King
-
తనని తాను ‘రాజు’గా ప్రకటించుకున్న ట్రంప్!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనని తాను రాజుగా ప్రకటించుకోవడం కలకలం రేపుతోంది. ట్రంప్ తాజాగా, న్యూయార్క్ నగరంలోని పాత బస్సు, మెట్రో రవాణా వ్యవస్థకు నిధులు సమకూర్చే కాంక్షన్ ప్రైసింగ్ ప్రోగ్రామ్ (Congestion Pricing Program)ను రద్దు చేశారు. రద్దు అనంతరం, ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తనను తాను ‘రాజు’ అని ప్రకటించుకున్నారు. దీంతో ఆయన అధ్యక్షాధికారాలపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.మరింత వివాదంవైట్ హౌస్ అధికారిక ఎక్స్ అకౌంట్లో ట్రంప్ రాజు ప్రకటనను మరింతగా హైలైట్ చేస్తూ, టైమ్ మ్యాగజైన్ మేకప్ కవర్‌ను షేర్ చేసింది. అందులో లాంగ్ లైవ్ ద కింగ్ అనే క్యాప్షన్ జోడించడం గమనార్హం. అంతేకాదు, వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ టేలర్ బుడోవిచ్ ఏఐ-తయారుచేసిన ట్రంప్ రాజరిక చిత్రం పోస్ట్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. "CONGESTION PRICING IS DEAD. Manhattan, and all of New York, is SAVED. LONG LIVE THE KING!" –President Donald J. Trump pic.twitter.com/IMr4tq0sMB— The White House (@WhiteHouse) February 19, 2025న్యూయార్క్ గవర్నర్ వార్నింగ్ ట్రంప్ రాజు ప్రకటనపై న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తీవ్రంగా స్పందించారు. మేం రాజుల పాలనలో లేం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. కోర్టులో కలుసుకుందాం’ అంటూ ఘాటుగా స్పందించారు.అధ్యక్ష అధికార దుర్వినియోగమా? ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (MTA) ట్రాన్స్‌పోర్టేషన్ సెక్రటరీ షాన్ డఫీ, ఇతర ఫెడరల్ అధికారులపై కేసు నమోదు చేసింది. ట్రంప్ ప్రభుత్వం న్యూయార్క్ ట్రాన్స్పోర్ట్ టోల్ ప్రోగ్రామ్ రద్దు చేయాలని ప్రయత్నించడం అధికార దుర్వినియోగం, రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను నాశనం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘హర్షా భాయ్.. శత్రువుకి కూడా ఇలాంటి పరిస్థితి రాదేమో!’
మొన్నీమధ్యే ‘లక్కీ భాస్కర్’ అనే ఓ సినిమా వచ్చింది. ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి అయిన హీరో.. దేశంలోనే అతిపెద్ద స్కాంలో తెలిసీతెలియకుండానే భాగం అవుతాడు. మోసాన్ని మోసంతోనే జయించి వంద కోట్లు తన ఖాతాలో వేసుకుంటాడు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌కు ప్రేక్షకులు క్లాప్స్.. విజిల్స్. ‘‘ఛస్.. అదొక ఆర్థిక మోసం’’ అనేవాళ్లు లేకపోలేదు. ‘‘సినిమానే కదా గురూ.. పైగా నేరం రుజువు కాలేదు.. అడ్జస్ట్ అయిపో’’ అని సలహా ఇచ్చేవాళ్లు లేకపోలేదు. ఉఫ్.. హీరో కాబట్టి సేవ్ అయిపోయాడు. ప్రేక్షకుల మనన్ననలు పొందగలిగాడు. అదే నిజజీవితంలో జరిగితే..! అఫ్కోర్స్ ఈ సినిమా కూడా వాస్తవ ఘటనల స్ఫూర్తితోనే తెరకెక్కిందనుకోండి. కానీ..”రిస్క్ హై తో ఇష్క్ హై” అనుకునే ఓ దిగువ మధ్యతరగతి వ్యక్తి.. డబ్బు సంపాదించాలనే కసితో వాణిజ్య రాజధానిలో అడుగుపెట్టాడు. కామర్స్ గ్రాడ్యుయేట్ నుంచి ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌గా ఆపై ప్రసన్న ప్రాంజివందాస్ దగ్గర శిష్యరికంలో స్టాక్ బ్రోకర్‌గా రూపాంతరం చెందాడు. ఆపై తన సోదరుడితో కలిసి గ్రోమోర్ అనే బ్రోకరేజ్ సంస్థను స్థాపించి.. 1987లో స్టాక్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. అదే సమయంలో.. బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఒడిసి పట్టుకున్నాడు. ఎస్బీఐలాంటి ప్రభుత్వ బ్యాంకుతో సహా అవినీతిమయమైన వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేయగలిగాడు. బ్యాంకుల నుంచి కోట్ల డబ్బుని సేకరించి.. దలాల్ స్ట్రీట్‌నే శాసించాడు. వెరసి.. వేల కోట్లను చాకచక్యంగా పిండుకున్నాడు. ఈ కథను Scam 1992 పేరుతో వెబ్ సిరీస్‌గా తీస్తే జనాలు థ్రిల్లయిపోయారు. ఆయన రిఫరెన్స్‌తో లక్కీ భాస్కర్ సినిమా తీస్తే అదిరిపోయిందన్నారు. పైగా ఆ కథల్లోంచి ఆర్థిక పాఠాలను, జీవిత సత్యాలను వెతికారు. ప్చ్.. తప్పులేదు సోషల్ మీడియా జమానా అలాంటిది మరి!.అది 2001 ,డిసెంబర్ 31.. దేశం మొత్తం న్యూఇయర్ సంబరాలకు సిద్ధమవుతోంది. అలాంటి టైంలో పత్రికల్లో, టీవీల్లో వచ్చిన ఓ వార్త అందరినీ ‘అరరె’ అనుకునేలా చేసింది. 47 ఏళ్ల వయసున్న హర్షద్ మెహతా.. థానే జైల్లో గుండె నొప్పితో కన్నుమూశాడు అని. ఓవైపు మెహతా ఫొటో.. మరోవైపు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరగాడి అస్తమయం అనే లైన్లు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా వీల్‌చైర్‌లోనే కుప్పకూలిపోయాడంటూ పేర్కొన్నాయవి. ఓ సాధారణ గుజరాతీ జైన్ కుటుంబంలో పుట్టి.. స్టాక్ మార్కెట్ సామ్రాజ్యంలో బిగ్ బుల్గా ఎదిగాడు హర్షద్ మెహతా. ఆరోజుల్లో.. మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలనుకున్న ఎంతో మందికి మూడు పదుల వయసున్న హర్షద్ మెహతా(Harshad Mehta) ఓ రోల్ మోడల్ అయ్యాడు. అలాంటి వ్యక్తి దేశంలోనే అతిపెద్ద స్కాంలో సూత్రధారి అయ్యాడు. అప్పటిదాకా ఆర్థిక మేధావి అనిపించుకున్న వ్యక్తి.. ఆర్థిక మోసగాడనే ముద్రతో విచారణ, ఐదేళ్ల జైలుశిక్ష ఎదుర్కొన్నాడు. చివరకు.. అనామక పరిస్థితుల నడుమ జైలు ఊచల మధ్య కన్నుమూయడం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పుడు మనీలైఫ్ ఎడిటర్‌గా ఉన్న సుచిత్ర దలాల్.. ఒకప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కాలమిస్ట్. హర్షద్ మెహతా సెక్యూరిటీస్ స్కాం తుట్టెను కదిలించారామె. ఆమె ప్రచురించిన ఆ ఇన్వెస్టిగేషన్ కథనాలు.. ఆ టైంలో మీడియా రంగంలోనే పెద్ద సెన్సేషన్ అయ్యాయి. కట్ చేస్తే.. అదే ఏడాది నవంబర్ 9వ తేదీన సీబీఐ ప్రముఖ స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతాను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి మరణించేదాకా.. తొమ్మిదేళ్లపాటు జ్యూడిషియల్ కస్టడీ కింద జైల్లోనే గడిపారాయన. మరోవైపు ఆయన కుటుంబం న్యాయపోరాటం మొదలుపెట్టింది కూడా అప్పటి నుంచే..స్టాక్ మార్కెట్లో హర్షద్ మెహతా ఎంత హుందాగా ఎత్తుకు ఎదిగారో.. అంతే దీనస్థితిలో పాతాళానికి చేరుకున్నారు. హర్షద్‌మెహతా మరణాంతరం.. ఆయన కుటుంబం 20 ఏళ్ల పాటు మీడియా కంటపడకుండా అజ్ఞాతం జీవితం గడిపింది. అతుర్ మెహతా.. హర్షత్ మెహతా కొడుకు. ఇన్వెస్టర్‌గా, ఎంట్రాప్రెన్యూర్గా ఓ దుస్తుల కంపెనీని నడిపిస్తున్నారు. అతుర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడు. అమెరికాలో స్థిరపడ్డాడని కొందరు.. లేదు ముంబైలోనే ఉన్నాడని మరికొందరు చెబుతుంటారు. అతని ఆస్తిపాస్తులు వగైరా వివరాలు వెతికినా ఇంటర్నెట్లో పెద్దగా కనిపించదు. ఇక.. హర్షద్ సోదరుడు, ఆయనతోపాటు కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన అశ్విన్ లా చదవి.. ముంబైలో ప్రాక్టీస్ చేస్తున్నారు. తన అన్న, కుటుంబం పేరిట నడుస్తున్న కేసులను ఆయనే వాదిస్తున్నారు ఇప్పుడు. ఈయన కూడా అంతే.. మీడియా కంట పడకుండా, ఇంటర్వ్యూల జోలికి పోకుండా బతుకుతున్నారు. ఇక జ్యోతి మెహతా(Joti Mehta).. హర్షద్ భార్య. ఆయన మరణాంతరం 20 ఏళ్లకు ఆమె నోరు విప్పారు. అయితే అది తన భర్త పేరిట ఏర్పాటు చేసిన వెబ్సైట్ ద్వారానే.‘‘నా భర్త హర్షద్ మెహతా చనిపోయింది సకాలంలో వైద్యం అందకనే. అసలు అంతకుముందు ఆయనకు ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు లేవు. కేవలం జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే నా భర్త చనిపోయాడు. ఆరోజు సాయంత్రం తన ఛాతీలో నొప్పిగా ఉందని ఆయన పక్క సెల్లో ఉన్న తన సోదరుడికి సమాచారం ఇచ్చారు. ఆయన ఆ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. జైల్లో ఉన్న వైద్యులు పరీక్షించి గుండెపోటు మాత్రలు లేవన్నారు. అయితే తన మెడికల్ బాక్సులో అవి ఉన్నాయని ఆయన మాత్రలను తెప్పించి వేసుకున్నారు. ఆ మందు నాలుగు గంటలపాటు మెహతాను బతికించింది. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో.. అర్ధరాత్రి దాటాక ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. నాడు జైలు అధికారులు సకాలంలో స్పందించి ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే.. ఆయన చనిపోయేవారే కాదు’’ అని జ్యోతి తెలిపారు. అంతేకాదు.. తన భర్త మరణానికి సంబంధించి అధికారులు ఎలాంటి విచారణ నివేదిక, పోస్ట్‌మార్టం నివేదిక ఇవ్వలేదని.. జైలు అధికారులను ఎన్నిసార్లు కోరినప్పటికీ స్పందన ఉండడం లేదని అంటున్నారామె. ఏ నోళ్లు అయితే పొగిడియో..అవే నోళ్లు నా భర్తను ఆర్థిక నేరస్థుడిగా ప్రచారం చేశాయి. శత్రువుకు కూడా మాకు వచ్చిన కష్టాలు రాకూడదని కోరుకుంటున్నాం అని చెబుతున్నారామె. అంతేకాదు harshadmehta.in ద్వారా సంచలన విషయాలు తెలియజేసే ప్రయత్నమూ చేస్తున్నారు. కుటుంబ కష్టాలుహర్షద్ మెహతాపై బ్యాంకుల చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఆధారంగా 72 క్రిమినల్ కేసులు, 600కిపైగా సివిల్ అభియోగాలు నమోదు అయ్యాయి. కానీ, అందులో కేవలం నాలుగు అభియోగాల్లో ఆయన జైలు పాలయ్యారు. 1992, జూన్ 4న సీబీఐ మెహతా కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై సెర్చ్ ఆపరేషన్ జరిపింది. సోదాల్లో ఎన్నో డాక్యుమెంట్లు, షేర్ మార్కెట్ కు సంబంధించిన సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకుంది. అప్పటికి ఆ కుటుంబం ఆస్తుల విలువ రూ.1,700 కోట్లు అని ఓ అంచనా. అనంతరం హర్షద్ మెహతా తన 1992-93 ఏడాది ఆదాయంపై ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేశాడు. ట్యాక్స్ డిపార్ట్ మెంట్ దాన్ని తిరస్కరించింది. మెహతా ఫ్యామిలీ రూ.4 కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు 1995లో ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. చివరికి ఈ వ్యవహారం కాస్తా ఇన్ కం ట్యాక్స్ ట్రిబ్యునల్ కు చేరింది. ఈలోపు ఆయన మరణించారు. మరోవైపు మెహతా కుటుంబంపై ఆదాయ శాఖ చర్యలు కొనసాగాయి. వరసగా వారి సంబంధిత ఆస్తులపై తనిఖీలు చేపట్టింది. చివరకు 23ఏళ్ళ తరువాత ట్రిబ్యునల్.. మెహతా కుటుంబ పన్ను కట్టాలనే ఐటీ శాఖ డిమాండ్ ను తోసిపుచ్చింది. ఆ కుటుంబానికి క్లీన్ చిట్ ఇస్తూ.. పన్ను కట్టాల్సిన అవసరం లేదని తేల్చింది.అదే టైంలో.. హర్షద్ మెహతా లావాదేవీల కారణంగా చెల్లించాల్సిన బకాయిలు ఆస్తుల కంటే ఎన్నో రేట్లుగా తేలింది. సంపాదించినదంతా దాదాపుగా బకాయిల చెల్లింపుకే సరిపోయింది. వీటిలో చాలావరకు సెటిల్మెంట్ కాలేక కోర్టుల దాకా చేరాయి. అయితే ఈ విషయంలో మెహతా కుటుంబానికే ఊరట లభించింది. ఫెడరల్ బ్యాంకు, కిషోర్ జననీ దావాలో జ్యోతి మెహతా రూ.6 కోట్ల సెటిల్మెంట్ విజయం సాధించారు. అలాగే.. న్యాయపోరాటం తర్వాత వేలంపాట లేకుండా కొన్ని ఆస్తులు తిరిగి ఆ కుటుంబానికే చేరాయి. అలా ఆ వచ్చినదాంతోనే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. స్కాం ఏంటంటే..లక్కీ భాస్కర్ సినిమా చూసినవాళ్లకు హర్షద్ మెహతా చేసిన నేరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, ఈ కథనం నేపథ్యంలో మరోసారి సింపుల్‌గా గుర్తు చేస్తున్నాం. స్టాక్ మార్కెట్(Stock Market)కు అమిత్ బచ్చన్‌గా పేర్కొందిన హర్షద్ మెహతా.. తన సోదరుడితో కలిసి గ్రోమోర్ అనే బ్రోకరేజ్ సంస్థను ఏర్పాటు చేశాడు. కోట్ల రూపాయలను, బ్యాంకులలో లోన్ పెట్టి తీసుకుని, ఆ డబ్బుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి, లాభాలు గడించి తిరిగి బ్యాంకులకు చెల్లించడం చేసేవాడు. రెడీ ఫార్వడ్ డీల్, బ్యాంకు రీసిప్ట్ లను వాడుకుని.. బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆ డబ్బును మంచి నీళ్ళకంటే కూడా దారుణంగా తన చుట్టూ తిప్పుకున్నాడు. స్టాక్ మార్కెట్ లో లొసుగులను వినియోగించి కోట్లకు పడగలెత్తాడు. బ్యాంక్ రిసిప్టుల ని, సంతకాలని ఫోర్జరీ చెయ్యడం అతిపెద్ద నేరం. అలా.. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోని (1992 సెక్యూర్టీస్) అతిపెద్ద కుంభకోణానికి హర్షద్ మెహతా పాల్పడ్డాడు. అయితే ఈ కేసు నుంచి తప్పించాలని రూ.1 కోటిని అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు లంచంగా ఇచ్చానంటూ హర్షద్ చేసిన ప్రకటన ఆ టైంలో రాజకీయంగానూ దుమారం రేపింది. వేకప్ కాల్.. హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక్కసారిగా కుదిపేసింది. షేర్ల కొనుగోలుకు బ్యాంకులోని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని తెలిసి ఆర్థిక మేధావులు విస్తుపోయారు. బీఎస్ఈ సెక్యూరిటీస్‌ల కుంభకోణం ద్వారా రూ.5,000 కోట్ల మోసానికి పాల్పడ్డారని రకరకాల సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. 1992లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చాక స్టాక్ మార్కెట్లు 72 శాతం పతనమయ్యాయి. ఆ కాలంలో ఇన్వెస్టర్లు రూ.4,000 కోట్లు నష్టపోయారు. మార్కెట్లపై ఈ పరిణామ ప్రభావం రెండేళ్లపాటు కొనసాగింది. దీని తరువాత కొత్తగా అనేక కఠిన చట్టాలను దేశంలో తీసుకురావటం జరిగింది. -
కిల్లర్స్.. గెటౌట్!
వాలెన్సియా: ఇటీవలి వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వాలెన్సియా నగరంలో స్పెయిన్ రాజ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం వరద బాధిత ప్రాంతంలో పర్యటనకు వచి్చన రాజు ఫిలిప్ పైకి వరద బాధితులు బురద విసురుతూ దూషించారు. వాలెన్సియా శివారులోని పైపోరా్టకు చేరుకున్న సమయంలో రాజు వెంట ఉన్న ప్రభుత్వాధికారులు స్థానికులతో మాట్లాడుతుండగా, కొందరు బిగ్గరగా ‘గెటౌట్! గెటౌట్!, కిల్లర్స్!’అంటూ కేకలు వేశారు. రాచకుటుంబీకులు, అధికారులపైకి గుడ్లు, బురద విసిరేందుకు ప్రయతి్నంచగా రక్షక సిబ్బంది గొడుగులతో వారిని కాపాడారు. పోలీసులు నిరసనకారులను వెనక్కి నెట్టేశారు. ఈ సమయంలో కింగ్ ప్రశాంతంగా బాధితులతో సంభాíÙంచేందుకు ప్రయతి్నంచారు. ఓ వ్యక్తి ఆయన భుజంపై తల ఆనించి, రోదించారు. రాజు వెంట రాణి లెటిజియా, వాలెన్సియా ప్రాంత ప్రెసిడెంట్ కార్లో మజోన్ ఉన్నా రు. గ్లవుజులతోపాటు ముంజేతిపై పడిన బురదతోనే రాణి స్థానికులతో మాట్లాడారు. ప్రధాని పెడ్రో సాంచెజ్ రాజు వెంట ఉన్నదీ లేనిదీ తెలియరాలేదు. ఇటీవలి భీకర వరదల్లో 200మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ముందస్తు హెచ్చరికలు చేయడంలో ప్రభుత్వం విఫలమవ్వడం వల్లే ఇంతటి స్థాయిలో నష్టం జరిగిందని జనం ఆగ్రహంతో ఉన్నారు. -
‘కేజ్రీవాల్ జైల్లో ఎందుకు రాజీనామా చేయలేదు?’
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ నేత సంజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి హర్యానాలో బీజేపీ అధికారం నుండి దిగిపోతుందని, ఆమ్ ఆద్మీ పార్టీ సాయం లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేదన్నారు. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కింగ్ మేకర్ అవుతారని, అధికార రిమోట్ కేజ్రీవాల్ చేతుల్లో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో ఎందుకు రాజీనామా చేయలేదో కూడా సంజయ్ సింగ్ వివరించారు. ఒక మీడియా సంస్థ నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న ఆప్ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ తాము సీట్ల విషయంలో కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకోలేదని, వారు, తాము విడివిడిగానే పోటీ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ వారి ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించుకోవాల్సి ఉందని, అయితే రిమోట్ కేజ్రీవాల్ చేతిలో ఉంటుందనే నమ్మకం తనలో ఉందన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 90 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు.గత పదేళ్ల పాలనలో సీఎం ఖట్టర్ హర్యానాను పూర్తిగా దిగజార్చారని, ఇప్పుడు నిరుద్యోగం విషయంలో భారతదేశంలో హర్యానా మొదటి స్థానంలో ఉందన్నారు. అగ్నివీర్ పథకంపై గ్రామాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని, ప్రభుత్వ పనితీరుపై రైతులు మండిపడుతున్నారన్నారు.జైల్లో ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని సంజయ్ సింగ్‌ను మీడియా ప్రశ్నించగా అదేగనుక జరిగివుంటే, బీజేపీ వ్యూహం ఫలించేదని.. ఆ తర్వాత మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, రేవంత్ రెడ్డి, పి. విజయన్.. ఇలా అందరినీ జైల్లో పెట్టి, బీజేపీ వారి రాజీనామాలను తీసుకుని ఉండేదని అన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ రాజీనామా చేసి, అతిశీని ముఖ్యమంత్రిని చేశారని, ఢిల్లీ ప్రజలు నాలుగు నెలల తర్వాత మళ్లీ కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నికుంటారని సంజయ్ సింగ్ దీమా వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం ఇంట్లో భారీ చోరీ -
విలన్‌గా అభిషేక్ బచ్చన్.. షారుఖ్‌తో ఢీ!
షారుక్ ఖాన్ హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. షారుక్ ఖాన్ , ఆయన కుమార్తె సుహానా ఖాన్ లీడ్ రోల్స్‌లో సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో ‘కింగ్’ తెరకెక్కనుంది. (చదవండి: ఇండస్ట్రీ అంతా ఒకే వెబ్ సిరీస్‌లో నటిస్తే.. ఇది అదే)ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీలో విలన్ రోల్ కొత్తగా ఉంటుందట. ఈ రోల్‌కు అభిషేక్ బచ్చన్‌ను సంప్రదించారట సుజోయ్ ఘోష్. నెగటివ్ రోల్ కావడంతో మొదట కాస్త విముఖతను వ్యక్తం చేసిన అభిషేక్.. పాత్రలోని డెప్త్, ప్రత్యేకత నచ్చడంతో ఫైనల్‌గా ఓకే చె΄్పారని బాలీవుడ్ సమాచారం. -
రాయల్ సెల్ఫీ: వందేళ్లక్రితమే భారత్‌లో సెల్ఫీ ఉందని తెలుసా..!
స్మార్ట్‌ఫోన్ యుగం వచ్చాక ఎక్కడికైన వెళ్లినా..ఏదైన వింత చోటు కనిపించినా.. వెంటనే ఫోన్‌కి పనిచెప్పేస్తారు. సెల్ఫీలు దిగేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయడం చేస్తోంది నేటి యువత. ఒకప్పటిలా కెమెరామెన్తో ఫోటోలు తీయించుకునే పనే లేదు. నచ్చిన యాంగిల్స్‌లో మనకు మనమే ఫోటోలు తీసేసుకుంటున్నారు. అయితే ఈ సెల్ఫీలు మోజు నేటిది మాత్రం కాదు. వందేళ్ల ఏళ్ల క్రితమే దీనికి క్రేజ్ ఉంది. పైగా నాటి కాలంలోనే వాళ్లు సెల్ఫీలు తీసుకుని సంబరపడ్డారు కూడా. ప్రపంచంలోనే తొలి సెల్ఫీని అక్టోబర్ 1839లో రాబర్ట్ కార్నెలియస్ తీశారు. ఆయన డాగ్యురోటైప్ టెక్నిక్‌ని ఉపయోగించారు. ఇది అయోడిన్-సెన్సిటైజ్డ్ సిల్వర్ ప్లేట్, పాదరసం ఆవిరిని ఉపయోగించే ప్రారంభ ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ. ఆయన అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తన ఇంటి పెరట్లో తన కుటుంబంతో కలిసి సెల్ఫీ దిగేందుకు దాదాపు మూడు నుంచి 15 నిమిషాల వ్యవధి తీసుకుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆ ఫోటో వెనుక సవివరంగా వివరించాడు కూడా. ఈ ఫోటోనే 1839లో తీసిన సెల్ఫీ లైట్ పిక్చర్‌గా గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. అయితే మన ఇండియాలో తొలి సెల్ఫీ దిగింది రాజకుటుంబానికి చెందిన ఓ జంట. రాచరికపాలన సాగే త్రిపుర రాష్ట్రంలో సెల్ఫీ ఫోటోగ్రాఫ్ 1880లో దిగడం జరిగింది. మహారాజా బీర్ చంద్ర మాణిక్య అతని భార్య మహారాణి ఖుమాన్ చాను మన్మోహినీ దేవి ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు. మహారాజు మంచి ఫోటోగ్రఫీ ఔత్సాహికుడు. అతను అనేక ఫోటోగ్రఫీ ప్రదర్శనలు కూడా నిర్వహించాడు. అంతేగాదు ఆయన చనిపోయేంత వరకు ఫోటోగ్రాఫిక్ సోసైటీలో సభ్యుడు కూడా.రాజు కారణంగా ఆ కళపై మహారాణి కూడా మక్కువ పెంచుకుంది. అలా ఆమె కూడా ఫోటోగ్రాఫర్‌గా మారడం జరిగింది. చెప్పాలంటే ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ కళలో ప్రావీణ్యం పొందిన తొలి భారతీయ మహిళ ఆమెనే కావడం విశేషం. కాగా, త్రిపుర మహారాజు తీసుకున్న సెల్ఫీలో మహారాణితో కౌగిలించుకుని దిగినట్లుగా ఫోటో కనిపిస్తుంది. అంతేగాదు ఈ ఫోటోనే భారతదేశంలోని తొలి సెల్ఫీగా నిలిచింది కూడా.(చదవండి: దీపికా పదుకొణె మెడలో సిక్కు మహారాజుల నాటి నెక్లెస్..!) -
ఒకసారి తన రాజ్యంలో..
విజయనగర రాజు విజయేంద్రవర్మ మంచి ఇంద్రజాలికుడు. ఎక్కడికి వెళ్ళినా, కళల గురించి గొప్పగా మాట్లాడేవాడు. ఒకసారి తన రాజ్యంలో కళాకారులు ఎంత గొప్పగా జీవిస్తున్నారో, గౌరవించబడుతున్నారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. వెంటనే మారువేషంలో గుర్రం మీద దేశసంచారానికి బయలుదేరాడు.ఒక ఊరి సంతలో కమ్మటి గానం విని గుర్రాన్ని ఆపి అటు వైపు వెళ్లాడు. అక్కడ నలుగురు సంగీత వాయిద్యాలు వాయిస్తుంటే మరో ఇద్దరు గానం చేస్తున్నారు. ఆ గానం చేస్తున్న యువతీ,యువకుడు ఇద్దరూ అంధులే! మధురంగా పాడటం ఆపాక సంతలో ఉన్నవారిని దానం చేయమని కోరారు. తన రాజ్యంలో కళాకారులు అడుక్కోవటం చూసి ఆశ్చర్యపోయాడు విజయేంద్రవర్మ. ‘రాజు గొప్ప కళాకారుడు! ఎప్పుడూ కళాకారుల గురించే మాట్లాడుతాడు! మీరు ఇలా యాచించటం వింతగా ఉంది!’ అంటూ యువతిని అడిగాడు రాజు. ‘రాజు కళాకారుడైనందుకు మా బతుకులు బాగైతాయని సంతోషించాము. అతని మాటలు కోటలు దాటుతాయి కానీ పనులు మాత్రం శూన్యం’ అన్నది ఆమె. విజయేంద్రవర్మ మౌనంగా ఉండిపోయాడు. గుర్రం ఎక్కి మరో గ్రామం చేరుకున్నాడు. అక్కడొక యువతి నృత్యం చేస్తుంటే .. కొందరు గ్రామ పెద్దలు వెకిలిగా నవ్వుతూ డబ్బులిస్తున్నారు. నృత్యం ముగిశాక ‘చూడమ్మా! రాజు కళాప్రేమికుడు కదా! నువ్వేంటి ఇలా దిగజారి అడుక్కుంటున్నావు?’ అడిగాడు విజయేంద్రవర్మ.‘రాజు కళాప్రేమికుడే. కాని కళాపోషకుడు మాత్రం కాదు. క్రియా శూన్యుడు. అతను చెప్పేది నిజంగా చేస్తే మాకు ఈ బతుకు ఉండక పోయేది!’ ఆవేశంగా అంది ఆమె. ఆ జవాబు విని మౌనంగా ముందుకు కదిలాడు రాజు. మరో గ్రామంలో ఒక వయసు పైబడిన ఇంద్రజాలికుడు ఇంద్రజాలం చేస్తూ కనిపించాడు. ఇంద్రజాలికుడిని చూడగానే విజయేంద్రవర్మకు ఎక్కడలేని ఉత్సాహం కలిగింది. రాజు అతనిలో తనని చూసుకున్నాడు. ప్రేక్షకులు చప్పట్లతో అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. ఇంద్రజాలికుడి ప్రదర్శన ముగిశాక నెత్తిన ఉన్న టోపి తీసి దానం చేయమని అడిగాడు. ‘తాతా ! రాజు కూడా నీ వలె గొప్ప ఇంద్రజాలికుడు కదా! నువ్వేంటి ఇలా..!’ అడిగాడు రాజు.‘నువ్వు శంఖాన్ని ఎప్పుడైనా చెవి దగ్గర పెట్టుకొని విన్నావా? వింటే సముద్రపు హోరులా శబ్దం వస్తుంది. ఆ శబ్దం నిరంతరం వస్తూనే ఉంటుంది. అలా శబ్దం చేయడం వల్ల ప్రయోజనం అటు శంఖానికి, ఇటు మనకు ఉండదు! రాజు గారి ప్రసంగాలు కూడా అంతే!’ అన్నాడు అతను.కళాకారులు తనని తోటి కళాకారుడిగా, కళల పట్ల విడువకుండా రోజంతా మాట్లాడగలిగే మంచి వక్తగా గుర్తించారే తప్ప మంచి పాలకుడిగా గుర్తించలేదని తెలుసుకున్నాడు విజయేంద్రవర్మ. ఆనాటి నుండి కళాకారులను గుర్తించి, వారికి తగిన ఉద్యోగాలు కల్పించి ఆర్థికంగా ఆదుకున్నాడు. వికలాంగ కళాకారులను గుర్తించి వారికి ప్రత్యేకంగా ఆరోగ్య సౌకర్యాలు, వసతులు కల్పించాడు.పేద కళాకారులను గుర్తించి వీలున్న చోటల్లా వారి సేవలను వినియోగించుకుని ఘనంగా సత్కరించాడు. మాటల్ని డబ్బులంత పొదుపుగా వాడుకుంటూ చేతలను నీళ్ళలా పరోపకారం కోసం ప్రవహింపచేశాడు. అలా కొద్ది రోజుల్లోనే విజయేంద్రవర్మ క్రియా శూన్యుడు కాదు.. క్రియా శూరుడిగా పేరు పొందాడు. – కొట్రా సరితఇవి చదవండి: ఆ ముగ్గురూ... ఓ ఉత్తరం! -
రోహిత్‌ను గుర్తు చేసిన కింగ్.. స్టేడియం బయటకు బంతి! వీడియో
టీ20 వరల్డ్‌కప్-2024లో సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ బ్రాండెన్ కింగ్ అద్బుతమైన షాట్‌తో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో కింగ్ భారీ సిక్స్ కొట్టాడు. అతడు కొట్టిన షాట్‌కు బంతి 101 మీటర్ల దూరం వెళ్లి స్టేడియం బయటపడింది. విండీస్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఇంగ్లండ్ పేసర్ రీస్ టాప్లీ తొలి రెండు బంతులను డాట్లగా వేశాడు. అనంతరం మూడో బంతిని స్టంప్స్ లైన్ దిశగా ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బంతి స్లాట్‌లో ఉండడంతో కింగ్ మిడ్ వికెట్ మీదగా భారీ సిక్స్ బాదాడు. దెబ్బకు బంతి స్టేడియం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రోహిత్ కూడా అచ్చెం ఈ విధంగానే మిడ్ వికెట్ దిశగా ఈజీగా భారీ సిక్స్‌లు కొడుతుంటాడు. ఇక ఈ మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన కింగ్ దురదృష్టవశాత్తు రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ రాజు
బ్రిటన్ రాజు చార్లెస్(75) అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపధ్యంలో మరోమారు ఆయన లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. దీనికి ముందు ఆయన ఒక ప్రసంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో అతని భార్య క్వీన్ కెమిల్లా కంట నీరు పెట్టుకున్నారు. వైద్యబృందం నుంచి క్లియరెన్స్ తీసుకున్న అనంతరం ఈ కార్యక్రమంలో రాజు పాల్గొన్నారు. వైద్యుల సలహా మేరకు బ్రిటన్ రాజు తన ప్రసంగాన్ని 45 నిమిషాలకు కుదించారు.బ్రిటన్ కింగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ గత ఫిబ్రవరిలో వెల్లడించింది. ఆయన ప్రోస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారు. రాజు ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ను షేర్ చేసిన బకింగ్‌హామ్ ప్యాలెస్ ఆయన చికిత్స ప్రక్రియలో ఆందోళనకర అంశం వైద్యుల దృష్టికి వచ్చిందని తెలిపింది.బ్రిటన్ రాజు వీలైనంత త్వరగా సాధారణ విధులలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కొంది. కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ ఆకాంక్షించారు. కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని దేశమంతా ప్రార్థిస్తోందని సునక్ అన్నారు. బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా చార్లెస్ కింగ్ ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షించింది. -
పోలాండ్ రోడ్లు, స్కూళ్లకు భారతీయ రాజు పేరెందుకు?
పోలాండ్ దేశం తమ ప్రాంతాల్లోని రహదారులకు, స్కూళ్లకు ఒక భారతీయ రాజు పేరు పెట్టి మరీ గౌరవించింది. అంతలా విదేశీయలుచే గౌరవింపబడుతున్న ఆ రాజు ఎవరూ? అతడేం చేశాడంటే..రెండో ప్రపంచ యుద్ధంలో పోలాండ్ ఆర్మీ తమ దేశంలోని 600 మంది మహిళలను పిలలను ఒక ఓడలో వేరే దేశానికి వెళ్లిపోమని చెప్పి పంపించేశారు. ఏ దేశం రక్షణ కల్పిస్తే అక్కడ ఆశ్రయం పొందమని చెప్పి మరీ వారందర్నీ షిప్లో పంపించేశారు. అయితే వాళ్లకు ఏ దేశం ఆశ్రయం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. చివరకు వాళ్ల ఓడ మంబై పోర్టుకు చేరుకుంది. అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ సైతం వీరికి ఆశ్రయం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఈ విషయం గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన మహారాజ్ దిగ్విజయ్ సింగ్ రంజిత్ సింగ్ జడేజా తెలిసింది. వెంటనే ఆయన తన రాజ్యంలో పోలిష్ శరణార్థులకు, పిల్లలకు ఆశ్రయం ఇచ్చాడు. వారందరీ కోసం తన ప్యాలెస్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఒక ప్యాలెస్‌ని నిర్మించి ఇచ్చాడు. వారందర్నీ తన స్వంత కుటుంబంలా చూసుకున్నాడు. వారి పిల్లలకు స్కూళ్లు, ఆహారశైలికి సంబంధించిన గోవా వంటవాళ్లను ఏర్పాటు చేశాడు. అలా వాళ్లు దాదాపు తొమ్మిదేళ్లపాటు గుజరాత్‌లోని జామ్నగర్లోనే ఆశ్రయం పొందారు. ఆ తర్వాత వారంతా దేశానికి వెళ్లిపోయారు. ఏ దేశం ఆశ్రయం ఇవ్వకపోయిన ఆ భారతీయ రాజు ఎంతో సహృద్భావంతో తమకు ఆశ్రయం ఇచ్చాడని కొనియాడుతూ..ఆ రాజుని పోలాండ్ అత్యున్నత మెడల్‌తో సత్కరించింది. అంతేగాదు ఆ భారతీయ రాజు మానవత్వంతో చేసిన నిస్వార్థ సేవకు గుర్తుగా తమ దేశంలోని రహదారులకు, స్కూళ్లకు ఆయన పేరు పెట్టుకున్నారు. (చదవండి: వాతావరణ యాంగ్జైటీ అంటే ఏంటి..? ఎదుర్కోవడం ఎలా..?) -
పార్టీలకు రూ.వేల కోట్లు.. ఎవరీ 'లాటరీ కింగ్'?
'లాటరీ కింగ్' శాంటియాగో మార్టిన్కి (Santiago Martin) చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ఎలక్టోరల్ బాండ్ల అగ్ర కొనుగోలుదారుగా ఉద్భవించింది. ఇందులో తమిళనాడు అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)కు అత్యధికంగా రూ.509 కోట్లు విరాళంగా ఇచ్చింది. రాజకీయ పార్టీలకు అనామక, అపరిమిత విరాళాలను అనుమతించే ఎలక్టోరల్ బాండ్ల విధానంలో డీఎంకే రూ. 656.5 కోట్ల విలువైన బాండ్లను పొందిందని ఎన్నికల కమిషన్ డేటా తాజాగా వెల్లడించింది. ఈ ఎలక్టోరల్ బాండ్ల విధానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీం కోర్ట్ రద్దు చేసింది. ఫ్యూచర్ గేమింగ్ మొత్తం రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. అందులో దాదాపు 37 శాతం డీఎంకేకి వెళ్లింది. మేఘా ఇంజినీరింగ్ (రూ. 105 కోట్లు), ఇండియా సిమెంట్స్ (రూ. 14 కోట్లు), సన్ టీవీ (రూ. 100 కోట్లు) సంస్థల నుంచి కూడా డీఎంకేకి విరాళాలు ముట్టాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ బాండ్లపై తాజా డేటాను బహిరంగపరిచింది. అంతకుముందు సీల్డ్ కవర్లలో ఈ డేటాను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వివరాలు ఏప్రిల్ 12, 2019కి ముందు కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ తేదీ తర్వాత ఎలక్టోరల్ బాండ్ వివరాలను ఎన్నికల సంఘం గత వారం బహిరంగపరిచింది. డేటా ప్రకారం, 2018లో బాండ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి అధికార బీజేపీ అత్యధిక మొత్తంలో (రూ. 6,986.5 కోట్లు) బాండ్లను స్వీకరించింది. తృణమూల్ కాంగ్రెస్ రెండవ అతిపెద్ద గ్రహీత (రూ. 1,397 కోట్లు) ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్ (రూ. 1,334 కోట్లు), బీఆర్ఎస్ (రూ. 1,322 కోట్లు), ఒడిశా అధికార పార్టీ బీజేడీ (రూ. 944.5) ఉన్నాయి. ఇక డీఎంకే ఆరో అతిపెద్ద గ్రహీతగా ఉంది. ఎవరీ శాంటియాగో మార్టిన్? శాంటియాగో మార్టిన్‌కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ 2019 నుంచి 2024 మధ్య రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఎన్నికల సంఘం గురువారం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసిన డేటా ప్రకారం.. తన తరువాతి స్థానంలో ఉన్న దాత కంటే 40 శాతం ఎక్కువగా ఈ సంస్థ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. మార్టిన్ యుక్తవయసులో లాటరీ టిక్కెట్లను విక్రయిస్తూ లాటరీ-టు-రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. మార్టిన్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రకారం.. ఆయన తన కుటుంబ పోషణ కోసం మయన్మార్‌లో యుక్తవయసులో కార్మికుడిగా పనిచేశాడు. 1980ల చివరలో భారతదేశానికి తిరిగి వచ్చి కోయంబత్తూరులో తన వ్యాపార ప్రస్తానాన్ని ప్రారంభించాడు. మార్టిన్ రెండు-అంకెల లాటరీ ఈ ప్రాంతంలో మంచి ప్రజాదరణ పొందింది. దీంతో ఇతర రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న భూటాన్, నేపాల్ దేశాలకు విస్తరించాడు. -
మురికివాడల్లో ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తి..నేడు సీఈవోగా రూ. 8 కోట్లు..!
మురికి వాడలో కటిక దారిద్యం మధ్య పెరిగాడు. తండ్రి మరణం, తల్లి కుటుంబాన్ని పోషించాల్సిన స్థితి. ఏకంగా ఐదుగురు సంతానం. ఒక్కరోజు కూడా కడుపు నిండా తినలేని ధీన స్థితి అయినా చదువుని నిర్లక్ష్యం చేయలేదు. తల్లి చేసే ఇడ్లీ అమ్మే వ్యాపారంలో చేదోడుగా ఉంటునే ఐఐఏం వంటి ఉన్నత చదువులు చదివాడు. చివరికీ స్వంతంగా ఓ ఫుడ్ కేటరింగ్ సర్వీస్ పెట్టి.. తనలాంటి మురికి వాడ పిల్లల్నే స్టాఫ్‌గా పెట్టుకుని కోట్లు ఆర్జిస్తున్నాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అతడెవరంటే.. చెన్నైలోని మడిపాక్కంకి చెందిన ఏలుమలై శరత్‌బాబు తల్లి, నలుగురు తోబుట్టువులతో కలసి మురికి వాడలో జీవించేవాడు. తండ్రి మరణించడంతో తల్లే కుటుంబ జీవనాధారం. తనపై ఆధారపడిని ఐదుగురు పిల్లల కడుపు నింపేందుకు ఆమె రోజుకు మూడు ఉద్యోగాలు చేయాల్సి వచ్చేది. ఇక శరత్ తన తల్లికి మురికివాడలో ఇడ్లీలు అమ్మే విషయంలో సాయం చేస్తుండేవాడు. తనతల్లి పడుతున్న కష్టాన్ని దగ్గరగా చూసిన శరత్ బాగా చదువుని ఎట్టి పరిస్టితుల్లో నిర్లక్ష్యం చేయకూడదనే నిశ్చయానికి వచ్చేవాడు. ఎందుకంటే..? తల్లి గ్రాడ్యుయేట్ అయ్యుంటే ఏదో ఉద్యోగం చేసి పోషించగలిగేది ఇన్ని పాట్లు పడేది కాదు కదా అని బాధపడేవాడు. అందుకే అతడు తినడానికి తిండి లేని ఎన్నో రాత్రుళ్లు గడుపుతూ కూడా చదవడం మాత్రం మానలేదు. అలా పదోతరగతిలో క్లాస్ టాపర్‌గా నిలిచి మంచి మార్కులతో పాసయ్యాడు. ఆ తర్వాత ప్రభుత్వ కాలేజ్‌లో ఇంటర్ పూర్తి చేసి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీలో సీటు సంపాదించుకున్నాడు. కానీ అతనికి ఆంగ్లంలో మంచి ప్రావిణ్యం లేకపోవడంతో స్నేహితుల ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా తన చదువును సాగించాడు. అలా బిట్స్ పిలానీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. వెంటనే క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే పోలారీస్ అనే కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు సరిగ్గా 30 నెలలు పనిచేసి ఇంటి అప్పులన్నీ తీర్చేశాడు. ఆ తర్వాత ఎంబీయే చేయాలనే ఆశ కలిగింది. దీంతో పోలారీస్లో ఉద్యోగం చేస్తూనే క్యాట్‌కి ప్రీపేరయ్యాడు. అలా మొదటి ప్రయత్నంలో విఫలమైన చివరికీ క్యాట్ ఉత్తీర్ణుడై అహ్మదాబాద్ ఐఐఏంలో ఎంబీఏలో చేరాడు. అక్కడ హాస్టల్ మెస్ కార్యదర్శి పదవికి ఎంపికయ్యాడు. ఇదే అతడికి ఆహారాన్ని తయారు చేసే సంస్థను నిర్వహించడం ఎలా అనేదానిపై అవగాహన ఏర్పడేలా చేసింది. ఇక విజయవంతంగా ఎంబీఏ పూర్తి చేసిన వెంటనే లక్షల ప్యాకేజీలతో ఎన్నో కార్పోరేట్ ఉద్యోగాలు వచ్చినా అటువైపుకి అసలు వెళ్లలేదు. తనలాంటి నిరుపేద యువకులకు ఉపయోగపడాలనుకున్నాడు. అందుకోసం కేవలం రూ. 2000 రూపాయలు పెట్టుబడితో ఫుడ్ కింగ్ అనే క్యాటరింగ్ సర్వీస్ మొదలుపెట్టాడు. తాను పెరిగిన మురికివాడలోనే ఓ చిన్న హోటల్ పెట్టాడు. తనలాంటి పేద యువకులని ఉద్యోగస్తులుగా పెట్టుకున్నాడు. మొదట్లో కార్పొరేట్ సంస్థలకు, బ్యాంకులకు వండి సరఫరా చేసేవాడు. ఆ తర్వాత ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వడం కూడా మొదలుపెట్టాడు. చెన్నైతో మొదలైన ఫుడ్ కింగ్ ప్రయాణం హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్ కూడా విస్తరించింది. ఇప్పుడు ఎనిమిది కోట్ల టర్నోవర్‌తో వ్యాపారాన్ని చేస్తున్నాడు. దాదాపు 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాడు. ఆ 200 మంది కూడా తనలా మురికివాడలో పెరిగిన వారే. బాల్యమంతా కటిక దారిద్య్రం మధ్యే గడిచింది. ఆ క్రమంలో లెక్కలేనన్ని అవమానాలు, చీత్కారాలు అనుభవించాడు. ఓ పక్క ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో భయాన కష్టాలు, సమస్యలు చవి చూశాడు. అయినప్పటికీ ఎన్నడూ బాబోయ్! నావల కాదని పారిపోలేదు, ఆత్మహత్య చేసుకోలేదు. తన కుటుంబాన్ని ఎలాగైన ఈ కష్టం నుంచి గట్టేక్కిస్తే చాలని తప్పన పడ్డాడు. అందుకు చదువొక్కటే మార్గం అని భావించాడు. కటిక దారిద్య్రాన్ని భరిస్తూనే ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. పైగా తన మూలలను మర్చిపోకుండా తనలాంటి వారికే జీవనోపాధి కల్పించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు శరత్ బాబు. ఇతడి కథ సమస్యలతో ఎలా పోరాటం చేయాలో నేర్పిస్తుంది. పైగా అచంచలంగా కష్టపడితే ఎప్పటికైన ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని చాటి చెబుతోంది కదూ.! (చదవండి: నటుడు అర్జున్ బిజ్లానీకి అపెండిసైటిస్ సర్జరీ! ఇది ఎందుకొస్తుందంటే..!) -
మరో ముస్లిం దేశంలో హిందూ దేవాలయం.. త్వరలోనే నిర్మాణం!
యూఏఈలోని అబుదాబిలో నిర్మితమైన మొదటి హిందూ దేవాలయం బుధవారం (ఫిబ్రవరి 14)నాడు ప్రారంభమయ్యింది. బీఏపీఎస్ నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇప్పుడు అబుదాబి తర్వాత మరో ముస్లిం దేశంలోనూ హిందూ దేవాలయం నిర్మితం కాబోతోంది. ఇందుకోసం ఆ దేశ రాజు నుంచి భూమిని విరాళంగా అందించారు. ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. యూఏఈ తర్వాత మరో ముస్లిం దేశమైన బహ్రెయిన్‌లో హిందూ దేవాలయాన్ని నిర్మించనున్నారు. ఈ ఆలయం కూడా అబుదాబిలో నిర్మితమైన దేవాలయం మాదిరిగానే ఉండనుంది. ఈ ఆలయాన్ని బోచాసన్ నివాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ(బీఏపీఎస్) నిర్మించబోతోంది. ఈ నేపధ్యంలో బీఏపీఎస్ ప్రతినిధి బృందం బహ్రెయిన్ పాలకునితో సమావేశమైంది. ఆలయం కోసం బహ్రెయిన్ ప్రభుత్వం భూమిని కేటాయించింది. దీంతో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడానికి సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి భూమిని కేటాయించినట్లు స్వయంగా ప్రకటించారు. దీనికి ముందు స్వామి అక్షరతి దాస్, డాక్టర్ ప్రఫుల్ల వైద్య, రమేష్ పాటిదార్, మహేష్ దేవ్‌జీ తదితరులు ఆలయ నిర్మాణం విషయమై చర్చించేందుకు బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్‌ను కలిశారు. అన్ని మతాల ప్రజలను స్వాగతించడం, వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రోత్సహించడం తమ ఉద్దేశమని బీఏపీఎస్ పేర్కొంది. బహ్రెయిన్‌లోని హిందూ ఆలయ నిర్మాణానికి భూమిని ఇచ్చినందుకు భారత ప్రధాని మోదీ.. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు, మత సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. -
Pillala Katha: ఎవరు నిజాయితీ పరుడు?
సింహగిరిని హిమవంతుడు పాలించేవాడు. ఒకరోజు ఆ రాజు.. మంత్రి వసంతుడితో ‘ఉద్యానవనంలో కొత్తగా చేరిన పది మంది పనివాళ్లలో ఎవరు నిజాయితీపరుడో తెలుసుకోవాలని ఉంది మంత్రివర్యా! అందుకు వజ్రాలను వారికి దొరికేలా చేద్దాం. వాటికి ఆశపడని వాడే నిజాయితీపరుడు. ఏమంటారు?’ అని అడిగాడు. ‘అలాగే మహారాజా.. మీరన్నట్టే చేద్దాం! నిజాయితీపరుడెవరో తేలుతుంది’ అన్నాడు మంత్రి. మరుసటిరోజే మంత్రితో చెప్పి ఉద్యానవనంలో కొత్తగా చేరిన పది మందీ పనిచేసే ప్రాంతంలో ఒక్కొక్కరికీ ఒక్కో వజ్రం దొరికేలా ఏర్పాటు చేయించాడు రాజు. ఒక గంట తరువాత ఉద్యానవనం చూసుకునే అధికారి ఆ పది మందినీ పిలిచి ‘పొరపాటున ఉద్యానవనంలో పది వజ్రాలు పడిపోయాయి. దొరికిన వాళ్లు వాటిని తీసుకెళ్లి రాజు గారికి ఇస్తే వారికి రాజు గారు ఐదు వెండి నాణేలు ఇస్తారు’ అని చెప్పాడు. అది విన్న పది మందిలో తొమ్మిది మంది అతి సులువుగా ఒక్కో వజ్రాన్ని స్వంతం చేసుకున్నారు. వారిలో ఒకడు ‘మనమేమన్నా పిచ్చివాళ్లమా? వజ్రానికి వెండి నాణేలు తీసుకోవడానికి? మనకు దొరికిన వజ్రాన్ని అమ్ముకుంటే ఎంతో ధనం వస్తుంది’ అన్నాడు. ‘అవునవును’ అన్నారు మిగతావారు. అందరూ మాట్లాడుకుని నేరుగా బంగారు అంగడి భూషయ్య వద్దకు బయలుదేరారు. పదవ వాడైన రామయ్య వద్దకు ఆ అధికారి వచ్చి ‘నేను వజ్రాల గురించి చెబుతున్నా వినకుండా నీ పాటికి నువ్వు పనిచేసుకుంటూ పోతున్నావేంటీ’ అని కసురుకున్నాడు. ‘నాకు పని ముఖ్యం. పనైపోయాక విరామ సమయంలో వెతుకుతాను’ అని బదులిచ్చాడు రామయ్య. అన్నట్టుగానే రామయ్య.. విరామ సమయంలో భోజనం చేసి వజ్రాన్ని వెతికి తీసుకెళ్లి ‘మహారాజా! ఇదిగోండి నాకు దొరికిన వజ్రం’ అంటూ రాజుకు ఇచ్చి ‘తోటలో పని ఉంది’ అంటూ వెంటనే వెళ్లిపోయాడు. దారిలో తొమ్మిది మందిలో ఒకడు ‘ఉద్యానవనంలో పనికి మనకిచ్చే జీతం చాలా తక్కువ. అందుకే ఈ వజ్రాన్ని అమ్మితే వచ్చే ధనంతో నేను పొరుగు దేశం వెళ్లి వ్యాపారం చేసుకుంటాను’ అన్నాడు. మరొకడు ‘పంట పొలం కొంటాన’న్నాడు. ఇలా మిగిలిన వాళ్లూ తమ తమ ఆలోచనలను పంచుకుంటూ భూషయ్య అంగడికి చేరుకున్నారు. వజ్రాలు అమ్మడానికి వచ్చామంటూ భూషయ్యకు తమ దగ్గరున్న వజ్రాలను ఇచ్చారు. వాటిని పరీక్షించిన భూషయ్య ‘ఇవి వజ్రాలు కావు. నాసిరకం రంగు రాళ్లు. నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావు’ అని తేల్చాడు. ‘ఒరే! మనం పొరబడ్డాము. తిన్నగా కోటకు వెళ్లి వీటిని రాజు గారికి ఇచ్చి వెండినాణేలు దక్కించుకుందాము’ అన్నాడు వారిలో ఒకడు. ‘అవునురా’ అంటూ వంత పాడారు మిగిలిన వాళ్లు. వెంటనే కోటకు పయనమయ్యారు. రాజు గారి కొలువుకు చేరుకొని ‘మహారాజా! ఇవిగోండి.. మాకు దొరికిన వజ్రాలు’ అంటూ ఆ తొమ్మండుగురూ వాటిని రాజుకిచ్చారు. ‘మీకు భోజన సమయానికి ముందు వజ్రాలు దొరికితే.. అవి అసలైనవనుకుని అమ్మడానికి భూషయ్య వద్దకు వెళ్లారు. అక్కడవి నకిలీవని తేలగానే ఇటు వచ్చారు కదా’ అని గద్దించాడు రాజు. సమాధానమివ్వలేక పోయారు వాళ్లు. ‘రామయ్య ఒక్కడే పని చూసుకుని వజ్రం దొరికిందని ఇచ్చి వెళ్ళాడు. మీలో నిజాయితీపరుడు ఎవరో తెలుసుకోవడం కోసం నేను ఆడిన నాటకం ఇది’ అన్నాడు రాజు. ‘నిజాయితీతో పని చేయలేని మీ అందరినీ మహారాజు గారు కొలువు నుండి తొలగిస్తున్నారు. మీరు పక్షం రోజులు పనిచేసినా మాసం జీతం ఇస్తున్నారు. తీసుకుని వెళ్ళండి’ అన్నాడు మంత్రి. తరువాత రామయ్యను పిలిచి ‘వృత్తికి విలువ ఇచ్చిన తరువాతనే నిజాయితీగా వజ్రం తెచ్చి ఇచ్చావు. అన్న మాట ప్రకారం నీకు ఐదు వెండినాణేలు ఇవ్వాలి. కానీ పది బంగారు నాణేలు ఇస్తున్నాను’ అన్నాడు రాజు. ‘మహారాజా! నాది కానిది పూచిక పుల్ల కూడా నాకు అవసరం లేదు. దొరికిన వజ్రం మీకు తెచ్చిచ్చాను. నాకిచ్చిన కొలువు బంగారం కంటే విలువైనది. మీరిచ్చే జీతం నాకు చాలు’ అని వందనం చేసి వెళ్లిపోయాడు రామయ్య. మరొక్కమారు రామయ్య నిజాయితీని ప్రశంసించి ‘చూశారుగా మంత్రీ.. మన పథకం ఎలా పారిందో!’ అన్నాడు రాజు గర్వంగా. ‘అవును మహారాజా!’ అన్నాడు మంత్రి మెచ్చుకోలుగా! - యు.విజయశేఖర రెడ్డి -
300 కార్లు, ప్రైవేట్ ఆర్మీ, సొంత జెట్స్ ఇంకా...కళ్లు చెదిరే మలేషియా కింగ్ సంపద
మలేషియా కొత్త రాజుగా బిలియనీర్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ (65) సింహాసనాన్ని అధిష్టించారు. దక్షిణ జోహోర్ రాష్ట్రానికి చెందిన సుల్తాన్ మలేసిమా 17వ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ సందర్బంగా ఆయనకు సంబంధించిన ఆస్తులు, ఇతర సంపదపై ఆసక్తి నెలకొంది. మలేషియాలో ఇప్పటికీ ప్రత్యేకమైన రాచరిక వ్యవస్థ అమల్లో ఉంది. తొమ్మిది రాజకుటుంబాల అధిపతులు ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒక సారి రాజుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరిని ‘‘యాంగ్ డి-పెర్టువాన్ అగోంగ్’’ అని పిలుస్తారు. దేశ రాజధాని కౌలాలంపూర్ లోని నేషనల్ ప్యాలెస్‌లో సుల్తాన్ ఇబ్రహీం.. ఇతర రాజకుటుంబాలు, ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం , క్యాబినెట్ సభ్యుల సాక్షిగా జరిగిన వేడుకలో పదవీ బాధ్యతలు చేపట్టారు. దేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన సుల్తాన్ ఇబ్రహీం రియల్ ఎస్టేట్ నుండి టెలికాం , పవర్ ప్లాంట్ల దాకా విస్తృతమైన వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి 5.7 బిలియన్ల డాలర్ల సంపద అతని సొంతం. బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసిన కుటుంబ సంపద 5.7 బిలియన్లు డాలర్లుగా అంచనా వేసినప్పటికీ, సుల్తాన్ నిజమైన సంపద అంతకు మించి ఉంటుందని భావిస్తారు. రియల్ ఎస్టేట్ , మైనింగ్ నుండి టెలికమ్యూనికేషన్స్ , పామాయిల్ వరకు అనేక వ్యాపారాల ద్వారా అపార సంపద అతని సొంతం. ముఖ్యంగా మలేషియా ప్రధాన సెల్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన ‘యూ’ మొబైల్లో 24శాతం వాటాతో పాటు, ఇతర అదనపు పెట్టుబడులూ ఉన్నాయి. అతని అధికారిక నివాసం ఇస్తానా బుకిట్ సెరీన్, సుల్తాన్ న కుటుంబ సంపదకు నిదర్శనం. అడాల్ఫ్ హిట్లర్ బహుమతిగా అందించినదానితో సహా ఇతనికి 300కు పైగా లగ్జరీ కార్లున్నాయి. గోల్డెన్, బ్లూ కలర్బోయింగ్ 737తో సహా, ఇతర ప్రైవేట్ జెట్లున్నాయి. వీటిన్నిటితోపాటు అతని ప్రైవేట్ సైన్యం కూడా విశేషంగా నిలుస్తోంది. సింగపూర్‌లో 4 బిలియన్ల డాలర్ల విలువైన భూమి ఉంది. ఇంకా షేర్లు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు కూడా పెద్ద ఎత్తునే ఉన్నాయి. సుల్తాన్ పెట్టుబడి పోర్ట్‌ఫోలియో మొత్తం 1.1 బిలియన్ డాలర్లు ఉంటుందట. సుల్తాన్ సింహాసనాన్ని అధిష్టించిన క్రమంలో దేశాభివృద్ధి, ఇతర దేశాలతో సంబంధాలు ఎలా ఉంటాయనేది పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యంగా మలయ్ కమ్యూనిటీకి గేట్ కీపర్, అతను చైనీస్ వ్యాపారవేత్తలతో జాయింట్ వెంచర్ల ద్వారా ప్రధాన ప్రాజెక్టులలో కీలక పాత్ర పోషించిన సుల్తాన్ రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టించాడనీ, తన పూర్వీకుల మాదిరిగా కాకుండా, సుల్తాన్ ఇబ్రహీం విభిన్నంగా ఉంటాడని అంచనా. సింగపూర్ బిజినెస్ టూకూన్స్తో సన్నిహిత సంబంధాలు, ప్రముఖ చైనీస్ డెవలపర్లతో వ్యాపార అనుబంధం లాంటివి దేశీయ, విదేశాంగ విధానంతోపాటు, దేశ ఆర్థికరంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయంటున్నారు విశ్లేషకులు. -
డెన్మార్క్ రాజుగా పదో ఫ్రెడరిక్
కోపెన్‌హేగెన్: డెన్మార్క్ రాజ సింహాసనాన్ని పదో ఫ్రెడరిక్ ఆదివారం అధిష్టించారు. రాణి రెండో మార్గరెట్ (83) అనారోగ్య కారణాలతో సింహాసనం వీడుతున్నట్లు కొత్త సంవత్సరం మొదటి రోజే ప్రకటించారు. 900 ఏళ్ల డెన్మార్క్ రాచరిక చరిత్రలో రాజు స్వచ్ఛందంగా సింహాసనం వీడటం ఇదే తొలిసారి. రాజధాని కోపెన్‌హేగెన్‌లోని జరిగిన కేబినెట్ సమావేశంలో సింహాసనం నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపే పత్రంపై రాణి సంతకం చేశారు. తర్వాత ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్ రాజభవనం బాల్కనీ నుంచి పదో ఫ్రెడరిక్‌ను రాజుగా ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాజభవనం వెలుపల వేలాది మంది గుమికూడారు. ‘గాడ్ సేవ్ ది కింగ్’అని చెబుతూ రాణి అక్కడి నుంచి ని్రష్కమించారు. రెండో మార్గరెట్‌తో పాటు ఆస్ట్రేలియా మూలాలున్న ఫ్రెడరిక్ భార్య క్వీన్ మేరీ రూపంలో డెన్మార్క్‌కు ఇద్దరు రాణులుంటారు. ఫ్రెడరిక్, మేరీల పెద్ద కుమారుడు క్రిస్టియన్ (18) యువరాజు హోదాతో సింహాసనానికి వారసుడయ్యారు. డెన్మార్క్ రాజరికం యూరప్‌లోనే అత్యంత పురాతనమైంది. 10వ శతాబ్దంలో వైకింగ్ రాజు గోర్డ్ ది ఓల్డ్ కాలం నుంచి అప్రతిహతంగా కొనసాగుతోంది. 1146లో అప్పటి డెన్మార్క్ రాజు మూడో ఎరిక్ లామ్ స్వచ్ఛందంగా సింహాసనం నుంచి వైదొలిగి, సన్యాసం తీసుకున్నారు. డెన్మార్క్ రాజుగా తొమ్మిదో ఫ్రెడరిక్ 1947 నుంచి 1972వరకు కొనసాగారు. ఆయన అకస్మాత్తుగా చనిపోవడంతో ఆయన కుమార్తె రెండో మార్గరెట్ సింహాసనం అధిíÙ్ఠంచారు. దాదాపు 52 ఏళ్లపాటు రాణిగా కొనసాగారు. -
పండుగకు నా సామిరంగను ఆదరించండి..!
-
పిల్లల కథ -‘తెలిసొచ్చింది మహా ప్రభో’
మధిర రాజ్యాన్ని పాలిస్తున్న రాజు భీమశంకరుడు మంచి పరిపాలనాదక్షుడు. రాజ్యాన్ని చక్కగా పాలిస్తుండేవాడు. కానీ రాజ్యంలోని ప్రజల్లో చాలామంది సోమరిపోతులు! బద్ధకంతో ఏ పనీ చేయకుండా ఉండేవారు. ఆ బద్ధకాన్ని పోగొట్టడానికి ఎన్ని విధాల ప్రయత్నించినా లాభం లేకపోయింది.ఒకరోజు రాజ్యంలోకి ఒక సాధువు వచ్చాడని అతని వద్దకు అందరూ వెళుతున్నారని.. ఎవరికి ఏ సమస్య ఉన్నా వారికి అతను తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నాడని రాజుకు తెలిసింది. మారువేషంలో అతని దగ్గరకు వెళ్లి.. సలహా తీసుకురమ్మని మంత్రిని ఆదేశించాడు. మారువేషంలో మంత్రి సాధువు వద్దకు వెళ్లి ‘ప్రణామాలు సాధుపుంగవా! మా రాజ్యంలో చాలామంది బద్ధకస్తులున్నారు. ఎన్ని విధాల ప్రయత్నించినా వారు మారడంలేదు. దాంతో వారి విషయంలో మా రాజుగారు విరక్తి చెందారు. ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయగలరు’ అని ప్రార్థించాడు. ‘దీనికి పరిష్కారం ఉంది’ అంటూ మంత్రి చెవిలో ఏదో చెప్పాడు ఆ సాధువు. ఆ విషయాన్ని రాజుకు చెప్పాడు మంత్రి. ‘సాధువు చెప్పినట్లుగా చేయండి’ అని మంత్రిని ఆదేశించాడు రాజు. ‘అలాగే రాజా’ అని చెప్పి.. ‘రాబోవు దసరా పండుగనాడు ప్రతి ఇంట్లోని మగవారి కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. కనుక దసరా రోజున పురుషులంతా.. మన రాజ్యం నడి బొడ్డునున్న సమావేశ ప్రాంగణానికి హాజరు కావలెను. వచ్చేటప్పుడు ప్రతిఒక్కరూ ఒక సంచి, ఒక పొడవాటి కర్ర తెచ్చుకొనవలెను’ అని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విన్న ప్రజలకు.. సంచి, కర్ర ఎందుకు తెచ్చుకోమన్నారో అర్థం కాలేదు. దసరా రానే వచ్చింది. ఆ రోజు పురుషులందరూ సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. కానీ బద్ధకస్తులు చాలామంది సంచి, కర్ర, తెచ్చుకోకుండానే వచ్చారు. రాజు.. అక్కడికి వచ్చిన వారినుద్దేశించి ‘మన రాజ్యంలో ఇప్పటి నుంచి కొత్త విధానాన్ని అవలంబించబోతున్నాం. అందులో భాగంగా మీరందరూ.. తెచ్చుకున్న సంచి, కర్రతో మన రాజ్యానికి ఉత్తరాన ఉన్న అడవిలోకి వెళ్లి.. కర్రతో అక్కడ చెట్లకున్న పండ్లను కొట్టి.. సంచిలో నింపుకొని రావాలి. ఇప్పుడే బయలుదేరి మీకప్పగించిన పని ముగించుకుని సాయంకాలానికల్లా మళ్లీ ఇదే ప్రాంగణానికి రావాలి’ అని చెప్పాడు. చిత్తం అంటూ బయలుదేరారంతా. సంచి,కర్రలు ఉన్నవాళ్లు పండ్లను కొట్టి.. సంచి నింపుకొని వచ్చారు. వాటిని తీసుకెళ్ళని బద్ధకస్తులు చేతికి అందిన కొన్ని పండ్లను మాత్రమే తెంపుకొని వారు వేసుకున్న చొక్కా లేదా కండువాలో కట్టుకొని వచ్చారు. సంచులు, కర్రలు తెచ్చుకున్న వారిని సంచితో సహా ఇంటికి వెళ్ళమన్నారు. అలా తీసుకురాని వారందరినీ వారం రోజులపాటు చెరసాలలో బంధించాలని ఆదేశించారు. వెంటనే రాజ భటులు వారందరినీ తీసుకెళ్లి ఒకొక్కరిని ఒక్కో గదిలో బంధించారు. బద్ధకం వల్ల వారు సంచి, కర్రను తీసుకెళ్లనందువల్ల వారు అడవి నుంచి తక్కువ పండ్లను తీసుకురావాల్సి వచ్చింది. చెరసాలలో ఉన్న వారం రోజులూ వారు ఆ పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలని.. బయట నుంచి వారికి ఇతర ఆహారమేమీ ఇవ్వకూడదని భటులను ఆదేశించారు. దాంతో వాళ్లకు ఆ పండ్లు రెండు రోజులకే సరిపోయాయి. మిగిలిన రోజుల్లో ఆకలితో అలమటించారు. బద్ధకించకుండా తామూ సంచి, కర్ర తీసుకువెళ్లి ఉంటే ఈ రోజు తమకు ఆ దుస్థితి పట్టేది కాదని మథన పడ్డారు. తిండి లేక నీరసించిన వాళ్లను చెరసాల నుంచి బయటకి తీసుకొచ్చారు. అప్పుడు వారినుద్దేశించి రాజు ‘ఇప్పటికైనా మీరు చేస్తున్న తప్పును గమనించారా? మనం ఏ పని చేసినా బద్ధకం లేకుండా మన పూర్తి శక్తిని కేంద్రీకరించి చేయాలి. అలా చేయకపోతే దాని పరిణామం ఇదిగో ఇలా ఉంటుంది’ అన్నాడు. వెంటనే వాళ్లంతా ‘క్షమించండి రాజా! తప్పు తెలుసుకున్నాం. ఇప్పటి నుంచి బద్ధకాన్ని వీడి కష్టపడి పనిచేస్తాం’ అన్నారు ముక్తకంఠంతో. ఏదైనా పని చేసుకోవడానికి వారందరికీ కొంత ధనం ఇప్పించి పంపించేశాడు రాజు. ఆ డబ్బుతో ఎవరికి వచ్చిన పనిని వారు చేసుకుంటూ రాజ్యాభివృద్ధిలో పాలుపంచుకోసాగారు. ఆ తర్వాత రాజ్యంలో బద్ధకస్తుల జాడే లేకుండా పోయింది. - ఏడుకొండలు కళ్ళేపల్లి -
ఈ వారం పిల్లల కథ - ‘దత్తత’
బ్రహ్మపుత్రా నది మధ్యలో ఉన్న మాజాలీ ద్వీపంలోని మంజీరా అడవికి రాజు కృపి. ఆ అడవిలోని జంతువులన్నిటికీ కృపి అంటే ఎంతో గౌరవం. ఉన్న లోటల్లా కృపికి పిల్లలు లేకపోవడమే. ‘నా తరువాత ఈ అడవిని పాలించే రాజు లేకపోతే జంతువుల పరిస్థితి ఏమిటీ?’ అంటూ దిగులుచెందుతూ ఎప్పుడూ అదే ఆలోచనలో ఉండేది. ఒకరోజు.. ఆ అడవిలోనే ఉండే కరటం అనే కాకి ‘మృగరాజా.. ఆహార వేట కోసం నేను వెళ్లే పల్లెల్లో.. పిల్లలు లేనివాళ్ళు మరొకరి పిల్లలను తెచ్చి పెంచుకుంటుంటారు. దాన్ని దత్తత అంటారట. అలాగే మీరు కూడా ఎవరినైనా పెంచుకుంటే ఈ సమస్య తీరుతుంది’ అంది. అక్కడే ఉన్న ఎలుగుబంటి ‘ఓ కరటం.. నీకు మతి పోయిందా? పక్కవాళ్ల పిల్లలను తెచ్చి పెంచుకోవడానికి మానవులంతా ఒకేలా ఉంటారు కాబట్టి సాధ్యపడుతుంది. కానీ ఇక్కడ మనం వేరు వేరు జంతువులం. పిల్లి పిల్లను తెచ్చి మృగరాజు పెంచుకుంటుందా ?’ అంది. ‘మరైతే ఎలా ఈ సమస్య తీరేది?’ అంటూ కలతచెందింది కరటం. అక్కడే చెట్టు మీద ఉన్న గద్ద ‘మహారాజా.. దిగులుపడకండి. నేను అనేక అడవులు తిరుగుతాను. ఎక్కడైనా సింహం పిల్లలుంటే మీకు చెబుతాను. అప్పడు దత్తత గురించి ఆలోచించవచ్చు’ అంది. ‘ఈ ఆలోచన బాగుంది. అయితే ఈ రోజు నుండే వెతకడం మొదలుపెట్టు’ అంది ఎలుగుబంటి. అలా వెళ్ళిన గద్ద పక్కనున్న అడవులన్నిటినీ గాలించడం మొదలుపెట్టింది. నదీ తీరంలో దానికి ఓ పావురం కలసింది. ‘నిన్నటి నుండి చూస్తున్నా .. ఆహారం కోసం కాకుండా నువ్వు దేనికోసమో వెతుకుతున్నట్టున్నావ్?’ అని అడిగింది. ‘అవును’ అంటూ తన రాజు గురించి, ఆయన బాధ గురించి చెప్పింది గద్ద. ‘ఉయ్యాల్లో పిల్లను పెట్టుకుని ఊరంతా వెదికినట్టుంది. మన పక్కనున్న కంజీరా అడవి రాణికి రెండు మగ పిల్లలు పుట్టాయి. జాగ్రత్తగా ప్రయత్నిస్తే మీ రాజు ఆశ ఫలించవచ్చు’ అంది పావురం. వెంటనే గద్ద కంజీరా అడవి వైపు ఎగిరి అక్కడి రాణి బిడ్డలను చూసింది. ముద్దుగా ఉన్నాయి. దయతలచి ఒక పిల్లనిస్తే భవిష్యత్తులో తమకు రాజు లేడనే లోటుండదు అనుకుంది. ఆ ఆలోచనతోనే తన అడవికి వెళ్లి రాజు సహా అక్కడి జంతువులన్నిటికీ తను చూసిన విషయాన్ని చెప్పింది. ‘మహారాజా .. ఒక తల్లి నుండి పిల్లను తేవడం చిన్న విషయం కాదు. చాకచక్యంగా వ్యవహరించి సాధించాలి’ అంది కరటం. ‘అవును.. మహారాజా! నానొక ఆవకాశం ఇవ్వండి. యువరాజును తీసుకొస్తా!’ అంది ప్రవాళం అనే కుందేలు. ‘అది నీవల్ల అయ్యే పనికాదు’ అని కుందేలును విదిలించి ‘మహారాజా.. ఆ అవకాశం నాకు ఇవ్వండి. నేను తీసుకొస్తా’ అంది త్రిశిర అనే నక్క. ‘అవును.. మహారాజా! త్రిశిర తెలివైనది. అవసరమైతే తన దొంగ తెలివితేటలనూ ఉపయోగించి పని పూర్తి చేయగలదు కూడా!’ అంది ఎలుగుబంటి. అలా మృగరాజు దగ్గర అనుమతి తీసుకుని కంజీరా అడవికి బయలుదేరింది త్రిశిర. కొంత దూరంలో దానికి ఓ తోడేలు జత కూడింది. రెండూ కలసి కంజీరా అడవికి చేరుకున్నాయి. రెంటికీ ఆకలి దంచేయసాగింది. ఎక్కడైనా ఆహారం దొరికితే బాగుండు అనుకున్నాయి. కొద్దిదూరంలోనే బాగా బలిసిన అడవి కోడి కనిపించింది. పొట్టికాళ్ళు.. మెలితిరిగిన పంచరంగుల తోక.. నెత్తిమీద ఎర్రని జుట్టు.. దాన్ని చూడగానే నోట్లో నీళ్లూరాయి తోడేలుకు. ‘రాజు సంగతి తరువాత.. ముందు దీన్నో పట్టుపడదాం’ అంది త్రిశిరతో. ‘తొందరపడకు. ఇది మన అడవి కాదు. పైగా మనం ఓ ముఖ్యమైన పని మీద వచ్చాం’ హెచ్చరించింది త్రిశిర. ‘నిజమే పని చేయాలంటే ఓపిక కావాలి. నీరసంతో పని చేయలేం కదా! అయినా కోడిని కొడితే ఎవరూ పట్టించుకోరు!’ అంది తోడేలు. ఆ కోడి మీదకు దూకుదాం అని ఆ రెండూ అనుకునేలోపు చాలా జంతువులు నక్కను, తోడేలును చుట్టుముట్టాయి. ‘మా మృగరాజును నిద్రలేపే కోడి పుంజునే చంపుదామని వచ్చారంటే.. మీ కెంత ధైర్యం?’ అని బెదిరించాయ్. భయపడిపోయిన త్రిశిర ‘అమ్మబాబోయ్’ అంటూ పరుగు తీసింది. తోడేలూ దాన్ని అనుసరించింది. అలా బెదిరిపోయి వచ్చిన త్రిశిరను చడామడా తిట్టాయి జంతువులన్నీ! ‘మహారాజా.. ఈసారి నాకిచ్చి చూడండి అవకాశం’ అని మళ్లీ అడిగింది ప్రవాళం. ‘ఏ పుట్టలో ఏ పాముందో.. సరే’ అంటూ అనుమతిచ్చింది మృగరాజు. వెంటనే ప్రవాళం.. వైద్యుడు కోతి బావను కలసి సువాసన తైలం తీసుకుంది. దాన్ని ఆనప బుర్రలో పోసుకుని.. భుజాన వేసుకుని కంజీరా అడవికి బయలుదేరింది ప్రవాళం. కంజీరా రాజును కలసింది. చాలా వినయంగా ‘రాజా .. మీరు చాలా మంచివారని.. జంతువుల పట్ల స్నేహభావంతో మెలగుతారని తెలిసింది. మా మంజీరా మహారాజు మీ కోసం ఈ సువాసన తైలం పంపారు. దీన్ని మీ మెరుస్తున్న జూలుకు రాసుకుంటే మీ వయస్సే కనపడదు’ అంటూ మాటల్లో పెట్టింది. ‘భలే మాట్లాడుతున్నావే’ అంది కంజీరా మృగరాజు. కొంత స్థిమితపడ్డాక మెల్లగా ‘రాజా.. మీకిద్దరు బిడ్డలని తెలిసింది. ఒకరు ఈ అడవికి రాజయితే మరొకరు పక్కనున్న మంజీరా అడవికి రాజు కావచ్చు’ అన్నది ప్రవాళం. ‘పక్క అడవికి రాజా? అదెలా?’ అని ఆశ్చర్యపోయింది మృగరాజు. అప్పుడు ప్రవాళం తమ మృగరాజుకు పిల్లల్లేని విషయం చెప్పి, దత్తత గురించీ చెవిన వేసింది. అది విని ఆలోచనలో పడింది కంజీరా మృగరాజు. ‘ఈ కుందేలు చెప్పింది బావుంది. పక్క అడవినీ నా బిడ్డే ఏలుతాడంటే అంతకంటే ఇంకేం కావాలి! ఇక్కడుంటే రెండిటిలో ఒకటే రాజవుతుంది. రెండోది మంత్రో ఇంకేదో అధికారి కాగలదు అంతే. ఈ భేదం వల్ల భవిష్యత్తులో రెండిటి మధ్య విరోధమూ తలెత్తొచ్చు. కాబట్టి బిడ్డను దత్తతకు పంపడమే సరి. పైగా ఆ రాజుకు మంచి పేరే ఉంది. కనుక ఆ రాజు మాట మన్నించి చిన్న కొడుకును దత్తతకు పంపాలి’ అనుకుంది. ఆ విషయాన్ని రాణితోనూ చెప్పింది. రాణీ సరే అంది. ఆ రెండూ కలసి తమ చిన్న కొడుకును ప్రవాళంతో మంజీరా అడవికి సాగనంపాయి. అక్కడ మంజీరాలోని జంతువులన్నీ తమ చిన్న రాజుకు ఘన స్వాగతం పలికాయి. తెలివితో రాజు సమస్యను తీర్చిన ప్రవాళాన్ని ప్రశంసలతో ముంచెత్తాయి. అలా తనకు వారసుడు దొరికినందుకు మంజీరా మృగరాజూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. -కూచిమంచి నాగేంద్ర -
ఆర్టికల్ 370 పూర్వాపరాలు.. ఎందుకు రద్దు చేశారు?
భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని స్వతంత్రప్రతిపత్తి జమ్మూకశ్మీర్‌కు మాత్రమే ఉంది. ఈ ప్రత్యేకతకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 1947ఆగస్ట్ 15న భారత్, పాక్ స్వాతంత్య్రం పొందాయి. నాడు శ్రీనగర్‌ను ఆక్రమించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నగా భారత్ సాయం కోరిన జమ్మూకశ్మీర్ చివరి రాజు రాజా హరిసింగ్ కొన్ని షరతులు, ఒప్పందాలకు లోబడి 1948 అక్టోబర్ 27న కశ్మీర్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు. జమ్మూకశ్మీర్ ప్రధానిగా హేక్‌అబ్దుల్లాను (1949) భారత్ నియమించింది. 1949 అక్టోబర్ 17న.. రాజప్రతినిధిగా హరిసింగ్ కుమారుడు కరణ్‌సింగ్ ఉన్నారు. 1949 అక్టోబర్ 17న కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగసభ రాజ్యాంగంలో 370 ఆధికరణను చేర్చింది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని శాశ్వతంగా ఉంచాలని, తాత్కాలిక పద్ధతుల్లో హక్కులు ఇవ్వకూడదన్న అబ్దుల్లా వాదనను అప్పట్లో కేంద్రం పట్టించుకోలేదు. 1952లో జరిగిన ఢిల్లీ ఒప్పందంతో రాజరికం రద్దయింది. 1954లో 35ఏ నిబంధన జరిగింది. 1956లో జమ్మూకశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగానికి ఆమోదం లభించింది. చివరికి 370 అధికరణం ద్వారా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. అయితే ఈ ప్రత్యేకప్రతిపత్తిని రాజ్యాంగంలోని 368(1) అధికరణం ద్వారా సవరించే వెసులుబాటును కూడా రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 370 రూపకర్త.. ఒకప్పటి మద్రాస్ రాష్ట్రానికి చెందిన గోపాలస్వామి అయ్యంగార్ ఈ ఆర్టికల్ 370కు ప్రధాన రూపకర్త. 1937-43 కాలంలో జమ్మూకశ్మీర్ సంస్థానానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. 1947 అక్టోబర్‌లో కేంద్రంలో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో ఈయన కేంద్రమంత్రిగా పనిచేశారు. జమ్మూకశ్మీర్ వ్యవహారాలు ఈయనే చూసుకునేవారు. ఈయన సారథ్యంలోని బృందం 1948, 1952లో కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది. Photo Credits: LIVE LAW HINDI ఆర్టికల్ 370 అంటే.. భారత రాజ్యాంగంలోని 21వ భాగంలో ఉన్న ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి లభిస్తోంది. ఆ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అధికారాలూ, రాజ్యాంగం, జెండా అమల్లో ఉన్నాయి. ఇవన్నీ తాత్కాలిక ప్రాతిపదికన లభిస్తాయన్న నిబంధన కూడా ఉంది. ఈ ఆర్టికల్ ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, కమ్యూనికేషన్ల రంగాలపై మాత్రమే భారత ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన చట్టాలు మాత్రమే కశ్మీర్లో అమలు చేయగలదు. మిగిలిన రంగాల్లో ఏం చేయాలన్నా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. సమస్యలకు, వివాదాలకు నిలయం.. మొదటి నుంచి కశ్మీర్ సమస్యలకు, వివాదాలకు నిలయంగా మారింది. కశ్మీర్లో క్రయవిక్రయాలపై హక్కులు లేకపోవడం, ఉగ్రవాదుల దాడుల కారణంగా శాంతిభద్రతలు అదుపులో లేకపోవడంతో ఇన్నాళ్లూ పెద్ద కార్పొరేట్ కంపెనీలేవీ కశ్మీర్లో పెట్టుబడులు పెట్టడానికి సాహసించలేదు. స్థానిక రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో లబ్ధి చేకూరడానికి అనుగుణంగానే వ్యూహాలు రచించాయి. అధికారం ఎక్కువగా స్థానిక ప్రభుత్వం చేతుల్లోనే ఉండిపోవడంతో పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయి. మరొకవైపు ఉగ్రదాడులకు స్థావరంగా మారడంతో ప్రబుత్వానికి ఆర్టికల్ 370 రద్దు అనివార్యమైంది. ఎప్పుడైనా స్వతంత్రప్రతిపత్తి రద్దు.. ఆర్టికల్ 370లోని సెక్షన్ 3 ప్రకారం భారత రాష్ట్రపతి ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా కశ్మీర్‌కు ఇచ్చిన స్వతంత్రప్రతిపత్తిని రద్దు చేయడానికి అధికారాలున్నాయి. ఫలానా తేదీ నుంచి 370 రద్దు లేదంటే మార్పులు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వొచ్చు. ఈ నిబంధనతోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పక్కాగా వ్యూహాలు రచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం 370ని రద్దు చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. కానీ 370లో నిబంధన 3ని చాలా తెలివిగా వినియోగించుకున్న మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ నుంచి తప్పించుకుంది. ఆర్టికల్ 370 రద్దు ఇలా.. భారత రాజ్యసభలో ఆగస్ట్ 5, 2019న ఉదయం 11 గంటకు, లోక్‌సభలో 12 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆర్టికల్ 370 రద్దును ప్రకటించారు. నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అనుమతిని తెలుపుతూ గెజిట్ విడుదల చేయడంతో అధికారికంగా 370 అధికరణం రద్దు జరిగింది. 360 రద్దుతో 35ఏ ఆర్టికల్ కూడా రద్దవుతుంది. ఈ ఆర్టికల్ రద్దుతో జమ్మూకశ్మీర్‌లో ఢిల్లీ తరహా పాలన అమలులోకి వచ్చింది. -
మంత్ర ఖడ్గం!
పూర్వం ఉజ్జయినిని మహామల్లుడనే రాజు పాలించేవాడు. ఆయన పేరుకు తగ్గట్టే మహాయోధుడు. అయితే ఆయనకు ఒక చింత ఉండేది. ఒక్కగానొక్క కొడుకు మణిదీపుడు యుద్ధ విద్యలందు ఏమాత్రం ఆసక్తి చూపేవాడుకాదు. రాజ్యాన్ని కాపాడుకోవాలంటే రాజు తిరుగులేని యోధుడై ఉండాలి అని మహామల్లుడు కొడుక్కి ఎంతచెప్పినా ఫలితం ఉండేదికాదు. మణిదీపుడికి కష్టపడి యుద్ధవిద్యలు నేర్వడం ఇష్టంలేదు. చిన్నప్పుడు విన్న కథల్లోలాగ మంత్రఖడ్గాన్ని సంపాదించి దానితో విజయాలను అందుకోవాలని అతను కలలు కంటుండేవాడు. ఒకరోజు.. రాజుగారి దర్శనానికి ఒక సాధువు వచ్చాడు. తన బాధను సాధువుతో చెప్పాడు మహామల్లుడు. ‘దాని గురించి మీరు చింత పడకండి. మణిదీపుడిని నాతో పంపండి. అతని కోరిౖకైన మంత్రఖడ్గాన్ని ఇచ్చి పంపుతాను. కానీ దానిని ఉపయోగించాలంటే కనీస నైపుణ్యం ఉండాలి కదా! దాన్ని కూడా మణిదీపుడికి ఏమాత్రం కష్టంలేకుండా అతి తక్కువ సమయంలో నేర్పించి పంపిస్తాను’ అన్నాడు. మణిదీపుడి ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. ఇటు యుద్ధవిద్యలూ వస్తున్నాయి. అటు తాను కోరుకున్న మంత్రఖడ్గమూ లభిస్తున్నది. ఇంకేం కావాలి! సాధువు వెంట బయలుదేరి ఆశ్రమం చేరాడు. సాధువు తానే మణిదీపుడికి కత్తియుద్ధం నేర్పించడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోతున్న మణిదీపుడితో ‘సాధువుకి క్షత్రియవిద్యలు ఎలా తెలుసా అని ఆశ్చర్యపోతున్నావా? నేను వయసులో ఉన్నప్పుడు మనరాజ్య సైన్యంలో పనిచేశాను. వయసయ్యాక ప్రశాంత జీవితం గడపాలని ఆశ్రమం నిర్మించుకున్నాను. అయితే నావద్దకు వచ్చినవారికి కాదనకుండా క్షత్రియ విద్యలు నేర్పిస్తున్నాను’ అన్నాడు. ఆరోజు సాయంత్రం అభ్యాసం అయ్యాక మణిదీపుడి భుజంతట్టి ‘ఎంతో అనుభవం ఉన్నవాడిలా చేస్తున్నావు. నేననుకున్నదానికంటే ముందే యుద్ధవిద్యలు నేర్చుకోగలవు’ అంటూ ప్రశంసించాడు. మణిదీపుడి మీద సాధువు పొగడ్తలు బాగా పనిచేశాయి. ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. యుద్ధవిద్యలు కష్టం అనుకున్నాడు. కానీ అవి తేలికే అని గ్రహించాడు. యుద్ధవిద్యలన్నీ నేర్పి అతనిని తిరిగి రాజధానికి పంపే సమయంలో.. సాధువు మంత్రఖడ్గాన్ని ఇస్తూ ‘ఇది మా పూర్వీకులది. నేను సైన్యంలో పనిచేస్తున్నప్పటి నుండీ నా దగ్గర ఉంది. ఇది నీకు భవిష్యత్‌లో ఉపయోగపడుతుంది’ అన్నాడు. మణిదీపుడు ఆనందంగా రాజ్యం చేరుకున్నాడు. కొడుకు ప్రయోజకుడై వచ్చినందుకు మహామల్లుడు సంతోషించి పట్టాభిషేకం చేశాడు. రాజయ్యాక కూడా మణిదీపుడు రోజూ అభ్యాసం చేయకుండా ఉండలేకపోయేవాడు! కొంతకాలానికి పొరుగున ఉన్న కోసలరాజుకు దుర్బుద్ధి పుట్టింది. బాగా అభివృద్ధి చెందిన ఉజ్జయినిని జయించి తమ రాజ్యంలో కలుపుకోవాలని దాడిచేశాడు. తన వద్ద ఉన్న మంత్రఖడ్గంతో మణిదీపుడు యుద్ధరంగాన చెలరేగిపోయాడు. ఘన విజయం లభించాక సాధువుని కలసి ‘మీరు ప్రసాదించిన మంత్రఖడ్గం వల్ల ఇంతటి విజయం లభించింది!’ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. ‘విజయం ఖడ్గానిది కాదు. నీ నైపుణ్యానిది. యుద్ధవిద్యలంటే ఇష్టంలేని నీవు ఒకసారి వాటిని నేర్చుకోవడం ప్రారంభించాక నీలో ఎక్కడలేని ఆసక్తి కలిగింది. అది సహజం. ఏవిద్య అయినా నేర్చుకోవడం మొదలుపెడితే ఇక దానిని వదలబుద్ధికాదు. ఆ లక్షణమే నీకు యుద్ధంలో విజయం లభించేట్టు చేసింది. ఇందులో మంత్రతంత్రాల ప్రమేయం ఏమీలేదు. నీ మనసులో యుద్ధవిద్యల పట్ల ఆసక్తికలగడానికి నేను మంత్రఖడ్గం అనే అబద్ధం ఆడాను. అది మామూలు ఖడ్గమే! కృషిని నమ్ముకునేవారికి విజయం వెన్నంటే ఉంటుంది. ఈ విషయం ఎప్పుడూ మరిచిపోకు’ అన్నాడు. ఆ సాధువు మణిదీపుడిని వెంటబెట్టుకుని మహామల్లుడి వద్దకు వచ్చాడు. ‘ప్రభూ! మీరు నన్ను మన్నించాలి. మణిదీపుడు యుద్ధవిద్యల పట్ల ఆసక్తి చూపడం లేదని మీరు బాధపడుతున్నారని తెలిసి నేను సాధువుగా మీ వద్దకు వచ్చి మంత్రఖడ్గం పేరుతో మణిదీపుడ్ని ఆకర్షించి యుద్ధవిద్యల్లో ఆరితేరేట్టు చేశాను. ఒకప్పుడు నేను మీ సైన్యంలో పనిచేసి మీ ఉప్పు తిన్నవాణ్ణి. ఆ కృతజ్ఞత కొద్దీ మీ బాధ తీర్చాలని భావించాను. సాధువుగా వచ్చి పరదేశినని అబద్ధం చెప్పాను. నేను చేసిందాంట్లో ఏదైనా తప్పుంటే మన్నించండి’ అన్నాడు సాధువు. దానికి మహామల్లుడు ఆనందిస్తూ ‘మీ స్వామిభక్తి ఆశ్చర్య పరుస్తున్నది. మీలాంటివారు ఆస్థానంలో ఉండాలి. ఇకమీదట మీరు మా ముఖ్య సలహాదారునిగా ఉండి రాజ్యరక్షణలో మీ శిష్యునికి తోడ్పడండి’ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. సాధువు సంతోషంగా అంగీకరించాడు. -డా. గంగి శెట్టి శివకుమార్ -
ప్రపంచంలో బడా భూస్వామి ఎవరు?
ఆ ప్రముఖునికి ప్రపంచంలో అత్యధిక భూములున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు, అడవులు, పట్టణ ప్రాంతాల్లో పలు భూములు, ఇళ్లు, విలాసవంతమైన మార్కెటింగ్ సముదాయాలు అతని సొంతం. సముద్ర తీరప్రాంతాలలో కూడా అతనికి ఆస్తులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అతనికున్న భూములు, ఆస్తులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక కంపెనీనే ఉంది. ఈ అపార ఆస్తిపాస్తులు బ్రిటన్ రాజకుటుంబానికి సొంతం. వీటికి యజమాని బ్రిటన్ రాజు చార్లెస్- III. అతని తల్లి క్వీన్ ఎలిజబెత్- II మరణం తరువాత కింగ్ చార్లెస్ ప్రపంచంలోనే భారీ ఆస్తిపాస్తులకు యజమానిగా మారారు. ఇతను బతికి ఉన్నంత వరకూ ఈ ఆస్తిని అతని సొంత ఆస్తిగా పరిగణిస్తారు. దీనికి అతను ప్రైవేట్ యజమాని కాదు. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ప్రిన్స్ చార్లెస్ ప్రపంచవ్యాప్తంగా 6.6 బిలియన్ ఎకరాల భూమి, విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. ఈ భూములు గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాలలోనూ ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం సంపదలో 16.6 శాతం ఈ బ్రిటిష్ రాజుకు చెందినదేని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ది క్రౌన్ ఎస్టేట్ అనే సంస్థ ఈ ఆస్తిపాస్తులను పర్యవేక్షిస్తుంది. ఈ బ్రిటీష్ రాజుకు ఒక లక్షా 15 వేల ఎకరాల వ్యవసాయ, అటవీ భూములున్నాయి. వీటితోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల విలువైన భూములు, ఆస్తులు, బీచ్‌లు, మార్కెట్లు, నివాస స్థలాలు, కార్యాలయ సముదాయాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో క్రౌన్ ఎస్టేట్ వివిధ షాపింగ్ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ రాజుకు ఇసుక, కంకర, సున్నపురాయి, గ్రానైట్, ఇటుక, మట్టి, బొగ్గు, స్లేట్ తదితర వ్యాపారాలు కూడా ఉన్నాయి. 2022 సెప్టెంబరులో కింగ్ చార్లెస్- III సింహాసనాన్ని అధిరోహించినప్పుడు అతను $46 బిలియన్ల సామ్రాజ్యానికి అధిపతి. (ఒక బిలియన్ అంటే రూ. 100 కోట్లు) ఇందులో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్‌లో ఉంది. ఈ ఆస్తులను క్రౌన్ ఎస్టేట్ సంస్థ పర్యవేక్షిస్తుంది. కింగ్ చార్లెస్- III తరువాత అత్యధిక భూముల కలిగిన వ్యక్తిగా సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా నిలిచారు. ఇతనికి ఎనిమిది లక్షల 30 వేల చదరపు మైళ్ల భూభాగం ఉంది. ఈ జాబితాలో తరువాతి పేరు సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా. ఇతనికి వ్యక్తిగతంగా ఎనిమిది లక్షల 30 వేల చదరపు మైళ్ల భూభాగం ఉంది. ఇది కూడా చదవండి: చైనా జిత్తులకు అమెరికా, భారత్ పైఎత్తు! -
ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబం.. ఒక షిప్ విలువే వేల కోట్లు!
ప్రపంచంలో ఎలాన్ మస్క్, ఇండియాలో ముఖేష్ అంబానీ అత్యంత ధనవంతులని అందరికి తెలుసు. అయితే వీరికంటే కూడా సంపన్న కుటుంబం ఒకటుందని నివేదికలు చెబుతున్నాయి తెలుస్తోంది. ఇంతకీ ఆ ఫ్యామిలీ ఏది, ఎక్కడుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, సౌదీలోని కింగ్ 'సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్' నేతృత్వంలో ఉన్న కుటుంబం అత్యంత సంపన్న కుటుంబం అని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ కుటుంబంలో 15,000 కంటే ఎక్కువమంది ఉన్నట్లు సమాచారం. వీరికి చమురు నిల్వల నుంచి భారీగా సంపద వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కుటుంబంలో అత్యంత ధనవంతుడు అల్వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్.. ఆయన నికర విలువ దాదాపు 20 బిలియన్ డాలర్లు. అయితే కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ తమ ఖచ్చితమైన నికర విలువను వెల్లడించలేదు. కొన్ని నివేదికల ప్రకారం, సౌదీ అరేబియా రాజు ప్రస్తుతం విలాసవంతమైన అల్ యమామా ప్యాలెస్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సుమారు 4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 1000 గదులు, సినిమా థియేటర్, అనేక స్విమ్మింగ్ పూల్స్ మరియు మసీదు వంటి అదనపు సౌకర్యాలు ఉన్నట్లు సమాచారం. ఈ రాజ కుటుంబం విలాసవంతమైన పడవలు, ఖరీదైన బంగారు పూతతో కూడిన కార్లు, ఖరీదైన దుస్తులు వినియోగిస్తున్నట్లు సమాచారం. వీరి వద్ద ఉన్న అనేక లగ్జరీ క్రూయిజ్ షిప్‌లలో ఒక దాని విలువ సుమారు రూ. 400 మిలియన్ డాలర్లు. ఇంకా వీరు రెండు హెలిఫ్యాడ్స్, స్పోర్ట్స్ పిచ్ వంటి వాటితో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ విమానం బోయింగ్ 747-400 కలిగి ఉన్నారు. టర్కీ బిన్ అబ్దుల్లా ఏకంగా 22 మిలియన్స్ ఖరీదైన కార్లు కలిగి ఉన్నట్లు సమాచారం. ఇందులో అనేక అన్యదేశ్య మోడల్స్ అయిన లాంబోర్ఘిని అవెంటడోర్ సూపర్‌వెలోస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూపే, మెర్సిడెస్, జీప్, బెంట్లీ మొదలైనవి ఉన్నాయి. -
చంద్రబాబే స్వయంగా దాన్ని అంగీకరించారు: విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: చంద్రబాబు కింగ్ ఆఫ్ కరప్షన్ అని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభివర్ణించారు. సోమవారం పార్లమెంట్ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. తనపై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయని స్వయంగా చంద్రబాబే అఫిడవిట్ ఇచ్చారు. చంద్రబాబు అవినీతి కుట్రకు పాల్పడ్డారు. ఆయన కింగ్ ఆఫ్ కరప్షన్. స్కిల్ స్కామ్‌లో అవినీతికి సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యాలు చూసిన తర్వాతే చంద్రబాబును కోర్టు రిమాండ్‌కు పంపింది. చంద్రబాబు ఒక వెన్నుపోటు దారుడు. బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకూ వెన్నుపోటు పొడిచాడు అని విజయసాయిరెడ్డి తెలిపారు. -
షినవత్రకు థాయ్‌లాండ్ రాజు క్షమాభిక్ష
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాజీ ప్రధానమంత్రి థక్సిన్ షినవత్ర(74)కు రాజు క్షమాభిక్ష ప్రసాదించారు. అవినీతి ఆరోపణలపై ఆయనకు కోర్టు విధించిన ఎనిమిదేళ్ల జైలు శిక్షను ఒక్క ఏడాదికి తగ్గించారు. ఇందుకు సంబంధించి రాజు మహా వజ్రాలొంగ్కర్న్ నిర్ణయాన్ని రాయల్ గజెట్ శుక్రవారం ప్రచురించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దేశంలో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే అంతిమ అధికారం రాజుదే. 2001, 2005ల్లో జరిగిన ఎన్నికల్లో షినవత్ర ప్రధాని అయ్యారు. 2006లో జరిగిన సైనిక కుట్రలో ప్రధాని పదవి నుంచి షినవత్రను గద్దె దించారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2008లో ఆయన దేశం విడిచి వెళ్లిపోయి, అజ్ఞాతంలో గడిపారు. వారం క్రితం దేశంలోకి ప్రవేశించిన వెంటనే అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆరోగ్యం క్షీణిస్తున్నందున క్షమాభిక్ష కోరుతూ రాజుకు విజ్ఞాపన పంపారు. షినవత్ర రాకతో దేశంలో మూడు నెలలుగా నెలకొన్న రాజకీయ అస్థిరత సమసిపోయే పరిణామాలు సంభవించాయి. షినవత్ర స్థాపించిన ఫ్యూథాయ్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా పార్లమెంట్లో మద్దతు పెరగడం విశేషం. -
3000 ఏళ్లుగా ఎడారి గర్భంలో రాజు సమాధి
భూమి తన గర్భంలో అనేక రహస్యాలను దాచుకుంది. వాటి గురించి నేటికీ ఎవరికీ పూర్తిగా తెలియదు. అయితే ఈ రహస్యాలు కాలక్రమేణా ప్రపంచం ముందు బయటపడుతూనే ఉన్నాయి. టుటన్‌ఖామెన్ సమాధి 3000 సంవత్సరాలకు పైగా ప్రపంచానికి తెలియని పెద్ద రహస్యంగా నిలిచింది. 1922 నవంబర్‌లో బ్రిటిష్ ఈజిప్టు శాస్త్రవేత్త హోవార్డ్ కార్టర్, అతని బృందం ఈజిప్టు రాజుల ఘాటీలో టుటన్‌ఖామెన్ సమాధిని తవ్వడం ప్రారంభించినప్పుడు అనేక రహస్యాలు ప్రపంచానికి తెలియవచ్చాయి. ఎడారి గర్భంలో దాగిన సమాధి టుటన్‌ఖామెన్ సమాధి 3000 సంవత్సరాలకు పైగా ఎడారి గర్భంలోనే దాగి ఉంది. 1922, నవంబర్ 4న కార్టర్ బృందం ఇక్కడ తవ్వకాలు మొదలుపెట్టినప్పుడు వారు ఇసుకలో ఖననం చేసిన సమాధి మెట్లను కనుగొన్నారు. తరువాత ఆ బృందం మెట్ల దారిని శోధించింది. నవంబర్ చివరి నాటికి వారు ఒక గది, ఒక భారీ ఖజానా, సమాధి తలుపులను కనుగొన్నారు. కార్టర్, అతని బృందం అక్కడి తలుపునకు గల రంధ్రం నుంచి లోపలకి చూసి తెగ ఆశ్చర్యపోయారు. ఈవిధంగా వారు బంగారు నిధులతో నిండిన గదిని కనుగొన్నారు. 9 ఏళ్ల వయసులోనే పాలకుడు 1922, నవంబర్ 26న ఈ బంగారు నిధిని కార్టర్, అతని బృందం కనుగొంది. అయితే టుటన్‌ఖామెన్ మమ్మీ ఉన్న శవపేటికను చాలా కాలం తర్వాత కనుగొన్నారు. టుటన్‌ఖామెన్ ఈజిప్ట్ పాలకుడు. ఇతనిని కింగ్ టుట్ అని పిలిచేవారు. ఈజిప్ట్ ఫారో రాజు టుట్ 1333 బీసీలో కేవలం తన 9 సంవత్సరాల వయస్సులోనే ఈజిప్ట్ పాలకుడయ్యాడు. అతని పాలన అనంతరం అతను మరణించినప్పుడు, సంప్రదాయం ప్రకారం అతని మృతదేహాన్ని మమ్మీగా తీర్చిదిద్ది భద్రపరిచారు. అతని మమ్మీతో పాటు పలు కళాకృతులు, నగలు, నిధులు కూడా అతని సమాధిలో ఖననం చేశారు. అయితే కాలక్రమేణా ఈ సమాధి ఎడారి ఇసుకలో కూరుకుపోయింది. ఎట్టకేలకు వీడిన మరణ రహస్యం కింగ్ టుట్ సమాధిలో వేలాది కళాఖండాలు, ప్రసిద్ధ శిరస్త్రాణం లభ్యమయ్యాయి. సమాధి నుండి బయటపడిన అమూల్య వస్తువుల జాబితాను రూపొందించేందుకు కార్టర్, అతని బృందానికి సుమారు 10 సంవత్సరాలు పట్టింది. సమాధిని కనుగొన్న తరువాత కింగ్ టుట్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఈజిప్షియన్ చక్రవర్తులలో ఒకరిగా గుర్తింపుపొందారు. శాస్త్రవేత్తలు, విద్యార్థుల పరిశోధన అంశంగా ఇతని చరిత్ర నిలిచింది. అయితే కింగ్ టుట్ ఎలా మరణించాడనేది చాలా కాలం మిస్టరీగానే మిగిలింది. ఈ రాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని కొందరు చరిత్రకారులు అంటుండగా, మరికొందరు ప్రమాదంలో మరణించాడంటారు. అయితే ఒక శతాబ్దం తర్వాత శాస్త్రవేత్తలు డిజిటల్ ఇమేజింగ్, డీఎన్ఏ పరీక్షల ద్వారా కింగ్ టుట్ మలేరియాతో మరణించినట్లు కనుగొన్నారు. ఇది కూడా చదవండి: సిక్కుల తలపాగా రహస్యం ఏమిటి? దీనిని ఎందుకు ధరిస్తారు? -
వింత మొఘల్ పాలకుడు: ‘ఇడియట్ మొఘల్ కింగ్‌గా పేరు
1712లో బహదూర్ షా (ప్రథమ) మరణం తరువాత, మొఘల్ పీఠం కోసం అతని కుమారుల మధ్య యుద్ధం జరిగింది. చివరికి జహందర్ షా విజయం సాధించి మొఘల్ సామ్రాజ్య సింహాసనంపై కూర్చున్నాడు. జహందర్ షా తన అసభ్యకర ప్రవర్తన కారణంగా అపఖ్యాతి పాలయ్యాడు. జహందర్ షా మొఘల్ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించిన వెంటనే తనకు ఎంతో ఇష్టమైన మహిళ లాల్ కున్వర్‌కు అధికార బాధ్యతలను అప్పగించాడు. అందానికి దాసోహమై.. లాల్ కున్వర్ మొఘల్ ఆస్థాన గాయకుడు ఖాసురత్ ఖాన్ కుమార్తె. లాల్ కున్వర్.. జహందర్ షాకు రెట్టింపు వయస్సు కలిగినది. ఆమె తన అందం నృత్యంతో విటులను అలరించేంది. లాల్ కున్వర్ చక్రవర్తి జహందర్ షాను తన ఆధీనంలో ఉంచుకున్నదని చరిత్రకారుడు స్మిత్ ‘ది హిందూ’లో ప్రచురితమైన ఒక కథనంలో రాశారు. జహందర్ షా అధికారంలోకి వచ్చిన వెంటనే లాల్ కున్వర్‌కు రాణి హోదాను అప్పగించాడు. అలాగే ‘ఇమ్తియాజ్ మొఘల్’ అనే బిరుదు కూడా ఇచ్చారు. జహందర్ షా అధిక సమయం లాల్ కున్వర్ కోసం వెచ్చించేవాడు. లాల్ కున్వర్ దీనిని తన ప్రయోజనాలకోసం సద్వినియోగం చేసుకున్నది. ఆమె మొదట తన కుటుంబ సభ్యులను మాన్సబ్లుగా నియమించింది. తరువాత వారు మొఘల్ సామ్రాజ్యం నుండి జాగీర్లు అందుకున్నారు. తరువాత ఆమె తన బంధువులను అన్ని కీలక పదవులలో నియమించింది. కుమారుల కళ్లను తొలగించి.. లాల్ కున్వర్ ఆధీనంలోకి వెళ్లిన జహందర్ షా క్రూరమైన, మూర్ఖపు చర్యలకు పాల్పడ్డాడు. చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం జహందర్ కుమారులపై లాల్ కున్వర్‌కు ద్వేషం పెంచుకుంది. అతని ఇద్దరు కుమారుల కళ్లను తొలగించి, వారిని జైలులో పెట్టాలని జహందర్ షాను కోరింది. జహందర్ షా ఆమె చెప్పినట్టే చేశాడు. అతని క్రూరత్వానికి సంబంధించిన మరొక ఉదంతం ఎంతోప్రసిద్ధి చెందింది. ఒకసారి తన సరదా కోసం జనంతో నిండిన పడవను నీట ముంచి, వారి ఆర్తనాదాలు విని విరగబడి నవ్వాడట. ‘ఇడియట్ మొఘల్ కింగ్’ జహందర్ షా కొన్నిసార్లు పూర్తి నగ్నంగా దర్బారుకు హాజరయ్యేవాడు. మరికొన్నిసార్లు స్త్రీల దుస్తులు ధరించి దర్బారు నిర్వహించేవాడు. జహందర్ షా వికృత చేష్టల కారణంగా అతనికి ‘ఇడియట్ మొఘల్ కింగ్’ అనే పేరు వచ్చింది. అతను మొఘల్ చరిత్రలో అత్యంత తెలివితక్కువ చక్రవర్తి అనే పేరు పొందాడు. జైలులోనే దారుణ హత్య జహందర్ మొఘల్ సామ్రాజ్య సింహాసనంపై కేవలం 9 నెలలు మాత్రమే ఉండగలిగాడు. అతని మేనల్లుడు ఫరూక్సియార్ అతనికి వ్యతిరేకంగా ఒక దళాన్ని నడిపాడు. 1713 జనవరి 6న ఫరూక్సియార్తో ఓటమి ఎదురయ్యాక అతను లాల్ కున్వర్‌తో కలిసి ఢిల్లీకి పారిపోయి, అక్కడ ఆశ్రయం పొందాడు. అక్కడ జహందర్‌ను ఖైదు చేశారు. తరువాత అతను జైలులోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఇది కూడా చదవండి: ‘నాన్నా నేను బతికే ఉన్నాను’.. తలకొరివి పెట్టేంతలో తండ్రికి ‘మృతురాలి’ నుంచి ఫోన్.. -
గొప్పగా ప్రారంభమై.. అంతలోనే కనుమరుగై.. పాకిస్తాన్ హిందూ పార్టీ పతనం వెనుక..
పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం లభించకముందు అక్కడ హిందువుల సంఖ్య భారీగానే ఉండేది. దీంతో అక్కడ వారికి తగిన ప్రాధాన్యత లభించేది. స్వాతంత్ర్యం అనంతరం పాక్ ప్రత్యేక దేశంగా అవతరించింది. అదేసమయంలో అక్కడ ఉంటున్న హిందువులు భారత్‌కు తరలివచ్చారు. కొద్దిమంది మాత్రం పాకిస్తాన్‌లోనే ఉండిపోయారు. వారిలో హిందూ రాజులు కూడా ఉన్నారు. వారిలో ఒకరే పాకిస్తాన్‌లోని అమర్కోటకు చెందిన హిందూ రాజు రాణా చంద్ర సింగ్. ఇతనే తొలిసారిగా 1990లో పాకిస్తాన్లో పాకిస్తాన్ హిందూ పార్టీని స్థాపించారు. నాడు పాకిస్తాన్లో అమర్ కోటగా పిలిచే ప్రాంతాన్ని నేడు ఉమర్కోటగా మార్చారు. రాణా చంద్ర సింగ్ అక్కడే రాజుగా ఉండేవారు. పాక్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అక్కడి హిందువులకుపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్న విషయాన్ని గమనించిన రాజపూత్ వంశస్థుడైన రాణా చంద్ర సింగ్ పాకిస్తాన్ హిందూ పార్టీని నెలకొల్పారు. అయితే పార్టీకి ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. పాకిస్తాన్‌లోని హిందువులు పార్టీకి తగినంత అండనివ్వలేదు. రాజకీయ విశ్లేషకులు తెలిపిన వివరాల ప్రకారం ఈ పార్టీలోని కీలకపదవులను రాణా చంద్ర సింగ్ కుటుంబ సభ్యులు, పాక్‌లోని అగ్రవర్ణాల వారు ఆక్రమించారు. అప్పట్లో పాక్‌లోని హిందూ ఓటర్లలో అత్యధికులు కింది వర్గాలకు చెందినవారే ఉన్నారు. దీంతో వారు ఈ పార్టీతో అనుసంధానం కాలేకపోయారు. ఫలితంగా పార్టీ ఎంత గొప్పగా ప్రారంభమయ్యిందో అంత వేగంగానే పతనమయ్యింది. పాకిస్తాన్ హిందూ పార్టీకి చెందిన జెండా హిందూ చిహ్నాలతో కూడి ఉంటుంది. కాషాయవర్ణంలోని జెండాపై త్రిశూలం గుర్తు కనిపిస్తుంది. అలాగే ఓంకారం కూడా ఉంది. ప్రస్తుతం ఈ పార్టీ మనుగడలో లేదు. అయితే ఈ పార్టీని స్థాపించిన రాణా చంద్ర సింగ్ కుమారుడు రాణా హమీర్ సింగ్ రాజకీయాల్లో యాక్టివ్గానే ఉన్నారు. ఆయన సింధ్ ప్రాంతానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సింధ్‌లో ఆయన పలుకుబడి కలిగిన వ్యక్తిగా పేరుగాంచారు. ఇది కూడా చదవండి: మరో ‘పబ్జీ’ దారుణం: తల్లిదండ్రులపై దాడికి తెగబడి.. -
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్ల సంపద, వేల ఎకరాల భూమి
World Richest Thailand King: ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న సంపన్నులను గురించి.. ప్రపంచంలోని కుబేరుల గురించి కూడా కొంత వరకు తెలుసుకున్నాం. అయితే ఈ రోజు అపారమైన సంపదను మాత్రమే కాకుండా వేల ఎకరాల భూమిని కలిగి, లెక్కకు మించిన వాహనాలను కలిగిన ఒక సంపన్న రాజును గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వేల ఎకరాల భూమి.. నివేదికల ప్రకారం.. థాయ్‌లాండ్‌కు చెందిన మహారాజు 'మహా వజిరాలాంగ్కార్న్' (Maha Vajiralongkorn) ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడని తెలుస్తోంది. ఈయన ఆస్తి సుమారు రూ. 3.2 లక్షల కోట్లు. అంతే కాకుండా వజ్రాలు, రత్నాలు వంటి వాటితో పాటు.. 16 వేల ఎకరాల కంటే ఎక్కువ భూమి కూడా వజిరాలాంగ్కార్న్ అధీనంలో ఉండేదని సమాచారం. ఖరీదైన డైమండ్.. భూముల విషయం పక్కనపెడితే మహా వజిరాలాంగ్కార్న్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన 545.67 క్యారెట్ బ్రయోన్ గోల్డెన్ జూబ్లీ డైమండ్ ఉండేదని.. దీని విలువ 12 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ (రూ. 98 కోట్లు) ఉంటుందని అంచనా, ఇది రాజు కిరీటంలో పొందుపరిచారు. వీటితో పాటు అపురూపమైన రాజ వాయిద్యాలు కూడా ఆయన వద్ద ఉండేవని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు! విమానాలు, హెలికాఫ్టర్లు & కార్లు.. బంగారం, వజ్రాలు మాత్రమే కాకుండా.. వజిరాలాంగ్కార్న్ దగ్గర ఏకంగా 38 విమానాలు, లెక్కకు మించిన హెలికాఫ్టర్లు ఉండేవి. ఇందులో నాలుగు బోయిన్, మూడు ఎయిర్‌బస్ విమానాలు. వీటితో పాటు 300 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు వీరి గ్యారేజిలో ఉండేవి. కేవలం వాహనాలకు వినియోగించే ఫ్యూయెల్ ఖర్చు మాత్రం సంవత్సరానికి రూ. 524 కోట్లు అని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. ఈ రాజు ఎంత సంపన్నుడో ఇట్టే తెలిసిపోతుంది. ఇదీ చదవండి: హీరోలా ఉన్న ఇతడిని గుర్తుపట్టారా? దేశం గర్వించదగ్గ సంపన్నుడు.. విశాలమైన ప్యాలెస్.. థాయ్‌లాండ్‌లోని గ్రాండ్ ప్యాలెస్ విస్తీర్ణం ఏకంగా 23,51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని 1782లో నిర్మించినట్లు సమాచారం. ఇది వారి వారసత్వానికి చిహ్నంగా చారిత్రాత్మక కట్టడంగా నిలిచింది. వజిరాలాంగ్కార్న్ రాజుని 'కింగ్ రామ ఎక్స్' అని కూడా పిలుస్తారు. -
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్లకు..
ఆధునిక ప్రపంచంలో సంపన్నులెవరు? అంటే వెంటనే గుర్తొచ్చేది ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్. భారతదేశం విషయానికి వస్తే ముఖేష్ అంబానీ పేరు చెబుతారు. వీరందరికంటే ముందు ఒకప్పుడు ఈ భూమిపైన అత్యంత సంపన్నుడెవరు? అనగానే 'మన్స ముస' (Mansa Musa) పేరే వినిపించేది. ఇంతకీ ఆయనెవరు? ఈయన సంపద విలువ ఎంత ఉండొచ్చు? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 14వ శతాబ్దంలో ఆఫ్రికన్ చక్రవర్తి అయిన మన్స ముస ఈ భూమిపై నివసించిన అత్యంత ధనవంతుడని నమ్ముతారు. చరిత్ర పుటల్లో కలిసిపోయిన ఈ సంపన్నుడు 1280 ADలో జన్మించినట్లు, పశ్చిమ ఆఫ్రికాలోని విస్తారమైన మాలి సామ్రాజ్యానికి 1312 ADలో రాజై పరిపాలించినట్లు తెలుస్తోంది. ఈయన సంపద విలువ సుమారు 400 బిలియన్ డాలర్లని అంచనా.. అంటే ఇప్పటి భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 లక్షల కోట్లు కంటే ఎక్కువ. మాన్సా మూసా సంపద.. ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద 235 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ నికర విలువ 150 బిలియన్ డాలర్లు. ఇప్పటి ప్రపంచ కుబేరులకంటే మన్స ముస సంపద రెట్టింపు అనే చెప్పాలి. అప్పట్లో ఆ దేశపు వనరులు ఉప్పు, బంగారం. (ఇదీ చదవండి: ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!) చరిత్రకారుల ప్రకారం.. హజ్ తీర్థయాత్ర కోసం మాలి నుంచి మక్కాకు ఆఫ్రికాలోని సహారా ఎడారిలో ప్రయాణం సాగించిన అతి తక్కువ మందిలో మన్స ముస ఒకరని, అప్పట్లోనే ఈ మార్గంలో వంద ఒంటెలు, భారీ మొత్తంలో బంగారం, 12000 మంది సేవకులు, 8000 మంది అనుచరులను తన వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. (ఇదీ చదవండి: ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తున్న భారత్ నిర్ణయం - బియ్యం ధరల్లో పెనుమార్పులు!) మన్స ముస ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన రాజు మాత్రమే కాదు, దాతృత్వానికి ప్రసిద్ధి చెందాడు. ఈ కారణంగానే ఇతన్ని 'కింగ్ ఆఫ్ కింగ్స్' అని పిలిచేవారు. తన ప్రజలకు బంగారాన్ని విరివిగా దానం చేసేవాడని, మాలి సామ్రాజ్యం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారాన్ని ఉత్పత్తి చేసిన ఘనత పొందిందని చెబుతున్నారు. -
వేలానికి 121 ఏళ్ల క్యాడ్బరీ చాక్లెట్.. నాటి తీయని వేడుకకు గుర్తుగా..
121 ఏళ్ల పురాతన క్యాడ్బరీ చాక్లెట్ వేలానికి వెళుతోంది. చాలామందికి క్యాడ్బరీ కంపెనీ చాలా పురాతనమైనదనే విషయం తెలియదు. 1902లో ఒక చిన్నారికి స్కూలులో ఈ క్యాడ్బరీ చాక్లెట్ ఇవ్వగా, ఆమె జాగ్రత్తగా దానిని దాచిపెట్టుకుంది. విశేష సమయాల కోసం ప్రత్యేకంగా.. వివరాల్లోకి వెళితే 1902లో ఇంగ్లండ్ కింగ్ ఎడ్వర్డ్-VII, క్వీన్ అలగ్జాండ్రాల పట్టాభిషేకం సందర్భంగా ఈ ప్రత్యేకమైన చాక్లెట్ తయారుచేశారు. నాటి రోజుల్లో ఇంత ఖరీదైన చాక్లెట్లు పిల్లలకు అంత సులభంగా లభించేవికాదు. నాటి రోజుల్లో చదువుకుంటున్న 9 ఏళ్ల మేరీ ఎన్ బ్లాక్మోర్కి లభ్యమైన ఈ చాక్లెట్‌ను తినకుండా, మహారాజుల పట్టాభిషేకానికి గుర్తుగా జాగ్రత్తగా దాచుకుంది. దశాబ్దాల తరబడి ఆ కుటుంబం దగ్గరే.. ఈ వెనీలా చాక్లెట్ మేరీ కుటుంబం దగ్గర కొన్ని దశాబ్ధాలుగా భద్రంగా ఉంది. అయితే ఇప్పుడు మేరీ మనుమరాలు దీనిని వేలం వేసేందుకు నిర్ణయించుకున్నారు. మేరీ మనుమరాలు జీన్ థమ్సన్కు ఇప్పుడు 72 సంవత్సరాలు. జీన్ ఈ చాక్లెట్‌ను తీసుకుని హెన్సన్‌కు చెందిన వేలందారుల దగ్గరకు వెళ్లినప్పుడు వారు ఈ చాక్లెట్ అస్తిత్వాన్ని పరిశీలించారు. ‘చాక్లెట్‌ను చిన్నారి తాకనైనా లేదు’ హెన్సన్ వేలందారులలో సభ్యుడైన మార్వెన్ ఫెయర్లీ మాట్లాడుతూ ‘ఆ సమయంలో ఇది ఎంతో అమూల్యమైన కానుక. ఈ చాక్లెట్ చిన్నారులకు అంత సులభంగా లభ్యమయ్యేది కాదు. ఇది ఎంతో ప్రత్యేకమైనది కావడంతోనే నాడు ఆ చిన్నారి కనీసం తాకకుండా కూడా భద్రపరిచింది’ అని అన్నారు. కాగా ఈ చాక్లెట్ డబ్బాపై కింగ్, క్వీన్ల చిత్రాలు ముద్రితమై ఉన్నాయి. వేలంలో లభించనున్న అత్యధిక మొత్తం ఈ చాక్లెట్ వేలం హెన్సన్లో జరగనుంది. వేలంలో దీని ధర కనీసంగా £100 నుంచి £150 (సుమారు రూ. 16 వేలు)వరకూ పలకనుందని అంచనా. ఇంతకు మంచిన ధర కూడా పలకవచ్చని, ఎందుకంటే ఒక్కోసారి చాలామంది చారిత్రాత్మక వస్తువులకు అధ్యధిక విలువ ఇస్తుంటారని మార్వెన్ ఫెయర్లీ పేర్కొన్నారు. డబ్బా తెరవగానే సువాసనలు రాజ కుటుంబానికి చెందిన పురాతన వస్తువులపై అందరికీ అమితమైన ఆసక్తి ఉంటుంది. ఈ 121 ఏళ్ల పురాతన చాక్లెట్ ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది. తినేందుకు ఏమాత్రం యోగ్యమైనది కాదు. దీనిని ఎవరూ తినలేరు కూడా. అయినా ఈ టిన్ తెరవగానే సువాసనలు వస్తున్నాయని ఫెయర్లీ తెలిపారు. ఇది కూడా చదవండి: సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకుంటే.. -
రాజుతో అంగరక్షకుడి సహగమనం
సాక్షి, హైదరాబాద్: సతీ సహగమనం గురించి అందరికీ తెలిసిందే. భర్త చితిపైనే భార్యను సజీవంగా దహనం చేసే దారుణ పద్ధతది. కానీ, రాజు చనిపోతే అంగరక్షకులను అతనితోపాటు సజీవ సమాధి చేసే మరో వికృత ఆచారం కొన్ని ప్రాంతాల్లో కొనసాగింది. స్వామి భక్తితో ఆత్మాహుతి చేసుకున్న అంగరక్షకుడు/ఆంతరంగిక సేవకుడి(లెంక) స్మృతిలో ఏర్పాటు చేసిన స్మారక ఆత్మాహుతి శిల ఇటీవల వెలుగుచూసింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ శివారు ఆల్వాన్‌పల్లిలో ఉన్న అతి పురాతన జైన దేవాలయం గొల్లత్తగుడి వెనక దీన్ని గుర్తించారు. అక్కడి శిథిల శైవమఠం గోళకీ ఆలయం పరిసరాల్లో ఆరు వీరగల్లు శిలలున్నాయి. వాటిల్లో ఒకటిగా ఉన్న ఈ శిలను కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, ముచ్చర్ల దినకర్లు పరిశీలించారు. దానిపై పరిశోధన చేసి, అది చనిపోయిన రాజుతోపాటు సజీవంగా సమాధి చేయించుకున్న అంగరక్షకుడు/ఆంతరంగిక సేవకుడిదిగా తేల్చారు. స్థానికంగా ఉన్న రాజు లేదా రాజు హోదాలో ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు అతని సేవకుడు కూడా ఆత్పార్పణ చేసుకోవటంతో తొలుత సేవకుడిని సమాధి చేసి, దాని మీద రాజు శవాన్ని సమాధి చేసినట్టు పేర్కొన్నారు. ఈ శిలమీద చనిపోయిన రాజు చిత్రం, దిగువ ఆ సేవకుడి చిత్రాన్ని చెక్కారు. వారు శివైక్యం చెందారనటానికి గుర్తులు చెక్కి ఉన్నాయి. యుద్ధంలో చనిపోతే... ‘శిల మీద లఘు శాసనం ఉంది. అది ఆ సేవకుడు, రాజుకు సంబంధించే ఉండి ఉంటుంది. అస్పష్టంగా ఉన్నందున చదవటం సాధ్యం కావటం లేదు’ అని హరగోపాల్ పేర్కొన్నారు. ఇక్కడికి చేరువలోని గంగాపూర్ ప్రాంతంలో గతంలో చాలా యుద్ధాలు జరిగాయని, ఓ యుద్ధంలో స్థానిక రాజు/ ఆ స్థాయి వ్యక్తి చనిపోవటంతో అతని సేవకుడు కూడా సజీవ సమాధి ద్వారా ఆత్మార్పణ చేసుకుని ఉంటాడని, దానికి గుర్తుగా స్థానిక దేవాలయం వద్ద ఈ ఆత్మాహుతి శిలను ఏర్పాటు చేసి ఉంటారని ఆయన చెప్పారు. ఏడెనిమిది శతాబ్దాల్లో దీన్ని ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. ఏపీలోని గుంటూరు జిల్లా ఈపూర్లో గతంలో కాకతీయ రాణి రుద్రమ మరణంతో ప్రమేయమున్న ఇలాంటి శిల్పం లభించిందని, అది చెన్నై మ్యూజియంలో ఉందని, మరోటి త్రిపురాంతకంలో ఉందని వెల్లడించారు. తెలంగాణలో తొలిసారి వెలుగు చూసిన ఈ శిల్పానికి చరిత్రలో ప్రాధాన్యముంటుందన్నారు. -
కింగ్ కోబ్రాకు కిస్.. నెటిజన్లు ఫైర్.. వీడియో వైరల్..
ఫేమస్ అయిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు పోస్టు చేసి లైక్స్, వ్యూస్ చూసి తమ పలుకుబడి ఎంత ఉందో అంచనా వేసుకుంటారు. రాత్రికి రాత్రే ఫేమస్ కావడానికి ప్రాణాల మీదకు వచ్చే పనులు కూడా చేస్తుంటారు. అయితే.. ఇందులో కొందరు సహజంగా విభిన్నమైన టాలెంట్‌ను ప్రపంచానికి చూపించే వారు కూడా ఉండకపోరు. తాజాగా ఓ వ్యక్తి కింగ్ కోబ్రాకు కిస్ పెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాములంటే ఎంత భయం. చూడగానే వన్నులో వణుకు వస్తుంది. కానీ కొందరు వాటితో కూడా స్నేహం చేసే వారు ఉంటారు. ఈ కోవకే చెందిన వ్యక్తేనేమో నిక్. తను ఓ కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు. చాలా పొడవు ఉన్న ఆ పాము పడగ విప్పిన వేళ.. దానికి వెనకు నుంచి ధైర్యంగా ముద్దు పెట్టాడు. కానీ ఆ కింగ్ కోబ్రా ఆయన్ని ఏమీ అనలేదు. ఈ వీడియోను నిక్ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు భారీగా స్పందించారు. నిక్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు కొంత మంది నెటిజన్లు. పాములపై తమ భయాన్ని వెలిబుచ్చారు మరికొందరు. 'పోతావ్ రేయ్..' అంటూ మరికొంత మంది క్రేజీగా స్పందించారు. ఏదేమైనా పాములకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ వీడియోకు వారం రోజుల్లోనే వేలల్లో వ్యూస్ వచ్చాయి. ఇదీ చదవండి: ఇద్దరు యువతులు పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని.. -
ఆటలోనే కాదు ఆస్తిలోనూ కింగే
-
నేడే చార్లెస్–3 పట్టాభిషేకం
లండన్: చరిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేక సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో శనివారం ఆయనకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. బీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఎలిజబెత్–2 మృతితో ఆయన తనయుడు చార్లెస్–3 బ్రిటన్ రాజుగా ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 74 ఏళ్ల చార్లెస్–3, 75 ఏళ్ల ఆయన భార్య కెమిల్లా శనివారం ఉదయమే గుర్రాలు పూన్చిన ప్రత్యేక బంగారు రథంలో బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబేకు చేరుకుంటారు. అక్కడ లాంఛనప్రాయంగా జరిగే కార్యక్రమాలు ముగిసిన అనంతరం రాజుకు, రాణికి కిరీటధారణ చేస్తారు. సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని చార్లెస్–3, సెయింట్ మేరీస్ కిరీటాన్ని కెమిల్లా ధరిస్తారు. ఈసారి కోహినూర్ వజ్రాన్ని ఈ కిరీటంలో చేర్చడంలేదు. కిరీటధారణ తర్వాత చరిత్రాత్మక కుర్చీలో రాజు, రాణి ఆసీనులవుతారు. 1953లో జరిగిన క్వీన్ ఎలిజబెత్–2 పట్టాభిషేక మహోత్సవానికి 8,000 మందిని ఆహ్వానించారు. చార్లెస్–3 పట్టాభి షేకానికి కేవలం 2,200 మందికి ఆహ్వానం పంపించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రైస్తవ పద్ధతిలో రాజు పట్టాభిషేకం జరగడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి కొంత ఆధునికతను జోడించారు. ఇతర మతాలకు సైతం చోటు కల్పించారు. వివిధ మతాల గురువులు, పెద్దలు రాజును ఆశీర్వదించనున్నారు. హిందూమతం తరపున నరేంద్ర బాబూభాయి పటేల్ రాజుకు ఉంగరం అందజేస్తారు. బ్రిటన్ తొలి హిందూ ప్రధానమంత్రి రిషి సునాక్ బైబిల్ సూక్తులు చదివి వినిపిస్తారు. చార్లెస్–3 పట్టాభిషేక వేడుకలో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, దేశ విదేశీ అతిథులు లండన్‌కు చేరుకుంటున్నారు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు శుక్రవారం లండన్‌కు చేరుకున్నారు. బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం) స్వీకరించినవారిని ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించారు. ఇలా ఆహ్వానం అందుకున్న వారిలో భారత సంతతికి చెందిన పాకశాస్త్ర ప్రవీణురాలు మంజు మాల్హీ కూడా ఉన్నారు. పట్టాభిషేకం సందర్భంగా జరిగే సైనిక పరేడ్‌లో బ్రిటిష్ సైనికులతోపాటు కామన్వెల్త్ దేశాల జవాన్లు కూడా పాల్గొంటారు. 7,000 మంది జవాన్లతో జరిగే కవాతు కనువిందు చేయనుంది. -
ఎనిమిదో నిజాం రాజు ముఖరంజా బహుదూర్ కన్నుమూత
-
రాజుగా చార్లెస్ ప్రమాణం
లండన్: బ్రిటన్ కొత్త రాజుగా 73 ఏళ్ల చార్లెస్–3 నియుక్తులయ్యారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి యాక్సెషన్ కౌన్సిల్ శనివారం ఉదయం లండన్‌లోని చారిత్రక సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో సమావేశమై ఆయన్ను రాజుగా నియమిస్తున్నట్టు లాంఛనంగా ప్రకటించింది. ప్యాలెస్ బాల్కనీ నుంచి నియామక ప్రకటనను బహిరంగంగా చదివి విన్పించింది. భేటీలో పాల్గొన్న ముఖ్య అతిథులంతా ‘గాడ్ సేవ్ ద కింగ్’ అంటూ తమ అంగీకారం తెలిపారు. అనంతరం చార్లెస్–3 రాజుగా ప్రమాణ చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజ ప్రకటన పత్రం తాలూకు రెండు ప్రతులపై తన కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ కానుకగా ఇచ్చిన ఇంక్ పెన్నుతో సంతకం చేశారు! ఆ వెంటనే కింగ్స్ ట్రూప్స్ 41 తుపాకులతో వందన సమర్పణ చేశాయి. రాణి హోదాలో ఆయన భార్య కెమెల్లా పార్కర్ బౌల్స్ (75), నూతన యువరాజుగా విలియం తదితరులు రాజ ప్రకటన పత్రంపై సాక్షి సంతకాలు చేశారు. బ్రిటన్‌తో పాటు కామన్వెల్త్ దేశాలన్నింటికీ ఇకపై చార్లెస్–3 అధినేతగా వ్యవహరిస్తారు. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆరుగురు బ్రిటన్ మాజీ ప్రధానులతో పాటు కొత్త ప్రధాని లిజ్ ట్రస్, విపక్ష నేతలు కూడా పాల్గొన్నారు. చార్లెస్–3 నిర్ణయం మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తొలిసారిగా పత్య్రక్ష ప్రసారం చేశారు. బ్రిటన్ను రికార్డు స్థాయిలో 70 ఏళ్లపాటు పాలించిన ఆయన తల్లి క్వీన్ ఎలిజబెత్–2 గురువారం 96వ ఏట కన్నుమూయడం తెలిసిందే. ‘‘అనంతమైన ప్రేమ, నిస్వార్థ సేవ, తిరుగులేని అంకితభావాలతో నా తల్లి పాలన అన్ని విషయాల్లోనూ సాటిలేనిదిగా సాగింది. ఆమె అస్తమయం అత్యంత దుఃఖమయమైన విషయం. నాపై ఎంతటి భారీ బాధ్యతలున్నాయో తెలుసు. ఆమె నెలకొల్పిన ప్రమాణాలను కొనసాగిస్తా. అందుకు నా జీవితాన్ని ధారపోస్తా’’ అంటూ తన తొలి ప్రసంగంలో కింగ్ చార్లెస్–3 ప్రతిజ్ఞ చేశారు. తల్లిని తలచుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘ప్రియాతి ప్రియమైన అమ్మా! దివంగతుడైన నాన్నను కలుసుకునేందుకు మహాప్రస్థానానికి బయల్దేరిన నీకు నేను చెప్పగలిగింది ఒకటే. మన కుటుంబం పట్ల నీ ప్రేమకు, అంకితభావానికి థాంక్యూ’’ అంటూ నివాళులర్పించారు. నూతన రాజుకు విధేయులుగా ఉంటామంటూ ప్రధాని ట్రస్, ఆమె మంత్రివర్గ సభ్యులంతా హౌజ్ ఆఫ్ కామన్స్‌లో ప్రతిజ్ఞ చేశారు. భర్త సమాధి పక్కనే... రాణి అంత్యక్రియలు సెప్టెంబర్ 19న ఉదయం చారిత్రక వెస్ట్ మినిస్టర్ అబేలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. బకింగ్‌హాం ప్యాలెస్ ఈ మేరకు ప్రకటన చేసింది. రాణి పార్థివ దేహాన్ని ఆమె మృతి చెందిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం ఉదయం రోడ్డు మార్గాన ఎడింబరోలోని హోలీ రుడ్‌హౌజ్ కోటకు తరలిస్తారు. మంగళవారం అక్కడినుంచి విమానంలో లండన్‌కు తీసుకెళ్తారు. సెప్టెంబర్ 14 నుంచి 4 రోజులు ప్రజల సందర్శనార్థం వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉంచుతారు. 19న సోమవారం విండ్సర్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌లో భర్త చార్లెస్ సమాధి పక్కనే ఖననం చేస్తారు. కార్యక్రమానికి వస్తున్న మాజీ ప్రధానులు థెరిసా మే, జాన్ మేజర్, గార్డన్ బ్రౌన్, టోనీ బ్లెయిర్, డేవిడ్ కామెరాన్, బోరిస్ జాన్సన్ -
ఎలిజబెత్ అస్తమయంతో మారిన వారసుల జాబితా
బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మృతితో ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ సింహాసనమెక్కారు. కింగ్ చార్లెస్–3గా ఆయనకు త్వరలో లాంఛనంగా పట్టాభిషేకం జరగనుంది. రాణి మృతితో బ్రిటన్ సింహాసనానికి వారసుల జాబితాలో కూడా మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. చార్లెస్ పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం, ఆయన సంతానానికే వారసత్వంలో ఇక అగ్ర తాంబూలం దక్కనుంది. ఆ లెక్కన విలియం, తర్వాత ఆయన పిల్లలు జార్జ్, చార్లెటీ, లూయిస్ జాబితాలో వరుసగా ఒకటి, రెండు, మూడు, నాలుగో స్థానాల్లో ఉంటారు. తర్వాత ఐదో స్థానంలో మాత్రమే విలియం సోదరుడు హ్యారీ ఉంటారు! ఆ తర్వాత ఆయన పిల్లలిద్దరూ వస్తారు. రాణి బతికుండగా చార్లెస్, విలియం తర్వాత హ్యారీ మూడో స్థానంలో ఉండేవారు. ► బ్రిటన్‌లో రాజు/రాణి పెద్ద కుమారుడు మాత్రమే రాజయ్యే సంప్రదాయం ఇటీవలిదాకా కొనసాగింది. తొలి సంతానమైనా సరే అమ్మాయికి అవకాశం ఉండేది కాదు. గురువారం మరణించిన రాణి ఎలిజబెత్–2 కింగ్ జార్జి–6కు తొలి సంతానంగా జన్మించింది. ఆమెకు తమ్ములెవరూ లేకపోవడం వల్ల మాత్రమే రాణి కాగలిగింది. ఈ పురాతన సంప్రదాయాన్ని 2013లో సింహాసన వారసత్వ చట్టం ద్వారా మార్చారు. దాని ప్రకారం తొలిచూరు అమ్మాయైనా బ్రిటన్ సింహాసనం ఆమెకే దక్కుతుంది. దీని ప్రకారం ప్రిన్స్ విలియం కూతురు చార్లెట్ వారసత్వ జాబితాలో తన తమ్ముడు లూయీస్ కంటే ముందుంది. ► రోమన్ క్యాథలిక్కును పెళ్లాడే రాజ కుటుంబీకులు సింహాసనానికి అనర్హులన్న నిబంధనను కూడా 2013 చట్టం ద్వారా తొలగించారు. అయితే రాజు/రాణి కావాలనుకునేవారు మాత్రం రోమన్ క్యాథలిక్కులు అయి ఉండరాదు. ► సింహాసనానికి వారసులను చట్టాల ద్వారా నియంత్రించడానికి, మార్చడానికి కూడా బ్రిటన్ పార్లమెంటుకు అధికారముంది. పాలన సరిగా లేకుంటే రాజు/రాణిని కూడా పార్లమెంటు మార్చగలదు. సింహాసనమెక్కే వారు ఇంగ్లండ్ చర్చికి, ప్రొటస్టెంట్ సంప్రదాయాలకు విధేయులై ఉండాలి. జాతీయ గీతమూ మారుతుంది చార్లెస్ రాజు కావడంతో బ్రిటన్ జాతీయ గీతమూ మారనుంది. ఎలిజబెత్–2 హయాంలో 70 ఏళ్లుగా బ్రిటన్‌లో ‘గాడ్ సేవ్స్ ద క్వీన్’ అంటూ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇకపై అది ‘గాడ్ సేవ్ అవర్ గ్రేషియస్ కింగ్’ అంటూ మొదలవుతుంది. బ్రిటన్ రాచరికాన్ని లాంఛనంగా అంగీకరించే న్యూజిలాండ్‌కూ ఇదే జాతీయ గీతం కాగా ఆస్ట్రేలియా, కెనడాలకు రాయల్ ఆంథెమ్‌గా కొనసాగుతోంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం కరెన్సీపై కూడా ఎలిజబెత్ బదులు ఇక చార్లెస్ ఫొటో వస్తుంది. అయితే ఇందుకు కొన్నేళ్లు పట్టవచ్చు. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ పాస్‌పోర్టుల్లోనూ రాణి స్థానంలో రాజు పేరు వస్తుంది. బకింగ్‌హం ప్యాలెస్ బయట విధులు నిర్వహించే క్వీన్స్ గార్డ్ ఇకపై కింగ్ గార్డ్‌గా మారుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బహ్రెయిన్ రాజు ఖలీఫా కన్నుమూత
దుబాయ్: ప్రపంచంలోనే సుదీర్ఘకాలం ప్రధాన మంత్రిగా కొనసాగిన 84 ఏళ్ళ బహ్రెయిన్ రాజు షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా బుధవారం మరణించారు. గత కొంతకాలంగా అనా రోగ్యంతో బాధపడుతోన్న ఖలీఫా అమెరికాలోని మేయో క్లినిక్‌లో చికిత్సపొందుతూ మరణిం చినట్లు బహ్రెయిన్ ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఖలీఫా దేశ విదేశాల్లో అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని షియాలు 2011లో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. ఈ ఉద్యమకారులను ఖలీఫా తీవ్రంగా అణచివేసి, తన పదవిని కాపాడుకోవడంలో కృతకృత్యులయ్యారు. ఈయన అత్యంత సంపన్నవంతుడు. విదేశీ ప్రతినిధులను కలవడానికి, ప్రత్యేకంగా తన సొంత దీవిలో సమావేశాలు నిర్వహించేవారు. బహ్రెయిన్‌ను 200 ఏళ్ల కు పైగా పరిపాలించిన అల్ ఖలీఫా వంశంలో ఈయన జన్మించారు. -
ఘన చరితం.. రేనాటి శాసనం
వైవీయూ: ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామ సమీపంలో లభించిన శాసనం ఆధారంగా చోళ మహారాజు రేనాడు ప్రాంతం నుంచి పరిపాలన సాగించినట్లు రూఢీ అయిందని వైవీయూ వైస్ చాన్సలర్ ఆచార్య మునగాల సూర్యకళావతి అన్నారు. బుధవారం వైవీయూ చరిత్ర, పురావస్తుశాఖ పరిశోధకులు, సహాయ ఆచార్యులు డాక్టర్ వి. రామబ్రహ్మం రేనాటి చోళరాజు శాసనం వివరాలను, దాని వెనుక ఉన్న చరిత్ర సంగతులను వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకువచ్చారు. చిన్నదుద్యాల సమీపంలో లభించిన రేనాటి చోళరాజు శాసనం అత్యంత అరుదైనదన్నారు. ఆ గ్రామానికి చెందిన బి.శివనారాయణరెడ్డి పొలంలో ఇది బయల్పడినట్లు తెలిపారు. వైవీయూ ఎంఏ చరిత్ర, పురావస్తుశాఖ విద్యార్థి వాసుదేవరెడ్డికి ముందుగా ఈ విషయం తెలియడంతో ఆయన డా. రామబ్రహ్మం దృష్టికి తీసుకువచ్చారు. శాసనం, ఆ సమాచారాన్ని మైసూర్‌లోని భారత పురాతత్వశాఖ(ఏఎస్ఐ)కు తెలియజేశారు. ఏఎస్ఐ, వైవీయూ చరిత్ర పురావస్తుశాఖ పంపిన శాసనం గురించి అధ్యయనం చేయగా పలు చారిత్రక అంశాలు వెలుగుచూశాయని ఆయన తెలిపారు. ►రేనాటి చోళుల రాజైన చోళమహారాజు ఈ శాసనం వేయించారు. అందులో (తొలితరం) తెలుగుభాష, తెలుగు లిపిలో క్రీ.శ. 8వ శతాబ్దంలో శాసనం వేయించినట్లు ఉంది. పిడుకుల గ్రామంలోని దేవాలయాన్ని దేవాలయ బ్రాహ్మణులకు ఆరు మర్తల (8పుట్ల ధాన్యం పండేభూమి) సేద్యానికి ఇచ్చినట్లు నమోదై ఉంది. అలానే ఈ శాసనంలో చోళమహారాజు రేనాడు ప్రాంతం నుంచి పరిపాలన కొనసాగించినట్లు తెలుస్తోంది. ఎవరైతే ధాన్యాన్ని పరిరక్షిస్తారో వారికి (శాసనంలో లైన్ నెంబర్ 21, నవారికి ఆశ్వ : 22 లైన్లో మేద : (ం) బుదీని’ ఉంది) అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుందని, ఎవరైతే హానిచేస్తారో వారు వారణాసిలో చంపిన పాపాన్ని (23. చెర్రివారు, 24 బారనసి ప్ర) పొందుతారని శాసనంలో లిఖించారు. ►పరిశోధకులు డాక్టర్ రామబ్రహ్మంను వైవీయూ వైస్ చాన్సలర్ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య డి. విజయరాఘవప్రసాద్‌లు అభినందించారు. వైవీయూ అధికారుల ఆదేశానుసారం ‘ఎక్స్‌ఫ్లోరేషన్ ఆఫ్ ఆన్ – ఎర్త్డ్ ఇన్స్క్రిప్షన్, స్ల్కప్ఫర్ అండ్ టెంప్లెస్ ఆఫ్ వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ పేరుతో యూనివర్సిటీ గ్రాంటు కమిషన్‌కు ప్రాజెక్టును పంపనున్నట్లు డాక్టర్ రామబ్రహ్మం తెలిపారు. -
గుడ్డి గుర్రం
సింహపురి రాజ్యాన్ని రుషికేశవ మహారాజు పరిపాలిస్తున్నాడు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నాడంటే ఎవరూ ఎదురు చెప్పకూడదు, ’ఔను’ అనాలి. చాలా మొండిఘటం. అయినా రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తున్నాడు. తనకు ఒక గుర్రం వుంది. చాలా ఏళ్ల తరబడి దానిపైనే ప్రయాణం సాగిస్తున్నాడు. గుర్రానికి వయసు పైబడింది. సేనాధిపతి కేశవుడికి గుర్రం మార్చమని చాలా సార్లు చెప్పాడు రాజు. ‘‘సేనాధిపతి... నేను స్వారీ చేస్తున్న గుర్రానికి వయసు ముదిరినది.. పైగా చీకటి పడే సమయానికి కళ్లు కనిపించవు.. గుడ్డిదైపోయింది. జోరు తగ్గిపోయింది. ఈ గుర్రాన్ని పాకలోనే కట్టేసి వేరే గుర్రాన్ని తెప్పించండి’’ అని చాలా సార్లు సేనాధిపతికి చెప్పి చూశాడు రాజు. ‘‘మహారాజా.. నీకు పట్టాభిషేకం జరిగినప్పటి నుంచి ఈ గుర్రం నిన్ను మోస్తూనే వుంది, ఇప్పుడు వయసు అయిపోయిందని వద్దనుకోవడం రాజధర్మం కాదు, వయసు మీద పడిందని మన బరువు బాధ్యతలు మోసిన తల్లిదండ్రులను వద్దనుకుంటామా, ఇది అంతే మహారాజా’’ అంటూ సేనాధిపతి గుర్రాన్ని మార్చడానికి ఒప్పుకోలేదు. ‘‘సేనాధిపతి.. పొంతన లేకుండా మాట్లాడుతున్నావు. గుర్రానికి వయసు మాత్రమే పైబడి వుంటే ఇలా ఆలోచించేవాణ్ణి కాదు. గుడ్డిది అయింది, పైగా సమరానికైనా సంబరానికైనా పనికి రాకుండా పోయింది, తల్లిదండ్రులతో పోలిక ఏమిటి?’’ రాజుగారి కంఠంలో కాస్త కటువుదనం కనిపించింది, ‘‘వయసు మీద పడినప్పుడే మహారాజా.. చూపు కూడా మందగిస్తుంది. కన్నవారు మన బాధ్యతను మోస్తున్నట్టే గుర్రం కూడా మీ బరువును మోస్తూ మీరు అనుకున్న గమ్యానికి చేరుస్తోంది. ఇందులో తారతమ్యం ఏమున్నది మహారాజా..’’ తమాయించుకుంటూ అన్నాడు సేనాధిపతి. ‘‘మీరు ఎన్నైనా చెప్పండి ఈ గుడ్డి గుర్రంపై నేను స్వారీ చేయలేను. వెంటనే గుర్రం మార్చండి’’ ఈసారి హెచ్చరిక జారీ చేసినట్టుగా అన్నాడు మహారాజు. ‘‘చిత్తం ప్రభు.. కాకపోతే చిన్న మనవి’’ అన్నాడు సేనాధిపతి. ‘‘చెప్పండి’’ అన్నాడు మహారాజు. ‘‘ఇప్పుడు మనం వెళుతున్న వేటకు ప్రస్తుతం ఈ గుర్రాన్నే ఉపయోగించండి. తరువాత వెళ్ళే వేటకు మరో గుర్రం సిద్ధం చేస్తాను’’ అన్నాడు సేనాధిపతి. ‘‘అటులనే కానివ్వండి’’ అంటూ మందిరంలోకి వెళ్ళాడు రుషికేశవ మహారాజు. రాజుకు వేటాడడం అంటే చాలా ఇష్టం, వేటకు వెళ్లిన ప్రతిసారి ఇలా వెనుకబడిపోవటం తనకు నచ్చలేదు, పరివారం చక్కగా వేటాడి విజయం సాధిస్తున్నారు, ఆ ఆనందం తనకు దక్కక పోవడానికి కారణం గుడ్డి గుర్రం. సేనాధిపతి మాత్రం గుర్రం విషయంలో వాయిదాలు వేస్తూ వెళుతున్నాడు. రాజు గుడ్డి గుర్రాన్నే స్వారీ చేయాలనే సేనాధిపతి యొక్క కోరిక వెనుక ఆంతర్యం ఏమిటో రాజుకు అర్థం కాలేదు. తన మాట ప్రకారమే ముందుకు వెళుతున్నాడు. పైగా రాజుకు వేట అంటే చాలా ఇష్టం ఒక మాసంలోనే రెండు సార్లు వేటకు వెళ్ళాల్సిందే.. ఒక రోజు తన పరివారంతో అడవికి వేట కోసం వెళ్ళాడు రాజు, పరివారమంతా ముందు వెళుతుంటే రాజు గుర్రం బాగా వెనుకబడింది, ముందుగా వెళ్లిన సేనాధిపతి రాజు రాకకోసం చెట్టు కింద కూర్చుని వున్నాడు. కాసేపటి తరువాత రాజు రానే వచ్చాడు. సత్తువ లేని గుర్రం కాబట్టే బాగా వెనుక పడ్డాడని తనపై కోపంగా వున్న రాజును గమనించాడు సేనాధిపతి, ‘‘సేనాధిపతి.. నీ గుర్రాన్ని నాకు ఇవ్వు. నువ్వు ఎలాగూ స్వారీలో నేర్పరివికాబట్టి ఈ గుడ్డి గుర్రాన్ని దారికి తెచ్చుకోగలవు’’ అంటూ అడిగాడు రాజు. సేనాధిపతి గట్టిగా నవ్వి ‘‘మహారాజా.. ఈరోజు చీకటి పడేవరకు దీనిపైనే పయనించండి. మీకు నచ్చకపోతే నా గుర్రం మీకిచ్చి మీ గుడ్డి గుర్రాన్ని నేనే తీసుకుంటాను’’ అన్నాడు సేనాధిపతి, వేట మొదలు పెట్టారు.. పరివారం మొత్తం అరణ్యాన్ని చుట్టు్టముట్టారు. పగలంతా తలా ఓ దిక్కు వెళ్లి వేటాడుతున్నారు, మధ్యాహ్నం దాటిపోయింది, రాజుగారి దగ్గర ఒక్క మనిషి కూడా లేడు. చీకటి పడుతోంది పరివారమంతా సేనాధిపతి మాట ప్రకారం రాజ్యానికి చేరుకున్నారు. రాజు మాత్రం అడవిలోనే నిలిచిపోయాడు. అది దట్టమైన అడవి కావడంతో వచ్చిన దారి మరచిపోయాడు. పైగా గుర్రం గుడ్డిది. ఎంతటి రాజైనా ఈ పరిస్థితుల్లో భయపడక తప్పదు. చాలా దూరం వచ్చేసినట్టు వున్నాడు. తను వచ్చింది తూరుపు ముఖం నుంచి కానీ అక్కడకు వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోయింది. తన పరివారం కనిపిస్తారేమో అని దిక్కులు చూస్తున్నాడు రాజు. వాళ్ళ అలికిడి ఎక్కడా వినపడలేదు. గుర్రాన్ని దారి మళ్ళిస్తున్నాడు. అది మాట వినలేదు. వేరే మార్గం వైపు లాగుతోంది. కాలి గిట్టలు పదే పదే నేలకేసి కొడుతోంది. గుర్రాన్ని ఎంత అదిలిస్తున్నా అది దక్షిణం వైపు దారికే అడుగులు కదుపుతున్నది. ఆకాశంలో క్రమేపి చీకటి అలముకుంది, ఇక ప్రయోజనం లేదని గుర్రం లాగుతున్న వైపే పయనం సాగించాడు. అది మెల్లగా అడుగులు వేస్తూనే ఎట్టకేలకు రాజుని రాజ్యానికి చేర్చింది. ఆశ్చర్యబోయాడు రాజు. ‘‘మహారాజా.. గుర్రం మార్చుకుందామా’’ అడిగాడు రాజుకు ఎదురేగిన సేనాధిపతి. ‘‘అవసరం లేదు సేనాధిపతి.. నా గుర్రం గుడ్డిదైనా దానికి వున్న ఆత్మవిశ్వాసం గుడ్డిది కాదు. మనిషి ఆత్మవిశ్వాసంతో బాటు ఏకాగ్రత కోల్పోతాడు కాబట్టే దారి మరచిపోతాడు. ఏ జంతువుకైనా ఏకాగ్రత వుంది కాబట్టే వచ్చిన దారి మరచిపోదు, దీన్ని బట్టి మనిషి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంపై నమ్మకం పెంచుకోవాలి, నువ్వు గుర్రం గుడ్డిదైనా ఎందుకు మార్చలేదో అర్థమైంది’’ అంటూ రాజు సేనాధిపతిని మెచ్చుకున్నాడు. ∙ -
మలేసియా ప్రధాని అనూహ్య రాజీనామా
కౌలాలంపూర్: మలేసియా ప్రధానమంత్రి అనూహ్యంగా పదవినుంచి తప్పుకున్నారు. ప్రధాని మహతీర్ మొహమాద్ (94)తన రాజీనామాను ఆ దేశ రాజుకు సమర్పించినట్టు సమాచారం. దీనిపై స్పందించడానికి ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించినప్పటికీ త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్టు మాత్రం వెల్లడించారు. ఇటీవల నెలకొన్ని రాజకీయ సంక్షోభం, త్వరలో కొత్త సంకీర్ణాన్ని ఏర్పాటుచేయనున్నారన్న అంచనాల మధ్య ప్రధాని రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. 2018, మేలో మలేసియా మహతీర్ ప్రధానిగా రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ప్రధాని మహాతిర్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. JUST IN: PM @chedetofficial has just sent his resignation letter to the King, after a day of political turmoil in Malaysia. A press statement is to be issued soon. — TheMalaysianInsight (@msianinsight) February 24, 2020 -
క్షేమంగానే ఉన్నాను
సీనియర్ నటులు కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారని బుధవారం వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎటువంటి నిజం లేదని, క్షేమంగానే ఉన్నానని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘నిమోనియాకు చికిత్స చేయించుకోవడంతో పాటు రెగ్యులర్ చెకప్ కోసమని హాస్పిటల్‌కు వెళ్లాను. దాంతో అనారోగ్యం పాలయ్యానని వార్తలు బయటకు వచ్చాయి. దానివల్ల హాస్పిటల్లో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భాల్లో ఆందోళనకు గురయ్యే అభిమానుల పరామర్శకు సమాధానం చెప్పడం చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బావుంది. చెకప్ పూర్తవగానే ఇంటికి వెళ్లిపోతాను. నా ఆరోగ్యం విషయంలో ఆందోళనకు గురైన అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు కృష్ణంరాజు. -
సంతోషం నీలోనే ఉంది
ఆ రాజుగారికి అన్నీ వున్నాయి. కాని ఎప్పుడూ సంతోషం కోసం వెతుకులాట. రాజుగారిలో అసంతృప్తి, విచారం అణువణువునా కనబడుతుంది. రాజ వైద్యులుగాని, మహామంత్రిగాని, మంత్రులుగాని, సామంతులు గాని, ప్రజలు గాని, పండితులు గాని రాజుగారి సుఖం కోసం సూచనలివ్వలేక పోతున్నారు. రాజ్యమంతా చాటింపు వేయించారు. రాజుగారి అసంతోషానికి కారణం చెప్పాలని, లేదా సుఖం ఎలా కలుగుతుందో సూచించాలని. ఒకరోజు ఒక పండితులవారొచ్చి ‘‘రాజా! మీకు సుఖం కలిగే మార్గం చెబుతాను. మీరు మన రాజ్యంలో ఎవరయినా వ్యక్తి ‘నేను సుఖంగా వున్నాను’ అంటే అతని నుంచి, అతను వాడే ఏదయినా వస్తువును తీసుకురమ్మనండి. ఆ వస్తువును మీరు ధరిస్తే మీకు సంతోషం కలుగుతుంది’’ అని చెప్పారు. ఈ సలహా రాజుగారికి మంచిగా అనిపించి, రాజ్యంలో సుఖంగా వున్నారనుకుంటున్న వ్యక్తుల వద్దకు మంత్రిని, దూతలను పంపించారు. వారు బాగా ప్రసిద్ధి చెందిన వ్యాపారస్తుని వద్దకు వెళ్ళి అడిగితే అతనన్నాడు ‘‘నా దగ్గర చాలా వస్తువులున్నాయి. కావలసినవి పట్టకెళ్ళండి. కాని నేను మాత్రం సుఖంగా లేను. నా వ్యాపారమింకా దశదిశలా పోలేదు, అన్యుల వ్యాపార వస్తువులు అక్కడక్కడ కనబడుతున్నాయి. అవి ఉండకూడదు. అంతవరకు నాకు సుఖముండదు’’ అన్నాడు. ప్రముఖ కళాకారుని వద్దకు వెళితే అతనన్నాడు ‘‘నాకు చాలా ప్రాచుర్యముంది. వేలాదిమంది అభిమానులున్నారు. కీర్తి, సంపదలున్నాయి కాని సుఖం లేదు. ఎందుకంటే దేశంలో నేనొక్కడనే కాదు, ఇంకా ఇద్దరు ముగ్గురు కళాకారులున్నారు. నేనొక్కడినే వుండాలి. నన్నొక్కడినే ప్రజలాదరించాలి. అంతవరకు నాకు సంతోషముండ దు’’ అన్నాడు. ఇలా దేశంలో ఎవరిని కదిలించినా, ఏదోఒక అసంతృప్తితో వున్నవారే తప్పిస్తే, సుఖంగా ఉన్నట్టు చెప్పలేక పోతున్నారు. దేశమంతా తిరుగుతూ ఒకరోజు అలసిపోయి మంత్రిగారు, సైనికులు సేదదీరుతున్నారు. దూరంగా బండి దగ్గర కూర్చొని, ఒకతను నేలపై ఆకుపరుచుకొని అందులో అన్నం తింటూ ‘‘నేను సుఖంగా ఉన్నాను, నాకు కోరికలు లేవు, నాకన్నీ వున్నాయి, నాకింకేమీ అక్కరలేదు అనుకుంటూ, పాడుకుంటూ పరిసరాలను మరచి తన్మయత్వంతో వున్నాడు. ఆ పాట విన్న మంత్రిగారు, సైనికులు అతనివద్దకు వెళ్ళి ‘‘నువ్వు సంతోషంగా వున్నానని పాడుకుంటున్నావు. నిజంగానే సుఖంగా వుంటే నువ్వుపయోగించే ఏ వస్తువైనా ఇవ్వమన్నారు. ‘‘నేను సంతోషంగానే ఉన్నాను కానీ, క్షమించండి మహారాజా! నా దగ్గరేమీలేదు, నే కట్టుకున్న గోచీగుడ్డ తప్ప. అసలు సుఖానికి, అన్ని సౌకర్యాలు కలిగివుండడానికి సంబంధమేంటి?’’ అని ఎదురు ప్రశ్న వేసాడు. ‘‘అదంతా రాజుగారు చెబుతారు గానీ, నువ్వు మా వెంట రావాలి’’ అని వారు ఎంత చెప్పినా రాను పొమ్మన్నాడు. అవసరమనుకుంటే రాజును తన వద్దకు రమ్మన్నాడు. చేసేదిలేక రాజుగారు మంది మార్బలంతో, సైనికులతో, బహుమతులతో వచ్చారు. అప్పటికి రైతు అలసి నిద్రపోతున్నాడు. మంత్రిగారు రాజుగారొచ్చిన విషయం చెప్పాడు. ‘‘నేనిప్పుడు నిద్రపోతున్నాను, రేపు రమ్మన్నాడు. రాజుగారు వెనుదిరిగి పోయి మరునాడు సాధారణ పౌరునిలాగ వచ్చి రైతు ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడి ‘‘స్వామీ’’ అన్నాడు. ‘‘రాజా! వచ్చావా? కూర్చో. ఇప్పుడు చెప్పు నీ సమస్యేంటి?’’ అన్నాడు. ‘‘స్వామీ నాకన్నీ వున్నాయి కాని సుఖం లేదు. అది ఎక్కడ, ఎలా దొరుకుతుందో చెప్పమన్నాడు రాజు. ‘‘రాజా! సుఖాలకు కారకాలు వస్తువులు కాదు. సంపదలు, ధనధాన్యాలు కావు. సుఖాన్నిచ్చేది ఆత్మ. ఎవరు తనలోనున్న ఆత్మను తెలుసుకుంటారో వారికి బయటి వస్తువులతో పనేముంటుంది? ఆనందం, సుఖం ఆత్మకు సంబంధించినది. మనిషి తనకోసం, తన సుఖంకోసం ఆలోచిస్తాడు. వేటివల్ల తనకు సుఖం కలుగుతుందో వాటికోసం వెంపర్లాడుతాడు. అవి అశాశ్వితాలు. ఆ సుఖం ఆ వస్తువున్నంత వరకే. అది శాశ్వతం కాదు. శాశ్వత సుఖం ఆత్మజ్ఞానంలోనే వుంది. ఆ ఆత్మజ్ఞానం నీలోనే ఉంది. అదే శాశ్విత సుఖం’’ అన్నాడు బండి తోలుకునే అతను. రాజు ముఖం అలౌకికానందంతో తేజోవంతమైంది. – విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
రాచరికాన్ని త్యజించిన మలేషియా రాజు
-
పదవిని త్యజించిన మలేసియా రాజు
కౌలాలంపూర్: మలేసియా రాజు సుల్తాన్ ముహమ్మద్ 5(49) తన పదవిని త్యజించారు. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా రాచరిక విధులకు దూరంగా ఉంటున్న ఆయన రష్యా మాజీ సుందరిని వివాహమాడినట్లు గతంలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ముహమ్మద్ భవిష్యత్తుపై వినిపిస్తున్న ఊహాగానాలకు రాజభవనం ఎట్టకేలకు తెరదించింది. ఆయన తన పదవికి రాజీనామా చేశారని, అది వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. పదవీకాలం ముగియకముందే రాచరికాన్ని త్యజించిన తొలి మలేసియా పాలకుడిగా ఆయన నిలిచారు. ఆయన నిష్క్రమణకు కారణమేంటో రాజభవనం చెప్పలేదు. రష్యా మాజీ సుందరిని ఆయన వివాహం చేసుకున్నారన్న వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. మలేసియా రాజు పదవీకాలం ఐదేళ్లు కాగా, ముహమ్మద్ రెండేళ్ల క్రితమే బాధ్యతలు చేపట్టారు. 9 వంశాల మధ్య ఐదేళ్లకోసారి అధికార పీఠం మారుతూ ఉంటుంది. -
గద్దెనొదిలిన రాజు
కన్నకొడుకైన అబ్షాలోము తిరుగుబాటు చేస్తే దావీదు చక్రవర్తి తన వందలాది మంది అనుచరులతో రాత్రికి రాత్రి కట్టుబట్టలతో రాజధాని వదిలి యోర్దాను నది దాటి అక్కడి అరణ్యంలో తలదాచుకున్నాడు. కాని అన్ని వందలమందికి ఆ మహారణ్యంలో ఆహారం తదితర అవసరాలు తీరేదెలా? నేను ఆకాశానికెక్కినా, పాతాళంలో పడుకున్నా, ఎక్కడున్నా దేవుడు తనను వదలడంటూ దావీదు అంతకు మునుపు ఒక కీర్తన రాసుకున్నాడు (కీర్తన 139). అతను విశ్వసించినట్టే, దావీదు సింహాసనాన్ని వదిలేసినా దేవుడు దావీదును వదల్లేదు. చిన్న రొట్టెముక్క కూడా దొరకని ఆ భీకారణ్యంలో గిలాదు వాడైన బర్జిల్లయి అనే 80 ఏళ్ల వృద్ధ ధనికుడు మరో ఇద్దరితో కలిసి.. దావీదు, అతని వందలమంది అనుచరులకు పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, కాయధాన్యాలు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు... ఇంకా మరెన్నో పుష్కలంగా సమకూర్చాడు (2 సమూ 17:28, 29). ఇంత ధారాళంగా, ఆనందంగా, అడక్కుండానే సమకూర్చడానికి ధనముంటే సరిపోదు. ఔదార్యం, దేవుని పట్ల ప్రేమ కూడా ఉండాలి. అవి బర్జిల్లయికి పుష్కలంగా ఉన్నాయి. రాజునైనా గద్దెనొదిలేస్తే లోకం లోకువగానే చూస్తుంది. పైగా దావీదుకు సాయం చేస్తే అబ్షాలోముకు శత్రువునవుతామన్న భయమూ ఉంటుంది. కాని బర్జిల్లయి దావీదు పట్ల తన విధేయతను, ప్రేమను కష్టకాలంలో క్రియల రూపంలో ప్రకటించాడు. పదిరూపాయలిచ్చి పదివేలు రాబట్టే స్వార్థపూరితమైన లోకంలో, రాజవంశస్తుడయ్యే భాగ్యాన్ని కూడా వదిలేసుకున్న ప్రతిఫలాపేక్షలేని ఔదార్యం, ఆదర్శ జీవితం బర్జిల్లయిది. అతనికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం; చెయ్యడమే తప్ప చేయించుకోవడం అలవాటు లేదు. బర్జిల్లయి లాగా ఇవ్వడమే, ఆదుకోవడమే శ్వాసగా బతికేవాడే నిజమైన విశ్వాసి. – డా. సుభక్త -
శత్రు స్థావరం
సిరియా రాజుకు ఇజ్రాయేలుతో యుద్ధం చేయాలని ఆలోచన. అతను ఆ రాజ్యం బయట ఏ ప్రాంతం నుంచి దాడి చేసినా సిరియా సైన్యాన్ని ఇజ్రాయేలు రాజు సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. ఎవరికీ తెలియకుండా యుద్ధ వ్యూహాన్ని రచించినా ఇజ్రాయేలు రాజు తన వ్యూహాన్ని ఎలా తెలుసుకుంటున్నాడో అంతుపట్టలేదు. దాంతో సిరియా రాజు తన సైనికులను పిలిపించి మనం వ్యూహం గురించి ఇజ్రాయేలు రాజుకు మీరే చెబుతున్నారని, చెప్పింది ఎవరో తనకు తెలియాలని అన్నాడు. సైనికులలో ఒకరు ‘‘మేమెవ్వరమూ చెప్పడం లేదు రాజా! ఆ ప్రాంతంలో ఎలీషా అని ఒక భక్తుడున్నాడు, ఇక్కడి మీ ఆలోచన అతను తెలుసుకుని ఆ విషయాన్ని ఇజ్రాయేలు రాజుకు తెలుపుతున్నాడు’’ అని చెప్పారు. ‘‘అయితే ముందుగా ఆ భక్తుడిని నా వద్దకు రప్పిం^è ండి’’ అని సిరియా రాజు ఆజ్ఞాపించాడు. సిరియా సైనికులు ఎలీషా దోతాను పట్టణంలో ఉన్నాడని తెలుసుకుని పట్టణాన్ని చుట్టుముట్టారు. విషయం తన శిష్యుని ద్వారా తెలుసుకున్న ఎలీషా తానే ఆ సైనికుల వద్దకు వెళ్లాడు, భక్తుడైన ఎలీషా ప్రార్థన చేయడంతోటే దేవుడి మహిమతో సిరియారాజు సైన్యం మొత్తానికి కళ్లు కనిపించకుండా పోయాయి. అప్పుడు ఎలీషా వారి వద్దకు వచ్చి ‘‘మీరు వెదుకుతున్న ఎలీషాను నేను చూపిస్తాను రండి’’ అని వారిని వెంటబెట్టుకుని ఇజ్రాయేలు సైనిక స్థావరమైన షోమ్రోను పట్టణానికి తీసుకు వెళ్లాడు. ఎలీషా ప్రార్థన మేరకు దేవుడు ఆ సైనికులకు తిరిగి దృష్టిని ఇచ్చాడు. వారు కళ్లు తెరిచి చూసి తాము ఇజ్రాయేలు సైనిక స్థావరమైన షోమ్రోనుకు తేబడ్డామనే విషయం అర్థమై భయంతో వణికిపోయారు. అప్పుడు ఇజ్రాయేలు రాజు ఎలీషాను ‘‘నాయనా వారిని చంపుదుమా’’ అని అyì గాడు. భక్తుడైన ఎలీషా ‘‘వద్దు, వారికి భోజనం పెట్టి పంపించమని’’ చెప్పి వెళ్లిపోయాడు. అతని మాట మేరకు ఇజ్రాయేలు రాజు అనేక వంటకాలను చేయించి సిరియా సైన్యానికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించాడు. తమ సైనికులు రాలేదని కలవరపడుతున్న సిరియా రాజు వద్దకు తిరిగి ఆ సైన్యం వెళ్లి విషయం మొత్తం చెప్పగానే రాజు హృదయం మారి ఇజ్రాయేలు మీద యుద్ధం చేయాలనే ఆలోచన మానుకున్నాడు.శత్రువుకు భోజనం పెట్టాలనే భక్తుని ఒక ఆలోచన రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది, శత్రువు దొరకగానే హాని చేయాలనే ఆలోచన కాకుండా వారిని ప్రేమించాలనే తలంపు వస్తే చాలా సమస్యలు తీరిపోతాయి. – రవికాంత్ బెల్లంకొండ -
కోట రహస్యం..వీడని చిక్కుముడి
పర్లాకిమిడి : గజపతి సంస్థానం మహారాజా గోపీనాథ గజపతి అస్వస్థత కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఆయన వ్యక్తిగత సిబ్బంది కేసుకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఇవి జిల్లా వ్యాప్తంగా బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. రాజావారి ఆరోగ్యం పట్ల ఆయన వ్యక్తిగత సిబ్బంది వహించిన నిర్లక్ష్యం కారణంగానే రాజావారు నిశ్చలస్థితిలో ఉండిపోయారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా సిబ్బందిపై ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. ఈ అవమానం భరించలేక రెండేళ్ల క్రితం రాజావారి వ్యక్తిగత సిబ్బందిగా పనిచేసిన గజపతి సంస్థానం మేనేజర్ అనంగమంజరీ దేవి, ఆమె సోదరి విజయలక్ష్మి పాత్రో, తమ్ముళ్ళు సంజయ్‌కుమార్ పాత్రో, సంతోష్‌కుమార్ పాత్రోలు వారి స్వగృహంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. 2016లో మహారాజా గోపీనాథ గజపతి అస్వస్థకు గురై ప్రస్తుతం రాష్ట్ర రాజధానిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రభుత్వ ఆధీనంలో దీర్ఘకాలిక వైద్య సేవలు పొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు గజపతి ప్యాలెస్ వ్యవహారాలు మహారాజా గోపినాథ గజపతి నారాయణ దేవ్ కుమార్తె కల్యాణీ దేవి చూసుకుంటున్నారు. ఆత్మహత్యల నేపథ్యంలో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు. సిట్‌కు కేసు అప్పగింత కానీ కారణాలు ఎంతమాత్రం తెలియరాకపోవడంతో సిట్ బృందానికి కేసును అప్పగించారు. ఈ బలవన్మరణాల పట్లబలమైన వ్యక్తుల పాత్రే ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై పలు మీడియాల్లో పెద్ద ఎత్తున కథనాలు కూడా అప్పట్లో వెలువడ్డాయి. అనంతరం దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం దర్యాప్తు చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యల రహస్యాన్ని పసిగట్టేందుకు అప్పట్లో సిట్ బృందం రెండు నెలల కాలం పాటు పర్లాకిమిడిలో ఉండి దర్యాప్తు చేపట్టింది. ఇదే సమయంలో సంస్థానం మేనేజర్ అనంగమంజరీ దేవి మరణ వాంగ్మూలంలో పేర్కొన్న వ్యక్తులను కూడా ప్రశ్నించింది. కేసుకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేతో పాటు మరో 11 మందిని సిట్ బృందం ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మేనేజర్ మరణ వాంగ్మూలంలో ఏముందోనన్న విషయం ఇప్పటికీ సిట్ దర్యాప్తు బృందం వెల్లడించకపోవడంపై కూడా స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. నివేదిక సంగతేంటి..? దర్యాప్తు పూర్తయినా ఇంతవరకు నిందితుల వివరాలు కూడా వెల్లడించకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. సిట్ దర్యాప్తు బృందం అలసత్వంపై బాధిత కుటుంబ సభ్యులు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయించారు. అయినా వివరాలు తెలియరాక పోవడం విశేషం. అప్పట్లో ఈ ఉమ్మడి ఆత్మహత్యలు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా కేసు విషయంలో కొందరి రాజకీయ నేతల హస్తం ఉందని తేలిన నేపథ్యంలో సిట్ దర్యాప్తు బృందం నివేదిక వెల్లడిస్తుందా? లేదా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు సిట్ నివేదిక వెల్లడిస్తుందని అధికారులు చెబుతున్నారు. -
పాత్రోచిత దానం
ఒక మహారాజు తన రాజ్యంలో పెద్ద ఎత్తున తోట కూర పండించి అందరికీ దానం చేస్తుంటాడు. పెద్దలు, పండితులకు స్వయంగా తోటకూర కట్ట చేతికిస్తూ, ‘అంతకి ఇంతయితే ఇంతకి ఎంతవుతుంది?’ అని ప్రశ్న వేసేవాడు. ఆ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పేవారు కాదు. దాంతో రాజు నిరాశ పడేవాడు. కొంతకాలం తర్వాత ఒక పండితుడు వచ్చాడు. అతనికీ తోటకూర కట్టను ఇస్తూ ఇదే ప్రశ్న వేశాడు. దానికాయన, ‘‘అంతకు ఇంతయితే, ఇంతకు ఇంతే!’’ అన్నాడు. రాజు నిరుత్సాహ పడ్డాడు. అదెలా చెప్పగలిగేరని ప్రశ్నించాడు. దానికాయన చిర్నవ్వుతో ఇలా చెప్పేడు. ‘‘రాజా నీవు పూర్వ జన్మలో ఒక నిరుపేదవి. అదృష్టం కొద్దీ కొద్దిపాటి పెరడున్న ఒక పూరిల్లు ఉండేది. ఆ పెరటిలోనే తోటకూర పండించి, అందరికీ దానం చేసేవాడివి. ఆ పుణ్యం మూలంగానే ఈ జన్మలో మహారాజుగా పుట్టేవు. నీకు పూర్వజన్మ జ్ఞానం ఉండటం వల్ల, ఆ విషయాలన్నీ గుర్తున్నాయి. అప్పుడు కొద్దో గొప్పో తోటకూర దానం చేస్తే రాజునయి పుట్టేను కాబట్టి, ఇప్పుడు కూడా విరివిగా తోటకూర దానం చేస్తే ఇంతకంటే మంచిజన్మ లభిస్తుందన్నది నీ ఆలోచన. అంతేనా?’’ అని అడిగాడు. అందుకు రాజు నిజమేనని అంగీకరిస్తూ, ‘‘అప్పుడు తోటకూర దానం చేస్తే రాజుగా పుట్టేను కదా, మరి ఈ జన్మలో ఇంతంత తోటకూర దానం చేస్తే ఇంత కంటే మంచి జన్మ ఎందుకు రాదు?’’ అని అడిగాడు. అందుకు ఆ పండితుడు ‘‘రాజా! అప్పుడు నీవొక నిరుపేదవి అయినప్పటికీ, ఉన్నదానిలోనే ఇతరులకు సాయపడాలన్న సంకల్పంతో తోటకూర దానం చేసేవాడివి. ఫలితంగా ఈ జన్మలో మహారాజుగా çపుట్టావు. అయితే నీకు స్తోమత ఉండి కూడా ఇంతకంటె మంచి జన్మ కావాలన్న కోరికతో నీ స్థాయికి తగ్గట్టుగా ధనం, వెండి, బంగారం వంటివి దానం చేయకుండా, పిసినిగొట్టుతనంతో తోటకూర మాత్రమే దానం చేస్తున్నావు. దీని ఫలితంగా నీవు మరుజన్మలో యాయవారం చేసుకుని జీవించాల్సి వస్తుంది జాగ్రత్త’’ అన్నాడు. ఆ మాటలకు రాజు సిగ్గుపడి, ఆయన కాళ్ళు పట్టుకుని తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు. అందుకు ఆ పండితుడు ‘‘రాజా! నీవు ఇకనుంచి నీ తాహతుకు తగిన దానం చెయ్యి. ప్రజల మంచి చెడ్డలను తెలుసుకుని అవసరంలో ఉన్న వారిని ఆదుకో. ఏది చేసినా నిండు మనస్సుతో చెయ్యి. నిరుపేదల ఆకలి తీర్చు. అన్నింటికీ మించి పేదలు, వికలాంగులు, వృద్ధులు ప్రజలు ఇతరుల మీద ఆధారపడి జీవించే బాధ లేకుండా స్వయంగా సంపాదించుకునే ఏర్పాటు చెయ్యి. మంచి జ్ఞానాన్నిచ్చే విద్యాదానం, నిరుపేదలు జబ్బుతో ఇబ్బంది పడకుండా వైద్యశాలలు కట్టించి ఉచిత వైద్య దానం చెయ్యి. అందరినీ ఆదరించు’’ అని చెప్పాడు.రాజు అప్పటినుంచి పనికి మాలిన దానాలు మానేసి, ప్రజల్ని పాలించడం పైనే దృష్టి పెట్టాడు. ఇందులోని నీతి ఏమిటంటే, ఎవరైనా సరే, తమ స్థోమతకు తగిన దానం చేయాలి. నిస్వార్థ బుద్ధితో చేసే దానం మాత్రమే భగవంతుడిని చేరుతుంది. స్థోమతకు మించిన దానాలు, అపాత్ర దానాల వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
నేనే రాజు.. నేనే మంత్రి!
మోస్‌మన్/ఆస్ట్రేలియా: ఈ ఫొటోలో ఉన్న ఆయన పేరు పాల్ డెల్ప్రాట్. వయసు 76 సంవత్సరాలు. వృత్తి రీత్యా రచయిత, చిత్రకారుడు.. చూడటానికి అచ్చు రాజులా కనిపిస్తున్నాడు..! ఏ దేశానికి రాజు అని ఆలోచిస్తున్నారా.. ఆయన ఆస్ట్రేలియాలోని మోస్‌మన్ అనే మున్సిపాలిటీకి చెందిన సామాన్య పౌరుడు. అయితే ఇటీవలే ‘ది ప్రిన్సిపాలిటీ ఆఫ్ వై’ అనే రాజ్యాన్ని నెలకొల్పి తనకు తాను రాజుగా ప్రకటించుకున్నారు. ఎందుకంటే మున్సిపాలిటీ అధికారులపై కోపంతో సొంతరాజ్యాన్నే ఏర్పరుచుకున్నారు. ఇంతకీ ఏమైందంటే.. 1993లో తన నివాస స్థలానికి రోడ్డు వేయాల్సిందిగా అధికారులకు విన్నవించుకున్నారు. అప్పటినుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే ఆయన ఇంటికి వెళ్లే దారిలో వాతావరణ పరంగా చాలా ముఖ్యమైన పొదలు, చెట్లు ఉన్నాయని, రోడ్డు వేయడం కుదరదని అధికారులు తేల్చేశారు. తన ఇంటికి వెళ్లేందుకు ఎలాంటి దారి లేదని, ఎలాగైనా రోడ్డు వేయాల్సిందిగా ఎంత కోరినా అధికారులు కుదరదని చెప్పారు. దీంతో ఏం చేయలేక సొంత రాజ్యం ఏర్పరచుకుని ‘ది ప్రిన్సిపాలిటీ ఆఫ్ వై’ అని పేరు పెట్టుకున్నారు. 2004 నవంబర్ 15న ఈ కొత్త రాజ్యానికి మున్సిపాలిటీ మేయర్ కూడా ఆమోద ముద్ర వేశారు. అయితే ఆస్ట్రేలియాలో ఇలా మినీ రాజ్యాలను ఏర్పరచుకోవడం ఇదే మొదటిసారి కాదు. అక్కడ దాదాపు 300 వరకు మినీ రాజ్యాలు.. వాటికి రాజులు కూడా ఉన్నారట. ప్రభుత్వానికి పన్నులు కట్టినన్ని రోజులు అధికారులు వీరిని ఏమీ అనరట. -
ఎండు గడ్డి.. పచ్చిగడ్డి
పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతను తన రాజ్యంలోని కొంతమంది మేకల కాపరులను పిలిచి, ‘‘మీ మేకలు పచ్చిగడ్డి తింటాయా.. ఎండుగడ్డి తింటాయా..?’’ అని ప్రశ్నించాడు. ‘‘అయ్యా..! మేకలు పచ్చిరొట్ట మాత్రమే తింటాయి. ఎండుగడి ్డతినవు’’ అని సమాధానం చెప్పారు వారు. అప్పుడు రాజు, మేకలను పచ్చిగడ్డి కాకుండా ఎండుగడ్డి మాత్రమే తినగలిగేలా చేస్తే మీకు మంచి బహుమానం ఇస్తానని ప్రకటించాడు. బహుమతి అనగానే అందరికీ ఆశపుట్టుకొచ్చింది.‘‘ప్రభూ.. మాకు నెలరోజుల గడువునివ్వండి. ఈ నెలరోజుల్లో మేము మేకలకు ఎండుగడ్డి తినిపించే ప్రయత్నం చేస్తాము’’ అని అడిగారు. దానికి రాజు సరేనన్నాడు. ఇక ఆ రోజు నుండి కాపరులందరూ తమ మేకలను బయటికి వదలకుండా, నిర్బంధించి ఎండుగడ్డి వేయడం ప్రారంభించారు. ఒకటి రెండు రోజులు మేకలు ఎండుగడ్డి ముట్టకుండా మొరాయించాయి. కాని ఆకలికి తాళలేక మూడోరోజునుండి ఎంగిలి పడడం ప్రారంభించాయి. మెల్లగా అవి ఎండుగడ్డికి అలవాటు పడిపోయాయి. నెలరోజుల తరువాత కాపరులంతా తమ తమ మేకలతో సహా రాజదర్బారుకు హాజరయ్యారు. రాజు సమక్షంలో అందరూ మేకలకు ఎండుగడ్డివేశారు. అవి వెంటనే తినేశాయి. తరువాత రాజు పచ్చిరొట్ట తెప్పించి వాటిముందు వేయించాడు. ఆవురావురుమంటూ అవి పచ్చిరొట్టంతా లాగించాయి. కాని అందులో ఒకమేక మాత్రం పచ్చిరొట్టను కనీసం వాసన కూడా చూడలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. రాజు ఆ మేకల కాపరిని పిలిచి, ‘‘ఏమిటీ.. నీ మేక పచ్చిరొట్ట తినడంలేదు, అలా ఎలా తర్ఫీదు ఇవ్వగలిగావు?’’ అని ప్రశ్నించాడు. దానికా కాపరి, ‘‘రాజా.. నేను దాని ముందు పచ్చిరొట్ట వేసి బెత్తం పట్టుకొని కూర్చునేవాడిని. అది రొట్ట తిందామనుకున్న ప్రతిసారీ దానిమూతిపై కొట్టేవాడిని. తరువాత ఎండుగడ్డి వేసేవాడిని. అది దాన్ని కూడా తినాలని ప్రయత్నించేది. కాని నేను ఏమీ అనేవాడిని కాదు. జంకుతూ, జంకుతూనే అది ఎండుగట్టి తినడం ప్రారంభించింది. పచ్చిగడ్డి తింటే దానికి దెబ్బలు పడేవి. ఈ విధంగా అది ఎండుగడ్డికి అలవాటు పడిపోయింది’’ అని వివరించాడు. మాట ప్రకారం రాజు ఆ కాపరికి గొప్ప బహుమతినిచ్చి సత్కరించాడు. అంటే, పచ్చిగడ్డి తింటే శిక్ష అనుభవించాల్సి వస్తుందన్న భయం మేకను ఎండుగడ్డికి అలవాటు చేసింది. అలాగే తప్పుచేస్తే దేవుడు శిక్షిస్తాడన్న భయం మనిషిలో ఉంటే దుర్గుణాలు గణనీయంగా తగ్గిపోతాయనే కదా, ఈ ఆరాధనలు. ఉపవాసాలు. – మదీహా అర్జుమంద్ -
రాజుగారికి నచ్చిన అబద్ధం
షేక్ సాదీ (అలై రహ్మా) గొప్ప పండితులుగా పేరు గడించారు. ఆయన చెప్పిన గాథలు సమాజ సంస్కరణ కోసం ఎంతో ఉపయోగపడేవి. ఆయన చెప్పినదే ఈ గాథ. ఓ రాజుగారు ఫలానా ఖైదీని ఉరితీయండి అని తలారిని ఆజ్ఞాపించారు. ఈ మాటలు విన్న ఖైదీ ప్రాణం మీద ఆశలు వదులుకున్నాడు. రాజుగారి మీద కోపం కట్టలు తెగింది. ఎలాగూ చావు తప్పదని రాజుగారిని తనదైన భాషలో నానా దుర్భాషలాడటం మొదలెట్టాడు. ఆ విధంగా రాజుగారి మీద కక్ష తీర్చుకున్నాడు. రాజుగారికి ఖైదీ మాటలు అర్థంకాక పక్కనే ఉన్న మంత్రులను అడిగారు. అందులో నుంచి ఒక మంత్రి కలగజేసుకొని ‘‘ఈ ఖైదీ మిమ్మల్ని దీవిస్తున్నాడు. ‘‘తమ కోపాన్ని దిగమింగేవారు, ఇతరులను క్షమించేవారంటే అల్లాహ్‌కు ఎంతో ఇష్టం’’ అనే ఖుర్ఆన్ వచనాన్ని వల్లిస్తున్నాడు’’ అని రాజుగారికి మంత్రి వివరించాడు. మంత్రి చెప్పిన ఈ మాటలతో రాజుగారికి ఖైదీ మీద కోపం చల్లారింది. ఆ ఖైదీ ఉరిశిక్షను రద్దుచేస్తూ క్షమాభిక్ష పెట్టారు. పక్కనే ఉన్న మరోమంత్రి కలగజేసుకుని ‘‘ఈ ఖైదీ దీవెనలు ఇచ్చింది, క్షమాపణలు కోరింది అంతా పచ్చి అబద్ధం. రాజుగారికే అబద్ధం చెబుతావా! రాజుగారూ ఈ ఖైదీ మిమ్మల్ని నానా దుర్భాషలాడాడు’’ అని నిజం చెప్పాడు. రెండోమంత్రి నిజం చెప్పినా అతని మాటలు రాజుగారికి నచ్చలేదు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ ‘‘నువ్వు చెప్పిన నిజం కంటే మొదటి మంత్రి చెప్పిన అబద్ధం నాకెంతో నచ్చింది. ఎందుకంటే మొదటి మంత్రి అబద్ధం చెప్పినా అతని సంకల్పం సత్యంపై ఉండింది. నువ్వు నిజం చెప్పినా నీ సంకల్పం నాకు నచ్చలేదు.’’ అన్నారు. మొదటి మంత్రిని అభినందించారు. – అమ్మార్ -
ఈ ఒక్కటి నీ కోసం
ఒక రాజు దగ్గర ఒకాయన పని చేసేవాడు. ఆయన భవనాలను ఎంతో శ్రద్ధగా నిర్మించేవాడు. వాటి పునాదులు లోతుగా తీయించేవాడు, స్తంభాలు దృఢంగా వేయించేవాడు, పైకప్పు కోసం వాడే సామగ్రి నాణ్యంగా ఉండేది. తలుపులు మంచి కలపతో చెక్కేవాడు. ఒక్కో ఇళ్లు వంద ఏళ్లయినా చెక్కు చెదరదేమో అన్నంత గొప్ప పనితనం వాటిల్లో కనబడేది. దాంతో ఆయనకు ఎంతో పేరొచ్చింది. రాజు కూడా ప్రత్యేకంగా అభిమానించేవాడు. పేరంటూ వచ్చాక ఆయనకు తన పనిమీద శ్రద్ధ తగ్గిపోయింది. ఎక్కువగా తన సహాయకులకు పనులు అప్పగించేవాడు. వాళ్లలో కొందరు అవినీతిపరులు ఉండేవారు. నాణ్యమైన సామగ్రి వాడేవారు కాదు. ఈ విషయం నెమ్మదిగా రాజుకు తెలిసింది. ఒకరోజు రాజు అతణ్ని పిలిపించి, ‘మీరు చివరిగా ఒక్క భవనాన్ని నాకోసం నిర్మించండి. తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకుందురు’ అన్నాడు. అతడు అలాగే అని ఒప్పుకున్నాడు. కానీ తన ధోరణిలో ఆ పనిని సహాయకులకు అప్పగించాడు. వాళ్లు వాళ్ల ధోరణిలో సొమ్ము మిగుల్చుకుంటూ భవనాన్ని పూర్తి చేశారు. ఒకరోజు రాజుతో పని పూర్తయిందని చెప్పడానికి వెళ్లాడు మేస్త్రి. ‘మీరు ఈ రాజ్యానికోసం ఎంతో సేవ చేశారు. ఈ భవనం మీరు నివాసం ఉండటానికే’ అని చెప్పాడు రాజు. మేస్త్రికి ఒక్కసారిగా ఆ భవనం కూలిపోయినట్టు అనిపించింది. -
నేడు రాష్ట్రానికి నేపాల్ రాజు
భువనేశ్వర్: తూర్పు భారత దేశపు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేపాల్ దేశపు చివురి రాజా జ్ఞానేంద్ర వీర్ విక్రమ్ సాహా దేవ్ దేశానికి విచ్చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఒడిశా రాష్ట్ర పర్యటన కూడా ఖరారైంది. భారతీయుల పవిత్ర గోమాత పూజా దుల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొం టారు. గోమాత సంరక్షణ కో సం నిర్వహిస్తున్న అంతర్జాతీయ గోసంవర్ధన మహోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఖుర్దా జిల్లాలోని జట్నీ రత్తిపూర్ గ్రామంలో గోమాత మందిరం నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం నగరంలోని లింగరాజ దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజాదుల్లో పాల్గొంటారు. సాక్షి గోపాల్ దేవస్థానాన్ని సందర్శిస్తారు. పూరీ జగన్నాథుని దేవస్థానంలో ప్రత్యేక పూజాదులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జగన్నాథుని సంస్కృతితో నేపాల్ రాజవంశానికి సంబం ధాలు ఉన్నందున శ్రీ మందిరంలో చతుర్థా మూర్తులు కొలువు దీరిన రత్నవేదికపైకి వెళ్లి ఆయనకు పూజాదులు నిర్వహించే యోగ్యత ఉంది. ఈ నేపథ్యంలో 36 నియోగుల సంఘం ప్రత్యేక షెడ్యూలు ఖరారు చేసింది. రాష్ట్ర పర్యటన ముగించుకుని ఆయన పశ్చిమ బెంగాల్‌ను సందర్శిస్తారు. 2001 నుంచి 2008 సంవత్సరాల -
రాజు ఫకీరు
పూర్వం హారూన్ రషీద్ అని ఒక రాజు ఉండేవాడు. మంచివాడు. కాని కాస్తంత అధికార గర్వం ఉండేది. ఒకరోజు రాజు వేటకు బయలు దేశాడు. వెంట చిన్నపాటి సైనిక పటాలంతో పాటు, ఇబ్రాహీం అనే మంత్రికూడా ఉన్నాడు. పరివారం ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించింది.అలా వెళుతూ వెళుతూ, ‘ఇబ్రాహీం! నాకు లభించని సంపద కాని, సంతోషం కాని ఇంకా ఏమన్నా ఉందంటావా?’ అని ప్రశ్నించాడురాజు. ‘అయ్యా.. సమస్త సంతోషాలు, అనంతమైన సిరిసంపదలు మీసొంతం. మీకు లేనిదంటూ ఏమీలేదు..’ బదులిచ్చాడుమంత్రి. అంతలో అడవిలోంచి ఓ కంఠం వినిపించింది. ‘మీరిద్దరూ బుద్ధిహీనులే. నిజమైన ఆనందం ఏమిటో మీకసలు తెలియనే తెలియదు.’ అని. ఈ శబ్దం విని వారు నిర్ఘాంతపోయి, అటువైపు దృష్టిసారించారు. ఒక బక్కపలచని, బలహీనవ్యక్తి అడవిలోంచి బయటికొచ్చాడు. అతణ్ణిచూసి, ‘ఎవర్నువ్వు?’ అంటూ ప్రశ్నించాడు రాజు. ‘నేను దేవుని దాసుణ్ణి’ ముక్తసరిగా సమాధానమిచ్చాడా వ్యక్తి. ‘నువ్వు నా పాలనలో ఉన్న ఈ దేశవాసివా? లేక ఇతరదేశస్థుడివా?’ ‘నువ్వూ నేనూ అందరూ దేవుని పాలనలోని వాళ్ళమే. మనందరి రాజు, ప్రభువు ఆయనే.’ అంతలో మంత్రి ఇబ్రాహీం కలగజేసుకొని, ‘నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?’ అన్నాడు కోపంగా. ‘తెలుసు. దైవాన్ని, పరలోకాన్ని మరచి, అంతా ప్రపంచమే అనుకొనే వ్యక్తితో మాట్లాడుతున్నాను’ అన్నాడా వ్యక్తి తనదైన శైలిలో.. ఈమాటలతో మంత్రికోపం తారాస్థాయికి చేరింది. ఇది గమనించిన రాజు కలగజేసుకొని, ‘ఇబ్రాహీం.. కాస్త ఆగు. కోపాన్ని దిగమింగు’’ అని గద్దించాడు. తరువాత భోజన ఏర్పాట్లు చేయమని పురమాయించాడు. రకరకాల రుచికరమైన వంటకాలు వడ్డించబడ్డాయి. భోజనానంతరం, ‘నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. సరైన సమాధానాలు చెబుతారా?’ అన్నాడు రాజు. ‘దైవచిత్తమైతే బుద్ధినుపయోగించి సరైన సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను.’ అన్నాడా వ్యక్తి. ‘ఫిరౌన్ ఎక్కువగా దైవానికి అవిధేయత చూపేవాడా? లేక నేనా?’ ’ఫిరౌన్ నేనే దేవుణ్నని ప్రకటించుకున్నాడు. అతడు దైవ తిరస్కారి. దేవుని దయవల్ల మీరలా కాదు. మీరు దైవ విశ్వాసి.’ అన్నాడా వ్యక్తి ‘హ.మూసా(అ)మీకన్నా ఉన్నతులా? లేక మీరు ఆయనకంటే ఉన్నతులా?’ ‘హ.మూసా అలైహిస్సలాం దేవుని ప్రవక్త. నేను కేవలం దాసుణ్ణి. నాకూ ఆయనకు పోలికా?’ ‘మరి దేవుడు మూసాను ఫిరౌన్ వద్దకు పంపినప్పుడు, ఆయన సౌమ్యంగా హితబోధ చేశారు. మీరు నాపట్ల అలా సౌమ్యంగా ప్రవర్తించలేదు.?’ ’నిజమే. నేను మీ పట్ల కాస్త కటువుగానే ప్రవర్తించాను. అల్లాహ్ నన్ను మన్నించుగాక.. నేను మిమ్మల్ని కూడా క్షమించమని కోరుతున్నాను.’ ‘నేను మిమ్మల్ని మన్నించాను. నాప్రశ్నలన్నింటికీ మీరు సరైన సమాధానాలు చెప్పారు.’ అంటూ..’ ఇతనికి పదివేల నాణాలు కానుకగా ఇవ్వండి’ అని ఆదేశించాడు. రాజాజ్ఞను ఆచరణలో పెట్టారు సేవకులు. ‘ఈ సంచులు నేనేమి చేసుకుంటాను? పేద సాదలకు పంచిపెట్టండి.’అన్నాడా వ్యక్తి. ఒక అధికారి కల్పించుకొని, ‘నీకసలు బుధ్ధుందా? రాజావారి కానుకల్నే వద్దంటున్నావు.’ అన్నాడు ఆగ్రహంగా! ఆ వ్యక్తి అతని వైపు చూస్తూ, ‘ఈ సంపద మీలాంటివారికోసం.. నాకవసరంలేదు.’ అంటూ లేచి నిలుచున్నాడు వెళ్ళిపోడానికి సిద్ధమవుతూ... దీంతో రాజు ఆ అధికారిని తీవ్రంగా మందలిస్తూ... ‘నాదగ్గరికి వచ్చిన వారినెవరినీ నేను రిక్తహస్తాలతో పంపను. వారికి ఏదో ఒకటి ఇచ్చి పంపడం నా అలవాటు’ అన్నాడు అనునయంగా. ‘మీరంతగా అంటున్నారు కాబట్టి, సరే’ అంటూ రెండుచేతులతో రెండుసంచులు పట్టుకొని, రాజువద్ద సెలవు తీసుకొని వెళ్ళిపొయ్యాడు. వెంటనే రాజు మంత్రి ఇబ్రాహీంను పిలిచి, ‘ఈవ్యక్తిసంచులు తీసుకెళతాడా..ఎక్కడైనా పారేసివెళతాడా చూడమని చెప్పి, తను కూడా మేడపైకెక్కాడు. ఆ వ్యక్తి రెండు చేతులూ పైకెత్తి, ‘ప్రపంచం నన్ను మోసం చెయ్యాలని చూసింది. కాని నాప్రభువు నన్ను రక్షించాడు’ అనుకుంటూ వెళ్ళిపోయాడు. హారూన్ రషీద్ మేడదిగి వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు. అంతలో ఇబ్రాహీం కూడా వచ్చాడు. ‘రాజా... అతను రెండుసంచులనూ ద్వారం దగ్గర గుమ్మరించి, ఇదిరాజుగారి సొమ్ము. దీనికి హక్కుదారులు మీరు మాత్రమే. అని మనద్వారపాలకులకే దానం చేసి ఖాళీ చేతులతో వెళ్ళి పోయాడు’ అని చెప్పాడు. ఇది విని హారూన్ రషీద్, ‘ఇబ్రాహీం..! ఎవరైతే ప్రాపంచిక వ్యామోహాన్ని దరి చేరనీయరో వారు రాజదర్పాన్ని సుతరామూ అంగీకరించరు. అంటూ, ‘దేవా..! నాపాలనలో ఎల్లప్పుడూ ఇలాంటి సచ్ఛీలురు, సత్పురుషుల్ని ఉండేలా ఆశీర్వదించు’ అని చేతులెత్తి అల్లాహ్‌ను వినమ్రంగా వేడుకున్నాడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
జ్ఞాన సేద్యం
కోసల రాజ్య రాజధాని శ్రావస్తి సమీపంలోని ఒక చిన్న గ్రామంలో నివసించే సుమంగళుడు నిరుపేద. పొట్ట గడవడం కూడా కష్టంగా ఉండేది. పంట చేలలోని పరిగలు ఏరుకుని జీవిస్తుండేవాడు. ఒకరోజున శ్రావస్తికి వెళ్ళాడు. అక్కడ రాజుగారు ప్రసేనుడు భిక్షువులకు ఆహార పదార్థాల్ని దానం చేయడం చూశాడు. తానూ భిక్షువుగా మారితే తిండికి ఇబ్బంది ఉండదు అనుకున్నాడు. ఒకరోజు బుద్ధుని ప్రబోధం విని, భిక్షువుగా మారాడు. భిక్షుసంఘంలో పాటించే నియమాలు, చదువు, శిక్షణలు ఎంతో కఠినం అనిపించాయి. పట్టుమని పదిరోజులు కూడా సాధన చేయలేకపోయాడు. భిక్షువుగా జీవిస్తే ధర్మం తెలుస్తుంది. జ్ఞానం, గౌరవం కలుగుతాయి. నిజమే! కానీ సాధన చేయడమే అతి కష్టంగా తోచింది. ఈ జీవితం కంటే పాత జీవితమే సులువు అనిపించి, ఆరామాన్ని వదిలి గ్రామం దారి పట్టాడు. మండు వేసవి, వడగాలులు, చెట్టు నీడన కూడా నిలవలేని ఎండతీవ్రత. అయినా, మండుటెండలో వరి కుప్పలు నూర్చుతున్న రైతుల్ని చూశాడు. వంటినిండా దుమ్ము, నూగు, చెమటతో తడిసి ముదై్దన శరీరాలు... వారి పరిశ్రమ చూసి ఆలోచనలో పడ్డాడు. కష్టపడకపోతే ఫలితం దక్కదు. జ్ఞానార్జన కూడా వ్యవసాయమే అనుకుని వెనుదిరిగి ఆరామానికి వెళ్లాడు. కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నాడు. అతి తక్కువ కాలంలో మంచి భిక్షువుగా, జ్ఞానిగా పేరుపొందాడు. – డా. బొర్రా గోవర్దన్ -
పిఠాపురం రాజు కలచెదిరింది
(లక్కింశెట్టి శ్రీనివాసరావు) నీరాజనాలు లేవు ... ఆ స్థానంలో అవమానాలే ఆయన రాజ్యంలోనే చుక్కెదురు అనగనగా అదొక రాజ్యం. మొదట్లో పీఠికాపుర మహా సంస్థానంగా పిలవబడి కాలక్రమంలో పిఠాపురం సంస్థానంగా పేరు మారింది. 1800 నుంచి 1909 వరకు ఈ సంస్థానం కొనసాగింది. సుమారు ఏడెనిమిది మంది రాజులు పాలించారు. పిఠాపురం సంస్థానాధీశులు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన రాజ్యంలో పట్టాభిషిక్తుడైన చివరి రాజు రావు వెంకటకుమారమహీపతి బహదూర్. ఆయన 1964లో చనిపోయారు. ప్రజా పాలన వచ్చాక రాచరిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. కాలక్రమంలో రాజ్యాలు కూడా కనుమరుగైపోయాయి. కానీ ఇప్పటికీ పిఠాపుర రాజ్యంలో రాచరిక పాలనే నడుస్తోందనే చెబుతారు. పోనీ ప్రస్తుత రాజేమైనా నాటి పిఠాపురం సంస్థానధీశుల వారుసులా అంటే అదీ లేదు. ‘చెట్టు కాయలు చెప్పుకుని’ సామెత చందంగా ఆ రాజుల పాలనతో సరితూగేలా పాలన అందిస్తున్నట్టు గొప్పలకు పోతుండటమే ప్రస్తుత పిఠాపుర రాజ్యంలో జనానికే కాదు రాజు చుట్టూ ఉండే పరివారానికి కూడా నచ్చడం లేదు. పిఠాపురం రాజులతో ఏ రకంగాను పోల్చుకోవడానికి కూడా ఇప్పటి రాజు సరిపోరని చెప్పొచ్చు. ఎందుకంటే పిఠాపురం సంస్థానాన్ని ఏలిన దాదాపు రాజులంతా దళిత జనోద్ధరణ కోసం అహర్నిశలూ శ్రమించారనే చెప్పాలి. తెలుగు నిఘంటువు తయారుచేయించింది, కవులను ప్రోత్సహించింది కూడా వారే. అంతెందుకు వారి యావదాస్తిని విద్యావ్యాప్తి కోసం ఒంటిచేత్తో దానం చేశారు. కోట్ల విలువైన వందలాది ఎకరాలను నిరుపేద కుటుంబాల్లో పిల్లల చదువుల కోసం దానంచేసి చరిత్రలో నిలిచిపోయారు. . భజన బృందం ... నాటి రాజులతో సమానంగా పాలన అందిస్తున్నామని నేటి తరం రాజు గొప్పగా చెప్పుకుంటుంటారు. రాజ్యంలో పౌరులు భారీ మెజార్టీతో రాజ్యాధికారాన్ని అప్పగించారంటే అదంతా తన గొప్పతనమని నేటి రాజు గుడ్డిగా నమ్ముతారు. నాడు చంద్రవంశ రాజుతో కలిసి వేసిన పాచికపారడంతోనే అధికారం దక్కిందనే వాస్తవాన్ని నేటి రాజు ఎంతమాత్రం విశ్వసించరు. అందుకే అడుగులకు మడుగులొత్తే సామంతులను చేరదీసి అంతఃపురంలో అందలాలు ఎక్కించడం వారు భజనలను ఆలకించడం నేటి రాజుకు పరిపాటిగా మారింది. అదంతా తన గొప్పతనమేనని రాజసం ఉట్టిపడేలా వ్యవహరిస్తారు. మూడేళ్ల పాలనలో రాజ్యంలో పౌరులకు తాను ఎంతో చేశానని తనకు తానుగా గొప్పగా ఆ రాజు భావిస్తున్నారు. అది నిజమా కాదా అని తెలుసుకుని చెవిలో వేయాలని వేగులను పంపించారు. పక్షం రోజులు దేశ సంచారం చేసి వచ్చిన వేగులంతా నిత్యం రాజు వెంట ఉండే భజన బృందమే. రాజ్యంలో చూసి వచ్చిన వాస్తవాలన్నీ రాజు చెవిలో వేస్తే వాస్తవాలంటే గిట్టని ఆ రాజుకు దూరమైపోతామని భయపడ్డారు. అందుకే కాబోలు రాజ్యంలో జనులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని సెలవిచ్చారు. ఇంకేముంది ఎక్కడ అడుగుపెడితే అక్కడ పూలాభిషేకంతో స్వాగతం పలుకుతారనే అత్యాశతో రాజు రాజ్యంలోని 50 పరగణాలను చుట్టి రావాలని అంతఃపురంలో నిర్ణయం తీసుకున్నారు. చైతన్య రథంపై పరివారాన్ని వెంట తీసుకుని మందీ మార్బలంతో బయలుదేరారు. . ఛీత్కారాలే... రాజు మనసు పొరుగున ఉన్న సామంత రాజ్యంపై పడింది. ఆ రాజ్యంలో ఊరూవాడా తిరగడం మొదలుపెట్టారు. ఎక్కడకు వెళ్లినా పౌరుల నీరాజనాలకు బదులు ఛీత్కారాలతో చుక్కెదురవుతుండటంతో రాజు కల చెదిరింది. నాటి పీఠికాపుర రాజులు దళితోద్ధరణకు ఎంతో కృషిచేయగా నేటి తరం రాజు ఆ వర్గాల అభ్యున్నతి కోసం ఖజానాకు వచ్చిన నిధులు సకాంలో ఖర్చుచేయక తిరిగి చంద్రవంశ రాజు ఖజానాకు పోయాయని వెళ్లిన చోటల్లా జనం తిట్ల పురాణం అందుకుంటున్నారు. దాంతో రాజుకు చిర్రెత్తుకు వచ్చినా లెక్క చేయకుండా రాజసం ఉట్టిపడేలా బయలుదేరిన రెండు రోజులకే రాజుకు పౌరులు చుక్కులు చూపించారు. ఆ రాజ్యంలో చినుకు పడితే పాపం పాదచారులకు కూడా కష్టమే. కంపుకొట్టే మురుగు కాలువలు, వెలగని వీధిలైట్లు చూపించి పీఠికాపురం వారసులమని చెప్పుకునే రాజులు చేసే పాలన ఇదేనా అని అతివలు పిల్లాపాపలతో చుట్టుముట్టేయడంతో రాజు దిక్కులుచూడటం తప్ప ఏమీ చేయలేకున్నారు. వారి రాజ్యాన్ని పాలిస్తున్న రాజు అనే విషయాన్ని కూడా ఆ క్షణంలో వారు మరిచిపోయారు. సామంత రాజ్యంలోని 11వ పరగణాలో అయితే మహిళలు రాజు రథం వెంటపడి పరుగులుపెట్టించారు. దారి చూపిస్తామని చెప్పి ఏడాదైపోయింది ఇప్పుడు వచ్చి ఏమి చేస్తారనడంతో అసలే రాజు ఆపై కోపం ముచ్చుకొచ్చింది. అయినా ఏమి చేయలేక తమాయించుకున్నారు. మీ పాలనా కాలంలో ఏనాడైనా వచ్చి పట్టించుకున్నారా అని పౌరులు ప్రశ్నల వర్షం కురిపించడంతో కల చెదిరింది...కథ మారింది..ఇక కన్నీరే మిగిలింది అనే పాట అందుకుని అంతఃపురంలో శయనమందిరం వైపు అడుగులు వేశారు. -
మూర్ఖుడన్న గురువే మేలు!
అతనొక రాజు. జెన్ గురించి నేర్చుకోవాలని అనుకున్నాడు. కానీ ఎవరి దగ్గర నేర్చుకోవాలో తెలియలేదు. మంత్రులను సమావేశపరిచాడు. మనసులోని మాట చెప్పాడు. అందరూ కలిసి ఒక్క మాటగా ఇద్దరు గురువుల పేర్లు చెప్పారు. ఆ ఇద్దరూ మహానుభావులే. వారిలో ఎవరినో ఒకరిని ఎంపిక చేసుకోవాలి కాబట్టి ఇద్దరినీ తన తన ఆస్థానానికి పిలిపించాడు. వారితో తన ఆసక్తిని చెప్పాడు. అప్పుడు మొదటి గురువు ‘‘రాజా! నువ్వు గొప్ప మేధావి. నీకు జెన్ నేర్పడం నాకు మహా ఆనందం’’ అన్నాడు చిర్నవ్వుతో. రెండోగురువు తొలి గురువు వంక కోపావేశంతో చూసాడు ‘‘రాజు తెలివితక్కువ వాడు. అతనికి జెన్ గురించి చెప్పాలంటే అనేక సంవత్సరాలు తలకిందులుగా నిలిచి మూడు చెరువుల నీళ్ళు తాగాలి. విద్య నేర్పడం అంత సులభం కాదు’’ అన్నాడు గట్టిగా.. ఆ రెండో గురువు మాటలు విని మంత్రులు భయంతో ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. అయిపోయింది..... రాజుని తెలివిలేని వాడని చెప్పిన రెండో గురువు తల తెగి నేలపడటం ఖాయం’’ అని అనుకున్నారు. కానీ రాజు అలా చెయ్యలేదు. ఆ రెండో గురువునే ఎంచుకున్నాడు. ఆయన దగ్గరే జెన్ గురించి నేర్చుకోవాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? ‘‘నన్ను గొప్ప మేధావి అని అనుకుంటున్న మనిషి దగ్గర నేనెలా కొత్త విషయాలు నేర్చుకోగలను? ఆయనకన్నా నన్ను తెలివిలేని మూర్ఖుడని చెప్పిన రెండో గురువు దగ్గరైతేనే నేను కొద్దో గొప్పో నేర్చుకోవడానికి వీలు ఉంటుంది... అదే నాకు మేలు చేస్తుంది. నా ఆశయం సిద్ధిస్తుంది’’ అన్నాడు రాజు. – యామిజాల జగదీశ్ -
కింగ్స్ ఫుడ్‌కోర్టు ప్రారంభం
మంకమ్మతోట : నగరంలోని ఆర్టీసీ బస్డాండ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కింగ్స్ఫుడ్ కోర్డును కరీంనగర్ డీఎస్పీ రామారావు ప్రారంభించారు. స్వయం కృషితో ఎదగాలని టిఫిన్స్ అండ్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్న నిర్వాహకుడు ఎ. చంద్రశేఖర్‌ను అభినందించారు. ఖలీమ్, అజీమ్, తాజ్ తదితరులు పాల్గొన్నారు. -
రైస్‌మిల్లులో వ్యక్తి ఆత్మహత్య
దుగ్గొండి మండలం మధిరలోని ఓ రైస్‌మిల్లులో రాజు(30) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ దొంగతనం కేసులో రైస్‌మిల్లు యాజమాని వేధింపులవల్లే రాజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో రైస్‌మిల్లు ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓ పక్క దేశానికి రాజు మరో పక్క మెకానిక్!
బెర్లిన్: ఎవరైనా ఏకకాలంలో పరస్పర భిన్నమైన జీవితాలను గడపడం చరిత్రలోనే అరుదు. అందులో రాజభోగాలు అందుబాటులో ఉండే ఓ దేశానికి రారాజుగా, మరో దేశంలో కష్టపడి పనిచేసే కారు మెకానిక్‌గా జీవించడమనేది అసలు ఉండదు. కానీ పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశం రాజు సెఫాస్ కోసి బాన్సా, పార్ట్ టైమ్ రాజుగాను, జర్మనీలో ఫుల్‌టైమ్ కారు మెకానిక్‌గాను పనిచేస్తున్నారు. వృత్తికి అంకితమై పనిచేసే వ్యక్తిగా జర్మనీ కస్టమర్ల ప్రశంసలు అందుకుంటున్న బాన్సా, ‘స్కైప్’ ద్వారా రాజ్యపాలను కొనసాగిస్తూ ఘనా ప్రజల మన్ననలను అందుకుంటున్నారు. జర్మనీలోని లుద్విగ్షాఫెన్లో సొంతంగా కారు మెకానిక్ షెడ్‌ను నడుపుతూ కుటుంబ జీవితాన్ని గడుపుతున్న 67 ఏళ్ల బాన్సాకు తూర్పు ఘనాలో పెద్ద రాజ ప్రాసాదమే ఉంది. ఆయన్ని అక్కడ ‘కింగ్ టోంగ్బే ఎన్గోరిఫియా సెఫాస్ కోసి బాన్సా’ అని వ్యవహరిస్తారు. అక్కడి ప్రజలకు ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనే. మొత్తం 20 లక్షల మంది ప్రజలకు ఆయన పాలకుడు. ఆయన రాజ ప్రాసాదం ఉన్న నగరంలోనే మూడు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. బాన్సా రాజు కాకముందే 1970లో చదువుకోసం జర్మనీ వచ్చారు. మంచి నైపుణ్యం గల మెకానిక్ కావాలంటూ తండ్రి ప్రోత్సహించడంతో బాన్సా చదువు పూర్తికాగానే మెకానిక్‌గా స్థిరపడ్డారు. 1987 వరకు ఆయన జీవితం ఓ మెకానిక్‌గా సాఫీగానే సాగిపోయింది. అప్పుడే ఆయనకు ఘనా రాజ ప్రాసాదం నుంచి అర్జెంట్‌గా రావాల్సిందిగా కబురు వచ్చింది. అప్పటి వరకు రాజుగా కొనసాగిన బాన్సా తాత కింగ్ ఆఫ్ హోహో మరణించారు. బాన్సాకు అప్పటికీ తండ్రి, ఓ అన్నయ్య ఉన్నారు. అయితే వారిద్దరు ఎడమ చేతి వాటంగాళ్లు అవడంతో రాచరిక సంప్రదాయం ప్రకారం వారు సింహాసనానికి అనర్హులయ్యారు. దాంతో సింహాసనం వారుసుడిగా బాన్సా ఎంపికయ్యారు. రాజుగా పట్టాభిషేకం జరిగింది. ఆనవాయితీగా ఆధ్యాత్మిక గురువుగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఎవరైనా రాజు బాధ్యతలు స్వీకరించాక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. పాత జీవితాన్ని తృణప్రాయంగా తిరస్కరిస్తారు. కానీ బాన్సాకు తాను ఎంతోకాలంగా చేస్తున్న మెకానిక్ వృత్తిని వీడాలనిపించలేదు. అప్పటి నుంచి రెండు విధులను నిర్వహిస్తున్నారు. ఏడాదికి ఎనిమిది సార్లు ఘనాకు వెళ్లి వస్తుంటారు. మిగతా సమయాల్లో స్కైప్ ద్వారా తన సలహాదారులలో సంప్రదింపులు జరుపుతూ పాలనా వ్యవహారలాను చూస్తున్నారు. ఘనాలో ప్రస్తుతం డెమోక్రటిక్ వ్యవస్థ ఉన్నప్పటికీ రాజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అన్ని ఎయిడెడ్ కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఇప్పటికే ఘనాలో ఎన్నో పాఠశాలలను కట్టించిన బాన్సా ప్రస్తుతం ఘనాలో మహిళల కోసం ప్రత్యేక జైలును నిర్మించేందుకు ఆయన అంతర్జాతీయంగా విరాళాలు సేకరిస్తున్నారు. బాన్సాకు భార్య గాబ్రియెల్ బాన్సా (57), ఇద్దరు పిల్లలు కార్లో, క్యాథరినాలు ఉన్నారు. 16 ఏళ్ల క్రితం బాన్సా వివాహం రాయల్ స్టేటస్ ప్రకారమే జరిగింది. ఆయనతోపాటు ఘనా వెళ్లి మొన్ననే తిరిగొచ్చిన జర్మనీ ఫొటోగ్రాఫర్ ఒకరు ఈ విషయాలను తోటి మీడియాతో పంచుకున్నారు. -
కుక్కను అవమానించినందుకు 37 ఏళ్ళ జైలు
విశ్వాసానికి మారుపేరుగా శునకాలను చెప్తాం. అంతటి ప్రేమను చూపించే పెంపుడు జంతువులను యజమానులూ ప్రాణప్రదంగా సాకడం కళ్ళారా చూస్తున్నాం. కానీ అదే శునకాన్ని అవమానించిన కారణంగా ఏళ్ళ తరబడి జైలు శిక్షపడటం ఎక్కడైనా చూశారా? ఇప్పుడు థాయిలాండ్ లో అదే జరిగింది. రాజుగారిని దేవుడి అవతారంగా, అత్యంత గౌరవంగా చూసే ఓ సాధారణ వ్యక్తి... ఆయనగారి శునకాన్ని అవమానించాడట.. ఇంకేముందీ అతగాడికి ఏకంగా 37 ఏళ్ళ జైలు శిక్ష పడింది. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా.. థాయ్ చట్టప్రకారం జరిగిన విషయం... సామాజిక మాధ్యమాలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో... అన్నికష్టాలు కూడా ఉన్నాయనడానికి థాయ్ సంఘటన నిదర్శనంగా చెప్పొచ్చు. అందుబాటులో ఉందికాదాని సోషల్ మీడియాను ఎడా పెడా వాడేస్తే.. ఏమౌతుందో ఈ సంఘటన చెప్పకనే చెప్తోంది. ఓ సాధారణ వ్యక్తి సోషల్ మీడియాలో రాజుగారి కుక్కపై చేసిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు అతడి తలకు చుట్టుకున్నాయ్. థాయిలాండ్ చట్టాల ప్రకారం సైనిక న్యాయస్థానాలు అతడికి ఏకంగా 37 ఏళ్ళ జైలు శిక్షను విధించాయి. సుమారు 2002 సంవత్సరంలో కింగ్ భూమిబోలో అతడి పెంపుడు శునకం టాంగ్ డేంగ్ పై ఓ పుస్తకం రాశాడు. ఆ పుస్తకం స్ఫూర్తితో ఆ తర్వాత 'ఖూన్ టాంగ్ డేంగ్' పేరిట ఓ యానిమేటెడ్ చిత్రం కూడా రూపొందింది. టాంగ్ డేంగ్ అన్న పేరున్న ఆ సైనిక శునకాన్ని నిజంగా ఆ వ్యక్తి ఏమని దూషించాడో కచ్చితంగా చెప్పలేదు కానీ.. రాచరిక పాలనలో ఉన్నకఠిన చట్టాలను ఉల్లంఘించినందుకే అతడికి శిక్ష విధించి, గతవారం అరెస్టు చేసినట్లు మాత్రం తెలుస్తోంది. -
సౌదీ అరేబియా రాజు కన్నుమూత
రియాద్: సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా(90) కన్నుమూశారు. అబ్దుల్లా శుక్రవారం ఒంటి గంటకు (స్థానిక కాలమాన ప్రకారం) మరణించారని సౌదీ అరేబియా రక్షణ మంత్రి సల్మాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో తదుపరి రాజుగా దివంగత అబ్దుల్లా తమ్ముడు మోక్రేన్ కు బాధ్యతలు అప్పచెబుతున్నట్లు ఆయన తెలిపారు. తొలుత అబ్దుల్లా సంస్మరణార్ధం రాయల్ ప్యాలెస్ లో నిర్వహించే ప్రార్థనలకు దేశ ప్రజలందరినీ ఆహ్వానించారు. అనంతరం అబ్దుల్లా అంత్యక్రియలు జరగనున్నాయి. గత డిసెంబర్ లో అబ్దుల్లా న్యుమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు గొట్టాల ద్వారా కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. ఆయన 2005లో సౌదీ అరేబియా రాజుగా దేశ పగ్గాలు చేపట్టారు. ఆయన ఈ మధ్యే సిరియాలో ఇస్లామిక్ స్టేట్ జరిపిన మారణకాండకు వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణంలో చేరారు. ఆయన మరణానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం ప్రకటించారు. -
పెళ్లింట... ఒబామా ఆట...
రాజు తలచుకుంటే దెబ్బలకే కాదు దోస్తానాకూ కొదవుండదని అర్థమై ఉంటుందా పెళ్లివారికి. అమెరికాలోని హవాలిలో నివసించే ఆర్మీ అధికారులు నాటాలీ హెల్మెల్, ఎడ్వర్డ్ మాల్యూలు గత ఆదివారం తమ పెళ్లికని కనొహె గోల్ఫ్‌కోర్స్‌లో ఏర్పాట్లన్నీ చేసేసుకున్నారు. తీరా పెళ్లికి పూట ఉందనగా.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్నేహితులతో కలిసి ఆదివారం గోల్ఫ్ ఆడడానికి వస్తున్నారు కాబట్టి పెళ్లి వేదికను మార్చుకోమని కబురు. సాక్షాత్తూ ప్రెసిడెంట్ గారు ఆడుకోవడానికి వస్తుంటే పెళ్లీ పేరంటాలు ఒక అడ్డా?! దాంతో ఉస్సురంటూ ఆదరా బాదరాగా తమ సెటప్ మొత్తం అక్కడి నుంచి వేరే చోటుకి మార్చేసుకున్నారు. సరే. ఏమైతేనేం, పెళ్లి అయిపోయిన కాసేపటికి పెళ్లివారికి ఒబామా నుంచి ఫోన్. తన ఆట కారణంగా వారికి కలిగిన ఇబ్బందికి సారీ చెప్పడంతో మొదలుపెట్టి, హనీమూన్ నుంచి గోల్ఫ్ ఆట విశేషాల దాకా వధూవరులతో కాసేపు ముచ్చటించి మరీ బై చెప్పారట. దీంతో వధూవరులు ఉబ్బితబ్బిబ్బయిపోయి... ఇది తమకు ఒక మెమొరబుల్ డే అంటూ అధ్యక్షుల వారి ఆట దెబ్బకు తమ పెళ్లి అడ్రస్ మారిపోవడాన్ని లైట్ తీసేసుకున్నారు. -
కింగ్ మేకర్లు కాదు.. కింగ్లే కావాలి
కరీంనగర్ రూరల్ : గ్రామాల్లో కింగ్ మేకర్లుగా ఉన్న మున్నూరుకాపులు ఇకనుంచి కింగ్‌లుగా మారాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. కరీంనగర్ మండలం బొమ్మకల్ లోని మున్నూరుకాపు హాస్టల్లో ఆదివారం నిర్వహించిన మున్నూరుకాపు ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మానం, వన భోజన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో మున్నూరుకాపుల జనాభా ఎక్కువగా ఉందని, రిజర్వేషన్లతోనే రాజకీయాల్లో భాగస్వామ్యం పెరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలకు ఉన్నత పదవులు లభించినట్లు చెప్పారు కులస్తులంతా కలిసికట్టుగా ఉండి రాజకీయాల్లో రాణించాలని రామగుండం, మంథని ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, పుట్ట మధు సూచించారు. హాస్టల్ నిర్మాణానికి తన కోటా నుంచి రూ. 20లక్షలు మంజూరు చేస్తానని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. బొమ్మ వెంకటేశ్వర్లును మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అనంతరం మంత్రి రామన్నతోపాటు పలువురు ప్రజాప్రతినిధులను సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో ఆహ్మాన కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సాన మారుతి, బిరుదు రాజమల్లు, మాజీ అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణ, కరీంనగర్ డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ ఎల్. రాజయ్య, జెడ్పీటీసీ సభ్యుడు ఎడ్ల శ్రీనివాస్, అర్బన్‌బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్, కార్పొరేటర్లు బండి సంజయ్‌కుమార్, గందె మాధవి, శ్రీదేవి, స్వరూపరాణి, ఆకులప్రకాశ్, బండారి వేణు, శ్రీకాంత్, సంఘం నాయకులు కాశెట్టి శ్రీనివాస్, నందెల్లి ప్రకాశ్,జంగిలిసాగర్, దాది సుధాకర్, చెట్టి జగన్,నలువాల రవీందర్, చల్లా హరిశంకర్, రామస్వామి, భూమయ్య, రవికిరణ్, నరేందర్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఈ ప్రశ్నకు బదులేది?
పురాతనం తవ్వకాల్లో సమాధులు బయటపడడం కొత్తేమీ కాదు. అయితే ఇటీవల చైనాలో బయటపడిన ఒక సమాధి మాత్రం చిన్నపాటి సంచలనం సృష్టించింది. రెండు వేల సంవత్సరాల క్రితం నాటి లియు ఫెయి అనే రాజు సమాధి అది. లియు రాజు చైనాలోని జియాంగ్డ్ ప్రాంతాన్ని ఇరవై ఆరు సంవత్సరాల పాటు పరిపాలించాడు. నాలుగు వందల తొంభై మీటర్ల పరిధిలో ఉన్న ఈ సమాధిలో రకరకాల సంగీత పరికరాలు, పెద్ద రథం, రకరకాల ఆయుధాలు, మధువు సేవించే పాత్రలు...మొదలైన విలువైన వస్తువులను కనుగొన్నారు. బంగారం, వెండితో తయారుచేసిన వస్తువులతో పాటు లక్ష నాణేలు కూడా ఉన్నాయి. వంట గదిలాంటి నిర్మాణం కూడా ఉంది. చైనాలోని నాన్జింగ్ మ్యూజియానికి చెందిన పరిశోధక బృందం ఈ తవ్వకాలు చేపట్టింది. ఒకరికి ఇష్టమైన వస్తువులను వారితో పాటి సమాధి చేయడం అనేది చాలా దేశాల్లో ఉంది. ఇలా చేయడం వల్ల మరుజన్మలో కూడా ఈ వస్తువులను వారికి చెందుతాయనేది ఒక నమ్మకం. లియు సమాధిలో విలువైన సంపద ఉండడం కూడా దీనిలో భాగమే. ‘‘లియు రాజు జీవనశైలి చాలా ఆడంబరంగా ఉండేది. ధైర్యవంతులనూ, దృఢకాయులై వ్యక్తులనూ బాగా ఇష్టపడేవాడు. రాజ్యంలోని యోధులను పిలిచి తరచుగా మాట్లాడేవాడు. రాజప్రాసాదాలు, ఎత్తై పరిశీలన కేంద్రాలు నిర్మించడం అంటే ఆయనకు ఇష్టం. ఎప్పుడు చూసినా ఆవేశం మూర్తీభవించినట్లు కనిపించేవాడు’’ అని ప్రాచీన చరిత్రకారులు లియు గురించి రాశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎన్నో విలువైన వస్తువులు ఉన్న సమాధిలో లియు రాజు శరీరం కనిపించలేదు. శవపేటిక దెబ్బతిని ఉంది. లియు సమాధిలో కనిపించిన భిన్న రకాల వస్తువులు...ఆనాటి కాలాన్ని దృశ్య రూపంలో చెబుతున్నట్లుగ ఉన్నాయి. ఇది సరేగానీ, ఇంతకీ లియు శరీరం ఎలా మాయమైనట్లు? ఒకవేళ దొంగలే ఈ పని చేశారు అనుకుంటే, మరి విలువైన సంపదను ఎందుకు విడిచి పెట్టారు?! -
సన్మార్గం : దానం ఎప్పటికీ చెడని పదార్థం
పూర్వం ఇంద్రద్యుమ్నుడనే రాజు అనేక పుణ్యకార్యాలు చేసి, యజ్ఞయాగాలు నిర్వహించి అందరిచేత మంచివాడనిపించుకుని తనువు చాలించాక స్వర్గలోకానికి వెళ్లాడు. ఏళ్లు గడిచేసరికి భూలోకంలో ఆయన కీర్తి మాసిపోయి, ఆ పేరుగల రాజు ఒకప్పుడు ఉండేవాడన్న సంగతి కూడా ప్రజలకు జ్ఞప్తిలేకుండా పోయింది. అప్పుడు దేవతలు ఇంద్రద్యుమ్నుడిని భూమి మీదకు తోసివేశారు. ఇంద్రద్యుమ్నుడు బాధపడుతూ మార్కండేయ మహర్షి దగ్గరకు వెళ్లి ‘‘మహర్షీ! నేనెవరో తెలుసు కదా, నా పేరు ఇంద్రద్యుమ్నుడు’’ అన్నాడు. మహర్షి ఆయనను తేరిపార చూసి ‘‘నాయనా! నీవెవరో నాకు తెలియదు. నీ పేరు నేనెప్పుడూ వినను కూడా వినలేదు. అయినా నేను హిమగిరివాసిని. రాజులూ, వాళ్ల చరిత్రలతో నాకు సంబంధం లేదు’’ అని చెప్పా డు. ‘‘మహర్షీ! మీ కంటే ముందు పుట్టి సజీవులుగా ఉన్నవాళ్లు ఎవరైనా ఉన్నారా? ఉంటే సెలవియ్యండి. వాళ్ల దగ్గరకి వెళ్లి వారికి నేను తెలుసేమో విచారిస్తాను’’ అన్నా డు ఇంద్రద్యుమ్నుడు. మంచుకొండ మీద గూబ ఒకటుంది. దాని పేరు ప్రావారకర్ణుడు. అది నాకంటే చాలా ఏళ్ల ముందు పుట్టింది. వెళ్లి దానిని అడిగి తెలుసుకో నాయనా’’ అన్నాడు మార్కండేయుడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు అశ్వాకారం ధరించి మహర్షిని మోసుకుంటూ ప్రావారకర్ణుడు ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లాడు. ‘‘ఉలూకమా! నేనెవరో నీకు తెలుసు కదా!’’ అన్నాడు రాజు తన నిజస్వరూపం చూపి, తన కథంతా చెప్పాక. ప్రావారకర్ణుడు కాసేపు ఆలోచించి ‘‘నాకు తెలియదు’’ అన్నాడు. రాజు సిగ్గుపడ్డాడు. ‘‘నీకంటే ముందు పుట్టి చిరంజీవులుగా ఉన్నవారెవరైనా ఉన్నారా?’’ అని మళ్లీ ప్రశ్నించాడు. ‘‘ప్రావారకర్ణుడు కాసేపు ఆలోచించి ‘‘ఇక్కడకు దగ్గరలో ఒక సరస్సు ఉంది. అక్కడ నాడీఝంగుడనే కొంగ ఉంది. అది నాకంటే వయస్సులో పెద్దది’’ అని చెప్పాడు. ఇంద్రద్యుమ్నుడు మార్కండేయ మహర్షిని, ప్రావారకర్ణుని మోసుకుంటూ సరోవరం దగ్గరకు వెళ్లి కొంగను కలుసుకుని, ‘‘నీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా?’’ అని అడిగాడు. అది కూడా కొంతసేపు ఆలోచించి తెలియదని తల అడ్డంగా ఊపింది. తనకంటే ముందు పుట్టి, తనతోపాటు ఆ సరస్సులో ఉంటున్న తాబేలుకు తెలుసేమో కనుక్కుంటానంది. సరేనన్నాడు రాజు. అందరూ అక్కడే ఉండి, తాబేలుకు కబురు పంపారు. వణుక్కుంటూ వచ్చిన ముసలి కమఠంతో ‘‘ఇంద్రద్యుమ్నుడు తెలుసా?’’ అంది ప్రావారకర్ణుడు. కమఠం కాసేపు ఆలోచించి, తనలో తాను ఏదో గొణుక్కుని ‘‘నేను ఆయనను ఎరక్కపోవడమేమిటి? ఆ మహానుభావుడు చేసిన దానాలు మరెవరూ చేసి ఉండరు. ఎన్నో గోదానాలు, ఎన్నో భూదానాలు, నిత్యసంతర్పణలు జరిగేవి. ఆ మహనీయుడు భూసురులకు దక్షిణగా వేనవేల గోవులు దానం చేయడం వల్ల ఆ గోవుల తొక్కిళ్ల చేత ఈ సరస్సు ఏర్పడింది. అసలు ఈ సరస్సు పేరే ఇంద్రద్యుమ్నం.’’ అని చెప్పి ఆ మహానుభావుని స్మరిస్తూ నమస్కరించింది కూర్మం. ‘‘నేనే ఆ ఇంద్రద్యుమ్న మహారాజుని’’ అని చెప్పి రాజు కూడా కమఠానికి నమస్కరించాడు. ఇంద్రద్యుమ్నుడిని ప్రత్యక్షంగా చూడగలిగినందుకు తన జన్మ ధన్యమైందని సంతోషించింది ముసలి తాబేలు. ఎన్నో వేల ఏళ్ల తరువాత కూడా ఇంద్రద్యుమ్న మహారాజు గొప్పతనాన్ని, ఆయన చేసిన పుణ్యకార్యాలనూ ఒకరైనా గుర్తు పెట్టుకున్నందుకు దేవతలు సంతోషించి, దివి నుండి భువికి వచ్చి, ‘‘మహారాజా! ఇప్పటికీ భూలోకంలో నీ కీర్తి మాసిపోనందుకు మాకు సంతోషంగా ఉంది. నీవు మాతోపాటు స్వర్గంలోనే ఉండాలి. ఇది మా అందరి కోరిక’’ అని పలికారు. ఇంద్రద్యుమ్నుడు కృతజ్ఞతగా నమస్కరించాడు. మార్కండేయ మహర్షిని, గూబను, కొంగను వారి వారి స్థానాలలో వారిని విడిచిపెట్టి దేవతలు ఇంద్రద్యుమ్నుడిని తమతో స్వర్గానికి తీసుకువెళ్లారు. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు సూతమహర్షి ధర్మరాజుకి ఈ కథ చెప్పి, ‘‘ధర్మరాజా! అన్నిదానాలలోఅన్నదానం ఉత్తమం. అన్నదానం చేయలేనివాడు పిడికెడు మెతుకులు పెట్టే ఇల్లు చూపించినా పుణ్యం లభిస్తుంది’’ అంటూ దానధర్మస్వరూపాన్ని వివరించాడు. అంటే చేసిన పుణ్యం ఎప్పటికీ చెడని పదార్థం. పుడమిపై కీర్తి ఎంతకాలం ఉంటుందో, అంతకాలం స్వర్గంలో ఉంటారు మానవులు. అపఖ్యాతి ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. బతికినన్నాళ్లూ పుణ్యకార్యాలు చేసి, అందరి దీవెనలు పొంది యశస్సును ఆర్జించుకోవాలి. - శొంఠి విశ్వనాథం -
ఆ నాలుగు దోషాలు లేనినాడే న్యాయం!
సిద్ధార్ధ గౌతముడు బుద్ధుడు కాకముందు ఐదువందల నలభై ఏడు జన్మలు ఎత్తినట్లు బౌద్ధగ్రంథాలు చెబుతున్నాయి. బుద్ధుని పూర్వజన్మలకు సంబంధించిన కథలే ఈ జాతక కథలు. మానవునిలో అనివార్యంగా ఉండాల్సిన ప్రేమ, కరుణ, సహనం, మైత్రీభావాల గురించి సూటిగా, స్పష్టంగా తెలియజేసే ఈ కథల నుంచి మచ్చుకు ఒకటి. పూర్వం కాశీరాజ్యాన్ని బ్రహ్మదత్తుడు పాలించేవాడు. ఓరోజు రాజుగారు రథం మీద విహారానికి వెళ్లి వచ్చారు. సేవకులు ఆ గుర్రాలను విప్పారు. కానీ, రథానికీ, గుర్రాలకూ కట్టే తోలు పట్టెడలను విప్పి, భద్రం చేయకుండానే వెళ్లిపోయారు. ఆ రాత్రి వాన పడింది. ఆ తోలు పట్టెడలు నాని, మెత్తబడ్డాయి. వాసన కొట్టాయి. ఆ వాసన పసిగట్టిన రాజుగారి పెంపుడు కుక్కలు వచ్చి, వాటిని కొరికి, తినేశాయి. తెల్లారి రాజుగారికి ఈ విషయం తెలిసింది. ‘‘ఎలా జరిగింది?’’ అని అడిగాడు. ప్రభూ! మన కోటగోడ తలుపులు మూసే ఉన్నాయి. కానీ మురుగు నీరు పోయే తూములగుండా ఊరకుక్కలు వచ్చి ఈ పని చేసి ఉండవచ్చు’’అని భటులు చెప్పారు. రాజుకు కోపం వచ్చింది. ‘‘కనిపించిన ఊరకుక్కలన్నింటినీ చంపేయండి’’ అని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే! భటులు కుక్కల వెంట పడ్డారు. చాలా కుక్కల్ని చంపేశారు. కొన్ని చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనై ప్రాణాలతో పారిపోయాయి. చావగా మిగిలిన కుక్కలన్నీ ఊరి చివరన ఉన్న శ్మశానం వద్దకు చేరాయి. అక్కడ వాటి రాజు ఉన్నాడు. అవి తమగోడు కుక్కల రాజుకు చెప్పుకున్నాయి. ‘‘మిమ్మల్నిలా చంపడానికి కారణం ఏమిటి?’’ అని అడిగాడు ఆ కుక్కలరాజు. ‘‘రాజా! రాత్రి కాశీరాజుగారి తోలు పట్టెళ్లను కుక్కలు తినేశాయట. మేమే ఆ పని చేశామని రాజుగారు మాకీ దండన విధించారు. కాని నిజానికి మాకే పాపం తెలియదు’’అన్నాయి. ఆ కుక్కలరాజు వెంటనే కుక్కలన్నింటినీ తీసుకుని రాజాస్థానానికి బయల్దేరాడు. కోటద్వారం వద్దే కుక్కలన్నింటినీ ఉంచి, తానొక్కడే కోటలోకి ప్రవేశించాడు. రాజభటులు చూస్తుండగానే రాజుగారి పక్కనే ఉన్న న్యాయపీఠం కిందికి దూరి కూర్చున్నాడు. భటులు కర్రలతో ఆ కుక్కల రాజును కొట్టి చంపడానికి సిద్ధమయ్యారు. సింహాసనం మీద కూర్చున్న రాజుగారు అది చూసి వారిని వారించి... ‘‘ఓ శునకమా! బైటకురా! ఎందుకు ఇలా వచ్చావు? ఎవరు నీవు?’’ అనడిగాడు. అప్పుడు కుక్కలరాజు బైటకు వచ్చి, సభ మధ్యలో నిలబడి- ‘‘రాజా! నేను కుక్కలకు రాజును. ఊరకుక్కల్ని చంపమని ఆజ్ఞ ఇచ్చారట..?’’ అని అడిగాడు. ‘‘ఔను, నేనే!’’ ‘‘ఎందుకలా ఇచ్చారు?’’ ‘‘మా రథం పట్టెళ్లని ఊరకుక్కలే కొరికి తినేశాయి కాబట్టి... కుక్కలన్నింటినీ చంపమని ఆజ్ఞ ఇచ్చాను’’ ‘‘మీ ఆజ్ఞ మీ రాజ్యంలోని కుక్కలన్నింటికా? కేవలం ఊరకుక్కలకేనా?’’అని ప్రశ్నించాడు కుక్కలరాజు. ‘‘అంటే..?’’ ‘‘ఈ పని మీ పెంపుడు కుక్కలు ఎందుకు చేయకూడదు?’’ ‘‘మా రాచకుక్కలా? అవి జాతికుక్కలు. ఇలాంటి పని అవి చేయవు. అసంభవం. ఇది ఊరకుక్కల పనే’’అన్నాడు రాజు. ‘‘నేరం నేను నిరూపిస్తాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వగలరా?’’ అని అడిగాడు కుక్కలరాజు. కాశీరాజు ఆశ్చర్యపడ్డాడు. సభలోని వారంతా నోరెళ్లబెట్టారు. ‘‘ఓ! తప్పక నిరూపించు’’అన్నాడు రాజు. ‘‘రాజా! ఓ గుప్పెడు దర్భమొలకల్ని తెప్పించి, వాటిని బాగా నూరి మజ్జిగలో కలిపి, మీ రాచకుక్కలకి తాగించండి’’ అన్నాడు. రాజాజ్ఞ మేరకు ఆ కుక్కలన్నింటికీ దర్భ ఇగుళ్లు నూరి కలిపిన మజ్జిగ తాగించారు భటులు. ఆ మజ్జిగ తాగిన వెంటనే కుక్కలకు వాంతి అయ్యింది. అందులో తోలుముక్కలు కనిపించాయి. రాజు సిగ్డుపడ్డాడు. కుక్కల రాజును అభినందించాడు. వెంటనే ఊరకుక్కలకు అభయం ఇచ్చాడు. అప్పుడు కుక్కలరాజు కాశీరాజుతో... ‘‘రాజా! న్యాయాన్యాయాలు నిర్ణయించే వ్యక్తి తులాదండంలాగా ఉండాలి. ఒకరిపట్ల అయిష్టతతో మరొకరి పట్ల పక్షపాతంతో ఉండకూడదు. అలాగే నిర్లక్ష్యంగానూ వ్యవహరించకూడదు. నిజాన్ని నిరూపించడంలో భయపడకూడదు. ఈ నాలుగు దోషాలు లేనినాడే సరైన న్యాయం జరుగుతుంది’’అని చెప్పాడు కుక్కలరాజు. నేరం ఒకరిది, శిక్ష మరొకరిది కాకూడదు. తమ వాళ్లమీద అతిప్రేమ, పని చేసే వాళ్లంటే లోకువ ఉండకూడదు అని బోధించే ఈ కథ ‘కుక్కుర జాతకం’ లోనిది. శ్లోకం, భావం ఆత్మాత్వం గిరిజామతిః సహచరాః ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచనా నిద్రా సమాధి స్థితిః సంచారః పదయో ప్రదక్షిణ స్తోత్రాణి సర్వాదిరో యత్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధానం భావం: శంకరా! నా ఆత్మయే నీవు. నా బుద్ధియే పార్వతి. నా పంచప్రాణాలు, అయిదు ఉపవాయువులు నీకు సహచరులు. నా దేహమే నీకు ఆలయం. నేననుభవిస్తున్న భోగాలు, విషయ సౌఖ్యాలు, వాటికోసం నేను చేస్తున్న ప్రయత్నాలన్నీ నీకు పూజ. నేను నిద్రపోవటమే సమాధి. నిన్ను గురించిన ధ్యానమే నీకు నేను చేసే తపస్సు. నేను ఏ పనిమీద ఎక్కడికి వెళుతూనైనా వేసే ప్రతి అడుగూ నీ గుడి చుట్టూ ప్రదక్షిణం. నేను మాట్లాడే ప్రతి మాటా నిన్ను గురించిన స్తోత్రమే. ఇన్ని మాటలెందుకు? నా దైనందిన వ్యవహారంలో నేను ఏ పని చేసినా అదంతా నీ ఆరాధనమే అనుకో. ఆ విధంగా భావించు. నన్ను అనుగ్రహించు. ఈశ్వరుని గురించి జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించిన శివమానస పూజాస్తోత్రంలోని శ్లోకాలివి. ఇందులో రెండు విశిష్ట భావాలున్నాయి. ధూపదీపాలతో కాకుండా మాసికంగానే శివార్చన చేయడం ఒకటి. శివోహం... అంటే నేనే శివ స్వరూపాన్ని అనే భావన రెండవది. జీవాత్మకూ, పరమాత్మకూ భేదం లేదు. నేను చేసే ప్రతిపనీ నాలో ఉన్న శివుడిని అర్చించడమే అని చెప్పడం అన్నమాట. ఎంత బాగుంది ఈ భావన! -
జయాపజయాలను అంచనా వేయడం మరో వంద సినిమాలు చేసినా నా వల్ల కాదు
మన్మథుడు, కింగ్, గ్రీకువీరుడు... ఇలాంటి టైటిల్స్‌కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న ఈ హ్యాండ్సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన చిత్రం ఇది. వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగార్జునతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ... *** ‘పగలు భాయ్.. చీకటి పడితే ప్లేబోయ్’ అని డైలాగ్ చెప్పారు.. ఇంతకీ ఆరు తర్వాత ఈ ప్లేబోయ్ ఏం చేస్తాడేంటి? (నవ్వుతూ) ఈ మధ్య ఓ ఆస్పత్రిలో షూటింగ్ చేశాం. సాయంత్రం ఆరు ఆవ్వగానే షూటింగ్‌కి పేకప్ చెప్పేసి, అందరం ఇంటికెళ్లే హడావిడిలో ఉన్నాం. అప్పుడు అక్కడున్న నర్సులు ‘ఏంటి సార్. ఆరయ్యింది కదా. ప్లేబోయా? అన్నారు సరదాగా. ఈ డైలాగ్ అంతలా అందరికీ రీచ్ అయ్యింది. ఇంకా ‘భాయ్’ సినిమాలో ఉన్న ఇతర పంచ్ డైలాగ్క్కూడా మంచి స్పందన లభిస్తోంది. ఇక, ఈ ప్లేబోయ్ ఏం చేస్తాడో సినిమాలో చూస్తేనే ఆసక్తికరంగా ఉంటుంది. *** ఇంతకూ ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది? ఫస్టాఫ్ అంతా ప్లేబోయ్లానే కనిపిస్తాను. చాలా సరదా సరదాగా ఉంటుంది. ముఖ్యంగా ఓపెనింగ్ సీన్స్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. మాఫియా డాన్‌లా, హాంగ్‌కాంగ్‌లో ఓ భాయ్‌కి రైట్ హ్యాండ్‌లా, ఓ సాదా సీదా వ్యక్తిలా... మూడు రకాల గెటప్స్‌లో కనిపిస్తాను. *** భాయ్ అంటే డాన్ అని, అన్నయ్యా అనీ అర్థం. మరి... ఆడవాళ్లు మిమ్మల్ని అన్నయ్యా అని పిలుస్తూ రాఖీతో రెడీ అయిపోతే ఏమనిపిస్తుంది? అన్నయ్యా అని పిలిస్తే ఆనందంగానే ఉంటుంది. కానీ, ఒక్క విషయం. నేను చెల్లెలు అనుకున్నవాళ్లందరూ నన్ను అన్నయ్యా అని పిలిచి, రాఖీ కడితే చాలా చాలా ఆనందపడతా. *** ఇంతకూ ‘భాయ్’ ఏ కేటగిరీ సినిమా? మంచి కమర్షియల్ సినిమా. ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ సెంటిమెంట్సూ ఉంటాయి. యాక్షన్ వయొలెంట్‌గా ఉండదు. చాలా స్టయిలిష్‌గా ఉంటుంది. ఇది ఫలానా కేటగిరీ మూవీ అని చెప్పలేం. అన్ని వర్గాలవారు చూసి ఆనందించే విధంగా ఉంటుంది. *** ఈ 25నే విడుదల చేయాలని వెంటనే ఎందుకు నిర్ణయం తీసుకున్నట్లు? ఈ మధ్యకాలంలో మూడు, నాలుగు సినిమాలు వాయిదాలు పడటంవల్ల రిలీజ్ డేట్ విషయంలో కొంచెం సందిగ్ధం నెలకొంది. ఏ సినిమాకైనా సోలో డేట్ చాలా అవసరం. ఈ నెలాఖరున ‘క్రిష్ 3’ వస్తోంది. అది మాత్రమే కాకుండా నవంబర్ 1 నుంచి 14 వరకు బెంగళూరులో దక్షిణాది భాషా చిత్రాలను విడుదల చేయకూడదు. ప్రతి సంవత్సరం ఈ తేదీల్లో కన్నడ, హిందీ, ఇంగ్లిష్ సినిమాలు తప్ప వేరేవి విడుదల చేయకూడదనే నిబంధన పెట్టారు. ఈ కారణాల వల్ల 25 బెస్ట్ డేట్ అనుకుని, రిలీజ్ ఫిక్స్ చేశాం. *** వీరభద్రమ్ టేకింగ్ గురించి? బాగా తీశాడు. మంచి మ్యూజిక్ డెరైక్టర్, సినిమాటోగ్రాఫర్... ఇలా అందరూ మంచి టెక్నీషియన్స్ కుదిరారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అన్నిటినీ వీరభద్రమ్ సరిగ్గా వినియోగించుకున్నాడు. హిట్ సినిమా చేయాలనే తాపత్రయంతో అందరం కష్టపడి చేశాం. *** ఈ చిత్రం పాటల్లో మీకు బాగా నచ్చినవి? అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మమతా మోహన్‌దాస్ పాడింది. ‘రయ్య రయ్య...’ పాటను మమతాతో పాడించారు. చాలా బాగా పాడింది. ఫోన్ చేసి, అభినందించాలనుకుంటున్నా. *** ఈ మధ్య ప్రతి సినిమా పైరసీకి గురవుతోంది. ఒకవేళ డీటీహెచ్ (డెరైక్ట్ టు హోమ్) విధానం ద్వారా థియేటర్లో విడుదల చేస్తే పైరసీ తగ్గుతుం దంటారా? ఆ అవకాశం ఉంది. కానీ, ఇలా విడుదల చేయడంవల్ల థియేటర్స్‌లో వసూళ్లు తగ్గే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి, థియేటర్లో విడుదల చేసిన రోజునే స్మాల్ స్క్రీన్స్‌కి విడుదలైన సినిమాలు లేవు. హాలీవుడ్లో కూడా ‘ఐరన్‌మేన్’లాంటి పెద్ద సినిమాలను థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తారు. తక్కువ ఓపెనింగ్స్ వస్తాయనిపించే చిన్న సినిమాలను మాత్రమే డీటీహెచ్‌లో కూడా విడుదల చేస్తుంటారు. *** భవిష్యత్తులో మీరు ఈ విధానాన్ని అనుసరిస్తారా? విడుదలైన రోజునే కాదు.. మొదటి, రెండో వారం తర్వాత అయితే ఆలోచిస్తా. *** మీరు దాదాపు 80 సినిమాలకు పైగా చేశారు కాబట్టి, ఓ సినిమా జయాపజయాలను కరెక్ట్‌గానే అంచనా వేయగలుగుతారా? 80 కాదు.. మరో 100 సినిమాలు చేసినా సినిమా జయాపజయాలు అంచనా వేయడం నా వల్ల కాదు. జయాపజయాలను ఊహించగలిగితే అన్నీ హిట్ సినిమాలే చేసేస్తాం. నాకు తెలిసి ఇప్పటివరకు ఓ సినిమాని వంద శాతం అంచనా వేసినవాళ్లు ఎవరూ లేరు. *** ఓకే... ‘మనం’ సినిమా విషయానికొద్దాం. ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు ఆ లుక్‌నే విడుదల చేయాలన్నది ఎవరి ఆలోచన? డెరైక్టర్ విక్రమ్కుమార్దే. సినిమా కథ చెప్పినప్పుడే ఈ ఫొటోగ్రాఫ్ గురించి చెప్పాడు. నాక్కూడా బాగా నచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తయ్యింది. డిసెంబర్లో విడుదల చేయాలనుకుంటున్నాం. *** ఈ సినిమా మొత్తం మీరిలా కళ్లద్దాలతోనే కనిపిస్తారా? మొత్తం కాదు.. కొన్ని సన్నివేశాల్లో అలా కనిపిస్తా. *** ‘మనం’ తర్వాత చేయబోయే సినిమా? ఏమీ అనుకోలేదు. ఎందుకంటే, గత రెండేళ్లుగా విశ్రాంతి లేకుండా సినిమాలు చేస్తున్నా. అందుకని, కొంచెం కూల్‌గా తర్వాత సినిమాని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నా. సో.. ప్రస్తుతానికి ‘భాయ్’ ప్రమోషనల్ కార్యక్రమాలు, ‘మనం’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాను. ఫిఫ్టీ ప్లస్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్నారు. ముడతలు మాయమవ్వడం కోసం బొటాక్స్ ఇంజక్షన్స్ ఏమైనా చేయించుకున్నారా? బొటాక్స్ ఇంజక్షన్ చేయించుకుంటే ముడతలు మాయమవ్వడం సంగతి అటుంచితే, మొహంలో ఎక్స్ప్రెషన్స్ కూడా మాయమవుతాయని నా ఫీలింగ్. ఫ్రీజ్ అయినట్లుగా కనిపిస్తాం. ఆ ఇంజక్షన్ చేయించుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. మరో పది, పదిహేనేళ్ల తర్వాత కూడా బొటాక్స్ జోలికి వెళ్లను. నాన్నగారికి ఇప్పటికీ ముడతలు ఉండవు. పళ్లు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. సో... నాన్నగారి జీన్స్ వల్ల మేం కూడా ముడతల బారిన పడమనుకుంటున్నా (నవ్వుతూ).