అనంతపురం : తాగటానికి భార్యను డబ్బులడిగితే ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... అనంతపురం పట్టణం సున్నపుగేడు ప్రాంతానికి చెందిన బసురుల్లా(50) బస్టాండ్ క్యాంటిన్‌లో పనిచేస్తుంటాడు. తాగుడుకు బానిసైన అతడు డబ్బుల కోసం తరచూ భార్యను వేధిస్తుంటాడు.
ఈ క్రమంలోనే శనివారం ఉదయం కూడా డబ్బులడగగా ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన బసురుల్లా స్థానిక బస్టాండ్ ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. మధ్యాహ్నం 1.15 ప్రాంతంలో అటుగా వెళ్లిన వారు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మద్యానికి డబ్బులివ్వలేదని ఆత్మహత్య
Published Sat, Sep 12 2015 3:10 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement