![Teenage Girl Ends Her Life Over Smart Phone Issue Anantapur - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/7/Teenage-Girl.jpg.webp?itok=g8EYjcw7)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,రాప్తాడు(అనంతపురం): ‘ఎప్పుడూ సెల్‌ఫోన్ చూస్తుంటావ్.. ఇంకెప్పుడు చదువుకుంటావ్.. బంద్ చేసి చదువుకో’ అని అన్న మందలించడంతో మనస్తాపానికి గురైన చెల్లెలు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానిక ముస్లిం మైనార్టీ కాలనీలో చోటు చేసుకుంది. వివరాలు.. మైనార్టీ కాలనీ చెందిన ఇస్మాయిల్‌కు కుమారుడు హకీమ్ మహమ్మద్, కుమార్తె హకీమ్ సబియా (20) ఉన్నారు. హకీమ్ సబియా డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది.
కొంతకాలంగా సబియా ఎక్కువగా సెల్ ఫోన్‌తో కాలక్షేపం చేస్తోంది. గమనించిన సోదరుడు హకీమ్ మహమ్మద్ గురువారం ఉదయం ఆమెను మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన సబియా మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది. కొద్దిసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు ధ్రువీకరించారు. మృతురాలి తండ్రి, సోదరుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాఘవ రెడ్డి కేసు నమోదు చేశారు.
చదవండి: భార్య స్నేహితురాలితో వివాహేతర బంధం.. 6 నెలల కిందట కనిపించకుండాపోయి..
Comments
Please login to add a commentAdd a comment