Lioness: కేర్‌ టేకర్‌పై జంప్‌ చేసిన సివంగి.. కానీ | Viral Video: Lioness Jumps On Man As He Opens Cage Gate | Sakshi
Sakshi News home page

Lioness: కేర్‌ టేకర్‌పై జంప్‌ చేసిన సివంగి.. కానీ

Published Mon, Dec 20 2021 8:40 PM | Last Updated on Mon, Dec 20 2021 9:27 PM

Viral Video: Lioness Jumps On Man As He Opens Cage Gate - Sakshi

కెప్‌టౌన్‌: సాధారణంగా మనలో చాలా మంది.. సాధు జంతువులను ఇంట్లో పెంచుకోవడం మనకు తెలిసిందే. అయితే, కొందరు మాత్రం అరుదుగా  సింహలు, పులులు వంటి క్రూర మృగాలను కూడా మచ్చిక చేసుకొని పెంచుకుంటుంటారు. అయితే, చిన్నతనం నుంచి పెంచుకోవడం వలన క్రూర జంతువులు కూడా వాటి సహజ క్రూర స్వభావాన్ని మరిచి, యజమానులతో ప్రేమగా ఉంటాయి.

ఇలాంటి ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. సౌత్‌ ఆఫ్రికా కలహరి ఎడారిలో బొట్సావాన అనే ప్రదేశం ఉంది. అక్కడ వాల్‌ గ్రూనెర్‌ అనే వ్యక్తి చిన్నతనం నుంచి ఒక సివంగిని పెంచుకుంటున్నాడు. దాన్ని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంటాడు. ప్రస్తుతం సివంగికి 9 ఏళ్లు.  సివంగి కూడా.. తన యజమాని పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటుంది.

వాల్‌, సివంగితో కూడిన అనేక ఫోటోలను తరచుగా తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటాడు. తాజాగా, ‘సిర్గది లయనీస్‌’ అనే ఇన్‌స్టాలో వీరి వీడియోను షేర్‌ చేశాడు. దానిలో వాల్‌ గ్రూనెర్‌..  బోనులో ఉన్న సివంగి వద్దకు చేరుకొని ఒక్కసారిగా కేజ్‌ను తొలగించాడు. అప్పుడు సివంగి గాండ్రిస్తూ తన యజమాని పట్ల ప్రేమతో వెంటనే దూకి అతడిని కిందపడేస్తుంది.

ఆ తర్వాత తోక ఊపుకుంటూ.. ప్రేమతో నాకుతూ.. తన యజమాని పక్కన కూర్చుంటుంది. ఈ వీడియోను పూర్తిగా చూడని వారు సివంగి వ్యక్తిపై దాడి చేసిందని పోరబడుతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. సివంగి దాడి చేసిందనుకున్నాం..’, ‘భలే జంప్‌ చేసిందే..’ అంటూ ఫన్నీగా కామెంట్‌లు పెడుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement