![Municipal Officials Over Action At Tadipatri](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/9/Tadipatri.jpg.webp?itok=6KJC_iZ4)
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి పాలనలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలను కూటమి నేతలు, అధికారులు టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా తాడిపత్రిలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
వివరాల ప్రకారం.. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్సార్‌సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటి నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. అన్ని అనుమతులు ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారని రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదేశాలతోనే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/20_27.png)
Comments
Please login to add a commentAdd a comment