తాడిపత్రిలో టీడీపీ నేతల అరాచకం బట్టబయలు | Video Viral Of Tdp Leaders Attacking Ysrcp Leader Murali House | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో టీడీపీ నేతల అరాచకం బట్టబయలు

Published Thu, Aug 22 2024 2:39 PM | Last Updated on Thu, Aug 22 2024 4:04 PM

Video Viral Of Tdp Leaders Attacking Ysrcp Leader Murali House

సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో టీడీపీ నేతల అరాచకం బట్టబయలైంది. వైఎస్సార్‌సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై టీడీపీ నేతల దాడి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మురళి ఇంటిపై దాడి, వాహనాల విధ్వంసాన్ని స్థానికులు సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. జేసీ వర్గీయుల బీభత్సం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు మూడు నెలలకు 20వ తేదీన (మంగళవారం) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లారు. వ్యక్తిగత పని ముగించుకుని అరగంటలో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారాయన.

ఆయన అలా వెళ్లిన వెంటనే.. జేసీ తన వర్గీయుల్ని రెచ్చగొట్టారు. దీంతో.. టీడీపీ గుండాలు వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేశారు. మురళి ఇంట ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. అదృష్టవశాత్తూ.. జేసీ వర్గీయుల దాడి నుంచి తృటిలో మురళి తప్పించుకున్నారు.

అరాచకం బట్టబయలు..వైరల్ గా మారిన జేసీ వర్గీయుల దాష్టీకం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement