
జగనన్న కాలనీ కోసం భూమిని చదును చేస్తుండగా అడ్డుపడి..
సాక్షి, అనంతపురం: తాడిపత్రి లో తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. గంగాదేవి పల్లిలో జగనన్న కాలనీ కోసం భూమిని చదును చేస్తుండగా.. అక్కడివారిపై దాడికి దిగారు.
జగనన్న కాలనీ భూమిని వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తల చదును చేస్తుండగా.. అడ్డుకుని టీడీపీ వర్గం కర్రలతో దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించి.. 24 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఎమ్మెల్యే పరామర్శ
టీడీపీ వర్గం దాడిలో గాయపడ్డ వారిని ఆసుపత్రిలో పరామర్శించారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
ఇదీ చదవండి: ఓటర్ల సవరణ జాబితాపై ఫోకస్ పెట్టండి