World Richest Thailand King: ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న సంపన్నులను గురించి.. ప్రపంచంలోని కుబేరుల గురించి కూడా కొంత వరకు తెలుసుకున్నాం. అయితే ఈ రోజు అపారమైన సంపదను మాత్రమే కాకుండా వేల ఎకరాల భూమిని కలిగి, లెక్కకు మించిన వాహనాలను కలిగిన ఒక సంపన్న రాజును గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వేల ఎకరాల భూమి..
నివేదికల ప్రకారం.. థాయ్‌లాండ్‌కు చెందిన మహారాజు 'మహా వజిరాలాంగ్‌కార్న్' (Maha Vajiralongkorn) ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడని తెలుస్తోంది. ఈయన ఆస్తి సుమారు రూ. 3.2 లక్షల కోట్లు. అంతే కాకుండా వజ్రాలు, రత్నాలు వంటి వాటితో పాటు.. 16 వేల ఎకరాల కంటే ఎక్కువ భూమి కూడా వజిరాలాంగ్‌కార్న్ అధీనంలో ఉండేదని సమాచారం.
ఖరీదైన డైమండ్..
భూముల విషయం పక్కనపెడితే మహా వజిరాలాంగ్‌కార్న్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన 545.67 క్యారెట్ బ్రయోన్ గోల్డెన్ జూబ్లీ డైమండ్ ఉండేదని.. దీని విలువ 12 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ (రూ. 98 కోట్లు) ఉంటుందని అంచనా, ఇది రాజు కిరీటంలో పొందుపరిచారు. వీటితో పాటు అపురూపమైన రాజ వాయిద్యాలు కూడా ఆయన వద్ద ఉండేవని తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు!
విమానాలు, హెలికాఫ్టర్లు & కార్లు..
బంగారం, వజ్రాలు మాత్రమే కాకుండా.. వజిరాలాంగ్‌కార్న్ దగ్గర ఏకంగా 38 విమానాలు, లెక్కకు మించిన హెలికాఫ్టర్లు ఉండేవి. ఇందులో నాలుగు బోయిన్, మూడు ఎయిర్‌బస్ విమానాలు. వీటితో పాటు 300 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు వీరి గ్యారేజిలో ఉండేవి. కేవలం వాహనాలకు వినియోగించే ఫ్యూయెల్ ఖర్చు మాత్రం సంవత్సరానికి రూ. 524 కోట్లు అని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. ఈ రాజు ఎంత సంపన్నుడో ఇట్టే తెలిసిపోతుంది.
ఇదీ చదవండి: హీరోలా ఉన్న ఇతడిని గుర్తుపట్టారా? దేశం గర్వించదగ్గ సంపన్నుడు..
విశాలమైన ప్యాలెస్..
థాయ్‌లాండ్‌లోని గ్రాండ్ ప్యాలెస్ విస్తీర్ణం ఏకంగా 23,51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని 1782లో నిర్మించినట్లు సమాచారం. ఇది వారి వారసత్వానికి చిహ్నంగా చారిత్రాత్మక కట్టడంగా నిలిచింది. వజిరాలాంగ్‌కార్న్ రాజుని 'కింగ్ రామ ఎక్స్' అని కూడా పిలుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment