిత భూముల నుంచి తొలగించారు. దీని ద్వారా ఒక్క అవనిగడ్డ నియోజకవర్గంలోనే 15,791 ఎకరాలు, 10,119 మంది రైతులకు లబ్ధి కలిగింది. చిక్కుముడులు తొలగిస్తున్నాం.. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఇందులో భాగంగా అసైన్డ్ భూములపై లబ్ధిదారులకు యజమాన్యపు హక్కులు కల్పిస్తున్నాం. ఇటీవల వెంకటాపురం గ్రామంలోని ఇనాం భూముల సమస్య పరిష్కరించాం. ఇప్పుడు నామమాత్రపు మార్కెట్ విలువ చెల్లించి, ఇంటి స్థలాలు కొనుగోలు వాటిని నిషేధిత స్థలాల జాబితా నుంచి తొలగించేలా ప్రభుత్వం 368 జీవో జారీ చేసింది. ఈ మేరకు జేసీ ఆధ్వర్యంలో ఇంటి స్థలాల సర్వే సాగుతోంది. దీని ద్వారా 2వేలకుపైగా కుటుంబాలకు లబ్ధి కలుగనుంది. – రాజబాబు, కలెక్టర్, కృష్ణా -
పేదలకు ఇళ్ల జాగాలు ప్రభుత్వ బాధ్యత
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఇళ్ల జాగాలు ఇవ్వడం ప్రభుత్వ సామాజిక బాధ్యతని, అవసరమైతే మళ్లీ కొత్తగా ఇళ్ల జాగాల కోసం భూములు అసైన్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ భూములను అమ్ముకునే హక్కు కూడా పేదలకు కల్పించాలనే ఆలోచనతో ఉన్నామని చెప్పారు. ఆదివారం అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల అసైన్‌మెంట్‌ల్యాండ్ తీసుకుంటోందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తోన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. పేదల భూములను వారికే ఎస్టాబ్లిష్ చేసి రీ అసైన్ చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. పేదల భూములను కాపాడతామని భరోసానిచ్చారు. అసైన్మెంట్ భూములపై పార్టీలకు అతీతంగా దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుందామన్నారు. ఇలాంటి అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవో ఇచి్చందని, దానికి తగ్గట్టుగానే తెలంగాణలో కూడా పరిశీలిద్దామని సీఎం చెప్పారు. వ్యవసాయ భూముల అమ్మకానికి అనుమతించకపోయినా పట్టణప్రాంతాల్లో విక్రయానికి అనుమతిస్తే దళితులు ఇతర చోట్ల భూమి కొనుక్కునే అవకాశం ఉంటుందన్నారు. అందరూ సరేనంటూ రాబోయే ఐదారు రోజుల్లోనే ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకుని ఈ మేరకు జీవో కూడా విడుదల చేసేందుకు తనకు అభ్యంతరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గొంతెమ్మ కోర్కెలు సరికాదు కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ, భద్రాచలంకు చెందిన ఐదు గ్రామాలను కేంద్రంతో మాట్లాడి తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. ప్రభుత్వపాఠశాలల్లో పనిచేసే స్వీపర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించడంతో పాటు చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కేసీఆర్ స్పందిస్తూ సఫాయన్నా నీకు సలామన్న అని గతంలోనే గ్రామపారిశుధ్యకార్మికుల వేతనాలు పెంచామని, దశాబ్ది ఉత్సవాల సందర్భంగానూ రూ.వెయ్యి పెంచామని గుర్తు చేశారు అలాంటిది కొందరు గొంతెమ్మ కోర్కెలు కోరడం సరికాదని వ్యాఖ్యానించారు. గల్ఫ్ కార్మికులకు సంబంధించి ఒక విధానం తీసుకొచ్చేందుకు భవిష్యత్‌లో ప్రయత్నిస్తామని సీఎం చెప్పారు. ఆసరా పింఛన్ల విషయంలో భార్యాభర్తల్లో ఒకరు చనిపోతే వెంటనే మరొకరికి త్వరలో పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని, పాల రైతులకు బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకుంటామని బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్ లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. -
ఆల్ టైమ్ రికార్డు ధర పలికిన కోకాపేట భూములు
-
గ్రేహౌండ్స్ భూమిపై ఎల్లో రాబందుల కళ్లు.. పచ్చ గుండాలకు సుప్రీం కోర్టు షాక్
సాక్షి, ఢిల్లీ: 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు, ఆయన నాయకత్వంలోని టిడిపిలో ఏ చాప్టర్ చూసినా ఏదో ఒక అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. చంద్రబాబుతో తిరిగే వాళ్లెవరయినా.. ఏదో ఒక కేసులో ఇరుక్కోవడం తరచుగా బయటపడుతోంది. హైదరాబాద్ భూమి వెనక బాబు అనుచరుడు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల రెవెన్యూ పరిధి. హైదరాబాద్ శివార్లలో అత్యంత విలువైన భూమి. 143 ఎకరాల ఈ భూమి విలువ అక్షరాలా పది వేల కోట్లు. దీన్ని గతంలో గ్రే హౌండ్స్ సంస్థకు కేటాయించారు. దేశంలో శాంతి భద్రతలను రక్షించే సంస్థల్లో ఒకటయిన గ్రౌహౌండ్స్ కే ఎసరు పెట్టేందుకు ప్రయత్నించారు టిడిపి నేత ఒకరు. ఆయనే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాల పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్న మాండ్ర శివానందరెడ్డి. రెండు దశాబ్దాలుగా ప్లాన్ అప్పట్లో పోలీస్ శాఖలో పని చేసిన మాండ్ర శివానందరెడ్డికి ఈ స్థలం వెనకున్న లూపోల్స్ కొన్ని తెలుసు. ఇంకేముంది.. ఈ భూమినే కొట్టేసేందుకు రకరకాల కుట్రలు పన్నారు. చంద్రబాబు అండతో రకరకాల కొత్త డాక్యుమెంట్లు సృష్టించారు. అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చెల్లవని తెలిసినప్పటికీ తామే జీపీఏ హోల్డర్లమంటూ దందా సాగించారు. అయితే ఈ కుట్రలకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. 1994 నుంచి కొనసాగుతున్న భూ వివాదానికి ముగింపు పలికింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రూ.10 వేల కోట్ల విలువైన ఈ భూమిని కొట్టేసేందుకు రకరకాల కుట్రలు చేశారు. మంచిరేవులలోని ఈ భూములకు విలువ పెరగడంతో వాటిపై రాబందుల కళ్లు పడ్డాయని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ల్యాండ్ మాఫియా జోక్యం కూడా కనిపిస్తోంది. ఈ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తుదివి. ఎలాంటి జోక్యాలు అనుమతించబోం. ఇక ముందు ఈ వ్యవహారంలో ఎలాంటి పిటిషన్ లను అనుమతించబోం. అలాగే కింది కోర్టులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు.’’ అని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. హక్కులన్నీ ప్రభుత్వానికే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలోని 142.39 ఎకరాల భూయాజమాన్య హక్కులు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజా ఆదేశాలతో 1994 నుంచి కొనసాగుతున్న భూవివాదానికి ముగింపు పలికినట్టయింది. ఈ భూములపై కిందిస్థాయి కోర్టులు, హైకోర్టు ఎలాంటి జోక్యం చేసుకునే అధికారం లేదని, ఇప్పుడు ఇచ్చిన తీర్పే తుదితీర్పు అని ఆదేశాల్లో పేర్కొంది. సదరు భూమి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందని, తదుపరి కేటాయింపులపై దాని యాజమాన్య, స్వాధీన హక్కులు ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకొని గ్రేహౌండ్స్‌కు బదిలీ చేయాలని చెప్పింది. బాబు బ్యాచ్ లో మహా ముదుర్లు చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో ఆయన వెంట బాగా దగ్గరగా నడిచిన వాళ్లలో, లేదా చంద్రబాబుతో కలిసి రకరకాల వ్యవహారాలు నడిపిన వాళ్లలో చాలా మంది ఇప్పుడు ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. మార్గదర్శి స్కాంలో బాబు ఫ్రెండ్ రామోజీరావు, అవినీతి కేసులో బాబు ఫ్రెండ్ సింగపూర్ ఈశ్వరన్, ఓటుకు కోట్లు కేసులో బాబు అనుచరుడు రేవంత్ రెడ్డి, అమరావతి రాజధాని కేసులో పార్టీ నేతల్లో చాలా మంది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా దూరం వెళ్తుంది. -
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్ల సంపద, వేల ఎకరాల భూమి
World Richest Thailand King: ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న సంపన్నులను గురించి.. ప్రపంచంలోని కుబేరుల గురించి కూడా కొంత వరకు తెలుసుకున్నాం. అయితే ఈ రోజు అపారమైన సంపదను మాత్రమే కాకుండా వేల ఎకరాల భూమిని కలిగి, లెక్కకు మించిన వాహనాలను కలిగిన ఒక సంపన్న రాజును గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వేల ఎకరాల భూమి.. నివేదికల ప్రకారం.. థాయ్‌లాండ్‌కు చెందిన మహారాజు 'మహా వజిరాలాంగ్కార్న్' (Maha Vajiralongkorn) ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడని తెలుస్తోంది. ఈయన ఆస్తి సుమారు రూ. 3.2 లక్షల కోట్లు. అంతే కాకుండా వజ్రాలు, రత్నాలు వంటి వాటితో పాటు.. 16 వేల ఎకరాల కంటే ఎక్కువ భూమి కూడా వజిరాలాంగ్కార్న్ అధీనంలో ఉండేదని సమాచారం. ఖరీదైన డైమండ్.. భూముల విషయం పక్కనపెడితే మహా వజిరాలాంగ్కార్న్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన 545.67 క్యారెట్ బ్రయోన్ గోల్డెన్ జూబ్లీ డైమండ్ ఉండేదని.. దీని విలువ 12 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ (రూ. 98 కోట్లు) ఉంటుందని అంచనా, ఇది రాజు కిరీటంలో పొందుపరిచారు. వీటితో పాటు అపురూపమైన రాజ వాయిద్యాలు కూడా ఆయన వద్ద ఉండేవని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు! విమానాలు, హెలికాఫ్టర్లు & కార్లు.. బంగారం, వజ్రాలు మాత్రమే కాకుండా.. వజిరాలాంగ్కార్న్ దగ్గర ఏకంగా 38 విమానాలు, లెక్కకు మించిన హెలికాఫ్టర్లు ఉండేవి. ఇందులో నాలుగు బోయిన్, మూడు ఎయిర్‌బస్ విమానాలు. వీటితో పాటు 300 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు వీరి గ్యారేజిలో ఉండేవి. కేవలం వాహనాలకు వినియోగించే ఫ్యూయెల్ ఖర్చు మాత్రం సంవత్సరానికి రూ. 524 కోట్లు అని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. ఈ రాజు ఎంత సంపన్నుడో ఇట్టే తెలిసిపోతుంది. ఇదీ చదవండి: హీరోలా ఉన్న ఇతడిని గుర్తుపట్టారా? దేశం గర్వించదగ్గ సంపన్నుడు.. విశాలమైన ప్యాలెస్.. థాయ్‌లాండ్‌లోని గ్రాండ్ ప్యాలెస్ విస్తీర్ణం ఏకంగా 23,51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని 1782లో నిర్మించినట్లు సమాచారం. ఇది వారి వారసత్వానికి చిహ్నంగా చారిత్రాత్మక కట్టడంగా నిలిచింది. వజిరాలాంగ్కార్న్ రాజుని 'కింగ్ రామ ఎక్స్' అని కూడా పిలుస్తారు. -
ఆ రైత్వారీ పట్టాలు చెల్లుతాయి
సాక్షి, అమరావతి : గ్రామ సర్వీసు ఈనాం భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ భూములపై ఉన్న ఆంక్షలను తొలగించేందుకు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందుకనుగుణంగా గ్రామ సర్విసు ఈనాం భూములకు జారీ చేసిన రైత్వారీ పట్టాలు చెల్లుబాటవుతాయని రెవెన్యూ శాఖ తెలిపింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ జీఓ నంబర్ 310 జారీ చేశారు. ఈ భూములకు గతంలో జారీ చేసిన రైత్వారీ పట్టాదారుల పేర్లను అన్ని రికార్డుల్లోకి ఎక్కించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. పట్టాదారులు లేని పక్షంలో వారి వారసులు (లీగల్ హైర్స్), లేకపోతే వారి నుంచి కొనుగోలు చేసిన వ్యక్తుల పేర్లను రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. రీ సర్వే రికార్డుల్లోనూ వారి పేర్లను చేర్చాలని స్పష్టం చేశారు. దీంతో 1.13 లక్షల మందికి చెందిన 1.68 లక్షల ఎకరాలు గ్రామ సర్విసు ఈనాం భూములు 22 (ఎ) జాబితా నుంచి తొలగి, ఆ కుటుంబాలకు మేలు కలుగుతుంది. ఈనాం భూముల చట్ట సవరణతో 22 (ఎ)లోకి సర్విసు ఈనాం భూములు దశాబ్దాల క్రితం గ్రామానికి సేవ చేసే కుల వృత్తుల వారి జీవన భృతి కోసం ఈనాంగా భూములిచ్చారు. 1956 ఈనాం (రద్దు, రైత్వారీ పట్టాలుగా మార్పు) చట్టం ప్రకారం కొన్ని ఈనాం భూములు రద్దవగా, కొన్ని రైత్వారీ భూములుగా మారాయి. రైత్వారీ భూములకు అప్పట్లోనే రైత్వారీ పట్టాలు జారీ చేశారు. ఈనాందారులు తమ భూములను ఎవరికైనా అమ్ముకునే హక్కు కూడా ఈనాం చట్టం కల్పించింది. దీంతో ఆ భూములను కొన్న వారికి రక్షణ ఏర్పడింది. అయితే గ్రామ సర్వీసు చేసిన వారికే కాకుండా ధా ర్మిక సంస్థలు, దేవాలయాల మనుగడ కోసం వాటికి ఈనాంగా భూములిచ్చారు. ఆ దేవాలయాల భూములు చాలావరకు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆ దేవాలయాల్లో ఏ సేవల కోసం భూమి ఇచ్చారో ఆ సేవలు కూడా ప్రస్తుతం లేవు. దీంతో వాటి రక్షణ కోసం 2013లో ఈనాం చట్టానికి సవరణలు చేశారు. దీని ప్రకారం ఈనాం భూములన్నింటిపైనా ఆంక్షలు విధించి వాటిని నిషేధిత జాబితా 22 (ఎ)లో చేర్చారు. దీంతో దేవాలయాల ఈనాం భూములతోపాటు గ్రామ సర్విసు ఈనాం కింద పొందిన రైత్వారీ పట్టా భూములు కూడా 22 (ఎ) జాబితాలో చేరిపోయాయి. రాష్ట్రంలో భూముల రీ సర్వే జరుగుతున్న క్రమంలో గ్రామ సర్విసు ఈనాం భూములపై రైతుల నుంచి పెద్దఎత్తున వినతులు వచ్చాయి. రైత్వారీ పట్టాలు పొందిన వారి నుంచి తాము కొన్నామని, తమ పేర్లను రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించడంలేదని, తమకు న్యాయం చేయాలని కోరారు. ధార్మిక సంస్థల ఈనాం, సర్విసు ఈనాం భూముల మధ్య తేడా ఇదే ఈ వినతులను పరిశీలించిన ప్రభుత్వం దేవాలయ, ధార్మిక సంస్థల ఈనాం, గ్రామ సర్వీసు ఈనాం భూముల మధ్య ఉన్న తేడాపై స్పష్టత ఇచ్చింది. ధా ర్మిక సంస్థల ఈనాం భూములను కేవలం ఆ దేవాలయాలు, అందులోని దేవుడి సేవల కోసం మాత్రమే ఇచ్చారు. అవి ఎప్పటికీ దేవాలయాలవే తప్ప వేరే వ్యక్తులు పొందే అవకాశం ఉండదు. గ్రామ సర్విసు ఈనాం భూములను అందరి మేలు కోసం పనిచేసిన కుల వృత్తుల వారికి (క్షురకులు, చాకలి, మంగలి వంటి వృత్తులు) ఇచ్చారు. ఆ భూములు ఆ వ్యక్తులు, వారి వారసులకు వస్తాయి. ఇలా సర్వీసు చేసిన కుల వృత్తుల వారి సంఖ్య గ్రామాల్లో చాలా పెద్ద సంఖ్యలో ఉండడం వల్లే వారికి రైత్వారీ పట్టాలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో 2013లో ఈనాం చట్టానికి చేసిన సవరణలు గ్రామ సర్వీసు ఈనాం భూములకు వర్తించవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ భూములన్నింటినీ 22(ఎ) నుంచి తొలగించాలని, వారి పేర్లను రికార్డుల్లోకి ఎక్కించాలని జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. -
పెద్ద కష్టం తీరింది.. సర్వీస్ ఈనాం భూములపై సర్వ హక్కులు
సర్వీసు ఈనాం అంటే? శతాబ్దాలు.. దశాబ్దాల క్రితం కుల వృత్తులు చేసే వారికి గ్రామాల్లో భూములను ఈనాంగా ఇచ్చారు. వారి వారి వృత్తుల పరంగా ఆల యాల నిర్వహణలో, ప్రజావసరాల్లో వారి భాగస్వామ్యం ఉండేది. ఈ క్రమంలో రజక, కుమ్మరి, కమ్మరి, మాదిగ, మాల, షరబి, భజంత్రి, పూజారి, వడ్రంగి తదితరుల భుక్తి కోసం అప్పట్లో భూములు ఇచ్చారు. వాటిని అనుభవిస్తూ సేవలు అందించేవారు. సాక్షి, అమరావతి: సర్వీసు ఈనాం భూమి రైతుల కష్టాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం చరమగీతం పాడింది. భూముల సమస్యలన్నింటినీ సానుకూలంగా కొలిక్కి తెచ్చే క్రమంలో సర్వీసు ఈనాం భూముల సమస్యను పరిష్కరించింది. నిషేధిత ఆస్తుల జాబితా 22(ఎ) నుంచి 1.68 లక్షల ఎకరాలను తొలగించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో 25 జిల్లాల్లో 1.13 లక్షల మంది కుల వృత్తులు చేసుకునే రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే 2.08 లక్షల ఎకరాల చుక్కల భూములు, 33 వేల ఎకరాల షరతుల గల పట్టా భూములు, ఇవే తరహాలోని మరో 60 వేల ఎకరాలకుపైగా భూముల్ని 22 (ఎ) జాబితా నుంచి తొలగించింది. మొత్తం 3 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి, దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది. తాజాగా 1.68 లక్షల సర్వీస్ ఈనాం భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించడం ద్వారా తాను పేద రైతుల పక్షపాతినని వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి నిరూపించారు. 2013లో పొరపాటున 22(ఎ)లోకి 1956లో ఈనాం చట్టం రావడంతో ఈనాం భూములను రద్దు చేసి, వారికి రైత్వారీ పట్టాలు ఇచ్చారు. దాని ప్రకారం చాలా మంది రైతులు పట్టాలు పొందారు. కొందరు రైతులు తమ అవసరాల కోసం అమ్ముకోగా, మరికొందరు వారసులకు ఇచ్చారు. 2013 వరకు ఈ రైత్వారీ పట్టాలను పట్టా భూములుగానే పరిగణించడంతో పట్టాదారులు సకల హక్కులు అనుభవించేవారు. 2013లో ఈ చట్టానికి సవరణ చేశారు. దేవాలయాలు, ధార్మిక సంస్థలకు ఇచ్చిన సర్వీసు ఇనాం భూములను ఉద్ధేశించి ఈ సవరణ జరిగింది. ఆ సంస్థల్లో పని చేసే వారు ఆ సర్వీసును అందించినంత కాలం ఆ భూమిపైన వచ్చే ఫలసాయాన్ని అనుభవించడమే తప్ప అమ్ముకునేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. ఇందుకు అనుగణంగా దేవాదాయ, ధార్మిక సంస్థలకు సంబంధించిన ఈనాం భూములను 22(ఎ)లో పెట్టారు. ఆ సమయంలో వాటితోపాటు గ్రామాల్లో చేతి వృత్తుల వారు అనుభవిస్తున్న ఈనాం భూములను కూడా 22(ఎ)లో చేర్చారు. ఒడ్డున పడేసిన జగన్ ప్రభుత్వం 2013 వరకు ఆ భూములపై సర్వ హక్కులు అనుభవించిన రైతులు ఒక్కసారిగా తమ హక్కులను కోల్పోయినట్లయింది. ఈ తప్పును సరిచేసే అవకాశం ఉన్నా, గత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. అప్పటి నుంచి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. లక్షలాది మంది రైతులతో ముడిపడి ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలనే ఆలోచన గత ప్రభుత్వం చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి ఈ సమస్య రావడంతో పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగానే సర్వీసు ఈనాం భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించి 2013కు ముందున్న సర్వ హక్కులు కల్పించడానికి మంత్రివర్గం ఆమోదించింది. దీనివల్ల వివిధ కుల వృత్తుల్లోని 1,13,610 మందికి చెందిన 1,68,604 ఎకరాల భూములకు విముక్తి లభించింది. తద్వారా ఆ రైతుల కుటుంబాలకు మేలు జరగనుంది. -
దళితుల సమాధులు స్వాహా..
హన్మకొండ చౌరస్తా: భూకబ్జాకోరులపై నగర పోలీ స్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఉక్కుపాదం మోపుతున్నా.. కొందరు బకాసురులు మాత్రం మమ్మల్నేమీ చేయలేరన్న ధీమాతో యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్న బకాసురులు ఒక అడుగు ముందుకేసి ఏకంగా శ్మశానవాటికనే మాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు. వివరా లిలా ఉన్నాయి. హనుమకొండలోని 4వ డివిజన్ పరిధి పెద్దమ్మగడ్డలో దళితులే అత్యధికంగా నివసిస్తుంటారు. సుమారు దశాబ్దకాలం క్రితం వరకు కూడా ఇక్కడ సామాజికంగా వెనుకబాటును అనుభవించారు. పెద్దమ్మగడ్డ వాసుల శ్మశానవాటికకు ఎసరు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దళిత ప్రాంతం పెద్దమ్మగడ్డ. అలాంటి దళితులకు చెందిన సమాధుల గడ్డ ఇప్పుడు కనుమరుగవుతోంది. పెద్దమ్మగడ్డ సమీపంలోనే నాలా వెంట ప్రధాన రహదా రికి ఆనుకుని ఉన్న సమాధుల్లో 99శాతం మాయమయ్యాయి. మిగిలిన ఒకటి రెండు సమాధులను సైతం నేలమట్టం చేసే పనిలో కబ్జాదారులు ఉన్నా రు. ప్రధాన రహదారి వెంటే సుమారు రెండెకరాల విలువైన స్థలం కావడంతో కోట్ల రూపాయల ధర పలుకుతోంది. దీంతో ఏడాది కాలంగా కొందరు కబ్జారాయుళ్లు రాజకీయ నాయకుల అండదండలతో గుట్టుచప్పుడు కాకుండా సమాధులను నేలమట్టం చేస్తూ మొరంతో ఆనవాళ్లు లేకుండా చదును చేస్తున్నారు. అయినా రెవెన్యూ, బల్దియా అధికారులు పట్టించుకోకపోవడంౖపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
అసైన్డ్ భూముల అంశంలో సీఎం జగన్‌ది సాహసోపేత నిర్ణయం: మంత్రి ధర్మాన
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూముల అంశంలో సీఎం జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ నిర్ణయంతో ఇకపై అసైన్డ్ భూముల లబ్ధిదారులైన పేదలకు సర్వహక్కులు లభించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. భూమి యాజమాన్యానికి సంబంధించి మార్పులు, సంస్కరణలు, ప్రయోజనకరమైన నిర్ణయాల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘మొదట్లో వ్యవసాయం తప్ప మరొక ఉపాధిమార్గం ఉండేది కాదు. అలాంటిది, ఈ ప్రభుత్వం వచ్చాక 20 ఏళ్లుగా తమకిచ్చినటువంటి భూమిపై సాగుచేసుకుంటున్న వ్యక్తికి ఆ భూమిపై అన్నిరకాల హక్కుల్ని కల్పించింది ఈ ప్రభుత్వం. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇలాంటి మహత్తర గొప్ప నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేస్తున్నాను’ అని చెప్పారు. 20 ఏళ్లపాటు అనుభవమున్న భూమిపై సర్వహక్కులు.. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘ 1977లో ఏపీ శాసనసభ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ (పీఓటీ)–1977 అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ఏ నేపథ్యంలో వచ్చిందంటే, ఆనాడు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసిన పెద్దలు, ప్రభుత్వం.. పేదలకు ఇస్తున్న భూమి జమీందార్లకు, భూస్వాములకు అమ్మకం చేస్తున్నారని.. తద్వారా వారికి ఉపాధికల్పించడానికి ఇచ్చిన భూమి వారి వద్ద లేకుండా పోతుందనే విషయాన్ని గ్రహించారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటున్న నేపథ్యంలో 1977 చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికి 40 ఏళ్లు దాటాయి. దేశంలోనూ సమాజంలోనూ అనేక మార్పులు వచ్చాయి. నిరుపేదల్లో అక్షరాస్యత పెరిగింది. గ్రామాల్లో భూస్వాములు, జమీందార్లు లేకుండా.. అందరికీ అనేక ఉపాధిమార్గాలు అందుబాటులోకొచ్చాయి. ఈనేపథ్యంలో ఒక మేజర్ సంస్కరణ తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన చేశారు. ఆ ఆలోచనే.. ఏపీ కేబినెట్లో తీర్మానించినట్టుగా, 20 ఏళ్లపాటు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూమిపైనున్న ఆంక్షలన్నీ ఎత్తేసి ఆ భూమిపై సర్వహక్కుల్ని లబ్ధిదారులకు కల్పించారు. అంటే, ఒక ప్రయివేటు భూమిపై వ్యక్తులకున్న హక్కులన్నీ... నేటికి 20 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న అసైన్డ్భూమి రైతులకు కూడా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది’ అని అన్నారు. రైత్వారీ పట్టాపొందిన వారికే ఆ భూమిపై హక్కు చట్టాలు తెలియక, లేదంటే అన్యాక్రాంతం చేసినా, లేక ఇప్పటికే భూములు అమ్ముకున్నట్లైతే.. వాటిని కొనుగోలు చేసిన వారికి మాత్రం పీఓటీ చట్టంలో రిలీఫ్ ఉండదని చెప్పారు. చట్టంలో దాని స్థాయి యథారీతిగానే ఉంటుందని.. ఆ భూమిపై హక్కు అప్పట్లో ఒరిజినల్ రైత్వారీ పట్టా పొందిన రైతుకు మాత్రమే చెందుతుందని స్పష్టంచేశారు. కనుక ఇప్పటికే సదరు అసైన్డ్ భూములు కొనుగోలు చేసుకున్నవారికి హక్కులు ఉండవని అర్ధం చేసుకోవాలని సూచించారు. అసైన్డ్ భూమి పొంది, 20 ఏళ్లకు పైబడి సాగుచేసుకుంటున్న భూమిపై సంబంధిత రైతుకు పూర్తిహక్కుల్ని ఈ ప్రభుత్వం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. 15.21 లక్షల మంది రైతులకు లబ్ధి.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల... రాష్ట్రంలో సుమారుగా 15.21లక్షల మంది అసైన్డ్ రైతులు లబ్ధిపొందుతున్నారని అన్నారు. ‘20 ఏళ్లుదాటి ప్రభుత్వ భూమి అనుభవంలో ఉన్నవారి సంఖ్య ఇది. ఇప్పటికి ప్రభుత్వం దగ్గర ఉన్న గణాంకాల ప్రకారం 33.29 లక్షల ఎకరాల్ని రైతులకు అసైన్డ్ చేయగా 19.21 లక్షలమంది లబ్ధిదారులు ఉన్నారని.. వీటిల్లో 27.41 లక్షల ఎకరాల భూమిపై ప్రస్తుతం కేబినెట్ నిర్ణయంతో ఆంక్షల్ని ఎత్తివేయనున్నట్లు తెలిపారు. చదవండి: తప్పు చేసింది టీడీపీ హయాంలో.. విషం వీరిపైనా! -
ఆంధ్రప్రదేశ్‌లో 54 వేల ఎకరాల భూ పంపిణీకి కేబినెట్ ఆమోదం... ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో లంక భూములకు పట్టాలు... ఇంకా ఇతర అప్డేట్స్
-
రక్షణ భూములను బదలాయించండి
మణికొండ: హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన 150 ఎకరాల రక్షణ భూమిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి వచ్చే లోపు తీపికబురు చెప్పాలని ఐటీ, పట్టణాభి వృద్ధిశాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. అలా చేయలేదంటే ప్రజల వద్దనే తేల్చుకుంటామని స్పష్టంచేశారు. నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలో రూ.29.50 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన ఔటర్‌రింగ్ రోడ్డు ఇంటర్‌చేంజ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలిసి జూబ్లీబస్ స్టేషన్ నుంచి షామీర్పేట, కండ్లకోయ, సుచి త్ర సర్కిల్ వరకు 36 కి.మీ. స్కైవే, మెహిదీ పట్నంలో స్కైవాక్, అత్తాపూర్, మణికొండల లో లింక్‌రోడ్ల నిర్మాణాలకు రక్షణ భూములను ఇవ్వాలని కోరామన్నారు. మరో వారం రోజుల్లో ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తున్న ట్టు తెలిసిందని, అంతలోపు రక్షణశాఖ మంత్రి, అధికారులకు ఆదేశాలు ఇచ్చి భూములను బదలాయించాలని కోరారు. పలుచోట్ల రక్షణ శాఖకు చెందిన 150 ఎకరాలు హైదరాబాద్ అభివృద్ధికి అవసరం పడుతోందని, దానికి బదులుగా శామీర్‌పేటలో 500 ఎకరాల భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చినా, ఎస్టీపీలు కట్టినా ఎలాంటి సహాయం చేయటం లేదన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలని, మిగతా సమయాల్లో అభివృద్ధి, ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి పి.సబితారెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ పాల్గొన్నారు. విశ్వనగరంగా అభివృద్ధి హైదరాబాద్‌కు మరిన్ని హంగులు కల్పించి విశ్వనగరంగా మార్చేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే నెలలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేస్తున్న సైకిల్ ట్రాక్, కోకాపేట, మల్లంపేటలలో మరో రెండు ఔటర్ ఇంటర్‌చేంజ్‌లను ప్రారంభిస్తామన్నారు. నార్సింగి ఇంటర్చేంజ్ వల్ల నార్సింగి, మెహిదీపట్నం, గండిపేట, కోకాపేట, శంకర్పల్లి ప్రజలు ఔటర్‌రింగ్ రోడ్డు ఎక్కే అవకాశం సమీపంలోనే ఏర్పడిందన్నారు. రాబోయే రోజుల్లో మూసీనదిని శుద్ధి చేయడంతోపాటు దాని వెంట నార్సింగి నుంచి నాగోల్ వరకు 55 కి.మీ. మేర రూ.10వేల కోట్లతో ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తామని వెల్లడించారు. వందశాతం శుద్ధీకరణ వందశాతం మురుగునీటి శుద్ధీకరణను వచ్చే సెప్టెంబర్ వరకు పూర్తి చేసి దేశంలోనే మొదటి నగరంగా హైదరాబాద్‌ను నిలుపుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కోకాపేటలో ఆయన రూ.66.15 కోట్లతో జలమండలి ఏర్పాటు చేసిన అధునాతన 15 ఎంఎల్డీల ఎస్టీపీని ప్రారంభించిన. అనంతరం మాట్లాడారు. వంద శాతం మురుగునీటిని శుద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, అందులో మొదటి అడుగు కోకాపేటలో వేశామన్నారు. రూ.3,866 కోట్లతో 31 చోట్ల 1200 ఎంఎల్డీల ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నామని వాటిని సెప్టెంబర్‌కల్లా ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో రోజూ 2వేల ఎంఎల్డీల మురికినీరు ఉత్పత్తవుతోందన్నారు. దేశంలో ఏ మహానగరంలో కూడా 30 నుంచి 40 శాతం మురుగునీటి శుద్ధి జరగటం లేదని పేర్కొన్నారు. -
హనుమా.. భూమాయ కనుమా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రెవెన్యూ అధికారులు, పూజారి వారసులు కలిసి ఏకంగా ఆంజనేయస్వామి భూములకే ఎసరు పెట్టారు. పహాణీలు, ధరణిలోని నిషేధిత జాబితాను పక్కన పెట్టి ఏకంగా 34 ఎకరాల దేవాదాయ భూమికి ఓఆర్సీ జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం అక్కడ ఎకరం రూ.కోటి వరకు పలుకుతుండటంతో ఎలాగైనా ఈ భూములను కొట్టేయాలని పక్కాగా ప్లాన్ చేశారు. మాడ్గుల మండలం అర్కపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 88లో 9.18 ఎకరాలు, సర్వే నంబర్ 79/ఎ4లో 20 గుంటలు, సర్వే నంబర్ 283లో 11 ఎకరాలు, సర్వే నంబర్ 241లో 11.06 ఎకరాల భూమి ఆంజనేయస్వామి దేవాలయం పేరున ఉంది. ఈ భూమికి అప్పటి ఆలయ పూజారి పప్పు లక్ష్మయ్య దంపతులను రక్షిత కాపలాదారుగా నియమించి, ఆ మేరకు రికార్డుల్లో వారి పేర్లను నమోదు చేశారు. భూమి కౌలు ద్వారా వచ్చి న డబ్బులతో ధూపదీప నైవేద్యాలు సమకూర్చా ల్సి ఉంది. ఆశించినస్థాయిలో కౌలు రాక, ఆలయ నిర్వహణ భారంగా మారి పూజారి లక్ష్మయ్య దంపతులు సుమారు 40 ఏళ్ల క్రితమే ఊరు విడిచి వెళ్లారు. అప్పటి నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతను గ్రామస్తులే చూసుకుంటున్నారు. పహాణీల్లోనే కాదు ధరణి పోర్టల్లోనూ ఈ భూములు ఆంజనేయస్వామి దేవాలయం పేరునే రికార్డు అయి ఉన్నాయి. గుడ్డిగా ఓఆర్సీ జారీ చేసిన రెవెన్యూ.. తాజాగా ఈ భూమి తనదేనని, ఆయా భూములను తమ పేరున మార్చాల్సిందిగా కోరుతూ ఆలయ పూజారి కుమారుడు ఫైల్ నంబర్ 6820/2022న రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన అడిగిందే తడవుగా రెవెన్యూ అధికారులు ఓఆర్సీ జారీ చేశారు. ఈ విషయం తెలిసి ఆలయ కమిటీ, గ్రామ పంచాయతీ సభ్యులు సహా దేవాదాయశాఖ కమిషనర్ అప్రమత్తమయ్యారు. ఈ భూమిపై లావాదేవీలతో పాటు రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఓఆర్సీని సైతం నిలిపి వేయాల్సిందిగా కోరుతూ దేవాదాయశాఖ కమిషనర్ సహా గ్రామ పంచాయతీ సభ్యులు రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నేడు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీసులో విచారణ జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) తిరుపతిరా>వు ఆర్డీఓ జారీ చేసిన ఓఆర్సీని నిలిపివేయడంతో పాటు రెవెన్యూ కోర్టుకు ఈ కేసును సిఫార్సు చేశారు. శనివారం ఉదయం ఇబ్రహీంపట్నం రెవెన్యూ కోర్టులో ఈ అంశంపై ఇటు దేవాదాయశాఖ, అటు పూజారి వారసులు, ఆంజనేయస్వామి దేవాలయం కమిటీ సభ్యుల సమక్షంలో విచారణ చేపట్టాలని నిర్ణయించారు. పరిశీలించకుండానే మ్యుటేషన్! అర్కపల్లి రెవెన్యూ గ్రామానికి ఆనుకునే సర్వే నంబర్ 95/2లో సుమారు ఆరు ఎకరాల వ్యవ సాయ భూమి ఉంది. రైతు ఇప్పటికే దీనిలో కొంత భాగాన్ని స్థానికులకు గుంటల్లో విక్రయించాడు. ప్రస్తుతం ఆ భూమిలో నివాసాలు కూడా వెలిశాయి. రెవెన్యూ రికార్డుల్లో గ్రామకంఠం భూమిగా రికార్డు చేశారు. ఇప్పటికే విక్రయించ గా మిగిలిన పది గుంటల భూమిని తన పేరున మ్యుటేషన్ చేయాల్సిందిగా సదరు రైతు ఇటీవల రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, కనీస రికార్డులను పరిశీలించకుండా ఏకంగా నివాసాలు వెలిసిన భూమిని సైతం అమ్మిన రైతు పేరున మ్యుటేషన్ చేయడం గమనార్హం. భూ రికార్డుల నిర్వహణలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి ఇదో నిదర్శనం. -
కుల ప్రాతిపదికన భూములా?
సాక్షి, హైదరాబాద్: కులరహిత సమాజం కోసం కృషి చేయాల్సిన ప్రభుత్వం అవి మరింత బలంగా మారే పనులు చేయడం దారుణమని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కుల ప్రాతిపదికన భూములు ఎలా కేటాయిస్తారు.. వారు కట్టుకొనే కమ్యూనిటీ భవన్లలోకి ఇతర కులాలను అనుమతిస్తారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వం అలా ఎలా భూములు కేటాయిస్తుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఆర్టికల్ 14కు విరుద్ధమని స్పష్టం చేసింది. ‘కులాంతర వివాహాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందా? ఈ రకమైన వివాహాలకు ఏదైనా సాయం అందిస్తోందా? కుల నిర్మూలన కోసం ప్రభుత్వం ఇలాంటి పథకాలను అమలు చేయాలి. 21వ శతాబ్దంలో కూడా కులాల ఆధారిత విభజన ఉందంటే.. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇలాంటి ఆలోచ నలు చాలా సంకుచితమైనవి.. అసంబద్ధమైనవి’ కకులాల మధ్య మరింత అంతరాలు పెంచేలా ప్రభుత్వ నిర్ణయం ఉన్నట్లు అనిపిస్తుంది. అని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. కర్ణాటకలోనూ లింగాయత్ కమ్యూనిటీ విద్యాసంస్థలు, చారిటీ ఆస్పత్రుల నిర్మాణం కోసం మార్కెట్ విలువకే ప్రభుత్వం నుంచి భూములు తీసుకుందని.. ఇలా కుల ప్రాతిపదికన భూములు కేటాయించడం సమర్థనీయమా అని ప్రశ్నించింది. ప్రభుత్వాలు ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. కమ్మ, వెలమ కులాలకు 5 ఎకరాల చొప్పున హైటెక్ సిటీ సమీపంలోని అత్యంత విలువైన భూములను కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ ఎ.వినాయక్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఎకరం విలువ రూ. 50 కోట్లకుపైనే... పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వొకేట్ సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. ‘ఖానామెట్ విలేజ్‌లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ) రహదారికి ఆనుకొని హైటెక్ సిటీ రోడ్డుకు పక్కన ఉన్న 5 ఎకరాల భూమిని ఆలిండియా వెలమ అసోసియేషన్‌కు, అయ్యప్ప సొసైటీ రోడ్డుకు ఆనుకొని ఉన్న మరో 5 ఎకరాల భూమిని కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్యకు ప్రభుత్వం కేటాయించింది. ఈ రెండూ రాష్ట్రంలో అత్యంత ధనిక కులాలు. కేటాయించిన భూములు కూడా అత్యంత విలువైనవి. ఎకరం రూ. 50 కోట్లకుపైనే ఉంటుంది’అని వాదించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ‘ప్రభుత్వం ఈ రెండు కులాలకు మాత్రమే భూములు ఇవ్వలేదు.. అనేక ఇతర కులాలకు కూడా కమ్యూనిటీ భవన్ల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించింది. జీవో నంబర్ 571 ఆధారంగా మార్కెట్ విలువ మేరకు భూములు కేటాయించింది. ఇతర కులాల్లో పేదలు ఎక్కువ శాతం ఉన్నందున వారికి మార్కెట్ విలువలోనూ తగ్గింపు ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కులాలకు భూకేటాయింపులపై అసంతృప్తి వ్యకం చేసింది. ఈ పిటిషన్లో ఇప్పటివరకు ఎలాంటి కౌంటర్ దాఖలు చేయని కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్యకు ఎక్స్‌పార్టీ ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. వెలమ అసోసియేషన్‌కు మాత్రం రెండు వారాలు సమయం ఇస్తున్నామని పేర్కొంటూ విచారణను జూన్ 28కి వాయిదా వేసింది. మరికొన్ని సంస్థలకు భూ కేటాయింపులపైనా... రాజబహదూర్ వెంట్రామిరెడ్డి విద్యాసంస్థలు(రెడ్డి హాస్టల్), శారదా పీఠం, జీయర్ ట్రస్టు, దర్శకుడు ఎన్.శంకర్‌కు భూ కేటాయింపులపై దాఖలైన పిల్ కూడా సీజే ధర్మాసనం వద్ద విచారణకు వచ్చింది. రెడ్డి హాస్టల్ కేటాయింపు పిటిషన్లో పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. అయితే 2018లో భూమి కేటాయిస్తే ఇప్పుడు ఎందుకు పిల్ వేయాల్సి వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్ 23కు వాయిదా వేసింది. -
మా భూములు మాకివ్వండి
ఆదిలాబాద్ రూరల్: సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభమయ్యే వరకు తమ భూములు తిరిగి ఇవ్వాలంటూ భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలంలోని రామాయి శివారులో గల రేణుకా సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన స్థలం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినీరెడ్డి ఆదివాసీలతో కలిసి భూముల వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను అరెస్టు చేయడంతో మిగతావారు పోలీసుల వాహనానికి అడ్డుతగిలారు. ఈ క్రమంలో ఓ మహిళ తమను అడ్డుకోవద్దని సీఐ కాళ్లు పట్టుకొని వేడుకుంది. అనంతరం వారందరినీ అరెస్టు చేస్తున్న క్రమంలో కొందరు మహిళలు పోలీసు వాహనంపైకి ఎక్కారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో వారిని కిందకు దించి ఆదిలాబాద్ రూరల్, బేల, జైనథ్, భీంపూర్, తదితర స్టేషన్లకు తరలించారు. ఇంకొందరు మహిళలు పురుగుమందు డబ్బాలతో వచ్చారు. కొంతమంది రైతులు నాగలితో భూములు దున్నేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఉపాధికి దూరమయ్యాం... సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు కోసం 2018లో తమ పంట భూములు ఇస్తే ఇప్పటివరకు పరిశ్రమ ప్రారంభం కాలేదని, ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని భూనిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లలోనే పూర్తి చేస్తామని చెప్పి పరిశ్రమ యజమానులు మాట తప్పారని ఆరోపించారు. మొత్తం 107 ఎకరాల భూమి తీసుకుని ఐదేళ్లవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తాము ఉపాధి కరువై కూలీలుగా మారామని, కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ కోసం నిరసన చేపడుతున్న క్రమంలో పోలీసులు కనీసం మహిళలని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. నిర్వాసితుల ఆందోళన నేపథ్యంలో ఈ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.