lions
-
సింహాల ఆవాసంలో 5 రోజులు
అడవి మధ్యలో చిన్న పిల్లాడు.. చుట్టూ గర్జించే సింహాలు.. ఘీంకరించే ఏనుగులు. జంగిల్ బుక్‌లోని మోగ్లీ గుర్తొస్తున్నాడు కదూ! అది కల్పిత కథ. నిజ జీవితంలో అంతకు మించిన సాహసాన్ని చేశాడు జింబాబ్వేకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు. ఐదురోజులపాటు క్రూర మృగాల ఆవాసంలో బతికాడు. ఈ ఆధునిక మోగ్లీ పేరు.. టినోటెండా పుదు. పండ్లు తింటూ.. చెలిమల్లో నీళ్లు తాగుతూ.. జింబాబ్వేలోని మాటుసడోనా గేమ్ పార్క్.. టెనోటెండా పుదు ఇంటికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు? ఎలా? వెళ్లాడో తెలియదు. ఒక్కసారి అడవిలోకి వెళ్లాక బయటపడటానికి మార్గం తెలియలేదు. అయితేనేం అధైర్య పడలేదు. బతికేందుకు అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అడవి పండ్లు తింటూ ఆకలి తీర్చుకున్నాడు. ఎండిపోయిన నదీ తీరాల వెంబడి.. కర్రలతో చిన్న చిన్న చెలిమెలు తవ్వి వచ్చిన నీటితో దాహం తీర్చుకుని ప్రాణాలు నిలుపుకొన్నాడు. రాత్రిపూట రాతి బండలపై నిద్రపోయాడు. మరోవైపు కనిపించకుండా పోయిన బాలుని కోసం ఊరంతా వెదికిన తల్లిదండ్రులు చివరకు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానిక బృందాలతో కలిసి సెర్చ్ పార్టీ ప్రతిరోజూ డ్రమ్ములు మోగిస్తూ బాలుడిని పట్టుకోవడానికి విఫల ప్రయత్నాలు చేసింది. నాలుగురోజులపాటు వెదికి ఆశలు వదులుకుంది. చివరి అవకాశంగా 5వ రోజు పార్క్ రేంజర్లు వాహనంపై అడవిమొత్తం గాలించడం మొదలుపెట్టారు. వాహనం శబ్దం విన్న బాలుడు అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అప్పటికే అక్కడినుంచి దూరంగా వచ్చేశారు. చివరకు తడిగా ఉన్న ఓ ప్రాంతంలో చిన్న చిన్న తాజా పాదముద్రలు కనిపించడంతో బాలుడు ఇక్కడే ఉంటాడని భావించారు. వాహనాన్ని వెనక్కి తిప్పి వెళ్లారు. ఎట్టకేలకు పుదుని కనిపెట్టగలిగారు. ప్రశంసల వర్షం.. జింబాబ్వే పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రకారం ఆఫ్రికాలో అత్యధిక సింహాలున్న పార్క్ అదే. ప్రస్తుతం అక్కడ 40 సింహాలున్నాయి. 1,470 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానవనం సింహాలతోపాటు జీబ్రాలు, ఏనుగులు, హిప్పోలు, జింకలకు నిలయంగా ఉంది. అలాంటి పార్క్ నుంచి ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. కానీ ఎంతో ధైర్యంతో ప్రాణాలతో బయటపడ్డ బాలుని స్టోరీని.. స్థానిక ఎంపీ ముట్సా మురోంబెడ్జి ఎక్స్‌లో పంచుకున్నారు. పుదు ధైర్యసాహసాలపై సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సౌతాఫ్రికా టీ20 ఛాలెంజ్ విజేతగా లయన్స్
క్రికెట్ సౌతాఫ్రికా టీ20 ఛాలెంజ్ విజేతగా లయన్స్ జట్టు ఆవిర్భవించింది. నిన్న (అక్టోబర్ 27) జరిగిన ఫైనల్లో లయన్స్.. టైటాన్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 19.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. క్లాసెన్ (13), ఫెరియరా (0) లాంటి భారీ హిట్టర్లు ఉన్న టైటాన్స్.. లయన్స్ బౌలర్ల దెబ్బకు కుదేలైంది. టైటాన్స్ ఇన్నింగ్స్‌లో గెరాల్డ్ కొయెట్జీ (20) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సిపామ్లా (4-0-12-4), మపాకా (4-0-15-2), ఫోర్టుయిన్ (3-0-10-2) టైటాన్స్‌ను దెబ్బకొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన లయన్స్ 15.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రస్సీ వాన్ డెర్ డస్సెన్ (44 నాటౌట్), కాన్నర్ ఎస్టర్‌హ్యుజెన్ (48 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి లయన్స్‌ను గెలిపించారు. లయన్స్ ఇన్నింగ్స్‌లో జుబేర్ హమ్జా 20, రీజా హెండ్రిక్స్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. టైటాన్స్ బౌలర్లలో గేలియమ్, గెరాల్డ్ కొయెట్జీ తలో వికెట్ పడగొట్టారు. సీఎస్ఏ టీ20 ఛాలెంజ్‌లో లయన్స్‌ను ఇది ఐదో టైటిల్. -
బర్డ్ ఫ్లూ కలకలం: వియత్నాంలో 47 పులుల మృతి
బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా దక్షిణ వియత్నాంలోని ఓ జూలో 47 పులులు, మూడు సింహాలు, ఓ పాంథర్ మరణించినట్లు స్థానిక మీడియా బుధవారం ఓ కథనంలో వెల్లడించింది. వియత్నాం న్యూస్ ఏజెన్సీ (VNA) మీడియా కథనం ప్రకారం.. లాంగ్ యాన్ ప్రావిన్స్‌లోని ప్రైవేట్ మై క్విన్ సఫారీ పార్క్ , హో చి మిన్ సిటీకి సమీపంలోని డాంగ్ నైలోని వూన్ జోయ్ జూలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ మరణాలు సంభవించాయని పేర్కొంది.నేషనల్ సెంటర్ ఫర్ యానిమల్ హెల్త్ డయాగ్నోసిస్ పరీక్ష ఫలితాల ప్రకారం ఈ జంతువులకు H5N1 రకం A బర్డ్ ఫ్లూ వైరస్ సోకటంతో మృతి చెందినట్లు తెలిపింది. అయితే పులుల మరణాలుపై జూ అధికారుల స్పందించకపోటం గమనార్హం. అదేవిధంగా జంతువులతో సన్నిహితంగా ఉన్న జూ సిబ్బంది ఎవరిలో కూడా శ్వాసకోశ లక్షణాలను బయటపడలేదని తెలుస్తోంది.⚠️Bird flu kills 47 tigers, 3 lions and a panther in Vietnam zoos, state media reports.47 tigers, 3 lions and a panther have died in zoos in south Vietnam due to the H5N1 bird flu virus, state media said Wednesday.@ejustin46@mrmickme2@DavidJoffe64https://t.co/P99Dn71HMF— COVID101 (@COVID19info101) October 2, 2024 ఎడ్యుకేషన్ ఫర్ నేచర్ వియత్నాం (ENV) ప్రకారం.. 2023 చివరి నాటికి వియత్నాంలో మొత్తం 385 పులులు జూలో ఉన్నాయి. ఇందులో 310 ప్రైవేట్ అధీనంలోని జూలలో ఉండగా.. మిగిలినవి ప్రభుత్వ అధీనంలోని జూల సంరక్షణలో ఉన్నాయి. 2022 నుంచి బర్డ్ ఫ్లూ వైరస్ H5N1 వేగంగా వ్యాప్తి చెందటం వల్ల పలు క్షీరదాల మరణాలు పెగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ఈ H5N1 వైరస్ ఇన్ఫెక్షన్లు మానవుల్లో కూడా తేలికపాటి నుంచి తీవ్రమైన స్థాయి వరకు ఉండవచ్చని, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారవచ్చని ప్రపంచ ఆగర్యో సంస్థ పేర్కొంది. మరోవైపు.. గతంలో 2004లో సైతం డజన్ల కొద్దీ పులులు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయాయని వియాత్నం స్థానిక మీడియా తెలిపింది.చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ ఆందోళన చెందుతోంది: జై శంకర్ -
Viral Video: సింహాలను సైతం తరిమికొట్టిన కుక్కలు..
పెంపుడు కుక్కలు విశ్వాసానికి మారుపేరుగా చెబుతుంటారు. ఒక్కసారి వాటిని మచ్చిగ చేసుకుంటే ఆపదల నుంచి తమ యజమానులను రక్షించేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గుజరాత్లో రెండు వైపులా సింహాలు, కుక్కల పోటాపోటీగా తలపడ్డాయి. చివరకు ఏం జరిగిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..ఆమ్రేలి సావర్కుండ్లాలోని ఓ గోశాలలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి సమీపంలోనే గిర్ నేషనల్ పార్క్ ఉంది. దీంతో ఆ అడవి నుంచి క్రూర జంతువులు ఈ ప్రాంతంలోకి తరచూ చొరబడుతుంటాయి. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి రెండు పెద్ద సింహాలు గోశాల వైపు వచ్చాయి. గేటు వద్దకు వచ్చిన సింహాలను లోపల ఉన్న కుక్కలు గమనించి మెరిగాయి. గేటు అవతల ఉన్నది సింహాలైనా సరే.. ఏమాత్రం తగ్గకుండా వాటిని లోపలకి రాకుండా అడ్డుకున్నాయి.అటు సింహాలు కూడా కుక్కలను చూసి గాండ్రించాయి. అయినా కుక్కలు ఏమాత్రం వెనక్కకు తగ్గకుండా సింహాల పైకి దూకుతుంటాయి. ఈ క్రమంలో సింహాల పంజా దెబ్బకు గేటు తెరుచుకుంటుంది. అయితే అప్పటికే భయపడిపోయిన సింహాలు.. అక్కడి నుంచి వాటి దారిన అవి వెళ్లిపోతాయి. కుక్కల అరుపులు విన్న ఓ వ్యక్తి అక్కడికి వచ్చి గేట్‌కు మళ్లీ గడి పెట్టి వెళ్లిపోయాడు.ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. 2 dogs fight with lions in Gujrat #viralvideo pic.twitter.com/SPPZq7MnJI— Daily Facts🩵 (@JohnJafar36) August 14, 2024 -
లోకో పైలట్ సమయస్ఫూర్తి, 10 సింహాలకు తప్పిన ముప్పు
గూడ్సు రైలు డ్రైవర్ సమయస్ఫూర్తి పది సింహాల ప్రాణాలను కాపాడింది. రైల్వే ట్రాక్‌పై ఉన్నపది సింహాలను చూసిన ఇంజన్ డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యాడు. ఎమర్జెన్సీ బ్రేకులను వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా పిపవవ్ పోర్టు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో రైలు డ్రైవర్ ముఖేష్ కుమార్ మీనాపై ప్రశంసల వెల్లువ కురుస్తోంది. పిపవవ్ పోర్టు స్టేషన్ నుంచి సైడింగ్ (ప్రధాన కారిడార్‌కు పక్కన చిన్న ట్రాకు)లోకి గూడ్సు రైలును తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు పశ్చిమ రైల్వే భావ్‌నగర్ డివిజన్ ఒక ప్రకటనలో తెలిపింది. రైలు ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న సింహాలను చూసిన వెంటనే ముఖేష్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతోపాటు, సింహాలు అక్కడినుంచి లేచి వెళ్లిపోయేంత వరకు వేచి చూశారు.ఈ సంఘటనపై స్పందించిన పశ్చిమ రైల్వే సింహాలు, ఇతర వన్యప్రాణుల భద్రత కోసం భావ్‌నగర్ డివిజన్ అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. రైల్వే ట్రాకుపై నడచి వెళ్లే వన్యప్రాణుల పట్ల లోకో పైలట్లు అప్రమత్తంగా ఉంటారని తెలిపింది. పిపావవ్ పోర్టును ఉత్తర గుజరాత్‌తో కలిపే ఈ రైలు మార్గంలో గత కొన్నేళ్లుగా అనేక సింహాలు చనిపోయాయి. దీంతో రాష్ట్ర అటవీ శాఖ కొన్ని చోట్ల ట్రాక్‌పై కంచెలనుఏర్పాటు చేసింది. అలాగే సింహాలను ఇలాంటి ప్రమాదాలనుంచి కాపాడాలంటూ దాఖలైన పిటీషన్‌ను విచారించిన గుజరాత్ హైకోర్టు, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం , రైల్వేలను కోరింది. కాగా 2020 జూన్ నాటి సర్వే ప్రకారం గుజరాత్ లో 674 సింహాలు ఉన్నాయి. -
Tripura: అక్బర్, సీత సింహాలు.. త్రిపుర సర్కారు కీలక నిర్ణయం
అగర్తల: మగ, ఆడ సింహాలకు అక్బర్, సీత అని వివాదాస్పద పేర్లు పెట్టిన ఉదంతంలో త్రిపుర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఈ విషయంలో బాధ్యున్ని చేస్తూ ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్( వైల్డ్‌లైఫ్ అండ ఎకో టూరిజం) ప్రబిన్ లాల్ అగర్వాల్‌ను సోమవారం ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సింహాలకు పెట్టిన పేర్లు హిందూ మతస్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఇప్పటికే కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో త్రిపుర ప్రభుత్వం ఉన్నతాధికారి సస్పెన్షన్ నిర్ణయం తీసుకోడం చర్చనీయాంశమవుతోంది. పశ్చిమబెంగాల్లోని సిలిగురి నుంచి తీసుకువచ్చిన రెండు సింహాల్లో మగ సింహానికి అక్బర్ అని, ఆడ సింహానికి సీత అని త్రిపుర సెపాయిజాలా జూ అధికారులు పేర్లు పెట్టారు. ఇది వివాదస్పదం అవడంతో వీహెచ్‌పీ కోర్టుకు వెళ్లింది. ఇదీ చదవండి.. జ్ఞానవాపి మసీదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు -
ఎగిరి దూకిన సింహాలు..వచ్చాడండి రాకీ భాయ్
-
Viral Video: నోటికందిన ఆహారాన్ని వదిలేసి.. కొట్టుకున్న సింహాలు..
సింహాలు అడవికి రారాజు. సాధారణంగా సింహాలు వేటాడితే టార్గెట్ గురి తప్పదు. గంభీరత్వానికి నిదర్శనమైన ఇవి ఎప్పుడూ గుంపులుగా దర్శనమిస్తుంటాయి. ఒక్కసారి ఏదైనా జంతువును ఆహారంగా చేసుకోవాలని డిసైడ్ అయితే వార్ వన్‌సైడ్ అవ్వాల్సిందే. చిన్న చిన్న జంతువులనే కాదు పెద్ద పెద్ద దున్నపోతులు, అడవి దున్నలు, జిరాఫీలను సైతం తమ వశం చేసుకుంటాయి. సింహాలు ఎక్కువగా వేటాడే జంతువుల్లో గేదె ఒకటి. దీని సైజు పెద్దగా ఉండటం వల్ల దాదాపు అయిదు రోజుల వరకు మరే ఇతర జంతువును వేటాడాల్సిన పని ఉండదు. తాజాగా ఓ సింహాల గుంపు కష్టపడి పొలంలో ఒంటరిగా మేస్తున్న గేదెపై దాడి చేసి ఆహారంగా తెచ్చుకున్నాయి. మిగతా గేదెల నుంచి దానిని దూరంగా తీసుకొచ్చి తినడం ప్రారంభించాయి. అయితే ఇంతలో ఏమయ్యిందో తెలిదు కానీ ఆడ సింహాల(శివంగి) మధ్య గొడవ ప్రారంభమైంది. నోటికి వరకు వచ్చిన ఆహారాన్ని పక్కకు పెట్టి మరీ ఒక్కొక్కటిగా దాడి చేసుకున్నాయి. శివంగిలు కొట్టుకుంటుంటే.. ఒక్క సింహం మాత్రం గేదెను అలాగే అదిమి పట్టుకుంది. చివరికి అది కూడా గొడవలో జాయిన్ అయ్యింది. ఇంకేముంది ఇదే మంచి చాన్స్ అని భావించిన గేదె మెల్లగా అక్కడి నుంచి లేచి పరుగు అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘గేదె అదృష్టం బాగుంది. పాపం సింహాలకు ఈ రోజు ఉపవాసమే. ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చదవండి: రెచ్చిపోయిన మాజీ ఐఏఎస్ కూతురు.. రోడ్డుపై క్రికెట్ బ్యాట్‌తో రచ్చ.. Lions fight while eating a water buffalo, then it casually walks off pic.twitter.com/JGiKMVJaQQ — OddIy Terrifying (@OTerrifying) October 19, 2022 -
గేదె ధర కన్నా సింహం రేటు తక్కువ.. ఎక్కడో తెలుసా?
Lions at cheaper rates than buffaloes.. అక్కడ గేదె కంటే తక్కువ ధరలో సింహాలను కొనుగోలు చేయవచ్చు. సింహాలను కొనుక్కోవచ్చంటూ జూ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దాయాది దేశమైన పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. దీంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు.. జూలో ఉన్న జంతువుల ఆలనా పాలనా చూసేందుకు కూడా డబ్బులులేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో పాక్ ప్రభుత్వం సింహాలను అమ్మకానికి పెట్టినట్టు ఆ దేశ మీడియా సంస్థలు పలు కథనాల్లో తెలిపాయి. అది కూడా ఓ గేదెను కొనుగోలు చేసే ధర కన్నా తక్కువ ధరలో అంటూ పేర్కొన్నాయి. లాహోర్ సఫారీ జూలోని అధికారులు కొన్ని ఆఫ్రికన్ సింహాలను (పాక్ కరెన్సీ) రూ.150,000 కంటే తక్కువ ధరకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు అక్కడి మీడియా సంస్థ సామా టీవీ తెలిపింది. కాగా, పాకిస్తాన్లో ఒక గేదె ధర ఆన్లైన్ మార్కెట్లో రూ.350,000 వరకు లభిస్తుందని పేర్కొంది. ఇక, లాహోర్ సఫారీ జూ యాజమాన్యం.. జూ లోని 12 సింహాలను ఆగస్టు మొదటి వారంలో విక్రయించి డబ్బు సంపాదించాలని భావిస్తోన్నట్లు తెలిపింది. అమ్మకానికి ఉన్న సింహాలలో.. మూడు ఆడ సింహాలు ఉన్నాయి. .@SalmanSufi7 .@sherryrehman .@WWFPak This SALE must not take place, how is this practising conservation ? The Lahore Safari Zoo management hopes to sell as many as 12 of its lions in the first week of August to raise money. Pls Help https://t.co/FfrlVOh1oF — Anika 🐘🦍🦧🦒🐋🐬 (@anikasleem) July 28, 2022 ఇది కూడా చదవండి: పాకిస్తాన్లో హిందూ మహిళ హిస్టరీ క్రియేట్.. ఎందరికో ఆదర్శం -
భయంతో పరుగు లంఘించిన మూడు సింహాలు: వీడియో వైరల్
సింహాన్ని చూస్తే ఏ జంతువైన పరుగు లంఘించాల్సిందే. అలాంటి సింహమే గజగజలాడుతూ ప్రాణాల కోసం పరుగులు పెట్టింది. అదీ కూడా మూడు పెద్ద సింహాలు కలిసి ఉండగా...వాటినే హడలెత్తించి మరీ పరుగులు పెట్టించింది హిప్పో అనే జీవి. పాపం ఆ సింహాలు మాములుగా భయపడలేదు. ఈ ఘటన ఆఫ్రికాలో చోటు చేసుకుంది. హిప్పొపొటామస్ ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన పెద్ద క్షీరదంగా చెబుతారు. ఇది ఆఫ్రికాలో ఒక్క ఏడాదిలోనే సుమారు 500 మందిని దాక చంపేయగలదు. మూడు సింహాలు బోట్స్వానాలోని సెలిండా రిజర్వ్ స్పిల్ వద్ద నదిని దాటడానికి ప్రయత్నించినప్పుడు కోపంతో ఉన్న హిప్పో వాటిని అడ్డగించింది. అందులో ఒక సింహా పై దాడి చేసేందుకు యత్నిచింది. ఆ సింహాన్ని హిప్పో మాములుగా పరిగెట్టించలేదు. దెబ్బకు ఒడ్డునున్న మిగతా రెండు సింహాలు అది బతకుతుందో లేదో అన్నంత టెన్షన్‌గా చూస్తున్నాయి. ఐతే కొద్దిలో ఆ సింహం ఆ హిప్పో భారి నుంచి తప్పించుకుంది. ఈ మేరకు ఈ ఘటకు సంబంధించిన వీడియో ఆన్లైన్ తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు నీటిలో ఉంటే సింహం పిల్లి అయిపోతుంది, అందుకే పరుగు లంఘించింది అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: జస్ట్ మిస్.. చిన్నారికి తప్పిన ఘోర ప్రమాదం.. ‘స్టుపిడ్ ఫెల్ అంటూ’.. ) -
Viral Video: అటు చూడు బే!
-
రెండు సింహాలు విమానాశ్రయం నుంచి తప్పించుకుని పెద్ద హంగామా సృష్టించాయి!!
సిడ్నీ: సింగపూర్‌లోని చాంగి ఎయిర్‌పోర్ట్‌లో రెండు సింహాలు తమ సరుకు రవాణా కంటైనర్‌లోంచి బయటకు వచ్చి అక్కడ ఉన్నవారందర్నీ భయబ్రాంతులకు గురి చేశాయి. అయితే అక్కడి అధికారులు ట్రాంక్విలైజర్ గన్‌తో కాల్చి మత్తులో పడేసి ఎయిర్పోర్ట్ నుంచి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్ఐఏ) వన్యప్రాణుల సదుపాయాన్ని నిర్వహిస్తున్న మండై వైల్డ్‌లైఫ్ గ్రూప్‌తో కలిసి పనిచేస్తోంది. (చదవండి: పాత కార్లు, సైకిల్ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!) అయితే ఈ ఎయిర్ లైన్స్ పెద్ద పులుల సంరక్షణ బాధ్యతను నిమిత్తం వాటిని మండైలోని జంతు నిర్బంధ కేంద్రానికి తరలించే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంతేకాదు అవి ఇలా తప్పించుకోవడం మొదటిసారికాదు అని అక్కడ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ సింహాలు మండై వైల్డ్‌లైఫ్ గ్రూప్ సంరక్షణలో మత్తు నుంచి కోలుకుంటున్నాయని అధికారులు తెలిపారు. (చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్!) -
ఆ రెండింటిని దత్తత తీసుకున్న ఉపాసన.. ఎందుకంటే ?
Upasana Konidela Adopted Two Lions In Nehru Zoological Park: మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన పరిచయం అక్కర్లేని పేరు. రామ్ చరణ్ భార్యగా, అపొలో అధినేత మనవరాలిగా కాకుండ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ మీడియాలో ఫిట్నెస్, ఆయుర్వేదం, జంతువుల సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటారు. వాటికి సంబంధించిన వీడియోలను సైతం షేర్ చేస్తుంటారు. తాజాగా రెండు సింహాలను దత్తత తీసుకున్నారు ఉపాసన. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని విక్కీ, లక్ష్మీ అనే రెండు సింహాలను దత్తత తీసుకున్నారు ఉపాసన కొణిదెల. వాటి సంరంక్షణ బాధ్యతలు, ఆహారపు ఖర్చులను ఏడాదిపాటు చూసుకోనున్నారు. ఇందుకోసం రూ. 2 లక్షల చెక్కును నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ ఎస్. రాజశేఖర్‌కు అందించారు ఉపాసన. పార్కులోని అన్ని జంతువుల సంరక్షణ, మంచి ఆరోగ్య పరిస్థితి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఉపాసన తెలిపారు. క్యూరేటర్, అతని బృంద సభ్యులను ఆమె అభినందించారు. జూలో ఉంచిన 2000 జంతువుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని, వాటి పరిశుభ్రతగా ఉంచడంలో సిబ్బంది అంకితభావంపై ఉపాసన ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఉపాసనకు నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ ఎస్. రాజసేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆమెది మంచి మనసు అని కొనియాడారు. వన్యప్రాణుల పరిరక్షణపై వారు చూపించిన నిబద్ధత ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఇలా పార్కులోని వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి పౌరులు ముందుకు రావాలని కోరారు. ఇదీ చదవండి: ట్రాన్స్‌జెండర్ కమ్యునిటీతో ఉపాసన సోదరి పెళ్లి వేడుకలు, ఆశీర్వాదాలు -
దగ్గు, తుమ్ము, నీరసంతో బాధపడుతున్న సింహాలు
సింగపూర్: సింగపూర్ జంతుప్రదర్శనశాలలోని నాలుగు ఆసియా సింహాలకు కోవిడ్ -19 పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు వైల్డ్‌లైఫ్ గ్రూప్‌లోని పరిరక్షణ, పరిశోధన, వెటర్నరీ వైస్ ప్రెసిడెంట్, జూ ఆపరేటర్ అయిన డాక్టర్ సోంజా లూజ్ పేర్కొన్నారు. తాజాగా సింగపూర్ దేశంలో సుమారు 3,397 కేసులు ఉన్నాయని దేశం మొత్తంగా చూస్తే సుమారు 2 లక్షలకు పైగా కేసులు ఉన్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. (చదవండి: చావు నోట్లో నుంచి కాపాడిన ‘సమయస్ఫూర్తి’) ఈ నేపథ్యంలోనే సింగపూర్ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అయిన నైట్ సఫారీ జంతుప్రదర్శనశాలలోని నాలుగు ఆసియా సింహాలకు కరోనా వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అదీ కాక సింహాల్లో గత రెండు రోజులుగా దగ్గు, తుమ్ములు, నీరసంతో సహా తేలికపాటి లక్షణాలను కనిపించాయని వైల్డ్ లైఫ్ గ్రూప్ తెలిపింది. అలాగే నైట్ సఫారీకి చెందిన ముగ్గురు కీపర్లకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు పేర్కొంది. దీంతో ఆసియాటిక్ సింహాల పార్క్ నైట్ సఫారిని మూసేసినట్లు వైల్డ్ లైఫ్ గ్రూప్ అధికారులు చెప్పారు. ఈమేరకు వైల్డ్‌లైఫ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సోంజా లూజ్ మాట్లాడుతూ..."సాధారణంగా, వైరస్ కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి గురికావు. కొద్దిపాటి సహాయక చికిత్సతో సింహాలు పూర్తిగా కోలుకుంటాయని మేము భావిస్తున్నాము. అయితే, తదుపరి చికిత్స అవసరమైతే గనుక యాంటీ ఇన్ఫ్లమేటరీలు, యాంటీబయాటిక్స్ ఇస్తాం" అని చెప్పారు. (చదవండి: పెళ్లి చేసుకున్న మలాల.. ఫోటోలు వైరల్) -
అసాధ్యురాలు.. ఏకంగా సింహం తోకపట్టుకుని
సింహాలను టీవిల్లోని డిస్కవరీ ఛానల్లోనో లేక ఏదైన జూ పార్క్‌లలో చూసి ఉంటాం. కానీ దాన్ని సరాసరిగా చూడటానికే భయపడతాం. అలాంటిది ఒక అమ్మాయి సింహం తోక పట్టుకుని మరీ నడిచేస్తుంది. అసలు ఆమె ఎవరు, ఎక్కడ జరిగింది చూద్దాం రండి. (చదవండి: మీది గొప్ప మనసు ..ఇష్టంగా వీడ్కోలు చెప్పేలా చేశారు!) అసలు విషయంలోకెళ్లితే.....వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా కూతురు వసుంధర పత్నీ సింహg తోక పట్టుకుని నవ్వుతూ నడుస్తుంది. అయితే ఆమె తండ్రి ఇండియన్ ఆర్పీజీ గ్రూప్ కాంగ్లోమెరిట్ ఛైర్మన్ అయిన హర్ష్ గోయెంకా ఈ ఘటనకు సంబంధించిన వీడియో తోపాటు" అది నా కూతురు. మీరు ఆమె తల్లిని ఊహించుకోగలరా " అనే క్యాప్షన్‌తో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇది దక్షిణాఫ్రికా జాతీయ ఉద్యానవన పార్క్‌లోని వన్యప్రాణుల పర్యటనలోనిదని, అక్కడ నిపుణుల సమక్షంలో పెద్ద పులులతో ఎంజాయ్ చేస్తారు అంటూ రకరకాలు ట్వీట్ చేశారు. (చదవండి: వృద్దుడు చేసిన వెరైటీ చాట్) -
Viral Video: సింహం సైలంట్‌గా ఉందని వేళాకోళం చేశావో వేటాడేస్తా
-
సింహం సైలంట్‌గా ఉందని వేళాకోళం చేశావో..
మన సరదాగా వన్యమృగాలతో చూడాలనో లేక సరదాగడుపదామనో మనం నేషలనల్ జూలాజికల్ పార్క్‌లు వంటి రకరకాల పార్కులకి వెళ్తాం. అయితే పార్క్‌లో ఉండే సంరక్షణాధికారులు సూచించినట్లుగా అక్కడ ఉన్న జంతువులతో జాగ్రత్తగా మసులుకోకపోతే చేదు అనుభవాలను ఎదర్కొక తప్పదు. (చదవండి: ఇదేం ట్రెండ్....చెత్త వేసే సంచిని ధరించడం ఏమిటి ?) అంతేకాదు ఇలాంటి చేదుఅనుభవాలను ఎదుర్కొన్న వాళ్ల గురించి ఇటీవల కాలంలో చాలానే విని ఉన్నాం. అయినప్పటికి పర్యాటకులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలపైకి ఎందుకు తెచ్చకుంటారో అర్ధంకాదు. అట్లాంటి చేదు అనుభవమే టాంజానియా పార్క్‌కి వెళ్లిన ఒక పర్యాటక బృందానికి ఎదురైంది. అసలు ఎక్కడ జరిగింది ఏమైంది చూద్దాం రండి. వివరాల్లోకెళ్లితే....టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌లో ఒక పర్యాటక బృందం కారులో కూర్చోని సింహాన్ని చూస్తుంటారు. అయితే ఆ సింహం వాళ్ల కారు పక్కనే ఉన్నప్పటికీ అది ఆ కారుని గమనించ కుండా అటువైపుకి తిరిగి ఉంటుంది. దీంతో ఒక పర్యాటక బృందంలోని ఒక వ్యక్తి కారు కిటకి డోరు తీసి సింహాన్ని తాకడానికి ప్రయత్నించడమే కాక ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తాడు. ఇక అంతే ఒక్కసారిగా సింహం పెద్దగా గాండ్రిస్తూ కిటికిలోకి తల దూర్చడానికి ప్రయత్నిస్తుంది. దీంతో సదరు పర్యాటకుడు షాక్‌కి గురై సీటు వెనక్కి వెళ్లి పోతాడు. ఇంతలో కారులో ఉన్న మిగతావాళ్లంతా కిటికి మూసేయ్ అంటూ కేకలు వేయడంతో కిటికిని మూసేయడానికి చాలా కష్టపడతాడు. ఏది ఏమైనా ఇలాంటి క్రూర జంతువులతో తస్మాత్ జాగ్రత్త. (చదవండి: ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్ హీరో) -
వైరల్: సింబా.. ఎంత ముద్దుగా ఉన్నావ్రా.. క్యూట్
Lion cub playing with his mother: బిడ్డకు తల్లి స్పర్శ, ఆమె ఒడిలో దొరికే లాలింపు మరెక్కడా దొరకదు. ప్రతీ బిడ్డకు మొదటి ఫ్రెండ్ కూడా అమ్మే.. ఆటపాటలు, ముద్దులు, మురిపాలు.. ఇలా ప్రతీ విషయంలోనూ అమ్మ తర్వాతే ఎవరైనా. మనుషులైనా, జంతువులైనా ఇందుకు అతీతం కాదు. అలాంటి అనిర్వచనీయమైన మాతృ ప్రేమ, తల్లీబిడ్డల బంధానికి అద్దం పట్టే సింహాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇసుకలో తల్లి చెంత సేద తీరుతున్న బుజ్జి సింహం.. గారాం చేస్తూ.. మెల్లిగా నడుచుకుంటూ వెళ్లి కాస్త దూరంగా పడుకుంటుంది. ఇంతలో అక్కడికి చేరిన సివంగి.. దానిని ముద్దాడుతూ, నవ్విస్తూ అక్కున చేర్చుకుంటుంది. ఆగష్టు 10న వరల్డ్ లయన్ డే సందర్భంగా భారత అటవీ శాఖ అధికారి సురేందర్ మెహ్రా ట్విటర్లో షేర్ చేశారు. అరుదైన జాతి అంతరించిపోకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. ఇక ఆయనతో ఏకీభించిన నెటిజన్లు.. ‘‘రేయ్.. సింబా.. ఎంత ముద్దుగా ఉన్నావ్రా. నీ అరుపులు, నవ్వు.. అల్లరి చేష్టలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. సో క్యూట్’’ అంటూ ఫిదా అవుతున్నారు. చదవండి: Kinnaur Landslide: 13 శవాలు వెలికితీత.. ఇంకా శిథిలాల కింద? It’s not just the number of a particular wild species that is important..! More important is how we keep this population healthy and secure their natural habitat at landscape level..#WorldLionDay 🦁@GujForestDept @moefcc @CentralIfs pic.twitter.com/YJYxRh3c2C — Surender Mehra IFS (@surenmehra) August 10, 2021 -
హైదరాబాద్ జూపార్క్‌లో 8 సింహాలకు కరోనా పాజిటివ్
-
మృగరాజుపై కరోనా పంజా
సాక్షి, హైదరాబాద్/ బహదూర్‌పురా: హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని 8 సింహాలు కరోనా బారిన పడ్డాయి. భారత్‌లో లక్షల మంది ప్రాణాలు హరించిన కోవిడ్ మహమ్మారి జంతువులకూ సోకడం ఇదే తొలిసారి. గత నెల 24వ తేదీకి ముందు సింహాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడటం గమనించిన జూ సిబ్బంది సమాచారాన్ని అధికారులకు తెలిపారు. అప్పటికే జూలోని యానిమల్ కీపర్లకు కరోనా పరీక్షలను నిర్వహించగా.. దాదాపు 25 నుంచి 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన జూ అధికారులు సింహాల నోరు, ముక్కు నుంచి ద్రవాలు సేకరించారు. ఆ నమూనాలను సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ అనుబంధ సంస్థ ల్యాబొరేటరీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ (లాకోన్స్)లో ఈ నమూనాలను విశ్లేషించగా, కోవిడ్–19 ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. సెంటర్ జూ అథారిటీ మార్గదర్శకాలను అనుసరించి ఈ ఏషియాటిక్ సింహాల ముక్కు, నోటిలోని ద్రవాల నమూనాలను సేకరించామని, ఆర్టీపీసీఆర్ పరీక్షల ద్వారా కరోన బారిన పడినట్లు నిర్ధారించామని సీసీఎంబీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఏషియాటిక్ సింహాల్లో కనిపించిన కరోనా వైరస్ అంత ప్రమాదకరమైన రకమేమీ కాదని సీసీఎంబీ స్పష్టం చేసింది. ప్రస్తుతం కరోనా బారిన పడ్డ సింహాలన్నింటినీ వేరుగా ఉంచామని, తగిన చికిత్స అందిస్తున్నామని నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ సుభద్ర దేవి తెలిపారు. తెలంగాణ జంతు సంరక్షణాలయాల డైరెక్టర్ డాక్టర్ కుక్రెటి మాట్లాడుతూ.. కరోన బారిన పడ్డ సింహాలు చికిత్సకు స్పందిస్తున్నాయని, కోలుకుంటున్నాయని వివరించారు. 5 మగ, 3 ఆడ సింహాలకు.. జూలాజికల్ పార్కులో ఉన్న లయన్ సఫారీలోని ఐదు మగ సింహాలు, మూడు ఆడ సింహాలు కరోనా బారిన పడ్డాయి. గతంలో పులుల ఎన్‌క్లోజర్‌లో పని చేసిన ఓ యానిమల్ కీపర్‌ను సింహాల ఎన్‌క్లోజర్‌కు మార్చారు. గత నెల ఏప్రిల్‌లో నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఆ యానిమల్ కీపర్‌కు పాజిటివ్ వచ్చింది. అతడిని క్వారంటైన్ కు పంపిన కొద్ది రోజులకే సింహాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటాన్ని గుర్తించారు. కరోనా సోకిన వ్యక్తి.. సింహాలకు అందించిన ఆహారంతోనే కరోనా సోకిందా.. లేదా ఇతర కారణాలతో వచ్చిందా అనే విషయం తేలాల్సి ఉంది. ఇప్పటికే చాలా జంతువులకు కరోనా? గతేడాది కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి పలు జంతు సంరక్షణ కేంద్రాల్లో జంతువులు వ్యాధి బారిన పడినట్లు సమాచారం ఉందని, మనుషుల నుంచి సోకిన ఈ వ్యాధి ఇతర జంతువులకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లాకోన్స్ సైంటిస్ట్ ఇన్చార్జి డాక్టర్ కార్తికేయన్ వాసుదేవన్ తెలిపారు. ఈ ఆసియా సింహాల్లో వ్యాధి లక్షణాలను గుర్తించడంతో పాటు, నమూనాల సేకరణకు మెరుగైన మార్గాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉందని వివరించారు. జంతువులకు నాలుగు కేంద్రాలు.. జంతువుల్లో కరోనా నిర్ధారణకు భారత్ లో మొత్తం నాలుగు కేంద్రాలు ఉండగా.. హైదరాబాద్‌లోని లాకోన్స్ అందులో ఒకటి. ప్రతి జంతువు లాలాజలం సేకరించడం కష్టమైన పని కాబట్టి, జంతువుల మలం ద్వారా వ్యాధిని నిర్ధారించేందుకు తాము ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నామని, తద్వారా బోనుల్లో ఉండే, స్వేచ్ఛగా తిరిగే జంతువుల నమూనాలు సేకరించడం సులువవుతుందని సీసీఎంబీ గౌరవ సలహాదారు, మాజీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. జంతువుల్లో కరోనా వైరస్‌ను సీసీఎంబీ ఇప్పటివరకు గుర్తించలేదని, అయితే త్వరలో ఈ దిశగా ప్రయత్నాలు చేస్తామని సీసీఎంబీ తాత్కాలిక డైరెక్టర్ డాక్టర్ వి.ఎం.తివారీ తెలిపారు. వాటి నుంచి మనకు సోకదు! ఏషియాటిక్ సింహాలకు సోకిన కరోనా వైరస్ మళ్లీ మనుషులకు సోకే అవకాశం లేదని, మనకు సోకుతుందనేందుకు తగిన ఆధారాలు లేవని సెంట్రల్ జూ అథారిటీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల జంతువులకు ఈ వ్యాధి సోకినప్పటికీ వాటి నుంచి తిరిగి మనుషులకు సోకినట్లు సమాచారం లేదని తెలిపింది. దేశంలోని అన్ని జంతు సంరక్షణ కేంద్రాల్లో కోవిడ్–19 నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు చేశామని, తగిన మార్గదర్శకాలు కూడా జారీ చేశామని తెలిపింది. పలు నివేదికల ప్రకారం.. గతేడాది స్పెయిన్ లోని బార్సిలోనాలోని ఓ జూలో సింహాలు, పులులకు కరోనా నిర్ధారణ అయింది. కాగా, రాష్ట్రంలో ఉన్న జూ పార్కులు, టైగర్ రిజర్వులు, వైల్డ్ లైఫ్ శాంచురీలు మే 2 నుంచి మూత పడిన సంగతి తెలిసిన విషయమే. చదవండి: కరోనా: ఆహారం అందిస్తాం.. అంత్యక్రియలు చేస్తాం.. -
వైరల్: మృగాళ్ల బారి నుంచి బాలికను కాపాడిన సింహాలు
అడ్డిస్బాబా: బుద్ధి, జ్ఞానం విచక్షణా శక్తి ఉన్న మనుషులు మృగాళ్లలా మారినా వేళ.. నోరు లేని మూగ జీవాలు మానవత్వం చూపాయి. ఓ చిన్నారి జీవితాన్ని నాశనం చేయడననికి ప్రయత్నించిన మృగాళ్ల బారీ నుంచి మృగరాజుల కాపాడాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఫ్రికా ఖండం, ఇథోపియా దేశ రాజధాని అడ్డిస్ బాబా అనే ప్రాంతంలో 12 ఏళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. తన కుమార్తె కనిపించడం లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. మరోవైపు కిడ్నాపర్లు బాలికను చిత్రహింసలకు గురిచేశారు. లైంగికంగా వేధించి బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించగా, బాలిక కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని స్థానికంగా ఉన్న ఓ అడవిలోకి వెళ్లింది. చిన్నారి జాడ కోసం కిడ్నాపర్లు అడవిలోకి వెళ్లారు. అలా సగం దూరం అడవిలోకి వెళ్లిన బాలికకు సింహాలు అండగా నిలిచాయి. ఓ చెట్టుకింద 3 సింహాలు కిడ్నాపర్ల నుంచి రక్షించేందుకు బాధితురాల్ని రౌండప్ చేశాయి. దీంతో కిడ్నాపర్లు గుండెల్ని అరచేతిలో పెట్టుకొని బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పరారయ్యారు. కాగా గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేపట్టారు. విచారణలో చిన్నారి సురక్షితంగా ఉందని, ఆమెను సింహాలు కాపాల కాస్తున్నాయని చెప్పారు. దాంతో షాక్ తిన్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఘటనస్థలానికి వెళ్లారు. అక్కడ తీవ్రగాయాలతో షాక్‌కు గురైన చిన్నారిని అక్కున చేర్చుకొని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్పృహలోకి వచ్చిన చిన్నారి అడవిలో జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు సింహాలపై ప్రశంసల వర్షం కురిపించారు. కిడ్నాప్‌కు పాల్పడిన నిందితుల్ని కటకటల్లోకి నెట్టారు. సింహాలు బాలికను రక్షించకపోయి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని అటవీ శాఖ అధికారి వెండాజు తెలిపారు. ఈ ప్రాంతంలో చిన్నారులపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతాయి. లైంగిక దాడుల అనంతరం బలవంతంగా పెళ్లిచేసుకుంటారు. ఒప్పుకోలేదంటే ప్రాణాలు తీసి పైశాచికానందం పొందుతారని ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: నెల రోజుల్లో భార్యకు 3 సార్లు విడాకులిచ్చి.. -
‘గతేడాది ఉగాది తర్వాత రథం తీయలేదు’
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి రథం మీద ఉన్న మూడు వెండి సింహాలు మాయమైన విషయంపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ ఈవో సురేష్ బాబు.. గతేడాది ఉగాది తర్వాత రథం తీయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 17 నెలల తర్వాత ఇంజనీరింగ్ పనులు నిమిత్తం పరిశీలిస్తే సింహాలు మాయమైనట్లు వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మూడు సింహాలు అపహారణ మాయంపై విచారణ ప్రారంభించారు. (‘హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోంది’) వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రథాన్ని ఉపయోగించలేదని ఇంద్రకీలాద్రి ఆయల ఛైర్మన్ సోమినాయుడు తెలిపారు. 2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఘాట్రోడ్లో ఉన్న రథాన్ని జమ్మిదిడ్డి లో పెట్టినట్లు, ఆ తరవాత మహామండపం దగ్గరకు తీసుకొచ్చి పెట్టారని గుర్తుచేశారు. 2019 లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉగాదికి వాడిన తర్వాత కరోనా వలన వాడలేదని స్పష్టం చేశారు. అప్పుడు ఏ రకంగా వాడిన తరవాత పట్టా కట్టి ఉంచారో ఇప్పటికి అలాగే ఉంచామన్నారు. నిన్న(బుధవారం) కనపడని సింహాలు స్టోర్ట్‌రూమ్‌లో ఉన్నాయో లేవో అని గుడి తాలూకా అధికారులు అందరూ తనిఖీ చేసినట్లు వెల్లడించారు. అయితే ఆ సింహాలు స్టోర్‌రూమ్‌లో లేవన్నారు. పోయిన సింహాలను తయారు చేసి ఆ రథానికి అమర్చే ప్రక్రియను బుధవారమే ప్రారంభించమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న సెక్యురిటి అధికారులు ఇప్పుడు వచ్చిన మాక్స్ సెక్యురిటి వాళ్ళకి ఆ సింహాలు అప్పజెప్పలేదని తెలిపారు. ఈ రోజు సింహాలు కనపడకుండా పోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆయల ఛైర్మన్ సోమినాయుడు మాట్లాడుతూ.. ‘పోయిన సింహాలు ఏరకంగా పోయాయి అని పోలీసులను దర్యాప్తు చేయాలి అని కోరాం. హిందువుల మనోభావాలు కాపాడేవిధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని మాట్లాడారు. గత టీడీపీ-బీజేపీ హయాంలో దేవాలయంలో క్షుద్రపూజలు జరిగినప్పుడు అప్పటి మీ దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేశారా?. గత టీడీపీ హయాంలో సుమారు 40 దేవాలయాలు కులగొట్టినప్పుడు ఆ రోజు జనసేన నాయకులు ఎందుకు మాట్లాడలేకపోయారు. ఒక ఎమ్మెల్సీ మాట్లాడేటప్పుడు మర్యాద కూడా లేకుండా మంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు బుద్ధ వెంకన్న. విచారణలో దోషులు తేలితే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాము. గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో తప్పులు జరిగాయి అప్పుడు ఎన్ని సారులు మీ మంత్రులతో రాజీనామా చేయించావు చంద్రబాబు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని వదంతులు చేసిన ప్రజలకు సీఎం వైఎస్ జనగ్పై అపార నమ్మకం ఉంది.’ అన్నారు. 2018 తరవాత ఇంద్రకీలాద్రి రథాన్ని తీయలేదని దుర్గగుడి ఈవో సురేష్‌బాబు పేర్కొన్నారు. ‘స్టోర్ రూమ్ తాళాలు నా దగ్గర ఉండవు. అక్కడ లేవు కాబట్టి స్టోర్ రూమ్‌లో సింహాలు ఉంటాయి అనే ఉద్దేశంతో నిన్న పరిశీలించాము. కానీ అక్కడ సింహాలు లేకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేశాము.’ అన్నారు. -
సింహాల కొట్లాట చూశారా?
గాంధీ నగర్: కొన్ని జంటలు అందరిముందు అన్యోన్యంగా ఉన్నట్లు కనిపిస్తాయే కానీ, ఇంట్లో మాత్రం ఒకరినొకరు తన్నుకు చస్తారు. రెండు సింహాలు అచ్చంగా కొంతమంది భార్యా భర్తల్లాగే కొట్టుకు చస్తున్నాయి. గుజరాత్‌లోని గిర్ అభయారణ్యంలో ఓ ఆడ సింహం, మగ సింహం రోడ్డుపై నిలబడి ఎదురెదురుగా తలపడ్డాయి. సింహం గర్జిస్తూ ముందుకు వస్తుంటే మరొకటి దాని వైపు కోపంగా చూస్తూ ఒక్కటివ్వబోయింది. కానీ ఎదురుగా ఉన్నది ఎంతకూ తగ్గలేదు. దాని దూకుడును చూసి వేగలేననుకుందో, ఎందుకొచ్చిన గొడవలే అనుకుందో ఏమో కానీ ఈ సింహం సైలెంట్‌గా పక్కకు తప్పుకుంది. (ఇలా ఏ తండ్రీ చెప్పడు!) ఈ పోరాటాన్ని వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ జుబీన్ ఆశర కెమెరాలో బంధించారు. వైల్డ్ ఇండియా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 22 సెకన్ల నిడివి ఉన్న ఈ పోరాట సన్నివేశాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. "ఆలూమగలు కొట్టుకున్నట్లే ఉందిగా.." అంటూ ఛలోక్తులు విసురుతున్నారు. 'కొత్తిమీర కట్ట మర్చిపోయి ఇంటికెళ్తే భార్య అలాగే అరుస్తుంది' అంటూ కొందరు భార్యాబాధితులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. 'మనుషుల్లో ఐనా, జంతువుల్లో ఐనా ఆడవాళ్లే గర్జిస్తారు' అని కొందరు మహిళలు రాసుకొచ్చారు. (భర్తకు విడాకులు, కొడుకుతో పెళ్లి) -
సింహాలు కూడా ఉహించని ట్విస్ట్!
‘‘స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టన్స్’’ అంటే బహుశా ఇదేనేమో. చావు కళ్ల ముందు కనపడి హాయ్ చెబితే.. దానికి ‘హ్యాండ్’ ఇవ్వడం అంత తేలికకాదు. కానీ, ఈ వైల్డ్ బీస్ట్ మాత్రం చావుకు లెగ్గే ఇచ్చింది. దాని కళ్లలో బ్రతకాలనే ఆశ తప్ప ఇంకేమీ లేనట్లు.. గాల్లో కలిసి పోకుండా ఉండేందుకు గాల్లోకి ఎగిరి మరీ సింహాలనుంచి తప్పించుకుంది. ప్రాణాల కోసం ఒలంపిక్‌లో పాల్గొన్న అథ్లెట్ లెవల్లో విజృంభించింది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్నంద గురువారం ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ సింహాలు కూడా అలా జరుగుతుందని అనుకోలేదు. అథ్లెట్ లాంటి ఛేజింగ్. వైల్డ్ బీస్ట్ అద్భుతంగా తప్పించుకుంది. తెలుసా? సింహాలు కేవలం 30శాతం మాత్రమే వేటలో విజయం సాధిస్తాయి’’ అని పేర్కొన్నారు. ( సెట్లో యాంకర్‌పై కోతి దాడి.. పరుగో పరుగు ) ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. ‘‘ ఎలా గెంతిందో చూడండి.. ఒలంపిక్ కోసం శిక్షణ పొందిన వ్యక్తిని ఛాలెంజ్ చేస్తే ఇలానే ఉంటుంది. నేను చూసిన వాటిలో ఇదో అద్భుతమైన సర్వైవల్ వీడియో’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( ఫోన్లో గేమ్ ఆడిన కప్ప; చివర్లో మాత్రం ) -
ఈ ఛేజింగ్ ఎప్పుడూ చూసుండరు
-
సింహం సింగిల్‌గా రాదు.. మీరే చూడండి
‘నాన్నా పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్‌గానే వస్తుంది' ఇది మన తెలుగు సినిమా డైలాగ్.. కానీ దీనికి భిన్నంగా ఓ చోట నీళ్లు తాగడానికి సింహాలు గుంపుగానే వచ్చాయి. అత్యంత అరుదైన, అద్భుతమైన ఈ దృశ్యం ఆఫ్రికా అడవుల్లోనిది. ఈ వీడియో పాతదే అయినా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐఎఫ్ఎస్ అధికారి సుధారామన్ ఈ వీడియోను తాజాగా ట్విటర్లో షేర్ చేశారు. ఆఫ్రికాకు చెందిన లండొలోజి ఈ వీడియోను మొదట షేర్ చేసినట్లు సుధా తెలిపారు. 'టైగర్ ఫ్యామిలీ డ్రింక్ టుగెదర్.. స్టే టుగెదర్' అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇక వీడియో చివరలో లయన్ కింగ్ సినిమాటిక్ ఎంట్రీ అబ్బుర పరుస్తుంది. The family that drinks together stays together. Wait to see the cinematic entry of the King. Infact it's quite rare sight to see a large pride using a waterhole. Lions are not great lovers of waterbodies unlike the tigers. Somewhere in Africa. Via Londolozi pic.twitter.com/fdo57f24GE — Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) May 25, 2020 -
సింహాల మధ్య బిడ్డకు ప్రసవం
గాంధీనగర్ : అప్పుడే పుట్టిన ఈ పాపకు ‘సింహ బాలిక’ అనే పేరు సందర్భోచితంగా ఉండొచ్చు. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్‌లో రహదారిపై చిమ్మ చీకటిలో సింహాల నడుమ బిడ్డను ప్రసవించింది ఓ తల్లి. కంగారు పడకండి. ఆ తల్లి అంబులెన్సులోనే ఉంది. నొప్పులు పడుతుంటే అంబులెన్సు ఆమెను ఇంటì నుంచి ఆసుపత్రికి వెళుతుండగా నాలుగు సింహాలు రోడ్డుకు అడ్డంగా వచ్చి అక్కడే ఉండిపోయాయి. ఇరవై నిముషాల సేపు అవి కదల్లేదు. ఈలోపు అంబులెన్సులోనే ప్రసవం జరిగిపోయింది. తల్లీబిడ్డ క్షేమం. తల్లి పేరు అఫ్సానా. -
4 పులులు, 3 సింహాలకు కరోనా పాజిటివ్
న్యూయార్క్ : నగరంలోని బ్రాంక్స్ జూలో నాలుగు పులులకు, మూడు సింహాలకు కరోనా వైరస్ సోకింది. బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో జూ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జూ టైగర్ మౌంటైన్‌లో ఉంటున్న మూడు పులులకు, మరో మూడు ఆఫ్రికన్ సింహాలకు పొడి దగ్గుతో కూడిన లక్షణాలు కనిపించాయని, ఓ పులికి మాత్రం లక్షణాలు లేకపోయినా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. అయితే వాటికి ఎటువంటి ఎనస్థీషియా ఇవ్వలేదని, మల పరీక్ష ద్వారా కరోనాను పరీక్షించామని తెలిపారు. ( ఒకే నెలలో 2.6 కోట్ల ఉద్యోగాలు మాయం ) మల పరీక్ష ద్వారా తమ అనుమానం నిజమైందని, జూలో ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది జంతువులు కరోనా బారినపడ్డాయని పేర్కొన్నారు. వైరస్ సోకినప్పటికి ఆ జంతువులు మామూలుగానే ఉంటున్నాయని, తింటున్నాయని, దగ్గు కూడా తగ్గిందని తెలిపారు. కాగా, గత నెలలో ఇదే జూలోని నదియా అనే నాలుగు సంవత్సరాల ఆడ పులి కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. నదియా కరోనా సోకిన తొలి పులి కావటం గమనార్హం. ( కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్ ) -
మనుషులు లేకుండా ఏమి హాయిలో అలా
సాక్షి, న్యూఢిల్లీ : మనుషుల అలికిడి లేకపోతే ఏమీ హాయిలో ఇలా.. .అనుకొని గుర్రుకొట్టి నిద్రపోతున్నాయి సింహాలు. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్కులో పార్క్ రేంజర్ రిచర్డ్ సోవ్రీకి బుధవారం మధ్యాహ్నం కనిపించిన దశ్యం. ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలను సష్టిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి నియంత్రించడంలో భాగంగా మార్చి 26వ తేదీ నుంచి దక్షిణాఫ్రికాలో లాక్డౌన్ పాటిస్తుండడంతో మనుషుల రాకపోకలకు లేక బోసి బోయిన నేషనల్ పార్క్ రోడ్డు. ఈ పార్కులోని సింహాలు, పులులు తరచుగా ఈ తారు రోడ్డును దాటుకుంటూ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళతాయి కానీ ఈ రోడ్డు మీద అడ్డంగా పడుకోవడం ఎప్పుడూ చూడలేదని ఫార్క్ రేంజర్ తెలిపారు. కానీ శీతాకాలం రాత్రులు అడవిలో కాకుండా ఇలా రోడ్డు మీద పడుకుంటాయని తెలుసుకానీ, మిట్టమధ్యాహ్నం ఇలా పడుకోవడం విశేషమని ఆయన చెప్పారు. మనుషులు వాహనాల్లో ఈ రోడ్డు గుండా వెళ్లడం అక్కడి సింహాలకు బాగా అలవాటేనని, మనుషులు నడిచి రావడం మాత్రం వాటికి తెలియదని, అలా నడిచి వాటి వద్దకు వెళ్లేందుకు మనుషులు ప్రయత్నిస్తే కీడు శంకించి అవి పీక్కు తింటాయని పార్క్ రేంజర్ మీడియాకు వివరించారు. మీడియాతో ఫొటోలను షేర్ చేసుకున్నారు. -
సింహాల గణనకు కొత్త విధానం
డెహ్రడూన్: దేశంలో సింహాల సంఖ్యను లెక్కించేందుకు శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని కనుగొన్నారు. దీంతో వాటి సంరక్షణ చర్యలు సమర్థంగా చేపట్టొచ్చని చెబుతున్నారు. సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా గుజరాత్‌లోని గిర్ అడవుల్లో ఉన్న 50 ఆసియా సింహాల సంఖ్య ప్రస్తుతం 500 వరకు పెరిగినట్లు వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కేశబ్ వివరించారు. ప్రస్తుతం ఉన్న లెక్కింపు విధానాల వల్ల కొన్ని సింహాలను లెక్కించకపోవచ్చు. లేదా డబుల్ కౌంటింగ్ జరగొచ్చు.. దీనివల్ల వాటి సంఖ్య వివరాలు పరిమితంగానే తెలుస్తాయి. అందుకే ఆయన సహచరులు కలసి కంప్యూటర్ ప్రోగ్రాం ఉపయోగించి లెక్కించే కొత్త విధానాన్ని రూపొందించారు. ఈ విధానంలో సింహం ముఖంపై ఉన్న మీసాలు, శరీరంపై ఉన్న మచ్చల ఆధారంగా గుర్తిస్తారు. సింహాల ఆహార లభ్యత, ఇతర కారకాలు సింహాల సంఖ్యను ప్రభావితం చేసే అవకాశం ఉందని కేశబ్ చెప్పారు. తాజా అధ్యయనంలో గిర్ అడవుల్లో 368 సింహాల్లో 67 సింహాలను 725 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో గుర్తించారు. -
పిల్లి కాదు ‘కరోనా పులా’ ..?
సాక్షి ప్రతినిధి, చెన్నై: చైనాలో కరోనా వైరస్‌తో వందలాది ప్రజలు పిట్టల్లారాలిపోవడం మొత్తం ప్రపంచాన్నే హడలెత్తిస్తోంది. తమ దేశంలోకి కరోనావైరస్ వ్యాపించకుండా అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. జంతువుల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో..చైనాలో నివసించే వ్యక్తులు భారత్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి లేదని భారత నావికాదళశాఖ గత నెల 11న ప్రకటన విడుదల చేసింది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియాన్మార్ సరిహద్దుల నుంచి ఆకాశ, భూమార్గంలో జనవరి 15 తర్వాత భారత్‌లోకి రావడంపై కేంద్రం నిషేధం విధించింది. చైనాలోని భారతీయ ఉద్యోగులు, విద్యార్థులు కరోనావైరస్ భయంతో తమిళనాడుకు వచ్చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వైరస్ అనుమానిత రోగుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా నుంచి చెన్నైకి వచ్చిన ఒక నౌకలో పసుపు, తెలుపు రంగులతో కూడిన “స్టో వేవే’ జాతికి చెందిన ఒక పిల్లి బోనులో కనుగొన్నారు. చైనా నుంచి వచ్చిన కంటైనర్లను హార్బర్ ప్రవేశద్వారం వద్ద కొన్నిరోజుల క్రితం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. పిల్లలు ఆడుకునే బొమ్మలున్న ఆ కంటైనర్‌లో బోనులో ఉంచిన పిల్లి బయటపడింది. ఎంతో బలహీనంగా ఉన్న ఆ పిల్లికి వైద్యచికిత్సలు అందిస్తున్నారు. ఈ పిల్లిని ఎవరు ఎవరికి పంపారు? ఎందుకోసం పంపారని కస్టమ్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. కంటైనర్ల మధ్య సింహాల సంచారం ఇదిలా ఉండగా హార్బర్ కంటైనర్ల నడుమ మూ డు సింహాలు సంచరిస్తున్నట్లు, సింహాల దాడి తో తీవ్రంగా గాయపడినట్లున్న ఒక యువకుని దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో సోమవారం ప్రచారం కావడం కలకలం రేపాయి. అంతేగాక తిరునెల్వేలీకి చెందిన ఒక యువకుడు విడుదల చేసిన ఆడియో కూడా భీతిల్లేలా చేసింది. ‘ఫోటోలు ఉన్న మూడు సింహాలను చూసే ఉంటారు, చెన్నై ఎన్నూరులోని కామరాజర్ హార్బర్‌లోనే ఇవి సంచరిస్తున్నాయి. ఇరుక్కు అడవుల నుంచి వచ్చాయా లేక చైనా నౌక నుంచి చేరుకున్నాయా, కంటైనర్లలో తెచ్చి వదిలిపెట్టారా అని అధికారులు తేల్చాల్సి ఉంది. ఆదివారం లోడు ఎత్తుతుండగా ఈ మూడు సింహాలను చూసాను. కంటైనర్ లారీ డ్రైవర్లు ఎలాంటి పరిస్థితిలోనూ రాత్రివేళల్లో కిందికి దిగవదు’ అని అతడు పేర్కొన్నాడు. కరోనావైరస్ అనుమానితుని మృతి పుదుక్కోటై జిల్లా అరంతాంగికి చెందిన శక్తికుమార్ (42) చైనాలో హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. పచ్చకామెర్లు సోకడంతో ఇటీవల సొంతూరుకు చేరుకుని చికిత్స పొందుతున్నాడు. చైనా హోటల్లో ఇబ్బందులు తలెత్తడంతో ఆరోగ్యం కుదుటపడేలోగా వెళ్లిపోయాడు. మరలా తీవ్ర అనారోగ్యానికి గురై ఈనెల 4వ తేదీన అరంతాంగికి వచ్చాడు. మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 15వ తేదీన మరణించాడు. శక్తికుమార్ సంగతి వైద్యశాఖకు తెలియకపోవడంతో సాధారణ రోగిలా మధురై ఆసుపత్రిలో చేరి ప్రాణాలు విడిచాడు. కరోనా వైరసే అతని ప్రాణాలను బలిగొందని ప్రచారం జరగడంతో ప్రజలు భీతిల్లుతున్నారు. చైనా నౌకలో వచ్చిన పిల్లిని వెనక్కు పంపాలని కేంద్ర నౌకాయానశాఖ మాజీ మంత్రి జీకే వాసన్ హార్బర్ అధికారులను కోరారు. -
వైరల్: ఇక నుంచి పులిరాజాకు చలిపెట్టదు
కాస్త చలి పెడితే చాలు.. ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటేనే ఒకటికి వందసార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఎప్పుడూ బయటే తిరుగాడే మూగ జంతువులకు చలి పెట్టదా అంటే పెడుతుంది. అవి కూడా మనుషుల్లానే చలి నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తాయి. మరి జూలో ఉండే జంతువుల మాటేమిటి? అవి ఎలాంటి చలిలోనైనా వణుకుతూ బాధపడాల్సిందేనా అనిపించక మానదు. కానీ అస్సాంలోని గౌహతి జూ అధికారులకు కూడా సరిగ్గా ఈ ప్రశ్నే తట్టింది. వాటి కోసం ఏదైనా చేయాలని భావించిన అస్సాం స్టేట్ జూ కమ్ బొటానికల్ గార్డెన్ అధికారులకు చక్కని ఐడియా తట్టింది. బోనులో ఉన్న పులుల, సింహాలు వెచ్చదనాన్ని అనుభూతి చెందేందుకు ఎన్‌క్లోజర్ వెలుపల హీటర్లను ఏర్పాటు చేశారు. అయితే అన్ని జంతువులకు హీటర్ అంత మంచిది కాదు. దీంతో పచ్చిక బయళ్లపై తిరుగాడే జింక, తదితర జంతువుల కోసం ప్యాడీ స్ట్రాలను అక్కడి గడ్డిపై పరిచారు. పాపం.. మూగ జీవాలకు ఎంత కష్టం వచ్చిందని కొందరు నెటిజన్లు సానుభూతి చూపిస్తున్నారు. జంతువులను బంధించకుండా వదిలేస్తే అయిపోయేది కదా అని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
జనావాసాల్లోకి ఏడు సింహాలు
గిరినగర్: గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జునాగఢ్‌లోని గిరినగర్ వీధుల్లో గత శుక్రవారం రాత్రి ఏడు సింహాలు చక్కర్లు కొట్టాయి. జనావాసాల మధ్య హాయిగా తిరిగాయి. దీన్ని ఓ వ్యక్తి చిత్రీకరించి సామాజిక మధ్యమాల్లో పోస్ట్‌చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. స్థానికులిచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు, సింహాలను అడవిలోకి తోలారు. కాగా, ఈ విషయమై జునాగఢ్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్(డీసీఎఫ్) ఎస్కే బేర్వాల్ మాట్లాడుతూ.. గిర్ అభయారణ్యం సమీపంలోనే ఉండటంతో ఈ సింహాల గుంపు జనావాసాల మధ్యకు వచ్చిందని తెలిపారు. వర్షాలు పడినా, పడకున్నా సింహాలు అలా స్వేచ్ఛగా తిరుగుతాయనీ, అది వాటి స్వభావమని వివరణ ఇచ్చారు. ఈ సింహాలన్నీ క్షేమంగానే ఉన్నాయని తేల్చిచెప్పారు. 2015 నాటి లెక్కల ప్రకారం గిర్ అభయారణ్యంలో 523 ఆసియా సింహాలు ఉన్నాయి. -
ఈ సింహాల అనుబంధం చూశారా?
భావోద్వేగాలు అన్నవి మనుషులకే పరిమితమా.. ఈ చిత్రాన్ని చూస్తే.. మన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే.. ఈ రెండు సింహాలు అన్నదమ్ములు.. చూశారుగా.. వీటి మధ్య బాండింగ్.. ఇలాంటి చిత్రాలు కాస్త అరుదే.. అందుకే ఇది వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పీపుల్స్ చాయిస్ పురస్కారాన్ని గెలుచుకుంది. ఏటా ఈ అవార్డును లండన్‌లోని ప్రఖ్యాత నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రదానం చేస్తోంది. మొత్తం 45 వేల ఎంట్రీలు రాగా.. తుది జాబితాకు 25 ఎంపికయ్యాయి. జనం ఓట్ల ఆధారంగా విజేతను ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని టాంజానియాలో తీశారు. భావోద్వేగాలు అన్నవి మనుషులకే పరిమితం కావన్న విషయాన్ని ఈ ఫొటో నిరూపిస్తోందని.. అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఈ చిత్రాన్ని తీసిన ఫొటోగ్రాఫర్ న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్ లాయిడ్ అన్నారు. ఈ చిత్రానికి ఆయన పెట్టిన పేరు ఏమిటో తెలుసా? బాండ్ ఆఫ్ బ్రదర్స్.. పర్ఫెక్ట్ కదూ.. -
గిర్’లో మరో రెండు సింహాల మృతి
అహ్మదాబాద్: గుజరాత్‌లోని ‘గిర్’ అభయారణ్యంలో మంగళవారం మరో రెండు సింహాలు మృత్యువాతపడ్డాయి. దీంతో సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఇక్కడ మృతి చెందిన సింహాల సంఖ్య 23కు చేరుకుంది. అంతర్గత పొట్లాటలు, ఇన్ఫెక్షన్ల వంటి కారణాలతో సెప్టెంబర్ 12 నుంచి 19వ తేదీ మధ్య 11 సింహాలు, సెప్టెంబర్ 20 నుంచి 30వ తేదీ మధ్యలో 10 సింహాలు ప్రాణాలు కోల్పోయాయి. మంగళవారం మరో రెండు చనిపోవడం చాలా దురదృష్టకరమని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. ఢిల్లీ, పూణే నుంచి వచ్చిన నిపుణులు అభయారణ్యంలో ఉంటున్న మిగతా సింహాలను పరీక్షించి ఎటువంటి ప్రమాదం లేదని భరోసా ఇచ్చారన్నారు. మృత్యువాతపడిన సింహాలన్నీ అభయారణ్యంలోని దల్ఖానియా రేంజ్లోనివే కావడం గమనార్హం. -
11 సింహాలు మృత్యువాత
రాజ్‌కోట్: గుజరాత్‌లోని గిర్ అడవుల్లో కొద్ది రోజుల వ్యవధిలోనే 11 సింహాలు మృతి చెందడం సంచలనంగా మారింది. అంతరించిపోతున్న సింహాల్ని కాపాడటానికి చర్యలు చేపడుతున్నామని చెబుతున్న అటవీశాఖ అధికారులు వాటి సంరక్షణకు మాత్రం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఈ ఘటన రుజువు చేస్తోంది. మృతిచెందిన 11 సింహాలను కూడా అమ్రేలి జిల్లా పరిధిలోని గిర్ తూర్పు డివిజన్లో గుర్తించారు. వాటి నమునాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జునాగఢ్ వెటర్నిటీ ఆస్పత్రికి తరలించామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. 8 సింహాలు వాటి మధ్య పోరు కారణాంగానే మరణించి ఉంటాయని వాటి పోస్ట్ మార్టం నివేదికల ఆధారంగా ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. మిగతా మూడింటి రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై లోతైన విచారణ చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వాని డిమాండ్ చేశారు. అవి ఏ కారణం చేత మరణించాయో(విద్యుద్ఘాతం, విషప్రయోగం, వేట) తెల్చాలని అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన గుజరాత్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, 2015 లెక్కల ప్రకారం గిర్ అడవుల్లో 520 సింహాలు ఉన్నాయి. -
లక్షన్నర టన్నుల కందులు కొనండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ సీజన్లో కందుల దిగుబడి 2.84 లక్షల మెట్రిక్ టన్నులు వస్తున్న నేపథ్యంలో లక్షన్నర టన్నులు సేకరించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రిహరీశ్‌రావు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన మరో లేఖ రాశారు. మొదట 33,500 మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. మంత్రి విన్నపం మేరకు కేంద్రం 53,600 మెట్రిక్ టన్నుల సేకరణకు ఒప్పుకొంది. అయితే కంది దిగుబడి పెరగడంతో హరీశ్ ఆదేశాలతో ఎంపీ జితేందర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ కార్యదర్శి సి.పార్థసారథి కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్‌ను, ఆ శాఖ ఉన్నతాధికారులను ఢిల్లీలో కలసి విజ్ఞప్తి చేయడంతో 1.13 లక్షల మెట్రిక్ టన్నుల కందుల సేకరణకు అంగీకరిస్తున్నట్లు కేంద్రం బుధవారం రాష్ట్రానికి తెలిపింది. రాష్ట్రంలో కందుల దిగుబడి దృష్ట్యా కేంద్రం ఈ పరిమితిని సడలించాలని, లక్షలన్నర టన్నులు సేకరించాలని హరీశ్ కోరారు. 83,650 టన్నుల కొనుగోళ్లు.. తెలంగాణలో 83,650 మెట్రిక్ టన్నుల కందులను సేకరించారు.మొత్తం కందుల కొనుగోళ్ల విలువ రూ.455 కోట్లు. కొనుగోళ్ల అనంతరం చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం తగదని హరీశ్ అన్నారు. కొనుగోలు చేసిన వెంటనే మార్క్‌ఫెడ్, హాకా సంస్థల అధికారులు కందులను గోడౌన్లకు తరలించి నాఫెడ్‌కు స్వాధీనపరచాలని సూచించారు. కందుల కొనుగోళ్లలో అక్రమాలు, అవకతవకలు జరిగితే సహించబోమన్నారు. కందుల రీ సైక్లింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంది రైతులకు మద్దతు ధర లభించాలన్నారు. జనగామ, భువనగిరిలలో కందుల క్రయవిక్రయాల్లో అవకతవకలు జరిగినందున జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ డైరెక్టర్‌ను ఆదేశించారు. -
నాతోనే పరాచికాలా..?!
నేను మృగరాజును.. నాతోనే పరాచికాలా అన్నట్లు.. సింహం ప్రవర్తిస్తున్నట్లు ఉంది. జూకు వెళ్తేనే ఎంతో జాగ్రత్తగా సింహాలు, పులులను చూస్తాం. అటువంటిది.. నడి రోడ్డుమీద విలాసంగా.. రాజసంతో విశ్రమిస్తున్న ఈ సంహం దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్రికన్ సఫారీ... సింహాలకు, పులులకు పెట్టింది పేరు. రహదారి లో రాజసంతో విశ్రమిస్తుంటాయి.. మృగరాజులు. ఆఫ్రికన్ సఫారీలో వాహనాలకు హారన్‌ను చాలా తక్కువగా ఉపయోగిస్తుంటారు. జంతువులకు ఏ మాత్రం అలజడి కనిపించినా.. అవి చాలా విపరీతంగా ప్రవర్తిస్తాయి. తాజాగా కొందరు చిన్నారులతో కలిసి ఆఫ్రికన్ సఫారికి వెళ్లారు. రోడ్డు మీద సింహాలు నిద్రిస్తున్నాయి. వాటికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా.. తమ వాహనాలను రోడ్డుకు పక్కగా వాహనదారులు ఆపేశారు. ఇద్దరు చిన్నారులు.. కార్ అద్దాలు తెరచి.. సింహాలను ఫొటోలు తీసే ప్రయత్నం చేశారు. ఫొటో క్లిక్, ఫ్లాష్ రావడంతో సింహాలు ఒక్కసారిగా పైకి లేచాయి. అయితే ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వాటంతట అవి పక్కకు వెళ్లాయి. ఎవరిమీద దాడి చేస్తాయన్నభయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని క్షణాలను లెక్కపెట్టుకుంటూ వాహనదారులు సమయం గడిపారు. -
నాతోనే పరాచికాలా..?!
-
అర్ధరాత్రి అడవిలో సింహాల మధ్య ప్రసవం
-
అర్ధరాత్రి అడవిలో సింహాల మధ్య ప్రసవం
అహ్మదాబాద్: ఆమె ఎలాంటి సమస్య లేకుండా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు చాలా ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ, ముఖంలో సంతోషానికి బదులు భయాందోళనలు అలుముకున్నాయి. ఏం జరుగుతుందో అని వణికిపోయింది. అందుకు కారణం సింహాలు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పన్నెండు సింహాలు. మొత్తం వారిని చుట్టుముట్టాయి. అదేమిటి బిడ్డకు జననం అంటే ఏ ఇంట్లోనో, ఆస్పత్రిలో ఉంటుందిగా.. అక్కడ సింహాలు చుట్టుముట్టడమేమిటని సందేహ పడుతున్నారా? కానీ, ఇది నిజమే. అయితే, ఆమె అంతా అనుకున్నట్లు ఇంట్లోనో ఆస్పత్రిలోనో బిడ్డకు జన్మనివ్వలేదు. అడవి ప్రాంతంలో ప్రసవించింది. అది కూడా అర్ధరాత్రి సమయంలో..వివరాల్లోకి వెళితే.,. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలోగల లునాసఫూర్ అనే ఓ ఏజెన్సీ గ్రామంలో మంగుబెన్ మక్వానా అనే 32 ఏళ్ల మహిళ గత నెల (జూన్) 29న పురిటి నొప్పులు వచ్చాయి. అప్పుడు సమయం అర్థరాత్రి తర్వాత 2.30 కావొస్తుంది. దాంతో ఆమెను జఫరాబాద్ టౌన్ ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్ వచ్చింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేది సింహాలకు ప్రసిద్ధిగాంచిన గిర్ ఫారెస్ట్ ప్రాంతం నుంచే. దీంతో వారు వెళ్లే సమయంలో అదే మార్గంలో తొలుత మూడు సింహాలు వారి వాహనాన్ని అడ్డగించాయి. ఆలోపే వరుసగా పన్నెండు సింహాలు వారి వాహనాన్ని చుట్టుముట్టాయి. స్థానికులకు అక్కడి సింహాలు పారిపోయేలా చేయడం తెలిసినందున అలాంటి సంకేతాలు ఇచ్చారు. వారి దురదృష్టం కొద్ది ఆ సింహాలు పారిపోవడానికి అటు ఇటు తిరగడం ఆపేసి ఏకంగా వాహనం ముందు కూర్చున్నాయి. ఈలోగా పురిటి నొప్పులు మరింత పెరగడంతో అంబులెన్స్‌లోని సిబ్బంది ఓ ప్రధాన వైద్యుడికి ఫోన్ చేసి అతడు చెప్పిన ప్రకారం పాటిస్తూ ఆమెకు అంబులెన్స్‌లోనే పురుడు పోశారు. అంబులెన్స్ నడుపుతున్న డ్రైవర్ జాదవ్ మాత్రం సింహాల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉన్నాడు. ఆ తర్వాత బిడ్డ జన్మించాక మెల్లిగా అంబులెన్స్ కదిలిస్తూ లైట్లు ఆన్ ఆఫ్ చేస్తూ ముందుకెళ్లడంతో సింహాలు దారిచ్చాయి. -
హైవేపై సింహాల గుంపు : నిలిచిన ట్రాఫిక్
-
రోడ్డు మధ్యలో లయన్స్ రాస్తా రోకో !
-
పర్యాటకుల కారుపై దూకిన సింహాలు
బనశంకరి (బెంగళూరు): బెంగళూరు శివార్లలోని బన్నేరుఘట్ట అభయారణ్యంలో మంగళవారం రెండు సింహాలు సందర్శకుల ఇన్నోవా వాహనంపై దాడికి యత్నిం చాయి. బన్నేరుఘట్ట పార్కులో పులులు, సింహాలు, వన్య మృగాలను చూడటానికి పర్యాటకులు ప్రత్యేక బస్సులో వెళ్తుంటారు. ఎక్కువ ఫీజు చెల్లిస్తే ఇన్నోవా వాహనం లోనూ వెళ్లొచ్చు. ఇలాగే ఇన్నోవాలో పర్యాటకులు వెళ్తుండగా రోడ్డుకు అడ్డుగా వచ్చిన 2 సింహాలు వాహనం పైకి దూకి ముందుకెళ్లకుండా అడ్డుపడ్డాయి. వాహన అద్దాలను పంజాతో కొడుతూ వారిని భయభ్రాంతులకు గురి చేసింది. కాసేపటికి అవి శాం తించి వెనక్కి మళ్లడంతో బతుకు జీవుడా అంటూ పర్యాటకులు బయటపడ్డారు. -
డయాలసిస్ యూనిట్ సేవలు ప్రారంభం
తణుకు: తణుకు ఏరియా ఆసుపత్రిలో లయన్స్ ఆధ్వర్యంలో వంక సత్యనారాయణ, నాగమణి డయాలసిస్ యూనిట్ సేవలు ప్రారంభించినట్లు ముఖ్యదాత, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వంక రవీంద్రనా«ద్ తెలిపారు. ఈ మేరకు శనివారం డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి రోగులను పరామర్శించారు. తణుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కిడ్నీ రోగులు వారి రక్తశుద్ధి కోసం ఈ నూతన కేంద్రానికి వచ్చి డయాలసిస్ చేయించుకుంటున్నారని చెప్పారు. అత్యాధునిక పది డయాలసిస్ యంత్రాలతో ఇటీవల లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ విజయకుమార్‌రాజు చేతుల మీదుగా ఈ కేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు. మిషన్లు అన్ని సక్రమంగా పని చేసి రోగులకు పూర్తి సంతృప్తి ఇచ్చే విధంగా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ఒక సారి డయాలసిస్ చేయించుకోవాలంటే రూ. 800 చెల్లిస్తే సరిపోతుందని ఇతర మందులు, పరికరాలు కూడా పూర్తిస్థాయిలో తగ్గింపు ధరల్లో తీసుకుంటామని వివరించారు. డయాలసిస్ చేయించుకునే రోగులు గతంలో ఏలూరు, భీమవరం వెళ్లేందుకు ప్రయాసపడేవారన్నారు. అయితే అధిక వ్యయప్రయాసలకయ్యే పని ఇక్కడ కేంద్రం ఉండటం కారణంగా సమయం వృధా కాకుండా తక్కువ ధరకు డయాలసిస్ పొందగలుతున్నారన్నారు. మునిసిపల్ మాజీ ఛైర్మన్ వంక రాజకుమారి రోగులందరినీ వ్యక్తిగతంగా పలకరించి డయాలసిస్ పొందుతున్నప్పుడు వారి అనుభవాలను తెలుసుకుని నిర్వహకులకు సూచనలు ఇచ్చారు. ఈ క ఆర్యక్రమంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం.బాబూరావు, డిస్ట్రిక్ట్ జిల్లా జిల్లా లయన్స్ నాయకులు దామెర రంగారావు, డాక్టర్ జీవీవీ సత్యనారాయణ, ఏలూరి శ్రీమన్నారాయణ, కల్లూరి త్రిమూర్తులు పాల్గొన్నారు -
కొత్త ట్రెండ్ సృష్టించిన జూ జీన్స్!
టోక్యో: ఫ్యాషన్ డిజైనింగ్ లో మనుషులు మాత్రమే కాదు జంతువులు రాణిస్తున్నాయి. అదేంటీ వాటికి డిజైన్ల గురించి ఏం తెలుసు అని సందేహం అక్కర్లేదు. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం మరి. నటకిరీటీ రాజేంద్రప్రసాద్ నటించిన 'ఆ ఒక్కడీ అడక్కు' మూవీ తెలుసు కదండీ. అందులో నష్టాల్లో ఉన్న బట్టల కంపెనీని రాజేంద్రప్రసాద్ లీజుగా తీసుకుని భిన్న రకమైన షర్ట్స్, ప్యాంట్స్ డిజైన్లను తయారుచేయిస్తాడు. సిగరెట్లతో చొక్కాలకు రంద్రాలు చేయడం, పాన్ మసాలా లాంటివి తిని డ్రెస్సుపై రంగు పడేలా చేయడం, సింగిల్ షోల్డర్ చొక్కాలు చేసి కొత్త ట్రెండ్ తీసుకొచ్చి లాభాలు తీసుకొస్తాడు. ప్రస్తుతం జపాన్ వాళ్లు ఇలాంటి ఫార్ములాను వాడుతున్నారు. జూ టీన్స్ పేరుతో బ్రాండింగ్ జీన్స్ అమ్ముతున్నారు. పులులు, సింహాలు, కొన్ని రకాల ఎలుగుబంట్లు అక్కడి ఓ జూలో ఉంటున్నాయి. అయితే జూ జీన్స్ వాళ్లు జూ వాళ్ల సహకారంతో జీన్స్ ప్యాంట్లు కుట్టేందుకు వాడే ముడిసరకును కారు, జీపు టైర్లకు, ఫుట్ బాల్స్ కు పూర్తిగా చుట్టేసి పార్కులోని జంతువుల మధ్య పడవేస్తారు. ఆ వెంటనే పులులు, సింహాలు ఆ జీన్స్ ముడిసరుకును చీల్చి చెండాడుతాయి. దీంతో బట్ట చాలా చోట్లు చీరుకుపోయినట్లుగా తయారవుతుంది. జూ జీన్స్ సంస్థ వాళ్లు ఆ ముడిసరుకును మళ్లీ సేకరించి ప్యాంట్లు, కొన్ని మోడల్ జీన్స్ షర్టులను రూపొందిస్తారు. ఆ తర్వాత జూ జీన్స్ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తారు. ఈ విధానం మొదలుపెట్టిన తర్వాత అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ జంతువులను గౌరవించేందుకు పులుల సాయంతో చేసిన డ్రెస్సులకు టీ1, లయన్స్ తో అయితే ఎల్1, ఎలుగుబంట్లు రబ్ చేసిన వాటి జంతువుల సహాయంతో డిఫరెంట్ ప్రాసెస్ వాడుతున్నారని తెలిసే కస్టమర్లు వీటిని కొనుగోలు చేయడం విశేషం. ఈ నెల 6 నుంచి 21 వరకూ హిటాచీ నగరంలో ఉత్పత్తులను అమ్మి, వచ్చే లాభాలను కమైన్ జూతో పాటు మరో సంస్థకు విరాళం ఇవ్వనున్నట్లు జీన్స్ సంస్థ ఉద్యోగి తెలిపారు. -
దోషులెవరో తేలిపోయింది..
దోషులెవరో తేలిపోయింది.. హంతకుల గుట్టురట్టయింది. ఆరుగురిని చంపిన కేసులో మూడు సింహాలకు జైలు శిక్ష పడింది!! గుజరాత్‌లోని గిర్ జాతీయ పార్కుకు సమీపంలోని గ్రామాలకు చెందిన ఆరుగురిని సింహాలు చంపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డౌట్ ఉన్న 18 సింహాలను జూ అధికారులు అదుపులోకి తీసుకుని.. వాటి పాదముద్రల నమూనాలు తీసుకున్నారు. చివరికి మూడు సింహాలను దోషులుగా తేల్చారు. ఇందులో ఒక మగ సింహం, రెండు ఆడసింహాలు ఉన్నాయి. ప్రధాన దోషి మగ సింహమేనని.. అది పలుమార్లు చేసిన దాడుల్లో ఆరుగురిని చంపేసిందని జూ అధికారులు తెలిపారు. ఆడ సింహాలు ఈ నేరంలో పాలుపంచుకున్నాయని.. మగ సింహం తినేసి వదిలేసిన మృతదేహాలను అవీ తిన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మగ సింహాన్ని జూకు తరలించి.. బోనులో బంధించారు. ఆడ సింహాలను రెస్క్యూ సెంటర్‌కు తరలించారు. నిర్దోషులుగా తేలిన మిగిలిన సింహాలను పార్కులోకి వదిలి స్వేచ్ఛను ప్రసాదించారు. -
ఆ సింహాలు గడగడ వణికిపోతున్నాయి!
మనం చూస్తున్నామని.. ఇలా గంభీరంగా నిల్చున్నట్లు స్టిల్లు పెట్టాయి గానీ.. లోపల ఇవి గడగడ వణికిపోతున్నాయి.. ఈ రెండే కాదు.. గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్కులోని 18 మృగరాజులది ఇదే పరిస్థితి. ఎందుకంటే.. ప్రస్తుతం ఇవి హత్య కేసును ఎదుర్కొంటున్నాయి. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ.. 18 సింహాల ‘అరెస్టు’ జరిగింది కూడా.. నేర నిరూపణ కోసం ఫింగర్ ప్రింట్లు తీసుకునే పని మొదలైంది. దోషిగా తేలిన సింహం.. ‘కటకటాల’ వెనక్కు వెళ్లాల్సిందేనట.. జైలు శిక్ష అనుభవించాల్సిందేనట.. మిగిలిన వాటిని నిర్దోషులుగా రిలీజ్ చేస్తారట. సింహాలపై హత్య కేసా.. అరెస్టులా.. జైలా.. ఏమిటిది అని అనుకుంటున్నారా? అయితే.. అసలు విషయంలోకి వెళ్లిపోదామా.. గిర్ నేషనల్ పార్కు సమీపంలోని గ్రామాల్లో ఇటీవల ఆరుగురు సింహం దాడిలో చనిపోయారు.. దీంతో అటవీ శాఖ అధికారులు డౌట్ ఉన్న 18 సింహాలను అదుపులోకి తీసుకున్నారు. వాటి పాదముద్రలను తీసుకునే పనిలో పడ్డారు. శాస్త్రీయపరమైన విశ్లేషణ అనంతరం హత్యలకు పాల్పడ్డ సింహం గుట్టు తేలుస్తారట. దోషిగా తేలినదాన్ని శాశ్వతంగా జూకు తరలించి.. బోనులో బంధిస్తారు. మిగిలిన వాటిని గిర్ పార్కులోకి మళ్లీ వదిలేసి స్వేచ్ఛను ప్రసాదిస్తారట. -
హాయ్ డార్లింగ్ అంటూ...
హాయ్ డార్లింగ్ అంటూ సింహాలను పలకరిస్తున్నాడు ముఖేష్‌ను కాపాడేందుకు అరగంట శ్రమించా విలేకరులతో జూపార్క్ అనిమల్ కీపర్ పాపయ్య బహదూర్‌పురా: ‘హాయ్ డార్లింగ్.. అంటూ ముఖేష్ సింహాలను పలకరిస్తూ వాటివద్దకు వెళుతున్నాడు.. సింహాల దృష్టిని మళ్లించేం దుకు సింహాలకు సైగలు చేస్తూ పక్కకు వెళ్లాలంటూ సూచించా.. అప్పుడు వెనక్కి వెళ్లాయి’ అని వివరించాడు జూపార్క్‌లోని అనిమల్ కీపర్ పాపయ్య. మద్యం మత్తులో నెహ్రూ జూలాజికల్ పార్కులోని సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకిన ముఖేశ్‌ను ప్రాణాలతో రక్షిం చేందుకు అర గంట పాటు తీవ్రంగా శ్రమించామని పాపయ్య విలేకరులకు వివరించాడు. 4.50గంటలకు సింహాల ఎన్‌క్లోజర్‌లోకి ముఖేశ్ దిగాడు. అదే సమయంలో ఆఫ్రికా సింహాల ఎన్‌క్లోజర్ పక్కనే ఉన్న ఏషియాటిక్ సింహాలకు ఆహరం అందించి ఎన్‌క్లోజర్‌లోకి పంపించి బయటికి వస్తున్నా.. ఎన్‌క్లోజర్‌లోకి ఓ వ్యక్తి దిగాడంటూ సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. ఆఫ్రికన్ సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దిగిన ముఖేశ్‌ను అక్కడికి వెళ్లవద్దంటూ వారించా.. అయినా వినకుండా నీటిలో ఈదుకుంటూ సింహాలు ఉన్న వైపు వెళ్లాడు. ఆ సమయంలో రెండు సింహాలు అతనికి నాలుగైదు అడుగుల దగ్గర వరకు వచ్చాయి. సింహాలను హాయ్ డార్లింగ్ అంటూ ముఖేశ్ పలకరిస్తున్నాడు. సింహాల దృష్టిని ముఖేశ్ వైపు నుంచి మళ్లించేందుకు సింహాలకు రాధ, కృష్ణ అంటూ సైగలు చేస్తూ పక్కకు వెళ్లాలని సూచించా.. అవి 20 అడుగుల వెనక్కి వెళ్లాయి. అయినా ముఖేశ్ సింహాల నీటి మోడ్‌లో నుంచి బయటికి వచ్చేందుకు ఇష్టపడలేదు. అతన్ని బయటికి రప్పించేందుకు ఓ దొడ్డు కర్రను లోనికి విసిరారు. వెనుకకు వెళ్లిన రెండు సింహాలు తిరిగి ముఖేశ్‌కు 3 అడుగుల దగ్గరికి వచ్చాయి. మళ్లీ గట్టిగా అరుస్తూ సింహాలను వెనక్కి వెళ్లాలంటూ సైగలు చేస్తూ కట్టెలతో దృష్టి మరలించి ఎన్‌క్లోజర్ వైపు వెళ్లే విధంగా చేశాను. తరువాత అవి ఎన్‌క్లోజర్‌లో ఉంచిన ఆహారాన్ని చూసి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాయి. దీంతో చిర్రెత్తిన ముఖేశ్ అవేమీ చేయవంటూ నేను విసిరిన కర్రను తిరిగి నాపైనే విసిరాడు. తరువాత పొడవాటి దొడ్డు కర్రను సింహాల మోడ్‌లో పెట్టి దాన్ని పట్టుకోవాలని ఐదు నిమిషాల పాటు అభ్యర్థించారు. ఎట్టకేలకు దానిని పట్టుకోవడంతో నెమ్మదిగా బయటికి లాగి ముఖేశ్‌ను ప్రాణాలతో బయటికి తీసుకొచ్చా అని వివరించాడు పాపయ్య. పన్నెండేళ్లుగా సేవలు.. పాపయ్య 12 సంవత్సరాలుగా ఈ సింహాల ఎన్‌క్లోజర్ వద్ద సేవలను అందిస్తున్నాడు. ఆరు సంవత్సరాల క్రితం జూపార్కుకు ఆ జత ఆఫ్రికా సింహాలను సౌదీ అరేబియా మహారాజు బహుమతిగా అందజేశారు. జూకు వచ్చినప్పుడు ఈ సింహాల వయస్సు మూడున్నర సంవత్సరాలే. ప్రస్తుతం ఈ సింహాలు దాదాపు 10 సంవత్సరాల వయస్సు గలవి. ఇదిలా ఉండగా పార్కులోని సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకి న ముఖేశ్ అనిమల్ కీపర్ పాపయ్య చొరవతో బతికి బయట పడటం జూ చరిత్రలోనే మొదటిసారి. 2009లో జూపార్కులో ఓ పులికి బన్ను తినిపించేందుకు ఓ వ్యక్తి ఇనుప జాలీల్లో నుంచి చేయి లోపలికి పెట్టాడు. దీంతో పులి బన్ను నాకుతున్నట్లు నటించి ఒక్కసారిగా చేయి మో చేతిని కొరికి వేసింది. ఈ సంఘటనలో చేయి కోల్పోయిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని రోజుల్లోనే మృతి చెందాడు. నెహ్రూ జూలాజికల్ పార్కులో తగినంత సిబ్బంది లేకపోవడం, అనిమల్ కీపర్లకు జూ ఉన్నతాధికారులు సమన్వయ లోపం కారణంగా అనేక విషయాలు బయటికి రాకుండా ఉండిపోతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖేశ్‌కు రిమాండ్ బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులోని సింహాల ఎన్‌క్లోజర్‌లోని దూకి హల్చల్ సృష్టించిన రాజస్థాన్‌కు చెందిన ముఖేశ్‌పై ఐపీసీ 448, వైల్డ్ లైఫ్ యాక్ట్ 38 సెక్షన్ల కింద బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ముఖేశ్‌పై సికింద్రాబాద్ రైల్వే జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. న్యాయమూర్తి సైతం ముఖేశ్‌ను మందలించారని పోలీసులు తెలిపారు. -
జూ లో తాను చావబోయి సింహాలను..
శాన్టియాగో(చిలీ): ఆత్మహత్య చేసుకోవాలని బోనులో దూకిన వ్యక్తి రెండు సింహాల మృతికి కారణమయ్యాడు. సింహాల బోనులోకి దూకి ఆత్మహత్యకు చేసుకోవాలనుకున్న ఓ 20 ఏళ్ల యువకున్ని కాపాడే ప్రయత్నంలో చిలీలోని జూ అధికారులు తప్పనిసరి పరిస్థతుల్లో రెండు సింహాలను కాల్చి చంపారు. వివరాలు.. చిలీలోని జూలో ఆఫ్రికా సింహాలను ఉంచిన బోణులోకి ఓ వ్యక్తి దూకి బట్టలు విప్పాడు. అనంతరం అతను బోనులో దిగిన కొద్దికే సింహాలు అతనిపై దాడి చేసి పడేశాయి. సమాచారం అందుకున్న జూ అధికారులు వెంటనే భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేసినట్లు జూ ప్రధాన అధికారులు తెలిపారు. అతను బోనులో పడగానే ఓ ఆడ సింహం, మగ సింహం అతనిపై దాడి చేసి పడేశాయి. మత్తు మందు కలిగిన బాణాలు సమయానికి అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని చంపాల్సి వచ్చిందని తెలిపారు. తీవ్రగాయాలైన అతన్ని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన అతన్ని ప్రాంకో లూయిస్‌గా గుర్తించారు. జూ అధికారులు ప్రాంకో జేబులో సూసైడ్ నోట్‌ను కనుగొన్నారు. మరోవైపు జూ అధికారులు చాలా ఆలస్యంగా స్పందించారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అతను బోణులో ప్రవేశించిన తర్వాత కొద్దిసేపటి వరకు సింహాలు అతనిపై దాడి చేయలేదని వారు తెలిపారు. -
సింహానికి ముద్దు పెడితే..
సింహాలను చూసి క్రూర జంతువులని భయపడటం సహజం. అవి జూలో బంధించి ఉన్నా కూడా వాటి దగ్గరికి పోవడానికి పిల్లలు, పెద్దలు ఎవరైనా తటపటాయించాల్సిందే. కానీ జూలో ఉన్న సింహాన్ని చూసి ఒక చిన్నారి చాలా ముచ్చటపడింది. అంతకన్నా మురిపెంగా గాల్లోకి ముద్దులు విసిరింది. దీంతో సింహం వైపునుంచి వచ్చిన రియాక్షన్ చూసి ఆశ్చర్య పోవడం అక్కడున్న వారి వంతైంది. అచ్చం అలవాటైన పెంపుడు జంతువులాగా ప్రేమను చూపించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆ ఆ వీడియో ఎక్కడదనేది మాత్రం తెలియరాలేదు. -
చెలికాడి చెంప ఛెళ్లుమనిపించె!
బోత్సువానా: మనిషిని, జంతువుని వేరు చేసేదే ఎమోషన్! అలాగని జంతువులకు భావోద్వేగాలు పూర్తిగా లేవని మాత్రం చెప్పలేం. ఫొటోలో కనిపిస్తున్న ఈ మృగరాజు తన తోడుతో కలిసి నీరు తాగేందుకు మడుగు దగ్గరికి వచ్చింది. ఆడసింహం నీళ్లు తాగుతుండగానే.. మృగరాజు మరో ఆడ సింహానితో స్నేహం చేసేందుకు ప్రయత్నించింది. దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన ఆడసింహం కోపంతో ఒక్క ఉదుటన వాటి వద్దకు వచ్చింది. మగసింహాన్ని పంజాతో ఒక్కటిచ్చింది. అంతే! మృగరాజు నేలకరిచాడు. బోత్సువానాలోని ఓ అటవీప్రాంతంలోనిదీ దృశ్యం. -
పార్క్ నుంచి సింహాల ఎస్కేప్
నైరోబీ: పార్క్ నుంచి సింహాలు తప్పించుకోవడం కెన్యా రాజధాని నైరోబీలో కలకలం సృష్టించింది. నేషనల్ పార్క్ నుంచి తప్పించుకున్న సింహాలు జనావాసంలోకి రావచ్చనే సమాచారంతో నైరోబీలో అలర్ట్ విధించారు. అయితే మొత్తం ఎన్ని సింహాలు బయటికి వెళ్లాయో స్పష్టమైన సమాచారం లేదు. ఇప్పటి వరకు ఒక ఆడ సింహాన్ని, రెండు సింహం పిల్లల్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మరో రెండు సింహాలు తిరిగి నైరోబీ నేషనల్ పార్క్‌లోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ ఆ సింహాలు కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని ఫారెస్ట్ అధికారలు తెలిపారు. ప్రజలెవ్వరూ బయటకు వెళ్లరాదని నైరోబీ వాసులను కోరారు. 2012లోనూ ఓసారి ఆడ సింహం పిల్లల్ని పార్క్‌లో వదిలి వెళ్లింది. అయితే అప్పట్లో ఆ ఆడ సింహాన్ని స్థానికులు చంపేశారు. అలాంటి ఘటన మళ్లీ జరగకుండా చూడాలని జూ అధికారులు స్థానికులను హెచ్చరించారు. -
లయన్ క్లబ్లో ఉచిత కంటిపరిక్షలు
-
బంధించిన బాలికను రక్షించిన సింహాలు
సింహం.. క్రూరత్వానికి.. కర్కశత్వానికి మారుపేరు..! అడవికి రారాజు.. జంతువులకు మృగరాజు. ఆధిపత్యం కోసం ప్రత్యర్థులను దారుణంగా చంపుతుంది. మాట వినకుంటే.. తమ సంతానంపై కూడా కరుణ చూపదు. నిర్దాక్షిణ్యంగా పంజా విసురుతుంది. అది దాని నైజం! అంతటి క్రూర జంతువులైన సింహాలు.. మృగాల్లాంటి మనుషుల నుంచి ఓ బాలికను కాపాడాయంటే నమ్ముతారా? సినీఫక్కీలో జరిగిన ఈ విచిత్ర ఘటన వివరాలు మీరే చదవండి. 2005లో ఆఫ్రికాలోని ఇథియోపియా దేశంలో జరిగింది ఈ ఘటన. దక్షిణ ఇథియోపియాలోని సెఫలోనియా ప్రాంతంలో ఓ గిరిజన గ్రామంలో ‘పోలీ’ అనే బాలిక తల్లిదండ్రులతో నివసించేది. ఆడుతూ.. పాడుతూ అందరితో కలివిడిగా ఉండే పోలీ అంటే గ్రామంలో తెలియనివారుండరు. పశ్చిమ దేశాల కంపెనీలు ఇథియోపియా పాలిట శాపంగా తయారయ్యాయి. వాటి మైనింగ్ దెబ్బకు అక్కడి అరణ్యాలు, గుట్టలు కనుమరుగయ్యాయి. పోలీ స్వగ్రామంలోనూ ఇదే పరిస్థితి. ఫలితంగా తాగునీటి కొరత. మైళ్ల దూరం కాలినకడన వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి. దీంతో గ్రామస్తులు సింహాల దాడిలో చనిపోతున్నారు. అది జూన్2, 2005. మంచినీళ్ల కోసం ఇంట్లో ఉన్న క్యాను తీసుకుని బయల్దేరింది పోలీ. అడవి పక్కన ఓ చెలిమెలో నీళ్లు పట్టుకుని ఇంటికి వస్తుండగా లస్సీ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పోలీని ఎత్తుకెళ్లాడు. ఇథియోపియాలో ఓ దుష్ట సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. తమ తెగలో నచ్చిన పిల్లను ఎత్తుకెళ్లి పెళ్లాడవచ్చు. అందుకనే లస్సీ ఈ దురాగతానికి పాల్పడ్డాడు. అడవికి సమీపంలో ఉన్న తన పొలంలోని గుడిసెలో పోలీని బంధించాడు లస్సీ. పెళ్లి చేసుకోమని బెదిరించాడు, కొట్టాడు. బెదిరిపోయిన ఆ బాలిక ఏడ్వడం మొదలు పెట్టింది. మరోవైపు చీకటిపడినా పోలీ ఇంటికి చేరకపోవడంతో ఆమె తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు స్పృహ కోల్పోయి గుడిసెలో పడి ఉన్న పోలీ.. ఏదో శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడి లేచింది. కిటికీ నుంచి ఏవో వెలుగులు ఆకుపచ్చ దీపాల్లా కనిపిస్తున్నాయి. ఏవో కాంతిపురుగులు అయి ఉంటాయనుకుంది. అలా ప్రతిరోజూ రాత్రి ఆ ఆకుపచ్చ వెలుగులు కనిపిస్తున్నాయి. అమ్మనాన్నలను తలుచుకుని పోలీ ఏడవని క్షణం లేదు. మరోవైపు పెళ్లికి ఒప్పుకోవాలంటూ లస్సీ బాలికను రోజూ కొడుతున్నాడు. అలా వారం గడిచింది. అది జూన్ 9. పోలీ జాడ కోసం పోలీసులు, అటవీ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. సాయంత్రం స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ‘లస్సీ’ భయపడ్డాడు. అదే రోజు రాత్రి పోలీని చంపేద్దామనుకున్నాడు. గుడిసెలో నుంచి పోలీని బయటికి ఈడ్చుకువచ్చాడు. పోలీ నిస్సహాయంగా కేకలు వేస్తోంది. ఇంతలో గుడిసె పక్కనున్న పొదలో ఏదో అలికిడి అయింది. అంతా నిశ్శబ్దం! పొదలను దాటుకుని మూడు భారీ ఆకారాలు బయటికి వచ్చాయి. ఆరు ఆకుపచ్చ లైట్లు మునుముందుకు వస్తున్నాయి. అవి సింహాలు..! అంటే వారంరోజులుగా కిటికీ వద్ద తాను చూసింది సింహాల కళ్లా? దేవుడా.. వీళ్లు చంపుతారనుకుంటే ఇప్పుడు సింహాల చేతిలో చావాలా? అనుకుంటూ కళ్లు మూసుకుంది పోలీ. సింహాలను చూసిన లస్సీ, అతని మిత్రులకు పైప్రాణాలు పైనే పోయాయి. పోలీ మూర్చపోయింది. లస్సీతోపాటు ఆరుగురు మిత్రబృందంపై సింహాలు పంజాలతో విరుచుకుపడ్డాయి. ఆ దెబ్బలకు వాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు మాత్రం అరుస్తూ గ్రామంవైపు పరుగులు తీశారు. పోలీ కోసం వెదుకుతున్న పోలీసులకు వీరు ఎదురుపడ్డారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గుడిసె వద్దకు పరుగున వచ్చారు. ఆ దృశ్యాన్ని చూసి తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. పోలీ చుట్టూ మూడు సింహాలు కాపలాగా కూర్చున్నాయి. పోలీసులు రాగానే.. లేచి నెమ్మదిగా పొదల్లోకి వెళ్లిపోయాయి. అప్పుడు బాలిక వైపు అడుగేశాడు గాలింపు బృందానికి నేతృత్వం వహిస్తున్న సార్జెంట్ వాంటమ్. విచిత్రమేంటంటే.. సింహాల దాడిలో గాయపడ్డ నిందితులెవరూ మరణించలేదు. బాలికను సింహాలు రక్షించాయన్న వార్త దేశమంతా దావానలంలా వ్యాపించింది. పోలీ గురించి జనం కథలు కథలుగా చెప్పుకోసాగారు. కొందరు ఆమెకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని ప్రచారం మొదలు పెట్టారు. బీబీసీ కూడా ఈఘటనపై ప్రత్యేక కార్యక్రమం చేయడంతో పోలీని చూసేందుకు జనం, మీడియా వివిధ దేశాల నుంచి ఆమె ఇంటి ముందు వాలిపోయేవారు. ఈ గోల భరించలేక పోలీ కుటుంబం మరో ఊరికి వలస వెళ్లి రహస్యజీవనం గడపసాగింది. ఈ సంఘటన ప్రముఖ జంతుశాస్త్రవేత్త డాక్టర్ సిన్పూర్ దృష్టిని ఆకర్షించింది. ఇందులో నిజమెంతో తేల్చుకోవాలని 2008లో ఆమె ఇథియోపియాకు వచ్చింది. నానా కష్టాలు పడి పోలీని, సార్జెంట్ వాంటమ్ను కలుసుకుంది. వారితో మరోసారి అడవికి వెళ్లింది. ఆకాశం నుంచి ఊడిపడ్డట్లుగా ఆ సింహాల మంద వారి ముందు ప్రత్యక్షమైంది. ఊహించని పరిణామంతో డాక్టర్ సిన్పూర్, సార్జంట్ భయపడిపోయారు. పోలీ కూడా మరోసారి వీరితో వచ్చి తప్పు చేశాననుకుంది. సింహాలు దగ్గరకు రాసాగాయి. కదలకుండా నిల్చున్నారు ముగ్గురూ. వారి వద్దకు వచ్చిన సింహం పోలీని ప్రేమగా నాలికతో తడిమి మళ్లీ అడవిలోకి వెళ్లింది. -
హ్యాపీ బర్త్ డే 'లయన్స్'
హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులోని ఏషియాటిక్ లయన్స్ (హరీష్, హారిక, హర్షిత) ల మొదటి జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. చీఫ్ కన్జర్వేటర్ ఆధ్వర్యంలో జూలో కేక్ కట్ చేసి వేడుక చేశారు. ఈ వేడుకల్లో క్యూరేటర్ గోపిరవి, యానిమల్ కీపర్లు, వెటర్నరీ సెక్షన్ విభాగం వైద్యులు పాల్గొన్నారు. -
ఆస్తుల స్తంభనతో పదివేల మొసళ్ల ఆకలి కేకలు
సాన్ మాన్యుయెల్: హోండురస్ లోని ఓ ఫార్మ్ లో ఉన్న 10వేలకుపైగా మొసళ్లు ఆకలితో అలమటిస్తున్నాయి. హోండురస్ వ్యాపార దిగ్గజం ఆస్తులను అమెరికా స్తంభింపజేయడంతో.. ఆయనకు చెందిన ఆ ఫార్మ్ లోని మొసళ్ల సంరక్షణ చూసుకునేవారు కరువయ్యారు. దీంతో రోజుకొక మొసలి ఆకలితో ప్రాణాలు విడుస్తున్నది. సాన్ మాన్యుయెల్ నగరంలోని 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొకొడ్రిలస్ కాంటినెంటల్ లో మొసళ్లతోపాటు, ఏడు సింహాలు కూడా ఉన్నాయి. గత రెండువారాలుగా వీటిని ఆహారం అందించేవారు లేకపోవడంతో మొసళ్లు, సింహాలు చనిపోయాయని, మొత్తం 40కిపైగా జంతువులు మృత్యువాత పడ్డాయని ఈ ఫార్మ్‌హౌస్ కు వాచ్‌మేన్ గా ఉంటున్న ఓ వ్యక్తి తెలిపాడు. మధ్య అమెరికాలోని హోండురస్ దేశంలో అత్యంత శక్తిమంతమైన వ్యాపారవేత్త రోసెన్థల్ కుటుంబానికి చెందిన ఫార్మ్‌హౌస్ ఇది. బ్యాంకింగ్, మీడియా, రియల్ ఎస్టేట్, పర్యాటకం, స్టాక్ ఎక్స్చేంజ్, వ్యవసాయం వంటి రంగాల్లో రోసెన్థల్ కుటుంబం భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే ఇటీవల మనీ లాండరింగ్, డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నదంటూ ఈ కుటుంబ ఆస్తులను అమెరికా స్తంభించింది. అమెరికాలో వ్యాపారాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించింది. దాంతో రోసెన్థల్ నేతృత్వంలోని బాంకో కాంటినెంటల్ దారుణంగా దెబ్బతిన్నది. దాని అధిపతి యాంకెల్ రోసెన్థల్ అరెస్టు అయ్యారు. ఈ పరిణామంతో రోసెన్థల్ కుటుంబం ఆధ్వర్యంలోని కొకొడ్రిలస్ కాంటినెంటల్ ఫార్మ్‌హౌస్ పై తీవ్ర ప్రభావం పండింది. దీని గురించి రోసెన్థల్ కుటుంబం పట్టించుకోవడం మానివేయడం, జంతువులకు ఆహారం కోసం నిధులు లేకపోవడంతో ఇక్కడున్న మొసళ్లు, సింహాలు, ఇతర జంతువులు ఆకలితో అలమటించే చనిపోయేదశకు చేరుకుంటున్నాయి. -
వీధుల్లో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు
బిలిసి: జార్జియా క్యాపిటల్ నగరం ప్రజలు వణికి పోతున్నారు. అక్కడి జూపార్క్లలోని సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, ఖడ్గమృగాలు, మొసళ్లు తప్పించుకొని వీధుల్లో విహరిస్తుండటంతో బిక్కుబిక్కుమంటున్నారు. గత కొద్ది రోజులుగా అక్కడ విపరీతమైన వరదలు వస్తున్నాయి. ఈ వరదల ప్రభావం జూ పార్క్ లపై కూడా పడి ఆ జంతువులన్నీ తప్పించుకున్నాయి. సింహాలు, పులులు, మొసళ్లు, ఖడ్గ మృగాలు, ఇతర జంతువులు ఇప్పుడు వీధుల్లో దర్శనమిస్తున్నాయి. దీంతో వీటిని తిరిగి బందించేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే వరదల కారణంగా ఆ పట్టణంలో పదిమందికి పైగా ప్రాణాలుకోల్పోవడంతోపాటు పరిస్థితులు అస్తవ్యస్తంగా మారడంతో అధికారులు తీరిక లేకుండా ఉన్నారు. తాజాగా జూ పార్క్ లలో జంతువులు కూడా పారిపోవడంతో అటూ సహాయ చర్యలు చూడలేక, మరోపక్క జంతువులను బందించలేక వారి తల ప్రాణంతోకకొచ్చిన పరిస్థితి ఎదురవుతోందట. ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వరదల కారణంగా చాలా జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. -
సీన్ రివర్సైంది.. పరిగెత్తరో
దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్కు.. మధ్యాహ్నం.. లంచ్ టైం.. డొక్క మాడుతుండటంతో రెండు సింహాలు (ఫొటోలో ఒకటే కనిపిస్తోంది) వేటకు బయల్దేరాయి. దారిలో బాగా బలిసిన అడవి దున్నలు కనిపించాయి. ఒకదాన్ని పట్టుకున్నా.. రెండ్రోజులు ఫుడ్ గురించి చూసుకోనక్కర్లేదు అనుకున్నాయి. వేటకు రెడీ అయ్యాయి. అమాంతం ఓ దున్నపై పడ్డాయి. కానీ సీన్ రివర్సైంది. ఆ దున్న వాటిని ఫుట్‌బాల్ తన్నినట్లు తన్నింది. ఇంకేముంది.. సింహాలకు సీన్ అర్థమైంది. ఈగోను పక్కనపెట్టి.. ఇలా కాళ్లకు పని చెప్పాయి. -
'పులులు, సింహాలనూ పెంచుకోనివ్వండి'
క్రూర జంతువుల సంతతిని పెంచేందుకు వాటిని పెంపుడు జంతువులుగా పెంచుకునేందుకు చట్టాలు ప్రజలకు ఇవ్వాలని మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ మంత్రి వింత ప్రతిపాదన చేశారు. దేశంలో పులులు, సింహాల సంఖ్య రోజురోజుకూ తగ్గుతున్నందున వాటిని సంరక్షించుకుంటూ వాటి సంతతిని వృద్ధి చేసేందుకు పెట్స్‌గా పెంచుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. మధ్యప్రదేశ్ లో యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా కుసుమ్ మెదాలే పనిచేస్తున్నారు. ఆఫ్రికా, దక్షిణాసియాలోని థాయిలాండ్ వంటి దేశాల్లో క్రూర మృగాలను పెట్స్‌గా పెంచుకునేలా చట్టాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఈ మేరకు మన చట్టంలో కూడా మార్పులు తీసుకురావాలని కుసుమ్ మెదాలే అటవీశాఖకు లేఖలు రాయటం విశేషం. -
ఇక్కడా అంతే!
నగరంలోని జూలోనూ భద్రత అంతంతే తక్కువ ఎత్తులోనే పులుల ఎన్క్లోజర్లు పైకి ఎక్కుతున్న సందర్శకులు పట్టించుకోని జూ సిబ్బంది ఢిల్లీ సంఘటనతోనైనా మేలుకోని వైనం బహదూర్‌పురా: సందర్శకులు చేష్టలుడిగి చూస్తుండగా... వారి కళ్ల ముందే ఓ వ్యక్తిని పులి పొట్టన పెట్టుకున్న విషాద సంఘటనకు మంగళవారం ఢిల్లీలోని జూ వేదికైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో జంతు ప్రదర్శన శాలల్లో భద్రతపై సందేహాలు ముసురుకుంటున్నాయి. నిత్యం వందలాది మంది సందర్శకులు వచ్చే నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులోని పులులు, సింహాల ఎన్క్లోజర్ల దగ్గర పరిస్థితి ఢిల్లీకి భిన్నంగా ఏమీ లేదు. వీటి చుట్టూ ప్రస్తుతం ఉన్న ఇనుప కంచెల ఎత్తు తక్కువగా ఉండటంతో సందర్శకులు అప్పుడప్పుడు వాటిపైకి ఎక్కి కౄరమృగాలను తిలకిస్తున్నారు. ఇది ప్రమాదమని తెలిసినప్పటికీ... జంతువులను దగ్గరగా చూడాలనే ఆతృతతో జాగ్రత్తలను పాటించడం లేదు. దీంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. నెహ్రూ జూలాజికల్ పార్కులో గతంలో ఓ సందర్శకుడు పులి ఎన్‌క్లోజర్ జాలీ నుంచి ఆహారాన్ని తినిపించేందుకు ప్రయత్నించగా... అతని చేతిని అది పూర్తిగా కోరికేసింది.ఇలాంటి సంఘటనల గురించి తెలిసినప్పటికీ... సందర్శకులు మేలుకోవడం లేదు. ఎన్క్లోజర్ల వద్ద వన్యప్రాణులకు బయటి ఆహారాన్ని అందించటం...రాళ్లు విసరటం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. నెహ్రూ జూలాజికల్ పార్కులోని సింహాలు, పులుల ఎన్క్లోజర్ల పరిస్థితిని బుధవారం ‘సాక్షి’ పరిశీలించగా... అదే తరహా దృశ్యాలు కనిపించాయి. తెల్ల పులుల ఎన్‌క్లోజర్ వద్ద ఇనుప తీగెలతో చేసిన కంచె సగం వరకే ఉంది. కొందరు సందర్శకులు ఈ కంచె పైకి ఎక్కుతూ... పులులను చూస్తూ కేరింతలు కొడుతున్నారు. ఢిల్లీలోని సంఘటన ఇక్కడి జూ అధికారులను కదిలించినట్టు లేదు. ఇనుప కంచెల పైకి ఎవరూ ఎక్కకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించలేదు. చిన్నారులు ఇనుప కంచెల మీదకు వెళుతున్నా... జూ యానిమల్ కీపర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాయల్ బెంగాల్ ఎల్లో టైగర్ ఎన్‌క్లోజర్ వద్ద మోకాళ్ల ఎత్తు వరకే ఇనుప కంచె ఉంది. అక్కడ చిన్నారులను తల్లిదండ్రులు ఇనుప కంచెపై నిలబెట్టి పులులను చూపిస్తున్నారు. సింహాల ఎన్‌క్లోజర్ వద్ద తక్కువ ఎత్తున్న ఇనుప రాడ్లపైకి చిన్నారులతో పాటు పెద్దలు ఎక్కుతూ మృగరాజులను తిలకిస్తూ కనిపించారు. అలా ఎక్కకూడదంటూ యానిమల్ కీపర్లు, సెక్యూరిటీ సిబ్బంది వారిని వారించారు. పులులు, సింహాల ఎన్క్లోజర్ల వద్ద కంచె ఎత్తును పెంచితేనే ఢిల్లీలాంటి సంఘటనలను నివారించవచ్చు. పులులు, సింహాలకు బయటి ఆహారాన్ని తినిపించేందుకు చేతులను ఎన్‌క్లోజర్‌కు చాపుతూ ఆహారాన్ని విసరడం వంటివి సందర్శకులు చేస్తున్నారు. దీన్ని కూడా నిరోధించాల్సిన అవసరాన్ని జూ అధికారులు, సిబ్బంది గుర్తించాలి. -
ఆసియాలోనే అతిపెద్ద రెండో జూ పార్కు
-
జిరాఫీని కాల్చి చంపిన జూ సిబ్బంది
-
ఆగ్రహమేల నోయి సింహా..!
దక్షిణాఫ్రికా సఫారీల్లో కొందరు సంచారులుంటారు. బాహ్యప్రపంచాన్ని పూర్తిగా మరచి జంతువుల జీవన శైలిని పరిశీలించడంలో, వాటి భావోద్వేగాలను క్లిక్‌మనిపించడంలో మునిగి తేలుతుంటారు వీళ్లు. ఇలాంటి వారిలో ఒక ప్రముఖుడు బ్రెండన్ జెన్నింగ్స్. సింహాల జీవనశైలి గురించి అధ్యయనం చేస్తూ, వాటి లైఫ్ స్టైల్‌ను ఫోటోలుగా మలిచే జెన్నింగ్స్‌కు ఇటీవల ఒక ఆసక్తికరమైన సీన్ కనపడింది. తను చాలా రోజులుగా గమనిస్తున్న ఒక ఆడసింహం, మగ సింహం గొడవపడుతున్న దృశ్యాన్ని గమనించాడు. ఆలస్యం చేయక తన కెమెరాకు పని చెప్పాడు. అడవికి రారాజైన సింహం తన పార్ట్నర్తో గొడవ పడుతున్న దృశ్యాన్ని కళ్లకు కట్టాడు జెన్నింగ్స్. సింహాల సంసారంలో అప్పుడప్పుడు ఇలాంటి అలకలు, గొడవలు మామూలేనని జెన్సింగ్‌స వ్యాఖ్యానించాడు. -
అరణ్యం: సింహాలు దొంగతనం చేస్తాయా!
మగ సింహాలు పదడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. 150 నుండి 250 కిలోల బరువుంటాయి. ఆడ సింహాలు తొమ్మిది అడుగుల వరకూ పెరుగుతాయి. 120 నుండి 200 కిలోల బరువుంటాయి! సింహం కూనను వెల్ప్ లేక లయొనెట్ అంటారు! సింహం గాండ్రింపు 8 కిలోమీటర్ల వరకూ వినిపిస్తుంది! మగ సింహం రోజుకు 7 కిలోల మాంసం తింటే, ఆడ సింహం 5 కిలోలు తింటుంది. అందుకే ఎక్కువగా జీబ్రా, జిరాఫీల్లాంటి పెద్ద జంతువులనే వేటాడతాయివి! ఇవి రోజులో పదహారు నుంచి ఇరవై గంటల పాటు విశ్రాంతి తీసుకుంటాయి. అంతేకాదు... మగ సింహాలకు వేటాడటానిక్కూడా బద్దకమే. పైగా వాటి కంటే ఆడ సింహాలే వేటలో చురుగ్గా ఉంటాయి. అందుకే ఆహార సేకరణ బాధ్యత వాటిదే. కానీ వేటాడి తెచ్చినదాన్ని ముందు మగ సింహాలు తిన్నాకే ఆడవి తింటాయి! ఆహారం దొరకనప్పుడు ఇవేం చేస్తాయో తెలుసా? చిరుతలు, హైనాలు వేటాడిన జంతువులను దొంగిలిస్తాయి! ఆడ సింహాలకు జాలి ఎక్కువ. ఒకవేళ ఏ సింహం కూన అయినా తప్పిపోయి తమ దగ్గరకు వస్తే... వాటికి కూడా తమ పిల్లలతో పాటే పాలిచ్చి పెంచుతాయి! సింహాలు నీళ్లు తాగకుండా నాలుగైదు రోజుల పాటు ఉండగలవు! సింహాల గుంపును ప్రైడ్ అంటారు. ప్రతి గుంపులో పదిహేను నుంచి నలభై వరకూ ఉంటాయి. ఆడ సింహాలు వేటకెళ్తే, మగవి పిల్లలను చూసుకుంటూ ఉంటాయి. అయితే ప్రతి సింహం రెండేళ్ల పాటు మాత్రమే తన గుంపునకు లీడర్‌గా ఉంటుంది. ఆ తరువాత వేరేది లీడర్ అవుతుంది! అందంగా ఉందని దగ్గరకెళ్లారో... అంతే! చూడగానే నెమలిలా అనిపిస్తుంది. కాస్త పరిశీలిస్తే కోడిలాగా కనిపిస్తుంది. కానీ ఇది నె మలి కాదు. కోడి అంతకన్నా కాదు. దీని పేరు హాట్జిన్. దక్షిణ అమెరికాలోని ఉష్ణప్రాంతాల్లో కనిపించే ఒక పక్షి! హాట్జిన్ల దగ్గరకు వెళ్తే అంతే సంగతులు. ఎందుకంటే, వాటి దగ్గర విపరీతమైన బురద వాసనలాంటిది వస్తుంది. ఆ వాసనకు కారణం... జీర్ణక్రియలోని లోపమే. హాట్జిన్లకు జీర్ణశక్తి తక్కువ. అందుకే గట్టిగా ఉండేవాటిని ముట్టుకోవు. ఆకులు, పూలు తింటాయి. ఆహారం జీర్ణమయ్యే క్రమంలో వాటి శరీరంలో ఒక రసాయనం విడుదలవుతుందట. దాని కారణంగానే ఇలాంటి వాసన వస్తుందని కనిపెట్టారు పరిశోధకులు. హాట్జిన్లు పొడవడం, రక్కడం చేయవు. కారణం వీటికి కొన్ని బలహీనతలుండటమే. ఇవి సరిగ్గా ఎగరలేవు. అన్ని రంగుల్నీ గుర్తించలేవు. నీరసంగా, డల్‌గా ఉంటాయి. అందుకే వీటినెవరూ పెంచుకోవడానికి ఇష్టపడరు. బ్రెజిల్లో కొన్ని చోట్ల హాట్జిన్ల గుడ్లను తింటారు. నిజానికి అవి కూడా ఒకలాంటి వాసన వస్తాయట. కానీ రుచి బాగుంటుందట. కానీ వీటి మాంసాన్ని మాత్రం ముట్టరు!