sickness
-
అనుమానిత వ్యాధి: ఒకరు మృతి.. వెంటిలేటర్‌పై 16 మంది.. 100 దాటిన బాధితులు
ముంబై: మహారాష్ట్రను అనుమానిత వ్యాధి వణికిస్తోంది. గుల్లెయిన్-బారే సిండ్రోమ్(జీబీఎస్)గా భావిస్తున్న ఈ వ్యాధి కారణంగా షోలాపూర్‌లో చార్టర్డ్ అకౌంటెంట్ ఒకరు మృతిచెందారు. కొత్తగా ఈ వ్యాధి మరో 28 మందికి సోకిందని, దీంతో బాధితుల సంఖ్య 101కి చేరిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఈ వ్యాధితో బాధపడుతున్న 16 మంది బాధితులు ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు కలిగిన వారిలో 19 మంది తొమ్మిదేళ్ల కంటే తక్కువ వయస్సు గలవారని, ఇప్పటివరకు 50 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో 23 కేసులు నమోదయ్యాయని వైద్య అధికారులు తెలిపారు. జనవరి 9న పూణేలోని ఒక ఆస్పత్రిలో చేరిన రోగి మొదటి జీబీఎస్ కేసుగా ఆరోగ్య శాఖ అనుమానిస్తోంది.బాధితుల నుండి తీసుకున్న నమూనాలలో క్యాంపిలో బాక్టర్ జెజుని బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. పూణేకు ప్రధాన నీటి వనరు అయిన ఖడక్వాస్లా ఆనకట్ట సమీపంలోని బావిలో ఈ. కోలి అనే బాక్టీరియా అధిక స్థాయిలో ఉందని అధికారుల పరీక్షల్లో తేలింది. దీంతో ఈ నీటిని వినియోగించేవారు ముందుగా మరిగించి, వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.ఆదివారం నాటి వరకు 25,578 ఇళ్లను సర్వే చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బాధితులను కనుగొనేందుకే ఈ సర్వే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జీబీఎస్ చికిత్స చాలా ఖరీదైనదని, ఒక్కో ఇంజెక్షన్ ధర రూ.20 వరకూ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. జీబీఎస్ అనేది శరీర రోగనిరోధక వ్యవస్థను అమితంగా ప్రభావితం చేస్తుంది. మెదడుకు సంకేతాలను తీసుకెళ్లే నరాలపై దాడి చేస్తుంది. అయితే ఈ వ్యాధి బారినపడిన 80 శాతం మంది రోగులు సరైన చికిత్స తీసుకుంటే ఆరు నెలల్లోనే కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి.. -
చిన్న పాప.. పెద్ద జబ్బు... నయం కావాలంటే రూ. 16 కోట్లు కావాలి
మైసూరు: చిత్రంలో కనిపించే చిన్నారికి పెద్ద జబ్బే సోకింది. ఆ జబ్బు నయం కావాలంటే రూ. 16 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో కన్నవారు హడలిపోయారు. తమ బిడ్డను కాపాడేందుకు దాతలు సహాయం చేయాలని వేడుకుంటున్నారు. వివరాలు.. మైసూరులో దేవరాజు మొహల్లాలో నివసించే హెచ్.నాగశ్రీ, ఎన్.కిశోర్ దంపతులకు 22 నెలల కీర్తన అనే కూతురు ఉంది. కానీ చిన్నారికి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) అనే అరుదైన జబ్బు సోకిందని ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. దీనివల్ల పాప ఎప్పుడూ నీరసంగా ఉంటుంది, కండరాలు బలహీనంగా ఉంటాయి, కనీసం ఆహారం నమలడం కూడా చేత కాదు. ఇక ఆడుకోవడం అనేదే ఉండదు. ఈ జబ్బు రెండవ దశలోకి వచ్చిందని, పాప మరింత బలహీనమైందని వాపోయారు. జన్యు చికిత్స, అరుదైన ఇంజెక్షన్లతో వైద్యం చేయిస్తే నయమవుతుందని వైద్యులు తెలిపారు, కానీ అందుకు రూ. 16 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. నిత్యం ఒక టానిక్ తాగాల్సి ఉంటుంది, ఒక్క బాటిల్ ధర రూ. 6 లక్షలని చెప్పారు. పేదవాళ్లయిన తమకు అంత స్తోమత లేదని, దాతలే ఆదుకోవాలని అభ్యర్థించారు. వివరాలకు చిన్నారి తండ్రి కిశోర్‌ని 9901262206 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
ప్రాణం తీసిన ఫుడ్‌పాయిజన్
నిర్మల్: మంచిబోజనం ఆరగిద్దామని హోటల్‌కి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు ఆ కస్టమర్స్. ఆహారం విషతుల్యం కావడంతో ఏకంగా ఒకరి ప్రాణంపోగా, 20 మంది వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రిల్–9 హోటల్లో ఈనెల 2, 3 తేదీల్లో భోజనం చేసిన వారంతా ఆస్పత్రుల పాలయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. యువతి మృతి.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర క్రాస్‌రోడ్డు వద్ద గల సెయింట్ థామస్ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ స్మితా జార్జ్, వైస్ ప్రిన్సిపాల్ దీపక్, ఉపాధ్యాయులు సోఫీ, ఫిజీ, వంటమనిషి ఫూల్‌కాలీబైగా (19) ఈనెల 2న షాపింగ్ కోసం నిర్మల్‌కు వచ్చారు. రాత్రి తిరిగి వెళ్తూ గ్రిల్–9 హోటల్లో రాత్రి భోజనం చేశారు. చికెన్–65, తందూరి చికెన్, చికెన్ ఫ్రైడ్‌రైస్ ఆరగించారు. అదేరోజు అర్ధరాత్రి నుంచి ఐదుగురికీ వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. స్థానిక బోథ్ సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి ఫూల్‌కాలీబైగా మంగళవారం మృతిచెందింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఫూల్‌కాలీబైగా ఉపాధి నిమిత్తం సెయింట్ థామస్ స్కూల్లో వంటపని చేసేందుకు వచ్చింది. ప్రిన్సిపాల్ స్మితాజార్జ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోథ్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిర్మల్ పోలీసులకు పంపించారు. 25 మందికిపైగా.. గ్రిల్–9 హోటల్లో వండిన ఆహారం విషతుల్యం కావడం వల్లే భోజనం చేసినవారిలో పదుల సంఖ్యలో అస్వస్థతకు గురైనట్లు తేలింది. ఖానాపూర్‌కు చెందిన పదిమంది వరకు యువకులు ఈ హోటల్లో ఆరగించి వెళ్లగానే వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన మరో ఆరుగురు కుటుంబ సభ్యులు ఇక్కడి మండీ విభాగంలో చికెన్ ఆరగించడంతో వారూ బాధితులయ్యారు. బోథ్ స్కూల్ స్టాఫ్‌తో కలిసి దాదాపు 25 మంది అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఈ ఘటన నేపథ్యంలో గ్రిల్–9 హోటల్ పరిసరాలను ‘సాక్షి’పరిశీలించగా, ఏమాత్రం శుభ్రత, నాణ్యత పాటించడం లేదన్న విషయం స్పష్టమైంది. హోటల్ వ్యర్థాలు, మురికినీరు అంతా వెనుకభాగంలో నిలిచి ఉంది. దీనిపై ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ ప్రత్యూషను ఫోన్లో వివరణ కోరగా, తాము సదరు హోటల్‌కు వెళ్లామని, తాళం వేసి యాజమాన్యం, వర్కర్లు పరారీలో ఉన్నారని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
పంది మాంసం తిన్న ఎఫెక్ట్.. కాళ్లలో మొత్తం పరాన్నజీవులే
వాషింగ్టన్: కాళ్ల నుంచి నడుము దాకా నొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన రోగికి సిటీ స్కాన్ చేసి ఆ రిపోర్ట్ చూశాక అవాక్కవడం వైద్యుల వంతైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా హెల్త్ జాక్సన్విల్లే వైద్యకళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పలు అంశాలపై ప్రజలకు ఆన్లైన్లో అవగాహన కల్పించే ఒక వైద్యుడి ద్వారా ఈ విషయం వెల్లడైంది. రోగికి తీసిన సీటీ స్కాన్ రిపోర్ట్‌లను చూపిస్తూ పరాన్న జీవులతో ఇబ్బందిపడ్డ ఆ రోగి వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా డాక్టర్ శామ్ ఘలీ వెల్లడించారు.డాక్టర్ శామ్ ఘలీ చెప్పిన వివరాల ప్రకారం..అత్యవసర చికిత్స నిమిత్తం ఆగస్ట్ 25వ తేదీన ఆ రోగిని మా ఎమర్జెన్సీ రూమ్‌లో చేర్పించారు. వెంటనే నేను సీటీ స్కాన్ తీ యించా. ఆ సీటీ స్కాన్ రిపోర్ట్చూశాక నాకు నోట మా టరాలేదు. కాళ్లలో ఎక్కడపడితే అక్కడ పరాన్నజీవులు తిష్టవేశాయి. సరిగా ఉడకని పంది మాంసం తినడం వల్ల రోగి శరీరంలోకి పంది నులిపురుగులు ప్రవేశించి రెండు కాళ్ల కండరాలను మొత్తం ఆక్రమించేశాయి. ఈ విషమ పరిస్థితిని టేనియా సోలియం లేదా సిస్టీసెర్కోసిస్గా వ్యవహరిస్తారు.ఏమిటీ సిస్టీసెర్కోసిస్?సరిగా ఉడకని, పచ్చి పంది మాసం తినడం వల్ల ఆ మాంసంలోని నులిపురుగులు మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయి. దాని లార్వాలు మెదడు, కండరాల్లో కి చొరబడితే ఆరోగ్య పరిస్థితి మరింత దారుణంగా తయార వుతుంది. చర్మం కింద గడ్డలు, తలనొప్పితోపాటు ఇన్ఫెక్షన్ మెదడు, వెన్నుపూస దాకా చేరితే మూర్ఛ వ్యాధి రావొచ్చు. కలుషిత ఆహారం, కలుషిత నీరు, అశుభ్రమైన చేతులు, మనిషి మలం ద్వారా కూడా ఈ నులిపురుగులు వ్యాపి స్తాయి. ఉడికీఉడకని పంది మాంసం ద్వారా లార్వాలు మనిషి పేగుల్లోకి, అక్కడి నుంచి రక్తంలో కలుస్తాయి.రక్తంతోపాటు శరీరమంతా తిరుగుతూ ఎక్కడపడితే అక్కడ లార్వాలు తిష్టవేస్తాయి. తొలి దశలోనే సిస్టీ సెర్కోసిస్ను గుర్తిస్తే నివారణ చాలా సులభం. ఆలస్యం చేస్తే మాత్రం మరణం ఖాయం. ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 కోట్ల మంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. అయితే కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వ్యాధి ముదిరి ఏటా 50,000 మంది చనిపో తున్నారు. ‘యాంటీ–పారాసైట్ థెరపీ, స్టెరాయిడ్ లు, న్యూరోసిస్టీసెర్కోసిస్ కోసం యాంటీ–ఎపిలె ప్టిక్స్, సర్జరీ ద్వారా ఈ వ్యాధికి చికిత్స చేసుకోవచ్చు. తొలి దశలో సీటీ స్కాన్ చేయిస్తే స్కానింగ్‌లో తెల్ల బియ్యంలాగా ఇవి కనిపిస్తాయి. దాంతో వీటిని గుర్తించవచ్చు. ఇన్ఫెక్షన్ సోకిన 5–12 వారాల్లోగా అవి నులిపురుగులుగా మారతాయి. అప్పుడు సమస్య మరింత జఠిలమవుతుంది. అందుకే తినేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోండి’ అని సూచించారు. -
వింత గ్రామం: నిద్ర ముంచుకొచ్చిందా ఇక అంతే!.. ఏకంగా..
నిద్ర అనేది మని షి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అలా అతిగా నిద్రపోయినా ప్రమాదమే. దీని వల్ల ఆరోగ్యానికే కాదు, దైనందిన జీవితానికి ఆటంకంగానే ఉంటుంది. అలాంటి నిద్ర ఓ గ్రామంలోని ప్రజలకు శాపంగా మారింది. వారికి నిద్ర ఏదోమైకం కమ్మినట్లుగా ముంచుకొచ్చి ఎక్కడపడితే అక్కడే మత్తుగా నిద్రపోతారట. పైగా చాలా రోజుల వరకు లేవరట. ప్రయత్నించిన ప్రయోజనం ఉండదట. చెప్పాలంటే మన రామాయణ ఇతిహాసంలో ఉండే కుంభకర్ణుడి మాదిరి నిద్రపోతారు. ఆ వింత గ్రామం ఎక్కడుందంటే.. కజకిస్తాన్‌లో కలాచి అనే ఊరు ఉంది. అక్కడ ప్రజ ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా చాలా నెలల పాటు నిద్రపోతూనే ఉంటారు. ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తి దాదాపు నెల పాటు నిద్రపోతాడు. ఇలా నిద్ర పోయిన వ్యక్తి మళ్లీ నెల పాటు మేల్కోడట. అందుకే ఈ ఊరును "స్లీపీ హోల్" అని అంటారు. వారి దగ్గర బాంబు పేల్చిన కూడా నిద్రలేవరట. నిజానికి వాళ్లు నిద్రపోవాలని అనుకోరు. కానీ వారికి తెలియకుండానే వచ్చేస్తుంది. ఈ నిద్ర వల్ల ఆ ఊరి ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారట. కొన్ని సార్లు రోడ్డు మీద కూడా నిద్ర పోతారట. ఇలా ఎక్కడపడితే అక్కడే నిద్ర ముంచుకొస్తే గనుక ఏకంగా నెల రోజులు అక్కడే అలాగే పడుకుంటారట ఆ ఊరి ప్రజలు. ఈ కలాచి గ్రామంలో సుమారు 600 మంది ప్రజలు ఉన్నారు. ఇందులో 14 శాతం మంది ఇలాంటి సమస్యతోనే బాధ పడుతుండటం బాధకరం. అయితే 2010లో ఓ పాఠశాలలో జరిగిన సంఘటన వల్ల ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. కొందరు విద్యార్థులు క్లాసులోనే నిద్రపోయి ఎంతకీ నిద్రలేవలేదట. ఉపాధ్యాయులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో.. ఈ విషయం బయటకు పొక్కింది. అలా ఈ వ్యాధితో దాదాపు 14 శాతం మంది బాధపడుతున్నారని తెలిసింది. దీని గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ ఇది ఏదో వ్యాధి వల్లే ఇలా జరుగుతుందని భావించారట. అయితే ఆ వ్యాధి ఏంటన్నది కనిపెట్టలేకపోయారు. దీంతో ఈ విషయం ఓ అంతు చిక్కని మిస్టరీలా ఉండిపోయింది. మొత్తం మీత కలాచి గ్రామం ఓ వింత వ్యాధి వల్ల ఇలా ప్రజలు నెలల తరబడి నిద్రపోతున్నట్లు తెలుస్తోంది. (చదవండి: రిజర్వాయర్ని వేలానికి పెట్టడం గురించి విన్నారా?) -
రైలుబండి నడిపే వారెక్కడ?
సాధారణంగా ఏ సంస్థలోనైనా సరే వంద మంది సిబ్బంది అవసరమైన చోట కనీసం మరో 10 మందిని అదనంగా నియమించుకుంటారు. సంస్థ నిర్వహణలో ఆటంకాలు లేకుండా ఉండాలంటే అదనపు సిబ్బంది అవసరం. కానీ దక్షిణమధ్య రైల్వేలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. రైళ్లు నడిపేందుకు డ్రైవర్లు కరువవుతున్నారు. వాస్తవానికి రైళ్ల నిర్వహణకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు లోకోపైలెట్లు, అసిస్టెంట్ లొకోపైలెట్లు తదితర సిబ్బంది కనీసం 30 శాతం అదనంగా ఉండాలి. అదనపు సిబ్బంది సంగతి పక్కనపెడితే.. ఉండాల్సిన వారిలోనే 30 శాతం సిబ్బంది కొరత ఉంది. దీంతో పనిభారంతో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. చివరకు అనారోగ్యం ఉన్నా సెలవులు లభించడం లేదంటూ లోకోపైలెట్లు వాపోతున్నారు. –సాక్షి, హైదరాబాద్ విరామమెరుగని విధులు.. దక్షిణమధ్య రైల్వేలో రోజూ సుమారు 600 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 10 లక్షల మందికిపైగా ప్రయాణం సాగిస్తుంటారు. అన్ని డివిజన్ల పరిధిలో 3,800 వరకు లోకో పైలెట్లు, సహాయ లోకోపైలెట్లు, షంటర్లు పని చేయవలసి ఉండగా ప్రస్తుతం 2384 మంది మాత్రమే ఉన్నారు.1,416 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే కనీసం వెయ్యి మంది అదనంగా ఉండాల్సిన చోట వెయ్యి మందికిపైగా కొరత ఉండడం గమనార్హం. కొంతకాలంగా లోకోపైలెట్ల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో ఉన్నవాళ్లపైనే పనిభారం అధికమవుతోంది. ‘లింక్’ లేని డ్యూటీలు సాధారణంగా ఒక లోకోపైలెట్ తన విధి నిర్వహణలో 8 గంటలు పనిచేసి 6 గంటల విశ్రాంతి తీసుకోవాలి. తరువాత మరో 8 గంటలు పని ఉంటుంది. తిరిగి 6 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. డ్యూటీ ముగిసిన తరువాత 16 గంటల పాటు విశ్రాంతి ఉండాలి. ప్రతి 72 గంటలకు ఒక రోజు సెలవు చొప్పున, ప్రతి 14 రోజులకు ఒక 24 గంటల పూర్తి విశ్రాంతి చొప్పున లోకోపైలెట్ లింక్ (విధి నిర్వహణ) ఉండాలి. కానీ ఈ లింక్‌కు పూర్తి విరుద్ధంగా 6 గంటలకు బదులు 4 గంటల విశ్రాంతే లభిస్తోందని లోకోపైలెట్లు అంటున్నారు. వరుసగా రాత్రిళ్లు పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వారానికి ఒకరోజు రాత్రి పూర్తిగా విశ్రాంతి ఉండాలి. కానీ ప్రస్తుతం రాత్రి పూట నిద్రకు నోచని ఎంతోమంది తీవ్ర ఒత్తిళ్ల నడుమ పనిచేస్తున్నారు. ‘అనారోగ్యం కారణంగా కూడా సెలవులు లభించడం లేదు. లాలాగూడ రైల్వే ఆసుపత్రి డాక్టర్లు ఫోన్లోనే ఫిట్నెస్ సరి్టఫికెట్లు ఇచ్చేస్తున్నారు. బాగానే ఉన్నావు డ్యూటీకి వెళ్లొచ్చని చెబుతున్నారు.’.. అని సికింద్రాబాద్ డిపోకు చెందిన అసిస్టెంట్ లోకోపైలెట్ ఒకరు చెప్పారు. ‘సేఫ్టీ’ ఎలా.. సిగ్నల్స్ కనిపెట్టడం, కాషన్ ఆర్డర్స్‌ను అనుసరించడం, ట్రాక్‌లు మార్చడం, వేగాన్ని అదుపు చేయడం.. ఇలా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇందుకు లోకోపైలెట్లకు ఏకాగ్రత, ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి. కానీ ప్రతి క్షణం వెంటాడే ఒత్తిడి, నిద్ర లేమి వల్ల రైల్వే మాన్యువల్‌కు విరుద్ధమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నామని రైఅంటున్నారు. ఒత్తిడే ప్రమాదాలకు కారణం? తరచూ హెచ్చరిక సిగ్నళ్లను (సిగ్నల్ పాసింగ్ ఎట్ డేంజర్) సైతం ఉల్లంఘిస్తూ రైలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. రైళ్లు పట్టాలు తప్పే సందర్భాల్లో ఇలాంటి ఒత్తిడే ప్రధాన కారణమవుతున్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సికింద్రాబాద్ డిపోలోనూ కొరత దక్షిణమధ్య రైల్వేలోనే కీలకమైన సికింద్రాబాద్ డిపోలో 578 మంది లోకోపైలెట్లు పని చేయవలసి ఉండగా 343 మంది మాత్రమే ఉన్నారు. 235 ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరతతో గూడ్స్ రైళ్లు నడపాల్సిన వాళ్లు ఎక్స్‌ప్రెస్‌లు, మెయిల్ సర్వీసులు నడుపుతున్నారు. షంటర్లు ఎంఎంటీఎస్‌లు, ప్యాసింజర్ రైళ్లు నడుపుతున్నారు. -
ఖమ్మం జిల్లా పర్యటనలో షర్మిలకు అస్వస్థత
-
ఖమ్మం జిల్లా పర్యటనలో షర్మిలకు అస్వస్థత
కొణిజర్ల: ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలంలో ఈరోజు(ఆదివారం) పర్యటిస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. రైతుల సమస్యలు అడిగి ఆమె మాట్లాడుతున్న క్రమంలో అస్వస్థతకు గురయ్యారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలనకు షర్మిల వెళ్లగా అక్కడ సొమ్ముసిల్లి కింద కూర్చుండిపోయారు. పంట నష్టంపై మాట్లాడుతుండగా షర్మిల అస్వస్థతకు గురయ్యారు. అంతకుముందు రైతుల సమస్యలపై మీడియాతో మాట్లాడిన షర్మిల.. కేసీఆర్ సర్కారును నిలదీశారు. ‘ ఇటీవల కురిసిన వర్షానికి ఖమ్మం రైతులు దారుణంగా నష్టపోయారు. అకాల వర్షాలకు చేతికొచ్చిన మొక్క జొన్న పంట నేల పాలయ్యింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గత నెల ఇదే ఖమ్మం జిల్లాకి కేసీఅర్ వచ్చాడు. మొక్క జొన్న పంటను పరిశీలించి 10 వేలు ఇస్తా అని ప్రకటన చేశాడు. గాలి మోటార్లో వచ్చి గాలి మాటలు చెప్పాడు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. పెద్ద పెద్ద భవంతులు కట్టేందుకు డబ్బులు ఉంటాయి.పంట నష్టపోయిన రైతులకు ఇవ్వడానికి రూపాయి కూడా ఉండదు. 2.50 లక్షల ఎకరాలు అని చెప్పి ఇప్పుడు లక్షా 50 వేల ఎకరాలు అన్నారు..అది కూడా లేదు. బొడి 5 వేలు రైతు బందు ఎవడు అడిగాడు.30 నుంచి 50 వేలు పెట్టుబడి పడితే నష్టపోయారు.5 వేలు ఏ మూలకు సరిపోతాయి.’ అని ప్రశ్నించారు. -
కిస్కా కథ అలా ముగిసింది..!
ఒంటారియో: కిస్కా. ఓర్కా రకం కిల్లర్ వేల్. ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలం. దాదాపు 40 ఏళ్లపాటు నీళ్ల ట్యాంకులో ఒంటరిగా బతుకీడ్చింది. చోటు మార్చాలని జంతువుల హక్కుల సంఘాలు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, అనారోగ్యంతో ఇటీవలే కన్నుమూసింది. ఐస్‌ల్యాండ్ సమీపంలోని సముద్ర జలాల్లో ఏడేళ్ల వయస్సున్నప్పుడు ఈ కిల్లర్ వేల్ పట్టుబడింది. దీనిని ఒంటారియోలోని నయాగరా జలపాతం వద్ద ఉన్న మెరైన్‌ల్యాండ్ జూ పార్క్‌కు అమ్మేశారు. 40 ఏళ్ల పాటు కిస్కా ఓ నీళ్ల ట్యాంకుకే పరిమితమైపోయింది.ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలంగా ముద్రపడింది. ఇటీవలే సుమారు 47 ఏళ్ల వయస్సులో కిస్కా చనిపోయింది. ‘కిస్కా మృతి పట్ల విచారిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఓర్కా రకం తిమింగలాలు బందీలుగా ఉన్నాయి. కెనడా ప్రభుత్వం నోవాస్కోటియాలో వందెకరాల్లో వేల్ శాంక్చువరీ ప్రాజెక్టు ఏర్పాటు పనుల్లో ఉంది. ఇది పూర్తయితే ట్యాంకుల్లో కన్నా స్వేచ్ఛగా, మెరుగైన సురక్షిత వాతావరణంలో పట్టుబడిన తిమింగలాలు, డాల్ఫిన్లను ఉంచడానికి అవకాశం ఏర్పడుతుంది’అని ఏనిమల్ జస్టిస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెమిల్లె లబ్చుక్ అన్నారు. తిమింగలాల్లో అత్యంత బలమైన ఈ ఓర్కాల ఆయుర్ధాయం 50 నుంచి 90 ఏళ్లు. -
షాకింగ్ విషయం బయటపెట్టిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్
'ఆర్ఎక్స్ 100' సినిమాతో యూత్ మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పాయల్ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా తన అనారోగ్యం గురించి చెప్పి షాక్ ఇచ్చింది. నాకు కిడ్నీ ఇన్ఫెక్షన్ అని తెలిసిందే. 'నేను నీళ్లు చాలా తక్కువగా తాగేదాన్ని ఫలితంగా ఇలా జరిగింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ ముగిసింది. యాంటీబయాటిక్స్ లాస్ట్ డోస్ తీసుకున్నాను. మళ్లీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. అడ్డంకులు ఎదురైనా అధిగమించాలి. అవాంతరాలు ఎదురైనా సరే షూటింగ్ ఆపలేదు. ఈ సినిమా నాకు స్పెషల్. ఇక నాలా మీరు మాత్రం చేయకండి. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి' అంటూ పాయల్ సూచించింది. ఆర్ఎక్స్ 100తో హిట్ ఇచ్చిన అజయ్ భూపతి డైరెక్షన్లోనే పాయల్ ప్రస్తుతం మంగళవారం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
నటి జయంతికి అస్వస్థత
ప్రముఖ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మాతృభాష కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు పొందారామె. ‘భార్యా భర్తలు’ చిత్రంతో తెలుగులో పరిచయమైన ఆమె ‘జగదేక వీరుడి కథ, డాక్టర్ చక్రవర్తి, జస్టిస్ చౌదరి, దొంగ మొగుడు, కొదమ సింహం, కలియుగ పాండవులు, ఘరానా బుల్లోడు, వంశానికొక్కడు, పెదరాయుడు’.. ఇలా.. దాదాపు 55 చిత్రాలకుపైగా నటించారు. కొద్ది సంవత్సరాల నుంచి ఆమె ఆస్తమా సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. జయంతికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. కాగా జయంతి తనయుడు కృష్ణకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ– ‘‘అమ్మకి ప్రస్తుతం వైద్యం అందుతోంది. చికిత్సకు స్పందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఒకటి రెండు రోజులు పరిశీలనలో ఉండాలని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమ్మని చూసేందుకు ఆస్పత్రికి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’ అన్నారు. -
మాజీ ఫుట్‌బాలర్ సఫీ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు జీఎంఎస్ సఫీ (47) బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1993–2001 మధ్య కాలంలో ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ సహా పలు టోర్నీల్లో సఫీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్ వేదికగా 2001లో జాతీయ క్రీడల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించారు. ఎస్బీఐ (సీసీపీసీ) హైదరాబాద్ శాఖలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న సఫీ...ఇటీవలే ఆలిండియా ఇంటర్ బ్యాంక్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. సఫీ మృతి పట్ల తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సంతాపం ప్రకటించింది. -
నటుడు రతన్ చోప్రా మృతి
సినిమా అంటే గ్లామర్ ప్రపంచం. అందుకే ఇక్కడ ఉన్నవారి జీవితం కలర్ఫుల్గా ఉంటుందని చాలామంది అనుకుంటారు. అయితే కొందరి నటీనటుల జీవితాలు కనీసం వైద్యానికి నోచుకోని స్థితిలో ముగుస్తున్నాయంటే నమ్మశక్యం కాదు. తాజాగా బాలీవుడ్ నటుడు రతన్ చోప్రా (70) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారాయన. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రతన్ చోప్రా సరైన వైద్యం చేయించుకోలేకపోయారు. శుక్రవారం ఆయన మృతి చెందిన విషయాన్ని ఆయన దత్త పుత్రిక అనిత అధికారికంగా ప్రకటించారు. మోహన్ కుమార్ దర్శకత్వంలో 1972లో వచ్చిన ‘మామ్ కీ గుడియా‘ చిత్రంలో ప్రధాన పోత్ర పోషించారు రతన్ చోప్రా. ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్న రతన్ పటియాలాలో పీజీ విద్య అభ్యసించారు. సినిమాలపై ఆసక్తితో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించారు. అయితే తన నానమ్మకు నటనా రంగంపై ఇష్టం లేకపోవడంతో రతన్ చోప్రా ఇండస్ట్రీకి దూరమై పలు స్కూళ్లలో టీచర్‌గా పనిచేశారు. క్యాన్సర్ బారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించడంతో పంజాబ్‌లోని మాలర్‌కోట్లలో తుదిశ్వాస విడిచారు. ఆర్థిక సమస్యలతో హర్యానాలోని పాంచ్‌కులలో అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన భోజనానికీ ఇబ్బందులు పడ్డారట. సమీపంలోని ఆలయాల వారే భోజనం పెట్టేవారని వార్తలు చెబుతున్నాయి. వివాహం చేసుకోని రతన్.. అనిత అనే యువతిని కూతురిగా దత్తత తీసుకున్నారు. ఇటీవల బాలీవుడ్ నటులు ధర్మేంద్ర, అక్షయ్ కుమార్, సోనూ సూద్‌లను రతన్ చోప్రా ఆర్థిక సాయం కోరారట. అయితే వారి నుంచి సమాధానం రాలేదని అనిత, రతన్ చోప్రా బంధువులు అంటున్నారు. -
నిర్మాత వెంకట్రాజు ఇకలేరు
‘గూండారాజ్యం, టూటౌన్ రౌడీ, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, చక్రం’.. వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత చమర్తి వెంకట్రాజు(సి.వెంకట్రాజు) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా సిద్దిరాజు కండ్రిగ గ్రామంలో 1948 మే 25న చమర్తి నారపరాజు, వెంకటమ్మ దంపతులకు జన్మించారాయన. సిద్దిరాజు కండ్రిగ గ్రామానికే చెందిన గుంటుమడుగు శివరాజుతో(జి.శివరాజు) కలిసి శ్రీ విజయలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకాన్ని స్థాపించారు వెంకట్రాజు. తొలిచిత్రంగా కృష్ణ హీరోగా ‘గూండారాజ ్యం’(1989) నిర్మించారు. ఆ తర్వాత ‘టూటౌన్ రౌడీ, నియంత, అహంకారి, ఆదర్శం, ఆరంభం’ వంటి సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత గీత చిత్ర ఇంటర్నేషనల్ అనే పతాకాన్ని స్థాపించిన వీరిద్దరూ ‘లేడీబాస్, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, శ్రీమతి వెళ్లొస్తా, ఘర్షణ, చక్రం’ వంటి పలు విజయవంతమైన సినిమాలు తీశారు. ‘పవిత్రబంధం’ సినిమాకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ చిత్రంగా బంగారు నందిని బహూకరించింది. సి.వెంకట్రాజు మృతికి పలువురు సినీ ప్రముఖులతో పాటు ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ సంతాపం తెలిపింది. కాగా ఆయన అంత్యక్రియలు చెన్నైలో ఈరోజు జరగనున్నాయి. -
కలుషిత ఆహారంతో 60 మంది విద్యార్థినులకు అస్వస్థత
నిడమనూరు: కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నల్లగొండ జిల్లా నిడమనూరులోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో 237 మంది విద్యార్థినులు చదువుతుండగా.. వరుసగా మూడు రోజులపాటు సెలవులు రావడంతో 140 మంది విద్యార్థినులు ప్రస్తుతం పాఠశాలలో ఉన్నారు. శనివారం విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో బీరకాయ కూరను వడ్డించారు. అయితే భోజనం చేసిన తర్వాత సుమారు 60 మంది విద్యార్థినులు ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థినులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కలుషిత ఆహారం తినడం వల్లనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస సమరద్ తెలిపారు. కొందరు పిల్లలు గ్యాస్ ప్రాబ్లమ్‌తో అస్వస్థతకు గురయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ చెప్పారు. -
క్షేమంగానే ఉన్నాను
సీనియర్ నటులు కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారని బుధవారం వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎటువంటి నిజం లేదని, క్షేమంగానే ఉన్నానని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘నిమోనియాకు చికిత్స చేయించుకోవడంతో పాటు రెగ్యులర్ చెకప్ కోసమని హాస్పిటల్‌కు వెళ్లాను. దాంతో అనారోగ్యం పాలయ్యానని వార్తలు బయటకు వచ్చాయి. దానివల్ల హాస్పిటల్లో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భాల్లో ఆందోళనకు గురయ్యే అభిమానుల పరామర్శకు సమాధానం చెప్పడం చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బావుంది. చెకప్ పూర్తవగానే ఇంటికి వెళ్లిపోతాను. నా ఆరోగ్యం విషయంలో ఆందోళనకు గురైన అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు కృష్ణంరాజు. -
ఏది పడితే అది రాయొద్దు!
‘అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు’, ‘ కాలేయ సంబంధిత సమస్యలంట’ అనేవి శుక్రవారం అమితాబ్ ఆరోగ్యానికి సంబంధించి చక్కర్లు కొట్టిన వార్తలు. శనివారం రాత్రి అమితాబ్ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ– ‘‘అనారోగ్యం, మెడికల్ ఇష్యూలు అనేవి ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు. వాటి గురించి ఏది పడితే అది రాయకూడదు. ఆ కోడ్‌ను ఎప్పుడూ బ్రేక్ చేయకూడదు. అలా చేయడం ఫ్రొఫెషనల్ కోడ్‌ను ఉల్లంఘించడమే. ఆ వ్యక్తిగత స్పేస్‌ను అర్థం చేసుకొని, గౌరవం ఇవ్వండి. ప్రపంచంలో అన్ని విషయాలూ అమ్మకానికి కాదు’’ అని ఘాటుగా రాసుకొచ్చారు అమితాబ్. -
మాజీ స్పీకర్ కోడెలకు అస్వస్థత
సాక్షి, గుంటూరు : టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. గుంటూరులోని కోడెల కుమార్తె విజయలక్ష్మికి చెందిన శ్రీలక్ష్మీ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. -
అరుణ్ జైట్లీకి తీవ్ర అస్వస్థత
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో ఉదయం ఆయన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేరారు. వెంటనే ఐసీయూలో చేర్చుకున్న వైద్యులు చికిత్స ప్రారంభించారు. హృదయం, మూత్రపిండాలు తదితర పలు విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు చికిత్స అందించారు. జైట్లీ అస్వస్థత వార్త తెలియగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఎయిమ్స్‌కు వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం ఎయిమ్స్ మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. ‘ప్రస్తుతం జైట్లీ గుండె స్థిరంగా కొట్టుకుంటోంది. కీలక అవయవాలకు రక్త ప్రసరణ బావుంది. ఆయనను ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం’ అని ఎయిమ్స్ ఆ ప్రకటనలో పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా తదితరులు ఆసుపత్రికి వచ్చి జైట్లీ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. వృత్తిపరంగా న్యాయవాది అయిన జైట్లీ.. మోదీ తొలి ప్రభుత్వంలో రక్షణ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ప్రభుత్వానికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో, విమర్శలను తిప్పికొట్టడంలో జైట్లీ ఎంతో క్రియాశీలకంగా ఉండేవారు. గతేడాది మే నెలలో ఆయనకు మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఎంతోకాలంగా ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగానే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ జైట్లీ పోటీ చేయలేదు. -
తిండి కలిగినా... కండలేదోయ్!
‘తిండి కలిగితే కండ కలదోయ్.. కండ కలవాడేను మనిషోయ్’గురజాడ మాట. ‘కండరాలకు ఈ తిండి చాలదోయ్.. దానికి దండిగా ప్రొటీన్లతో పొత్తు కలవాలోయ్’అని కొనసాగింపు వ్యాక్యాలుంటే నేటికి సరిగ్గా నప్పుతాయేమో! శరీర నిర్మాణానికి మాంసకృత్తులు అత్యంత అవసరం. వాటి లోపం శారీరక పెరుగుదల, మేధో వికాసాన్ని మందగింప చేయడం సహా పలు రకాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతటి కీలకమైన మాంసకృత్తులు భారతీయుల ఆహారంలో లోపిస్తున్నాయి. ఇప్సోస్– ఇన్‌బాడీ అనే దక్షిణ కొరియా సంస్థ ఇటీవల హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల్లోని 30– 55 వయస్కులపై జరిపిన అధ్యయనం ప్రకారం 68 శాతం మంది భారతీయులు మాంసకృత్తుల లోపాన్ని ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి వారి సంఖ్య 75 శాతం మంది కన్నా ఎక్కువే. ఇండియన్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో (ఐఎంఆర్బీ) గతేడాది విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని తేల్చింది. దీని ప్రకారం.. దేశంలో 73 శాతం మందిలో మాంసకృత్తులు లోపించాయి. 84 మంది భారతీయ శాకాహారులు, 65 శాతం మాంసాహారులు తగిన మేరకు ప్రొటీన్లు తీసుకోవడం లేదు. 93 శాతం మందికి ప్రొటీన్లు ఎంత మేరకు తీసుకోవాలో కూడా తెలియదు. 71% మందికి కండరాల అనారోగ్యం ఇప్సోస్– ఇన్‌బాడీ అధ్యయనం ప్రకారం.. దేశంలో 71% మందికి కండరాల ఆరోగ్యం సరిగా లేదు. భారతీయుల కండరాలు బలంగా లేకపోవడానికి ప్రొటీన్ల లోపమే కారణమంటున్నారు. కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. దేశంలోని పిల్లల్లో 36% మంది తక్కువ బరువుతో ఉన్నారు. 21% మంది ఎత్తుకు తగినంత బరువు లేరు. 38% మంది ఎదుగుదల లోపంతో గిడసబారిపోతున్నారు. గుడ్ల పెంకులు.. పోషకాల గనులు ఇటీవల బెంగళూరులో ఓ పరిశోధక బృందం.. శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసి తయారు చేసిన గుడ్ల పెంకు పొడిని గోధుమ పిండితో కలిపి చపాతీలు, బిస్కట్లు తయారు చేయడమెలాగో ప్రదర్శనపూర్వకంగా వివరించింది. పరిశోధకుల్లో ఒకరైన హెచ్‌బీ శివశీల.. గుడ్డు పెంకు ఇచ్చే ఒక స్పూను పొడిలో 750– 800 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుందని చెబుతున్నారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ గుడ్ల పెంకుల పొడిని ఆహారంలో భాగం చేయడం వల్ల చేకూరే ప్రయోజనాలను వివరించింది. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏం తినాలి?... పాల సంబంధిత ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, మాంసం, గింజలు, పప్పులు, బఠానీలు, సోయాబీన్స్, చిక్కుళ్లు, వేరుశనగలు, ముదురాకుపచ్చ కూరల్లో మాంసకృత్తులు పుష్కలంగా లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వృక్ష సంబంధిత మాంసకృత్తులతో పోల్చుకుంటే, జంతు సంబంధమైన మాంసకృత్తులు శరీరానికి అవసరమైన అమినో యాసిడ్లను తగిన మేరకు అందించగలవని, గుడ్లలో ఉత్తమ కోవకు చెందిన ప్రొటీన్లు ఉంటాయని, వీటిని మొత్తంగా తీసుకోవడం వల్ల అన్ని రకాల అమినో యాసిడ్లూ లభిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. -
ఈ టైమ్‌లో అవన్నీ చేయవచ్చా?
∙నా వయసు 22 సంవత్సరాలు. నేను ఈమధ్య కాస్త బరువు పెరిగాను. గడ్డం దగ్గర మొటిమలు వస్తున్నాయి. అవాంఛిత రోమాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. దీని గురించి నా స్నేహితురాలికి చెబితే ‘పీసీఓయస్ కావచ్చు’ అంటోంది. ఇది నిజమేనా? ఈ డిజార్డర్ గురించి, నివారణ చర్యల గురించి వివరంగా తెలియజేయగలరు. – యంఎన్, కొవ్వూరు పీసిఓయస్ అంటే Polycystic ovary syndrome (pcos) అందులో గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాల్లో చిన్న చిన్న ఫాలికల్స్ ఎక్కువగా ఉండి, నీటి బుడగలులాగా ఉంటాయి. ఇవి కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల, అధికబరువు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాలతో పాటు ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల ఏర్పడతాయి. మగవారిలో ఎక్కువగా ఉండే ఆండ్రోజన్, టెస్టోస్టిరాన్ హార్మోన్ pఛిౌటఉన్నవాళ్లలో ఎక్కువగా విడుదల అవుతుంది. దీని ప్రభావం వల్ల బరువు పెరగటం, అవాంఛిత రోమాలు, జుట్టు ఊడటం, మొటిమలు రావటం, పీరియడ్స్ క్రమం తప్పటం, గర్భం దాల్చడానికి ఇబ్బంది వంటి ఎన్నో లక్షణాలు బయటపడతాయి. చిన్న సమస్యగానే భావించి నిర్లక్ష్యం చేస్తే.. చిన్నవయసులోనే బీపి, షుగర్, గుండెజబ్బులు వంటి ఇతర సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిజానికి pఛిౌటస్కానింగ్ ద్వారా మరియు కొన్ని రక్త పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. ఇవి ఎవరికి, ఎందుకు వస్తాయి అని చెప్పలేం. జన్యుపరమైన కారణాల వల్ల, కొందరు సన్నగా ఉన్నా కూడా pఛిౌటరావచ్చు. ఇవి అనేక కారణాల వల్ల వస్తాయి కాబట్టి.. వీటికి నివారణ చర్యలు చెప్పటం కూడా కష్టం. కాకపోతే ఇవి ఇంకా ఎక్కువ పెరగకుండా లక్షణాల తీవ్రతను అదుపులోకి పెట్టుకోవటానికి బరువు పెరగకుండా వ్యాయామాలు, మితమైన డైటింగ్ చెయ్యటం మంచిది. అలాగే వారివారి లక్షణాలను బట్టి డాక్టర్ సలహా మేరకు మందులు వాడవలసి ఉంటుంది. వీరిలో షుగర్ ఉన్నవారిలోలాగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తగ్గించడానికి కొందరికి షుగర్‌కి వాడే మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. నా వయసు 27 సంవత్సరాలు. నేను అధిక బరువు ఉంటాను. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. ఈ టైమ్‌లో డైట్, వ్యాయామాల ద్వారా బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చా? ఒకవేళ చేసే వీలు ఉంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలో తెలియజేయగలరు. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు బరువు తగ్గించుకునే ప్రయత్నాలు మంచిది కాదని మా వారు అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం? దయచేసి వివరంగా తెలపండి. – కె.నీలిమ, సంగారెడ్డి అధిక బరువు ఉండటం వల్ల హార్మోన్స్‌లో తేడాలు ఏర్పడి పిరియడ్స్‌లో ఇబ్బందులు, గర్భం దాల్చడానికి ఇబ్బందులు, త్వరగా చిన్నవయసులోనే బీపి, షుగర్, మోకాళ్లనొప్పులు వంటి ఇబ్బందులు వస్తుంటాయి. గర్భం దాల్చిన తర్వాత హార్మోన్ అసమతుల్యత వల్ల అబార్షన్లు, బీపి, షుగర్ పెరిగే అవకాశాలు, కాన్పు సమయంలో కాన్పు తర్వాత ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువ. కాబట్టి బరువు తగ్గి సాధారణ బరువుకి వస్తే పైన చెప్పిన సమస్యల నుంచి బయటపడవచ్చు. బరువు తగ్గడానికి వాకింగ్, యోగా, జాగింగ్ వంటి వ్యాయామాలతో పాటు, మితమైన డైటింగ్ చెయ్యవచ్చు. ఇవన్నీ గర్భందాల్చక ముందే చెయ్యవలసిన పనులు. గర్భం వచ్చిన తర్వాత ఉన్న అధికబరువును తగ్గించడమనేది ఎంతమాత్రం మంచి పని కాదు. కానీ ఇంకా ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవచ్చు. ఆహారంలో అన్నం తక్కువ తీసుకుంటూ.. కూరలు ఎక్కువ తినడం, జంక్‌ఫుడ్, నూనె వస్తువులు, వేపుళ్లు, స్వీట్స్, చక్కెర వంటివి వాడకపోవటం, అరటిపండు, సపోటా వంటి చక్కెర శాతం ఎక్కువగా ఉండే పండ్లను అతి తక్కువగా తీసుకోవటం వంటివి పాటిస్తే ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవచ్చు. అలాగే రోజూ ఉదయం, సాయంకాలం 15 నిమిషాల పాటు సాధారణ వాకింగ్, మీ డాక్టర్ సలహా మేరకు అధికశ్రమలేని చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవచ్చు. చిన్న చిన్న ఇంటి పనులను కూడా చేసుకోవచ్చు. నేను ప్రెగ్నెంట్. నా వయసు 27. నేను ‘మార్నింగ్‌సిక్‌నెస్’ కు గురువుతున్నాను. ఏది తింటున్నా వికారంగానే అనిపిస్తోంది. దీని గురించి డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉంటుందా? ‘మార్నింగ్‌సిక్‌నెస్’ పోవడానికి హోమ్రెమిడీల గురించి వివరంగా తెలియజేయగలరు. – జి.భార్గవి, నందిగామ ప్రెగ్నెన్సీ మొదలయిన మొదటి మూడు నెలల్లో, ఎదిగే పిండం దగ్గర నుంచి బీటా హెచ్‌సిజి (ఏఇఎ) అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది కొంతమందిలో కొద్దిగా, మరికొందరిలో ఎక్కువగా విడుదల అవుతుంది. దీని ప్రభావం వల్ల ఒక్కొక్కరిలో వికారం, వాంతులు, ఆకలిలేకపోవడం, నీరసం బద్ధకం, ఓపిక లేకపోవడం, నిద్ర ఎక్కువగా ఉండటం, లేదా నిద్రపట్టకపోవడం, కొన్ని రకాల ఆహారపు పదార్థాలు నచ్చకపోవడం, ఎసిడిటీ వంటి ఇబ్బందులు ఉంటాయి. వీటినే మార్నింగ్ సిక్నెస్ అంటారు. ఏఇఎ మోతాదుని బట్టి.. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి.. మార్నింగ్ సిక్నెస్ లక్షణాలు ఉంటాయి. ఇవి మెల్లగా మూడు నెలలు దాటిన తర్వాత చాలావరకు తగ్గిపోతాయి. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి. తినే ఆహారంలో నూనె వస్తువులు, వేపుళ్లు, పచ్చళ్లు, కారం, మసాలాలు, కాఫీ, టీ వంటివి తీసుకోకపోవటమే అన్ని విధాల మంచిది. లేదా ఎంత తక్కువ తీసుకుంటే అంతమంచిది. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, మంచినీళ్లు, రాగిజావ, పండ్లు, పండ్లరసాలు, పాలు వంటివి ఎక్కువసార్లు తీసుకోవచ్చు. లక్షణాలు మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు.. ఛీ్ఠౌజీn్చ్ట్ఛ, ట్చnజ్టీజీఛీజీn్ఛ వంటి మాత్రలు, వాంతులు బాగా ఎక్కువగా ఉంటే ౌnఛ్చీnట్ఛ్టటౌn మాత్రలు వాడుకోవచ్చు. అంతేకానీ వికారం, వాంతులు అవుతున్నాయని, తినాలని అనిపించడంలేదని తినకుండా ఉండకూడదు. దీని వల్ల ఇంకా గ్యాస్ ఎక్కువగా ఏర్పడి.. లక్షణాల తీవ్రత పెరిగి.. సమస్య మరింత పెద్దదిగా మారవచ్చు. అందుకే వాంతులు అవుతున్నా, ఏదోఒకటి, కొద్దికొద్దిగా తాగుతూ, తింటూ ఉండాలి. మార్నింగ్‌సిక్‌నెస్ లక్షణాలు పెరుగుతూ బాగా ఇబ్బందిగా మారి కళ్లు తిరగడం, బీపీ తగ్గిపోవడం వంటివి ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి డాక్టర్ దగ్గరకు వెళ్లకపోతే.. డీహైడ్రేషన్‌లోకి వెళ్లి, ప్రాణాపాయస్థితికి చేరుకునే అవకాశాలూ లేకపోలేదు. ఇంటి చిట్కాలు, డాక్టర్ సలహాలు, మందులు పనిచెయ్యకపోతే.. తప్పనిసరిగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి, అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని సెలైన్స్ పెట్టించుకోవలసి ఉంటుంది. అంతేకానీ నిర్లక్ష్యం ఎంతమాత్రం మంచిది కాదు. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్నగర్హైదరాబాద్ -
పైలట్ల తప్పిదం.. విమానంలో నరకం
ముంబై: పైలట్ల తప్పిదం వల్ల దాదాపు 30 మంది విమాన ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం ముంబై నుంచి జైపూర్‌కు 166 మంది ప్రయాణికులతో వెళ్తున్న జెట్ ఎయిర్వేస్ విమానంలో ఒక్కసారిగా పీడనం తగ్గడంతో పలువురు ప్రయాణికుల ముక్కుల్లోంచి, చెవుల్లోంచి రక్తం రావడంతో అంతా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానంలోని ఎయిర్ ప్రెషర్ బటన్స్ ఆన్ చేయకపోవడం వల్ల ఈ దారుణం జరిగింది. ఏం జరుగుతుందో తెలియక ఉక్కిరిబిక్కిరైన ప్రయాణికులంతా ఆక్సిజన్ మాస్క్‌లు ధరించారు. కొద్దిసేపటికి తప్పు తెలుసుకున్న పైలట్లు టేకాఫ్ అయిన 23 నిమిషాల అనంతరం విమానాన్ని తిరిగి మళ్లీ ముంబై విమానాశ్రయంలో దించారు. చెవులు, ముక్కుల నుంచి రక్తం వచ్చిన ఐదుగురు ప్రయాణికులకు తాత్కాలికంగా వినికిడి సమస్య ఏర్పడిందని(బారోట్రామా), రెండు వారాల్లో కోలుకుంటారని ముంబైలోని బాలాభాయ్ నానావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉండడంతో వైద్య పరీక్షల అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశం ఈ ఘటనకు బాధ్యులైన పైలట్లను విధుల నుంచి తప్పించారు. విమాన ప్రమాద దర్యాప్తు విభాగం(ఏఏఐబీ)చే విచారణకు ఆదేశించింది. విమానం ఇంజిన్లు ఆన్ చేసే ముందు క్యాబిన్‌లోని ఒత్తిడి నియంత్రణను సరిచూసుకోవడం పైలట్ల బాధ్యతని, వారి నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని ఏఏఐబీ అధికారి తెలిపారు. విమానం ఎగరడానికి ముందు ‘బ్లీడ్’ స్విచ్‌ను ఆన్ చేయడం సిబ్బంది మరిచిపోయారని, దాంతో క్యాబిన్లో ఒత్తిడి నియంత్రణ కాలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. బోయింగ్ 737 విమానం క్యాబిన్లో ప్రెషర్ లోపం వల్ల ముంబైకి తిరిగి వచ్చిందని, పైలట్లను విధుల నుంచి తప్పించామని, దర్యాప్తు కొనసాగుతోందని జెట్ ఎయిర్వేస్ అధికార ప్రతినిధి తెలిపారు. ‘మొత్తం 166 మంది ప్రయాణికుల్లో 30 మంది ఇబ్బంది పడ్డారు. కొందరికి నోటి నుంచి, చెవుల నుంచి రక్తం వచ్చింది. కొందరు తలనొప్పితో ఇబ్బంది పడ్డారు’ అని చెప్పారు. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన జెట్ ఎయిర్వేస్.. ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ‘ఒక్కసారిగా గాలి ప్రెషర్ తగ్గింది. వెంటనే ఆక్సిజన్ మాస్క్‌లు ధరించాం. చెవుల్లో తీవ్రమైన నొప్పి ఉందని చాలా మంది ఫిర్యాదు చేశారు’ అని ఉద్యోగి ప్రశాంత్ శర్మ తెలిపారు. 30 లక్షల పరిహారం ఇవ్వాలి: బాధితుడు తనకు జరిగిన నష్టానికి రూ. 30లక్షల పరిహారంతో పాటు, ఎకానమీ క్లాస్ టికెట్‌పై బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించేందుకు 100 వోచర్లు ఇవ్వాలని వినికిడి లోపంతో ఇబ్బందిపడుతున్న ప్రయాణికుడు ఒకరు డిమాండ్ చేశారని ఎయిర్‌లైన్స్ సిబ్బంది వెల్లడించారు. -
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వండి
పణజి: గోవా రాజకీయం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధమంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి మనోహర్ పారికర్(62) దీర్ఘకాల అనారోగ్యం, ఆస్పత్రిలో చేరిక.. అనంతర పరిస్థితులను అంచనా వేసేందుకు వచ్చిన ముగ్గురు సభ్యుల బీజేపీ కేంద్ర బృందం ప్రస్తుతం రాష్ట్ర నేతలతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం గమనార్హం. మొత్తం 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పార్టీ నేత చంద్రకాంత్ కవ్లేకర్ నేతృత్వంలో సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే, గవర్నర్ మృదులా సిన్హా లేకపోవడంతో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కవ్లేకర్ విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీ నాయకత్వం తమాషాలు చేస్తోంది. ఏడాదిన్నరలోనే మరోసారి ఎన్నికలు జరపడం అంటే రాష్ట్ర ఖజానాపై భారం వేయడమే. అందుకే అసెంబ్లీని రద్దు చేయడానికి బదులు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరాం. మాకు అవకాశమిస్తే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని తెలిపాం’ అని ఆయన అన్నారు. కాగా, సంకీర్ణంలోనే ఉంటామని, సమస్య పరిష్కారం కోసం బీజేపీ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా తమకుఆమోదయోగ్యమేనంటూ భాగస్వామ్య పక్షాలు ప్రకటించాయి. అసెంబ్లీలోని 40 సీట్లకు గాను కాంగ్రెస్‌కు 16 మంది సభ్యులుండగా ప్రభుత్వం ఏర్పాటుకు మరో ఐదుగురు సభ్యుల మద్దతుంటే సరిపోతుంది. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ (14), మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (3), గోవా ఫార్వర్డ్ పార్టీ (3), ఎన్సీపీ (1), స్వతంత్రులు(3) కలుపుకుని 21 మంది సభ్యుల మద్దతుంది. -
పుట్టగొడుగు తిని ముగ్గురికి అస్వస్థత
టెక్కలి రూరల్ : పొలంలో దొరికిన పుట్టగొడుగు తిని ఇద్దరు చిన్నారులతో పాటు వృద్ధురాలు అస్వస్థతకు గురయ్యారు. మండంలోని భగవాన్‌పురానికి చెందిన వృద్ధురాలు ముత్యాలమ్మ, బాడాన సీత(13), బాడాన సత్యనారాయణ(10) బుధవారం పొలానికి వెళ్లారు. అక్కడి నుంచి వచ్చే సమయంలో పుట్టగొడుగును ఇంటికి తెచ్చుకున్నారు. తర్వాత దానిని వండి తిన్న తర్వాత.. వాంతులు, విరేచనాలు అవడంతో స్థానికులు హుటాహుటిన టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వీరు అక్కడే చికిత్స పొందుతున్నారు. -
11వ అంతస్తు నుంచి దూకి టెకీ ఆత్మహత్య
హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని 11 అంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కలికిరి మండలానికి చెందిన శ్రావణి(28) కుటుంబ సభ్యులతో కలసి మదీనాగూడలో ఉంటోంది. ప్రైమ్ ఎరా మెడికల్ టెక్నాలజీస్ కంపెనీలో పనిచేస్తోంది. శ్రావణికి 18 నెలల క్రితం రామకృష్ణతో వివాహం కాగా, 4 నెలల క్రితం బాబుకు జన్మనిచ్చింది. అప్పటినుంచి ఆమెకు తలనొప్పి, సైనస్ ప్రాబ్లమ్ రావడంతో చాలా ఆస్పత్రులకు వెళ్లినా తగ్గలేదు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9.30 గంటలకి ఉద్యోగానికి వెళుతున్నానని చెప్పి బయలుదేరిన శ్రావణి 10 గంటల సమయంలో ప్రైమ్ ఎరా కంపెనీ ఉన్న మిలాంజ్ టవర్స్ 11వ అంతస్తు ఎక్కి దూకింది. తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. అనారోగ్యం కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లి ఈశ్వరమ్మ పోలీసులకు తెలిపింది. -
వికటించిన వ్యాక్సిన్ చిన్నారులకు అస్వస్థత
-
హమ్మయ్య.. ఏమీ జరగలేదయ్యా
అర్ధరాత్రి హడావిడిగా ఆసుపత్రి తలుపు తట్టారు సన్నీ లియోన్. ఇది షూటింగ్ కోసం కాదు. నిజంగానే సన్నీ లియోన్ అస్వస్థతకు గురి అయ్యారు. అందుకే హాస్పిటల్‌కు వెళ్లారు. ఇంతకీ విషయం ఏంటంటే... ఓ చానల్ షోకు సంబంధించి ఉత్తరాఖాండ్‌లో ఉన్నారు సన్నీలియోన్. కానీ మిడ్నైట్ కడుపు నొప్పితో బాధపడుతూ అక్కడే ఉన్న ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు ఆమె. ‘‘మైల్డ్ ఫీవర్‌తో పాటు కడుపు నొప్పితో ఇబ్బందిపడుతూ సన్నీ లియోన్ హాస్పిటల్‌కు వచ్చారు. చికిత్స తర్వాత ఆమె కోలుకున్నారు. శుక్రవారం డిస్చార్జ్ చేశాం’’ అని హాస్పిటల్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ‘‘సన్నీ కాస్త అనారోగ్యానికి గురైన మాట వాస్తవమే. వైద్యులు బెడ్ రెస్ట్ సూచించారు. తిరిగి సోమవారం ఆమె సెట్లో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాం. అప్పటివరకు సన్నీతో సంబంధంలేని సన్నివేశాలను చిత్రీకరిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సో.. సన్నీ ఫ్యాన్స్ అందరూ ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట. -
డైట్ చిట్కాలు వికటించి అస్వస్థత..
సాక్షి, హైదరాబాద్: మందులు వేసుకోకుండా పాటించిన డైట్ చిట్కాలు చివరకు ఆమె ప్రాణాల మీదకు తెచ్చాయి. ఓ ఆయుర్వేద వైద్యుడు చెప్పిన డైట్ చిట్కాలు పాటిస్తూ వేళకు మందులు వేసుకోకపోవడంతో అస్వస్థతకు గురైంది. దీంతో బంధువులు ఆమెను చికిత్స కోసం బుధవారం నిమ్స్‌కు తరలించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మేన కోడలు అలివేలు(45) మధుమేహం, అధిక బరువు సమస్యలతో బాధపడుతోంది. బరువు తగ్గేందుకు ఓ ఆయుర్వేద వైద్యుడి సూచన మేరకు గత 31 రోజుల నుంచి డైట్(దీనిలో భాగంగా కొబ్బరినూనె తాగినట్లు తెలిసింది) పాటిస్తోంది. చిట్కాలు పాటిస్తూ ఇన్సులిన్ వాడకపోవడం వల్లే షుగర్ లెవల్స్ 450 ఎంజీకి పెరిగాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వైద్యులు తగిన చికిత్స అందించడంతో ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. కాగా, అలివేలును కడియం శ్రీహరి గురువారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా ఇదే సదరు ఆయుర్వేద వైద్యుడు సూచించిన చిట్కాలు వికటించి కేవలం 35 రోజుల్లో నలుగురు బాధితులు నిమ్స్‌లో చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
ఇంద్రాణీ ముఖర్జియాకు అస్వస్థత
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియా(46) అస్వస్థతకు లోనయ్యారు. దక్షిణ ముంబైలోని బైకుల్లా జైలులో అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను అధికారులు శుక్రవారం రాత్రి ఇక్కడి జేజే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇంద్రాణీకి సీసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి డీన్ ఎస్డీ ననంద్కర్ తెలిపారు. ఇంద్రాణీ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందన్నారు. 2012, ఏప్రిల్‌లో కుమార్తె షీనా బోరాను అత్యంత కిరాతకంగా హత్యచేసిన కేసులో ఇంద్రాణీని పోలీసులు 2015లో అరెస్ట్ చేశారు. -
తమిళనాడులో విషాదం
సాక్షి ప్రతినిధి, చెన్నై: పాఠశాల వార్షికోత్సవ ఫ్లడ్‌లైట్ల వెలుగులు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జీవితాల్లో చీకట్లు నింపాయి. కళ్లను ఏమాత్రం తెరవలేని స్థితిలో 60 మంది విద్యార్థులు, 30 మంది తల్లిదండ్రులు సహా 96 మంది కంటి ఆస్పత్రి పాలయ్యారు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా ఏర్వాడి పొత్తయడిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువులు చెప్పే ఎస్వీ హిందూ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ప్రతిఏటా పాఠశాల మైదానంలో నిర్వహించే వార్షికోత్సవాన్ని ఈసారి ఇరుకైన ఒక తరగతి గదిలో జరిపారు. వార్షికోత్సవ అలంకారం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు వీలుగా ఇరుకైన ఆ తరగతి గదిలో కళ్లు మిరుమిట్లు గొలిపే పెద్ద పెద్ద లైట్లను అమర్చారు. ఈ లైట్ల నుంచి వెలువడుతున్న కాంతులు విపరీతంగా ఉండడంతో అందరికీ కళ్లు మంటలు పుడుతుండగా నలుపుకుంటూనే కార్యక్రమాలను వీక్షించారు. ఇళ్లకు వెళ్లిన తరువాత అందరికీ కళ్లమంటలు అధికమై కనురెప్పలు తెరవలేని స్థితికి చేరుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ బాలసుబ్రమణియన్‌కు శుక్రవారం రాత్రి నుంచి వరుసగా ఫిర్యాదులు అందడంతో శనివారం ఉదయం ఒక వ్యాన్‌లో బాధితులను ప్రయివేటు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. 60 మంది విద్యార్థులు, 30 మంది తల్లిదండ్రులు, ఐదుగురు ఉపాధ్యాయులు, కరస్పాండెంట్ బాలసుబ్రమణియన్ సహా మొత్తం 96 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
అమితాబ్ బచ్చన్‌కు అస్వస్థత
జోధ్‌పూర్/న్యూఢిల్లీ: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’చిత్ర షూటింగ్లో బిగ్ బీ అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆయన్ని జోధ్‌పూర్‌లోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అమితాబ్‌కు చికిత్స అందించేందుకు ముంబై నుంచి జోధ్‌పూర్‌కు ప్రత్యేక వైద్య బృందం కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. వెన్నునొప్పితో బాధ పడుతున్న అమితాబ్ ఇటీవల లీలావతి ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం ఉదయం కూడా పలు ట్వీట్స్ చేసిన అమితాబ్ హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అమితాబ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆయన భార్య జయాబచ్చన్ చెప్పారు. -
తాగునీరు కలుషితం..50 మందికి అస్వస్థత
నగరంపాలెం(గుంటూరు): గుంటూరు నగరంలో తాగునీరు కలుషితమై 50 మంది అస్వస్థతకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరపాలక సంస్థ పరిధిలోని సంగడిగుంట లాంచెస్టర్ రోడ్డు పరిసర ప్రాంతాల్లోని మంత్రివారి వీధి, చిటికెల వారి వీధీ, రెడ్ల బజారు తదితర ప్రాంతాల్లోని వార్డులతో పాటు ఆనందపేట, పొన్నూరు రోడ్డులో పలువురు ఆదివారం విరోచనాలు, వాంతులతో గుంటూరు జీజీహెచ్, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. శనివారం ఉదయం వచ్చిన మంచినీరు తాగటం వలన అస్వస్థతకు గురైనట్లు పలువురు బాధితులు తెలుపుతున్నారు. ఆదివారం ఉదయం నీళ్ల విరోచనాలు, వాంతులు అవటంతో నీరిసించి అస్వస్థతతో 20 నుంచి 25 మంది వరకు సంగడిగుంట లాంచెస్టర్ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మురుగునీటి కాల్వ మీద నుంచే మంచి నీరు సరఫరా అవుతుండడంతో అక్కడక్కడ లీకులు వలన నీరు కలుషితం అవుతుందన్నారు. విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ, ఇంజనీరింగ్, ప్రజారోగ్యశాఖ అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ ఎంహెచ్వో డాక్టర్ శోభారాణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు లక్ష్మయ్య బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్ళి వివరాలు సేకరించారు. కమిషనర్ ఆదేశంతో సంగడిగుంటలోని వడ్డేగూడెం మున్సిపల్ పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. -
ప్రియుడి కోసం పోరాడుతున్న యువతికి అస్వస్థత
ఒడిశా: ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ముందు ఆరు రోజులుగా నిరసన తెలియజేస్తున్న యువతి ఆరోగ్య పరిస్థితి విషమించింది. వివరాల్లోకి వెళ్తే... కొమరాడ మండలం తులసివలస గ్రామానికి చెందిన బొడ్డు రాజశేఖర్ ఇంటి ముందు అతని ప్రియురాలు పుణ్యావతి ఆరు రోజులుగా నిరసన తెలియజేస్తోంది. తన ప్రియుడితో పెళ్లి చేసేంతవరకు అన్నపానీయాలు ముట్టనని భీష్మించుకుని కూర్చున్న యువతి ఆరోగ్యం సోమవారం నాటికి క్షీణించింది. విషయం తెలుసుకున్న సీపీఎం నాయకులు, స్థానికులు ఆమెను 108 వాహనంలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు కొల్లి సాంబమూర్తి, బీవీఆర్ మాట్లాడుతూ, యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కానందున ఎటువంటి చర్యలు తీసుకోలేమని కొమరాడ తహసీల్దార్ సూర్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం పుణ్యావతి పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
మహిళను పీక్కుతిని చంపేసిన శునకాలు
సాలూరు: భర్త ఆదరణకు నోచుకోని ఓ ఒంటరి ఇల్లాలు వీధికుక్కలకు బలైంది. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బంగారమ్మ కాలనీలో వెంకటాపురం గజలక్ష్మి (45) శిథిలమైన తన గృహంలో నివాసం ఉంటోంది. భర్త రామకృష్ణ బొడ్డవలస గురుకుల పాఠశాలలో వంటవాడిగా పనిచేస్తున్నాడు. ఆయన ఆదరణ లేకపోవడంతో ఈమె ఇరుగుపొరుగు వారిచ్చే ఆహారం తీసుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. అనారోగ్యం బారినపడ్డ ఆమె శిథిల గృహంలో గురువారం రాత్రి నిద్రపోయింది. తలుపులు కూడా లేని ఆ ఇంట్లో వీధికుక్కలు తలదాచుకోవడం సాధారణమైంది. వేకువజామున 3 గంటల సమయంలో ఆమెపై కుక్కలతో పాటు కుక్క పిల్లలు దాడిచేసి, ఆమె శరీరాన్ని పీక్కుతిని దారుణంగా చంపేశాయి. తెల్లవారుజామున సమీప కుటుంబాలవారు వెళ్లి చూసేసరికి అత్యంత దారుణ స్థితిలో ఉన్న గజలక్ష్మి మృతదేహాం పడిఉంది. వార్డు మాజీ కౌన్సిలర్ పెద్దింటి శ్రీరాములు పోలీసులకు తెలపడంతో ఎస్ఐ పాంగివారి విచారణ జరిపారు. -
కల్తీ సారా తాగి 9 మందికి అస్వస్థత
కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మాళ్లపల్లిలో కల్తీసారా తాగి 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరు బుధవారం ఆస్పత్రిలో మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన ఎనగందుల పోశం, మల్లక్క, నిమ్మలగూడంలో ఆత్రం సత్యవార్, ఆత్రం సునీల్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎర్రోళ్ల లస్మయ్య, ఒడిపిలవంచకు చెందిన బండి సమ్మయ్య, రాములు, మరో ఇద్దరు గ్రామంలోని సమ్మక్క అనే మహిళ వద్ద సారా తాగారు. ఇందులో సునీల్, సత్యవార్ సోమవారం సారా తాగగా, మిగిలిన వారు మంగళవారం సాయంత్రం సారా తాగారు. తాగిన కొంత సమయానికే వారు వాంతులు, విరేచనాలకు లోనయ్యారు. పోలీసులు వెంటనే బాధితులను మండల కేంద్రం లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇందులో ఎలగందుల పోశం, మల్లక్క, ఎర్రోళ్ల లస్మయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎం, పరకాల ఆస్పత్రులకు తరలించారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా సోమన్ పల్లివాసి ఏర్రోళ్ల లస్మయ్య(45) పరకాల ఆస్పత్రిలో చనిపోయాడు. సత్యవార్ పరిస్థితి విషమంగా ఉంది. హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెం టిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం. -
సోనియాకు అస్వస్థత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ(70) శుక్రవారం అస్వస్థతకు లోనయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కడుపు నొప్పి రావడంతో ఆమెను ఎయిర్ అంబులెన్స్ ద్వారా హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై గంగారామ్ ఆస్పత్రి చైర్మన్ డా.డీఎస్ రానా మీడియాతో మాట్లాడుతూ.. సోనియా సాయంత్రం 5 గంటల సమయంలో కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరారన్నారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీటర్లో స్పందిస్తూ.. సోనియా పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. ‘సిమ్లాలో అమ్మ(సోనియా)కు కడుపు నొప్పి రావడంతో వెంటనే ఢిల్లీకి తీసుకొచ్చాం. భయపడాల్సిందేమీ లేదు. ప్రస్తుతం ఆమె పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. మీ అద్భుతమైన ప్రేమ, ఆప్యాయతలకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. -
జనగామలో ప్లాíస్టిక్ బియ్యం కలకలం
ఎగిరి పడుతున్న అన్నం ఉండలు భోజనం చేసిన కుటుంబ సభ్యులకు అస్వస్థత జనగామ: జనగామలో ప్లాస్టిక్ బియ్యం గురువారం కలకలం రేపింది. దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ బియ్యం అమ్మకాలు జోరుగా సాగుతున్న క్రమంలో జిల్లా కేంద్రంలో అమ్మకాలు వెలుగులోకి రావడం సివిల్ సప్లయ్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపిస్తుంది. బాధితుల తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్కు సమీపంలోని ఎస్బీఐ ఏడీబీ బ్యాంకు ఎదురుగా నివాసముంటున్న కంతి శివశంకర్ రెండు రోజుల క్రితం ఎల్జీ కంపెనీకి చెందిన 25 కిలోల బియ్యం కొనుగోలు చేశాడు. బుధవారం రాత్రి ఆయన భార్య చందన అన్నం వండగా కొత్త రకమైన వాసన రావడంతో అనుమానం కలిగింది. భర్తతో పాటు ఎల్కేజీ చదువుకుంటున్న కుమారుడికి వడ్డించింది. అదే రోజు రాత్రి కుమారుడు వాంతులు చేసుకోగా ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. అనుమానం వచ్చిన శివశంకర్ పరిశీలి ంచగా ప్లాస్టిక్ బియ్యంగా అనుమానించాడు. ఈ విషయాన్ని స్థానికులకు తెలపడంతో భోజనాన్ని ముద్దలుగా తయరు చేసి నేలకు కొట్టడంతో బంతుల్లాగా పైకి ఎగిరి రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. చుట్టపక్కల కాలనీవాసులు తమ ఇంట్లో నిల్వ ఉన్న బియ్యాన్ని అనుమానంగా పరిశీలించుకున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని శివశంకర్ తెలిపాడు. కాగా జనగామలో ప్లాస్టిక్ రైస్ అమ్మకాలు చేస్తున్నారనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ప్లాస్టిక రైస్ లేక పాలిషింగ్ చేసిన బియ్యమా నిజానిజాలు తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగాలని ప్రజలు కోరుతున్నారు. -
నర్సింగ్ విద్యార్థినులకు అస్వస్థత
► కలుషితాహారం తిని వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిన 21 మంది ► రిమ్స్ నర్సింగ్ హాస్టల్లో పర్యవేక్షణ లోపం ► ఆహార కాంట్రాక్టర్‌కు మెమో జారీ ఒంగోలు సెంట్రల్: రిమ్స్ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రిమ్స్‌కు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో దాదాపు 180 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా రిమ్స్‌లోనే ఉన్న నర్సింగ్ కళాశాలలోనే ఉంటున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే హాస్టల్లో ఉన్న విద్యార్థినులు కడుపునొప్పితో విలవిల్లాడారు. దీంతో ఉదయం 6 గంటల సమయంలో ఈ విషయాన్ని రిమ్స్ అధికారులకు తెలిపారు. అనంతరం ఐదుగురు విద్యార్థినులు రిమ్స్ క్యాజువాలిటీ అత్యవసర చికిత్స విభాగంలో తీవ్ర కడుపునొప్పితో చేరారు. అనంతరం మరో ఐదుగురు తీవ్ర వాంతులతో, ఇంకో 11 మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం చేరారు. మధ్యాహ్నానికి పలువురు విద్యార్థినులు కోలుకున్నారు. మిగిలిన వారిలో మూడో సంవత్సరం నర్సింగ్ విద్యార్థినులు లావణ్య, హర్షితల పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ప్రత్యేక చికిత్స అందించారు. వీరికి బీపీ చాలా తక్కువగా ఉండటంతో అత్యవసర చికిత్స అందించారు. మరో 24 గంటలు పరిశీలనలో ఉంచారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు దగ్గర ప్రాంతాల వారు హుటాహుటిన రిమ్స్‌కు చేరుకుని, తమ పిల్లల పరిస్థితి వాకబు చేసి ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థినులకు లక్ష్మీనారాయణ అనే కాంట్రాక్టర్ ఆహారాన్ని సరఫరా చేస్తున్నాడు. గురువారం రాత్రి దోసకాయ కూరతో కూడిన అన్నాన్ని విద్యార్థినులకు పెట్టారని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.వల్లీశ్వరి తెలిపారు. ఆహారంలోనో, పాత్రల్లోనూ కలుషితమై విషపూరితమైనట్లు చెప్పారు. కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులను శుక్రవారం మధ్యాహ్నం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, రిమ్స్ వైద్యశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సింగరాజు రాంబాబులు రిమ్స్‌కు చేరుకుని పరామర్శించారు. విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరక్టర్ డాక్టర్ వల్లీశ్వరి, సూపరింటెండెంట్ డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ నామినేని కిరణ్‌కుమార్, డాక్టర్ ఎం.వెంకయ్య, డాక్టర్ హనుమానాయక్, నర్సింగ్ సిబ్బంది వైద్య సేవలు అందించారు. వసతి గృహంపై కొరవడిన పర్యవేక్షణ: రిమ్స్ నర్సింగ్ కళాశాల వసతి గృహంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఆహార కాంట్రాక్టర్ తన ఇష్టం వచ్చినట్లు ఆహారాన్ని సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అనేక సార్లు ఆహారం బాగాలేదని విద్యార్థినులు ఫిర్యాదు చేసినా కాంట్రాక్టర్ గానీ, అధికారులు గానీ పట్టించుకోలేదు. ఈమధ్యే వైద్య కళాశాల విద్యార్థినులు తమకు కూడా నాణ్యమైన ఆహారం అందించడం లేదని, అధిక ధరలు వసూలు చేస్తున్నారని పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, కలెక్టర్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే విచారణ చేస్తున్నారు. ఇది జరుగుతుండగానే నర్సింగ్ కళాశాల వసతి గృహంలో ఆహారం కలుషితమై విషాహారంగా మారింది. ఆహారం విద్యార్థినులు గానీ, రోగులు గానీ తినే ముందు ఆర్ఎంఓ, డైటీషియన్లు తప్పని సరిగా రుచి చూడాలి. బాగుంది అంటేనే విద్యార్థులకు గానీ, రోగులకు గానీ వడ్డించాలి. అయితే ఈ నిబంధన అమలు కావడం లేదు. ఆమ్యామ్యాలకు కక్కుర్తి పడుతున్న అధికారులు నాసిరకం భోజనాన్ని విద్యార్థినులకు అందిస్తున్నారు. ఆహార కాంట్రాక్టర్‌కు మెమో: రిమ్స్ నర్సింగ్ కళాశాల వసతి గృహానికి ఆహారాన్ని సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ లక్ష్మీ నారాయణకు ప్రాథమికంగా మెమో జారీ చేస్తున్నట్లు రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. ఆహార శాంపిల్‌ను నాణ్యత పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. పూర్తి నివేదిక అందగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
చలితో గజగజ..!
• రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు • చలిగాలులతో వణుకుతున్న ప్రజలు • పొంచి ఉన్నఅనారోగ్య ముప్పు మహబూబ్‌నగర్ క్రైం : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లో కనిష్ట ఉష్ణోగ్రతలు అతి తక్కువస్థాయికి పడిపోతున్నాయి. పదిరోజుల నుంచి చలి పెరిగుతోంది. గ్రామీణ ప్రాంతంలో ప్రజల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిం ది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రోజురోజుకు వాతావరణంలో భారీ మార్పులతో కనిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలిపులి పంజా విసురుతోంది. సాయంత్రం ఐదు దాటిందంటే చల్లనిగాలులు వీస్తున్నాయి. తెల్లవారుజామున నుంచి చల్లని గాలులతో పాటు మంచు కప్పుకుంటోంది. పదేళ్ల కాలంలో ఎప్పుడూ నమోదుకాని విధంగాలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో ఈసారి ఉదయం 8గంటలు గడవనిదే ఏపని చేసుకోలేని పరిస్థితి. మరోవైపు పిల్లల నుంచి పెద్దల వరకు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. చలిజ్వరాలతో పాటు ఇతరత్ర వ్యాధులతో సతమతమవుతున్నారు. రాత్రివేళల్లో.. జిల్లాలో వారం రోజులుగా రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులతో జలుబు, దగ్గు తదితర సమస్యలతో ఆనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. చలిని తట్టుకోలేక వృద్ధులు ఇబ్బందిపడే అవకాశం ఎక్కువగా ఉంది. చలికాలంలో రుగ్మతలు ధరిచేరకుండా పరిశుభ్రతతో పాటు ఆహారపు అలవాట్లలో స్వల్ప మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే శరీరాన్ని కాపాడుకోవచ్చు. -
రుద్రారంలో బాలికకు డెంగీ
హైదరాబాద్‌లో చికిత్స గ్రామంలో మరికొందరికి విషజ్వరాలు చిన్నశంకరంపేట: డెంగీ వ్యాధితో బాలిక అస్వస్థతకు గురైన సంఘటన మండలంలోని రుద్రారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి వినోద్ కూతురు ధనలక్ష్మి చిన్నశంకరంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. వారం క్రితం విషజ్వరంతో బాధపడుతుండగా స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో సికింద్రాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగీ సోకినట్లు నిర్ధారించారు. దీంతో అక్కడ చికిత్సలు అందించారు. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయడంతో గ్రామానికి చేరుకున్నారు. బాధిత బాలిక తండ్రి వినోద్ మాట్లాడుతూ బాలికకు జ్వరం ఉందని ఆస్పత్రికి తీసుకుపోతే హైదరాబాద్ తీసుకుపొమ్మన్నారన్నారు. అక్కడి డాక్టర్లు పరీక్షలు నిర్వహించి డెంగీ వ్యాధి సోకినట్లు నిర్ధారించారని తెలిపారు. సుమారు రూ. లక్ష వైద్యం కోసం ఖర్చయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైద్యం ఖర్చులను అందించి ఆదుకోవాలని కోరారు. కాగా గ్రామంలో అనేక మంది విషజ్వరాలతో బాధపడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. వైద్య అధికారులు గ్రామానికి వచ్చి వైద్య పరీక్షలు చేయాలని కోరారు. ఇదే విషయం చిన్నశంకరంపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సవిత దృష్టికి తీసుకుపోగా బాలికకు డెంగీ వ్యాధి వచ్చిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. గ్రామానికి వైద్య సిబ్బందిని పంపించి వైద్య పరీక్షలు చేయిస్తానన్నారు. -
జ్వరాలతో వణుకుతున్న గురుకులం
సిద్దిపేట రూరల్:మండలంలోని మిట్టపల్లి, ఎల్లుపల్లి గ్రామాల శివారులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విష జ్వరాలతో వణుకుతోంది. ఒకే రోజు పదుల సంఖ్యలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా వాంతులు, విరేచనాలు, విషజ్వరాలతో బాధపడుతున్నారు. శుక్రవారం ఉదయం ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకురావడంతో, 20మందిని ఆటోల్లో సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్సలు అందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ సంబంధిత పుల్లూర్ పీహెచ్సీ వైద్యులకు సూచించారు. దీంతో వైద్యుడు శివకుమార్ నేతృత్వంలో పాఠశాలలో హెల్త్‌క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెల్త్‌క్యాంప్ ద్వారా విద్యార్థినీలందరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. విషజ్వరాలు తీవ్రంగా ఉన్న 8మంది విద్యార్థినులను ప్రత్యేక గదిలో చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ పాఠశాలలో నీటి నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెంది విషజ్వరాలు సోకినట్లు తెలిపారు. -
అనారోగ్యంతో రైలు ప్రయాణికుడి మృతి
రైల్వే గేట్ : అనారోగ్యంతో రైలు ప్రయాణికుడు మృతిచెందిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వరంగల్ జీఆర్పీ సీఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లా దన్‌సిరియా ప్రాంతానికి చెందిన రాంకృపాల్‌సింగ్(62) పాటలీపుత్ర – యశ్వంతాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నైకి వెళ్తున్నాడు. రైలు వరంగల్ సమీపంలోకి చేరుకోగానే అతడు తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. రైలు వరంగల్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే ఆయన భౌతికకాయాన్ని దింపి, పోలీ సులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. కేసును హెడ్ కానిస్టేబుల్ ముర ళి దర్యాప్తు చేస్తున్నారు. -
అతిసారంతో 41 మందికి అస్వస్థత
దుర్కి (బీర్కూర్) : నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలంలోని దుర్కి గ్రామంలో డయేరియా ప్రబలింది. మంగళవారం గ్రామానికి చెందిన సుమారు 41మంది దళితులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఏఎన్ఎం ఇచ్చిన సమాచారంతో బీర్కూర్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిలిప్‌కుమార్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని అత్యవసర వైద్యశిబిరం నిర్వహించారు. అస్వస్థతకు గురైన వారిని గ్రామ చావిడి, సబ్సెంటర్లలో పరీక్షించి ప్రత్యేక చికిత్సలు అందించారు. గ్రామంలో డయేరియా వ్యాపిస్తోందని తెలుసుకున్న జిల్లా మలేరియా అధికారి లక్ష్మయ్య, జిల్లా స్పెషల్ డాక్టర్ రాజేష్‌లు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
నాసిరకం వంటనూనెతో మధ్యాహ్న భోజనం
♦ దద్దుర్లతో అస్వస్థతకు గురైన విద్యార్థినులు ♦ ధరిపల్లి జెడ్పీపాఠశాలలో సంఘటన చిన్నశంకరంపేట : మధ్యాహ్న భోజనంలో నాసిరకం వంట నూనె వాడడంతో విద్యార్థులు దద్దుర్లతో అస్వస్థతకు గురైన సంఘటన చిన్నశంకరంపేట మండలం ధరిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో నెలకొంది. గురువారం పాఠశాలకు హాజరైన విద్యార్థులకు చేతులపై దద్దుర్లు కనిపించాయి. మధ్యాహ్న భోజన సమయానికి దద్దుర్లతో నొప్పి ఎక్కువ కావడంతో విద్యార్థులు ఆందోళనకు గుర య్యారు. చేతులు, ఇతర శరీర భాగాలపై దద్దుర్లు పెరిగిపోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజన సమయానికి నొప్పి ఎక్కువ కావడంతో రోదించడం మొదలు పెట్టారు. విద్యార్థుల పరిస్థితిని గమనించిన పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం వెంకటేశం గ్రామ ప్రజాప్రతినిధులకు, విద్యార్థుల తల్లి తండ్రులకు సమాచారం అందించారు. వెంటనే విద్యార్థుల తల్లి తండ్రులు చిన్నశంకరంపేట పీహెచ్సీ సిబ్బందికి సమాచారం అందించడంతో డాక్టర్ సువర్ణ సిబ్బందితో వచ్చి వైద్య సేవలు అందించారు. 50 మందికి విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం 108లో మెదక్ ఏరియా అస్పత్రికి తరలించారు. కాగా విద్యార్థులకు దద్దుర్లు రావడానికి నాసిరకం వంటలే కారణమని విద్యార్థుల తల్లి తండ్రులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంఈఓ బాల్‌చంద్రం, చిన్నశంకరంపేట ఎస్ఐ నగేష్, ఏఎస్ఐ పోచయ్య, ఎంపీటీసీ శ్రీని వాస్, ఉపసర్పంచ్ పాండు పాఠశాలకు చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
ఆహారం వికటించి 20మంది బాలికలకు అస్వస్థత
కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆహారం వికటించి పలువురు బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఎన్ఆర్ఐ బాలికల వసతి గృహంలో గురువారం ఉదయం టిఫిన్ చేసిన బాలికల్లో 20 మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడ్డారు. నిర్వాహకులు వారిని వెంటనే ప్రగతినగర్‌లోని పీపుల్స్ ఆస్పత్రికి తరలించారు. వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కలుషితాహారం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. -
నటుడు రితీశ్కు అస్వస్థత
తమిళసినిమా: నటుడు, రాజకీయ నాయకుడు రితీశ్ గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారు. రితీశ్ కానల్‌నీర్, నాయగన్, పెన్‌సింగం తదితర చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్న రితీశ్ డీఎంకే తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం అన్నాడీఎంకేలో చేరారు. రెండు రోజుల క్రితం జిమ్‌కు వెళ్లినప్పుడు హఠాత్తుగా గుండెపోటు రావడంతో నిర్వాహకులు మైలాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అత్యవసర విభాగంలో చికిత్సలు పొందుతున్నారు. అధిక రక్తపోటు కారణంగానే రితీశ్ అనారోగ్యానికి గురయ్యాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. -
కాలం చెల్లిన వంటనూనెతో పలువురికి అస్వస్థత
మంచాల: కాలంచెల్లిన వంటనూనెతో చేసిన ఆహార పదార్థాలు తిని.. పలువురు అస్వస్థతకు గురైన సంఘటన మంచాలలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నారెడ్డి విజయ్‌భాస్కర్ ఇంట్లో ఓ శుభకార్యం ఉండడంతో శ్రీగణేష్ సూపర్మార్కెట్లో దుకాణంలో గోల్డెన్ ప్యూర్ కంపెనీ పేరుతో ఉన్న మంచినూనె ప్యాకెట్లను ఆదివారం కొన్నాడు. వీటితో ఆహార పదార్ధాలు తయారుచేశారు. అయితే భోజనం చేస్తున్న సమయంలోనే ఓ రకమైన వాసన వచ్చిందని తెలిపారు. అప్పటికే అన్నం తిన్న ఐదారుగురు వాంతులు చేసుకోవడంతో.. ఇదేమిటా? అని పరిశీలించారు. తేదీ దాటిపోయిన నూనెను వాడడం వల్లే ఇలా జరిగిందని నిర్ధారించుకున్నారు. 2015 ఆగస్టు 8న ప్యాక్ చేసిన నూనెను 6 నెలలలోపే విక్రయించాలి. కానీ 10 నెలలు దాటిన నూనెను వ్యాపారి తమకు అంటగట్టాడని విజయ్‌భాస్కర్ మండిపడ్డారు. ఈ విషయమై దుకాణదారుడి వద్దకు వెళ్లి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. మంచాల సీఐ గంగాధర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వచ్చి సూపర్మార్కెట్లో పరిశీలించగా పది నెలల కాలం దాటిన ఆయిల్ ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు సీఐ తెలిపారు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి తీవ్ర అస్వస్థత
అధిక రక్తపోటుతో ఫిట్స్... హైదరాబాద్ కేర్‌కు తరలింపు నంద్యాల: నంద్యాల ఎంపీ ఎస్పీవెరైడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి రక్తపోటు అధికం కావడంతో ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ముందుగా స్థానిక సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొంత కాలంగా అస్వస్థతకు లోనైన ఆయన.. ఇటీవల కోలుకుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని గడివేముల మండలం ఉండుట్ల గ్రామంలో 30 ఏళ్ల తర్వాత బుధవారం జరిగిన జాతరలోనూ పాల్గొన్నారు. అనంతరం తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే ఎండ తీవ్రతతో రక్తపోటు అధికమై అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు న్యూరాలజిస్ట్ వరదరాజు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ హరినాథరెడ్డి వెళ్లి ఆయనకు వైద్యం చేశారు. ఇదే సమయంలో ఫిట్స్ వచ్చి శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. రాత్రి 7.30 గంటల సమయంలో సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రిలో చేర్పించారు. తర్వాత ఆయన అల్లుడు శ్రీధర్‌రెడ్డి, కుమార్తెలు సుజల, రాణి, మేనల్లుడు రాజగోపాల్‌రెడ్డి హుటాహుటిన అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. -
ఎండకు విలవిల
♦ నిప్పుల కొలిమిని తలపిస్తున్న జిల్లా ♦ మధ్యాహ్నం బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం ♦ ఇప్పటికే 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ♦ వడదెబ్బతో అస్వస్థతకు గురవుతున్న ప్రజలు తాండూరు: భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. తీవ్రరూపం దాల్చిన ఎండలకు తోడు వేడి గాలులు వీస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇళ్ల నుంచి భయటకు రావడానికి భయపడుతున్నారు. వాతావరణం పొడిగా మారి, తేమశాతం గణనీయంగా తగ్గడంతో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. గడిచిన శుక్రవారం (ఈనెల 18న) అత్యధికంగా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం తీవ్ర రూపం దాల్చిన ఎండలకు ఉదాహరణ. సాధారణంగా 30-35 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదైతే ఎండలతో వాతావరణం వెడెక్కుతుంది. ఇక 38 డిగ్రీలు నమోదైతే భరించలేని విధంగా వాతావరణం వేడిగా మారుతుంది. కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీలకు చేరడంతో జనాలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. తీవ్ర వర్షాభావం నేపథ్యంలో ఈసారి ఫిబ్రవరి నెల నుంచే గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలుగా నమోదుతున్నాయి. మార్చి వచ్చే సరి కి మరింత అధికమయ్యాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6గంటల వరకు ఎండల తీవ్రత కనిపిస్తున్నది. దాంతో జనాలు రోడ్ల మీదకు రావడం తగ్గింది. చాలా మంది ఎండల ప్రభావంతో అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. నాపరాతి గనులు, పాలిషింగ్ యూనిట్లలో పని చేయడానికి కార్మికులు ఆసక్తి చూపకపోవడం లేదు. దాంతో గనుల్లో పనులు స్తంభించిపోతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఆస్పత్రి వైద్యులు సూచిస్తున్నారు. -
కల్తీ నెయ్యి కేంద్రంపై పోలీసుల దాడి
రూ.10 లక్షల విలువ చేసే నెయ్యి, మిషనరీ స్వాధీనం ఈ నెయ్యి తింటే అనారోగ్యం తప్పదంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యంపై కల్తీకాటు వేస్తోంది. ఉప్పు, పప్పు, పాలే కాదు.. నెయ్యిని కూడా వదలడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ శివారులోని ఓ కల్తీనెయ్యి కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. సుమారు రూ.10 లక్షల విలువ చేసే నెయ్యి సహా మిషనరీలను స్వాధీనం చేసుకున్నారు. మీర్‌పేట పరిధిలోని నాదర్గుల్ గ్రామంలో కరీంనగర్‌కు చెందిన మహేష్(25) ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నకిలీ నెయ్యి తయారీ కేంద్రం నిర్వహిస్తున్నాడు. విషయం తెలిసిన స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్ఓటీ) ఓఎస్డీ రామచంద్రారెడ్డి నేతృత్వంలోని ఇన్స్పెక్టర్ నర్సింగ్‌రావ్ బృందం గురువారం కల్తీ నెయ్యి కేంద్రంపై ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఎటువంటి ట్రేడ్ లెసైన్స్ లేకుండానే ప్రముఖ బ్రాండ్ల పేరుతో మార్కెట్లో ఈ కల్తీ నెయ్యిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రూ.5 లక్షల విలువ చేసే 2,100 కిలోల పామాయిల్, 230 కిలోల కృత్రిమ నెయ్యి, 36 కిలోల డాల్డా, 300 లీటర్ల విలువైన ముడి సరుకు, మూడు ప్యాకింగ్ మిషన్లను, ఒక పెద్ద నెయ్యి బాయిలర్‌తో పాటు 5 లక్షల విలువ చేసే మరో యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కృష్ణ, లక్ష్మి, దుర్గ బ్రాండ్ల పేర్లతో ప్యాక్ చేసిన నెయ్యి ప్యాకెట్లను కూడా పోలీసులు గుర్తించారు. తదుపరి విచారణ కోసం నిందితులను మీర్‌పేట పోలీసులకు అప్పగించారు. ఇది తింటే ప్రమాదం: డాక్టర్ నాగార్జున, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, సన్‌షైన్ ఆసుపత్రి సహజసిద్ధమైన నెయ్యిలో పామాయిల్, డాల్డా కలపడం వల్ల ఆ ఆహార పదార్థం విషతుల్యంగా మారే ప్రమాదం ఉంది. అజీర్తితో పాటు గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో భారీగా కొవ్వు పేరుకుపోయి ఊబకాయానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇది మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. -
ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు..! ప్రయత్నం విరమిస్తే మరణించినట్లు!!
సినీ రంగంలో బ్రేక్ వచ్చేంత వరకు పడిన కష్టాల గురించి ఒకసారి ఎమ్మెస్ ‘సాక్షి’తో పంచుకుంటూ, ‘‘...ఆ పన్నెండేళ్ళు నేను పడిన కష్టాలు భయంకరం! ఒక దశలో విరక్తి చెంది, మా ఊరెళ్ళిపోదామనుకున్నాను. మర్నాడు రెలైక్కడానికి టికెట్ కూడా తెచ్చుకున్నా. ఆ రాత్రి రూమ్‌లో కూర్చొని ఆలోచనలో పడ్డా. అప్పుడు నేను రాసిన కథలు గుర్తొచ్చాయి. నా కథల్లో హీరో సినిమా మొత్తం కష్టపడి, చివరికి అనుకున్నది సాధిస్తాడు. ‘మనం రాసిన కథల్లో హీరోల్లా మనం కష్టపడకూడదా?’ అని ఎందుకో అనిపించింది. అంతే! ‘ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు... ప్రయత్నం విరమిస్తే మరణించినట్లు’ అని పేపర్ మీద రాసుకున్నా. దాన్ని గోడకు అంటించా. టికెట్ చించేశా’’ అని చెప్పుకొచ్చారు. ఆ తరువాత దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గరకు రచయితగా వెళ్ళడం, నటుడిగా తెర మీదకు రావడం చరిత్ర. ప్రయత్నిస్తూ కెరీర్లో గెలుపు సాధించిన ఎమ్మెస్ అనారోగ్యంపై పోరులో అర్ధంతరంగా ప్రయత్నం విరమించి కన్నుమూయడం తీరని విషాదం. -
సినీ నటుడు ఎంఎస్ నారాయణకు అస్వస్థత
-
సినీ నటుడు ఎంఎస్ నారాయణకు అస్వస్థత
భీమవరం: సినీ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించి అనంతరం విజయవాడ ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. ఎంఎస్ నారాయణ స్వస్థలమైన భీమవరానికి సంక్రాంతి పండుగని వచ్చి ఆదివారం సాయంత్రం స్థానిక హోటల్లో గది తీసుకున్నారు. ఆహారం తీసుకున్న అనంతరం రాత్రివేళ ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సన్నిహితులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఫుడ్ పాయిజన్ జరిగినట్లు వైద్యులు చికిత్స చేశారు. విషయం తెలుసుకున్న ఎంఎస్ కుమారుడు, సినీ హీరో విక్రమ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఎంఎస్ నారాయణను హైదరాబాద్ లోని కిమ్స్ కు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మెరుగుపడుతున్న కేశవరెడ్డి ఆరోగ్యం
నిజామాబాద్: ప్రముఖ తెలుగు నవలారచయిత డాక్టర్ పెనుమూరి కేశవరెడ్డి గత సోమవారం గుండెనొప్పితో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 66 ఏళ్ల కేశవరెడ్డి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని ఆయనకు వైద్య సేవలు అందిస్తున్న కార్డియాలజిస్ట్ డాక్టర్ రవీంద్రనాథ్‌సూరి తెలిపారు. నాలుగు మాసాల క్రితం కేశవరెడ్డికి లింక్ఫోమా కేన్సర్ వ్యాధి నిర్ధారణ అయ్యింది. కేశవరెడ్డి తెలు గు సాహితీరంగంలో ప్రముఖ నవలా రచయిగా పేరు పొందారు. ఆయన రచించిన ‘అతడు అడవిని జయిం చాడు’ నవలను నేషనల్ బుక్ ట్రస్ట్ వారు 14 భారతీయ భాషల్లోకి అనువదించారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఆయన రచనలపై ఎంఫిల్, పీహెచ్డీ చేసిన పరిశోధకులు ఉన్నారు. పలు సదస్సులు, వేదికలపై ఆయ న రాసిన రచనలపై సమావేశాలు నిర్వహించారు. ప్రము ఖ రచయితగా, వైద్యునిగా పేరు ప్రఖ్యాతులు గడించారు. మూడు దశాబ్దాలుగా డిచ్పల్లి వద్ద కుష్టు రోగుల ఆస్పత్రిలో స్కిన్ స్పెషలిస్టుగా సేవలందించారు. -
విద్యార్థులకు అస్వస్థత
కట్టంగూర్ : మధ్యాహ్న భోజనం వికటించి 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మండలంలోని అయిటిపాముల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. ఈ విద్యా సంవత్సనం ప్రారంభం నుంచి పాఠశాలలో భోజన ఎజెన్సీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంగా ఇదే పాఠశాలలో జులై 19, 2014న ఫుడ్ పాయిజన్ కావటంతో 42 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. దీంతో మూడు నెలలుగా పాఠశాల ఎస్ఎంసీ కమి టీ ఆధ్వర్యంలో వంట చేసి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. చెర్వుఅన్నారం ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటన ఒక్క రోజైనా పూర్తి కాకముందే అయిటిపాములో రెండోసారి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అధికారుల పర్యవేక్షణ, సంఘాల మధ్య గొడవల కారణంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. వారం రోజు లుగా నూతన సంఘాలైన తిరుపతమ్మ, వరలక్ష్మి, లక్ష్మినర్సింహ్మ సంఘాలు వంట చేస్తున్నారు. శనివారం వంటల సమయం లో పప్పుదోసకాయ కూరలో సాంబారు మసాలకు బదులుగా చికెన్ మసాలా, పొ ట్లాల్లో తెచ్చిన కారాన్ని వేసి కూరను వండి విద్యార్థులకు వడ్డించారు. దోసకాయ ముక్కలు సరిగ్గా ఉడక లేదని విద్యార్థులు తెలిపారు. అన్నం తిన్న విద్యార్థులు తర గతి గదిలోకి వెళ్లి కూర్చున్నారు. సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో 6 నుంచి 9వ తరగతి వరకు 31,10వ తరగతి విద్యార్థి ఒక్క రు చొప్పున విద్యార్థులు కడుపునొప్పి, తల నొప్పితో పాటు వాంతులు చేసుకున్నారు. ఇది గమినించిన పాఠశాల హెచ్ఎం రేణుకాదేవి 108 వాహనంలో32 మంది విద్యార్థులను నకిరేక ల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. ఆసుపత్రిలో 14 మంది బాలికలు, 18 మంది బాలురకు వైద్య సిబ్బంది మెరుగైన చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులంతా క్షేమంగా ఉండటంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. విష యం తెలుసుకున్న డీఈఓ విశ్వనాథరావు, జెడ్పీటీసీ మాద యాదగిరి, ఎంపీపీ కొండ లింగస్వామి, ఎంఈఓ బి.మోహన్‌రెడ్డి, సర్పంచ్ పెద్ది మంగమ్మసుక్కయ్య, ఊ ట్కూరి ఏడుకొండలు, నిమ్మనగోటి సైదులు విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం: డీఈఓ విశ్వనాథరావు విద్యార్థుల పట్ల అలసత్వంగా వ్యహరించిన వారిని కఠినంగా శిక్షిస్తాము. డిప్యూటీ డీఈ ఓతో విచారణ చేయిస్తాం, కలెక్టర్‌కు ఫిర్యా దు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాండా చూస్తాం. -
కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి అస్వస్థత
కొత్తపేట : వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన కొత్తపేట(తూర్పు గోదావరి) ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయన శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ నిర్విరామం గా అనేక అధికారిక, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఓ కార్యకర్తను పరామర్శిం చేందుకు రాత్రి ఆత్రేయపురం వెళుతున్న సమయంలో ఆయన ముక్కుపుటాల నుంచి రక్తం స్రవించింది. దాన్ని తుడుచుకుంటుండగానే స్రావం తీవ్రమై నేప్కిన్తో పాటు షర్టు, ప్యాంటు రక్తంతో తడిసిపోయాయి. ఆయన తో ఉన్న నాయకులు, సన్నిహితులు ఆందోళనకు గురై వెంటనే రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కార్డియాలజిస్టు ఎన్ఎస్ రామరాజు పర్యవేక్షణలో రక్తస్రావాన్ని అరికట్టేందుకు చికిత్స చేశారు. విపరీతమైన అలసట, రక్తపోటు పెరగడం వల్ల రక్తస్రావమైనట్టు నిర్ధారించిన వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచిం చారు. ఈఎన్టీ స్పెషలిస్టు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కూడా జగ్గిరెడ్డికి వివిధ పరీక్షలు జరి పారు. స్వస్థత చేకూరడంతో జగ్గిరెడ్డి ఆది వారం మధ్యాహ్నం గోపాలపురంలోని స్వగృహానికి తిరిగి వచ్చారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఉద యం జగ్గిరెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. ఏ విషయంలోనూ ఒత్తిడికి లోనుకావద్దని సూచించారు. వాకింగ్, యోగా, మెడిటేషన్ వంటివి చేయాలని, హైదరాబాద్ వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు, నాయకుల పరామర్శ అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పరామర్శించారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పినిపే విశ్వరూప్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, పార్టీ నాయకులు కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, వరుపుల సుబ్బారావు తదితరులు ఫోన్లో పరామర్శించారు. జగ్గిరెడ్డిని పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, కొల్లి నిర్మలకుమారి, జక్కంపూడి రాజా, జక్కంపూడి చిన్ని ఉన్నారు. ఇంకా ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, టీడీపీ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, బండారు సత్తిబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ కోరం జయకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు ధర్నాల రామకృష్ణ, ఆలమూరు ఎంపీపీ కొత్తపల్లి వెంకటలక్ష్మి దుర్గారావు తదితరులు ఉన్నారు. -
తూ.గో. జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి అస్వస్థత
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆదివారం తెల్లవారు జామున అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆయన్ను రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రికి తరలించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రి వైద్యులు జగ్గిరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. -
విషాదం
కుమారుడి మరణవార్త విని తండ్రి మృతి ఆదోని అర్బన్: అనారోగ్యంతో కుమారుడు మృతి చెందగా ఆ వార్తను జీర్ణించుకోలేక తండ్రి అస్వస్థతకు గురై మరణించాడు. ఈ ఘటన ఆదోనిలో శనివారం చోటుచేసుకుంది. తండ్రీకొడుకులు 12గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు చిన్నాన్న కొంకా గోవిందప్ప కుమారుడు కొంకా గోపాల్ (58) డయాలసిస్‌తో బాధపడుతూ కర్నూలు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని బంధులు, కుటుంబ సభ్యులు స్వగ్రామమైన ఆదోనికి తీసుకొచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తండ్రి గోవిందప్ప ఒక్కసారిగా సొమ్మసిల్లిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు గోవిందప్పను స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బీపీ పూర్తిగా పడిపోవడంతో వైద్యసేవలందించినా ఫలితం లేకపోవడంతో గోవిందప్ప(90) అర్ధరాత్రి మృతి చెందాడు. 12గంటల వ్యవధిలోనే తండ్రికొడుకులు మృతి చెందడంతో కొంకా కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. -
మనుషులపై ఔషధ ప్రయోగాల కలకలం
‘విమ్టా ల్యాబ్స్’పై ఆరోపణలు ‘స్టడీ’ కోసం వచ్చిన యువకుడికి అస్వస్థత.. బయటపడ్డ పరిశోధన విషయం ల్యాబ్‌ను పరిశీలించిన పోలీసులు ఉప్పల్: చర్లపల్లి పారిశ్రామికవాడలోని ‘విమ్టా ల్యాబ్స్’లో జరుగుతున్న పరిశోధనలపై మరోసారి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ సంస్థలో వివిధ మందులపై పరిశోధనలు చేస్తుంటారు. అయితే, ఈ పరిశోధనలను మనుషులపై గోప్యంగా నిర్వహిస్తున్నారు. 18-40 ఏళ్ల లోపు వారిపై ‘స్టడీ’ పేరిట ప్రయోగాలు చేస్తున్నారు. డబ్బులకు ఆశపడి నల్గొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల అత్యధికులు ఈ పరిశోధనలకు సహకరించేందుకు అంగీకరిస్తున్నారు. వీరిలో నిరుద్యోగులు, ఆర్థికంగా చితికిన వారు ఎక్కువ మంది ఉంటున్నారు. అంతా గోప్యమే.. పరిశోధనల వేళలకు సంబంధించిన వివరాలతో పాటు ఇతర సమస్యలకు దారి తీసే పరిస్థితులపై అవగాహన కల్పించరని కొత్తగూడెంకు చెందిన శ్రీహరి అనే యువకుడు తెలిపాడు. ‘స్టడీ’ కోసం విమ్టా ల్యాబ్స్‌లో శుక్రవారం చేరిన ఈయనకు వాంతులు వచ్చినా సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో అతడు మీడియాను ఆశ్రయించాడు. శనివారం సాయంత్రం సంస్థ ఆవరణలో తనపై పరిశోధనలు జరిగిన విషయాన్ని, తాను ఎదుర్కొన్న సమస్యలను ఆదివారం ఇక్కడ బయట పెట్టాడు. నిబంధనలకు విరుద్ధంగా మనుషులపై ప్రయోగాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సంస్థను పరిశీలించిన పోలీసులు విమ్టా ల్యాబ్స్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏసీపీ జి.ప్రకాశరావు, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ వెంకట రమణ ల్యాబ్స్‌ను పరిశీలించారు. ఇందులో శ్రీహరి అనే యువకుడు సంతకం చేసిన పత్రాలను సిబ్బంది వారికి చూపించారు. సంస్థకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నట్లు సిబ్బంది పోలీసులకు వివరించారు. తమ సంస్థలో నిబంధనల మేరకే ప్రయోగాలు జరుగుతాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ లెనిన్‌బాబు స్పష్టం చేశారు. -
ఆరోగ్యశాఖ గణాంకాధికారి ఆస్పత్రిపాలు
అనంతపురం మెడికల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ గణాంక అధికారి ఉమామహేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు గురై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం బీపీ లెవల్స్ పూర్తిగా పడిపోవడంతో అత్యవసర చికిత్స కోసం ఆయనను ఐసీయూలో చేర్చారు. డీఎంహెచ్ఓ దూషించినందువల్లే ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఆస్పత్రి పాలైనట్లు తెలిసింది. కొంతమేరకు కోలుకున్న ఆయన విలేకరులకు తెలిపిన వివరాలు ఆయన మాటాల్లో.. ‘ ఈ నెల 25న డీఎంహెచ్ఓ రామసుబ్బారావు నన్ను పిలిపించారు. గ్రామాల్లో ఇళ్లలో అవుతున్న ప్రసవాల జాబితా అడిగారు. ఏడెనిమిది క్లస్టర్ల నుంచి అందిన సమచారాన్ని ఆయనకు ఇచ్చాను. మిగిలినవి రాలేదని తెలిపాను. పూర్తి సమాచారం ఎందుకు తెప్పించుకోలేదని ఆయన నాపై ఆగ్రహించారు. అందరికీ ఫోన్లు చేశాను, సమాచారం అందగానే తెలియచేస్తానని సమాధానమిచ్చా. దీంతో ఆయన నన్ను దూషిస్తూ మాట్లాడారు. మర్యాదగా మాట్లడమని కోరాను.. దీనిపై ఆయన రెచ్చిపోయి గెట్అవుట్ అంటూ తిట్టారు. మరుసటి రోజు(26న) ఉదయం కార్యాలయానికి వచ్చాను. క్యాంప్‌నకు వెళ్లాలని డీఎంహెచ్ఓ ఉద్దేశపూర్వకంగా ఆదేశించారు. కార్యాలయంలో మీటింగ్ జరుగుతోందని చెప్పినా ఆయన వినిపించుకోలేదు. బీపీ, షుగర్‌తో బాధపడుతున్న నేను అప్పటికే మానసిక వత్తిడికి గురయ్యాను. క్యాంపునకు వెళ్లి రాత్రి వచ్చే సరికి నీరసించి అస్వస్థతకు గురయ్యాను. శనివారం ఉదయం లేవలేకపోవడంతో మా క్వార్టర్స్‌లో ఉన్న డాక్టర్ నా పరిస్థితి గమనించి ఆస్పత్రికి తీసుకొచ్చారు.’ డీఎంహెచ్ఓ వేధింపులవల్ల తాను అస్వస్థతకు గురయ్యానని ఎస్ఓ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకుల పరామర్శ: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఓ ఉమామహేశ్వరరావును ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ చైర్మన్ బీసీఆర్ దాస్, నాయకులు పెద్ద ఓబుళేసు, ఎన్ఎన్కుంట సూరి, దొడ్డప్ప, తదితరులు పరామర్శించారు. బీసీఆర్ దాస్ మాట్లాడుతూ డీఎంహెచ్ఓ ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడుతున్నారని బాధితులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. డీఎంహెచ్‌ఓపై చర్యల తీసుకోవాలని ఆందోళనలు చేయడంతోపాటు, మంత్రులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. వెంటనే డీఎంహెచ్‌ఓపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం
మెదక్ రూరల్: పురుగు మందులను కొట్టే సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అస్వస్థతకు గురయ్యే అవకాశంతో పాటు ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్ (8886612480) తెలిపారు. ప్రస్తుతం రైతులు సాగు పత్తి పం టలకు మందు స్ప్రే చేసే సమయం కావున రైతులు ఈ సలహాలను పాటించాలని సూచించారు. తీసుకోవల్సిన జాగ్రత్తలు... పురుగు మందు డబ్బాను నోటితో తీయవద్దు, మందును చేతితో కలపొద్దు. పవర్ స్ప్రేయర్ నాజిల్‌ను పెద్దగా చేయరాదు. మందు సన ్నగా తుంపరగా పడేలా చూడాలి. ఒకేసారి రెండు, మూడు మందులను కలిపి పిచికారీ చేయొద్దు. నిండుగా దుస్తులు, చేతులకు గ్లౌజులు, కళ్లజోడు, ముఖానికి మాస్క్, తలకు టోపీ లేదా రుమాలు ధరించాలి. ఉదయం, సాయంత్రం వేళలో మాత్రమే మందు స్ప్రే చేయాలి. గాలికి ఎదురుగా పిచికారీ చేయొద్దు. స్ప్రే చేయడం పూర్తయ్యే వరకూ భోజనం చేయడం, పొగతాగడం చేయకూడదు. గాయాలు, పుండ్లు ఉన్న వ్యక్తులు పురుగు మందులు పిచికారీ చేయొద్దు. మందు ప్రభావానికి గురైతే పురుగు మందు ప్రభావానికి గురైన వ్యక్తి నోట్లో వేలు పెట్టి వాంతి చేయించాలి. మూర్చపోయిన సందర్భంలో నాలుక కరుచు కోకుండా రెండు దవడల మధ్య గుడ్డ పెట్టాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు తడిబట్టతో తుడవాలి. ఉష్ణోగ్రత తగ్గితే దుప్పటి కప్పి వెచ్చగా ఉంచాలి. వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించాలి. -
అన్నం కాదది.. విషం
నరసాపురం (రాయపేట)/నరసాపురం రూరల్ : నరసాపురం మండలం చిట్టవరం జెడ్పీ హైస్కూల్లో బుధవారం విద్యార్థులకు వడ్డించిన మధ్యాహ్న భోజనం వారి పాలిట విషమైంది. 40 మంది చిన్నారులను ఆస్పత్రి పాల్జేసింది. రెండు ముద్దలు నోట్లో పెట్టుకోగానే వాంతులు చేసుకుని, కళ్లు తిరిగి పడిపోయిన విద్యార్థుల్ని ఉపాధ్యాయులు, గ్రామస్తులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పిం ది. ఈ ఘటనతో చిట్టవరం గ్రామం ఉలిక్కిపడింది. చిన్నారుల తల్లిదండ్రుల రోదనలతో మిన్నంటింది. భోజనం విషతుల్యం కావడానికి కారణమేంటనేది ఇంకా వెల్లడి కాలేదు. తుప్పు కంపుకొడుతున్న బియ్యూన్ని వండటం వల్ల ఆహా రం కలుషితమైందా.. పప్పు, తోటకూర కూర కలుషితమైం దా.. వంట చేయడానికి ఉపయోగించిన నీళ్లవల్ల ఇలా జరి గిందా అనేది తేలాల్సి ఉంది. ఇదే అన్నం తిన్న పాఠశాల ప్రధానోపాధ్యారుుని సైతం అస్వస్థతకు గురయ్యూరు. వి ద్యార్థులు, ప్రధానోపాధ్యాయిని నరసాపురంలోని ప్రైవే టు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఎవరికీ ప్రమాదం లేదని, అంతా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. తుప్పు బియ్యం.. చేదెక్కిన అన్నం అన్నం ముద్దను నోట్లో పెట్టుకోగానే కొంతమంది విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయూరు. మరికొందరు వాంతులు చేసుకున్నారు. పాఠశాలలో మొత్తం 184 మంది విద్యార్థులు ఉండగా, 140 మంది తరగతులకు హాజరయ్యూరు. వీరిలో 110మంది పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన పాఠశాలకు చేరుకుని ఆటోలు, 108 వాహనంలో నరసాపురంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. పాఠశాలలో వడ్డిస్తున్న అన్నం నాలుగు రోజులుగా తుప్పు వాసన వస్తోందని, నోట్లో పెట్టుకుంటే చేదుగా ఉంటోందని అస్వస్థతకు గురైన విద్యార్థులు చెప్పారు. దీంతో తినకుండా పారబోస్తున్నామన్నారు. ఆకలిని తట్టుకోలేక బుధవారం అన్నం తిన్నామన్నారు. అన్నం బాగుండటం లేదని వంట చేస్తున్న వారికి చెబుతుంటే తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుప్పు పట్టిన బియ్యం వల్ల అన్నం ఇలా ఉంటోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అప్రమత్తమైన అధికారులు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన నరసాపురం చేరుకున్నారు. ఆస్పత్రులకు వెళ్లి విద్యార్థుల పరిస్థితిని తెలుసుకుని తక్షణ వైద్యసేవలందించేందుకు కృషి చేశారు. జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి, డీఎంహెచ్‌వో ఆర్.శంకరరావు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో జె.ఉదయ భాస్కరరావు, తహసిల్దార్ శ్రీపాద హరినాథ్, ఎంపీడీవో శివప్రసాద్‌యాదవ్, ఎంఈవో ప్రసాద్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రైవేటు వైద్యులు ఇలపకుర్తి ప్రకాష్, ఎం.కోటేశ్వరరావు, కేకే జాన్ తదితరులు చిన్నారులకు వైద్య సేవలందించారు. పలువురు ఆర్ఎంపీలు సైతం వైద్య సేవల్లో పాలు పంచుకున్నారు. వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, మునిసిపల్ చైర్పర్సన్ పసుపులేటి రత్నమాల, వైస్‌చైర్మన్ పొన్నాల నాగబాబు, టీడీపీ నాయకులు బండారు ప్రతాప్‌నాయుడు, డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి, డాక్టర్ రమేష్, చిట్టవరం సర్పంచ్ పోలిశెట్టి సత్తిబాబు తదితరులు విద్యార్థులను పరామర్శించి, వారి తల్లిదండ్రులను ఓదార్చారు. విచారణకు ఆదేశం విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై డీఈవో ఆర్.నరసింహరావు విచారణకు ఆదేశించారు. విద్యార్థుల పరిస్థితిని పరిశీలించిన ఆయన ప్రధానోపాధ్యాయిని ఆర్.కుమారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్నం చేదుగా ఉందని విద్యార్థులు చెప్పడంతో తాను రుచి చూశానని, ఆ వెంటనే అస్వస్థతకు గురయ్యూనని ప్రధానోపాధ్యాయిని చెప్పారు. తక్షణమే విచారణ నిర్వహించి 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఎంఈవోను డీఈవో ఆదేశించారు. ఇదే అంశంపై మరో మండలస్థాయి అధికారి కూడా విచారణ నిర్వహిస్తారని డీఈవో చెప్పారు. డీఎంహెచ్‌వో ఆర్.శంకరరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఐసీయూలో 18మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ఎవరికీ ప్రాణాపాయం లేదన్నారు. ఇప్పటికే చాలామందిని డిశ్చార్జి చేశారని, మిగిలిన వారిని గురువారం డిశ్చార్జి చేస్తారని తెలిపారు. పప్పు వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని భావిస్తున్నామన్నారు. సాల్మనెల్లా అనే బాక్టీరియా వల్ల ఇటువంటి పరిస్థితి వస్తుందన్నారు. ఆహారాన్ని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపిస్తున్నట్టు చెప్పారు. ప్రైవేటు వైద్యులు సత్వర సేవలందించడం వల్లే విద్యార్థులు కోలుకున్నారని ఆయన పేర్కొన్నారు. -
మంత్రి నారాయణకు అస్వస్థత
-
మంత్రి నారాయణకు అస్వస్థత
చిత్తూరు: ఏపి పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అస్వస్థతకు లోనయ్యారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయన అస్వస్థులయ్యారు. విఐపి లాంజ్‌లో ఆయనకు వైద్యసేవలు చేస్తున్నారు. ఆయనకు గుండెనొప్పి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఉదయం నుంచి నారాయణ పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి ఆయన ఒక యాగం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ రేణిగుంట నుంచి విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యలో నారాయణ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విమానాన్ని వెనుకకు తీసుకువచ్చారు. రేణిగుంటలో విమానాశ్రయంలో మంత్రిని దించారు. అక్కడ వైద్యపరీక్షలు చేసి చికిత్స చేశారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. విమానాశ్రయంలో కొలుకున్న తరువాత నాయయణ తన వాహనంలో చెన్నై బయలుదేరి వెళ్లారు. -
తీర్థయాత్రలో విషాహారం..
-
వికటించిన ఐరన్ మాత్రలు
ధర్పల్లి : ఐరన్ మాత్రలు వికటించి 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో గురువారం విద్యార్థినులకు ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు. ఏఎన్ఎంలు సుశీల, నాగమణి సూచించినట్లుగానే భోజనం చేసిన తర్వాతే విద్యార్థినులు మాత్రలు వేసుకున్నారు. రాత్రి 7 గంటల సమయంలో కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలు ప్రారంభమయ్యాయి. 22 మంది అస్వస్థతకు గురి కావడంతో వెంటనే 108 అంబులెన్స్‌లో ధర్పల్లి క్లస్టర్ ఆస్పత్రికి తరలించారు. స్టాఫ్ నర్సులు ఉమ, హప్రీన్లు చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి, సేవలందించారు. హెచ్ఈఓ కిషన్‌రావు, ఏఎన్ఎంలు గంగామణి, నాగమణితో పాటు ఎంఎల్ఓ లింగమయ్య విద్యార్థులను పరామర్శించారు. డాక్టర్లే లేరు ధర్పల్లి ప్రభుత్వ క్లస్టర్ ఆస్పత్రిలో రాత్రి వేళల్లో డ్యూటీ డాక్టర్ ఉండాలి. అయితే ఐరన్ మాత్రలతో అస్వస్థతకు గురి అయిన వారిని ఆస్పత్రికి తరలించినప్పుడు డాక్టర్ ఒక్కరు కూడా లేక పోవటంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఆస్పత్రికి చెందిన ఉద్యోగులు వెంటనే మెడికల్ ఆఫీసర్ స్వాతికి సమాచారం అందించారు. ఆమె జిల్లా కేంద్రం నుంచి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. మాత్రల్లో లోపం లేదని, భోజనం చేయకుండా మాత్రలు వేసుకున్నందునే అస్వస్థతకు గురై ఉంటారని వైద్యురాలు తెలిపారు. ఎలాంటి ప్రమాదమూ ఉండదని పేర్కొన్నారు. -
ఎల్కల్‌లో అతిసార 50 మందికి అస్వస్థత
దౌల్తాబాద్, న్యూస్‌లైన్: అతిసార ప్రబలడంతో 50 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన దౌల్తాబాద్ మండలం ఎల్కల్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఎల్కల్‌లో తాగునీరు కలుషితం కావడంతో పాటు పారిశుద్ధ్యం లోపించడంతో మూడు రోజులుగా ప్రజలు వాంతులు, విరేచనాలతో గ్రామస్తులు బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం పరిస్థితి తీవ్రం కావడంతో 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్పందించిన గ్రామస్తులు అస్వస్థతకు గురైన వారిని వెంటనే గజ్వేల్, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు కొంతమందికి స్థానిక పంచాయతీ కార్యాలయంలోనే ఏఎన్ఎంలు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గజ్వేల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సునీల్‌రాజా గ్రామాన్ని సందర్శించారు. అంతకు ముందు తొగుట సీఐ వెంకటేశ్వర్లు కూడా ఎల్కల్ వెళ్లి వివరాలు సేకరించారు. అవసరమైన సాయం అందించాలని బేగంపేట పోలీసులను ఆదేశించారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారిని డాక్టర్ పద్మను ‘న్యూస్‌లైన్’ ఫోన్లో సంప్రదించగా తనకు ఎల్కల్‌లో అతిసార ప్రబలిన సంగతే తెలియదని చెప్పారు. అయినా వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తానన్నారు. -
86 మంది విద్యార్థులకు అస్వస్థత
విస్సన్నపేట, కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో 86 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఈ పాఠశాలలో సుమారు 500 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. శనివారం రాత్రి విద్యుత్తు లేకపోవటంతో వీరు చీకటిలోనే భోజనం చేశారు, కొద్దిసేపటికే ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకుంటూ కడుపునొప్పితో బాధపడ్డారు. ఆదివారం ఉదయానికి ఏకంగా 78 మంది కడుపు నొప్పితో బాధపడుతున్నా నిర్వాహకులు పట్టించుకోలేదు. ఆదివారం విద్యార్థులను కలుసుకునేందుకు తల్లిదండ్రులు రావడంతో విషయం బయటపడింది. తల్లిదండ్రులు ఆందోళనతో నిర్వాహకులు 108 వాహనాలకు సమాచారం అందించి విద్యార్థులను మెరుగైన వైద్యంకోసం నూజివీడు తరలించారు. వంటగదిలో, భోజనం హాలులో కరెంటు పోతే చీకట్లో భోజనం పెట్టడం ఏంటని తల్లిదండ్రులు నిర్వాహకులను నిలదీశారు. -
విషపుకాయలు తిని నలుగురు చిన్నారులకు అస్వస్థత
మదనపల్లె క్రైం, న్యూస్‌లైన్: పెళ్లింట విషాదం అలముకుంది. అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారులు విషపూరితమైన కాయలుతిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గురువారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. చిన్నారుల తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలు... గౌనిగారిపల్లెలో గురువారం ఓ ఇంట్లో వివాహం జరుగుతోంది. అదే సమయంలో ఇరుగుపొరుగుకు చెందిన వెంకటేష్ కుమారుడు బ్రహ్మ(5), ఆనంద్ కుమారుడు మధు(7), నాగరాజు కుమారుడు వినయ్‌కుమార్(5), రెడ్డినారాయణ కుమారుడు భాస్కర్‌బాబు(5) పెళ్లింట ఆడుకుంటున్నారు. ఆ ఇంటివద్ద ఉన్న యర్రాముదం(జెట్రోఫా) చెట్టు కింద కాయలు పడి ఉన్నాయి. ఆ కాయలు నిమ్మకాయల సైజులో ఉండడంతో తినే కాయలని భావించి నలుగురు చిన్నారులు తిన్నారు. కొద్దిసేపటికే ఆ నలుగురు తీవ్ర వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పెళ్లిభోజనం ఏమైనా విషాహారంగా మారిందేమోనని కంగారు పడ్డారు. చిన్నారులను అడగడంతో తాము పెళ్లి భోజనం ఇంకా తినలేదని, ఆ కాయలను తిన్నామని చూపించారు. దీంతో వెంటనే చిన్నారులను 108లో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పిల్లలను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కంగారు పడాల్సిన పనిలేదని, త్వరగానే పిల్లలు కోలుకుంటారని చిన్నపిల్లల డాక్టర్ మధుసూదనాచారి తెలిపారు.