bus stand
-
బస్టాండ్‌లో మహిళ ప్రసవం
కరీంనగర్ టౌన్: భర్తతో కలిసి స్వస్థలానికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ నిండు గర్భిణి కరీంనగర్ బస్టాండులో ఆదివారం సాయంత్రం పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. ఆర్టీసీ, 108 సిబ్బంది ఆ మహిళకు పురుడుపోశారు. ఒడిశాకు చెందిన కుమారి– దూల దంపతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఇటుక బట్టీలో కొద్దిరోజులుగా కూలీలుగా పనిచేస్తున్నారు.నిండు గర్భిణి అయిన కుమారిని తీసుకుని ఆమె భర్త దూల ఆదివారం కుంట–భద్రాచలం మీదుగా స్వస్థలానికి వెళ్లేందుకు కరీంనగర్ బస్‌స్టేషన్ చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కుమారికి పురిటినొప్పులు వచ్చాయి. కాసేపటికి ఎక్కువ కావడంతో ఆమె భర్త అక్కడే ఉన్న ఆర్టీసీసిబ్బంది సాయం కోరాడు. వారు వెంటనే 108 సిబ్బందికి ఫోన్ చేశారు. ఇంతలో అక్కడే ఉన్న ఆర్టీసీ మహిళా సిబ్బంది పరిస్థితిని గమనించి ప్లాట్‌ఫాం ఎదురుగా ఉన్న చెట్టు కిందకు కుమారిని తీసుకెళ్లారు. చుట్టూ చీరలు అడ్డుగా పెట్టి డెలివరీ చేశారు. అదే సమయంలో 108 సిబ్బంది అక్కడికి చేరుకొని సాయం అందించారు. పండంటి ఆడబిడ్డ జని్మంచగా.. 108 వాహనంలో తల్లీబిడ్డను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. పురుడుపోసిన ఆర్టీసీ స్వీపర్లు సైదమ్మ, స్రవంతి, లావణ్య, భవానీ, రేణుకను అధికారులు, ప్రయాణికులు అభినందించారు. కాగా తన భార్యకు డెలివరీ సమయం వచ్చే వరకు ఇటుక బట్టీ యాజమాని కూలీ డబ్బులు ఇవ్వలేదని, రేపుమాపు అంటూ దాటవేయడం వల్లే ఈ పరిస్థితి వచి్చందని కుమారి భర్త దూల ఆవేదన వ్యక్తం చేశారు. -
మంచిర్యాల బస్టాండ్ లో ఓవర్ యాక్షన్
-
వరంగల్‌లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
వరంగల్: బాంబులతో వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల కూల్చివేత జరుగుతుండగా.. బాంబుల మోతతో నగరం దద్దరిల్లింది. పెద్ద శబ్దాలకు చుట్టుపక్క ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిన్న తప్పిదం జరిగినా భారీ నష్టం వాటిళ్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా కూతవేటు దూరంలో రైల్వే స్టేషన్ కూడా ఉండటం గమనార్హం.ఇక.. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల తొలగింపు పనులు చకచకా సాగుతున్నాయి. రూ.70 కోట్లతో అధునాతన బహుళ అంతస్తుల బస్‌స్టేషన్ నిర్మాణంలో భాగంగా సిటీ బస్‌స్టేషన్‌ను అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత బాంబుల (జిలెటిన్ స్టిక్స్)తో భవనాలను కూల్చి వేశారు. పురాతన భవనాలు దృఢంగా ఉండటంతో ఎక్స్కవేటర్లతో కూల్చడం సాధ్యం కాకపోవడంతో, కూల్చివేతలకు పేలుడు పదార్థాలు ఉపయోగించారు. -
ఎన్నికల పండగ..కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
-
Hyderabad : పేరుకే మహా నగరం..తీరు చూస్తే మహా నరకం (ఫొటోలు)
-
సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లెబాట పట్టిన జనం
-
సంక్రాంతి వేళ.. ప్రయాణం కిటకిట (ఫొటోలు)
-
మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా
-
ప్రమాదం ఎలా జరిగిందో కళ్లకు కట్టినట్లు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
-
విజయవాడ బస్టాండ్ లో బస్సు బీభత్సం
-
నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్‌కు కొత్త కళ
సాకక్షి, నిర్మల్: నిర్మల్ టీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ అభివృద్ధిపై దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో శనివారం టీఎస్ఆర్టీసీ చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో నిర్మల్ ఆర్టీసీ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌గా నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నూతనంగా నిర్మించే ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద సెల్లార్, జి-ప్లస్ వన్, శుభకార్యాలకు నిర్వహించే హాల్, నిర్మాణం చేయాలని నిర్ణయించారు. టీఎస్ఆర్టీసీ ద్వారా రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కమర్షియల్ కాంప్లెక్స్‌లలో 53 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. ఆర్టీసీ అధికారులతో నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ బస్టాండ్ఘా నిర్మించేందుకుగా తీసుకోవాల్సిన నిర్ణయాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో చర్చించారు. ఆర్టీసీ సంస్థకు వీలైనంత ఆదాయాన్ని తీసుకొచ్చేందుకు బస్టాండులను ఆధునీకరించి ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.బస్టాండులను కమర్షియల్ కాంప్లెక్సులుగా మార్చి ఆర్టీసీకి కొంత ఆదాయాన్ని సమకూర్చే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే నిర్మల్ బస్ స్టేషన్‌కు నూతనంగా ప్రారంభించిన ఏసీ బస్సులు సూపర్ లగ్జరీ బస్సులను హైదరాబాద్ కేంద్రంగా సర్వీసులను నడుపుతున్నారు. టిఎస్ ఆర్టిసి ప్రాంగణాలలో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు బస్టాండ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని బాజిరెడ్డి తెలిపారుజ నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిర్మల్‌లో నిర్మించే టీఎస్ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ ప్రత్యేకతలు ఇవే.. 1. 1.3 ఎకరాలలో అత్యాధునిక హంగులతో మెరుగైన సౌకర్యాలతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం. 2. ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో పార్కింగ్ సదుపాయం కోసం సెల్లార్ మరియు జి ప్లస్ వన్ నిర్మాణం. 3. నిర్మల్ ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌గా నిర్మాణం చేయడానికి 35 కోట్ల నిధుల ఖర్చు. 4. కమర్షియల్ కాంప్లెక్స్ శుభకార్యాలు నిర్వహించేందుకు హాలును ప్రత్యేకంగా నిర్మాణం. 5. బస్టాండ్ కమర్షియల్ కాంప్లెక్స్ ఆర్టీసీ ప్రయాణికుల కోసం 53 స్టాళ్లను ఏర్పాటు. 6. ప్రయాణికుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్స్, బస్సుల కోసం వేచి ఉన్న వారికోసం ఎల్సీడీ తెరల ఏర్పాటు 7. ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు. 8. మరో 10 తరాలకు అడ్వాన్స్‌గా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం. 9. టీఎస్ఆర్టీసీ బస్టాండుల యొక్క ఆధునికరించుకోవడం వల్ల ప్రయాణికులను ఆకట్టుకోవడం జరుగుతుందని, ప్రయాణికులు కూడా ప్రైవేటు బస్సులను ఆశ్రయించకుండా టీఎస్ఆర్టీసీ అందిస్తున్న ప్రత్యేక రాయితీలు బస్సు సర్వీసులను ఆదరించాలని మరోసారి బాజిరెడ్డి గోవర్ధన్ విజ్ఞప్తి చేశారు. 10. అదనపు ఆదాయ వనరులే మార్గంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సాధించిందని, దీనికి రాష్ట్ర ప్రజలందరూ సహకారం ఉండాలని తెలియజేశారు. -
మన రోల్ మోడల్.. ఒక మంచి పనికి ఎవరో చెప్పడం ఎందుకూ!
పండ్లు అమ్మే ఒక మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని అంకోలా బస్టాండ్‌లో పండ్లు అమ్మే ఒక మహిళ ‘పండ్లు అమ్మడమే కాదు పరిసరాల పరిశుభ్రత కూడా నా బాధ్యత’ అంటోంది. బస్ స్టాండ్ పరిసరాల్లో ఎక్కడ పండ్ల తొక్కలు కనిపించినా వాటిని తీసుకువచ్చి చెత్త డబ్బాలలో వేస్తూ ఉంటుంది. ‘ఇలా చేయమని ఎవరైనా చెప్పారా?’ అని అడిగితే– ‘ఒక మంచి పనికి ఎవరో చెప్పడం ఎందుకూ’ అంటుంది. ఈ మహిళ వీడియో క్లిప్‌ను ఆదర్శ్ హెగ్డే అనే యువకుడు ట్విట్టర్లో షేర్ చేస్తే వైరల్ అయింది. నెటిజనులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ‘మన రోల్ మోడల్’ ‘ఎంత గొప్ప మనసో!’ ‘రియల్ ఉమెన్ ఎంపవర్మెంట్’ ‘నిజమైన హీరో కోసం ఎన్నో ఏళ్లుగా వెదుకుతున్నాను. ఇవాళ్టికి దొరికింది’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. This lady is fruit seller & she sells fruits wrapped in leaves at Ankola Bus stand,Karnataka. Some people after finish eating they throw the leaves from bus window. But this lady goes there picks up the leaves and puts it in dustbin. Its not her work but she's doing it. 🙂🙏👍 pic.twitter.com/TaqQUGZuxP — Adarsh Hegde (@adarshahgd) April 10, 2023 -
బస్టాండ్‌లో యువతికి తాళి కట్టిన యువకుడు
వేలూరు: బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న యువతి మెడలో యువకుడు తాళి కట్టిన సంఘటన ఆంబూరులో సంచలనం రేపింది. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు బస్టాండ్‌లో మంగళవారం సాయంత్రం సుమారు 8 గంటలకు బస్సు కోసం ప్రయాణికులు వేచి ఉన్నారు. రాత్రి సమయం కావడంతో దుకాణదారులు దుకాణాలను మూసే పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో పంజాబ్ దస్తులు వేసుకున్న యువతితో యువకుడు కలిసి వచ్చారు. కొద్ది సమయంలో ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఒక ప్రైవేటు బస్సు వెనుకకు వెళ్లారు. యువకుడు జేబులో ఉన్న తాళి బొట్టును తీసి యువతి మెడలో కట్టాడు. ఆ యువతి కూడా తాళిని సర్వ సాధారణంగా దుస్తులు లోపల వేసుకుని అక్కడి నుంచి ఇద్దరూ కలిసి వెళ్లారు. గమనించిన కొందరు ప్రయాణికులు కలికాలం అనుకుంటూ మాట్లాడుకున్నారు. ఇదిలా ఉండగా బస్టాండ్‌లో జరిగిన ఈ తంతు వీడియో కొందరు ఫేస్బుక్లో పెట్టారు. విషయం తెలుసుకున్న ఆంబూరు పోలీసులు యువతీ, యువకుల కోసం బస్టాండ్‌లో గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకి తెలియరాలేదు. -
సారీ.. నో ఏసీ.. అలంకారప్రాయంగా ఏసీ బస్ షెల్టర్లు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ఏసీ బస్షెల్టర్లు అలంకారప్రాయంగా మారాయి. ఏ ఒక్క షెల్టర్లోనూ ఏసీ సదుపాయం లేదు. ఏసీ ఉంటే తప్ప ఆ షెల్టర్లలో కూర్చోవడం సాధ్యం కాదు. ఒక్క ఏసీ మాత్రమే కాదు. తాగునీళ్లు, టాయిలెట్లు వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అక్కరకు రాని షెల్టర్లలో కూర్చొని ఎదురు చూసేందుకు అవకాశం లేకపోవడంతో ప్రయాణికులు మండుటెండలోనే పడిగాపులు కాయాల్సివస్తోంది. ఏర్పాటులోనే ఆర్భాటం.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట్మాకంగా అయిదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఏసీ షెల్టర్లు నేతిబీర చందంగా మారాయి. అద్దాల డోర్లతో బ్రహ్మాండమైన లుక్ కనిపిస్తుంది. కానీ డోర్లు తెరిస్తే అన్నీ లుకలుకలే. ఏసీ షెల్టర్లతో పాటు నాన్ ఏసీ షెల్టర్ల ఏర్పాటును అప్పట్లో ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. వ్యాపార ప్రకటనలపై వచ్చే ఆదాయంతో వీటిని నిర్వహించాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన సదుపాయాలను ప్రయాణికులకు అందజేయాలి. ఈ షెల్టర్లను ఏర్పాటు చేసిననప్పటి నుంచి వ్యాపార ప్రకటనల ద్వారా ఆయా సంస్థలకు ఆదాయం లభిస్తోంది. ప్రయాణికులకు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు అందడం లేదు. తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, బషీర్‌బాగ్, కోఠి, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, శిల్పారామం, ఖైరతాబాద్ తదితర చోట్ల బస్షెల్టర్లను ఏర్పాటు చేశారు. రెండు కేటగిరీలుగా షెల్టర్లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ నివేదిక ప్రకారం నగరంలో సుమారు 1800 బస్షెల్టర్లు అవసరం. కొన్ని చోట్ల పాతకాలపు షెల్టర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని శిథిలమయ్యాయి. రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం కారణంగా, గతంలో మెట్రో పనుల దృష్ట్యా షెల్టర్లను తొలగించారు. ఇలా షెల్టర్లు లేని చోట ఆధునిక పద్ధతిలో కట్టించేందుకు చర్యలు చేపట్టారు.ఈ క్రమంలోనే మొదట ఏసీ షెల్టర్లకు శ్రీకారం చుట్టారు. కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, శిల్పారామం, దిల్సుఖ్నగర్, ఖైరతాబాద్, తదితర 10 ప్రాంతాల్లో ఏసీ షెల్టర్లను ఏర్పాటు చేశారు. ప్రారంభించిన కొద్ది రోజులు మాత్రమే ఏసీ ఉంది. ఆ తరువాత ఎక్కడా పని చేయడం లేదు. అప్పట్లో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాలు, ప్యానిక్ బటన్లు, మొబైల్ చార్జింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆ సదుపాయాలు ఏవీ అందుబాటులో లేదు. ప్రకటనలకే.. తార్నాక, బేగంపేట్ వంటి పలు చోట్ల ఏర్పాటు చేసిన నాన్ ఏసీ షెల్టర్లు బస్టాపులతో సంబంధం లేకుండా ఉన్నాయి. కేవలం వాటికి వ్యాపార ప్రకటనలకే ఏర్పాటు చేసినట్లుగా ఉన్నాయి. ఆ షెల్టర్లకు పర్లాంగ్ దూరంలో బస్సులు ఆగుతాయి. జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, ముఖ్యంగా జనం దృష్టిని ఆకర్షించేందుకు అవకాశం ఉన్న చోట ఈ తరహా ప్రకటనలతో షెల్టర్లు ఏర్పాటు కావడం గమనార్హం. -
పులివెందుల బస్టాండ్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
తప్పుదారి చూపిన గూగుల్.. ఒక్కసారిగా అవాక్కైన ప్రయాణికులు!
అన్నానగర్(చెన్నై): గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ.. ఓ డ్రైవర్ శుక్రవారం కడలూరు బస్టాండ్‌లోకి లారీని తీసుకెళ్లడం కలకలం రేపింది. వివరాలు.. మార్గం తెలియని పట్టణాల్లో వెళ్తున్నప్పుడు ఆండ్రాయిడ్ సెల్ఫోన్లో గూగుల్ మ్యాప్‌ను అనుసరించి డ్రైవర్లు ప్రయాణిస్తుంటారు. అయితే గూగుల్ మ్యాప్ తప్పు చూపిచడంతో ఒక్కోసారి ప్రమాదలకు సైతం గురవుతుంటారు. వివరాలు.. శుక్రవారం కడలూరులోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి తిరుకోవిలూరు మీదుగా బెంగళూరుకు ట్రక్కులో రసాయనాలకు సంబంధించిన ముడిసరుకును ఓ డ్రైవర్ లారీలో లోడ్ చేస్తున్నాడు. షార్ట్ కట్ కోసం వెతుకుతున్న అతను గూగుల్ మ్యాప్స్ సహాయం కోరాడు. దాని ప్రకారం గూగుల్ మ్యాప్ ద్వారా కడలూరు ముత్తునగర్, ఇంపీరియల్ రోడ్డుకు వచ్చి లారె¯న్స్ రోడ్డు, వన్‌వే రోడ్డుకు వచ్చాడు. కానీ అక్కడ రైల్వే సొరంగం ఉండడంతో అది దాటి వెళ్లలేక వాహనాన్ని అక్కడే నిలిపాడు. ట్రాఫిక్ సమస్య ఏర్పడి ఆటో డ్రైవర్లు గొడవ పడడంతో గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించి వస్తూ.. ఇక్కడ ఇరుక్కుపోయానని చెప్పాడు. తర్వాత ముందుకు పోనిచ్చే క్రమంలో లారీని బస్ స్టేషన్లోకి తీసుకెళ్లాడు. లారీ ఒక్కసారిగా బస్ స్టేషన్లోకి రావడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు. తర్వాత స్థానికుల సహాయంతో డ్రైవర్ ఎలాగో అలా.. లారీని మెయిన్ రోడ్డులోకి తీసుకొచ్చాడు. ఈక్రమంలో ట్రాఫిక్‌కు భారీగా అంతరాయం ఏర్పడడంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చదవండి: ఆలయాల్లోకి సెల్ఫోన్లు నిషేధం.. వస్త్రధారణ సరిగా ఉండాలన్న మద్రాస్ హైకోర్టు -
CM Jagan: సీఎం జగన్ నరసాపురం పర్యటన ఖరారు
సాక్షి, పశ్చిమగోదావరి(నరసాపురం): ఈ నెల 21న నరసాపురంలో జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలో జరుగుతున్న సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న బస్టాండ్, 100 పడకల ఆసుపత్రి పనులు పరిశీలించారు. చిన్నచిన్న పెండింగ్ పనులు ఉంటే రెండురోజుల్లో పూర్తి చేసుకోవాలని చెప్పారు. చినమామాడిపల్లి వద్ద నిర్మించిన హెలీప్యాడ్‌ను, 25 వార్డు వీవర్స్‌కాలనీ వద్ద ముఖ్యమంత్రి బహిరంగ సభ వేదికను పరిశీలించారు. వేదిక పనులు వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. బహిరంగసభ వద్ద పార్కింగ్ విషయంలో ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ సీఎం పర్యటన 21న ఖరారు అయ్యిందని చెప్పారు. ఆ రోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం కావడంతో నరసాపురంలో జరిగే వేడుకల్లో సీఎం పాల్గొంటారని చెప్పారు. ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ప్రాజెక్ట్ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని చెప్పారు. బస్టాండ్, ఆసుపత్రి వంటి పూర్తయిన పనులను ప్రారంభిస్తారని వివరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నరసాపురం సబ్‌కలెక్టర్ ఎం.సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు. చదవండి: (రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాను.. బట్టలిప్పించికొట్టిస్తా: చంద్రబాబు) -
వరంగల్‌లో ఆధునిక బస్టాండ్
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో సరికొత్త, ఆధునిక బస్టాండ్ నిర్మితం కానుంది. ప్రస్తుతం పట్టణంలో ఉన్న పాత బస్టాండ్‌ను కూల్చివేసి, దానికి పక్కనే ఉన్న వరంగల్ నగరపాలక సంస్థ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)లకు చెందిన స్థలాలను కూడా కలిపి 2.32 ఎకరాల స్థలంలో, రూ.75 కోట్ల వ్యయంతో ఐదు అంతస్తుల్లో కొత్త బస్టాండ్ నిర్మించనున్నారు. కేవలం బస్సులు ఆగే ప్రాంగణంగానే కాకుండా, భారీ వాణిజ్య సముదాయంగా, భవిష్యత్తులో వరంగల్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు సాకారమైతే దానితో అనుసంధానించేందుకు వీలుగా దీనిని నిర్మించాలని నిర్ణయించారు. శుక్రవారం బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్‌లు దీని ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. పురపాలక శాఖ నిధులతో.. పురపాలక శాఖ నిధులతో ఈ బస్టాండ్‌ను నిర్మించనున్నారు. వాహనాల పార్కింగ్‌కు భారీ సెల్లార్, బస్సులు నిలిపేందుకు 32 ప్లాట్‌ఫామ్స్, సమీపంలో ఉన్న వరంగల్ రైల్వే స్టేషన్‌కు స్కైవాక్‌తో అనుసంధానం, ఎస్కలేటర్లు, వాణిజ్య సముదాయాలు, రెస్టారెంట్లతో ఈ భారీ భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. ఒకవేళ మెట్రోతో అనుసంధానిస్తే ఎలాంటి ఏర్పాట్లు అవసరమో, నాగ్‌పూర్ మెట్రో అధికారులతో సంప్రదించినట్టు బాజిరెడ్డి వెల్లడించారు. అలాగే రైల్వేతో అనుసంధానంపై ఆ శాఖ అధికారులతో చర్చిస్తున్నామన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్‌తో చర్చల నేపథ్యంలో, పురపాలక శాఖ నిధుల విడుదలకు మార్గం సుగమమైనట్లు తెలిపారు. సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అజిత్‌రెడ్డి, ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, వినోద్, చీఫ్ ఇంజనీర్ రామ్‌ప్రసాద్, వరంగల్ ఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. -
వార్తల్లోకెక్కిన శ్రీకార్యం బస్టాండ్.. కూల్చేసిన ప్రభుత్వం
తిరువనంతపురం: ఏమాత్రం సిగ్గుపడకుండా అబ్బాయి వడిలో అమ్మాయిలు కూర్చుని ఆ మధ్య సోషల్ మీడియాలో ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. స్థానికులు ఓ బస్టాండ్‌లో చేసిన పనితో.. మండిపోయిన కాలేజీ స్టూడెంట్స్ ఈ ట్రెండ్‌ను పుట్టించారు. అయితే వార్తల్లో చర్చనీయాంశంగా మారిన ఆ బస్టాండ్‌ను.. రెండు నెలల తర్వాత ఇప్పుడు కూల్చేయాలని అధికారులు నిర్ణయించారు. అమ్మాయిలు, అబ్బాయిలు పక్కపక్కనే కూర్చుంటున్నారంటూ తిరువనంతపురం శ్రీకార్యం బస్టాండ్ బెంచ్‌ను మూడు ముక్కలు చేశారు స్థానికులు. ఇది నచ్చని కొందరు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు.. ఆ మూడు ముక్కలపై ఒళ్లో కూర్చుని ఫొటోలు పెట్టి వైరల్ చేశారు. అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు కూర్చున్న ఫొటోలు తెగ ట్రెండ్ అయ్యాయి. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో ఆ బస్ షెల్టర్‌ను తాత్కాలికంగా సీజ్ చేశారు పోలీసులు. జులైలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ విషయం ప్రభుత్వం దాకా వెళ్లడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ బస్టాండ్‌ను పడగొట్టాలని నిర్ణయించడంతో విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ స్థానంలో కొత్త బస్టాండ్‌ను, అదీ లింగ వివక్షకు తావు లేకుండా ఉండేలా చూస్తామని విద్యార్థులకు మాటిచ్చారు మేయర్ ఆర్య రాజేంద్రన్. స్థానికులు చేసిన ఆ పని అనవసరమైందని, ప్రొగ్రెసివ్ స్టేట్‌గా పేరున్న కేరళలలో ఇలాంటి ఘటనలు జరగడం మంచిది కాదని ఆమె పేర్కొన్నారు. అలాగే.. అబ్బాయిలు-అమ్మాయిలు కలిసి కూర్చోవడంపై రాష్ట్రంలో ఎలాంటి నిషేధం లేదన్న ఆమె.. అలా కనిపించిన వాళ్లను వేధించే సంస్కృతి ఏనాడో అంతరించిపోయిందని గుర్తు చేశారు. ఇదీ చదవండి: వాళ్లు చదువుకునేలా ఏదైనా సాయం చేయండి -
ప్రియుడి కోసం ఇద్దరమ్మాయిల డిష్యుం.. డిష్యుం
ఔరంగాబాద్: ఇద్దరు టీనేజర్లు.. ఒకే కుర్రాడిని ప్రేమించారు. కాదు.. కాదు.. ఆ కుర్రాడే ఒకరికి తెలియకుండా మరొకరిని మ్యానేజ్ చేసుకుంటూ వచ్చాడు. చివరికి విషయం బయటపడేసరికి.. కుర్రాడి కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన ఆ అమ్మాయిలు.. వాళ్లలో వాళ్లే ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని బాహాబాహీకి దిగారు. మహారాష్ట్రలోని పయ్థాన్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇద్దరమ్మాయిల్లో.. ఒక అమ్మాయి సదరు కుర్రాడితో కలిసి స్థానిక బస్టాండ్‌కు చేరుకుంది. ఆ సమయంలో మరో అమ్మాయి కూడా అక్కడే ఉంది. వీళ్లిద్దరినీ గమనించి.. దగ్గరకు వచ్చి నిలదీసింది. విషయం తేలేసరికి.. ప్రియుడు తనవాడంటే తనవాడంటూ ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకుని తన్నుకున్నారు. అక్కడే ఉన్న కొందరు వీళ్లను నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ.. లాభం లేకపోయింది. ఈ గ్యాప్‌లో ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయినా అదేం పట్టించుకోకుండా ఆ యువతులు ఫైటింగ్ కొనసాగించారు. ఈలోపు పోలీసులు వచ్చి.. ఇద్దరినీ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇప్పి పంపించారు. ఇదీ చదవండి: చిన్నారుల స్టెప్పులకు కేటీఆర్ ఫిదా -
RTC Buses: బస్సులో ఓ చార్జి .. కౌంటర్లో మరో చార్జి.. ఎందుకీ గందరగోళం?
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ బస్సు చార్జి రూ.280. బస్సులో ఈ మొత్తానికే టికెట్ జారీ అవుతోంది. అదే బస్టాండులోని కౌంటర్లో టికెట్ కొంటే మాత్రం రూ.310 చార్జి అవుతోంది. అన్నిచోట్లా ఇలాగే జరుగుతోంది. ఒకే ప్రాంతానికి వెళ్లే, ఒకే కేటగిరీ బస్సు అయినా.. బస్సులో కండక్టర్/డ్రైవర్ జారీ చేసే టికెట్ ధరకూ, బస్టాండ్లలోని కౌంటర్లలో తీసుకునే టికెట్ ధరకూ పొంతన ఉండటం లేదు. ఇలా బస్సులో ఒకలా, కౌంటర్లో మరోలా జారీ అవుతున్న టికెట్లు ప్రయాణికులను అయోమయానికి గురి చేస్తున్నాయి. దీంతో కొన్నిసార్లు సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్నారు. ఎందుకీ గందరగోళం.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్లలో అక్కడి నుంచే ప్రారంభమయ్యే బస్సు ప్లాట్‌ఫామ్ మీదకు రావటానికి కొన్ని నిమిషాల ముందు నుంచి అక్కడి కౌంటర్లలో నిర్ణీత ప్రాంతానికి/నగరానికి టికెట్లు జారీ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రైవర్లే టిమ్ (టికెట్ జారీ యంత్రం) ద్వారా టికెట్ జారీ చేస్తున్నారు. అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి అదే ప్రాంతం లేదా నగరానికి వెళ్లే బస్సుల్లో కూడా టిమ్‌లతో టికెట్లు జారీ చేస్తున్నారు. అయితే బస్సుల్లో టిమ్స్‌తో జారీ చేసే టికెట్ ధర కంటే కౌంటర్లలో ఇచ్చే టికెట్ చార్జి అధికంగా ఉంటోంది. గత కొంతకాలంగా ఈ వ్యత్యాసం కనిపిస్తోంది. ఆన్లైన్ రిజర్వేషన్ సిస్టమే కారణం గతంలో కౌంటర్లలో ఇచ్చే టికెట్, బస్సుల్లో ఇచ్చే టికెట్ ఒకే సాఫ్ట్వేర్ ద్వారా జరిగేది. అదే అడ్వాన్స్డ్ రిజర్వేషన్ అయితే మరో పద్ధతి ఉండేది. ప్రయాణానికి చాలా ముందుగా సీటు రిజర్వ్ చేసుకునేందుకు టికెట్ కొంటే అదనంగా చార్జి చేసే పద్ధతి ఎప్పట్నుంచో ఉంది. కచ్చితంగా సీటు రిజర్వ్ చేసే వెసులుబాటు ఉన్నందున, ఆ సేవకు గాను రూ.30 చార్జి చేస్తారు. గతంలో రూ.10గా ఉన్న ఈ చార్జిని ఇటీవల డీజిల్ సెస్ పెంచిన సమయంలో సవరించి రూ.30కి పెంచారు. ఇలా ముందస్తుగా సీట్లు రిజర్వ్ చేసేందుకు వినియోగించే సాఫ్ట్‌వేర్‌నే ఇప్పుడు కామన్‌గా వాడుతున్నారు. ఆర్టీసీ అధీకృత ప్రైవేటు ఏజెంట్లు, ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లు, ఆర్టీసీ స్పాట్ టికెట్ జారీ చేసే కౌంటర్లు.. ఇలా అన్నింటా ఒకటే వాడుతున్నారు. బస్టాండ్లలో సాధారణ టికెట్లు జారీ చేసే చోట కూడా ఇదే సాఫ్ట్వేర్ ఉండటంతో, బస్సు బయలు దేరటానికి కొన్ని నిమిషాల ముందు టికెట్ కొన్నా.. అడ్వాన్స్డ్ రిజర్వేషన్ చార్జి పడుతోంది. ఫలితంగా బస్సులో సాధారణ టిమ్ ద్వారా జారీ చేసే టికెట్‌కు, కౌంటర్లో ఉండే ఓపీఆర్ఎస్ (ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) టికెట్‌కు ఈ తేడా కనిపిస్తోంది. అప్పటికప్పుడు ప్రయాణం కోసం వచ్చే వారు, కౌంటర్లో టికెట్ కొని ఈ రిజర్వేషన్ చార్జి చూసి కంగుతింటున్నారు. ఇదేంటని సిబ్బందిని నిలదీస్తే, ఇందులో తమ ప్రమేయమేమీ ఉండదని, సిస్టంలో లోడ్ చేసిన మేరకు ఆటోమేటిక్‌గా టికెట్ చార్జి వస్తుందని చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు తమకు కౌంటర్లో కాకుండా, బస్సు లో టిమ్ ద్వారా టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అలా ఇవ్వలేమని, కౌంటర్లోనే తీసుకోవాల్సి ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. అలాగే కొన్ని సర్వీసులకు టిమ్ ద్వారా టికెట్ జారీ ఉండదని, అందువల్ల కచ్చితంగా కౌంటర్లోనే తీసుకోవాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ కాకున్నా రూ.30 అదనంగా సమర్పించుకోవాల్సి వస్తోంది. -
బస్టాండ్ బాత్రూంలో ప్రసవం.. పుట్టిన కొద్దిసేపటికే ఆడశిశువు మృతి
సాక్షి, వనపర్తి: బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణి మార్గమధ్యంలో బస్టాండ్ బాత్రూంలోనే ప్రసవించ గా.. పుట్టిన కొద్దిసేపటికే ఆడశిశువు చనిపోయింది. తల్లి ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉంది. ఈ సంఘ టన వనపర్తి జిల్లా కొత్తకోటలో మంగళవారం చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా నాగవరం గ్రామానికి చెందిన చంద్రకళ, చంద్రయ్యల కూతురు మంజుల వివాహం గతేడాది ఆత్మకూర్ మండలం తిపుడంపల్లికి చెందిన కృష్ణయ్యతో జరిగింది. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న కృష్ణయ్య తన భార్యతో కలిసి అక్కడే ఉంటున్నారు. మంజుల ప్రస్తుతం 8 నెలల గర్భవతి. ఆమె ప్రతినెలా వనపర్తి ఏరియా ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. మంగళవారం మంజుల వనపర్తి ఆస్పత్రికి వచ్చి తల్లిదండ్రులతో కలిసి తిరిగి హైదరాబాద్‌కు బస్సులో బయల్దేరింది. కొత్తకోటకు వచ్చే సరికి పురిటినొప్పులు రావడంతో అక్కడి బస్టాండ్‌లో దిగింది. స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. బాత్రూంకు వెళ్లిన మంజుల అంబులెన్స్ వచ్చేసరికి అందులోనే ప్రసవించింది. ఆడశిశువు పురిటిలోనే కన్నుమూసింది. అంబులెన్స్ సిబ్బంది మంజులను కొత్తకోట పీహెచ్‌సీకి తీసుకెళ్లగా డాక్టర్లు పరీక్షించి ఆమె ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. -
నిన్న అమ్మాయిలు.. నేడు అబ్బాయిలు.. అక్కడ అసలేం జరుగుతోంది..
చెన్నై: విద్యార్థులు దేశ భవిష్యత్తుకు ఆశా దీపాలంటారు. కానీ ఇటీవల నెట్టింట చక్కర్లు కొడుతున్న కొన్ని వీడియోలో చూస్తుంటే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయం వేయక మానదు. ముఖ్యంగా విద్యార్థులు బస్సులో ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణించడం, టీచర్లపై దాడి చేయడం, గ్రూపులుగా ఏర్పడి గొడవలకు పాల్పడడం వంటి ఘటనలు తమిళనాడులో పెరుగుతున్నాయి. తాజాగా కొందరు విద్యార్థులు బస్టాండ్ వద్ద కొట్టుకున్నారు. కోయంబత్తూరు సమీపంలోని ఒండిపుదూర్‌లోని బస్టాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఓ పక్క గొడవ జరుగుతుండగానే మరి కొందరు జోక్యం చేసుకోవడంతో పెద్ద ఘర్షణకు దారి తీసింది. రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఇదంతా జరిగింది. విద్యార్థుల యూనిఫాం ఆధారంగా ప్రభుత్వ స్కూల్‌కు చెందినవారుగా గుర్తించారు. ఇక బుధవారం చెన్నైలోని కొత్త వాషర్‌మెన్‌పేట బస్టాండ్ వద్ద కాలేజీ విద్యార్థినుల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో మహిళా విద్యార్థులు జట్లు పట్టుకుని కొట్టుకున్నారు. వెంటనే అక్కడకు వచ్చిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. హెచ్చరించి వారిని వదిలేశారు. అయితే ఈ రెండు ఘటనలపై డీజీపీ శైలేంద్ర బాబు స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని గర్తు చేసుకున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకు స్తోమత లేక ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదివిస్తున్నారని అన్నారు. అలాంటప్పుడు పాఠశాల సంపదైన చైర్లు, కుర్చీలను ఎలా ధ్వంసం చేస్తాం అని ఆయన ప్రశ్నించారు. మన భవిష్యత్తు కోసం శ్రమించే టీచర్లపై ఎందుకు దాడి చేస్తున్నారు? అని డీజీపీ ఆ వీడియోలో నిలదీశారు. ఇలాంటి చర్యలకు పాల్పడ్డవద్దని విద్యార్థులకు హితవు పలికారు. చదవండి: సున్నం కొడుతుంటే రహస్య గది కనిపించింది.. అందులోకి వెళ్లి చూడగా.. -
ప్రయాణికుడి ట్వీట్.. స్పందించిన సజ్జనార్
వేములవాడ: ప్రయాణికుడు చేసిన ట్వీట్‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. వేములవాడకు చెందిన వెల్దండి సదానందం ఈనెల 6న వేములవాడ నుంచి కరీంనగర్‌కు బస్సులో ప్రయాణించారు. ఆ సమయంలో డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ కనిపించడంతో వీడియో తీసి ట్విట్టర్లో సజ్జనార్‌కు పోస్టుచేశారు. దీనిపై స్పందించిన సజ్జనార్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చదవండి: Drunk And Drive Test: ఇక రోజూ డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చుక్కేస్తే.. చిక్కినట్టే! అదేరోజు కరీంనగర్లో దిగి బస్టాండ్‌లో మరుగుదొడ్ల నిర్వహణ, వాటర్ బాటిళ్ల అమ్మకాలపై అధిక వసూళ్లు చేస్తున్నట్లు పోస్టు చేయడంతో వారికి రూ.5 వేలు జరిమానా విధించాలని ఆదేశించారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్లే క్రమంలో కండక్టర్ మాస్క్ లేకుండా విధులు నిర్వహిస్తున్న ఫొటో షేర్ చేయడంతో కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. -
మేక అడ్డురావడంతో.. బస్టాండ్‌లోకి దూసుకెళ్లిన కంటైనర్
సాక్షి, గుడిహత్నూర్: మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొనబోయిన కంటైనర్ బస్టాండ్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో బస్టాండ్‌లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఉట్నూర్ వైపు నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న బస్సు యూటర్న్ తీసుకొని గుడిహత్నూర్ బస్టాండ్ చేరింది. మేక అడ్డురావడంతోనే.. బస్సు బస్టాండ్‌లోకి వస్తుండగా మేక అడ్డు రావడంతో డ్రైవర్ కొంచెం ముందుకు తీసుకెళ్లి నిలుపడంతో ప్రయాణికులు దిగుతున్నారు. అంతలోనే వెనుక నుంచి ఒక భారీ కంటైనర్ వేగంగా వస్తోంది. వేగం అదుపు కాకపోవడంతో డ్రైవర్ దానిని బస్టాండ్‌లోకి తీసుకెళ్లాడు. లేకుంటే వేగం తీవ్రతకు బస్సును ఢీకొనేదే. తేరుకున్న డ్రైవర్ కంటైనర్‌ను బస్టాండ్ ప్లాట్‌ఫాంపై నిలిపి దాక్కున్నాడు. స్థానికులు ఆర్టీసీ డ్రైవర్‌దే తప్పని ఆయనతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలుసుకొని కారకులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తప్పెవరిది? డోంగర్గావ్ యూటర్న్ నుంచి బస్సు బస్టాండ్ వచ్చే క్రమంలో స్పీడ్ లిమిట్ 40 కి.మీగా ఉంది. కాని ఆర్టీసీ బస్సు వెనకాల నుంచి ఓ భారీ కంటైనర్ నేరుగా బస్టాండ్‌లోనికి దూసుకెళ్లడంతో దాని స్పీడ్ కనీసం 90 కి.మీ వేగం ఉంటుందని తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: బంజారాల బతుకమ్మ... తీజ్ పండుగ