సాక్షి, అనంతపురం: తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లాక తలుపులు బిగించుకొని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.. సీఐ భార్యా, ఇద్దరు కూతుళ్ల నుంచి వివరాలు సేకరించిన తర్వాత మీడియాకు వివరాలు వెల్లడించారు.
తాడిపత్రి సీఐ ఆనందరావు మృతికి కుటుంబ కలహాలే కారణమని పేర్కొన్నారు. కొంత కాలం గా భార్యా భర్తల మధ్య విబేధాలు ఉన్నాయని.. నిన్న రాత్రి కూడా సీఐ ఆనందరావు దంపతుల మధ్య గొడవ జరిగిందని.. ఈ మనస్తాపం తోనే సీఐ ఆనందరావు బలవన్మరణానికి పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ శ్రీనివాసరావు వివరించారు.
ఎమ్మెల్యే పరామర్శ
తాడిపత్రి సీఐ ఆనందరావు మృతి పట్ల ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విచారం వ్యక్తం చేశారు. సీఐ కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. ఆనందరావు మృతదేహానికి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నివాళులు అర్పించారు. సీఐ ఆనందరావు మృతదేహం వద్ద ఎస్పీ శ్రీనివాసరావు పోలీసు లాంఛనాలతో నివాళులు అర్పించారు.
(చదవండి: పిడుగు పడి 11 మందికి గాయాలు)
Comments
Please login to add a commentAdd a comment