దోషులెవరో తేలిపోయింది..
హంతకుల గుట్టురట్టయింది.
ఆరుగురిని చంపిన కేసులో మూడు సింహాలకు జైలు శిక్ష పడింది!!
గుజరాత్‌లోని గిర్ జాతీయ పార్కుకు సమీపంలోని గ్రామాలకు చెందిన ఆరుగురిని సింహాలు చంపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డౌట్ ఉన్న 18 సింహాలను జూ అధికారులు అదుపులోకి తీసుకుని.. వాటి పాదముద్రల నమూనాలు తీసుకున్నారు. చివరికి మూడు సింహాలను దోషులుగా తేల్చారు.
ఇందులో ఒక మగ సింహం, రెండు ఆడసింహాలు ఉన్నాయి. ప్రధాన దోషి మగ సింహమేనని.. అది పలుమార్లు చేసిన దాడుల్లో ఆరుగురిని చంపేసిందని జూ అధికారులు తెలిపారు. ఆడ సింహాలు ఈ నేరంలో పాలుపంచుకున్నాయని.. మగ సింహం తినేసి వదిలేసిన మృతదేహాలను అవీ తిన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మగ సింహాన్ని జూకు తరలించి.. బోనులో బంధించారు. ఆడ సింహాలను రెస్క్యూ సెంటర్‌కు తరలించారు. నిర్దోషులుగా తేలిన మిగిలిన సింహాలను పార్కులోకి వదిలి స్వేచ్ఛను ప్రసాదించారు.