cage
-
ఎన్నికల్లో గెలుపుపై చిలుక జోస్యం.. ఇద్దరి అరెస్ట్
చెన్నై: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల ఫీవర్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. తమిళనాడులోని కడలూరు నియోజకవర్గంలో చిలుక జోస్యం చెప్పే సెల్వరాజ్ కూడా ఎన్నికల పేరు చెప్పుకుని ఎంతో కొంత వ్యాపారం పెంచుకుందామని చూశాడు. అయితే అతడ ప్లాన్ బెడిసి కొట్టింది. కడలూరు నియోజకవర్గంలో పీఎంకే పార్టీ అభ్యర్థి తంగర్ బచ్చన్ గెలవబోతున్నాడని తన వద్ద ఉండే చిలుకతో జోస్యం చెప్పించాడు. సెల్వరాజ్ పంజరం తలుపు తెరవగానే చిలుక వచ్చి అక్కడున్న దేవుడి ఫొటోల్లో నుంచి ఒక ఫొటో తీసింది. అది పీఎంకే అభ్యర్థికి ఇష్టమైన దేవుడి ఫొటో కావడంతో ఈ ఎన్నికల్లో కడలూరు నుంచి ఆయనే గెలువబోతున్నాడని సెల్వరాజ్ ప్రకటించాడు. దీంతో ఎగిరి గంతేసిన అభ్యర్థి తంగర్ బచ్చన్ చిలుకకు సంతోషంతో అరటిపండు తినిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఇంకేముంది పోలీసులు రంగ ప్రవేశం చేసి చిలుక జోస్యం చెబుతున్న సెల్వరాజ్, అతడి తమ్ముడిని అరెస్టు చేశారు. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ చట్టం సెక్షన్ 4 కింద ఇద్దరిని అరెస్టు చేసి కొద్దిసేపు జైలులో ఉంచి తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఇదీ చదవండి.. పిల్లి కోసం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృత్యువాత -
తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత..
సాక్షి, తిరుమల: తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. శ్రీవారి ఆలయానికి వెళ్లే నడకదారిలో బుధవారం తెల్లవారుజామున మరో చిరుత బోనులో పట్టుబడింది. కాగా, నడకదారిలో వారం రోజులుగా అటవీశాఖ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారు. వివరాల ప్రకారం.. తిరుమల నడకదారిలో మరో చిరుత బోనులో చిక్కింది. చిరుత సంచారాన్ని గుర్తించిన అధికారులు బోనులు ఏర్పాటు చేయడంతో తాజాగా చిరుత బోనులో చిక్కింది. అయితే, చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే తాజాగా చిరుత చిక్కడం విశేషం. ఇక, చిరుతను జూపార్క్‌కు తరలించడానికి అటవీశాక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో ఇప్పటి వరకు ఆరు చిరుతలను అటవీశాఖ అధికారులు బంధించారు. ఇది కూడా చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం! -
శిఖరేశ్వరంలో ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన ఎలుగుబంటి
-
తిరుమల లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర బోనులో చిక్కిన చిరుత
-
తిరుమల నడకదారిలో బోనులో చిక్కిన మరో చిరుత
-
తిరుమల: బోనులో చిక్కిన మరో చిరుత..
సాక్షి, తిరుమల: తిరుమల నడకదారిలో మరో చిరుత బోనులో చిక్కింది. గురువారం తెల్లవారుజామున చిరుత బోనులో చిక్కినట్టు తెలుస్తోంది. నడకదారిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద చిరుత బోనులో చిక్కింది. ఇక, 50 రోజుల వ్యవధిలో అధికారులు మూడు చిరుతలను బంధించడం విశేషం. వివరాల ప్రకారం.. ఇటీవల లక్షిత అనే చిన్నారిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాడి చేసిన ప్రాంతంలోనే అధికారులు బోన్లు పెట్టడంతో మూడు రోజుల క్రితమే ఓ చిరుత బోనులో చిక్కింది. ఇక, ఆ ప్రాంతానికి సమీపంలోనే అధికారులు చిరుతల కోసం మూడు చోట్ల బోన్ల ఏర్పాటు చేశారు. మోకాలిమెట్టు, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లను పెట్టారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున మరో చిరుత లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద బోనులో చిక్కింది. ఇదిలా ఉండగా.. 50 రోజుల వ్యవధిలో అధికారులు మూడు చిరుతలను బంధించారు. ఇది కూడా చదవండి: ఏపీలో పలు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ -
చిరుత కడుపులో మానవ మాంస ఆనవాళ్లు తెలియాలి: డీఎఫ్ఓ శ్రీనివాసులు
సాక్షి, తిరుపతి: తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి చేసిన చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. కాగా, టీటీడీ ఫారెస్ట్ అధికారులు చిరుతను ఎస్వీ జూపార్క్‌కు తరలించారు. ఈ సందర్భంగా టీటీడీ డీఎఫ్ఓ శ్రీనివాసులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో శ్రీనివాసులు మాట్లాడుతూ.. బాలికపై దాడిచేసిన చిరుత ఇదేనా.. కాదా అన్నది పరిశీలిస్తాం. చిరుత కడుపులో మానవ మాంస ఆనవాళ్లు ఉన్నాయా? లేదా అన్నది తెలుసుకుంటాం. అనంతరం ఫారెస్ట్ అధికారుల నిర్ణయం మేరకు చిరుతను జూలో ఉంచాలా? లేక ఫారెస్ట్‌లో వదలాలా అన్నది నిర్ణయిస్తాం. బోనులో చిక్కిన చిరుత ఆడ చిరుత.. నాలుగేళ్లు ఉంటాయని తెలిపారు. మరోవైపు.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. లక్షిత చనిపోయిన ప్రాంతంలోనే నేడు చిరుత పట్టుబడింది. ఈ ప్రాంతంలో ఇంకా చిరుతల సంచారం ఉన్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. నడకదారిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఫారెస్ట్ శాఖ చెప్పే వరకు నిబంధనలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలో 15 ఏళ్లలోపు చిన్నారులకు అనుమతి లేదు. నడకమార్గంలో భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఇది కూడా చదవండి: వీడియో: చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది -
బాలికపై దాడి చేసిన ప్రాంతంలోనే పట్టుబడ్డ చిరుత
-
తిరుమల: బోనులో చిక్కిన చిరుత
సాక్షి, తిరుమల: తిరుమలలో బాలికపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. బాలిక మృతి నేపథ్యంలో ఘటనాస్థలంతో పాటు చుట్టుపక్కల బోన్లతో పాటు సీసీ కెమెరాలను అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి బాలికపై దాడి చేసిన ప్రాంతంలోనే చిరుత బోనులో చిక్కింది. బాలికపై దాడిచేసిన రెండురోజుల వ్యవధిలోనే చిరుతను అధికారులు పట్టుకున్నారు. బోనులో పడిన చిరుత పెద్దదిగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో చిరుతను బంధించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. అనంతరం, చిరుతను అటవీశాఖ అధికారులు జూపార్క్‌కు తరలించారు. ఈ సందర్బంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. లక్షిత చనిపోయిన ప్రాంతంలోనే నేడు చిరుత పట్టుబడింది. ఈ ప్రాంతంలో ఇంకా చిరుతల సంచారం ఉన్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. నడకదారిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఫారెస్ట్ శాఖ చెప్పే వరకు నిబంధనలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలో 15 ఏళ్లలోపు చిన్నారులకు అనుమతి లేదు. నడకమార్గంలో భక్తులు గుంపులుగా వెళ్లాలి. ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల తర్వాత బైక్‌లకు నో ఎంట్రీ అని స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి -
తిరుమల: బోనులో చిక్కిన చిరుత
సాక్షి, తిరుపతి: తిరుమలలో బోనులో చిరుత పులి చిక్కింది. మొన్న అలిపిరి మార్గంలో మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుతే ఇది. 7వ మైలురాయి వద్ద ఇది బోనులో పడింది. కేవలం ఒక్కరోజులోనే చిరుతను బంధించారు అధికారులు. నిన్న సాయంత్రం చిరుతను బంధించేందుకు రెండు బోన్లను ఏర్పాటు చేశారు అధికారులు. 150 ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి(శుక్రవారం, జూన్ 23) 10.45 గంటల ప్రాంతంలో చిరుత బోనులో పడినట్లు తెలుస్తోంది. డీఎఫ్‌వో ఏమన్నారంటే.. బాలుడిపై దాడి చేసిన ఒక్కరోజులోనే చిరుతను బంధించాం. తల్లి, పిల్ల చిరుతలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ చిరుతను ఇంకా వేటాడడం పూర్తిగా అలవాటు కాలేదు అని డీఎఫ్‌వో తెలియజేశారు. చిన్నారి కౌశిక్‌ను పరామర్శిస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. పక్కన చికిత్స అందిస్తున్న వైద్యుడు తిరుమల నడక మార్గంలోని 7వ మైలు వద్ద ఓ చిరుత పులి బాలుడిపై దాడి చేసింది. తన తాతతో కలిసి అక్కడే ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కుంటున్న సమయంలో హఠాత్తుగా వచ్చిన చిరుత బాలుడి మెడ పట్టుకుని ఎత్తుకెళ్లింది. వెంటనే స్పందించిన అక్కడి దుకాణదారుడు, తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ చిరుత వెనుక పరుగులు తీశారు. టార్చ్‌లు వేస్తూ, రాళ్లు విసరడంతో 7వ మైలు కంట్రోల్ రూం వద్ద చిరుత బాలుడిని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయింది. చిరుత దాడి నుంచి బాబును అక్కడి భద్రతా సిబ్బంది రక్షించారు. గాయాల పాలైన బాలుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడి చెవి వెనుక, మరికొన్ని ప్రాంతాల్లో చిరుత దంతపు గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన బాలుడు కర్నూలు జిల్లా ఆదోని వాసి కౌషిక్(3)గా గుర్తించారు. దాడి గురించి తెలియగానే.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి బాలుడిని పరామర్శించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. చిరుత దాడి చేసిన మెట్ల మార్గంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతామన్నారు. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఇదీ చదవండి: గోవధ నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? -
72 ఏళ్ల వృద్ధుడిపై ఒకేసారి 40 మొసళ్లు దాడి!
ఓ వృద్ధుడిపై ఒకేసారి 40 మొసళ్లు మూకుమ్మడిగా దాడి చేసి హతమార్చాయి. ఈ షాకింగ్ ఘటన కంబోడియాలో చోటు చేసుకుంది. ఆ వృద్ధుడు తన పోలంలోని ఆవరణలో ఓ ఎన్‌క్లోజర్‌లో ఈ మొసళ్లును పెంచుతున్నాడు. అందులోని ఓ మొసలి గుడ్లు పెట్టింది. ఆ గుడ్ల కోసం ఎన్‌క్లోజర్ నుంచి మొసలి తరలించాలనుకున్నాడు 72 ఏళ్ల వృద్ధుడు. అందుకోసం అతను ఓ కర్రతో బెదిరిస్తూ పక్కకు తొలగిపోయేలా చేద్దామనుకుంటే అది రివర్స్‌లో అతడి కర్రను బలంగా పట్టుకుని ఎన్‌క్లోజర్‌లోకి లాగింది. ఈ హఠాత్పరిణామానికి ఆ వృద్ధుడు ఎన్‌క్లోజర్‌లోకి పడిపోయాడు. అంతే ఒక్కసారిగా అక్కడే ఉన్న 40 మొసళ్లు అతనిపై మూకుమ్మడి దాడి చేసి తినేశాయి. ఆ ప్రాంతంలో అతడి ఆవశేషాలు మాత్రమే కనిపించాయి. ఈ విషయాన్ని బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. కంబోడియాలోని సియెమ్ రీప్ చుట్టూ అనేక మొసళ్లు సంరక్షణ ఎన్క్లోజర్లు ఉన్నాయి. అక్కడివారు ఈ మొసళ్లను వ్యాపారం కోసం పెంచుతుంటారు. అక్కడి వారు వాటితో గుడ్లు, మాంసం, చర్మం తదితరాల వ్యాపారం చేస్తుంటారు. (చదవండి: చైనాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం..ఏకంగా 6.5 కోట్ల మందికిపైగా..) -
హామీలు నెరవేర్చకపోతే.. అక్కడ నాయకుల పని ఫినిష్! బంధించి..
ప్రజలు చేత ప్రత్యక్ష్యంగా ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారిగా ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఐతే ప్రతి నాయకుడు తనని గెలిపిస్తే ఇవి చేస్తాం, అవి చేస్తాం అంటూ ఎన్నెన్నో హామీలు ఇచ్చేస్తుంటారు. ఆ తర్వాత గెలిచాక అసలు వాటిని గుర్తుంచుకునే తీరికే లేనట్లు ప్రవర్తిస్తారు. మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు ప్రజలు గానీ, వారికిచ్చిన హామీలు గానీ వారికి గుర్తేరావు, ఔనా! ఐతే ఇక్కడ ఆ ఊరిలో మాత్రం అలా కుదరదట. నాయకులు హామీలు నెరవేర్చకపోతే ఇక అంతే సంగతులు. ప్రజలే అక్కడ వారిని బహిరంగంగా శిక్షిస్తారు. మళ్లీ ఇలాంటి పని చేయకుండా వారిలో మార్పు వచ్చేలా చేస్తారట. వివరాల్లోకెళ్తే..ఇటలీలో ఓ చిన్న పట్టణంలో ఈ వింత ఆచారం కొనసాగుతోంది. అక్కడ తాము ఎన్నుకున్న నాయకుడు తప్పుడుగా వ్యవహరించినా, తప్పుడు పనులు చేసినా ఇక అంతే సంగతులు. అలాగే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయినా.. వారిని బోనులో బంధించి నీటిలో ముంచేస్తారు. అలా అని వారిని చనిపోయేంత వరకు నీటిలో ముంచేయరు. తాము చేసిన తప్పు వారికి అవగతమయ్యేలా జస్ట్ ఒక్క సెకను మాత్రమే అలా బోనులో బంధించి నీటిలో ముంచుతారు. ఇది వారికి ఒక అవమానంలా అనిపించి ఎలాంటి తప్పులు దొర్లకుండా తమ విధులను సక్రమంగా నిర్వర్తించేలా చేయడమే తప్ప మరో ఉద్దేశ్యం ఏమి లేదని చెబుతున్నారు అక్కడి స్థానికులు. ఇది ఇటలీలోని టోంకాలో సాంప్రదాయకంగా జరుగుతుంది. ప్రతి ఏడాది జూన్ చివరిలో జరిగే విజిలియన్ వేడుకలో ఇది ఒక భాగం. అంతేగాదు ఈ శిక్షలను జూన్ 26కు ముందు, చివరి ఆదివారం విధిస్తారు. గతేడాది 2022 జూన్ 19న దీనిని నిర్వహించారు. 2023, జూన్ 25 ఈ కార్యక్రమం ఉంటుంది. (చదవండి: మంటల్లో చిక్కుకున్న బస్సు..అదే టైంలో కండక్టర్ నిద్రిస్తుండటంతో..) -
గొరిల్లా పట్టు మాములుగా లేదుగా...కొద్దిలో సేఫ్ లేదంటే...
ఇటీవల సందర్శకులు జూలకు వెళ్లి అక్కడ ఉన్న జంతువులతో లేనిపోనీ కష్టాలు కొనితెచ్చుకున్న సంధార్భాలు అనేకం. జూ అధికారులు సైతం ప్రమాదకరమైన జంతువుల సమీపంలోకి వెళ్లొద్దు అని హెచ్చరిక బోర్డులు పెట్టినా కూడా లెక్కచేయకుండా వెళ్లి పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని క్రూర జంతువులు దగ్గరకు వెళ్లేటప్పుడు జంతు సంరక్షక్షులు చెప్పే సూచనలు పాటించాలి లేదంటే ఆ జంతువుల దాడికి బలైపోక తప్పదు. అచ్చం అలానే ఇక్కడో వ్యక్తి తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అదృష్టం కొద్ది బయటపడ్డాడు. వివరాల్లోకెళ్తే..ఇండోనేషియాలోని కసాంగ్ కులిమ్ జూలో టీనా అనే గొర్రిల్లా బోనులో బంధించి ఉంది. హసన్ అరిఫిన్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఈ జూని సందర్శించడానికి వెళ్లాడు. ఐతే అతను ఈ టీనా అనే గొర్రిల్లా బోను వద్దకు ఇచ్చి రెండు చేతుల ఇచ్చి సరదాగా రా అన్నాడు. అంతే అది ఒక్కసారిగా అతన్ని కోపంగా పట్టుకోవడానికి రెడీ అయిపోయింది. అక్కడి అతను దూరంగానే ఉన్నాడు. ఐతే ఆ గోర్రిల్లా మాత్రం ఆ వ్యక్తి చొక్కాను పట్టుకుని బోనులోకి లాగేందుకు ట్రై చేస్తోంది. సహయం కోసం హసన్ తన స్నేహితుడిన పిలిచాడు. అతని స్నేహితుడు సైతం తన ఫ్రెండ్‌ని కాపాడుకునేందుకు ప్రయత్నించిన ఆ గొర్రిల్లా అతని కాలుని కదలకుండా ఉడుం పట్టు పట్టేసింది. ఇక ఎలాగోలాగా బలవంతంగా ఆ గొర్రిల్లా ఉడుంపట్టు నుంచి లాగేందుకు శతవిధాల ప్రయత్నిస్తూంటే అది ఆ వ్యక్తిని కూడా పక్కకు తోసేసింది. చివరికి హసన్ తన కాలుని గొర్రిల్లా కొరకబోతుందనగా కొద్ది సెకన్ల వ్యవధిలో తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. pic.twitter.com/6yhHjvDjgT — san (@sundaykisseu) June 7, 2022 (చదవండి: ఇక రాను రాను టమాటా కెచప్ తయారు చేయకపోవచ్చు!) -
Lioness: కేర్ టేకర్‌పై జంప్ చేసిన సివంగి.. కానీ
కెప్టౌన్: సాధారణంగా మనలో చాలా మంది.. సాధు జంతువులను ఇంట్లో పెంచుకోవడం మనకు తెలిసిందే. అయితే, కొందరు మాత్రం అరుదుగా సింహలు, పులులు వంటి క్రూర మృగాలను కూడా మచ్చిక చేసుకొని పెంచుకుంటుంటారు. అయితే, చిన్నతనం నుంచి పెంచుకోవడం వలన క్రూర జంతువులు కూడా వాటి సహజ క్రూర స్వభావాన్ని మరిచి, యజమానులతో ప్రేమగా ఉంటాయి. ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. సౌత్ ఆఫ్రికా కలహరి ఎడారిలో బొట్సావాన అనే ప్రదేశం ఉంది. అక్కడ వాల్ గ్రూనెర్ అనే వ్యక్తి చిన్నతనం నుంచి ఒక సివంగిని పెంచుకుంటున్నాడు. దాన్ని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంటాడు. ప్రస్తుతం సివంగికి 9 ఏళ్లు. సివంగి కూడా.. తన యజమాని పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటుంది. వాల్, సివంగితో కూడిన అనేక ఫోటోలను తరచుగా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా, ‘సిర్గది లయనీస్’ అనే ఇన్‌స్టాలో వీరి వీడియోను షేర్ చేశాడు. దానిలో వాల్ గ్రూనెర్.. బోనులో ఉన్న సివంగి వద్దకు చేరుకొని ఒక్కసారిగా కేజ్‌ను తొలగించాడు. అప్పుడు సివంగి గాండ్రిస్తూ తన యజమాని పట్ల ప్రేమతో వెంటనే దూకి అతడిని కిందపడేస్తుంది. ఆ తర్వాత తోక ఊపుకుంటూ.. ప్రేమతో నాకుతూ.. తన యజమాని పక్కన కూర్చుంటుంది. ఈ వీడియోను పూర్తిగా చూడని వారు సివంగి వ్యక్తిపై దాడి చేసిందని పోరబడుతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. సివంగి దాడి చేసిందనుకున్నాం..’, ‘భలే జంప్ చేసిందే..’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Sirga (@sirgathelioness) -
రివర్స్ జూ: బోనులో మనం.. స్వేచ్ఛగా సింహాలు
సింహాన్ని చూడ్డానికి మనం జూకు వెళ్తాం.. సింహానికే మనల్ని చూడాలనిపించింది అనుకోండి.. ఇదిగో ఈ రివర్స్ జూకు వస్తుంది.. అంటే.. జంతువులు బయట తిరుగుతూ ఉంటే.. మనం బోనులో ఉండటమన్నమాట. దక్షిణాఫ్రికాలోని హారిస్మిత్లో ఉన్న జీజీ సింహాల అభయారణ్యంలో ఈ వినూత్న బోనును ఏర్పాటు చేశారు. దీని వల్ల సందర్శకులకు కూడా వాటిని దగ్గర నుండి చూసే అనుభూతి కలుగుతుందని అభయారణ్యం నిర్వాహకులు చెబుతున్నారు. భద్రత విషయంలో ఎలాంటి భయాలూ అక్కర్లేదని.. దీన్ని తరచూ ఇంజనీర్లతో తనిఖీలు చేయిస్తామని పేర్కొంటున్నారు. -
మైనర్ అదృశ్యం: ‘జూ’ బోనులో ముక్కలై
లాహోర్ : కనిపించకుండాపోయిన బాలుడు స్థానిక జూలోని సింహపుబోనులో ముక్కలై కనిపించడం కలకలం రేపింది. లాహోర్ సఫారి పార్క్‌లో సోమవారం ఈ విషాదం చోటు చేసుకుంది. సఫారి పార్క్ లాహోర్ డైరెక్టర్ చౌదరి షాఫ్కత్ అందించిన సమాచారం ప్రకారం మరణించిన మైనర్ బాలుడిని బిలాల్ (18) గా గుర్తించారు. అతని బట్టలు ఆధారంగా బాలుడుని తండ్రి గుర్తించగా, అయితే బోనులోకి బిలాల్ ఎలా ప్రవేశించాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని హత్య చేసి అనంతరం బోనులోకి విసిరి వుంటారా అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. సోమవారం నుంచి తమ కుమారుడు కనిపించకుండాపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పార్క్ అధికారులను సంప్రదించారు. దీంతో మృతదేహానికి సంబంధించిన తల, చేతులు లాంటి శరీర భాగాలను సింహం బోనులో జూ అధికారులు కనుగొన్నారు. దీంతో పాటు కొడవలి, గడ్డిని కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గడ్డి కోసుకునేందుకు జూ ఫెన్సింగ్ గోడ ఎక్కి పార్కులోకి ప్రవేశించినపుడు బాలుడిపై సింహాలు దాడి చేసి వుంటాయని జూ అధికారులు భావిస్తున్నారు. కాగా బిలాల్ మామయ్య ఇదే పార్కులో ఉద్యోగిగా ఉన్నాడు. -
కాంట్రాక్టర్లపై అమిత ప్రేమ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న దోపిడీని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) బహిర్గతం చేసింది. కాంట్రాక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద కేంద్రం మంజూరు చేసిన నాలుగు ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని రూ.1,051.57 కోట్లు మేరకు పెంచేసి, అనుచిత లబ్ధి చేకూర్చారని తీవ్రంగా ఆక్షేపించింది. ప్రాజెక్టులు పూర్తయినా ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల (పిల్ల కాలువ) పనులు చేయనందువల్ల రైతులకు ప్రయోజనం దక్కట్లేదని స్పష్టం చేసింది. భూసేకరణలో జాప్యం.. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో నిర్లక్ష్యం.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లలో లోపాలు.. పనులలో అక్రమాలు వెరసి.. పూర్తి కావాల్సిన ప్రాజెక్టుల పనులు ముందుకు సాగట్లేదంటూ కడిగిపారేసింది. దేశంలో ఏఐబీపీ ప్రాజెక్టుల పనుల తీరుపై అధ్యయనం చేసిన కాగ్ పార్లమెంట్‌కు నివేదికిచ్చింది. ఏఐబీపీ ప్రాజెక్టుల పనులో ఎక్కడా లేని రీతిలో ఏపీలో భారీగా అక్రమాలు జరుతున్నాయని పేర్కొంది.అడ్డగోలుగా అంచనాల పెంపు..రాష్ట్రంలో తాడిపూడి ఎత్తిపోతల, గుండ్లకమ్మ, తారకరామ తీర్థసాగరం, భవనాసి మినీ రిజర్వాయర్లను సత్వరమే పూర్తి చేసేందుకు ఏఐబీపీ కింద కేంద్రం నిధులు ఇస్తోంది. ఈ పనుల్లో రాష్ట్రప్రభుత్వం అక్రమాలకు పాల్పడినట్టు కాగ్ నివేదిక స్పష్టం చేసింది.గుండ్లకమ్మ ప్రాజెక్టు 2008లోనే పూర్తయింది. మొత్తం 32,400 హెక్టార్లకుగాను 27,110 హెక్టార్ల ఆయకట్టుకు అప్పట్లోనే నీటిని విడుదల చేశారు. మిగిలిన 5,290 హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లందించాలంటే 21.06 ఎకరాల భూమిని సేకరించాలి. కానీ రాష్ట్రప్రభుత్వం 2014 నుంచి ఇప్పటిదాకా సేకరించలేదు. ఎకరానికి రూ.1,500 చొప్పున ఖర్చు చేస్తే మిగిలిన ఆయకట్టుకు నీళ్లందించవచ్చు. కానీ అంచనా వ్యయాన్ని రూ.165.22 కోట్ల నుంచి రూ.753.83 కోట్లకు పెంచేసి కాంట్రాక్టర్‌కు అనుచితంగా లబ్ధి చేకూర్చింది. ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే గ్రామాలవారికి పునరావాసం కల్పించడంలోనూ విఫలమైందని తేల్చింది. తాడిపూడి ఎత్తిపోతల పథకం 2008 నాటికే దాదాపుగా పూర్తయింది. 83,609 హెక్టార్లకుగాను 62,138 హెక్టార్ల ఆయకట్టుకు అప్పట్లో నీటిని అందించారు. మరో 21,471 హెక్టార్లకు నీటిని అందించాలి. కానీ 2014 నుంచి ఇప్పటివరకూ డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టనందువల్ల మిగతా ఆయకట్టుకు నీళ్లందించలేదు. అయితే అంచనాల్ని రూ.376.96 కోట్ల నుంచి రూ.568 కోట్లకు పెంచేసి కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చినట్టు కాగ్ ఆక్షేపించింది. తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టు కింద పదివేల హెక్టార్లకు నీటిని ఇవ్వాలి. ప్రాజెక్టుకు అవసరమైన 107.53 ఎకరాల భూమిని ఇప్పటిదాకా సేకరించలేదు. పనులు కాంట్రాకర్లకు అప్పగించాక డీపీఆర్‌లో భారీగా మార్పులుచేర్పులు చేశారు. దీంతో అంచనా వ్యయాన్ని రూ.220.11 కోట్ల నుంచి రూ.471.31 కోట్లకు పెంచేసి కాంట్రాక్టర్‌కు ప్రయోజనం కల్పించినట్టు కాగ్ వెల్లడించింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో భవనాసి చెరువును మినీ రిజర్వాయర్‌గా చేపట్టే పనులను రూ.27 కోట్లతో చేపట్టారు. మినీ రిజర్వాయర్‌గా మార్చే పనులకు భూసేకరణ చేయలేదు. అంచనా వ్యయాన్ని రూ.27 కోట్ల నుంచి రూ.47.72 కోట్లకు పెంచి కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చారని కాగ్ తేల్చింది. వెలిగల్లు రిజర్వాయర్ పూర్తి కాకుండానే... వెలిగల్లు రిజర్వాయర్‌ను పూర్తి కాకుండానే పూర్తయినట్లు ప్రకటించారు. కానీ రిజర్వాయర్ పనుల్లో పలు లోపాలు బయటపడ్డాయి. ప్రభుత్వం నిబంధనల మేరకు వ్యవహరించి ప్రాజెక్టు పూర్తయినట్టుగా ప్రకటించకుండా ఉండుంటే.. మరమ్మతులకయ్యే ఖర్చును కాంట్రాక్టరే భరించేవారు. కానీ సర్కారు తీరు వల్ల రూ.16 కోట్ల ప్రజాధనంతో రిజర్వాయర్‌కు మరమ్మతులు చేయాల్సి వచ్చింది. ఆ మేరకు కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చినట్టు కాగ్ తేల్చింది. -
నేనే బాగున్నాను
అదొక రంగురంగుల పక్షి. అందమైన దాని రూపాన్ని చూసి, తియ్యనైన దాని గొంతును విని ముచ్చటపడి దాన్ని ఒక పంజరంలో పెట్టారు. ఒక గిన్నెలో నీరు, మరో గిన్నెలో ధాన్యపు గింజలు వేసి ఉంచారు. పంజరం లోపలే అది కూర్చునేందుకు చిన్న పీట వేశారు. అయితే, ఆ పక్షి ఇవేమీ గమనించే స్థితిలో లేదు. బయట ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న మరో పక్షి మీదనే దాని దృష్టంతా. దాన్ని చూస్తూ, ‘నాకు ఈ పంజరమే ప్రపంచం, ఇక్కడ నాకు ఊపిరి సలపడం లేదు’ అన్న బాధ! దాంతో ఆ పక్షిపై ఈరా‡్ష్య భావాన్ని పెంచుకుంది. ఇంకొక వైపు బయట ఉన్న పక్షి.. ‘ఈ పంజరంలో బంధించి ఉన్న పక్షి ఎంత సుఖంగా ఉంది! దీనికి తిండీ నీరు సంపాదించుకునే కష్టం లేదు. గాలివానల భయం లేదు. వేటాడే పక్షుల నుంచి తప్పించుకునే శ్రమ లేనే లేదు. నాకు మాత్రం ఎప్పుడూ ఆహారం సంపాదించుకోవడం, నీరు తాగడం గురించిన ఆలోచనే. గాలి వానల్లో ఎంతో కష్టంగా ఉంటుంది. చాలాసార్లు గద్దల్లాంటి పక్షుల నుండి రక్షించుకోవటం కష్టమైపోతుంది..’ అని ఆలోచించి తనకు తాను బాధపడుతూ పంజరంలోని పక్షిపైన ఈర‡్ష్య పడసాగింది. విషయమేంటంటే అవి రెండూ తనకన్నా మరో పక్షే ఎక్కువ సుఖంగా ఉన్నట్లు భావిస్తున్నాయి. ఒకవేళ రెండింటి ఆలోచనలు మార్పు చెందితే.. పంజరంలో ఉన్న పక్షి ‘నేను ఎంత సుఖంగా ఉన్నాను. నాకైతే అన్నీ పంజరంలోనే దొరుకుతున్నాయి. కాని పాపం తిండి, నీరు వెదుక్కునే అవస్థ, ప్రతికూల వాతావరణ బాధ, వేటగాళ్ల నుంచి పొంచి ఉండే ప్రమాదం బయట తిరిగే పక్షికి ఎప్పుడూ తప్పవు కదా!’ అని ఆలోచిస్తే బయటి పక్షి మీద అసూయ చెందదు. బయటి పక్షి.. ‘నేనెంత సుఖంగా, స్వేచ్ఛగా ఉన్నాను! ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎపుడంటే అప్పుడు వినువీధిలో హాయిగా ఎగరగలను. కానీ, పాపం! ఆ పంజరంలోని పక్షికి ఈ సుఖం ఎప్పటికీ ఉండదు. అస్తమానం దీని ప్రపంచం ఆ పంజరమే కదా!’ అని ఆలోచిస్తే పంజరంలోని పక్షిపై దానికి ఈర్ష్య బదులు సానుభూతి కలుగుతుంది. వాటి ఆలోచనలలో ఈ విధమైన మార్పు వస్తే రెండింటి దృక్పథమూ మారిపోతుంది. మన ఆలోచనలు కూడా ఇక్కడి ఆ పక్షులకన్నా విభిన్నం ఏమీ కాదు. అందరూ తమ తమ పరిస్థితులను అనుకూలంగా, అదృష్టంగా భావిస్తూ, ఇతరుల గురించి సానుభూతిగా ఆలోచిస్తూ, వారి మంచి కోరుకోవడంలోనే తృప్తి, సంతృప్తి ఉన్నాయి. – డి.వి.ఆర్. -
పెళ్లి వేడుకకు పంజరంలో వచ్చిన జంట
-
వెరైటీ పెళ్లి.. గాల్లో వధూవరులు..
న్యూఢిల్లీ : జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం పెళ్లి. అలాంటి పెళ్లి జీవితాంతం తియ్యని జ్ఞాపకంగా గుర్తుండేలా చాలా మంది రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. తమ పెళ్లిని ఉత్సవంలా, మరికొంత మంది మరుపురాని వేడుకలా జరుపుకున్నారు. కొంత మంది గుర్రాలపై ఊరేగింపుగా రావడం, ఇంకొంత మంది హెలికాప్టర్లో పెళ్లిమండపానికి చేరుకోవడం ఇలా భిన్నంగా పెళ్లిళ్లు చేసుకోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. తాజాగా మరో జంట ఇంకాస్త వెరైటీగా కల్యాణ మండపంలోకి ప్రవేశించారు. పెళ్లి వేడుక జరిగే ప్రాంతానికి ఓ విద్యుత్ పంజరంలో వారిద్దరూ వచ్చారు. ఆకాశం నుంచి వారిద్దరినీ ఓ డేగ తీసుకువస్తున్నట్లుగా ఓ క్రేన్ సాయంతో వారిని కిందకి దించారు. ఆ సమయంలో పంజరం నుంచి వెలుగులు విరజిమ్మాయి. ఈ దృశ్యాలను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ అయింది. వధూవరులు దిగుతున్న సమయంలో ‘బహారో ఫూల్ బర్సావో మేరా మెహబూబ్ ఆయాహై..’అనే క్లాసికల్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండడంతో ఆ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
మా రాజాకి మీ భవిష్యత్తు తెలుసు
‘చిలుకరాజా ఇలా వచ్చి ఈ అమ్మ పేరుతో ఓ మంచి కార్డు తీయి...’ అంటూ పంజరం డోర్‌ని తెరిచాడు.చిలుక నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చి ఓ కార్డు లాగి మళ్లీ పంజరం లోపలికి వెళ్లిపోయింది. ఆ కార్డుతో అతను మా ఫ్రెండ్ భవిష్యత్తును చెప్పడం మొదలుపెట్టాడు. ‘అమ్మా, నీ మనసు మంచిది. ముక్కుసూటిగా మాట్లాడతవు. అడిగినవారికి లేదనని పెద్ద చేయి తల్లి నీది..’ వరుసగా అన్నీ మంచి లక్షణాలే. మా స్నేహితురాలి ముఖం వెలిగిపోతోంది ఆ మాటలకు. ‘అయినవాళ్ల చెడుసూపు నీ మీద ఉంది. జాగ్రత్తగా ఉండాలి..’ మా స్నేహితురాలి ముఖంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వెంటనే ‘ఈ శ్రావణమాసంలో ఇల్లు కడతావు తల్లీ..’ ఆ మాటతో తన ముఖం మతాబులా వెలిగిపోయింది. అతని మాటల అల్లిక ముచ్చటగా ఉంది. కిందటివారం అమ్మవారి దర్శనానికి స్నేహితులతో కలిసి విజయవాడ వెళ్లినప్పుడు కొండదిగి కిందకు వచ్చాక రోడ్డుకు ఎడమవైపున కూర్చొని కనిపించారు చిలుకజోస్యం చెప్పేవాళ్లు. సరదాగా చిలుకజోస్యం చెప్పించుకుందామన్నారు. మా మాటలు విన్నారేమో అన్నట్టుగా ‘అమ్మా, రండి మా రాజా (రామచిలుకపేరు) జోస్యం నూటికి నూరుపాళ్లు కరెక్ట్ అవుతుంది..’ జోస్యం చెప్పే అతను పిలిచాడు. అతని ముందు ఒక ప్లాస్టిక్ సంచి పరిచి, దానిమీద కార్డులు పేర్చి ఉన్నాయి. పక్కన చిలుక పంజరం. వద్దన్నా వినకుండా ఇద్దరూ అక్కడ చేరిపోయారు. ఒక జాతకానికి ముప్పై రూపాయలు అనడంతో మరేమీ ఆలోచించకుండా అతని ముందు మూడు పది నోట్లు పెట్టింది మా ఫ్రెండ్. ‘చిలుకరాజా ఇలా వచ్చి ఈ అమ్మ పేరుతో ఓ మంచి కార్డు తీయి...’ అంటూ పంజరం డోర్‌ని తెరిచాడు. చిలుక నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చి ఓ కార్డు లాగి మళ్లీ పంజరం లోపలికి వెళ్లిపోయింది. ఆ కార్డుతో అతను మా ఫ్రెండ్ భవిష్యత్తును చెప్పడం మొదలుపెట్టాడు. ఈ సంఘటన అక్కడక్కడా, అప్పుడప్పుడూ చూసిందే కానీ, అతని మాటలు ఆ ప్రాంతం వారివిగా అనిపించలేదు. ‘ఏ ఊరు మీది..’ అనడంతో సూర్యాపేట. తెలంగాణవాళ్లం’ అన్నాడు. కొంచెం ఆసక్తిగా అనిపించింది. అక్కణ్ణుంచి ఇంతదూరం వచ్చావా? అక్కడ జోస్యం చెప్పించుకునేవారు లేరా! అనడంతో ‘మేం దేశమంతా తిరిగిటోళ్లమమ్మా. బతుకుదెరువుకోసం ఎంత దూరమైనా వెళ్లాల్సిందే, మాకు ఓ ప్రాంతం అనేది ఏముంది?’ అన్నాడు. ‘సూర్యాపేటలో సొంత ఇల్లు ఉంది. మా సుట్టాలంతా అక్కడే ఉంటారు. నెలలో పది రోజులు సూర్యాపేటలో మిగిలిన రోజులు ఇక్కడే. ముప్పై ఏళ్లుగా ఇదే పని. ఇంకో నలుగురం కలిసి ఇక్కడే ఓ రూమ్ తీసుకొని ఉంటున్నాం. వాళ్లూ నాలాగే జోస్యం చెప్పుకుంటారు. నాకు ఒక కూతురు, నలుగురు కొడుకులు. ఈ చిలుకజోస్యం చెప్పుకునే వాళ్లను పెద్దోళ్లను చేశా. వాళ్లందరి పెళ్లిళ్లు అయ్యి, పిల్లలు కూడా! పట్నంలో పనులు చేసుకుంటు బతుకుతున్నరు..’ అంటూ తన గురించి చెప్పుకొచ్చాడు. ఈ రామచిలుకను ఎక్కణ్ణుంచి తీసుకొస్తారు? అనడంతో ‘మా సుట్టాలలోనే కొంతమంది వీటికి ట్రైయినింగ్ ఇస్తారు. ఆ పని నాకు తెల్వదు. వాళ్ల దగ్గర్నుంచి మా లాంటివాళ్లు వెయ్యి, రెండు వేలకు ఓ రామచిలుకను కొనుక్కుంటాం’ అన్నాడు. ఎంతసేపూ ఈ చిలుకను పంజరంలోనే ఉంచితే ఎలా? అంటూ.. నా మాట పూర్తికాకుండానే ‘సాయంత్రం మా రూమ్‌కి వెళతాం కదా! అక్కడ పెద్ద పంజరంలో మా చిలుకలన్నీ విడిచిపెడతాం. అన్నీ కలిసి ఉంటాయి. పొద్దున్నే ఎవరి చిలుకను వాళ్లు తీసుకుంటాం. ఒక్కొక్కరం ఒక్కోచోటుకి వెళ్లిపోతాం.’ అంటూనే ‘అమ్మా, మీ పేరున ఓ రాగిరేకు, కొన్ని మూలికలు ఇస్తాను. వాటిని కృష్ణలో వదిలేయాలి. మీ మీదున్న చెడు దృష్టి నీళ్లలో కొట్టుకుపోయినట్టు పోతుంది. దానికి ఖర్చు వంద రూపాయలు!’ అన్నాడు. అతను చెప్పిన ఆ వస్తువులేవో తీసుకొని తను కృష్ణానదివైపుగా అడుగులేసింది. మీ జాతకాన్ని మీరు చూసుకుంటారా అని అడిగితే–‘రోజూ వ్యాపారానికి బయల్దేరే ముందే చూసుకుంటాం. ఏముందమ్మా మనం మంచి అనుకుంటే మంచే అవుతుంది. చెడు అనుకుంటే అంతా చెడే’ అన్నాడు అతను బతుకునేర్పిన అనుభవంతో! ‘ఒక్క గింజ కూడా దాచుకోలేని పిట్ట మనిషి భవిష్యత్తును ఏం చెబుతుంది?’ అని ప్రశ్నించే ఓ కవి మాటలు గుర్తుకువచ్చాయి. వ్యాపారం అని అతనే అంత స్పష్టంగా చెప్పాడు. మంచి‘మాట’ను అందుకు ఎంచుకున్నాడు. మంచే జరుగుతుందనే ఆలోచన మైండ్‌లో ఉంది. వ్యాపారంలో ప్రాథమిక సూత్రాలు ఇవే కదా! ఫ్రెండ్ తిరిగి రావడంతో నేనూ తనతో బయల్దేరాను. వెడుతూ వెనక్కి తిరిగి పంజరం వైపు చూశాను. జాతకం చెప్పించుకోవడానికి మరో ఇద్దరు వ్యక్తులు అక్కడ చేరారు. పంజరం నుంచి బయటకు వచ్చిన చిలుక ముక్కుతో కార్డు లాగి, ఆ వెంటనే లోపలికి వెళ్లిపోయింది. – నిర్మలారెడ్డి -
కోతుల కట్టడి ఇలాగా.. ?
తెనాలి: జంతు సంరక్షణ చట్టాల్లో కాలానుగుణంగా మార్పులు తెస్తూ తగిన ప్రచారం చేస్తున్నా అమలు చేయాల్సిన ప్రభుత్వ శాఖలకు మాత్రం అవి చెవికెక్కటం లేదు. జంతువులను ప్రేమగా చూడాలని, హింసించవద్దనీ దేశవ్యాప్తంగా జంతు ప్రేమికులు పోరాడుతున్నారు. మూడు చిన్న బోనుల్లో గురువారం తెనాలి పట్టణానికి చెందిన మున్సిపాలిటీ సిబ్బంది 96 కోతుల్ని ఇలా కిక్కిరిసేలా ఉంచారు. పట్టణంలోని వివిధ ప్రదేశాల్లో సంచరిస్తున్న కోతులను అదుపులోకి తీసుకొని ఇలా చాలీచాలని బోనుల్లో బంధించారు. ఆ మూగజీవుల బాధను కళ్లారా చూసి చలించిన ఓ పౌరుడు తన స్మార్ట్‌ఫోనులో ఫొటో తీసి మీడియాకు పంపించారు. ఈ విషయం తర్వాత మున్సిపాలిటీ వారికి తెలిసిందో ఏమో? సాయంత్రానికల్లా టాటా ఏస్ వాహనం తీసుకొచ్చి కోతులను చిలకలూరిపేట వద్ద కొండల్లో వదిలేందుకు సిద్ధమయ్యారు. -
మోజామ్ బెగ్ అంటే టెర్రర్....
లండన్: అనుమానిత టెర్రరిస్టులు, టెర్రరిజం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ముస్లిం యువత తరఫున పోరాడేందుకు 2003లో లండన్‌లో ఏర్పాటైన సంస్థ ‘కేజ్ (సీఏజీఈ)’. టెర్రరిస్టుల అణచివేత పేరిట ఇప్పుడు సిరియాపై పాశ్చాత్య దేశాలు జరుపుతున్న దాడులను సాకుగా చూపించి ముస్లిం యువతను టెర్రరిజం వైపు రెచ్చగొడుతోంది. ముఖ్యంగా కేజ్ డెరైక్టర్ మోజామ్ బెగ్ విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకొని తన వాక్చాతుర్యంతో విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. టెర్రరిజం వైపు వారిని ప్రోత్సహిస్తున్నారు. కాలిఫా రాజ్యస్థాపనే లక్ష్యమంటూ వారికి నూరిపోస్తున్నారు. బెగ్ గత విద్యా సంవత్సరంలో బ్రిటన్‌లోని 11 విశ్వవిద్యాలయాల్లో 15 సార్లు ముస్లిం యువతను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారు. బర్మింగమ్, మన్చెస్టర్, బ్రాడ్ఫోర్డ్, ఈస్ట్ లండన్ విశ్వవిద్యాలయాల వేదికపై ఆయన బహిరంగంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. హేతువాదులను, జీవించే హక్కు కోసం పోరాడుతున్న మానవ హక్కుల సంఘాల నేతలను అనుమతించని ఈ విశ్వవిద్యాలయాలు బెగ్ ప్రసంగాలను అనుమతించడం మీడియాకే ముక్కుమీద వేలేసుకునేలా చేశాయి. దాడుల ద్వారా టెర్రరిస్టులను నిర్మూలించడం కన్నా టెర్రరిజం వైపు యువత వెళ్లకుండా నిర్మూలించడమే ఉత్తమ విధానమని నమ్మిన బ్రిటన్ ప్రభుత్వం ఏటా 40 కోట్ల రూపాయలను ఆలక్ష్యం కోసం ఖర్చు చేస్తున్నా ఏం సాధిస్తున్నట్లు? ఏ విశ్వవిద్యాలయంలోనైనా బెగ్ ప్రసంగం తీరు ఇలా ఉంటుంది....‘నాజీల సమయంలో యూదులను చూసినట్టు ఇక్కడి ప్రభుత్వం ముస్లింలను చూస్తోంది. సిరియాలో ఎంత మంది యువకులు పాశ్చాత్య దేశాల దాడుల్లో మరణిస్తున్నారో వీరికి పట్టదు. సిరియా తిరుగుబాటు దారులు ఒకరిద్దరిని చంపేస్తే అహో అన్యాయం జరిగిపోయిందన్నట్లు దానికెంతో ప్రాచుర్యం కల్పిస్తారు. అమాయక ముస్లింలను అరెస్టు చేసి వేధిస్తారు. ఐసిస్ దాడుల్లో మరణించిన ప్రతి పాశ్చాత్యుడి పేరు, ఊరుతో సహా మన దృష్టికి వస్తోంది. మరి వీరు చంపేసిన సిరియా పౌరుల్లో ఒక్కరి పేరు కూడా మనకు ఎందుకు వినిపించదు. టెర్రరిస్టు అనుమానితులుగా అరెస్టైన ముస్లిం యువకుల పేరు, ఊరు కాదుకదా! కనీసం వారెక్కడున్నారో కూడా మనకు తెలియదు. ఏమిటీ ఈ పరిస్థితి. బ్రిటన్‌లో కూడా ఖలీఫా రాజ్యం ఏర్పడితేనే ఈ పరిస్థితికి పరిష్కారం’ అని ఆయన పలు ప్రసంగాల్లో పిలుపునిచ్చారు. ఓ ప్రసంగంలో పారిస్‌పై జరిగిన దాడి గురించి ప్రస్తావిస్తూ ‘ పిల్లలను కూడా పొట్టన పెట్టుకున్నారని ప్రభుత్వంతోపాటు దాని బాకాలైన మీడియా కూడా గోల చేసింది. నేను చెబుతున్నా ఇదింతా ఉట్టి ప్రచారమే. ఒక్కరంటే ఒక్క పిల్లాడు కూడా పారిస్ దాడిలో చనిపోలేదు’ అని చెప్పారు. పారిస్ దాడుల్లో చనిపోయిన 130 మంది పౌరుల్లో పిల్లలు కూడా ఉన్న విషయం తెల్సిందే. టెర్రరిస్ట్ నేపథ్యం ఉన్న మోజామ్ బెగ్పైనే కాదు. ఆయన నిర్వహిస్తున్న ‘కేజ్’పై కూడా బ్రిటన్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేక పోతోంది. ఇటీవల సంస్థ ఆర్థిక లావాదేవీలను మాత్రం స్తంభింపచేసింది. అఫ్ఘానిస్తాన్‌లోని అల్ కాయిదా టెర్రరిస్టు శిక్షణా శిబిరాలను మూడుసార్లు సందర్శించిన బెగ్ 2002లో పాకిస్తాన్లో అమెరికా సైనికుల చేతుల్లో అరెస్టయ్యారు. గ్వాటెమాల బే జైల్లో గడిపారు. అనంతరం విడుదలయ్యాక తాను ఎలాంటి నేరం చేయకపోయినప్పటికీ తనను అన్యాయంగా జైల్లో పెట్టారంటూ బ్రిటన్ కోర్టులో దావా వేశారు. ఆ కేసులో విజయం సాధించి ఏకంగా పది కోట్ల రూపాయల నష్ట పరిహారం పొందారు. ఆ డబ్బులో ఐదు కోట్ల రూపాయలను వెచ్చించి బర్మింగమ్లో ఐదు పడక గదుల విశాలమైన భవనాన్ని కొన్నారు. అందులో కారు గ్యారేజీ, కారు సౌకర్యం ఉంది. ఆయనకు భార్యా నలుగురు పిల్లలు ఉన్నారు. వారంతా హాయిగానే జీవిస్తున్నారు. కోర్టు కేసులో తనకు అండగా నిలిచిన కేజ్ సంస్థలో బెగ్ చేరి ఇప్పుడు దానికి డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. యువతను టెర్రరిజం వైపు ప్రోత్సహిస్తున్నారు. -
ఎలుకల కోసం బోను
మనం ఇంతవరకూ ఎలుకలను పట్టుకునేందుకు ఉపయోగపడే ఎలుకల బోనులనే చూశాం. కానీ ఈ బోను ఎలుకలను పట్టుకునేందుకు కాదు.. అవి నివసించేందుకు! భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో వ్యోమగాములతో పాటు నివసించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 10 ఎలుకలను వచ్చే ఆగస్టులో అక్కడికి పంపనుంది. అందుకే అవి ఐఎస్ఎస్కు సురక్షితంగా చేరడంతోపాటు అక్కడ నివసించేందుకూ ఉపయోగపడేలా ఈ హైటెక్ బోనును కాలిఫోర్నియాలోని నాసా ఏఎంఈఎస్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఎలుకలకు కావలసిన ఆహారం, నీరు, తాజా గాలి వంటి వన్నీ ఇందులో ఉంచుతారు. వాటిని పర్యవేక్షించేందుకు విజువల్/ఇన్ఫ్రారెడ్ వీడియో సిస్టమ్ ఈ బోనులో ఉంది. అయితే వీటిని ఏదో సరదా కోసం అక్కడికి పంపడం లేదు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేమి వల్ల వ్యోమగాములు కండరాల ద్రవ్యరాశి తగ్గిపోవడం, ఎముకలు, ప్రత్యుత్పత్తి, వ్యాధినిరోధక వ్యవస్థలు బలహీనపడిపోవడం, గుండె, నాడీ సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. జీరో గ్రావిటీలో ఎలుకలను ఉంచి, వాటి శరీరంలో ఆరోగ్యపరంగా వచ్చే మార్పులను, ఆయా సమస్యల నివారణకు పరిష్కారాలను కనుగొనేందుకే నాసా వీటిని రోద సికి పంపుతోందన్నమాట. -
పులి బోనులో క్యాబరే డాన్స్
పులి నోట్లో తల దూర్చడమంటే మాటలా? మధ్యప్రదేశ్ లో ఒక ఇంజనీరింగ్ కుర్రాడు దాదాపు ఇలాంటి పనేచేశాడు. మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ జూకి వెళ్లి పులుల బోనులోకి దూకేశాడు. అంతేకాదు పులుల క్లబ్బులో క్యాబరే డాన్సర్ గా మారి నడుం ఊపి, కాలు కదిపి 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' పాడేశాడు. ఆ కుర్రాడి పేరు యశోనందన్ కౌశిక్. వయసు 23 ఏళ్లు. ఇండోర్ లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ చదువుకుంటున్నాడు. సోమవారం జూకి వెళ్లి, ఇరవై అడుగుల ఎత్తైన బోను ఎగబాకి ఎక్కి, లోపలికి దూకేశాడు. లోపల డాన్సులు చేశాక, పులులు నీరుతాగేందుకు ఏర్పాటు చేసిన చిన్న నీటి గుంటలో ముఖం,కాళ్లు, చేతులు కడుక్కున్నాడు. ఈ తతంగమంతా దాదాపు అరగంట పాటు సాగింది. పులులకు ఈ డ్యాన్సు బాగా నచ్చిందేమో... తాపీగా కూర్చుని చూస్తూ ఊరుకున్నాయే తప్ప ఏమీ చేయలేదు. అంతలో ఈ వింత చూసిన మిగతా పర్యాటకులంతా పరుగుపరుగున వెళ్లి జూ అధికారులకు చెప్పారు. వారు వచ్చి ఈ కుర్రాడిని బయటకు లాక్కొచ్చారు. 'మా అబ్బాయి గత నాలుగు రోజులుగా నిద్రపోలేదు. దానివల్లే ఇలా చేశాడేమో' అన్నారట కౌశిక్ తల్లిదండ్రులు. గతేడాది అక్టోబర్ లో ఇలాగే ఒకాయన భువనేశ్వర్ లోని నందన్ కానన్ జూలోని సింహాల బోనులోకి ప్రవేశించి, మాంసం ముద్దై బయటకు వచ్చాడు. 2007 లో గువహటి జూ లో ఒకాయన బోనులో చేతులు దూర్చి మరీ తన సెల్ ఫోన్ లో పులుల ఫోటో తీయబోయాడు. ఆ ఫోనూ, ఆయన చెయ్యి బోనులోనే ఉండిపోయాయి. అవును మరి... పులిని చూడాలనుకుంటే చూడొచ్చు. కాస్త దగ్గరికి వెళ్లి ఫోటో దిగాలనుకుంటే దిగొచ్చు. ఫరవాలేదులే అని మరీ జూలు పట్టుకుంటే .... వేటాడేస్తది. అన్ని పులులూ గ్వాలియర్ జూలో లాంటి పులుల్లా ఉండవు మరి !!