ఖమ్మంమామిళ్లగూడెం: ఎన్నికలు పూర్తయ్యాయి. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమై ఉంది. రెండు రోజుల్లో ఫలితాలు కూడా రానున్నా యి. అయితే, ఎవరొచ్చినా, ఏ అభ్యర్థి గెలిచినా ఖమ్మంలో ప్రధానంగా బస్టాండ్‌ను పూర్తి చేస్తారా? అని పలువురు అంటున్నారు. పాత బస్టాండ్ సరిపోకపోవడం, కొత్త బస్టాండ్ పనులు ప్రారంభించారు కానీ, పూర్తిస్థాయిలో నిర్మించకపోవడంతో కనీసం ఎన్నికల ఫలితాల తర్వాతనైనా బస్టాండ్ నిర్మిస్తారోని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రు. ఖమ్మం నగరం రోజురోజుకూ అభివృద్ధి చెం దుతుండటంతో.. నగరానికి వచ్చే ప్రజల సంఖ్య ఎక్కువ అవుతోంది. అయితే గతంలో ఎప్పుడో నిర్మించిన బస్టాండ్ ప్రస్తుతం సరిపోకపోవడంతో మరో బస్టాండ్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ఈ నిర్మాణ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. బస్టాండ్ నిర్మాణానికి శం కుస్థాపనచేసి ఏడాది దాటిపోయినా నిర్మాణ పను ల్లో పురోగతి అంతగా లేదు. ఈ బస్టాండ్ ప్రజ లకు అందుబాటులోకి రావాలంటే ఎంత కాలం పడుతుందో తెలియడం లేదు. నగరంలోని ఎన్‌ఎస్టీరోడ్‌లో నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్ పను లు 7ఎకరాల 13కుంటల స్థలంలో, రూ.25 కోట్ల తో కొనసాగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో, ఆధునిక హంగులతో చేపడతామని అప్పటి సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే నూతన బస్టాండ్‌కు స్థలం కేటాయించిన తర్వాత చాలా రోజులకు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణ పనులు ప్రారంభించి సంవత్సరం కాలం కావస్తున్నా ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి.
నిధులు విడుదల చేసినా..
ఎన్నో ఏళ్ల కిందట జిల్లా కేంద్రంలో నిర్మించిన ఖమ్మం బస్టాండ్ ప్రస్తుతం ఉన్న బస్సులకు సరిపడడం లేదనే ఉద్దేశంతో నూతన బస్టాండ్ నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులను స్థలం కేటాయించాలని ఆదేశించి, నిధులను సైతం విడుదల చేసింది. అయితే నిర్మాణ పనులు మాత్రం అడుగు వేయడానికి ఆరు మాసాలు అన్నచందంగా సాగుతున్నాయి. గత సంవత్సరం జూన్ నెలలో పనులు ప్రారంభించినా ఇప్పటి వరకు కనీసం పిల్లర్లు కూడా పైకి లేవలేదు. బస్టాండ్ నిర్మాణ పనులు చూసిన వారంతా ఇలా పనులు జరిగితే ఇంకా పది సంవత్సరాలు అయినా పూర్తికాదని చర్చించుకుంటున్నారు. పని ప్రదేశాల్లో కనీసం పనికి అవసరమైన మిషన్లు, సామగ్రి, కూలీలను ఏర్పాటు చేసుకోకపోవడం కూడా పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని స్థానికులు మారోపిస్తున్నారు. బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా కనీసం సంబంధిత అధికారులు పనులను పరిశీలించిన దాఖలాలు కూడా లేవు.
పాత బస్టాండ్‌లో ఇక్కట్లు
నూతన బస్‌స్టాండ్ నిర్మాణం త్వరగా పూర్తవుతుందని భావిస్తే అదికాస్తా జాప్యం అవుతుండటంతో పాత బస్‌స్టాండ్‌కు ఇక్కట్లు తప్పడంలేదు. ప్రతిరోజు జిల్లా కేంద్రమైన ఖమ్మం బస్టాండ్‌కు దాదాపు 1,250 బస్సులు నిత్యం ఇతర జిల్లాలు, రాష్ట్రాల ద్వారా వస్తూ పోతుంటాయి. వేల మంది ప్రయాణికులు ఖమ్మం బస్టాండ్ నుంచి వారివారి గమ్య స్థానాలకు ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులకు, బస్సుల సంఖ్యకు అనుగుణంగా బస్టాండ్ లేక పోవడంతో బస్సులు బస్టాండ్‌లో తిరగటానికి ఇబ్బంది కరంగా మారింది. వర్షాకాలంతో ప్రయాణికులకు అనుకూలంగా లేని బస్టాండ్‌లో ఆరుబ యట తడవక తప్పడంలేదు. బస్సు లోనికి రావాలన్నా,బయటకు వెళ్లాలన్నా నరకమే కనిపిస్తోంది. ఇక బస్టాండ్ బయట ఆటోలు, తోపుడు బండ్లతో బస్సులులోనికి రావడానికి ఎక్కువ సమయం పడుతోందని ప్రయాణికులు చెబుతున్నారు.
ట్రాఫిక్‌తో సమస్య
నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాలతో ట్రాఫిక్ సమస్య ఇబ్బందికరంగా ఉంది. వాహనాలకు అనుగుణంగా రోడ్ల విస్తీర్ణం లేకపోవడంతో ఇక్కట్లు తప్పడంలేదు. సమస్యలను ఎవ రూ పట్టించుకోక పోవడంతో స్థానిక ప్రజలకు ఇ బ్బందులు తప్పడంలేదు. ఈసారి ఎన్నికల్లో గెలిచే ప్రజాతినిధులు పట్టించుకొని బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, నగరం లో ప్రయాణికులకు అనుగుణంగా మినీబస్సులు తిప్పాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నప్పటికీ రోడ్లు అనుకూలంగా లేకపోవడంతో మినీబస్సులు జాడలేకుండా పోయాయి.
ఎవరొచ్చినా ‘స్టాండ్’ అయ్యేనా?
Published Sun, Dec 9 2018 12:33 PM | Last Updated on Sun, Dec 9 2018 12:33 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment