ముంబై: మహారాష్ట్రను అనుమానిత వ్యాధి వణికిస్తోంది. గుల్లెయిన్-బారే సిండ్రోమ్(జీబీఎస్)గా భావిస్తున్న ఈ వ్యాధి కారణంగా షోలాపూర్‌లో చార్టర్డ్ అకౌంటెంట్ ఒకరు మృతిచెందారు. కొత్తగా ఈ వ్యాధి మరో 28 మందికి సోకిందని, దీంతో బాధితుల సంఖ్య 101కి చేరిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఈ వ్యాధితో బాధపడుతున్న 16 మంది బాధితులు ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు కలిగిన వారిలో 19 మంది తొమ్మిదేళ్ల కంటే తక్కువ వయస్సు గలవారని, ఇప్పటివరకు 50 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో 23 కేసులు నమోదయ్యాయని వైద్య అధికారులు తెలిపారు.
జనవరి 9న పూణేలోని ఒక ఆస్పత్రిలో చేరిన రోగి మొదటి జీబీఎస్ కేసుగా ఆరోగ్య శాఖ అనుమానిస్తోంది.
బాధితుల నుండి తీసుకున్న నమూనాలలో క్యాంపిలో బాక్టర్ జెజుని బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. పూణేకు ప్రధాన నీటి వనరు అయిన ఖడక్వాస్లా ఆనకట్ట సమీపంలోని బావిలో ఈ. కోలి అనే బాక్టీరియా అధిక స్థాయిలో ఉందని అధికారుల పరీక్షల్లో తేలింది. దీంతో ఈ నీటిని వినియోగించేవారు ముందుగా మరిగించి, వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆదివారం నాటి వరకు 25,578 ఇళ్లను సర్వే చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బాధితులను కనుగొనేందుకే ఈ సర్వే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జీబీఎస్ చికిత్స చాలా ఖరీదైనదని, ఒక్కో ఇంజెక్షన్ ధర రూ.20 వరకూ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. జీబీఎస్ అనేది శరీర రోగనిరోధక వ్యవస్థను అమితంగా ప్రభావితం చేస్తుంది. మెదడుకు సంకేతాలను తీసుకెళ్లే నరాలపై దాడి చేస్తుంది. అయితే ఈ వ్యాధి బారినపడిన 80 శాతం మంది రోగులు సరైన చికిత్స తీసుకుంటే ఆరు నెలల్లోనే కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి..
Comments
Please login to add a commentAdd a comment