lioness
-
14 సింహాలు వెంటపడినా జడవలేదు.. ఒంటరైనా బెదరలేదు!
ఒకటి రెండు సింహాలు ఉంటేనే మిగిలిన జంతువులు హడలిపోతాయి. అలాంటిది ఒంటరిగా ఉన్నప్పుడు పదికిపైగా సింహాలు ఒక్కసారిగా వెంటపడితే అంతే ఇక.. వాటికి ఆహారమైపోయినట్లేనని భావించాల్సిందే. అయితే.. తనను వేటాడేందుకు 14 ఆడ సింహాలు వెంటపడుతున్నా జవలేదు ఓ గజరాజు. ఒంటరిగా ఉన్న బెదరకుండా వాటి బారి నుంచి తప్పించుకుంది. సింహాలను గజరాజు ఏవిధంగా ఎదిరించిందనే విషయాన్ని చెబుతూ ఆ దృశ్యాలను అటవీ శాఖ అధికారి సుశాంత నందా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఒంటరిగా ఉన్న ఏనుగును 14 ఆడ సింహాలు వేటాడేందుకు ప్రయత్నించినా.. వాటిపై గెలిచింది. ఇక్కడ అడవికి రాజు ఎవరు అని ఊహిస్తున్నారు?’ అని రాసుకొచ్చారు. వీడియోలో.. ఓ నదిలోకి నీళ్లు తాగేందుకు వచ్చిన గజరాజుపై దాడి చేశాయి సింహాలు. ఓ సింహం దానిపైకి ఎక్కి అధిమిపట్టే ప్రయత్నం చేయగా.. మిగిలినవి కాళ్లు, ఇతర భాగాలను నోట కరిచేందుకు యత్నించాయి. వాటిబారి నుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసింది ఏనుగు. కాళ్లతో తంతూ తొండంతో కొడుతూ చెదరగొట్టింది. అయినా.. అవి వెనక్కి తగ్గకపోవటంతో నీటిలోకి వెళ్లింది. కొంత దూరం వరకు వెళ్లిన సింహాలు.. ఇక ఏనుగు తమకు చిక్కదని భావించి వెనుదిరిగాయి. Lone tusker takes on 14 lionesses & wins… Who should be than king of forest ? Via Clement Ben pic.twitter.com/kYbZNvabFv — Susanta Nanda IFS (@susantananda3) August 27, 2022 ఇదీ చదవండి: పొలంలో నిద్రిస్తున్న మహిళపైకి నాగుపాము.. ఎలా తప్పించుకుందంటే? -
Lioness: కేర్ టేకర్‌పై జంప్ చేసిన సివంగి.. కానీ
కెప్టౌన్: సాధారణంగా మనలో చాలా మంది.. సాధు జంతువులను ఇంట్లో పెంచుకోవడం మనకు తెలిసిందే. అయితే, కొందరు మాత్రం అరుదుగా సింహలు, పులులు వంటి క్రూర మృగాలను కూడా మచ్చిక చేసుకొని పెంచుకుంటుంటారు. అయితే, చిన్నతనం నుంచి పెంచుకోవడం వలన క్రూర జంతువులు కూడా వాటి సహజ క్రూర స్వభావాన్ని మరిచి, యజమానులతో ప్రేమగా ఉంటాయి. ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. సౌత్ ఆఫ్రికా కలహరి ఎడారిలో బొట్సావాన అనే ప్రదేశం ఉంది. అక్కడ వాల్ గ్రూనెర్ అనే వ్యక్తి చిన్నతనం నుంచి ఒక సివంగిని పెంచుకుంటున్నాడు. దాన్ని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంటాడు. ప్రస్తుతం సివంగికి 9 ఏళ్లు. సివంగి కూడా.. తన యజమాని పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటుంది. వాల్, సివంగితో కూడిన అనేక ఫోటోలను తరచుగా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా, ‘సిర్గది లయనీస్’ అనే ఇన్‌స్టాలో వీరి వీడియోను షేర్ చేశాడు. దానిలో వాల్ గ్రూనెర్.. బోనులో ఉన్న సివంగి వద్దకు చేరుకొని ఒక్కసారిగా కేజ్‌ను తొలగించాడు. అప్పుడు సివంగి గాండ్రిస్తూ తన యజమాని పట్ల ప్రేమతో వెంటనే దూకి అతడిని కిందపడేస్తుంది. ఆ తర్వాత తోక ఊపుకుంటూ.. ప్రేమతో నాకుతూ.. తన యజమాని పక్కన కూర్చుంటుంది. ఈ వీడియోను పూర్తిగా చూడని వారు సివంగి వ్యక్తిపై దాడి చేసిందని పోరబడుతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. సివంగి దాడి చేసిందనుకున్నాం..’, ‘భలే జంప్ చేసిందే..’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Sirga (@sirgathelioness) -
షాకింగ్: కరోనాతో మరో సింహం మృతి
చెన్నై: కరోనా మహమ్మారి మనుషులనే కాదు జంతువులను సైతం వీడటం లేదు. కోవిడ్‌తో ఇటీవల(జూన్3) తమిళనాడులోని అరిగ్నర్ అన్నా జూపార్క్‌లో ఓ మగ సింహం(నీలా) చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా చెన్నైలోని అదే జూలో బుధవారం ఉదయం 10.15 నిమిషాల సమయంలో మరో సింహం మరణించిందని జూ అధికారులు తెలిపారు. పద్మనాథన్ అని పిలవబడే ఈ సింహం వయస్సు 12 ఏళ్లు. జూన్ 3న ఈ సింహం శాంపిల్స్‌ను భోపాల్‌లోని వైరాలజీ ఇన్స్ టిట్యూట్ కి పంపగా అప్పుడే దీనికి పాజిటివ్ అని నిర్ధారించారని చెప్పారు. కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో సింహానికి ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అందించామని జూ అధికారులు పేర్కొన్నారు. దీనిని రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేకపోయిందని వారు తెలిపారు. కాగా ఇక్కడి సఫారీ పార్కులో ఉన్న మిగతా 5 సింహాలు తరచూ దగ్గుతున్నాయి. గత మే 26 నుంచి అనారోగ్యానంతో ఉన్న వీటి పట్ల కూడా వెటర్నరీ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గత ఆదివారం సీఎం ఎం.కె. స్టాలిన్ ఈ జూను సందర్శించి ఇక్కడి జంతువుల పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యంగా సింహాల ట్రీట్ మెంట్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని,వాటి వైద్య చికిత్సలో ఎలాంటి లోపం కలగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. కానీ తాము ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇవి అనారోగ్యం బారిన పడుతున్నాయని అధికారులు వాపోతున్నారు. చదవండి: అలాంటి సొమ్ము నాకొద్దు; ఏకంగా 14 కోట్లు తిరస్కరించిన యువతి కరోనా వైరస్‌తో సివంగి మృతి -
కరోనా వైరస్‌తో సివంగి మృతి
చెన్నై : కరోనా వైరస్ కారణంగా ఓ తొమ్మిదేళ్ల సివంగి మృత్యువాతపడింది. చెన్నైలోని అరిగ్నర్ అన్నా జూలాజికల్ పార్కులో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. జూలోని నీలా అనే సివంగికి కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. మొదట లక్షణాలు లేకపోయినప్పటికి ఆ తర్వాత సివంగి ముక్కులోంచి స్రావాలు రావటంతో చికిత్స మొదలుపెట్టారు. చికిత్స పొందుతున్న సదరు సివంగి గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మృతి చెందింది. జూ ఎన్‌క్లోజర్‌లోని ఐదు, సఫారీ పార్కులోని ఒక సింహం కరోనా లక్షణాలు కలిగి ఉండటంతో మొత్తం 11 సింహాలకు పరీక్షలు నిర్వహించారు. వీటిలో తొమ్మిది సింహాల కరోనా శాంపిళ్లను భోపాల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ డిసీజ్‌కు పంపారు. దీనిపై జూ అధికారి మాట్లాడుతూ.. ‘‘ కరోనా సోకిన సింహాలకు తమిళనాడు వెటర్నరీ అండ్ సైన్స్ యూనివర్శిటీ కోఆర్డినేషన్‌తో జూ వెటర్నరీ బృందం చికిత్స అందిస్తోంది. మరో సింహంతో పాటు అన్ని పులులకు టెస్టులు నిర్వహించి శాంపిళ్లను భోపాల్ పంపాము. మృతి చెందిన సివంగికి కరోనా వచ్చిందా లేదా అన్న సంగతి ధ్రువీకరించుకోవటానికి మరో సారి పరీక్ష నిర్వహించి, శాంపిళ్లను ల్యాబ్‌కు పంపాము’’ అని తెలిపారు. -
ఒక్కసారిగా మీదకు దూకిన శివంగి.. పరుగులు తీసిన జనం
మాస్కో: సర్కస్‌లో ఓ ఆడ సింహం శిక్షకుడిపై దాడి చేసింది. అతడి కాళ్లు, చేతులను కొరుకుతూ ఉగ్రరూపం ప్రదర్శించింది. దీంతో సర్కస్ చూడటానికి వచ్చిన వాళ్లంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన రష్యాలో శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎంతైనా జంతువులు జంతువులే! ఆ శివంగి పేరు వేగ. మరో ఆడ సింహం సాంటాతో అప్పటికే కొట్లాటకు దిగిన వేగ.. కోపంతో ఊగిపోతూ శిక్షకుడు మాక్సిం ఓర్లోవ్పై దూకింది. అతడు ఎంతగా వారిస్తున్నా వెనక్కి తగ్గలేదు సరికదా.. కాళ్లు, చేతులు కొరుకుతూ చుక్కలు చూపించింది. ఎలాగోలా దాని బారి నుంచి తప్పించుకున్న మాక్సిం ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గురించి అతడు మాట్లాడుతూ... ‘‘ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. నిజానికి వేగ చిన్నప్పటి నుంచే దూకుడుగా ఉండేది. తనకు ఇప్పుడు ఐదేళ్లు. వేగను అదుపు చేయడం కాస్త కష్టమే. ఎంతైనా జంతువులు.. జంతువులే కదా. ఇకపై వేగతో సర్కస్ చేయించబోం. జూ అధికారులతో మాట్లాడి తన స్థానంలో మరో సింహం పిల్లను తీసుకువస్తాం’ అని చెప్పుకొచ్చాడు. కాగా రెండేళ్ల క్రితం ఉక్రెయిన్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. చదవండి: వైరల్: అతడి చర్మాన్ని లాగితే మామూలుగా ఉండదు -
వైరల్: మృగాళ్ల బారి నుంచి బాలికను కాపాడిన సింహాలు
అడ్డిస్బాబా: బుద్ధి, జ్ఞానం విచక్షణా శక్తి ఉన్న మనుషులు మృగాళ్లలా మారినా వేళ.. నోరు లేని మూగ జీవాలు మానవత్వం చూపాయి. ఓ చిన్నారి జీవితాన్ని నాశనం చేయడననికి ప్రయత్నించిన మృగాళ్ల బారీ నుంచి మృగరాజుల కాపాడాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఫ్రికా ఖండం, ఇథోపియా దేశ రాజధాని అడ్డిస్ బాబా అనే ప్రాంతంలో 12 ఏళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. తన కుమార్తె కనిపించడం లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. మరోవైపు కిడ్నాపర్లు బాలికను చిత్రహింసలకు గురిచేశారు. లైంగికంగా వేధించి బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించగా, బాలిక కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని స్థానికంగా ఉన్న ఓ అడవిలోకి వెళ్లింది. చిన్నారి జాడ కోసం కిడ్నాపర్లు అడవిలోకి వెళ్లారు. అలా సగం దూరం అడవిలోకి వెళ్లిన బాలికకు సింహాలు అండగా నిలిచాయి. ఓ చెట్టుకింద 3 సింహాలు కిడ్నాపర్ల నుంచి రక్షించేందుకు బాధితురాల్ని రౌండప్ చేశాయి. దీంతో కిడ్నాపర్లు గుండెల్ని అరచేతిలో పెట్టుకొని బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పరారయ్యారు. కాగా గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేపట్టారు. విచారణలో చిన్నారి సురక్షితంగా ఉందని, ఆమెను సింహాలు కాపాల కాస్తున్నాయని చెప్పారు. దాంతో షాక్ తిన్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఘటనస్థలానికి వెళ్లారు. అక్కడ తీవ్రగాయాలతో షాక్‌కు గురైన చిన్నారిని అక్కున చేర్చుకొని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్పృహలోకి వచ్చిన చిన్నారి అడవిలో జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు సింహాలపై ప్రశంసల వర్షం కురిపించారు. కిడ్నాప్‌కు పాల్పడిన నిందితుల్ని కటకటల్లోకి నెట్టారు. సింహాలు బాలికను రక్షించకపోయి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని అటవీ శాఖ అధికారి వెండాజు తెలిపారు. ఈ ప్రాంతంలో చిన్నారులపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతాయి. లైంగిక దాడుల అనంతరం బలవంతంగా పెళ్లిచేసుకుంటారు. ఒప్పుకోలేదంటే ప్రాణాలు తీసి పైశాచికానందం పొందుతారని ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: నెల రోజుల్లో భార్యకు 3 సార్లు విడాకులిచ్చి.. -
తెల్ల సివంగులతో మార్నింగ్ వాక్ చేస్తుండగా..
కేప్‌టౌన్ : పెంపుడు తెల్ల సివంగుల దాడిలో వాటి యజమాని మృతి చెందిన ఘటన దక్షిణాఫ్రికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ వన్యమృగాల సంరక్షకుడు వెస్ట్ మ్యాథ్యూసన్(65) సివంగులు పిల్లలుగా ఉన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా వాటిని పెంచుతున్నాడు. బుధవారం ఉదయం సివంగులతో కలిసి ఆయన మార్నింగ్ వాక్కు వెళ్లారు. వాకింగ్ చేస్తుండగా హఠాత్తుగా ఓ సివంగి ఆయనపై పడి దాడి చేయటం మొదలుపెట్టింది. అనంతరం మరో సివంగి కూడా దాడికి దిగింది. ( పులిని చంపి, కాళ్లు అపహరణ ) ఆ సమయంలో మ్యాథ్యూతో పాటు ఉన్న ఆయన భార్య సివంగుల నుంచి భర్తను రక్షించటానికి శతవిధాలా ప్రయత్నించింది. అయినప్పటికి లాభం లేకపోయింది. దీంతో పెంపుడు సివంగుల చేతిలోనే ఆయన ప్రాణం కోల్పోయారు. ఈ నేపథ్యంలో మ్యాథ్యూ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆ రెండు తెల్ల సివంగులను సంరక్షకుడి ఇంటినుంచి వేరే ప్రాంతానికి తరలించారు అధికారులు. వాటి భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. (రెండు పులులు కొట్లాట.. వీడియో వైరల్) -
వైరల్ వీడియో: సింహాల కొట్లాట చూశారా
-
సింహాల కొట్లాట చూశారా?
గాంధీ నగర్: కొన్ని జంటలు అందరిముందు అన్యోన్యంగా ఉన్నట్లు కనిపిస్తాయే కానీ, ఇంట్లో మాత్రం ఒకరినొకరు తన్నుకు చస్తారు. రెండు సింహాలు అచ్చంగా కొంతమంది భార్యా భర్తల్లాగే కొట్టుకు చస్తున్నాయి. గుజరాత్‌లోని గిర్ అభయారణ్యంలో ఓ ఆడ సింహం, మగ సింహం రోడ్డుపై నిలబడి ఎదురెదురుగా తలపడ్డాయి. సింహం గర్జిస్తూ ముందుకు వస్తుంటే మరొకటి దాని వైపు కోపంగా చూస్తూ ఒక్కటివ్వబోయింది. కానీ ఎదురుగా ఉన్నది ఎంతకూ తగ్గలేదు. దాని దూకుడును చూసి వేగలేననుకుందో, ఎందుకొచ్చిన గొడవలే అనుకుందో ఏమో కానీ ఈ సింహం సైలెంట్‌గా పక్కకు తప్పుకుంది. (ఇలా ఏ తండ్రీ చెప్పడు!) ఈ పోరాటాన్ని వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ జుబీన్ ఆశర కెమెరాలో బంధించారు. వైల్డ్ ఇండియా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 22 సెకన్ల నిడివి ఉన్న ఈ పోరాట సన్నివేశాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. "ఆలూమగలు కొట్టుకున్నట్లే ఉందిగా.." అంటూ ఛలోక్తులు విసురుతున్నారు. 'కొత్తిమీర కట్ట మర్చిపోయి ఇంటికెళ్తే భార్య అలాగే అరుస్తుంది' అంటూ కొందరు భార్యాబాధితులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. 'మనుషుల్లో ఐనా, జంతువుల్లో ఐనా ఆడవాళ్లే గర్జిస్తారు' అని కొందరు మహిళలు రాసుకొచ్చారు. (భర్తకు విడాకులు, కొడుకుతో పెళ్లి) -
సింహాల వల్ల కాలేదు: చిరుతలు సాధించాయి!
న్యూఢిల్లీ : ‘నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు పట్టు.. బైట కుక్క చేత భంగ పడును’ అన్న పద్యం కచ్చితంగా వినే ఉంటాము. నీళ్లలో ఉన్నప్పుడు మొసలి శక్తి ఏనుగును సైతం చంపేలా ఉంటుందని, బైటి కొచ్చినపుడు కుక్క కూడా దాంతో ఓ ఆట ఆడుకుంటుందని దానర్థం. అయితే కొన్ని కొన్నిసార్లు నీళ్లలో ఉన్నప్పుడు కూడా మొసలి ప్రాణాలకు భరోసా ఉండదు. చిరుత పులి ప్లాన్ వేసి నీళ్లలోకి దూకిందంటే మొసలి ఖతం కాక తప్పదు. ( 1100 కి.మీ. ప్రయాణించిన మొసలి) సింహాల గుంపుకు సాధ్యంకాని పనిని కూడా చిరుత పులులు ఈజీగా చేసేస్తాయి. చిరుత పులులు మొసళ్లను వేటాడిన పాత వీడియో సమూహం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జస్ట్ ఫర్ నేచర్ లవర్స్ అనే ఫేస్బుక్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. -
శార్వరి నామ సంవత్సర (సింహ రాశి) రాశిఫలాలు
ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. విదేశీయాన ఖర్చులకు ఎక్కువ మొత్తంలో ధనం ఖర్చు చేస్తారు. మీరు చేస్తున్నది మంచికో, చెడుకో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం, కుటుంబసభ్యుల కోరిక కాదనలేక ఎప్పటిక్పుడు సర్దుబాటు కావడం విశేషం. సామాజికంగా, రాజకీయంగా వచ్చే మార్పులు మీ మీద ప్రత్యక్షంగా మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు, పడిన కష్టాలు ఇప్పుడు లాభిస్తాయి. మాటపట్టింపు, మొండి వైఖరి వల్ల కొన్నింటికి దూరంగా ఉంటారు. పరిస్థితుల ప్రభావం వల్ల జీవనమార్గం సక్రమంగానే దొర్లుతుంది. అనువంశికంగా రావలసిన ఆస్తులు ఎట్టకేలకు సానుకూలపడతాయి. రూపాయి ఖర్చు అయ్యేచోట వంద రూపాయలు ఖర్చు అవుతాయి. సంతానం భవిష్యత్తు కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. వాళ్ళ పేరుమీద స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఐశ్వర్యనాగిని ఉపయోగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. క్రీడలు, రాజకీయాలపై మీ అంచనాలు నిజమవుతాయి. అయితే జూదాలకు, పందాలకు దూరంగా ఉండడం మంచిది. సామాజిక పరిస్థితుల మీద విరక్తి పుడుతుంది. ఈ సమాజంలో మనుగడ సాగించగలమా? అన్న మానసిక వేదన కలుగుతుంది. ప్రతినిత్యం నాగసింధూరం నుదుటన ధరించడం వలన నరదృష్టి తొలగిపోయి, జనాకర్షణ ఏర్పడుతుంది. విద్య వైజ్ఞానికరంగాలలో అనుకున్నది సాధిస్తారు. పి.హెచ్.డి. వంటివి పూర్తిచేస్తారు. సివిల్ సర్వీస్‌లు, ఇతర పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. టెండర్ల విషయంలో అయోమయం ఏర్పడుతుంది. మీ వ్యక్తిగత, ఆఫీస్ రహస్యాలను మీ శత్రువర్గానికి చేరవేస్తున్న నమ్మకద్రోహులను గమనించి తగిన చర్యలు తీసుకుంటారు. వృత్తి రహస్యాలు, వ్యక్తిగత బలహీనతలు ఎక్కడా బయటపెట్టరాదన్న సూత్రాన్ని తెలుసుకుంటారు. టైలర్లకు, కోళ్ళపారాలు నడిపేవారికి బాగాలేదు. అన్నిరకాల వాయిద్యకారులకు మంచి రోజులు. పేరు, ధనం రెండూ సంపాదిస్తారు. కవులకు, రచయితలకు కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. సన్మానాలు జరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కార్యాలయ సంబంధమైన సమస్యను అధిగమించడానికి ఈ ప్రమోషన్ ఉపయోగపడుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతలు ఎలాగైనా నెరవేర్చాలని నిశ్చయించుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుకున్నంత అభివృద్ధి ఉండకపోవచ్చు. కొత్త పరిచయాలు, స్నేహితుల వల్ల ఉపయోగం కలుగుతుంది. కీళ్ళనొప్పులు, కాళ్ళనొప్పులు రావచ్చు. సంవత్సర ద్వితీయార్ధంలో సంతాన విషయమై శ్రద్ధ వహించవలసి వస్తుంది. అన్నిరకాల దేవుళ్ళ అభిషేకాలకు మహాతీర్థం పొడిని ఉపయోగించండి. యూనియన్స్ పోరాటంలో ఉత్సాహంగా పాల్గొంటారు. న్యాయం కోసం చేసే పోరాటంలో ముందుంటారు. న్యాయస్థానాల వరకు పోరాటం పోవచ్చు. రాజకీయ జీవితం బాగుంటుంది. సినిమాలు, డిస్ట్రిబ్యూటర్లకు గత సంవత్సరం కన్నా అనుకూల కాలం. మీరు అనుకున్న పనులు సమయానికి కాస్త అటుఇటుగా పూర్తవుతాయి. భగవంతుడు అన్నీ ఇచ్చినా మిగతావి మనం చేసుకోవలసిన ముఖ్య కార్యాలు ఉన్నాయన్న భావంతో కాంట్రాక్టులు, లీజులు, లైసెన్స్‌లు, రెన్యువల్స్ అనుకూలిస్తాయి. ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు. విజయం సాధిస్తారు. సోదరసోదరీ వర్గానికి రహస్యంగా సహాయం చేస్తారు. ఈ విషయమై ఇంట్లో గొడవలు వచ్చి కొంతకాలం మనశ్శాంతి కోల్పోతారు. ఉన్నతవిద్యను అభ్యసించే అవకాశం, ఇతర భాషలను నేర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాసంస్థలు, సామాజిక సేవాసంస్థలు, లోహపు వ్యాపారాలు చేసేవారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. చేతివృత్తి పనివారికి కూడా మంచి ఫలితాలే సూచిస్తున్నాయి. సంతానం లేని వారికి సంతానప్రాప్తి సంభవం. అవివాహితులైన వారికి వివాహప్రాప్తి. నిర్మాణాలను దగ్గరుండి పర్యవేక్షించడం చెప్పదగిన సూచన. నాణ్యతలో లోపాలు ఉన్నాయని మీపై ఆరోపణలు రావచ్చు. ప్రభుత్వ నిర్ణయాల వలన కొద్దిమంది రియల్ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోతారు. పోటీపరీక్షలలో విజయం సాధించి కుటుంబ ప్రతిష్ఠ నిలబెడతారు. మీరు ఎంతో శ్రమించి మంచి ఫలితాలు సాధించినప్పటికీ మీ వైరివర్గం వారు మీ శ్రమను గుర్తించక విమర్శిస్తారు. శత్రువులతో వాదించే కన్నా కాలమే సమస్యలను పరిష్కరిస్తుందని మౌనంగా ఉండిపోతారు. మీరు నిజాయితీగా, స్పష్టంగా మాట్లాడటం వల్ల వైరివర్గం దానిని మీ అహంభావంగా భావించి మీపై అకారణంగా మీ సన్నిహిత సహచరవర్గంలో ఉండే వారి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎవరిపట్ల మీకు ఆసక్తి, అనురాగం ఉన్నాయో వారి వల్లనే మానసిక వేదన కలుగుతుంది. వచ్చిన అవకాశాలు చేజార్చుకోవద్దు, నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయవద్దు. వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. రుద్రజడను ఉపయోగించండి. మీ కంపెనీకి ప్రజలలో గుడ్‌విల్, నమ్మకం పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో మీరే కేంద్రబిందువు అవుతారు మిగిలిన భాగస్వాముల పాత్ర నామమాత్రం అవుతుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఒక ఆశ ఫలించడం మీకు, మీ భాగస్వాముల ఆనందానికి అవధులు ఉండవు. బ్యాంకు రుణాలు, అనుకూలమైన స్థలం, ప్రభుత్వ రాయితీలు మొదలైనవి అనుకూలం. మీరు ఆశించిన విధంగా, ఊహించని విధంగా మీ జ్యేష్ఠ సంతానానికి ఉద్యోగం లభిస్తుంది. ఆడపిల్లల గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి గట్టిగా ఆలోచన చేస్తారు. వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అవి సఫలం అవుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి కష్టంమీద సంబంధం కుదురుతుంది. ప్రేమవివాహాలు చేసుకున్న వారికి చేదు అనుభవాలు సంభవిస్తాయి. భగవంతుడు నొసట రాసిన రాత శాశ్వతమని నమ్ముతారు. ఈ నమ్మకం చాలా విషయాలలో మీకు మనోధైర్యాన్ని కలిగిస్తుంది. కీలకమైన పోటీపరీక్షలలో నామమాత్రంగా శ్రమించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. అనూహ్యంగా ప్రతి విషయంలోనూ అదృష్టం కలిసి వస్తుందని భావించవద్దు. అదృష్టం కోసం ఎదురుచూడడం వలన ఆశ, కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించి తగిన విధంగా ప్రవర్తిస్తారు. పాస్‌పోర్ట్, వీసాల కోసం ప్రయత్నించే వారికి అవి లభిస్తాయి. గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వాళ్ళకి గ్రీన్‌కార్డు లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన కొన్నిరకాల ఉత్తర్వులు మీకు మేలు చేస్తాయి. మీ పలుకుబడి ఉపయోగించి తక్కువ కొటేషన్‌తో ఎక్కువ లాభాలు ఉన్న కాంట్రాక్టులను మీ స్వంతం చేసుకుంటారు. దూరప్రాంతాలకు మీ పిల్లలను పంపించి చదివిస్తారు. సంసారం గుట్టు రోగం రట్టు అనే సామెత మీ విషయంలో నిజమవుతుంది. మీ సమస్యలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. మంచి విషయాలు చెబితే జనం ఓర్చుకోలేరు. చెడ్డ విషయాలు సమస్యలు చెబితే లోకువగా చూస్తారని మీ అభిప్రాయం. ఉద్యోగాల విషయంలో మధ్యవర్తుల వల్ల, కమీషన్ ఏజెంట్ల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. దొడ్డిదారిలో ఉద్యోగాలు సంపాదించుకునే మార్గాలకు స్వస్తి చెప్పండి. అవి ఎండమావులని గ్రహించండి. సనాతన సంప్రదాయాలు మీద మీకున్న నమ్మకం బలీయమైనది. కోర్టుతీర్పులు మీకు అనుకూంగా ఉంటాయి. కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. దుష్ప్రచారాలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవడం వల్ల సానుకూల ఫలితాలు సాధిస్తారు. రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. నయవంచకుల సలహాలు ప్రక్కన పెడతారు. ఉన్నతాధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. కొంతమందికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. సహోద్యోగులు మీ మీద చేస్తున్న దుష్ప్రచారం అబద్ధాలని నిరూపిస్తారు. ముఖ్యమైన సభలు, సమావేశాలకు ఆహ్వానాలు అందటం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. బహిరంగ సభల్లో చక్కగా ప్రసంగిస్తారు. కొన్ని అవార్డులు మీకు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలను నిర్లక్ష్యం చేస్తున్నారనే అపవాదు వస్తుంది. ఎటువంటి విమర్శలకు ప్రతిస్పందించకుండా నిండుకుండలా ఉంటారు. విలువలేని వ్యక్తులకు ప్రాధాన్యతనిచ్చి మాట్లాడడానికి ఇష్టపడరు. ఆచరణలో మీ ఈ నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుంది. సాంకేతిక విద్యలో చక్కగా రాణిస్తారు. వ్యాపార సంబంధమైన విషయాలు కూడా లాభిస్తాయి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల కొన్ని చికాకులు సంభవిస్తాయి. దైవసంకల్పం ముందు మానవుడు చాలా బలహీనుడని కొన్ని సంఘటనలు నిరూపిస్తాయి. మార్పులు పరివర్తన కాలానుగుణంగానే నడుస్తాయి. కానీ మన ప్రయత్నాల వల్ల రావని గ్రహిస్తారు. ఇన్సూరెన్స్ విషయంలో జాగ్రత్త వహించండి. చోరభయం పొంచి వుంది. పూర్వీకులు రాసిన డాక్యుమెంట్లు, వీలునామాలోని లోపాలు కీలక సమయంలో ఇబ్బంది పెడతాయి. స్పష్టతలేని పెద్దల అభిప్రాయాలు సంకటానికి గురిచేస్తాయి. దురుసుగా మాట్లాడి అయినవాళ్ళని దూరం చేసుకోవడం మంచిలక్షణం కాదు. కోపంగా మీరు మాట్లాడినప్పటికీ విషయాలను కంటితో చూసి నిజానిజాలను బేరీజు వేసుకుంటారు. టీ.వీ, సినీరంగాలలోని వారికి, కళాకారులకు, సాంకేతిక సిబ్బందికి నూతన అవకాశాలు కలిసివస్తాయి. వచ్చిన అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారు. రాజకీయ పదవి లభిస్తుంది. -
‘అమ్మ’ ప్రేమను చాటిన సింహం
బిడ్డలపై ప్రేమ లేని తల్లి ఉంటుందా అంటే.. సమాధానం చెప్పడం చాలా కష్టం. ఏ తల్లి అయినా తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటుంది. మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ తల్లిప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. దీనికి నిదర్శనం ఈ వీడియోనే. తన బిడ్డను నది దాటించే క్రమంలో ఓ ఆడసింహం చేసిన పని అందరిని ఆశ్చర్యపరిచింది. నదిలోని మొసళ్లు ఎక్కడ తన బిడ్డలను మింగేస్తాయోనని చూసుకుంటూ.. జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చింది ఆ ఆడ సింహం. నది దాటే క్రమంలో పిల్ల సింహం ఒక్క క్షణం నిటిలో మునిగితే చాలు.. వెంటనే నోటితోపైకి లాగుతోంది. తన బిడ్డను మొసలి మింగేసిదన్న భయంతో వెంటనే అప్రమత్తమై పిల్ల సింహాన్ని నోటితో పైకి లాగుతోంది. ఈ అసాధారణ దృశ్యం కెన్యాలోని ఎవాసో వద్దగల నైరో నది సమీపంలో చోటు చేసుకోగా.. లుకా బ్రాకాలి అనే ప్రముఖ ఫోటో గ్రాఫర్ తన కెమెరాలో బంధించారు.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ‘తల్లి ప్రేమను మించింది లేదు’., ‘ సింహం అయినా కూడా ఓ బిడ్డకు తల్లియే కదా’ అని కామెంట్లు పెడుతున్నారు. -
‘అమ్మ’ ప్రేమను చాటిన సింహం
-
పరుగో.. పరుగు
సమస్యలను చూసి భయపడి పారిపోతే.. మరింత ఎక్కువగా తరుముతుంటాయి. అదే ఒక్కసారి ధైర్యం చేసి ఎదురుతిరిగితే.. చివరికి చావు కూడా మనిల్ని చూసి పారిపోతుందంటారు. సరిగ్గా ఇలానే జరిగింది ఓ చోట. ఆహారం కోసం తిరుగుతున్న ఆడ సింహానికి ఎదురుగా గేదెల మంద కనిపించింది. వాటిని చూడగానే సింహం అబ్బ ‘ఈ రోజు నా పంట పండింది.. ఒక వారానికి సరిపోను ఆహారం దొరికింది’ అని సంబరపడింది. గేదెల మందపై దాడి చేద్దామని భావించి అటుగా వెళ్లింది. అయితే సింహం రాక గమనించిన గేదెలు ఒక్కసారిగా పరుగందుకున్నాయి. తనను చూసి భయపడి పారిపోతున్న గేదెల వెనకాల పరిగెత్తింది సింహం. కానీ ఇంతలో ఒక విచిత్రం జరిగింది. ఉన్నట్టుండి ఒక గేదె సింహం వైపు దూసుకొచ్చింది. ఈ ఊహించని పరిణామానికి బిత్తరపోవడం సింహం వంతయ్యింది. వెంటనే తేరుకుని, కాలికి బుద్ధి చెప్పి పరుగు లంకించుకుంది. అంత సేపు గేదెలు తనను చూసి భయడటంతో తానే బలవంతురాలిని అనుకున్న సింహం, ఒక్క గేదె ఎదురుతిరిగే సరికి పారిపోయింది. జీవితం కూడా ఇంతే. సమస్యలు వచ్చినప్పుడు భయపడి పారిపోయే బదులు ఎదురుతిరిగితే.. అవే మనల్ని చూసి పారిపోతాయి అనే దానికి ఉదాహరణగా నిలిచింది ఈ వీడియో. -
వైరల్: ఆడ సింహంతో ఆట..
రాజ్‌కోట్ : సింహం దాడి గురించిన వార్తలే తరుచూ చూస్తుంటాం. గుజరాత్‌లోని యువత మాత్రం సింహానే వేధించారు. తమ ఆనందం కోసం వన్యప్రాణులను హింసించడం సరదాగా మార్చుకున్నారు కొంతమంది యువకులు. గత నెలలో గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్‌లోని సింహాలను హింసకు గురిచేస్తున్నారని అధికారులు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మనుషులు ఏంటి సింహల్ని హింసించడం ఏంటనుకుంటున్నారా..?. వారి మొబైల్ ఫోన్లలో లభించిన ఈ వీడియో చూస్తే వారేం చేశారో తెలుస్తుంది. గిర్ పార్క్ సమీపంలోని పొలంలో కొంతమంది యువకులు పార్టీ చేసుకుంటున్నారు. వీరికి ఓ మహిళ వంట వండుతుంది. ఇంతలో అక్కడికి ఓ ఆడ సింహం చేరుకుంది. వారు దానికి ఏ మాత్రం బెదరకుండా ఆటపట్టించడం మొదలుపెట్టారు. అక్కడున్నవారిలో ఒకతను తన చేతిలో ఉన్న కోడిని సింహానికి ఆశ చూపుతూ.. దాని ఓపికను పరీక్షించాడు. అతడు ఇలా చేయడం తనకు మాములే అని చెప్పడం కోసమెరుపు. కొద్దిసేపటి తర్వాత కోడిని దానికి ఇచ్చేయడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై గిర్ అభయారణ్య అధికారి ఒకరు మాట్లాడుతూ.. గత నెలలో అరెస్టు చేసిన ఏడుగురు వ్యక్తుల నుంచి ఈ వీడియో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారు అలా చేస్తున్న సింహం దాడి చేయకపోవడానికి కారణం.. సింహం ఆ పద్దతిలో ఆహారం పొందడానికి అలవాటు పడిందని చెప్పారు. ఇదే పార్క్‌లో గత ఏడాది ఒక మగ, ఒక ఆడ సింహాల్ని కొంత మంది స్థానిక యువకులు వెంబడించిన విషయం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఈ వీడియో బయటకు రావడంతో జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న అటవీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వన్యప్రాణుల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
సింహానికి కోడిని ఆశ చూపుతూ ఆట..
-
బర్రెను చూసి సింహం తుర్రుమంది!
అడవికి ఓ న్యాయం ఉంటుంది. ఆ న్యాయం ప్రకారం అడవికి రాజు సింహం. దానిని చూసి అన్నీ జంతువులు భయపడాల్సిందే. ఎదైనా జంతువు ఎదురుతిరిగి నువ్వెంత అని కొమ్ములు ఎగరేస్తే.. సింహం తన పంజా విసురుతుంది. ఎదురుగా జంతువు కనిపిస్తేనే దానికి ఆహారంగా మారిపోతుంది. అలాంటిది ఎదురుతిరిగితే బతికి బయటపడగలదా? కానీ ఇక్కడ మాత్రం ఆటవిక న్యాయం తిరగబడింది. బర్రె (గెదే)ను చూసి ఆడ సింహం ఒకటి భయపడింది. గెదే మీదకు ఉరికొస్తుంటే.. సింహం బెదిరి పోరిపోయింది. ఆ సింహాన్ని వెంటాడి మరీ గెదే తరిమేసింది. ఈ ఘటన గుజరాత్‌లోని గిర్ అడవిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన నాటకీయ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. #WACTH Law of the jungle turns - dramatic visuals of a buffalo chasing a lioness into the wild in Gir Forest (Guj)https://t.co/JuKJnQPG4X — ANI (@ANI_news) June 5, 2016 -
'మా సోనియా సివంగి లాంటివారు'
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సివంగి లాంటివారని ఆ పార్టీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా వ్యాఖ్యానించారు. అగస్టా వెస్ట్‌లాండ్ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు వేటిలోనూ ఆమెపేరు లేదని అన్నారు. లోక్‌సభలో ఈ అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ నాయకులు తమ ప్రసంగాల్లో సోనియాపై పరోక్ష విమర్శలు చేస్తున్నారని అన్నారు. అయితే సివంగి లాంటి సోనియా.. వీటికి భయపడబోరని సింధియా చెప్పారు. అగస్టా వెస్ట్‌లాండ్ భారతీయ కార్యాలయంలోని అధికారి పీటర్ హులెట్ రాసిన లేఖను ఆయన ప్రస్తావిస్తూ, సోనియా.. ఆమె సలహాదారులను తమ రాయబార కార్యాలయం గౌరవించాల్సి ఉందని చెప్పారన్నారు. సోనియా పేరు ఏ పత్రంలోనూ లేదని, ఎవరి సంతకాలూ లేని.. ఎవరూ ధ్రువీకరించని పత్రాల మీద మాత్రమే ఉందని తెలిపారు. ఈ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్ కూడా తన జీవితంలో ఎప్పుడూ ఏ గాంధీనీ కలవలేదన్నారని, వాళ్ల నుంచి తనకు లేఖ గానీ, మెసేజ్ గానీ ఏమీ లేవని చెప్పారని సింధియా గుర్తుచేశారు. గాంధీలకు అసలు డబ్బు ఏవీ చెల్లించలేదని క్రిస్టియన్ మైఖేల్ గట్టిగా చెప్పారన్నారు. మిలన్ కోర్టు జడ్జి కూడా సోనియాగాంధీకి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవనే చెప్పారని అన్నారు.