హోటల్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రధానిగా అత్యున్నత పదవిని అలకరించింది. అంతేగాదు జస్ట్ 37 ఏళ్లకే ప్రధాని అయిన మహిళగా చరిత్ర సృష్టించింది కూడా. ఎవరామె? ఆమె సక్సెస్ జర్నీ ఏంటంటే..
ఆమె పేరు పేటోంగ్‌టార్న్ షినవత్రా. అతి పిన్న వయస్కురాలైన థాయి రెండో ప్రధానిగా చరిత్ర సృష్టించింది. గత ప్రధాని స్రెట్టా థావిసిన్ నైతిక ఉల్లంఘనలపై పదవీచ్యతుడు కావడంతో థాయ్ మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా కుమార్తె కొత్త ప్రధానిగా నామినేట్ అయ్యారు. ఆమె రాజకీయాల్లోకి రావడానికి ముందు తమ కుటుంబ హోటల్‌ని విజయవంతంగా నిర్వహించారు.
ఆ తర్వాత ఫ్యూ థాయ్ ఇన్‌క్లూజన్ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కమిటీ చీఫ్‌గా 2021లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఉంగ్ ఇంగ్ అనే మారుపేరుతో పిలువబడే షినవత్రా తన కుటుంబంలో ఇలాంటి అత్యున్నత పదవిని అలకరించిన మూడొవ కుటుంబ సభ్యుడు. అంతేగాదు ఆమె పార్టీ, దాని మిత్రపక్షాలు 493 సీట్లలో 319 కైవసం చేసుకోవడంతో పార్లమెంటులో భారీ విజయం సాధించారు.
ఆమె 2023లో కూడా ప్రధాని మంత్రి పదవికి పోటీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ప్రజా రవాణా ఛార్జీలను తగ్గించడం, ఆరోగ్య సంరక్షణ కవరేజీని విస్తరింపజేయడం , కనీస రోజువారీ వేతనాన్ని రెట్టింపు చేస్తాం వంటి హామీలు ఇచ్చింది. అంతేగాదు తన తండ్రి పాలనలో అనుసరించిన విధానాలకు కొన్ని మార్పులు తీసుకురావాలనే దృక్పథంతో పనిచేయాలనుకుంటోంది షినవత్రా. ఆమె రిలాక్స్డ్ వ్యయ విధానాలతో వృద్ధిని పెంచి దేశ ఆర్థిక సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయనున్నట్లు తెలిపింది.
ఇక ఆమె వాణిజ్య పైలట్ అయిన పిడోక్ సూక్సావాస్‌ను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతేడాది ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తున్నప్పుడే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ షినవత్రా అంకితభావంతో తన కుటుంబ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించడమే కాకుండా దేశ ఆర్థిక విధానాల్లో మార్పులు రావాలన్నా ఆకాంక్ష ఆమెను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. ఆ క్రమంలో కెరీర్‌పరంగా, వ్యక్తిగతంగా పలు సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.
(చదవండి: హార్ట్ బైపాస్ సర్జరీ: రికవరీ కోసం తీసుకోవాల్సిన డైట్ ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment