పర్యాటకుల కారుపై దూకిన సింహాలు
బనశంకరి (బెంగళూరు): బెంగళూరు శివార్లలోని బన్నేరుఘట్ట అభయారణ్యంలో మంగళవారం రెండు సింహాలు సందర్శకుల ఇన్నోవా వాహనంపై దాడికి యత్నిం చాయి. బన్నేరుఘట్ట పార్కులో పులులు, సింహాలు, వన్య మృగాలను చూడటానికి పర్యాటకులు ప్రత్యేక బస్సులో వెళ్తుంటారు. ఎక్కువ ఫీజు చెల్లిస్తే ఇన్నోవా వాహనం లోనూ వెళ్లొచ్చు.
ఇలాగే ఇన్నోవాలో పర్యాటకులు వెళ్తుండగా రోడ్డుకు అడ్డుగా వచ్చిన 2 సింహాలు వాహనం పైకి దూకి ముందుకెళ్లకుండా అడ్డుపడ్డాయి. వాహన అద్దాలను పంజాతో కొడుతూ వారిని భయభ్రాంతులకు గురి చేసింది. కాసేపటికి అవి శాం తించి వెనక్కి మళ్లడంతో బతుకు జీవుడా అంటూ పర్యాటకులు బయటపడ్డారు.