neglected
-
మరణించిన మెగా అభిమానులను పట్టించుకోని డిప్యూటీ సీఎం పవన్
-
కార్చిచ్చు కనిపించని ఉచ్చు..!
కార్చిచ్చులు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. ఏడాదికేడాది కార్చిచ్చులు పెరిగిపోతున్నాయి. అడవుల్లో మంటలు చెలరేగిన క్షణాల్లోనే సమీపంలో నగరాలకు విస్తరించి దగ్ధం చేస్తున్నాయి. అమెరికాలోని హవాయి దీవుల్లో రేగిన కార్చిచ్చుతో లహైనా రిసార్ట్ నగరం ఒక బూడిద కుప్పగా మిగిలింది. అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న అతి పెద్ద విపత్తుల్లో ఒకటిగా మిగిలిపోయిన ఈ కార్చిచ్చు బీభత్సంలో 80 మందికి పైగా మరణించారు. మౌయి దీవిలో లహైనా పట్టణంలో మంగళవారం రాత్రి మొదలైన కార్చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉంది. వాతావరణం పొడిగా ఉండడంతో పాటు హరికేన్ ఏర్పడడంతో ద్వీపంలో బలమైన గాలులు వీచాయి. దీంతో శరవేగంతో మంటలు వ్యాపించి అందాల నగరాన్ని దగ్ధం చేశాయి. మొదలైతే.. అంతే ► పశ్చిమ అమెరికా, దక్షిణ ఆ్రస్టేలియాలో తరచూ కార్చిచ్చులు సంభవిస్తూ ఉంటాయి. చరిత్రలో అతి పెద్ద కార్చిచ్చులన్నీ అక్కడే వ్యాపించాయి. గత కొన్నేళ్లుగా బ్రిటన్ అత్యధికంగా కార్చిచ్చుల బారినపడుతోంది. 2019లో బ్రిటన్‌లో 135 కార్చిచ్చులు వ్యాపించి 113 చదరపు మైళ్ల అడవిని దగ్ధం చేశాయి. రష్యా, కెనడా, బ్రెజిల్ దేశాలకు కూడా కార్చిచ్చు ముప్పు అధికంగా ఉంది. ► బ్రిటన్‌లో మాంచెస్టర్‌లో 2019లో సంభవించిన కార్చిచ్చు ఏకంగా మూడు వారాల పాటు కొనసాగింది. 50 లక్షల మంది వాయు కాలు ష్యంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో వ్యాపించిన కార్చిచ్చు వేలాది ఇళ్లను దగ్ధం చేసింది. 300 కోట్ల జంతువులు మరణించడమో లేదంటే పారిపోవడం జరిగింది. ► అమెరికాలో కాలిఫోరి్నయాలో ఎక్కువగా కార్చిచ్చులు వ్యాపిస్తూ ఉంటాయి. 2020లో కార్చిచ్చు 4 లక్షల హెక్టార్ల అడవుల్ని మింగేసింది. 1200 భవనాలు దగ్ధమయ్యాయి. ► 2021లో ప్రపంచ దేశాల్లో కార్చిచ్చుల వల్ల 176 వందల కోట్ల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ గాల్లో కలిసింది కార్చిచ్చులతో ఏర్పడిన కాలుష్యానికి ప్రపంచంలో ఏడాదికి దాదాపుగా 34 వేల మందికి ఆయుష్షు తగ్గి ముందుగానే మరణిస్తున్నారు. ► 1918లో అమెరికాలో మిన్నెసోటాలో ఏర్పడిన కార్చిచ్చు చరిత్రలో అతి పెద్దది. ఈ కార్చిచ్చు వెయ్యి మంది ప్రాణాలను బలి తీసుకుంది. ► యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంచనాల ప్రకారం ప్రపంచంలో ఏడాదికి 40 లక్షల చదరపు కిలోమీటర్ల అడవుల్ని కోల్పోతున్నాం. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2030 నాటికి పెరిగిపోనున్న కార్చిచ్చులు 14% 2050 నాటికి30%, ఈ శతాబ్దం అంతానికి 50%కార్చిచ్చులు పెరుగుతాయని యూఎన్ హెచ్చరించింది. ఎందుకీ మంటలు ? ► కార్చిచ్చులు ప్రకృతి విపత్తే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న కార్చిచ్చుల్లో 10 నుంచి 15% మాత్రమే సహజంగా ఏర్పడుతున్నాయి. వాతావరణం పొడిగా ఉండి, కరువు పరిస్థితులు ఏర్పడి, చెట్లు ఎక్కువగా ఎండిపోయి ఉన్నప్పుడు మండే ఎండలతో పాటు ఒక మెరుపు మెరిసినా కార్చిచ్చులు ఏర్పడతాయి. బలమైన గాలులు వీస్తే అవి మరింత విస్తరిస్తాయి. ► మానవ తప్పిదాల కారణంగా 85 నుంచి 90% కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. అడవుల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్లి క్యాంప్‌ఫైర్ వేసుకొని దానిని ఆర్పేయకుండా వదిలేయడం, సిగరెట్లు పారేయడం, విద్యుత్ స్తంభాలు వంటివి కూడా కార్చిచ్చుకి కారణమవుతున్నాయి. ► ఇందనం లేదంటే మరే మండే గుణం ఉన్న పదార్థాలు చెట్లు, పొదలు, గడ్డి దుబ్బులు ఉన్న అటవీ ప్రాంత సమీపాల్లో ఉంటే కార్చిచ్చులు ఏర్పడతాయి. 2021లో కాలిఫోరి్నయాలో చమురు కారణంగా 7,396 కార్చిచ్చులు ఏర్పడి 26 లక్షల ఎకరాల అటవీ భూమి దగ్ధమైంది. ► ప్రస్తుతం అమెరికా హవాయి ద్వీపంలో కార్చిచ్చు మెరుపు వేగంతో వ్యాపించడానికి డొరైన్ టోర్నడో వల్ల ఏర్పడిన బలమైన గాలులే కారణం. కాలిఫోర్నియాలో ఎక్కువగా కార్చిచ్చులు వ్యాపించడానికి గాలులే ప్రధా న పాత్ర పోషించాయి. అగ్గి మరింత రాజేస్తున్న వాతావరణ మార్పులు సహజసిద్ధంగా ఏర్పడే కార్చిచ్చుల వల్ల అడవుల్లో ఎండిపోయిన వృక్ష సంపద దగ్ధమై భూమి తిరిగి పోషకాలతో నిండుతుంది. మానవ నిర్లక్ష్యంతో ఏర్పడే కార్చిచ్చులు ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇవాళ రేపు వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కార్చిచ్చులు ఎక్కువైపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులతో వాతావరణం పొడిగా ఉండడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, కర్బన ఉద్గారాల విడుదల ఎక్కువైపోవడం వంటి వాటితో దావానలాలు పెరిగిపోతున్నాయి. 1760లో పారిశ్రామిక విప్లవం వచి్చన తర్వాత భూ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ పెరిగిపోయాయి. దీని ప్రభావం ప్రకృతిపై తీవ్రంగా పడింది. అటవీ ప్రాంతాల్లో తేమ తగ్గిపోవడం వల్ల కార్చిచ్చులు మరింత ఎక్కువ కాలం పాటు సంభవిస్తున్నాయి. జనాభా పెరిగిపోవడం వల్ల అటవీ ప్రాంతాలకు దగ్గరగా నివాసం ఏర్పరచుకోవడంతో కార్చిచ్చులు జనావాసాలకు పాకి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా అమెరికాలోని కాలిఫోరి్నయాలో అత్యధికంగా కార్చిచ్చులు సంభవిస్తున్నాయి. భవిష్యత్‌లో వీటి తీవ్రత మరింత పెరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. మొత్తానికి ఏ సమస్య అయినా భూమి గుండ్రంగా ఉంది అన్నట్టుగా గ్లోబల్ వారి్మంగ్ దగ్గరకే వచ్చి ఆగుతోంది. భూతాపాన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాలు చిత్తశుద్ధితో పని చేస్తే కార్చిచ్చులతో పాటు ఇతర సమస్యల్ని కూడా అధిగమించవచ్చు. చరిత్రలో భారీ కార్చిచ్చులు దేశం ఏడాది దగ్ధమైన అటవీ రష్యా 2003 2.2 కోట్ల హెక్టార్లు ఆ్రస్టేలియా 2020 1.7 కోట్ల హెక్టార్లు కెనడా 2014 45 లక్షల హెక్టార్లు అమెరికా 2004 26 లక్షల హెక్టార్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒమిక్రాన్ తరుముతున్నా తీవ్ర నిర్లక్ష్యం.. మాస్కు మరిచి ఎన్ని కథలో..
ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విజయవాడలోని పటమట రైతుబజార్ కిటకిటలాడుతోంది. 20 దుకాణాలను పరిశీలించగా కేవలం 5 దుకాణాల యజమానులు మాత్రమే మాస్క్ ధరించారు. అలాగే.. ఓ దుకాణానికి 10 మంది వినియోగదారులు వచ్చారు. వీరిలో నలుగురు మాస్క్ ధరించలేదు. ఇద్దరు మాస్క్‌ను గడ్డం కిందకు పెట్టుకున్నారు. కేవలం నలుగురే ముక్కు, నోరు కవర్ అయ్యేలా మాస్క్ పెట్టుకున్నారు. ఇక ఈ పది మందిలో ఒక్కరే చేతులు శానిటైజ్ చేసుకున్నారు. సాక్షి, అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ తరుణంలో వైరస్ వ్యాప్తిపట్ల రాష్ట్రంలో ప్రజలు ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నారు? నిబంధనలు ఎంతవరకు పాటిస్తున్నారు? అని ‘సాక్షి’ వివిధ ప్రాంతాల్లో ఆదివారం పరిశీలిస్తే అక్కడ పరిస్థితులు ఇలా కనిపించాయి.. ►విజయవాడలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్లో గంట వ్యవధిలో 67 మంది ప్రవేశించారు. వీరిలో 15 మంది ప్రవేశద్వారం దగ్గరకు రాక ముందు నుంచి మాస్క్‌తో ఉన్నారు. 31 మంది అక్కడకు వచ్చాక జేబులోని మాస్క్ తీసి ధరించారు. లోపలికి వెళ్లాక వీరు మాస్క్‌ను తిరిగి జేబుల్లో పెట్టుకోగా, మరికొందరు గడ్డం కిందకు లాగేసుకున్నారు. ఇక మాస్క్ లేకుండా లోనికి ప్రవేశించడానికి వీల్లేదని 21మందిని సెక్యూరిటీ సిబ్బంది వారించారు. దీంతో ఐదుగురు అమ్మాయిలు చున్నీని, 11 మంది అబ్బాయిలు రుమాలును ముఖానికి కట్టుకుని లోపలికి వెళ్లారు. ఐదుగురు అప్పటికప్పుడు మాస్క్‌లు కొని వెళ్లారు. ►విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, అనంతపురం, విజయవాడ సహా పలు నగరాల్లో విద్యావంతులు మాస్క్ లేనిదే బయటికి రావడంలేదు. ►పోలీసుల తనిఖీల్లో మాస్క్‌లు ధరించకుంటే రుసుములు విధిస్తున్నారని.. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలోకి అనుమతించరనే కారణంతో కొందరు ఆ కాసేపటికి మాత్రమే మాస్క్‌లు ధరిస్తున్నారు. ►పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాస్క్ వాడకాన్ని మెజారిటీ శాతం తగ్గించేశారు. చాలామంది ఆటోల్లో, ట్రాక్టర్లలో ప్రయాణిస్తున్నప్పుడు మాస్క్‌లు ధరించడమే మానేశారు. ►గతంలో గుంటూరు జిల్లా నరసరావుపేట, తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ, అమలాపురం, చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైనప్పటికీ ఇప్పుడు అక్కడి ప్రజలు సైతం కరోనా నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. మాస్క్ పెట్టుకోని వారు ఇలా అంటున్నారు.. ►రాష్ట్రంలో పాజిటివ్ కేసుల నమోదు చాలావరకు తగ్గింది. దీంతో వైరస్ ప్రభావం పెద్దగాలేదు కదా.. ►రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నాంగా.. ►మాస్క్‌తో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. సమూహానికి దూరంగా ఉన్నప్పుడు మాస్క్ ఎందుకింక.. మాస్క్‌ల వాడకం 80–90 శాతం తగ్గింది లాక్డౌన్ రోజులతో పోలిస్తే విద్యా, వ్యాపార, వాణిజ్య ఇతర కార్యకలాపాలు బాగా పెరిగాయి. ప్రజల దృష్టి కరోనా నుంచి పూర్తిగా తొలగిపోయింది. ఈ నేపథ్యంలో మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటించడం బాగా తగ్గించారు. నగరాల్లో ప్రతి 10 మందిలో 5–6 మంది.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 2–3 మంది మాత్రమే మాస్క్‌ను వినియోగిస్తున్నారు. ఈ లెక్కన జూలై నెలతో పోలిస్తే మాస్కుల వినియోగం 80–90 శాతం తగ్గిందని అంచనా. మాస్క్ ధరించే విధానం చాలా ముఖ్యం వైరస్ వ్యాప్తిని మాస్క్ ద్వారా అడ్డుకోవచ్చు. మాస్క్ పెట్టుకున్న వ్యక్తుల్లోకి వైరస్ ప్రవేశించినా తక్కువ లోడ్ మాత్రమే వెళ్తుŠంది. చాలామంది మొక్కుబడిగా పెట్టుకుంటున్నారు. నోరు, ముక్కు రెండూ పూర్తిగా కవర్ అయ్యేలా మాస్క్ ధరిస్తేనే రక్షణగా ఉంటుంది. టీకా వేయించుకున్న వారిలో ఒమిక్రాన్ ప్రభావంలేదని ఎక్కడా రుజువు కాలేదు. కాబట్టి.. వారూ కచ్చితంగా మాస్క్‌లు ధరించాల్సిందే. – డాక్టర్ హైమావతి, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు తప్పనిసరి అయితేనే గర్భిణులు బయటకు వెళ్లాలి గర్భిణులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. రెండో దశలో వైరస్ బారినపడిన గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణ వ్యక్తుల్లా గర్భిణుల ఊపిరితిత్తుల పనితీరు ఉండదు. శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వారు మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు. బాలింతలు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ ప్రభావతి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ -
మంది సొమ్మే కదా మనకేంటి!
సాక్షి,హైదరాబాద్: ఏటీఎంలో నింపే డబ్బు బ్యాంకులది.. అంటే ప్రజల సొమ్ము. నిర్వహణలో మాత్రం అటు బ్యాంకులు, ఇటు కాంట్రాక్టు తీసుకున్న ఏజెన్సీలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా లోపభూయిష్టంగా మారిన ఏటీఎంలు అక్రమార్కులకు, నేరగాళ్లకు కల్పతరువులుగా మారుతున్నాయి. నగరంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాలే దీనికి నిదర్శనం. కస్టోడియన్లు రూ.14.69 కోట్లు కాజేసిన కేసులు గడిచిన కొన్నేళ్లల్లో సిటీలో నమోదయ్యాయి. రైటర్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉద్యోగులు రూ.23.32 లక్షలు కాజేశారంటూ ఇటీవల సీసీఎస్ పోలీసులు రిజిస్టర్ చేసిన కేసు వీటిలో తాజాది. ఔట్ సోర్సింగ్ చేతుల్లో నగదు భర్తీ.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఏటీఎంల్లో నగదును నింపే బాధ్యతల్ని స్వయంగా పర్యవేక్షించట్లేదు. ఈ కాంట్రాక్టుల్ని హైదరాబాద్, ఢిల్లీ, ముంబై కేంద్రాలుగా నడిచే ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నాయి. ఈ పని చేయడానికి ఆయా సంస్థలు అనేక మందిని కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. వీరిలో కస్టోడియన్లుగా పిలిచే ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం. బ్యాంకులకు చెందిన నగదు భద్రపరిచే కేంద్రాల నుంచి రూ.కోట్లను తమ సంస్థల వాహనాల్లో తరలించే టీమ్ సభ్యులకు ఈ కస్టోడియన్లు నేతృత్వం వహిస్తారు. ఆ మొత్తాన్ని తీసుకువెళ్లి ఆయా బ్యాంకుల ఏటీఎం సెంటర్లలోని మిషన్లలో పెడుతుంటారు. ఇంతటి వ్యవహారాలతో నడిపే కీలక బాధ్యతల్ని బ్యాంకులు కాంట్రాక్టు ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నాయి. సాంకేతికతకు ఆమడదూరం... ఏ ఏటీఎం కేంద్రంలో ఎప్పుడు, ఎంత నిపారన్నది కాంట్రాక్టులు నిర్వహిస్తున్న సంస్థల్లో కస్టోడియన్లు పని చేసే ఉద్యోగులు రికార్డుల్లో రాసిందే బ్యాంకులకు ఆధారం. ఈ తరహా ఉద్యోగుల కార్యకలాపాలపై ఏమాత్రం నిఘా సైతం ఉంచట్లేదు. కస్టోడియన్‌తో కూడిన ఓ బృందం బ్యాంక్ నుంచి సదరు వాహనంలో ఎంత మొత్తం తీసుకుని బయలుదేరుతోంది, తిరిగి ఎంత మొత్తం తీసుకువస్తోంది అనే అంశాలు కేవలం మాన్యువల్‌గానే పుస్తకాల్లోనో, వీరు ఫీడ్ చేస్తే కంప్యూటర్లోనో నమోదవుతున్నాయి. ఏటీఎం సెంటర్లో ఎంత డబ్బు పెట్టారనే దానికి సైతం ఈ లెక్కలే ఆధారం. అంతే తప్ప ఓ మిషన్‌లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని డిపాజిట్ చేశారనేది లెక్కించడానికి సాంకేతికంగా ఎలాంటి మెకానిజం ఇప్పటి వరకు ఆయా సంస్థలు, బ్యాంకులు అందిపుచ్చుకోలేదు. ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపిన కస్టోడియన్లు మళ్లీ వెళ్లి ఏటీఎంలను ఓపెన్ చేసినా గుర్తించే పరిజ్ఞానం బ్యాంకుల వద్ద ఉండట్లేదు. ఈ కారణంగానే ఏటీఎంల్లో అవసరమైనంతా డిపాజిట్ చేశామంటూ చెబుతున్న కస్టోడియన్లు గోల్‌మాల్‌కు పాల్పడుతూ రూ.లక్షలు, రూ.కోట్లు కాజేసే వరకు సంస్థలు గుర్తించలేకపోతున్నాయి. ఓల్డేజ్ సెక్యూరిటీ గార్డ్లు.. ఏటీఎంల భద్రత విషయంలోనూ లోపాలున్నాయి. ఇక్కడ విధుల్లో వృద్ధులే ఎక్కువగా ఉంటున్నారు. కూకట్‌పల్లిలోని పటేల్‌కుంట పార్క్ వద్ద ఈ ఏడాది ఏప్రిల్ 29న చోటు చేసుకున్న ఏటీఎం సొమ్ము దోపిడీ కేసు దీనికి ఉదాహరణ. దాదాపు ప్రతి సెక్యూరిటీ గార్డు, గన్‌మె న్ ‘ఓల్డేజ్’లోనే ఉంటున్నారు. పది ఏటీఎం కేంద్రాలను పరిశీలిస్తే వాటిలో ఆరు ఏడింటిలో వృద్ధులే సెక్యూరిటీ గార్డులుగా ఉంటున్నారు. ఏటీఎం కేంద్రాల్లో నింపాల్సిన నగదును కాజేసిన కస్టోడియన్ల ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. నగరంలో రూ.14.69 కోట్ల మేర కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా ప్రజాధనం దుండగుల పాలవుతున్నా ఆయా బ్యాంకులు మాత్రం పట్టించుకోవట్లేదు. -
సాగు 78% ... రుణం 20%
సాక్షి, హైదరాబాద్: రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు నిర్లక్ష్యం చూపుతున్నాయి. వాస్తవంగా సీజన్ ప్రారంభంలోనే రైతులకు విరివిగా రుణాలివ్వాలి. ఆ ప్రకారం జూన్‌లో ప్రారంభమయ్యే వానాకాలం సీజన్‌కు మే నెల నుంచే రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ, రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఇక బ్యాంకర్లపై ఒత్తిడి తేవడంలోనూ వ్యవసాయ శాఖ వైఫల్యం కనిపిస్తోంది. దీంతో అన్నదాతలు గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేయాల్సి వస్తోంది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశాల్లో ప్రభుత్వం రైతు రుణాల విషయం ప్రస్తావిస్తున్నా ఎలాంటి మార్పు రావడంలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకులు రుణ లక్ష్యాలను ఎందుకు పెంచుకుంటూ పోతున్నాయో అంతుబట్టడంలేదని వ్యవసాయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలైనా.. సాగు గణనీయంగా ఉన్నా.. రుణాలు ఇవ్వడానికి అనాసక్తి చూపిస్తున్నాయి. వానాకాలం పంటల సాగు ఇప్పటివరకు 78 శాతం అయినా, రుణాలు మాత్రం 20 శాతానికే పరిమితం కావడంపై విమర్శలు వస్తున్నాయి. ఇచ్చింది రూ.7 వేల కోట్లే... రాష్ట్రంలో నీటి వనరులు గణనీయంగా పెరిగాయి. సాగు నీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో రెండుమూడేళ్లుగా వ్యవసాయ పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో 63 లక్షల మంది రైతులుంటే... అందులో 65 శాతం మంది బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారు. మిగిలిన 35 శాతం మందికి రుణాలు అందక ప్రైవేట్‌గా తెచ్చుకుంటున్నారు. వాటికి అధిక వడ్డీలు చెల్లిస్తున్నారు. ఇక వానాకాలం పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.16 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 90.98 లక్షల (78%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇదిలా ఉంటే.. 2021–22లో రూ.59,440 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఈ సీజన్‌కు రూ.35,665 కోట్లు ఇవ్వాలనుకున్నారు. కానీ, ఇప్పటివరకు రూ. 7 వేల కోట్ల (20%) మేరకే రుణాలు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. కొన్నిచోట్ల బ్యాంకులు రైతుల నుంచి పాస్ పుస్తకాలు తీసుకొని పంట రుణాలు ఇస్తున్నాయి. ఇక రైతుబంధుకు, బ్యాంకు రుణాలకు నోచుకోని కౌలు రైతుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. వీరికి ప్రైవేట్ రుణాలు తప్ప మరో ఆధారమే లేదు. ఓ అంచనా ప్రకారం.. ఇప్పటివరకు రైతులు దాదాపు రూ.4,500 కోట్ల మేర ప్రైవేట్ అప్పులు చేయడం పరిస్థితిని తెలియజేస్తోంది. రుణమాఫీతోనైనా మారేనా? లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని గత ఎన్నికలకు ముందు ప్రభుత్వం హామీయిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గతేడాది రూ. 25 వేల వరకు మాఫీ చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రుణమాఫీ కోసం రూ.5,225 కోట్లు కేటాయించింది. ఇప్పుడు రూ.50 వేల వరకు రుణాలను మాఫీ చేయనుంది. అయితే రుణమాఫీ సొమ్ము పేరుకుపోయిందన్న భావనతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీంతో కొన్ని చోట్ల రైతుబంధు సొమ్మును కూడా జమ చేసుకున్నాయి. ఇప్పటికైనా బ్యాంకులు తీరు మార్చుకొని సీజన్లో ఇవ్వాల్సిన రుణాలను ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. బడ్జెట్ లేదన్నారు.. నాకు రెండు ఎకరాల భూమి ఉంది. వరి పండిస్తున్నా. పంట పెట్టుబడి కోసం సహకార సంఘంలో రుణం అడిగితే బడ్జెట్ లేదని చెప్పారు. కమర్షియల్ బ్యాంకులో రుణం కావాలంటే బీమా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. రుణం దొరకడం ఎంతో కష్టంగా మారింది. – తెడ్డు లక్ష్మి, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా లేనిపోని కొర్రీలు బ్యాంకుల్లో పంట రుణం కావాలంటే లేనిపోని కొర్రీలు పెడుతున్నారు. బీమా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. బీమా ప్రీమియం పెద్ద మొత్తంలో ఉంది. దీంతో బ్యాంకు రుణం అంటేనే విరక్తి కలుగుతోంది. – కిషన్, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా రెన్యువల్ చేసుకోమంటున్నారు రెండెకరాల పొలంలో పం ట సాగు కోసం మూడేళ్ల క్రితం ఎస్బీఐలో రూ.62 వేల రుణం తీసుకున్నా. కొత్త రుణానికి వెళ్తే బ్యాం కు అధికారులు ఇవ్వడానికి వీల్లేదంటున్నారు. అడిగతేæపాత రుణం రెన్యువల్ చేసుకుంటే తప్ప కొత్త రుణం ఇవ్వలేమంటున్నారు. – హన్మంతు, మాచన్‌పల్లి, మహబూబ్‌నగర్ రూరల్ బ్యాంకర్లు ఇవ్వడం లేదు నాకు ఆరెకరాల పొలం ఉంది. గట్టు మండల కేం ద్రంలోని ఎస్బీఐలో రు ణంకోసం దరఖాస్తు చే శా. ఏడాది కాలంగా తిరుగుతున్నా ఇప్పటివరకు పైసా ఇవ్వలేదు. అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవడం లేదు. దీంతో బయటనే వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. – ఆంజనేయులు, ఎల్లందొడ్డి, గట్టు, జోగులాంబ గద్వాల -
దారుణం: కొడుకు పట్టించుకోలేదు.. కోడలు గెంటేసింది
సాక్షి, వరంగల్ రూరల్: ఉద్యోగ రీత్యా కన్నకొడుకు పొరుగు దేశంలో ఉన్నాడు.. ఇక్కడున్న కొడలు పట్టించుకోకుండా ఇంటి నుంచి గెంటేసింది. కాటికి కాలుజాపిన వయసులో గత్యంతరం లేక ఆ కన్నతల్లి కూతురు వద్ద తలదాచుకుంటోంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పరకాల పట్టణంలోని మమత నగర్‌కు చెందిన గుండెమీద రాజయ్య–నర్సమ్మ(76) దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. వారికి వివాహం అయింది. సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కొడుకు రవికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతను ఉద్యోగ రీత్యా దుబాయిలో ఉంటున్నాడు. కుమార్తె హసన్‌పర్తిలోని అత్తవారి ఇంట్లో ఉంటోంది. 2014 డిసెంబర్ 20న రాజయ్య మృతి చెందడంతో నర్సమ్మకు కష్టాలు మొదలయ్యాయి. కోడలు మంజుల నర్సమ్మను పట్టించుకోకపోగా.. మమత నగర్లో ఉన్న ఇంటిని ఆక్రమించుకుని ఆమెను బయటకు పంపించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో హసన్‌పర్తిలోని కూతురు ఇంట్లో మూడేళ్లుగా తలదాచుకుంటోంది. కన్నకొడుకు పట్టించుకోకపోవడం ఒక వైపు, మరోవైపు వృద్ధాప్యం కారణంగా జీవనం భారంగా మారడంతో నర్సమ్మ 2019 జూన్‌లో పరకాల ఆర్డీఓను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఆమె అభ్యర్థనపై విచారించిన అప్పటి ఆర్డీఓ తల్లి పోషణ బాధ్యతను కొడుకు రవి, కోడలు మంజుల చూసుకోవాలని, పరకాల మమత నగర్‌లోని ఇంటికి చెందిన కిరాయి డబ్బులు నర్సమ్మకు చెందాలని ఈ ఏడాది ఫిబ్రవరి 9న తీర్పు వెల్లడించారు. నాలుగు నెలలు గడిచినా అమలు కాకపోవడంతో నర్సమ్మ హైకోర్టును ఆశ్రయించగా.. ఆర్డీఓ ఇచ్చిన తీర్పు అమలు చేయాలంటూ కలెక్టర్ హరితను ఆదేశించింది. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చి పది రోజులు దాటినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని బాధితురాలు వాపోయింది. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని నర్సమ్మ కోరుతోంది. ఈ విషయమై కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో పరకాల ఇన్చార్జి, వరంగల్ రూరల్ ఆర్డీఓ మహేందర్‌జీని వివరణ కోరగా.. గుండెమీద నర్సమ్మతో పాటు కోడలు మంజులను మంగళవారం కార్యాలయానికి పిలిపించి మాట్లాడుతానని, హైకోర్టు ఆదేశాల అమలుకు కృషి చేస్తానని చెప్పారు. చదవండి: వృద్ధురాలిపై లైంగిక దాడి, 20 సార్లు కత్తితో పొడిచి -
తెలంగాణపై చిన్నచూపు!
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తోంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ స్ఫూర్తి ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికి నిధుల హామీలు పారిస్తున్నారు. తెలంగాణకు నిధులిచ్చేందుకు మాత్రం కేంద్రానికి మనసు రావడం లేదు’ అని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణను ఆదుకుని, ప్రాధాన్యతా రంగాలకు నిధులు కేటాయించే విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ప్రపంచ వ్యాక్సిన్లలో మూడో వంతు హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తవుతున్నాయని, 70 దేశాల రాయబారులు ఇక్కడి జీనోమ్ వ్యాలీని సందర్శించారని.. ఇంత ప్రాముఖ్యత ఉన్న నగరానికి తగిన సహాయ, సహకారాలు అందించేందుకు కేంద్రం ముందుకు రావడం లేదేమని నిలదీశారు. బుధవారం శాసనసభలో మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల పద్దులు.. సీఎం తరఫున ప్రభుత్వ రంగసంస్థలు, ఐఅండ్ పీఆర్ పద్దులపై కేటీఆర్ సమాధానమిచ్చారు. వ్యాక్సిన్ ఇక్కడ.. బాట్లింగ్ అక్కడనా?: అంతర్జాతీయంగా మూడో వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోనే తయారవుతుండగా.. 1,200 కిలోమీటర్ల దూరంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఖసోలిలో వ్యాక్సిన్ బాట్లింగ్ను చేపడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నో విషయాల్లో దేశానికే ఆద ర్శంగా నిలుస్తున్న హైదరాబాద్ వరదల్లో మునిగిపోతే.. కేంద్రం నుంచి అందిన సాయం సున్నా అని విమర్శించారు. ‘‘104 ఏళ్లలో ఎప్పుడు లేనంతగా వరదల బారినపడ్డ హైదరాబాద్‌కు రూ.1,350 కోట్ల తక్షణ సాయం అందించాలని సీఎం కేసీఆర్ లేఖ రాసినా కేంద్రం నుంచి ఒక్కపైసా రాలేదు. ఐటీ, ఎయిరోస్పేస్, వ్యాక్సిన్ తయారీ రాజధానిగా ఉన్న తెలంగాణకు రూ.832 కోట్లు అందించాలని కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరికి లేఖ రాస్తే.. ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదంటూ తిరుగుటపా వచ్చింది. దేశాభివృద్ధిలో హైదరాబాద్ కు ఐదు శాతం జీడీపీ వాటా ఉన్నా.. కేంద్రం ఎందుకు తోడ్పాటు అందించడం లేదు. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–విజయవాడ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్.. హైదరాబాద్ ఫార్మాసిటీ, బయోటెక్‌పార్క్, మెగా టెక్స్టైల్ తదితరాలపై రాష్ట్రం మొర ఆలకించడం లేదు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన బయ్యారం స్టీల్‌ప్లాంట్‌పై ఉలుకూ పలుకు లేదు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంటున్నారు. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో రక్షణ సంస్థలు ఉన్నా కూడా.. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఎక్కడో ఉన్న బుందేల్‌ఖండ్‌కు తరలించారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో పసుపు విస్తారంగా పండుతుంటే.. అక్కడ తమిళనాడులో పసుపు బోర్డు పెడతామని ఎన్నికల హామీలిస్తారు. ఇవన్నీ చూస్తుంటే అసలు కేంద్రం ఆలోచన ఏమిటో అర్థం కావడం లేదు. ఎదుగుతున్న రాష్ట్రాన్ని వేరుగా చూడటం సరికాదు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 30 వరకు ఆధార్ లింకేజీ పొడిగింపు హైదరాబాద్‌లో 20వేల లీటర్ల వరకు ఉచిత నీరు పొందేందుకు ఆధార్ లింకేజీ తప్పనిసరని, దీనికి తుది గడువును వచ్చేనెల 30 వరకు పొడిగించామని కేటీఆర్ చెప్పారు. ఉచిత నీటికి సంబంధించి ఏడాదికి రూ.480 కోట్లను ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఎంఐఎం సభ్యుడు జాఫర్ హుస్సేన్ ప్రస్తావించిన అంశాలపై ఆయన ఈ సమాధానాలు ఇచ్చారు. మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్ల పనులను 71 మున్సిపాలిటీల్లో మొదలుపెట్టగా 11 చోట్ల పూర్తయ్యాయని, మిగతా చోట్ల త్వరలో ప్రారంభిస్తామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ నగరానికి గత ఆరున్నరేళ్లలో వివిధ శాఖలు, పథకాలు, కార్యక్రమాల కింద మొత్తం రూ.67,149.23 కోట్లు ఖర్చుచేసినట్టు వెల్లడించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ప్రతిపక్ష సభ్యులను ఉద్దేవించి.. ‘‘మీరు అక్కడే ఉంటారు. మేం ఇక్కడే ఉంటాం. అనుకున్నవన్నీ పూర్తి చేస్తాం. అనుమానం వద్దు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
కమీషన్లకు కక్కుర్తీ..కలెక్టర్ నోటీసులు!
జగిత్యాల/ధర్మపురి: జిల్లాలోని కొన్ని గ్రామపంచాయతీల్లో నిధుల దుర్వినియోగంతోపాటు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో కలెక్టర్ రవి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. సరైన కారణంతో సంజాయిషి ఇవ్వని సర్పంచులు, కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. బుధవారం జిల్లాలోని ధర్మపురి మండలం జైన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌తోపాటు గ్రామపంచాయతీ కార్యదర్శులను ఆరు నెలలపాటు సస్పెన్షన్ విధించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రూ.37.03 లక్షల లెక్కలపై నిర్లక్ష్యం జిల్లాలోని ధర్మపురి మండలం జైన గ్రామ సర్పంచ్ జె.ప్రభాకర్‌రావు, ఉపసర్పంచ్ కురిక్యాల మహేశ్, పంచాయతీ కార్యదర్శి పాషా గ్రామపంచాయతీ విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడంతోపాటు పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారనే కారణాలతో కలెక్టర్ ఆరునెలల పాటు సస్పెన్షన్ ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. గ్రామపంచాయతీకి చెందిన నిధులు రూ.37,03,865 సంబంధించిన రికార్డులు చూపించకపోగా కలెక్టర్ జారీచేసిన షోకాజ్ నోటీసులకు సమాధానం సైతం ఇవ్వలేదు. దీంతో పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు ముగ్గురిపై సస్పెన్షన్ విధించారు. ప్రతీ నెల రూ.9.17 కోట్లు జిల్లాలోని 380 గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ప్రతీ నెల రూ.9.17 కోట్లు మంజూరు చేస్తోంది. గ్రామాల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తుండగా, ఆయా నిధులను పల్లెప్రగతి పనులతో పాటు వైకుంఠదామాలు, పల్లెప్రకృతి వనాలు, శాని టేషన్, పంచాయతీ నిర్వహణ కోసం పాలకవర్గాలు వినియోగిస్తున్నాయి. గతేడాది జిల్లాలో సుమారు రూ.110 కోట్లు గ్రామపంచాయతీల నిధుల రూపంలో జీపీలకు చేరాయి. కొన్ని గ్రామాల్లో నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలున్నాయి. చాలా వరకు గ్రామాల్లో శ్మశానవాటిక పనులు పూర్తి కాలేదు. డంపింగ్‌యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, కంపోస్ట్‌యార్డుల నిర్మాణాలు సైతం నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చూపడంతోపాటు నిధుల్లో పారదర్శకత లేని 8 మంది సర్పంచులకు కలెక్టర్ రవి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ధర్మపురి మండలం జైన, రాజారం, రాయికల్ మండలం ధర్మాజీపేట, వెల్గటూర్ మండలం గుల్లకోట, చెగ్యాం, వెల్గటూర్, కథలాపూర్ మండలం బొమ్మెన, కోరుట్ల మండలం పైడిమడుగు సర్పంచులకు గతంలో షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దుర్వినియోగం ఇలా.. ధర్మపురి మండలంలోని జైనాలో హరితహారంలో భాగంగా కొనుగోలు చేసిన ట్రీగార్డులలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2019–2020లో 1,600 ట్రీగార్డులను కొనుగోలు చేశారు. ఒక్కో ట్రీగార్డుకు రూ.54 చొప్పున రూ.86,400 చెల్లించాల్సి ఉండగా.. రూ.1.92లక్షల విలువైన ట్రీగార్డులు కొన్నట్లు రికార్డులు చూపించినట్లు నిర్ధారణయ్యింది. సాధారణ నిధుల కింద రూ.1.95లక్షలు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.7,95,845, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.27,13,020 మొత్తం రూ.37,03,865 నిధుల వినియోగంపై వివరణ ఇవ్వాలని కలెక్టర్ నుంచి షోకాజ్ నోటీలు జారీ చేశారు. వీటిపై 15 రోజుల్లోగా స్పందించకపోవడంతో సస్పెన్షన్ చేస్తున్నట్లు ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ధర్మపురి మండలంలోని రాయపట్నంలో రూ.4 లక్షలు, బుగ్గారం పంచాయతీలో రూ.2.40 లక్షలు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు రావడంతో షోకాజ్ నోటీస్‌లు జారీ అయ్యాయి. 15 రోజుల్లోగా సంజాయిసీ ఇవ్వాలని కోరారు. -
బాబు ఊకదంపుడు.. జారుకున్న జనం!
ఘనత వహించిన చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని 14 ఏళ్లపాటు పాలించారు.. అభివృద్ధికి తానే అడ్రస్ అని ప్రగల్బాలు పలికారు.. ఏడు పర్యాయాలు కుప్పం వాసుల నుంచి ఓట్ల కప్పం వసూలు చేసుకున్నారు. కానీ, అక్కడి ప్రజల దాహార్తిని తీర్చడంలో విఫలమయ్యారు. అన్నదాతలకు సాగునీరు అందించకుండా కబుర్లతో కాలక్షేపం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాసుల కోసం కాంట్రాక్టర్లకు కొమ్ముకాశారు. తీరా అధికారం కోల్పోయాక నా నియోజకవర్గం అంటూ గుండెలు బాదుకుంటున్నారు. అసలు నిజాలను పక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి/కుప్పం: నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి నీరందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. తనను ఏడు పర్యాయాలు గెలిపించి అక్కున చేర్చుకున్న కుప్పం అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టించుకోకుండా 18 నెలల వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నేను పులివెందులకు నీళ్లిచ్చా.. మరి మీరు కుప్పానికి ఎందుకు ఇవ్వరంటూ అర్థంలేని ప్రశలను సంధిస్తున్నారు. గండికోట ప్రాజెక్టును దివంగత ముఖ్యంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేయబట్టి పులివెందులకు నీళ్లొచ్చాయి. మరి కుప్పానికి నీరు రావాలంటే హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు పనులు పూర్తికావాలి. తన హయాంలో అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్, వైఎస్సార్ జిల్లా అప్పటి టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి సంస్థకు కాంట్రాక్టులు అప్పగించడం వల్లే ఈ ప్రాజెక్టు ఆలస్యమైన విషయం బాబుకు తెలియదా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపాదిత అంచనాలు పెంచి కాసులు మూటగట్టుకున్నారే కానీ, పనులు పూర్తి చేయలేదని విమర్శిస్తున్నారు. సకాలంలో ఆ ప్రాజెక్టు పూర్తిచేసి ఉంటే కుప్పానికి ఎప్పుడో నీళ్లు వచ్చేవని వెల్లడిస్తున్నారు. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చొరవ వల్లే పుంగనూరు వరకు కృష్ణా జలాలు వచ్చాయని స్పష్టం చేస్తున్నారు. పాలారు ప్రాజెక్టును అడ్డుకున్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో కుప్పం మండలం గణేష్‌పురం వద్ద రూ.55 కోట్లతో పాలారు ప్రాజెక్టు నిర్మించేందుకు నిధులు కేటాయించారు. నిర్మాణ పనులు ప్రారంభించే సమయంలో చంద్రబాబు తెరవెనుక మంత్రాంగం నడిపి తమిళనాడు హైకోర్టులో కేసు వేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్టు నిలిచిపోతే స్థానిక ఎమ్మెల్యేగా చంద్రబాబు మిన్నకుండిపోవడమే ఇందుకు నిదర్శనమని గుర్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పరాభవాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గంటల తరబడి ఊకదంపుడు.. చంద్రబాబు రాజుపేట రోడ్డు, రామకుప్పం, శాంతిపురంలో ప్రసంగించారు. విషయం లేకపోయినా గంటల తరబడి ఊకదంపుడు ఉపన్యాసమే కొనసాగడంతో పలుచోట్ల జనం మెల్లగా జారుకోవడం కొసమెరుపు. చదవండి: చంద్రబాబు మేనిఫెస్టో.. ఓ 420 వ్యవహారం జగన్ దెబ్బకు కుప్పానికి పరుగు -
టీడీపీ నిర్వాకం.. కొండలకు కోట్లిచ్చిన ఘనులు!
పలమనేరు: నాటి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పిదాలు నేటి ప్రభుత్వానికి శాపంగా మారాయి. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కొండలు, గుట్టల భూములు పేదల ఇంటి స్థలాలకు పనికిరాకుండా పోయాయి. నాడు టిడ్కో, రెవెన్యూ అధికారులు చేసిన నిర్లక్ష్యానికి నేటి ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి ఇళ్లస్థలాలకు అనువైన స్థలాలను సేకరించాల్సి వస్తోంది. ఈ తంతంగాలన్నీ మాజీ మంత్రి అమరనాథ రెడ్డి హయాంలో పలమనేరులో చోటుచేసుకున్న లీలలు. ఇంతకీ ఏం జరిగిందంటే.... పేదలకు అపోర్టబుల్ హౌస్ నిర్మాణాలకు నాటి ప్రభుత్వం భూసేకరణకు ఆదేశించింది. దీంతో అప్పటి రెవెనూ అధికారులు, ఏపీ టిడ్కో (ఆంధ్రప్రదేశ్ టౌన్ షిప్ అండ్ ఇఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)లు కలసి పట్టణ సమీపంలోని గడ్డూరు వద్ద 1075, 1076, 1069 సర్వే నెంబర్లలో రైతుల నుంచి 8.78 ఎకరాలను భూసేకరణ ద్వారా సేకరించారు. ఈ భూములూ కొండలు, గుట్టలుగా ఉన్నాయి. నిర్మాణాలకు యోగ్యంగా లేవని సంబంధిత ఇంజినీర్లు అప్పట్లోనే తేల్చిచెప్పారు. అయితే ఇవేవీ పట్టించుకోని నాటి మాజీ మంత్రి దర్బార్ ఆ భూములనే సేకరించాలని అప్పటి తహసీల్దార్‌కు హుకుం జారీ చేసింది. కొండలు, గుట్టలుగా ఉన్న వాటిని ఎకరా రూ.25 లక్షలతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీంతో 8.78 ఎకరాలకు రూ.2.25 కోట్లను వెచ్చించారు. టిడ్కోకు సంబందించిన డీఈ స్థాయి అధికారుల అభ్యంతరాలను కాదని కింది స్థాయి అధికారులు చేపట్టిన భూసేకరణలో భారీగానే చేతులు మారాయనే ఆరోపణలు లేకపోలేదు. ఒక్కటీ కట్టలేదు.. ఓ వైపు ఆ భూమిని చదునుకూడా చేయలేదు. గతేడాది ఫిబ్రవరి 17 మాజీ మంత్రి అమరనాథ రెడ్డి మున్సిపల్ పాలకవర్గంతో కలసి అక్కడ శిలాఫలకానికి పూజలు చేశారు. అయితే అక్కడ ఓ ఇంటి నిర్మాణం సాగితే ఒట్టు. ఎన్నికలకు ముందు ఓట్లకోసం జరిగిన నాటకంగా ప్రజలకు తరువాత అర్థమైంది. ఇప్పుడేమైందంటే.. పేదలకు ఇంటిపట్టాల కార్యక్రమంలో భాగంగా నేటి ప్రభుత్వం మున్సిపాలిటీ పరిధిలో నాలుగు వేల మంది దాకా ఇంటి పట్టాలకు సిద్ధం చేసింది. గత ప్రభుత్వం టిడ్కో ద్వారా సేకరించిన 8.78 ఎకరాలు దానికి ఆనుకుని 6.40 ఎకరాల ప్రభుత్వ భూమిని కలిపి 15.18 ఎకరాల్లో సుమారు 800 మందికి ప్లాట్లు కేటాయించాలని భావించింది. అయితే ఈ భూములు కొండలు, గుట్టలుగా ఉండడంతో చదును చేసేందుకు ఇప్పటికి రూ.20 లక్షల దాకా ఖర్చు పెట్టింది. ఇంకో రూ.30 లక్షలు పెట్టినా ఇవి ఇళ్ల నిర్మాణాలకు యోగ్యంగా లేవని తేలింది. సక్రమంగా ఉన్న భూమిలో ప్రస్తుతం 400 ప్లాట్లను మాత్రం సిద్ధం చేశారు. దీంతో మిగిలిన లబ్ధిదారుల కోసం మొరం రెవెన్యూ పరిధిలో మరో 20 ఎకరాల భూమిని రైతుల నుంచి ఎల్ఏ ద్వారా సేకరించాల్సి వచ్చింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.3 కోట్ల దాకా వెచ్చించాల్సి ఉంది. దీనికి తోడు టిడ్కో సేకరించిన భూమిలో లెవలింగ్ కోసం ఖర్చు చేస్తున్న ప్రభుత్వ ధనం వృథా అయినట్టే. ప్రజాధనాన్ని బూడిదపాలు చేసిన ఈ తంతంగంలో జరిగిన అక్రమాలపై నాటి ప్రభుత్వంలో ఇక్కడ పనిచేసిన అధికారులను, టిడ్కో సిబ్బందిని విచారించాల్సిన అవరసం ఉంది. అప్పుడే ఈ వ్యవహారంలో జరిగిన అక్రమాలు బయటపడే అవకాశం ఉందని ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వృథా జరిగింది నిజమే... గత ప్రభుత్వంలో గడ్డూరు వద్ద టిడ్కో సేకరించిన భూముల్లో సగం దాకా కొండలు గుట్టలుగా ఉంది. ఇందులోని గట్టులను చదును చేసేందుకు ఇప్పటికే రూ.20 లక్షలు ఖర్చు చేశాం. కాని ప్రయోజనం లేదు. అందుకే ఇళ్ల స్థలాలకోసం అదనంగా భూసేకరణ చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – శ్రీనివాసులు, తహసీల్దార్, పలమనేరు -
పారిశ్రామిక మేడలు..!
ఎచ్చెర్ల క్యాంపస్: పేరుకు పారిశ్రామిక వాడలు.. అక్కడ వెలుస్తున్నాయి కమర్షియల్ మేడలు.. నిరుద్యోగిత ముసుగులో కొంతమంది వ్యాపారులు దర్జాగా వాణిజ్య వ్యాపారం చేసుకుంటున్నారు. శ్రీకాకుళం నగరానికి ఆనుకుని, 16వ నంబరు జాతీయ రహదారి పక్కన ఉండటంతో పారిశ్రామిక వాడ స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. గత టీడీపీ పాలనలో అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతోపాటు ఏపీఐఐసీ అధికారులతో లాలూచీ పడి పరిశ్రమల ఏర్పాటు కోసం స్థలాలు పొందినట్టు తెలుస్తోంది. ఇదీ ఏపీఐఐసీ లక్ష్యం... నిరుద్యోగులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా పోత్సహించాలి. సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. నిరుద్యోగి పది మందికి ఉపాధి కల్పించాలి. ఇదీ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక వసతుల కల్పన శాఖ (ఏపీఐఐసీ) లక్ష్యం. అధికారుల పర్యవేక్షణ లోపం, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటు కంటే వ్యాపారులకు వాణిజ్య సముదాయాలు నిర్మాణం, అద్దెలకు ఇచ్చేందుకు ఈ పారిశ్రామికవాడ ఉపయోగపడుతుంది. ఆన్లైన్ వ్యాపార గోదాములు, కార్యాలయాలు వంటివి నిర్వహణకు అద్దెకు ఇచ్చుకునేందుకు అనువైన స్థలం కావటంతో ఎక్కువ మంది వ్యాపార సముదాయాల నిర్వహణకు ఆసక్తి చూపిస్తున్నారు. పారిశ్రామిక వాడలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు.... కుశాలపురం సమీపంలోని నవభారత్ పారిశ్రామికవాడ 16.37 ఎకరాలు విస్తరించి ఉంది. నిరుద్యోగ యువతకు పరిశ్రమల ఏర్పాటు కోసం స్థలాలు కేటాయిస్తారు. పరిశ్రమలు మూతపడితే స్థలాలు ఏపీఐఐసీ స్వా«దీనం చేసుకుని, మరొకరికి ఇవ్వాలి. ప్రస్తుతం 55 పరిశ్రమలు ఉండగా, ఇందులో 12 పరిశ్రమలు మూతపడ్డాయి. స్టీల్, గ్రానైట్, అల్యూమినియం, గార్నటైట్, రంగులు, రీ ట్రైడ్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. గత ప్రభుత్వం సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించకపోవటం, ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు తీసుకోకపోవటం వంటి అంశాల వల్ల కొన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. ఇదేక్రమంలో నిబంధనలకు వ్యతిరేకంగా కమర్షియల్ కాంప్లెక్స్ (వాణిజ్య సముదాయాలు)ను నిర్మిస్తున్నారు. గతంలో పరిశ్రమల కోసం తీసుకున్న స్థలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా, బహుళ అంతస్తులు నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని అద్దెకు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఐదు కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఈ పారిశ్రామిక వాడలో ఉండటం గమనార్హం. పరిశ్రమల స్థాపన పేరిట రాయితీలు... పరిశ్రమల ఏర్పాటు పేరుతో బ్యాంకుల నుంచి రాయితీ రుణాలు సైతం కొందరు తీసుకుంటున్నారు. వీటితో వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు. నిర్మాణ సమయంలో ఏపీఐఐసీకి దరఖాస్తు చేసుకున్న విధంగా పరిశ్రమ నిర్మాణం చేపట్టాలి. లేదంటే అధికారులు స్థల మంజూరును రద్దు చేయాలి. ఇలా చేయడం లేదు. దీంతో నిరుద్యోగుల స్థానంలో వ్యాపారులు ప్రయోజనాలు ఎక్కువుగా పొందుతున్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు వాణిజ్య సముదాయాలు నిర్మాణం చేపడుతున్నారు. ఏపీఐఐసీ శాఖ స్పందించకుంటే భవిష్యత్తులో ఇక్కడ సూక్ష్మ పరిశ్రమలు సైతం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. నిబంధనల అమలుకు కృషి వాణిజ్య సమదాయాల నిర్మాణం నిబంధనలకు వ్యతిరేకం. స్థలాలు పొందిన వారు నిబంధనలు పక్కాగా పాటించాలి. స్థలాలు తీసుకున్నప్పుడు దరఖాస్తులో పేర్కొనేలా నిర్మాణాలు, పరిశ్రమల ఏర్పాటు ఉండాలి. దీనిపై ప్రత్యేక దృష్టి పెడతాం. – సుధాకర్, ఏపీఐఐసీ, జోనల్ మేనేజర్ -
బయటపడిన ఖాకీల ‘బండారం’
సాక్షి, విశాఖపట్నం/పెదవాల్తేరు(విశాఖ తూర్పు): మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు బండారు అప్పలనాయుడు విషయంలో త్రీ టౌన్ పోలీసుల బండారం బయటపడింది. ఈ కేసు విషయంలో వారు అపకీర్తిని మూటగట్టుకున్నారు. బీచ్‌రోడ్డులో బీభత్సం సృష్టించి బైకుపై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడడానికి కారకుడైన అప్పలనాయుడుని సకాలంలో అరెస్టు చేయకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ప్రమాదంలో అప్పలనాయుడు నడుపుతున్న కారు (ఏపీ31డీపీ 6666) అదుపు తప్పి బైకుని ఢీకొన్న తరువాత ఆర్కేబీచ్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఢీకొట్టి ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన మెడికల్ విద్యార్థి స్నేహితులు రావడంతో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. దీంతో అప్పలనాయుడు, అతని స్నేహితులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. రోజూ బీచ్‌రోడ్డులో త్రీ టౌన్ పోలీసుల రాత్రి గస్తీ ఉంటుంది. ఏఎస్ఐ రాజేశ్వరరావు, ఇతర పోలీసులు వెళ్లేసరికే నిందితులు పారిపోయారని త్రీటౌన్ పోలీసులు చెబుతున్నారు. పైగా నిందితులు కారు వెనుక వైపు గల నెంబర్ ప్లేట్ సైతం మాయం చేయడానికి ప్రయత్నించారంటే ఎంతగా బరితెగించారో ఇట్టే అర్ధం అవుతుంది. ఆర్కేబీచ్లో గల సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం పోలీసులు పూర్తి స్థాయిలో పరిశీలించ లేదంటే ఎంత నత్తనడకన దర్యాప్తు చేశారన్నది తెలుస్తోంది. మీడియాకి తెలియనివ్వకుండా... త్రీ టౌన్ పోలీసులపై ఈ కేసు విషయమై మొదటి నుంచీ తెలుగుదేశం నేతల ఒత్తిళ్లు పనిచేశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుడు అప్పలనాయుడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్టేషన్లో లొంగిపోవడం వల్లనే అరెస్టు చూపించారే తప్ప వారంతట వారు అరెస్టు చేసిన పాపాన పోలేదు. ఫలితంగానే నిందితుడిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టే అవకాశం లేకపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. కారులో ఉన్న వారు మద్యం సేవించి ఉన్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో నిందితుడిని త్రీ టౌన్ పోలీసులు 24 గంటలలోపు అరెస్టు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేస్తే నిజం నిగ్గు తేలేది. ఆదివారం పెందుర్తిలోని అప్పలనాయుడు ఇంటికి పోలీసులు వెళ్లారని చెబుతున్నప్పటికీ... ఎవరు వెళ్లారన్నది మాత్రం మీడియాకి చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. గతంలో కూడా వివాదాస్పద చరిత్ర ఉన్న అప్పలనాయుడుని త్రీటౌన్ పోలీసులు కావాలనే అరెస్టు చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోనీ నిందితుడు అరెస్టు అయిన విషయం కూడా పోలీసులు మీడియాకి పొక్కనీయలేదంటే తెలుగుదేశం పారీ్టకి ఎంతగా తొత్తుల్లా వ్యవహరించారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బండారు పరువు పోతే ఎలా అనుకున్నారో ఏమోగానీ పోలీసులు మాత్రం విషయం బయటకు పొక్కనీయలేదు. ఇక సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిందితుడు అప్పలనాయుడుకి 41 నోటీస్ ఇచ్చి పంపించేశారు. ఈ విషయం కూడా రాత్రి 7.30 గంటల వరకు మీడియాకి చెప్పకుండా గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిన్నా చితకా కేసుల్లో నిందితులను అరెస్టు చేస్తే హడావిడి చేసే త్రీటౌన్ పోలీసులు బడాబాబుల కుమారులను అరెస్టు చేసినపుడు మాత్రం గోప్యంగా ఉంచడం తీవ్ర దుమారం రేపుతోంది. సదరు నిందితుడు మంగళవారం కోర్టులో హాజరవుతాడని పోలీసులు అంటున్నారు. ఈ కేసుని త్రీ టౌన్ సీఐ కె.రామారావు పర్యవేక్షణలో ఎస్.ఐ.జి.హరీష్ దర్యాప్తు చేస్తున్నారు. కాగా, క్షతగాత్రులలో ఒకరైన మెడికో చంద్రకిరణ్ ఆదివారం రాత్రి మళ్లీ కేజీహెచ్‌లో చికిత్స కోసం చేరారు. కారు ప్రస్తుతం పోలీసుల స్వా«దీనంలో ఉంది. మద్యం విక్రయాలు ఎలా..? ప్రభుత్వం మద్య నియంత్రణలో భాగంగా దుకాణాలు రాత్రి 8 గంటలకు మూతపడుతున్నాయి. బార్లు రాత్రి 11 గంటలకు మూతపడుతున్నాయి. మరి బండారు అప్పలనాయుడు మిత్ర బృందం అర్ధరాత్రి ఎలా మద్యపానం చేశారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది. మద్యం మత్తులో ఉండడం వల్లనే అదుపు తప్పి ప్రమాదం చేశారని బాధితులు, స్థానికులు అంటున్నారు. ఇకనైనా అర్ధరాత్రి మద్యం విక్రయాలను ఎక్సైజ్ పోలీసులు అదుపు చేయాలని పలువురు కోరుతున్నారు. -
‘పచ్చ’పాపం.. విద్యార్థినుల శోకం
ఐదేళ్ల టీడీపీ పాలనలో విద్యారంగం కుదేలైంది. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూ.20 లక్షలు వెచ్చిస్తే 100 మందికి పైగా వసతి కల్పించవచ్చని అధ్యాపకులు వేడుకున్నా.. ఐదేళ్ల కాలంలో ఐదు పైసలు కూడా విడుదల చేయని పరిస్థితి. ప్రచారం పేరుతో రూ.కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు.. విద్యారంగంపై వివక్ష చూపారు. అప్పటికే కొనసాగుతున్న పనులకు కూడా నిధులు మంజూరు చేయకుండా నిలిపేశారు. ఫలితంగా రాయలసీమలోనే పేరుగాంచిన కేఎస్ఎన్ కళాశాలలో వసతి గృహాల నిర్మాణాలు పూర్తి కాక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ నిర్లక్ష్యానికి ఇప్పుడు రూ.1.20 కోట్ల మూల్యం చెల్లించుకోవాల్సి రావడం గమనార్హం. అనంతపురం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాల రాయలసీమలోనే పేరుగాంచింది. అందువల్లే ఇక్కడ చదువుకునేందుకు అనంతపురంతో పాటు వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల విద్యార్థినులు కూడా ఉత్సాహం చూపుతారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే విద్యార్థినులతో పాటు అనంతపురం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులకు వసతి తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలోనే 2012లో అప్పటి ముఖ్యమంత్రి హాస్టల్ భవనానికి రూ.కోటి నిధులు కేటాయించారు. 19 గదులు(టాయిలెట్, బాత్రూం ఆటాచ్డ్), డైనింగ్‌హాల్, లైబ్రరీ గది నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. రూ.కోటి ఖర్చు చేసినా అన్నీ శ్లాబ్ స్థాయి వరకు పనులు జరిగాయి. అక్కడితో నిధులు అయిపోవడంతో పనులు నిలిపేశారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కళాశాల యాజమాన్యం పలుమార్లు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి వసతి గృహం సమస్యను తీసుకెళ్లినా లాభం లేకపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదేళ్లలో ఈ నిర్మాణాలకు రూపాయి కూడా విడుదల చేయలేదు. ‘రూసా’ నిధులతో 12 గదుల నిర్మాణాల పూర్తి.. హాస్టల్ గదుల కొరత, నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోవడంతో ‘కేఎస్ఎన్’ యాజమాన్యం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈక్రమంలో 2017లో రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్ష అభియాన్ (రూసా) నిధులు రావడంతో రూ. 35 లక్షలు ఖర్చు చేసి పెండింగ్‌లో ఉన్న 12 గదుల నిర్మాణాలను పూర్తి చేసింది. ఈ గదులు అందుబాటులోకి రావడంతో విద్యార్థినులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తక్కిన ఏడు గదులు, డైనింగ్‌హాల్, లైబ్రరీ నిర్మాణాలు ఇప్పటికీ అలాగే నిలిచిపోయాయి. టీడీపీ హయాంలో రూ.20 లక్షలు ఖర్చు చేసి ఉంటే ఆ పనులన్నీ అప్పుడే పూర్తయ్యేవి. కానీ వారు నిధులు మంజూరు చేయకపోవడంతో ఇప్పుడు ఆ పనులు పూర్తి చేయాలంటే రూ.1.20 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 160 మందికి మాత్రమే వసతి.. కళాశాల హాస్టల్లో ప్రస్తుతం 450 మంది విద్యార్థినులు ఉంటున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో మొదటి సంవత్సరం విద్యార్థినులు 320 మంది హాస్టల్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. భవనాలు అందుబాటులో లేకపోవడంతో అధ్యాపకులు 160 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న ఏడు గదులు పూర్తయితే మరో 100 మందికి పైగా వసతి భాగ్యం దక్కేది. వసతి సదుపాయం లేని కారణంగా చాలామంది విద్యార్థినులు వెనక్కు వెళ్లిపోతున్నారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభగల విద్యార్థులు కూడా వసతిలేని కారణంగానే ఉన్నత చదువులకు ఫుల్స్టాప్ పెట్టేస్తున్నారు. రూ.90 లక్షలతో అంచనాలు.. పెండింగ్‌లో ఉన్న ఏడు గదుల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు రూ.40 లక్షలు, అలాగే డైనింగ్ హాల్, లైబ్రరీ గది పూర్తి చేసేందుకు మరో రూ.50 లక్షలు అవసరమని ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు తాజాగా అంచనాలు రూపొందించారు. వాస్తవానికి ఈ పనులు పెండింగ్‌లో ఉంచకుండా అప్పుడే పూర్తి చేసి ఉంటే రూ.25 లక్షల్లోపు పూర్తయ్యేవి. నాడు పట్టించుకోని కారణంగా ప్రస్తుతం దాని వ్యయం రూ.1.25 కోట్లకు చేరింది. ఇప్పటికైనా నిధులు కేటాయించి పెండింగ్ నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని విద్యార్థినులు కోరుతున్నారు. వసతికి ఇబ్బందిగా ఉంది హాస్టల్ భవన నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. ఏడు గదులు, డైనింగ్ హాల్, లైబ్రరీ గది పూర్తయితే చాలా ఉపయోగంగా ఉంటుంది. మరో వందమందికి వసతి కల్పించవచ్చు. ఆరేళ్ల కిందట రూ. కోటితో నిర్మాణాలు చేపట్టినా అవి పూర్తి కాలేదు. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసేలా చూడాలి. – శంకరయ్య, ప్రిన్సిపల్ -
వి‘రక్త’ బంధాలు
సాక్షి, నర్సంపేట(వరంగల్) : మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మానవత్వం మచ్చుకైనా కనిపిస్తలేదు.. ఇది ఓ పాటలోని వాక్యం కాదు .. నిజ జీవితంలో ఎక్కడో చోట బయటపడుతున్న వాస్తవం . అయినవాళ్లు.. చివరకు అమ్మానాన్నల బంధాలకు సైతం బీటలు వారుతున్నాయి. డబ్బే పరమావధిగా అరాచకాలు చోటు చేసుకుంటున్నా యి. కన్న తల్లిదండ్రులను కొడుకు చంపడం.. కొడుకును తల్లిదండ్రులే చంపడం.. ఆస్తికోసం అమ్మానాన్నలను గెంటివేయడం.. సోదరులపై దాడి, హత్య చేయడం జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న అమానవీయ ఘటనలే ఇందుకు నిదర్శనం. ప్రాధేయపడినా కనికరించని కసాయి.. గత నెల 30వ తేదీన అన్న కంటే తక్కువ భూమి పంచి ఇచ్చారని వృద్ధ తల్లిదండ్రులపై మమకారాన్ని మరిచిన కన్న కొడుకు, మనుమడు కలిసి కిరాతకంగా గొంతు కోసి కడతేర్చిన ఘటన రూరల్ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి పరిధిలోని భూక్యా తండాలో ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. భూక్యా దస్రూ – బాజీని గొంతు కోసి ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. తండ్రిని చంపిన అనంతరం తల్లిని చంపబోతుండగా వద్దని ప్రాధేయపడినా కొడుకు తల్లిని సైతం చంపడం బంధాలు రోజురోజుకు దిగజారాయని చెప్పడానికి ఉదాహరణగా చెప్పొచ్చు. కొడుకు, కోడలు వేధింపులతో.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎల్కేశ్వరం గ్రామానికి చెందిన రాళ్లబండి సాలయ్య(76), రాళ్ల బండి రాధమ్మ(66) వృద్ధ దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం గడుపుతున్నారు. వీరిని తరచూ కొడుకు , కోడలు వేధించే వారని స్థానికులు తెలిపారు. కొడుకుకు భారం కాకుడదని ముహూర్తం పెట్టుకుని వారి దహన సంస్కారాలకు సైతం డబ్బులు సమకూర్చుకుని మరీ శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆరెకరాలు సంపాదించి ఇచ్చినా నిత్యం కొడుకు, కోడలు సూటిపోటి మాటలే వారి ఆత్మహత్యకు కారణమైందని స్థానికులు చర్చించుకోవడం గమనార్హం. దామెర మండలం ముస్త్యాలపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో కడారి మహేష్‌చంద్ర అనే వ్యక్తిని చేతులు కట్టేసి కుటుంబసభ్యులు కిరోసిన్ పోసి మంగళవారం సజీవ దహనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కున చేర్చుకునేవారు లేరు.. రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన అనుమాండ్ల వీరస్వామి– శోభలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పిల్లు లేరు. వయస్సు మీద పడడంతో వీరస్వామికి ఆరోగ్యం బాగా లేదు. దీంతో వీరస్వామి దంపతులకు ఎవరూ అద్దెకు ఇల్లు ఇవ్వలేదు. శోభ ఇండ్లలో పనిచేస్తూ ఎంతో కొంత వచ్చిన డబ్బులతో వారు పెట్టిన అన్నం తెచ్చి భర్తకు పెట్టి తాను తిని దయనీయ స్థితిలో జీవనం సాగించారు. గత మూడు నెలలుగా చెట్ల కిందనే దయనీయ స్థితిలో జీవనం కొనసాగిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇలా జిల్లాలో అనుబంధాలు.. బంధాలు అన్నది మరిచిపోయిన ఘటనలు ఇటీవల కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. బంధాలు దూరమవుతున్నాయి.. తల్లిదండ్రులు పిల్లల మధ్య రోజురోజుకు దూరం పెరుగుతుంది. పక్కవాళ్లను చూసి మంచి కన్నా చెడే ఎక్కువ నేర్చుకోవడం, మంచి కన్నా చెడు ఎక్కువగా నేర్చుకోవడం ఎక్కువైపోయింది. మానసిక బంధాలను ప్రేమను పెంచుకుంటే తప్పా ఒకరి బాధలను ఇంకొకరికి అర్థమయ్యేలా పిల్లలకు, పిల్లల బాధలను తల్లిదండ్రులు అర్థం చేసుకుంటేనే ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలను ఆపడానికి అవకాశం ఉంది. – సృజనారెడ్డి, సైకలాజిస్ట్ -
నరకానికి కేరాఫ్..
సాక్షి ప్రతినిధి విజయనగరం: విజయనగరంలోని జేఎన్టీయూకే క్యాంపస్‌లో సమస్యలు తిష్ట వేశాయి. వందల మంది చదువుతున్న ఈ యూనివర్సిటీలో సగానికి పైగా విద్యార్థులు వసతి గృహాల్లోనే ఉంటూ కాలేజ్ మెస్‌లోనే తింటున్నారు. కానీ కొన్ని నెలలుగా ఈ మెస్ సరిగ్గా నడవడం లేదు. కనీసం తాగునీరు కూడా లేకపోవడంతో విద్యార్థులు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరానికి వచ్చి భోజనం చేయాల్సి వస్తోంది. లేదా పస్తులుండాలి. మరో వైపు కళాశాలలో పరిశోధన శాల అభివృద్ధికి వచ్చిన నిధులు కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి. విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ కూడా అందుబాటులో ఉండటం లేదు. ఇంత జరుగుతున్నా నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీనిపై రెండు రోజులుగా పగలు, రాత్రి అన్న తేడా లేకుండా విద్యార్థులు ఆందోళనల చేపడుతున్నారు. ప్రిన్సిపల్ ఆధిపత్యం.. కళాశాలలో మొత్తం 1670 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో దాదాపు 1430 మంది వసతి గృహంలోనే ఉంటున్నారు. స్టూడెంట్ మెస్‌లు నడుపుతూ విద్యార్ధులకు భోజన వసతి కల్పిస్తున్నారు. అయితే స్టూడెంట్స్ మేనేజ్మెంట్ నిర్వహణలో భోజన వసతి వ్యవహారంలో స్టూడెంట్స్‌కి స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ప్రిన్సిపల్ ఆధిపత్యం వల్ల మెస్ చార్జీలు భారీగా పెరుగుతున్నాయి. కాంట్రాక్ట్ పద్ధతి మెస్ నిర్వహణలో రూ.3 వేలు వరకు వచ్చిన బిల్లును స్టూడెంట్ మేనేజ్మెంట్ నిర్వహణ ద్వారా రూ.1400 కి తీసుకొచ్చారు. కానీ ప్రిన్సిపాల్ ఆధిపత్యంలో మెస్ నిర్వహణ వచ్చినప్పటి నుంచి రూ.1900 కి మెస్ బిల్లు చేరింది. దాదాపు నెలన్నరగా విద్యార్ధుల చేత నడిపించే మెస్‌లకు నీటి సౌకర్యం ఆగిపోయింది. విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించినా ప్రిన్సిపల్ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు విజయనగరం వచ్చి భోజనం చేస్తున్నారు. రెండేళ్లుగా కళాశాల ప్రాంగణానికి ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ప్రయోగశాల అభివృద్ధికి సంబంధించిన నిధులు ఉన్నప్పటికీ రెండేళ్లుగా వాటి ఏర్పాటుకు సంబంధించిన టెండర్లను పిలిచి డిపార్ట్మెంట్లకు అందజేయడం లేదు. నిధులున్నా విద్యార్థులకు ప్రయోగశాల నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేయలేదు. హాస్టల్లో మౌలిక సౌకర్యాల కొరత ఉంది. క్రీడాప్రాంగణం కళాశాల క్రీడలు ఆడుకునే స్థాయిలో లేదు. వీటిపై విద్యార్థులెవరైనా వ్యక్తిగతంగా నిలదీసినా, ప్రశ్నించినా వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నా రు. మార్కులు తగ్గించేస్తామంటూ బెదిరిస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. ఈ నేప థ్యంలో మూకుమ్మడిగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. మిడ్ ఎగ్జామ్స్‌కి దూరమైనా కూడా నిరసనలో పాల్గొంటున్నారు. దిగివచ్చిన రిజిస్ట్రార్.. జేఎన్టీయూ వీసీ వస్తేగానీ నిరసన విరమించేది లేదంటూ మంగళ వారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా విద్యార్థులు ఆందో ళన కొనసాగించారు. రాత్రి వేళ చీకట్లోనూ కళాశాల గేటు వద్ద బైఠాయించారు. చేసేది లేక జేఎన్టీయూ కాకినాడ యూనివర్శిటీ రిజస్ట్రార్ సుబ్బారావు బుధవారం విజయనగరం వచ్చారు. తొలుత కళాశాల ప్రిన్సిపాల్, వైస్‌ప్రిన్సిపాల్, వివిధ విభాగాల అధిపతులు, ఫ్యాకల్టీలతో సమస్యలపై సమీక్షించారు. అనంత రం విద్యార్థుల వద్దకు వచ్చివారి సమస్యలను తెలుసుకున్నారు. కళాశాల నిర్వహణలో లోపాలున్నట్లు ఆయన గుర్తించారు. అకడమిక్కి నష్టం కలగకుండా వాటిని సరిదిద్దుకుందామని వారికి హామీ ఇచ్చారు. సమస్యలు చెప్పే వారిపై పరోక్షంగా ఫ్యాకల్టీ శిక్షలు వేస్తున్నారని విద్యార్థులు రిజిస్ట్రార్ ముందు ఏకరుపు పెట్టడంతో అక్కడున్న కళాశాల ఫ్యాకలీ, ఇతర సిబ్బందిని రిజస్ట్రార్ కళాశాల లోపలికి పంపారు. అనంతరం విద్యార్థులు చెప్పిన సమస్యల్లో ప్రధానంగా కళాశాల గ్రంథాలయ సౌకర్యాన్ని వారం రోజుల్లో పూర్తి స్థాయిలో కల్పిస్తామని హామీ ఇచ్చారు. రూ.లక్షలోపు నిధులను విడుదల చేసే అర్హత తనకు ఉందని ప్రస్తుతం సెమిస్టర్‌కి అవసరమైన తక్షణ మెటీరియల్‌ని తెప్పిస్తామని చెప్పారు. గ్రంథాలయంలో కంప్యూటర్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలన్న డిమాండ్‌పై స్పష్టమైన హామీ ఇచ్చారు. వసతి గృహంలోని మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలిస్తాన్నారు. ఎప్పటిలాగే మెస్‌బిల్లును తగ్గించుకోవడానికి మెస్ నిర్వాహణలో ఫ్యాకల్టీ ఆధిపత్యం లేకుండా చేయాలని విద్యార్థులు కోరారు. స్టూడెంట్ మేనేజ్ మెంట్ పద్ధతిలో జరుగుతున్న మెస్ నిర్వహణలో పూర్తిగా విద్యార్థులకే స్వేచ్ఛ ఇస్తామని హామీ ఇచ్చారు. వీసీ రావాల్సిందే... రిజిస్ట్రార్ ఇచ్చిన హామీలపై విద్యార్థులు సంతృప్తి చెందలేదు. రిజస్ట్రార్ సుబ్బారావు విద్యార్థుల సమస్యలు ఒక్కొక్కటిగా వింటూ పరిష్కార మార్గాలు చెపుతూ విద్యార్థులకు హామీలిచ్చారు. దాదాపు నాలుగు అంశాల తరువాత బాలికల హాస్టల్ సమస్యలు చర్చలోకి వచ్చాయి. ఫ్యాకల్టీ, హాస్టల్ ఇతర సిబ్బంది వారిపై చేస్తున్న అసభ్యకర చర్యలను బాలికలు చెపుతున్న సమయంలో పరిష్కార మార్గాలు చెప్పకుండా మధ్యలో రిజిస్ట్రార్ కళాశాలలోపలికి వెళ్లిపోయారు. చాలా సేపటి వరకూ బయటకు రాకపోవడంతో విద్యార్థులు నిరసనలు కొనసాగించారు. రాత్రి 9.30 గంటల సమయంలో రిజిస్ట్రార్ మరలా విద్యార్థుల దగ్గరకు వచ్చారు. వీసీ వస్తేనే తాము ఆందోళన విరమిస్తామని విద్యార్థులు పట్టుబట్టి కూర్చున్నారు. రాత్రి 10 గంటలకు కూడా చర్చలు కొనసాగుతున్నాయి. -
‘పథకాలను చూసి ఆశ్చర్యపడ్డారు’
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా సీడ్ పార్క్‌ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. సోమవారం అయోవా యూనివర్శిటీ ప్రతినిధులతో మంత్రి కన్నబాబు, సీఎం కార్యాలయం అధికారులు భేటీ అయ్యారు. కర్నూలు జిల్లా సీడ్ పార్క్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విత్తన కంపెనీలకు మేలు చేసేలా కాకుండా.. రైతులకు మేలు చేసేలా విత్తనాభివృద్ధి జరగాలని కోరారు. అదే విషయాన్ని ఆయోవా ప్రతినిధులకు సూచించినట్లు వెల్లడించారు. సీడ్‌పార్క్ ప్రతిపాదనలను రిడిజైన్ చేయాలని చెప్పామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులకు అనుగుణంగా విత్తనాభివృద్ధి చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన రైతు పథకాలను చూసి అయోవా ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. విత్తనాలు అందించడానికి ల్యాబ్‌లను పెడుతున్నామని తెలిపారు. -
నిధులున్నా.. నిర్లక్ష్యమే...
సాక్షి, విజయనగరం అర్బన్: ఓ వైపు సర్కారు విద్యకు పెద్ద పీట వేస్తూ... అందులోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశిస్తుంటే... జిల్లా అధికారులు నిర్లక్ష్యం వల్ల కేజీబీవీ విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదరికంతో డ్రాపౌట్లుగా మారిన విద్యార్థినుల కోసం కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)ను నెలకొల్పారు. వారిపై ఎలాంటి ఆర్థిక భారం మోపకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ జిల్లా అధికారుల నిర్వహణ లోపం వల్ల విద్యార్థినులే కాస్మొటిక్ చార్జీలు భరించాల్సి వస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యార్థినులకు వసతితోపాటు స్టేషనరీ, కాస్మొటిక్ చార్జీలు వంటివాటిని యంత్రాంగం అందించాల్సి ఉంది. కానీ పాఠశాలలు పునఃప్రారంభమై నాలుగునెలలు కావస్తున్నా జిల్లా సర్వశిక్షాభియాన్ వాటిని అందివ్వలేదు. ఇందుకు సంబంధించిన నిధులు రెండు నెలల క్రితమే జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినా... పర్చేజింగ్ టెండర్ చేపట్టడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. సర్కారు చొరవ చూపుతున్నా... జిల్లాలో మొత్తం 33 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. అందులో 6,500 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రవేశం పొందిన విద్యార్థినికి రెండు జతల యూనిఫాం, పాదరక్షలు, స్టేషనరీ, వారికి అవసరమైన నోట్ పుస్తకాలు, ప్లేట్లు, పెట్టెలు, కాస్మొటిక్ వస్తువులు, పాఠ్యపుస్తకాలు వంటివి విద్యాలయాల్లోనే ఇవ్వాలి. తొలుత జిల్లా స్థాయిలోని పర్చేజింగ్ కమిటీల ద్వారానే కొనుగోలు చేసి జూన్ నెలలోనే వాటిని పంపిణీ చేసేవారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రస్థాయిలో టెండర్లు వేసి అన్ని జిల్లాలకు పంపి ణీ చేశారు. దానివల్ల ఆలస్యం అవుతోందని, ప్రస్తుత ప్రభుత్వం జిల్లా స్థాయిలోనే పర్చేజ్ చేసుకోమని రెండు నెలల క్రితమే నిధులు కేటాయించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఒక్కో విద్యార్థినికి కాస్మొటిక్ వస్తువుల కోసం నెలకు రూ.125, శానిటరీ నాప్కిన్స్ కోసం నెలకు రూ.35లు ఇవ్వాలని ఆదేశించారు. కానీ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా నాలుగునెలలవుతున్నా టెండర్ ఊసే లేదు. కనీసం డబ్బులు చెల్లించలేదు. విద్యార్ధినులు తమకు అవసరమైన వస్తువులను సొంత డబ్బు వెచ్చించి బయటే కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. విద్యార్థినులపై రూ. 41.6లక్షల భారం జిల్లాలో 33 కేజీబీవీల్లో 6,500 మంది విద్యార్థినులున్నారు. గడిచిన నాలుగు నెలల్లో వారు నెలకు కాస్మొటిక్ వస్తువులకోసం రూ.125, శానిటరీ నాప్కిన్స్కి రూ.35 వంతున రూ.41.6 లక్షల ఆర్థిక భారం మో యాల్సి వచ్చింది. కాస్మొటిక్ వస్తువులు పంపిణీ అయ్యేంతవరకు దుస్తులు శుభ్రపర్చుకోవడానికి నెలకు మూడు సబ్బులు, స్నానం సబ్బులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పేస్టులు, తలకు కొబ్బరి నూనె, ముఖానికి రాసుకునేందుకు పౌడర్ డబ్బాలు, షాంపూలు, బ్రష్‌లు కొనుగోలు చేయాలి. అయితే నాలుగునెలలుగా వీటికి డబ్బులు రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్చేజింగ్ టెండర్ దశలో ఉంది.. కాస్మొటిక్ కిట్స్ పర్చేజింగ్ బాధ్యత గతంలో రాష్ట్రస్థాయిలో ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం జిల్లా పర్చేజింగ్ కమిటీకి అప్పగించిం ది. నిధులు వచ్చి రెండునెలలు అయింది. గిరిజన ఉత్పత్తులు కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నాం. అందుకే ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం వాటి కొనుగోలుకు సంబంధించిన పర్చేజింగ్ టెండర్ దశలో ఉంది. – ఎం.కృష్ణమూర్తినాయుడు, పీఓ, ఎస్ఎస్ఏ బయట షాపుల్లో కొని తెచ్చుకుంటున్నాం కాస్మొటిక్ వస్తువులు ఇవ్వడంలేదు. పాఠశాల ప్రారంభం నుంచి ఆ వస్తువులను ఇంటిదగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని బయట కొనుక్కుంటున్నాను. కొందరికి డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. త్వరగా ఇస్తే బాగుంటుంది. – బి.వి.లక్ష్మి, 9వ తరగతి, విజయనగరం కేజీబీవీ. -
ఇదేం తీరు?
సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సర్కారుపై ఆర్థిక భారం దండిగానే ఉంటోంది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాల్సిన అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ఖజానాపై పెనుభారం పడుతోంది. నీటి వనరుల మరమ్మతు... ఆధునికీకరణవంటి పనులకు ఆసరాగా నిలుస్తుందని నిర్దేశించిన నీటితీరువా వసూలుపై అధికారులు నిర్లక్ష్యధోరణి చూపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రూ. 30కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. వాటిని వసూలు చేస్తే కాస్తయినా ప్రభుత్వానికి తోడ్పాటునందించినట్టే. సాక్షి, విజయనగరం గంటస్తంభం: నీటి తీరువా బకాయిలు జిల్లాలో పేరుకుపోయాయి. కోట్లాది రూపాయలు రైతులు చెల్లించాల్సి ఉన్నా... వసూలు చేయడానికి అధికారులు చొరవ చూపడంలేదు. అంత మొత్తం ఒకేసారి వసూలు చేయకపోయినా రైతులకు ఇబ్బంది లేకుండా దశల వారీగానైనా వసూలు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వచ్చి తిరిగి నీటి వనరులు బాగు చేసేందుకు ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని మరచి అధికారులు వసూలుపై దృష్టిసారించపోవడం విశేషం. సాగునీటి వనరుల నుంచి నీటిని పంటలకు వినియోగించుకునేందుకు రైతులు ఏటా నీటి తీరువా(పన్ను) చెల్లించాల్సి ఉంది. శాశ్వత సాగునీటి వనరులైన ప్రాజెక్టుల కింద ఏడాదికి ఎకరాకు రూ.200లు, సాధారణ సాగునీటి వనరులైన చెరువులు, కాలువ కింద ఎకరాకు రూ.100లు పన్నుగా చెల్లించాలి. ఖరీఫ్, రబీ ముగిసిన తర్వాత గ్రామ రెవెన్యూ అధికారులు ఈ పన్ను వసూలు చేస్తుంటారు. పేరుకుపోయిన బాకాయిలు.. నీటి తీరువా వసూలుపై అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదు. పంటలు పండని ఏడాది మానేసి పండిన ఏడాది తప్పక వసూలు చేయాల్సి ఉంది. జిల్లాలో గతేడాది ఖరీఫ్‌లో నాలుగు మండలాలు, రబీలో 25మండలాల్లో కరువు ఉండగా మిగతా మండలాల్లో పంటలు పండాయి. అంతకుముందు ఏడాది జిల్లాలో కాస్తా దిగుబడి తగ్గినా పంటలు మాత్రం బాగానే పండాయి. కానీ అధికారులు నీటితీరువా సకా లంలో వసూలుకు వెళ్లక బకాయిలు జిల్లాలో పేరుకుపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.30.74 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా అందులో రూ.28.10కోట్లు గతేడాది వరకు వసూలు కాని బకాయిలే. ఈ ఏడాది రూ.2.63కోట్లు టార్గెట్ ఇచ్చారు. పాత బకాయిలు ఎక్కువగా ఉండడంతో మొత్తం ఒకే ఏడాది వసూలు చేయాల్సి వస్తోంది. వసూలు అంతంతమాత్రమే.. రైతుల నుంచి అంత మొత్తం వసూలు చేయడం కష్టమనే చెప్పాలి. ఇప్పటివరకు ఈ ఏడాదిలో కేవలం రూ.10.81 లక్షలు మాత్రమే వసూలైంది. కోట్లాది రూపాయిలు బకాయిలుండగా వసూలు నామమాత్రంగా ఉండటం ఆలో చించదగ్గ విషయం. జిల్లాలో గతంలో కూడా పెద్దగా వసూలు చేసిన సందర్భం లేదు. నోట్లు రద్దు చేసిన సంవత్స రం మాత్రం జిల్లాలో రూ. 1.80కోట్లు వసూలు జరిగింది. ఆ తర్వాతగానీ, ముందుగానీ రూ.కోటి దాటి లేదు. గతేడాది ఆ మాత్రం కూడా వసూలు కాలేదు. ఈ నేపథ్యంలో ఎంతగా ప్రయత్నించినా మరో రూ.2కోట్లు వరకు వసూలవుతుందని అధికారుల అంచనా. వసూలుపై దృష్టిసారించని అధికారులు.. జిల్లాలో బకాయిలు రూ.కోట్లల్లో ఉన్నా వసూలు విషయం మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. వసూలు చేయాలంటే ముందుగా జమాబందీ జరిగి పన్ను నిర్ణయించాలి. తర్వాత వసూలుకు వీఆర్వోలు వెళ్లాలి. కానీ జమాబందీ ప్రక్రియ జిల్లాలో మొక్కుబడిగా జరుగుతోంది. ఇక వసూలు విషయమే అధికారులు మరిచిపోయా రు. గత ఆర్థిక సంవత్సరంలో నామమాత్రంగా వసూలు చేసిన అధికారులు ఈ ఏడాది పూర్తిగా దృష్టిసారించలేదు. కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడిచినా రూ.30కోట్లు లక్ష్యంలో కేవలం రూ.10.81లక్షలు వసూలు చేశారు. అంటే కేవలం 0.4 శాతం మాత్రమే. నీటి తీరువా వసూలు ఇంత ఘోరంగా ఉన్నా ఒక్క అధికారీ దీనిపై పట్టించుకోవడం లేదు. వాస్తవానికి నీటి తీరువా ద్వారా వచ్చిన ని ధులను ప్రభుత్వం తిరిగి సాగునీటి వనరుల అభివృద్ధికి వెచ్చిస్తుంది. దీని వల్ల రైతులకే లబ్ధి కలుగుతుంది. కానీ అధికారులు వసూలు చేయకపోవడం వల్ల ఈ భారం ప్రభుత్వంపై పడి నీటి వనరుల అధునికీకరణ, మరమ్మతులకు నిధులు వెచ్చించాల్సి వస్తోంది. ఎన్నికల వల్ల ఆలస్యమైంది.. నీటి తీరువా వసూలు రెగ్యులర్‌గా జరుగుతుంది. ప్రతి ఏడాది వందశాతం రైతులు చెల్లించరు. అందువల్ల కొంత బకాయి ఉండడం సహజం. గతేడాది వరకు బకాయిలు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నవి. ఈ ఏడాది వసూలు తక్కువగానే ఉంది. ఎన్నికల నేపథ్యంలో మొదట్లో ఆలస్యమైంది. తర్వాత వీఆర్వోలు, ఇతర రెవెన్యూ అధికారులు ఇతర పనులపై బీజీగా ఉన్నారు. నీటితీరువా వసూలుపై దృష్టిపెట్టాం. సమావేశం ఏర్పాటు చేసి డ్రైవ్ తీసుకునేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. – బి.శ్రీకాంత్, సెక్షన్ పర్యవేక్షకులు, కలెక్టరేట్ -
కలగానే ఇరిగేషన్ సర్కిల్!
సాక్షి, విజయనగరం గంటస్తంభం: విజయనగరంలో ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు గత ప్రభుత్వం కలగా మార్చేసింది. బొబ్బిలి సర్కిల్ కార్యాలయం నుంచి శ్రీకాకుళం వేరు పడిన తరువాత జిల్లాలోని ఇరిగేషన్‌శాఖను ఒకే సర్కిల్ పరిధిలోకి తీసుకురావాలన్న అధికారుల ఆలోచన నెరవేరలేదు. దీనిపై రెండున్నరేళ్ల క్రితమే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించి పంపినా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణం. దీనివల్ల ఇటు అధికారులు, అటు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బొబ్బిలి నుంచి వేరు పడిన శ్రీకాకుళం.. విజయనగరం నీటిపారుదలశాఖలో వింత పరిస్థితి ఉంది. జిల్లాలో ఉన్న నీటిపారుదల శాఖ అంతా ఒక గొడుగు కింద లేదు. మధ్య, చిన్ననీటిపారుదలశాఖకు విజయనగరం, పార్వతీపురం డివిజన్లు ఉన్నాయి. ఇందులో విజయనగరం డివిజన్ విశాఖపట్నం సర్కిల్ పరిధిలో ఉంది. ఈ సర్కిల్లో పనులను విశాఖపట్నం ఎస్ఈ పర్యవేక్షిస్తున్నారు. జిల్లాకు సంబంధించి బొబ్బిలిలో సర్కిల్ కార్యాలయం ఉన్నా విజయనగరం డివిజన్‌ను అందులోకి తీసుకురాలేదు. ఒకప్పుడు పార్వతీపురం డివిజ న్తోపాటు శ్రీకాకుళం జిల్లా అందులో ఉండేది. మూడేళ్ల క్రితం శ్రీకాకుళంలో ప్రత్యేకంగా ఒక ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేసి ఆ జిల్లా ఇరిగేషన్ శాఖను ఆ పరిధిలోకి తీసుకొచ్చారు. అయినా విజయనగరం జిల్లాలో రెండు డివిజన్లను ఒకే సర్కిల్ పరిధిలోకి తీసుకురాలేదు. రెండు సర్కిళ్లతో ఇబ్బందులు.. వాస్తవానికి విజయనగరం చిన్న జిల్లా. బొబ్బిలి డివిజన్లో గతంలో శ్రీకాకుళం మొత్తం ఉండడంతో పని భారం వల్ల విజయనగరం డివి జన్ను విశాఖపట్నంలో కలిపారు. కానీ బొబ్బిలి సర్కిల్ ఒక్క పార్వతీపురానికి పరిమితమైన నేపథ్యంలో విజయనగరంలో కలిపితే భౌగోళికంగా, పరిపాలనాపరంగా ఇబ్బందులు తొలుగుతాయి. ఇలా కాకుండా రెండు వేర్వేరు సర్కిల్లో డివిజన్లు ఉండడం వల్ల అధికారులకు, రైతులకు కొంత ఇబ్బంది ఏర్పడుతోంది. విజయనగరం డివిజన్‌కు చెందిన రైతులు విశాఖపట్నం వెళ్లాల్సి వస్తోంది. అంతేగాకుండా నీటిపారుదల వనరుల అభివృద్ధికి సంబంధించి స్పష్టత లేకపోయింది. రెండు డివిజన్లకు సంబంధించి ఇద్దరు ఈఈలతోపాటు ఇద్దరు ఎస్ఈలను అడిగితేగానీ కుదరట్లేదు. దీనివల్ల ప్రగతి కొంతవరకు కుంటుపడుతోంది. ఈ విషయం గుర్తించిన అప్పటి కలెక్టర్ ఎం. ఎం.నాయక్ రెండు డివిజన్లను ఒక సర్కిల్ పరిధిలోకి తీసుకురావాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సిఫా ర్సు కూడా చేశారు. ఈ నేపథ్యంలో బొబ్బిలిలో ఉన్న ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం విజయనగరానికి మార్చాలని కోరారు. దీనిపై జెడ్పీ సమావేశంలో చర్చ జరిగింది. అప్పుడు విజయనగరంలో సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని తీర్మానించి ప్రభుత్వానికి పంపించారు. ఉన్నతాధికారులు ఆలోచించాల్సిందే... గత ప్రభుత్వంలో పని చేసిన జిల్లాకు చెందిన మంత్రి, ఇతర పాలకులు పట్టించుకోకపోవడం కారణమైతే జెడ్పీ సమావేశంలో చేసిన తీర్మానంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేలా చేయడంలో ఏ ఎమ్మెల్యేగానీ, ఎమ్మెల్సీగానీ ప్రయత్నించలేదు. దీనివల్ల విజయనగరంలో సర్కిల్ ఏర్పాటు, ఒకే గొడుకు కిందకు మొత్తం ఇరిగేషన్ డిపార్టుమెంట్ రాలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున సమస్య గుర్తించి విజయనగరానికి సర్కిల్ ఇస్తారన్న ఆశతో జిల్లా రైతాంగం భావిస్తోంది. -
నిత్యం భయం.. జీవనం దుర్భరం
సాక్షి, గూడెంకొత్తవీధి(పాడేరు): అదో గిరిజన కుగ్రామం. ఆ గ్రామం పేరు మండపల్లి. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల సరిహద్దులో ఉంది. జిల్లా సరిహద్దుతో పాటు గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాలకు కూడా ఇదే సరి హద్దు గ్రామం. సరిహద్దు ప్రాంతంలో అత్యంత మారుమూల ప్రాంతంలో ఉండడంతో మండపల్లి రెండింటికీ చెడ్డ రేవడిలా ఉంది. దశాబ్దాలుగా కనీస అభివృద్ధి నోచుకోకుండా తల్లడిల్లుతోంది ఈ గ్రామం. ఈ గ్రామంలో సుమారు 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈనెల 19న ఈగ్రామం వద్దే పోలీసులు, మావోయిస్టు లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి, గతంలో ఈ గ్రామానికి సమీపంలో మావోయి స్టులు శిక్షణ ఇవ్వడంతో అప్పుడో సారి గ్రామం పేరు ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది. తరచూ మావోయిస్టులు, పోలీసులు గ్రామ పరిసరాల్లో సంచరిస్తుండడంతో గ్రామస్తులు బితుకు బితుకు మంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామాన్ని మావోయిస్టులు, పోలీసులు తప్ప అధికారులు సందర్శించిన దాఖలాలు లేవు. దీంతో కనీస సౌకర్యాలకు నోచుకోక దుర్భర పరిస్థితుల్లో మండపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు బతుకులు వెళ్లదీస్తున్నారు. దారుణంగా రోడ్డు.. మండపల్లి గ్రామం దట్టమైన కొండల మధ్య సుదూర ప్రాంతంలో ఉంది. భౌగోళికంగా ఈ గ్రామాన్ని కొయ్యూరు మండలంలో విలీనం చేశారు. మండపల్లి గ్రామస్తులు కొయ్యూరు మండల కేంద్రానికి వెళ్లాలంటే కాలిబాటే శరణ్యం. కొండలు ఎక్కి, వాగులు దాటి సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే జీకే వీధి మండలానికి రావాలంటే దారుణంగా ఉన్న మార్గంలో 20 కిలోమీటర్లు ప్రయాణించాలి. గతంలో ఈ గ్రామానికి చెందిన గిరిజనులు శ్రమదానంతో రహదారి బాగు చేసుకున్నారు. అయితే గతంలో కురిసిన భారీ వర్షాలకు రహదారి అంతా కొట్టుకుపోయింది. కొండల పైనుంచి వర్షపు నీరు ప్రవాహానికి రహదారి కోతకు గురై రాళ్లమయంగా మారింది. దీంతో ఈ మార్గంలో ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. విద్యుత్, తాగునీరు గగనమే.. మారుమూల గ్రామం కావడంతో పాటు రహదారి సౌకర్యం లేక ఈ గ్రామానికి విద్యుత్, తాగునీరు వంటి సదుపాయాలేవీ దరిచేయడం లేదు. విద్యుత్ సదుపాయం లేనికారణంగా ప్రత్యామ్నాయంగా గతంలో ప్రభుత్వం సోలార్ ప్లాంటు ఏర్పాటు చేశారు. కానీ ఇది సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేక చీకటిలోనే మగ్గుతున్నారు. తాగునీటికి కూడా దయనీయ పరిస్థితి. పొలం గట్ల వద్ద వచ్చే నీరు, వాగుల నుంచి వచ్చే నీటిని తాగునీటికి వినియోగించడంతో రోగాల బారినపడి ప్రతి ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. పింఛన్లు రద్దు.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామానికి చెందిన 15 మంది వరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రావాల్సిన ఫించన్ పూర్తిగా రద్దయింది. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. గత ఐదేళ్లలో గ్రామంలో ఏఒక్క ఉపాధి పనికూడా నిర్వహిం చకపోవడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, రహదారి లేకపోవడం వల్లే ఏ ఒక్క అధికారి కూడా తమ గ్రామానికి రావడం లేదని, కొయ్యూరు మండలానికి వెళ్లి అధికారులకు తమసమస్య చెప్పుకున్నా కనీసం పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రామ సచివాలయాల ఏర్పాటుతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్న నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించడంతో ఈ సారైనా తమ గ్రామాలు బాగుపడతాయన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపాలెం, కొమ్ము సంపంగి, కోతిగొంది, వెదురులంక, పుత్తకోట తదితర గ్రామాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. -
జంఝాటం !
ఆ ప్రాంతంలో సాగునీటి సమస్య తీర్చడానికి ప్రాజెక్టు ఉంది. దాని ద్వారా నీరు తరలించడానికి కాలువలున్నాయి. కానీ నిర్వహణే లేదు. కాలువల్లో గుర్రపుడెక్క... పిచ్చిమొక్కలు... పెరిగిపోయాయి. చుక్కనీరైనా సాగడానికి అనువుగా లేదు. మరోచోట కాలువకు అడ్డంగా పెద్దరాయి పడింది. దానిని తొలగించకపోవడంవల్ల నీరు రావట్లేదు. దీనివల్ల వేలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదు. దీనంతటికీ కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యం... అధికారుల్లో చిత్తశుద్ధి లోపం. ఇదీ జంఝావతి రిజర్వాయర్ పరిధిలోని కాలువల దుస్థితి. వీరి నిర్వాకం వల్ల పార్వతీపురం సబ్‌డివిజన్ పరిధిలోని మూడు మండలాలకు సాగునీరు అందక అవస్థలు పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుంది మన రైతన్నల పరిస్థితి. పంటల సాగుకు అవసరమైన ప్రాజెక్టులున్నాయి. నీటి వనరులున్నాయి. కాని అధికారుల పర్యవేక్షణ లోపంతో సాగునీరు సకాలంలో అందక కరువు పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తోంది. పార్వతీపురం డివిజన్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన బడుగు రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. జంఝావతి ఎగువ, దిగువ కాలువల అభివృద్ధికి రూ.28.44 కోట్లు నిధులున్నా అధికారులు సకాలంలో పూడికలు తీయకపోవడం, ఎస్టిమేట్లు వేయడంలో నిబద్ధత లోపించడంవల్ల రైతన్నలు ఈ ఏడాది ఖరీఫ్‌కు దూరమై కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దిగువ కాలువను వేధిస్తున్న అడ్డంకులు.. జంఝావతి దిగువ కాలువ పొడవు 26.09 కిలోమీటర్లు. ఇది జంఝావతి రబ్బరు డ్యాం నుంచి సీతానగరం మండలం నిడగల్లు, ఇప్పలవలస వరకు ఉంది. కాలువలో గుర్రపు డెక్క ఆకు పెరగడం, కాలువలో కొన్ని ప్రాంతాల్లో రాతి బండలు అడ్డంగా ఉండటంతో కాలువ ద్వారా రైతులకు అవసరమైన సాగునీరు రావడంలేదు. అలాగే సీతానగరం మండలం నిడగల్లు వద్ద పోతినాయుడు చెరువు వద్ద బాక్స్ కల్వర్టు నిర్మించాల్సి ఉంది. నర్సిపురం వద్ద ఒక కల్వర్టు, నర్సిపురం కనుమల చెరువు వద్ద ఒక సూపర్ పాసేజ్‌ను నిర్మించాల్సి ఉంది. మృత్యుంజయవలస వద్ద ఒక కల్వర్టు నిర్మించాల్సి ఉంది. ఈ కల్వర్టులకు నిధులు కూడా మంజూరై ఉన్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో కాలువకు అడ్డుగా ఉన్న రాయిని తొలగించడానికి, కల్వర్టులు నిర్మాణానికి, అడ్డాపుశిలనుంచి సీతానగరం మండలంలోని తామర చెరువు వరకూ కాలువ అభివృద్ధి చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చి 2017–18 ఖరీఫ్ సీజనులో నిర్దేశించిన భూములకు సాగునీరందించడానికి సిద్ధం చేయాలని మార్గదర్శకాలున్నా పనులు జరగడం లేదు. కాని కాంట్రాక్టర్ సకాలంలో వీటిని నిర్మించడంలేదు. గుర్రపు డెక్క ఆకును తొలగిస్తే చాలు నీరు దిగువకు వెళుతుంది. కాని అధికారులు నిధులు వినియోగించకుండా, పనులు చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడంతో రైతన్నలు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పడకేసిన ఎగువకాలువ.. జంఝవతి ఎగువ కాలువ జంఝావతి రబ్బర్ డ్యాం నుంచి జమదాల గ్రామం వరకు 27.29 కిలోమీటర్ల పొడవు ఉంది. నెల్లూరుకు చెందిన ఆర్‌కెఎన్ ప్రాజెక్ట్సుకు చెందిన కాంట్రాక్టరు ఈ కాలువ పనుల టెండర్ దక్కించుకున్నారు. కొమరాడ మండలం డంగభద్ర వద్ద రాయిపణుకు తగిలింది. 1300 నుంచి 1700 మీటర్ల మేర రాళ్ళను పేల్చి కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కాంట్రాక్టర్ రూ.6 కోట్ల వరకు ఖర్చు పెట్టగా అప్పటి ప్రభుత్వం రూ.3 కోట్ల వరకు బిల్లులు చెల్లించలేదు. దీనివల్ల పనులు ఆగిపోయాయి. నీరున్నా... అందని వైనం.. పార్వతీపురం మండలంలోని ఎమ్మార్‌నగర్, కృష్ణపల్లి, మరిపి, ఎల్.ఎన్.పురం, చినబొండపల్లి, వెంకంపేట, పెదబొండపల్లి, లచ్చిరాజుపేట, తాళ్ళబురిడి, జమదాల గ్రామాలకు అందాల్సిన సాగు నీరు అందకుండా పోయింది. ఒక వైపు అధికారుల పర్యవేక్షణ లోపం, మరో వైపు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా రైతన్నలకు కళ్ళముందే సాగునీరు ఉన్నా అది సాగుకు అందకుండా పోతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి నిధులు విడుదల చేస్తే కేవలం వారం రోజుల్లోనే పనులు పూర్తి చేసి పంట చేలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. -
దయనీయం.. కళావిహీనం!
తలమానికంగా నిలవాల్సిన ప్రాజెక్టు కళావిహీనమైంది.. పది వేల ఎకరాల్లో రూ.100 కోట్లు వెచ్చించి దీనిని నిర్మించారు.. తొలి దశలో 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించారు.. రెండో దశ పూర్తయితే మరో 12,500 ఎకరాలు సస్యశ్యామలం కావాల్సివుంది. కానీ మడ్డువలస ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలింది. గత ప్రభుత్వ వైఫల్యం... అధికారుల నిర్లక్ష్యం ప్రాజెక్టును పీడిస్తున్నాయి. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలోనే రెండో దశకు ఆమోదం పలికినా.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అరకొర నిధులు మంజూరు చేయడంతో కార్యరూపం దాల్చలేదు. కనీసం ఉన్న ప్రాజెక్టు నిర్వహణ సైతం సరిగా లేకపోవడంతో పథకం పరిస్థితి దయనీయంగా మిగిలింది. మడ్డువలస ప్రాజెక్టు స్థితిగతులపై సాక్షి ఫోకస్.. వంగర: నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మిగిలిన మడ్డువలస ప్రాజెక్టు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ముఖద్వారం నుంచి హెడ్ భాగం వరకు అన్నీ సమస్యలే. టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన ముఖద్వారం నిర్మాణం అర్ధంతరంగా వదిలేశారు. అక్కడ నుంచి వెళ్లే రాళ్లదారి అధ్వానంగా తయారైంది. డైక్ భాగమంతా బురదమయంగా ఉంది. ఈ ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మించాల్సి ఉండగా ఎటువంటి చర్యలు లేక ఈ పరిస్థితి దాపరించింది. పలు చోట్ల రాతి రివిట్మెంట్ దిగజారినప్పటికీ మెరుగుపరిచేందుకు అధికారుల చర్యలు శూన్యం. ప్రాజెక్టు జనరేటర్లు, లైట్ల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ నేలపై ప్రమాదకరంగా ఉంది. వైర్లపై అడుగుపడితే ప్రాణాపాయమే. నీటినిల్వను కొలిచే ప్రదేశంలో ఉన్న దిమ్మలు, బోర్డులు శిథిలమయ్యాయి. బకేట్ పోర్షన్‌కు వెళ్లే ప్రదేశంలో పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వ పాపం.. చంద్రబాబు హయాంలో (2014–2019) మూడుసార్లు రూ.9 కోట్లు మంజూరు కాగా ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన మూడు నెలలకే రూ.9.50 కోట్లు మంజూరు చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో దీనినిబట్టి అర్థమవుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రెండో దశలో భాగంగా ఆధునికీకరణ పనుల ఫైలుకు ఆమోదం పలికారు. అనంతరం 2011లో సీఎం రోశయ్య రూ.47 కోట్లు మంజూరు చేశారు. ఆ తర్వాత ఒకసారి రూ.11 కోట్లు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మ రో రూ.14 కోట్లు కేటాయించారు. చంద్రబాబు సీఎం అయ్యాక నిధుల కేటాయింపు లేక పరిస్థితి మరింత దిగజారింది. ప్రస్తుతం రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆధునీకరణ నిధుల్లో భాగంగా ప్రాజెక్టు హెడ్ భాగంలో అత్యవసర గేట్లు, గేట్లు, హెడ్ స్లూయీస్‌ల మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా ఆ ఛాయలే లేవు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిర్వాసితులుగా మిగిలిన ఏడు గ్రామాల వారికి వైఎస్సార్ రూ.27 కోట్లు మంజూరు చేసి వారికి అండగా నిలిచారు. అనంతరం ఈ ప్రాజెక్టుకు జనరేటర్లు, డీజిల్ కొనుగోలు, పిచ్చిమొక్కలు తొలగింపునకు ప్రతి ఏటా వేలల్లో మాత్రమే మంజూరు చేశారు తప్ప శాశ్వత పరిష్కారానికి నోచుకోలేదు. అత్యంత ప్రధాన సమస్యలు ఇవీ.. చిన్నపాటి రైస్‌మిల్లు నిర్మిస్తే త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఉంటుంది. జిల్లాలో 9 మండలాల్లో 37,285 ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టుకు మాత్రం త్రీఫేజ్ విద్యుత్ సరఫరా లేదు. ప్రతీ రోజు నాలుగు గంటలు మాత్రమే త్రీఫేజ్, మిగతా సమయం 2 ఫేజ్ మాత్రమే ఉంటుంది. వరదలు అధికంగా ఉండేటప్పుడు గేట్లు ఎత్తాలంటే త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా అవసరం. ప్రత్యామ్నాయంగా రెండు జనరేటర్లు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి పాడై మరమ్మతుల కోసం ఎదురుచూస్తోంది. ఉన్న ఒకటి పాడైతే వరదల సమయంలో పరిస్థితి ఏమిటిః ఇటువంటి ప్రధాన సమస్యపై దృష్టి పెట్టకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ప్రజలు, రైతులు అధికారులను హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టు వద్ద నైట్‌వాచ్‌మెన్, లస్కర్లు లేకపోవడంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వచ్చే పర్యాటకులు, విద్యార్థులను అదుపు చేసే నాథులు కరువవుతున్నారు. సిబ్బంది పహరా లేకపోవడంతో ప్రాజెక్టు ఆవరణలో బకెట్ పోర్షన్లో దిగి గడిచిన పదేళ్లలో 8 మంది విద్యార్థులు, యువకులు మృత్యువాత పడ్డారు. మరమ్మతులు కరువు.. ప్రధానంగా ప్రాజెక్టు బకేట్ పోర్షన్లో ఉన్న 11 గేట్లలో మూడు గేట్లు పాడయ్యాయి. టీడీపీ హయాంలో రూ.13 లక్షల నీరు–చెట్టు నిధులతో గేట్లను తూతూమంత్రంగా సరిచేసి చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత గేట్లకు మళ్లీ లీకులు ప్రారంభమయ్యాయి. గేట్లను ఆనుకొని ఉన్న 24 రోప్‌లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో సాగునీరు వృథా అవుతోంది. ఇది మినహా ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు. నదిని ఆనుకొని రివిట్మెంట్, రక్షణ గోడ పూర్తిగా శిథిలమైనప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. వరదలు సమయంలో ఇవి ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయాల్సిన అత్యవసర గేట్ల మెటీరియల్ ఇక్కడే వృథాగా పడి ఉంది. పర్యాటక శోభకు నోచుకోని మడ్డువలస... మడ్డువలస ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని గత పాలకులు హామీ ఇచ్చినా ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. పర్యాటక కేంద్రం కోసం కేటాయించిన ఐదెకరాల స్థలం కూడా కళావిహీనంగా ఉంది. పార్కు నిర్మించి, బోటు షికారు ఏర్పాటు చేస్తే పర్యాటకులు తాకిడి అధికమవుతుంది. అదే విధంగా ఈ ప్రాంతానికి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న త్రివేణి సంగమం, పవిత్ర సంగమేశ్వరస్వామి దేవాలయాలను వీక్షించవచ్చు. తద్వారా అభివృద్ధి చెందవచ్చు. అధికారులు రారు.. సిబ్బంది లేరు.. వర్షాలు, వరదల సమయంలో మినహా ప్రాజెక్టు వద్ద అధికారులు కనిపించరు. ఇంజినీర్లు రా జాంలోని కార్యాలయంలో ముఖం చూపించి వెళ్లిపోతుంటారు. ఇక్కడ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. మడ్డువలస ప్రాజెక్టుకు అధి కారులు, లస్కర్లు, ఎలక్ట్రీషియన్లు, వాచ్మెన్ మొత్తం 51 మంది ఉండాలి. ప్రస్తుతం ఒక ఈఈ, ఒక డీఈ, నలుగురు జేఈలు, ఒక లస్కరు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఒక జేఈ, లస్కర్లు 27మంది, ఎలక్ట్రీషియన్లు ఇద్దరు, ఫిట్టర్లు ముగ్గురు, వాచ్మెన్లు ముగ్గురు, హెల్ప ర్లు ఎనిమిది మంది ఇంకా అవసరం ఉంది. ప్రాజెక్టు హెడ్ వద్ద ఒక లస్కర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆశలు ఫలిస్తాయని రైతుల ఆకాంక్ష.. గత ప్రభుత్వాలు మడ్డువలసను పట్టించుకోకపోవడంతో అభివృద్ధి జరగలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాజెక్టుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. దీంతో రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో మడ్డువలస అభివృద్ధికి సీఎం బాటలు వేస్తారని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదనలు పంపించాం.. ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన నిధులు, సిబ్బంది కొరత, గేట్లు మరమ్మతులు వంటి సమస్యలపై ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి జనరేటర్ల మరమ్మతులు, డీజిల్ కొనుగోళ్లు మినహా నిర్వహణ (మెయింటినెన్స్) కోసం నిధులు మంజూరు అవడంలేదు. ప్రస్తుతం పంపించిన ప్రతిపాదనల మేరకు నిధులు మంజూరైతే సమస్యలు పరిష్కరిస్తాం. –నర్మదా పట్నాయక్, డీఈ, మడ్డువలస అంధకారంలో ప్రాజెక్టు.. మడ్డువలస ప్రాజెక్టు రాత్రి సమయంలో అంధకారంలో ఉంటుంది. ఇక్కడ 34 విద్యు త్ స్తంభాలున్నాయి. వీటికి అమర్చిన ఎల్ఈడీ బల్బులు ఏడాది క్రితమే పాడవ్వడంతో ప్రాజెక్టు అంధకారంలో ఉంది. వరదలు, తుఫానులు సమయమిది. ఇటువంటి సమయంలో ప్రాజెక్టు వద్ద అంధకారంలో ఉండడంతో రాత్రి సమయంలో రీడింగ్ బోర్డులు కనిపించక వరదలను గుర్తించలేని పరిస్థితి. ఇక్కడ కొన్ని విద్యుత్ స్తంభాలు బల్బులు లేకుండా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. -
బాబు మాటలన్నీ నీటి మూటలే: చేనేత కార్మికులు
చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితికి పొంతనే లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో కుప్పలు తెప్పలుగా హామీల వర్షం కురిపించి.. అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తకపోవడంతో చేనేతల బతుకులు అతుకు.. మెతుకు కరువై దుర్భరంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో చేనేత కార్మికులు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మోసాన్ని తలుచుకుని నిన్ను నమ్మం బాబూ అంటున్నారు. సాక్షి, ప్రొద్దుటూరు : జిల్లాలో సుమారు 30 వేల కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాం నుంచి ఆనవాయితీగా ఎక్కువ శాతం మంది టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం చేనేత కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. స్వయంగా 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలు సైతం ప్రభుత్వం అమలు చేయలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2014 మే 4న ప్రొద్దుటూరు పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్లో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. చేనేత ఐక్యవేదిక కన్వీనర్ అవ్వారు ప్రసాద్ చేనేత కార్మికులకు వర్క్‌షెడ్‌తో కూడిన ఇళ్లు మంజూరు చేయాలని కోరగా అందుకు ఆయన అంగీకారం తెలిపారు. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అపెరల్ పార్కు కోసం కేటాయించిన 76.16 ఎకరాల స్థలాన్ని బదలాయించి మున్సిపల్ అధికారులు ఇళ్ల నిర్మాణానికి కేటాయించారు. చేనేత కార్మికుల కోసం కేటాయించిన స్థలాన్ని ఇతరులకు ఎలా ఇస్తారని నేతన్నలు ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ హామీలు గుర్తున్నాయా బాబూ..! చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు : ఎంతో మంది చేనేతలు గుర్తింపు కార్డులు లేక అవస్థలు పడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 22,142 మంది చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేశారు. చేనేత కార్మికుల బ్యాంకు రుణాలు మాఫీ : అసలు రుణాలే ఇవ్వలేదు. సొసైటీలకు మాత్రమే ఇచ్చారు. లబ్ధి పొందింది సొసైటీ నిర్వాహకులే. చేనేత కార్మికుల పిల్లలను చదివించేందుకు ప్రత్యేక ప్యాకేజీ, ఉచిత వైద్యం : అసలు అమలు కాలేదు. రూ.లక్షా 50వేలతో ఉచితంగా ఇల్లు, మగ్గం షెడ్డు ఏర్పాటు : చేనేత కార్మికులకు ప్రత్యేకంగా ఇళ్ల నిర్మాణం జరగలేదు. అసలు వర్క్‌షెడ్‌తో కూడిన ఇళ్లు ఏర్పాటు చేయలేదు. ఒక్కొక్క చేనేత కుటుంబానికి రూ.లక్ష మేరకు సంస్థాగత రుణం : అమలుకు నోచుకోలేదు. చేనేత కార్మికులకు తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు : రుణాల ఊసే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నేత బజార్లు : జిల్లాలో అమలు కాలేదు. ఉచిత ఆరోగ్య బీమా : గతంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఐసీఐసీఐ లాంబార్డు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సహకారంతో 2005 నుంచి అమలు చేసిన ఆరోగ్య పథకం 2014 సెప్టెంబర్ 30తో ముగిసింది. తిరిగి ఈ పథకాన్ని అమలు చేయలేదు. చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి ముడిసరుకులను సరఫరా, మార్కెటింగ్ సౌకర్యాలను జిల్లా, డివిజన్ కేంద్రాల్లో అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాం. : ఈ విధానం అమలుకు నోచుకోలేదు. జిల్లాకు ఒక చేనేత పార్కును ఏర్పాటు చేసి కార్మికులకు శిక్షణ, ఉపాధి : చేనేత పార్కు ఏర్పాటు చేయకపోగా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ప్రొద్దుటూరులోని అపెరల్ పార్కు, మైలవరంలోని టెక్స్టైల్ పార్కు ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదు. సగం ధరకే జనతా వస్తాలు: జనతా వస్త్రాల పథకం పునరుద్ధరణ : గత ఐదేళ్లలో ఈ పథకం ఊసే లేదు. మగ్గాలకు ఉచిత విద్యుత్ : నేటికీ అమలుకు నోచుకోలేదు. విద్యుత్ చార్జీల భారంతో చేనేతలు అవస్థలు పడుతున్నారు. చేనేత ఉత్పత్తులపై ఆఫ్ సీజన్ సమయాల్లో రుణ సదుపాయం కల్పించి గిట్టుబాటు ధర వచ్చేదాకా వాటిని నిల్వ ఉంచుకునే అవకాశం కల్పించడం. : ఈ పథకం అమలుకు నోచుకోలేదు. చేనేత పరిశ్రమల ఆధునికీకరణకు ప్రత్యేక విభాగం : ఏర్పాటు కాలేదు. -
15 రోజులే మిగిలింది ..
సాక్షి,నవాబుపేట: మరుగదొడ్లు వంద శాతం పూర్తి చేయాలని టార్గెట్ విధించినా.. గ్రామాల్లో ఇంకా నత్త నడకన వాటి నిర్మాణం సాగుతుంది. దీంతో మార్చి ఆఖరుకు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినా.. అది ఆచరణలో లేక పోవటం శోచనీయం. కేవలం రెండు, మూడు గ్రామాలు మినహయిస్తే మిగతా వాటిలో చాలా ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఇప్పటికీ మండలంలో అన్ని గ్రామాల్లో కలిపి725 మరుగుదొడ్లు ప్రారంభమే కాలేదు. కాగా అమ్మపూర్, కొండాపూర్, ఇప్పటూర్, పోమాల్, కొల్లూర్ గ్రామాల్లో పెద్ద ఎత్తున మరుగుదొడ్లు ని ర్మించాల్సి ఉంది. కాగా లబ్ధిదారులు మరుగదొడ్ల నిర్మాణానికి సంబంధించి మార్కవుట్ ఇవ్వడంలో నిర్లక్ష్యం ఏర్పడింది. దీంతో మార్చి టార్గెట్ పూర్తి కావటం కష్టంగానే మారింది. కాగా మొత్తం 3432 మరుగుదొడ్లు మార్చిలో పూర్తిచేయాలని ఉండగా 1350 పూర్తయ్యాయి. నవాబుపేటలో 307, లోకిరేవులో 235, కూచూర్లో230, ఖానాపూర్‌లో 134, కాకర్జాలలో 250, హజిలాపూర్‌లో 188, చౌడూర్‌లో 122, గురుకుంటలో 188, కాకర్లపహడ్లో 128, కారుకొండలో 184, తీగలపల్లిలో130 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణంలో మహిళా మేస్త్రీలు.. మండలంలో ప్రత్యేకంగా 25 మంది మహిళా మేస్త్రీలకు శిక్షణ ఇచ్చి లక్ష్యాన్ని పూర్తి చేసే కార్యక్రమం చేపట్టారు. మహిళలకు ప్రత్యేకంగా 5 రోజులు శిక్షణ ఇచ్చి, మరుగుదొడ్లు నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
డెత్ ట్రాక్స్!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని రైలుపట్టాలు మరణమృదంగం మోగిస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఓచోట రైల్వేట్రాక్స్ రక్తసిక్తమవుతున్నాయి. జనాల నిర్లక్ష్యం కొంత.. అధికారుల వైఫల్యం మరికొంత.. వెరసి విలువైన ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. ఏటా వందలాది మంది పట్టాలు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. రైల్వే పట్టాలకు ఇరువైపులా ఉండే కాలనీ, బస్తీవాసులు నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతూ మృత్యువాతపడుతున్నారు. త్వరగా వెళ్లొచ్చనే ఒకే ఒక్క కారణంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫెన్సింగ్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఉన్నచోట్ల సైతం పట్టాల మీద నుంచే వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక కాలకృత్యాలు తీర్చుకునేందుకు పట్టాలపైకి వెళ్లినవారు సైతం రైళ్లు ఢీకొని ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది కాలంలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే పోలీసుల పరిధిలో 409 మంది మృత్యువాత పడ్డారు. కొన్నిచోట్ల ఫుట్ఓవర్ బ్రిడ్జీలు లేకపోవడం.. మరికొన్నిచోట్ల ప్రహరీ గోడలు, ఫెన్సింగ్ లేకపోవడం వల్ల జనం పట్టాలు దాటేస్తున్నారు. కొన్నిచోట్ల ఫెన్సింగ్ ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా ట్రాక్స్ దాటేసి వెళ్లిపోతున్నారు. ఇలాంటి చోట్ల అధికారుల నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరోవైపు రైలు కింద పడి ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాదిలో ఇలా 117 మంది బలవంతంగా తనువు చాలించారు. మొత్తమ్మీద హైదరాబాద్‌లో 13 చోట్ల అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు రైల్వే పోలీసుల పరిశీలనలో వెల్లడైంది. ఈ డెత్ ట్రాక్స్‌ను బుధవారం ‘సాక్షి’క్షేత్రస్థాయిలో పరిశీలించింది. వివరాలివీ... భరత్‌నగర్ పరిధిలో అధికం... రైలు పట్టాలపైకి వెళ్లడం ప్రమాదమని తెలిసి కూడా జనం సాహసం చేస్తున్నారు. రైలు రావడంలేదు కదా.. వచ్చేలోపు దాటేయొచ్చులే అనుకుంటూ విలువైన ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు. భరత్‌నగర్ రైల్వే ఇన్స్పెక్టర్ పరిధిలోని నేచర్‌క్యూర్–లింగంపల్లి మార్గంలో అధిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2017లో ఈ మార్గంలో 180 మంది, 2018లో 150 మంది వరకు చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ఫతేనగర్ రైల్వేస్టేషన్, భరత్‌నగర్, బోరబండ, హైటెక్ సిటీ, హఫీజ్‌పేట రైల్వేస్టేషన్ల వద్ద కూడా పట్టాలు దాటే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ స్టేషన్లన్నింటిలోనూ ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఉన్నప్పటికీ, 90 శాతం మంది వాటిని పట్టించుకోవడంలేదు. ఇక సనత్‌నగర్ రైల్వేస్టేషన్లో దూర ప్రాంతం నుంచి వచ్చే రైళ్లు ఆగుతుంటాయి. దీంతో చాలామంది ప్రయాణికులు ఇక్కడే రైలు దిగి పట్టాల మీదుగా నడుచుకుంటూ వెళ్లి భరత్‌నగర్ ఫ్లైఓవర్ వద్ద బస్సులు, ఆటోలు ఎక్కుతుంటారు. ఇలా వెళ్లేవారు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఫతేనగర్ రైల్వేస్టేషన్ వద్ద రైల్వే పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అక్కడ పట్టాలు దాటుతున్న 60 మందిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపించారు. పట్టాలు దాటడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించి, వారికి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. కాలకృత్యాల కోసం వెళ్లి... సికింద్రాబాద్‌లోని జేమ్స్ స్ట్రీట్, సంజీవయ్య పార్కు ట్రాక్‌లోనూ పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ నుంచి సంజీవయ్య పార్కు మధ్య ఉన్న ట్రాక్స్ పైకి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ప్రమాదాలబారిన పడుతున్నారు. సంజీవయ్య పార్కు స్టేషన్ దాటిన తర్వాత పీవీ ఘాట్ ఎదురుగా నెక్లెస్‌రోడ్ నుంచి పట్టాలు దాటితే ప్రకాశ్‌నగర్‌లోకి వెళతారు. ఇక్కడ పట్టాలు దాటకుండా నిర్మించిన ప్రహరీ కూలిపోయింది. దీంతో చాలామంది అక్కడ పట్టాలు దాటి వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. మౌలాలీ–లాలాగూడ రైల్వేస్టేషన్ల మధ్యలో ఉన్న లాలాపేట్ డైరీఫామ్ వద్ద ఉన్న ట్రాక్ తరచుగా రక్తమోడుతోంది. ప్రతి నెలా కనీసం ఒకటి, రెండు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ రైల్వే అధికారులు ఏర్పాటుచేసిన ఫెన్సింగ్ తొలగించి మరీ వెళుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గేటు వేసినా మా దారి మాదే... రాజ్‌భవన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఎమ్మెస్ మక్తా వాసులకు రైల్వేలైన్ క్రాసింగ్ కారణంగా తిప్పలు తప్పడంలేదు. ప్రధాన రహదారి నుంచి మక్తాకు వెళ్లాలంటే రైల్వే ట్రాక్ దాటాల్సిందే. నాంపల్లి నుంచి వచ్చే రైళ్లన్నీ ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. దీంతో రైలు రావడానికి పది నిమిషాల ముందు గేట్లు వేస్తారు. కానీ జనం ఆ గేటు కింద నుంచి వెళ్లిపోతుంటారు. తమ వాహనాలను సైతం గేటు కింద నుంచే తీసుకెళ్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ ఆర్ఓబీ నిర్మించాలని ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ, అధికారులకు పట్టడంలేదు. ప్రమాదమని తెలిసినా... మల్కాజ్గిరి, దయానంద్‌నగర్, సఫిల్‌గూడ రైల్వేస్టేషన్ల మీదుగా ప్రతి రోజూ వందల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ ప్రాంతాల్లో ఉదయం ఆఫీసులకు వెళ్లేవారు, విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్లే తల్లిదండ్రులు సైతం ప్రమాదమని తెలిసీ పట్టాలు దాటుకుంటూ వెళుతున్నారు. మల్కాజ్గిరి రైల్వేస్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉన్నా.. ఎక్కువ మంది ప్రయాణికులు పట్టాలు దాటి వెళ్లడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక చందానగర్ ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ సమీపంలో జనం పట్టాలు దాటడం నిత్యకృత్యంగా కనిపిస్తుంది. పాపిరెడ్డి కాలనీ, సురభి కాలనీ, రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ నుంచి పట్టాలు దాటి హుడా కాలనీకి చేరుకుంటున్నారు. ఆర్వోబీ నుంచి బైక్‌లు, కార్లు మాత్రమే వెళ్తున్నాయి. ఆర్వోబీ నిండా డ్రైనేజీ నీరు చేరడంతో నడిచి వెళ్లలేని పరిస్థితి నెలకొనడం కూడా జనం పట్టాల మీద నుంచి వెళ్లడానికి మరో కారణం. సెల్ఫీల కోసం ప్రాణాలు పణంగా... మలక్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలో ఏటా సుమారు 50 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. ట్రాక్‌పై నడిచే ప్రయాణికులు రైళ్ల రాకను గమనించలేక ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు తాగిన మైకంలో ట్రాక్ మీదకు వచ్చి పడిపోతున్నారు. దీంతో రైళ్లు ఢీకొని చనిపోతున్నారు. ఇక సెల్ఫీల పిచ్చితో విద్యార్థులు పట్టాలు ఎక్కుతున్నారు. రైలు వచ్చే ముందు సెల్ఫీ తీసుకోవాలనే ఆరాటంతో ప్రాణాలనే ఫణంగా పెడుతున్నారు. ఇక్కడ ప్రయాణికులు ట్రాక్‌పై నడవకుండా, ఫుట్ ఓవర్‌బ్రిడ్జ్ నిర్మించాలని చాలా ఏళ్ల క్రితమే ప్రతిపాదించినప్పటికీ, ఆచరణకు మాత్రం నోచుకోవడంలేదు. ఈ 13 చోట్ల ప్రమాదకరంగా పట్టాలు... ►లాలాపేట విజయ డెయిరీ దగ్గర ► మౌలాలీ సమీపంలోని నోమా ఫంక్షన్ హాల్ సమీపంలో... ►చర్లపల్లి ట్రాక్ (ఘట్కేసర్) మాధవరెడ్డి బ్రిడ్జి దగ్గర ► ఘట్కేసర్ సమీపంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ►మల్కాజిగిరి రైల్వేస్టేషన్–సఫిల్‌గూడ స్టేషన్ మార్గంలో... ► సంజీవయ్యపార్కు స్టేషన్ సమీపంలోని జీహెచ్ఎంసీ డంప్ దగ్గర ►గుండ్ల పోచంపల్లి, డబీర్‌పురా (మేడ్చల్), మనోహరాబాద్ మార్గం ►మలక్‌పేట్ రైల్వేస్టేషన్, విద్యానగర్, జామై ఉస్మానియా స్టేషన్ల సమీపంలో... ► బోరబండ ఎంఎంటీఎస్ స్టేషన్‌కు 200 అడుగుల దూరంలో ఉన్న టర్నింగ్ వద్ద ►హైటెక్‌సిటీ–బోరబండ మార్గంలో... ►ఫతేనగర్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జీ కింద... ►నేచర్‌క్యూర్ హాస్పిటల్–ఫతేనగర్ల మధ్య ► హైటెక్‌సిటీ–మాదాపూర్ మధ్య ట్రాక్‌లో... ప్రమాదాల నివారణకు ఏమి చేయాలి? ►అవసరమైన చోట ట్రాక్‌కు రెండు వైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. ►సైడ్‌వాల్స్ కట్టించాలి ►ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఏర్పాటు చేయాలి. ►ఆర్పీఎఫ్, జీఆర్పీ బృందాలు నిరంతరం నిఘా కొనసాగించాలి. ►డెత్ట్రాక్స్ను గుర్తించి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి. మలక్‌పేటలో సెక్యూరిటీ పెంచాలి మలక్‌పేట రైల్వేస్టేషన్లో సెక్యూరిటీ పెంచాలి. ట్రాక్స్‌పై నడవకుండా పూర్తిగా మూసివేసి, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలి. ఇక్కడ తాగుబోతుల బెడద కూడా ఎక్కువ. వారిని అడ్డుకోవాలి. – రవికుమార్, మలక్‌పేట స్వీయ భద్రత పాటించాలి ప్రధాన రైల్వేస్టేషన్లలో వృద్ధులు, లగేజీ ఉన్నవారు ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్ మీదకు వెళ్లడానికి ఎస్కలేటర్స్, లిఫ్ట్ సదుపా యాలను కల్పించాలి. పట్టాలు దాటి వెళ్లకూడ దని ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడంలేదు. ఈ విషయంలో వారు స్వీయ భద్రత పాటించాలి. – నూర్, సబర్బన్ బస్ అండ్ ట్రావెలర్స్ అసోసియేషన్ మల్కాజ్గిరి ప్రధాన కార్యదర్శి ఆర్వోబీలో మురికినీరు తొలగించాలి చందానగర్ రైల్వేస్టేషన్‌లోని ఆర్వోబీలో మోకాళ్లలోతు ఉన్న మురికి నీటిలో నడవలేని పరిస్థితి ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు మురుగునీరు ఆర్వోబీలోకి రాకుండా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జీ నిర్మిస్తే పాపిరెడ్డి కాలనీ వైపు నుంచి వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. – మల్లేష్, పాపిరెడ్డి కాలనీ -
నిర్లక్ష్యమే..
నగరంలో అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలకు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపటమే కారణంగా గుర్తించారు. అయితే, రోడ్డు ప్రమాదాలు, వాటిలో మరణిస్తున్న వారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఏటా కనీసం 200 నుంచి 300 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు 247 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 254 మంది కన్నుమూశారు. కొన్ని ప్రమాదాల్లో ఒకరు.. మరికొన్నింటిలో అంతకంటే ఎక్కువ మంది మరణిస్తుండడంతో ఫాటిల్ యాక్సిడెంట్స్ కంటే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ ప్రమాదాలను తగ్గించాలని ట్రాఫిక్ పోలీసులు ప్రమాద కారణాలపై అధ్యయనం చేశారు. వీటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుని మృతుల సంఖ్య, ఈ తరహా యాక్సిడెంట్స్‌ను తగ్గించాలని నిర్ణయించారు. సాక్షి, సిటీబ్యూరో: రోగం ఎక్కడ ఉంటే మందూ అక్కడే వేయాలి... రోడ్డు ప్రమాదాలు, మరణాల నియంత్రణకు సిటీ ట్రాఫిక్ పోలీసులు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాలకు కారణాలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నగరంలో అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలకు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపటమే కారణంగా గుర్తించారు. ఇలా మొత్తం తొమ్మిది కారణాలను గుర్తించిన అధికారులు వీటిపై దృష్టి సారించి నిరోధక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రమాదాలు తగ్గుతున్నా... నగరంలో రోడ్డు ప్రమాదాలు, వాటిలో మరణిస్తున్న వారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఏటా కనీసం 200 నుంచి 300 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. ఈ ఏడాది ఆక్టోబర్ వరకు 247 రోడ్డు ప్రమాదాలు (మృతులు నమోదైనవి) జరగ్గా 254 మంది కన్నుమూశారు. కొన్ని ప్రమాదాల్లో ఒకరు... మరికొన్నింటిలో అంతకంటే ఎక్కువ మంది మరణిస్తుండటంతో ఫాటిల్ యాక్సిడెంట్స్ కంటే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీనిని గణనీయంగా తగ్గించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఇందుకుగాను ప్రమాద కారణాలపై అధ్యయనం చేశారు. వీటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుని మృతుల సంఖ్య, ఈ తరహా యాక్సిడెంట్స్‌ను తగ్గించాలని నిర్ణయించారు. పోలీసులు అందించిన డేటాతో... ఇందుకుగాను శాంతిభద్రతల విభాగం అధికారుల సహాయం తీసుకున్నారు. నగర ట్రాఫిక్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 25 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నిరోధానికి ట్రాఫిక్ పోలీసులు పని చేస్తారు. అయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసేది మాత్రం లా అండ్ ఆర్డర్ పోలీసులే. ఈ నేపథ్యంలోనే ప్రాథమికంగా వారి వద్ద ఉన్న గణాంకాలు సేకరించి వాటిపై అధ్యయనం చేశారు. సదరు రోడ్డు ప్రమాదం ఏ కారణంగా చోటు చేసుకుంది? ఎంతటి ప్రభావం చూపింది తదితర అంశాలను పరిశీలించారు. కొన్ని అంశాల్లో నేరుగా ఘటనాస్థలాలకు వెళ్లి పరిశీలించి వచ్చారు. వీటిలో యాదృచ్ఛికంగా జరిగిన వాటిని మినహాయించారు. అత్యధికం మానవ తప్పిదాల వల్లే... సిటీలోని ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకున్న 247 ప్రమాదాలను విశ్లేషించిన పోలీసులు కొన్ని ప్రమాదాలకు కొన్ని రకాలైన కారణాలు ఉన్నట్లు తేల్చారు. సరోజినీ దేవి కంటి ఆస్పత్రి ప్రాంతంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఎక్కువగా ప్రమాదాల బారినపడుతున్నారు. అత్యధికంగా రోడ్డు దాటే ప్రయత్నాల్లో ఉన్న పాదచారులే కావడం గమనార్హం. దీనికి వేగంగా వస్తున్న వాహనాలే కారణంగా మారాయి. తాడ్బంద్ ముస్లిం గ్రేవ్‌యార్డ్ ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా ఉండటంతో పాటు ఇంజినీరింగ్ లోపాలు సైతం వాహనచోదకులు, పాదచారులకు శాపంగా మారాయి. నగరంలో అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు మానవ తప్పిదాలుగా భావించే ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్వల్లే జరిగినట్లు వెల్లడైంది. ఇకపై స్పెషల్ డ్రైవ్స్అన్నీ అయా ఉల్లంఘనల పైనే దృష్టి సారించడం ద్వారా వీటిని తగ్గించాలని భావిస్తున్నారు. నిపుణుల సహకారంతో అధ్యయనం ‘రోడ్డు భద్రత కోణంలో హైదరాబాద్‌ను సేఫ్ సిటీగా మార్చడం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. దీనికోసం కేవలం ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం అధికారులే కాకుండా మిగిలిన విభాగాలతోనూ కలిసి పని చేస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేయడానికే బ్లాక్స్పాట్స్తో పాటు అలా మారడానికి కారణాలనూ శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని నిర్ణయించాం. దీనికోసం జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులతో పాటు సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ట్రాన్స్పోర్ట్ ఇంజినీర్స్ సహాయం తీసుకోవాలని నిర్ణయించాం. ఇంజినీరింగ్ సహా మానవ తప్పిదాలు, ఇతర లోపాలను గుర్తించిన చోట్ల వాటిని సరిచేయాలని కోరుతూ ఆయా విభాగాలకు నివేదికలు అందించనున్నాం. ప్రమాద కారణాలపై వాహనచోదకుల్లో అవగాహన కల్పిస్తాం.’– నగర ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది జనవరి–అక్టోబర్ మధ్య జరిగిన ప్రమాదాల్లో మరణాలు కారణాలు ఇలా... మొత్తం ప్రమాదాలు: 247 మృతులు: 254 ర్యాష్ డ్రైవింగ్ 110 ఓవర్ స్పీడింగ్: 79 అదుపు తప్పడం: 16 డ్రంక్ డ్రైవింగ్: 19 సెల్‌ఫోన్ డ్రైవింగ్: 3 రహదారి లోపాలు: 4 రాంగ్ సైడ్ డ్రైవింగ్: 6 మైనర్ డ్రైవింగ్: 8 ఇతర కారణాలు: 2 -
రైతన్నకు ‘అకాల’ దెబ్బ
సాక్షి, నెట్వర్క్: ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో గురువారం అకాలవర్షం అన్నదాతలను దెబ్బతీసింది. భారీ వర్షం కురవడంతో వరిధాన్యం నీటిపాలుకాగా, పత్తి తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అల్పపీడన ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు కురిసిన వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరిధాన్యం, కోతకు వచ్చిన వరిపంట, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడవకుండా ఉండేందుకు రైతులు« ఎన్ని కవర్లు కప్పినా ఫలితం లేకుండా పోయింది. సుమారు ఐదు వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయింది. పొలాల్లో కోసి ఉన్న వరి మెదలు నీటిలో మునిగిపోయాయి. మరోవైపు ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి, ఇంటి ఆవరణలో నిల్వ ఉంచిన పత్తి తడిసి ముద్దయింది. అధికారుల నిర్లక్ష్యంతోనే ధాన్యం రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఉండాల్సి వచ్చిందని, ఇప్పుడు వర్షంలో తడిసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరబెట్టి తీసుకొచ్చినా తేమ సాకుతో, గన్నిసంచుల కొరత, లారీలు రావడం లేదని రకరకాల కారణాలతో పదిరోజులు వరకు కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచాల్సి వచ్చిందని, వర్షంలో ధాన్యం తడిసిందని రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో రైతులకు అధికంగా నష్టం జరిగింది. అలాగే.. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మేడిపల్లి, ధర్మపురి, గొల్లపల్లి, వెల్గటూర్ ప్రాంతాల్లో సుమారు 20 వేల క్వింటాళ్ల వరకు ధాన్యం ఈ కాల వర్షానికి తడిసిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట, బోయినపల్లి తదితర మండలాల్లోనూ ఇదే పరిస్థితి. కరీంనగర్ జిల్లా చొప్పదండి, మానకొండూర్, సైదాపూర్ మండ లంలో పంటలకు నష్టం వాటిల్లింది. వర్షంతోపాటు ఈదురుగాలుల ప్రభావంతో మొక్కజొన్న నువ్వుల పంటలు నేలకొరిగాయి. పెద్దపల్లి జిల్లాలో కురిసిన వర్షానికి గోదావరిఖనిలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. -
ఎవరొచ్చినా ‘స్టాండ్’ అయ్యేనా?
ఖమ్మంమామిళ్లగూడెం: ఎన్నికలు పూర్తయ్యాయి. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమై ఉంది. రెండు రోజుల్లో ఫలితాలు కూడా రానున్నా యి. అయితే, ఎవరొచ్చినా, ఏ అభ్యర్థి గెలిచినా ఖమ్మంలో ప్రధానంగా బస్టాండ్‌ను పూర్తి చేస్తారా? అని పలువురు అంటున్నారు. పాత బస్టాండ్ సరిపోకపోవడం, కొత్త బస్టాండ్ పనులు ప్రారంభించారు కానీ, పూర్తిస్థాయిలో నిర్మించకపోవడంతో కనీసం ఎన్నికల ఫలితాల తర్వాతనైనా బస్టాండ్ నిర్మిస్తారోని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రు. ఖమ్మం నగరం రోజురోజుకూ అభివృద్ధి చెం దుతుండటంతో.. నగరానికి వచ్చే ప్రజల సంఖ్య ఎక్కువ అవుతోంది. అయితే గతంలో ఎప్పుడో నిర్మించిన బస్టాండ్ ప్రస్తుతం సరిపోకపోవడంతో మరో బస్టాండ్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ఈ నిర్మాణ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. బస్టాండ్ నిర్మాణానికి శం కుస్థాపనచేసి ఏడాది దాటిపోయినా నిర్మాణ పను ల్లో పురోగతి అంతగా లేదు. ఈ బస్టాండ్ ప్రజ లకు అందుబాటులోకి రావాలంటే ఎంత కాలం పడుతుందో తెలియడం లేదు. నగరంలోని ఎన్ఎస్టీరోడ్లో నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్ పను లు 7ఎకరాల 13కుంటల స్థలంలో, రూ.25 కోట్ల తో కొనసాగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో, ఆధునిక హంగులతో చేపడతామని అప్పటి సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే నూతన బస్టాండ్‌కు స్థలం కేటాయించిన తర్వాత చాలా రోజులకు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణ పనులు ప్రారంభించి సంవత్సరం కాలం కావస్తున్నా ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. నిధులు విడుదల చేసినా.. ఎన్నో ఏళ్ల కిందట జిల్లా కేంద్రంలో నిర్మించిన ఖమ్మం బస్టాండ్ ప్రస్తుతం ఉన్న బస్సులకు సరిపడడం లేదనే ఉద్దేశంతో నూతన బస్టాండ్ నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులను స్థలం కేటాయించాలని ఆదేశించి, నిధులను సైతం విడుదల చేసింది. అయితే నిర్మాణ పనులు మాత్రం అడుగు వేయడానికి ఆరు మాసాలు అన్నచందంగా సాగుతున్నాయి. గత సంవత్సరం జూన్ నెలలో పనులు ప్రారంభించినా ఇప్పటి వరకు కనీసం పిల్లర్లు కూడా పైకి లేవలేదు. బస్టాండ్ నిర్మాణ పనులు చూసిన వారంతా ఇలా పనులు జరిగితే ఇంకా పది సంవత్సరాలు అయినా పూర్తికాదని చర్చించుకుంటున్నారు. పని ప్రదేశాల్లో కనీసం పనికి అవసరమైన మిషన్లు, సామగ్రి, కూలీలను ఏర్పాటు చేసుకోకపోవడం కూడా పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని స్థానికులు మారోపిస్తున్నారు. బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా కనీసం సంబంధిత అధికారులు పనులను పరిశీలించిన దాఖలాలు కూడా లేవు. పాత బస్టాండ్‌లో ఇక్కట్లు నూతన బస్‌స్టాండ్ నిర్మాణం త్వరగా పూర్తవుతుందని భావిస్తే అదికాస్తా జాప్యం అవుతుండటంతో పాత బస్‌స్టాండ్‌కు ఇక్కట్లు తప్పడంలేదు. ప్రతిరోజు జిల్లా కేంద్రమైన ఖమ్మం బస్టాండ్‌కు దాదాపు 1,250 బస్సులు నిత్యం ఇతర జిల్లాలు, రాష్ట్రాల ద్వారా వస్తూ పోతుంటాయి. వేల మంది ప్రయాణికులు ఖమ్మం బస్టాండ్ నుంచి వారివారి గమ్య స్థానాలకు ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులకు, బస్సుల సంఖ్యకు అనుగుణంగా బస్టాండ్ లేక పోవడంతో బస్సులు బస్టాండ్‌లో తిరగటానికి ఇబ్బంది కరంగా మారింది. వర్షాకాలంతో ప్రయాణికులకు అనుకూలంగా లేని బస్టాండ్‌లో ఆరుబ యట తడవక తప్పడంలేదు. బస్సు లోనికి రావాలన్నా,బయటకు వెళ్లాలన్నా నరకమే కనిపిస్తోంది. ఇక బస్టాండ్ బయట ఆటోలు, తోపుడు బండ్లతో బస్సులులోనికి రావడానికి ఎక్కువ సమయం పడుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. ట్రాఫిక్‌తో సమస్య నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాలతో ట్రాఫిక్ సమస్య ఇబ్బందికరంగా ఉంది. వాహనాలకు అనుగుణంగా రోడ్ల విస్తీర్ణం లేకపోవడంతో ఇక్కట్లు తప్పడంలేదు. సమస్యలను ఎవ రూ పట్టించుకోక పోవడంతో స్థానిక ప్రజలకు ఇ బ్బందులు తప్పడంలేదు. ఈసారి ఎన్నికల్లో గెలిచే ప్రజాతినిధులు పట్టించుకొని బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, నగరం లో ప్రయాణికులకు అనుగుణంగా మినీబస్సులు తిప్పాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నప్పటికీ రోడ్లు అనుకూలంగా లేకపోవడంతో మినీబస్సులు జాడలేకుండా పోయాయి. -
సమస్యలు రాజ్యమేలుతున్నాయి..
సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కర్షకులు... మత్స్యకారులు... దినసరి కూలీలు... లెక్కలేనన్ని కష్టాలను ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి పనుల పేరుతోమితిమీరిన అవినీతి చోటుచేసుకుంది. మరుగుదొడ్లలో అక్రమాల గుట్టు బట్టబయలవుతోంది. హౌస్‌ఫర్ ఆల్ బండారం బటయపడింది. కరువుతో రైతాంగం అల్లాడుతోంది. ఉన్న ఊళ్లో బతుకు లేక వలసవెళ్లిన మత్స్యకారులకు ఎంత కష్టం ఎంత కష్టం... పాక్‌చెరలో బందీగా మారి బిక్కుబిక్కుమంటున్న వారిని పట్టించుకునేవారెవరు? ఇవన్నీ చర్చించడానికి మళ్లీ ఓ వేదిక దొరికింది అదే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. మంగళవారం జరగనున్న ఈ సమావేశంలో ఈ సమస్యలు చర్చకు వస్తాయో రావో... విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అన్ని వర్గాలూ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వాటి పరిష్కారంపై పాలకులు దృష్టిసారించడం లేదు. కనీసం మంగళవారం జరగనున్న జిల్లా పరిషత్ సర్వసభ్యసమావేశంలోనైనా దీనిపై చర్చిస్తారో లేదోనని జిల్లా ప్రజా నీకం ఎదురు చూస్తోంది. జిల్లాలో ఈ ఏడాది తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది మంది రైతులు అప్పుల ఊబితో కూరుకుపోయారు. ఖరీప్ లో వరి పంట 1,19,735 హెక్టార్లలో సాగవ్వగా 50 వేల హెక్టార్లలో నష్టం వాటిల్లింది. జిల్లాలో 26 మండలాల్లో కరువు పరిస్థితులున్నాయి. కాని రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగు మండలాలనే మాత్రమే కరువు జాబితాలో చేర్చింది. కరువు కారణంగా రైతాంగం ఎకరానికి రూ. 20 వేల వరకు నష్టపోయారు. కరువు మండలంగా ప్రకటిస్తే కనీసం కొంతలో కొంతైనా ఊరట లభిస్తుందని రైతులు వేడుకుంటున్నారు. సర్కారు దీనిపై పునరాలోచించాలి. మరి జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. బాలికలపై పెరుగుతున్న అత్యాచారాలు జిల్లాలో బాలికలపై లైంగికదాడులు పెరుగుతున్నాయి. గత ఏడాది సీతానగరం వద్ద పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగికదాడి చేసి హతమార్చగా... తాజాగా ఎస్.కోట మండలం ఐతినపాలెం వద్ద తొమ్మిదేళ్ల బాలికపై మరో కామాంధుడు లైంగికదాడికి యత్నించాడు. వీటిని నియంత్రించడానికి చేపడుతున్న చర్యలేమిటో తేల్చాలి. బిక్కుబిక్కుమంటూ మత్స్యకారులు జిల్లాకు చెందిన ఐదుగురు మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రానికి వలస వెళ్లి అక్కడినుంచి పొరపాటున పాక్‌జలాల్లోకి వెళ్లి అక్కడి కోస్టుగార్డులకు చిక్కి ప్రస్తుతం అక్కడ బందీలుగా మారారు. వారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. ఇక్కడ వారి కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ తమవారికోసం ఎదురు చూస్తున్నారు. కనీసం వారికి సాంత్వన చేకూర్చే ప్రయత్నమూ చేయడం లేదు. విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి మొన్నటి వరకు డెంగీ వ్యాధి కోరలు చాపింది. తాజాగా స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. జిల్లాలో నెల రోజుల్లో 13 మంది స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. వారిలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. అందులో 9 నెలలు పాప కూడా ఉంది జిల్లాలో వైద్యం దైవాధీనంగా మారింది. ముఖ్యంగా జిల్లా కేంద్రాస్పత్రిలో రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం పూసపాటి రేగ మండలం పోరాం గ్రామానికి చెందిన జి.స్వాతి అనే గర్భిణి రోడ్డు ప్రమాదంలో గాయపడి కేంద్రాస్పత్రి వస్తే చికిత్స అందించడంలో జాప్యం చేయడం వల్ల ఆమెకు అబార్షన్ అయింది. దీంతో వారి బంధువులు ఆందోళనకు దిగారు. అదేవిధంగా ఘోషాస్పత్రిలో కొద్ది రోజుల క్రితం గుమ్మలక్ష్మిపురానికి చెందిన ఓ గర్భిణి మరుగుదొడ్డిలో ప్రసవించింది. ఈ రెండు ఆస్పత్రిల్లో రోగులకు సకాలంలో వైద్యం అందచరనే ఆరోపణలు ఉన్నాయి. -
ఎట్టకేలకు అంగీకారం!
సాక్షి ప్రతినిధి, కడప: న్యాయంగా రావాల్సిన బీమా అందలేదు. రైతులకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. ప్రత్యక్ష పోరాటం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చినా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపలేదు. వెరసి రైతులకు నిరీక్షణ తప్పలేదు. వైఎస్సార్సీపీ ప్రత్యక్ష పోరాటంతో ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వానికి అంగీకార లేఖ రాస్తూ నిర్ణయం తీసుకుంది. రైతులు వారి వారి పంటలకు బీమా చెల్లించుకునే వెసులుబాటు ఉంది. ప్రీమియం చెల్లించిన తర్వాత బాధ్యత ఇన్య్సూరెన్సు కంపెనీలదే. బీమా చెల్లించాల్సిన సమయంలో దరఖాస్తులు సక్రమంగా పూరించలేదని అర్హులైన రైతులకు బీమా చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. రైతులకు తెలియక చేసిన తప్పులకు శిక్ష విధిస్తారా... అంటూ వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. వివిధ దశల్లో ప్రత్యక్ష ఆందోళన చేసింది, తుదకు ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ధర్నా చేపట్టారు. ఆపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లోపించింది. రెండున్నరేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించేందుకు అంగీకరిస్తూ లేఖలో వెల్లడించిన వైనమిది. జిల్లాలో 2012–13 పంటలబీమాకు శనగ, పొద్దుతిరుగుడు పంటలకు రైతులు బీమా ప్రిమియం చెల్లించారు. 76,750 మంది బీమా చెల్లించగా వారిలో 21,965 క్లైయిమ్లను అగ్రికల్చర్ ఇన్య్సూరెన్సు కంపెనీ (ఏఐసీ) తిరస్కరించింది. అందులో ప్రధానంగా 20,655 దరఖాస్తులు పంటలు సాగుచేసిన తేది పొందుపర్చలేదని పంటల బీమా మంజూరు చేయకుండా తిరస్కరించింది. వారిలో 16,889 మంది బుడ్డశనగ, 3,766 మంది పొద్దుతిరుగుడు రైతులు ఉన్నారు. వారందరికీ పంటల బీమా మంజూరు చేయకుండా తిరస్కరించింది. ఈపరిస్థితుల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వారికి అండగా అత్యంత చిత్తశుద్ధితో వైఎస్సార్సీపీ పోరాటాన్ని ఎంచుకుంది. కడప మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ఏఐసీ అధికారులతో అనేక పర్యాయాలు చర్చించారు. అదేవిధంగా వ్యవసాయశాఖ కమిషనర్‌తో సైతం మంతనాలు చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసి హైదరాబాద్‌లోని ఏఐసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రాష్ట్ర పరిధిలో ఉన్న అడ్డంకులను చేధించుకుని ఏఐసీ జీఎం రాజేశ్వరి ద్వారా ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితోనూ, కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రెటరీతోనూ ప్రత్యేకంగా పలుమార్లు కలుస్తూ ఐదేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న అవస్థలను వివరిస్తూ, ప్రత్యేక సమావేశాల ద్వారా వ్యవహారాన్ని కొల్కి తెచ్చారు. ఆమేరకు 2016 మార్చి 10న కేంద్రప్రభుత్వం లేఖ రాసింది. పెండింగ్‌లో ఉన్న ఆ క్లైయిమ్స్ రాష్ట్రప్రభుత్వ వాటానిమిత్తం అంగీకారం కోరింది. ఇలాంటి తరుణంలో తక్షణమే స్పందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లుగా నిర్లక్ష్యం ప్రదర్శించింది. 2018 సెప్టెంబర్ 19న అగ్రికల్చర్ స్పెషల్ సెక్రెటరీ డి.మురళీధర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి అంగీకార లేఖ రాశారు. చిత్తశుద్ధి పోరాటం చేసిన ఫలితమే... పంటలకు బీమా ప్రీమియం చెల్లించిన తర్వాత కూడా రైతులకు బీమా మంజూరు కాకపోవడంపై వైఎస్సార్సీపీ రైతులకు అండగా నిలిచింది. చిత్తశుద్ధితో అడుగడుగునా వైఎస్సార్సీపీ ప్రత్యక్ష పోరాటం చేసిన నేపథ్యంలో తక్షణమే స్పందిస్తే ఆ పార్టీకి మంచిపేరు వస్తుందని కావాలనే రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే వైఎస్సార్సీపీ నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలోనైనా శనగ రైతులకు పంటల బీమా చెల్లింపు చేస్తామని ప్రజాసంకల్పయాత్రలో సైతం ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ పోరాట ఫలితంగా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం లేఖకు స్పందిస్తూ అంగీకార లేఖ రాసింది. గతంలో కూడా ఇలాంటి విపత్కర పరిస్థితిని రైతులు చవిచూశారు. 2012–13 రబీ పంటల బీమా మంజూరు చేయడంలో ఏఐసీ నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఎంపీ హోదాలో పలుమార్లు పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లడం, స్వయంగా ఇన్సూరెన్సు అధికారులను కలవడంతో రూ.132కోట్లు మంజూరు చేస్తూ ఏఐసీ నిర్ణయం తీసుకుంది. తొలివిడతగా 17,161మంది శనగ రైతులకు రూ.88 కోట్లు బీమా మొత్తం జమ అయింది. రెండో విడతగా 11,286 మంది శనగ రైతులకు రూ.44కోట్లు బీమా మొత్తం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పట్లో శనగరైతులు సైతం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని కృషిని కొనియాడుతూ వచ్చారు. తక్షణమే పరిహారం అందించకుండా దాదాపు నాలుగు వారాలు అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారు. ‘అమ్మ పెట్టదు...అడుక్కోనివ్వదు’ అన్నట్లుగా వ్యవహరించారు. తాజాగా 2012–13 రబీ పంటల బీమా దరకాస్తులు పూరించడంలో పంట సాగుచేసిన తేది పొందుపర్చలేదనే కారణంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు త్వరలో శుభవార్త వినే అవకాశం ఉంది. -
మాటల్లోనే పరిష్కారం..!
‘గంట్యాడ మండలం పెదమజ్జి పాలెం గ్రామానికి చెందిన పాతిన రాణి పింఛన్ కోసం ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేసుకుంది. పింఛన్ మంజూరు కాలేదు. కనీసం ఎందుకు రావడం లేదో తెలియజేయలేదు. నవంబర్ 19న మరోసారి గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పక్షవాతంతో బాధపడుతున్న ఆమె గ్రీవెన్స్‌కు వచ్చేందుకు అవస్థలు పడుతోంది. అధికారులు మాత్రం పింఛన్ ఆదరువు కల్పించలేకపోతున్నారు.’ ‘విజయనగరం పట్టణంలో కె.ఎల్.పురం వజ్రపుబంద ఆక్రమణకు గురైందని స్థానికులు ఫిర్యాదు చేశారు. అధికారులు నెలలు తరబడి చర్యలు తీసుకోలేదు. ఆక్రమణలు విషయం నీటిపారుదలశాఖ అధికారులే అంగీకరిస్తున్నా తొలిగించేందుకు చొరవ తీసుకోపోవడం శోచనీయం’. విజయనగరం గంటస్తంభం: గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి మీరెప్పుడైనా చూశారా? అక్కడ అర్జీ ఇచ్చేందుకు జనం పడే పాట్లు అన్నీ ఇన్నీ కాదు. నడవడానికి శరీరం సహకరించని వృద్ధులు... పుట్టుకతోనే వైకల్యంతో బాధపడే విభిన్న ప్రతిభావంతులు... ఎన్నో ఏళ్లుగా సమస్యతో పోరాడుతున్న బాధితులు... అన్నీ పత్రాలు ఉన్నా రికార్డుల్లో భూమి హక్కులు లేని రైతులు.. ఇలా ఎంతోమంది కనపడతారు. రెక్కాడితేగాని డొక్కాడని కూలీలు...చేతిలో చిల్లుగవ్వ లేని పేదలు అప్పులు చేసి మరీ గ్రీవెన్స్‌సెల్‌కు వస్తారు. వారిని చూసినా... వారిని కదిపినా కలెక్టర్ నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి దరఖాస్తు ఇస్తే పరిష్కారమైనట్లేనన్న ఆశ వారిలో కనిపిస్తుంది. ఒకసారి వస్తేగానీ ఇక్కడ పరిస్థితి అర్థం కాదు.. ఇదంతా ఎండమావులే అని. చేతల్లో కా కుండా మాటలతోనే ఫిర్యాదులు పరిష్కరించేస్తున్నారని.. జిల్లాలో గ్రీవెన్స్‌సెల్ అర్జీల పరిష్కా రం తీరు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. నామమాత్రపు పరిష్కారం మీకోసం కార్యక్రమంలో వచ్చిన వినతుల్లో దాదా పు అన్నీ పరిష్కరించినట్లు ప్రభుత్వం చెబుతుంది. ఆన్లైన్లో అలాగే చూపిస్తున్నారు. వాస్తవానికి ఎం తమంది ఇచ్చిన అర్జీదారులకు సరైన పరిష్కా రం లభించందంటే నామమాత్రమే అని చెప్పాలి. పరిష్కారం అంటే ప్రభుత్వం, అధికారుల దృష్టిలో అర్జీకి ఏదో ఒక సమాధానం చెప్పడం. కానీ అర్జీ దారుడు దృష్టిలో తాను అధికారుల దృష్టిలో పెట్టిన సమస్య పరిష్కారమైతేనే న్యాయం జరిగినట్లు. ఈవిషయం అధికారులకు తెలిసినా తమ వద్ద అర్జీ పెండింగ్ లేకుండా ఏదో ఒక సమాధానం చెప్పేస్తున్నారు. ఒక్కోసారి తమ పరిధిలోనిది కాదని, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాధానం ఇచ్చి సరిపెడుతున్నారు. ఇవన్నీ పరిష్కారమైనట్లేనని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో లెక్కకు వినతులు పరిష్కారం జరిగినా వాస్తవంలో ప్రజలు ఇబ్బందులు తీరడం లేదు. గత నాలుగేళ్లలో వచ్చిన వినతుల్లో అధికారులు పరిష్కారమైనట్లు చెబు తున్న వినతుల్లో 70శాతం పరిస్థితి ఇదే. దీంతో గ్రీవెన్స్‌సెల్‌లో వినతులు ఇవ్వడమే మినహా తమకు ఎటువంటి న్యాయం జరగడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోపం ఎవరిది? గ్రీవెన్స్‌సెల్‌లో వినతులకు సరైన పరిష్కారం ల భించలేదన్నది జిల్లా వాసులందరికీ తెలుసు. ప్రతీ మండలం, ప్రతీగ్రామం నుంచి ఏదో సందర్భంలో ఎవరో ఒకరు గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి ఉంటా రు. వారి సమస్యకు ఎంతవరకు పరిష్కారం లభించిందో ఒకసారి తెలుసుకుంటే ఈ విషయం ఇట్టే బోధపడుతుంది. ఇందుకు లోపం ఎవరిదం టే ప్రభుత్వానిదేనని చెప్పక తప్పదు. అధికారులు పొరపాట్లు కూడా చాలా వరకు ఉన్నాయి. ప్రభుత్వంతో సంబంధం లేని వినతులు పరిష్కరించే అవకాశం ఉన్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదు. అర్జీదారుడు ఇచ్చిన గ్రీవెన్స్‌ను మళ్లీ మండలాలకు పంపిస్తున్నారు. వాస్తవానికి అక్కడకు వెళ్లి న్యాయం జరగలేదని భావించిన తర్వాత కలెక్టర్ వద్దకు వస్తున్నారు. ఆ విషయం మరిచి వారికే పంపడమే కాకుండా కనీసం వాస్తవమెంతో తెలుసుకోవడం లేదు. గ్రీవెన్స్ పిటీన్‌పై గ్రామాలకు వెళ్లి విచారణ చేసిన జిల్లా అధికారులను వేళ్లమీద లెక్క పెట్టవచ్చు. ఇకపోతే ప్రభుత్వం కూడా గ్రీవెన్స్ పరిష్కారానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు. నాలుగేళ్లలో వచ్చినవాటిలో 5.10 లక్షల వినతులు ఫైనాన్స్ సంబంధిత అం శాలే అయినా వాటి పరిష్కారానికి చొరవ లేదు. పింఛన్లు, ఇళ్లు, ఇళ్ల బిల్లులు, రుణాలు అధిక అర్జీ లు వస్తున్నా వారికి సమస్యకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఇదిలాఉంటే 1100కు ఫోన్ చేసిన వారికి మాత్రమే రేషన్‌కార్డులు మంజూరు కావడం చూస్తే గ్రీవెన్స్‌సెల్‌కు విలువ లేదన్నది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో గ్రీవెన్స్‌సెల్‌కు భవిష్యత్తులో ఎటువంటి ప్రాధాన్యముంటుందో చూడాలి. పట్టించుకోవడం లేదు.. పట్టణంలో ఉన్నా తమ గు రించి పాలకులు పట్టించుకోవడం లేదు. తమకు తాగునీరు, విద్యుత్ సరఫరా లేదని, ఇతర సౌకర్యాలు అందడం లేదు. గ్రీవెన్స్‌సెల్‌లో ఎన్నోసార్లు అధికారులకు సమస్య తెలియజేసినా పరిష్కా రం కాలేదు. అటు ప్రభుత్వం గానీ, అధికారులుగానీ తమను పట్టించుకోవడం లేదు. – మజ్జి సత్యవతి, కామాక్షినగర్ నగర్ మాంతిచెరువు నివేదిస్తే పరిష్కరించినట్టే.. అర్జీదారుడు సమస్యపై ఇచ్చే దరఖాస్తు విచారించి పరిష్కరిస్తున్నాం. ఆర్థికపరమైన విషయాలు ప్రభుత్వానికి నివేదించి ఆ విషయం అర్జీ దారుడుకు తెలియజేస్తున్నాం. పింఛన్లు, ఇళ్ల కోసం ఎక్కువగా అర్జీలు వ స్తున్నాయి. ఆ విషయం ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. ఆ విధంగా చేస్తే పరిష్కారమైనట్లే. చేయలేని వాటి విషయంలో అర్జీదారుడికి తెలియజేసి క్లోజ్ చేస్తున్నాం. అంటే ఆ దరఖాస్తుకు పరిష్కారం అయినట్టే. – జె.వెంకటరావు, డీఆర్వో, విజయనగరం -
కౌలు రైతుల కష్టాలు తీరేనా..?
గుర్రంకొండ: జిల్లాలో కౌలు రైతులు అప్పులు పాలై కష్టాల బాటలో బతుకు సాగిస్తున్నారు. వీరిని అన్ని విధాల ఆదుకొంటా మని ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటిమూటలుగానే మిగులు తున్నాయి. పథకాలన్నీ వీరికీ వర్తిస్తాయంటున్న ప్రకటనలు కాగి తాలకే పరిమితవుతున్నాయి. ఈ ఖరీఫ్‌లో ఏ ఒక్క కౌలు రైతుకూ రుణం మంజూరు కాలేదు. రబీ సీజన్లోనూ అదే తీరు. తప్పనిసరిగా పంట రుణాలివ్వాలని జిల్లా అధికారులు చెబుతున్నా బ్యాంకులు బేఖాతరు చేస్తున్నాయి. ఎలాంటి భరోసా లేదంటూ బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. అప్పు చేసి పండిస్తే దిగుబడి మాటెలా ఉన్నా కనీసం గిట్టుబాటు ధర కూడా సంతృప్తికరంగా లేదు. దీంతో నష్టాలపాలవుతున్నారు. రబీ సీజన్లో కొందరు అధిక వడ్డీలకు ప్రయివేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేశారు. నెరవేరని లక్ష్యం కౌలురైతులకు 2014 నుంచి రుణ అర్హత గుర్తింపు సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. తొలి ఏడాది 3,458 మందికి సర్టిఫికెట్లు ఇవ్వగా 29 మందికి మాత్రమే బ్యాంకర్లు రుణాలు మంజూరు చేశారు. 2017లో 1,949 మందికిగాను 275 మంది రుణాలు పంపిణీ చేశారు. ఈ ఏడాది 2,246 మంది గుర్తింపు కార్డులివ్వగా ఇప్పటివరకూ ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదు. ఖరీఫ్ సీజన్ వెళ్లిపోయింది. రబీ సీజన్ ప్రారంభమైనా కౌలు రైతులకు నిరాశే ఎదురైంది. ఈ గుర్తింపు సర్టిఫికెట్లు నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. ఈ ఏడాది మేలోనే సర్టిఫికెట్లు జారీ చేసి బ్యాంకర్లను ఒప్పిస్తే ఫలితం ఉండేదని రైతులంటున్నారు. ఖరీఫ్ సీజన్ ముగిసినా రుణాలివ్వకపోవడం దారుణ మని కౌలురైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రయివేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేశారు. ఖరీఫ్‌లో పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. సాగు వ్యయం కూడా చేతికందక భారీగా నష్టపోయారు. రబీ సీజన్లో ఆశతో గుర్తింపు సర్టిఫికెట్లు తీసుకొని బ్యాంకులకు వెళుతున్న కౌలురైతులకు ఛీత్కారాలు, అవమానాలు ఎదురవుతున్నాయి. రెండు నెలలు గడుస్తున్నా రుణాలు ఇవ్వలేదు. 2017 రబీ సీజన్లో డీసీసీబీకి చెందిన బ్యాంకులు 275 మందికి రుణాలు మంజూరు చేశాయి. మిగిలిన బ్యాంకర్లు కాదు.. పొమ్మన్నారు. సాగుచేసే పంట ఆధారంగా రుణాలు ఇవ్వలేంటూ కచ్చితంగా చెప్పేస్తున్నారు. అప్పుల ఊబిలో కౌలు రైతులు.. పంట పండినా.. పండకపోయినా భూమి యజమానికి తప్పనిసరిగా కౌలు డబ్బులు చెల్లించాలి. కౌలురైతులు వేరుశెనగ సాగులో ఆరేళ్లుగా నష్టాలనే చవిచూ స్తున్నారు. పంట నష్టపరిహారం వచ్చిన వీరికి దక్కదు. భూమి యజమానికి చేరుతోంది. వీరికి ఎలాంటి సాయమూ అందలేదు. ప్రభుత్వ రాయితీలు, పరిహారం యజమానులకు చెందుతుండటంతో కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. కౌలురైతులకు రుణాల కోసం ప్రభుత్వం ఈ ఏడాది సాగు నేస్తం పథకం ప్రవేశపెట్టింది. దీని జాడే లేదు. మేలోనే గుర్తింపు కార్డులు జారీచేసి ఈ పథకం కింద సింగిల్‌విండోల ద్వారా రుణాలు మంజూరు చేసి ఉంటే ప్రయోజనకరంగా ఉండేది. గత ఏడాది ఎంతో కొంత ఆదుకున్న డీసీసీబీ బ్యాంకులు ఈ ఏడాది చేతులెత్తేశాయి. ఆదుకునే వారేరీ? కౌలు రైతుల పరిస్థితి దారుణంగా మారింది. పంటలు పండక ఏటా నష్టపోతున్నాం. మమ్మల్ని ఆదుకునేవారు లేరు. ప్రభుత్వ సబ్సిడీ పథకాలు అందడం లేదు. ఎక్కువ వడ్డీలకు అప్పు తెచ్చి సాగు చేస్తున్నాం. బాగా నష్టపోతున్నాం. వ్యవసాయం తప్ప మరే పని చేయలేకున్నాం. ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఆదుకుంటే బాగుంటుంది. – నరసింహులు, కౌలురైతు, గుర్రంకొండ -
చర్మం పొడిబారుతోందా!
చలికాలం రావడానికి ముస్తాబు అవుతోంది. పగటి వేళ ఎండగానూ, రాత్రి వేళ కాస్త చలిగా ఉండడం సహజంగా జరుగుతుంటుంది. ఈ పరిస్థితుల్లో చర్మ సంరక్షణ పట్ల ముఖ్యంగా పొడి చర్మం గలవారు తప్పనిసరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి నీళ్లతోనూ, చల్లని నీళ్లతోనూ కాకుండా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. ముఖానికి పదే పదే సబ్బు వాడకుండా వెచ్చని నీటితో రోజులో రెండు – మూడు సార్లు కడగాలి. స్నానం చేసిన తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ కాలం గాలిలో తేమ తక్కువ. దీని వల్ల ఒంటిమీద ఉండే స్వేదం కూడా త్వరగా ఆరిపోతుంటుంది. దీంతో చర్మం పొడిబారినట్టు అవుతుంది. ఈ సమస్య రాకుండా 2 నుంచి 4 లీటర్ల నీళ్లు రోజులో తప్పనిసరిగా తాగాలి. రాబోయే కాలంలో మృతకణాల సంఖ్య కూడా పెరుగుతుంటుంది. వీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని ఎక్కువసేపు స్క్రబ్ చేయకూడదు. మీ చర్మతత్త్వం ఏదో తెలుసుకొని తగిన సౌందర్య ఉత్పాదనలను ఎంపిక చేసుకొని వాడాలి. పనుల వల్ల పాదాలు, చే తులు ఎక్కువగా నీటిలో నానుతూ ఉంటాయి. దీంతో వీటి పై చర్మం త్వరగా తేమ కోల్పోతుంది. అలాగే వదిలేస్తే పగుళ్లు బారే అవకాశం ఉంది. అందుకని, రాత్రివేళ తడి లేకుండా చేతులను తుడిచి మాయిశ్చరైజర్ రాసి, గ్లౌజ్‌లను వేసుకోవాలి. గ్లిజరిన్ ఉండే క్రీమ్స్, పెట్రోలియమ్ జెల్లీ మాయిశర్చరైజర్లు పాదాల చర్మాన్ని పొడిబారనివ్వవు. వారానికోసారి పాదాలను స్క్రబ్బర్‌తోరుద్ది, కడిగాలి. పడుకునే ముందు పెట్రోలియమ్ జెల్లీ రాసి, సాక్స్‌లు వేసుకోవాలి. చర్మం దురద పెడుతుంటే పొడిబారి ఉంటుందిలే అనుకుని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే, ఒక్కోసారి అవి రకరకాల చర్మ సమస్యలకు కారణమై ఉండచ్చు. -
చిన్న పెన్సిలు ముక్క పెద్ద పాఠం
చిన్న చిన్న విషయాలే పెద్ద పాఠాలు నేర్పిస్తాయి.పెద్ద పెద్ద ఆదర్శలు చిన్న సాధనతోనే ప్రారంభమవుతాయి.చిన్నది ఏదీ వృధా కాదు.చిన్న చిన్న బిందువులేమహా సింధువును సృష్టిస్తాయి. అందరూ హడావుడిగా వెతుకుతూనే ఉన్నారు. ఆకలి, దాహం కూడా మర్చిపోయారు. ఆ రోజు సబర్మతి ఆశ్రమంలో పశువులు కూడా ఉపవాసం ఉన్నాయి. వాటిని చూసుకునే వాళ్లు కూడా వెతికే పనిలోనే ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలు దాటిపోయింది. వంటగది ఖాళీగా ఉంది. వండి వడ్డించే వాళ్లు కూడా వెతికే పనిలోనే మునిగి ఉన్నారు. ఇక కస్తూర్బా గాంధీ దగ్గరకు వచ్చింది. ‘‘బాపూ.. అది చిన్న పెన్సిలు ముక్క. ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఊడ్చేవాళ్లు చిన్నదేలే, బాపూజీ పడేశారేమో అనుకుని ఊడ్చేసుంటారు... ఆ చిన్న ముక్క కోసం ఆశ్రమంలోని చిన్నా పెద్దా అందర్నీ ఇలా బాధపెట్టడం బాగోలేదు. మీరు కాస్త ఆలోచించండి.’’ అంది. ఆమె స్వరంలో చోటు చేసుకున్న తీవ్రతకు గాంధీజీ రాట్నం ఆగింది. ‘‘చూడు బా, ‘చిన్నిముక్క’ అన్న నిర్లక్ష్యం నుండి బయటకు రావడానికే ఈ ఉపవాసం... నువ్వనే బలవంతపు బందిఖానా’’ అని దగ్గరగా కనిపిస్తున్న వ్యక్తితో ‘‘బాలూ, అందరినీ ఇక్కడ సమావేశపరచు’’ అన్నారు. బాపూజీ ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నారేమో, ఆశ్రమవాసులందరూ బిలబిలమంటూ వచ్చేశారు. చివరివ్యక్తి కూడా వచ్చాడని నిర్ధారించుకున్న గాంధీజీ గొంతు సవరించుకున్నారు. ‘దొరికిందా?’ అని క్షణం ఆగారు. అందరి మొహాలూ వాడిపోయి ఉన్నాయి, బా ఏదో అనబోతుంటే బాపూజీ ‘బా నా మీద నేరం మోపుతున్నది, చిన్నముక్క కోసం ఆశ్రమంలో ఉన్న చిన్నాపెద్దలకే కాదు, పశువులకూ శిక్ష విధించానని మనందరి భవిష్యత్తుకూ, మన దేశ భవిష్యత్తుకూ.. ఈ సందర్భంలో మనం ఓపాఠం నేర్చుకుందాం. అదేమంటే, చిన్న చిన్న విషయాల్లో మనం జాగ్రత్త వహించాలి. ఈ రోజు పోయిన ఆ చిన్న పెన్సిలు ముక్కే మనకో ఉపాధ్యాయుడు! ఆ పెన్సిలుతో ఇంకొక గ్రంథం రాయగలను నేను. మీకు తెలుసు, మనకు వచ్చే ఉత్తరాల్లో ఖాళీగా ఉన్న భాగాన్ని నేను జమాఖర్చులు రాసేందుకు ఉపయోగిస్తానని. దేనినైనా వృథాగా పారేయడం మీకు న్యాయమనిపిస్తోందా?’’ క్షణమాగి అందరివైపూ చూశారు గాంధీజీ. అందరూ ‘న్యాయం కాదు’ అన్నట్టు తలలూపారు.‘‘మనం నీటిని చుక్కచుక్క పెద్ద బొక్కెనలా విలువగా వాడడం ఇటీవలనే నేర్చుకున్నాం, అందుకు నేనెంతో తృప్తిపడుతున్నాను. రేపు మీరెవరైనా మీ మీ గ్రామాలకు వెళ్లినప్పుడు నీటిని పొదుపుగా వాడడమేగాక, తోటివారికి కూడా తప్పకుండా అవగాహన కలిగిస్తారు. ఈ చిన్ని పెన్సిలు ముక్క అంతే! చిన్ని చిన్ని ప్రారంభాలే కదా, పెద్ద పెద్ద కార్యాలకు మూలం, చిన్నదే కదా అని అశ్రద్ధ చేస్తే అన్ని రంగాల్లోనూ పెద్ద అవినీతికి దారితీస్తుందని మీకు తెలుసు. సత్యం, అహింస, నీతి – వీటిని చిన్నగా సాధన చేయడం మనం ప్రారంభిస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం. చిన్న పెన్సిలు ముక్క నుండి నేర్చుకునేది అదే కదా’’ అంటూ గాంధీజీ ఉపన్యాసాన్ని, ఉపవాసాన్ని కూడా ముగించారు. కస్తూర్బాతోపాటు ఆశ్రమవాసులందరూ కూడా అక్కడి నుంచి తృప్తిగా తమ తమ విధుల్లోకి కదిలారు. – ఝాన్సీ కె.వి.కుమారి -
అగ్రిగోల్డ్ సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది
-
విభజన తంటాలు.. ఇంకెన్నాళ్లు?
సాక్షి, హైదరాబాద్: పోలీస్‌శాఖలో విభజన ప్రక్రియ పూర్తి కాలేదు. డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, నాన్ క్యాడర్ ఎస్పీలు రెండు రాష్ట్రాల మధ్య నాలుగేళ్లుగా నలిగిపోతున్నారు. డీఎస్పీ విభజన ఎప్పుడో జరగాల్సి ఉన్నా ఇప్పటివరకు సీనియారిటీ పంచాయితీ తేలలేదు. దీనిని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెండింగ్ పెట్టాయి. అధికారులను విభజించాల్సిన కమల్‌నాథన్ కమిటీ తాత్కాలిక కేటాయింపులకు ఓకే చెప్పినా తుది కేటాయింపులపై హైకోర్టు స్టే ఉండటంతో ఏం చేయాలో తెలియక పోలీస్ శాఖకే వదిలేసింది. దీనితో రెంటికి చెడ్డ రేవడిలాగా పోలీస్ అధికారుల పరిస్థితి తయారైందన్న వాదన ఉంది. ఇటీవల రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. పెండింగ్‌లో ఉన్న విభజన పనులను పూర్తి చేసుకోవాలని, మధ్యేమార్గంగా వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా డీఎస్పీల విభజనపై ఓ నిర్ణయానికి వచ్చినా ఇప్పటివరకు అందులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కేంద్రానికి లేఖ రాసి తెలంగాణలో పనిచేస్తున్న డీఎస్పీలను ఇక్కడే కొనసాగించాలని, ఏపీలో పనిచేస్తున్న అధికారులను అక్కడే కొనసా గేలా చర్యలు చేపట్టాలని కోరాలని నిర్ణయించారు. ఇప్పటివరకు లేఖ రాయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సీనియారిటీ వ్యవహారంపై రెండు రాష్ట్రాల పోలీస్ పెద్దలు ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. ఇంటిగ్రేటెడ్ డీఎస్పీ సీనియారిటీ రూపొందించడంపై దృష్టి పెట్టలేదు. సీనియారిటీ జాబితా సమీక్ష పేరుతో మూడున్నరేళ్ల ఏపీ పోలీస్‌శాఖ కాలం గడిపింది. ఇంతవరకు జాబితా రివ్యూ చేసి హైకోర్టులో దాఖలు చేయకపోవడంతో విభజన, పదోన్నతులు, పదవీ విరమణ సెటిల్మెంట్లు అన్నీ పెండింగ్‌లో పడిపోయాయని తెలంగాణ పోలీస్ అధికారులు అంటున్నారు. ఉమ్మడి ఏపీలో రూపొందించిన జీవో 108, 54 సీనియారిటీ జీవోలను రివ్యూ చేసే అధికారం ఏపీ ప్రభుత్వానికి ఉండటంతో ఆ అంశం ఏపీలోకి వెళ్లింది. దీనితో తమ చేతిలో ఎలాంటి అధికారం లేదని తెలంగాణ అధికారులు తేలికగా తీసుకున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయా అధికారులు వినతిపత్రాలిచ్చి ఏళ్లు గడుస్తున్నాయే తప్పా విభజన పని ముందుకు సాగడం లేదు. కేంద్ర హోంశాఖ హెచ్చరించినా.. రెండు రాష్ట్రాల్లో కలిపి 36 మందికి కన్ఫర్డ్ కోటా కింద ఐపీఎస్‌లుగా పదోన్నతులు కల్పించాల్సి ఉండగా రెండు రాష్ట్రాల హోంశాఖలు నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నాయి. దీనిపై కేంద్ర హోంశాఖ ప్రతి ఏటా హెచ్చరిస్తూ వస్తూనే ఉంది. కన్ఫర్డ్ జాబితా కింద వేకెన్సీ ఉన్న పోస్టుల భర్తీకి ప్రతిపాదిత జాబితా పంపాలని కోరినా బుట్టదాఖలు చేస్తూ వస్తున్నాయని లేఖలో స్పష్టం చేసింది. నాలుగేళ్లుగా ప్యానల్ జాబితా పంపకపోవడంతో కన్ఫర్డ్ ఆశావహ అధికారులు నిరాశలో మునిగిపోయారు. గ్రూప్ వన్ డీఎస్పీగా సెలక్ట్ అయిన నాటి నుంచి 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తే ఐపీఎస్ పదోన్నతి రావాల్సి ఉంది. 11 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ప్యానల్ జాబితా ఫైలు కదలకపోవడం తమ సర్వీసుపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీనియారిటీ జాబితా పేరుతో నాలుగేళ్లుగా పెండింగ్‌లో పెట్టడంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల అధికారులు మధ్యేమార్గ నిర్ణయం తీసుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని కోరుతున్నారు. -
అపురూపంగా చూసుకోవాలి
కొత్తగా పెళ్లయిన జంట భోజనానికి కూర్చుంది. ‘‘మీ అమ్మగారిని కూడా పిలవండి’’ అని చెప్పింది భార్య. ‘‘మా అమ్మ సంగతి వదిలేయి.’’ అని విసుక్కున్నాడు భర్త. అందుకు ఆమె ఒప్పుకోలేదు. మీ అమ్మగారు తినకుండా మనం తినడం భావ్యం కాదని చెప్పింది. పెళ్లికొడుక్కి చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఇద్దరూ పెళ్లైన రోజే విడిపోయారు. ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఎవరికి తోచిన సంబంధం వాళ్లు చూసుకుని వేరే పెళ్లి చే సుకున్నారు. ఇలా ముప్ఫై ఏళ్లు గడిచిపోయాయి. ఆ మహిళకు మగ సంతానం కలిగింది. పిల్లలు ప్రయోజకులయ్యారు. పిల్లల్ని ధార్మికంగా తీర్చిదిద్దడంతో పిల్లలు కూడా తల్లిని రాణిలా చూసుకోసాగారు. కాళ్లకు మట్టి కూడా అంటనివ్వకుండా ఎంతో అపురూపంగా చూసుకోసాగారు. దగ్గరుండి హజ్ యాత్ర చేయించారు. హజ్ యాత్ర తిరుగు ప్రయాణంలో ఒక చోట ఒక వ్యక్తి చింపిరి జుట్టుతో రోడ్డుపక్కన దుర్భరస్థితిలో పడి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి చలించిపోయిన ఆ మహిళ ఆ అభాగ్యుడిని లేపి ఏదైనా తినిపించి మంచినీళ్లు తాగించాలని తన పిల్లలను కోరింది. పిల్లలు ఆ వ్యక్తిని లేపి కూర్చోబెడుతుండగా ఆ వ్యక్తిపై ఆమె దృష్టి పడింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిందా మహిళ. ఆ వ్యక్తి ఎవరో కాదు, తన మొదటి భర్త అని గుర్తుచేసుకొంది. ఈ దుస్థితికి కారణమేమిటని అడిగింది. దానికా వ్యక్తి ‘‘మా పిల్లలు నా ఆస్తినంతా కాజేసి నన్ను బయటకు గెంటేశారు’’ అని తన దీనస్థితిని చెప్పుకొచ్చాడు. అప్పుడామె కలగజేసుకొని ‘‘నీ ఈ దుస్థితిని మన పెళ్లయిన మొదటి రాత్రే అంచనా వేశాను. నువ్వు మీ అమ్మానాన్నల హక్కులు నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేశావు. వాళ్లను చులకనగా చూశావు. రేపటి రోజు నాకూ ఇదే గతి పడుతుందనే ఆ రోజు నీ నుంచి విడిపోయాను’’ అని చెప్పింది. మన వృద్ధాప్యం ఎలా గడపాలని కోరుకుంటున్నామో మన తల్లిదండ్రులకూ అలాంటి వృద్ధాప్యాన్ని అందించాలి. ముసలితనంలో వాళ్లను ఆదరించాలి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే బతికుండగానే ఆ పాపం మన మెడకు చుట్టుకుంటుందని ముహమ్మద్ ప్రవక్త (స) హెచ్చరించారు. – ముహమ్మద్ హమ్మాద్ -
టెట్ హాల్‌టికెట్ల జారీలో నిర్లక్ష్యం
ఒంగోలు: టీచర్స్ ఎలిజబిలిటీ టెస్టు (టెట్) హాల్ టికెట్ల జారీలో నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. దీని అనంతరం డీఎస్సీలో ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్న విద్యార్థులకు ఈ వ్యవహారం పిడుగుపాటుగా మారింది. స్థానికంగా కొప్పోలు రోడ్డులోని ఇందిరమ్మ కాలనీ 6వ లైనులో నివాసం ఉంటున్న ఎస్.సాయి పద్మిని టెట్ పరీక్షకు దరఖాస్తుచేసుకోగా ఇటీవల హాల్ టికెట్ నంబర్ 1710714314404 జారీ అయింది. అయితే ఆమెకు పరీక్ష కేంద్రం గుంటూరు జిల్లా నరసరావుపేటలోని చిలకలూరి పేట రోడ్డులో కేశనపల్లిలో ఉన్న కృష్ణచైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్‌ను కేటాయించారు. దీంతో ఆ సెంటర్‌ను విచారించుకునేందుకు కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లారు. తీరా ఎంత విచారించినా ఆ పేరుతో ఎటువంటి పరీక్ష కేంద్రం అక్కడ లేదు. దీంతో తమ కుమార్తె ఎలా పరీక్ష రాయాలో ఎలో రాయాలో తెలియక ఆందోళనతో బు«ధవారం రాత్రి మీడియాను ఆశ్రయించారు. పలువురు విద్యార్థులకు కూడా ఇలానే తప్పులు దొర్లాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంతా ఆందోళన చెందుతున్నారు. అధికారులు జోక్యం చేసుకోవాలి: విద్యార్థిని తల్లి జ్యోతి టెట్ పరీక్ష రాయడం ద్వారా నాలుగేళ్లలోపు జరిగే టీచర్ పరీక్షలకు అర్హత ఉంటుంది. అయితే పరీక్ష కేంద్రం అడ్రెసే లేకపోతే పరీక్ష ఎలా రాయాలి? మేము ఇప్పటికే సెంటర్‌కోసం అనేక విధాలుగా తిరిగాం. కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో మాత్రమే ఉంది. కానీ నరసరావుపేట , గుంటూరు జిల్లా అని హాల్‌టిక్కెట్‌లో ఇచ్చారు. తక్షణమే సెంటర్‌కు సంబంధించి స్పష్టత తెలియజేయాలి. -
నిర్లక్ష్యం ఖరీదు.. ఘర్షణ
సాక్షి, తిరుపతి : రెవెన్యూ, పోలీసు అధికారుల నిర్లక్ష్యం కారణంగా బుధవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లి పరిధిలో సర్వే నంబర్ 468/1, 3, 5, 6, 7, 8లో సుమారు మూడు ఎకరాల పొలం ఉంది. దీన్ని నెల్లూరు సెటిల్మెంట్ వారు 1984లో తమకు రఫ్ పట్టాలు ఇచ్చిన ట్లు లక్ష్మమ్మ, సుబ్బమ్మ వర్గీయులు చెబుతున్నారు. ఆ భూములు తమకు తండ్రి నుంచి సంక్రమించాయని మునెప్ప వర్గీయులు చెబుతున్నారు. ఈ భూముల విషయమై లక్ష్మమ్మ కోర్టును ఆశ్రయించినట్లు చెబుతున్నారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు మునెప్ప, తమకే అనుకూలంగా ఉందని లక్ష్మమ్మ వర్గీ యులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ మూడెకరాల్లో వరి పంట సాగైంది. దాన్ని తాము సాగు చేశామని మునెప్ప, లక్ష్మమ్మ చెబుతున్నారు. ప్రస్తుతం పం ట కోత దశకు చేరుకుంది. ఈ క్రమంలో పంట కోసేందుకు ఇరు వర్గాల వారు ప్రయత్నించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో నాగరాజు, మునీశ్వర్, రాజశేఖర్, శ్రీనివాసులు, మునిరాజ, వసంతకుమారి, స్వర్ణకుమారి, మునిలక్ష్మి, సంధ్య గాయపడ్డారు. రుయాలో చికిత్స పొందుతున్నారు. భూముల విషయం తేల్చని అధికారులు విలువైన ఆ భూమి ఎవరికి చెందుతుందనే విషయాన్ని తేల్చాలని ఇరు వర్గాల వారు రెవెన్యూ అధికారులను కోరారు. అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆ పొలంలో సాగు చేసుకునేందుకు ప్రయత్నించడం, గొడవలు పడడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం నిత్యకృత్యంగా మారిం ది. అందులో భాగంగా మూడు రోజుల క్రితం లక్ష్మమ్మ వర్గీయులు పోలీసు అధికారులను కలిసి తాము వరి కోత కోస్తున్నామని మునెప్ప వర్గీయులు అడ్డుకునే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో బుధవారం ఇరువర్గాల వారు దాడులకు దిగారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషయమై అలిపిరి ఎస్ఐ శ్రీనివాసులును వివరణ కోరగా భూమి వివాదాన్ని రెవెన్యూ అధికారులు తేల్చాల్సి ఉందన్నారు. తాము రక్షణ మాత్రమే కల్పిస్తామని తెలిపారు. -
నిండుప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమం): ఒకరి నిర్లక్ష్యం మరొకరి కుటుంబానికి తీరని అన్యాయం చేసింది. తమ ఇంటి దీపం ఆరిపోయిన పలువురి జీవితాలను నిలబెట్టేందుకు అవయవదానం చేసేందుకు పేద కుటుంబం ముందుకొచ్చింది. అయితే ప్రమాదానికి కారణమైన యువకుడిని పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిం చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయవాడ గొల్లపాలెంగట్టు బావి ప్రాంతంలో కాకి చిరంజీవి(45) భార్య రమణమ్మ, ఇద్దరు కుమార్తెలతో నివసిస్తున్నారు. చిరంజీవి అల్యూమినియం పాత్రల తయారీ పనిచేస్తారు. వచ్చే అరకొర సంపాదనలోనే కుమార్తెలను చదివిస్తున్నారు. ఈ నెల 18న చిరంజీవి మరో యువకుడితో కలిసి సైకిల్‌పై బంగారయ్య కొట్టు వైపు నుంచి వాగు సెంటర్ వైపు వెళ్తుండగా, ఓ యువకుడు డివైడర్‌పై నుంచి బైక్‌ను దూకించి సైకిల్‌ను ఢీకొట్డాడు. చిరంజీవి, అతనితో ఉన్న వ్యక్తి కూడా గాయపడ్డారు. చిరంజీవి తలకు గాయమై స్పృహకోల్పోవడంతో బైక్‌తో ఢీకొట్టిన వ్యక్తి సమీపంలోని డాక్టర్ వద్ద చేర్చి జారుకున్నాడు. ఈ తతంగం అంతా ఘటనా స్థలానికి కూతవేటు దూరంలో ఉన్న బ్యాకరీ ఎదుట ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలో రికార్డయింది. అనంతరం చిరంజీవిని 108పై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విజయవాడలో సరైన వైద్యం అందక గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురువారం సాయంత్రం బ్రెయిన్ డెడ్ కావడంతో అతని కుటుంబీకులు చిరంజీవి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి గురించి ఆరా తీసేందుకు బాధితుని బంధువులు కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా చేదు అనుభవం ఎదురైంది. సీసీ కెమెరాలో బైక్ నంబర్ సరిగా రికార్డు కాలేదని, కేసు దర్యాప్తులో ఉందంటూ పోలీసులు నిర్లక్ష్యంగా చెప్పారని బాధితులు ఆరోపించారు. న్యాయం జరగకుంటే సీఎంను కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. -
ఆస్పత్రుల్లో భద్రత కరువు!
ఆదిలాబాద్‌టౌన్: ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా రోగుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కనీస భద్రత ప్రమాణాలు పాటించుకుండా ఆస్పత్రి భవనాలు నిర్మిస్తున్నారు. జిల్లాలో చాలా మేరకు ప్రయివేటు ఆస్పత్రుల్లో అగ్నిమాపక పరికరాలు లేకపోవడంతో రోగుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. ఇటీవల హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం వల్ల ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. 2011లో కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో వంద మందికి పైగా రోగులు మృత్యువాత పడ్డారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోం, డయాగ్నోస్టిక్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఆస్పత్రి ముందు భాగంలోని వెలివేషన్‌కు నిప్పు అంటుకుంది. సరైన సమయంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడం, రోగులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోగుల ప్రాణాలు కాపాడే కేంద్రాలే నిబంధనలు పాటించక ప్రాణాల్ని హరించుకుపోతున్నాయి. ఆస్పత్రి యాజమాన్యం అగ్నిప్రమాద నివారణ చర్యలు చేపట్టకపోవడంతో షార్ట్ సర్క్యూట్‌తో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వైద్యారోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లాలో అంతే.. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగులకు ఎంత వరకు భద్రత ఉందనేదానికి సమాధానం లేదు. ఎందుకంటే జిల్లాలోని ఏ ఆస్పత్రిలోనూ అగ్నిప్రమాదాలను నిలువరించేందుకు కనీస పరికరాలు లేవు. ఆస్పత్రులకు అనుమతులు కూడా లేకపోవడం గమనార్హం. ఆస్పత్రుల్లో రక్షణ చర్యలు కూడా ఏమాత్రం కానరా>వడం లేదు. జిల్లాలో దాదాపు 50కి పైగా ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. ఏ ఒక్క ఆస్పత్రిలో కూడా అగ్నిమాపకశాఖ అనుమతులు లేకపోవడం గమనార్హం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేలాది మంది రోగులు చికిత్స పొందుతుంటారు. వారినుంచి చికిత్స పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ.. ఆస్పత్రుల యాజమాన్యాలు బహుళ అంతస్తులు నిర్మిస్తున్నాయి. కానీ అందులో ఎలాంటి భద్రత చర్యలు చేపట్టకపోవడం శోఛనీయం. 50 పడకలు అంత కంటే తక్కువ సామర్థ్యం ఉన్న చిన్న ఆస్పత్రులు, నర్సింగ్‌హోంలు, క్లినిక్‌ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇరుకు సందుల్లో సైతం వాటిని నిర్వహిస్తూ రోగుల నుంచి బలవంతంగా డబ్బులను వసూలు చేస్తున్నారు కానీ వారికి ఎలాంటి ప్రాణ రక్షణ కల్పించడం లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల భవనాలు నిర్మించేటప్పుడు అగ్నిమాపక శాఖ నుంచి తప్పనిసరిగా నో ఆబక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. కానీ ఈ సర్టి ఫికెట్ కోసం ఇప్పటివరకు ఎవరూ దరఖాస్తులు చేసుకోలేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదం జరిగితే.. నిబంధనలు పాటించకుండా ఉన్న ఆస్పత్రుల్లో, బహుళ అంతస్తుల్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటన్నది ఆందోళనకరం. చాలా ఆస్పత్రుల్లో కేవలం ఒకే ఒక మెట్ల మార్గం మాత్రమే ఉంటుంది. కొన్నింట్లో ఒకే లిఫ్ట్ ఉంటుంది. అగ్ని ప్రమాదం జరిగితే విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో లిఫ్ట్ పని చేయకపోతే ఒకే ఒక మెట్టు మార్గంద్వారా రోగులను, సహాయకులను బయటకు ఎలా తరలిస్తారన్నది ఆలోచించాల్సిన విషయమే. చుట్టూ అగ్నిమాపక శకటం తిరిగేంత స్థలం కూడా చాలా ఆస్పత్రుల పరిసరాల్లో ఉండడం లేదు. ఈ మంటలు పక్క భవనాలను వ్యాపించేలా ఆస్పత్రుల నిర్మాణం ఉంది. బయటి వెంటిలేషన్ లోపలికి వెళ్లకపోగా ప్రమాదం జరిగితే తీవ్రత ఎక్కువ ఉండే అవకాశాలూ లేకపోలేదు. పట్టించుకోని వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక శాఖలు.. జిల్లాలో ఏ ఒక్క ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా అగ్నిప్రమాదాలకు సంబంధించిన రక్షణ ఏర్పాట్లు చేయలేదు. అయినప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖలు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిబంధలనకు విరుద్ధంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో అగ్నిమాపక శాఖ అనుమతులు లేకుండా చాలా ఆస్పత్రులు నడుపుతున్నారు. అగ్నిప్రమాద నివారణ చర్యలు చేపట్టని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేయడంతో పాటు అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో రక్షణ ఏర్పాట్లు ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 15 మీటర్లు దాటితే మా పరిధిలోకి వస్తాయి.. 15 మీటర్లు దాటి భవనాలు నిర్మిస్తే మా పరిధిలోకి వస్తాయి. జిల్లాలోని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేస్తే వారు కోర్టుకు వెళ్లారు. ఉమ్మడి జిల్లాలో 12 మీటర్ల లోపు ఉన్న ఆస్పత్రులే ఉన్నాయి. ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఉంటే ప్రమాదాలు జరిగితే నివారించవచ్చు. ప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రం ఎన్ని మీటర్లతో సంబంధం లేకుండా కోర్టులో కేసు వేస్తాం. రోగులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చిన ఆస్పత్రుల్లో రక్షణ చర్యలు కల్పించుకోవాలి. – సందన్న, డివిజినల్ ఫైర్ అధికారి -
ఒక్క సుగుణమున్నా చాలు!
ఆత్మీయం భగవంతుడు ఎంతో దూరదృష్టి కలిగినవాడు కనుకనే ప్రతివారికీ ఏదో ఒక సుగుణాన్ని ప్రసాదించి తద్వారా వారికి ఎనలేని కీర్తి కలిగేలా దీవిస్తాడు. ఉదాహరణకు రాక్షసులకు ఉన్నంత దీక్ష, పట్టుదల దేవతలలో కనిపించవు. అందుకే దేవతలు రాక్షసుల ముందు తలవంచ వలసి వచ్చేది. తామనుకున్న కార్యం సాధించే వరకూ, సకల దుఃఖాలనూ ... చివరకు ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి తపస్సు చేసి, అసాధారణ వరాలు పొందగలిగిన రాక్షసులు తమకున్న ఓర్పు, పట్టుదల అనే సుగుణాలతో దైవాన్ని కూడా వశపరచుకోగలిగారు. మహాబలి దాతృత్వం ముందు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే వామనుడై చేయి సాచాడు. పదితలల రావణాసురుని భక్తి ముందు కైలాసనాథుడే ఆత్మలింగమై చేతికి చిక్కాడు. దుర్యో«దనుని స్నేహధర్మం ముందు అతడెంత దుర్మార్గుడైనా, శ్రీకృష్ణుడంతటి వాడిని కూడా నిర్లక్ష్యం చేసి, తన సర్వస్వాన్ని అతని పాదాక్రాంతం చేశాడు కర్ణుడు. వీరంతా ఎంతటి కర్కోటకులైనా, లోకకంటకులైనా, వారిలోని ఒక్క మంచిగుణంతో చరిత్రలో శాశ్వత కీర్తిని పొందగలిగారు. -
వంశధార నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం
-
నీట్ పరీక్షలో కాలేజీ యాజమన్యం నిర్లక్ష్యం
-
ఇన్విజిలేటర్ నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం
పినపాక(భద్రాద్రి కొత్తగూడెం): పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్ అయోమయంగా మారింది. భద్రాద్రి జిల్లా పినపాక మండలం ఎల్చి రెడ్డిపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల కేంద్రం రూం నంబర్1లో 20 మంది విద్యార్థులు శనివారం తెలుగు పేపర్–2 పరీక్ష రాశారు. ఆ గదిలోని ఇన్విజిలేటర్ విద్యార్థులకు మెయిన్ బుక్‌లెట్‌కు బదులు అదనపు సమాధాన పత్రాలు ఇచ్చాడు. కంగారులో ఉన్న విద్యార్థులు వెంటనే వాటిపై ఉన్న నంబర్‌నే ఓఎంఆర్ షీట్ మీద వేశారు. గంట తర్వాత విద్యార్థులు అడిషినల్ షీట్ అడిగారు. అప్పుడు అసలు తన టేబుల్ మీద మెయిన్ బుక్లెట్సే లేవన్న విషయం గమనిం చిన ఇన్విజిలేటర్ అధికారులకు తెలిపారు. సుమారు గంట తర్వాత విద్యార్థులకు మెయిన్ బుక్లెట్ ఇచ్చారు. ఇన్విజిలేటర్‌ను పరీక్షల విధుల నుంచి తొలగించా మని పరీక్ష కేంద్రం చీఫ్ సూప రింటెండెంట్ నాగశ్రీ తెలిపారు. -
నిరాదరణకు గురైతే రూ. పదివేల భరణం
- జిల్లా లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ - వృద్ధాశ్రమంలో న్యాయ విజ్ఞాన సదస్సు కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): కొడుకులు, కుమార్తెల నిరాదరణకు గురైన తల్లిదండ్రులు, వయోవృద్ధులు కనిష్టంగా పది వేల రూపాయల భరణం పొందేందుకు చట్టాలున్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ తెలిపారు. ఇందుకు వయోవృద్ధులు, ముసలి తల్లిదండ్రులు, రక్షణ, సంరక్షణ చట్టం-2007 అవకాశం కల్పిస్తోందన్నారు. అలాంటి వారు ఆర్డీఓకు దరఖాస్తు చేసుకుంటే నెలకు కనీసం పదివేల రూపాయల భరణం పోందే అవకాశం ఉందన్నారు. సోమవారం ఎలుకూరు ఎస్టేట్‌లోని శ్రీమాతా అన్న పూర్ణేశ్వరి వృద్ధుల ఆశ్రమంలో న్యాయ విజ్ఞానా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆస్తి రాయించుకున్న తరువాత వారి సంతతి నిరాదరణకు గురిచేస్తే ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు చెల్లవన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు ప్రసాదు, తిరుపతయ్య, అశ్రమ మేనేజర్ కేసీ రంగస్వామి పాల్గొన్నారు. -
రైతు ‘బంద్’
ఒంగోలు టూటౌన్ : రైతుబంధు పథకం అధికారుల నిర్లక్ష్యంలో నీరుగారుతోంది. ప్రచార లోపంతో అన్నదాత దరిచేరడంలేదు. గత ఆరు సంవత్సరాలలో ఈ పథకం కింద కొద్ది మంది రైతులే రుణాలు పొందారంటే ఈ పథకంపై ప్రచారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పథకం ప్రవేశపెట్టి ఏళ్లు గడుస్తున్నా రైతుల చెంతకు నేటికి చేరనేలేదు. రైతులకు ఎంతో ప్రయోజనకరమైన ఈ పథకం అమల తీరుపై సాక్షి కథనం.. మార్కెట్ యార్డుకు తరలిస్తున్న సమయంలో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం ఉంది. రైతు రూ. లక్ష వరకు బీమా పొందవచ్చు. నిల్వ చేసిన పంట ఉత్పత్తులకు 75 శాతం వరకు రుణం అందజేస్తారు. మూడు నెలల వరకు ఎలాంటి రుణం వసూలు చేయరు. మార్కెట్ యార్డులలో పెట్టిన పంట ఉత్పత్తులకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. పథకంపై కొరవడిన అవగాహన: ఏతలు నాడు ఉన్న ఉత్పత్తి ధరలు కోతల నాటికి తగ్గిపోతున్నాయి. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందని పరిస్థితి. అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. కాలం గాని కాలంలో ధరలు రోజురోజుకీ పెరుగుతున్నా.. రైతులకు మాత్రం దక్కడం లేదు. ఇళ్లలో నిల్వ చేసుకునే సామర్ధ్యం లేక చాలా మంది రైతులు పంట ఉత్పత్తులను తెగనమ్ముకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్ యార్డు సౌకర్యం, రైతుబంధు పథకం లాభాల గురించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేస్తే పథకాన్ని ఉపయోగించుకుంటారు. కానీ వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు ప్రచారాన్ని కరపత్రాలకే పరిమితం చేస్తున్నారు. ఏదోఒక సందర్భంలో రైతులతో జరిగే సమీక్షలలో ఒకటి, రెండు మాటలు చెప్పి కాలం వెళ్లబుచ్చుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు అన్నదాత దరి చేరటంలేదు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ప్రచారం కల్పిస్తున్నాం: రైతు బంధు పథకంపై విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్ నాటికి రూ.86.40 లక్షలను రైతులకు స్వల్పకాలిక రుణాలుగా అందించాం. పంట కోతల అనంతరం గిట్టుబాటు ధర లేనిపక్షంలో పథకం ఉపయోగించుకునేలా రైతులను చైతన్యవంతం చేస్తామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏడీ సయ్యద్ రఫీ అహ్మద్ తెలిపారు. పథకం ఉద్దేశం: రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసుకుని, రుణం మంజూరు చేసి వారిని ఆదుకోవడమే ఈ పథకం ఉద్దేశం. ముందుగా రైతులు ధాన్యాన్ని మార్కెట్ యార్డులలో నిల్వ చేసుకోవాలి. గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులు తమ ఉత్పత్తులను యార్డుల్లో ఉంచుకోవచ్చు. మార్కెట్ కమిటీలలో తనఖా ఉంచిన ధాన్యం విలువలో 75 శాతం వరకు రుణ సౌకర్యం కల్పిస్తారు. గతంలో లక్ష రుణం మంజూరు చేసేవారు. రెండేళ్ల క్రితం రుణ సదుపాయం దాదాపు రూ.2 లక్షల వరకు పెంచారు. ఏఎంసీల ద్వారా స్వల్పకాలిక రుణాలుగా ఇస్తారు. ఇటువంటి రుణాలకు 180 రోజుల వరకు ఎటువంటి వడ్డీ ఉండదు. అనంతరం 181వ రోజు నుంచి 270వ రోజు వరకు స్వల్పంగా 12 శాతం వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతం పథకం అమలుపరిస్థితి: ఆరేళ్లుగా ఈ పథకం ఆశించిన స్థాయిలో రైతుల దరి చేరలేదు. 2010–11లో 103 మంది మాత్రమే వినియోగించుకున్నారు. 2011–12 లో కేవలం 78 మాత్రమే ఉపయోగించుకోగా.. 2012–13 లో 70 మంది లబ్ధిపొందారు. 2013–14లో 97 మంది రైతులు వినియోగించుకోగా..2014–15 ఆర్ధిక సంవత్సరంలో 117 మంది రైతులు ఈ పథకం కింద రుణాలు పొందారు. 2015–16లో 91 మంది రైతులకే పరిమితమైంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నాటికి కేవలం 61 మంది రైతులు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. మొత్తం మీద గడిచిన ఆరేళ్లలో కేవలం 600 మందికి మాత్రమే ఈ పథకం ఉపయోగపడింది. జిల్లాలో ఆరు లక్షల వరకు రైతులు ఉంటే ఎంతో ప్రయోజనకరమైన ఈ పథకం ఏ కొద్ది మందికో ఉపయోగపడిందంటే పథకం ఏ స్థాయిలో నీరుగారుతోందో తెలుస్తోంది. రైతుకు ఎన్నో లాభాలు: వరి, మొక్కజొన్న, పెసర, ఆముదం, పొద్దుతిరుగుడు, ఉలవలు వంటి వ్యవసాయ ఉత్పత్తులకు రైతుబంధు పథకంలో స్థానం కల్పించారు. రైతులు పండించిన పంటను -
ఈ రోడ్లింతే.. విశ్వనగరం ఓ తంతే..!
ఫిల్‌గూడలో కుంగిన రహదారి గొరుు్యలో పడ్డ వాహనాలు ముగ్గురికి తీవ్ర గాయాలు మల్కాజిగిరి : విశ్వనగరమంటారు.. అద్దంలా మెరిపిస్తామంటారు.. గుంతలు పడ్డ రోడ్లనే సరిచేయలేని నాయకులు అద్భుతంగా మార్చేస్తామంటారు.. ఇది కాదన్నట్టు శాఖల మధ్య సమన్వయ లోపంతో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా తవ్వేస్తారు.. పనులు చేయకుండా కాలయాపన చేస్తుంటారు.. ఇదేంటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమిస్తారు. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే రహదారులు కుంగిపోరుు ప్రాణాలు పోయే పరిస్థితి తలేత్తినా పనులు చేపట్టడంలో మీనమేషాలు లెక్కిస్తుంటారు. మొన్న ఎన్టీఆర్ గార్డెన్ ముందు రోడ్డు కుంగిపోరుు ప్రమాదకరంగా మారిన విషయం మరువకముందే.. మల్కాజిగిరి సర్కిల్ రోడ్డు కుంగిపోరుుంది. దీన్ని సరిచేయక పోవడంతో వాహనదారులు అందులో పడిపోరుు ప్రాణాలు పోయేంత పరిస్థితి తలెత్తింది. వివరాల్లోకి వెళితే.. అక్కడ ఏం జరుగుతోంది..! మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో ప్రపంచ బ్యాంక్ నిధులతో మంచినీటి సరఫరా పనులను ఏడాది క్రితం ప్రారంభించారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో మెట్రో వాటర్ బోర్డు ప్రాజెక్ట్ విభాగం పర్యవేక్షణలో ఐహెచ్పీ కంపెనీ పైపులైన్ల ఏర్పాటు, రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టింది. డిఫెన్స కాలనీ నుంచి మల్కాజిగిరి వరకు ప్రధాన పైపులైన్ల ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతున్నారుు. ఈ పనుల తీరుపై ప్రజా ప్రతినిధులే అసంతప్తి వ్యక్తం చేశారు. రోడ్లను తవ్వి వదిలిపెట్టడంతో తలెత్తిన ఇబ్బందులపై విపక్షాలు సైతం ధర్నాలు చేశారుు. ప్రమాదం జరిగిందిలా.. సఫిల్‌గూడ ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో పైపులైన్ వేయడానికి రోడ్డును తవ్వినప్పుడు భూమిలో వివిధ పైపులు, బండరారుు అడ్డం వచ్చారుు. అదే ప్రాంతంలో చాణుక్యపురి రిజర్వాయర్ నుంచి కాలనీలకు మంచినీరు సరఫరా అయ్యే సబ్‌లైన్ కూడా ఉంది. పైపులైన్ ఏర్పాటుకు ఇబ్బందులు రావడంతో తవ్విన గొరుు్యని నిర్లక్ష్యంగా మట్టితో పూడ్చి వదిలేవారు. ఇదిలావుండగా.. శనివారం ఉదయం సఫిల్‌గూడ మినీ ట్యాంక్‌బండ్‌కు వాకింగ్‌కు కోసం ఆనంద్‌బాగ్‌కు చెందిన ఏసురత్నం వెళుతున్నారు. కృపా కాంప్లెక్స్‌కు చెందిన ఆంజనేయులు అతని వదినను తీసుకొని బైక్ మీద మల్కాజిగిరికి వస్తున్నారు. వీరిద్దరు ఒక్కసారిగా పైపులైన్ తవ్విన ప్రదేశం మీదుగా వెళుతుండగా ఆ ప్రాంతం కుంగిపోరుు ఆ గుంతలో వారు వాహనాలతో సహాపడిపోయారు. వెంటనే స్ధానికులు అప్రమత్తమై వారిని బయటకు తీశారు. ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యారుు. వీరి వాహనాలు గొరుు్యలో పడేముందే ఆర్టీసీ బస్సు వెళ్లిందని, ఆసమయంలో గనుక గొరుు్య పడివుంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. -
రుణ మాఫీ మాయ!
పొందూరు :స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జిల్లా అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా 62 కుంటుంబాల వారితో పాటు 15 స్వయంశక్తి సంఘాల సభ్యులకు రుణమాఫీ వర్తించకుండా పోయింది. ఎస్బీఐ శ్రీకాకుళం ఏడీబీ శాఖ, రాజాం ఎస్బీఐ, నరసన్నపేట ఎస్బీఐ, ఆమదాలవలస ఎస్బీఐ, కొత్తూరు ఎస్బీఐ శాఖలు సక్రమంగా వ్యవహరించడంతో ఆ ప్రాంతంలోని మొత్తం 47 చేనేత కుటుంబాల వారికి మాఫీ జరిగింది. ప్రభుత్వం 2014 మార్చి 31 నాటికి రుణ బకాయిలు ఉన్న వారికి మాఫీని వర్తింపజేశారు. అయితే దేశంలోనే చేనేత రంగానికి ఎంతో ప్రసిద్ధి చెందిన తమకు అన్యాయం జరిగిందని పొందూరు చేనేత కార్మికులంతా వాపోతున్నారు. తమ సంక్షేమం పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించడం అత్యంత దారుణమని పేర్కొంటున్నారు. స్థానిక సారుుబాబా చేనేత సహకార సంఘం పరిధిలోని 40 కుటుంబాల వారికి 2008 నుంచి 2013 వరకు ఇచ్చిన రుణాలతో పాటు ప్రైవేటు రంగంలో మరో 22 కుటుంబాల వారికి అలాగే ఎస్‌హెచ్‌జీల కింద ఉన్న కార్మికులకు ఇచ్చిన రుణాలు మాఫీ కాలేదు. ఒక్కో చేనేత కార్మికుడు రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు రుణాలు తీసుకొన్నారు. కొన్నాళ్లుగా బకారుులను చెల్లించాలని బ్యాంకు అధికారులు విపరీతమైన ఒత్తిడి తెచ్చి మానసిక క్షోభకు గురి చేశారని ఆరోపించారు. తాము పొదుపు చేసుకొన్న మొత్తాలను తమ అనుమతి లేకుండానే బకారుుల కింద దపదఫాలుగా జమ చేసుకొన్నారని కొందరు కార్మికులు ఆరోపించారు. బ్యాంకు నుంచి రుణ బకారుుల జాబితాలు జిల్లా పాలనా యంత్రాంగానికి పంపకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. జిల్లా అధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఇకనైనా బ్యాంకు అధికారులు తమకు న్యాయం చేయాలని లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే బకాయిలను పాక్షికంగా చెల్లించిన వారికి తిరిగి ఆ మొత్తాలను మాఫీలో భాగంగా వర్తింపజేయాలని వారు కోరుతున్నారు. అనుమతి లేకుండానే... నా అనుమతి లేకుండానే పొదుపు ఖాతాలో రూ.3,400 మొత్తాన్ని బకాయి కింద జమ చేశారు. కనీస విలువలు పాటించకుండా నిబంధనలకు విరుద్దంగా బ్యాంకు అధికారులు ప్రవర్తించారు. -మానెం పైడిరాజు, చేనేత కార్మికుడు కార్మికులకు న్యాయం జరిగే వరకు... కార్మికులకు న్యాయం జరిగే వరకు శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహిస్తాం. జరిగిన అన్యాయంపై జిల్లా పాలనా యంత్రాంగానికి నివేదించాను. అలాగే జిల్లా చేనేత శాఖ సహాయ సంచాలకులు గుత్తి రాజారావు దృష్టికి తేగా రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్‌తో మాట్లాడతా. -గంప వీరభద్రస్వామి, అధ్యక్షుడు, సాయిబాబా చేనేత సహకార సంఘం, పొందూరు ఎల్డీఎం ఏమన్నారంటే... ఈ విషయమై జిల్లా లీడ్ బ్యాంకు శాఖ మేనేజర్ (ఎల్డీఎం) పి.వెంకటేశ్వరరావు వద్ద సాక్షి మంగళవారం ప్రస్తావించగా పొందూరు ఎస్బీఐ నిర్వాకంపై విచారణ జరిపించాలని ఎస్బీఐ జోనల్ (శ్రీకాకుళం) ఉన్నతాధికారులకు లేఖను పంపిస్తున్నట్టు వివరించారు. కార్మికులకు న్యాయం జరిగేం దుకు కృషి చేస్తామని చెప్పారు. -
రుసువిల
బిల్లకల్లు చెరువుకు నిర్లక్ష్యపు గండి 15ఏళ్లుగామరమ్మతుకు నోచని సాగునీటి వనరు రెండుసార్లు రూ.43లక్షలు మంజూరైనా కదలని పనులు పునరుద్ధరణ అటవీశాఖ అధికారుల అభ్యంతరం అచ్చంపేట: నల్లమలలోనే రుసువుల చెరువు అతిపెద్దది. దీనికింద అత్యధికంగా చెంచుగిరిజనుల సాగుభూములు ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 545 ఎకరాలకు సాగునీరు అందుతుండగా.. వాస్తవంగా వెయ్యి ఎకరాలకుపైగా అందిస్తోంది. ఒకసారి నిండితే మూడుపంటలకు ఢోకా ఉండదు. మొదట కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ)ద్వారా నీటినిల్వ సామర్థ్యాన్ని ఐదు టీఎంసీలకు పెంచి అచ్చంపేట, బల్మూర్ మండలాలకు సాగునీరు అందించాలని ప్రణాళిక రూపొందించారు. అయితే 15ఏళ్లుగా చెరువుకట్ట మరమ్మతుకు నోచకపోవడంతో పెద్దపెద్ద గండ్లు పడి నీరంతా బయటికి వెళ్లిపోతోంది. ఫలితంగా నీళ్లులేక చెరువు కింద ఉన్న బిల్లకల్లు, కొండనాగుల, లక్ష్మీపల్లి గ్రామాల భూములు బీళ్లుగా మారుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువులోకి చేరిన నీరంతా గండిద్వారా వృథాగా చంద్రవాగులోకి వెళ్తోంది. 25 అడుగుల నీటిమట్టం ఉన్న ఈ చెరువు ప్రస్తుతం 16అడుగులకు చేరింది. గండి దిగువన కేవలం ఏడు అడుగుల నీళ్లు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. గండి నుంచి వృథాగా పోతున్న నీళ్లను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే దృష్టికి సమస్య గండిని పూడ్చి తమ పంటపొలాలకు సాగునీరు అందించాలని శనివారం రుసువుల చెరువు సందర్శించిన అచ్చంపేట గువ్వల బాలరాజు ముందు ఆయకట్టు రైతులు తమ గోడు వినిపించారు. ఈ చెరువును అభివృద్ధి చేస్తే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరడంతో పాటు పులులు, చిరుతలు, ఇతర అటవీజంతువులకు తాగునీరు అందే అవకాశం ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నీటివనరు మరమ్మతు చేపడితే రైతులు వలసలు వెళ్లకుండా ఉన్నచోటే వారికి ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడ్డారు. నిధులు మంజూరైనా నిట్టూర్పే! 2004లో అప్పటి క్రీడలశాఖ మంత్రి పి.రాములు రూ.40లక్షలు మంజూరు చేయించారు. అటవీశాఖ అభ్యంతరం చెప్పడంతో నిధులు వెనక్కివెళ్లాయి. 2005లో రాజీవ్‌పల్లెబాటలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ విజ్ఞప్తి మేరకు చెరువు మరమ్మతుకు రూ.43లక్షలు మంజూరుచేశారు. అటవీశాఖ మళ్లీ కొర్రీపెట్టడంతో పనులు ప్రారంభించలేదు. అప్పట్లో టెండర్లు పిలిచి అగ్రిమెంట్ చేసుకున్నా కాంట్రాక్టర్లు వెనకడుగు వేశారు. అటవీశాఖ అభ్యంతరం నల్లమల అభయారణ్యంలో చెరువు నిర్మాణం చేపడితే అటవీప్రాంతం నీటì లో మునిగి పర్యావరణానికి ముప్పుఉందని అటవీశాఖ చెబుతోంది. నిజానికి ఈ చెరువును అభివృద్ధిచేస్తే పర్యావరణానికి ముప్పు ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడంలో స్థానిక ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని రైతులు మండిపడుతున్నారు. రుసువుల చెరువును అభివృద్ధి చేస్తే పంటలకు సాగునీరు అందుతుందని, అడవిలోని జంతుజాలానికి తాగునీరు లభిస్తుందని వారు సూచిస్తున్నారు. -
మానవత్వానికి మచ్చ..!
వర్షంలోనే రోగిని వదిలేసిన గాంధీ సిబ్బంది హైదరాబాద్: ప్రభుత్వ అంబులెన్సలో తీసుకొచ్చిన ఓ రోగిని వార్డులో చేర్చకుండా ఆస్పత్రి బయటే వర్షంలో వదిలేశారు. వర్షంలో తడుస్తూ సదరు రోగి చేస్తున్న హాహాకారాలను అక్కడే ఉన్న కొంతమంది పట్టించుకోకుండా మానవత్వానికే మచ్చతెచ్చారు. నిన్నటికి నిన్న సీటీ స్కాన్ పనిచేయడం లేదని నిండు ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం.. నేడు వర్షంలో రోగిని వదిలేసిన ఈ హృదయవిదారక సంఘటన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నం జరిగింది. అస్వస్థతకు గురైన రోగి నరసయ్య కొద్దిరోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మంజూరైన డబ్బు వైద్యానికి ఖర్చు అరుుపోరుుంది. దీంతో సీఎం సహాయనిధి కోసం ప్రయత్నించమని తోటివారు సలహా ఇవ్వడంతో అతని భార్య గాంధీ ఆస్పత్రిలోని ఉచిత అంబులెన్సలో నరసయ్యను గురువారం బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకువె ళ్లింది. తిరిగి అదే అంబులెన్సలో మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం రోగిని అంబులెన్స నుంచి స్ట్రెచర్‌పైకి దించారు. అంతలోనే వర్షం పెరగడంతో స్ట్రెచర్‌పై రోగిని అలాగే వదిలేసి అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రధాన భవనం వద్ద స్ట్రెచర్‌ను తీసుకువెళ్లేందుకు ర్యాంపు లేకపోవడంతో రోగి భార్య దిక్కుతోచని స్థితిలో ఉండిపోరుుంది. సహాయం చేయమని కోరినా వర్షంలో తడిసిపోతామని అక్కడ ఉన్నవారు నిరాకరించారు. ఐదు నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్న ఓ వ్యక్తి వర్షంలో తడుస్తున్న రోగిని చూసి వార్డులోకి చేర్చేందుకు సహాయపడ్డాడు. -
అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
జీడిమెట్ల: ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణం తీశాయి. రోడ్డు గుంతల్లో ద్విచక్రవాహనం జారి పడింది. దానిపై ప్రయాణిస్తున్న గృహిణి రోడ్డుపై పడగా.. అదే సమయంలో దూసుకొచ్చిన బస్సు ఆమై నుంచి దూసుకెళ్లడంతో మృతి చెందింది. జీడిమెట్ల ఎస్సై లింగ్యానాయక్ కథనం ప్రకారం.. సురారం కాలనీకి చెందిన మన్మథరావు భార్య సంధ్య(25) ఆదివారం సాయంత్రం పనిపై స్కూటీపై ఎర్రగడ్డ వెళ్లింది. తిరుగు ప్రయాణంలో సురారం వెళ్లెందుకు జీడిమెట్ల మైలాన్ పరిశ్రమ వద్ద ఉన్న రోడ్డు గుంతల్లో స్కూటీ స్క్రిడ్ కావడంతో పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు (టీఎస్ యూబీ 0448) సంధ్యపై నుంచి వెళ్లింది. తీవ్ర గాయాలైన సంధ్యను స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ రాత్రి 9 గంటలకు మృతి చెందింది. సోమవారం భర్త మన్మథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గుంతలు పడ్డ రోడ్డుకు అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో నిండు ప్రాణం బలైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
నాడిపట్టకుండానే మందులు రాస్తున్నారు
సాక్షి, సిటీబ్యూరో: కొందరు వైద్యులు సామాజిక బాధ్యతను మరిచిపోయి సంపాధనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. మానవత్వాన్ని మరచి అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన నిరుపేదలను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. శనివారం హోటల్ ఆవాసలో జరిగిన కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్టర్ వార్షిక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం అన్ని వృత్తుల్లో చెడు ఉన్నట్లే వైద్య వృత్తిలోనూ చెడు ఉందన్నారు. మానవతా దృక్ప«థంతో అందించాల్సిన వైద్య సేవలను వ్యాపారంగా మార్చి “వైద్యో నారాయణోహరి’ అన్న పదానికి విలువ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మందులతో తగ్గని మొండి రోగాలను సైతం ఆత్మీయ పలకరింపు, స్పర్శతో తగ్గించే అవకాశం ఉందని, వైద్యపరంగా ఇది ఎన్నోసార్లు నిరూపితమైందన్నారు. అయితే కొందరు వైద్యులు రోగులు చెప్పిన విషయాన్ని పూర్తిగా వినకపోవడమే కాకుండా కనీసం బీపీ చెక్చేయకుండా, నాడీ పట్టి చూడకుండా మందులు రాసేస్తున్నారని, రోగుల ఆగ్రహానికి గురవడ మే కాకుండా న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. జబ్బులు, చికిత్సలు, మందులపై రోగుల్లో అవగాహన పెరిగిందన్న విషయాన్ని వైద్యులు గుర్తుంచుకోవాలన్నారు. నగరవాసులకు మాత్రమే గుండెజబ్బులు రావడం లేదని, మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలు కూడా గుండె జబ్బుతో బాధపడుతున్నారన్నారు. అయితే వీరిలో చాలా మంది చికిత్సకు నోచుకోలేక పోతుండటం దారుణమన్నారు. సామాజిక బాధత్యగా ప్రతి వైద్యుడు నెలలో ఒక్కరోజైనా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి రోగులకు చికిత్సలు అందించాలని సూచించారు. కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా టి.చాప్టర్ అధ్యక్షుడు జె.శివకుమార్ మాట్లాడుతూ సదస్సులో భాగంగా ప్రైమరీ యాంజియోప్లాస్టీ చికిత్సలపై 300 మంది కార్డియాలజిస్టులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ నరసరాజు, డాక్టర్ శ్రీధర్‌రెడ్డి పెద్ది, డాక్టర్ సీతారామ్, డాక్టర్ శ్రీధర్ కస్తూరి తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు
విద్యారణ్యపురి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ వలీఉల్లాఖాద్రీ విమర్శించారు. హన్మకొండలోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యను కాషాÄæూకరణ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సైతం విద్యావ్యవస్థను కార్పొరేట్æకబంధ హస్తాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ, జిల్లా కార్యదర్శి ఎన్.అశోక్‌స్టాలిన్, నాయకులు పొలెపాక వెంకన్న, ప్రవీణ్, గడ్డం నాగన్న, మహేందర్, ల్యాదల్లశరత్, శ్రవణ్, జన్నె అశోక్, చింత జగదీశ్, బిక్షపతి, వీరన్న, హరీష్ పాల్గొన్నారు. -
సైకిల్‌పై మంత్రి పర్యటన
పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలంటూ హెచ్చరిక మచిలీపట్నం: రాష్ట్ర బీసీసంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం సైకిల్‌పై పట్టణంలో పర్యటించారు. కోనేరుసెంటర్ నుంచి సైకిల్‌పై బయలుదేరిన ఆయన బస్టాండ్‌సెంటర్, జిల్లాకోర్టుసెంటర్, లక్ష్మీటాకీస్‌సెంటర్ మీదుగా మూడో వార్డులోని పెయింటర్స్‌కాలనీ, నీలగిరికాలనీల్లో పర్యటించారు. మంత్రి పట్టణంలోని మురికివాడల్లో పారిశుద్ధ్య సిబ్బంది విధులు ఏ విధంగా నిర్వహిస్తున్నదీ, సక్రమంగా విధులకు హాజరవుతున్నదీ లేనిదీ ఆరా తీయడంతో పాటు అభివృద్ధిపై ప్రత్యేక ఆరా తీశారు. పెయింటర్స్‌కాలనీ వాసులు తమ ప్రాంతంలో డ్రైనేజీ వసతి సరిగా లేదని, వర్షాకాలంలో కాలనీ మొత్తం తటాకంలా తయారవుతుందని మంత్రి ఎదుట వాపోయారు. కాలనీకి తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి డ్రైనేజీల అనుసంధానానికి మొదటి విడతగా రూ. 18 కోట్ల నిధులు మంజూరయినట్లు కాలనీ వాసులకు చెప్పారు. మంత్రి మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులందితే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్‌చైర్మన్ పి.కాశీవిశ్వనాథం, కౌన్సిలర్లు బత్తిన దాసు, నారగాని ఆంజనేయప్రసాద్, లోగిశెట్టి వీరాస్వామి పాల్గొన్నారు. -
సాగర మధనం... సాగేదెలా?
⇒హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులు మూలకు ⇒ఘన వ్యర్థాల తొలగింపుపై నిర్లక్ష్యం ⇒ఆస్ట్రియాలోని డాన్యుబ్ నది తరహాలో {పక్షాళన అవసరం ⇒కూకట్పల్లి నాలా మళ్లింపు పనుల పూర్తితో గరళ జలాల నుంచి విముక్తి ⇒ఘన వ్యర్థాలను హెచ్డీపీఈ పైపుల్లో నింపేందుకు అవకాశం నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్ సాగర్ సుందర తటాకంగా మారడం కలేనా...? తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన సాగర్ ప్రక్షాళన పనులు అటకెక్కినట్టేనా...? కాలుష్య కాసారంగా మారిన హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేయడం అసాధ్యమేనా....అంటే... ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. తెలంగాణ ప్రభుత్వం తొలుత చేసిన ప్రకటనలు చూసి.. మన సాగరం ఇక ఆస్ట్రియా దేశంలోని ‘డాన్యుబ్ నది’లా మారుతుందని నగరవాసులు ఆశించారు. ముక్కు మూసుకోకుండా స్వేచ్ఛగా...స్వచ్ఛమైన జలాల్లో విహరించొచ్చని భావించారు. విశ్వనగరి కాబోతున్న భాగ్యనగరికి హుస్సేన్ సాగర్ తలమానికమవుతుందని ఆనందించారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రక్షాళన పర్వంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. పనులపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో సాగర్ ప్రక్షాళన ఇప్పట్లే లేనట్లే అని భావించాల్సి వస్తోంది. సిటీబ్యూరో: ఒకప్పుడు స్వచ్ఛమైన తాగునీటితో మహానగర దాహార్తిని తీర్చిన హుస్సేన్ సాగరం.. దశాబ్దాలుగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక ఘన వ్యర్థాలను తన గర్భంలో దాచుకొని కాలుష్య కాసారంలా మారింది. ఈ సాగరానికి పూర్వపు వైభవం తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లక్రితం ఆర్భాటంగా ప్రకటించింది. ఈ కృషిలో భాగంగా కూకట్పల్లి నాలా మళ్లింపు పనులను ఇటీవలే పూర్తిచేయడంతో పారిశ్రామిక వ్యర్థాలు సాగరంలోకి చేరకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా..సాగరం అట్టడుగున పేరుకుపోయిన ఘన వ్యర్థాల తొలగింపుపై మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ వ్యర్థాలను తొలగించేందుకు ఆస్ట్రియాదేశంలోని డాన్యుబ్ నదిని ప్రక్షాళన చేసిన తరహాలోనే ఇక్కడా అదే విధానాన్ని అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గతేడాది ఆస్ట్రియా నిపుణుల బృందం సాగరాన్ని పరిశీలించి అందులోని నీటిని తొలగించకుండానే అడుగున పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు తమ వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని ప్రభుత్వానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది. కానీ ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సాగర్ ప్రక్షాళన నీటిమీద రాతలా మారింది. ఆస్ట్రియాలో డాన్యుబ్ నది ప్రక్షాళన ఇలా... ఆస్ట్రియా దేశంలోని డాన్యుబ్ నది ఒకప్పుడు గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ కార్యకలాపాల నుంచి వెలువడిన ఘన,ద్రవ,పారిశ్రామిక వ్యర్థాలతో కాలుష్య కాసారంగా మారింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఈ నదిని ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించింది. ఈపనులను 2015 చివరి నాటికి పూర్తిచేశారు. నదిలోని నీటిని తొలగించకుండానే అడుగున గడ్డకట్టుకుపోయిన వ్యర్థాలను ప్రత్యేకమైన యంత్రాలతో తొలగించి వీటిని జియోటెక్స్‌టైల్(మందమైన హెచ్డీపీఈ పైపులు)పైపుల్లో నింపి నది చుట్టూ కట్టలా ఏర్పాటు చేశారు. ఇక నదిలోకి మురుగు వ్యర్థాలు ప్రవేశిస్తున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ మురుగు జలాలను శుద్ధి చేసే ఎస్టీపీలు, హానికారక రసాయనాలను తొలగించే ఈటీపీ(ఎఫ్లుయెంట్ట్రీట్మెంట్ ప్లాంట్లు) ఏర్పాటు చేసి నీటిని శుద్ధి చేసిన అనంతరమే నదిలోకి వదులుతున్నారు. దీంతో ఒకప్పుడు దుర్గంధాన్ని వెదజల్లిన ఈ నది ఇపుడు మంచినీటి సాగరంలా మారింది. అంతేకాదు ఈ నది వద్ద ఏర్పాటు చేసిన ఈతకొలను ఇపుడు పర్యాటకులకు స్వర్గధామంలా మారింది. ఒకప్పుడు ఈ నది చెంతకు రావాలంటేనే భయపడిన స్థానికులు ఇపుడు ఇక్కడి ఆహ్లాద పరిస్థితుల్లో సేదదీరుదుతుండడం విశేషం. హుస్సేన్ సాగర్ శుద్ధీ సాధ్యమే..! సుమారు 900 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన హుస్సేన్‌సాగర గర్భంలో దశాబ్దాలుగా సుమారు 40 లక్షల టన్నుల ఘనవ్యర్థాలు పోగుపడి నట్లు అంచనా. ఘనవ్యర్థాలన్నీ గడ్డకట్టుకుపోయి గుట్టలా పేరుకుపోయాయి. ప్రభుత్వం గత రెండేళ్లుగా సాగరంలోకి పికెట్, బంజారా, కూకట్పల్లి, బుల్కాపూర్ నాలాల నీరు చేరుతున్న ప్రాంతాల్లో వ్యర్థాల తొలగింపు పనులు చేపట్టింది. సుమారు 5 లక్షల టన్నుల వ్యర్థాలను మాత్రమే తొలగించినట్లు సమాచారం. తొలగించిన వ్యర్థాలను సైతం పర్యావరణ సమస్యలు తలెత్తకుండా పీసీబీ అనుమతితో ఇక్కడి నుంచి తరలించి గాజులరామారంలోని క్వారీ గుంతల్లో నింపారు. మిగిలిన 35 లక్షల టన్నుల ఘన వ్యర్థాలు సాగర గర్భంలోనే మిగిలి పోవడంతో ప్రక్షాళన పర్వం ప్రహసనంగా మారింది. ఈ ఘన వ్యర్థాలను కూడా డాన్యుబ్ నది తరహాలో ఆస్ట్రియా సాంకేతిక పరిజ్ఞానంతో తొలగించి మందమైన హెచ్డీపీఈ పైపుల్లో నింపి సాగరం చుట్టూ కట్టలా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేని పక్షంలో సాగరం మధ్యలో ఐల్యాండ్(దీవి)మాదిరిగా వ్యర్థాలు నింపిన పైపులను ఏర్పాటు చేయవచ్చని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆస్ట్రి యా నిపుణుల సహకారం, సాంకేతికతతో మాత్రమే ఈ పనులు చేయగలుగుతారని..ప్రస్తుతం మన వద్ద అందుబాటులో ఉన్న విధానాలతో అట్టడుగున ఉన్న ఘన వ్యర్థాలను తొలగించడం సాధ్యపడదని స్పష్టంచేస్తుండడం గమనార్హం. విషం నుంచి విముక్తి ఇలా.. బాలానగర్, జీడిమెట్ల, పాశమైలారం తదితర పారిశ్రామిక వాడల నుంచి రోజువారీగా 500 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థజలాలు హుస్సేన్‌సాగర్‌లో చేరకుండా ఇటీవలే కూకట్పల్లి నాలా మళ్లింపు పనులను పూర్తిచేశారు. సుమారు రూ.53 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టారు. ప్రకాశ్‌నగర్ ఐఅండ్‌డీ(ఇంటర్ సెప్టార్ అండ్ డైవర్షన్)నుంచి మారియట్ హోటల్ దిగువ వరకు ఈ పనులను చేపట్టారు. ఈ మార్గంలో 2200 డయా వ్యాసార్థం గల భారీ మైల్డ్‌స్టీల్ పైపులైను ఏర్పాటు చేసి మారియట్హోటల్ అవతల ఉన్న హుస్సేన్‌సాగర్ సర్ప్లస్నాలా వరకు పారిశ్రామిక వ్యర్థ జలాలను సాగర్‌లోకి చేరకుండా దారి మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి ప్రకాశ్‌నగర్, గోల్నాక, అంబర్పేట్ మీదుగా మూసీలోకి ప్రవేశించే ఏర్పాట్లు చేశారు. మార్గమధ్యంలో అంబర్పేట్ మురుగుశుద్ధి కేంద్రం వద్ద ఈ పారిశ్రామిక వ్యర్థజలాల్లో ఉన్న ఘన వ్యర్థాలను తొలగించి మూసీలోకి వదులుతున్నారు. మిషన్ హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనలో మిగిలిన పనులివే.. ⇒{పధానంగా కలుస్తోన్న నాలాలు: పికెట్, బుల్కాపూర్, బంజారా నాలాలు ⇒జలాశయం నీటి నాణ్యత మెరుగుపరచడం, జలాశయంలోకి ఘనవ్యర్థాలు చేరకుండా చూడడం ⇒ మిగిలిన మూడు నాలాల నుంచి చేరుతున్న మురుగునీటిని దారి మళ్లించడం ⇒జలాశయంలో జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం ⇒ జలాశయం నీటిని ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్ అవసరాలకు వాడుకునేలా శుద్ధిచేయడం ⇒పికెట్‌నాలా వద్ద నీటి శుద్ధికి 30 ఎంఎల్డీ సామర్థ్యంతో మురుగుశుద్ధి కేంద్రం నిర్మాణం ⇒ హుస్సేన్‌సాగర్ వద్దనున్న 20 ఎంఎల్డీ ఎస్టీపీ అధునికీకరణ ⇒హుస్సేన్‌సాగర్ చుట్టూ రింగ్‌సీవర్ మెయిన్స్ నిర్మించి మురుగునీరు చేరకుండా చూడడం ⇒రంగధాముని చెరువు వద్ద 5 ఎంఎల్డీ సామర్థ్యంతో మినీ ఎస్టీపీ నిర్మాణం ⇒సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ట్రంక్సీవర్ మెయిన్స్ నిర్మాణం ⇒శుద్ధిచేసిన నీరు మాత్రమే జలాశయంలోకి ప్రవేశించే ఏర్పాటు ⇒జలాశయం అడుగున పేరుకుపోయిన వ్యర్థాలను డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా తొలగింపు ⇒జలాశయంలో ఆక్సీజన్ శాతం పెంచేందుకు ఏరియేషన్ వ్యవస్థ ఏర్పాటు ⇒జలాశయంలో నేరుగా పూజా సామాగ్రిని పడవేయకుండా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు ⇒హుస్సేన్‌సాగర్‌కు ఆనుకొని ఉన్న 22 మురికివాడలను ఎన్జీఓల సహకారంతో అభివృద్ధి ⇒సమీప బస్తీలు,కాలనీల్లో టాయిలెట్స్ నిర్మాణం. ⇒జలాశయంలో ఘన వ్యర్థాల తొలగింపునకు ప్రత్యేక యంత్రాంగం నెలకొల్పడం. ⇒మిషన్ హుస్సేన్‌సాగర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రజల భాగస్వామ్యం పెంచడం. -
చినుకు పడితే గుండె దడ దడ
వర్షాలు, గాలులకు తోడు భయపెడుతున్న పురాతన భవనాలు నగరంలో అధికారులు గుర్తించినా కూల్చనివి 274 నిర్లక్ష్యం వీడకపోతే ప్రాణనష్టం తప్పదంటున్న నిపుణులు సిటీబ్యూరో: క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో నగరంలో బుధవారం మళ్లీ గాలివాన బీభత్సం సృష్టించింది. ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 100 కి.మీ ప్రచండ వేగంతో ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల భారీ వృక్షాలు విరిగిపడడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ తీగలు తెగిపడడంతో పలు శివారు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. ఎస్.ఆర్.నగర్ బీకేగూడాలో ఓ భారీ వృక్షం కూలి ఆటో ధ్వంసమైంది. సనత్‌నగర్ బస్టాప్ వద్ద ఓ దుకాణంపై భారీ వృక్షం కూలింది. అశోక్‌నగర్ కాలనీలో ఓ భవనంపై ఉన్న రేకులు ఎగిరి పక్కనే ఉన్న పెంకుటిల్లుపై పడడంతో ఆ ఇల్లు ధ్వంసమైంది. బేగంపేట్ రసూల్‌పురా భరణి కాంప్లెక్స్ వద్ద ఓ భారీ వృక్షం కూలి మూడు కార్లు ధ్వంసమయ్యాయి. సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో ఓ భారీ వృక్షం కూలి రెండు కార్లు ధ్వంసమయ్యాయి. గాలివాన బీభత్సం నేపథ్యంలో బుధవారం సాయంత్రం జీహెచ్ఎంసీ మేయర్, వివిధ విభాగాల నోడల్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. జీహెచ్ఎంసీ అత్యవసర కాల్ సెంటర్‌కు అందిన ఫిర్యాదుల్లో.. విద్యుత్ సరఫరాలో అంతరాయంపై 26 ఫిర్యాదులు, చెట్లుకూలిన ఘటనపై 27 ఫిర్యాదులు అందినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. తక్షణం ఆయా సమస్యలను పరి ష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్ధన్‌రెడ్డి సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. కాగా సాయంత్రం 8.30 గంటల వరకు1.06 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ట్రాఫిక్ జాంఝాటం.. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గాలివాన రావడంతో అబిడ్స్, కోఠి, నాంపల్లి, లక్డికాపూల్, పంజగుట్ట, ఖైరతాబాద్, ఎస్.ఆర్.నగర్, అమీర్‌పేట్, సికింద్రాబాద్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో వర్షపునీరు రహదారులపై నిలిచి ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. వాహనదారులు, ఉద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ట్రాఫిక్‌లో చిక్కుకొని విలవిల్లాడారు. ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. కాగా మధ్యాహ్నం గరిష్టంగా 40.5 డిగ్రీలు, కనిష్టంగా 28.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ 89 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల 24 గంటల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదులు బుధవారం సాయంత్రం కురిసిన వాన, ఈదురుగాలుల వల్ల 30 ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలిగినట్లు, 25 చెట్లు కూలిపోయినట్లు జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదులందాయి. దాంతో వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణశాఖ ద్వారా అందిని హెచ్చరికలతో ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌కు చేరుకోవాల్సిందిగా ఆయా విభాగాల నోడల్ అధికారులకు సమాచారమిచ్చారు. కేవలం పదినిమిషాల్లోనే తక్షణ చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించారని పేర్కొన్నారు. సీతాఫల్మండి, జూబ్లీహిల్స్, చిలుకలగూడ, లోయర్‌ట్యాంక్‌బండ్, ముషీరాబాద్ ఎమ్మార్వో కార్యాలయం, బంజారాహిల్స్ రోడ్డునెంబర్ 12 తదితర ప్రాంతాల్లో కూలిన చెట్లను వెంటనే తొలగించినట్లు పేర్కొన్నారు. ఓయూ క్యాంపస్‌లో కూలిన చెట్లు గాలివానతో బుధవారం ఓయూ క్యాంపస్ అతలాకుతలం అయింది. విపరీతమైన గాలికి పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి కిందపడగా, కరెంట్ తీగలు తెగి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. టెక్నాలజీ విద్యార్థుల హాస్టల్ పైకప్పుపై చెట్టు విరిగిపడడంతో సిమెంట్ రేకులు విరిగిపోయాయి. దీంతో వర్షం నీరు హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి విద్యార్థుల పుస్తకాలు, దుస్తులు, ఇతర వస్తులు తడిచిపోయాయి. -
తెలంగాణపై రైల్వే నిర్లక్ష్యం
సందర్భం బ్రిటిష్ ఇండియా 96 ఏళ్ల (1853 -1947) హయాంలో 53 వేల కిలో మీటర్ల రైలుమార్గం నిర్మించారు. 68 ఏళ్ల స్వతంత్ర భారతంలో నిర్మించిన రైలుమార్గం 10 వేల కి.మీ. మన పాలకులు రైల్వే వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యం వహి స్తున్నారో చెప్పడానికి ఈ ఉదాహ రణ చాలు. ఇక భద్రత, పరిశుభ్రత కూడా అంతంత మాత్రమే. ఈ అంశాల పరిశీలన కోసం అనిల్ కకోద్కర్, శాంపిట్రోడా ఇచ్చిన నివేదికలు కూడా అమలుకు నోచుకోలేదు. 2004-2011 మధ్య రైల్వే ప్రయాణికుల చార్జీలు ఏమీ పెంచకుండా ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. నడికుడి-బీబీనగర్ మధ్య కొత్త రైలుమార్గం మినహా, మరో మార్గమేదీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. రెండేళ్ల క్రితం అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 బడ్జెట్లో బులెట్ రైళ్లను ప్రవేశపెడతామని చెప్పింది. తొమ్మిది ప్రధాన మార్గాలలో 160- 200 కి.మీ. వేగంతో రైళ్లను నడిపేందుకు కూడా ఆ బడ్జెట్ ఆమోదించింది. 2015-16 రైల్వే బడ్జెట్ మరీ ప్రత్యేకమైనది. ఒక్క కొత్త రైలును కూడా అది ప్రవేశ పెట్టలేదు. తొమ్మిది హైస్పీడ్, సెమీ హైస్పీడ్ మార్గాలలో ఏ ఒక్క దానికీ పనులు ప్రారంభం కాలేదు. కొన్నిచోట్ల దశాబ్దా లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. కొత్త రైలు మార్గాలు అందుబాటులోకి రాకుండా, పారిశ్రామికోత్పత్తులు, వ్యవసా యోత్పత్తులు అధికంగా జరిగే ప్రాంతాలకు విస్తరించకుండా ఆదాయం ఎలా పెరుగుతుంది? 1947 నాటి దేశ జనాభా 35 కోట్లు. నేటి జనాభా 120 కోట్లు పైనే. పెరిగిన 85 కోట్ల జనాభాకు అనుగుణంగా రైల్వేలు విస్తరించలేదు. ప్రాజెక్టు లలో తీవ్ర జాప్యం, అధిక వ్యయం, అవినీతి వంటి వాటితో రైల్వే సతమతమవుతోంది. రైలు ప్రయాణం కూడా రోజురోజుకూ భారమవు తోంది. 2014, జూన్ నుంచి ప్రయాణికుల చార్జీలను 14.2 శాతం, సరుకు రవాణా చార్జీలను 6.5 శాతం పెంచారు. అదే సంవత్సరం అక్టోబర్ నుంచి ప్రీమియర్ తత్కాల్ విధానంతో 50 శాతం టికెట్లను అధిక ధరలకు అమ్ముతున్నారు. సంవిధ రైళ్ల పేరుతో 20 శాతం టికెట్ల మీద 50 శాతం ధర పెంచి అమ్ముతున్నారు. అంటే 20 శాతం ప్రయాణికులకు మూడు రెట్ల చార్జీని వసూలు చేస్తూ ఆదాయం పెంచుకుంటున్నారు. ఇది 2015 జూలై నుంచి అమలవుతున్నది. ప్లాట్‌ఫాం టికెట్‌ను కూడా రూ. 5 నుంచి రూ.10లకు పెంచారు. రిజర్వేషన్ వ్యవధిని 120 రోజులు ముందుకు తెచ్చి, రద్దు చార్జీలను భారీగా పెంచారు. ఇలా టికెట్ల రద్దు ద్వారా రూ. 4 వేల కోట్ల ఆదాయం వస్తోంది. చిత్రంగా ప్రభుత్వాలు కొత్త మార్గాల నిర్మాణం, కొత్త రైళ్లు నడపడం, అదనపు బోగీలను జత చేయడం, కేటరింగ్ సదుపాయాలు వంటి అంశాలను నిర్లక్ష్యం చేస్తూనే, ఈ- కేటరింగ్, వైఫై, వేగవంతంగా రిజర్వేషన్, మొబైల్ యాప్; టెక్నాలజీ వెబ్సైట్, బయో టాయ్‌లెట్స్ అంటూ చిన్న చిన్న అంశాలను బడ్జెట్లో హైలైట్స్‌గా చూపుతున్నారు. గత దశాబ్ద కాలంలో కాట్రా-ఉదంపూర్ మార్గాన్ని (345 కి.మీ.) 2014 జూలైలో ప్రారంభించడం తప్ప, మరో మార్గమేదీ పూర్తి చేసిన దాఖలాలు లేవు. ఒక్కొక్క రాష్ట్రానికి సంవత్సరా నికి రూ. 1,000 కోట్ల వంతున కేటాయిస్తే ప్రతి రాష్ట్రంలో నాలుగేసి కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఇందు కోసం నాలుగేళ్ల కాలంలో రూ.28,000 కోట్ల వంతున కేటా యిస్తే 112 కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. అలాగే వేల కోట్లతో వ్యాపారాలు నిర్వహించే పారిశ్రామిక వేత్తలు కార్పొరేట్ సామాజిక బాధ్యతతో రూ. 500 కోట్లు వెచ్చించి ఒక్కొక్క మార్గాన్ని నిర్మించి జాతికి అంకితం చేయ వచ్చు. అలాగే ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి కొత్త మార్గాల నిర్మాణానికి నిధులు కేటాయించవచ్చు. అలాగే గ్రీన్ స్టేషన్లు, మోడల్ స్టేషన్లు, గ్రానైట్ స్టేషన్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఆపాలి. తెలంగాణ దుస్థితి నిజాం పాలన తరువాత 1966లో సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వేను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నడికుడి నుంచి సికింద్రాబాద్ శివార్లలోని బీబీనగర్ మధ్య 163 కి.మీ. మార్గాన్ని నిర్మించడం మినహా మరో మార్గమేదీ తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రాలేదు. పెద్దపల్లి- కరీంనగర్-నిజామాబాద్ మధ్య 177 కి.మీ. మార్గానికి 1994లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు అనుమతిం చారు. ఇందులో పెద్దపల్లి-కరీంనగర్ మార్గం నిర్మాణం 2001 నాటికే పూర్తయింది. కానీ కరీంనగర్-నిజామాబాద్ మార్గం పనులు నేటికీ పూర్తి కాలేదు. భద్రాచలం -కొవ్వూరు మధ్య కొత్త మార్గం నిర్మాణ ప్రతిపాదనకు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మోక్షం లభించలేదు. 2010లో అను మతి లభించినా ఇంతవరకు నిర్మాణం ఆరంభం కాలేదు. మణుగూరు-రామగుండం, అక్కన్నపేట-మెదక్-మేడ్చల్, కొండపల్లి-కొత్తగూడెం, గద్వాల్-మాచర్ల మార్గాల నిర్మా ణానికి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందే ఒప్పందం జరిగింది. 50:50 ఖర్చు భరించేందుకు అంగీకారం కుదిరింది. అయినా నిర్మాణం ఆరంభం కాలేదు. వీటిని 2010-11 బడ్జెట్లో ఆమోదించారు. 2011-12 బడ్జెట్లో అక్కన్నపేట-మెదక్, భద్రాచలం- కొవ్వూరుల ప్రస్తావన ఉంది. మహబూబ్‌నగర్-గుత్తి, సికింద్రాబాద్-మద్కేడ్- ఆది లాబాద్ మార్గాలలో రెండవ మార్గం నిర్మాణానికి ఆమోదం లభించింది. మనోహరాబాద్-కొత్తపల్లి మార్గానికి ఆమోదం లభించినా కేటాయింపులు లేవు. కరీంనగర్- నిజామాబాద్ మార్గం పూర్తయితే ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలా బాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. చెన్నై, ముంబై, తిరుపతి వెళ్లేవారికి సౌకర్యం పెరుగుతుంది. భద్రాచలం-కొవ్వూరు మార్గం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలు బెంగాల్ వైపు నేరుగా రాక పోకలు సాగించవచ్చు. సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రమే కాదు, పెద్ద కూడలి. నిత్యం 130 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. కానీ పది ప్లాట్‌ఫారమ్‌లు మాత్రమే ఉండడం వల్ల కొన్ని రైళ్లు గంటల తరబడి స్టేషన్ బయట వేచి ఉండవలసిన పరిస్థితి నెలకొంది. కానీ ఈ ప్లాట్‌ఫారాల సంఖ్య పెంచే సూచన ఏదీ లేదు. దీనితో నిత్యం గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో ప్లాట్‌ఫారాల సంఖ్య పెంచి కొన్ని రైళ్లను నేరుగా అక్కడకు పంపడం వల్ల సికింద్రాబాద్‌కు ఒత్తిడి తగ్గుతుంది. చర్లపల్లిని టెర్మినల్‌గా పెట్టాలని భావిస్తున్నా, అది సమస్యను పరిష్కరించేది కాదు. అన్ని ప్రధాన స్టేషన్లలో లిఫ్ట్ సౌకర్యం, మెడికల్ షాపుల ఏర్పాటు, పరిశుభ్రమైన ఆహారం అందుబాటులోకి తేవాలి. 50:50 ప్రాతిపదికన ప్రాజెక్టుల పూర్తికి కృషి చేయాలి. (రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా) వ్యాసకర్త సోషల్ అవేర్నెస్ కాంపెయిన్ సభ్యురాలు ఎం. రోజాలక్ష్మి మొబైల్: 94410 48958 -
రాంగ్ రూట్‌పై నజర్
ఆధునిక టెక్నాలజీ వినియోగించనున్న ట్రాఫిక్ కాప్స్ నగరంలో 100 చోట్ల కెమెరాల ఏర్పాటు ‘ఉల్లంఘనులకు’ జనవరి నుంచి ఈ-చలాన్లు ‘తొంబై తొమ్మిది సార్లు ఉల్లంఘించినా ఏ ఇబ్బందీ రాకపోవచ్చు... వందోసారైనా మూల్యం చెల్లించక తప్పదు’ ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలో అధికారులు పదేపదే చెప్పే మాట ఇది. ఈ మూల్యం ఉల్లంఘనకు పాల్పడిన వాహనచోదకుడు చెల్లిస్తే ఒక ఎత్తు. అదే... ఏ పాపం ఎరుగని ఎదుటి వ్యక్తిపై ప్రభావం చూపితే... ఆ కుటుంబం బాధ, వ్యధ వర్ణనాతీతం. ప్రస్తుతం నగరంలో నిత్యం అనేక కుటుంబాలు ఈ క్షోభను అనుభవిస్తున్నాయి. ఉల్లంఘనులు ‘పొరపాటుగా’ అని భావించే అనేక అంశాలు బాధితుల పాలిటి గ్రహపాటుగా మారుతున్నాయి. ఇలాంటి ‘పొరపాట్ల’లో రాంగ్ రూట్..., నో ఎంట్రీ మార్గాల్లోకి వాహనాలతో రావడం ప్రధానమైంది. నిర్లక్ష్యంతో కూలిపోతున్న కుటుంబాలు.. నగరంలో ఇలా రాంగ్ రూట్/నో ఎంట్రీ మార్గాల్లో దూసుకుపోతూ ప్రమాదాలకు గురికావడంతో పాటు వాటికి కారకులుగా మారుతున్న ఉదంతాలు ఎన్నో ఉంటున్నాయి. కాస్తదూరం ముందుకు వెళ్లి ‘యూ టర్న్’ తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్న వాహనచోదకులు... అది వన్ వే అని ... రాంగ్ రూట్ అని తెలిసి కూడా దూసుకుపోతున్నారు. నో ఎంట్రీ మార్గాలనూ వీరు వదలట్లేదు. ఇలాంటి వాహనచోదకులు నిత్యం చిన్న చిన్న ప్రమాదాలకు లోనవడంతో పాటు కారకులవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఎదుటి వారి ఉసురు తీసి వారి కుటుంబాన్నే కకలావికలం చేస్తున్నారు. 2013లో జరిగిన ముషీరాబాద్ ఏఎస్సై సత్యనారాయణ మరణమే దీనికి నిదర్శనం. ఇప్పటి వరకు బారికేడ్లు, కెమెరాలతో... సిటీలోని అనేక జంక్షన్లతో పాటు కొన్ని కీలక ప్రాంతాల్లో ఈ రాంగ్ రూట్, నో ఎంట్రీ ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆయా చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసినా ఉల్లంఘనుల్ని అడ్డుకోలేకపోతున్నారు. దీంతో కెమెరాలతో కానిస్టేబుళ్లు, హోంగార్డుల్ని మోహరిస్తున్నారు. వీరు ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడే వారి వాహనాలను ఫొటోలు తీసి, ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ-చలాన్ పంపుతున్నారు. అయితే అన్ని వేళల్లో, ప్రధానంగా రాత్రిపూట ఈ పాయింట్లలో సిబ్బంది లేకపోవడంతో ఉల్లంఘనులు రెచ్చిపోయి తమ ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా ఇతరుల ప్రాణాలు తీయడం చేస్తున్నారు. దీనికి పరిష్కారంగానే ట్రాఫిక్ పోలీసు విభాగం ఏఆర్‌డీవీసీఎస్ పరిజ్ఞానాన్ని అమలులోకి తెస్తోంది. వచ్చే నెల నుంచి అందుబాటులోకి... ఈ తరహా ఈ-చలాన్లు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచేసే వాహనచోదకులపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రెండు కమిషనరేట్లకు చెందిన పెండింగ్ డేటాను ఇంటిగ్రేడ్ చేయడం, బకాయిదారులకు సంక్షిప్త సందేశాలు పంపడం, రహదారులపై పీడీఏ మిషన్ల ద్వారా తనిఖీలు చేసి చర్యలు తీసుకోవడం, ఎక్కువ సంఖ్యలో పెండింగ్ చలాన్లు ఉన్న వారిపై న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేయడం తదితర చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఓపక్క ఉల్లంఘనల్ని నిరోధించడం ... మరోపక్క ఈ-చలాన్ బకాయిలు వసూలు చేయడం సాధ్యమవుతుందని అధికారులు చెప్తున్నారు. టెండర్ల దశను పూర్తి చేసుకున్న ఏఆర్‌డీవీసీఎస్ విధానం వచ్చే నెల నుంచి పని చేయడం ప్రారంభించనుంది. ఇలాంటి టెక్నాలజీ అనుసంధానిత విధానాల వల్ల వాహనచోదకులతో ట్రాఫిక్ సిబ్బందికి ఘర్షణలు, వాగ్వాదాలకూ అస్కారం ఉండదని అధికారులు చెప్తున్నారు. నగర వ్యాప్తంగా 100 చోట్ల... ఆటోమేటిక్ రాంగ్ డెరైక్షన్ వైలేషన్ క్యాప్చర్ సిస్టం (ఏఆర్‌డీవీసీఎస్)గా పిలిచే ఈ సాఫ్ట్‌వేర్‌ను బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ సర్వర్‌లో నిక్షిప్తం చేస్తారు. దీన్ని నగరంలో ఈ తరహా ఉల్లంఘనలకు అవకాశం ఉన్న జంక్షన్లలో ఇప్పటికే ఉన్న సర్వైలెన్స్ కెమెరాలను అనుసంధానిస్తారు. జంక్షన్లు కాకుండా ఇతర చోట్ల ఈ ఉల్లంఘనలు జరుగుతున్న ప్రాంతాల్లో కొత్తగా కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇలా నగర వ్యాప్తంగా 100 చోట్ల ఉండే కెమెరాలన్నీ కంట్రోల్ రూమ్‌లోని సర్వర్‌కు అనుసంధానిస్తారు. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ప్రత్యేక ప్రోగ్రామింగ్ ఆయా మార్గాల్లో నిర్దేశించిన రూట్లలో కాకుండా వాటికి వ్యతిరేకంగా వచ్చే వాహనాలను గుర్తించి, ఫొటో తీసి, కంట్రోల్‌రూమ్ సర్వర్‌కు పంపుతుంది. అక్కడ ఈ-చలాన్‌ను జనరేట్ చేసి వాహనచోదకుల చిరునామాకు పంపేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. -
కనుమరుగు
ఉండీ ఉపయోగం లేని మరుగుదొడ్లు నిర్మాణం పూర్తయినా తాళాలు తీయరు నీటి వసతి అంతంతమాత్రమే ఇక్కట్లపాలవుతున్న విద్యార్థినులు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులు మరుగు దొడ్లు లేక ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థలు, సర్వశిక్షాఅభియాన్ ద్వారా మరుగుదొడ్లు నిర్మించినా వాటికి తాళాలు వేసి ఆయా పాఠశాలల హెచ్ఎంలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. దీంతో ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థినుల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా నీటి వసతి లేదు. ఇంకొన్నిచోట్ల పైప్‌లైన్ ఉన్నా సక్రమంగా పనిచేయడం లేదు. మరుగుదొడ్లకు తలుపులు విరిగిపోతే మరమ్మతులు చేయించని పరిస్థితి నెలకొంది. పలు ఉన్నత పాఠశాలలను ‘సాక్షి’ బృందం పరిశీలించగా ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. మచిలీపట్నం : సర్కారు పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. స్వచ్ఛ భారత్ పేరిట పాఠశాలల్లో కార్యక్రమాలు చేయడం తప్ప అక్కడి ఆడపిల్లలు పడే ఇబ్బందులను పట్టించుకోకుండా ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరు విస్మయం గొల్పుతోంది. సర్వశిక్షా భియాన్, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జిల్లాలోని 3,224 పాఠశాలల్లో 1,105 మరుగుదొడ్లు నిర్మించారు. జిల్లాలో 458 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో ఆరు నుంచి పదో తరగతి వరకు 70 వేల మందికి పైగా విద్యార్థినులు చదువుతున్నారు. గెయిల్, బీహెచ్ఈఎల్, ఓఎన్జీసీ, బెల్ వంటి ప్రభుత్వరంగ సంస్థలు పాఠశాలల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల మరుగుదొడ్లు నిర్మించారు. వీటికి తాళాలు వేసి హెచ్ఎంలకు అప్పగించారు. అయితే వాటిని ఇంకా ప్రారంభించకపోవడం గమనార్హం. సర్వశిక్షాభియాన్ లెక్కల ప్రకారం 40 మంది పిల్లలకు ఒక మరుగుదొడ్డి, ఒక బాత్రూమ్ ఉండాలి. ఇప్పటి వరకు 1,105 మరుగుదొడ్లు నిర్మించగా, మరో 130 నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపారు. మచిలీపట్నం నియోజకవర్గంలో గుండుపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వరంగ సంస్థ ఇటీవల ఆడపిల్లల కోసం మరుగుదొడ్లను నిర్మించింది. వీటిని ప్రారంభిం చకుండా తాళం వేసి ఉంచారు. చిన్నాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. మరుగుదొడ్లు చుట్టూ వర్షపునీరు, వృధా నీరు చేరి తటాకాన్ని తలపిస్తోంది. తిరువూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ నీటి వసతి లేదు. నీటి కుండీ పనిచేయడం లేదు. ఎ.కొండూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కైకలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 400 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఇక్కడ రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. నీటి వసతి సక్రమంగా లేదు. కంకిపాడు మండలంలోని పునాదిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 261 మంది బాలికలు ఉన్నారు. ఇక్కడ కేవలం మూడు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. కాటూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మూడు మరుగుదొడ్లను ఓఎన్జీసీ సంస్థ నిర్మించింది. వీటికి తాళాలు వేసి ఉంచారు. తోట్లవల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 250 మంది బాలికలు చదువుతున్నారు. ఇక్కడ నాలుగు మరుగుదొడ్లు ఉండగా వీటిలో ఒకటి పాడైంది. పామర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 341 మంది విద్యార్థినులు ఉన్నారు. మూడు మరుగుదొడ్లే ఉన్నాయి. నీటి సదుపాయం సరిగా లేదు. మోపిదేవి మండలం వెంకటాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. మరుగుదొడ్లకు వెళ్లే దారి వెంబడి పిచ్చిమొక్కలు మొలిచి విషసర్పాలు సంచరిస్తున్నాయి. గుడివాడ పట్టణంలోని ఏకేసీపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 410 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఎనిమిది మరుగుదొడ్లు ఉన్నాయి. వీటికి తలుపులు లేవు. నీటి వసతి లేదు. బాత్రూమ్కు వెళ్లాలంటే విద్యార్థినులు క్యూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. జగ్గయ్యపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో మరుగుదొడ్లు నిర్మించినా అవి ఇరుకుగా ఉండటంతో విద్యార్థినులు ఇబ్బందిపడుతున్నారు. పెనుగంచిప్రోలు మండలం అనిగళ్లపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నా నీటి వసతి లేదు. వత్సవాయి జెడ్పీ ఉన్నత పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
ఏమారితే ప్రమాదమే !
ప్రధాన పట్టణాల్లో చాలా చోట్ల మూతలు లేని మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతున్న డ్రైన్లు గేట్లు లేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద {పయాణికుల పాట్లు {పమాద కేంద్రాలను పట్టించుకోని పాలకులు, అధికారులు జిల్లా వ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో కప్పుల్లేని మ్యాన్‌హోల్స్ .. మూతల్లేని డ్రయినేజీ కాలువలు ప్రమాదాలకు నిలయాలుగా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల అలక్ష్యం కారణంగా ప్రయాణికులు కాస్త ఏమారితే అవస్థలు పడాల్సి వస్తోంది. నోళ్లు తెరుచుకున్న కాలువలు, రహదారుల పక్కనున్న బావులు పాదచారులు, వాహనదారుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. కాపలాదారులు, గేట్లు లేని రైల్వే క్రాసింగ్‌లు ప్రమాద కేంద్రాలుగా ఉన్నా పట్టించుకునేవారు లేరు. తిరుపతి: జిల్లాలో మ్యాన్‌హోల్స్ ప్రమాదకరంగా మారాయి. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె తదితర ప్రధాన ప్రాంతాల్లో సైతం నోర్లు తెరుచుకుని మనుషులను మింగేస్తున్నాయి. వీటిలో విద్యార్థులు, స్థానికులు పడి ప్రమాదాలకు గురవుతున్నా కార్పొరేషన్, మున్సిపాలిటీ అధికారులు తమకు పట్టనట్లు వ్యవ హరిస్తున్నారు. వర్షం పడితే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మోకాలు లోతుకు పైగా నీళ్లలో రోడ్లపైన నడవాల్సిన దుస్థితి నెలకొంది. రో డ్లు సెలయేర్లను తలపిస్తున్నాయి. కాలనీ లు చెరువులుగా మారుతున్నాయి. ప్రధానకారణం కాలువలు, మ్యాన్ హోల్స్ పూడిపోవడమే. మురుగు నీరు రోడ్లవైనే ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు పలుచోట్ల అవస్థలు పడుతున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా మారి, ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. రోడ్డు పక్కన ఉన్న ప్రధాన మార్గాల్లో పెద్ద కాలువలపైన శ్లాబ్ వేసి వాటిని పాదచారులకు ఫుట్‌పాత్‌లుగా అందుబాటులోకి తెచ్చారు. కొన్ని చోట్ల పనులు నాసిరకంగా చేయడమేగాక బిల్లులు అందలేదనే సాకుతో కొందరు కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే వదిలివేశారు. అవే పాదచారుల పాలిట శాపంగా మారుతున్నాయి. తిరుపతి నగరంలోని అన్నమయ్య సర్కిల్ నుంచి పాస్‌పోర్ట్ కార్యాలయం మీదుగా లక్ష్మీపురం సర్కిల్ వరకు, రామానుజ సర్కిల్ నుంచి పద్మావతీ కల్యాణ మండపాల వరకు నిర్మించిన పెద్ద కాలువలే ఇందుకు నిదర్శనం. జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో కొద్ది వర్షానికే పల్లపు ప్రాంతంలోని కాలనీలు మునుగుతున్నాయి. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో జిల్లా కలెక్టర్, కమిషనర్ నిత్యం ప్రయాణించే ప్రధాన మార్గంలో మ్యాన్ హోల్స్ తెరుచుకునే ఉన్నా పట్టించుకునే నాథుడే లేరు. ఇప్పటికే వీటిలో పడి పలువురికి గాయాలయ్యాయి. కొన్నిచోట్ల మ్యాన్‌హోల్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి. నగరమంతా ఓపెన్ డ్రైన్లు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే ఇళ్ల మధ్యలోకి మురుగు నీరు చేరుతోంది. మదనపల్లెలో పరిస్థితి అధ్వానంగా ఉంది. టీటీడీ కల్యాణ మండపం సమీపంలో ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి పలువురు విద్యార్థులు గాయాల పాలయ్యారు. స్థానికులే వాటిపై కంపచెట్లను వేసి కప్పి వేయడం గమనార్హం. ఆర్టీసీ బస్టాండుతో పాటు పలు ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ తెరుచుకునే ఉన్నాయి. పలమనేరు బస్టాండు సమీపంలో రోడ్డు పక్కనే కాలువ ప్రమాదకరంగా ఉంది. అక్కడ ఇటీవలే ఆటో బోల్తా పడి ముగ్గురికి గాయాలయ్యాయి. అయినా మున్సిపాలిటీ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. సీఎం సొంత ఇలాకా కుప్పంలో సైతం ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్, ప్యాలెస్ ఎక్స్టెన్షన్ ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ తెరుచుకుని ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రైల్వే గేట్ల వద్ద ప్రజలకు తిప్పలే.. జిల్లాలో రేణిగుంట అవుటర్ నుంచి పాకాల వరకు 25 గేట్లు ఉన్నాయి. ఇందులో పాకాల సమీపంలోని బాలినేనిపల్లె, గుడిపల్లె, మొరవవల్లె ప్రాంతాల్లో కాపలాదారులు లేని గేట్లు ఉన్నాయి. గేట్లు ఉన్న ప్రాంతాలు తిరుపతి నగరంలోని ఆర్సీ రోడ్డు, తుమ్మల గుంట సమీపంలోని చిత్తూరు జాతీయ రహదారి, చదలవాడ కాలేజీ, పద్మావతి డిగ్రీ కాలేజీ ప్రాంతాల్లో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మదనపల్లె ప్రాంతంలోని సీటీఎం, కాశీరావుపేట ప్రాంతాల్లో కాపలాలేని రైల్వేగేట్లు ఉన్నాయి. -
కార్పొరేట్ ఉరితాళ్లు
కార్పొరేట్ విద్యావిధానం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసానికి బదులు ఒత్తిడిని పెంచుతోంది. హాస్టళ్లు కార్పొరేట్ జైళ్లుగా మారాయి. నిర్బంధాలను భరించలేక కొందరు, భయంతో మరికొందరు విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. చిన్న వయసులోనే తమ నూరేళ్ల జీవితాన్ని అర్ధంతరంగా ముగిస్తున్నారు. తల్లి దండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. కాలేజీల యాజమాన్యాలు మాత్రం పిల్లలు చనిపోతే మేమేమి చేస్తామంటూ శవాలను తల్లిదండ్రులకు అప్పగిస్తున్నాయి. మరి నేటి విద్యావిధానంలో మార్పు వచ్చేదెన్నడు!? - విద్యార్థి దశలోనే బలవన్మరణాలు - తల్లిదండ్రులకు మిగుల్చుతున్న కడుపుకోత సాక్షి ప్రతినిధి, విజయవాడ : కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షల రూపాయల్లో ఫీజులు దండుకుంటున్నా విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థులకు ఆవాసం కోసం ఏర్పాటుచేసిన హాస్టళ్లలో కనీస వసతులు కూడా ఉండటం లేదు. ఒక్కో గదిలో ఆరు నుంచి పది మంది వరకు విద్యార్థులను ఉంచుతూ తీవ్ర నిర్బంధాలకు గురిచేస్తున్నారు. ఇరుకు గదుల్లో గాలి, వెలుతురు సరిగా అందక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. అనారోగ్యానికీ గురవుతున్నారు. ఆహారం విషయంలోనూ నాణ్యత పాటించకపోవడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు పోటీ పేరుతో తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తుండటంతో విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు. ర్యాంకుల కోసం 12 గంటల విద్యా విధానం... కార్పొరేట్ కాలేజీల్లో ర్యాంకుల కోసం 12 గంటల విద్యా విధానం అమలవుతోంది. కదిలితే కాళ్లు విరగ్గొడతామనే భయంతో విద్యాభ్యాసం చేపడుతున్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఒత్తిళ్లను తట్టుకోలేక, తమ భవిష్యత్‌ను ఎలా తీర్చిదిద్దుకోవాలో అర్థం కాక, తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడలేక, కాలేజీ నుంచి ఇంటికి వెళదామంటే లక్షల్లో డబ్బు కట్టిన తల్లిదండ్రుల బాధ చూసి తట్టుకోలేక.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాలి... ర్యాంకుల రేసులో కొట్టుకుపోతున్న నేటి విద్యావిధానం వెంటే తల్లిదండ్రులు కూడా పయనిస్తున్నారు. అదే తమ బిడ్డల బంగారు భవితకు ఆధారమని భావిస్తున్నారు. అప్పులు చేసి మరీ లక్షల రూపాయలు కార్పొరేట్ కళాశాలలకు చెల్లిస్తున్న తల్లిదండ్రులు, పిల్లల ఇబ్బందులు, వారి మనసు తెలుసుకోలేకపోతున్నారు. తాము చెప్పిందే వినమంటున్నారు. అటు అమ్మానాన్నల మాట కాదనలేక, మనసుకు నచ్చని చదువు చదువలేక పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తేలిపోతున్న పోలీస్ కేసులు విద్యా సంస్థల్లో జరిగే ఆత్మహత్యలు, అనుమానాస్పద మృతి కేసులు తేలిపోతున్నాయి. విచారణలో ఆత్మహత్యకు పురిగొల్పిన కారణాలను సరిగా బయటికి తీయడం లేదు. కార్పొరేట్ కళాశాలల్లో కేసులను మాత్రం త్వరగా ముగించేస్తున్న ఉదంతాలే ఎక్కువ. గత ఏడాది సెప్టెంబర్‌లో, నవంబరులో ఇద్దరు విద్యార్థులు, ఈ ఏడాది జనవరి, మార్చి నెలల్లో మరో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నలుగురు ఒకే విద్యా సంస్థలో విద్యార్థినీ విద్యార్థులు. తాజాగా కడపలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దీనికి తాజా ఉదాహరణ. పిల్లల ఆసక్తిని గుర్తించాలి పిల్లల ఆసక్తికి అనుగుణంగా తల్లిదండ్రులు చదివించాలి. ఇందుకు భిన్నంగా జరిగినప్పుడు ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. డాక్టర్, ఇంజనీర్, చార్టర్డ్ అకౌంటెంట్ మాత్రమే చదువు కాదు. ఇవి కాకున్నా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. చదువు కంటే జీవితం ముఖ్యమని గుర్తించాలి. తమ ఆశలను బలవంతంగా వారిపై రుద్దరాదు. పిల్లల శక్తిసామర్థ్యాలను బట్టి చదివించాలి. వారి ఆసక్తిని గుర్తించి ఆ దిశగా ప్రోత్సహిస్తే ఒత్తిడి లేకుండా ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలకు చేరతారు. - ఎల్.కాళిదాస్, డీసీపీ (శాంతి భద్రతలు), విజయవాడ మానసిక స్థితి అర్థం చేసుకునే పరిస్థితుల్లేవు పిల్లల మానసిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఉదయం నుంచి రాత్రి వరకూ పర్యవేక్షణలోనే చదివించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో వారు అక్కడి నుంచి పారిపోవాలనే ఆలోచనలు, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలు పాల్పడేందుకు సిద్ధపడుతున్నారు. వాళ్లంతట వారే చదువుకునే వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. - బి.రవిప్రసాద్, విద్యావేత్త, విజయవాడ కారణాలు అనేకం... ఇటీవల జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు అనేక కారణాలు వెలుగు చూస్తున్నాయి. నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషితేశ్వరి ర్యాగింగ్‌తో ఆత్మహత్య చేసుకుంటే, మరొకరు చదువులో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు బలవంతంగా తమ ఆశలను పిల్లలపై రుద్దుతున్నారు. దీంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. - డాక్టర్ టీఎస్ రావు, మానసిక వికాస నిపుణుడు, విజయవాడ -
వీడని గ్రహణం!
‘కాగ్నా’పై వంతెన నిర్మాణంలో అంతులేని నిర్లక్ష్యం నాలుగేళ్ల క్రితం అసంపూర్తి దశలో నిలిచిపోయిన పనులు రూ.10 కోట్లు మంజూరు చేసిన ప్రస్తుత సర్కారు దిక్కూదివాణం లేని టెండర్ల ప్రక్రియ ఇరవై గ్రామాల ప్రజలకు తీరని కష్టాలు తాండూరు: కర్ణాటక సరిహద్దు బషీరాబాద్ మండలం జీవన్గీ బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. సరిహద్దులో అంతర్రాష్ట్ర రహదారితో లింకు ఏర్పడే ఈ బ్రిడ్జి నిర్మాణానికి గ్రహణం వీడటం లేదు. ఏలికల చిన్నచూపుతో ఇరవై గ్రామా ల ప్రజల రాకపోకల కష్టాలు తీరని పరిస్థితి నెలకొంది. గతంలో అరకొర పనులు చేసిన కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో లక్షల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు చందమే అయ్యాయి. జీవన్గీ గ్రా మంలో కాగ్నా నదిపై ఈ వంతెన నిర్మించాల్సి ఉంది. సరిహద్దులోని కర్ణాటకతో పాటు తాండూరుకు రాకపోకలు సుగమమవుతాయి. అప్పటి మంత్రి ఇంద్రారెడ్డి హ యాంలో ఇక్కడ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. కానీ పునాదుల దశలోనే పనులు ఆగిపోయాయి. నాలుగేళ్ల క్రితం పనులు చేపట్టినా అసంపూర్తిగా వదిలేశారు. తాజాగా తెలంగాణ సర్కారుకు ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు రూ.10 కోట్లు మంజూరయ్యాయి. కానీ టెండర్ల ప్రక్రియ ఆగిపోయింది. ఫలితంగా బ్రిడ్జి పనులకు మోక్షం కలగటం లేదు. 12 కి.మీ. దూరం తగ్గుతుంది.. బషీరాబాద్ నుంచి తాండూరుకు 30 కి.మీ.దూరం. జీవన్గీ వద్ద వంతెన నిర్మాణంతో కరన్‌కోట మీదుగా తాండూరుకు 18 కి.మీ. దూరం.దీంతో 12 కి.మీ. దూరం తగ్గుతుంది. బషీరాబాద్ నుంచి జీవన్గీతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కరన్‌కోట్ మీదుగా కర్ణాటక పరిధిలోని చించొళి, గుల్బర్గా, సులేపేట్, ఉమ్మాబాద్ ప్రాంతాల రాకపోకలకు సులవుతుంది. లేనిపక్షంలో తాండూరుకు చేరుకొని ఆయా గ్రామాలకు వెళ్లడం దూరం పెరగటంతోపాటు సమయాభావం పడుతుంది. తాండూరు మండలంలో నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. సిమెంట్ ఉత్పత్తుల లారీలు పెద్ద సంఖ్యలో కర్ణాటకు వెళ్తుంటాయి. ప్రస్తుతం వాహనాల రాకపోకలు ఇలా.. తాండూరు మండలంలోని నాలుగు సిమెంట్ కర్మాగారాల నుంచి సిమెంట్ లోడ్ లారీలు గౌతాపూర్, తాండూరు మీదుగా మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌కు చేరుకొని అక్కడి నుంచి కర్ణాటకు వెళుతుంటాయి. లారీలు తాండూరులోకి ప్రవేశించడం వల్ల ట్రాఫిక్ చిక్కులు ఉత్పన్నమవుతున్నాయి. రూ.60లక్షలు వృథా! సుమారు నాలుగేళ్ల క్రితం బ్రిడ్జి నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. పిల్లర్ల వరకు పనులు చేపట్టారు. దాదాపు రూ.60 లక్షల పనులు జరిగాయి. ఆ తర్వాత కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. తెలంగాణ సర్కారు ఏర్పడిన అనంతరం అధికారులు కొత్త అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపించారు. సాంకేతిక అనుమతులు వస్తేనే.. జీవన్గీలో వంతెన నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరయ్యాయి. కాగ్నా నదిలో 250 మీటర్ల పొడవు బ్రిడ్జి నిర్మాణానికి రూ.6కోట్లు, బషీరాబాద్ వైపు 2 కి.మీ.,కరన్‌కోట్ వైపు 2.5కి.మీ. రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరయ్యాయి. సాంకేతిక అనుమతి ఉత్వర్వులు వస్తే టెండర్లు నిర్వహించి పనులు మొదలుపెడతాం. - జానకిరాములు, ఆర్అండ్బీ, డీఈఈ -
కోరలుచాచిన కాలుష్యం
- తీవ్రమైన చెట్ల నరికివేత - నీటి సంరక్షణ, మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం - అడుగంటుతున్న భూగర్భ జలాలు - ‘పర్యావరణం’పై అవగాహనే కీలకం - నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పర్యావరణ పరిరక్షణ.. ఇది అందరి బాధ్యత.. దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలి.. చెట్లు నరకడం వల్ల కలిగే నష్టాలు.. వర్షాలు కురవకపోవడం.. భూగర్భ జలాలు అడుగంటడం.. ఆరోగ్య సమస్యలు తలెత్తడం.. భవిష్యత్ తరాలకు ఎదురయ్యే ఇబ్బందులు.. వీటన్నింటిపై ముందస్తుగా వివరిస్తే కొంత మేలు చేసినట్లవుతుంది.. ఆ దశగా ప్రతి ఒక్కరు అడుగు ముందుకు వేయూలి.. నగరాలు, గ్రామాల్లో మొక్కలు విరివిగా పెంచడం.. వాటిని కాపాడడం బాధ్యతగా తీసుకోవాలి.. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం... - వరంగల్ అర్బన్/మహబూబాబాద్ రూరల్ : పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ఏదో ఒక నగరంలో అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది. ఇందులో పర్యావరణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పలు మార్గదర్శక సూత్రాలను రూపొంది స్తుం టారు. 1972లో స్థాపించబడిన ‘ఐక్యరాజ్యసమితి పర్యావరణ పథకం’ ఇదే నివేదికను ఉపయోగించుకుని పర్యావరణానికి సంబంధించి.. రాజకీయవాదులను, ప్రజలను అప్రమత్తం చేసే దిశగా తగిన చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం ఆధునిక పోకడలు పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ప్రజారోగ్యం దెబ్బతినడం వల్ల భవిష్యత్ తరాలకు శాపంగా మారనుంది. పల్లెలు, గ్రామాలను వదిలి పట్టణాలకు, నగరాలకు వలసలు పెరుగుతున్నాయి. ఏటా ఈ శాతం వృద్ధి చెందుతుండటంతో పట్టణాలు, నగరాలపై ఒత్తిడి ఎక్కువవుతోంది. ఆవాసాలకు అవసరమైన స్థలాల కోసం పచ్చని చెట్లను నరికేస్తున్నారు. చెరువులు, కుంటలను ఆక్రమిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. వాహనాల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతుండటంతో కాలుష్య భూతం ప్రజలను భయపెడుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో పట్టణాలు, నగరాల్లో జీవనం దుర్భరంగా మారుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాల ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యం వెరసి పట్టణాలు, నగరాల్లో పర్యావరణానికి తూట్లు పడుతున్నారు. పర్యావరణంపై పట్టింపు కరువు పర్యావరణం కలుషితం కావడం వల్ల ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపుతున్నాయి. చెత్త చెదారాన్ని ఎక్కడపడితే అక్కడ కాల్చివేస్తుండటంతో వెలువడుతున్న పోగతో శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నారు. వాతావరణానికి విఘాతం కలుగుతోంది. పడిపోతున్న భూగర్భ జలాలు నగరంలో అపార్టుమెంట్ సంస్కృతి పెరగడంతో బోరుబావుల నుంచి భూగర్భ జలాల వినియోగం విపరీతంగా పెరిగింది. కాంక్రీట్ జంగిల్లా మారి వర్షపు నీరు భూమిలో ఇంకేం దుకు కూడా ఆవకాశం లేకపోవడం, భూగర్భ జలాలు వినియోగించుకోవడమే కానీ, తిరిగి భర్తీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉండటంతో భూగర్భ జల మట్టాలు భారీగా పడిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో హన్మకొండలో 14.38, జనగామలో 13.77 మీటర్లకు భూగర్భ జలమట్టాలు అడుగంటిపోయాయి. ఇలా జిల్లాలోని పట్టణాల్లో, నగరంలో 13 నుంచి 36 మీటర్ల మేర భూగర్భ జలమట్టం అడుగంటిపోరుుంది. కాగితాల్లోనే నిషేధం ప్రభుత్వం 40 మైక్రాన్ల లోపు మందం ఉన్న పాలిథిన్ సంచులను నిషేధించింది. అరుునా నగరంలో పాలిథిన్ వినియోగం ఏమాత్రం తగ్గలేదు. ఎక్కడ చూసినా పాలిథిన్ సంచుల క్రయవిక్రయాల నియంత్రణకు అధికారులు చేపడుతున్న చర్యలు ఏమీ కనిపించడం లేదు. గతంలో పాలిథిన్ విక్రయాలు అరికట్టేందుకు క్రమం తప్పకుండా దాడులు చేసేవారు. అవి నిలిపివేయడంతో పాలిథిన్ సంచుల విక్రయాలు కొనసాగుతున్నాయి. పాలిథిన్ విని యోగం పెరగడం వల్ల వ్యర్థాలతోపాటు టన్నులకొద్దీ పాలిథిన్ చేరుతోంది. దీంతో భూసారం దెబ్బతినడంతోపాటు డ్రైనేజీల్లో చేరినప్పడు మురుగు పారుదలకు ఆటంకంగా తయారవుతున్నాయి. వాల్టా చట్టం అమలులో విఫలం నీరు, భూమి, చెట్టు పరిరక్షణ చట్టం(వాల్టా యాక్టు-2002) అమలులో ఉంది. దీని ప్రకారం వృక్షాలు, చెట్లు నరకకూడదు. ఒకవేళ చెట్లు నరికితే 30 రోజుల్లో ఒక చెట్టుకు రెండు మొక్కల చొప్పన నాటి వాటిని పర్యవేక్షించాల్సి ఉంది. కానీ.. ఇది ఎక్కడ అమలుకు నోచుకోవడం లేదు. ప్రైవేట్ వ్యక్తులే కాదు, విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్నాయని, ఇళ్ల నిర్మాణాలకు, రోడ్ల విస్తరణకు అడ్డుగా వస్తున్నాయని చెట్లను నరికివేస్తున్నారు. నగరంలో విపరీతంగా చెట్లు నరికి వేయడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా ఈ చట్టాలను సక్రమంగా అమలు పరిచే ందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
మన కుటుంబం మన ప్రపంచం!
వెనకటికి ఒక చీమ.. ఇల్లు అలుకుతూ అలుకుతూ తన పేరేమిటో మరచిపోయిందట. పొద్దున ఇంటి నుంచి బయలుదేరిన మనిషి కూడా, సవాలక్ష పనుల్లో పడిపోయి ‘కుటుంబాన్ని’ మరచిపోతున్నాడు. ఆ చీమకు తన పేరు మరచిపోవడం వల్ల జరిగిన నష్టమేమిటో తెలియదుగానీ, మనం మన కుటుంబాలను మరచిపోవడం వల్ల ఒక సామాజిక అగాథం ఏర్పడుతుంది. దాని నుంచి అశాంతి ఏర్పడి ధైర్యం సన్నగిల్లుతుంది. ప్రతి చిన్న భయానికీ డిప్రెషన్లోకి వెళ్లిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది.‘‘కుటుంబం అంటే ఏమిటో కాదు... అది మనకు దేవుడు ఇచ్చిన విలువైన కానుక’’ అనే ఒక విలువైన మాట ఉంది.ఎందుకో మరి ఆ విలువైన కానుక చాలామందికి కనబడడం లేదు. బిజీగా ఉండడం గొప్ప విషయమేగానీ, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేంత దూరం ఉండడం మాత్రం గొప్ప విషయం కాదంటున్నారు నిపుణులు. కుటుంబానికి దూరంగా ఉండడం లేదా నిరక్ష్యం చేయడం అనే ధోరణికి మూలాలు మానసికమా? సామాజికమా? ఆర్థికమా? అనుకుంటే చూపుడు వేలు మాత్రం ‘ఎకనామిక్ గ్లోబలైజేషన్’ వైపు చూపుతుంది. మన దేశంలో వేగంగా జరిగిన ప్రపంచీకరణ ఆర్థిక విషయాలకు మాత్రమే పరిమితం కాలేదు. అది సామాజిక సంబంధాలు, కుటుంబ విలువలపై కూడా ప్రభావం చూపుతుంది. నరుడు విశ్వనరుడు అయ్యాడు.అమ్మానాన్నలు పల్లెటూళ్లో. అబ్బాయిలు, అమ్మాయిలు పట్నంలో. ఉద్యోగరీత్యా అమ్మ ఒకచోట, నాన్న ఒకచోట. దీంతో కుటుంబవిలువల వెలుగు మసకబారుతుంది.ఒక కుటుంబం ఉందంటే, ఎవరూ చెప్పకుండానే కొన్ని విలువలు ఏర్పడిపోతాయి. అవి మనలో ఇంకిపోతాయి. నాన్న అంటే ఎవరు? గంభీరంగా ఉంటాడు. అయితే మనసు మాత్రం వెన్న. క్రమశిక్షణతో ఉండాలంటాడు. కాలాన్ని వృథా చేయవద్దు అంటాడు. కార్యశీలతకు ప్రాధాన్యత ఇస్తాడు. తన ముఖం మీద ఎలాంటి బాధ కనిపించకుండా సంక్షోభ సమయాలకు పరిష్కారాలు ఆలోచిస్తాడు. నాన్న అంటే నాన్న మాత్రమే కాదు... క్రమశిక్షణ మొదలు కార్యశీలత వరకు... కొన్ని ఉన్నతమైన విలువలకు బలమైన ప్రతీక. ఇక అమ్మ. నాన్నలా కఠినంగా కనిపించదు. వెన్నలా కరిగిపోతుంది. ఏమాటనైనా మనసు విప్పి చెప్పాలనిపిస్తుంది. అమ్మలో అమ్మ మాత్రమే లేదు మానసిక విశ్లేషకురాలు కూడా ఉంది. ‘ఇదిగో ఈ బాధ వచ్చిందమ్మా’ అంటే ‘అదిగో అలా చెయ్యి’ అంటుంది. నమ్మకం ఇచ్చే ధైర్యానికి, మాటతో కొత్త బాట చూపే సృజనాత్మక విలువలకు అమ్మ అద్దంలాంటిది.ఇక పెద్దన్న అంటే, చిన్నపాటి నాన్న. నాన్న విలువలకు రెండో ఇంచార్జీగా వ్యవహరిస్తాడు. తమ్ముళ్లతో స్నేహంగా ఉంటూనే బాధ్యతతో కూడిన విలువలను నేర్పిస్తాడు. ఇక అక్కలు, చెల్లెలు... ఇద్దరూ అమ్మలే. శ్రామిక విలువలను పంచుకోవడం ఎలానో వాళ్లు చెప్పకనే చెబుతారు. ఆరోజు అమ్మ ఊరెళ్లింది. పెద్దక్క ఉందిగా! మరి చిన్నక్క ఏంచేస్తుంది? పెద్దక్క అన్నం వండుతుంది. చిన్నక్క కూరలు తరుగుతుంది.నవ్వుతూ నవ్వుతూనే తమ్ముళ్లను, అన్నలను వంటాయణంలోకి దింపుతుంది. కుటుంబంలో ఒక్కో వ్యక్తి... ఒక్క విలువను ప్రతిబింబిస్తారు. ఆ విలువలన్నీ కలిసి బలమైన పునాదిని ఏర్పరుస్తాయి. కష్టాల గాలిదుమారాలు ఎన్ని వచ్చినా... ఆ పునాది చెక్కుచెదరకుండా బలంగా ఉంటుంది. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? కుటుంబ విలువలపై డిజిటల్ టెక్నాలజీ ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై నార్త్‌వెస్ట్రన్ యూనివర్శిటీ ఒక అధ్యయనం నిర్వహించింది. కుటుంబవిలువలపై డిజిటల్ టెక్నాలజీ ప్రతికూల ప్రబావం చూపుతుందని ఈ అధ్యయనం తెలియజేస్తుంది. ఫేస్‌బుక్‌లాంటి సామాజిక అనుసంధాన వేదికల్లో ఎవరి లోకంలో వారు మునిగి పోవడం వల్ల, కుటుంబ సభ్యులలో ఒకరితో ఒకరు మాట్లాడుకునే సమయం, సాన్నిహిత్యం తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఏంచేయాలి? మనసు ఉంటే మార్గం ఉంటుంది. కుటుంబానికి దగ్గర కావడం అంటే కుటుంబవిలువలకు దగ్గర కావడమే. అందుకే ఒక ప్రణాళిక రచించుకోండి. దీని ప్రకారం...ఉద్యోగరీత్యా, చదువుల రీత్యా కుటుంబసభ్యుల్లో ఒక్కొక్కరూ ఒక్కోచోట ఉండొచ్చు. అందుకే వారానికి రెండుసార్లు అందరూ కలుసుకునే ఏర్పాట్లు చేసుకోండి. ఒక్క వారం అలా చేసి చూడండి. మీలోకి ఎంత కొత్త శక్తి వచ్చిందో చూసుకోండి.విదేశాల్లో ఉన్నప్పుడు తరచు కలుసుకోవడం కష్టం కాబట్టి ఫోన్లో ఎక్కువగా టచ్‌లో ఉండండి. పొడి పొడి మాటలు కాకుండా విశ్లేషణాత్మకమైన సంభాషణ చేయండి. కుటుంబ జ్ఞాపకాలను పంచుకోండి.మీ ఇంట్లో పెద్దగా జరుపుకునే పండగేదో ఉంటుంది. ఆరోజు అందరూ తప్పనిసరిగా కలుసుకోండి. మనసు విప్పి మాట్లాడుకోండి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే... మీరొక్కసారి కళ్లు మూసుకొని ఆలోచించండి... ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. ‘ఫ్యామిలీ ఈజ్ నాట్ యాన్ ఇంపార్టెంట్ థింగ్. ఇట్స్ ఎవ్రీ థింగ్’ అది మీ అనుభవంలోకి రావాలంటే కుటుంబాన్ని ప్రేమించండి. ఆ విలువలను గొప్పగా తలకెత్తుకోండి. మీ ఫ్యామిలికీ మన ఫ్యామిలీ తరపున హ్యాపీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్! ‘‘కుటుంబం అంటే ఏమిటో కాదు... అది మనకు దేవుడు ఇచ్చిన విలువైన కానుక’’ అనే ఒక విలువైన మాట ఉంది. ఎందుకో మరి ఆ విలువైన కానుక చాలామందికి కనబడడం లేదు. బిజీగా ఉండడం గొప్ప విషయమేగానీ, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేంత దూరం ఉండడం మాత్రం గొప్ప విషయం కాదంటున్నారు నిపుణులు. కుటుంబం అంటే అందమైన స్వర్గం. - జార్జ్ బెర్నార్డ్ షా, నాటక రచయిత వాస్తవాలు తెలుసుకోవడానికి ‘కుటుంబం’ మార్గదర్శనం చేస్తుంది. - గ్రేస్ కెల్లీ, హాలివుడ్ నటి -
అక్షరం నేర్పితే ఒట్టు !
నిర్లక్ష్యంలో సాక్షరభారత్ నంబర్ వన్ దశాబ్దాల తరబడీ నెరవేరని లక్ష్యం ఇంకా 5.38 లక్షల మంది నిరక్షరాస్యులే పట్టించుకోని అధికారులు ఏటా కోట్లాది రూపాయల వృథా వయోజనులకు అక్షరాలు నేర్పేందుకు వయోజన విద్య, సాక్షరభారత్ పేర్లతో దశాబ్దాల తరబడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అక్షరాస్యత శాతం ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా ఉంది. క్షేత్రస్థాయిలో అధికారులు ఈ కార్యక్రమాన్ని పట్టించుకోకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో లక్ష్యం నెరవేరడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్న కోట్లాది రూపాయల నిధులు నిరుపయోగమవుతున్నాయి. అసలు అక్షరాస్యత కార్యక్రమం కొనసాగుతున్న విషయం గ్రామీణులకు తెలియడం లేదు. నోటు పుస్తకాలు, పేపర్లు, పెన్నులు, పెన్సిళ్ల పేరుతో మరో కోటి రూపాయలకు పైగా వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి రూ.8 కోట్ల వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యయం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 75 శాతం నిధులు ఇస్తుండగా, మిగిలిన 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. అక్షరాలు నేర్పని వీసీఓలు నెలకు రూ.2వేలు గౌరవవేతనం తీసుకుంటున్న 95 శాతానికి పైగా వీసీఓలు వయోజనులకు అక్షరాలు నేర్పడం లేదన్న ఆరోపణలున్నాయి. అసలు వారు గ్రామాలకే వెళ్లడం లేదని తెలుస్తోంది. వీరిని పర్యవేక్షించాల్సిన ఎంసీఓలదీ అదే పరిస్థితి. ఇరువురు వేలాది రూపాయలు గౌరవవేతనం తీసుకుంటూ నిరక్షరాస్యులకు అక్షరం ముక్క నేర్పడం లేదు. ఏ గ్రామంలో విచారించినా ఇదే విషయం చెబుతున్నారు. అసలు అక్షరాస్యత కార్యక్రమం కొనసాగుతున్న విషయం కూడా ఆయా గ్రామాల్లోని నిరక్షరాస్యులకు తెలియడం లేదు. పట్టించుకోని ఉన్నతాధికారులు అక్షరాస్యత కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన డీడీ, ఏపీఓ, సీపీఓ తదితర ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. వారు గ్రామాలకు వెళ్లి పర్యవేక్షించే పరిస్థితి లేదు. కొంతమంది అధికారులు వీసీఓలు, ఎంసీఓలతో కలిసి నిధులు బొక్కుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఉత్తపుణ్యానికొచ్చే జీతాలే కదా అనుకుంటూ క్షేత్రస్థాయి సిబ్బంది కొందరు ఉన్నతాధికారులకు వాటాలు సమర్పిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని నిరక్షరాస్యులు కోరుతున్నారు. -
దశాబ్దాలుగా రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం
-
అర్థరాత్రి ఔటర్ పై ప్రయాణికుల జాగారం...
-
అర్థరాత్రి ఔటర్ పై ప్రయాణికుల జాగారం...
హైదరాబాద్: ప్రైవేటు ట్రావెల్స్ అరాచకాలకు హద్దు లేకుండా పోతోంది. క్షేమంగా గమ్యానికి చేర్చాలిన బస్సులు ప్రయాణికులను నడిరోడ్డు పైనే వదిలేస్తున్నాయి. నిన్నదీపికా ట్రావెల్స్... నేడు న్యూ ధనుంజయ ట్రావెల్స్... ప్రయాణికులను నడిరోడ్డుపై రాత్రంతా జాగారం చేయించాయి. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో విశాఖపట్నం బయల్దేరిన న్యూ ధనుంజయ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపైన నిలిచిపోయింది. ఎయిర్ లాక్ అయిందంటూ బస్సును అర్ధంతరంగా నిలిపివేసిన డ్రైవర్ తనకు బాధ్యత లేదన్నట్టు వ్యవహరించాడు. ట్రావెల్స్ యాజమాన్యం కూడా మరో బస్సు ఏర్పాటు చేయకుండా చేతులెత్తేయడంతో ప్రయాణికులు రాత్రంతా అవుటర్‌పై అవస్థలు పడ్డారు. ట్రావెల్స్ మేనేజ్మెంట్కి ఫోన్ చేసినా కూడా ఎలాంటి స్పందన లేదు. దీంతో రాత్రంతా ప్రయాణికులు పడిగాపులు కాశారు. టికెట్ల రూపంలో వేలకువేలు గుంజి...ఆపద సమయంలో కనీసం తమవైపు కన్నెత్తైనా చూడలేదని ప్రయాణికులు వాపోయారు. బుధవారం ఉదయం వరకూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
‘చచ్చేంత’ నిర్లక్ష్యం
తొట్టంబేడు: తెలుగుగంగ అధికారుల నిర్లక్ష్యం.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ బాలిక గల్లంతుకు కారణమరుుంది. తెలుగుంగ కాలువ వద్ద ప్రవూద సూచికలు పెట్టాలని, కాలువ మెట్లు పూడ్చి వేయూలని పదేపదే స్థానికులు మొత్తుకుంటున్నా గంగ అధికారులు నిద్ర వుత్తు వీడలేదు. ఫలితంగా వుంగళవారం తెలుగుగంగ కాలువ వద్ద ఓ బాలిక గల్లతైంది. స్థానికుల కథనం మేరకు.. శ్రీకాళహస్తి వుండలంలోని ఇనగలూరు దళితవాడకు చెందిన ధనయ్యు, గంగాదేవి మొదటి కువూర్తె భువనేశ్వరి(12) స్థానిక ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. తొట్టంబేడు వుండలంలోన గురప్పనాయుుడుకండ్రిగలో అవ్మువ్ము కర్మక్రియులకు తల్లితో పాటు హాజరైంది. ఈ క్రవుంలో వుంగళవారం తల్లి గంగాదేవితో పాటు పక్కనే ఉన్న తెలుగుగంగ కాలువలో దుస్తులు ఉతికేందుకు వెళ్లింది. గంగ కాలువకు ఏర్పాటు చేసిన మెట్లపై తల్లి, కూతురు దుస్తులు ఉతుకుతుండగా భువనేశ్వరి ప్రవూదవశాత్తు అదుపుతప్పి కాలువలో పడిపోరుుంది. కాలువలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో బాలిక వేగంగా కొట్టుకుపోరుుంది. కువూర్తె కొట్టుకుపోతున్న విషయూన్ని గుర్తించిన గంగాదేవి రక్షించాలంటూ కేకలు వేసింది. దీంతో సమీపంలో ఉన్న కొందరు రైతులు హుటాహుటిన కాలువలో దూకి గాలించారు. అప్పటికే భువనేశ్వరి కాలువలో కనపడకుండా కొట్టుకుపోరుుంది. ఈ విషయుం గ్రావుంలో తెలియుడంతో బంధువులు, గ్రావుస్తులు కాలువ వెంబడి భువనేశ్వరి ఆచూకీ కోసం చూస్తున్నారు. అరుుతే కాలువలో నీటి ఉధృతికి భువనేశ్వరి వుృతి చెంది ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. కళ్ల ఎదుటే కన్న పేగు కొట్టుకుపోతుంటే కాపాడలేక గంగాదేవి తల్లడిల్లిపోరుుంది. గురప్పనాయుుడుకండ్రిగలోని అవ్ము ఇంటి వద్ద గంగాదేవిని ఎంతవుంది ఓదార్చినా ఆమె వేదనను ఆపలేకపోయూరు. ఆమె రోదన చూపరులను కలచి వేసింది. అవ్మువ్ము అంత్యక్రియులకు వచ్చి భువనేశ్వరి గల్లంతరుుందనే వార్తతో గురప్పనాయుుడుకండ్రిగలో విషాదం అలువుుకుంది. వుుందే హెచ్చరించిన ‘సాక్షి’ తెలుగుగంగ కాలువ వద్ద ప్రవూద సూచికలు లేవు. మెట్ల వద్ద స్నానాలు చేసేందుకు, దుస్తులు ఉతికేందుకు వెళుతున్న అవూయుకులు నీటిలో కొట్టుకుపోరుు ప్రాణాలు కోల్పోతున్నారని, నివారణ చర్యలు చేపట్టాలని ‘సాక్షి’లో పదే పదే కథనాలు ప్రచురించినా అధికారుల్లో ఎలాంటి చలనం కలగపోవడం వారి నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. ఈ నెల 5వ తేదీ ‘ఇంకా ఎంతవుంది గల్లంతుకావాలి ? అనే కథనం కూడా ప్రచురితమైంది. గడచిన నాలుగేళ్లలో సువూరు 42 వుందికి పైగా వుండలంలోని తెలుగుగంగ కాలువలో కొట్టుకుపోరుు వుృతి చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ముప్పు ముంగిట గొట్టా
హిరమండలం: జిల్లా రైతులకు జీవనాధారమైన వంశధార నదిపై నిర్మించిన గొట్టా బ్యారేజీ ముప్పు ముంగిట నిలిచి ఆందోళన కలిగిస్తోంది. కుడి, ఎడమ కాలువల ద్వారా 2.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ సిరుల పంటలు పండిస్తున్న బ్యారేజీ ఎగువ భాగాన్ని చూస్తే భవిష్యత్తు ఎంతో భయానకంగా కనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా భారీగా పూడిక పేరుకుపోయి బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతోంది. బ్యారేజీ నిర్మించి 37 ఏళ్లు పూర్తి అయినా ఇంతవరకు పూడిక తీసిన సందర్భాలు లేవు. ఫలితంగా గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా 25 శాతానికి పడిపోయిందని ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ గేట్ల వద్ద మట్టి, ఇసుక మేటలు వేయడమే ఈ పరిస్థితికి కారణం. దీని ప్రభావం పంటలకు నీటి సరఫరాపై పడుతోంది. కుడి, ఎడమ కాలువలకు అవసరమైనంత నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. గులుమూరు గ్రామం వద్ద నది గమనం మారడం కూడా నదిలో పూడిక పెరిగిపోయేందుకు ఒక కారణం. ఇలా గత 20 ఏళ్ల నుంచి మట్టి ఎక్కువగా చేరుతోంది. గతంలో ఇక్కడికి వచ్చిన ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ పూడిక తొలగింపునకు ప్రతిపాదనలు రూపొందించాలని వంశధార అధికారులను ఆదేశించినా అవి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని తెలుస్తోంది. 30 శాతం నీరే విడుదల వంశధార కుడి కాలువ ద్వారా ఆయకట్టుకు 872 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా 300 క్యూసెక్కులకు మించి విడుదల చేయలేకపోతున్నారు. బ్యారేజీ నుంచి కుడికాలువకు నీరు విడుదలయ్యే ప్రదేశం వద్ద పూడిక పేరుకుపోవడంతో ప్రవాహ దిశ అనుకున్న విధంగా సాగట్లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో తక్కువ పరిమాణంలోనే నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగాా శివారు ఆయకట్టుకు నీరందక రైతులు నష్టపోతున్నారు. గత ఏడాది ప్రధాన కాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద భారీగా పూడికతో నిండిపోయి నీరు వెళ్లే పరిస్థితి కనిపించకపోవడంతో నీటి విడుదల సమయంలో తాత్కాలికంగా కొంత మట్టిని తొలగించారు. బ్యారేజీ 20, 21, 22 గేట్ల పెద్ద మట్టిదిబ్బల స్థాయిలో పూడిక నిండిపోయింది. ఇది కుడికాలువ నీటి ప్రవాహానికి అవాంతరంగా మారింది. మహేంద్రతనయతో ముప్పు వంశధారకు ఉపనదిగా ఉన్న మహేంద్రతనయ నుంచే ఎక్కువగా మట్టి కొట్టుకువస్తోంది. వంశధార ప్రవాహంతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి కూడా మట్టి వస్తుండడంతో బ్యారేజీ వద్ద లోతు తగ్గి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. దశాబ్దాల తరబడి నది ఎగువ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయకట్టు రైతుల చెబుతున్నారు. గొట్టా నుంచి గులుమూరు వరకు సుమారు 6.2 కి.మీ., తుంగతంపర నుంచి సుమారు 3.5 కి.మీ. మేరకు నదిలో పేరుకుపోయిన మట్టి, ఇసుక మేటలను తొలగించాల్సి ఉందని వంశధార అధికారులు చెబుతున్నారు. కనీసం దమ్ము ట్రాక్టర్లతో నీరు లేని సమయంలో ఈ ప్రాంతంలో దున్నించినా మట్టి మేటలు వదులై భారీ వరదల సమయంలో దిగువకు కొట్టుకుపోయి సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని పలువురు సూచిస్తున్నారు. -
కళ తప్పాయి
నగరానికి కొత్త అందాలు తెచ్చిన కుడ్యచిత్రాలపై నిర్లక్ష్యపు నీడలు కుడ్య చిత్రాల అందాలను దెబ్బతీస్తున్న పోస్టర్లు రాష్ట్ర సంస్కృతిని, సంప్రదాయాలను సమున్నతంగా చూపాయి ఆ కుడ్య చిత్రాలు. నగరానికి వచ్చే పరదేశీయులకు మైసూరు రాచరికపు హంగులను, హంపిలోని శిల్ప సౌందర్యాన్ని, జోగ్ జలపాతపు సందడిని కళ్లకు కట్టాయి. అంతేకాదు రాష్ట్రానికి వన్నె తెచ్చిన అనేక మంది కవులు, పోరాట యోధులు మరెంతో మంది కళాకారులను నేటి తరానికి పరిచయం చేశాయి. అయితే ఇదంతా గతం... నగరానికి కొత్త అందాలను తెచ్చిపెట్టిన కుడ్యచిత్రాలు ఇప్పుడు ‘కళ’తప్పుతున్నాయి. రాష్ట్ర ఘనచరితను సగర్వంగా చాటి చెప్పిన కుడ్యచిత్రాలు ప్రస్తుతం నిర్లక్ష్యపు నీడలో మసకబారిపోతున్నాయి. బీబీఎంపీ నిర్వహణ కొరవడడంతో పెచ్చులూడడంతో పాటు పార్టీలు, సినిమాల పోస్టర్ల వెనక్కి చేరిపోతున్నాయి. -బెంగళూరు రాష్ట్ర చరిత్రను చాటి చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర చరిత్రను, ఇక ్కడి కళలు, సంస్కృతి, సంప్రదాయాలను పర్యాటకులకు చాటి చెప్పే ఉద్దేశంతో 2009లో బృహత్ బెంగళూరు మహా పాలికె (బీబీ ఎంపీ) నగరంలోని ప్రముఖ కూడళ్లలోని గోడలపై కుడ్య చిత్రాలను గీసే కార్యక్రమానికి నాంది పలి కింది. కేవలం ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజెప్పడమే కాక స్థానిక కళాకారులకు సైతం ఉపాధి కల్పించవచ్చనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనుకున్నదే తడువుగా నగరంలోని ప్రముఖ కూడళ్లలో ఉన్న గోడలన్నింటిపై అందమైన కుడ్యచిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. మైసూరు రాజప్రాసాదాలు, బన్నేరుఘట్ట ప్రాంతంలోని వన్యప్రాణి సంపద, పట్టడక్కల్లోని కాశీ విశ్వనాథుని దే వాలయాలు, బాదామీలోని శిల్పసంపద ఇలా అనేక గొప్ప ప్రాంతాలను కళాకారులు ఈ కుడ్యచిత్రాల్లో సాక్షాత్కరింపచేశారు. కేవలం ప్రఖ్యాతిగాంచిన కట్టడాలు, వ్యక్తులు, ప్రాంతాలే కాక ‘పర్యావరణ పరిరక్షణ’,‘వాననీటి సంరక్షణ’ తదితర అంశాలకు చెంది న సందేశాలు కూడా గోడలపై కనిపించేవి. కొరవడిన నిర్వహణ నగరానికి కొత్త అందాలను తెచ్చిపెట్టిన కుడ్యచిత్రాలు బీబీఎంపీ నిర్వహణా లోపం కారణంగా తమ కళను కోల్పోతున్నాయి. ఒక మంచి లక్ష్యంతో గోడలపైకు డ్యచిత్రాలను గీయడానికి శ్రీకారం చుట్టిన బీబీఎంపీ నెమ్మదిగా వాటి నిర్వహణా విషయాన్ని పక్కకు నెట్టేసింది. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లోని గోడలపై ఉన్న అద్భుత కుడ్యచిత్రాలపై వివిధ పార్టీలు, సంఘాలు, సినిమాల పోస్టర్లు వెలుస్తున్నాయి. మరికొన్నైతే ఏళ్లకేళ్లు నిర్వహణే లేకపోవడంతో పెచ్చులూడిపోతున్నాయి. ఇక నగర ప్రజల్లో కొరవడిన అవగాహనతో కొన్ని గోడలు మూత్రవిసర్జన శాలలుగా మారుతుంటే, మరికొన్ని చెత్తకుప్పలుగా మారుతున్నాయి. దీంతో ఈ కుడ్యచిత్రాల వైపు చూడడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇలా నగరంలోని ప్రముఖ కూడళ్లలోని గోడలపై ఉన్న కుడ్యచిత్రాలన్నీ కూడా ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. -
బిడ్డ పుట్టకుండానే పురుటి కష్టాలు
కంబాలచెరువు (రాజమండ్రి) :కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్తే, బిడ్డ పుట్టకుండానే పురుటి కష్టాలు చూపించిందో వైద్యురాలు. ‘ఆ కేసు నాది కాదు.. ఆ డ్యూటీ డాక్టర్ వెళ్లిపోయాడు.. నేనేం చేయలేను’ అంటూ పురుటి నొప్పులతో బాధ పడుతున్న ఓ గర్భిణికి వైద్యం నిరాకరించింది. రాజమండ్రిలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కడియానికి చెందిన జి.దుర్గకు తొలి కాన్పు సిజేరియన్ అయింది. రెండోసారి గర్భం ధరించిన ఆమె కొద్ది రోజుల కిందట రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ లక్ష్మణరావు ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. ఈ నెల 17న పురుడు వస్తుందని, ఆ రోజు రావాలని చెప్పి, ఆమెను ఇంటికి పంపించివేశారు. ఈ నేపథ్యంలో దుర్గ సోమవారం ఆస్పత్రిలో చేరారు. ఆమెను పరీక్షించిన డాక్టర్ లక్ష్మణరావు, పురుడు రావడానికి ఇంకా సమయం ఉందని చెప్పి, మంగళవారం డిశ్చార్జి చేశారు. ఆయన డ్యూటీ దిగిన సమయంలో నొప్పులు అధికమవడంతో విధుల్లో ఉన్న డాక్టర్ వసుంధరకు దుర్గ బంధువులు విషయం తెలిపారు. తనకేమీ తెలియదని, డాక్టర్ లక్ష్మణరావు ఇంటికి వెళ్లిపోవాలని రాసిచ్చారని, ఆ కేసు తాను ఇప్పుడు చూడనని డాక్టర్ వసుంధర చెప్పారు. దీంతో చేసేది లేక దుర్గ, ఆమె బంధువులు ఆస్పత్రి బయటే నిరాశగా ఉండిపోయారు. ఈలోగా ఆస్పత్రి సిబ్బంది ఒకరు వచ్చి ‘ఏం ఫర్వాలేదు, రూ.2 వేలు ఇస్తే లోపల చేర్చుకుని ఆపరేషన్ చేస్తారు’ అని తనకు చెప్పారని దుర్గ బంధువు కోడిబోయిన రమణ చెప్పాడు. ఈలోగా ఈ సమాచారం తెలిసిన మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. విషయం రచ్చ అయ్యేటట్టు ఉందని భయపడిన వైద్యులు దుర్గకు వైద్య సేవలు అందించారు. తాను పరుషంగా మాట్లాడలేదని డాక్టర్ వసుంధర ‘సాక్షి’కి చెప్పారు. -
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం
మెదక్ రూరల్: పురుగు మందులను కొట్టే సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అస్వస్థతకు గురయ్యే అవకాశంతో పాటు ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్ (8886612480) తెలిపారు. ప్రస్తుతం రైతులు సాగు పత్తి పం టలకు మందు స్ప్రే చేసే సమయం కావున రైతులు ఈ సలహాలను పాటించాలని సూచించారు. తీసుకోవల్సిన జాగ్రత్తలు... పురుగు మందు డబ్బాను నోటితో తీయవద్దు, మందును చేతితో కలపొద్దు. పవర్ స్ప్రేయర్ నాజిల్‌ను పెద్దగా చేయరాదు. మందు సన ్నగా తుంపరగా పడేలా చూడాలి. ఒకేసారి రెండు, మూడు మందులను కలిపి పిచికారీ చేయొద్దు. నిండుగా దుస్తులు, చేతులకు గ్లౌజులు, కళ్లజోడు, ముఖానికి మాస్క్, తలకు టోపీ లేదా రుమాలు ధరించాలి. ఉదయం, సాయంత్రం వేళలో మాత్రమే మందు స్ప్రే చేయాలి. గాలికి ఎదురుగా పిచికారీ చేయొద్దు. స్ప్రే చేయడం పూర్తయ్యే వరకూ భోజనం చేయడం, పొగతాగడం చేయకూడదు. గాయాలు, పుండ్లు ఉన్న వ్యక్తులు పురుగు మందులు పిచికారీ చేయొద్దు. మందు ప్రభావానికి గురైతే పురుగు మందు ప్రభావానికి గురైన వ్యక్తి నోట్లో వేలు పెట్టి వాంతి చేయించాలి. మూర్చపోయిన సందర్భంలో నాలుక కరుచు కోకుండా రెండు దవడల మధ్య గుడ్డ పెట్టాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు తడిబట్టతో తుడవాలి. ఉష్ణోగ్రత తగ్గితే దుప్పటి కప్పి వెచ్చగా ఉంచాలి. వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించాలి. -
నిర్లక్ష్యం మేట
గట్లు, కరకట్టల నిర్మాణాలకునిధులివ్వని ప్రభుత్వం రూ.100 కోట్ల ప్రతిపాదనలు బుట్టదాఖలు వణుకుతున్న నది పరివాహక ప్రాంతీయులు నిధుల మంజూరులో సర్కారు నిర్లక్ష్యం వల్ల ఏటిగట్లు మరమ్మతులకు నోచుకోవడంలేదు. వరదల కారణంగా గండ్లు పడిన కాలువ గట్లను పట్టించుకోకపోవడంతో నది పరివాహక ప్రాంత జనం భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ఆలస్యంగానైనా కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నా.. అతివృష్టి పంటలను ముంచుతుందన్న భయం అన్నదాతలను పట్టి పీడిస్తోంది. విశాఖ రూరల్ : గత ఏడాది తుపాన్లు, అల్పపీడనం కారణంగా వచ్చిన వరదలకు జిల్లాలో రిజర్వాయర్లు దెబ్బతిన్నాయి. చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. భవిష్యత్తులో వరదలు వచ్చినా ముంపు భయం లేకుండా ఉండేందుకు కాలువలు, గట్లు, కరకట్టల నిర్మాణాలకు అధికారులు రూ.114 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ఏడాది కావస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు శారదనది గట్లు పలుచోట్ల బలహీనపడ్డాయి. జలాశయాలన్నీ నీటితో నిండి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నది పరివాహక ప్రాంతాల వారు వణికిపోతున్నారు. భూ సేకరణకు నిధులు లేవు : గట్ల నిర్మాణం కోసం అధికారులు భూములను సేకరించాలని నిర్ణయించారు. శారదా, వరాహ, తాండవ నదుల పరివాహక ప్రాంతాల్లో ప్రైవేటు భూములు ఉన్నాయి. ఈ స్థలాల్లో కొంతమంది సరుగుడు, ఇతర తోటలు వేశారు. వర్షాల సమయంలో నదుల నుంచి వరద నీరు పొంగిన సందర్భంలో ఈ తోటల కారణంగా నీరు పాయలుగా విడిపోయి గ్రామాల్లోకి చేరుతోంది. వరద నీరు పోటెత్తుతుండడంతో మట్టి గట్లకు గండ్లు పడుతున్నాయి. ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతుండడంతో గట్లు పటిష్టంగా నిర్మించాలని నిర్ణయించారు. అలాగే కొట్టుకుపోతున్న ప్రాంతాల్లో పెద్ద గట్లు నిర్మించేందుకు సమీపంలో ఉన్న ప్రైవేటు స్థలాలు మొత్తం 645 ఎకరాల్లో భూ సేకరణ చేపట్టాలని గుర్తించారు. ఇందుకు రూ.14 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. అయితే భూ సేకరణకు నిధులు లేవని కేవలం మరమ్మతుల కోసం ప్రణాళిక రూపొందించి పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదనలు బుట్టదాఖలు గట్లు, కరకట్టల నిర్మాణాలకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి గతేడాది ప్రభుత్వానికి పంపించారు. వీటి నిర్మాణాలకు సుమారు రూ.114 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. అయితే అంచనాలు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించడంతో భూసేకరణకు ప్రతిపాదించిన రూ.14 కోట్లు మినహా రూ.100 కోట్లతో కొత్త ప్రతిపాదనలను గతేడాదే పంపించారు. శారదా, తాండవ, వరాహ రిజర్వాయర్లకు సంబంధించి రూ.26 కోట్లు మంజూరు చేస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వం కొలువుతీరాక ఈ ప్రతిపాదనలకు కదలిక వస్తుందని అధికారులు భావించినప్పటికీ అసలు ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. గత వరదల సమయంలో పొలాల్లో వేసిన ఇసుక మేటలు ఇప్పటికీ తీయలేదు. ప్రస్తుతం జిల్లాలో నదీ, జలాశయాల కాలువల పరిస్థితి దారుణంగా ఉంది. నదీ పరివాహక ప్రాంతాల్లో రెండువైపులా ఎత్తుగా గట్లు నిర్మించాల్సిన అవసరముంది. శాశ్వత ప్రాతిపదికన కాంక్రీట్‌తో కాలువలను నిర్మించాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వరద నష్టాన్ని తగ్గించి గ్రామాలు, పొలాల్లోకి వరద నీరు చేరకుండా ఉండాలంటే తప్పకుండా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. -
బాలుడిని బలిగొన్న బడి బస్సు
డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి మృతి కోపోద్రిక్తులైన స్థానికులు.. వ్యాన్‌పై దాడి ఉప్పల్/ రామంతాపూర్: స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం బాలుడి ప్రాణాలు బలిగొంది. ఈ సంఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు బస్సుపై రాళ్లతో దాడి చేశారు. ఉప్పల్ పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.. ఉప్పల్ పారిశ్రామిక వాడ లక్ష్మీనారాయణ కాలనీకి చెందిన బారెడి సునీల్ కుమారుడు రోషన్(5) హబ్సిగూడలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. శనివారం తరగతులు ముగిసిన అనంతరం స్కూల్ బస్సు లక్ష్మీనారాయణ కాలనీలోని రోషన్ దిగే స్టేజీ వద్దకు చేరుకుంది. బస్సు ఆగిన వెంటనే బాలుడు బస్సులో నుంచి దిగి ఇంటి బాట పట్టాడు. ఈ విషయాన్ని గమనించని డ్రైవర్ వెంటనే బస్సును వెనక్కి తీసుకున్నాడు. దీంతో రోషన్‌ను ఢీకొని, వెనక చక్రాలు అతడిపైనుంచి వెళ్లాయి. బాలుడి తలకు తీవ్రగాయాలు కాగా వెంటనే రామంతాపూర్‌లోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు. అప్పటికే రోషన్ మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై కోపోద్రిక్తులైన స్థానికులు బస్సును ధ్వంసం చేశారు. ఒక్కగానొక కుమారుడు.. రోషన్ తండ్రి సునీల్ ప్రైవేట్ ఉద్యోగి, తల్లి పద్మశ్రీ గృహిణి. వీరికి రోషన్ ఒక్కడే కుమారుడు. అతడ్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. తల్లి బస్సు వద్దకు వచ్చే లోపే ఈ సంఘటన జరగడంతో సంఘటన స్థలంలో పద్మశ్రీ కుప్పకూలి పోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే వచ్చి తల్లిని లేపి గాయాలపాలైన రోషన్‌ను అసుపత్రికి తరలించారు. బాలుడి మృతదేహం వద్ద తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కాగా కొత్త డ్రైవర్ కావడం, బస్సు కూడా కండీషన్లో లేకపోవడం, దీనికి తోడు రివర్స్‌లో వెళ్లే సమయంలో సైడ్ చూపించే క్లీనర్ లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పరామర్శ ఈ సంఘటన విషయం తెలుసుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, నాయకులు అశోక్ కుమార్ గౌడ్, ప్రతిభ తదితరులు బాలుడి తల్లిదండ్రులను పరామర్శించారు. -
108కూ నిర్లక్ష్యం జబ్బు
చిత్తూరు(సిటీ): రోగులు, క్షతగాత్రుకు ప్రాణంపోసే 108 సిబ్బందిలోనూ నిర్లక్ష్యం జబ్బు పట్టుకుంటోంది. వింతవ్యాధితో బాధపడుతున్న ఓరోగిని అత్యవసరంగా తిరుపతి రుయా వైద్యశాలకు తీసుకెళ్లాలని, లేని పక్షంలో ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వైద్యులు చెప్పినా కాణిపాకం 108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు నిదర్శనం...వివరాలలోకి వెళ్లితే... నగర పరిధిలోని శ్రీలంక కాలనీకి చెందిన సోమనాథం, ఒరిస్సాకు చెందిన కీర్తన ప్రేమ వివాహం చేసుకున్నారు. కీర్తన నాలుగు నెలల క్రితం ఒరిస్సాలోని ప్రభుత్వ వైద్యశాలలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు పుట్టినప్పటి నుంచి కీర్తన వింత వ్యాధితో బాధపడుతోంది. దీంతో కీర్తనను చికిత్స నిమిత్తం మంగళవారం చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో చేర్పించారు. అయితే ఆమె పరిశీలించిన వైద్యులు, రోగి స్థితి సీరియస్‌గా ఉందని, మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తీసుకుపోవాలని సిఫార్సు చేశారు. రోగిని తిరుపతికి తరలించడానికి డబ్బు లేక అల్లాడుతున్న నిరుపేద ముత్తు పరిస్థితిని చూసి చలించిన డాక్టర్ 108కు ఫోన్ చేశారు. అప్పటికే వైద్యశాలలో ఉన్న కాణిపాకం రూట్ వాహనంలో రోగిని తీసుకెళ్లేందుకు ఉపక్రమించారు. అయితే తమ వాహనంలో రోగిని తిరుపతికి తీసుకెళ్లేందుకు రూల్స్ ఒప్పుకోవంటూ, అ వాహ నం సిబ్బంది అక్కడ నుంచి జారుకున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రికి వచ్చిన వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి చూసి స్పందించారు. డాక్టర్లతో చర్చించడంతో పాటు, కొంత ఆర్థిక సహాయం చేసి, చిత్తూరు వైద్యశాల అంబులెన్స్‌లో తిరుపతికి తరలింపజేశారు. -
చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చిన నిర్లక్ష్యం
కృష్ణపల్లి (పార్వతీపురం రూరల్) : మధ్యాహ్న భోజన నిర్వాహకుల నిర్లక్ష్యం ఆ చిన్నారుల ప్రాణాలకు మీదకు తెచ్చింది. నిత్యం భోజనం బాగోక పోయినా నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో అడగలేకపోతున్న తల్లిదండ్రుల భయం వారి బిడ్డలను ఉక్కిరిబిక్కిరి చేసింది. పార్వతీపురం మండలంలోని కృష్ణపల్లి గ్రామం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటుండగా చెడు వాసన రావడంతో కొంతమంది ఆరుబయటే పారబోశారు. భోజనం చేసిన ఒకరిద్దరు విద్యార్థులకు కడుపులో తిప్పినట్లు అనిపించడంతో తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో కృష్ణపల్లి గ్రామస్తులు బుధవారం ఒక్కసారిగా భీతిల్లారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల దగ్గరకు తల్లిదండ్రులు చేరుకుని గగ్గోలు పెట్టారు. ఒంట్లో తిప్పుతున్నట్లు ఉన్న కొంతమంది పిల్లలను వారి తల్లిదండ్రులే మోటారు సైకిల్‌పై పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను కూడా ఆస్పత్రికి తరలిస్తే మంచిదని 108 వాహనంలో మరికొంతమందిని తరలించారు. సమాచారం అందుకున్న తహశీల్దార్ కేవీడీ ప్రసాద్ హుటాహుటిన తమ సిబ్బందితో సహా పాఠశాలకు చేరుకున్నారు. జరిగిన సంఘటనపై విచారణ చేశారు. ఆ సమయంలో భోజన నిర్వాహకులు హాజరు కాకపోవడంతో తహశీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే వారిని తొలగించి కొత్తవారికి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని ప్రధానోపాధ్యాయుడు బలగ శంకరరావుకు సూచించారు. పాఠశాలలో 120 మంది విద్యార్థులుండగా బుధవారం మధ్యాహ్నం భోజనానికి 96 మంది హాజరైనట్లు హెచ్ఎం తెలిపారు. వీరిలో కొంతమంది విద్యార్థులకు భోజనం చేయడం వల్ల ఏమీ కాలేదని కొంతమందికి మాత్రమే ఒంట్లో తిప్పినట్లు అన్పించిందని తహశీల్దార్ కు తెలిపారు. అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. 65 మంది విద్యార్థులకు వైద్యపరీక్షలు భోజనం వికటించడంతో అస్వస్థతకు గురైన విద్యార్థుల తో పాటు భోజనం చేసి ఆరోగ్యంగా ఉన్న మరి కొంతమం ది విద్యార్థులను కూడా ఆస్పత్రికి తరలించారు. దీంతో 65 మంది విద్యార్థులు ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేసుకున్నారు. ఏడ్పులతో దద్దరిల్లిన ఏరియా ఆస్పత్రి...! పార్వతీపురం/బెలగాం: ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురైన 65 మంది పిల్లలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆస్పత్రంతా పిల్లలు వారి తల్లిదండ్రుల ఏడ్పులతో దద్దరిల్లింది. ఆస్పత్రికి వచ్చిన పిల్లలకు వైద్యులు జి.నాగశివ జ్యోతి, డా.బి.వెంకటరావు, జి.వాసుదేవరావు, రాజీవ్, సంతోష్, సత్యనారాయణ మూరి,్త జీవీఆర్‌ఎస్ కిశో ర్ తదితరులతోపాటు సిబ్బంది తక్షణ వైద్యసేవలు అందించారు. వైద్యులు పిల్లలకు ఇంజక్షన్లు చేసే సమయంలో వారి ఏడ్పులతో ఆస్పత్రి ప్రాంగణమంతా దద్దరిల్లింది. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యా రు. పిల్లలకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు ధైర్యం చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం తల్లిదండ్రులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన నిర్వాహకులకు పూర్తి రాజకీయ అండ ఉండడంతో వారు పెట్టిందే భోజనం, చేసిందే వంట అన్న చందంగా పిల్లలు తినాల్సిందేనని వాపోయారు. ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మున్సిపల్ చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, తహశీల్దారు కేడీవీ ప్రసాద్, వైఎస్సార్సీపీ నాయకుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆస్పత్రికి వచ్చి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఇంత బాధ్యతారాహిత్యమా?: ద్వారపురెడ్డి శ్రీనివాసరావు... ఎమ్మెల్యే స్వగ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులు, మధ్యా హ్న భోజన నిర్వాహకులకు ఇంత బాధ్యతారాహిత్యమా..? అంటూ వైస్సార్సీపీ నేత ద్వారపురెడ్డి శ్రీనివాస రావు ప్రశ్నించారు. తక్షణమే నిర్వాహకులను విధుల నుంచి తొలగించి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాహకులపై చర్యలు శూన్యం..! మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలో బాధ్యులైన నిర్వాహకులపై కనీస చర్యలు తీసుకునేందుకు ఇటు రెవెన్యూ, అటు విద్యాశాఖాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిర్వాహకులపై కనీసం పోలీ సులకు ఫిర్యాదు కూడా చేయకపోవడం పట్ల ఆయా శాఖాధికారులు రాజకీయ పలుకుబడికి లొంగిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఎంఈఓ డి.రామచంద్రరావు వద్ద ప్రస్తావించగా తాను క్యాంపులో ఉన్నానని, తహశీల్దారే సంఘటనను పర్యవేక్షించారని తప్పుకున్నారు. తహశీల్దారును ప్రశ్నించగా మిడ్డేమీల్ విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలోకి వస్తుందని వారే పోలీసులకు ఫిర్యాదు చే యాలని అన్నారు. అయితే సెలవులో ఉన్న హెచ్ఎంకు విద్యాశాఖాధికారులు చార్జి మెమో ఇవ్వడం కొసమెరుపు. -
మన పిల్లల్ని...దేవుడే కాపాడాలి !
విజయనగరం ఫోర్ట్ : చిన్నారులు ప్రయాణించే ప్రైవేటు పాఠశాలల బస్సుల పట్ల పలు పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రవాణా శాఖాధికారులకు ఎంతోకొంత ముట్టజెప్పి, మేనేజ్ చేసుకోవచ్చునన్న భావనలో చాలామంది యాజమానులు ఉన్నారు. ఈ కారణంగానే పాఠశాలలు పునఃప్రారంభమై 12 రోజులు కావస్తున్నా...ఇప్పటికీ చాలామంది బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు (ఎఫ్‌సీ) తీసుకోలేదు. ఈ విషయమై సంబంధిత అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 400 ప్రైవేటు పాఠశాలల బస్సులు ఉన్నాయి. వీటిలో 340 బస్సులు మాత్రమే ఇప్పటివరకు ఎఫ్‌సీ చేయించుకున్నాయి. 60 బస్సులు ఇంకా ఎఫ్‌సీ చేరుుంచుకోవాల్సి ఉంది. వాస్తవానికి పాఠశాలలు పునఃప్రారంభమైన రోజు నాటికే ఎఫ్‌సీలు తీసుకోవాలి. కానీ 12 రోజులు కావస్తున్నా.. బస్సుల యజమానులు ఎఫ్‌సీలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారు. ఎఫ్‌సీ చేయించుకున్న బస్సుల్లో కూడా కొన్నింటి పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్టు సమాచారం. విద్యార్థులు ప్రయాణించే బస్సు పూర్తిస్థాయి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అలాగే డ్రైవర్ కూడా ఆరోగ్యవంతుడై ఉండి, ఎటువంటి చెడు అలవాట్లు లేకపోతే అప్పుడు విద్యార్థులు సురక్షితంగా ఇంటికి చేర్చగలరు. కానీ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యజమానులు ధనార్జనే తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి అలోచించడం లేదు. కండిషన్ బాగాలేని బస్సులు నడిపి కాసుల కూడేసుకోవాలని చూస్తున్నారే తప్ప విద్యార్థుల క్షేమాన్ని విస్మరిస్తున్నారు. జిల్లాలో చాలా బస్సుల కండిషన్ అధ్వానంగా ఉంది. కొన్ని బస్సులు ప్రమాదాలకు ద్వారాలు తెరిచే విధంగా ఉన్నాయి. సీట్లు చిరిగిపోవడం, పెయింటెంగ్ వెలిసిపోవడం, అద్దాలు పగిలిపోవడంతో పాటు ఇంజిన్ కండిషన్ లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రత్యేక డ్రైవ్‌పై మీనమేషాలు గత ఏడాది రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో అధికారులు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్‌లో నిబంధనలు అతిక్రమించిన 40 బస్సులను సీజ్ చేశారు. డ్రైవ్ చేపట్టిన వారం రోజులు స్కూల్ బస్సులు ప్రతీ రో జూ రవాణా శాఖ కార్యాలయం వద్ద బారులు తీరేవి. ఈ ఏడాది కూడా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కమిషనర్ ఆదేశించినప్పటికీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అన్ని జిల్లాలోనూ దాడులు నిర్వహించినప్పటికీ ఇక్కడ మాత్రం ప్రత్యేక డ్రైవ్ చేపట్టలేదు. నిబంధనలు కఠినతరం గత ఏడాది కాకినాడ, ఖమ్మం జిల్లాలో జరిగిన పాఠశాల బస్సు ప్రమాదంలో కొంతమంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. దీంతో ఈ ఏడాది అధికారులు నిబంధనలను కఠినతరం చేశారు. నిబంధనలకు అనుగుణంగా బస్సు లేకపోతే ఫిటినెస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా పంపించేస్తున్నారు. గత రెండు రోజుల్లో 20 వరకు బస్సులను రవాణాశాఖ అధికారులు తిప్పి పంపించేశారు. దీంతో బస్సు యాజమానులు బస్సులను కండిషన్‌గా ఉంచేందుకు షెడ్డులకు పంపించి యుద్ధప్రాతిపాదకన చర్యలు చేపడుతున్నారు. రెండు రోజుల్లో ప్రత్యేక డ్రైవ్ : ఒకటి, రెండు రోజుల్లో స్కూల్ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ చేపడతామని ఇన్చార్జ్ ఆర్టీఓ ఐ. శివప్రసాద్‌రావు తెలిపారు. నిబంధనలు పాటించని, ఎఫ్‌సీ లేని వాహనాలను సీజ్ చేస్తామని చెప్పారు. ఎఫ్‌సీ నిబంధనలు ఇవి బస్సు ప్రధాన ద్వారం వద్ద పిల్లలు ఎక్కడనాకి 325 మిల్లీ మీటర్లు ఎత్తు ఉండాలి. స్టీరింగ్, బ్రేకు, ఇంజిన్ కండిషన్ బాగుండాలి. సీట్లు కొత్తగా ఉండాలి. టైర్లు కండిషన్ బాగు ఉండాలి. బస్సులపై విద్యార్థులను ఆకర్షించే విధంగా బొమ్మలు వేయాలి. ప్రథమ చికిత్స బాక్సు ఉండాలి. డ్రైవర్ 50 ఏళ్ల లోపు ఉండాలి. డ్రైవర్, క్లీనర్ యూనిఫారం ధరించాలి. డ్రైవర్ గాని క్లీనిర్ గాని మద్యం సేవించరాదు. అద్దాలు, గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. లైట్లు అన్నీ కొత్తవి ఏర్పాటు చేయాలి. అత్యవసర ద్వారం, బ్రేకులు, స్టీరింగ్ కండిషన్‌గా ఉండాలి. వాహనంలో విద్యార్థుల జాబితా ఉండాలి. డ్రైవర్‌కు లెసైన్సు తప్పనిసరి ఇవి చేయకూడదు సీట్లకు సరిపడ విద్యార్థులను మాత్రమే బస్సులో ఎక్కించాలి. పరిమితికి మించి పిల్లలను ఎక్కించకూడదు. ఎఫ్‌సీ లేకుండా బస్సును నడపరాదు. అలా చేస్తే రూ. 5 వేలు అపరాధ రుసం విధిస్తారు. బస్సును సీజ్ చేస్తారు. -
నిద్రిస్తున్న కార్మికులపై దూసుకెళ్లిన లారీ
ముగ్గురు బీహార్‌వాసుల మృతి సుల్తానాబాద్ : లారీ క్లీనర్ నిర్లక్ష్యం మూడు నిండుప్రాణాలను బలిగొంది. రివర్స్‌లో వచ్చిన లారీ నిద్రిస్తున్న కార్మికులపై నుంచి వెళ్లడంతో వారు మృత్యువాతపడ్డారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో శనివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. బీహార్ రాష్ట్రం మస్తాపూర్ జిల్లా రోసేరా మండలం కల్యాణ్‌పూర్‌కు చెందిన 15 మంది కార్మికులు వారం క్రితం రైస్‌మిల్లులో పనిచేసేందుకు వచ్చారు. శుక్రవారం పని ముగిసిన తర్వాత భోజనాలు చేసి మిల్లు ఆవరణలో అందరూ ఒకే చోట వరుసగా పడుకున్నారు. అర్ధరాత్రి 2.15 గంటల ప్రాంతంలో మేడిపల్లిలోని ఐకేపీ సెంటర్ నుంచి ఓ లారీ మిల్లుకు ధాన్యం తీసుకొచ్చింది. హనుమాన్ దీక్ష స్వీకరించిన డ్రైవర్ మాలవితరణకు వెళ్లగా, క్లీనర్ సాయిలుకు లారీని అప్పగించాడు. అతడు నిద్రిస్తున్న కార్మికులను గమనించకుండా లారీని రివర్స్ తీసుకోవడంతో వెనుక చక్రాల కింద నలిగి దీప్‌సదా(20), శ్యాంసుందర్ సదా(25), సుకేందర్‌సదా(22) మృతిచెందారు.