మెదక్ రూరల్: పురుగు మందులను కొట్టే సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అస్వస్థతకు గురయ్యే అవకాశంతో పాటు ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్ (8886612480) తెలిపారు. ప్రస్తుతం రైతులు సాగు పత్తి పం టలకు మందు స్ప్రే చేసే సమయం కావున రైతులు ఈ సలహాలను పాటించాలని సూచించారు.
తీసుకోవల్సిన జాగ్రత్తలు...
పురుగు మందు డబ్బాను నోటితో తీయవద్దు, మందును చేతితో కలపొద్దు.
పవర్ స్ప్రేయర్ నాజిల్‌ను పెద్దగా చేయరాదు. మందు సన ్నగా తుంపరగా పడేలా చూడాలి.
ఒకేసారి రెండు, మూడు మందులను కలిపి పిచికారీ చేయొద్దు.
నిండుగా దుస్తులు, చేతులకు గ్లౌజులు, కళ్లజోడు, ముఖానికి మాస్క్, తలకు టోపీ లేదా రుమాలు ధరించాలి.
ఉదయం, సాయంత్రం వేళలో మాత్రమే మందు స్ప్రే చేయాలి.
గాలికి ఎదురుగా పిచికారీ చేయొద్దు.
స్ప్రే చేయడం పూర్తయ్యే వరకూ భోజనం చేయడం, పొగతాగడం చేయకూడదు.
గాయాలు, పుండ్లు ఉన్న వ్యక్తులు పురుగు మందులు పిచికారీ చేయొద్దు.
మందు ప్రభావానికి గురైతే
పురుగు మందు ప్రభావానికి గురైన వ్యక్తి నోట్లో వేలు పెట్టి వాంతి చేయించాలి.
మూర్చపోయిన సందర్భంలో నాలుక కరుచు
కోకుండా రెండు దవడల మధ్య గుడ్డ పెట్టాలి.
శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు తడిబట్టతో తుడవాలి.
ఉష్ణోగ్రత తగ్గితే దుప్పటి కప్పి వెచ్చగా ఉంచాలి.
వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించాలి.
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం
Published Fri, Sep 12 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM
Advertisement