
సీనియర్ నటులు కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారని బుధవారం వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎటువంటి నిజం లేదని, క్షేమంగానే ఉన్నానని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘నిమోనియాకు చికిత్స చేయించుకోవడంతో పాటు రెగ్యులర్ చెకప్ కోసమని హాస్పిటల్‌కు వెళ్లాను. దాంతో అనారోగ్యం పాలయ్యానని వార్తలు బయటకు వచ్చాయి. దానివల్ల హాస్పిటల్లో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భాల్లో ఆందోళనకు గురయ్యే అభిమానుల పరామర్శకు సమాధానం చెప్పడం చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బావుంది. చెకప్ పూర్తవగానే ఇంటికి వెళ్లిపోతాను. నా ఆరోగ్యం విషయంలో ఆందోళనకు గురైన అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు కృష్ణంరాజు.