attacking
-
తాడిపత్రిలో టీడీపీ నేతల అరాచకం బట్టబయలు
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో టీడీపీ నేతల అరాచకం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై టీడీపీ నేతల దాడి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మురళి ఇంటిపై దాడి, వాహనాల విధ్వంసాన్ని స్థానికులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. జేసీ వర్గీయుల బీభత్సం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు మూడు నెలలకు 20వ తేదీన (మంగళవారం) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లారు. వ్యక్తిగత పని ముగించుకుని అరగంటలో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారాయన.ఆయన అలా వెళ్లిన వెంటనే.. జేసీ తన వర్గీయుల్ని రెచ్చగొట్టారు. దీంతో.. టీడీపీ గుండాలు వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేశారు. మురళి ఇంట ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. అదృష్టవశాత్తూ.. జేసీ వర్గీయుల దాడి నుంచి తృటిలో మురళి తప్పించుకున్నారు. -
ఇజ్రాయెల్‌కు హిజ్బుల్లా ముప్పు.. అధునాతన ఆయుధాలతో దాడులు
యుద్ధ వాతావరణం మధ్య ఇజ్రాయెల్ అట్టుడికిపోతోంది. తాజాగా లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్‌లోని మిలిటరీ పోస్ట్‌పై డ్రోన్, క్షిపణి దాడులను చేసింది. హిజ్బుల్లా దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ మీడియాకు తెలిపింది. హిజ్బుల్లా గత ఏడు నెలలుగా ఇజ్రాయెల్‌పై నిరంతరం దాడులకు తెగబడుతోంది. ఇజ్రాయెల్ గగనతలం నుండి హిజ్బుల్లా ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ దాడులలో హిజ్బుల్లా అధునాతన ఆయుధాలను ఉపయోగించిందని సమాచారం.ఇటీవలి కాలంలో హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై దాడులను తీవ్రతరం చేయడం గమనార్హం. గాజా స్ట్రిప్‌లోని దక్షిణ నగరమైన రఫాలో ఇజ్రాయెల్ చొరబాటు అనంతరం హిజ్బుల్లా ఇజ్రాయెల్ అంతర్గత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతూ వస్తోంది. గత ఏడాది అక్టోబర్ ప్రారంభం నుంచి సరిహద్దు వెంబడి హిజ్బుల్లా కాల్పులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ మధ్యలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత, హిజ్బుల్లా దాడులు తీవ్రమయ్యాయి.రఫాలో ఇజ్రాయెల్ సైనిక చర్య అనంతరం హిజ్బుల్లా ఈ విధమైన దాడులకు పాల్పడుతోంది. గాజాలో ఇజ్రాయెల్ దూకుడు వైఖరిని అవలంబిస్తూ దాడులు కొనసాగిస్తే ఉత్తర ఇజ్రాయెల్ నివాసితులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లలేరని హిజ్బుల్లా హెచ్చరించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తున్నంత కాలం తమ బృందం పోరాడుతూనే ఉంటుందని హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా పేర్కొన్నారు. లెబనీస్ ఫ్రంట్, గాజా మధ్య సంబంధాలు స్థిరమైనవని, వాటిని ఎవరూ డీ లింక్ చేయలేరని హసన్ నస్రల్లా స్పష్టం చేశారు. -
ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ రాకెట్ ఫోర్స్?
ఒకప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ సత్సంబంధాలు కలిగిన దేశాలు. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఇరు దేశాలు బద్ధశత్రువులుగా మారాయి. ఈనెల (ఏప్రిల్) ఒకటిన సిరియా రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో 13 మంది ఇరాన్ సైనికులు మరణించారు. ఈ దాడిపై స్పందించిన ఇరాన్.. ఇజ్రాయెల్‌ను నిందించింది. ఇజ్రాయెల్‌పై చర్య తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది. దీని తరువాత ఏప్రిల్ 13న ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. నిజానికి ఇరాన్ నుండి ఇజ్రాయెల్‌కు వేల కిలోమీటర్ల దూరం ఉంది. అయినా ఇరాన్ దాడులను విజయవంతంగా నిర్వహించింది. దీనిని చూస్తే ఇరాన్ రాకెట్ ఫోర్స్ ఎంతో శక్తివంతమైనదని అర్థమవుతుంది. ఇరాన్ వద్ద అత్యంత శక్తివంతమైన తొమ్మిది బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఇవి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్‌పై దాడి చేసే శక్తిని కలిగివున్నాయి. ఈ క్షిపణుల్లో అత్యంత ప్రమాదకరమైనది ‘సెజిల్’. ఈ క్షిపణి గంటకు 17 వేల కిలోమీటర్ల వేగంతో 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యంపై దాడి చేయగలదు. ఖిబార్ క్షిపణి పరిధి రెండు వేల కిలోమీటర్లు. దీనితో పాటు, హజ్-ఖాసేమ్ దాడి పరిధి 14 వందల కిలోమీటర్లు. ఇరాన్ వద్ద హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. గత సంవత్సరం ఇరాన్ తన స్వదేశీ హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించే వాటిని హైపర్సోనిక్ క్షిపణులు అంటారు. ఈ క్షిపణులను వాటి వేగం కారణంగా అడ్డుకోవడం అసాధ్యం. ఇరాన్ దగ్గర అణుశక్తితో రూపొందిన క్రూయిజ్ క్షిపణి కూడా ఉంది. దీని పరిధి మూడు వేల కిలోమీటర్లు. ఇరాన్‌కు డ్రోన్ల ఆయుధాగారం కూడా ఉంది. ఇరాన్ వద్ద మొహజిర్-10 అనే ప్రాణాంతక డ్రోన్ ఉంది. దీని పరిధి రెండు వేల కిలోమీటర్లు. ఇది 300 కిలోల బరువును మోయగలదు. ఇరాన్ దగ్గరున్న రాకెట్ ఫోర్స్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. -
ఘోరం: గుర్తుతెలియని మహిళ.. చిన్నారిని విచక్షణ రహితంగా కొడుతూ..
సాక్షి, ఉట్నూర్ (ఆదిలాబాద్): చిన్నారిపై మహిళ హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం మండలంలో కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం... మండలంలోని వేణునగర్ కాలనీలో గుర్తు తెలియని మహిళ చిన్నారితో వచ్చింది. ఆ చిన్నారిని చిత్రహింసలకు గురిచేస్తూ సమీపంలోని గుట్ట వద్దకు తీసుకువెళ్లింది. అక్కడ విచక్షణ రహితంగా కొడుతుండడంతో అటుగా వెళ్తున్న ప్రభాస్ గమనించి అడ్డుకొని నిలదీశాడు. దీంతో సదరు మహిళ పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికుల సాయంతో పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. దాడిలో గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం చిన్నారిని పోలీసులకు అప్పజెప్పారు. ఈ విషయమై ఎస్సై సుబ్బారావును వివరణ కోరగా.. ఆ చిన్నారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని విచారణ చేస్తున్నామని వివరించాడు. ప్రస్తుతం చిన్నారిని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు. -
చెత్త ఏరుకునే వ్యక్తులు చితక్కొట్టుకున్నారు.. కారణం తెలిస్తే షాక్!
సాక్షి, చిక్కడపల్లి: చెత్త కాగితాలు ఏరుకునే ఇద్దరు వ్యక్తులు మరో వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పాత గొడవలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శివశంకర్‌రావు కథనం ప్రకారం... మహబూబ్‌నగర్‌కు చెందిన భీమ్‌రెడ్డి(30), ముషీరాబాద్‌కు చెందిన సాయిప్రశాంత్(31), గురుమూర్తి(30)లు చెత్తకాగితాలు ఏరుకుంటూ ఫుట్‌పాత్‌లపై నివసిస్తున్నారు. తరచూ మద్యం తాగడంతో పాటు వైట్నర్ సేవిస్తుంటారు. ఇదిలా ఉండగా, భీమ్‌రెడ్డి, సాయిప్రశాంత్‌లకు గురుమూర్తితో పాతగొడవలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఫుట్‌పాత్‌పై మళ్లీ గొడవపడ్డారు. భీమ్‌రెడ్డి, సాయిప్రశాంత్‌లు పక్కనే ఉన్న రాయితో గురుమూర్తి తలపై బాదడంతో తీవ్రగాయమైంది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమోటోగా కేసు నమోదు చేసి భీమ్‌రెడ్డి, సాయిప్రశాంత్‌లను అదుపులోకి తీసుకున్నారు. గురుమూర్తిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ దాడికి ఓ అమ్మాయి కారణమని తెలుస్తోంది. నిందితులు భీమ్‌రెడ్డి, సాయి ప్రశాంత్‌లను రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. ప్రస్తుతం గురుమూర్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారని ఎస్ఐ వెల్లడించారు. -
వైరల్ వీడియో: ఇద్దరిపై చిరుత పంజా!
ముంబై: లాక్‌డౌన్‌తో జనావాసాలు నిర్మానుష్యంగా మారడంతో జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా చిరుతలు తరచుగా జనావాసాల్లోకి వచ్చి దాడులు చేస్తున్న ఘటనలు చూస్తునే ఉన్నాం. తాజాగా అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని నాశిక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందిరా నగర్లో రోడ్డు మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై ఓ చిరుత అనూహ్యంగా దాడికి దిగింది. ఈ దాడిలో ఇరువురిని తీవ్రంగా గాయపరిచింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇటీవల హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో, నల్లగొండ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. వీటిని పట్టుకునేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగుతున్నారు. #WATCH Maharashtra: A leopard was seen attacking a man in Indira Nagar area of Nashik y'day. The leopard has attacked two people here, giving them serious injuries. Forest Officials say, "Its footprints can be traced to forests. Our team is at the spot." (Source: CCTV footage) pic.twitter.com/9MTCCHW73N — ANI (@ANI) May 30, 2020 -
కరోనా గబ్బిలాలను ఏమి చేయదా..?
-
బలుచిస్తాన్‌లో పాక్ సైన్యం అకృత్యాలు
-
పర్యాటకుల కారుపై దూకిన సింహాలు
బనశంకరి (బెంగళూరు): బెంగళూరు శివార్లలోని బన్నేరుఘట్ట అభయారణ్యంలో మంగళవారం రెండు సింహాలు సందర్శకుల ఇన్నోవా వాహనంపై దాడికి యత్నిం చాయి. బన్నేరుఘట్ట పార్కులో పులులు, సింహాలు, వన్య మృగాలను చూడటానికి పర్యాటకులు ప్రత్యేక బస్సులో వెళ్తుంటారు. ఎక్కువ ఫీజు చెల్లిస్తే ఇన్నోవా వాహనం లోనూ వెళ్లొచ్చు. ఇలాగే ఇన్నోవాలో పర్యాటకులు వెళ్తుండగా రోడ్డుకు అడ్డుగా వచ్చిన 2 సింహాలు వాహనం పైకి దూకి ముందుకెళ్లకుండా అడ్డుపడ్డాయి. వాహన అద్దాలను పంజాతో కొడుతూ వారిని భయభ్రాంతులకు గురి చేసింది. కాసేపటికి అవి శాం తించి వెనక్కి మళ్లడంతో బతుకు జీవుడా అంటూ పర్యాటకులు బయటపడ్డారు. -
భర్య, పిల్లలపై కత్తితో దాడి చేసిన భర్త
-
తిరుమలలో భక్తులపై తేనెటీగల దాడి
-
ఆడపడచు పై దాడి చేసిన తారా చౌదరి
-
రాహుల్ గాంధీకి చేదు అనుభవం