సింహాల కొట్లాట చూశారా? | Viral Video: Fight Between Lion, Lioness Gives Best Husband Wife Jokes | Sakshi
Sakshi News home page

ఆలూమ‌గ‌లు కొట్టుకున్న‌ట్లే ఉందిగా..

Published Sun, Jul 26 2020 2:25 PM | Last Updated on Sun, Jul 26 2020 4:05 PM

Viral Video: Fight Between Lion, Lioness Gives Best Husband Wife Jokes - Sakshi

గాంధీ నగర్: కొన్ని జంటలు అంద‌రిముందు అన్యోన్యంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తాయే కానీ, ఇంట్లో మాత్రం ఒక‌రినొక‌రు త‌న్నుకు చ‌స్తారు. రెండు సింహాలు అచ్చంగా కొంతమంది భార్యా భ‌ర్త‌ల్లాగే కొట్టుకు చ‌స్తున్నాయి. గుజ‌రాత్‌లోని గిర్ అభ‌యార‌ణ్యంలో ఓ ఆడ సింహం, మగ సింహం రోడ్డుపై నిల‌బ‌డి ఎదురెదురుగా త‌ల‌ప‌డ్డాయి. సింహం గ‌ర్జిస్తూ ముందుకు వ‌స్తుంటే మ‌రొక‌టి దాని వైపు కోపంగా చూస్తూ ఒక్క‌టివ్వ‌బోయింది. కానీ ఎదురుగా ఉన్న‌ది ఎంతకూ త‌గ్గలేదు. దాని దూకుడును చూసి వేగ‌లేన‌నుకుందో, ఎందుకొచ్చిన గొడ‌వ‌లే అనుకుందో ఏమో కానీ ఈ సింహం సైలెంట్‌గా ప‌క్క‌కు త‌ప్పుకుంది. (ఇలా ఏ తండ్రీ చెప్ప‌డు!)

ఈ పోరాటాన్ని వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్ జుబీన్ ఆశ‌ర కెమెరాలో బంధించారు. వైల్డ్ ఇండియా ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. 22 సెక‌న్ల నిడివి ఉన్న ఈ పోరాట స‌న్నివేశాన్ని చూసి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. "ఆలూమ‌గ‌లు కొట్టుకున్న‌ట్లే ఉందిగా.." అంటూ ఛ‌లోక్తులు విసురుతున్నారు. 'కొత్తిమీర క‌ట్ట మ‌ర్చిపోయి ఇంటికెళ్తే భార్య అలాగే అరుస్తుంది' అంటూ కొంద‌రు భార్యాబాధితులు త‌మ గోడు వెల్ల‌బోసుకుంటున్నారు. 'మ‌నుషుల్లో ఐనా, జంతువుల్లో ఐనా ఆడ‌వాళ్లే గ‌ర్జిస్తారు' అని కొంద‌రు మ‌హిళ‌లు రాసుకొచ్చారు. (భ‌ర్త‌కు విడాకులు, కొడుకుతో పెళ్లి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement