tadipatri
-
తాడిపత్రిలో దారుణం.. భార్యను నరికి చంపిన భర్త
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త వెంకటేశ్వరరెడ్డి వేట కొడవలితో నరికి చంపాడు. భార్య పుష్పావతి అక్కడికక్కడే మృతి చెందింది. తాడిపత్రి పట్టణంలోని హేమాద్రి లాడ్జిలో ఘటన జరిగింది. దంపతుల సమస్యలను పరిష్కరించేందుకు ఇరు వర్గాల పెద్దలు లాడ్జిలో సమావేశమయ్యారు. ఒంటరిగా మాట్లాడాలని చెప్పిన భర్త.. భార్యను హత్య చేశాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.అనుమానాస్పదంగా మహిళ మృతికోనసీమ జిల్లా: రామచంద్రపురం మండలం తోటపేట గ్రామంలో ఈ నెల 12న దామిశెట్టి మహాలక్ష్మి (54) అనుమానాస్పదంగా మృతి చెందింది. సహజ మరణంగా భావించిన బంధువులు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆమె ఒంటిపై బంగారం లేదని, బంగారం కోసమే హత్య చేసి ఉంటారని ద్రాక్షారామ పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో పాతిపెట్టిన మహాలక్ష్మి మృతదేహాన్ని బయటకు తీశారు. స్మశానవాటిక వద్దనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానాస్పద మృతి కింద కేసుగా నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: జంట హత్యల కేసులో వీడిన మిస్టరీ -
‘‘రేయ్.. నీ కథ చూస్తా!’’ జేసీ బెదిరింపులు వెలుగులోకి
అనంతపురం, సాక్షి: కూటమి సర్కార్ అండతో తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) రెచ్చిపోతూనే ఉన్నారు. అధికారులు, రాజకీయ నేతలు ఎవరనేది చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తూ నిత్యం వార్తల్లోక్కి ఎక్కుతున్నారు. తాజాగా మరోసారి ఆయన వివాదంలో నిలిచారు. ఓ దళిత నేతను ఫోన్లో బెదిరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా ఇది ఇక్కడితోనే ఆగలేదు. దళిత సంఘం నేత రాంపుల్లయ్య మున్సిపల్ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఈ విషయంపై ఆయన్ని ఫోన్లో బెదిరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిలిచినా మీటింగ్‌కు రాకపోవం ఏంటని జేసీ ప్రశ్నించగా.. ఆ ఆహ్వానం గౌరవంగా ఉండాలని రాంపుల్లయ్య అన్నారు. ఆ సమాధానం తట్టుకోలేని జేసీ ‘‘నేను పిలిస్తే రావా.. రేయ్.. నీ కథ చూస్తా’’ అంటూ చిందులు తొక్కాతూ ఫోన్ పెట్టారు. అయితే.. ఈ బెదిరింపుల వ్యవహారాన్ని తాడిపత్రి(Tadipatri) సీఐ సాయి ప్రసాద్ దృష్టికి ఫోన్ ద్వారా రాంపుల్లయ్య తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. సీఐ కూడా జేసీకి మద్దతుగా రాం పులయ్యనే దూర్భాషలాడారు. పరస్పర దూషణలతో కూడిన ఆ ఆడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: ఏపీ రాజకీయాలకు సరిగ్గా సరిపోయే సామెత! -
తాడిపత్రిలో సీఐ, దళిత నేత మధ్య చిచ్చుపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి
-
గాంధీనగర్ లో కాశీ మనోజ్ ను కిడ్నాప్ చేసిన దుండగులు
-
కూటమి సర్కార్ కక్ష సాధింపు.. మున్సిపల్ అధికారుల ఓవరాక్షన్!
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి పాలనలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను కూటమి నేతలు, అధికారులు టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా తాడిపత్రిలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.వివరాల ప్రకారం.. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్సార్సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటి నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. అన్ని అనుమతులు ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారని రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదేశాలతోనే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
కూటమి నేతల కమీషన్ దందా.. జేసీ ప్రభాకర్‌పై ఫిర్యాదు!
సాక్షి, అనంతపురం: కూటమి సర్కార్ పాలనలో లిక్కర్ మాఫియా హవా కొనసాగుతోంది. పలుచోట్ల కూటమి నేతలకు మద్యం షాపులు దక్కకపోవడంతో కమీషన్ల కోసం టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ కారణంగా తాడిపత్రిలో నేటికీ నాలుగు మద్యం షాపులు ప్రారంభం కాలేదు.వివరాల ప్రకారం.. తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మద్యం వ్యాపారులు ఫిర్యాదు చేశారు. అయితే, తాడిపత్రిలో నాలుగు మద్యం షాపులను విజయవాడకు చెందిన వ్యాపారులు గోపీనాథ్, గురునాథం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో తన అనుమతి లేనిదే మద్యం షాపులు ప్రారంభించవద్దని జేసీ ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. వ్యాపారులను బెదిరించే ప్రయత్నం చేశారు.దీంతో, నాలుగు మద్యం షాపులు దక్కించుకున్నప్పటికీ తాడిపత్రిలో మాత్రం అవి ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో విజయవాడ మద్యం వ్యాపారులు గోపీనాథ్, గురునాథం.. తమకు భద్రత కల్పించాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, తాడిపత్రిలో మద్యం షాపులు తమ వారికి దక్కకపోవడంతో టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. తమకు 15 శాతం కమీషన్ ఇచ్చాకే మద్యం షాపులు నిర్వహించాలని వార్నింగ్ ఇచ్చారు. -
తాడిపత్రిలో టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, అనంతపురం జిల్లా: వైఎస్సార్సీపీ నేత జావేద్ ఇంటి వద్ద ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి అనుచరుడు వీరంగం సృష్టించాడు. డబ్బులు బాకీ ఉన్నారంటూ వైఎస్సార్సీపీ నేత ఇంటి వద్ద అనుచరులతో దౌర్జన్యానికి దిగాడు. కుటుంబ సభ్యులను నిర్బంధించారని పోలీసులకు వైఎస్సార్సీపీ నేత జావేద్ ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత గోరాకు ఎలాంటి బాకీ లేనని జావెద్ స్పష్టం చేశారు.హోంగార్డుపై టీడీపీ నేత దౌర్జన్యం శింగనమల మండలంలోని ఉల్లికల్లు గ్రామానికి చెందిన టీడీపీ నేత రంగారెడ్డి తనపై దాడికి ప్రయత్నించాడంటూ శింగనమల పీఎస్‌లో పనిచేస్తున్న హోంగార్డు నాగేంద్ర మంగళవారం సీఐ కౌలుట్లయ్యకు ఫిర్యాదు చేశారు. వివరాలు... సెప్టెంబరులో ఒక రోజు రాత్రి నాయనపల్లి క్రాస్ నుంచి మరువకొమ్మ వరకూ హెడ్ కానిస్టేబుల్ గిరి మహేష్‌తో కలసి, హోంగార్డు నాగేంద్ర గస్తీ విధులు నిర్వర్తించాడు.ఆ సమయంలో టీడీపీ నేత ఉల్లికల్లు రంగారెడ్డికి చెందిన టిప్పరులో అక్రమంగా ఇసుక తరలిస్తుండడం గుర్తించి పోతురాజుకాలువ సమీపంలో అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. దీంతో అప్పటి నుంచి హోంగార్డు నాగేంద్ర ఎక్కడ కనిపించిన రంగారెడ్డి కోపంతో దుర్భాషలాడేవాడు. ఈ క్రమంలో మంగళవారం నాయనవారిపల్లిలో జరిగిన శుభకార్యానికి ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, ఎంఎస్ రాజు హాజరుకానుండడంతో ఎస్ఐ, ఎఎస్ఐ, హెడ్ కానిస్టేబులు, సిబ్బందితో ఎస్కార్ట్ విధుల్లో నాగేంద్ర కూడా పాల్గొన్నాడు. అక్కడ సిబ్బంది భోజనం చేస్తున్న సమయంలో నాగేంద్రపై రంగారెడ్డి దాడికి ప్రయతి్నంచాడు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది అడ్డుకోవడంతో నీ కథ చూస్తా అంటూ బెదిరిస్తూ వెళ్లిపోయాడు. టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐకి బాధితుడు ఫిర్యాదు చేశాడు. -
మాటలకందని విషాదం.. కొన్ని గంటల్లో నిశ్చితార్థం.. అంతలోనే..
తాడిపత్రి రూరల్: నిశ్చితార్థం కోసం గోరింటాకు పెట్టించుకుని సోదరునితో కలిసి ద్విచక్రవాహనంపై వస్తున్న యువతిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. తాడిపత్రి అప్‌గ్రేడ్ రూరల్ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకటరెడ్డిపల్లికి చెందిన వీణాదేవి(24)కి ఆదివారం వివాహ నిశితార్థం జరగాల్సి ఉంది.ఇందు కోసం శనివారం సోదరుడు నారాయణరెడ్డితో కలిసి బైక్‌పై తాడిపత్రికి వెళ్లి చేతికి గోరింటాకు పెట్టించుకుంది. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా వీరి బైక్‌ను బుగ్గ నుంచి తాడిపత్రి వైపు వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో వీణాదేవి అక్కడికక్కడే చనిపోయింది.తీవ్రంగా గాయపడిన తమ్ముడు నారాయణరెడ్డికి తాడిపత్రిలో ప్రథమ చికిత్స చేసి, అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరి కొన్ని గంటల్లో నిశితార్థం జరుగుతుందన్న అనందంలో ఉన్న వీణాదేవి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను, గ్రామస్తులను కలచివేసింది. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
తాడిపత్రిలో వెలుగులోకి జేసీ ప్రభాకర్ రెడ్డి మద్యం దందా
-
ఎస్పీని కలిసిన కేతిరెడ్డి
-
రావణ కాష్టం.. రాక్షసానందం!
‘మీరేంటో.. మీ విధానాలేంటో..’ అంటూ ఓ సినిమాలో రావు రమేష్ చెప్పిన డైలాగ్ వారికి బాగా సరిపోతుంది. నిత్యం వివాదాలకు వారే ఆజ్యం పోస్తూ చలికాచుకోవడం రివాజుగా మారింది. గత ఐదేళ్లూ ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించిన తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం జేసీ ఆగడాల కారణంగా బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలు ఒకరకం.. తాడిపత్రి ఒక్కటీ మరో రకంగా మారింది. ‘మేమే రాజులం, మేమే మంత్రులం.. మేము రాసిందే రాజ్యాంగం’ అనే రీతిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపైనా, ప్రత్యర్థి పారీ్టలోని నాయకులపైనా దాడులు చేయడమే కాకుండా తిరిగి వారిపైనే కేసులు పెట్టిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇసుక అక్రమాలపై కావాలనే రాద్ధాంతం.. అధికారం చేతిలో ఉందికదా అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ‘25 మంది ఇసుక తోలేది మా వాళ్లే.. మీరందరూ ఇసుక తోలడం మానుకోండి. లేదా నాకు దూరమవుతారు’ అంటూ ఇటీవల ప్రభాకర్‌రెడ్డి వీడియో సందేశాలు విడుదల చేశారు. అయితే, జేసీ వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే అందులో మరో కోణం అవగతమవుతుంది. తన వర్గం నాయకులు సాగిస్తున్న ఇసుక దందాను నిలిపివేయించి తానే సొంత వాహనాలతో ఇసుక అక్రమ రవాణా సాగించాలన్న మర్మం బయటపడుతుంది. జిల్లాల వారీగా చంద్రబాబు ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్టులు తయారు చేయిస్తోందన్న సమాచారం అందడంతోనే డ్రామాలు ఆడుతున్నారన్న విమర్శలు మరోవైపు వినిపిస్తున్నాయి. పోలీసుల్లో అసంతృప్తి.. తాడిపత్రి మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను ఇటీవల పోలీసులు పట్టుకోగా.. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వెంటనే సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేసి కేసులు కట్టాలంటూ దురుసుగా వ్యవహరించారు. ఎప్పుడు కేసులు కట్టాలో తనకు తెలుసునని సీఐ చెప్పగా.. ఆయనను ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఈ క్రమంలో సీఐను వెనకేసుకు రావాల్సిన పోలీసు ఉన్నతాధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించి, సీఐతో ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పించారు. నిజాయితీగా పనిచేసే ఓ సీఐ పట్ల ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై పోలీసు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎస్పీ స్థాయి వ్యక్తి క్షమాపణలు చెప్పించడమేంటని కిందిస్థాయి పోలీసు అధికారులు వాపోతున్నారు. ఇదే క్రమంలో.. తాను ఏ తప్పూ చేయలేదని, శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే క్షమాపణలు చెప్పానని సీఐ పేర్కొనడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే రాకుండా అడ్డంకులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగుపెట్టకుండా దాడులు చేయిస్తున్నారంటే జేసీ ప్రభాకర్‌రెడ్డి గూండాగిరీ ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇటీవల ఎన్నికల పోలింగ్ రోజు రాళ్లు రువ్వుకున్న ఘటనలో ప్రభాకర్‌రెడ్డి, పెద్దారెడ్డిలు ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇద్దరికీ బెయిలొచ్చింది. కానీ పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డుకుంటున్నారు. ఇటీవల పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లగా తన అనుచరులతో దాడులు చేయించారు. కందిగోపుల మురళి అనే వైఎస్సార్ సీపీ నాయకుడి ఇంటిని ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా జిల్లా పోలీసులు చేష్టలుడిగి చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది. పనిచేయడానికి అధికారులే రావడం లేదు.. జేసీ కుటుంబం దెబ్బకు నియోజకవర్గంలో పనిచేసేందుకు అధికారులే రావడం లేదంటే అతిశయోక్తి కాదు. తాడిపత్రి తహసీల్దార్‌గా వెళ్లిన ఈశ్వరమ్మ కొన్ని రోజులకే తానక్కడ పనిచేయలేనంటూ తిరిగి వచ్చేశారు. తాడిపత్రి టౌన్‌కు ఎస్ఐ ఉన్నా అటాచ్డ్ కింద పెదపప్పూరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రూరల్ పోలీసుస్టేషన్లో ఎస్ఐ లేరు. తమకు ఎప్పుడు బదిలీ వస్తే వెళ్లిపోదామా అన్న ఆలోచనలో రవాణా శాఖ సిబ్బంది ఉన్నారు. మైనింగ్, రెవెన్యూ, ఆరోగ్య.. ఇలా ఏ శాఖ అధికారులైనా తాడిపత్రిలో పనిచేసేందుకు జంకుతున్నారు. పోలీసులన్నా, అధికారులన్నా తన కింద గుమస్తాలే అన్న రీతిలో జేసీ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. -
జేసీ అస్మిత్‌తో నేను దురుసుగా ప్రవర్తించలేదు: సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి
సాక్షి, అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి క్షమాపణల విషయంపై అనంతపురం జిల్లా తాడిపత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ స్పందించారు. మంగళవారం తాడిపత్రిలో జరిగిన ఘటనలో తన తప్పేమీ లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్నే తాను జిల్లా ఎస్పీకి కూడా వ్యక్తిగతంగా కలిసి వివరించానని సి.ఐ. క్ష్మీకాంత్ రెడ్డి బుధవారం తెలిపారు. ఎస్పీ జగదీష్‌ను కలిసిన తరువాత సి.ఐ. విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం నాటి ఘటన వివరాలను తెలిపారు. ‘తాడిపత్రి ఘటనలో నా తప్పు ఏమీ లేదు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌తో నేను దురుసుగా ప్రవర్తించలేదు. ఎస్సీ, ఎస్టీ కేసు నా పరిధిలోని అంశం కాదు. డీఎస్పీ విచారణ చేస్తారని ఆయనతో చెప్పాను. నేను తాడిపత్రిలో 14 నెలల నుంచి పనిచేస్తున్నాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నాపై ఎలాంటి చర్యలు తీసుకున్నా నాకు ఓకే’ అని కామెంట్స్ చేశారు. తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి ఇదేం రాక్షసానందం? సీఐ లక్ష్మీకాంత రెడ్డితో క్షమాపణలు చెప్పించుకున్న @JaiTDP ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అధికారమదంతో పోలీసుల మనోభావాల్ని దెబ్బతీస్తూ అందరి ముందు సీఐ నుంచి క్షమాపణలు చెప్పించుకున్న జేసీ అస్మిత్ రెడ్డి pic.twitter.com/UNSgk2TEMt— YSR Congress Party (@YSRCParty) August 27, 2024 -
జేసీ అరాచకాలు సహించం: వైఎస్సార్సీపీ వార్నింగ్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ దాడులపై ఎస్పీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు వినతి పత్రం అందజేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఆంక్షలు తొలగించాలని మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.కూటమి అధికారంలోకి వచ్చాక దాడులకు తెగబడుతోందని వైఎస్సార్సీపీ మండిపడింది. ‘‘మా పాలనలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాం. చంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేయడం హేయమైన చర్య. దాడులను ఆపడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఆస్తులను ధ్వంసం చేస్తుంటే రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. దాడులు ఇలాగే కొనసాగితే సహించేది లేదు’’ అని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు.ప్రతిపక్షం ఉండకూడదన్నదే జేసీ కుట్రలు: అనంత వెంకటరామిరెడ్డితాడిపత్రి లో జేసీ హింసా రాజకీయాలు ఖండిస్తున్నాం. టీడీపీ దౌర్జన్యాలు, దాడులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేదు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గానికి వెళ్తే తప్పేంటి?. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీ అనుమతితో తాడిపత్రి వెళ్లినా దాడులు చేశారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. హామీలు అమలు చేయకుండా టీడీపీ నేతలతో దాడులు చేయిస్తున్నారు. టీడీపీ గూండాగిరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాంపోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి: మాజీ ఎంపీ తలారి రంగయ్యశాంతి భద్రతలు పరిరక్షించడం లో చంద్రబాబు విఫలమయ్యారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కక్షసాధింపు రాజకీయాలు లేవు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి అనుమతించాలి.జేసీ రౌడీయిజాన్ని పోలీసులు అడ్డుకోలేరా?: మాజీ మంత్రి శంకర్ నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటవిక పాలన ప్రోత్సహిస్తున్నారు. హామీలు అమలు చేయకుండా హింసను ప్రేరేపిస్తున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజాన్ని పోలీసులు అడ్డుకోలేరా?. పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదు. -
చంద్రబాబూ.. జేసీ కుటుంబాన్ని అదుపులో పెట్టు: వైఎస్సార్సీపీ నేత మురళి
సాక్షి, తాడేపల్లి: జేసీ కుటుంబం అరాచకాలపై తాడిపత్రి వైఎస్సార్సీపీ నేత కందిగోపుల మురళి మండిపడ్డారు. మూడు రోజుల క్రితం జేసీ వర్గీయులు తమ ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారని ధ్వజమ్తెతారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాయలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వీడియో తీస్తుంటే మావాళ్ల ఫోన్లను లాక్కున్నారంటూ.. దాడి ఘటనను ఆయన వివరించారు.‘‘మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాల్ చేస్తే ఆయన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాను. కారులో వెళ్తుంటే నాపై దాడి చేసేందుకు జేసీ మనుషులు వచ్చారు. నేను భయపడి వెనక్కి వచ్చేశాను. కాసేపటికే వారంతా మా ఇంటి మీదకు వచ్చారు. వందల మంది వచ్చి దాడులు చేశారు. ఇనుప తలుపులను సైతం పగులకొట్టి లోపలకు వచ్చారు. మారణాయుధాలు చేతపట్టుకుని వచ్చి దాడి చేశారు. తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారు. ఫోన్లు చేసిన పోలీసులు రాలేదు. పదేపదే ఫోన్లు చేస్తే 45 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు’’ అని మురళి చెప్పారు.‘‘నాకు గన్ లైసెన్స్ ఉన్నా ఫైరింగ్ చేయలేదు. గతంలో కూడా ఒకసారి మా ఇంటిపై దాడి చేసి లూఠీ చేశారు. బంగారం దోచుకుపోయారు. ఇరవై ఏళ్ల తర్వాత జేసీ కుటుంబాన్ని ఓడించాం. మళ్లీ ఓడిస్తాం. ఏం ఉన్నా రాజకీయంగా పోరాడతాం. జేసీ కుటుంబం ఇలా ఇళ్లపై దాడులకు దిగటం మంచిది కాదు. రాయలసీమలో ఐదేళ్లుగా శాంతిభద్రతలు బాగున్నాయి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.’’ అని మురళి పేర్కొన్నారు.15 ఏళ్లుగా నాకు గన్ లైసెన్స్ ఉంది. గొడవ అంతా అయిపోయిన తర్వాతే గన్ తీసుకుని బయటకు వచ్చాను. అయితే నేనే టీడీపీ వారిపై దాడి చేసినట్లుగా కేసులు పెట్టారు. చిన్నపిల్లలు, ఆడవారిపై జేసీ కుటుంబం దాడులు చేయడమేంటి?. జేసీ ప్రభాకరరెడ్డి చేసే రాజకీయాలు ఇవేనా?. చంద్రబాబూ.. జేసీ కుటుంబాన్ని అదుపులో పెట్టండి. ఒక విలేకరిని నేను బెదిరించినట్టుగా అక్రమ కేసులు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపులకు దిగొద్దు’’ అని మురళి అన్నారు. -
తాడిపత్రిలో టీడీపీ నేతల అరాచకం బట్టబయలు
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో టీడీపీ నేతల అరాచకం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై టీడీపీ నేతల దాడి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మురళి ఇంటిపై దాడి, వాహనాల విధ్వంసాన్ని స్థానికులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. జేసీ వర్గీయుల బీభత్సం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు మూడు నెలలకు 20వ తేదీన (మంగళవారం) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లారు. వ్యక్తిగత పని ముగించుకుని అరగంటలో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారాయన.ఆయన అలా వెళ్లిన వెంటనే.. జేసీ తన వర్గీయుల్ని రెచ్చగొట్టారు. దీంతో.. టీడీపీ గుండాలు వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేశారు. మురళి ఇంట ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. అదృష్టవశాత్తూ.. జేసీ వర్గీయుల దాడి నుంచి తృటిలో మురళి తప్పించుకున్నారు. -
అధికార జులుం.. తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్తత
అనంతపురం, సాక్షి: అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతుండడంతో.. నియోజకవర్గంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా.. కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటన అనంతరం చెలరేగిన హింస నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారక్కడ. ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు మూడు నెలలకు నిన్న(మంగళవారం) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లారు. వ్యక్తిగత పని ముగించుకుని అరగంటలో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారాయన. ఆయన అలా వెళ్లిన వెంటనే.. జేసీ తన వర్గీయుల్ని రెచ్చగొట్టారు. దీంతో.. టీడీపీ గుండాలు వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేశారు. మురళి ఇంట ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. అదృష్టవశాత్తూ.. జేసీ వర్గీయుల దాడి నుంచి తృటిలో మురళి తప్పించుకున్నారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో తాడిపత్రి అంతటా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలతో పాటు రాష్ట్ర డీజీపీ, కేంద్ర హోం శాఖలకు సైతం ఫిర్యాదులు పంపారు. ఈ సందర్భంగా జేసీపై కే. పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు గుప్పించారు. ‘‘నా హత్యకు జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్ర పన్నారు, నన్ను చంపి తాడిపత్రి లో రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేయాలని జేసీ భావిస్తున్నారు. 2006లో మా అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి హత్య చేయించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతా. త్వరలో తాడిపత్రి కి వెళ్లి వైఎస్సార్ సీపీ శ్రేణులకు అండగా ఉంటా అని అన్నారాయన. వంద మంది టీడీపీ గుండాలొచ్చారుదాడి ఘటనపై తాడిపత్రి వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి సాక్షితో మాట్లాడారు. ‘‘జేసీ ప్రభాకర్ రెడ్డి నన్ను చంపేందుకు స్కెచ్ వేశారు. నా ఇంటిపై వంద మంది టీడీపీ గూండాలు దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేసి, నా ఇంటికి నిప్పు పెట్టారు. తలుపులు పగులగొట్టి నన్ను చంపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. నాకు లైసెన్స్ తుపాకీ ఉంది.. అయినప్పటికీ కాల్పులు జరపలేదు. ప్రాణ రక్షణ కోసమే తుపాకీ చేతిలో పట్టుకున్నాను. టీడీపీ అధికారంలోకి వచ్చాక నాకు గన్ మెన్ తొలగించారు అని అన్నారాయన. మురళి భార్య రమా మాట్లాడుతూ.. ఇలా దాడి జరగడం రెండోసారి అని చెప్పారామె.‘‘టీడీపీ గూండాలు మా ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. గంటసేపు బెడ్ రూం లో దాక్కుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాక్కున్నాం. మా ఇంటిపై దాడి టీడీపీ నేతలు దాడి చేస్తే... నా భర్త కందిగోపుల మురళి పై అక్రమ కేసులా?. ఇదెక్కడి న్యాయం?’’:::మురళి భార్య రమాదేవి -
చట్టం.. జేసీ చుట్టం!
తాడిపత్రిటౌన్: చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అయితే తాడిపత్రిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. చట్టం.. జేసీకి చుట్టం అన్న రీతిలో వ్యవహరిస్తోంది. కళ్లెదుటే నిందితులు కనిపిస్తున్నా పోలీసులు అరెస్టు చేయకుండా వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. అసలు విషయానికి వస్తే... సార్వత్రిక ఎన్నికల అనంతరం తాడిపత్రిలో రెండు రోజుల పాటు ఇరువర్గాల గొడవలు, అల్లర్ల ఘటనలకు సంబంధించి పోలీసులు ఏడు కేసుల్లో దాదాపు 520 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో 163 మందిని (టీడీపీకి చెందిన వారు 81 మంది, వైఎస్సార్సీపీకి చెందిన వారు 82 మంది) అరెస్టు చేశారు. ఆ సమయంలో మిగిలిన నిందితుల కోసం పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పట్టడంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు గ్రామాలు వదిలి బయటప్రాంతాల్లో తలదాచుకున్నారు. గ్రామాలకు గ్రామాలు ఖాళీ అయి బిక్కుబిక్కు మంటూ గడిపాయి. పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి పట్టణ వాసులు సైతం ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలు లేకుండా రహదారులనే దిగ్బంధించిన సంఘటనను ఎవ్వరూ మరచిపోలేరు.పోలీసుల తీరు వివాదాస్పదంఅల్లర్లు, గొడవల కేసుల్లో నిందితులగా ఉండి కనిపించకుండా పోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొంతమంది ఎన్నికల ఫలితాల అనంతరం కళ్లెదుటే తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తమ మాట వినని పోలీసులను బదిలీలు చేయిస్తారని, వీఆర్‌కు పంపుతారేమోనని పోలీసులే టీడీపీ నాయకులను చూసి జంకుతున్నారు. నిందితులను చూసి కూడా చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇదే విషయమై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియా సాక్షిగా చెబుతున్నా పోలీసులు ఏమాత్రమూ స్పందించడం లేదు. గత బుధవారం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట తలపెట్టిన ధర్నాకు అల్లర్ల కేసుల్లో ఉన్న నిందితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారన్న విషయం తాడిపత్రిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. -
తాడిపత్రిలో హై టెన్షన్
సాక్షి, అనంతపురం: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరలేపుతోంది. అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తోంది. శనివారం ఉదయం తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బెయిల్ షూరిటీలు సమర్పించేందుకు తాడిపత్రికి కేతిరెడ్ఢి పెద్దారెడ్డి వెళ్లారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అంతుచూస్తానంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరించిన సంగతి తెలిసిందే. నేడు ఉదయం నేరుగా తాడిపత్రి పీఎస్‌కు వెళ్లిన పెద్దారెడ్డి.. తాడిపత్రి పోలీసులతో మాట్లాడారు. బెయిల్ మంజూరై ఐదు రోజులు గడిచినా షూరిటీలు ఎందుకు తీసుకోలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదని మండిపడ్డారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఐదు రోజులైనా పోలీసులు ఎందుకు షూరిటీలు స్వీకరించలేదని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, మరో 10 మందిపై ఆంక్షలు ఉన్నా తాడిపత్రిలో విచ్చలవిడిగా సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీరు కాదని పెద్దారెడ్డి ధ్వజమెత్తారు.‘‘నన్ను, నా కొడుకులను జిల్లా బహిష్కరణ చేయటానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరు?. తాడిపత్రి ప్రజలకు అండగా ఉంటా. నా ఊపిరి ఉన్నంతవరకూ తాడిపత్రిలోనే ఉంటా. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాను’’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై టీడీపీ కక్ష సాధింపు
సాక్షి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగింది. మునిసిపల్ అధికారులు.. పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేశారు. నోటీసులు ఇవ్వకుండానే కొలతలు వేయటం వైఎస్సార్ సీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ఆదేశాలతో మునిసిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్ సీపీ శ్రేణులు మండిపడుతున్నారు.కాగా, తిరుపతి నగరంలో నాలుగంతస్తుల భవనాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా ఒక టీడీపీ నేత దౌర్జన్యానికి దిగారు. తన స్థలాన్ని కాపాడుకునేందుకు వేరొకరి భవనాన్ని కూల్చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు భవన యజమానిపై దాడికి దిగారు. ఈ వ్యవహారం నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది.తిరుపతిలో తిరుమల బైపాస్ మున్సిపల్ పార్క్ ఎదురుగా ఉన్న విరజా మార్గంలోని టీడీపీ నేత అన్నా రామచంద్రయ్య స్థలంలో మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. అతడి ఇద్దరు కుమార్తెలు కార్పొరేటర్లుగా ఉన్నారు. దీంతో ఆయన అధికారబలంతో తన స్థలాన్ని కాపాడుకునేందుకు వేరొకరి ఇంటి (నాలుగు అంతస్తుల భవనం) పైకి ఆ రోడ్డుని మళ్లించారు. నూతనంగా నిర్మించిన నాలుగంతస్తుల భవనంపై తన మనుషులతో మంగళవారం 15 అడుగుల పబ్లిక్ రోడ్డు అని రాయించారు.ఈ విషయమై భవన యజమాని మాస్టర్ ప్లాన్ మ్యాప్‌ని, అందుకు సంబంధించిన ఆధారాలను చూపించారు. ఈ విషయాన్ని స్పష్టం చేయాల్సిన టౌన్‌ప్లానింగ్ అధికారులు.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగి నోరెత్తడంలేదు. బాధితుడు అధికారులను ప్రాధేయపడుతున్నా పట్టించుకోలేదు. ఇదే సమయంలో టీడీపీ నేత అన్నా రామచంద్రయ్య తన మనుషులతో భవనం వద్ద పనులు చేసుకుంటున్న యజమానిపై దాడి చేశారు. ఈ దాడి సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోలు బయటకు వచ్చాయి. -
తాడిపత్రిలో సిట్.. అల్లర్లపై కొనసాగుతున్న దర్యాప్తు
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం తాడిపత్రి అల్లర్ల ఘటనలపై సిట్ బృందం దర్యాప్తు చేపట్టింది. కేసుల వివరాలు, నిందితుల గుర్తింపు లాంటి అంశాలపై సిట్ ఆరా తీస్తోంది. మరోవైపు.. అరెస్టులు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ చేసిన తర్వాతే నివేదికను సిద్ధం చేయాలని సిట్ భావిస్తోంది.పల్నాడు జిల్లాలో పోలింగ్ డే ఘటనల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని పోలీసులు గుర్తిస్తున్నారు. నిన్న(గురువారం) పల్నాడులో 60 మందికిపైగా అరెస్టులు జరిగాయి. 33 మంది పెట్రోల్ బాంబులతో దాడులకు తెగబడినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితుల్ని నరసరావుపేట కోర్టులో హాజరుపరిచి.. నెల్లూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.పల్నాడుపై సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పల్నాడు జిల్లా పోలింగ్ నాటి హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు.. ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోనే విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతోంది.ఈవీఎం ధ్వంసం వెనుక కారణాలపై సిట్ ఆరా తీస్తోంది. పిన్నెల్లి వీడియోతో సంబంధం లేదని ఈసీ ప్రకటించగా, వీడియో బయటకు ఎలా వచ్చిందనేదానిపై సిట్ విచారణ చేపట్టనుంది. కుట్ర కోణాలు ఉన్నాయా? అనే అంశంపై సిట్ పరిశీలించనుంది. మాచర్ల, పల్నాడు ఈవీఎం ఘటనలపై సిట్ సమగ్ర నివేదిక సిద్ధం చేయనుంది. -
ఎస్పీ కి వైఎస్ఆర్సీపీ నేతల విజ్ఞప్తి
-
కడుపు మంటతోనే టీడీపీ దాడులు
-
చివరి అంకానికి సిట్ దర్యాప్తు
-
తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం
-
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన తీరు చూస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది. ఢిల్లీలో కూర్చున్న ఈసీ పెద్దలు తమ ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాల ఫలితమే రెండు, మూడు రోజుల పాటు జరిగిన హింస అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి వచ్చిన తర్వాత పోలీసు, పరిపాలన వ్యవస్థను తన చేతిలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వారు స్వతంత్రంగా కాకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు కోరిన రీతిలో పక్షపాతంగా వ్యవహరించారు. కూటమి కోరిన అధికారులను కోరిన చోట అప్పాయింట్ చేసింది. వారు కూటమికి విధేయతతో వ్యవహరించి అభాసు పాలయ్యారు. అంతిమంగా సస్పెన్షన్లు, బదిలీలకు గురి కావల్సి వచ్చింది.దీపక్ మిశ్ర అనే రిటైర్డ్ అధికారిని అబ్జర్వర్‌గా నియమిస్తే, ఆయన టీడీపీకి సంబంధించినవారు ఇచ్చిన విందులో పాల్గొన్నారట. ఆ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు బహిరంగంగానే చెప్పారు. ఇది ఎన్నికల సంఘానికి ఎంత సిగ్గుచేటైన విషయం. దీపక్ మిశ్ర ఎక్కడా గొడవలు జరగకుండా చూడాల్సింది పోయి తెలుగుదేశంకు అనుకూలంగా పనిచేయాలని పోలీసులపై ఒత్తిడి చేశారట. అలాగే సస్పెండైన ఒక పోలీసు ఉన్నతాదికారి టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని ఆయా నియోజకవర్గాలలో పోలీసులను ప్రభావితం చేయడానికి కృషి చేశారట.ఇవన్ని వింటుంటే పెత్తందార్లుగా ముద్రపడ్డ చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్‌లు ఎన్నికలలో గెలుపుకోసం ఎన్ని కుట్రలు చేయడానికైనా వెనుకాడలేదని అర్ధం అవుతుంది. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో విద్వంసం సృష్టించడం, అది కనిపించకుండా ఉండాలని సీసీ కెమెరాలు పగులకొట్టడం వంటి సన్నివేశాలు చూసిన తర్వాత పోలీసు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం ఎలా ఉంటుంది? మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పోన్ చేస్తేనే కనీసం సమాధానం ఇవ్వని పోలీసు అధికారులను విశ్వసించడం ఎలా? దీని ఫలితంగానే పల్నాడు ప్రాంతంలో బలహీనవర్గాల ఇళ్లపై దాడులు, అనేక మంది గుడులలో, ఇతరత్రా తలదాచుకకోవలసి వచ్చింది. ఆ మహిళలు రోదించిన తీరుచూస్తే ఎవరికైనా బాద కలుగుతుంది.గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, దానిని బూతద్దంలో చూపుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నించింది. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా యజమానులు ఫ్యాక్షనిస్టులుగా మారి ప్రతి ఘటనకు రాజకీయ రంగు పులిమి, వైఎస్సార్సీపీకి అంటగడుతూ నీచమైన కధనాలు ఇస్తూ వచ్చారు. వారి అండ చూసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు. పోలీసులను బెదిరించేవారు. అంగళ్లు, పుంగనూరుల వద్ద చంద్రబాబు రెచ్చగొట్టడంతో టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం, పోలీసు వాహనాన్ని కూడా వారు దగ్దం చేయడం, ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అంత చేసిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్‌లు అప్పటి చిత్తూరు ఎస్పి మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆయన పేరు రెడ్ బుక్‌లో రాసుకున్నామని, తాము అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత నీ సంగతి చూస్తామంటూ బెదిరించేవారు.ఇలా అనేక మంది అధికారులను తరచూ భయపెట్టే యత్నం చేసినా, దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా ఈ అంశంపై తగు నిర్ణయాలు చేయలేదు. దాంతో టీడీపీ, జనసేన నేతలు చెలరేగిపోతూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనంలోకి వెళ్లడంతో వాటికి పోటీగా ఏమి చెప్పినా, తమకు మద్దతు లబించదని భావించిన చంద్రబాబు, పవన్‌లు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యకు ఏదో ప్రమాదం వాటిల్లిందన్న ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ష్ట్రంలో సైకో పాలన సాగుతోందని పిచ్చి-పిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని యత్నించారు. పవన్ అయితే ఏకంగా ముప్పైవేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని, వలంటీర్లే దానికి బాధ్యులంటూ నీచమైన విమర్శలు కూడా చేశారు. నిప్పుకు వాయువు తోడైనట్లు, రామోజీరావు, రాధాకృష్ణలు ఉన్నవి, లేనివి కల్పించి గాలివార్తలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించడానికి యత్నించారు.ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవపడితే దానికి రాజకీయం పులిమి వీరు రాష్ట్రం అంతటా ప్రచారం చేసేవారు. వెంటనే చంద్రబాబో, లేక ఇతర టీడీపీ నేతలు అక్కడకు వెళ్లి హడావుడి చేసే యత్నం చేసేవారు. ఈ రకంగా గత ఐదేళ్లుగా ఏపీ ఇమేజీని దెబ్బతీయడానికి వీరు గట్టి కృషి చేశారు. ఏదైనా ఘటన జరిగితే రెండువైపులా ఉన్న వాదనలు, వాస్తవ పరిస్థితిని వివరిస్తూ వార్తలు ఇస్తే తప్పుకాదు. అలా కాకుండా టీడీపీ వారిని భుజాన వేసుకుని దారుణ కధనాలు ఇవ్వడం ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజల దృష్టిలో పరువు కోల్పోయాయి. అయినా ఎన్నికల సమయం వచ్చేసరికి వీరు మరింత రెచ్చిపోయారు. ప్రభుత్వపరంగా, లేదా వైఎస్సార్సీపీ పరంగా ఏవైనా తప్పులు ఉంటే చెప్పవచ్చు. కాని.. వైఎస్సార్సీపీని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవన్నట్లుగా వీరు ప్రవర్తించారు.టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే గెలుపు అవకాశాలు లేవన్న స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్‌ను తమ ట్రాప్‌లోకి తెచ్చుకుని తదుపరి బీజేపీని కాళ్లావేళ్లపడి పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తుకు ఎందుకు తహతహలాడుతున్నదన్నదానిపై అప్పుడే అంతా ఊహించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం అండతో జగన్ ప్రబుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగాన్ని భయపెట్టి తమదారిలోకి తెచ్చుకోవడానికి, వీరు పన్నాగం పన్నారు. అందుకు తగ్గట్లుగానే బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఈ పని పురమాయించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కోడ్ అమలుకు వస్తుంది కనుక సహజంగానే ఈసీకే విశేషాధికారాలు ఉంటాయి. దానిని తమకు అడ్వాంటేజ్‌గా మార్చుకున్నారు.ఎన్నికల సంఘం అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు కావల్సిన అదికారులను నియమించుకునే ప్రక్రియ ఆరంబించారు. పురందేశ్వరి ఏకంగా 22 మంది అధికారుల జాబితాను ఇచ్చి వారందరిని తొలగించి, తాము సూచించినవారిని నియమించాలని కోరడం సంచలనం అయింది. బహుశా దేశ చరిత్రలో ఇంతత ఘోరమైన లేఖ ఎవరూ రాసి ఉండరు. అలా ఉత్తరం రాసినందుకు సంబంధిత రాజకీయ నేతను మందలించవలసిన ఎన్నికల సంఘం ఆమె కోరిన చందంగానే అధికారులను బదిలీ చేయడం ఆరంభించింది. పలువురు జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను, ఇతర చిన్న అధికారులను కూడా బదిలీ చేయించారు. చివరికి డీజీపీని కూడా వదలిపెట్టలేదు. సిఎస్ ను కూడా బదిలీ చేయాలని గట్టిగానే కోరారు కాని ఎందుకో ఆ ఒక్క బదిలీ ఆగింది.ఈ బదిలీ అయిన వారిలో ఎవరికి ఫలానా తప్పు చేస్తున్నట్లు ఎక్కడా ఈసీ తెలపలేదు. కనీసం నోటీసు ఇవ్వలేదు. నేరుగా బీజేపీ నేతలు ఏమి చెబితే అదే చేశారన్న భావన ఏర్పడింది. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి గట్టిగా ఉండే అధికారులపై చెడరాశాయి. వారందరిని బదిలీ చేయాలని ఒకసారి, బదిలీ చేస్తున్నారని మరోసారి రాసేవారు. వారు రాయడం, టీడీపీ, బీజేపీలు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, మరుక్షణమే ఈసీ స్పందించడం మామూలు అయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఎక్కడా పెద్దగా విమర్ధలు చేయలేదు. 2019లో కేంద్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ పార్టీ నేతల ఇళ్లలో సోదాలు జరిపితేనే చంద్రబాబు రెచ్చిపోయి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసేవారు. ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేది కార్యాలయానికి వెళ్లి తగాదా ఆడారు.. ధర్నా చేశారు.. కాని జగన్ చాలా హుందాగా వ్యవహరించారు. రాజకీయ విమర్శలు చేశారే తప్ప ఎక్కడా స్థాయిని తగ్గించుకోలేదు.టీడీపీ, బీజేపీలు తాము కోరినట్లుగానే అధికారులను నియమించుకుని పెత్తనం చేశారు. అయినా జగన్ ఎక్కడా అదికారులను ఎవరిని తప్పుపట్టలేదు. జనాన్ని నమ్ముకుని తన ప్రచారం తాను చేసుకున్నారు. పోలింగ్ నాడు బలహీనవర్గాలు, పేద వర్గాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో టీడీపీ వర్గాలు ఆందోళన చెందాయి. కొంత ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న పల్నాడు వంటి ప్రాంతాలలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ కూటమి నేతలు ప్రయత్నించారు. అందువల్లే వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. లేదా బాగా ఆలస్యంగా స్పందించారు. అయినా ఆ రోజు అంతా చాలావరకు ప్రశాంతంగా ముగిసింది. తదుపరి పరిస్థితిని సమీక్షించుకున్న టీడీపీ క్యాడర్ ఓటమి భయమో మరేదో కారణం కాని, ఒక్కసారిగా వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనుకున్నవారిపై దాడులు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రిచంద్రగిరి మొదలైన చోట్ల వీరు నానా రభస చేశారు.ఎన్నికల సంఘం పనికట్టుకుని ఎక్కడైతే అధికారులను మార్చిందో అక్కడే ఈ గొడవలు జరగడంతో కుట్ర ఏమిటో బోధపడింది. ప్రత్యేకించి కొన్ని గ్రామాలలో దాడులు అమానుషంగా ఉన్నాయి. ఆ గ్రామాలలో మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సన్నివేశాలు కనిపించాయి. వీటిని మాత్రం ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా కప్పిపుచ్చి వైఎస్సార్సీపీనే దాడులు చేసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. ఒకవేళ వైఎస్సార్సీపీ వారిది కూడా ఏదైనా తప్పు ఉంటే రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా వీరు వార్తలు కవర్ చేస్తూ తామూ ఫ్యాక్షనిస్టులమేనని రామోజీ, రాధాకృష్ణలు రుజువు చేసుకుంటున్నారు. ఎన్నికలు వారం రోజులు ఉండగా, ఇక రెండు రోజులలో జరుగుతాయనగా కూడా కొందరు పోలీస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పలు చోట్ల తమకు కావల్సినవారిని కూటమి నియమింప చేసుకోగలిగింది. కొత్తగా వచ్చిన అధికారులకు అన్ని విషయాలపై అవగాహన తక్కువగా ఉంటటుంది. దానికి తోడు తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించడానికి సిద్దమై వచ్చినందున ఆయా ఘటనలపై సరిగా స్పందించలేదు. అందువల్లే పల్నాడు ప్రాంతంలో గొడవలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. బూత్ స్వాధీనం వంటివి జరిగినా చూసి, చూడనట్లు పోయారట.నిజానికి ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధికారులను నియమించినా ఉపయోగం ఉండదు. ఆ విషయం తెలిసి కూడా ఇలా వ్యవహరించడం అంటే కచ్చితంగా కూటమి పెత్తందార్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరిల ఒత్తిడికి ఈసీ లొంగిందని అర్దం. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే ఇంటిలో రచ్చ సృష్టించారు. అది మరీ ఘోరంగా ఉంది. అలాగే జెసి ప్రభాకరరెడ్డి ఇంటిలో కొందరు పోలీసులు గొడవ చేశారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. ఎక్కడ ఎవరు చేసినా ఖండించవలసిందే. చర్య తీసుకోవల్సిందే. తాడిపత్రిలో ఏ స్థాయికి గొడవలు వెళ్లాయంటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేసే యత్నం వరకు. ఇది మంచిది కాదు. నిజంగానే ఈనాడు మీడియా రాసినట్లు టీడీపీ నేతలే ఘర్షణలలో దెబ్బతిని ఉన్నా, వైఎస్సార్‌సీపీవారు దాడులు చేశారన్న నిర్దిష్ట సమాచారం ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ పాటికి అక్కడకు వెళ్లి మరింత అగ్గి రాజేసేవారు. ఆయన ఎక్కడకు వెళ్లలేదు.పెత్తందార్ల కొమ్ము కాస్తున్న కూటమి నేతలు గాయపడ్డ పేదలను పలకరించడానికి ఎందుకు వెళతారు! ఇప్పుడు ఈసీ ఏపీ ఛీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచి వివరణ కోరినా ఏమి ప్రయోజనం ఉంటుంది. చేసిందంతా చేసి, తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి ఈసీ ఇలా వ్యవహరిస్తున్నదన్న అనుమానం వస్తోంది. కేవలం ఎన్నికల సంఘం కొత్త అధికారులను నియమించిన చోటే ఈ ఘర్షణలు జరిగాయని, దీనికి ఈసీనే బాధ్యత వహించాలని ఈ అధికారులు వివరణ ఇచ్చి ఉండాలి. లేదా ఎన్నికల కమిషన్ తో ఎందుకు తలనొప్పిలే అనుకుంటే వారి వాదన ఏదో చెప్పి వచ్చి ఉండాలి. అందుకే పలువురు అధికారులపై కమిషన్ చర్చ తీసుకోక తప్పలేదు. ఏది ఏమైనా స్వతంత్రంగా ఉండవలసిన ఎన్నికల సంఘం కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగడం, శాంతి భద్రతలకు వారి చర్యలే విఘాతం కల్గించడం వంటివి ఏ మాత్రం సమర్దనీయం కాదు. దీనివల్ల ఈసీ విశ్వసనీయతపై మచ్చ పడిందని చెప్పక తప్పదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు